Chanakya
-
పట్నా నాటి ఔన్నత్యానికి దర్పణం
పట్నా టూర్ అనగానే నాకు ‘చాణక్య’ చారిత్రక నవల, టీవీ సీరియల్ ఒకదానితో ఒకటిపోటీ పడుతూ కళ్ల ముందు మెదిలాయి. ‘సున్న’ తో ప్రపంచ గణితాన్ని గాడిలో పెట్టిన ఆర్యభట్ట గుర్తొచ్చాడు. ఖగోళ పరిజ్ఞానంలో మన మేధ ఎంతో పరిణతి చెందినదనే విషయం మరోసారి గుర్తొచ్చింది. అలాగే వర్తమానంలో బిహార్ అనుభవిస్తున్న పేదరికమూ, జంగిల్ రాజ్ అనే వార్తకథనాలు కూడా గుర్తొచ్చాయి. పాటలీపుత్ర నుంచి పట్నా వరకు ఈ నగరం అనుభవించిన ఆటుపోట్లన్నీ కళ్లముందు మెదిలాయి. పట్నాలో అడుగు పెట్టిన తర్వాత దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్నీ గతంలోకి వెళ్లి విశ్లేషించుకుంటూ ముందుకు సాగాను. ఆర్యభట్ట నాలెడ్జ్ యూనివర్సిటీలో చూపుడువేలితో ఆకాశాన్ని చూపిస్తున్న ఆర్యభట్ట విగ్రహం ముందు మోకరిల్లాను.బిహార్‌లో ఆలూపట్నా ప్రజల జీవనశైలి నిరాడంబరంగా కనిపించింది. కూరగాయల బళ్ల మీద బంగాళదుంప రాశి, పక్కనే మరో బస్తా ఉంటాయి. కాయగూరలు నామమాత్రమే. బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఒక సందర్భంలో ‘సమోసాలో ఆలూ ఉన్నంత కాలం బిహార్‌లో లాలూ ఉంటాడు’ అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పుడు లాలూ లేడు కానీ ఆలూ మాత్రం ఉంది. బిహార్ జీవనశైలిలో ఆకుపచ్చ కూరగాయల కంటే బంగాళదుంపకేప్రాధాన్యం. ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో జిలేబీ, భోజనంలో మధ్యమధ్య పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినడం ఈ రెండూ కొత్తగా అనిపిస్తాయి. జీవనశైలి విలాసవంతంగా లేకపోయినప్పటికీ కళల పట్ల ఆరాధన మెండుగా ఉంది. సంగీతకార్యక్రమాలు, వేడుకల్లో నాట్య ప్రదర్శనలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. ఊరేగింపులో వాహనాల మీద జరిగే నాట్యప్రదర్శనల్లో నర్తకి రక్షణ కోసం గ్రిల్ ఉంటుంది. బాలికల చదువు, రక్షణ కోసం టోల్ ఫ్రీ నంబర్‌తో ప్రచారం బాగున్నాయనిపించింది.ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలుపట్నా నగరం పర్యావరణానికిప్రాధాన్యం ఇస్తోంది. ఆటో రిక్షాలన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే. వాహనాల విషయంలో పర్యావరణ స్పృహ మెండుగానే ఉంది. ప్లాస్టిక్ వాడకం మీద నిషేధం ఏమీ లేక΄ోవడంతో సామాన్యుల్లో ఆ ధ్యాస కనిపించదు. గంగాతీరంలో పూజలు చేసి పూలు, అగరవత్తులు తీసుకెళ్లిన పాలిథిన్ కవర్లను అక్కడే పడేస్తున్నారు. తీరమంతా ΄్లాస్టిక్ వ్యర్థాల తోరణంగా కనిపించింది. గంగానది నీరు స్వచ్ఛంగా ఉన్నాయి, నదిలో పడవ విహారం మాత్రం అద్భుతమైన అనుభూతినిచ్చింది. సూర్యోదయం, సూర్యాస్తమయాల్లో నది విహారం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది.గోల్ఘర్పట్నాలో తప్పకుండా చూడాల్సిన వాటిలో గోల్ఘర్ ఒకటి. ఇది మగధరాజ్య ధాన్యాగారం. ఈ ధాన్యాగారం ఇనుప నిర్మాణం. రాజ్యంలో రైతులు పండించిన ధాన్యంలో వారి అవసరాలకు పోగా మిగిలిన వాటిని సేకరించి ఇందులో భద్రపరిచేవారు. ఒక ఏడాది కరువు, వరదలు వచ్చినా సరే రాజ్యంలో ఆకలి లేకుండా తిండి గింజలను అందుబాటులో ఉంచడం కోసమే ఈ ఏర్పాటు. ΄ాలనలో ఇంతటి ముందు చూపుకు చాణుక్యుని అర్థశాస్త్రమే మూలం. ప్రాచీన కాలంలో ఇక్కడ పర్యటించిన ఫాహియాన్, మెగస్తనీస్ వంటి విదేశీ యాత్రికులు పట్నా నగరాన్ని ప్రపంచానికి మోడల్‌గా చూపించారు. మెగస్తనీస్ అయితే ఏకంగా ‘గ్రేటెస్ట్ సిటీ ఆన్ ద ఎర్త్’ అని రాశాడు. అంతటి చైతన్యవంతమైన, ఉచ్ఛస్థితిని చూసిన నగరం పట్నా. సామాన్యులతో మాటలు కలిపితే ఆ మూలాల ప్రభావం ఇప్పటికీ ఉందనిపిస్తుంది. వారిని చూస్తే పేదరికంతో పోరాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కానీ మాటల్లో వారిలో సమృద్ధిగా ఉన్న రాజకీయ చైతన్యం వ్యక్తమవుతుంది. ప్రాచీన కాలంలోకి ఎంట్రీపట్నా నగరం ప్రపంచంలో అత్యంత పురాతన కాలం నుంచి జనజీవనం కొనసాగుతూ వస్తున్న ప్రదేశం. ఆర్యభట్ట, వాత్సాయనుడు, చాణుక్యుడు, సిక్కుల గురువు గురుగోవింద్‌సింగ్ వంటి మేధావులు పుట్టిన నేల. నంద, మౌర్య, గుప్త రాజవంశాల రాజధాని. ఇన్ని ప్రత్యేకతలను సొంతం చేసుకున్న నేల మీద నడిచేటప్పుడు మనకు తెలియకుండానే నేటి నుంచి అక్షరాలలో చూసిన నాటికి వెళ్లిపోతాం. ఇక్కడ పర్యటించడం రియల్లీ ఏ బ్యూటిఫుల్ ఎక్స్‌పీరియెన్స్. పరిణిత శిల్పకళ ప్రాచీన పట్నా జీవనశైలిని చూడాలంటే బిహార్ మ్యూజియంలో అడుగుపెట్టాలి. మొదటగా ఆకర్షించేది యక్షిణి శిల్పం. గంగానది తీరాన దిదర్గంజ్ గ్రామం నుంచి సేకరించిన ఈ శిల్పం శిల్పం అద్దంలా మెరుస్తుంటుంది. శిల్పచాతుర్యాన్ని ఫొటోలో చూడాల్సిందే తప్ప వర్ణించడం అసాధ్యం. రీజనల్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రలేఖనాలు మధుబని ఆర్ట్‌లో కృష్ణుడు, గోపికల ఘట్టాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక పటంలో ఒక గ్రంథం ఇమిడి ఉంటుంది. బొమ్మలు వేయడానికి చిత్రకారులు వాడిన బేసిక్ కలర్స్ నుంచి సెకండరీ కలర్స్ వాడకం వరకు చిత్రవర్ణాల పరిణామ క్రమం అర్థమవుతుంది. చిత్రాలను, శిల్పాలను పరిశీలించినప్పుడు అప్పటి కాలంలో చిత్రకళ కంటే శిల్పకళ ఉచ్ఛస్థితిలో పరిణతి చెందినట్లు అనిపించింది.– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
తెలంగాణలో మరో సర్వే.. ఆ పార్టీకే ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్కే ఆధిక్యమంటూ మిషన్ చాణక్య సర్వే రిపోర్టు తేల్చింది. ఓట్ షేర్‌పై మిషన్ చాణక్య నిర్వహించిన సర్వేలో బీఆర్ఎస్-44.62 శాతం, కాంగ్రెస్-32.71 శాతం, బీజేపీ-17.6 శాతం, ఇతరులకు 5.04 శాతం ఓట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. కాగా, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాబోతోందని ఇండియా టీవీ సర్వే కూడా వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒపీనియన్ పోల్స్ ఫలితాలను విడుదల చేసిన ఇండియా టీవీ.. బీఆర్ఎస్కు 70, కాంగ్రెస్‌కు 34, బీజేపీకి 7, ఎంఐఎంకు 7 సీట్లు వస్తాయని పేర్కొంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు 88, కాంగ్రెస్‌కు 19, ఎంఐఎం 7, ఇతరులు నాలుగు చోట్ల విజయం సాధించారు. చదవండి: తెలంగాణ బీజేపీ తొలి జాబితా విడుదల -
రూ.100 కోట్ల ఫండ్.. స్టాక్ మార్కెట్ యువ సంచలనం ఈమె!
స్టాక్ మార్కెట్ రంగంలో ఫండింగ్ మందగించిన ప్రస్తుత తరుణంలో ప్రముఖ వ్యాపార నిపుణులే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించి సంచలనానికి తెరతీశారు భారతదేశానికి చెందిన యువ చార్టర్డ్ అకౌంటెంట్ క్రేషా గుప్తా. క్రేషా గుప్తా వయసు 24 సంవత్సరాలు. ఐదేళ్లుగా ఆమె మార్కెట్ ట్రెండ్లను అధ్యయనం చేస్తున్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) కోసం ఆమె రూ.100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించారు. భారతదేశపు అతి పిన్న వయస్కులైన ఫండ్ మేనేజర్లలో ఒకరిగా నిలిచారు. ఇదీ చదవండి: D'Yavol: ఆర్యన్ ఖాన్.. బన్‌గయా బిజినెస్‌మేన్! ఆకట్టుకుంటున్న కొత్త బ్రాండ్ టీజర్.. ఆమె ప్రారంభించిన ఫండ్ ప్రత్యేకంగా ఏ రంగానికి సంబంధించినది కాదు. అయితే చిన్న మధ్యతరహా పరిశ్రమలు, స్టార్టప్‌లలో పెట్టుబడుల కోసం దీన్ని ప్రారంభించారు క్రేషా గుప్తా. దీంతో స్టార్టప్‌లపై దృష్టి సారించిన అతి పిన్న వయస్కురాలైన మహిళా ఇన్వెస్టర్‌గా నిలిచారు. క్రేషా గుప్తా కంపెనీ పేరు చాణక్య ఆపర్చునిటీస్ ఫండ్ 1. సెబీలో నమోదైన ఈ ఫండ్ కంపెనీ స్టార్టప్‌లు, ఎంఎస్ఎంఈలలో రూ. 100 కోట్లు పెట్టుబడి పెడుతుంది. అవసరమైతే మరో రూ.100 కోట్ల నిధులు సమీకరిస్తుంది. అంటే ఇది గ్రీన్ ఇష్యూ ఫండ్. ఈ ఫండ్ లాభదాయకమైన చిన్న, మధ్య తరహా పరిశ్రమలలో పెట్టుబడి పెడుతుందని ఆమె మీడియాకు తెలిపారు. 25 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు, ఇందు కోసం అధిక నెట్‌వర్త్ ఉన్న వ్యక్తుల నుంచి నిధులు సేకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: EPFO: పీఎఫ్ ఈ-పాస్‌బుక్ డౌన్లోడ్ కావడం లేదా? బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే.. ఎవరీ క్రేషా గుప్తా? అహ్మదాబాద్‌కు చెందిన క్రేషా గుప్తా 2019లో సీఏ పూర్తి చేశారు. అహ్మదాబాద్ విశ్వవిద్యాలయం నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు. సింబయాసిస్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ లెర్నింగ్ నుంచి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ సర్వీసెస్ డిప్లొమా చదివారు. క్రేషా గుప్తా సర్టిఫైడ్ రీసెర్చ్ అనలిస్ట్ కూడా. ఎప్పుడూ చదువులో చురుగ్గా ఉండే క్రేషాకు మంచి అకడమిక్ రికార్డు ఉంది.(ఐటీ కంపెనీ భారీ గిఫ్ట్స్: సంబరాల్లో ఉద్యోగులు) కార్పొరేట్, కన్సల్టింగ్ రంగాలలో ఫైనాన్స్, అకౌంట్స్, MIS, టాక్స్ అడ్వైజరీ వంటి విభాగాల్లో పనిచేసిన ఆమె ఇన్వెస్టర్ రిలేషన్స్ అండ్ ట్రెజరీ టీమ్‌లో భాగంగా వోడాఫోన్ ఐడియాతో తన కెరియర్ను ప్రారంభించారు. గత ఐదేళ్లుగా ఈక్విటీ మార్కెట్లను అధ్యయనం చేస్తున్న క్రేషా గుప్తాకు పెట్టుబడి అవకాశాలను గుర్తించడంలో, నష్టాలను తగ్గించడంలో విశేష నైపుణ్యం ఉంది. ట్రెండ్లైల్ ప్రకారం... 2023 మార్చి 31 నాటికి ఆమె 3 స్టాక్లను కలిగి ఉన్నారు. వీని నికర విలువ రూ. 6.9 కోట్లు. విజయ రహస్యాలు అవే.. రూ. 100 కోట్ల ఫండ్‌ను ప్రారంభించడం తనకు సరికొత్త అనుభవమని క్రేషా గుప్తా లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాశారు. ఫండ్ విషయంలో అనుభవజ్ఞులైన ఫండ్ మేనేజర్లు తరచూ హెచ్చిరిస్తుంటారని, అయితే ఏళ్ల అనుభవం మాత్రమే ఎల్లప్పుడూ విజయాన్ని నిర్దేశించదని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇతరుల నుంచి నేర్చుకునే సుముఖత, కొత్త ఆలోచనలకు సిద్ధంగా ఉండటం, నేర్చుకునే అవకాశాలను వెతకడం, ప్రశ్నించేందుకు సంకోచించకపోవడం.. ఇవే ఇంత చిన్న వయస్సులో తన విజయానికి రహస్యాలని వివరించారు. ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్! -
డబ్బు చుట్టూ... జనవరి మొదటి వారంలో సినిమా
శివ కంఠమనేని, సంజనా గల్రాని, ప్రియా హెగ్డే, చాణక్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మణిశంకర్’. జీవీకే (జి. వెంకట్ కృష్టణ్) దర్శకత్వంలో కేఎస్ శంకర్ రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం. ఫణిభూషణ్ నిర్మించారు. ఎంఎల్ రాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ‘మణిశంకర్’ బిగ్ ఆడియో సీడీని వీఐపీ ప్రైమ్ సీఈవో సతీష్ రెడ్డి విడుదల చేశారు. అతిథులుగా పాల్గొన్న నటుడు మురళీ మోహన్, నిర్మాత సి. కల్యాణ్ చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపారు. ‘‘డబ్బు చుట్టూ తిరిగే కథా కథనాలతో యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ తెరకెక్కింది. జనవరి మొదటి వారంలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు జి. వెంకట్ కృష్టణ్. ‘‘నా ఫ్రెండ్స్ శ్రీనివాస్, ఫణి భూషణ్‌ల సాయంతో ఈ సినిమా నిర్మించాను’’ అన్నారు శివ కంఠమనేని. ఈ కార్యక్రమంలో సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి, సంగీత దర్శకుడు ఎం.ఎల్ రాజా పాల్గొన్నారు. -
‘చాణక్య’ మూవీ రివ్యూ
టైటిల్: చాణక్య జానర్: స్పై థ్రిల్లర్ నటీనటులు: గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్, నాజర్, రాజేష్ కట్టర్ తదితరులు సంగీతం : విశాల్ చంద్రశేఖర్ నిర్మాత: రామ బ్రహ్మం సుంకర దర్శకత్వం: తిరు టాలీవుడ్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న గోపీచంద్ గట్టి హిట్టు కొట్టి చాలా కాలమైంది. వరుసగా సినిమాలు చేస్తున్న ఈ హీరోకు ఈ మధ్యకాలంలో సరైన విజయం దక్కలేదు. పంతం, ఆక్సీజన్, గౌతం నందా, ఆరడుగుల బుల్లెట్ లాంటి చాలా సినిమాలు గోపీచంద్ చేసినా.. ఏ సినిమా కూడా అతని ఆశలను నిలబెట్టలేకపోయింది. ఈ క్రమం ‘చాణక్య’ అంటూ స్టైలిష్ స్పై చిత్రంతో గోపీచంద్ ఈ దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గూఢచారి నేపథ్యంతో వచ్చిన వచ్చిన ఈ సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించిందా? గోపీచంద్ ‘చాణక్య’ శపథం నెరవేరిందా? ఓ సారి తెలుసుకుందాం... కథ: పాక్ ఉగ్రవాద దాడుల నుంచి దేశాన్ని రక్షించడానికి అర్జున్ (గోపీచంద్) రా ఏజెంట్‌గా సీక్రెట్ ఆపరేషన్ నడుపుతుంటాడు. బయటకు మాత్రం బ్యాంక్ ఉద్యోగి రామకృష్ణగా చలామణీ అవుతుంటాడు. తన సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా భారత్‌లో జరుగుతున్న ఉగ్రదాడులకు కారకుడు.. పాక్ చెందిన ఇబ్రహీం ఖురేషీ అని అర్జున్ తెలుసుకుంటాడు. ఈ క్రమంలో ఖురేషీకి చెందిన అబ్దుల్ సలీమ్‌ను అర్జున్ హతమారుస్తాడు. ఇందుకు ప్రతీకారంగా అర్జున్ టీమ్‌లో సభ్యులైన అతని నలుగురు స్నేహితులు (రా ఏజెంట్స్)ను ఖురేషీ కిడ్నాప్ చేసి కరాచీకి పట్టుకుపోతాడు. ఈ మేరకు ఖురేషీ అర్జున్‌కు ఇచ్చిన షాక్‌తో ఫస్టాప్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో గోపీచంద్ కరాచీ వెళ్లి తన నలుగురు ఫ్రెండ్స్‌ను ఎలా కాపాడాడు? దేశాన్ని ఉగ్రముప్పు నుంచి ఎలా బయటపడేశాడన్నది మిగిలిన కథ. విశ్లేషణ కథ రోటీన్‌గానే ఉంది. ఇలాంటి కథలతో చాలా సినిమాలు వచ్చిన ఫీలింగ్ కలుగుతోంది. కథనం కూడా కొత్తగా లేకపోవడం ప్రేక్షకులకు కొంత బోరింగ్ అనిపించవచ్చు. దర్శకుడు తిరు తీసుకున్న పాయింట్‌ను కొత్తగా గ్రిప్పింగ్‌గా చెప్పడానికి ప్రయత్నించకుండా.. రోటిన్ సీన్లతో లాగించడం, యాక్షన్ డోస్ పెంచడం ఈ సినిమాలో కనిపిస్తోంది. గోపీచంద్-మెహరీన్ మధ్య లవ్ ట్రాక్ కొంత బాగున్నా.. కుక్కల డాక్టర్‌గా అలీతో చేయించిన హాస్యం పండకపోగా.. కొంచెం ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. మొత్తానికి కథాకథనాలు అనుకున్నంత వినూత్నంగా లేకపోవడం, ఒక స్పై థ్రిల్లర్‌కు ఉండాల్సిన ఉత్కంఠభరిత సన్నివేశాలు అంతగా లేకపోవడం ఈ సినిమా మైనస్ అని చెప్పవచ్చు. హీరో గోపీచంద్ రా ఏజెంట్ పాత్రలో మరోసారి ఆకట్టుకున్నాడు. యాక్షన్, ఛేజింగ్ సీన్లతో దర్శకుడు ఇచ్చిన పాత్రకు నూటికినూరుపాళ్లు న్యాయం చేశాడు. అయితే, కథలోనే కావాల్సినంత సరుకు లేకపోవడం.. గోపీచంద్ పాత్ర కూడా పెద్దగా పేలలేదు. ఇక, హీరోయిన్ ఐశ్యర్వగా మెహరీన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటలు, హీరోతో రొమాన్స్‌కే పరిమితం. సెకండాఫ్‌లో వచ్చే జరీన్ ఖాన్ పాత్ర తన పరిధి మేరకు ఆకట్టుకుంది. రా చీఫ్ పాత్రలో నాజర్ కనిపిస్తారు. టెక్నికల్‌గా స్పై థ్రిల్లర్ మూవీస్‌కు ఉండాల్సిన గ్రాండ్ లుక్‌ను తీసుకురావడంలో డైరెక్టర్ తిరు సక్సెస్ అయ్యాడని చెప్పాలి. ఛేజింగ్ సీన్లు కూడా బాగానే ఉన్నాయి. సంగీతం సోసోగా ఉన్నా.. . శ్రీ చరణ్ పాకాల బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపిస్తుంది. కెమెరావర్క్ కూడా ఓకే అని చెప్పాలి. బలాలు ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాటోగ్రఫి గ్రాండ్ లుక్ బలహీనతలు కథాకథనాలు కొత్తగా లేకపోవడం సినిమా రోటీన్‌గా ఉండటం -
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’
మ్యాచో హీరో గోపీచంద్, మెహరీన్ జంటగా నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’.. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ చిత్రం శనివారం(అక్టోబర్ 5న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా ‘చాణక్య’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ఈ చిత్రానికి సెన్సార్ నుండి మంచి స్పందన రావడంతో దర్శక నిర్మాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’థియేటర్లలో సందడి చేస్తున్న సమయంలో ‘చాణక్య’విడుదల చేసి రిస్క్ చేస్తున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ ముందుగా అనుకున్న తేదీ ప్రకారం ‘చాణక్య’ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. -
‘చాణక్య’ మూవీ వర్కింగ్ స్టిల్స్
-
మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా
‘‘నా నుంచి ప్రేక్షకులు ఎలాంటి అంశాలను కోరుకుంటారో అవన్నీ ‘చాణక్య’ సినిమాలో ఉన్నాయి. ఓ హీరోను ఎలా చూపించాలో తిరుగారు అలా చూపించారు’’ అని హీరో గోపీచంద్ అన్నారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా, బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది. వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘అనిల్ సుంకరగారికి సినిమాలంటే ఎంతో ప్యాషన్.. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించాను. అబ్బూరి రవిగారు చాలా మంచి డైలాగ్స్ రాశారు. విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకాల అద్భుతమైన సంగీతం అందించారు. మీ ప్రేమను ఈనెల 5న తిరిగి ఇచ్చేస్తా’’ అన్నారు. ‘‘చాణక్య’ సినిమా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నా’’ అన్నారు ఎంపీ, నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ. డైరెక్టర్ తిరు మాట్లాడుతూ – ‘‘గోపీచంద్‌గారు సరికొత్త పాత్రలో, చాలా కష్టపడి చేసిన చిత్రమిది. ఆయన ఇష్టమైన సినిమాల లిస్టులో మా సినిమా కూడా ఉంటుంది’’ అన్నారు. ‘‘గోపీచంద్‌గారిని సరికొత్త కోణంలో చూపిస్తున్నాం’’ అన్నారు నిర్మాత అనిల్ సుంకర. నటుడు రాజేష్ కతార్. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్, మాటల రచయిత అబ్బూరి రవి తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి, సహ నిర్మాత: అజయ్ సుంకర, కెమెరా: వెట్రి పళనిస్వామి. -
‘చాణక్య’ ప్రీ రిలీజ్ ఫంక్షన్
-
‘చాణక్య’ ట్రైలర్ ఆవిష్కరణ
-
రిస్క్ చేస్తున్న ‘చాణక్య’
గోపీచంద్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జరీన్‌ఖాన్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. తిరు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ ఏ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ స్పై థ్రిల్లర్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను అక్టోబర్ 5న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. అయితే సైరా నరసింహారెడ్డి లాంటి ప్రతిష్టాత్మక చిత్రం రిలీజ్ అయిన మూడో రోజే గోపిచంద్ సినిమా రిలీజ్ చేయటం రిస్క్ అన్న టాక్ వినిపిస్తోంది. తొలి వారంలోనే సైరాను ఢీ కొంటే థియేటర్ల సమస్యతో పాటు కలెక్షన్లపై కూడా భారీగా ప్రభావం పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బందుల్లో ఉన్న గోపిచంద్ రిస్క్ చేస్తాడా..? లేక రిలీజ్ డేట్ విషయంలో మరోసారి ఆలోచిస్తాడా? అన్నది చూడాలి. -
పండగకి వస్తున్నాం
‘‘అనిల్ సుంకర ప్యాషనేట్ నిర్మాత అని విన్నాను. గతంలో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ ఆయనతో సినిమా చేస్తాను’’ అన్నారు గోపీచంద్. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం నిర్మించిన చిత్రం ‘చాణక్య’. గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ నటించారు. దసరాకి చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దర్శకుడు తిరు చెప్పిన కథ ఇది. నాకు బాగా నచ్చింది. అయితే కొన్ని మార్పులు చెప్పాను. అన్నీ సరిచేసి అద్భుతంగా స్టోరీ రెడీ చేశాడు. డైలాగ్స్, సీన్స్ అన్నీ గ్రిప్పింగ్‌గా ఉంటాయి. హీరోయిన్ మెహరీన్‌తో లవ్ ట్రాక్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ మంచి వ్యక్తి. ఆయన సపోర్ట్ చెయ్యటం వల్లే ఈ సినిమా త్వరగా పూర్తయింది. తిరుకి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. తిరు మాట్లాడుతూ– ‘‘తమిళంలో నాలుగు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రంలో రా ఏజెంట్ పాత్రలో గోపీచంద్ కనిపిస్తారు. ఈ షూటింగ్ రాజస్తాన్‌లో జరిపినప్పుడు గోపీచంద్‌కి అనుకోకుండా ప్రమాదం జరిగింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తర్వాత ఐ.సి.యులో పెట్టారు. అయితే తక్కువ సమయంలో కోలుకుని షూటింగ్ పూర్తి చేశారు’’ అన్నారు. ‘‘యాక్షన్‌ను కొత్త పద్ధతిలో చేయించారు దర్శకుడు తిరు. గోపీచంద్ ఓ కొత్త జోనర్లో చేసిన చిత్రమిది’’ అన్నారు అబ్బూరి రవి. -
‘చాణక్య’ టీజర్ విడుదల
-
ఆకట్టుకుంటోన్న ‘చాణక్య’ టీజర్
హీరో గోపిచంద్ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. విరామం ఎరుగకుండా ప్రయత్నిస్తూ ఉన్న మునుపటిలా విజయాన్ని అందుకోలేకపోతున్నారు. చివరగా లౌక్యం సినిమాతో హిట్ కొట్టగా.. ఆక్సిజన్, గౌతమ్‌నంద, పంతం లాంటి సినిమాలను చేశాడు. అయినా అనుకున్న విజయాన్ని పొందలేకపోయాడు. మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు చాణక్యతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రా ఏజెంట్‌గా అర్జున్ పాత్రలో గోపిచంద్ నటించిన ఈ మూవీ టీజర్ అందర్నీ ఆకట్టుకునేలా ఉంది. టీజర్లో ఉన్న యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికి హైలెట్‌గా మారనున్నాయి. ఈ మూవీలో మెహ్రీన్, జరీన్ ఖాన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి తిరు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏకే ఎంటర్టైన్మెంట్పై నిర్మించిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
జీవితమంటే ఆట కాదు
రాఘవసాయి, నాగబాబు, చాణక్య హీరోలుగా స్నేహాల్‌కామత్, మమతారెడ్డి, దీక్ష హీరోయిన్లుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఖేల్’. ‘లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమాతో శరత్ కుమార్. ఆర్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. గ్లోబల్ మోషన్ పిక్చర్స్ సమర్పణలో మాన్సీ మూవీస్ పతాకంపై గొట్టిముక్కల పాండురంగారావు, పులి అమృత్‌గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ– ‘‘భారతదేశంలో హైదరాబాద్ సినిమా హబ్‌గా మారనుంది. షూటింగ్‌లు, పోస్ట్ ప్రొడక్షన్ సౌకర్యాల కోసం సినిమా పరిశ్రమను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ‘ఖేల్’ సినిమా విజయవంతం కావాలి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షుడు యు. సత్యనారాయణ, కూకట్పల్లి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమర్ సాధనాల, సంగీతం: ఆనంద్ అవసరాల, సహ నిర్మాత: పులి అమృత్‌గౌడ్. ∙పి. మహేందర్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బి. వినోద్ కుమార్, పులి అమృత్ గౌడ్, జి. పాండురంగా రావు -
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘చాణక్య’
మ్యాచో హీరో గోపీచంద్, మెహరీన్ జంటగా నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’.. తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ లుక్‌కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 9 సాయంత్రం గంటలు 4.05 నిమిషాలకు విడుదల చేస్తున్నారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. -
దసరా రేస్
పండక్కి నాలుగైదు సినిమాలు ఒకేసారి విడుదలైనా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను ఆశించవచ్చు. పండగ సెలవులు, ఫెస్టివల్ మూడ్ ఆడియన్స్‌ను థియేటర్స్‌కు రప్పిస్తాయి. అందుకే పండగకి మూడు నుంచి నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి దసరా రేస్‌లో నిలబడే సినిమాల లిస్ట్ ఒక్కోటిగా బయటికి వస్తోంది. ‘చాణక్య’గా వస్తున్నారు గోపీచంద్. తిరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటించారు. టాకీ పార్ట్ పూర్తయింది. ఇటీవలే ఇటలీలో పాటల చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాకు అజయ్ సుంకర సహనిర్మాత. దసరా పండక్కి ప్రేక్షకులను నవ్వించడంతో పాటు భయపెట్టనున్నారు దర్శకుడు ఓంకార్. ఆల్రెడీ ఆయన ‘రాజుగారి గది, రాజుగారి గది 2’ చిత్రాలతో అదే చేశారు. ఈ సారి అంతకుమించి నవ్వించి భయపెట్టడానికి ‘రాజుగారి గది 3’ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. అశ్విన్‌బాబు, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా ఓక్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. ఇక దసరా రేస్‌కి ఓ హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కూడా రెడీ అవుతోంది. కీర్తీ సురేశ్ నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ మూవీ ‘మిస్ ఇండియా’ కూడా దసరాకే విడుదల అంటున్నారు. ‘వెంకీ మామ’ కూడా దసరాకు విడుదలవుతుందనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. మరి.. దసరా రేస్‌లో నిలిచే చిత్రాలు ఏవో తెలియాలంటే ఓపిక పట్టాల్సిందే. -
దసరా బరిలో ‘చాణక్య’
ఇటీవల వరుస ఫ్లాప్‌లతో ఇబ్బంది పడుతున్న మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఇటలీ, మిలాన్‌లో పాటల చిత్రీకరణను జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి చిత్రాన్ని దసరాకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. -
ఏజెంట్ చాణక్య
‘చాణక్య’ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడు. దేన్నైయినా విశ్లేషించగలుగుతాడు. అతను పరిశోధన మొదలుపడితే ఏ కేస్ అయినా పరిష్కారం కావాల్సిందే. మరి.. చాణక్య ఎలాంటి ప్లాన్లు వేశాడు? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారని తెలిసింది. తాజాగా ఈ సినిమాలో గోపీచంద్ కొత్త లుక్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటలను విదేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలను కుంటున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి. -
గోపీచంద్ ‘చాణక్య’ అప్డేట్
హీరో గోపీచంద్ నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. రీసెంట్గా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుదల చేశారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
చాణక్య అన్వేషణ
చుట్టూ జనం...వారి మధ్యలో తీక్షణమైన చూపులతో దేన్నో వెతుకుతున్నాడు చాణక్య. ఆ వెతుకులాట ఎందుకు? ఎవరి కోసం అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘చాణక్య’. బుధవారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘చాణక్య’ సినిమాలోని లుక్‌ను విడుదల చేశారు. ఇక్కడ ఉన్న ఫొటో ఇదే. ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. యాభై శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరక్కనున్న సంగతి తెలిసిందే. -
‘చాణక్య’గా గోపిచంద్
ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై గోపీచంద్ హీరోగా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందుతోన్న భారీ స్పై థ్రిల్లర్ చిత్రానికి ‘చాణక్య’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా టైటిల్ లోగోను ఆదివారం దర్శక నిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శకుడు తిరు.. గోపీచంద్‌ను సరికొత్త పంథాలో చూపిస్తూ తెరకెక్కిస్తున్న చిత్రమిది. మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. 50 శాతానికి పైగా చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. -
పీఠ ముడి
అధికార పీఠం చేసిన అవమానానికిఅతడు శపథం చేసి సిగముడి వీడాడు.ఆ అధికారాన్ని అంతం చేశాకే తిరిగి సిగముడి కట్టాడు.అతడు పట్టు పడితే వీడని మొండివాడు.శపథం నెరవేరే వరకుమరలని జగమొండివాడు.అందుకే అతడిది చాణక్య శపథంగా వాసికెక్కింది.ఆ ‘పీఠ’ ముడి గురించే ఈ సీరియల్. సూక్ష్మబుద్ధి గల చాణక్యుడు తన రాజకీయ చతురతతో దిగ్గజాలతో ఢీకొని అనుకున్నది సాధించాడు. నిరుపేద కుటుంబంలో జన్మించినప్పటికీ చదువు విలువ తెలిసి, తక్షశిల విశ్వవిద్యాలయంలో ప్రతిభను కనబరచి అపారమేధస్సుతో భరతజాతి గుండెల్లో అమరుడై నిలిచాడు. అతనే చాణక్యుడు. కౌటిల్యుడిగా అర్థశాస్త్రాన్ని, రాజనీతి శాస్త్రాన్ని, భౌతిక, మానసిక తత్వశాస్త్రాలను ఔపోసన పట్టి ప్రపంచానికి అందించాడు. ఇతని కథను దేశ ప్రజలకు దర్శనీయం చేసిన బుల్లితెర చారిత్రక కథనాలను అందించడంలో మరో మైలురాయిని తన ఖాతాలో జమ చేసుకుంది. ద్వివేది శపథం కౌరవసభ మధ్యలో అందరిముందు తనకు జరిగిన అవమానానికి ప్రతిగా కౌరవుల రక్తంతో తన కురులను తడిపేవరకు వాటిని ముడివేయనని ప్రతిజ్ఞ చేస్తుంది మహాభారతంలో ద్రౌపది. పాటలీపుత్ర సభలో తనకు జరిగిన అవమానానికి ప్రతీకారంగా నందరాజులను రాజ్యహీనులను చేస్తానని, అప్పటివరకు తన శిఖ కురులను ముడివేయనని శపథం చేస్తాడు చాణక్యుడు. మొదటి సంఘటన ద్వాపర యుగంలో జరిగింది. రెండవది కలియుగంలో జరిగింది. రెండూ చారిత్రక ఘట్టాలే. రెండింటి నుంచీ నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో. తొమ్మిదేళ్లపాటు చాణక్యుడి అర్థశాస్త్రంతో సహా 180 పుస్తకాలను చదివి, అర్ధం చేసుకొన్న దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేది తనకు తానే శపథం చేసుకున్నాడు ‘ఎలాగైనా సరే ఈ రాజనీతిజ్ఞుడిని బుల్లితెర మీద ఆవిష్కరింపజేయాలి’ అని. అప్పటికే వాడుకలో ఉన్న చారిత్రక కథ చాణక్యుడిది. ఒక పేద బ్రాహ్మణుడు అంచెలంచెలుగా ఎదిగి, తన సూక్ష్మబుద్ధితో ప్రత్యర్థులను మట్టికరిపించిన విధానాన్ని చూపాలనుకున్నాడు. అతనికున్న అపారమేధాశక్తిని దేశప్రజల కళ్లకు కట్టాలనుకున్నాడు. చాణక్యుడి జీవితం గురించి పరిశోధన చే శాడు. ‘జాతీయ స్పృహ కలిగిన మొట్టమొదటి వ్యక్తి’గా చాణక్యుడిని అభివర్ణించాడు ద్వివేది. 1988లోనే పైలట్ ఎపిసోడ్‌ను దూరదర్శన్‌కి సబ్మిట్ చేశారు ద్వివేది. అయితే, బిఆర్ చోప్రా మహాభారత్ పట్ల వారు ఆసక్తిగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్ తెరమీద రక్తి కట్టించడానికి మరో మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది. 1991 సెప్టెంబరులో ప్రసార మైన ‘చాణక్య’ ఆగస్టు 1992 వరకు మొత్తం 47 ఎపిసోడ్లలో ప్రసారమైంది. మొత్తం మూడు పార్టులు.. వాటిలో... 1. మగధ రాజ్యాన్ని పాలిస్తున్న చంద్రగుప్తుడు ధననందుడి కుమారుడు. ఇతని రాజ్య విశేషాలను ఈ భాగంలో చూపారు. 2. నందుల పాలనపై చాణక్యుడి సాయంతో చంద్రగుప్తుడు ఎదురుదాడి చేసి, గెలవడం.. ఈ భాగంలో చూడచ్చు. 3.అలెగ్జాండర్ ఉత్తరభారత దేశాన్ని ముట్టడి చేసే సమయంలో చంద్రగుప్త నాయకత్వంలో చాణక్యుని రాజనీతి చతురతతో వారిని తిప్పికొట్టడం చూస్తాం. రాజకీయ చతురతతో కూడిన ఈ మూడు భాగాలను ప్రముఖంగా ఫ్రేమ్ వర్క్ చేసుకోవడానికి చాణక్యుడి యుద్ధకౌశలం పట్ల ముగ్ధుడవడమే కారణం అంటారు దర్శకుడు ద్వివేది. కథ ఇదీ.. ‘పాటలీపుత్రాన్ని మహాపద్మనందుడు తన ఎనిమిది మంది కుమారుల సాయంతో పాలించేవాడు. మహాపద్మనందునికి ఇళ, ముర అని ఇద్దరు రాణులు. ఇళకు ఎనిమిది మంది కొడుకులు, మురకు చంద్రగుప్తుడు ఒక్కడే కొడుకు. ఈ ఎనిమిది మంది నందులు తమ తమ్ముడైన చంద్రగుప్తుని చంపడానికి ఎన్నో దురాలోచనలు చేసేవారు. ఒకరోజు పేదవాడిగా కనిపించే చాణక్యుడు నందరాజుల సభకు వచ్చి, అక్కడి ఉన్నతాసనంపై కూర్చున్నాడు. పేదవాడనే కారణంతో నందులు అతన్ని తిరస్కారభావంతో చూసి, సింహాసనం నుండి కిందకు లాగి పడేస్తారు. నందుల రాక్షసమంత్రి ఇది సరైనది కాదని వారికి నచ్చజెప్పినా ప్రయోజనం లేకపోతుంది. తనను అవమానించిన నందులపై ఆగ్రహించిన చాణక్యుడు ‘ అందరి మధ్య ఇలా అవమానించారు. మిమ్మల్ని కూడా ఇలాగే సింహాసనం నుండి లాగి, మీ తలలను నరికి గానీ ఈ జుట్టు ముడి వేయను’ అని శపథం చేసి అక్కణ్ణుంచి వెళ్లిపోతాడు. నందుల తమ్ముడు చంద్రగుప్తుడు రహస్యంగా చాణక్యుడిని కలుస్తాడు. మొదటి ప్రతిజ్ఞ నందుల నాశనం అయితే, రెండవ ప్రతిజ్ఞ నందరాజ్యానికి చంద్రగుప్తుని రాజుని చేయడం అంటాడు చాణక్యుడు. ఆ తర్వాత తన రాజకీయ చతురతతో నందులను యుద్ధంలో ఓడించి, వారిని చంపి తన తలవెంట్రుకలను ముడుస్తాడు. ముందు అనుకున్న విధంగా చంద్రగుప్తుణ్ణి రాజును చేశాడు. ఈ విధంగా రెండు ప్రతిజ్ఞలను నెరవేర్చుకున్నాడు. అంతటితో ఆగకుండా అనేక దండయాత్రలు తన ఆధ్వర్యంలో జరిపి, పాటలీపుత్రాన్ని మగధ రాజ్యంగా విస్తరింపజేసి చంద్రగుప్తుడిని చక్రవర్తిగా ప్రకటించాడు. క్రీస్తుపూర్వం 4వ శతాబ్దికి చెందిన చాణక్యుడు రాజనీతి శాస్త్రంతోపాటు అర్థశాస్త్రాన్ని రచించాడు. భౌతిక, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణుడు. తన సూక్ష్మబుద్ధితో శత్రువులను జయించి భారతదేశంలో మొదటి చక్రవర్తిత్వాన్ని నెలకొల్పాడు. ప్రకాష్ ద్వివేది ద్విపాత్రాభినయం ∙చాణక్యుడిగా దర్శకుడైన ప్రకాష్ ద్వివేది తన నట విశ్వరూపం చూపడం ఇందులో విశేషంగా చెప్పుకోవచ్చు. చాణక్యుడిగా, చంద్రగుప్తుడిగా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు ∙చాణక్య సీరియల్ ‘ఇండియన్ టెలివిజన్‌కి ఒక మైలురాయి’ అని చెప్పవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయబడిన ఈ సీరియల్ ఐదు అంతర్జాతీయ అవార్డులు అందుకుంది. సీరియల్ ప్రామాణికత, నటీనటుల నటనను దేశమంతా విస్తృతంగా ప్రశంసించింది ∙ప్రముఖ దర్శకుడు శ్యామ్‌బెనెగల్ కూడా ఈ సీరియల్‌కి తన సహకారాన్ని అందించారు ∙చాణక్య సీరియల్కన్నా ముందు ద్వివేది స్టేజీ యాక్టర్‌గా కొనసాగేవారు. -
12 నిజ జీవిత పాత్రల్లో యంగ్ హీరో
ఎమ్ఎస్ ధోని బయోపిక్‌తో ఒక్కసారిగా స్టార్ లీగ్‌లో ఎంటర్ అయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ధోని పాత్రలో జీవించిన ఈ యువ నటుడు ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 నిజజీవిత పాత్రల్లో నటించేందుకు ఓకె చెప్పాడు. 540బిసి నుంచి 2015 ఏడి మధ్య కాలానికి చెందిన 12 మంది మేధావుల జీవితాలను సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో చాణక్యుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి వారి జీవితాలను తెరకెక్కించనున్నారు. ఈ 12 కథలో లీడ్ రోల్స్‌లో నటించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెడీ అవుతున్నాడు. తన స్నేహితుడు వరుణ్ మథుర్‌తో కలిసి సుశాంత్ ఈ సిరీస్‌ను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఈ సిరీస్ మరింత పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు. -
చాణక్యుడి పాత్రలో స్టార్ హీరో
సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో హిస్టారికల్, ఫోక్లోర్ సినిమాల హవా కనిపిస్తోంది. భారతీయ సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో భారీ వసూళ్లు సాధిస్తుండటంతో మన మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మక చిత్రాలను తెరకెక్కించేందుకు ముందుకు వస్తున్నారు. ఇటీవల పద్మావత్ సినిమా ఘనవిజయం సాధించగా ప్రస్తుతం మణికర్ణిక చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా మరో చారిత్రక పాత్రను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్ మేకర్స్. చరిత్రలో ఎంతో గొప్ప రాజనీతిజ్ఞుడు, గురువు, ఆర్థిక నిపుణుడు అయిన చాణక్యుడి కథను వెండితెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న నీరజ్ పాండే ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ టైటిల్ రోల్ లో నటించేందుకు అంగీకరించారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్.. ఫ్రైడే ఫిలిం వర్క్స్, ప్లాస్ సి స్టూడియోస్ బ్యానర్లతో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.