టైటిల్ : పంతం
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : గోపిచంద్, మెహరీన్, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, జయప్రకాష్ రెడ్డి
సంగీతం : గోపి సుందర్
దర్శకత్వం : కె.చక్రవర్తి
నిర్మాత : కె.కె. రాధామోహన్
యాక్షన్ హీరో గోపిచంద్‌కు కొద్ది రోజులుగా కాలం కలిసిరావటం లేదు. వరుసగా ప్రతీ సినిమా బోల్తా పడుతుండటంతో కెరీర్ కష్టాల్లో పడింది. కామెడీ సినిమాలతో మంచి విజయాలు సాధించిన గోపి మాస్ యాక్షన్ హీరోగా సత్తా చాటడంలో ఫెయిల్ అవుతున్నాడు. ఈ టైంలో ఓ మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త దర్శకుడు చక్రవర్తి తెరకెక్కించిన ‘పంతం’ గోపిచంద్ కెరీర్‌ను గాడిలో పెడుతుందా..? మాస్ హీరోగా గోపిచంద్ సక్సెస్ సాధించాడా..?
కథ;
ఆనంద్ సురానా (ముఖేష్ రుషి) లండన్‌లో ఉండే భారతీయ వ్యాపారవేత్త. వేల కోట్ల ఆస్తులకు అధిపతి. మినిస్టర్లకు కూడా సురానాను కలవాలంటే నెలల సమయం పడుతుంది. అలాంటి సురానా ఫ్యామిలీ వారసుడు విక్రాంత్ సురానా (గోపిచంద్). ఆనంద్ సురానాకు దానధర్మాలు చేయటం ఇష్టం ఉండదు. (సాక్షి రివ్యూస్) తన భార్య దుర్గాదేవి (పవిత్రా లోకేష్) అలా దాన ధర్మాల కోసం డబ్బు ఖర్చు చేస్తుందని ఇండియా నుంచి వ్యాపారాలను ఫ్యామిలినీ లండన్ తీసుకెళ్లిపోతాడు. కానీ విక్రాంత్ మాత్రం తల్లి బాటలోనే నడుస్తాడు. తల్లి ఏర్పాటు చేసిన ట్రస్ట్ కోసం తిరిగి ఇండియా వస్తాడు. అలా ఇండియాకు వచ్చిన విక్రాంత్‌కు ఎదురైన పరిస్థితులేంటి..? ఆ పరిస్థితులపై విక్రాంత్ ఎలా పోరాటం చేశాడు..? అన్నదే మిగతా కథ.
నటీనటులు ;
మాస్ యాక్షన్ రోల్‌లో తనకు తిరుగులేదని గోపిచంద్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రాబిన్ హుడ్ తరహా పాత్రలో పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యాడు. యాక్షన్ సీన్స్‌లో మంచి ఈజ్ చూపించాడు. ఫస్ట్ హాప్‌లో కామెడీ టైమింగ్‌తోనూ అలరించాడు. ముఖ్యంగా కోర్టు సీన్‌లో గోపిచంద్ నటన సూపర్బ్ అనిపిస్తుంది. హీరోయిన్ మెహరీన్ పాత్ర కేవలం పాటలకే పరిమితమైంది. ఉన్నంతలో తన వంతుగా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. (సాక్షి రివ్యూస్)విలన్‌గా సంపత్ రాజ్ రొటీన్ పాత్రలో కనిపించారు. అవినీతి పరుడైన రాజకీయ నాయకుడిగా తనదైన స్టైల్‌లో మెప్పించారు. ఇతర పాత్రల్లో జయప్రకాష్, పృథ్వీ, షియాజీ షిండే, ముఖేష్ రుషి, తనికెళ్ల భరణి తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.
విశ్లేషణ ;
ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం ప్రకటించే సాయం ఎంత మంది బాధితులకు చేరుతుంది.? మధ్యలో మంత్రులు, అధికారులు ఆ డబ్బును ఎలా దోచేస్తున్నారు అన్న పాయింట్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించాడు దర్శకుడు చక్రవర్తి. గోపిచంద్ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు వరుస యాక్షన్ సీన్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే హీరోయిజాన్ని ఎలివేట్ చేసే ప్రయత్నంలో లాజిక్‌లను కాస్త పక్కన పెట్టినట్టుగా అనిపిస్తుంది.(సాక్షి రివ్యూస్) విలన్ క్యారెక్టర్‌ను మరింత బలంగా చూపించి ఉంటే బాగుండేది. గోపిసుందర్ సంగీతం పెద్దగా ఆకట్టుకునేలా లేదు. కథనం మధ్యలో పాటలు స్పీడు బ్రేకర్లల ఇబ్బంది పెడతాయి. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫి. ప్రతీ ఫ్రేమ్ రిచ్‌గా, స్టైలిష్‌గా ప్రజెంట్ చేశారు. నిర్మాత రాధామోహన్ ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు.
ప్లస్ పాయింట్స్ ;
గోపిచంద్ నటన
కోర్టు సీన్
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ ;
హీరోయిన్
సంగీతం
సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్ డెస్క్.
మరిన్ని సినిమా రివ్యూల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment