‘పంతం’ మొదటి రోజు వసూళ్లు | Gopichand Pantham First Day Collections | Sakshi
Sakshi News home page

Published Fri, Jul 6 2018 12:00 PM | Last Updated on Fri, Jul 6 2018 12:02 PM

Gopichand Pantham First Day Collections - Sakshi

గోపిచంద్‌ చాలాకాలం నుంచి హిట్‌ కోసం ఎదురుచూస్తున్నారు. లౌక్యం సినిమాతో చివరగా విజయాన్ని అందుకున్న గోపిచంద్‌ పంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. యాక్షన్‌ అండ్‌ మెసెజ్‌ ఓరియెంటెడ్‌గా తెరకెక్కిన ఈ మూవీకి మొదటి రోజు కలెక్షన్లు బాగానే వచ్చాయని తెలుస్తోంది. 

ఈ సినిమా గురువారం (జూలై 5) విడుదలైంది. ట్రైలర్‌తో అంచనాలు పెంచిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను తెచ్చుకుంది. మొదటి రోజే దాదాపు 5కోట్ల షేర్‌ను, 3 కోట్ల గ్రాస్‌ను రాబట్టిందని సమాచారం. ఇక వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఈ సినిమా పూర్తి రిపోర్ట్‌ వస్తుంది. ఈ సినిమాలో గోపిచంద్‌ సరసన మెహ్రీన్‌ జోడిగా నటించారు. ఈ సినిమాకు గోపిసుందర్‌ సంగీతమందిచగా, కేకే రాధామోహన్‌ నిర్మించగా, కె చక్రవర్తి దర్శకత్వం వహించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement