జూలై 5న గోపిచంద్‌ ‘పంతం’ | Gopichand Pantham Will Be Released On 5th July | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 12 2018 2:30 PM | Last Updated on Tue, Jun 12 2018 2:37 PM

Gopichand Pantham Will Be Released On 5th July - Sakshi

ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన హీరో గోపిచంద్‌. కానీ గత కొంత కాలం పాటు సరైన విజయాలు లేక వెనుకపడ్డారు. గోపిచంద్‌ ప్రస్తుతం పంతం సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. నేడు (జూన్‌ 12) గోపిచంద్‌ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. 

ఇప్పటికే విడుదలైన పంతం టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. టీజర్‌లోని డైలాగ్‌ సోషల్‌మీడియాలో వైరల్‌గా మారుతోంది. ఈ సినిమాను జూలై 5న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాను  శ్రీసత్య సాయి బ్యానర్‌పై కె.కె.రాధామోహన్‌ నిర్మించగా,  కె. చక్రవర్తి దర్శకత్వం వహించారు. గోపిచంద్‌కు పలువురు సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement