షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’ | Gopichand's Chanakya Shooting Completed, Teaser on September 9th | Sakshi
Sakshi News home page

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

Published Sun, Sep 8 2019 10:52 AM | Last Updated on Sun, Sep 8 2019 10:52 AM

Gopichand's Chanakya Shooting Completed, Teaser on September 9th - Sakshi

మ్యాచో హీరో గోపీచంద్‌, మెహ‌రీన్ జంట‌గా న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ ‘చాణక్య‌’.. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టికే విడుద‌లైన గోపీచంద్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈ సినిమా టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 9 సాయంత్రం గంట‌లు 4.05 నిమిషాల‌కు విడుద‌ల చేస్తున్నారు చిత్రయూనిట్‌. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని ద‌స‌రాకు విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement