
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు తలుచుకున్నప్పుడల్లా చిన్న వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతుంటారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఈమె వల్లే చనిపోయాడని కూడా అన్నారు. ఇప్పటికే పూర్తిగా యాక్టింగ్‌కి దూరమైపోయిన రియా.. ఏం చేస్తున్నాను? సంపాదన ఎలా అనే విషయాల్ని తన పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది.
(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)
'ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. మోటివేషనల్ స్పీకర్‌గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో ఛాప్టర్ అని చెప్పొచ్చు. గతంలో ఏం జరిగిందో, ఎలాంటి బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించని, నా గురించి అన్ని తెలిసినట్లు చాలా విమర్శలు చేశారు. ఇంకొందరైతే నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయతీగా ఉన్నా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను' అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.
బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి వచ్చిన సుశాంత్ సింగ్.. 'చిచ్చోరే' లాంటి సినిమాలతో హీరోగా చాలా ఫేమ్ సంపాదించాడు. కానీ ఏమైందో ఏమో గానీ 2020 జూన్‌లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి బాలీవుడ్‌లోని నెపోటిజం కల్చరే కారణమని, బడా హీరోలే ఇతడికి అవకాశాలు రాకుండా చేసి, మానసికంగా హింసపెట్టి చంపేశారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇతడి ప్రేయసి రియాపై కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా నటనకు దూరమైపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఈమెనే బయటపెట్టింది.
(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్)
Comments
Please login to add a commentAdd a comment