
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ ఏ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్ 5న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే సైరా నరసింహారెడ్డి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ అయిన మూడో రోజే గోపిచంద్ సినిమా రిలీజ్ చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. తొలి వారంలోనే సైరాను ఢీ కొంటే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లపై కూడా భారీగా ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న గోపిచంద్ రిస్క్ చేస్తాడా..? లేక రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచిస్తాడా? అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment