12 నిజ జీవిత పాత్రల్లో యంగ్ హీరో | Sushant Singh Rajput In 12 Series Biopic | Sakshi
Sakshi News home page

Published Wed, Aug 1 2018 1:53 PM | Last Updated on Wed, Aug 1 2018 4:40 PM

Sushant Singh Rajput In 12 Series Biopic - Sakshi

ఎమ్‌ఎస్‌ ధోని బయోపిక్‌తో ఒక్కసారిగా స్టార్‌ లీగ్‌లో ఎంటర్‌ అయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌. ధోని పాత్రలో జీవించిన ఈ యువ నటుడు ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 నిజజీవిత పాత్రల్లో నటించేందుకు ఓకె చెప్పాడు. 540బిసి నుంచి 2015 ఏడి మధ్య కాలానికి చెందిన 12 మంది మేధావుల జీవితాలను సిరీస్‌గా రూపొందిస్తున్నారు.

ఈ సిరీస్‌లో చాణక్యుడు, రవీంద్రనాథ్ ఠాగూర్‌, అబ్దుల్‌ కలాం లాంటి వారి జీవితాలను తెరకెక్కించనున్నారు. ఈ 12 కథలో లీడ్‌ రోల్స్‌లో నటించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెడీ అవుతున్నాడు. తన స్నేహితుడు వరుణ్ మథుర్‌తో కలిసి సుశాంత్‌ ఈ సిరీస్‌ను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఈ సిరీస్‌ మరింత పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement