Sushanth SIngh Rajput
-
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ సూసైడ్ కేసులో CBI రిపోర్ట్
-
సినిమాల్లేవుగా సంపాదన ఎలా? హీరో సుశాంత్ ప్రేయసి సమాధానమిదే!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు తలుచుకున్నప్పుడల్లా చిన్న వయసులో ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అని ఫ్యాన్స్ ఇప్పటికీ బాధపడుతుంటారు. సుశాంత్ చనిపోయిన తర్వాత అతడి ప్రేయసి, హీరోయిన్ రియా చక్రవర్తిపై లెక్కలేనన్ని విమర్శలు వచ్చాయి. ఈమె వల్లే చనిపోయాడని కూడా అన్నారు. ఇప్పటికే పూర్తిగా యాక్టింగ్‌కి దూరమైపోయిన రియా.. ఏం చేస్తున్నాను? సంపాదన ఎలా అనే విషయాల్ని తన పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టింది.(ఇదీ చదవండి: 'కల్కి 2898' టీమ్‌కి లీగల్ నోటీసులు.. హీరో ప్రభాస్‌కి కూడా!)'ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను. నా జీవనాధారం ఏంటని కొందరు అడుగుతున్నారు. గత కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. మోటివేషనల్ స్పీకర్‌గా మారి డబ్బులు సంపాదిస్తున్నాను. నా జీవితంలో ఇది రెండో ఛాప్టర్ అని చెప్పొచ్చు. గతంలో ఏం జరిగిందో, ఎలాంటి బాధ అనుభవించానో నాకు మాత్రమే తెలుసు. ఎవరికి వాళ్లు ఏదేదో ఊహించని, నా గురించి అన్ని తెలిసినట్లు చాలా విమర్శలు చేశారు. ఇంకొందరైతే నేను చేతబడి చేశానని అన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిజాయతీగా ఉన్నా, ధైర్యంగా ముందుకు సాగుతున్నాను' అని రియా చక్రవర్తి చెప్పుకొచ్చింది.బ్యాక్ గ్రౌండ్ లేకుండా బాలీవుడ్‌లోకి వచ్చిన సుశాంత్ సింగ్.. 'చిచ్చోరే' లాంటి సినిమాలతో హీరోగా చాలా ఫేమ్ సంపాదించాడు. కానీ ఏమైందో ఏమో గానీ 2020 జూన్‌లో ఇంట్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. దీనికి బాలీవుడ్‌లోని నెపోటిజం కల్చరే కారణమని, బడా హీరోలే ఇతడికి అవకాశాలు రాకుండా చేసి, మానసికంగా హింసపెట్టి చంపేశారని అప్పట్లో రూమర్స్ వచ్చాయి. ఇతడి ప్రేయసి రియాపై కూడా విపరీతమైన ట్రోల్స్ రావడంతో ఇప్పుడు ఆమె పూర్తిగా నటనకు దూరమైపోయింది. తాజాగా ఈ విషయాన్ని ఈమెనే బయటపెట్టింది.(ఇదీ చదవండి: భార్య ఉపాసనకి కొత్త పేరు పెట్టిన రామ్ చరణ్) -
సుశాంత్ వర్ధంతి.. వెక్కివెక్కి ఏడ్చిన బుల్లితెర నటి!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు బాలీవుడ్లో తెలియనివారు ఉండరు. ఎంఎస్ ధోని చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఊహించని విధంగా 2020లో ముంబయిలోని తన నివాసంతో సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ అతని నాలుగో వర్ధంతి సందర్భంగా పలువురు బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్‌కు నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుశాంత్ వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, అతని సోదరి శ్వేతా సింగ్ కీర్తి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమానికి సుశాంత్ సన్నిహితురాలు, సహనటి క్రిస్సన్ బారెట్టో కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సుశాంత్‌ను తలుచుకుని బోరున విలపించారు. అతనికి ఇలా జరిగి ఉండాల్సింది కాదంటూ వెక్కివెక్కి ఏడ్చారు. సుశాంత్ తనతో ప్రతి చిన్న విషయంలోనూ ఎప్పుడు చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉండేవాడని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. సుశాంత్.. ఎంఎస్ ధోని మూవీతో పాటు డ్రైవ్, చిచోరే, కేదార్నాథ్, దిల్ బేచారా లాంటి సినిమాల్లో నటించారు. View this post on Instagram A post shared by Instant Bollywood (@instantbollywood) -
హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ పేరు చెప్పగానే చాలామంది ఎమోషనల్ అవుతారు. ఎందుకంటే ఎంతో పెద్ద కెరీర్ ఉన్న హీరో.. ఊహించని విధంగా తన ఫ్లాట్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. హిందీ ఇండస్ట్రీలోని నెపోటిజం వల్ల ఇలా జరిగిందని రచ్చ రచ్చ జరిగింది.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)అలాంటిది ఆ ఫ్లాట్‌లో యంగ్ హీరోయిన్ అదాశర్మ మకాం పెట్టేసింది. దాదాపు నాలుగు నెలల క్రితమే తాను ఈ ప్లేసులోకి షిఫ్ట్ అయినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. 'ద కేరళ స్టోరీ' సినిమాతో పాన్ ఇండియా రేంజులో గుర్తింపు తెచ్చుకున్న అదా.. సుశాంత్ ఫ్లాట్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది.'నేను నాలుగు నెలల క్రితమే ఈ ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అయ్యాను. కానీ నా సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉండటం వల్ల సర్దుకోవడం కుదర్లేదు. ఈ మధ్య పూర్తిగా వస్తువులు, సామాన్లు అన్నీ సర్దేసుకున్నాను. ఇక్కడంతా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. కేరళ, ముంబయిలోని మా ఇళ్ల చుట్టూ చెట్లు ఉంటాయి. అందుకే చుట్టూ పచ్చని వాతావరణం ఉన్న ఈ ఇంటికి మారాను. అలానే ఈ ఫ్లాట్‌లోకి వేరే ఏం ఆలోచించకుండా మారిపోయాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: ప్రేమికులే హంతకులైతే? ఇంట్రెస్టింగ్గా 'పరువు' ట్రైలర్) -
నీళ్లలాంటి ఆహారం.. టాయిలెట్ పక్కనే పడుకున్నా..: హీరోయిన్
బాలీవుడ్ నటుడు, ఎంఎంస్ ధోని హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. యంగ్ హీరో సూసైడ్ చేసుకోవడంతో ఇండస్ట్రీ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. అయితే సుశాంత్ ప్రియురాలు, నటి రియా చక్రవర్తిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. నెల రోజుల పాటు జైలులో ఉన్న రియా ఆ తర్వాత బెయిల్‌పై రిలీజై బయటికొచ్చారు. తాజాగా ఓ షోకు హాజరైన రియా జైలులో ఉన్నప్పటి చేదు అనుభవాలను పంచుకున్నారు. రియా మాట్లాడుతూ.. 'నాకు జైలులో ఎక్కువగా రోటీ, క్యాప్సికం పెట్టేవాళ్లు. కేవలం అవీ పేరుకే గానీ మొత్తం నీళ్లలాగే ఉండేది. అయినప్పటికీ ఆకలిగా ఉండటంతో గతిలేక తినేసేదాణ్ని. నేను పడుకునే ప్లేస్ పక్కనే బాత్రూమ్ ఉండేది. ఇలాంటివి దుర్భర పరిస్థితులు జైలులో చవిచూశా. ఆ సమయంలో పడిన శారీరక బాధల కన్నా.. మానసిక క్షోభనే ఎక్కువ అనుభవించా. కానీ మిగిలిన వారితో పోలిస్తే నా పరిస్థితి కాస్తా ఫరవాలేదనిపించేది. కొందరు బెయిల్ వచ్చినా రూ.5 వేలు, రూ.10 వేలు కూడా కట్టలేక అక్కడే ఉండేవారు. నాకు బెయిల్ వచ్చినప్పుడు.. మీరు హీరోయిన్ కదా.. మీ సంతోషాన్ని డ్యాన్స్ చేసి చూపిచండని కొందరు అడిగారు. అందుకే ఆ సమయంలో నాగిని పాటకు డ్యాన్స్ చేశా' అని జైలులోని అనుభవాలను చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) -
సుశాంత్‌తో బ్రేకప్‌పై హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది. ఆయన మరణించి మూడేళ్లు దాటిన(2020 జూన్‌లో ఆత్మహత్య చేసుకున్నాడు).. ఇప్పటికీ ఆయన గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన మాజీ ప్రియురాలు అంకిత లోఖండేతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న రియా చక్రవర్తి.. ఇప్పటికీ సుశాంత్‌ని తలచుకొని బాధపడుతుంటారు. తాజాగా హీరోయిన్ అంకితా లోఖండే..సుశాంత్‌తో బ్రేకప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సుశాంత్‌ని తాను ఎంతగానో ప్రేమించానని, కానీ ఇతరుల మాటలను విని తనకు బ్రేకప్ చెప్పాడని ఆవేదన వ్యక్తం చేసింది. ‘మేమిద్దరం విడిపోవడానికి పెద్ద కారణాలేవి లేవు. సుశాంత్ విడిపోదామని చెప్పగానే నేను షాకయ్యాను. ఆయన నిర్ణయంతో రాత్రికి రాత్రే నా జీవితంలోని పరిస్థితులన్నీ మారిపోయాయి. బ్రేకప్ ఎందుకు చెప్పాడో తెలియదు. కానీ అతని నిర్ణయాన్ని మాత్రం తప్పుబట్టాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎదుట వాళ్ల మాటలు విని ఆయన నాకు బ్రేకప్ చెప్పాడేమో అనిపిస్తుంది’అని అంకితా లోఎఖండే చెప్పుకొచ్చింది. కాగా, సుశాంత్ ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అంకితతో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కలిసి ఓ సీరియల్లో నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అయితే సుశాంత్ హీరోగా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. వీరిద్దరు విడిపోయారు. ఆ తర్వాత సుశాంత్.. రియా చక్రవర్తితో ప్రేమాయణం కొనసాగించాడు. ఇద్దరు కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ అనుహ్యంగా 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. -
మూన్‌పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్‌తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్‌పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్‌ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్‌కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్‌ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్‌ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్‌లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
సుశాంత్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన సారా, వీడియో వైరల్
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ లోకాన్ని విడిచి మూడేళ్లపైనే అవుతున్నా అభిమానుల గుండెల్లో మాత్రం సజీవంగానే ఉన్నాడు. సోషల్ మీడియాలో తరచూ అతడి పేరు వినిపిస్తూనే ఉంది. శనివారం (జనవరి 21న) ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని హీరోయిన్ సారా అలీ ఖాన్ చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసింది. ఎన్జీవోలోని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసిన సారా పిల్లలతో కలిసి చప్పట్లు కొట్టింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. 'హ్యాపీ బర్త్‌డే సుశాంత్, ఇతరులను నవ్వించడమంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు. పై నుంచి మమ్మల్ని చూస్తున్న నీ ముఖంలో మేమంతా కలిసి చిరునవ్వు తెప్పించామని భావిస్తున్నాం. ఈ రోజును ఇంత స్పెషల్‌గా మార్చినందుకు సునీల్ అరోరాకు ప్రత్యేక ధన్యవాదాలు. మీలాంటివాళ్లు ఈ ప్రపంచాన్ని మరింత ఉత్తమంగా, సురక్షితంగా, సంతోషకరంగా మార్చుతారు. మీరు కూడా ఇతరులకు సంతోషాన్ని పంచండి' అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారగా సారా చేసిన పనికి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు నెటిజన్లు. అదే సమయంలో కొందరు మాత్రం ఇదంతా వట్టి డ్రామా అని విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా సుశాంత్, సారా.. కేదార్నాథ్ (2018) సినిమాలో కలిసి పని చేశారు. ఈ చిత్రంతోనే సారా ఇండస్ట్రీకి పరిచయమైంది. View this post on Instagram A post shared by Sara Ali Khan (@saraalikhan95) చదవండి: ఈ ఏడాది ఏ హీరోయిన్ చేతిలో ఎన్ని సినిమాలున్నాయో తెలుసా? -
ప్రియుడ్ని పెళ్లాడిన అంకిత లోఖండే, ముంబైలో గ్రాండ్ వెడ్డింగ్
Ankita Lokhande- Vicky Jain Are Married: సుశాంత్ సింగ్ మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి అంకితా లోఖండే ప్రియుడు విక్కీ జైన్‌ను వివాహమాడింది. ఈ వేడుకకు ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్ వేదికైంది. వధువు అంకిత గోల్డెన్ కలర్ లెహంగా ధరించగా, వరుడు విక్కీ జైన్ కూడా వధువుకు సరిపోలే బంగారు- తెలుపు రంగు షేర్వాణీ ధరించాడు. వేదిక వద్దకు వధూవరులిద్దరు పాతకాలపు కారులో రావడం ఆకట్టుకుంది. వీరి పెళ్లి వేదికను వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. కాగా కరోనా నిబంధనల నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సినీ ప్రముఖుల మధ్య వీరి వివాహ కార్యక్రమం ఈరోజు(డిసెంబర్ 14) ముంబైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా తన మెహందీ, ఎంగేజ్మెంట్, హల్దీ, సంగీత్ కార్యక్రమాలకు సంబధించిన ఫొటోలను అంకిత కొద్ది రోజులుగా షేర్ చేస్తూ వచ్చింది. దీంతో ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇండోర్‌లో జన్మించిన అంకిత 2005లో తన నటన కలను సాకారం చేసుకోడానికి ముంబైకి వచ్చింది. తన టాలెంట్ నిరూపించుకునేందుకు 'టాలెంట్ హంట్' రియాలిటీ షోలో పాల్గొంది. చదవండి: (భార్యభర్తలుగా తొలిసారి మీడియా ముందుకు కత్రినా-విక్కీ, వీడియో వైరల్) నాలుగేళ్ల తర్వాత 'పవిత్ర రిష్టా' టీవి సీరియల్‌తో పెద్ద బ్రేక్ వచ్చింది. ఈ సీరియల్‌తో పరిచయమైన సుశాంత్ సింగ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు 2019లో అంకిత ప్రకటించింది. తర్వాత సుశాంత్‌తో ఆరేళ్ల పాటు రిలేషన్షిప్లో ఉంది. కంగనా రనౌత్ నటించిన 'మణికర్ణిక'తో సినిమాల్లోకి అడుగుపెట్టింది అంకిత. తర్వాత 'బాఘీ 3' చిత్రంలో కూడా నటించింది. సుశాంత్‌తో బ్రేకప్ తర్వాత మరో బాలీవుడ్ నటుడు విక్కీజైన్‌తో ప్రేమలో పడింది. గత మూడేళ్లుగా వీరు ప్రేమలో మునిగితేలుతున్నారు. చదవండి: (Katrina Kaif: సల్మాన్, రణ్‌బీర్ నుంచి కత్రినాకు ఖరీదైన బహుమతులు, అవేంటంటే..) -
ఏం జరిగిందో....ఎప్పుడు తేలుస్తారు ?
-
వైరల్ వీడియో: ప్రియురాలితో సుశాంత్ సింగ్ స్టెప్పులు
-
Sushant Singh Rajput: ఏడాది పూర్తి.. ఏం తేల్చారు?
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి చెంది ఏడాది పూర్తయ్యింది. అతనిది ఆత్మహత్యా లేదంటే అభిమానులు ఆరోపిస్తున్నట్లు బాలీవుడ్ మాఫియా ప్రొద్భలం వల్ల జరిగిన హత్య అనే విషయంపై ఎటూ తేలకుండా పోయింది. సోషల్ మీడియాలో దాదాపు ఏడాదిగా సుశాంత్ మీదే చర్చ. ఒక టాలెంటెడ్ నటుడి మరణంతో సినీ వర్గాల్లో నెపొటిజం చర్చ మాత్రం విపరీతంగా కొనసాగింది. అనుమానాలు, ఆరోపణలు, విచారణ, వివాదాలు.. వీటి నడుమే సుశాంత్ మరణం కేసుపై సీబీఐ విచారణ కొనసాగుతూనే ఉంది. సాక్షి, వెబ్‌డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నిష్క్రమణతో సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. హిందీ సినీ పరిశ్రమ ఒక మంచి నటుడిని కోల్పోయింది. ముఖంలో అమాయకత్వం.. అలరించిన అతని నటన్ని తల్చకుంటూ హఠాత్తుగా అతను లేడనే వార్తని అభిమానులు తట్టుకోలేకపోయారు. అందుకే అతని మరణం పూర్తైన ఏడాది రోజున మళ్లీ అతన్ని గుర్తు చేసుకుంటున్నారు. సుశాంత్ బాల్యం, అతని చదువు, వ్యక్తిగత విషయాలు, ఫొటోలు, వీడియోలు, సినిమాలకు సంబంధించిన అన్ని విషయాల్ని గుర్తు చేసుకుంటున్నారు. పనిలో పనిగా సుశాంత్ కేసులో న్యాయం కావాలని కోరుకుంటూ.. ఇదొక ‘చీకటి రోజు’గా ప్రకటించారు. మరణం తర్వాత.. 34 ఏళ్ల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14, 2020న బాంద్రాలోని తన ఇంట్లో ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించాడు. ముంబై పోలీసులు అది ఆత్మహత్య అని పేర్కొనడంతో మొదలైన చర్చ.. ఏడాది అయినా నడుస్తూనే ఉంది. డిప్రెషన్ సుశాంత్ ప్రధాన సమస్య అని మాజీ ప్రేయసి, సన్నిహితులు చెప్పగా, కాదు.. బాలీవుడ్లో కొందరు అతనికి అవకాశాల్లేకుండా చేసి అతన్ని మానసికంగా చంపేసి ఆపై ఆత్మహత్యకు ఉసిగొల్పారనేది ఫ్యాన్స్ వాదన. కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు.. సినీ పరిశ్రమలోని కొందరు ప్రముఖులు కూడా ఇదే వాదనతో ఏకీభవించడంతో ఈ చర్చ ప్రముఖంగా నడిచింది. ఇంకోపక్క ఈ కేసులో అనుమానాలున్నాయని సుశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు ఆసక్తికరమైన మలుపు తిరిగింది. చదవండి: ఇంతకీ ఈ దిశ ఎవరు? చివరికి సీబీఐకి.. ఈ కేసులో సుశాంత్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన నటి రియా చక్రవర్తి మీదే అందరికీ అనుమానాలు రేకెత్తాయి. బాలీవుడ్ మాఫియాతో చేతులు కలిపి ఆమె సుశాంత్‌ను చంపేసిందని అభిమానులు ఆగ్రహం వెల్లకక్కారు. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ముంబై పోలీసుల దర్యాప్తు, అదే టైంలో అతని సొంతం రాష్ట్రం బిహార్ పోలీసుల దర్యాప్తు నడుమ కేసు గందరగోళంగా సాగింది. విచారణలో ముంబై పోలీసులు సహకరించడం లేదన్న బిహార్ ప్రభుత్వం ఆరోపణతో సుప్రీం కోర్టు జోక్యం చేసుకుంది. దీన్నొక హై ప్రొఫైల్ కేసుగా అభివర్ణిస్తూ.. కేసును ఆగస్టు 19న సీబీఐకి అప్పజెప్పింది. మరోవైపు ఆర్థిక లావాదేవీల కోణంలో ఈడీ, డ్రగ్స్ లింకుల నేపథ్యంలో ఎన్సీబీ.. సుశాంత్ కుటుంబ సభ్యుల నుంచి బాలీవుడ్ సెలబ్రిటీల దాకా వీలైనంత ఎక్కువ మందిని ప్రశ్నించాయి.. అనుమానితుల్ని అరెస్ట్ చేశాయి. ఏదైతేనేం ఏడాది పూర్తయ్యింది. సీబీఐ నుంచి, ఇతర విభాగాల నుంచి సుశాంత్ కేసులో ఎలాంటి అప్డేట్ లేదు. అందుకు సోషల్ మీడియా గట్టిగా #JusticeForSushantSinghRajput అని నినాదం చేస్తోంది. -
ట్రెండింగ్‌లో #JusticeForDisha
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో సహా పలువురు బాలీవుడ్ ప్రముఖులకు పీఆర్ మేనేజర్‌గా వ్యవహరించింది దిశా సలియాన్. ఆమె మరణించి నేటికి(జూన్ 8) సరిగ్గా ఏడాది పూర్తి అయ్యింది. దిశ చనిపోయిన ఆరు రోజులకి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడు. దిశ మరణం ఈనాటికీ ఒక మిస్టరీనే. ఈ తరుణంలో దిశ చావుకి, సుశాంత్ చావుకి ఏదో లింక్ ఉందనేది సుశాంత్ ఫ్యాన్స్ అనుమానం. అందుకే ఆమెకు న్యాయం జరగాలని కోరుకుంటూ ఈరోజు ట్విట్టర్లో జస్టిస్ ఫర్ దిశ హ్యాష్‌ట్యాగులతో క్యాంపెయిన్ నడిపించారు. ముంబై: దిశ సలియాన్ పోయినేడాది జూన్ 8న చనిపోయింది. ముంబైలో మలాడ్ వెస్ట్ ప్రాంతంలోని జన్‌కళ్యాణ్ అపార్ట్మెంట్ 14వ అంతస్తు నుంచి దూకి ఆమె మరణించిందని పోలీసులు వెల్లడించారు. ఆమె చాలా కాలంగా డిప్రెషన్లో ఉందని, అందుకే సూసైడ్ చేసుకుందని దిశ కాబోయే భర్త రోహన్ రాయ్ మీడియాతో చెప్పాడు. అయితే ఆమె మృతిపై అందరికీ అనుమానాలున్నాయి. ఆమె ఆత్మహత్య చేసుకుందని కొందరు అంటుంటే.. శవంగా కింద ఉన్న టైంలో ఆమె ఒంటి మీద బట్టలు లేవని, ఆమెపై అత్యాచారం జరిగి ఉంటుందని, ఆమె మరణానికి ముందు ఆమె అపార్ట్మెంట్కి కొందరు వచ్చారని, సామూహిక అత్యాచారం చేశారని, ఒకానొక దశలో నటుడు సూరజ్ పంచోలీ ఆమెను గర్భవతిని చేశాడని.. ఇలా రకరకాల పుకార్లు వినిపించాయి. అయితే యాక్సిడెంటల్ డెత్‌గా నమోదు చేసుకున్న ముంబై పోలీసులు కేసును క్లోజ్ చేశారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ కేసు దర్యాప్తును సీబీఐ తీసుకున్నాక.. దిశ కేసును కూడా పరిశీలించాలని నిర్ణయించుకుంది. ఒక సెలబ్రిటీ ఫిగర్ విషయంలో ఇంతకాలమైనా ఎటు తేలకపోవడంపై చాలా మందిలో అసంతృప్తి నెలకొంది. ఏది ఏమైనా ఈ కేసు చాలామందికి ముఖ్యంగా సుశాంత్ అభిమానులకు ఆమె పట్ల సానుభూతి క్రియేట్ అయ్యింది. మే 26.. దిశ డే దిశ సలియాన్ కర్ణాటకలోని ఉడిపిలో పుట్టింది. ముంబైలో చదువుకున్న దిశ.. మాస్ మీడియా కోర్సులో డిగ్రీ చేసి పీఆర్ ఏజెన్సీలోకి అడుగుపెట్టింది. టైమ్స్ గ్రూప్ లాంటి ప్రముఖ కంపెనీల్లో పని చేసింది. కొన్నాళ్లపాటు సుశాంత్ పీఆర్వోగా వ్యవహరించింది. ఆమె తండ్రి ఓ వ్యాపారవేత్త. టీవీ యాక్టర్ రోహన్ రాయ్‌తో ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. గత ఏడాది కాలంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై వరల్డ్ రికార్డు స్థాయిలో ట్వీట్లు పోస్ట్ అయ్యాయి. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో వారంలో కనీసం మూడు రోజులైనా ట్వీట్లతో ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఈ తరుణంలో సింపథీతో దిశా కోసం కూడా ఉద్యమిస్తున్నారు. మే 26న ఆమె పుట్టినరోజుకాగా.. ఆ రోజును ఏకంగా దిశ దినోత్సవంగా ట్విట్టర్లో జరిపారు కూడా. చదవండి: సుశాంత్‌కి పట్టిన గతే పడుతుంది -
సుషాంత్ కేసు: సిద్ధార్థ్ కస్టడీకి కోర్టు అనుమతి
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో నటుడి పీఆర్ మేనేజర్ సిద్ధార్థ్ పితానిని ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా సిద్దార్థ్ అరెస్ట్‌పై తాజాగా ఎన్సీబీ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. '' ఈ నెల 26న సిద్థార్ధ్ను హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాం. విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా .. సిద్థార్ధ్ స్పందించలేదు. దీంతో సిద్ధార్థ్‌ను అరెస్ట్ చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశాం. హైదరాబాద్ నుంచి ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబైకి తరలించి ముంబై కోర్టులో సిద్థార్ధ్ను హాజరుపరిచాం. కోర్టు జూన్ 1 వరకు సిద్ధార్థ్‌ను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు అనుమతి ఇచ్చింది.'' అని తెలిపింది. కాగా అతడు గతంలో సుశాంత్ నివసించిన ఫ్లాట్‌లోనే మూడేళ్లపాటు ఉన్నాడు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకునే ముందు చివరిసారిగా సిద్ధార్థ్‌తో మాట్లాడినట్లు పోలీసులు గతంలోనే గుర్తించారు. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసులో సీబీఐ అధికారులు ఇతడిపై విచారణ జరిపారు. అలాగే ఈ కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలోనూ ఎన్సీబీ అధికారులు సిద్ధార్థ్‌ను పలుమార్లు విచారించారు. చదవండి: సుశాంత్ కేసు: నటుడి పీఆర్ మేనేజర్ అరెస్ట్ -
‘నా కుమారుడి చావును క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు’
ఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కుదిపివేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సుశాంత్ మరణంపై పలు అనుమానాలు కూడా వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్లో సినీ ప్రముఖులు ప్రతిభను ప్రోత్సాహించరని.. కేవలం బంధుప్రీతి చూపిస్తారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కాగా ప్రస్తుతం బాలీవుడ్లో సుశాంత్ సింగ్ జీవితంపై రెండు, మూడు బయోపిక్‌లు నిర్మాణంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ ఈ చిత్రాలను నిలిపివేయాల్సింది కోరుతూ మంగళవారం ఢిల్లీ హై కోర్టును ఆశ్రయించారు. అతడి వాదనలు విన్న కోర్టు సుశాంత్‌పై తెరకెక్కుతున్న చిత్రాలను నిలిపివేయాల్సిందిగా నిర్మాతలకు సమన్లు జారీ చేసింది. తన కొడుకు చావును పలు నిర్మాణ సంస్థలు క్యాష్ చేసుకోవాలనుకుంటున్నాయనీ సుశాంత్ సింగ్ తండ్రి ఆరోపించారు. అంతేకాకుండా తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని తెలిపారు. కాగా, సుశాంత్ సింగ్ తండ్రి తరపున సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టులో వాదనలను వినిపించారు. సుశాంత్ సింగ్ కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, అతనిపై వచ్చే బయోపిక్ సినిమాలు కేసుపై ప్రభావం చూపుతాయని కోర్టుకు విన్నవించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడిన కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) దర్యాప్తు చేస్తోందని, తీర్పు ఇంకా పెండింగ్‌లో ఉందని కోర్టుకు తెలిపారు. పిటిషన్లో ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఎ స్టార్ వాస్ లాస్ట్ అండ్ శశాంక్’ వంటి చిత్రాలను ప్రస్తావించారు. అంతేకాకుండా కుటుంబసభ్యుల సమ్మతి లేకుండా ఈ సినిమాలను తీస్తున్నారని కోర్టుకు వివరించారు. ప్రస్తుతం బాలీవుడ్ సుశాంత్ జీవితం ఆధారంగా ‘న్యాయ్: ది జస్టిస్’, ‘సూసైడ్ ఆర్ మర్డర్: ఏ స్టార్ వాజ్ లాస్ట్ అండ్ శశాంక్’ సినిమాలు రూపొందుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఇప్పటివరకు అతని జీవితంపై మూడు సినిమాలు తెరపైకి వచ్చాయి. ఒక వార్తా నివేదిక ప్రకారం, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బయోగ్రఫీ, సుశాంత్, రాజ్‌పుత్: ది ట్రూత్ విన్స్ , ది అన్సాల్వ్డ్ మిస్టరీ సినిమాలకు ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ఆమోదం లభించినట్లు తెలుస్తోంది. చదవండి: సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు -
సుశాంత్ సింగ్ కజిన్ మంత్రి అయ్యాడు
పాట్నా: 2020లో అత్యంత విషాదం నింపిన ఘటన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. అతడి ఆత్మహత్య అనంతరం జరిగిన పరిణామాలు మరింత ఆవేదనకు గురి చేశాయి. అయితే ఇప్పుడు సుశాంత్ సింగ్ బంధువు బిహార్ మంత్రిగా నియమితులయ్యారు. ఈ వార్తపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు నీరజ్ సింగ్ బబ్లూ సుశాంత్‌కు చుట్టం అవుతారు. బిహార్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మంగళవారం చేపట్టారు. కొత్తగా 17 మంది మంత్రులుగా నియమితులు కాగా వారిలో సుశాంత్ కజిన్ నీరజ్ సింగ్ బబ్లూ ఉన్నారు. సీఎం నితీశ్ కుమార్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కింది. రాఘోపూర్ స్థానం నుంచి 2005లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అనంతరం 2010, 2015, 2020 ఎన్నికల్లో ఉంబర్‌పూర్ నుంచి పోటీ చేసి గెలిచారు. బీహార్ బీజేపీ అగ్రనేతల్లో నీరజ్ సింగ్ బబ్లూ ఒకరు. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ‘సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదు’ అని ప్రకటించిన వ్యక్తి నీరజ్ సింగ్ బబ్లూ. సోషల్ మీడియాలో ‘జస్టిస్ ఫర్ ఎస్ఎస్ఆర్’ అనే ఉద్యమాన్ని ఆయన ప్రారంభించారు. సుశాంత్ మరణం తర్వాత అతడి కుటుంబానికి నీరజ్ సింగ్ బబ్లూ అండగా నిలిచారు. -
దయచేసి నన్ను ఫాలో కావొద్దు
ముంబయి: బాలీవుడ్ నటి రియాచక్రవర్తి బాంద్రాలోని రోడ్డు పక్కన ప్రత్యక్షమైంది. బుధవారం ముంబైలోని బాంద్రాలోని రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో రియా చక్రవర్తి పూల బొకే కొనుగోలు చేసింది. రియా చక్రవర్తి కారు దిగి పూల దుకాణంలో బొకే కొనుగోలు చేసిన తర్వాత కారు వైపు నడుస్తున్నప్పుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అభిమానులు ఆమెను గుర్తు పట్టి తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడం మొదలు పెట్టారు. దింతో ఆమె వారిని దయచేసి నన్ను ఫాలో కావొద్దు, వీడియోలు తీయకండి అని వారిని వేడుకుంది. ఇప్పడు దీనికి సంబందించిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.(చదవండి: క్షమాపణలు చెప్పిన సల్మాన్ ఖాన్) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) రియా పూలు కొన్న తర్వాత తన కారు దగ్గరకు వెళ్తుండగా ఫొటోగ్రాఫర్లు ఆమెను ఫాలో అయ్యారు. "అబ్ మెయిన్ జా రాహి హూన్, పీచే మాట్ ఆనా" అని ఆమె అనడం మనం వీడియోలో గమనించవచ్చు. జనవరి 21న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జన్మదినానికి ఒక రోజు ముందు రియా పువ్వులు కొన్నట్లు అభిమానులు గుర్తించారు. అయితే రియా మాత్రం వీటిపై స్పందించలేదు. రియా వదులుగా ఉండే బూడిద రంగు చొక్కా, నల్ల లెగ్గింగ్ ధరించింది. ఆమె నల్ల మాస్కు ధరించి వీడియోలో కనిపించింది. డ్రగ్స్ లింక్స్ కేసులో జైలు జీవితం గడిపిన తర్వాత బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
ఏడాదిని మింగేసిన కరోనా మహమ్మారి
కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. ఈ ఏడాదంతా కరోనా, కరోనా, కరోనా అంతే.. మరో మాటకి తావు లేదు. వేరే చర్చకి ఆస్కారం లేదు. కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తూనే దేశం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. కరోనా నేర్పిన పాఠాలను అర్థం చేసుకుంటూనే సామాజిక, ఆర్థిక మార్పులకి అలవాటు పడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి అడుగులు పడుతున్నాయి. వ్యాక్సిన్‌తో కరోనా పీడ విరగడైపోతుందన్న ఉత్సాహంతో యావత్ భారతావని కొత్త ఏడాదికి స్వాగతం చెప్పడానికి సిద్ధమైంది. ఉవ్వెత్తున ఉద్యమాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లో మైనార్టీలకు భారత పౌరసత్వాన్ని ఇవ్వడానికి వీలు కల్పించే పౌరసత్వ సవరణ చట్టంపై పెల్లుబుకిన ఆగ్రహంతో మొదలైన ఈ ఏడాది కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కన్నెర్ర చేయడంతో ముగుస్తోంది. ప్రపంచ దేశాల దృష్టిని కూడా ఈ రెండు ఉద్యమాలు ఆకర్షించాయి. పౌరసత్వ సవరణ చట్టంతో (సీఏఏ)అభద్రతా భావంలో పడిపోయిన మైనార్టీలు ఢిల్లీలో షహీన్‌బాగ్ వేదికగా కొన్ని నెలల పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ఏడాది మార్చిలో కరోనా కారణంగా లాక్డౌన్ విధించడంతో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం చప్పున చల్లారిపోయింది. ఏడాది చివర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, పంజాబ్ సరిహద్దుల్లో గడ్డ కట్టే చలిని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టాలతో వ్యవసాయం కార్పొరేటీకరణ జరుగుతుందని, కనీస మద్దతు ధరకే ఎసరు వస్తుందన్న ఆందోళనతో రైతన్న నెలరోజులై ఆందోళనలు ఉధృతంగా నిర్వహిస్తున్నారు. వామ్మో కరోనా కంటికి కనిపించని సూక్ష్మక్రిమి ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఏడాదంతా కరోనా తప్ప మరే మాట వినిపించలేదు. చైనాలోని వూహాన్లో తొలి సారిగా బట్టబయలైన ఈ వైరస్ అక్కడ్నుంచి వచ్చిన ఒక విద్యార్థి ద్వారా జనవరి 30న భారత్‌లోని కేరళకి వచ్చింది. ఆ తర్వాత మార్చికల్లా ఢిల్లీ, హైదరాబాద్, బెంగుళూరుకి విస్తరించింది. దీంతో కేంద్రం మార్చి 25 నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ విధించింది. సరిహద్దులన్నీ మూసివేసి కార్యకలాపాలన్నీ నిలిపివేయడంతో సామాజికంగా, ఆర్థికంగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి ఆ తర్వాత దశల వారీగా పాక్షికంగా లాక్‌డౌన్‌ని కొనసాగించిన∙కేంద్రం జూన్ 1 నుంచి అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభించింది. ప్రపంచ దేశాల పట్టికలో కోటికి పైగా కేసులతో రెండో స్థానంలో ఉన్నప్పటికీ పోరాట పటిమ ప్రదర్శించిన భారత్‌ను డబ్ల్యూహెచ్‌వో కూడా ప్రశంసించింది. బతుకు నడక 130 కోట్ల జనాభా కలిగిన భారత్ వంటి దేశంలో కరోనా కట్టడికి లాక్డౌన్ మినహా మరో మార్గం లేకపోవడంతో కేంద్రం రాత్రికి రాత్రి నిర్ణయం తీసుకుంది. దీంతో అతి పెద్ద మానవీయ సంక్షోభం తలెత్తింది. కేంద్రం నిర్ణయం 4 కోట్ల మంది వలస కార్మికులపై తీవ్రమైన ప్రభావం పడింది. పనులు లేకపోవడం, కరోనా మహమ్మారి ఎలాంటి ఆపద తీసుకువస్తుందోన్న ఆందోళనలతో వలస కార్మికులు చావైనా బతుకైనా సొంత గడ్డపైనేనని నిర్ణయించుకొని స్వగ్రామాలకు పయనమయ్యారు. కాళ్లు బొబ్బలెక్కేలా మైళ్లకి మైళ్లు నడిచారు. ఈ క్రమంలో 200 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రమైన జీవితం కోసం వారు పడ్డ ఆరాటం, సాగించిన నడక మనసుని బరువెక్కించే దృశ్యంగా నిలిచింది. మూగబోయిన స్వరాలు కరోనా మహమ్మారి గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంది. ఆగస్టు 5న కరోనా సోకడంతో చెన్నైలో ఆసుపత్రిలో చేరిన ఆయన 40 రోజుల పాటు మహమ్మారితో పోరాడి సెప్టెంబర్ 25న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. హిందూస్తానీ సంగీతంలో సుప్రసిద్ధులైన పండిట్ జస్రాజ్ 90 ఏళ్ల వయసులో గుండె పోటు రావడంతో అమెరికాలో తుది శ్వాస విడిచారు. ఈ ఇద్దరు సంగీత సామ్రాట్‌లను కోల్పోవడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆలయాలకి భూమి పూజ శ్రీరాముడి భక్తుల కలలు ఫలించే అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో పాటు, ప్రజాస్వామ్యానికి దేవాలయం వంటి పార్లమెంటు కొత్త భవనానికి ఈ ఏడాది భూమి పూజ మహోత్సవాలు జరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగస్టు 5న అయోధ్యలో రామ మందిరానికి పునాది రాయి పడింది. 40కేజీల బరువున్న వెండి ఇటుకని శంకుస్థాపన కోసం వాడారు. మరోవైపు పార్లమెంటు కొత్త భవనానికి డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. దేశవ్యాప్తంగా నియోజకవర్గాల సంఖ్య పెంచుతూ ఉండడంతో 1,224 మంది సభ్యులు కూర్చొనే సామర్థ్యంతో ఈ భవనం నిర్మాణం జరుపుకుంటోంది. ఒక హత్య, మరో ఆత్మహత్య ఈ ఏడాది జరిగిన క్రైమ్ సీన్లో హాథ్రస్ అత్యాచారం, హత్య కేసు ఎంత సంచలనం సృష్టించిందో, బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తదనంతరం బాలీవుడ్ డ్రగ్స్ మాఫియాపై జరిగిన విచారణ అంతే ప్రకంపనలు రేపింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లా బూల్హరీ గ్రామానికి చెందిన 19 ఏళ్ల దళిత యువతి సెప్టెంబర్ 14న వ్యవసాయ క్షేత్రానికి వెళితే అగ్రవర్ణానికి చెందినవారుగా అనుమానిస్తున్న కొందరు పశువుల్లా మారి గ్యాంగ్ రేప్ చేయడంతో తీవ్రగాయాలతో బాధపడుతూ ఢిల్లీ ఆస్పత్రిలో బాధితురాలు సెప్టెంబర్ 29న మరణించింది. యూపీ పోలీసులు ఆమె మృతదేహానికి పోస్టు మార్టమ్ నిర్వహించకుండా 30 తెల్లవారుజామున 2.30 గంటలకు హడావుడిగా అంత్యక్రియలు చేయడంతో ఈ రేప్ కేసు రాజకీయ ప్రకంపనలు రేపింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన స్వగృహంలో జూన్ 14న ఆత్మహత్య చేసుకోవడం ఆ తర్వాత జరిగిన పరిణామాలు బాలీవుడ్‌ని ఒక్క కుదుపు కుదిపేశాయి. బాలీవుడ్లో ఏళ్ల తరబడి వేళ్లూనుకుపోయిన నెపోటిజంపై చర్చ మళ్లీ మొదలైంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ని మించిన మలుపులతో సాగిన ఈ ఉదంతం బాలీవుడ్ మాఫియా లింకుల్ని కూడా బయటకు లాగడంతో ప్రకంపనలు సృష్టించింది. సుశాంత్ సింగ్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిని సెప్టెంబర్ 8న మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) అరెస్ట్ చేయడంతో బాలీవుడ్ తారలకే చుక్కలు కనిపించాయి. దీపిక పదుకొనె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ వంటి వారు ఎన్సీబీ ఎదుట హాజరవాల్సి వచ్చింది. సరిహద్దుల్లో సై నాలుగు దశాబ్దాల తర్వాత వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కయ్యాలమారి చైనా నిబంధనలన్నీ తుంగలో తొక్కి, ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాల్ని తోసి రాజని మన జవాన్లపై జూన్ 15 అర్ధరాత్రి దాడులకు దిగింది. మన సైన్యం కూడా గట్టిగా ఎదురుదాడికి దిగడంతో డ్రాగన్ తోక ముడిచింది. ఈ ఘర్షణల్లో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా నుంచి జరిగిన ప్రాణ నష్టాన్ని ఆ దేశం ఇప్పటివరకు బయట పెట్టలేదు. చైనాను దీటుగా ఎదుర్కోవడానికి వాస్తవాధీన రేఖలో జవాన్లకు అత్యద్భుమైన సదుపాయాలను కల్పించడంతో పాటు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో కూడిన క్షిపణుల్ని మోహరించి భారత్ సైనిక రంగంలో తన సత్తా చాటుకుంది. అవీ.. ఇవీ.. ► నిర్భయ హత్యాచారం కేసులో ఆమె తల్లిదండ్రుల పన్నెండేళ్ల పోరాటం ఫలించింది. దోషులైన పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్, ముఖేష్ కుమార్‌లకు మార్చి 20న ఢిల్లీలోని తిహార్ జైల్లో ఉరి శిక్ష అమలు చేశారు. ► మహారాష్ట్రలోని పాలగఢ్ జిల్లాలో ఏప్రిల్‌లో జరిగిన మూకదాడిలో ఇద్దరు సాధువులు సహా ముగ్గురు మరణించారు. యూపీలోని ఒక ఆలయంలో ఇద్దరు సాధువులు హత్యకు గురయ్యారు. ఈ ఘటనలు మతం రంగు పులుముకోవడంతో బీజేపీ, శివసేన మాటల యుద్ధానికి దిగాయి. ► ఒకవైపు కోవిడ్ మహమ్మారితో సతమతమవుతూ ఉంటే మేలో అంఫా తుఫాన్ ఈశాన్య భారతాన్ని కలవరపెట్టింది. బెంగాల్లో తుపాన్ ధాటికి 72 మంది ప్రాణాలు కోల్పోతే, లక్ష కోట్ల రూపాయల నష్టం కలిగింది. ► ఐరాసభద్రతా మండలికి నాన్ పర్మెనెంట్ సభ్యదేశంగా భారత్ జూన్ 18న ఎన్నికైంది. వచ్చే జనవరి నుంచి కొత్త మండలిలో భారత్ చేరనుంది. ► ముంబైని పీఓకేతో పోల్చడం, రాష్ట్ర పోలీసుల్ని విమర్శిస్తూ ట్వీట్లు పెట్టడంతో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు, శివసేన సర్కార్ మధ్య పెద్ద యుద్ధమే నడిచింది. సెప్టెంబర్‌లో ఆమె నివాసాన్ని కూడా కూల్చివేయడానికి ముంబై నగరపాలక సంస్థ ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కంగనాకు కేంద్రం వై ప్లస్ భద్రత కల్పించడం విమర్శలకు దారి తీసింది. -
మత్తులో మనోళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మాదకద్రవ్యాల వినియోగంలో ఉన్న చీకటి కోణాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డ్రగ్స్ వినియోగంపై సర్వేల వివరాలు వెలువడుతున్నాయి. టాప్–10 నగరాల్లో ఢిల్లీ, ముంబై.. జర్మనీకి చెందిన మార్కెట్ పరిశోధన సంస్థ ఏబీసీడీ ప్రపంచంలోని 120 దేశాల్లో 2018 డ్రగ్స్ వినియోగంపై డేటా ఆధారంగా జాబితాను రూపొందించింది. ఏబీసీడీ జాబితా ప్రకారం.. ► ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ వినియోగం న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇక్కడి ప్రజలు ప్రతి సంవత్సరం 70 వేల 252 కిలోల మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారు. ► పాకిస్తాన్‌లోని కరాచీ నగరం రెండవ స్థానంలో ఉంది. ఇక్కడ ఏటా 38 వేల 56 కిలోల డ్రగ్స్‌ను వినియోగిస్తారు. ► ప్రపంచంలోని టాప్–10 నగరాల జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ మూడో స్థానంలో, దేశ ఆర్థి క రాజధాని ముంబై ఆరో స్థానంలో ఉంది. ఢిల్లీవాసులు ప్రతీ సంవత్సరం 34 వేల 708 కిలోల డ్రగ్స్ వినియోగించగా, ముంబై వాసులు ప్రతీ ఏటా 29 వేల 374 కిలోల మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. ► నాలుగోస్థానంలో అమెరికాలోని లాస్ ఏంజిల్స్ ( 32,713 కిలోలు), ఐదోస్థానంలో ఈజిప్ట్‌లోని కైరో ( 29,565 కిలోలు), ఏడో స్థానంలో ఇంగ్లండ్ రాజధాని లండన్ (28,485 కిలోలు), ఎనిమిదోస్థానంలో అమెరికాలోని షికాగో (22,262 కిలోలు), తొమ్మిదోస్థానంలో రష్యా రాజధాని మాస్కో ( 20,747 కిలోలు), పదో స్థానంలో కెనడా రాజధాని టొరంటొ ( 20,638 కిలోలు) ఉన్నాయి. 5 ఏళ్లలో 14.74 లక్షల కిలోల డ్రగ్స్.. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాల ప్రకారం 2019లో 3.42 లక్షల కిలోల కంటే ఎక్కువ మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. 35,310 మందిని ఎన్సీబీ అరెస్టు చేసింది. అరెస్ట్ అయిన వారిలో 35 వేల మంది పురుషులు, 284 మంది మహిళలు ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో 2015 – 2019 మధ్య దేశవ్యాప్తంగా ఎన్సీబీ 14.74 లక్షల కిలోల డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకుంది. 2018 లో అత్యధికంగా 3.91 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. రోజుకు 23 మంది మృతి.. ఒకసారి మాదకద్రవ్యాలకు బానిసౖలైన వారు ఆ వ్యసనాన్ని వదిలించుకోవడం చాలా కష్టం. డ్రగ్స్ వినియోగంతోనూ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. డ్రగ్స్ దొరకని పరిస్థితుల్లోనూ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. దేశంలో మాదకద్రవ్యాల వినియోగం కారణంగా ప్రతిరోజూ 23 మంది మరణిస్తున్నారని ఎన్సీబీ గణాంకాలు సూచిస్తున్నాయి. గతేడాది 7,860 మంది డ్రగ్స్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. డ్రగ్స్ అధిక మోతాదు కారణంగా 704 మంది మరణించారు. 2019లో డ్రగ్స్ కారణంగా 8,564 మంది మృతి చెందారు. దీని ప్రకారం ప్రతిరోజూ 23 మంది మాదకద్రవ్యాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. -
కామెడీ క్వీన్‌కు ఎన్సీబీ సెగ
సాక్షి, ముంబై: బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్‌కు మరో షాక్ తగిలింది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత మాదకద్రవ్యాల తుట్టె కదిలింది. బాలీవుడ్ ప్రముఖులపై నిషేధిత మత్తు పదార్ధాల వినియోగం ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఇప్పటికే పలువురిని విచారించింది. తాజాగా నటి భారతీ సింగ్ ముంబై నివాసంపై శనివారం ఉదయం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) దాడి చేసింది. భారతి సింగ్‌తోపాటు, ఆమె భర్తపైనా నిషేధిత పదార్థాలు తీసుకున్న ఆరోపణలు వచ్చాయని ఏజెన్సీ వర్గాలు తెలిపాయి. డ్రగ్ పెడ్లర్ విచారణలో భారతి సింగ్ పేరు వెలుగులోకి రావడంతో ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం ఈ దాడులు చేపట్టింది. కొద్దిమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీనియర్ అధికారి తెలిపారు. దీంతో భారతి, ఆమె భర్త హర్ష్ లింబాచియాకు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నెల ప్రారంభంలో నటుడు అర్జున్ రాంపాల్ ఇంటిపై ఎన్సీబీ దాడులు చేసింది. రాంపాల్, అతని స్నేహితురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ ఇద్దరినీ ప్రశ్నించింది. అయితే తన నివాసంలో ఎన్సీబీ స్వాధీనం చేసుకున్నవి ప్రిస్క్రిప్షన్‌లో భాగమని రాంపాల్ చెప్పాడు. ప్రిస్క్రిప్షన్ మేరకు మందులు వాడుతున్నాను తప్ప, తనకు డ్రగ్స్‌తో సంబంధం లేదనీ పేర్కొన్నాడు. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అర్నాబ్ గోస్వామి అరెస్ట్ అన్యాయమేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : రిపబ్లిక్ టీవీ స్టార్ యాంకర్, ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఆయన అభిమానులతోపాటు మరి కొంత మంది వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ‘ఇది పత్రికా స్వేచ్ఛ పై జరిగిన దాడి, భావ ప్రకటనా స్వేచ్ఛ రాజ్యాంగ హక్కు’ అంటూ కొందరు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తల వరకు విమర్శిస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేతోపాటు ఆయన మంత్రివర్గ సహచరులను, ముంబై పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌లను విమర్శించినందుకు గోస్వామిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. అర్నాబ్ గోస్వామిని అరెస్ట్ చేయడం అన్యాయమేనా? అది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం అవుతుందా? బాలీవుడు వర్ధమాన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బాలీవుడ్ తార రియా చక్రవర్తిని అరెస్ట్ చేయాలంటూ కొన్ని నెలలపాటు అర్నాబ్ గోస్వామి తన టీవీ ఛానెల్ ద్వారా గోల చేసిన విషయం తెల్సిందే. రియా చక్రవర్తిని అనుమానితురాలిగా ముందుగా అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు ఆ తర్వాత ఎలాంటి ఆధారాలు లేవంటూ వదిలేశారు. తన ఆత్మహత్యకు ఫలానా, ఫలానా వారు బాధ్యులంటూ సుశాంత్ ఎలాంటి ఆత్మహత్య లేఖలో పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని, రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి, కేసు పెడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటూ గోస్వామి పదే పదే డిమాండ్ చేశారు. అలాంటి వ్యక్తిని 2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ చేయడం తప్పెలా అవుతుంది ? పైగా ఆ డిజైనర్ తనకు అర్నాబ్ గోస్వామి, ఆయన ఇద్దరు మిత్రులు ఇవ్వాల్సిన దాదాపు ఐదు కోట్ల రూపాయలను చెల్లించక పోవడం వల్లనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, సూసైడ్ నోట్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ కారణంగానే ఆ డిజైనర్ తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే రియా అరెస్ట్‌ను పదే పదే డిమాండ్ చేసిన గోస్వామికి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు కూడా ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదా ? అది రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగించడమేనా? సామాజిక కార్యకర్త సుధా భరద్వాజ్, విరసం కవి వరవర రావు, జర్నలిస్ట్ సిద్ధిక్ కప్పన్‌తోపాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో అనేక మంది జర్నలిస్టులను అనేక కేసుల్లో అరెస్ట్ చేసి నిర్బంధించగా, కొన్నేళ్లుగా వారు బెయిల్ దొరక్క జైళ్లలో అలమటిస్తున్నారు. నేడు గోస్వామి అరెస్ట్‌ను ఖండిస్తున్నావారు వారి నిర్బంధాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదన్నదే ఇక్కడ ప్రశ్న. క్వారంటైన్లో ఉన్న గోస్వామి తన మిత్రుడి సెల్‌ఫోన్ ద్వారా తన వారందరితో మంతనాలు జరుపుతున్నారనే ఫిర్యాదుపై పోలీసులు ఆ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకొని క్వారంటైన్ నుంచి ఆదివారం తెల్లవారు జామున తలోజి జైలుకు పంపించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. తాను తన న్యాయవాదులతో ఫోన్లో కూడా సంప్రతించేందుకు వీల్లేకుండా తనను అన్యాయంగా జైలుకు తరలించారంటూ గోస్వామి కూడా మీడియాతో మొరపెట్టుకున్నారు. ఒక్క గోస్వామికే కాదు, ఆయన స్థానంలో ఓ సామాన్యుడు ఉన్నా న్యాయవాదులను సంప్రతించేందుకు ఫోన్ అనుమతించడం కూడా రాజ్యాంగం కల్పిస్తున్న హక్కే. సెల్‌ఫోన్‌ను అనుమతించకపోయినా జైల్లో ఉండే ఫోన్లను అనుమతించాల్సిందేగదా!? పారిపోయే అవకాశం లేనందునా గోస్వామికైనా ఈ కేసులో బెయిలివ్వాల్సిందే. ‘బెయిల్ నాట్ జెయిల్’ అన్న అర్నాబ్ నినాదంలో నిజం లేకపోలేదు. -
సుశాంత్ కేసు: గాబ్రియెల్లా సోదరుడు అరెస్ట్
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి డ్రగ్స్ కోణం వెలుగు చూడటంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆ దిశగా విచారణ చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదివారం నటుడు అర్జున్ రాంపాల్ ప్రియురాలు గాబ్రియెల్లా డెమెట్రియేడ్స్ సోదరుడిని అరెస్టు చేసింది. అతనికి కూడా డ్రగ్స్ వ్యవహారంతో సంబంధం ఉన్నట్లు తేలడంతో ఎన్సీబీ అతనిని రిమాండ్‌లోకి తీసుకుంది. ఇక దక్షిణాఫ్రికా జాతీయుడైన అగిసిలాస్‌ను డ్రగ్ పెడ్లర్లతో సన్నిహితంగా ఉన్నాడన్న ఆరోపణలతో అరెస్ట్ చేసిన ఎన్సీబీ స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం అతనిని కస్టడీకి పంపారు. ఇప్పటికే సుశాంత్ కేసులో ఆయన ప్రేయసి రియా చక్రవర్తిని, ఆమె సోదరుడు షోవిక్‌ను, సుశాంత్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, పర్సనల్ స్టాఫ్ దీపేశ్‌సావంత్ తదితరులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక రియా ఈ కేసులు 28రోజుల జైలు జీవితం గడిపి బెయిల్‌పై విడుదలయ్యింది. వీరినే కాకుండా ఈ కేసుకు సంబంధించి బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, సారా ఆలీఖాన్, శ్రద్ధాకపూర్ లాంటి వారిని కూడా ఎన్సీబీ విచారించింది. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబాయిలోని బాంద్రాలో ఉన్న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన పలు ఆరోపణలు తెరపైకి వచ్చిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అభ్యర్థన మేరకు ఎన్సీబీ కేసు నమోదు చేసింది. చదవండి: ప్రముఖ టీవీ ఛానెల్‌పై రూ.200 కోట్ల దావా -
పొరుగింటామెను అరెస్ట్ చేయండి: రియా
ముంబై: తనపై తప్పుడు ఆరోపణలు చేసి కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పొరుగింటావిడ డింపుల్ తవానిపై చర్యలు తీసుకోవాలని రియా చక్రవర్తి సీబీఐకిలేఖ రాసింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య విషయంలో రియా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు అంటే జూన్ 13న రియాను తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి సుశాంత్ వచ్చాడని డింపుల్ ఒక మీడియాతో చెప్పారు. అయితే ఆమె సీబీఐ విచారణలో నేను వారిని చూడలేదని ఎవరో చెబితే విన్నానని వెల్లడించారు. దీంతో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కేసును తప్పుదోవ పట్టించడానికి చూసిన డింపుల్‌పై చర్యలు తీసుకోవాలని రియా సీబీఐని లేఖ ద్వారా కోరింది. మీడియా తన టీర్పీల కోసం తనను అపకీర్తి పాలు చేస్తోంది లేఖలో పేర్కొంది. ఇక సుశాంత్ కేసులో రియాను సీబీఐ సెప్టెంబర్‌లో అదుపులోకి తీసుకుంది. ఆమెకు అక్టోబర్7 వతేదీన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రియా తమ్ముడు షోవిక్‌కు మాత్రం ఇంకా కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఇక రియా తరుపు న్యాయవ్యాది ఈ కేసులో మీడియా ముందు తప్పుడు ఆరోపణలు చేస్తున్న వ్యక్తుల పేర్లు సీబీఐ ముందు ఉంచుతామని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..? -
రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ పై సీనియర్ నటి షబనా ఆజ్మీ ఘాటుగా స్పందించారు. దివంగత నటుడు సుశాంత్ రాజ్ పుత్ సింగ్ మరణం తరువాత వివాదాస్పద వ్యాఖ్యలతో నిరంతరం వార్తల్లో నిలుస్తున్న కంగనాపై షబనా తనదైన శైలిలో విమర్శలకు దిగారు. ప్రధానంగా బాలీవుడ్‌కు తానే స్త్రీవాదాన్ని, జాతీయవాదాన్ని నేర్పించానన్న కంగనా వ్యాఖ్యలపై షబనా స్పందించారు. కంగనా తన సొంత పురాణాన్ని విశ్వసించడం మొదలు పెట్టిందనీ, తన మాయలో తాను బతుకుతోందని విమర్శించారు. ఇకనైనా వీటికి స్వస్తి చెప్పి తన పని తాను చేసుకుంటే మంచిదని కంగనాకు సూచించారు. అంతేకాదు రోజూ వార్తల హెడ్ లైన్స్ లో లేకపోతే ఆమెకు భయం.. అందుకే ఎపుడూ వార్తల్లో ఉండేందుకు వివాదాస్పద వ్యాఖ్యలు, దారుణమైన ప్రకటనలు చేస్తుందంటూ కంగనాపై మండిపడ్డారు. ఆమె చాలా బాగా నటిస్తుంది...నటనపై దృష్టి కేంద్రీకరిస్తే మంచిదంటూ కంగనాకు షబనా ఆజ్మీ హితవు పలకడం విశేషం. ముంబై మిర్రర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘డ్రగ్ మాఫియా’, టెర్రరిస్టుల నుంచి బాలీవుడ్‌ను రక్షించాలన్న కంగనా వ్యాఖ్యలను షబానా తిప్పికొట్టారు. చిత్ర పరిశ్రమకు తన కుండే సమస్యలున్నాయని, కానీ మొత్తం పరిశ్రమను ఒకే గాటన కట్టడం అన్యాయమన్నారు. సామాజికంగా నిబద్ధతతో మాట్లాడేవారు చాలామంది ఇండస్ట్రీలో ఉన్నారని షబనా పేర్కొన్నారు. నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్ళించే క్రమంలోనే ఒక పద్ధతి ప్రకారం తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో యాంటి నేషనల్ అంటూ షబనా ఆజ్మీపై విమర్శలు గుప్పించిన కంగనా ఆమె భర్త జావేద్ అక్తర్ పై కూడా ఆరోపణలు చేసింది. కాగా సుశాంత్ ఆత్మహత్య తరువాత బాలీవుడ్ లో నెపోటిజం, మాదక ద్రవ్యాలవినియోగంపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సుశాంత్ ది ఆత్మహత్య కాదు అని నిరూపించలేని రోజు తన పద్మశ్రీ పురస్కారాన్ని వదులుకుంటానని కంగనా గతంలో ప్రకటించారు. అయితే తాజాగా సుశాంత్ ది ఆత్మహత్యే అని వైద్యుల బృందం ప్రకటించడంతో సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద దుమారమే రేగుతోంది. -
సుశాంత్ కేసు ఇంకెన్నాళ్లు..?
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ది హత్యా? ఆత్మహత్యా ? ఎప్పటికి తేలుతుందని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సీబీఐని సూటిగా ప్రశ్నించారు. ఈ కేసులో సీబీఐ కొనసాగిస్తున్న విచారణపై ప్రజలందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని అన్నారు. శుక్రవారం మంత్రి దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ.. సుశాంత్ మృతిపై ముంబై పోలీసులు సరైన దిశగా విచారణ చేస్తున్న సమయంలో హఠాత్తుగా కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ చేతుల్లోకి ఈ కేసు వెళ్లిందన్నారు. వీలైనంత త్వరగా సీబీఐ అసలు నిజాలను రాబట్టాలన్నారు. ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టి 45 రోజులు గడిచినా ముందుకు అడుగు పడలేదని మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు. (సుశాంత్ కేసులో మరో మలుపు) -
సుశాంత్ మృతి కేసులో ఎయిమ్స్ వైద్యుల నివేదిక
-
సుశాంత్ మృతిపై ఎయిమ్స్ కీలక రిపోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కీలక రిపోర్టును సమర్పించింది. సుశాంత్ అనుమానాస్పద మృతిని సుదీర్ఘం పరిశీలించిన ఎయిమ్స్ వైద్యులు మంగళవారం తుది నివేదికను ప్రభుత్వానికి అప్పగించారు. సుశాంత్ మృతదేహంలో ఎలాంటి విషం లేదని స్పష్టం చేశారు. ఆయన మృతికి ఉరి వేసుకోవడమే కారణమని ఎయిమ్స్ వర్గాలు ధృవీకరించాయి. సుశాంత్ డీఎన్ఏను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నివేదికను సమర్పిస్తున్నామని, దీనిలో ఎలాంటి సందేహాలు అవసరంలేదని పేర్కొన్నారు. గతంలో మహారాష్ట్ర వైద్యుల నివేదికలో తేలిన విషయాలే తమ పరిశీలనలో తేలాయని వివరించారు. తాజా నివేదిక ఆధారంగా మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని వైద్యులు భావిస్తున్నారు. (నలుగురిదీ ఒక్కటే మాట..) జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మృతిపై తొలుత అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. తన కుమారుడిని ఎవరో గొంతునులిమి హత్య చేసిఉంటారని, ఇది ముమ్మాటికి హత్యేనని అతని తండ్రి బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనేక వివాదాలు, ఆరోపణల నడుమ సుశాంత్ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలోనే ఎయిమ్స్ తన రిపోర్టును సమర్పించింది. సుశాంత్‌కు ముమ్మాటికి ఆత్మహత్యేనని తేల్చింది. మరోవైపు అతని మరణాంతరం వెలుగుచూసిన డ్రగ్స్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో తొలినుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఇచ్చిన వాంగ్మూలం మేరకు నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతోంది. మరోవైపు సీబీఐ సైతం ఎంక్వైరీ చేస్తోంది. (సుశాంత్ మృతి: మర్డర్ కేసుగా మార్చండి!) మరోవైపు గొంతు నులమడం వల్లనే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయాడని సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ ఆరోపిస్తున్నారు. తాను పంపిన సుశాంత్ మృతదేహం ఫొటోలు చూసి ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ ఒకరు ఈ విషయం స్పష్టం చేశారని పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేస్తున్న జాప్యం దారుణమన్నారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై దర్యాప్తును పక్కనబెట్టి, ఎన్సీబీ డ్రగ్స్ కేసుపై ఎక్కువ దృష్టి పెడుతున్నారన్నారు. -
ఉడ్తా బాలీవుడ్
-
సుశాంత్ కేసు క్లైమాక్స్‌కు చేరుకున్నట్లేనా?
సాక్షి, న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఇక క్లైమాక్స్‌కు చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో రియా చక్రవర్తిని విచారిస్తున్న సీబీఐకు ఎయిమ్స్ ఫోరెన్సిక్ విభాగం కొన్ని రిపోర్టులను అందించింది. సోమవారం ఉదయం 11గంటల సమయంలో ఎయిమ్స్‌కు చెందిన నలుగురు ఎయిమ్స్ వైద్యులు సీబీఐ అధికారులను కలిసి వారికి రిపోర్టులు అందించారు. వారి మధ్య దాదాపు రెండు గంటల పాటు సమావేశం జరిగింది. సుశాంత్ మరణించిన సమయంలో అతని ఇంటికి దగ్గరలో ఉన్న కూపర్ ఆసుపత్రిలో సుశాంత్ పంచనామా నిర్వహించారు. అనంతరం ఈ కేసును రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న సీబీఐ పోస్ట్‌మార్టం రిపోర్టు విషయంలో సహకరించాలని ఎయిమ్స్‌ను కోరింది. దీంతో రంగంలోకి దిగిన ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం సుశాంత్ ఇంటిని కూడా పరిశీలించింది. సుశాంత్ మరణం వెనుక ఏదైనా కుట్రదాగుందా, ఇది ఆత్మహత్య లేదా హత్య అనే కోణంలో ఎయిమ్స్ వైద్యులు రిపోర్టును, సుశాంత్ మరణించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం సీబీఐకి తన రిపోర్టును అందించారు. ఇక సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణం వెలుగులోకి రావడంతో సీబీఐతో పాటు ఎన్సీబీ కూడా రంగంలోకి దిగి పలువురును విచారిస్తోంది. ఈ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు, బాలీవుడ్ సెలబ్రెటీల పేర్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ -
ఆ ముగ్గురినీ ప్రశ్నించిన ఎన్సీబీ
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో బాలీవుడ్–డ్రగ్స్ సంబంధాలపై నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ శనివారం హీరోయిన్లు దీపికా పదుకొణె, సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్‌లను సుదీర్ఘంగా వేర్వేరుగా ప్రశ్నించింది. ఇదే కేసులో శుక్రవారం విచారించిన ధర్మా ప్రొడక్షన్స్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్‌ను అరెస్టు చేసింది. దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న ఎన్సీబీ గెస్ట్‌హౌస్‌కు శనివారం ఉదయం 9.50 గంటల ప్రాంతంలో చేరుకున్న దీపికా పదుకొణె మధ్యాహ్నం 3.50 గంటల ప్రాంతంలో తిరిగి వెళ్లిపోయారు. దీపికను, ఆమె మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌ను కలిపి విచారించినట్లు సమాచారం. కరిష్మా డ్రగ్స్ గురించి జరిపిన వాట్సాప్ చాట్‌లో ‘డి’అనే అక్షరం ఎవరిని ఉద్దేశించిందనే కోణంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. కరిష్మాను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించినట్లు ఎన్సీబీ వర్గాలు తెలిపాయి. విచారణ అనంతరం వీరిరువురూ పది నిమిషాల వ్యవధిలోనే వేర్వేరు కార్లలో వెళ్లిపోయారు. వీరి విచారణ సమయంలో ఎన్సీబీ కార్యాలయం బయట పెద్ద సంఖ్యలో మీడియా సిబ్బంది గుమికూడారు. దక్షిణ ముంబైలో..బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉన్న ఎన్సీబీ జోనల్ కార్యాలయంలో శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్‌లను శనివారం సాయంత్రం ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. ఎన్సీబీ కార్యాలయానికి మధ్యాహ్నం 12గంటలకు శ్రద్ధాకపూర్ చేరుకోగా ఒక గంట తర్వాత సారా అలీఖాన్ వచ్చారు. వీరిద్దరినీ అధికారులు వేర్వేరుగా ప్రశ్నించారు. దాదాపు నాలుగున్నర గంటల అనంతరం సాయంత్రం 5.30 గంటలకు సారా, 6 గంటల ప్రాంతంలో శ్రద్ధాకపూర్ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా, డ్రగ్స్ కేసులో శుక్రవారం ప్రశ్నించిన నిర్మాత క్షితిజ్ రవి ప్రసాద్‌ను శనివారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. వెర్సోవాలో ఉన్న ఆయన నివాసం నుంచి తీసుకెళ్లి, రోజంతా ప్రశ్నించినట్లు సమాచారం. తాజా అరెస్టుతో డ్రగ్స్ కేసుల్లో అరెస్టయిన వారి సంఖ్య 18కి చేరుకుంది. మీడియాకు పోలీసుల వార్నింగ్ డ్రగ్స్ కేసులో ఎన్సీబీ విచారణకు హాజరై తిరిగి వెళ్లే సినీ ప్రముఖుల వాహనాలను వెంబడించి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని డిప్యూటీ కమిషనర్ సంగ్రామ్‌సింగ్ మీడియా సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై వెళ్లే వారిని ప్రమాదంలోకి నెట్టవద్దని కోరారు. ఎవరైనా వెంబడిస్తున్నట్లు తేలితే ఆ వాహనాలను సీజ్ చేయడంతోపాటు సంబంధిత డ్రైవర్‌పై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శనివారం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొణె ఎలాగోలా మీడియా కంటబడకుండా తప్పించుకోగా, మీడియా సిబ్బంది సారా అలీఖాన్ ప్రయాణిస్తున్న వాహనాన్ని వెంబడిస్తూ వచ్చారు. ఎన్సీబీ కార్యాలయం నుంచి తిరిగి వెళ్లే సమయంలో దీపిక పదుకొణె ప్రయాణిస్తున్న వాహనాన్ని మీడియా వెంబడించింది. అనంతరం పోలీసుల హెచ్చరికల ఫలితంగా శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ విచారణ అనంతరం తిరిగి వెళ్లే సమయంలో ‘ఛేజింగ్’ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. శాండల్‌వుడ్ కేసులో టీవీ యాంకర్.. మంగళూరు: శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో టీవీ యాంకర్ అనుశ్రీని శనివారం బెంగళూరు క్రైమ్ బ్రాంచి పోలీసులు ప్రశ్నించారు. స్నేహితుడు తరుణ్ రాజ్‌తోపాటు అనుశ్రీ పార్టీలకు హాజరైందంటూ ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన డ్యాన్సర్–కొరియోగ్రాఫర్ కిశోర్ అమన్ శెట్టి వెల్లడించడంతో పోలీసులు అనుశ్రీకి సమన్లు జారీ చేశారు. తరుణ్ డ్రగ్స్ వాడకంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు సమాచారం. విచారణలో వీరేమన్నారు ఈ సుదీర్ఘ విచారణలో అధికారులు ముగ్గురి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా దీపిక.. 2017లో తన మేనేజర్ కరిష్మాతో డ్రగ్స్ గురించి చాటింగ్ చేసినట్లు అంగీకరించారు. అయితే, డ్రగ్స్ తీసుకున్నదా లేదా అనేది వెల్లడికాలేదని సమాచారం. ఎన్సీబీ విచారణను ఎదుర్కొన్న సారా, శ్రద్ధా తమకు డ్రగ్స్ అలవాటు లేదని తెలిపారు. వీరి ఫోన్లను అధికారులు సీజ్‌చేశారు. -
బాలీవుడ్ ఒక్కటే వాడుతుందా: పూజా బేడీ
ముంబై: బాలీవుడ్ ఒక్క పరిశ్రమే డ్రగ్స్ వాడుతున్నట్లు మీడియా హడావుడి చేస్తుందని ప్రముఖ బాలీవుడ్ నటి పూజా బేడీ విమర్శించారు. బాలీవుడ్ కాకుండా మిగతా రంగాలలో విపరీతంగా డ్రగ్స్(మాదక ద్రవ్యాల) వాడుతన్నా, మీడియాకు కనిపించట్లేదా అని ప్రశ్నించారు. కాగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుత్ ఆత్మహత్యతో డ్రగ్స్ ప్రమేయం ఏమైనా ఉన్నదా అని దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై విచారణలో భాగంగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌ను ప్రశ్నించనున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) పేర్కొంది. ఈ అంశంపై ఎన్సీబీ పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులను ప్రశ్నిస్తోంది. వీరిలో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ప్రీత్ సింగ్‌లకు సమన్లు జారీ చేసన విషయం తెలిసిందే. మరోవైపు 39 మంది బాలీవుడ్ సెలబ్రిటీలపై డ్రగ్స్ కేసు సంబంధించి విచారించే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. సంచలన అంశాలను మీడియా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని పూజా బేడీ పేర్కొంది. -
డ్రగ్స్ కేసు: రియా ఎవరి పేర్లు చెప్పలేదు!
ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టైన నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో ఎవరి పేర్లను వెల్లడించలేదని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మానేషిండే అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మినహా ఇతర నటుల గురించి ఆమె మాట్లాడలేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మాట్లాడిన సతీశ్.. ‘‘ఎన్సీబీ ఎదుట వాంగ్మూలం ఇచ్చే సమయంలో రియా ఎవరి పేరును ప్రస్తావించలేదు. ఇందుకు సంబంధించిన వార్తలన్నీ అవాస్తవం. సుశాంత్‌తో ఉన్నన్ని రోజులు అతడు మత్తు పదార్థాలు తీసుకునేవాడని మాత్రమే రియా చక్రవర్తి ఎన్సీబీకి తెలిపారు. అంతేతప్ప ఇతరుల గురించి ఆమె మాట్లాడలేదు’’అని పేర్కొన్నారు. (చదవండి: టీవీ నటులను తాకిన డ్రగ్స్ సెగ) అదే విధంగా రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలను కూడా ఆయన కొట్టిపారేశారు. ‘‘సుశాంత్ ఇంటి మనిషిగా ఉన్నందున తన గురించి ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేయడం సరికాదు’’అని పేర్కొన్నారు. అయితే జయా సాహా ఇతర డ్రగ్ డీలర్లతో రియా వాట్సాప్ చాట్స్ గురించి సతీశ్‌ను ప్రశ్నించగా.. ‘‘రియా, సుశాంత్‌లతో జయా ఏం మాట్లాడారన్న దానిపై స్పష్టతనివ్వాలనుకుంటున్నా. గంజాయి ఆకుల నుంచి తీసిన సీబీడీ ఆయిల్ ఇవ్వాలని మాత్రమే వాళ్లు ఆమెను అడిగారు. నిజానికి అది మత్తు పదార్థం కాదు. ఎవరికైనా అనుమానం ఉంటే ఆ ఆయిల్ బాటిల్‌ను చెక్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి మాదక ద్రవ్యాలు లేవని దానిపై రాసి ఉంటుంది’’అని పేర్కొన్నారు. (చదవండి: హీరోయిన్లు మాత్రమేనా? హీరోల మాటేమిటి?) కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసుతో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర ప్రకంపనలు రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి అరెస్టు కాగా, బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకునె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్ సహా రకుల్ ప్రీత్‌సింగ్‌కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో దీపికా సెప్టెంబరు 25న, సారా, శ్రద్ధ సెప్టెంబరు 26న ఎన్సీబీ అధికారుల ఎదుట హాజరుకానున్నారు. రకుల్, సుశాంత్ మేనేజర్ శృతి మోదీ, సిమోన్ ఖంబట్టా నేడు విచారణ ఎదర్కొంటున్నారు. అయితే రియా చెప్పడంతోనే వీరందరి పేర్లు బయటపడ్డాయనే ప్రచారం నేపథ్యంలో లాయర్ సతీశ్ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అమెజాన్‌లో సీబీడీ ఆయిల్: మీరా చోప్రా
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుతో బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం తెర మీదకు వచ్చిన సంగతి తెలిసిందే. పలువురు స్టార్ హీరోయిన్లు మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్లు సంచలన వార్తలు వెలుగు చూస్తున్నాయి. వీరిలో కొందరు సీబీడీ ఆయిల్ (కానబిడియోల్ ఆయిల్) వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నటి మీరా చోప్రా చేసిన ఓ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది. తాను సీబీడీ ఆయిల్ కోసం ఆన్లైన్లో సర్చ్ చేశానని.. ఇది అమెజాన్‌లో దొరుకుతుందని తెలిపారు. ఈ మేరకు ఆమెకు ట్వీట్ చేశారు. ‘ఊరికే అడుగుతున్నాను. సీబీడీ ఆయిల్‌ని భారత్‌లో నిషేధించినప్పుడు అది ఆన్లైన్లో ఎలా అందుబాటులో ఉంది. ఇది అమెజాన్‌లో లభిస్తుంది. నేను చూశాను. నిషేధించినప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అంటూ మీరా చోప్రా ప్రశ్నించింది. ఇక సీబీడీ ఆయిల్ గంజాయి నుంచి లభిస్తుంది. దీన్ని మన దేశంలో నిషేధించారు. ఇక నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ టాలెంట్ మేనేజర్ జయ సాహా సంచలన విషయాలను వెల్లడించింది. (చదవండి: సుశాంత్ డ్రగ్స్ కోసం మమ్మల్ని వాడుకున్నాడు) సుశాంత్, రియా చక్రవర్తితో పాటు తన కోసం కూడా సీబీడీ ఆయిల్‌ను ఆర్డర్ చేసినట్లు జయ సాహా అంగీకరించిందని సమాచారం. అలాగే రియా చక్రవర్తికి వాట్సాప్ ద్వారా సుశాంత్‌కు ఇచ్చే డ్రగ్‌ను ఎలా వినియోగించాలో చెప్పిందని సమాచారం. సీబీడి ఆయిల్‌ని సుశాంత్ తాగే టీలో నాలుగైదు చుక్కలు కలిపి ఇవ్వాలని, అలా అరగంటకోసారి ఇవ్వాలని రియా చక్రవర్తికి సూచించానని జయ సాహా తెలిపినట్లుగా సమాచారం. ఇక రియా లాయర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో సీబీడి గురించి మాట్లాడారు. దీనిలో ఎలాంటి మాదకద్రవ్యాలు లేవని బాటిల్ మీద ఉందని తెలిపిన సంగతి తెలిసిందే. ఇక రియా తన బెయిల్ పిటిషన్లో సుశాంత్‌కి మాదక ద్రవ్యాల అలవాటు ఉందని.. అతని కోసం తాను అప్పుడప్పుడు చిన్న చిన్న పరిమాణంలో డ్రగ్స్ తీసుకున్నానని తెలిపింది. అయితే తాను డ్రగ్ సిండికేట్‌లో భాగం కానని రియా వెల్లడించింది. బాంబే హై కోర్టు ఈ రోజు ఆమె బెయిల్ పిటిషన్‌ని విచారించనుంది. -
రియా బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె బెయిల్ పిటిషన్ విచారణను ముంబై హైకోర్టు బుధవారం వాయిదా వేసింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాలతో బాంబే హైకోర్టు సెలవులో ఉంది. దీంతో రేపు(గురువారం) బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు పేర్కొంది. నేడు రియా బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసినట్లు బాంబే హైకోర్టు తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత 24గంటల్లో 173 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు నాయరో కోవిడ్-19 ఆస్పత్రి నీట మునిగింది. వర్షం కారణంగా ముంబైలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. రైల్వే ట్రాక్‌పై వర్షపు నీరు నిలవడంతో పలు రైలు సర్వీసులు రద్దయ్యాయి. చదవండి: (రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా) -
రియాకు అర్హత లేదు.. డీజీపీ రాజీనామా
పట్నా: బిహార్ ముఖ్యమంత్రిని విమర్శించినందుకు గాను రియా చక్రవర్తిపై మండి పడటమే కాక.. ఆమెకు ముఖ్యమంత్రిని విమర్శించే స్థాయి లేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన డీజీపీ గుప్తేశ్వర్ పాండే తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అయితే రాజకీయాల్లో చేరడానికి పాండే రాజీనామా చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే వచ్చే నెలలో బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాండే స్వచ్ఛంద పదవీ విరమణ చేయడంతో ఎన్నికల్లో పోటీ చేస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 బిహార్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి గుప్తేశ్వర్ పాండే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక పాండే రాజీనామా అభ్యర్థనకు సంబంధించి నోటిఫికేషన్ హోంశాఖ జారీ చేసింది. ఇక నిన్నటితో ఆయన వర్కింగ్ డేస్ పూర్తయ్యాయి.(చదవండి: ‘రియాకు ఆ అర్హత లేదు.. అందుకే’) ఇక డీజీపీ రాజకీయాల్లో చేరతారంటూ వస్తోన్న వార్తలపై పాండే స్పందించారు. ‘నేను ఇప్పటి వరకు ఏ పార్టీలో చేరలేదు.. దీని గురించి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. నాకు సమాజ సేవ చేయాలని ఉంది. అందుకుగాను రాజకీయాల్లోనే చేరాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. ఇక పాండే గతంలో కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాజకీయాల్లో చేరి.. బీజేపీ టికెట్ పొందాలని ఆశించారు. కానీ అవకాశం లభించలేదు. దాంతో ఉద్యోగానికి రాజీనామా చేసిన 9 నెలల తర్వాత తిరగి తనను విధుల్లోకి తీసుకోవాల్సిందిగా బిహార్ ప్రభుత్వాన్ని కోరారు. అతని అభ్యర్థన మేరకు నితీష్ కుమార్ 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు పాండేని విధుల్లోకి తీసుకున్నారు. -
అక్టోబర్ 6 వరకు రియా జైల్లోనే
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయని అభియోగాలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి మరోసారి చుక్కెదురైంది. ఆమె జ్యుడిషియల్ కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగిస్తూ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్టు చేసిన మిగతా నిందితులను రేపు కోర్టులో ప్రవేశపెడుతామని పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పందే తెలిపారు. నిందితుల్లో రియా సోదరుడు షోవిక్ కూడా ఉన్నారు. ఇక సెప్టెంబర్ 11న రియా, మిగతా ఐదుగురు నిందితులు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించింది. నిందితులు ప్రస్తుతం ముంబైలోని బైకుల్లా జైలులో ఉన్నారు. మరోవైపు రియా, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి బెయిల్ కోసం మహారాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. వీరి బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 23న విచారణకు రానుంది. బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో నివాసంలో జూన్ 14న ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. రియా చక్రవర్తికి సుశాంత్ మాజీ ప్రియురాలు కావడంతో ఆమెపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కేసు సీబీఐకి చేతికి వెళ్లింది. ఈ క్రమంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, నార్కోటిక్స్ విభాగం సైతం రంగంలోకి దిగింది. బాలీవుడ్ డ్రగ్స్ కేసుగా పరిస్థితి మారింది. ఈక్రమంలోనే బాలీవుడ్‌కు చెందిన హీరోయిన్లు సారా అలీ ఖాన్, మరో 15 మంది పేర్లను రియా విచారణలో వెల్లడించినట్టు సమాచారం. రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా డ్రగ్స్ కేసులో వినిపిస్తోంది. -
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కంగనా!
అహ్మదాబాద్: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మృతితో పాటు మాదకద్రవ్యాల అంశానికి సంబంధించి బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ చేస్తున్న ఆరోపణలు, విమర్శలు హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా రాజకీయంగా సైతం సంచలనం సృష్టిస్తున్నాయి. కంగనా చేస్తున్న వ్యాఖ్యలపై బాలీవుడ్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యులు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) చీఫ్ రామ్‌దాస్ అథవాలే కంగనాకు మద్దతుగా నిలిచారు. దీంతో కంగనా రాజకీయాల్లోకి వస్తున్నారనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా గుజరాత్‌లోని వడోదరలో వెలుగుచూసిన ఓ పోస్టర్ చర్చనీయాంశమైంది. త్వరలో జరగబోయే వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఆర్పీఐ కంగనా ఫొటోలతో ఉన్న పోస్టర్‌ను వాడింది. (చదవండి: ఎన్ని నోళ్లు మూయించగలరు?) కాలాఘోడా ప్రాంతంలో వెలిసిన ఈ పోస్టర్లో అథవాలే, కంగనా ఉన్నారు. కంగనాకు తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆర్పీఐ వడోదర చీఫ్ రాజేశ్ గోయల్ ఈ సందర్భంగా తెలిపారు. ముంబై వచ్చేందుకు కంగానా ఇబ్బందులు పడుతున్న సమయంలో తమ పార్టీ అధినేత అథవాలే ఆమెకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కాగా, యంగ్ హీరో సుశాంత్ సింగ్ మరణానికి బంధుప్రీతి కారణమని వార్తల్లో నిలిచిన కంగనా, బాలీవుడ్‌ను డ్రగ్స్ మాఫియా శాసిస్తోందని చెప్పి తీవ్ర విమర్శలు చేసింది. దాంతోపాటు సుశాంత్ మృతి కేసు విచారణలో ముంబై పోలీసులపై నమ్మకం లేదని తేల్చి చెప్పింది. కంగనా వ్యాఖ్యలపై శివసేన పార్టీ నేతలు అభ్యంతరం తెలపడంతో వివాదం ముదిరింది. ఈక్రమంలోనే అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ ముంబై కార్పొరేషన్ కంగనా కార్యాలయంలో కొంత భాగాన్ని కూల్చేసింది. కక్ష సాధింపు చర్యలు చేపట్టారంటూ ఆమె హైకోర్టుకు వెళ్లడంతో.. అధికారుల దుందుడుకు చర్యలపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. (చదవండి: డ్రగ్స్ వాడకం ఫలితమే డిప్రెషన్: కంగనా) -
మలుపులు తిరుగుతున్న సుశాంత్ మృతి కేసు
-
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో విచారణ వేగవంతం
-
సుశాంత్ విసెరాను సరిగా భద్రపరచలేదు
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన కేసులో మరో కీలక విషయం వెలుగు చూసింది. సుశాంత్ మృతదేహం నుంచి సేకరించిన కీలమైన అవయవాలు(విసెరా) సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ బృందం పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అదే విధంగా అవయవాల (విసెరా)ను సరిగా భద్రపరచలేదని తెలిపింది. ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్, టాక్సికాలజీ విభాగానికి అందిన విసెరా చాలా తక్కువ పరిమాణంలో ఉందని, కొంత మేరకు క్షీణించిందని అధికారులు తెలిపారు. (సస్పెన్స్ థ్రిల్లర్‌కు ఏమాత్రం తీసిపోని కేసు) ఎయిమ్స్ బృందం ఆదివారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిట్)ను కలువనుంది. ఎయిమ్స్ బృందం సుశాంత్‌కి సంబంధించిన పలు నివేదికలు సిట్‌కి అందించనున్నారు. సుశాంత్ మృతికి గల కారణాన్ని నిర్ధారించడంలో కీలకమైన విసెరాను శుక్రవారం ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందం పరీక్షించింది. అయితే సుశాంత్ అవయవాల (విసెరా) క్షీణించిందని, దాని వల్ల రసాయన, టాక్సికాలజికల్ విశ్లేషణ చేయడం కష్టతరంగా మారిందని ఎయిమ్స్ అధికారులు పేర్కొన్నారు. జూన్ 14న సుశాంత్ తన ముంబై ఇంటిలో ఉరివేసుకుని చనిపోయిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సుశాంత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో సీబీఐ విచారణ జరుపుతోంది. (కరణ్ జోహార్ డ్రగ్ పార్టీపై ఎన్సీబీ కన్ను) -
జయప్రదను టార్గెట్ చేసిన నగ్మ
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు అనేక మలుపులు తిరుగుతూ మాదకద్రవవ్యాల వినియోగం అంశం దగ్గర ఆగిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ కోణం వెలువడటంతో కేసు మరో మలుపు తిరిగింది. పార్లమెంట్ వేదికగా దీనిపై వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఇక మాదకద్రవ్యాల కోణం గురించి వ్యాఖ్యలు చేసిన కంగనకు, ఇతర నటులకు మధ్య మాటలయుద్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలో నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మ.. బీజేపీ నాయకులు, సీనియర్ నటి జయప్రదను టార్గెట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు నుంచి ప్రజలను దారి మళ్లించడానికి మాదకద్రవ్యాలు, బాలీవుడ్లో డ్రగ్ కల్చర్ అంశాలను తెర మీదకు తెచ్చారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నగ్మ ట్వీట్ చేశారు. (చదవండి: విమర్శలు... వ్యంగ్యాస్త్రాలు) CBI , NCB , ED pls answer to #BJP Member #JayaPrada Ji on what’s happening to #SSR case it’s been so long we are all waiting for what’s the outcome but no result and to cover up suddenly all #bjp members r talking about drugs in #Bollywood as Nation is still waiting #SSRDeathCase — Nagma (@nagma_morarji) September 17, 2020 ‘సీబీఐ, ఎన్సీబీ,ఈడీ దయచేసి సుశాంత్ కేసులో ఏం జరుగుతుందో బీజేపీ నాయకులు, జయప్రద గారికి తెలియజేయండి. సుశాంత్ చనిపోయి ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయింది. దేశప్రజలంతా సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. కానీ ఫలితం లేదు. దీన్ని కవర్ చేయడానికి ఉన్నట్లుండి బీజేపీ నాయకులు బాలీవుడ్లో మాదక ద్రవ్యాల వినియోగం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికి కూడా దేశ ప్రజలు సుశాంత్ మృతికి కారకులేవరో తెలుసుకోవాలని భావిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ఎంపీ రవికిషన్ బాలీవుడ్లో డ్రగ్స్ వినియోగం ఉందంటూ చేసిన వ్యాఖ్యలకు జయప్రద మద్దతిచ్చారు. దాంతో నగ్మ ఈ వ్యాఖ్యలు చేశారు. టీవీ నటి కావ్యా పంజాబీ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘తొలుత జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రారంభమైంది.. తరువాత జస్టిస్ ఫర్ కంగనగా మారి ఇప్పుడు జస్టిస్ ఫర్ రవి కిషన్ అయ్యింది. మరి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్కడ అంటూ’ ట్వీట్ చేసింది. -
నన్ను మీడియా వేధిస్తోంది
-
గవర్నర్‌తో కంగన భేటీ
ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్ నటి కంగన రనౌత్ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీతో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించి, న్యాయం చేయాలని కోరానని ఆ తరువాత ఆమె వెల్లడించారు. ‘గవర్నర్‌ని కలిశాను. ఒక పౌరురాలిగా ఆయనను కలిసేందుకు వచ్చాను. ఒక కూతురుగా నన్ను చూశారు. నా సమస్య విన్నారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అని గవర్నర్‌తో భేటీ అనంతరం కంగన వ్యాఖ్యానించారు. సోదరి రంగేలితో కలిసి ఆమె రాజ్‌భవన్‌లో కోశ్యారీని కలిశారు. ఆ సందర్భంగా గవర్నర్‌కు ఆమె పాదాభివందనం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ముంబైపై, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేశారు. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ఒకసారి, మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులకు భయపడ్తున్నానని మరోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన తీవ్రంగా స్పందించింది. ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, ముంబైకి రావద్దని కోరుతున్నామని సేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో బాంద్రాలోని కంగన కార్యాలయ భవనాన్ని అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్) అధికారులు పాక్షికంగా కూల్చివేశారు. ఆ తరువాత, శివసేనపై, ఉద్ధవ్‌ఠాక్రేపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముంబైని అవమానించిన వారికి మద్దతా? ముంబైని పీఓకేతో పోలుస్తూ అవమానించిన కంగనకు బీజేపీ మద్దతిస్తోందని, బిహార్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అలా వ్యవహరిస్తోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ విమర్శించారు. ముంబై ప్రాముఖ్యతను దెబ్బతీసి, నగరాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని సామ్నా పత్రికలోని తన కాలమ్ ‘రోక్‌తోక్’లో పేర్కొన్నారు. మరాఠా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఇదన్నారు. కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రకు చెందిన ఒక్క బీజేపీ నేత కూడా ప్రకటన చేయలేదని గుర్తు చేశారు. కంగన వ్యాఖ్యలను బాలీవుడ్ నటులెవరూ ఖండించకపోవడాన్ని ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మౌనంగా ఉన్న పాండవులతో పోల్చారు. ‘ముంబై వల్ల పేరు, డబ్బు అన్నీ సంపాదించుకున్న మీరు.. అదే ముంబైని సహ నటి విమర్శిస్తే ఖండించరా? డబ్బే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. నటుడు అక్షయ్‌కుమార్ మినహా ఎవరూ దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మేం మర్చిపోం, మర్చిపోనివ్వం: ఫడ్నవీస్
పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు బీజేపీపై మండిపడ్డారు. అందుకే బిహార్‌లో సుశాంత్ పోస్టర్లను దేవేంద్ర ఫడ్నవీస్ పెట్టించారని ఆరోపించారు. సుశాంత్ మరణాన్ని అడ్డుపెట్టుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. బిహార్ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి ఫడ్నవీస్ సారథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బిహార్‌లో వెలిసిన సుశాంత్ పోస్టర్లు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దీని గురించి ఫడ్నవీస్ స్పందిస్తూ ‘మేం సుశాంత్ సింగ్ మరణాన్ని రాజకీయాలకు వాడుకోవాలనుకోవడంలేదు. సుశాంత్ విషయం జరగకముందు నుంచే నేను బిహార్ ఎన్నికల కోసం పని చేస్తున్నాను. ఈ విషయం కామన్ మ్యాన్ భావాలకు స్పందించింది. సుశాంత్‌కు తప్పకుండా న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు. అందుకే మేం చెబుతున్నాం మర్చిపోము, మర్చిపోనివ్వము’ అని పేర్కొన్నారు. మహారాష్ట్రలో బీజేపీ మెజారిటీ స్థానాలు సాధించినప్పటికీ అనుకోని పరిస్థితులలో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇక శివసేన ప్రభుత్వంపై ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర గవర్నమెంట్ కరోనాపై యుద్ధం ముగిసిందని భావించి ప్రస్తుతం కంగనాపై యుద్ధం మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు. చదవండి: ‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’ -
రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ
ముంబై: సుశాంత్ ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన నటి రియా చక్రవర్తికి ముంబై కోర్టులో చుక్కెదురైంది. సోదరుడి షోవిక్‌తో పాటు ఎనిమిది మందికి బెయిల్ ఇచ్చేందుకు ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో రియాను, ఆమె సోదరుడు షోవిక్‌తో పాటు మరో ముగ్గురిని నార్కోటిక్ శాఖ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మొదటిసారి రియా బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు ఆమెను సెప్టెంబర్ 22 వరకు కస్టడీలో ఉంచాలని ఆదేశించింది. దీంతో రియా బెయిల్ కోసం మరోసారి కోర్టును ఆశ్రయించారు. ఈసారి కూడా రియాతో పాటు మరో ఐదుగురు నిందితుల బెయిల్ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. దీంతో బాంబే హైకోర్టును ఆశ్రయించేందుకు నిందితుల తరపు న్యాయవాది ప్రయత్నిస్తున్నారు. తన చేత బలవంతంగా నేరాన్ని ఒప్పించారని, కస్టడిలో తనకు రేప్ అండ్ మర్డర్ బెదిరింపులు వస్తున్నాయని రియా బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఇలాగే ఉంటే తన మానసిక పరిస్థితి మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రియా తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రియా ఏ నేరం చేయలేదని, అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం రియను ముంబైలోని బైకులా జైలులో ఉంచారు. ఆ జైలులో కేవలం రియా మాత్రమే మహిళ ముద్దాయిగా ఉన్నారు. చదవండి: మగ ప్రపంచంపై.. రియా కోపంగా ఉందా? -
‘సుశాంత్ రోజుకు 5 సార్లు డ్రగ్స్ తీసుకునేవాడు’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తిని, అతని తమ్ముడిని నార్కోటిక్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వద్ద రియా తమ్ముడు షోవిక్ చక్రవర్తి అనేక విషయాలు వెల్లడించాడు. తాను అనేక సార్లు సుశాంత్ సింగ్‌కు మరిజువానా, హాష్, వీడ్ సరఫరా చేసినట్లు పేర్కొన్నాడు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్డౌన్లో కూడా ఇచ్చినట్లు తెలిపాడు. దానికి సంబంధించిన బిల్లులు అన్ని రియా కార్డు నుంచే చెల్లించినట్లు అధికారులకు తెలిపాడు. ఇప్పటికే ఎన్సీబీ అరెస్టు చేసిన డ్రగ్స్ పెడ్లర్లు బసిత్ పరిహార్, సూర్దీప్ మల్హోత్రా తనకు డ్రగ్స్ అందించేవారని షోవిక్ వెల్లడించాడు. సుశాంత్ డ్రగ్స్ వాడతాడని శ్యామ్యూల్ మిరండా, సిద్దార్థ్ పితానీ తనతో చెప్పారాని తెలిపాడు. రియా, బసిత్ పరిహార్ వాట్సప్ చాట్‌ను షోవిక్ నిర్ధారించారు. ‘నేను మార్చి 16, 2020లో సుశాంత్ తనతో డ్రగ్స్ గురించి మాట్లాడాడని చెప్పగా సుశాంత్ రోజుకు 5 సార్లు వీడ్ తీసుకుంటాడని రియా చెప్పింది. అందుకే తనకి నేను ఐదు గ్రాముల వీడ్‌ను ఏర్పాటు చేశాను. అది 20 సార్లు వాడొచ్చు. అప్పుడు నేను బసిత్‌ను కలిశాను’ అని తెలిపారు. చదవండి: ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి -
రియా అరెస్టు: అదొక మూర్ఖపు చర్య!
న్యూఢిల్లీ: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని బిహార్ నటుడి మృతిగా ప్రచారం చేస్తూ బీజేపీ ఎన్నికల్లో లబ్ది పొందే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓట్లు రాబట్టుకునేందుకు ‘జస్టిస్ ఫర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ’పేరిట బీజేపీ బిహార్ విభాగం బ్యానర్లు, పోస్టర్లు విడుదల చేస్తోందంటూ మండిపడ్డారు. ‘‘దివంగత సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇండియన్ యాక్టర్. కానీ ఓట్లు కొల్లగొట్టేందుకు బీజేపీ ఆయనను బిహార్ నటుడిగా మార్చివేసింది’’ అంటూ ట్విటర్ వేదికగా విమర్శలు సంధించారు. అదే విధంగా సుశాంత్ మృతి కేసులో అతడి ప్రేయసి, నటి రియా చక్రవర్తి పట్ల దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్న తీరును అధీర్ రంజన్ చౌదరి తప్పుబట్టారు. (చదవండి: బలవంతంగా ఒప్పించారు: రియా ) ఈ మేరకు.. ‘‘ పొలిటికల్ మాస్టర్లను ప్రసన్నం చేసుకునేందుకు కేంద్ర సంస్థలు తమ వంతు పాత్ర పోషించాయి. సముద్రాన్ని మధించి మకరందానికి బదులు మాదక ద్రవ్యాలను కనుగొన్నాయి. అసలైన హంతకుడిని పట్టుకునేందుకు ఇప్పటికీ చీకట్లో వారి వెదుకులాట కొనసాగుతూనే ఉంది’’అని వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. రియా చక్రవర్తిని ఎన్డీపీఎస్ చట్టం(నార్కొటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెన్)కింద అరెస్టు చేయడాన్ని ఒక మూర్ఖపు చర్యగా అభివర్ణించారు. ఇక మరో ట్వీట్లో..‘‘రియా తండ్రి మాజీ ఆర్మీ అధికారి. ఆయన దేశానికి సేవ చేశారు. రియా బెంగాలీ బ్రాహ్మణ మహిళ, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు న్యాయం చేయడాన్ని బిహారీకి న్యాయం చేసినట్లుగా చిత్రీకరించడం సరికాదు’’ అంటూ ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తూనే రియా బెంగాలీ అంటూ పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా కొత్తగా ఎన్నికైన అధీర్ రంజన్ చౌదరి తన మార్కు రాజకీయాన్ని ప్రదర్శించారు. (చదవండి: ‘బిహార్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలం’) అదే విధంగా సుశాంత్ కేసులో ‘మీడియా విచారణ’ న్యాయ వ్యవస్థకు అరిష్టంగా దాపురిచిందంటూ మండిపడ్డారు. కాగా సుశాంత్ సింగ్ మృతి కేసులో వెలుగు చూసిన డ్రగ్స్ వ్యవహారంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు రియా చక్రవర్తిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రేమపేరిట తన కొడుకును మోసం చేసి, అతడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుందంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈడీ ఎదుట రియా విచారణకు హాజరయ్యారు. అంతేగాక సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో బిహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించిన విషయం విదితమే. Rhea's father is a former military officer, served the nation. Rhea is a Bengalee Brahmin lady, justice to actor sushant rajput should not be interpreted as a justice to Bihari.#SushantSinghRajputCase (4/n) — Adhir Chowdhury (@adhirrcinc) September 9, 2020 -
నేనెప్పుడూ అలా అనలేదు: అంకిత
ముంబై: సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌ను హత్య చేశారని తాను ఎప్పుడూ అనలేదని ఆయన మాజీ ప్రేయసి అంకితా లోఖాండే తెలిపారు. సుశాంత్‌కు, అతని కుటుంబానికి న్యాయం జరగాలని మాత్రమే కోరానని పేర్కొంది. సుశాంత్ మరణం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ సోషల్‌మీడియా వేదికగా నిరసనలు వెలువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన నార్కోటిక్ అధికారులు ఆయన స్నేహితురాలు రియా చక్రవర్తిని అదుపులోకి తీసుకున్నారు. 🙏🏻 pic.twitter.com/Hu985iz6Od — Ankita lokhande (@anky1912) September 9, 2020 ఈ విషయంపై స్పందించిన అంకిత ‘ఇది అనుకోకుండా జరిగింది కాదని, చేసుకున్న కర్మ ఫలితం’ అని ట్వీట్ చేసింది. ఇక సుశాంత్ ఆత్మహత్య గురించి మీరు ఎందుకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ప్రశ్నించగా, తాను కేవలం సుశాంత్ మానసిక స్థితి గురించి మాట్లాడానని, సుశాంత్‌ను హత్య చేశారని ఎప్పుడూ అనలేదని పేర్కొన్నారు. తాను ఎవరిని అనుమానిస్తున్నట్లు కూడా పేర్కొనలేదని చెప్పారు. తనకు తెలిసినంత వరకు సుశాంత్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని చెప్పారు. ఈ కేసులో ఉన్న నిజానిజాలు బయటకు రావాలని మాత్రమే తాను పోరాడుతున్నట్లు తెలిపారు. JUSTICE ⚖️ pic.twitter.com/O5aRCirGPD — Ankita lokhande (@anky1912) September 8, 2020 ఇక అంకిత, రియాకు పలు ప్రశ్నలు సంధించారు. సుశాంత్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వాళ్లు డాక్టర్ చెప్పిన మందులు కాకుండా డ్రగ్స్‌ను తీసుకోవడానికి ప్రోత్సహిస్తారా? అసలు ఎవరైనా అలా చేస్తారా? అని ప్రశ్నించారు. రియా కేవలం సుశాంత్ అనారోగ్యం గురించి మాత్రమే ఆయన కుటుంబ సభ్యులకు చెప్పింది. అంతేకాని సుశాంత్ డ్రగ్స్ వాడుతున్నట్లు చెప్పిందా? లేదు. ఎందుకంటే తాను కూడా ఆ డ్రగ్స్‌ను తీసుకుంటూ ఆనందించింది. అందుకే నేను ఖర్మ తప్పదూ అంటూ పేర్కొన్నాను అని అంకిత తెలిపింది. చదవండి: రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?! -
శివసేన సర్కారు దూకుడు
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న అనుమానాస్పద స్థితిలో మరణించి నప్పటినుంచి రాజుకుంటున్న వివాదం అనేకానేక మలుపులు తిరిగి చివరకు మంగళవారం అతని స్నేహితురాలు, నటి రియా చక్రవర్తి అరెస్టుకు దారితీసింది. అది జరిగిన మరునాడే నటి కంగనా రనౌత్ నివాసం ఆవరణలో అనుమతుల్లేని నిర్మాణాలున్నాయంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) కూల్చివేతలు మొదలుపెట్టడం, ముంబై హైకోర్టు ఆదేశాలతో మధ్యలో అవి నిలిచి పోవడం, ఆ విషయంలో శివసేనపై కంగనా విరుచుకుపడటం వంటి పరిణామాలన్నీ చకచకా జరిగాయి. రియా చక్రవర్తి అరెస్టుతో సుశాంత్ మరణంపై రాజుకున్న వివాదానికి తాత్కాలికంగా తెరపడిందని అందరూ అనుకునేలోగానే ఇప్పుడు కంగనా ఇంటి కూల్చివేత వివాదం ఎజెండాలో కొచ్చింది. ఈ రెండు ఉదంతాలూ పరస్పర సంబంధమైనవి కాకపోయివుంటే ఈ కూల్చివేత ఇంత ఆదరా బాదరాగా జరిగేది కాదు. అలాగే ఇంత ప్రముఖంగా చర్చకొచ్చేది కూడా కాదు. ఎందుకంటే ఇంతక్రితం షారుఖ్ ఖాన్, సోనూసూద్ వంటి బాలీవుడ్ ప్రముఖుల నివాసాల్లో సైతం బీఎంసీ అక్రమ నిర్మాణాల పేరిట కొన్నింటిని కూల్చివేసింది. ఇటీవలకాలంలో శివసేనపై, ముంబై మహా నగరంపై కంగనా చేస్తున్న వ్యాఖ్యానాలు ఆ పార్టీకి ఆగ్రహం కలిగిస్తున్నాయి. సుశాంత్‌సింగ్ కేసులో ముంబై పోలీసుల వ్యవహారశైలిని ఆక్షేపిస్తూ ఆ నగరాన్ని కంగనా పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చారు. ఇక్కడ జీవనం సాగించాలంటే భయంగా వుందని వ్యాఖ్యానించారు. అందుకు జవాబుగా శివసేన సైతం ఆమెపై నోరు పారేసుకుంది. దాంతో తన ప్రాణాలకు ముప్పువుందంటూ ఆమె కేంద్రానికి విన్నవించుకుని వై ప్లస్ సెక్యూరిటీ కూడా సాధించుకున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేసిన ప్పుడు శివసేన ప్రతీకారం ఏ స్థాయిలో వుంటుందో అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నందువల్లా, ఆ అధికారాన్ని ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో పంచుకుంటూన్నందువల్లా ఆ పార్టీ ఈసారి భౌతిక దాడులకు బదులు వాగ్యుద్ధానికి మాత్రమే పరిమితమైంది. కానీ అధికారాన్ని విని యోగించి తన చేతనైంది చేయడానికి సిద్ధపడింది. దాని పర్యవసానమే బుధవారంనాటి కూల్చివేత. కంగనా బంగ్లాలో కొన్ని అక్రమ నిర్మాణాలున్నాయని బీఎంసీ మొన్న సోమవారం ఆమెకు నోటీసులు జారీ చేసింది. అది అవాస్తవమని ట్విటర్లో కంగనా జవాబిచ్చారు. ఆమె సిబ్బంది కూడా బీఎంసీకి లిఖితపూర్వక సమాధానం పంపారు. అది అందుకున్న వెంటనే బుధవారం ఉదయం బీఎంసీ కూల్చివేత మొదలుపెట్టింది. మధ్యాహ్నానికి స్టే రావడంతో అది తాత్కాలికంగా నిలిచింది. ముంబై మహానగరంలో అధికారుల కుమ్మక్కు కారణంగా అనేకానేక అక్రమ నిర్మాణాలు బయల్దేరు తున్నాయని, పర్యవసానంగా వర్షాకాలంలో నగరం వరదల్లో చిక్కుకుంటున్నదని పర్యావరణవేత్తలు ఎప్పటినుంచో ఆరోపిస్తున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా సాగిస్తున్న నిర్మాణాలు నగరంలో నిరుపేదలు, సాధారణ పౌరుల బతుకుల్ని నరకప్రాయం చేస్తున్నాయని వారంటున్నారు. కనుక అక్రమ నిర్మాణాలు కూల్చేయాల్సిందే. కానీ అందుకు తగిన విధివిధానాలు అనుసరించాలి తప్ప ఇష్టానుసారం చేయడం ఎవరూ హర్షించరు. ఇది హఠాత్తుగా చేసింది కాదని...ఆమెకు 2018లోనే నోటీసులిచ్చామని బీఎంసీ చెబుతోంది. అది నిజమే కావొచ్చు... కానీ దానిపై ఆమె కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఇచ్చిన నోటీసుకు సైతం కంగనా సిబ్బంది జవాబిచ్చారు. ఆ వెంటనే కూల్చివేత ప్రారంభించాల్సిన అగత్యం ఏమొచ్చిందో బీఎంసీ సంతృప్తికరమైన జవాబివ్వలేక పోతోంది. ఒకపక్క ఆమెకూ, శివసేనకూ మధ్య వివాదం రాజుకుని తారస్థాయికి వెళ్లిన సమయంలో ఇది చోటుచేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది వేధింపుగానే అందరూ భావిస్తారు. ఈ వివాదం మొత్తానికి మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు. సుశాంత్ మరణానికి మానసిక ఒత్తిళ్లే కారణమని, ఇలాంటి ఒత్తిళ్లను అయినవాళ్లు సకాలంలో గుర్తించకపోతే బాధితులు ఆత్మహత్య చేసుకునేవరకూ వెళ్తారని చానెళ్ల నిండా నిపుణులు చర్చిస్తున్న సమయంలో కంగనా రనౌత్ రంగ ప్రవేశం చేసి పూర్తి భిన్నమైన కథనం వినిపించారు. బాలీవుడ్లో బంధుప్రీతిని ప్రోత్సహించే మూవీ మాఫియా అతన్ని మృత్యు ఒడిలోకి నెట్టిందని ఆరోపించారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం కూడా వున్నదని ఆమె చెప్పారు. ఆ తర్వాత మొత్తం మారిపోయింది. అది చూస్తుండగానే కంగనాకూ, శివసేనకూ... కంగనాకూ, ఇతర బాలీవుడ్ నటీ మణులకూ మధ్య వివాదంగా మారింది. బిహార్ ఎన్నికల్లో లబ్ధిపొందడానికే బీజేపీ ఉద్దేశపూర్వకంగా ముంబై పోలీసులపై బురద జల్లుతున్నదని, వారి తరఫున కంగనా ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తున్నారని శివసేన ఆరోపిస్తోంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చు. కానీ ఒక నటి చేసిన వ్యాఖ్యలు సీరియస్‌గా తీసుకుని, ఆమెపై కక్ష సాధిస్తున్నట్టు కనబడేలా వ్యవహరించడం శివసేన అపరిపక్వతను పట్టిచూపుతుంది. దశాబ్దాలుగా మహారాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న శివసేన గతంలో ఎన్నోసార్లు దూకుడు ప్రదర్శించి వివాదాల్లో చిక్కుకుంది. స్థానికుల ఉపాధి కాజేస్తున్నారన్న వంకతో స్థానికేతరులపై ఆ పార్టీ దాడులు చేసింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి నేతృత్వంవహిస్తూ ఇంత అసహనం, ఇంత తొందరపాటు ప్రదర్శించడం ఆ పార్టీకే కాదు... కూటమిలోని భాగస్వామ్య పార్టీలకు కూడా రాజకీయంగా ఇబ్బందులు తెస్తుంది. లాక్డౌన్ పర్యవసానంగా మన దేశంలో సామాన్యుల జీవనం ఎంత దుర్భరంగా మారిందో కళ్లకు కట్టే కథనాలు అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వస్తున్నాయి. కరోనా మహమ్మారి జోరు ఇంకా తగ్గలేదు. కానీ మన మీడియా మాత్రం రెండున్నర నెలలుగా బాలీవుడ్ పరిధి దాటి బయటకు రావడం లేదు. కనీసం ఇప్పటికైనా ఈ వివాదానికి తెరపడి జనం ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అందరూ దృష్టి కేంద్రీకరిస్తే మంచిది. -
రియా చక్రవర్తి నిజంగా నేరం చేశారా?!
సాక్షి, న్యూఢిల్లీ : ‘కొన్నేళ్లుగా మానసిక ఆందోళనతో బాధ పడుతూ అక్రమంగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వాటిని అధిక మొత్తంలో తీసుకొని ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని ప్రేమించిన పాపానికి నేడు ఓ యువతిని మూడు కేంద్ర ప్రభుత్వ సంస్థలు వెంటాడుతున్నాయి. ఇది న్యాయాన్ని అపహాస్యం చేయడమే’ అని బాలివుడ్ సినీ తార రియా చక్రవర్తిని మంగళవారం నాడు ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ అరెస్ట్ చేయడం పట్ల ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనెషిండే చేసిన వ్యాఖ్యలివి. రియా చక్రవర్తిని ప్రేమిస్తూ ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగిన బాలీవుడ్ వర్ధమాన హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన విషయం తెల్సిందే. ఆ కేసులో ఇంతకుముందే ఏడుగురు అనుమానితులను అరెస్ట్ చేయగా మంగళవారం నాడు రియాను అరెస్ట్ చేశారు. (చదవండి : ఏ తండ్రీ భరించలేడు.. నేను చచ్చిపోవాలి) న్యాయవాది సతీష్ వాదన మేరకు రియా చక్రవర్తిని అన్యాయంగా అరెస్ట్ చేశారా ? ఏ చట్టం కింద ఆమెను అరెస్ట్ చేశారు ? ఆ చట్టం ఏం చెబుతోంది ? చట్టంలో లోపాలు ఏమైనా ఉన్నాయా ? అన్న అంశాలపై ఆమెను అరెస్ట్ చేయడం సబబా, కాదా ! అన్న విషయం ఆధారపడి ఉంది. ‘నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్’ కింద ఆమెను అరెస్ట్ చేశారు. దేశంలో మాదక ద్రవ్యాలు లేదా మానసిక ప్రేరణ కలిగించే ద్రవ్యాలను ఉత్పత్తి చేయడం, సరఫరా చేయడం, కొనుగోలు చేయడం, కలిగి ఉండడం, ఉపయోగించడాలను నిషేధిస్తూ 1985లో భారత పార్లమెంట్ ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రకటించిన నేపథ్యంలో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం దీన్ని తెచ్చింది. ఈ చట్టంతోపాటు మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రపంచ దేశాలతో చేసుకున్న పలు ఒప్పందాలు, ఒడంబడికలను పటిష్టంగా అమలు చేయడం కోసం రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఓ చట్టం ద్వారా ‘నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో’ ఏర్పాటు చేసింది. ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టయిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. నేరం తీవ్రతను బట్టి చట్టంలోని 31, ఏ సెక్షన్ కింద మరణ శిక్షను కూడా విధించేందుకు ఆస్కారం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం 2001లో చట్టాన్ని సవరించింది. ‘ఇండియన్ హార్మ్ రిడక్షన్ నెట్వర్క్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో మరణ శిక్షకు వ్యతిరేకంగా ముంబై హైకోర్టు తీర్పు చెప్పింది. మాదక ద్రవ్యాల కేసులో మరణ శిక్షను అమలు చేయాల్సిందేనంటూ పంజాబ్ ప్రభుత్వం 2018లో కేంద్రానికి సిఫార్సు చేసింది.(చదవండి : రియా చక్రవర్తి అరెస్ట్ ) ఎన్టీపీఎస్ చట్టంలో ఎంతో గందరగోళం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలోని ఈ చట్టంలో ఎంతో గందరగోళం ఉంది. ఈ చట్టంలో ‘అడిక్షన్ (బానిసవడం)’ అన్న పదంగానీ, దానికి నిర్వచనంగానీ లేదు. కాకపోతే వైద్య అవసరాల కోసం మాదక ద్రవ్యాలను ప్రభుత్వమే సరఫరా చేయవచ్చు అని ఉంది. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన వారికి చికిత్స చేయడానికి లేదా వారి చేత వాటిని మాన్పించేందుకు మళ్లీ మాదక ద్రవ్యాలనే చికిత్సలో భాగంగా ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ వైద్య అవసరాలకు ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేయవచ్చంటే ‘డి అడిక్షన్’ సెంటర్లకు ప్రభుత్వం వీటిని సరఫరా చేయవచ్చని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక్క డి అడిక్షన్ కేంద్రం కూడా లేదు. స్వచ్ఛంద సంస్థలు, మాదక ద్రవ్యాల ప్రభావం నుంచి బయట పడిన వ్యక్తులు, సమూహాలు వీటిని నడుపుతున్నారు. వీటికి ప్రభుత్వం మాదక ద్రవ్యాలను సరఫరా చేసే పద్ధతి కూడా అమలులో లేదు. అమెరికా, కెనడా, నార్వే, బెల్జియం, నెదర్లాండ్స్ లాంటి దేశాలు మాదక ద్రవ్యాల నిర్మూలనా చట్టంలో భారీ సవరణలను తీసుకొచ్చి ‘అడిక్ట్స్ ట్రీట్మెంట్’కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నాయి. అమెరికా ‘సస్టేన్ అబ్యూస్ అండ్ మెంటల్ హెల్త్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్’ పేరిట ఓ చట్టాన్నే తీసుకొచ్చింది. డ్రగ్ అడిక్షన్‌ను నైతిక పరమైన అంశంగా పరిగణించడం వల్లనే భారత ప్రభుత్వాలు ఈ చట్టంలో సవరణలు తీసుకొచ్చేందుకు ఇంతవరకు సాహసించలే కపోయాయి. ‘డ్రగ్ అడిక్షన్’ను ఇతర దేశాలు ఓ జబ్బుగా, అంటే ‘జీవమనోసామాజిక’ స్థితిగా గుర్తించడం వల్ల సవరణలు తీసుకొచ్చాయి. చట్టంలో గందరగోళం ఉండడం వల్ల భారత్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసుల్లో న్యాయవాదులు స్పష్టంగా వాదించలేకపోతున్నారు. న్యాయమూర్తులు స్పష్టమైన తీర్పులు చెప్పలేక పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రిచా నేరం చేశారా? అంటే నైతికంగా చేసినట్లు, ‘అడిక్షన్’ పరంగా చేయనట్లని అర్థం చేసుకోవచ్చు! -
కంగనా బంగ్లాను కూల్చివేసిన బీఎంసీ
ముంబై: బాంద్రాలో ఉన్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని బృహన్ ముంబై కార్పొరేషన్(బీఎంసీ) అధికారులు బుధవారం కూల్చివేశారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యాలయాన్ని నిర్మించారనే ఆరోపణలతో కూల్చివేత కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగన మండిపడింది. 'నా ముంబై ఇప్పుడు పాక్ ఆక్రమిత కశ్మీర్' అంటూ మరోసారి ట్విట్టర్ పోస్ట్ చేశారు. దీంతోపాటు బీఎంసీ సిబ్బంది తన కార్యాలయాన్ని కూల్చుతున్న ఫొటోలను షేర్ చేసింది. ‘నేను ఎలాంటి తప్పు చేయలేదు, కానీ ముంబై అనేది మరో పీఓకే అనే విషయాన్నినా శత్రువులు పదేపదే నిరూపిస్తున్నారు’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. 'బాబర్, అతని సైన్యం' అంటూ కూల్చివేతకు వచ్చిన పోలీసులు, అధికారులు, సిబ్బంది ఫొటోలను షేర్ చేసింది. ‘ఇది కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు, నా వరకు ఇది రామ మందిర్. గుర్తుంచుకోండి బాబర్, అతని సైన్యం రామ మందిరాన్ని కూడా ముక్కలు ముక్కలు చేశారు. కానీ దాన్ని మళ్లీ ఇప్పుడు నిర్మించారు. నా భవనం విషయంలో కూడా అదే జరుగుతుంది. జై శ్రీరామ్’ అని ట్వీట్ చేసింది. కంగన ఇటీవలే రూ. 48 కోట్లతో ఈ కార్యాలయాన్ని కొనుగోలు చేసింది. Babur and his army 🙂#deathofdemocracy pic.twitter.com/L5wiUoNqhl — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 దీనిపై బీఎంసీ మేయర్ కిషోర్ పెడ్నేకర్ మాట్లాడుతూ, ‘ కంగనా తనకు నచ్చినట్లు మాట్లాడుతుంది. ఆమె తన మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఈ పని చేసిది శివసేన పార్టీ కాదు, బీఎంసీ. ఫిర్యాదు అందిన తరువాత మేం భవానాన్ని కూల్చివేశాం’ అని పేర్కొన్నారు. దీనిపై కంగనా తరుపు న్యాయవాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన కార్యాలయం కూల్చివేతను నిలిపేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన కోర్టు కూల్చివేతపై స్టే ఇచ్చింది. मणिकर्णिका फ़िल्म्ज़ में पहली फ़िल्म अयोध्या की घोषणा हुई, यह मेरे लिए एक इमारत नहीं राम मंदिर ही है, आज वहाँ बाबर आया है, आज इतिहास फिर खुद को दोहराएगा राम मंदिर फिर टूटेगा मगर याद रख बाबर यह मंदिर फिर बनेगा यह मंदिर फिर बनेगा, जय श्री राम , जय श्री राम , जय श्री राम 🙏 pic.twitter.com/KvY9T0Nkvi — Kangana Ranaut (@KanganaTeam) September 9, 2020 చదవండి: పీఓకేను తలపిస్తున్న ముంబై : కంగన -
డ్రగ్స్ కేసు : రియా చక్రవర్తి అరెస్ట్
సాక్షి, ముంబై : బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు అరెస్ట్ చేశారు. డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేసినట్లు ఎన్సీబీ తెలిపింది. సాయంత్రం 4:30 గంటలకు రియాకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. డ్రగ్స్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాను ఎన్సీబీ నాలుగు రోజుల పాటు రియాను విచారించింది. విచారణలో ఆమె 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా సుశాంత్ సింగ్ మృతి చెందినప్పటి నుంచి పోలీసులు రియాను విచారిస్తున్నారు. దీనిలో భాగంగానే డ్రగ్స్ కేసు వెలుగులోకి వచ్చింది. (8 గంటలు ప్రశ్నల వర్షం) ఈ క్రమంలోనే విచారణను మరింత వేగవంత చేసిన ఎన్సీబీ అధికారులు రియా సోదరుడు షోవిక్‌ను అరెస్టు చేశారు. రియా సూచనల మేరకు సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని షోవిక్ విచారణలో వెల్లడించాడు. ఆయన ఇచ్చిన వాగ్మూలం ఆధారంగానే ఎన్సీబీ విచారణ జరిపింది. ఈ క్రమంలోనే రియాకు చెందిన మొబైల్, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటినుంచి కీలక ఆధారాలను సేకరించారు. అలాగే డ్రగ్స్ స్మగ్లర్ బాసిత్‌ను ఐదు సార్లు కలిసినట్టు రియా అంగీకరించడంతో మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే రియా డ్రగ్ కేసులో బాలీవుడ్‌కు సంబంధం ఉన్నట్లు చెప్పడంతో పరిశ్రమలోని ప్రముఖులకు కూడా త్వరలో ఎన్సీబీ సమాన్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా ఎన్సీబీ అధికారులు సమీర్ వాంఖడే, కేపీఎస్ మల్హోత్రా ఆధ్వర్యంలో రియా విచారణ కొనసాగుతోంది. -
ఆ మెడిసిన్ వల్లే సుశాంత్ చనిపోయాడు : రియా
సాక్షి, ముంబై: దివంగత నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మరణానికి అతని సోదరి ప్రియాంక సింగ్ కారణమంటూ రియా చక్రవర్తి ఆరోపించింది. సుశాంత్ ఇద్దరు అక్కలు ప్రియాంక సింగ్, నీతూ సింగ్ సుశాంత్‌కు సంబంధించిన బోగస్ మెడికల్ ప్రిస్కిప్షన్‌ను ఇచ్చారని, ఆ మెడిసిన్ తీసుకున్న 5 రోజుల్లోనే సుశాంత్ మరణించాడని రియా సంచలన ఆరోపణలు చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు అతని సిస్టర్స్ కారణమంటూ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేగాక ఢిల్లీలో రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ తరణ్‌పై కూడా రియా ఈ ఫిర్యాదులో పేర్కొంది. గతంలో సుప్రీం ఆదేశాల మేరకు ప్రస్తుతం ఈ కేసును దర్యాప్తు నిమిత్తం ముంబై పోలీసులు సీబీఐకి బదలాయించారు. (నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి) ఢిల్లీ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి ఔట్ పేషెంట్‌గా సుశాంత్‌కు జూన్ 8వ తేదిన బోగస్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని... ఆ సమయంలో సుశాంత్ ముంబైలోనే ఉన్నట్లు తెలిపింది. చట్టవిరుద్ధంగా అతనికి సైకోట్రోపిక్ మెడిసిన్‌ను ఇవ్వడం వల్లే సుశాంత్ మరణించాడని ఆరోపించింది. సుశాంత్‌కు ఈ బోగస్ ప్రిస్క్రిప్షన్‌తో వైద్యం చేయడం వల్లే మరణించాడని ఇందుకు కారణమైన సుశాంత్ సోదరి ప్రియాంక, నీతూ సింగ్ డాక్టర్ తరుణ్‌లతో పాటు తదితరులను విచారించాల్సిందిగా రియా తన ఫిర్యాదులో పేర్కొంది. ఇక సుశాంత్ మృతికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో వరుసగా మూడోరోజు కూడా నటి రియా చక్రవర్తి నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా డ్రగ్స్ తీసుకొంటోన్న బాలీవుడ్‌కు చెందిన కొందరి పేర్లను కూడా రియా వెల్లడించినట్లు తెలుస్తోంది. (8 గంటలు ప్రశ్నల వర్షం) -
శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా
ముంబై: తనపై విమర్శలు చేస్తున్నవారిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడ్డారు. ముఖ్యంగా శివసేన ఎంపీ సంజయ్‌రౌత్ పురుష అహంకారి అని విమర్శించారు. భారతీయ మహిళలపై ఇన్న ఘోరాలు, అఘాయిత్యాలు జరగడానికి ఇలాంటి పురుష అహంకారమేనని కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మహారాష్ట్రవాసిని కాదన్న సంజయ్ రౌత్ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నానని అన్నారు. గతంలో ముంబై మహా నగరంలో బతకలేకపోతున్నామని చెప్పిన ఆమిర్ ఖాన్, నసీరుద్దీన్ షాపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని కంగనా ప్రశ్నించారు. ఒక మహిళను అయినందునే శివసేన ఎంపీ రెచ్చిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం కంగనా ట్విటర్లో వీడియో విడుదల చేశారు. (చదవండి: నేను విఫలమయ్యాను: సుశాంత్ సోదరి) సెప్టెంబర్ 9 న ముంబై వస్తున్నానని, దమ్ముంటే తనను అడ్డుకోవాలని ఆమె విమర్శకులకు సవాల్ విసిరారు. ప్రస్తుతం ఆమె సిమ్లాలోని తన సొంతింట్లో ఉన్నారు. కాగా, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముంబై పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదని కంగనా అసహనం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. మంబై పోలీసులపై నమ్మకం లేకుంటే ఇక్కడకు రావొద్దని సంజయ్ రౌత్ కంగనాకు కౌంటర్ ఇచ్చారు. ఎంపీ సంజయ్ బహిరంగంగా తనకు వార్నింగ్ ఇస్తున్నారని, ఇప్పడు తనకు ముంబై పాక్ ఆక్రమిత కశ్మీర్‌లా కనిపిస్తోందని కంగనా కామెంట్ చేయడంతో వివాదం మరింత ముదిరింది. ఇదిలాఉండగా.. విమర్శలు, ప్రతి విమర్శల నేపథ్యంలో కంగనాకు ‘వై’ కేటగిరీ భద్రత కల్పించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. (చదవండి:కంగనా కామెంట్లు; అందుకు నేను సిద్ధం) -
శివసేన ఎంపీపై రెచ్చిపోయిన కంగనా
-
సుశాంత్ సోదరి ఎమోషనల్ పోస్ట్!
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ కొంత పురోగతిని సాధించింది. ఈ సందర్భంగా సుశాంత్ సోదరి, శ్వేతా సింగ్ కీర్తి అతనిని గుర్తుచేసుకుంటూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుశాంత్ తాను కలిసి ఉన్న ఒక ఫోటోను షేర్ చేశారు. మేం ఒకరిని ఒకరం ఎప్పుడూ కాపాడుకుంటాం అని వాగ్దానం చేశాము. కానీ భాయ్ నేను నా మాటను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాను. అయితే ఇప్పుడు నేను, దేశం మొత్తం నీకు మరో వాగ్ధానం చేస్తున్నాం. మేం నిజం కనుక్కుంటాం, నీకు న్యాయం చేస్తాం. నా సోదరుడు ఎలాంటి వ్యక్తి అంటే అతని జీవితం ఆనందంతో నిండినది. అతను చిన్న పిల్లవాడిలా ఉంటాడు. అతను కోరుకున్నది ప్రేమ మాత్రమే. ఎవరైనా ఒకసారి తన తల నిమురుతూ ప్రేమతో మాట్లాడితే సుశాంత్‌కు అది చాలు. తన ప్రాణాలు బలవంతంగా తీసుకునే వ్యక్తి కాదు. అది నమ్మడానికి నా మనసు సిద్ధంగా లేదు. మన ఉద్దేశాలను స్పష్టంగా ఉంచుకుందాం. సుశాంత్ మరణానికి నిజమైన కారణం ఏంటో తెలుసుకుందాం. ఇది సత్యానికి వచ్చిన ఆగ్రహం’ అని శీర్షికను జోడించింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన మరణించిన విషయం తెలిసిందే. అతడు డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నాడని బాంద్రా పోలీసులు తెలిపారు. అయితే సుశాంత్ అత్మహత్య చేసుకునే వ్యక్తి కాదని, అతని మరణం వెనుక ఏదో నిజం ఉండే ఉంటుందని కుటుంబ సభ్యులు మొదటి నుంచి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనేక నిరసనలు వెల్లువెత్తడంతో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించారు. విచారణలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రమంలో రియా సోదరుడిని నార్కోటిక్ అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. View this post on Instagram We promised each other that we will protect each other forever. But,I failed Bhai...I failed! But here is another promise I and the whole country make to you, we will find the truth, we will get you justice!I knew my brother, the kind of person he was, full of life and joy. He was like a child, the only thing he wanted was love. Koi ek baar, pyaar se haath pher de uske sar pe, pyaar se baat karle, bas that was enough for him to make him happy. He was not a person who would take his own life. My heart is not ready to believe it. Let’s keep our intentions clear, we want to know what is the cause of Sushant’s death, nothing less will suffice! It is Satya ka Agrah, #SatyagrahForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 6, 2020 at 10:29am PDT చదవండి: సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా.. -
సుశాంత్ కోసం డ్రగ్స్ కొన్నా..
ముంబై: సినీ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో సీబీఐ, ఎన్సీబీ విచారణలో అనేక కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కి సంబంధించిన డ్రగ్స్ కేసులో అతని ప్రియురాలు, నటి రియా చక్రవర్తిని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఆదివారం ఆరుగంటల పాటు విచారించింది. తిరిగి మరిన్ని వివరాలు రాబట్టేందుకు సోమ వారం కూడా విచారణకు హాజరుకావాల్సిందిగా రియాకు సమన్లు జారీచేసినట్టు ఎన్సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముత్తా అశోక్ జైన్ మీడియాకి వెల్లడించారు. సుశాంత్ సింగ్ కోసం తన సోదరుడు షోవిక్ చక్రవర్తి, మరో నిందితుడి ద్వారా తాను మాదకద్రవ్యాలను కొనుగోలు చేసేదానినని రియా అంగీకరించినట్టు తెలు స్తోంది. డ్రగ్స్ కొన్నానని, అయితే తానెప్పుడూ వాటిని వాడలేదని ఆమె చెప్పారు. రక్త నమూ నాలు ఇవ్వడానికి సిద్ధమని, ఎప్పుడూ డ్రగ్స్ వాడలేదని తెలిపారు. ఈ ఏడాది మార్చి 17న జైద్ నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేసేం దుకు మేనేజర్ మిరాండా వెళ్ళిన విషయం కూడా తనకు తెలుసునని ఎన్సీబీ ఎదుట రియా ఒప్పుకున్నారు. మార్చి 15న తన సోదరుడు షోవిక్‌కు, తనకు మధ్య మాదకద్రవ్యాలపై జరిగిన వాట్సాప్ చాట్ వాస్తవమేనని కూడా ఎన్సీబీ ఎదుట ఆమె అంగీకరించినట్టు సమా చారం. కాగా, రియా చక్రవర్తి విచారణ పూర్తి అయిన తరువాత, షోవిక్ చక్రవర్తి, సుశాంత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరాండా, వ్యక్తిగత సహాయకుడు దీపేశ్ సావంత్‌లను రియాతో కూర్చోబెట్టి విడివిడిగా ఒక్కొక్కరి పాత్రపై వివరాలు సేకరిస్తామని ఎన్సీబీ తెలిపింది. తాజాగా అనూజ్ కేశ్వాని అనే వ్యక్తి ఇంటిపై ఎన్సీబీ దాడిచేసింది. ఈ దాడిలో 590 గ్రాముల హశీష్, 0.64 గ్రాముల ఎల్ఎస్డి షీట్స్, 304 గ్రాముల గంజాయి, 1,85,200 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై సీబీఐ, అతని అకౌంట్ల నుంచి కోట్ల రూపాయల డబ్బును బదలాయించారనే ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణను కూడా రియా ఎదుర్కొంటున్నారు. ప్రశ్నల వర్షం... ఎన్సీబీ జాయింట్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని ఎన్సీబీ బృందం, కొంత మంది మహిళా పోలీసులతో కలిసి ఆదివారం తెల్లవారు జామున పశ్చిమ శాంతా క్రజ్‌లోని రియా చక్రవర్తి ఇంటికి వెళ్ళి, ఆమెకు సమన్లు అంద జేసింది. పోలీసు ఎస్కార్ట్‌తో రియాను మధ్యాహ్నం 12 గంటలకు బల్లార్డ్ ఎస్టేట్‌లోని సంస్థ కార్యాలయానికి తీసుకొని వచ్చారు. ఆమె నుంచి ఫోన్లను స్వాధీనం చేసుకున్న తర్వాత ఈడీ ఇచ్చిన రిపోర్టుతో ఎన్సీబీ మాదక ద్రవ్యాల కోణంలో విచారణ ప్రారంభించింది. డ్రగ్స్ ముఠాతో రియాచక్రవర్తికి ఉన్న సంబంధాలపై ఎన్సీబీ అధికారులు ఆమెపై ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం, రియా చక్ర వర్తి వివిధ టీవీ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తాను ఎప్పుడూ మాదక ద్రవ్యాలు సేవించలేదని చెప్పారు. సుశాంత్ సింగ్ గంజాయి తీసుకునే వాడని, ఇదే విషయాన్ని మిరాండా కూడా విచారణలో చెప్పినట్లు ఎన్సీబీ తెలిపింది. షోవిక్ ఆదేశాల మేరకు మిరాండా డ్రగ్స్‌ని సరఫరా చేసేవాడని ఎన్సీబీ వెల్లడించింది. ఇప్పటి వరకు 8 మంది నిందితులను అరెస్టు చేశారు. 2018 సెప్టెంబర్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గంజాయి సేవిస్తున్నప్పుడు తాను చూశానని వ్యక్తిగత సలహాదారు దీపేశ్ సావంత్ అంగీకరించినట్టు ఎన్సీబీ అధికారులు వెల్లడించారు. మార్చి 13న రియా సోదరుడు షోవిక్ నుంచి డ్రగ్స్ తీసుకురావాలని సుశాంత్ చెప్పారని, అవి తీసుకొచ్చేందుకు మిరాండాతో కలిసి వెళ్ళానని దీపేశ్ చెప్పారు. అంతేకాకుండా ఏప్రిల్ 17న రియా చక్రవర్తి కోసం కూడా తాను డ్రగ్స్ సేకరించినట్లు దీపేశ్ ఎన్సీబీకి వెల్లడించారు. ప్రేమించడమే నేరమా? ‘‘రియాచక్రవర్తి అరెస్టుకి సిద్ధంగా ఉన్నారు. ఎవరినైనా ప్రేమించడం నేరమైతే, తన ప్రేమ కోసం ఆమె ఎన్నికష్టాలనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆమె అమాయకురాలు. ఆమెపై బీహార్ పోలీసులు, సీబీఐ, ఈడీ, ఎన్సీబీలతో కలిసి పెట్టిన కేసుల్లో ముందస్తు బెయిలు కోసం రియా చక్రవర్తి ఏ కోర్టునీ ఆశ్రయించలేదు’’అని ఆమె న్యాయవాది సతీష్ మనేషిండే ట్వీట్ చేశారు. -
డ్రగ్స్ కేసు: రియా చక్రవర్తి అరెస్టు!
-
రియా చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
-
బాలీవుడ్: విదేశాలలో సైతం నిరసన సెగలు
సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకొని నెలలు గడుస్తున్న ఆయన కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ సుశాంత్‌కు న్యాయం జరగాలంటూ పోరాడుతూనే ఉన్నారు. సామాజక మాధ్యమాల ద్వారా ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ అంటూ న్యాయం కోసం తపిస్తున్నారు. సుశాంత్ మరణించిన నాటి నుంచి ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరిగింది. ఇక దీంతో పాటు బాలీవుడ్లో ఉన్న నెపోటిజం, స్టార్ కిడ్స్‌పై వ్యతిరేకత కూడా అదే రేంజ్లో పెరుగుతూ వస్తుంది. బాలీవుడ్ ఈ వ్యతిరేకతను కేవలం ఇండియాలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ఎదుర్కొంటోంది. ప్రస్తుతం బ్రిటన్‌లో ‘జస్టిస్ ఫర్ సుశాంత్’ మూమెంట్ ఉదృతంగా సాగుతుంది. ఇందులో భాగంగా సెప్టెంబర్ 14వ తేదీన బ్రిటన్‌లోని మల్టీప్లెక్స్‌ల ముందు నిరసన తెలియజేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుశాంత్ సింగ్ ఫ్యాన్స్ ఆన్లైన్ ద్వారా ఈ నిరసనలో పాలుపంచుకోబోతున్నారు. సుశాంత్ సోదరి శ్వేత సింగ్ ఆధ్వర్యంలో జస్టిస్ ఫర్ సుశాంత్ క్యాంపెయిన్ జరుగుతున్న విషయం తెలిసిందే. వారందరూ సీబీఐ సుశాంత్ మరణం వెనుక ఉన్న వ్యక్తులను, నిజాలను బయటకు తీసుకురావాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుతూ, బాలీవుడ్ ఇప్పుడు ఆ స్థాయిలో ఉంది అంటే దానికి కారణం ఫ్యాన్స్ అని ఆ విషయాన్ని స్టార్స్‌గా ఎదిగిన వారు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మర్చిపోకూడదు అని అన్నారు. దీంతో నిరసన సెగలు వీధుల నుంచి సినిమా హాల్ సీట్ల వరకు చేరినట్లు తెలుస్తోంది. ఇతర స్టార్ కిడ్స్ సినిమాలు చూడటానికి ఫ్యాన్స్ అంతగా ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా వారి వీడియోలను డిస్లైక్ చేయాలంటూ ప్రచారం కూడా చేస్తున్నారు. దేశాన్ని దాటి ఖండాతరాలలో కోసం ఇలా జరగడంతో బాలీవుడ్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. చదవండి: సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అదుపులో మరొకరు -
సుశాంత్ సింగ్ కేసులో ఎన్సీబీ అదుపులో మరొకరు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధం ఉన్న మరో అనుమానితుడు బాసిత్ పరిహార్‌ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సిబి) ప్రశ్నిస్తున్నట్టు అధికారులు చెప్పారు. ఇప్పటికే అరెస్టు అయిన జైద్ విలాత్రా ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా, ఆయన్ను సెప్టెంబర్ 9 వరకు ఎన్సీబీ కస్టడీకి అప్పగించారు. జైద్ విచారణ సందర్భంగా బాసిత్ పరిహార్ పేరు బయటపడింది. రాజ్‌పుత్ కేసులో రియాచక్రవర్తిపై నమోదైన మాదకద్రవ్యాల కేసుకి, బాసిత్‌కి సంబంధం ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. రియాచక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ మొబైల్ చాట్స్‌లో బాసిత్ ప్రస్థావన ఉన్నట్లు వారు చెప్పారు. షోవిక్‌ని, రాజ్‌పుత్ మేనేజర్ సామ్యూల్ మిరందాని మాదకద్రవ్యాల కేసు విచారణకు పిలవనున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్ర, గోవా, ఢిల్లీలోని మరికొంత మంది మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠాపై నిఘా పెట్టినట్లు అధికారులు తెలిపారు చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
అమెరికాలో సుశాంత్ బిల్ బోర్డులు తొలగింపు
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన బిల్ బోర్డులను తొలగించడానికి అమెరికా మీడియా సంస్థ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఈ మెయిల్ ద్వారా సుశాంత్ సింగ్ సోదరి శ్వేతా సింగ్‌కు తెలిపింది. ఈ మెయిల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్లను శ్వేత తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా పంచుకుంది. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో కొన్ని బిల్ బోర్డులను అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రచారం ద్వారా ఆయనతో సంబంధం ఒక మహిళను కించపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆ మీడియా సంస్థ మెయిల్లో తెలిపింది. ఆ కారణంగానే ఆ బిల్ బోర్డులను తొలగించాలని నిర్ణయించుకున్నట్లు వివరించింది. It seems the paid PR has it’s reach everywhere. Hollywood Billboard company reached out telling they will not keep the Billboard any longer! The wordings on the billboard only demanded fair trial and justice! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR pic.twitter.com/YrMrLH3eIX — shweta singh kirti (@shwetasinghkirt) September 3, 2020 దీనిపై శ్వేత సింగ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పెయిడ్ పీఆర్ ప్రపంచంలో ప్రతి చోట కనిపిస్తోంది. ఈ కారణంగానే హాలీవుడ్ బిల్‌బోర్డు సంస్థ సుశాంత్ బిల్బోర్డును తొలగిస్తున్నట్లు ప్రకటించడం జరిగింది. బిల్‌బోర్డు ద్వారా న్యాయమైన విచారణ, న్యాయం మాత్రమే కోరుతున్నాము! #Report4SSR #JusticeForSushantSinghRajputt #Warriors4SSR అని ఆమె ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14 వ తేదిన ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. తరువాత ఆయన మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి అనేక ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో జస్టిస్ ఫర్ సుశాంత్ అంటూ ప్రచారం సాగుతోంది. View this post on Instagram Thanks Chicago! 🙏❤️🙏 Lets Stay United and keep demanding justice for Sushant. #JusticeForSushantSinghRajput #GlobalParyerForSSR A post shared by Shweta Singh kirti (@shwetasinghkirti) on Sep 1, 2020 at 12:38pm PDT చదవండి: సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్ -
సుశాంత్ డ్రగ్స్ కేసులో ఇద్దరు అరెస్ట్
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్ కేసులో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) బుధవారం అరెస్ట్ చేసింది. ముంబై బాంద్రాకు చెందిన అబ్దుల్ బాసిత్ పరిహార్‌ను అరెస్టు చేసినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులు మాట్లాడుతూ, ‘అతనికి శామ్యూల్ మిరాండాతో సంబంధం ఉంది. షోవిక్ చక్రవర్తి (రియా చక్రవర్తి సోదరుడు) సూచనల మేరకు మిరాండా డ్రగ్స్ సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి’ అని తెలిపారు. శామ్యూల్ మిరాండా సుశాంత్ సింగ్ ఇంటిలో హౌస్ కీపింగ్ మేనేజర్‌గా పని చేసేవాడు. ఇంటికి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతడే చూసుకునేవాడు. గత ఏడాది మేలో రియా అతనిని సుశాంత్ ఇంటిలో మేనేజర్‌గా నియమించింది. మొదటి నుంచి సుశాంత్ కుటుంబ సభ్యులు అతనిపై ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ డబ్బును కాజేయడంలో రియాకు అతడు సహాయం అందించడాని వారు ఫిర్యాదు చేశారు. ఇక శామ్యూల్‌తో పాటు ముంబైకు చెందిన జైద్ విలాత్రాను కూడా ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలోని ఉన్నత స్థాయి వర్గాలకు చెందిన వారు జరుపుకునే పార్టీలలో డ్రగ్స్ సరఫరా చేసేవాడనే ఆరోపణలు ఉండటంతో జైద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇక సుశాంత్ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు రియా చక్రవర్తి తల్లిదండ్రులను బుధవారం విచారించారు. ఈ కేసులో మొదటిసారిగా రియా తల్లిదండ్రులు సీబీఐ ముందు హాజరయ్యారు. ఇక గతవారం రియా తమ్ముడు షోవిక్‌ను కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ డబ్బును కాజేసి అతను ఆత్మహత్య చేసుకోవడానికి కారణమయ్యారు అంటూ సుశాంత్ కుటుంబసభ్యులు రియా కుటుంబ సభ్యులందరిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఇక రియాను సీబీఐ అధికారులు నాలుగు రోజులలో 35 గంటల పాటు విచారించారు. చదవండి: ‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’ -
ముంబై: సీబీఐ ఆఫీస్‌కు చేరుకున్న రియా చక్రవర్తి
-
సుశాంత్ విచిత్రంగా ప్రవర్తించేవాడు
-
‘సుశాంత్‌కు తెలియకుండా డ్రగ్స్ ఇచ్చారు’
ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి విషయంలో రోజుకొక కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఆమెకు డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ కొన్ని వార్తలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా సుశాంత్ తండ్రి తరపున వాదిస్తున్న న్యాయవాది రియాపై మరో ఆరోపణ చేశారు. రియా, సుశాంత్‌కు తెలియకుండా అతనికి నిషేధించిన డ్రగ్స్‌ను ఇచ్చిందని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లు తెలిపారు. ఈ విషయం గురించి లాయర్ కేకేసింగ్ మాట్లాడుతూ, ‘సుశాంత్‌కు తెలియకుండా కొన్ని నిషేధిత డ్రగ్స్‌ను ఆయనకు ఇచ్చారు. ఇదే అతడు చనిపోవడానికి కారణమయ్యింది. మొదటి నుంచి కూడా సుశాంత్‌కు తనకు తెలియకుండానే ఏదో మందులు ఇస్తున్నారని కుటుంబ సభ్యులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాన్ని ఎఫ్ఐఆర్లో కూడా పేర్కొన్నాం. సుశాంత్‌కు తెలియకుండానే డాక్టర్లు రాసి ఇవ్వని డ్రగ్స్‌ను సుశాంత్‌కు ఇచ్చారని అందులో ఫిర్యాదు చేశారు’ అని తెలిపారు. ఒకవేళ అలాంటి డ్రగ్స్ ఇచ్చి సుశాంత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారా లేదా హత్య చేయడానికి ప్రయత్నించారా అన్న అనుమానాలను సుశాంత్ తండ్రి తరుపు న్యాయవాది అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి డ్రగ్స్ వాడటం చట్టవిరుద్దమని ఆయన తెలిపారు. ఇంకా సుశాంత్ ఆత్మహత్య విషయంలో అనేక విషయాలు బయటపడ్డాయి. సుశాంత్ ఫస్ట్ ఫ్లోర్లో నిద్రపోయేవాడని రియా పై అంతస్తులో పార్టీలు చేసుకునేదని ఇంట్లో ఉండే పనివాళ్ల ద్వారా తెలిసింది. అలాగే రియా డ్రగ్ డీలర్స్‌తో మాట్లాడినట్లు, వాళ్లకు మెసేజ్‌లు చేసినట్లు కొన్ని ఆధారాలను ఈడీ డిపార్ట్మెంట్ సీబీఐకు అందించింది అనే కథనాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ లింక్ గురించి రియా తరుపు న్యాయవాది మాట్లాడుతూ రియాకు కావాలంటే రక్త పరీక్ష నిర్వహించవచ్చని, రియా తన జీవితంలో డ్రగ్స్ తీసుకోలేదని తెలిపారు. చదవండి: సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి? -
సైకలాజికల్ అటాప్సీ..!
-
డెత్ మిస్టరీ
-
సుశాంత్ మృతి కేసులో కీలక మలుపు
-
రియాకు ఆస్థాయి లేదు: డీజీపీ
పాట్నా: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తి ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తాజాగా రియా చక్రవర్తిపై బీహార్ డీజీపీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ విషయంలో మీడియా రాద్ధాంతం చేస్తుందని రియా కోర్టును ఆశ్రయించారు. అదేవిధంగా సుప్రీంకోర్టులో రియా దాఖలు చేసిన పిటిషన్లో బీహార్ సీఎం నితీశ్ కుమార్ పేరును కూడా ప్రస్తావించారు. దీనిపై బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే మండిపడ్డారు. ఒక ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి రియాకు లేదన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో సుశాంత్ కేసులో రాద్ధాంతం చేస్తున్నారని రియా తన పిటిషన్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ను బీహార్‌లో నమోదు చేశారని, దీని వెనుక సీఎం నితీశ్ కుమార్ ఉన్నారని రియా ఆరోపించింది. దీనిపై బీహార్ డీజీపీ పై విధంగా స్పందించారు. సుశాంత్ రాజ్‌పుత్ కేసును సీబీఐకు అప్పగించిన సంగతి తెలిసిందే. చదవండి: సీబీఐకి సుశాంత్ సింగ్ మృతి కేసు -
సుశాంత్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు
-
మూవీ మాఫియాపై కంగనా ఫైర్
ముంబై: యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సెలబ్రిటీల వ్యవహార శైలిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా తన ట్విటర్ ఖాతాను కొందరు సస్పెండ్ చేస్తున్నారని, మూవీ మాఫియా కుట్రతోనే ఇదంతా జరుగుతుందని కంగనా ఆరోపిస్తుంది. బాలీవుడ్లో నెపోటిజం వేళ్లూనుకుపోయిందంటూ, ప్రతిభ ఉన్న వాళ్లకు ప్రాధాన్యం ఉండదని, కేవలం స్టార్ కిడ్స్‌కు మాత్రమే అవకాశాలు, అవార్డులు ఉంటాయని ఆమె ఇటీవల విమర్శించిన విషయం తెలిసిందే. అయితే సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన వారిలో కంగనా ముందు వరుసలో నిలిచారు. చదవండి: ‘రణబీర్ ఓ రేపిస్ట్, దీపిక ఒక సైకో’ -
సుశాంత్ కేసు: ఆ అంబులెన్స్‌లు ఎందుకు వచ్చాయి?
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై ఇప్పటికీ పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి సుశాంత్ మరణానికి సంబంధించి మరిన్ని సందేహాలు లేవనెత్తారు. సుశాంత్ చనిపోయిన తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు ఎందుకు ఉన్నాయని, ఆయనకు నమ్మకస్తుడైన శ్యామ్యూల్ హోకిప్ అదృశ్యం అవడం వెనుక ఉన్న కారణాలు ఏమిటి అని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ట్విట్టర్లో సంచలన ఆరోపణలు చేశారు. సుశాంత్ మరణిస్తే బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్ మరణిండానికి ముందు రోజు అంటే జూన్ 13 తేదీ రాత్రి ఆయనతో పాటు ఇంట్లో శామ్యూల్ హెకిప్ కూడా ఉన్నారనే విషయాన్ని ఇటీవల ఒక టీవీ ఛానల్ జరిపిన స్టింగ్ ఆపరేషన్‌లో బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సుశాంత్ మరణం తర్వాత నుంచి శ్యామ్యూల్ కనిపించకుండా పోవడం, ఎవరికి అందుబాటులో లేకపోవడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నాయి. ఇంతకీ శామ్యూల్ హెకిప్ బతికే ఉన్నాడా? లేదా చనిపోయాడా? సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నిస్తున్నారు. రెండు అంబులెన్సులు ఎందుకు వచ్చాయి? వాటి కోసం ఎవరు కాల్ చేశారు? సుశాంత్ మరణం రోజున రెండు మృతదేహాలు అంటూ సోషల్ మీడియాలో ఆ ఇంటి నుంచి రెండు దేహాలు వెళ్లాయనే ఫోటోలు వైరల్ అయ్యాయి. ఒక ఫోటోలో కాళ్లు స్ట్రెయిట్‌గా ఉంటే మరో ఫోటోలో కాళ్లు ముడుచుకొని ఉన్న దేహాలకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. తాజాగా సుబ్రమణ్యస్వామి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ ఫోటోలకు సంబంధించిన విషయం మరోసారి చర్చనీయాంశమవుతుంది. ఈ నేపథ్యంలోనే సుశాంత్‌కు పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్‌ను ప్రశ్నించాలని సుబ్రహ్మణ్య స్వామి సీబీఐను గతంలో కోరారు. చదవండి: ‘నా కొడుకు ఉరి వేసుకోడాన్ని ఎవరూ చూడలేదు’ -
‘ఆర్ఆర్ఆర్’కు అలియా మైనస్ కానుందా?
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి బాలీవుడ్లో నెపోటిజం మీద విమర్శలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే స్టార్ కిడ్స్ అయిన అలియా భట్, సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ లాంటి వారిపై తీవ్రస్థాయిలో సుశాంత్ అభిమానులు విరుచుకుపడ్డారు. వారిని అన్‌ఫాలో చేశారు. అంతే కాకుండా సోషల్‌మీడియాలో తీవ్రంగా విమర్శించడంతో సోనాక్షి సిన్హా లాంటివారు తమ అకౌంట్లను కూడా డియాక్టివేట్ చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ విషయంలో అలియాభట్, ఆమె తండ్రి మహేష్ భట్ చేసిన కామెంట్స్ విపరీతంగా ట్రోల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా అలియా నటించిన సడక్ 2 ట్రైలర్ ఓటీటీ ప్లాట్ ఫాంలో విడుదలైంది. దానికి ఎక్కువగా నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. దాదాపు 4 మిలియన్ల మంది డిస్లైక్ చేశారు. ఇదిలా ఉండగా అలియా భట్ సౌత్‌లో దర్శక ధీరుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో ప్రధాన పాత్ర చేస్తోంది. అలియాభట్ వల్ల ఈ సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో రాజమౌళి ఏ నిర్ణయం తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. చదవండి: సడక్ 2: ట్రైలర్‌ను వేటాడేస్తున్న నెటిజన్లు -
ముగ్గురిపై దిశ తండ్రి ఫిర్యాదు
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ ఆత్మహత్య కేసులో తాజా పరిణామం చోటు చేసుకుంది. ఆమె తండ్రి సతీష్ సలియన్, దిశ మరణం గురించి పుకార్లు వ్యాప్తి చేసినందుకు గాను ముగ్గురు వ్యక్తులపై శుక్రవారం లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చట్టపరమైన అభిప్రాయాలను తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కొంత మంది సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని దిశా సలియన్ మరణంతో కలిపి అనేక వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్‌లు, సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, దిశా సలియన్ మరణ కేసుల మధ్య సంబంధం ఉందని పలువురు రాజకీయ నాయకులు కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తన కుమార్తె పరువు తీశారని, ఆమె గురించి పలు పుకార్లు సృష్టించారని సతీష్ సలియన్ ముంబైలోని మల్వాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా పోస్టులు తమను మానసికంగా ఎలా వేధిస్తున్నాయో ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముగ్గురు వ్యక్తులు నకిలీ కథలను ప్రచారం చేస్తున్నారని తన ఫిర్యాదులో తెలిపారు. వారిని పునీత్ వసిష్ఠ, సందీప్ మలాని, నమన్ శర్మలుగా ఆయన తెలిపారు. ఈ ముగ్గురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు. (‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’) సతీష్ సలియన్ ఇచ్చిన ఫిర్యాదును చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని ముంబై పోలీసు వర్గాలు తెలిపాయి. ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. సరైన చట్టపరమైన అభిప్రాయాలను తీసుకున్న తరువాత, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అనంతరం ఆ ముగ్గురు వ్యక్తులను పిలిచి ఈ విషయంపై దర్యాప్తు చేస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించిన నాటి నుంచి ఆయన మేనేజర్‌గా పని చేసిన దిశ మరణంపై కూడా పలు కథనాలు ప్రచారమవుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు -
సుశాంత్ కేసు: మనవడికి పవార్ మందలింపు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బిహార్, మహారాష్ట్రల మధ్య వివాదాలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుశాంత్ రాజ్‌పుత్ మృతి దర్యాప్తుపై స్పందించారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులకు మొదటి అవకాశం ఇవ్వాలని ఆయన అన్నారు. అయితే ఈ కేసును సీబీఐకి అప్పగించాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరద్ పవార్ మనవడు పార్థ్ పవార్(అజిత్ పవార్ కుమారుడు) కూడా సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. దీనిపై పవార్ స్పందించారు. ఇవి పరిణితి లేని వ్యాఖ్యలు అని.. వాటిని తాము సీరియస్‌గా తీసుకోవడం లేదని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించి మాట్లాడాలని మనవడిని బహిరంగంగా మందలించారు పవార్. (బాంద్రా డీసీపీ- రియా ఫోన్ కాల్స్) సుశాంత్ మృతిపై ముంబై పోలీసుల దర్యాప్తు సరిగా సాగడం లేదని.. వారి మీద తమకు నమ్మకం లేదని సుశాంత్ కుటుంబ సభ్యులు బిహార్ ముఖ్యమంత్రిని కోరిన సంగతి తెలిసిందే. దాంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు నితీష్ కుమార్. అయితే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బిహార్ సీఎం ఇలా చేశారని.. శివసేన ఆరోపిస్తోంది. ఈ సందర్భంగా పవార్ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర పోలీసులపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారు నాకు గత 50 ఏళ్ల నుంచి తెలుసు. వారి మీద పూర్తి నమ్మకం ఉంది. ఆరోపణలను నేను పట్టించుకోను. ముందు వారిని లోతుగా దర్యాప్తు చేయనిద్దాం. తర్వాత కేసును సీబీఐకి లేదా ఇతర ఏజెన్సీలకు అప్పగించినా మేము వ్యతిరేకించం’ అన్నారు పవార్. (సీబీఐ దర్యాప్తు: రియా స్పందన) ఈ కేసులో రాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ప్రమేయం ఉన్నట్లు వస్తోన్న ఊహాగానాలను ఆయన కొట్టిపారేశారు. అసలు ఆదిత్య పేరును ఇందులోకి ఎందుకు లాగుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు పవార్. ఆదిత్య పేరును బీజేపీనే వివాదంలోకి లాగిందని ఆయన ఆరోపించారు. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో ఆదిత్య ఠాక్రేకు ఏం సంబంధం ఉంది. రాష్ట్రంలో మా మద్దతుతో శివసేన అధికారంలోకి రావడాన్ని ప్రతిపక్షాలు ఇంకా జీర్ణించుకోలేక పోతున్నాయి. అందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయి’ అని సీనియర్ సేన నాయకుడు సంజయ్ రౌత్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్‌తో సంబంధాలు నిజమే: ఆదిత్య ఠాక్రే) -
‘సుశాంత్‌పై మానసిక రోగి ముద్ర వేశారు’
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై విచారణకు సంబంధించి, తమ కుటుంబంపై జరుగుతున్న దుష్ర్పచారంపై సుశాంత్ కుటుంబ సభ్యులు 9 పేజీల లేఖను విడుదల చేశారు. సుశాంత్‌కు తన కుటుంబంతో సరైన సంబంధాలు లేవని శివసేన పత్రిక సామ్నాలో ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ రాసిన సంపాదకీయం అనంతరం ఈ లేఖను సుశాంత్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. నటుడకి తాము చాలా సన్నిహితులమని చెబుతూ కొందరు మీడియాలో ప్రకటనలు చేస్తున్నారని ఈ లేఖలో సుశాంత్ కుటుంబం మండిపడింది. నటి రియా చక్రవర్తి పేరును ప్రకటనలో ప్రస్తావించకపోయినా సుశాంత్‌ను దారుణంగా హత్య చేశారని పేర్కొంది. ఈ కేసులో ఖరీదైన న్యాయవాదులను నియమించుకున్నారని, వారు న్యాయాన్ని హతమారుస్తారా అని లేఖలో సుశాంత్ కుటుంబం విస్మయం వ్యక్తం చేసింది. సుశాంత్‌పై మానసిక రోగి ముద్ర వేసి, మృతదేహం ఫోటోలను బహిర్గతం చేసి తమకు సంతాపం తెలిపేందుకూ సమయం ఇవ్వలేదని పేర్కొంది. ముంబై పోలీసుల విచారణ కొద్దిమంది సంపన్నుల ఉద్దేశాలను వెల్లడించేలా సాగిందని ఆరోపించింది. తమ కుటుంబం పోలీసులను ముందుగానే సంప్రదించినా ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదని లేఖ సూటిగా ప్రశ్నించింది. సుశాంత్ నలుగురు అక్కలతో పాటు తండ్రినీ బెదిరిస్తున్నారని, తమ కుటుంబం ప్రతిష్ట మసకబార్చేలా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. సుశాంత్ జ్ఞాపకాలకూ కళంకం ఆపాదిస్తున్నారని మండిపడింది. ఇక సుశాంత్ ఆయన సోదరిల గురించి లేఖలో ప్రస్తావిస్తూ పెద్ద కుమార్తె విదేశాల్లో ఉంటారని, రెండో కుమార్తె జాతీయ క్రికెట్ టీమ్‌లో ఆడారని, మూడో కుమార్తె లా చదవగా, నాలుగో కుమార్తె ష్యాషన్ డిజైనింగ్‌లో డిప్లమో చేశారని ఈ ప్రకటన పేర్కొంది. ఐదో సంతానంగా సుశాంత్ తన తల్లికి గారాల బిడ్డని తెలిపింది. తమ కుటుంబం ఏ ఒక్కరి నుంచి ఏమీ ఆశించలేదని, ఎవరికీ హాని తలపెట్టలేదని స్పష్టం చేసింది. చదవండి : సుశాంత్ కేసు : ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు -
‘సుశాంత్ సోదరి నన్ను వేధించారు’
న్యూఢిల్లీ/ముంబై : దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తన సోదరి ప్రవర్తనపై బాధపడుతూ తనతో చేసిన వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లను నటి రియా చక్రవర్తి షేర్ చేశారు. సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ తన పట్ల వ్యవహరించిన తీరుపై సుశాంత్ కలత చెందాడని ఆ వాట్సాప్ చాట్ తేటతెల్లం చేస్తోందని రియా చెప్పారు. తమ మధ్య దూరం పెంచేందుకు సుశాంత్ రూమ్మేట్ సిద్ధార్ధ్ పిధానిని ప్రియాంక ప్రేరేపించేదని పలు వాట్సాప్ మెసేజ్‌ల్లో రియాతో సుశాంత్ పేర్కొన్నట్టు ఆ స్క్రీన్షాట్లలో ప్రస్తావించారు.కాగా రియా ఆరోపణలను సుశాంత్ మరో సోదరి శ్వేతా సింగ్ కీర్తి తోసిపుచ్చారు. ప్రియాంకతో పాటు తనతోనూ సుశాంత్ అన్యోన్యంగా ఉండేవారని చెప్పారు. ప్రియాంకతో తన అనుబంధంపై సుశాంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన వీడియోను శ్వేత షేర్ చేశారు. కాగా సుశాంత్ మృతికి ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి కారణమంటూ దివంగత నటుడి కుటుంబ సభ్యులు బిహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సుశాంత్ కేసును సీబీఐ విచారణకు అప్పగించారు. ఇక సుశాంత్ విషాదాంతం నేపథ్యంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోమవారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు. చదవండి : సుశాంత్ కేసు : క్వారంటైన్లో బిహార్ పోలీసుల విచారణ -
సుశాంత్ కేసు: రియా నోరు విప్పుతుందా?
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బలవన్మరణం నేపథ్యంలో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా సోమవారం రెండోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ఆమె ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించిన ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాపై ఈడీ అధికారులు మరోసారి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. కాగా జూన్ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. (రియా చక్రవర్తిపై సంచలన ఆరోపణలు చేసిన లాయర్) సుశాంత్ నుంచి నీళ్ల బాటిల్, లెటర్ మాత్రమే అందుకున్నా ఆయన మరణంపై సందేహాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి రియా సహా, ఆమె కుటుంబ సభ్యులు, మరికొంతమందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. దీంతో ఈ కేసు విచారణలో భాగంగా శుక్రవారం రియాను ఈడీ ఎనిమిది గంటల పాటు ప్రశ్నించినప్పటికీ సంతృప్తికర స్థాయిలో సమాధానాలు రాలేవు. కేవలం ఓ వాటర్ బాటిల్, లెటర్ మాత్రమే సుశాంత్ నుంచి తీసుకున్నాన్నానంటూ ఆమె అనేక ప్రశ్నలకు దాటవేసే సమాధానాలిచ్చారు. (ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా?) రియా తమ్ముడిని 18 గంటల పాటు విచారించిన ఈడీ దీంతో మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేడు ఆమె మళ్లీ ఈడీ కార్యాలయానికి వచ్చింది. ఈసారైనా అధికారులు అడిగే ప్రశ్నలకు రియా సరైన సమాధానాలు చెప్తుందో లేదో చూడాలి. మరోవైపు శనివారం ఆమె సోదరుడిని ఈడీ 18 గంటల పాటు విచారించింది. శనివారం మధ్యాహ్న ప్రాంతంలో ఈడీ కార్యాలయానికి వెళ్లిన షోవిక్ ఆదివారం ఉదయం 6.30 నిమిషాలకు బయటకు వచ్చాడు. ఇదిలా వుండగా సీబీఐ దర్యాప్తును ఆపివేయాలంటూ రియా సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసు మంగళవారం విచారణకు రానుంది. (సుశాంత్ నుంచి తీసుకున్న ఆస్తి ఇదే : రియా) -
సుశాంత్ కేసు : క్వారంటైన్లో బిహార్ పోలీసుల విచారణ
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుట్ మృతిపై బిహార్ పోలీసుల విచారణను అడ్డుకుంటున్నారని, ఈ కేసును క్వారంటైన్లోకి నెట్టారని మహారాష్ట్ర తీరును బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీ తప్పుపట్టారు. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులు తనను క్వారంటైన్ చేయలేదని సుశాంత్ కేసు విచారణను క్వారంటైన్ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో రియా చక్రవర్తిపై ఎఫ్ఐఆర్ దాఖలైన నేపథ్యంలో కేసు దర్యాప్తును పర్యవేక్షించేందుకు ముంబై చేరుకున్న పట్నా ఎస్పీ వినయ్ తివారీని కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా బీఎంసీ అధికారులు క్వారంటైన్ చేశారు. ఆగస్ట్ 15 వరకూ క్వారంటైన్లో ఉండాలని, ఆయనకు బీఎంసీ అధికారులు క్వారంటైన్ ముద్ర వేశారు. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జోక్యంతో క్వారంటైన్ నుంచి తివారీని బీఎంసీ అధికారులు విడుదల చేశారు.క్వారంటైన్లో ఉన్న బిహార్ ఐపీఎస్ అధికారి వినయ్ తివారీని ఆయన స్వరాష్ట్రానికి వెళ్లేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు అనుమతించారు. కాగా తివారీని విడుదల చేయాలని బిహార్ పోలీసులు కోరడంతో క్వారంటైన్ గడువుకు వారం ముందుగానే ఆయనను విడుదల చేశామని బీఎంసీ అధికారి తెలిపారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తునకు సంబంధించి రియా చక్రవర్తి శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. తన సోదరుడు సౌవిక్ చక్రవర్తితో కలిసి ముంబైలోనీ ఈడీ కార్యాలయానికి చేరుకున్న రియాపై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టు తెలుస్తోంది. సుశాంత్‌కు చెందిన కోట్లాది రూపాయలను అక్రమంగా దారి మళ్లించినట్టు రియా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. జూన్ 14న బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రా నివాసంలో విగతజీవిగా కనిపించిన విషయం తెలిసిందే. చదవండి : ఈడీ ముందుకు రియా: అరెస్ట్ చేస్తారా? -
సరైన నిర్ణయం
మరణమే విషాదకరమైనదనుకుంటే అది వివాదస్పదమైనప్పుడు మరింత బాధిస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మొన్న జూన్ 14న చనిపోయాక జరిగింది అదే. ఈ ఉదంతంపై అనేకులు కోరుతున్నట్టు సీబీఐ దర్యాప్తు చేయిస్తామని బుధవారం కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది గనుక అటువంటి వారందరికీ ఉపశమనం దొరుకుతుందని భావించాలి. సుశాంత్ సింగ్‌ది ఆత్మహత్య కాదని, అది హత్యని కుటుంబసభ్యులు, మరికొందరు అంటుంటే... బాలీవుడ్‌ను శాసిస్తున్న కొందరు ప్రముఖులు అతన్ని అవమానించి, అతనికి అన్నివిధాలా అవరోధాలు సృష్టించి ఆత్మ హత్యకు ప్రేరేపించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులు కోరుకుంటున్నట్టు సీబీఐ దర్యాప్తు జరపడమే సరైన నిర్ణయం అనడంలో సందేహం లేదు. చలనచిత్ర పరిశ్రమతో సంబంధం లేని ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి బాలీ వుడ్లో నిలదొక్కుకోవడం, విజయం సాధించడం మాటలు కాదు. ప్రతిభాపాటవాలు పుష్కలంగా వుంటే తప్ప ఎంతమాత్రం సాధ్యం కాదు. సినీ పరిశ్రమ కోట్లాది రూపాయల పెట్టుబడితో ముడిపడి వున్న రంగం. దాంతోపాటు బంధుప్రీతి కూడా అక్కడ అధికమే. అలాంటిచోట సుశాంత్ తనేమిటో నిరూపించుకున్నాడు. అందరితో శభాష్ అనిపించుకున్నాడు. ఆయనతో సన్నిహితంగా మెలిగిన వారూ, భిన్న సందర్భాల్లో ఆయన్ను దగ్గరగా చూసినవారూ ఆయన వ్యక్తిత్వం ఎంతో ఉన్నతమైన దని, మానవీయత గుండె నిండా నింపుకున్న వ్యక్తని చెబుతున్నారు. అటువంటి వ్యక్తి తన మరణ కారణం గురించి క్లుప్తంగానైనా చెప్పకుండా నిష్క్రమించాడంటే వారెవరూ సమాధానపడలేక పోతున్నారు. సుశాంత్ మరణంపై ఇన్నిరోజులుగా సాగిన వివాదం అవాంఛనీయమైనది. కుటుంబసభ్యులు, సన్నిహితులు సందేహాలు వ్యక్తం చేసిన వెంటనే వారికి సంతృప్తికలిగే విధంగా తగిన దర్యాప్తునకు ఆదేశించివుంటే ఈ వివాదం ఇలా ముదిరేది కాదు. సుశాంత్‌ది బలవన్మరణమైతే అందుకు కారకు లెవరో నిర్ధారించి, వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది హత్యే అయితే దుండగుల్ని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని తగిన శిక్ష పడేలా చూడాలని ఆశి స్తారు. ఆత్మహత్య లేదా అసహజమైన మరణం జరిగినప్పుడు సీఆర్పీసీ సెక్షన్ 174 కింద ఆకస్మిక మరణంగా నమోదు చేస్తారు. ఆత్మహత్యగా కనబడితే ఎలాంటి లేఖ అయినా వదిలివెళ్లారా లేదా అనేది చూస్తారు. మరణించినవారి సన్నిహితుల్ని, సమీప ప్రాంతాల వారిని పోలీసులు ప్రశ్నిస్తారు. వారు చెప్పిన వివరాలను నమోదు చేస్తారు. పోస్టుమార్టం జరిపించి మృతుల శరీరంపై గాయాలే మైనా వున్నాయా అన్నది పరిశీలిస్తారు. వుంటే ఏ రకమైన వస్తువు లేదా ఆయుధంతో దాడి జరిగి వుంటుందో అంచనాకొస్తారు. మరణించినవారు ఏ లేఖ వదిలి వెళ్లకపోతే, సన్నిహితులు కూడా ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయకపోతే ఏసీపీ స్థాయి అధికారి ఆ దశలోనే కేసును మూసి వేస్తారు. హత్యగా భావిస్తే ఐపీసీ 302కింద, ఎవరైనా ఆత్మహత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలొస్తే ఐపీసీ 306కింద కేసు నమోదు చేస్తారు. ముంబైలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసి నగరానికి వచ్చిన ఆయన కుటుంబసభ్యులు తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని, ఎవరిపైనా అనుమానం వ్యక్తం చేయలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. అయితే బిహార్ పోలీసుల కథనం మరోలా వుంది. సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తి ఈ ఆత్మహత్యకు పురిగొల్పిందని కుటుం బసభ్యులు ఆరోపించారని వారు చెబుతున్నారు. అందువల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేశామంటున్నారు. 2013నాటి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం వారు ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసి ఉదంతం జరిగిన పరిధిలోని పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయాలి. వారలా చేయకుండా దర్యాప్తు కోసం ముంబై వెళ్లారు. అయితే వారిపట్ల ముంబై పోలీసుల ప్రవర్తన కూడా సరిగా లేదు. ఏదో దాచడానికి ప్రయత్నిస్తున్నారని, ఎవరినో కాపాడటమే ధ్యేయంగా అడుగులేస్తున్నారని వస్తున్న ఆరోపణల్ని బలపరిచే రీతిలో వారు అతిగా ప్రవర్తించారు. దర్యాప్తు కోసం వచ్చిన బిహార్ సీనియర్ ఐపీఎస్ అధి కారిని 14 రోజులు క్వారంటైన్లో వుండాలని శాసించి దిగ్భ్రాంతిపరిచారు. అంతేకాదు... పోస్టు మార్టం నివేదిక అడిగినా ఇవ్వలేదు. ఏమైతేనేం మొత్తానికి సుశాంత్ మరణంపై సీబీఐ దర్యాప్తు త్వరలో మొదలవుతుంది. అయితే ఈ ఉదంతంలో భిన్న వర్గాలు స్పందించిన తీరు గురించి మాట్లాడుకోవాలి. కొన్ని చానెళ్లు ఈ ఉదం తంపై క్యాంపెయిన్ నడిపాయి. కొందర్ని దోషులుగా నిర్ధారిస్తూ తీర్పులిచ్చాయి. ఇతరులు సరేసరి. సుశాంత్ సన్నిహితురాలు రియా చక్రవర్తిపై ఎవరికైనా అనుమానాలుండటం తప్పేమీ కాదు. కానీ ఆమె దోషిగా నిర్ధారణ అయినట్టే భావించి ఆమెను, ఆమె స్వరాష్ట్రమైన బెంగాల్ మహిళలను దూషిం చడం... నిజమో కాదో తేలకుండానే కోట్లాది రూపాయలు రియా కైంకర్యం చేసిందని ఆరోపించడం అనాగరికం. ముంబైలో మానవత చచ్చిపోయిందని, ఇది సురక్షితమైన ప్రాంతం కాదని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ భార్య ట్వీట్ చేయడం కూడా పెను వివాదం రేపింది. ముంబై పోలీసుల దర్యాప్తు పూర్తయ్యేవరకూ ఆగి, వారు తేల్చేదేమిటో చూశాక మాట్లాడితే వేరుగా వుండేది. బిహార్‌కు చెందిన అన్ని పార్టీలూ దీన్ని బిహారీల ఆత్మగౌరవానికి తగిలిన దెబ్బగా చూశాయి. అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి గనుకే ఈ పార్టీలన్నీ ఈ స్థాయిలో స్పందించాయని, ఫిర్యాదు చేయా లంటూ సుశాంత్ కుటుంబసభ్యులపైనా ఒత్తిళ్లు వచ్చాయని కొందరి ఆరోపణ. ఏదేమైనా నిరాధా రమైన ఆరోపణలకూ, అనవసర నిందలకూ ప్రభావితం కాకుండా సీబీఐ అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేయాలి. కారకులెవరో తేలితే వారెంతటివారైనా కఠిన శిక్ష పడేలా చూడాలి. -
సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించడంపై అభ్యంతరం
సాక్షి, న్యూఢిల్లీ : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి బదిలిచేయడాన్ని మహారాష్ర్ట ప్రభుత్వం వ్యతిరేకించింది. బీహార్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, వాస్తవానికి ఈ కేసు దర్యాప్తు చేయడానికి ముంబై పోలీసులకై అధికారం ఉందని తెలిపింది. బీహార్ పోలీసులు కొందరు రాజకీయ నేతల ప్రోద్భలంతో ఇదంతా చేస్తున్నారని ఆరోపించింది. అంతేకాకుండా సుశాంత్ తండ్రి మహారాష్ర్టలో ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుశాంత్ ఆత్మహత్య కేసును పట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలంటూ రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ హృషేష్ రాయ్ నేతృత్వంలో బుధవారం సుప్రీంకోర్టులో విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ముంబై పోలీసుల చర్యను సుప్రీం తప్పుబట్టింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేసేందుకు బీహార్ నుంచి ముంబై వచ్చిన పోలీస్ అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకించింది. ఇది తప్పుడు సంకేతాలు పంపుతుందని వ్యాఖ్యానించింది. కేసు విచారణను నిజాయితీగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించింది. (‘ఆమెపై హత్యాచారానికి తెగబడ్డారు’) సుశాంత్ మృతికి సంబంధించిన దర్యాప్తు వివరాలను రికార్డులో ఉంచాలని మహారాష్ర్ట ప్రభుత్వాన్ని ధర్మాసనం కోరింది. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తుపై స్టేటస్ రిపోర్ట్ మూడు రోజుల్లో సమర్పించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. నిజాలు బయటకు రావాల్సిందే అంటూ సుప్రీం పేర్కొంది. ఈ కేసులో సాక్ష్యాదారాలను నాశనం చేశారంటూ ఆరోపించిన సుశాంత్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని, అన్ని సాక్ష్యాలను జాగ్రత్తగా చూసుకునేలా చర్యలు తీసుకుంటామంటూ జస్టిస్ రాయ్ హామీ ఇచ్చారు. ఇక సుశాంత్ అనుమానస్పద మృతి కేసుపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తునకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ కోరుతూ బిహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్రం అంగీకరించిందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపారు. (సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ) -
సుశాంత్ మాజీ మేనేజర్ మరణంపై సంచలన ఆరోపణలు
ముంబై : బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సలియన్ది ఆత్మహత్య కాదని ఆమెపై లైంగిక దాడి జరిపి హత్య చేశారని మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణే ఆరోపించారు. దిశా అటాప్సీ రిపోర్ట్‌లో ఆమె ప్రైవేట్ భాగాలపై గాయాల మరకలున్నాయని వెల్లడైందని పేర్కొన్నారు. దిశా, రాజ్‌పుత్‌ల మరణాల కేసుల్లో దోషులను కాపాడేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీజేపీ నేత రాణే ఆరోపించారు. దిశా కుటుంబంపై ఒత్తిడి తెస్తుండటంతో వారు ఆమె మృతిపై విచారణ కోరడం లేదని రాణే పేర్కొన్నారు. జూన్ 13 రాత్రి నటుడు దినోమోరియా నివాసంలో పార్టీ జరిగిందని, ఆ తర్వాత పార్టీకి హాజరైన వారు సుశాంత్ ఇంటికి వెళ్లారని రాణే చెప్పారు. ఈ పార్టీకి ఓ రాజకీయ నేత కూడా హాజరయ్యారని పేర్కొన్నారు. కాగా విశ్వసనీయ సమాచారం ఉండటంతోనే తన తండ్రి ఈ ఆరోపణలు చేసి ఉంటారని ఆయన కుమారుడు, బీజేపీ నేత నితీష్ రాణే అన్నారు. త్వరలోనే తాము ఈ వివరాలను సంబంధిత అధికారుల ఎదుట వెల్లడిస్తామని చెప్పారు. సుశాంత్ మృతిపై వాస్తవాలు వెలుగులోకి రాకుండా కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కాగా జూన్ 14న సుశాంత్ విషాదాంతానికి ముందురోజు సుశాంత్ ఇంట్లో పార్టీ జరిగిందనే ఆరోపణలను ముంబై పోలీస్ చీప్ పరంవీర్ సింగ్ గతంలో తోసిపుచ్చారు. మరోవైపు సుశాంత్ మృతిపై అతడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆరోపణలు వెల్లువెత్తాయి. సుశాంత్ తండ్రి ఫిర్యాదుపై ముంబై చేరుకున్న బిహార్ పోలీసులు ఈ దిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. చదవండి : సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం -
‘ముంబై మానవత్వం కోల్పోయింది’
ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సతీమణి అమృత ఫడ్నవిస్ ముంబై నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబై తన మానవత్వాన్ని కోల్పోయిందన్నారు. సుశాంత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తితోపాటు ఆమె కుటుంబసభ్యుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో రెండు ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అలాగే దర్యాప్తు విషయంలో బిహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య కోల్డ్ వారికి దారితీసింది. ఈ నేపథ్యంలో సుశాంత్ కేసులో ముంబై పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తే జీవించడానికి ముంబై మహానగరం సురక్షితం కాదనిపిస్తోందన్నారు. (నొప్పి లేకుండా చనిపోవడం ఎలా?.. గూగుల్‌లో సుశాంత్ సెర్చ్) ‘సుశాంత్ సింగ్ కేసులో పోలీసులు వ్యవహిరిస్తున్న తీరు చూస్తే ముంబై మానవత్వం కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్నవారు జీవించడం సురక్షితం కాదు’ అని ట్విటర్లో పేర్కొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలను శివసేన, ఎన్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమృత ఫడ్నవిస్ వ్యాఖ్యలను శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేదీ తప్పు పట్టారు. రాష్ట్ర బీజేపీ నాయుకులు రాజకీయం చేస్తూ ముంబై పోలీసులను నిందిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల పరువు తీసేవిధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పోలీసులను నిందించే వారు తమ భద్రత కోసం ప్రైవేట్ సిబ్బందిని నియమించుకోవాలన్నారు. మాజీ సీఎం భార్యగా అమృత ఫడ్నవిస్ పోలీసులను నిందించటం సిగ్గుచేటన్నారు. -
ఐపీఎస్ బలవంతపు క్వారంటైన్‌పై సీఎం స్పందన
పట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును విచారించడానికి వెళ్లిన బిహార్ ఐపీఎస్ ఆఫీసర్ వినయ్ తివారీని క్వారంటైన్లో ఉండాలని ముంబాయి హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ఆదేశించడంపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్పందించారు. కేసును విచారించడానికి వెళ్లిన పోలీసు అధికారిని ఇలా బలవంతంగా క్వారంటైన్లో ఉంచడం సరైనది కాదని అన్నారు. బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్లో ఉంచారు అని ట్వీట్ చేసిన అనంతరం నితీశ్ కుమార్ స్పందించారు. ఆదివారం సుశాంత్ కేసు విచారణలో బిహార్, ముంబై పోలీసులకు మధ్యలో వాగ్వాదం జరిగింది. డీజీపీ ఈ విషయం పై ముంబై పోలీసులతో మాట్లాడారు. వినయ్ విషయంలో జరిగింది సరైనది కాదు అని వారికి తెలిపారు అని నితీశ్ కుమార్ చెప్పారు. ఇది రాజకీయ విషయం కాదని, న్యాయానికి సంబంధించింది అని బిహార్ పోలీసులు వారి డ్యూటీ వారు చేస్తున్నారు అని పేర్కొన్నారు. తివారీ చేతి మీద క్వారంటైన్ స్టాంప్ వేసిన 40 నిమిషాల నిడివిగల వీడియోను బిహార్ పోలీసులు షేర్ చేశారు. ముంబైలో కరోనా కేసులు విపరీతంగా ఉన్న నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన వారందరికి క్వారంటైన్ విధిస్తున్నామని ముంబై పోలీసులు తెలిపారు. రేఖా చక్రవర్తి, ఆమెకుటుంబ సభ్యులపై సుశాంత్ రాజ్‌పుత్ నాన్న ఫిర్యాదు చేసిన తరువాత నుంచి ముంబై పోలీసులతో పాటు పట్నాకు చెందిన నలుగురు పోలీసుల బృందం కూడా విచారణ మొదలు పెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన బాంద్రాలోని తన ప్లాట్‌లో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ఆయన ఆత్మహత్యకు సంబంధించి చాలా కథనాలు బయటకు వస్తున్నాయి. చదవండి: సుశాంత్ సూసైడ్: సీఎం వ్యాఖ్యలు కలకలం -
సుశాంత్ స్నేహితుడి కదలికలపై పోలీస్ నజర్
పట్నా : బాలీవుడ్ యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై బిహార్ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు సహకరించడంలేదని, కేసుకు సంబంధించిన కీలక పత్రాలను అందచేయడం లేదని బిహార్ పోలీసులు ఆరోపిస్తున్న క్రమంలో పట్నా ఎస్పీ వినయ్ కుమార్ ముంబైకి పయనమయ్యారు. జులై 14 అర్ధరాత్రి 12.30-12.45 గంటల మధ్య సుశాంత్ రూం తలుపును ఓపెన్ చేసేందుకు ఆయన స్నేహితుడు, రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని పిలిపించిన తాళాలు తయారుచేసే వ్యక్తి కోసం పట్నా పోలీసులు గాలిస్తున్నారు. కీ మేకర్‌ను గుర్తించామని, త్వరలోనే మొత్తం ఘటనపై అతడిని ప్రశ్నిస్తామని పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా బిహార్ పోలీసులు సుశాంత్ సింగ్ రాజ్పుట్ విషాదాంతం సీన్ రీకన్స్ర్టక్షన్ చేపట్టారు. సుశాంత్ నివాసంలో పనిచేసే ఆయన సిబ్బందిలో పలువురిని సైతం పోలీసులు ప్రశ్నించారు. ఇక దర్యాప్తులో భాగంగా సుశాంత్ సిబ్బందిలో ఒకరు యువనటుడి గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి గురించి సంచలన విషయాలు వెల్లడించారు. సుశాంత్ బాంద్రా నివాసంలో రియా ఉన్నప్పుడు అన్ని విషయాలూ ఆమె కనుసన్నల్లోనే సాగేవని సుశాంత్ వద్ద పనిచేసే స్వీపర్ తెలిపారు. ఆమె అనుమతి లేకుండా సుశాంత్ రూంలోకి ఏ ఒక్కరికీ ప్రవేశం ఉండేది కాదని చెప్పారని తెలిసింది. సుశాంత్ గదిని శుభ్రపరచాలా, లేదా అనేది కూడా ఆమే నిర్ణయించేవారని చెప్పారు. జూన్ 14న సుశాంత్ విషాదాంతంలో తొలిసారి సుశాంత్ మృతదేహాన్ని చూసిన ఆయన స్నేహితుడు, రూమ్మేట్ సిద్ధార్థ్ పితాని ఆచూకీపైనా బిహార్ పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, సుశాంత్ మరణానికి ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తే కారణమని ఆరోపణలు వెల్లువెత్తాయి. చదవండి : ‘రియా చక్రవర్తి జాడ తెలియలేదు’ -
‘రియా చక్రవర్తి జాడ తెలియలేదు’
ముంబై: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో బిహార్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా శనివారం ప్రత్యేక పోలీసు బృందం ముంబైకి వెళ్లిందని డీజీపీ గుప్తేశ్వర్ పాండే తెలిపారు. పోలీసులు సుశాంత్ మృతికి సంబంధించిన పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారని తెలిపారు. అదే విధంగా అతని స్నేహితులు, సహచరులు, బంధవులను విచారించి హత్యకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. నలుగురు సభ్యుల పోలీసు బృందం ముంబైలో ఉన్న సుశాంత్ సోదరి, మాజీ ప్రేయసి అంకితా లోఖండే, వంటమనిషి, పలువురు స్నేహితుల వద్ద వాంగ్మూలం తీసుకున్నారని తెలిపారు. కానీ రియా చక్రవర్తి ఎక్కడ ఉన్నారో ఇంకా గుర్తించలేదని, ఆమె ఆచూకి ఇప్పటి వరకు తెలియలేదన్నారు.(సుశాంత్ కేసు: రియా పిటిషన్‌పై 5న విచారణ) అదే విధంగా సుశాంత్ బ్యాక్ అకౌంట్, ట్రాన్జాక్షన్స్ సమాచారాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నారని డీజీపీ తెలిపారు. బిహార్ పోలీసులకు సుశాంత్ కేసును దర్యాప్తు చేసి చేధించే సామర్థ్యం ఉందన్నారు. సుశాంత్ కుటుంబ సభ్యులకు పోలీసులు న్యాయం చేస్తారని తెలిపారు. ఈ కేసు విచారణను బిహార్ నుంచి ముంబై పోలీసులకు అప్పగించాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో పలు సంచలన విషయాలు బయట పడుతున్నాయి. సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి 15 కోట్ల రూపాయలు రియా కాజేసిందంటూ సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. (రియాకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలంటూ ఒత్తిడి) -
సుశాంత్ సూసైడ్: సీఎం వ్యాఖ్యలు కలకలం
పట్నా : బాలీవుడ్ యంగ్‌హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఉదంతం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. ఈ కేసు విషయంపై మహారాష్ట్ర, బిహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సుశాంత్ ఆత్మహత్యపై ఇటు మహారాష్ట్రలోను, అటు బిహార్‌లోనూ కేసులు నమోదుకావడంతో ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే విచారణ నిమిత్తం బిహార్ పోలీసులు ముంబైకి రావడం, అక్కడ ముంబై పోలీసులు వారిని అడ్డుకుని వెనక్కిపంపించడం వివాదానికి దారితీసింది. మరోవైపు సుశాంత్ ఆత్మహత్య కేసు విచారణలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రతిపక్ష బీజేపీ విమర్శించడంతో రాజ్‌పుత్ వ్యవహారానికి రాజకీయ రంగు పులుముకుంటోంది. ఈ నేపథ్యంలో బిహార్ ఉపముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత సుశిల్ మోదీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. (సుశాంత్ సూసైడ్ మిస్టరీలో మనీలాండరింగ్ కేసు) సుశాంత్ ఆత్మహత్య కేసులో నిజాలు బయటపడకుండా బాలీవుడ్ మాఫీయా అడ్డుపడుతోందని, చిత్రపరిశ్రమలోని కొందరి ఒత్తడికి ఉద్ధవ్ ఠాక్రే తలొంచారని ఆరోపించారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్ దోషులను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. తాజా కేసును విచారించే శక్తీ, సామర్థ్యాలు బిహార్ పోలీసులకు ఉన్నాయని, వారి విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని, కానీ ముంబై పోలీసుల నుంచి సరైన సహకారం లేదని మండిపడ్డారు. ఈ మేరకు శనివారం రాత్రి ఓ మీడియాతో మాట్లాడిన సుశిల్ మోదీ.. మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సుశాంత్ కేసును సీబీఐకి చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజా ట్విస్ట్) ఇదిలావుండగా.. బిహార్, బీజేపీ నేతల తీరుపై సీఎం ఠాక్రే తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కేసు దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. ముంబై పోలీసుల విశ్వసనీయత దెబ్బతీస్తున్న బీజేపీ నేతల తీరు సరైనది కాదని మండిపడ్డారు. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని ఠాక్రే స్పష్టం చేశారు. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా చూడద్దొని అన్నారు. జూన్ 14న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. -
సుప్రీం కోర్టుకు రియా.. 5న విచారణ!
సాక్షి,న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్య ఘటన వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు నిష్పక్షపాతంగా విచారణ జరపించాలని డిమాండ్ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఐదు రోజులుగా సుశాంత్ ఆత్మహత్య కేసు కీలక మలుపులు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి, ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఈ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. జూలై 25న సుశాంత్ తండ్రి కేకే సింగ్ రియాపై పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆమె ఏమో కేసు దర్యాప్తును పట్నా నుంచి ముంబై పోలీసులకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. (చదవండి: సుశాంత్, అలియా మధ్య పోటీ, గెలిచేదెవరు?) మరోవైపు రియా చక్రవర్తి పిటిషన్‌ను ఆగష్టు 5న సుప్రీం కోర్టు విచారించనున్నట్లు తెలుస్తోంది. జస్టిస్ హృషికేశ్ రాయ్ సింగిల్ జడ్జి బెంచ్ ఈ పిటిషన్‌ను విచారించనుంది. సుశాంత్ ఆత్మహత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన తనపై ఆయన కుటుంబ సభ్యులు తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే చంపేస్తాం, అత్యాచారం చేస్తామంటూ బెదిరింపులు కూడా వస్తున్నాయని వాపోయారు. ముందస్తు నోటీసు లేకుండా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయకుండా ఉండటానికి మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో ఒక దావా వేసింది. ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారని, ఈ కేసును విచారించగలరని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. (చదవండి : సుశాంత్ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్) ఎం.ఎస్. ధోనీ లాంటి బ్లాక్ బ్లస్టర్ చిత్రంలో నటించిన సుశాంత్.. జూన్ 14న ముంబైలోని బాంద్రాలో ఉన్న తన అపార్ట్మెంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిశారు. -
‘సుశాంత్‌పై క్షుద్రపూజలు చేయించింది’
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూ అనుమానపు నీడలు అలుముకుంటూనే ఉన్నాయి. రియాపై రోజుకొక అభియోగం మోపుతున్నారు. సుశాంత్ బ్యాంక్ అకౌంట్ నుంచి రియా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుందనే ఆరోపణలు ఉన్నాయి. డాక్టర్ ఇచ్చిన మందులు కాకుండా వేరే మందులను సుశాంత్‌కు ఇచ్చిందని అతడి ఫిజికల్ ట్రైనర్ కూడా తెలిపారు. ఇవి మాత్రమే కాకుండా సుశాంత్ చావుకు రియానే కారణమంటూ పలువురు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య విషయంలో సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతున్నారు. సుశాంత్ కుటుంబం కూడా రియాపై అనేక ఆరోపణలు చేస్తోంది. తాజాగా సుశాంత్ సోదరి మితు సింగ్ సుశాంత్ ప్లాట్‌లో క్షుద్ర పూజలు జరిగాయని, ఒక తాంత్రికుడిని పిలిపించి రియా ఇదంతా చేసిందని ఆరోపించారు. అదేవిధంగా సుశాంత్ స్నేహితుడు నీలోత్పల్ కూడా క్షుద్రపూజల విషయంలో విచారణ జరిపించాలని కోరారు. సుశాంత్ మరణంపై దర్యాప్తు కోసం ప్రధాని నరేంద్ర మోదీకి మితు సింగ్ లేఖ రాసిన సంగతి తెలిసిందే. చదవండి: నాపై భయంకరమైన వార్తలు రాస్తున్నారు: రియా -
సుశాంత్ కేసు: మహారాష్ట్ర వర్సెస్ బిహార్
ముంబై: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తును నిర్వహించడంలో ముంబై పోలీసుల సామర్థ్యాన్ని ప్రశ్నించే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే పేర్కొన్నారు. జూన్‌లో ఆత్మహత్య చేసుకున్న నటుడు సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ వ్యవహారానికి నెమ్మదిగా రాజకీయ రంగు పులుముకుంటోంది. మహారాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శలు గుప్పించడంపై సీఎం ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ.. ముంబై పోలీసులు ఎంతో సమర్థత కలిగిన వారు. ఈ కేసును రాష్ట్ర పోలీసులు విచారించగలరు. ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఈ కేసును నిర్వహించడంలో ముంబై పోలీసుల విశ్వసనీయతను బీజేపీ నాయకుడు అనుమానించారని ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్‌పై ఠాక్రే విరుచుకుపడ్డారు. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలు ఎవరిదగ్గర అయినా ఉంటే నిరభ్యంతరంగా ముంబై పోలీసులకు సంప్రదిస్తే.. కేసును విచారించి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకంటామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ కేసును మహారాష్ట్ర వర్సెస్ బిహార్ సమస్యగా ఉపయోగించవద్దు. ఇది చాలా దుర్భరమైన విషయం" అని ఆయన అన్నారు. మేము 30 సంవత్సరాలు బీజేపీతో కలిసి ఉన్నాము. కానీ వారు మమ్మల్ని విశ్వసించలేదు. అయితే 30 ఏళ్లుగా మాతో రాజకీయ విభేదాలు ఉన్నవారు మమ్మల్ని విశ్వసించారు అని ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం గురించి ఠాక్రే పేర్కొన్నారు. ఈ కేసును ముంబై పోలీసులు చేధించగలరని, సీబీఐ దర్యాప్తు అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇటీవల అన్నారు. కాగా.. జూన్ 14న సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్మెంట్లో సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు రాజ్‌పుత్ కుటుంబం, అతని కుక్‌తో సహా సుమారు 40 మంది వాంగ్మూలాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. (సుశాంత్ సూసైడ్ మిస్టరీలో మనీలాండరింగ్ కేసు) -
ఆమె ఖర్చుల భారం సుశాంత్‌దే!
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించిన పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. తన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి విమాన టికెట్లు, హోటల్ ఖర్చులను సుశాంత్ భరించాడని వెల్లడైంది. రియా సోదరుడి ఖర్చులు కూడా సుశాంత్ భరించాడని బ్యాంక్ స్టేట్మెంట్లో తేలింది. సుశాంత్ విషాదాంతంపై దర్యాప్తు చేపట్టిన బిహార్ పోలీసులు ముంబైకు చేరుకుని విచారణను వేగవంతం చేయడంతో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి : ఆమె విషకన్య.. సంచలన ఆరోపణలు కుంగుబాటుతో బాధపడుతున్న సుశాంత్‌కు 2019 నవంబర్ నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్ కేసరి చావ్దానూ బిహార్ పోలీసులు సంప్రదించారు. కొద్దినెలలుగా సుశాంత్ మందులు సరిగ్గా వేసుకోవడం లేదని, ఆహారం సవ్యంగా తీసుకోవడం లేదని డాక్టర్ వెల్లడించారు. సుశాంత్ సరిగ్గా స్పందించపోవడంతో తాను కూడా వైద్య సలహాలు ఇవ్వడం విరమించానని ఆయన పోలీసులకు తెలిపారు. సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్రపై సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు రంగంలోకి దిగారు. సుశాంత్ ఖాతా నుంచి రూ 15 కోట్లు వేరే ఖాతాలకు బదిలీ అయ్యాయని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సుశాంత్ కేసు: పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ కేసులు కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ ఆత్మహత్య కేసును ప్రస్తుతం పోలీసులు విచారించవచ్చని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కు బదిలీ చేయాలన్న పిటిషన్‌ను కొట్టి వేస్తూ గురువారం అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. పోలీసులను తమ పని తమను చేయనివ్వాలని, తమకేదైనా స్పష్టమైన సందేహం ఉంటే ముంబై హైకోర్టుకు వెళ్లాలని పిటిషనర్ అల్కా ప్రియకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సూచించింది. (దిల్ బేచారా: ఎంత మంది చూశారంటే!) అలాగే అభిమానులు, కొంతమంది బాలీవుడ్ ప్రముఖులు, రాజకీయ నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ సుశాంత్ కేసును సీబీఐకు అప్పగించలేమని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా సుశాంత్ తండ్రి రియాపై పట్నాలో ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. తన కొడుకును మోసం చేసి రియా డబ్బులు లాక్కుందని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించిందని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో ఆరోపించారు. (సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు) కాగా రియా ఈ కేసును ముంబైకి బదిలీ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేసు విచారణను బీహార్ నుంచి ముంబైకి ట్రాన్సఫర్ చేయాలనీ.. రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముంబైలో దర్యాప్తు జరుగుతుండగా అదే కేసులో బీహార్‌లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం చట్టవిరుద్ధమని రియా న్యాయవాది చెప్పారు. అంతేగాక స్వయంగా హోమంత్రి అమిత్‌షాకు ఈ కేసును సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఆమె కోరారు. మరోవైపు రియా చర్యను అడ్డుకోవాలని కోరుతూ సుశాంత్ తండ్రి ఈ రోజు(గురువారం) సుప్రీంకోర్టులో కోవియట్ పిటిషన్ వేశారు. కాగా సుశాంత్ జూన్ 14న ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే అతన్ని ఆత్మహత్యకు ప్రేరేపించారన్న నేపథ్యంలో ముంబై పోలీసులు ఇప్పటికే 40 మందికి పైగా ప్రశ్నించారు. (ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు) -
దిల్ బేచారా: ఎంత మంది చూశారంటే!
ప్రముఖ బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం దిల్ బేచారా. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతో భావేద్వేగానికి గురి చేసింది. హాట్‌స్టార్+డిస్నీలో విడుదలైన ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో వ్యూస్ లభించాయి. ఈ చిత్రాన్ని విడుదలైన 24 గంటల్లో 95 మిలియన్ల మంది వీక్షించారు. ఇది ప్రముఖ వెబ్ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్ ’ వ్యూస్‌ను మించి ఉందని ప్రముఖ మీడియా కన్సల్టింగ్ ఫార్మ్ ఆర్ మ్యాక్స్ మీడియా తెలిపింది. చదవండి: దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్ సుశాంత్ గౌరవార్థం ఈ సినిమాను సబ్‌స్రైబర్స్, నాన్ సబ్‌స్రైబర్స్ కు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తున్నట్లు హాట్‌స్టార్+ డిస్నీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఒకవేళ సుశాంత్ సినిమా థియేటర్లలో విడుదలై టికెట్ ధర రూ. 100 చొప్పున కొని చూసి ఉంటే 950 కోట్ల బిజినెస్ చేసేది. పీవీఆర్ సినిమా థియేటర్లలలో టికెట్ ధర రూ. 207 చొప్పున ఉంటుంది కాబట్టి అక్కడ చూసి ఉంటే బాక్సాఫీస్ కలెక్షన్ రూ. 2000కోట్లు దాటేది. సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య చేసుకొన్న విషయం తెలిసిందే. -
ఆత్మహత్య చేసుకున్న మరో నటుడు
ముంబై: 2020లో వరుస మరణాలు చిత్ర పరిశ్రమలో విషాదాన్ని నింపుతున్నాయి. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఇప్పటికీ బాలీవుడ్ పరిశ్రమను వెంటాడుతుండగా, ఇప్పుడు మరాఠీ సినీ నటుడు అశుతోష్ భక్రే(32) జూలై 29న ఆత్మహత్య చేసుకొని తుదిశ్వాస విడిచాడు. మరాఠ్వాడ ప్రాంతంలోని నాందేడ్‌లోని తన నివాసంలో అశుతోష్ ఉరివేసుకున్నట్లు తెలుస్తోంది. అశుతోష్ భక్రే కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి గల సరైన కారణాలు ఇంకా తెలియలేదు. ఒక వ్యక్తి తమ ప్రాణాలను ఎందుకు తీసుకుంటారో విశ్లేషించే వీడియోను అశుతోష్ భక్రే చనిపోయే ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అశుతోష్ మరణంపై ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని అధికారి తెలిపారు. View this post on Instagram " No one can lie, no one can hide anything, when he looks directly into someone's eyes....!!" 😊🤘🏻#marathmolalook #traditionaloutfit #loveforcamera A post shared by Aashutosh Bhakre (@aashutoshbhakre) on Nov 16, 2017 at 4:18am PST ప్రముఖ మరాఠీ టెలివిజన్ నటి మయూరి దేశ్‌ముఖ్‌ను అశుతోష్ భక్రే 2016లో వివాహం చేసుకున్నాడు. 2013 చిత్రం భకార్తో అశుతోష్ భక్రేకు మంచి గుర్తింపు లభించింది. అతను ఇచార్ తార్లా పక్కాలో కూడా నటించాడు. ప్రముఖ టెలివిజన్ షో ‘కులాటా కాలి కులేనా’తో మయూరి దేశ్‌ముఖ్ బాగా ప్రాచుర్యం పొందింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయినప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నాడో తెలియకుండా అతని గురించి మాట్లాడటం తప్పని సుశాంత్‌కు సపోర్టు చేస్తూ మయూరి ఒక లెటర్‌ను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది. చదవండి: దిల్ బేచారా: కంటతడి పెట్టించిన సుశాంత్ View this post on Instagram Yes it was wrong of him to take his life. But can we please stop judging him and lecturing what he should have done...How much we as human civilization know in depth about depression????? Has there been a fool proof cure in the medical science for people suffering from mental illness??? And whoever first circulated the picture of his dead body SHAME on Him.. And those who are circulating those pictures still, SHAME on them as well... Our culture has elaborate and intricate rituals for those who have left their body. We worship and pray deeply so that the soul has an easy passage. His family gets strength to move on. Do you think his family can gain strength from the manner in which his news is portrayed.. Please use Social Media carefully. And please please lets remember him through his best work and best pics. He was a self made achiever after all!! I pray for your peace and strength to your family! Hope you Rest in Peace Sushant 🙏 Love and prayers Mayuri Deshmukh and Family A post shared by Mayuri :) (@mayurideshmukhofficialll) on Jun 14, 2020 at 10:29pm PDT -
సుశాంత్ ఆత్మహత్య కేసులో కీలక మలుపు
పట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది. సుశాంత్ స్నేహితురాలు రియా చక్రవర్తిపైన పట్నాలోని రాజీవ్ నగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సుశాంత్ మృతిపై ఆయన తండ్రి కృష్ణ కుమార్‌సింగ్ ఫిర్యాదుతో రియాపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుశాంత్ అకౌంట్ నుంచి రూ.15 కోట్లు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు. ఆయనకు సంబంధించిన ఆర్థిక అంశాలతో పాటు ఇతర విషయాలను రియా స్వయంగా పర్యవేక్షించినట్లు తెలిపారు. ఈ మేరకు రియాను బుధవారం విచారించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ‘సుశాంత్ తండ్రి కేకే సింగ్ తన ఆరోగ్య సమస్యల కారణంగా కేసుపై పోరాడడానికి ముంబై వెళ్లలేనని చెప్పారు. దాంతో రాజీవ్ నగర్ పోలీసు స్టేషన్లో రియాపై కేసు నమోదు చేశాము. రియా సుశాంత్ బ్యాంక్ ఖాతా నుంచి రూ. 15 కోట్లు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించాము’ అని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(పట్నా) సంజయ్ సింగ్ తెలిపారు. తన కుమారుడికి సంబంధించిన నగదు, ఆభరణాలు, ల్యాప్‌టాప్, క్రెడిట్ కార్డు, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లు రియా వద్ద ఉన్నట్లు కేకే సింగ్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. కాగా, జూన్ 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. -
సుశాంత్ కేసులో మహేష్ భట్ వాంగ్మూలం నమోదు
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సుశాంత్ ఆత్మహత్య కేసులో తాజాగా ప్రముఖ దర్శకుడు మహేష్‌భట్‌ను ముంబై పోలీసులు ప్రశ్నించారు. జూలై 27న శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్‌కు హాజరైన మహేష్ భట్‌ను కొన్ని గంటలపాటు విచారించిన పోలీసులు ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మహేష్ భట్‌తోపాటు కరణ్ జోహార్ మేనేజర్‌ను కూడా విచారణకు హాజరు కావాలని మహారాష్ట్ర హోశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కోరారు. అలాగే నటి కంగనా రనౌత్‌ను కూడా వాంగ్మూలాన్ని రికార్డు చేసేందుకు రావాలని సూచించారు. (అక్కడికి రావాలనిపిస్తోంది అక్కా: సుశాంత్) కాగా జూన్ 14న బాంద్రాలోని తన నివాసంలో సుశాంత్ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. సినీ ఇండస్ట్రీలోని కొందరు ప్రముఖుల వల్లే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్యా చోప్రా, రియా చక్రవర్తి సహా 37 మందిని పోలీసులు విచారించారు. ఇప్పుడు మహేష్ భట్‌ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో తను సుశాంత్‌ను కేవలం రెండు సార్లు మాత్రమే కలిసినట్లు మహేష్ భట్ వెల్లడించారు. నవంబర్ 2018లో ఒకసారి, 2019 జనవరిలో మరోసారి అని పేర్కొన్నారు. (‘మరోసారి నా హృదయం ముక్కలైంది’) ‘సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తి నా 2018 చిత్రం 'జలేబీ'లో పనిచేసింది. ఆ సమయంలో కలిసి పనిచేయడం వల్ల రియా నన్ను ఒక మెంటర్‌గా గౌరవించేది. నా చిత్రాల్లో నటించాలని సుశాంత్ నటించాలని ఏ రోజు కోరలేదని ఆ ఉద్దేశ్యం నాకు లేదు’ అని తెలిపారు. అయితే సడక్-2 సినిమాలో ముందుగా సుశాంత్‌ను అడిగి ఆ తర్వాత ఆదిత్యారాయ్ కపూర్‌ను తీసుకున్నట్లు వార్తలు వచ్చాయని ప్రశ్నించగా అలాంటిదేం లేదని, 'సడక్ 2' లో నటించడానికి సుశాంత్‌తో చర్చలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. (‘దిల్ బేచారా’ మరో రికార్డు) అంతేగాక దివంగత నటుడు సుశాంత్ తనతో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపించాడని కూడా వెల్లడించాడు. తన ప్రాజెక్టులలో తనకు కనీసం ఒక చిన్న పాత్ర ఇవ్వమని కోరాడని భట్ తెలిపారు. ఇదిలావుండగా సుశాంత్ మరణంపై సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న నటి కంగనా రనౌత్‌కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. మున్ముందు ఈ విచారణలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
ఆ తరువాతే సుశాంత్ చికిత్స ఆపేశాడు
ముంబై: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసులు నలుగురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను నమోదు చేశారు. సుశాంత్‌కి థెరపీ సెషన్స్ ఇచ్చిన సైకోథెరపిస్ట్‌ను సోమవారం ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి ఐదు గంటలపాటు ప్రశ్నించారు. ఆయన వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేశారు. సైకోథెరపిస్ట్‌లను కాకుండా, పోలీసులు గత వారం ముంబైకి చెందిన మరో ముగ్గురు మానసిక వైద్యుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. సుశాంత్ డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటున్నాడని, కానీ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజులు ముందు దానిని ఆపేశాడని అతని స్నేహితులు తెలిపారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. దిషా సాలియన్ మరణించినప్పటి నుంచి సుశాంత్ చికిత్స తీసుకోవడం మానేశాడు. దిషా మరణించిన తరువాత పోలీసులు సుశాంత్‌ను విచారించారు. దీంతో సుశాంత్ చాలా ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. దిశా సాలియన్ సుశాంత్ టాలెంట్ మేనేజ్మెంట్ సంస్థలో ఉద్యోగిని. ఈ సంస్థను ఉదయ్ సింగ్ గౌరీ నిర్వహించేవారు. ఇదిలా ఉండగా సుశాంత్ రెండుసార్లు మాత్రమే దిశను కలిశారని గౌరీ పోలీసులకు తెలిపారు. చదవండి: ‘అమిత్‌షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’ జూన్ 9న 14వ అంతస్తులోని ఫ్లాట్ నుండి దూకి దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది. ఆమె సుశాంత్ మాజీ మేనేజర్ అని వివిధ వార్తా కథనాల ద్వారా తెలిసింది. దీంతో పోలీసులు సుశాంత్‌ను పలు విధాలుగా ప్రశ్నించడంతో ఒత్తిడికి గురై డిప్రెషన్ మందులు వాడటం కూడా ఆపేశాడు. గౌరీ స్టేట్మెంట్ను రికార్డు చేసిన పోలీసులు, ఎవరైనా ప్లాన్ చేసి సుశాంత్‌ను బెదిరించడం వల్ల మరణించాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు. నెగిటివ్ స్టోరీ యాంగిల్లో కూడా విచారణ చేస్తున్నారు. చాలా మంది అగ్రశ్రేణి బాలీవుడ్ టాలెంట్ మేనేజర్లు, కాస్టింగ్ మేనేజర్లను కూడా పోలీసులు ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం పోలీసులు మరికొందరు బాలీవుడ్ ప్రముఖుల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. -
అలా అయితే పద్మశ్రీ వెనక్కి ఇచ్చేస్తా : కంగన
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత సినీ పరిశ్రమలో నెపోటిజంపై గొంతెత్తిన బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ మరోసారి సంచలనం సృష్టించారు. ఈ విషయంలో తన వాదనలను నిరూపించుకోలేకపోతే తన పద్మశ్రీని పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేస్తానని ప్రకటించారు. ఒక హిందీ టీవీ చానల్‌తో మాట్లాడుతూ కంగనా ఈ విషయాన్ని వెల్లడించారు. సుశాంత్ కేసు విచారణలో భాగంగా ముంబై పోలీసులు తాను మనాలీ ఉండగా ఫోన్ చేశారనీ, అయితే తన స్టేట్మెంట్ను తీసుకోవడానికి ఎవరినైనా పంపించాలని కోరినా ఎవరూ రాలేదని వివరించారు అయితే ఈ విషయంలో తాను ఏం మాట్లాడినా బహిరంగంగానే మాట్లాడనని, తాను పారిపోయే మనషిని కాదని స్పష్టం చేశారు. తన విమర్శలను నిరూపించుకోలేకపోతే, పద్మశ్రీ అవార్డును ఉంచుకునే అర్హత తనకుండదని ఆమె పేర్కొన్నారు. (సుశాంత్‌ది ఆత్మహత్యా? హత్యా: కంగన ఫైర్) జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య యావత్ సినీలోకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అలాగే పరిశ్రమలో నెపోటిజంపై అనేక విమర్శలు చెలరేగాయి. ప్రధానంగా మహేష్ భట్, కరన్‌జోహార్ లాంటి నిర్మాతలపై కంగనా ఘాటు విమర్శలు గుప్పించారు. అలాగే సుశాంత్‌ది ఆత్మహత్యా లేక పథకం ప్రకారం జరిగిన హత్యా అంటూ బాలీవుడ్ పరిశ్రమ తీరుపై కంగనా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. (‘సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి’) -
సుశాంత్ మరణం: హోంమంత్రి వ్యాఖ్యలు
ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై సీబీఐ విచారణ అవసరం లేదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేశారు. ఈ కేసును ముంబై పోలీసులు సమర్ధంగా దర్యాప్తు చేధిస్తారని అన్నారు. సుశాంత్ విషాదాంతం కేసులో వ్యాపార శత్రుత్వ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారని చెప్పారు. సుశాంత్ రాజ్పుట్ జూన్ 14న ముంబైలో తన బాంద్రా అపార్ట్మెంట్లో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు ఆత్మహత్యగా పేర్కొనగా ప్రాథమిక దర్యాప్తులో బాలీవుడ్ యువనటుడు కుంగుబాటుకు లోనై చికిత్స పొందుతున్నారని వెల్లడైంది. కాగా, సుశాంత్ ఎలాంటి పరిస్ధితిలో తీవ్ర నిర్ణయం తీసుకున్నారో, ఎంతటి ఒత్తిడికి గురయ్యారో నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణ చేపట్టాలని కోరుతూ ఆయన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి గురువారం ట్వీట్ చేశారు. ప్రభుత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, సీబీఐ విచారణ ద్వారా ఈ కేసులో న్యాయం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. చదవండి : ‘సుశాంత్‌ది ఆత్మహత్య కాదు..’ -
‘అమిత్‌షా మీరు తలుచుకుంటే నిమిషం చాలు’
పాట్నా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ చేపట్టాల్సిందిగా బిహార్ జన్ అధికార్ పార్టీ అధ్యక్షుడు పప్పు యాదవ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖను కోరిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ ఆయనకు సమాధానం ఇచ్చింది. హోం మంత్రిత్వ శాఖ రిప్లైని పప్పు యాదవ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఈ లేఖ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్‌కు సరిపోతుంది. మేం దీనిని ఆ శాఖకు పంపిస్తున్నాం అని సమాధానం ఇచ్చారు. దీనిపై పప్పు యాదవ్ స్పందిస్తూ, అమిత్‌షా మీరు అనుకుంటే ఈ కేసులో ఒక్క నిమిషంలో సీబీఐ విచారణ మొదలవుతుంది. దయచేసి దీనిని పక్కన పెట్టొద్దు అని పేర్కొన్నారు. చదవండి: ఎందుకీ ఆత్మహత్యలు ఇక పప్పు యాదవ్‌తో పాటు నటుడు శేఖర్ సుమన్ కూడా సుశాంత్ ఆత్మహత్య విషయంలో పోరాటం మొదలు పెట్టాడు. అయితే ఆయన ఈ విషయంలో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. సుశాంత్ కుటుంబం నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేకపోవడంతో వెనక్కు తగ్గతున్నట్లు ఆయన ప్రకటించారు. వాళ్ల అభిప్రాయాలకు మనందరం గౌరవమివ్వాలి అని ఆయన కోరారు. చదవండి: ‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’ ఇక సుశాంత్ చిన్నతనంలో గడిపిన పాట్నాలోని రాజీవ్‌నగర్‌లో ఉన్న ఇంటిని మెమొరియల్‌గా మార్చనున్నట్లు అతని కుటుంబం తెలిపింది. ఇందులో ఆయన అభిమానుల కోసం సుశాంత్ దగ్గర ఉన్న బుక్స్, ఆయన వాడిన టెలిస్కోప్ ఇంకా ఇతర వస్తువులు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా ఆయన సోషల్‌మీడియా అకౌంట్లను కూడా కొనసాగిస్తామని ఆయన కుటుంబం తెలిపింది. జూన్ 14 వ తేదీన సుశాంత్ బాంద్రాలోని తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’ -
ట్యూబ్ భళ్లుమంది
కోపమేనా గూడు కట్టుకుని ఉండేది? ప్రేమా లోలోపల ఘనీభవిస్తూ ఉంటుంది. గూడు కట్టుకున్న కోపంలా.. ఘనీభవించిన ప్రేమ బద్దలు కాదు. కానీ.. ఇప్పుడైంది! సుశాంత్‌పై ప్రేమ ‘లైక్’లుగా భళ్లుమంది. ‘దిల్ బేచారా’కు కోటి లైక్‌లు! మూవీ ట్రైలర్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు. యూట్యూబ్ లైక్‌ల చరిత్రలో.. మరో ‘డెస్పసీతో’.. దిల్ బేచారా!! ఇద్దరూ చనిపోతారా చివర్లో! కిజీ బసుకు థైరాయిడ్ క్యాన్సర్. ఇమ్మాన్యుయేల్ రాజ్‌కుమార్ జూనియర్‌కు ఆస్టియోసర్కోమా. ఇదీ క్యాన్సరే. అయితే ఆమెకు ఉన్నంత తీవ్రంగా ఉండదు అతడికి. ‘కిజీ తర్వాతే నువ్వు’ అన్నట్లు ఉంటుంది.. తీసుకుపోవడానికి. కిజీ.. మన్నీకి దూరదూరంగా ఉంటుంది. అతడికి తనకు దగ్గరవకుండా ఉండటం కోసం. మన్నీ అంటే.. మన ఇమ్మాన్యుయేలే. దగ్గరవొద్దంటే దూరంగా ఉండే రకమా! నీ దూరం నీది. నా దగ్గర నాది అంటాడు. ప్రేమ వాళ్లలో ప్రాణాన్ని పంప్ చేస్తుంటుంది. దిగ్.. దిగ్.. దిగ్... కిజీ.. ‘దిల్ బేచారా’ హీరోయిన్. మన్నీ ‘దిల్ బేచారా’ హీరో. ఇద్దరూ చనిపోతారా చివర్లో! ‘జనన మరణాలు మన చేతుల్లో లేకపోవచ్చు. ఎలా జీవించాలన్నది మన చేతుల్లోనే ఉంటుంది’.. ఈ మూవీ ట్రైలర్లో వస్తుందీ మాట. కానీ.. సుశాంత్, మరణాన్ని కూడా జీవించడంలోని ఒక భాగంగా చేసుకుని వెళ్లిపోయాడా! ‘దిల్ బేచారా’లోని హీరో మన్నీ.. సుశాంతే! లేడు ఇప్పుడు. హీరోయిన్ కిజీ.. సంజనా సంఘీ ముంబైలో లేదు ఇప్పుడు. ఢిల్లీ నుంచి వచ్చిన ఆమ్మాయి ఢిల్లీకే తిరిగి వెళ్లిపోయింది. ఇద్దరూ కలిసి ఇక నటించేది లేదు. ఇద్దరూ కలిసి ఈ సినిమాను చూసుకునేది లేదు. ఇద్దరూ ఉన్న.. ఈ ఇద్దరు మాత్రమే ఉన్న ట్రైలర్ ఇప్పుడు ‘లైక్ ’ల రికార్డులతోపాటు, చూస్తున్న వారి హార్ట్లనూ బ్రేక్ చేస్తోంది. చనిపోయిన చిన్నవాడు కళ్లముందు నవ్వుతూ కనిపిస్తున్నాడు. ∙∙ ‘దిల్ బేచారా’ ట్రైలర్ జూలై 6న యూట్యూబ్‌లో విడుదలైంది. ఈ పది రోజుల్లోనే 7 కోట్ల 45 లక్షల 72 వేల మందికి పైగా ట్రైలర్‌ని వీక్షించారు. కోటి మంది ‘లైక్’ చేశారు. ఒక సినిమా ట్రైలర్‌కు ఇన్ని లైక్‌లు రావడం యూట్యూబ్ చరిత్రలోనే ఇది రికార్డు. ఆల్‌టైమ్ రికార్డు లైక్స్ ఉన్న 2019 నాటి హాలీవుడ్ మూవీ ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ట్రైలర్‌ను కూడా ‘దిల్ బేచారా’ ట్రైలర్ ఎక్కడో దూరంగా ఉంచేసింది. అసలు ట్రైలర్ విడుదలైన 24 గంటల్లోనే 40 లక్షల 80 వేల మంది లైక్ చెయ్యడం ‘దిల్ బేచారా’కు నమోదైన మొదటి రికార్డు. అయితే మూవీ ట్రైలర్స్ అని వేరు చేయకుండా అసలు మొత్తం మీద యూట్యూబ్ చరిత్రలో ఇప్పటి వరకు మోస్ట్–లైక్డ్ వీడియో మాత్రం ‘డెస్పసీతో’. 2017 జనవరిలో విడుదలైన ఈ 4.41 నిముషాల స్పానిష్ పాప్ వీడియో సాంగ్‌కి ఇంతవరకు 3 కోట్ల 80 లక్షల మందికి పైగా ‘లైక్’ కొట్టారు. ‘దిల్ బేచారా’ స్త్రీ పురుషుల మధ్య ప్రేమ. నిస్సహాయమైన రెండు హృదయాల స్పందన. ‘డెస్పసీతో’ దేహ సాన్నిహిత్యంతో జీవితాన్ని ప్రేమించడం! ఆగి, మెల్లిగా జీవితపు క్షణాల్లోని ప్రేమకణాలను జ్వలింపజేసుకోవడం. డెస్పసీతో అంటే స్పానిష్‌లో.. ‘నెమ్మదిగా’ అని. ప్యూర్టొరికో గాయకుడు లూయీ ఫాన్సీ (42), ప్యూర్టొరికో ర్యాపర్ డాడీ యాంకీ (43) కలిసి చేసిన ఈ పాప్ వీడియో అగ్గిలా భగ్గుమనడానికి ఇందులోని థీమ్ ఒక కారణమైతే.. వీyì యో రిలీజ్ అయిన మూడో నెలలోనే కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ దీనికి రీమిక్స్ వెర్షన్‌ని సృష్టించడం వల్ల వచ్చిన పాపులారిటి మరొక కారణం. దాన్ని చూసి దీన్ని, దీన్ని చూసి దాన్ని చూడ్డం వల్ల కూడా డెస్పసీతో లైక్‌లు, వీక్షణలు వరదనీటి మట్టంలా పెరిగిపోయాయి. ∙∙ ‘దిల్ బేచారా’ గుడ్ లవ్. ‘డెస్పసీతో’ నాట్ టూ గుడ్. సుశాంత్, సంజనాల్లోని అమాయ కత్వం లూయీ ఫాన్సీ, డాడీ యాంకీల డెస్పసీతోలో కనిపించదు. ఆ సాంగ్‌ను ‘ఛీ’ అన్నవారూ ఉన్నారు. ‘‘ఏంటిది! ఓప్పం గంగ్నమ్ స్టెయిల్లా! వేలం వెర్రి కాకపోతే’’ అని. ఐనాగానీ.. లాటిన్, అర్బన్ మ్యూజిక్ రిథమ్స్ ‘డెస్పసీతో’ను నిలబెట్టాయి. దిల్ బేచారాలో ‘‘కిస్సీ అని నీకెవరు పేరు పెట్టారు?’’ అని కావాలని అడుగుతాడు సుశాంత్.. కిజీ బసుని. ‘‘కిజీ నా పేరు. ఇటీజ్ జడ్ అంటుంది’’ కిస్ అనే మాట రిపీట్ కాకుండా కిజీ. అంత ఫ్రెష్ లవ్ వాళ్లది. డెస్పసీతో లోనివన్నీ గాఢమైన చుంబన భావనలు. ‘నా ముద్దులతో నీ దుస్తులను తొలగించాలని ఉంది’ అంటాడు. కొద్దికొద్దిగా ముద్దులతో మనం దగ్గరవుదాం’ అంటాడు. అలాంటప్పుడు జీవితాన్ని ప్రేమిస్తున్నట్లుగా ఉండదు. దేహాన్ని వ్యామోహిస్తున్నటు అనిపిస్తుంది. బహుశా డెస్పసీతోకు వచ్చిన మూడు కోట్లకు పైగా లైక్‌లలో మగపిల్లలు, మగవాళ్లు కొట్టినవే ఎక్కువగా ఉండి ఉండాలి. రికార్డులు వస్తుంటాయి, పోతుంటాయి. అవన్నీ చరిత్ర ట్యూబుల్లో ఉండిపోయేవి. వాటితో నిమిత్తం లేకుండా మనసులలో కొన్ని రికార్డు అయిపోతూ ఉంటాయి. లైక్‌లు కొట్టనివాళ్లలో కూడా సుశాంత్ అభిమానులు కోటికి మించే ఉండరంటారా?! -
నక్షత్రానికి సుశాంత్ పేరు నిజం కాదు
బాలీవుడ్లో అర్ధాంతరంగా నేల రాలిన తార సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అతని చావుతో యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్రమంలో బిహార్‌లోని పర్నియాలో ఓ రహదారికి సుశాంత్ పేరును పెట్టి అభిమానం చాటుకున్నారు. అమెరికాలోని రక్ష అనే ఓ అభిమానైతే ఏకంగా ఆకాశంలోని నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరును నామకరణం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈమేరకు దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేషన్ ఫొటో కూడా జత చేశారు. ప్రతి ఒక్కరూ దీన్ని నిజమనే నమ్మి ఆమె అభిమానం చాటుకున్న తీరుకు అబ్బురపడ్డారు. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అధికారులు స్పష్టం చేశారు. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?) అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య(ఐఏయూ) శాస్త్రవేత్త ఒకరు మాట్లాడుతూ.. రాజ్‌పుత్ పేరు మీద ఎలాంటి నక్షత్రం లేదని వివరణ ఇచ్చారు. ఐఏయూ ఓటింగ్ సభ్యుడు డా. అశ్విన్ శేఖర్ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ సెలబ్రిటీ కానీ, ఎవరి పేరైనా సరే నక్షత్రానికి పెట్టే హక్కు అంతర్జాతీయ ఖగోళ సమాఖ్యకు మాత్రమే ఉంది అని తెలిపారు. అయితే చాలామంది తమకు నచ్చిన పేర్లను తారలకు పెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. దీంతో అసలు సుశాంత్ పేరున నక్షత్రం అనే వార్త తప్పని రుజువైంది. కాగా జూన్ 14న ముంబైలోని తన స్వగృహంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే (నక్షత్రానికి సుశాంత్ పేరు) -
జీవితాంతం ప్రేమిస్తూ ఉంటాను: సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యకు పాల్పడి నేటికి(జూలై14) నెల పూర్తవుతోంది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు మరోసారి సుశాంత్‌ను తమ మదిలో గుర్తుకు తెచ్చుకుంటున్నారు. గత నెల 14న సుశాంత్ ముంబైలోని తన నివాసంలో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్‌గా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తి హీరోతో తనకున్న జ్ఙాపకాలను నెమరేసుకున్నారు. (సుశాంత్ కేసులో సీబీఐ విచారణ జరగాలి: స్వామి) ఈ మేరకు సుశాంత్‌తో దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయడంతోపాటు తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో భావోద్వేగ లేఖ రాశారు. ‘నా భావోద్వేగాలను ఎదుర్కోడానికి ఇంకా కష్టపడుతున్నాను. నా మనసులో ఏదో అలజడి. నాకు ప్రేమ మీద నమ్మకాన్ని కలిగించావు. ప్రేమకున్న శక్తిని తెలిసేలా చేశావు. జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నేర్పించావు. దాన్నినేను ప్రతి రోజు నేర్చుకుంటానని నీకు మాట ఇస్తున్నాను. నువ్వు శాశ్వతంగా వెళ్లిపోయావనే విషయాన్ని నేనింకా నమ్మలేకపోతున్నాను. నువ్వు ఇప్పుడు ప్రశాంతమైన ప్రదేశంలో ఉన్నావని నాకు తెలుసు. నీలాంటి గొప్ప శాస్త్రవేత్తకు చంద్రుడు, నక్షత్రాలు, గెలాక్సీలు స్వాగతం పలికాయని నమ్ముతున్నాను’. అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. (తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి) సుశాంత్ మరణించి నెల రోజులవుతున్నా, జీవితాంతం తనను ప్రేమిస్తూ ఉంటానని రిచా పేర్కొన్నారు. ‘నీ మంచితనం, ఆనందంతో ప్రతి దాన్ని అద్భుతంగా మార్చగలవు. నీకోసం ఎంతో ఎదురు చూస్తుంటాను. నిన్ను మళ్లీ తిరిగి నా దగ్గరకు తీసుకు రావాలని కోరుకుంటున్నాను. నువ్వు అందమైన, గొప్ప వ్యక్తివి. ప్రప్రంచం చూసిన వ్యక్తుల్లో నువ్వు అద్భుతం. మన మధ్య ఉన్న ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేకపోతున్నాయి. ప్రతి దాన్ని మంచి మనసుతో ప్రేమిస్తావు. ఇప్పుడు మా ప్రేమ నిజంగా విశేషమైనదని నువ్వు నిరూపించావు. శాంతంగా ఉండు సుషీ. నిన్ను కోల్పోయి 30 రోజులు గడుస్తున్నా.. నిన్ను జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. నీకు శాశ్వతంగా కనెక్టు అయ్యాను’. అంటూ సుశాంత్‌పై తనకున్న అమితమైన ప్రేమను వెల్లడించారు రియా చక్రవర్తి. (సుశాంత్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్) View this post on Instagram Still struggling to face my emotions.. an irreparable numbness in my heart . You are the one who made me believe in love, the power of it . You taught me how a simple mathematical equation can decipher the meaning of life and I promise you that I learnt from you every day. I will never come to terms with you not being here anymore. I know you’re in a much more peaceful place now. The moon, the stars, the galaxies would’ve welcomed “the greatest physicist “with open arms . Full of empathy and joy, you could lighten up a shooting star - now, you are one . I will wait for you my shooting star and make a wish to bring you back to me. You were everything a beautiful person could be, the greatest wonder that the world has seen . My words are incapable of expressing the love we have and I guess you truly meant it when you said it is beyond both of us. You loved everything with an open heart, and now you’ve shown me that our love is indeed exponential. Be in peace Sushi. 30 days of losing you but a lifetime of loving you.... Eternally connected To infinity and beyond A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on Jul 13, 2020 at 9:49pm PDT -
సల్మాన్, కరణ్‌లపై పిటిషన్ కొట్టివేత
పట్నా : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్‌లోని బంధుప్రీతి కారణంగానే అతడు చనిపోయాడని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించి బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్‌ఖాన్, కరణ్ జోహార్, ఏక్తా కపూర్, సంజయ్ లీలా బన్సాలీలపై కేసు నమోదు చేయాలని బిహార్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్‌ను బుధవారం కోర్టు కొట్టివేసింది. స్థానిక న్యాయవాది సుధీర్ కుమార్ ఓజా దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను ముజఫర్‌పూర్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముకేశ్ కుమార్ తిరస్కరించారు. ఇది న్యాయస్థానాల పరిధిలోని అంశం కాదని ఆయన వ్యాఖ్యనించారు. (ప్రముఖ నటుడు జగదీప్ కన్నుమూత) కాగా, సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డ 3 రోజుల తర్వాత సుధీర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అందులో సాక్షులుగా.. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఉందని తీవ్ర విమర్శలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పేరును చేర్చారు. మరోవైపు తన పిటిషన్‌ను కొట్టివేయడంపై సుధీర్ స్పందిస్తూ.. ఈ తీర్పును జిల్లా కోర్టులో సవాలు చేయనున్నట్టు తెలిపారు. సుశాంత్ మరణం బిహార్ వాసుల్లో బాధను నింపిందని.. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారికి శిక్షపడేందుకు పోరాడాల్సి ఉందని చెప్పారు. మరోవైపు సుశాంత్ ఆత్మహత్యకు వెనక కుట్ర దాగి ఉందని అతని అభిమానులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. -
వాళ్లు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తారు: రవీనా
తమ కెరీర్‌ను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వ్యక్తులు సమాజంలో చాలా మంది ఉన్నారని బాలీవుడ్ నటి రవీనా టండన్ అన్నారు. ఇది కేవలం సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సర్వ సాధారణమని ఆమె పేర్కొన్నారు. ఇక ఇటీవల బాలీవుడ్ సుశాంత్ సింగ్ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో నెపోటిజమ్ వాదన ఉవ్వెత్తున లేచింది. నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ చనిపోయాడని అతని అభిమానులతోపాటు కొంతమంది ప్రముఖ నటులు సైతం గళం విప్పుతున్నారు. సుశాంత్ మరణించి 20 రోజులు దాటుతున్న బంధుప్రీతిపై చర్చలు మాత్రం చల్లారడం లేదు. (మెగాస్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ?) దీనిపై తాజాగా నటి రవీనా టండన్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో తను స్వయంగా ఎదుర్కొన్న అనుభవాల గురించి చెప్పుకొచ్చారు. ‘బాలీవుడ్లో నెపోటిజమ్ ఉంది. అందుకు నేను అంగీకరిస్తున్నాను. ప్రతి చోట మంచి వ్యక్తులు, చెడ్డ వ్యక్తులు ఉన్నారు. వీరిలో చెడ్డవాళ్లు మిమ్మల్ని ఓడించేందుకు ప్రణాళికలు రచిస్తుంటారు. నాకు కూడా ఈ అనుభవం ఎదురైంది. వాళ్లు మిమ్మల్ని ఎప్పుడూ దెబ్బతీసేందుకు, సినిమాల నుంచి తప్పించేందుకు ఎదురు చూస్తుంటారు. ఇవన్నీ చిన్నప్పుడు క్లాస్‌రూమ్‌లో చేసే చిల్లర రాజకీయాల్లాంటివి. కానీ ప్రతి పరిశ్రమలోనూ ఇలాంటి వ్యక్తులు ఉంటారు. అయితే మేము గ్లామరస్ ఇండస్ట్రీలో ఉన్నాము కాబట్టి ఇది ఎక్కువ హైలెట్ అవుతోంది’. అని రవీనా అన్నారు. అంతేగాక సుశాంత్ మరణాన్ని సంచలనం చేయడం ఆపేయాలని ఆమె కోరారు. (రవీనా.. నన్ను పెళ్లి చేసుకుంటారా?) -
రికార్డు సృష్టించిన సుశాంత్ మూవీ ట్రైలర్!
ముంబై: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ టీజర్ భారతీయ సినిమాలు వేటికి దక్కని ఒక ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోని 4.8 మిలియన్ల లైక్‌లను సాధించింది. ఇప్పటి వరకు హాలివుడ్ సినిమా ‘అవేంజర్స్: ఇన్ఫినిటి వార్’ ఒక్కరోజులో 3.6 మిలియన్ లైక్‌లను అందుకొని మొదటి స్థానంలో ఉంది. ఇప్పుడు దిల్బేచారా సినిమా అవేంజర్స్‌ను వెనక్కి నెట్టింది. (నక్షత్రానికి సుశాంత్ పేరు) ప్రముఖ నవల ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా మే 8 వతేదీన విడుదల కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. ఈ సినిమాను సుశాంత్‌కు నివాళిగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఉచితంగా ప్రసారం చేస్తానని తెలిపింది. యమ్‌ఎస్ ధోని చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ రాజ్‌పుత్ జూన్ 14వ తేదీన ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. (కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి) -
కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వండి: నటి
‘‘ఎక్కడా సమానత్వం లేదు. కేవలం సినీ పరిశ్రమలోనే కాదు... అన్నిచోట్లా బంధుప్రీతి ఉంది. మీరు ఓ స్టార్ అయితే మీ కొడుకు లేదా కూతురిని సినిమాల్లోకి తీసుకువస్తారు. అది సరైందే. అయితే ఇండస్ట్రీ బయటి వ్యక్తులకు కూడా సమానంగా అవకాశాలు ఇవ్వకపోవడమే సరైంది కాదు. టీవీ నటులు బాలీవుడ్లో అడుగుపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. మాకు సరైన అవకాశం రాకపోవడం వల్లే ఇదంతా. మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి కనీసం ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వొచ్చు కదా’’ అంటూ హిందీ టీవీ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హీనా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. వెండితెరపై ప్రతిభ చాటుకోవాలనుకునే వారికి అవకాశాలు ఇవ్వాలని సినీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు.(‘సుశాంత్‌ను ఆ సినిమాల్లో నుంచి తప్పించాను’) కాగా బుల్లితెరపై ప్రస్థానం ప్రారంభించి నుంచి బాలీవుడ్ హీరోగా ఎదిగిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత నెపోటిజం మరోసారి హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగనా రనౌత్ వంటి పలువురు సినీ ప్రముఖులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి, ఇండస్ట్రీలో ఎదిగిన తీరు గురించి పంచుకుంటున్నారు. ఈ క్రమంలో జాతీయ మీడియాతో మాట్లాడిన హీనా ఖాన్.. సుశాంత్ సినీ ప్రయాణం తనకు స్ఫూర్తిదాయకమన్నారు. ‘‘ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. కఠిన శ్రమకోర్చి ఉన్నతస్థాయికి ఎదిగాడు. మేం బయటివాళ్లం. మాకు గాడ్ఫాదర్లు ఉండరు. కాస్త గుర్తింపు, కొద్దిపాటి గౌరవం మాత్రమే మేం కోరుకుంటాం. కాబట్టి అందరినీ సమానంగా చూస్తే ఇలాంటివి జరగవు’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.(ఆ ‘దెయ్యమే’ సుశాంత్‌ను పీడించింది!) ఇక ‘యే రిష్తా క్యా కహెలాతా హై’ సీరియల్(తెలుగు డబ్బింగ్- పెళ్లంటే నూరేళ్లపంట)ల్లో అక్షరగా లక్షలాది అభిమానులను సొంతం చేసుకున్న హీనా.. సినిమాల్లోకి రాకముందే కాన్స్ ఫెస్టివల్లో హొయలొలికించే గౌరవం దక్కించుకున్న నటిగా గుర్తింపు పొందారు. ఆ మధుర జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న హీనా ఖాన్.. కాన్స్ ఫెస్టివల్లో పాల్గొనే సమయంలో టీవీ యాక్టర్ అవడం వల్ల భారతీయ ఫ్యాషన్ ప్రముఖులు తన పట్ల వివక్ష చూపారని.. అయితే ఆ సమయంలో అంతర్జాతీయ స్థాయి డిజైనర్లు తనకు సాయంగా నిలబడ్డారని పేర్కొన్నారు. కాగా హుస్సేన్‌ఖాన్ దర్శకత్వంలో ‘లైన్స్’ అనే సినిమాతో హీనాఖాన్ బాలీవుడ్లో అడుగుపెట్టేందుకు సిద్ధం కాగా.. ఆ సినిమా ఇంతవరకు విడుదలకు నోచుకోలేదు. కాగా ఆమె తాజాగా నటించిన ‘అన్‌లాక్’ అనే డిజిటల్ ఫిల్మ్ జీ5లో స్ట్రీమ్ అవుతోంది. -
నక్షత్రానికి సుశాంత్ పేరు
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళం అంటే ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆవిషయం తన అభిమానులందరికి కూడా తెలుసు. నటుడిగా మారిన తర్వాత కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌పై సుశాంత్ అనేక అధ్యయనాలు చేశారు. విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూడటానికి ఖరీదైన ఓ టెలిస్కోప్‌ను కొనుగోలు చేశారు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆ టెలిస్కోప్ నుంచి విశ్వంలోకి చూస్తూ ఉండే వారని ఆయనకు సన్నిహితంగా ఉండే వారు తెలిపారు. సుశాంత్ ఇష్టాలు తెలిసిన ఒక అభిమాని ఆయనకు గొప్పగా నివాళి ప్రకటించారు.అమెరికాలో ఉంటున్న రక్ష అనే అభిమాని ఒక నక్షత్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ పేరు పెట్టారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. (నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే! ) ‘సుశాంత్ అద్భుతమైన వ్యక్తి. అతనికి నివాళులు అర్పించడంలో కొంత ఆలస్యం చేశాను. ఈ చీకటి ప్రపంచంలో ఆయన ఒక స్వచ్ఛమైన రత్నం లాంటివాడు. ఆయన మరింతగా మెరవాలి. ఆయన పేరు మీద ఉన్న నక్షత్రాన్ని ఆయన టెలిస్కోప్‌తో కొనడం చాలా సంతోషంగా ఉంది. ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి. అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు. విశ్వంలో ఉంటే తారల్లో ఒకటైన RA 22.121 కు జూన్ 25,2020 నుంచి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశారు. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ మాకు హక్కులు కల్పించింది. ఆ తారకు సంబంధించిన హక్కులు, కాపీరైట్స్ మాకు లభించాయి అని కూడా రక్ష పేర్కొన్నారు. చంద్రమండలంపై కూడా సుశాంత్ భూమిని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’) -
నేనూ కూడా నెపోటిజం బాధితురాలినే!
చెన్నై : నేను బాధితురాలనే అంటోంది తాప్సీ. ఈ ఉత్తరాది భామ దక్షిణాదిలో మొదట కథానాయికగా పేరు తెచ్చుకుంది. ముఖ్యంగా తమిళంలో మొదటగా ఆడుగళం చిత్రంలో ధనుష్‌కు జంటగా పరిచయమైంది. ఆ చిత్రం విజయంతో తర్వాత ఇక్కడ కొన్ని చిత్రాల్లో నటించిన నటిగా పెద్దగా పేరు సంపాదించుకోలేక పోయింది. తెలుగులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో తాప్సీ బాలీవుడ్‌ను నమ్ముకుంది. అక్కడ ఈ అమ్మడు నటించిన నామ్ షబానా, పింక్ వంటి చిత్రాలు సక్సెస్ అవడంతో బాలీవుడ్లో ప్రముఖ కథానాయికగా రాణిస్తోంది. ముఖ్యంగా నటనకు అవకాశం ఉన్న పాత్రలు ఈ అమ్మడిని వరించడం విశేషం. కాగా ఇప్పుడు అక్కడ నేపోటిజం అనే పదం చర్చనీయాంశంగా ట్రోల్ అవుతోంది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటన తరువాత దానికి తామూ బాధితులమే అంటూ చెప్పుకొని పలువురు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అలా తాప్సీ కూడా బాధితురాలినే నని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది. దీని గురించే ఆమె తెలుపుతూ సినీ పరిశ్రమలో ప్రముఖుల వారసులుగా రంగప్రవేశం చేసిన వారికి పరిచయాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది. అలా వారికి సినిమాల్లో అవకాశాలు చాలా సులభంగా వస్తాయని అంది. అయితే ఏలాంటి సినీ నేపథ్యం లేని వాళ్లు ప్రముఖులతో పరిచయాలు అవడానికి చాలా కాలం పడుతుందని చెప్పింది. దీంతో దర్శకులు కూడా బయటి నుంచి వచ్చే వారికి అవకాశాలు కల్పించడం కంటే ప్రముఖుల వారసులతో చిత్రాలు చేయడానికే నటింపజేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారని చెప్పింది. అలా మొదట్లో తాను పలు అవకాశాలను కోల్పోయినట్టు చెప్పింది. అప్పుడు తాను అనుభవించిన బాధ మాటల్లో చెప్పలేనని పేర్కొంది. ఇలాంటి బాధాకరమైన సంఘటనలకు ప్రేక్షకులు కూడా ఒక కారణమని ఆరోపించింది. సినిమా వారసులకు నటించిన చిత్రాలను చూడడానికి ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారని, ఇతరులు వారి చిత్రాలను పట్టించుకోకపోవడం ఇందుకు కారణమని నటి తాప్సీ పేర్కొంది. -
ఎందుకీ ఆత్మహత్యలు
గూడు కట్టుకున్న దిగులు మాటలతోనే బద్దలవుతుంది.. మనసు తేలికపడుతుంది బతుకు మీద నమ్మకం కలుగుతుంది.. జీవిక పట్ల ఆశ మొదలవుతుంది.. ఇప్పుడు ఈ ప్రపంచానికి కావల్సింది ఆ దిగులు దిబ్బను పగలకొట్టే మాటల డైనమైట్ .. యెస్.. మౌనంతో ముడుచుకుపోయిన మనసును పెకల్చే ఆ డైనమైటే డైలాగ్ ... మనుషుల మధ్య స్నేహాన్ని.. సంబంధాల మధ్య అనుబంధాలను పెంచే డైలాగ్ ఉండాలి.. డైలాగ్‌లేని డార్క్‌నెస్‌లో ముందుగా కూరుకుపొయ్యేది గ్లామర్ వరల్డే... ఆ దుష్ప్రభావమే సినిమా సెలెబ్రిటీల సూసైడ్స్.. సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య(14జూన్, 2020) కలవరపెట్టింది. బయటకు కనిపించే కారణాల వరకు అవకాశాల్లేకుండా లేడు. చేతిలో రెండు సినిమాలున్నాయట. ఇప్పటి వరకు చేసినవీ పేరునే కాదు డబ్బునూ ఆర్జించినవే. మరి సూసైడ్ ఎందుకు చేసుకున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లను బట్టి ఒంటరితనం, డిప్రెషన్ అని అంచనావేస్తున్నారు. డిప్రెషన్‌కు సినిమా తారలు కొత్తకాదు.. సినిమా తారలకూ డిప్రెషన్ పాత కంపానియనే. హీరో, హీరోయిన్లుగా కాక నటీనటులుగా నిలిచిపోయిన అనాటి కళాకారులు చాలా మందికి తర్వాత కాలంలో వేషాలు కరువై డిప్రెషన్ ఫ్రెండ్ అయింది. వెండితెర వెలుగుల నీడగా మారిన వాళ్లను ఆర్థిక కష్టాలూ ఆటోగ్రాఫ్ అడిగాయి. డీలా పడిపోలేదు. మనసు విప్పి మాట్లాడారు. తాము అనుభవిస్తున్న క్షోభను తోటివారితో పంచుకున్నారు. మాట సాయం, నైతిక స్థైర్యం పొందగలిగారు. గెలుపు, ఓటములు కాదు బతకడం ముఖ్యం అని ముందుకు సాగారు. సంపాదించిన కీర్తిని కాదు బతకాలన్న కాంక్షను సెలబ్రేట్ చేసుకున్నారు. అప్పుడు టీవీ లేదు.. ప్రైవేట్ చానల్స్ ఊహే అందలేదు. గ్రీన్ రూమ్ తప్ప ఇంకో చోటులో ఇమడలేరు. షూటింగ్ స్పాట్ కాకుండా మరో ప్రపంచం తెలియదు. అంటే ఇంకో ఉపాధి ఊసే లేకపోయినా.. రాకపోయినా బతికారు. ప్రాణం పెట్టుకున్న అభిరుచి జీవిత కాలం భరోసా ఇవ్వకపోయినా దాన్ని వృత్తిగా ఆస్వాదించిన క్షణాలనే నెమరువేసుకుంటూ స్నేహితులను పెంచుకుంటూ జీవించారు. ఈరోజుకీ వాళ్లను తలుచుకుంటోంది కేవలం వాళ్లలోని ప్రతిభతోనే కాదు సమస్యల్లో వాళ్లు ప్రదర్శించిన ధైర్యానిక్కూడా. ఈ స్ఫూర్తే కదా అభిమానులకు కావాల్సింది! ఈ హీరోయిజానికే కదా ఫేవరెట్స్ పెరగాల్సింది. పరిమితి చెదిరి పరిధి పెరిగింది.. ఇదివరకటితో పోలిస్తే అవకాశాలు మెండు. రెమ్యునరేషనూ సంతృప్తికరంగానే ఉంటోంది. ఫాలోయింగ్ ఉన్నప్పుడే లైఫ్‌ను సెటిల్ చేసుకోవాలనే ఎరుకా హెచ్చింది. ఈ సంపాదనను మరో రంగంలో మదుపుగా పెట్టాలనే ఆలోచనా వచ్చింది. పాతతరం నటీనటుల్లా ఎముకలేని దానాలతో కష్టార్జితాన్ని కరిగించుకోవట్లేదు. అవసరం ఉన్నప్పుడు మాత్రం చేయి అందివ్వడానికి వెనకంజ వేయడంలేదు. ఇంతగా ప్లాన్ చేసుకున్న ఈ షెడ్యూల్లో హఠాత్తుగా ఆత్మహత్యలెందుకు ప్లేస్ అవుతున్నాయి? నటనా తృష్ణకు ఈ రోజు సినిమా ఒక్కటే మాధ్యమంగా లేదు. థియేటర్ ఒక్కటే ప్రామాణికంగా కనిపించడం లేదు. ప్రైవేట్ చానెల్స్ వస్తూవస్తూనే సీరియళ్లు, రియాలిటీ షోలతో చాన్స్‌లు చూపించాయి. మాధురి దీక్షిత్, శిల్పా శెట్టి, సొనాలి బెంద్రె, వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్స్, జావేద్ జఫ్రీ, అనుపమ్ ఖేర్ (సమ్‌థింగ్ సే టు అనుపమ్ అంకుల్), కిరణ్ ఖేర్ వంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లు, అనురాగ్ బసు, అను మాలిక్ వంటి దర్శకులు, సంగీత దర్శకులూ ఈ స్పేస్‌ను ఉపయోగించుకుంటున్నారు. ప్రేక్షకులు తమను మరిచిపోకుండా చూసుకుంటున్నారు. అంతెందుకు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ తో అమితాబ్‌ను ‘బిగ్ బి’గా నిలబెట్టింది ఈ స్మాల్ స్క్రీనే కదా. సల్మాన్ ఖాన్, సంజయ్‌దత్‌లు ‘బిగ్ బాస్’ను నిర్వహించారు. ఆ ప్రేరణతో దక్షిణాది భాషల్లోనూ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్ .. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ని ఆడించారు. ‘బిగ్‌బాస్’నూ నడిపించారు. ఇప్పుడు ప్రతి చానెల్లోని దాదాపు అన్ని రియాలిటీ షోలకు సినిమా తారలే యాంకర్లు. ప్రేక్ష మోహతా క్రైమ్ పెట్రోల్ (క్రైమ్ సీరియల్) యాక్టర్. వయసు 26 ఏళ్లు. ఇండోర్‌లోని తన ఇంట్లో మొన్న (2020) మే, 26న ఉరితో జీవితాన్ని అంతం చేసుకుంది. కెరీర్‌కు సంబంధిం చిన ఆందోళన, నిరాశ, వ్యాకులతతో బాధపడుతున్నట్టు సూసైడ్ నోట్లో రాసింది. కుశల్ పంజాబీ మోడల్, సినిమా, టీవీ నటుడు. 2019, డిసెంబర్ 26న ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం.. డిప్రెషనే. నితిన్ కపూర్ తెలుగు సినిమాల నిర్మాత. 2017, మార్చి 14న పై అంతస్తు నుంచి దూకి ప్రాణాలు వదిలాడు. అతనూ మానసిక అనారోగ్యంతో బాధపడ్డట్టు సమాచారం. ప్రత్యూష బెనర్జీ ‘బాలికా వధు’ సీరియల్లో ఆనంది పాత్రతో ప్రాచుర్యం పొందిన నటి. బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్ కూడా. 2016, ఏప్రిల్ 1న ఆత్మహత్య చేసుకుంది. ప్రత్యూష రాయుడు సినిమాతో తెలుగు ప్రేక్షకుల అటెన్షన్ పొందిన తెలుగు నటి. హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ అయ్యే సమయంలో 2002, ఫిబ్రవరి 2న ఆత్మహత్యతో జీవితానికే ముగింపు చెప్పుకుంది. కారణం ప్రేమ వ్యవహారమే. రంగనాథ్ ఒకప్పటి తెలుగు హీరో, క్యారెక్టర్ ఆర్టిస్ట్. దాదాపు 300 పై చిలుకు చిత్రాల్లో నటించిన రంగనాథ్ 2015, డిసెంబర్ 19న బలవన్మరణంతో ఈ లోకాన్ని విడిచిపోయాడు. ఉదయ్ కిరణ్ ‘చిత్రం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమై ‘నువ్వు నేను’, ‘మనసంతా నువ్వే’ తో ఫేవరేట్ యాక్టర్‌గా మారాడు. ఆర్థిక ఇబ్బందుల వల్ల డిప్రెషన్‌కు లోనై 2014, జనవరి 5న ఆత్మహత్య చేసుకున్నాడు. ఫటాఫట్ జయలక్ష్మి తెలుగు, తమిళ, మలయాళ నటి. అంతులేని కథలో ఆమె పోషించిన పాత్ర ఊతపదం ఫటాఫట్. దాంతో ఆమె స్క్రీన్ నేమ్ ‘ఫటాఫట్ జయలక్ష్మి’ అయింది. లవ్ ఫెయిల్యూర్‌తో మనస్తాపం చెంది 1980లో ఆత్మహత్య చేసుకుంది. గురుదత్ వసంత్ కుమార్ శివశంకర్ పడుకోణే తెర మీద గురుదత్ టైటిల్ కార్డ్‌తో కనిపించాడు.. అలరించాడు. ప్యాసా, కాగజ్ కె ఫూల్, సాహిబ్ బీబీ ఔర్ గులామ్, చౌద్వీ కా చాంద్ సినిమాలు ఇప్పటికీ గురుదత్ను సజీవంగా నిలుపుతున్నాయి. 1964, అక్టోబర్ 10న ఆల్కహాల్లో నిద్రమాత్రలు కలుపుకొని శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. కునాల్ సింగ్ ‘ప్రేమికుల రోజు’ సినిమా గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా హీరోనే కునాల్ సింగ్. 2008, ఫిబ్రవరి 7న ఉరివేసుకొని చనిపోయాడు. అంతకు కొన్ని నెలల ముందు కూడా ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడట మణికట్టు కొసుకొని. జియా ఖాన్ రామ్‌గోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయింది. ఆమిర్ ఖాన్ ‘గజినీ’లోనూ నటించి మంచి పేరు తెచ్చుకుంది. 2013, జూన్ 3న సూసైడ్ చేసుకుంది. కారణం.. బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలీ కొడుకు సూరజ్ పంచోలీ (‘హీరో’ ఫేమ్)తో ప్రేమ.. వైఫల్యం. సిల్క్ స్మిత తెలియనది ఎవరికి? వందల సినిమాల్లో నటించి అప్పటి యువతకు ఆరాధ్య దేవతగా నిలిచింది. 1996, సెప్టెంబర్ 23న ఆత్మహత్య చేసుకొని సినిమా అభిమానులందరినీ షాక్‌కు గురిచేసింది. మోనల్ నావల్ తమిళ సినిమాల్లో నటించిన మోనల్... ఫేమస్ హీరోయిన్ సిమ్రన్‌కు చెల్లెలు. 2002లో చెన్నైలోని తన ఇంట్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. అక్కడ కూడా మానసిక నిర్బలత్వానికి ఏ వుడ్ అయినా ఒకటే. సైకియాట్రీకన్సల్టేషన్ పట్ల సంకోచాలేమీ లేని పాశ్చాత్య సమాజంలోని నటులు కూడా ఆత్మహత్య అనే బలహీన క్షణాన్ని కౌగిలించుకున్నారు. హాలీవుడ్ ప్రసిద్ధులు రాస్ అలెగ్జాండర్, మార్లిన్ మాన్రో, స్టాన్లీ ఆడమ్స్, ఎలిజబెత్ హార్ట్మన్, బ్రాడ్ డేవిస్, రిచర్డ్ ఫ్రాన్స్ వర్త్, రాబిన్ విలియమ్స్, బ్రిటిష్ యాక్ట్రెస్, మోడల్ లూసీ గార్డన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆ సూసైడ్స్ లిస్ట్ కూడా పెదద్దే. నటనకే కాదు గొంతు అరువివ్వడానికీ అవకాశాలున్న కాలం ఇది. యానిమేషన్ పిక్చర్స్‌కి కూడా ఫీచర్ ఫిల్మ్స్కున్నంత డిమాండ్ ఉంటోంది. అన్ని భాషల్లోకి అనువాదం అవుతున్న ఈ సినిమాలకు ఆయా భాషల్లోని స్టార్స్ తమ గొంతును అరువిస్తున్నారు. స్వరంతో నటించే ఈ జాబ్ కూడా సంతృప్తినిచ్చేదే.. ఖ్యాతినార్జించి పెట్టేదే. షార్ట్ఫిల్మ్స్కూ కాల్షీట్లు యూట్యూబ్ చానెల్స్ తమ ఉనికితో మరిన్ని ఆపర్చునిటీస్ను పెంచాయి. క్రియేటివిటీనే పెటుబడిగా మార్చాయి. షార్ట్ ఫిల్మ్స్‌కు మెయిన్ స్ట్రీమ్ సినిమా స్టేటస్‌ను తెచ్చాయి. సోషల్ మీడియా దానికి పబ్లిసిటీ పార్ట్నర్ అయింది. ఔత్సాహిక టెక్నీషియన్లు, యాక్టర్లకు బిగ్ స్క్రీన్ ఎంట్రీ టికెట్‌గా, అలాగే బిగ్ స్క్రీన్ టెక్నీషియన్లు, యాక్టర్లకు ఫాలోయింగ్ పెంచే ప్లాట్‌ఫామ్‌గా స్పేస్ తీసుకున్నాయీ యూ ట్యూబ్ చానళ్లు. అనురాగ్ కశ్యప్ వంటి డైరెక్టర్లు, నసీరుద్దీన్ షా, దీప్తి నావల్, నందితా దాస్, కాజోల్ వంటి తారలు యూట్యూబ్ చానెల్ షార్ట్ ఫిల్మ్స్ కోసం కాల్షీట్లు అడ్జస్ట్ చేసినవారే. ఎవర్ ది టాప్ ఈ అవకాశాల పందిరి ఇలా ఉండగానే ఓటీటీ (ఓవర్ ది టాప్) వేదిక తయారైంది. టీవీలు, యూట్యూబ్‌లతో థియేటర్లలో ప్రేక్షకుల సంఖ్య తగ్గింది అనే మాట వైరల్ అవుతూండగానే యాప్‌ల రూపంలో స్మార్ట్ టీవీల్లోకి దూరిపోయింది. సినిమాతో పోటీ పడే బడ్జెట్.. దానికి మించిన సాంకేతిక విలువలు.. ఫీచర్ ఫిల్మ్ యాక్టర్లూ టచప్ చేసుకునేలా చూశాయి. మూవీస్‌కు స్ట్రీమింగ్ పార్టనర్స్‌గా ఉంటూనే ఒరిజనల్స్‌ను రిలీజ్ చేశాయి. వెబ్ సిరీస్‌తో టీవీ సీరియళ్లు తమ స్క్రిప్ట్, స్క్రీన్ ప్లేను తరచి చూసుకోవాల్సిన పరిస్థితి. సృజన, ప్రతిభకు ఆకాశం దాటిపో యింది హద్దు. లైమ్‌లైట్‌లో ఉన్న సినిమా నటీనటులు వెబ్ సిరీస్, ఓటీటీ ఒరిజనల్స్ కోసం డేట్స్ బ్లాక్ చేసుకుంటున్నారు. దీనికి హాలీవుడ్ కూడా డై హార్డ్ ఫ్యాన్. మన దగ్గరా అన్ని భాషల ఫిల్మ్ వుడ్స్‌కు ఓటీటీ నుంచి ఇన్విటేషన్ ఉంది. వరల్డ్ సినిమాకు ఇంటినే స్క్రీనింగ్ థియేటర్‌గా చేసింది. ఇప్పటికే బాలీవుడ్ నుంచి అనురాగ్ కశ్యప్, కరణ్ జోహార్, దిబాకర్ బెనర్జీ, జోయా అఖ్తర్‌లు దీనికోసం సినిమాలు తీశారు. సిరీస్‌లూ నిర్మించారు. సైఫ్అలీ ఖాన్, నవాజుద్దీన్ సిద్దిఖీ, పంకజ్ త్రిపాఠి, మనీషా కోయిరాలా, వివేక్ ఒబెరాయ్, రీచా ఛద్దా, వికీ కౌశల్, భూమి ఫడ్నేకర్, కియారా అద్వాణి, సుప్రియా పాఠక్, రత్నా పాఠక్ షా, అభయ్ డియోల్, రమ్యకృష్ణ వంటి సుప్రసిద్ధులంతా ఓటీటీలో నటించారు. కరోనా వల్ల థియేటర్లో రిలీజ్ కాని షూజిత్ సర్కార్ సినిమా ‘గులాబో సితాబో’ కూడా అమెజాన్‌లో విడుదలైంది. అజయ్ దేవ్గన్ కూడా ఈ వెబ్ చానెల్స్ కోసం సినిమా నిర్మిస్తున్నాడు. అందులో కాజల్, షబానా ఆజ్మీ నటిస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా నెట్‌ఫ్లిక్స్ కోసం ధర్మ ప్రొడక్షన్స్ తీసిన ‘డ్రై వ్’ అనే చిత్రంలో నటించాడు. ‘బాలాజీ’ (బాలాజీ టెలిఫిలిమ్స్, బాలాజీ మోషన్ పిక్చర్స్) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసుకుంది ‘బాలజీ ఆల్ట్’ పేరుతో. తెలుగు చిత్రసీమా ఓటీటీ తెర మీద కనిపిస్తోంది. నందిని రెడ్డి, జగపతి బాబు వంటి దర్శక, నటుల కంట్రిబ్యూషన్ మొదలైపోయింది. తెలుగు భాష తరపునా ‘ఆహా’ అనే స్క్రీన్ లాంచ్ అయింది. కరోనాతో కలిసొచ్చిన కాలం.. ఫిల్మ్ దునియాలో ఓటీటీ ఒక విప్లవమే. సెన్సార్, డిస్ట్రిబ్యూషన్, థియేటర్ల తలనొప్పుల్లేకుండా ఓటీటీలో ప్లే చేసుకోవచ్చు. పైగా నెట్‌ఫ్లిక్స్, అమెజాన్లు సిరీస్, సినిమాలు నిర్మించడానికీ సిద్ధంగా ఉన్నాయి భారతీయ ప్రధాన భాషల్లో... కథ నచ్చితే. దీంతో త్వరలోనే ప్రధాన స్రవంతి సినిమా స్కోప్ తగ్గుతుందనే అంచనాలు మొదలయ్యాయి. కరోనా ఆ ‘త్వరలో’ అనే భవిష్యత్తును వర్తమానం చేసేసింది. సమూహాలు.. సమూహ ప్రదేశాలు నిషేధించింది. షూటింగ్స్ ఆగిపోయాయి. పూర్తయిన సినిమాలు థియేటర్లకు వెళ్లే సీన్ లేదు. అనివార్యంగా ఓటీటీయే కనిపించింది. ‘గులాబో సితాబో’ బోణీ చేసింది. అలా ఓటీటీకి కాలం కలిసొచ్చింది. ఆశావాదం ‘ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తప్పకుండా తెరిచే ఉంటుంది..’ అనే మాటను వింటూనే ఉంటాం. కరోనాతో సినిమాలు ఆగిపోతే... ఒటీటీ ఓపెన్ అయింది. దాని పట్ల ప్రేక్షకులకున్న క్రేజ్ కూడా అర్థమైంది. షూటింగ్‌లు ఆగిపోవడం తాత్కాలికమే (ఈ వ్యాసం రాస్తున్న సమయానికి వీటికీ గ్రీన్‌సిగ్నల్ వచ్చింది). ఇది మనకు మాత్రమే ఉన్న సమస్య కాదు.. ప్రపంచమంతా ఎదుర్కొంటున్నదే. కాబట్టి పరిష్కారమూ అంతే వేగంగా దొరుకుతుంది. ఎటొచ్చి కొంత సంయమనం.. కాస్తంత సహనం అవసరం. కాని ఇప్పుడంతా ఇన్స్టంట్ టైమ్.. వేచి చూసేంత ఓపిక లేదు. క్షణాల్లో ఫలితాలు కావాలి. లేకపోతే భయం.. ఆందోళన.. అభద్రత. దాన్నుంచే ఒత్తిడి.. వ్యాకులత. కుటుంబంతో గడిపితే ఉపశమనం కలుగుతుంది. సన్నిహితులతో చెప్పుకుంటే బరువు దిగుతుంది. ఆ షేరింగే మిస్ అయింది చాలా మంది సెలబ్రిటీల ఆత్మహత్యల కేసుల్లో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ సహా. కరోనాతో దారి మూసుకుపోయిందన్న దిగులా? ప్రత్యామ్నాయ వేదిక అనే మరో దారి తెరిచే ఉంది.. దాని కోసం నటించిన అనుభవమూ ఉందన్న ధీమాను పట్టుకోలేని నిస్సహాయతా? అమ్మానాన్న, తోబుట్టువుల ముందు బయటపడితే వాళ్లు టెన్షన్ పడతారేమోనన్న బాధా? ఆ మానసిక సంఘర్షణను స్నేహితులతో చెప్పుకొనీ గుండె నిండా ఊపిరి పీల్చుకోవచ్చు.. ఓస్ ఇంతేనా ఈ పటాటోపం అని పలుచన చేస్తారనే బెరుకా? అయినవాళ్ల దగ్గర ఇన్ని సంకోచాలెందుకు? మనసులో ఉన్నది చెప్పుకోవడానికి తటపటాయిస్తున్నామంటే ఆ చనువు, చొరవ మిస్ అయినట్టే. అంటే అవతలి వాళ్లను మనవాళ్లుగా చూడట్లేదనో.. మనవాళ్లనుకున్నవాళ్లు మనల్ని కేవలం విజేతలుగా మాత్రమే పరిగణిస్తున్నట్టో! ఆ అంతరమే మాటకు, చెవికీ వర్తించి మనసు ముడుచుకుపోయేలా చేస్తుంది. ఇన్సెక్యూరిటీ, యాంగై్జటీ తనను ఆక్యుపై చేస్తున్నా గాంభీర్యం ప్రదర్శించమని పోరుతుంది మెదడు. ఆర్జించిన పేరుప్రఖ్యాతుల మాయ ఇది. అందుకే ఆత్మీయులే ఈ స్పృహతో మెదలాలి. గ్లామర్ మేకప్ కింద తడి చారికలుంటాయి. వాటిని గమనించాలి.. మాటలతో ఆ మనసును కదిలించాలి.. చెవి ఒగ్గాలి. నెమ్మదిగా గూడు కట్టుకున్న దిగులు మాటలుగా కరగడం మొదలుపెడుతుంది. కన్నీళ్లుగా ఉబికి వస్తుంది. దుఃఖంతో బహిర్గతమవుతుంది. ఆ భావోద్వేగమంతా పోయి ఖాళీ అయిన గుండె ధైర్యంతో కొట్టుకోవడం మొదలుపెడుతుంది. నిర్భయంగా ముందుకు సాగేందుకు సన్నద్ధమవుతుంది నడక. జీవితానికి హ్యాపీ కంటిన్యుయేషనే... తర్వాత అవాంతరాలు ఉండవని కాదు.. లెక్కలోకి రావు అని. ఆత్మహత్యల జాబితా తగ్గుతుందీ అని. డిప్రెషన్ అంతు చూసిన తారలు తాను డిప్రెషన్లోకి వెళ్లానని.. సైకియాట్రిస్ట్, ఫ్యామిలీ సపోర్ట్‌తో బయటపడ్డానని మీడియా ముందు రివీల్ చేసి బాలీవుడ్లో స్టార్ డిప్రెషన్‌ను బయటపెట్టింది దీపికా పడుకోణ్. మానసిక అనారోగ్యం గురించి మాట్లాడితే పోయేదేమీ లేదు వ్యాకులత తప్ప అనే స్థైర్యాన్నీ తోటి సెలబ్రిటీలకు పంచింది. దీనిమీద అవగాహన కలిగించడానికి తన చెల్లి అనిషా పడుకోణ్‌తో కలిసి ‘ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్’ను స్థాపించింది. ప్రియాంక చోప్రా, పరిణీతి చోప్రా, అలియా భట్ వంటి తారలూ తాము డ్రిపెషన్‌ను ఎదుర్కొన్నామని, కుటుంబ సభ్యులు, స్నేహితుల సహాయంతో దాన్నుంచి రిలీవ్ అయ్యామనీ చెప్పారు. దృష్టికి రాని ఇలాంటి సెలబ్రిటీలు ఇంకెందరో ధైర్యమివ్వడానికి! – సరస్వతి రమ -
సరోజ్ ఖాన్ చివరి పోస్ట్ అతడి గురించే
ముంబై: దాదాపు నాలుగు దశాబ్దాలుగా బాలీవుడ్ హిట్ చిత్రాలకు నృత్య దర్శకురాలిగా పనిచేసిన ‘మాస్టర్జీ’ సరోజ్ ఖాన్(72) శుక్రవారం ఉదయం గండెపోటుతో కన్నుమూశారు. ‘మదర్ ఆఫ్ డ్యాన్స్’గా కీర్తింపబడే సరోజ్ ఖాన్ మృతి పట్ల బాలీవుడ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరో పెద్దదిక్కును కోల్పోయామని, ఆమె మరణం తీరని లోటని పలువురు బాలీవుడ్ ప్రముఖులు పేర్కొన్నారు. సరోజ్ మరణం అనంతరం ఆమె సోషల్ మీడియాలో చేసిన చివరి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. జూన్ 14న యువ కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై భావోద్వేగ పోస్ట్ చేశారు. (ప్రముఖ కొరియోగ్రాఫర్ కన్నుమూత) ‘నేను మీతో ఎప్పుడూ పని చేయలేదు కానీ చాలాసార్లు కలుసుకున్నాం. నేను మీ అన్ని చిత్రాలను చూశాను. మీరన్నా, మీ చిత్రాలన్నా నాకెంతో ఇష్టం. అయితే మీ జీవితంలో ఏం పొరపాటు జరిగింది? మీరు మీ జీవితానికి సంబంధించి తీసుకున్న ఈ నిర్ణయంతో తీవ్ర షాక్‌కు గుర్యయ్యాను. నీ కష్టాలను, బాధలను పెద్దవాళ్లతో పంచుకుంటే పరిస్థితి వేరేలా ఉండేది. అప్పుడు మీ కుటుంబ పరిస్థితి ఎంటో నాకు తెలియదు. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. సుశాంత్ కుటుంబానికి నా ప్రగాఢ సానభూతి తెలుపుతున్నాను’ అంటూ సుశాంత్ మృతి పట్ల సరోజ్ ఖాన్ తన సంతాపం తెలిపారు. (బాలీవుడ్లో విషాదం: గుండెపగిలే వార్త) కాగా 200కు పైగా సినిమాలకు కొరియోగ్రఫి అందించిన సరోజ్ ఖాన్ చివరగా 2019లో కరణ్ జోహర్ తెరకెక్కించిన ‘కళంక్’ సినిమాకు పనిచేశారు. 1950వ దశకంలో బాలనటిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సరోజ్‌ఖాన్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా మారి మంచి గుర్తింపు పొందారు. మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిన ‘తేజాబ్’ చిత్రంలోని ‘ఏక్.. దో.. తీన్’ పాటకు సరోజ్ ఖానే కొరియోగ్రఫీ చేశారు. హిందీలో వచ్చిన దేవదాస్ చిత్రంలోని ‘డోలా రే డోలా’ పాటకు 2003లో, శృంగారం సినిమాలోని అన్ని పాటలకు 2006లో, ‘జబ్ వి మెట్’లోని ‘యే ఇష్క్ హాయే’ గీతానికి 2008లో.. అమె జాతీయ అవార్డులు అందుకున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ సినిమాకు కూడా ఆమె కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఈ చిత్రానికిగాను ఆమె 1998లో నంది అవార్డు దక్కించుకున్నారు. View this post on Instagram I had never worked with you @sushantsinghrajput but we have meet many times. What went wrong in your LIFE?I'm shocked that you took such a drastic step in your LIFE. You could have spoken to an Elder which could have helped YOU and would have kept us Happy looking at YOU. God bless your soul and I don't know what your Father and Sister's are going through. Condolences and Strength to them to go through this Time. I Loved you in all your Movies and will always Love you. R.I.P🙏🙏 A post shared by Saroj Khan (@sarojkhanofficial) on Jun 14, 2020 at 7:27am PDT -
సడక్-2కు సుశాంత్ ఫ్యామిలీ ఝలక్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్లో బంధుప్రీతి(నెపోటిజం)పై విస్తృత చర్చ లేవనెత్తింది. బాలీవుడ్లో స్టార్ కిడ్స్‌కు ఇచ్చిన ప్రాధాన్యత సుశాంత్‌కు ఇవ్వలేదన్న వాదన బలంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఎందరో బాలీవుడ్ ప్రముఖులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. వీరిలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తితో కలిసి తిరిగిన దర్శకుడు, చిత్ర నిర్మాత మహేశ్ భట్ కూడా ఒకరు. ఆయన బుధవారం సోషల్ మీడియాలో "సడక్-2" చిత్ర పోస్టర్‌ను విడుదల చేశాడు. హీరోయిన్ అలియాభట్ నటించిన ఈ సినిమా పోస్టర్ లుక్కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదిలా ఉంటే సుశాంత్ కుటుంబ సభ్యులు బాలీవుడ్ చిత్రాల్లో ఎంతవరకు నెపోటిజమ్ ఉందన్న విషయాన్ని గుర్తించేందుకు గురువారం "నెపోమీటర్"ను ప్రారంభించారు. ఇది ఐదు కేటగిరీలను ప్రధానంగా పరిగణనలోకి తీసుకుంటుంది. (పాట్నాలో సుశాంత్ మెమోరియల్) నిర్మాత, ప్రధాన పాత్రలు, ఇతర పాత్రలు, దర్శకుడు, రచయిత ఆధారంగా సినిమాలో ఎంతమేరకు బంధుప్రీతి ఉందో నిరూపిస్తూ ఫలితాన్ని వెల్లడిస్తుంది. దీనికోసం సోషల్ మీడియాలో నెపోమీటర్ అని అకౌంట్ కూడా క్రియేట్ చేశారు. అందులో అలియాభట్ సడక్-2 చిత్రం 98% నెపోటిస్టిక్ అని తెలిపింది. అంటే ఈ చిత్రంలో ఐదు కేటగిరీల్లోని నాలిగింట్లో బాలీవుడ్ ప్రముఖుల వారసులే ఉన్నారని స్పష్టం చేసింది. బాలీవుడ్లో నెపోటిజమ్ రూపుమాపాలన్న ప్రయత్నంతోనే దీన్ని ప్రవేశపెట్టామని సుశాంత్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. బయట నుంచి వచ్చేవారికి అవకాశాలు ఇవ్వని సినిమాలు చూడవద్దని అభిమానులను కోరారు. కాగా నెపోమీటర్ ఎక్కువ శాతాన్ని చూపిస్తే అది అందులో స్టార్ల కుటుంబ సభ్యులు అధికంగా ఉన్నట్లు.. తక్కువగా చూపిస్తే ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేని వారు సినిమాలో ఎక్కువగా ఉన్నట్లు అర్థం. (సుశాంత్ ఆత్మహత్యపై మరిన్ని అనుమానాలు) View this post on Instagram #Sadak2 is 98% Nepotistic. We rated it based on 5 categories, Producer, Lead Artists, Supporting Artists, Director & Writer. 4 out of 5 categories have Bollywood Family members. When #nepometer is high, it’s time to #boycottbollywood Will you watch this movie? Tell us in comments. A post shared by Nepometer (@nepometer) on Jul 1, 2020 at 9:43pm PDT -
'కంగనా.. నీకు ఆ అర్హత లేదు'
చెన్నై : ‘నీకు ఆ.. అర్హతే లేదు’ అంటూ తమిళ నటి మీరా మిథున్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విరుచుకుపడింది. 8 తూటాకల్ తదితర కొన్ని చిత్రాల్లో నటించిన మీరా మిథున్ వివాదాస్పద నటిగా ముద్ర వేసుకుంది. ఫ్యాషన్ షో నిర్వహించి పలు ఆరోపణలను మూటకట్టుకుంది. ఈమెపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల బిగ్‌బాస్ 3 రియాలిటీ షో లో కూడా పాల్గొని తనదైన ముద్ర వేసింది. ఎప్పుడూ ఏదో అంశంపై స్పందిస్తూ వార్తల్లో ఉండే మీరా తాజాగా బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై విమర్శలు గుప్పించి వార్తల్లో నానుతోంది. నటి కంగనా రనౌత్ దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రతో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈమె ఇటీవల బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య సంఘటనఫై స్పందిస్తూ వారసత్వం తారల ఆధిక్యాన్ని ఖండిస్తూ తీవ్రంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. కాగా నటి మీరా మిథున్ కంగనా రనౌత్ ఫై తీవ్రంగా విమర్శలు చేసింది. అసలు నీకు జయలలిత పాత్రలో నటించే అర్హతే లేదని నటి మీరా మిథున్ పేర్కొంది. ఆ పాత్రకు కంగనను ఎంపిక చేయటమే పెద్ద తప్పని అంది. అదే విధంగా నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య వ్యవహారం ఫై అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నావ్.. అంటూ దుయ్యపట్టింది. కాగా, మీరా మిథున్ విమర్శలపై నటి కంగన రనౌత్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
‘సుశాంత్‌తో నేను మాట్లాడితే అలా జరిగేది కాదేమో’
కరాచీ: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన జీవితంలో వచ్చే సమస్యలు ఎలా ఎదుర్కొవాలో అనే విషయాన్ని తెలియజేయడంతో పాటు సుశాంత్ ఆత్మహత్యపై కూడా స్పందించారు. ఈ విషయంపై అక్తర్ మాట్లాడుతూ, ‘సుశాంత్ మరణం నన్ను కలిచివేసింది. ఒక విషయం నన్ను ఇంకా బాధపడేలా చేసింది. అదేంటంటే నేను సుశాంత్‌ను ముంబైలో కలిశాను. అప్పుడు సుశాంత్ పొడుగైన జుట్టుతో ఉన్నాడు. అప్పుడు కొంత మంది అతను ఎంఎస్ ధోని సినిమాలో నటిస్తున్నాడని చెప్పారు. అయినప్పటికీ నేను అతనితో మాట్లాడకుండా వెళ్లిపోయాను. అప్పుడు నేను సుశాంత్‌తో మాట్లాడి ఉంటే నేను జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యలను అతనితో పంచుకునే వాడిని. అతనికి జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం వచ్చేది. నేను సుశాంత్‌తో మాట్లాడనందుకు చాలా బాధపడుతున్నాను’ అని తెలిపారు. (‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’) ఇంకా అక్తర్ మాట్లాడుతూ, మనకి బాధ, డిప్రెషన్ ఉన్నప్పుడు మనకి సన్నిహితంగా ఉన్నవారితో పంచుకుంటే కొంత వరకు బయట పడొచ్చని చెప్పారు. హీరోయిన్ దీపిక పదుకొనే కూడా డిప్రెషన్, యాంగ్జైటీతో బాధపడేదని, కానీ ఆ విషయాన్ని అందరికి చెప్పి బయట పడిందని తెలిపారు. సుశాంత్ కూడా డిప్రెషన్‌కు చికిత్స తీసుకుంటూ, ధైర్యంగా ఉండే తన సన్నిహితులతో సమస్యలు పంచుకొని ఉండాల్సిందని, అప్పుడు ఇలా జరిగి ఉండేది కాదోమో అని అక్తర్ విచారం వ్యక్తం చేశారు. (సుశాంత్ మరణం: సల్మాన్ విన్నపం) -
‘సుశాంత్ కోసం తన జీవితాన్నే ఇచ్చేసింది’
ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కోసం మాజీ ప్రేయసి అంకితా లోఖండే తన జీవితాన్ని అంకితం చేసిందని సుశాంత్ స్నేహితుడు సందీప్ సింగ్ అన్నారు. అంకితా మాత్రమే సుశాంత్‌ను నిజంగా అర్థం చేసుకుందని ఆయన పేర్కొన్నారు. అసలు రియా చక్రవర్తిని పెళ్లి చేసుకోవాలన్న సుశాంత్ ఆలోచన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు. కాగా ఈ నెల 14 సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకొని అర్థాంతరంగా తనువు చాలించిన విషయం తెలిసిందే. అయితే కెరీర్ పరంగా సమస్యలు తలెత్తడంతో తీవ్ర మానసిక ఒత్తిడి కారణంగానే సుశాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అందరూ భావిస్తున్నారు. (సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫౌండేషన్ : కీలక ప్రకటన) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ.. సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు తనకు చెప్పలేదని వెల్లడించారు. సుశాంత్ ఇంట్లో ఎప్పుడూ కొంతమంది వ్యక్తులు ఉండేవారన్నారు. తానెప్పుడూ సుశాంత్‌తో ఫోన్ కాల్స్ ద్వారా టచ్‌లో ఉండే వాడని పేర్కొన్నారు. రియా చక్రవర్తితో సుశాంత్ రిలేషన్ గురించి అడగ్గా.. ‘వాళ్లు పెళ్లి చేసుకుంటారని నాకు తెలీదు. ఆ పెళ్లి గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. నాకు నిజంగా తెలీదు. ఒకానొక సమయంలో సుశాంత్, అంకితా పెళ్లి చేసుకోవాల్సి ఉండేది. నాకు తెలిసినంతవరకు అదే సుశాంత్ చివరి రిలేషన్ అనుకుంటా’. అని తెలిపారు.(తను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు: సుశాంత్ తండ్రి) సుశాంత్‌ను అంకితా స్నేహితురాలుగా కాకుండా తన తల్లిగా చూసుకునేదని సందీప్ అన్నారు. అంకితా గురించి మాట్లాడుతూ.. ‘ఆమె సుశాంత్ జీవితంలో తన తల్లి స్థానాన్ని పొందింది. నా 20 ఏళ్ల సినీ పరిశ్రమలో అంకితా లాంటి అమ్మాయిని చూడలేదు. అంత మంచి అమ్మాయి. సుశాంత్‌కు ఎల్లప్పుడూ జాగ్రత్తగా చూసుకునేది. తన కోసం ఏమైనా చేస్తుంది. సుశాంత్‌కు అనుగుణంగా మెలిగేది. అనికి నచ్చిన ఫుడ్‌ను వండి పెట్టేది. అంకితా తన ఇంటిని సుశాంత్‌కు నచ్చే విధంగా డిజైన్ చేసుకుంది.సుశాంత్ కోసం తన కెరీర్‌ను వదులుకుంది. ఇలా ప్రతిదీ సుశాంత్ ఇష్టం మేరకే చేసేది. అంకితా లాంటి అమ్మాయిని పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇటీవల తనతో మాట్లాడాను అంకితా ఎంత బాధపడుతుందో నాకు తెలుసు’. అంటూ ముగించారు. (‘సుశాంత్‌ను అందుకే తొలగించారా!’) -
సోను నిగమ్‌పై వీడియో ద్వారా ప్రతిదాడి
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత బాలీవుడ్లో మాటల దాడులు కొనసాగుతున్నాయి. ఆరోపణలూ ప్రత్యారోపణలు వేడి మీద ఉన్నాయి. ‘నెపొటిజమ్’ (పక్షపాతం) ఎవరు ఎవరి పట్ల వహిస్తే ఎవరికి అన్యాయం జరుగుతున్నదో కూడా మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో గాయకుడు సోనూ నిగమ్ ‘ఆత్మహత్యలు నటీనటుల్లోనే కాదు ఇక మీదట గాయకుల్లో, సంగీత దర్శకుల్లో కూడా మనం చూడాల్సి వస్తుంది. ఆడియో కంపెనీల నిరంకుశ వైఖరి ఇందుకు కారణం’ అని కామెంట్ చేశాడు. ఇది ‘టి సిరీస్’ సంస్థను, దాని అధిపతి అయిన భూషణ్ కుమార్‌ను ఉద్దేశించినది. సోను నిగమ్ అంతటితో ఆగకుండా ‘భూషణ్ 20 ఏళ్ల క్రితం నా దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షించమని కూడా వచ్చాడు’ అన్నాడు. టి. సిరీస్ సంస్థ అధినేత గుల్షన్ కుమార్ 1997లో మాఫియా దాడిలో హతమయ్యాడు. అప్పటికి ఆయన కుమారుడైన భూషణ్ వయసు 18 సంవత్సరాలు. అయినప్పటికీ భూషణ్ సంస్థ పగ్గాలు చేపట్టాడు. సంస్థను నిలబెట్టాడు. పెద్ద నిర్మాతగా కూడా ఉన్నాడు. సోను నిగమ్ ఆరోపణలకు భూషణ్‌కుమార్ బదులివ్వలేదు. కాని అతని భార్య దివ్యా ఖోస్లా కుమార్ మాత్రం ఆగ్రహంతో అపర కాళిగా మారింది. తన భర్త మీద ఆరోపణలు చేసిన సోను నిగమ్ మీద వీడియో ద్వారా ప్రతిదాడికి దిగింది. ఒక వేడుకలో గాయకుడు సోను నిగమ్, టి సిరిస్ అధినేత భూషణ్ కుమార్, దివ్యా ఖోస్లా ‘సోనూ నిగమ్ గారూ. టి సిరీస్ సంస్థ ఎందరో గాయకులకు, సంగీత దర్శకులకు బ్రేక్ ఇచ్చింది. ఢిల్లీలో మీరు ఐదు రూపాయలకు కచ్చేరి ఇస్తున్న రోజుల్లో మా మామగారు గుల్షన్ కుమార్ గారు మిమ్మల్ని స్పాట్ చేసి బాంబే పిలిపించి గాయకుడిగా అవకాశం ఇచ్చారు. కాని ఆయన చనిపోయినప్పుడు సంస్థ మునిగిపోతుందని భావించిన మీరు టి సిరీస్‌తో కాకుండా మరో మ్యూజిక్ కంపెనీతో కాంటాక్ట్‌లోకి వెళ్లారు. ఇదా మీరు చేయాల్సింది. అసలు మీరు ఇంత పెద్ద గాయకులు అయ్యారు కదా మీరు ఎంతమంది కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చారు? మిమ్మల్ని మీరు చూసుకోవడం తప్ప ఎవరికీ ఏమీ చేయలేదు. ఇక మీరు అండర్ వరల్డ్ ప్రస్తావన తెచ్చారు. మావారు మీ దగ్గరకు అబూ సలేమ్ నుంచి రక్షణ కోసం వచ్చారని చెబుతున్నారు. అంటే మీకు అండర్ వరల్డ్‌తో లింక్స్ ఉండేవా? దీనిమీద ప్రభుత్వం విచారణ జరిపించాలని కోరుతున్నాను. మీరు చేస్తున్న ఆరోపణల వల్ల సోషల్ మీడియాలో నా భర్త మీద, నా మీద, నా సంతానం మీద కామెంట్స్ వస్తున్నాయి. ఇది చాలా తప్పు. అవకాశాలు అందరికీ ఇవ్వలేము. అవకాశాలు దొరకని వాళ్లు ఆరోపణలకు దిగితే ఎవరూ మిగలరు. ఇక మీదటైనా మీ ఆరోపణలు బంద్ చేసుకోండి’ అని గట్టిగా హెచ్చరించింది దివ్యా ఖోస్లా. ఈ భార్య చెప్పిన బదులు ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Divyakhoslakumar (@divyakhoslakumar) on Jun 24, 2020 at 7:23am PDT -
ఇది అన్యాయం
‘‘ఇలా జరగడానికి వీల్లేదు. సుశాంత్ ఆత్మకు శాంతి చేకూరాలంటే, అతనికి నిజమైన నివాళి ఇవ్వాలంటే ‘దిల్ బేచారా’ సినిమాని థియేటర్లో విడుదల చేయాల్సిందే. లేకపోతే తనకు అన్యాయం చేసినవాళ్లు అవుతారు’’ అంటూ పలువురు నెటిజన్లు ‘దిల్ బేచారా’ నిర్మాతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా ఇది. ఈ చిత్రాన్ని జూలై 24న ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ నిర్ణయం సుశాంత్ అభిమానులను నిరుత్సాహపరిచింది. ‘‘సుశాంత్‌ని చివరిసారిగా బిగ్ స్క్రీన్ మీద చూసే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఇది మా విన్నపం’’ అంటున్నారు ఫ్యాన్స్. ‘ఫాక్ప్ స్టార్ స్టూడియోస్’ నిర్మించిన ఈ చిత్రాన్ని డిస్నీ, హాట్‌స్టార్ విడుదల చేయనున్నాయి. మరి.. ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంపట్ల సుశాంత్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి, సంస్థ అధినేతలు నిర్ణయాన్ని మార్చుకుంటారా? వేచి చూడాలి. సుశాంత్ గత చిత్రం ‘డ్రైవ్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. -
సుశాంత్ చివరి చిత్రం.. ఫ్రీగా చూడొచ్చు
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై యావత్ దేశం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. నేటికీ ఆయన అభిమానులు సుశాంత్‌ను తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. ఇక సుశాంత్ చివరిసారిగా నటించిన "దిల్ బేచారా" చిత్రం విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. ఇది "ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్"కు రీమేక్. తాజాగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో జూలై 24న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా "ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమూహారమే ఈ కథ. సుశాంత్ నటించిన ఈ సినిమా అందరి మనసులో చిరస్థాయిగా నిలుస్తుంది" అంటూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ట్వీట్ చేసింది. క్యాస్టింగ్ డైరెక్టర్ ముఖేశ్ చాబ్రా తొలిసారి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుశాంత్ సరసన సంజనా సాంఘి నటించింది. ఈ సినిమా అందరూ ఉచితంగా చూడొచ్చని సంజనా పేర్కొంది. (సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?) దర్శకుడు ముఖేశ్ మాట్లాడుతూ.. "సుశాంత్ నా సినిమాలో హీరోనే కాదు, నా స్నేహితుడు కూడా. 'కాయ్ కో పీచే' నుంచి 'దిల్ బేచారా' వరకు అతనేంటో నాకు తెలుసు. నేను దర్శకత్వం వహించే తొలి సినిమాలో అతను నటిస్తాడని నాకు మాటిచ్చాడు. మేమిద్దరం ఎన్నో కలలు కన్నాం, మరెన్నో ప్లాన్లు వేసుకున్నాం. కానీ అవన్నీ అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు ఒంటరిగా ఈ సినిమా రిలీజ్ చేస్తున్నా" అని భావోద్వేగానికి లోనయ్యాడు. సుశాంత్ గత చిత్రం 'డ్రైవ్'ను నిర్మాత కరణ్ జోహార్ ఓటీటీలోనే రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆఖరు చిత్రాన్నైనా థియేటర్లో విడుదల చేయాలని అభిమానులు కోరినప్పటికీ నిర్మాతలు ఓటీటీకే మొగ్గు చూపారు. (అమ్మా.. మన ఇద్దరం తప్పనుకుంటా: సుశాంత్) -
సుశాంత్ కుక్క మరణం: నిజమేనా?
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం దేశవ్యాప్తంగా ఎంతోమందిని కుంగదీసిన విషయం తెలిసిందే. అతడి మరణాన్ని తట్టుకోలేక కొందరు అభిమానులు ప్రాణాలు సైతం తీసుకున్నారు. ఈ క్రమంలో సుశాంత్ ఇంట్లో ఉంటే క్షణం వదిలిపెట్టకుండా వెన్నంటే తోకూపుకుంటూ తిరిగే అతడి కుక్క కూడా చనిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి. అతడు ఈ లోకం నుంచి నిష్క్రమించిన నాటి నుంచి ఆ కుక్క తిండీనీళ్లూ మానేసి మౌనంగా రోదిస్తోందంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నిజానిజాలు తెలుసుకోకుండానే ఎంతోమంది ఆ శునకం చనిపోయిందని నమ్ముతూ నివాళులు సైతం అర్పిస్తున్నారు. వాస్తవమేంటంటే.. సుశాంత్ పెంచుకున్న కుక్క ఫడ్జ్ చనిపోలేదు. (సుశాంత్ నా బిడ్డగా పుట్టబోతున్నాడు: నటి) అతడు శాశ్వతంగా వీడ్కోలు తీసుకున్న రోజు నుంచి అది దిగులుగానే ఉంది. సుశాంత్ ఇక తిరిగి రాడని తెలీక ఇప్పటికీ అతడి కోసం ఎదురుచూస్తూనే ఉంది. అయితే సోషల్ మీడియా దుష్ప్రచారం ప్రకారం అది మరణించలేదు. దీనితోపాటు సుశాంత్ పెంచుకుంటున్న నాలుగు కుక్కలు ఆరోగ్యంగానే ఉన్నాయని అతని బంధువు ఒకరు వెల్లడించారు. కాగా సుశాంత్ ఫడ్జ్‌తో కలిసి ఆడుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను కంటతడి పెట్టిస్తోంది. ఫోన్లో సుశాంత్ ఫొటోను తదేకంగా చూస్తున్న ఫడ్జ్ ఫొటో చూసిన నెటిజన్ల గుండె బరువెక్కుతోంది. (సుశాంత్‌కు గొప్ప నివాళి) -
సుశాంత్ మరణంపై డబ్బు సంపాదించడం భావ్యమా!
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై చిత్ర పరిశ్రమ ఇంకా కోలుకోలేకపోతోంది. ఈ యంగ్ హీరో మరణంతో ఇండస్ట్రీలోని అనేక చీకటి కోణాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్లో నెపోటిజమ్‌పై ఇప్పటి వరకు సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ కొనసాగుతోంది. ఇండస్ట్రీలో వారసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు వెల్లువెత్తగా, తాజాగా బాలీవుడ్ స్థార్ దీపికా పదుకొనే సుశాంత్ మరణంపై ఓ ఫోటోగ్రాఫర్పై మండిపడ్డారు. (సల్మాన్ ట్వీట్: విమర్శలు గుప్పించిన సింగర్!) ఇండస్ట్రీలో ఫోటో గ్రాఫర్ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సెలబ్రిటీల ఫోటోలు, వీడియోలను అభిమానులకు చేరవేయడంతో వీరు ముందుంటారు. సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడ కనిపించినా ఫోటోగ్రాఫర్లు వారిని క్లిక్‌మనిపించేందుకు తెగ ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ ఫోటోగ్రాఫర్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ అంతియ యాత్రకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో సుశాంత్ మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. దీనిపై సదరు ఫోటోగ్రాఫర్ ఇలా పేర్కొన్నాడు. దయచేసి నా ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్‌ఫామ్‌లోనూ పోస్ట్ చేయరాదు' అంటూ రాసుకొచ్చారు. (జీవితం చాలా చిన్నది నన్బా : కీర్తి) అయితే దీనిపై స్పందించిన దీపికా పదుకొనే.. 'అవునా. మీకు ఈ వీడియో తీయడం సరైనదేనా?. సుశాంత్ కుటుంబం అనుమతి లేకుండా దీనిని సోషల్ మీడియోలో పోస్ట్ చేయడమే కాకుండా దీని ద్వారా డబ్బు సంపాదించడం భావ్యమేనా..' అంటూ దీపికా ప్రశ్నించారు. ఇక దీపికా మాట్లాడిన తీరుపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇలాంటి విషయాన్ని ప్రస్తావించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. (సుశాంత్ నెలకు ఎంత ఖర్చు చేస్తారంటే..?) -
సుశాంత్ మరణం: మరో అభిమాని ఆత్మహత్య
లక్నో: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఇక లేడన్న వార్తను ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆత్మహత్యను తట్టుకోలేక ఇప్పటికే పలువురు అభిమానులు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన మరో అభిమాని శనివారం బలవన్మరణానికి పాల్పడ్డ విషయం ఆలస్యంగా తెలిసింది. గ్రేటర్ నోయిడాకు చెందిన పన్నెండేళ్ల బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. సుశాంత్ ఆత్మహత్య అతన్ని తీవ్రంగా కుంగదీసింది. (సుశాంత్ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్) దీంతో మనోవేదనకు గురైన బాలుడు శనివారం తన గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ ఎలాగైతే చనిపోయాడో అలాగే ఆ బాలుడు కూడా ఉరివేసుకుని మరణించాడు. కాగా అతడు గదిలోకి వెళ్లడానికి కొన్ని క్షణాల ముందు టీవీలో సుశాంత్‌కు సంబంధించిన వార్తలే చూశాడని బాలుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. జూన్ 14న సుశాంత్ ఆత్మహత్య చేసుకోగా.. అతడి మరణవార్తను తట్టుకోలేక విశాఖపట్నంకు చెందిన ఓ అమ్మాయి, ఒడిశాకు చెందిన ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. (సుషాంత్ మరణం తట్టుకోలేక యువతి ఆత్మహత్య) -
సుశాంత్ మాజీ ప్రియురాలి ఫోటోలు వైరల్
ముంబై: హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయి వారం దాటుతున్న బాలీవుడ్లో మాత్రం ఇంకా ఆ మంటలు చల్లారలేదు. ప్రస్తుతం సుశాంత్ మరణానికి సంబంధించిన కొత్త విషయం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సుశాంత్ మాజీ ప్రేయసి రియా చక్రవర్తి, మహేష్ భట్ కలిసివున్న పాత ఫోటోలు సామాజిక మాధ్యమాలలో తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. దీనితో పాటు సుశాంత్ చనిపోవడానికి ముందు అతని ఫ్లాటులో సీసీ కెమెరాలు ఆఫ్ చేయబడ్డాయని, కొంత మంది స్నేహితులు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు రోజు రాత్రి అతని గదికి వచ్చినట్లు చెబుతున్నారు. అప్పుడు అతని ఫ్లాట్ నుంచి ఒక శబ్ధం వినిపించిందని, కానీ అది డిప్రషన్లో అరిచే అరుపు కాదని అంటున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: స్పందించిన సల్మాన్) సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తాడు మీద అతని చూపుడు వేలు, మధ్యవేలు, చిటికెన వేలు గుర్తులు మాత్రమే ఉన్నాయని మిగిలిన వేలి గుర్తులు లేవని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాటు సుశాంత్ ఆత్మహత్యకు ముందు రియా చక్రవర్తి సుశాంత్‌తో ఉన్న ఫోటోలన్నింటిని సోషల్ మీడియా నుంచి తొలగించినట్లు కూడా వైరల్ వీడియోలో ఉంది. ఇంకా సుశాంత్ ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడని మహేష్‌భట్ అన్నారని అది ఈ రోజు నిజమయ్యిందని, రియాతో సన్నిహితంగా ఉంటే చంపేస్తామని సుశాంత్‌ను ఎవరో బెదిరించినట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో రియా, మహేష్ భట్ కలిసి ఉన్న ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ విషయాలు ఎంత వరకు నిజమో పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. రియాను సుశాంత్ చనిపోయిన తర్వాత పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. (సుశాంత్ ఆత్మహత్య: పీఎస్‌కు హీరోయిన్) -
సుశాంత్ ఆత్మహత్య: స్పందించిన సల్మాన్
బాలీవుడ్లో పెద్దల పెత్తనాన్ని ఎండగడుతున్నారు. బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారికే బాలీవుడ్లో ప్రోత్సాహం లభిస్తుందా? అంటూ సినీ ప్రముఖుల తీరును విమర్శిస్తున్నారు. బంధుప్రీతిపై మండిపడుతున్న సినీ ప్రేక్షకలోకం ఒక్కసారిగా గొంతెత్తి ప్రశ్నించడానికి కారణం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. 'అతని ప్రతిభకు గుర్తింపు లేదు, అతడిని పైకి రాకుండా అణగదొక్కారు!' అంటూ ఆయన అభిమానులు కడుపు మంటతో రగిలిపోతున్నారు. దీనికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో కారణమైన సెలబ్రిటీలను అన్‌ఫాలో అవుతూ వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. (సల్మాన్‌ఖాన్ (బాలీవుడ్) రాయని డైరీ) ఈ సెగ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కూ తగిలింది. దీనిపై సల్మాన్ తొలిసారిగా స్పందించాడు. సుశాంత్ ఫ్యాన్స్‌కు మద్దతుగా ఉండాలని తన అభిమానులను కోరాడు. ఈమేరకు శనివారం రాత్రి ట్వీట్ చేశాడు. "అభిమానులందరికీ ఓ విజ్ఞప్తి. మీరందరూ సుశాంత్ అభిమానులకు మద్దతుగా నిలబడాలి. ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకోవడం సరికాదు. వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోండి.. ప్రేమించే వ్యక్తిని కోల్పోయిన బాధలో ఉన్న సుశాంత్ కుటుంబానికి, ఆయన అభిమానులకు తోడుగా ఉండండి" అని అభ్యర్థించాడు. (ఐ వాన్న అన్‌ఫాలో యు) -
‘అక్షయ్‌ని కాదని సుశాంత్‌ను తీసుకున్నాను’
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబైలో కన్ను మూసిన సంగతి తెలిసిందే. డిప్రెషన్‌తో బాధపడుతున్న సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఈ క్రమంలో ధోని బయోపిక్కు సంబంధించి ఓ ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. మాజీ భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని బయోపిక్ ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’లో ప్రధాన పాత్ర కోసం తనను తీసుకోవాల్సిందిగా అక్షయ్ కుమార్ ఆ చిత్ర దర్శకుడు నీరజ్ పాండేను కోరినట్లు సమాచారం. ఈ క్రమంలో 2017లో ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ.. ‘నీరజ్ పాండే ధోని బయోపిక్ తెరకెక్కిస్తున్నారని నాకు తెలిసింది. దాంతో ఆ చిత్రంలో ధోని పాత్ర కోసం నన్ను తీసుకోవాల్సిందిగా నీరజ్‌ను కోరాను. కానీ అతడు సున్నితంగా తిరస్కరించాడు’ అని తెలిపారు. ‘ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ధోని పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన సంగతి తెలిసిందే. (ఐ వాన్న అన్‌ఫాలో యు) దీనిపై నీరజ్ పాండే స్పందిస్తూ.. ‘ఈ చిత్రంలో ధోని యుక్తవయస్సులో వచ్చే సన్నివేశాలు కూడా ఉంటాయి. 16-17 ఏళ్ల యువకుడిగా నటించాల్సి ఉంటుంది. ఆ వెర్షన్ అక్షయ్‌కు సూట్ కాదు. అందుకే అతడి అభ్యర్థనను తిరస్కరించాను’ అన్నాడు. అంతేకాక ఈ చిత్రంలో సుశాంత్ నటన గురించి మాట్లాడుతూ.. ‘తను చాలా మంచి నటుడు. ఈ పాత్ర గురించి చెప్పినప్పుడు సుశాంత్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. స్క్రిప్ట్‌ను పూర్తిగా చదివాడు. ధోని బాడీ లాంగ్వేజ్‌ను ఎంతో బాగా అనుకరించాడు’ అని తెలిపారు. ‘ఎమ్ఎస్ ధోని: అన్‌టోల్డ్ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఈ చిత్రం 133 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సుశాంత్ నటనను విమర్శకులు సైతం ప్రశంసించారు. (ఆయన మరణాన్ని నమ్మలేకపోతున్నాం) -
అమ్మకు తోడు
'డిప్రెషన్’ గురించి ఇప్పుడు చర్చ ఎక్కువగా నడుస్తోంది. మనసులోకి వెలితి ఎప్పుడు అడుగు పెడుతుందో తెలియదు. ముఖ్యంగా అయినవారిని కోల్పోయినప్పుడు. రిషి కపూర్ మరణంతో నీతూ కపూర్ కచ్చితంగా ఒక ఖాళీని అనుభూతి చెందుతూ ఉంటుంది. అందుకే కుమార్తె రిథిమ కపూర్ తండ్రి మరణించినప్పటి నుంచి తన అత్తవారిల్లు ఢిల్లీని వదిలి ఆమెతోనే ఉంటోంది. అంతే కాదు ఇప్పుడు తల్లికి ఒక కుక్కపిల్లను బహూకరించింది. నీతూసింగ్ ఆ కుక్క పిల్లను తన కుటుంబ సభ్యునిగా సంతోషంగా స్వీకరించింది. అంతేకాదు, దానికి ‘డూడుల్ కపూర్’ అని పేరు కూడా పెట్టుకుంది. దేనికీ ఏదీ ప్రత్యామ్నాయం కాదు. కాని మనసును దారి మళ్లించడానికి ప్రతిదీ ఉపయోగపడుతుంది. డిప్రెషన్లో ఉన్నవారిని పూలతోట పెంచమని అంటూ ఉంటారు. కుక్కపిల్లలను పెంచుకోవడం కూడా యాంటీ డిప్రెసెంటే. నీతూకు ఈ కుక్కపిల్ల మంచి ఓదార్పు కానుంది.(ఐ వాన్న అన్‌ఫాలో యు) -
చనిపోయే ముందు సుశాంత్ ఔదర్యం!
ముంబాయి: సుశాంత్ సింగ్‌రాజ్‌పుత్ మరణం బాలీవుడ్లో మాత్రమే కాకుండా అందరిని ఎంత శోకసంద్రంలో ముంచిదో తెలిసిందే. సుశాంత్ మరణానికి సంబంధించిన విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో సుశాంత్‌కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుంచే తనని తాను సన్నద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. చనిపోవడానికి మూడు రోజుల ముందే ఇంట్లో పనివారిని, తాను డబ్బులు ఇవ్వాల్సిన వారికి ఇచ్చేసినట్లు ఇంట్లో పనివారు పోలీసులకు తెలిపారు. ('సుశాంత్ కాంట్రాక్ట్ ముగిసింది.. నువ్వు కూడా') ఇవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువే ఇచ్చి ఇంకా తాను వారికి జీతాలు ఇవ్వలేనని చెప్పినట్లు వారు పోలీసులకు తెలిపారు. ఇన్ని రోజులు తన బాగోగులు చూసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు. ఆర్థికంగా తాను ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇంట్లో పనివారు కరోనా కారణంగా ఇబ్బంది పడటం చూసి వారికి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే సాయం చేయడం బట్టే సుశాంత్ మంచి తనం అర్థం అవుతుందని ఆయన అభిమానులు అంటున్నారు. (సుషాంత్ మరణం టిక్‌టాక్‌లో చూసి..) -
అన్‌ఫాలో స్టార్ కిడ్స్‌పై బాబిల్ స్పందన..
ముంబై : అప్పటి వరకు అడపాదడపా ఉన్న సమస్య ఒక్కసారిగా ఉవ్వెత్తున లేచింది. ఇన్ని రోజులు దీని ప్రస్తావన సినీ పరిశ్రమలో ఉన్పప్పటికీ ఇంత భారీ స్థాయిలో లేదు. అదే నెపోటిజమ్(బందుప్రీతి). బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంతో ఈ వివాదం కాస్తా వాడివేడి చర్చకు దారి తీసింది. కేవలం స్టార్ కిడ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఎదుగుతున్నారని, ప్రతిభ ఉన్న సామాన్యులకు సినిమా అవకాశాలు ఇవ్వడం లేదని వాదన ఎక్కువగా వినబడుతోంది. ఇక బాలీవుడ్లో ఉన్న నెపోటిజమ్ కారణంగానే సుశాంత్ నిరాశకు గురయ్యారని, పరిశ్రమలోని రాజకీయాల కారణంగా సినిమాలను కోల్పోయి మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో బాలీవుడ్లో ఉన్న బంధుప్రీతికి వ్యతిరేకంగా నేడు అనేక మంది నెటిజన్లు గళమెత్తుతున్నారు. ఈ క్రమంలో కరణ్ జోహార్ వంటి వారిని సోషల్ మీడియాలో అన్‌ఫాలో అవుతున్నారు. చిత్ర పరిశ్రమలో సుశాంత్‌కు అన్యాయం జరిగిందని ఆగ్రహంతో నెపోటిజానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. (సుశాంత్.. మాట నిలబెట్టుకోలేదు క్షమించు) తాజాగా తాము ఆరాధించే నటీ, నటులను కూడా స్థార్ కిడ్‌లను ఫాలో కావొద్దు అంటూ విన్నపిస్తున్నారు. ఈ క్రమంలో దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కొడుకు బాబిల్ ఖాన్‌ను సుశాంత్క్ మద్దతుగా చేపడుతున్న పోరాటంలో సహయం చేయాలని ఓ అభిమాని ఇన్‌స్టాగ్రామ్‌లో కోరాడు. అంతేగాక స్టార్ కిడ్‌లను అన్‌ఫాలో చేయాలని పేర్కొన్నాడు. దీనిపై బాబిల్ స్పందిస్తూ.. ‘భారతీయ సినిమాల్లో నటనలో మార్పులు తీసుకొచ్చిన వ్యక్తి(ఇర్ఫాన్ ఖాన్) కొడుకుగా ఉండటంలో ఎన్ని ఒత్తిడిలు, ఆశయాలు ఉంటాయో నీకు తెలుసా బ్రదర్. బంధుప్రీతికి వ్యతిరేకంగా జరుగుతున్న మీ పోరాటాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ప్రతి విషయానికి రెండు కోణాలు ఉంటాయి’ అని బదులిచ్చారు. (ఆ మాఫియా ఇంకా పెద్దది: సోనూ నిగమ్) దీనిపై స్పందించిన ఇన్స్టాగ్రామ్ యూజర్.. ‘మేము స్టార్ కిడ్ల సినిమాలను బహిష్కరించలేము. కాబట్టి వారి సోషల్ మీడియా అకౌంట్లను అన్‌ఫాలో చేస్తే వారికి ఉన్న ఇన్కమ్ తగ్గుతుంది. ఇది న్యాయం కోసం జరుగుతున్న పోరాటం’ అని పేర్కొన్నారు. ‘నా నటన, కృషితో మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకున్నానని నేను ఆశిస్తున్నాను. నా ఈ ప్రయాణంలో మీకు ఏదైనా అన్యాయం జరిగిందని నేను అనుకోవడం లేదు’ అని బాబిల్ సమాధానమిచ్చారు. కాగా ప్రస్తుతం బాబిల్ ఇచ్చిన రిప్లై నెటిజన్ల మనసు దోచుకుంది. (బాలీవుడ్ స్టార్ కిడ్స్‌పై పేరడీ సాంగ్) -
'సుశాంత్ కాంట్రాక్ట్ ముగిసింది.. నువ్వు కూడా'
ముంబై : బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఘటన కేసులో బాంద్రా పోలీసులు మొత్తం 13 మంది వ్యక్తుల వాంగ్మూలాలు రికార్డు చేశారు. వీరిలో సుశాంత్ సింగ్ ప్రేమికురాలుగా ఉన్న రియా చక్రవర్తిని బుధవారం బాంద్రా పోలీసులు స్టేషన్‌కు పిలిపించి విచారించారు. కాగా ఈ నెల 14న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉరి వేసుకోవడం వల్లే సుశాంత్ మరణించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అయితే సుశాంత్ మానసిక ఒత్తిడికి గురికావడానికి కారణాలేంటనే విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈ విచారణలో గురువారం సుశాంత్ ప్రేమికురాలుగా ప్రచారంలో ఉన్న రియా చక్రవర్తిని పోలీసులు విచారించారు. పోలీస్ స్టేషన్లో ఆమె దాదాపు 9 గంటల పాటు ఉన్నారు. ఈ విచారణలో యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో కాంట్రాక్టు అయిపోయిందని, తనను కూడా ఒప్పందం ఆపేయాలని కోరినట్లు రియా తెలిపారు. (సుశాంత్ మరణం; కరణ్‌కు మద్దతుగా వర్మ) కాగా నిన్న(గురువారం) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) మధ్య కుదిరిన ఒప్పందం కాపీని దర్యాప్తు కోసం సమర్పించాలని బాంద్రా పోలీసులు కోరారు. సుశాంత్ ఇప్పటి వరకు రెండు వైఆర్ఎఫ్ చిత్రాలలో నటించారు. 2013లో విడుదలైన శుద్ధ్ దేశీ రొమాన్స్, 2015లో వచ్చిన డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి. వీటిలో శుద్ధ్ దేశీ రొమాన్స్.. సుశాంత్ కెరీర్లో రెండో చిత్రం. అయితే సుశాంత్ వైఆర్ఎఫ్తో మూడు సినిమాల ఒప్పందం కుదుర్చుకున్నట్లు అప్పట్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి. (బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో) సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణ వార్త బాలీవుడ్‌ను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. అంతేగాక నెపోటిజమ్(బంధుప్రీతి) అనే వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. సినీ పరిశ్రమలో కేవలం స్టార్ హీరోల వారసులు మాత్రమే ఎదుగుతున్నారని, సుశాంత్‌కు సినిమా బ్యాక్‌గ్రౌండ్ లేకపోవడం వల్లే తనను ఎవరు సినిమాల్లోకి తీసుకోలేదని.. అందువల్లే మానసిక ఒత్తిడికి గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడని అనేక ఆరోపణలు విపిస్తున్నాయి. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ వంటి వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ మాట్లాడుతూ.. మీడియా ద్వారా వెలుగులోకి వచ్చిన వృత్తిపరంగా ఉన్న వివాదాలతో సహా సుశాంత్ ఆత్మహత్యకు సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. (సుషాంత్ మరణం టిక్‌టాక్‌లో చూసి..) -
సుషాంత్ మరణం టిక్‌టాక్‌లో చూసి..
సాక్షి, విశాఖపట్నం : సుషాంత్ సింగ్ మీద ఉన్న అభిమానం ఆమెను ఆత్మహత్య పాల్పడేలా చేసింది. ఈ విషాద ఘటన విశాఖ జిల్లా మల్కాపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. మల్కాపురం మండలం శ్రీహరిపురం పవన్ పుత్ర నగర్‌కు చెందిన సుమన్ కుమారి టిక్ టాక్ వీడియోలు చూడడం బాగా అలవాటు. ఈ మధ్యనే ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ మరణంకు సంబంధించి టిక్ టాక్‌లో తరచూ వీడియోలు చూస్తుండేది. ఈ నేపథ్యంలో సుషాంత్ మృతి పట్ల తీవ్ర ఒత్తిడికి గురైన సుమన్ కుమారి ఇంట్లోని ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా బాలీవుడ్ నటుడు సుషాంత్ సింగ్ రాజ్‌పుత్ గత ఆదివారం తన ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
‘సుశాంత్ నాకు చంద్రుడిని చూపించాడు’
హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఎక్కడైనా.. ఎప్పుడైనా పాటపాడుతూ అందుకనుగుణంగా డ్యాన్స్ చేసేవాడని.. ప్రతిరోజూ చాలా హుషారుగా ఉండేవాడని అంటున్నారు హీరోయిన్ శ్రద్ధాకపూర్. ‘చిచోరే’లో తన సహనటుడైన సుశాంత్‌తో ఉన్న జ్ఞాపకాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. సుశాంత్ మానవత్వం, తెలివి, జీవితంపై ఆసక్తిగల వ్యక్తి అని ఆమె గుర్తుచేసుకున్నారు. అంతేకాక టెలిస్కోప్ నుంచి సుశాంత్ తనకు చందమామను చూపించాడని.. ఆ అనుభవాన్ని ఎప్పటికి మర్చిపోలేనన్నారు శ్రద్ధ. ఈ క్రమంలో ‘ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ఇది చాలా కష్టంగా అనిపిస్తున్నది. అంతా శూన్యంలా తోస్తోంది.. సుశాంత్.. డియర్ సుశ్..’ అంటూ శ్రద్ధ వ్యాఖ్యానించారు. 2019లో విడుదలైన చిచోరే సినిమాలో శ్రద్ధాకపూర్, సుశాంత్ సరసన నటించిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో) కాగా, సినిమా షూటింగ్ అప్పుడు సుశాంత్‌ను తాను సెట్లో గమనిస్తుండేదానినని, అతడితో మాట్లాడేందుకు ఇష్టపడేదానినని శ్రద్ధా కపూర్ గుర్తుచేసుకున్నారు. తాము ఎక్కువగా విశ్వం, లైఫ్ ఫిలాసఫీల గురించి చర్చించుకునేవాళ్లమని ఆమె తెలిపారు. అతనితో ఉన్నంతసేపు గమ్మత్తైన ప్రదేశంలో ఉన్నట్లు అనిపించేదన్నారు. పని విషయంలో సుశాంత్ ఎంతో అంకితభావం ప్రదర్శించేవాడని తెలిపారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడని గుర్తు చేసుకున్నారు. ఒకసారి ‘చిచోరే’ టీమ్ అంతా సుశాంత్ ఇంటికి వెళ్లారని.. అక్కడి ప్రకృతి సౌందర్యానికి తాము ఫిదా అయ్యామన్నారు. సుశాంత్ తనకు తానే సాటి అని తెలిపారు. మెసేజ్‌తో పాటు చిచోరే షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోని, విన్సెంట్ వాన్ గోహ్ ‘స్టారి నైట్’ ఫోటోతో కలిపి ఉన్న చిత్రాన్ని పోస్ట్ చేశారు. శ్రద్ధా కపూర్ మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. View this post on Instagram Been trying to accept what has happened and coming to terms with it is very difficult. There is a huge void... Sushant...! Dearest Sush...! Full of humility, intelligence, curiosity about life, seeing beauty in everything, everywhere! He danced to his own tune! I always looked forward to seeing him on set, wondering what captivating interaction we would have next! Apart from being a wonderful co-actor who put his heart and soul in to his work, he was at his core, an amazing person. He cared for people and wanted to see them happy. His kind smile, the conversations we had at shoot about the Cosmos, different philosophies, the moments we spent together, were filled with magical wonderment! During a lovely musical and poetry filled get together at his home (he loved music and poetry), he showed me the moon from his telescope and I was so speechless that I could see it’s exquisite beauty up close!! He wanted to share that feeling! Our Chhichhore gang went to his beautiful home in Pavna, where we were awestruck together with the peace and calm of the nature around us - he loved nature! He saw things through a kaleidoscopic lens and wanted to share that with everyone around him. He was mesmerized by the simplest things and would muse on them in a genius way...! He was truly, One of a kind... I’ll miss you.. dearest Sush.. Shine on... ✨💜 A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on Jun 18, 2020 at 3:56am PDT -
బాలీవుడ్ బంధుప్రీతిపై వైరల్ వీడియో
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కేవలం స్టార్ హీరోల వారసులు మాత్రమే ఎదుగుతున్నారనే వాదన ఎక్కువగా వినబడుతోంది. గాడ్‌ఫాదర్ లేనిదే గ్రాండ్ సక్సెస్‌తో ఎంట్రీ ఇచ్చిన ఒకటి రెండు ఫ్లాపులు పడితే సర్దుకొని ఇంటికెళ్లాల్సిందే. ప్రతిభ ఎంత ఉన్న సినీ పరిశ్రమ మళ్లీ వారివైపు కన్నెత్తైనా చూడదు. అదే స్టార్ కిడ్స్ అయితే ఆడిషన్స్ దగ్గర నుంచే అన్ని విషయాలలో రెడ్ కార్పెట్‌తో స్వాగతం చెబుతుంది. ఒక్క సినిమా కూడా చేయకముందే వారికి ఎంతో మంది అభిమానులు పుట్టుకొస్తారు. ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయిన నిర్మాతలు వారి ఇంటి తలుపు కొడుతూనే ఉంటారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య నేపథ్యంలో సినిమా పరిశ్రమలో ఉండే పక్షపాత ధోరణిపై చాలా మంది గళం విన్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో స్కూప్‌లు చేయడంలో ప్రముఖుడైన సలీల్ జమ్దార్ సినీ పరిశ్రమపై చేసిన జింగాత్ ధడక్ అనే పేరడీ సాంగ్ మళ్లీ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. 2018లో ఈ పాట విడుదలైంది. కానీ ఇప్పుడు సుశాంత్ ఆత్మహత్య తరువాత మళ్లీ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆడిషన్స్ దగ్గర నుంచి సామాన్యులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే విషయాన్ని చూపించారు. ('సుశాంత్‌ని 7 సినిమాల్లో తప్పించారు') స్టార్ కిడ్స్‌కు కష్టపడకుండానే ఎలాంటి అవకాశాలు వస్తున్నాయి అనే విషయాన్ని చూపించారు. బాలీవుడ్ స్టార్ పిల్లలపై ‘జింగాత్ ధడక్’ పేరడీ పాటను రూపొంచారు. ఈ పాటను చూస్తే ప్రతి ఒక్కరూ ప్రస్తుతం పరిశ్రమలో ఉన్న పరిస్థితుల గురించి పునరాలోచన చేయకుండా ఉండరు. ఈ పేరడీ పాట ట్యూన్‌ను ధడక్ సినిమా పాట నుంచి తీసుకున్నారు. ధడక్ సినిమా సైరత్ అనే మరాఠీ సినిమా రీమేక్. ఈ సినిమాలో ఎలాంటి స్టార్లు లేకపోయిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. ధడక్ సినిమాలో మాత్రం స్టార్ కిడ్స్ జాన్వీ కపూర్, ఇషాన్ కట్టర్ నటించారు. ఈ పేరడీపాటలో స్టార్ కిడ్స్ అలియాభట్, వరుణ్‌ధావన్, రణబీర్ కపూర్ వీరితోపాటు మరికొంత మంది స్టార్ పిల్లల్ని చూపించారు. ప్రతిభతో సంబంధం లేకుండా ఏ కష్టం పడకుండా స్టార్ హీరోల వారసులు సులువుగా గుర్తింపు పొందుతున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో బాలీవుడ్ బంధుప్రీతిపై తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెపోటిజం కారణంగా ఇప్పటికే కరణ్ జోహార్, అలియాభట్ విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. (ముసుగులు తొలగించండి) -
అమ్మా.. మన ఇద్దరం తప్పనుకుంటా: సుశాంత్
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ నెల 14న ముంబైలోని తన నివాసంలో ఆత్యహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుశాంత్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ స్వహస్తాలతో రాసిన ఓ లేఖ అభిమానుల హృదయాలను కలచి వేస్తోంది. తల్లిని గుర్తు చేసుకుంటూ సుశాంత్ అందమైన కవితను రాశాడు. ‘నేను ఉన్నంత కాలం.. మీ జ్ఞాపకాలతోనే నేను సజీవంగా ఉన్నాను. ఓ నీడ వలే. కాలం ఎన్నటికి కదలదు. ఇది ఎంతో అందంగా ఉంది. ఇది ఎప్పటికి ఇలానే కొనసాగుతుంది. అమ్మా నీకు గుర్తుందా.. ఎప్పటికి నాతోనే ఉంటానని నువ్వు నాకు వాగ్దానం చేశావు. అలానే ఎలాంటి పరిస్థితుల్లో అయినా నవ్వుతూనే ఉంటానని నేను నీకు మాట ఇచ్చాను. చూడబోతే మన ఇద్దరం తప్పని తెలుస్తుంది అమ్మా’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లేఖ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.(సామాజిక దూరంతోనే ఆత్మహత్యలు!) Late #SushantSinghRajput’s handwritten note for his mother after she passed away. #RIPSushantSinghRajput pic.twitter.com/tQjEMe4wcJ — Filmfare (@filmfare) June 17, 2020 సుశాంత్‌కు తన తల్లితో గాఢమైన అనుబంధం ఉండేది. అయితే దురదృష్టవశాత్తు సుశాంత్ యుక్త వయసులోనే ఆమె మరణించారు. అయినప్పటికి సుశాంత్ ఆమెను తన హృదయంలో పదిలంగా దాచుకున్నారు. ఇదే కాక సుశాంత్ చివరి సోషల్ మీడియా మెసేజ్ కూడా తల్లిని ఉద్దేశిస్తూనే చేశాడు. (కరణ్ నంబర్ ఇచ్చాడు కదా అని ఫోన్ చేస్తే..) -
సుశాంత్ ఆత్మహత్య; కరణ్‌కు మద్దతుగా వర్మ
బాలీవుడ్ యువ నటుడు సశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తెరపైకి మరో వివాదాన్ని తీసుకొచ్చింది. భారత సినీ పరిశ్రమలో నెపోటిజమ్(బంధుప్రీతి) ఎక్కువ ఉందనే వాదన ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. సుశాంత్ మరణానికి బంధుప్రీతి కారణమంటూ నెటిజన్లు కరణ్ జోహార్‌ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. తాజాగా ఈ విషయంపై వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ స్పందించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియాలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. Social media warriors can only create snap entertaining tweets for job less bored people, but people like @karanjohar @ektarkapoor #AdityaChopra etc can create actual physical work which will actually feed people — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2020 సినీ పరిశ్రమలో బంధుప్రీతిని ప్రోత్సాహిస్తున్నాడని కరణ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని వర్మ ఖండించారు. ‘సుశాంత్ మరణంపై కరణ్ జోహర్‌ను నిందించడం హాస్యాస్పదంగా ఉంది. ఇది చిత్ర పరిశ్రమపై అవగాహన లేకపోవడాన్ని చూపిస్తుంది. కరణ్‌కు సుశాంత్‌తో సమస్య ఉందని అనుకుంటున్నారు. అయినా ఎవరితో పనిచేయాలనేది కరణ్ ఇష్టం. నిర్మాతలు ఎవరితో పని చేయాలనుకుంటున్నారనేది వాళ్ల ఇష్టంపై ఆధారపడి ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. WITHOUT NEPOTISM SOCIETY WILL COLLAPSE BECAUSE NEPOTISM(FAMILIAL LOVE ) IS THE FUNDAMENTAL TENET OF A SOCIAL STRUCTURE..Like u shouldn’t love others wife more, u also shouldnt love others children more — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2020 అలాగే ‘సోషల్ మీడియాలో నెపోటిజం గురించి కరణ్ జోహర్‌ను విమర్శిచే వాళ్లు ఒక్కరికి కూడా పని ఇవ్వలేరు. కానీ కరణ్, ఏక్తా కపూర్, ఆదిత్యా చోప్రా వంటి వాళ్లు ఎంతో మందికి పని ఇచ్చార’ని గుర్తు చేశారు. బంధుప్రీతికి అనుకూలంగా మాట్లాడుతూ.. ప్రతి వ్యవస్థలో బంధుప్రీతి పాతుకు పోయిందన్నారు. ఇది లేకుంటే సమాజం కుప్పకూలిపోతుందని వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంధుప్రీతి లేకుండా ఉండాలి అంటే మనం మన కుటుంబాన్ని భార్య, పిల్లలను కూడా ఎక్కువగా ఇష్టపడలేం అని పేర్కొన్నారు. ‘ప్రతికూల సందర్భంలో మాట్లాడే నెపోటిజం ఒక జోక్. ఎందుకంటే మొత్తం సమాజం కేవలం కుటుంబ ప్రేమపై ఆధారపడి ఉంటుంది’ అంటూ వ్యాఖ్యానించారు. Nepotism spoken in a negative context is a joke because entire society is based on only a family loving concept ..Should @iamsrk launch someone unknown instead of Aryan just because someone is more talented (in whose view is the point?) — Ram Gopal Varma (@RGVzoomin) June 16, 2020 -
నాకున్న స్నేహితులు ఇద్దరే: సుశాంత్
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అకాల మరణ వార్త మొత్తం దేశాన్ని కదిలించింది. అతను ఒంటరిగా ఉన్నాడని.. నిరాశతో బాధపడుతున్నాడని నివేదికలు వెల్లడించాయియి. ఈ క్రమంలో సుశాంత్ మరణించిన రెండు రోజుల తరువాత పాత వీడియో ఒకటి ఆన్లైన్లో తెగ వైరలవుతోంది. ఈ వీడియోలో సుశాంత్ తనకు కేవలం ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ‘చాలా నిజాయితీగా చెప్తున్నాను. నాకు ఇద్దరు స్నేహితులు మాత్రమే ఉన్నారు’ అని చెప్పడం వీడియోలో చూడవచ్చు. (‘ఒంటరిగా పోరాడితే.. బలవంతులవుతారు’) ఈ క్రమంలో సుశాంత్ మాట్లాడుతూ.. ‘జనాలకు నాతో మాట్లాడటం ఇష్టం ఉండదు.. అయితే వారు మొదట నన్ను ఇష్టపడినట్లు నటిస్తారు. ఆ తరువాత నన్ను మర్చిపోతారు. నేను స్నేహితులను చేసుకోలేను. అంటే నాకు జనాలు అంటే ఇష్టం లేక కాదు. నేను వారిని నిజంగా ఇష్టపడుతున్నాను. కాని వారు నాతో మాట్లాడ్డానికి ఆసక్తి చూపరు. మొదటిసారి వారు నన్ను ఇష్టపడుతున్నట్లు నటిస్తారు. కాని తర్వాత వారు నా కాల్స్ లిఫ్ట్ చేయరు’ అని తెలిపారు. బంధుప్రీతి కారణంగా సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నారని అభిమానులు దుమ్మెత్తిపోస్తున్నారు. వారసత్వం లేక టాలెంట్ వున్న నటుల పట్ల ఇండస్ట్రీ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Please don't miss. Carefully Listen what did Sushant Singh Rajput say about his friends in Bollywood. 😭😭😭💔💔#JusticeForSushantSinghRajput #BoycottKaranJoharGang #bollywoodnepotism #SonamKapoor #KaranJoharIsBULLY #SalmanKhan #BoycottFakeStars #Nepotism pic.twitter.com/aoFpo79Ue5 — Pushpendra Kulshreshtha (@iArmySupporter) June 16, 2020 -
సుశాంత్ మృతికి కారణం తెలుసు: నటుడు
ముంబై: బాలీవుడ్ చిత్ర పరిశ్రమ కుటుంబం కాదని.. అది కేవలం ఊహాత్మకమైన పేరు మాత్రమేనంటూ నటుడు గుల్షాన్ దేవయ్య మంగళవారం ట్వీట్ చేశాడు. నటి మీరా చోప్రా యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై స్పందిస్తూ బాలీవుడ్ పరిశ్రమ ఒక కుటుంబం అంటూ చేసిన ట్వీట్‌కు గుల్షాన్ రీట్వీట్ చేశాడు. ‘బాలీవుడ్ పరిశ్రమ ఒక కుటుంబం అంటారు. కానీ అది అందరికి కాదు. ఎప్పటికీ కాదు కూడా. కుటుంబం అనుకుంటే సమస్యలు వస్తాయి. పని చేసే ప్రదేశం కాబట్టి అది ఒక ఊహత్మక పేరు మాత్రమే. అయితే ఇది నేను ఎవరినీ ఉద్దేశించి అనడం లేదు. నా అభిప్రాయం మాత్రమే చెప్పాను. ఒకవేళ ఈ ట్వీట్ ఎవరినైనా ఉద్దేశించినట్లు ఉంటే నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. (సుశాంత్ ఇంట మరో విషాదం) గుల్హాన్ సోమవారం చేసిన ట్వీట్లో ‘‘సుశాంత్ ఎందుకు ఇలా చేశాడో ఆలోచిస్తే నటీ నటులందరికి అర్ధం అవుతుంది. తన మరణానికి కారణం బాలీవుడ్‌లోని ప్రతిఒక్కరికి తెలుసు. ఇదే ఎక్కువగా బాధించే విషయం. సుశాంత్ మరణవార్త ప్రతి ఒక్కరిని దిగ్బ్రాంతికి గురిచేసింది’’ అంటు రాసుకొచ్చాడు. కాగా సుశాంత్‌కు బాలీవుడ్ క్షమాపణలు చెప్పాలంటూ నటి మీరా చొప్రా సోమవారం ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ‘‘అవును ఇది నిజం.. బాలీవుడ్ అనేది ఒక కుటుంబం. కానీ ఈ కుటుంబం నీకు అవసరమైన సమయంలో నీతో లేదు. క్షమించు సుశాంత్’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. కాగా సుశాంత్ ముంబైలోని తన నివాసంలో మానసిక ఒత్తిడి కారణంగా ఆదివారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కొద్ది మంది బాలీవుడ్, టీవీ నటీనటుల మధ్య సోమవారం ముంబైలోని పవన్ హన్స్ శ్మశానవాటికలో సుశాంత్ అంత్యక్రియలు నిర్వహించారు. (నాకూ లోతైన గాయాలు : పాపం సుశాంత్!) Really sorry to be doing this but Bollywood is not a family , it never was and never will be . If one thinks it’s a family .. there is the problem. Bollywood is an imaginary name for a place of work that’s it . I am really not trying to put anybody down here & sorry if it seems https://t.co/hoz30WiEOJ — Gulshan Devaiah (@gulshandevaiah) June 15, 2020 -
సుశాంత్ చితికి నిప్పు పెడుతుంటే చూడలేకపోయా
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంత్యక్రియలు సోమవారం ముంబైలో పూర్తయ్యాయి. నటుడు వివేక్ ఒబెరాయ్‌తో పాటు కృతి సనన్, ముఖేశ్ చబ్రా సహా పలువురు బాలీవుడ్ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం వివేక్ ఒబెరాయ్ సోషల్ మీడియాలో తన మనసులోని భావాలను వెల్లడిస్తూ భావోద్వేగ పోస్ట్ పెట్టారు. "సుశాంత్ అంత్యక్రియల్లో పాల్గొనడం ఎంతో బాధాకరం. అతని బాధలను నేను పంచుకుంటే బాగుండేది అనిపిస్తోంది. కానీ కష్టాలకు చావే పరిష్కారం కాదు. ఆత్మహత్య సమస్యలను నయం చేయలేదు. అతడు తన కుటుంబం, స్నేహితులు, లక్షలాది అభిమానుల గురించి ఒక్కసారి ఆలోచించినా ఇలా జరిగేది కాదు. సుశాంత్ చితికి అతడి తండ్రి నిప్పు పెడుతుంటే ఆయన కళ్లలో బాధ చూడలేకపోయాను. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) సుశాంత్ సోదరి అతడిని తిరిగి వచ్చేయమంటూ గుండెలు పగిలేలా రోదించింది. ఈ బాధను మాటల్లో వర్ణించలేను. ఇండస్ట్రీని పేరుకు మాత్రమే ఫ్యామిలీ అని పిలుస్తుంటారు. కానీ ఎక్కడైతే ప్రతిభను అణిచివేయరో, ఎక్కడైతే నటుడికి గుర్తింపు ఉంటుందో అలాంటి కుటుంబంగా ఇండస్ట్రీ పరివర్తనం చెందాలి. ప్రస్తుత పరిస్థితిలో మార్పు రావాలి. అహంకారాలు పక్కన పెట్టి ప్రతిభ ఉన్నవారికి ప్రోత్సాహం అందించాలి. ఇది అందరికీ మేల్కొలుపు కావాలి. నవ్వులు చిందించే సుశాంత్‌ను నేను ఎప్పటికీ మిస్సవుతాను. ఆ దేవుడు నీ కుటుంబానికి శక్తినివ్వాలని కోరుకుంటున్నాను" అని లేఖలో తెలిపారు. (‘సుశాంత్ మరణం నాకు పెద్ద మేల్కొలుపు’) -
ఎంతగా ప్రాధేయపడ్డాడో పాపం సుశాంత్..
బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్ మరోసారి ఇండస్ట్రీ పెద్దలపై మండిపడ్డారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే ఈ ఫైర్‌బ్రాండ్.. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యా లేదా పక్కా పథకం ప్రకారం చేసిన హత్యా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం మనల్ని విషాదంలో ముంచేసింది. అయితే ప్రతీ విషయాన్ని రెండో కోణం నుంచి ఆలోచించాలంటారు కదా. ఎవరి మనసు అయితే బలహీనంగా మారిపోతుందో వారే డిప్రెషన్లోకి వెళ్లిపోతారు. అలాంటి వాళ్లకే ఆత్మహత్య చేసుకుంటారు. స్టాన్ఫోర్డ్ స్కాలర్షిప్ సాధించిన వ్యక్తి.. ఇంజనీరింగ్ ఎంట్రన్స్ మెరిట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి, అతడి మనసు అలా ఎలా బలహీనమవుతుంది?’’ అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తను ఎంతగా ప్రాధేయపడ్డాడు? ‘‘తను పెట్టిన ఆఖరి పోస్టులు చూశారా? నా సినిమాలు చూడండి అంటూ అతడు ఎంతగా అభ్యర్థించాడో వాటిని చూస్తే అర్థమవుతుంది. నాకు గాడ్‌ఫాదర్ లేడు, నా సినిమాలు ఆడకుంటే ఇండస్ట్రీ నుంచి నన్ను పంపించేస్తారు అంటూ బతిమిలాడాడు. ఎందుకు ఈ ఇండస్ట్రీ నన్ను తనలో ఒకడిగా భావించడం లేదు? అంతా ముగిసినట్లు అనిపిస్తుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పుడు చెప్పండి ఈ ఘటనలో మన ప్రమేయమేమీ లేదంటారా?’’అంటూ కంగన బీ-టౌన్‌ను నిలదీశారు. (ఆ పెయింటింగ్.. ఆ పోస్టు.. ముందే చెప్పావా సుశాంత్?) అవార్డులు ఎందుకు ఇవ్వరు? ‘‘తొలి చిత్రం ‘కా పో చే’ బాగున్నా తనకు గుర్తింపు దక్కలేదు. ఎంఎస్ ధోని కానివ్వండి, కేదార్నాథ్ కానివ్వండి, చిచోర్ కానివ్వండి. గుర్తింపు ఏది? గల్లిబాయ్ వంటి సినిమాలకు అవార్డులు ఇస్తారు. చిచోర్ వంటి ఉత్తమ చిత్రాలను, వాటిని తెరకెక్కించిన దర్శకులను పట్టించుకోరు?’’అంటూ రెండు నిమిషాల నిడివి గల ఇన్‌స్టా వీడియోలో కంగన ‘బంధుప్రీతి’(నెపోటిజం)పై మరోసారి విమర్శలు గుప్పించారు. కాగా కంగన సైతం ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండానే బాలీవుడ్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. అనేక కష్టనష్టాలకోర్చి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా.. గొప్ప నటిగా ఎదిగారు. ఇక అవుట్‌సైడర్ల తరఫున గళం వినిపించే కంగనా.. తనలాగే గాడ్‌ఫాదర్ లేకుండానే ఇండస్ట్రీలో ప్రవేశించి లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సుశాంత్ ఆత్మహత్యను జీర్ణించుకోలేక ఇలా తన ఆవేదన, ఆగ్రహం వెళ్లగక్కారు. ప్రతిభను గుర్తించాలే తప్ప కష్టసమయాల్లో అధికంగా దృష్టి సారించి సెలట్రిటీలను ఇబ్బంది పెట్టడం సరికాదని మీడియాకు హితవు పలికారు. సహానుభూతి కలిగి ఉండాలని కోరారు.(‘సుశాంత్ మరణం నాకు పెద్ద మేల్కొలుపు’) -
సుశాంత్ ఎందుకిలా చేశావ్: వాట్సన్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య ఘటనపై సినీ, క్రీడా ప్రముఖులు తీవ్ర విచారం వెలిబుచ్చారు. గొప్ప ప్రతిభ, కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు ఉన్నప్పటికీ సుశాంత్ బలవన్మరణానికి పాల్పడటం కలచివేస్తోందని అంటున్నారు. తాజాగా ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ షేన్ వాట్సన్ సుశాంత్ మృతిపట్ల నివాళి అర్పించారు. చక్కని ప్రతిభ త్వరగా కనుమరుగైపోయిందని ట్విటర్లో పేర్కొన్నాడు. (చదవండి: డిప్రెషన్‌ను జయించండిలా..) సుశాంత్ ఎందుకిలా చేశాడో ఆలోచించడం ఆపలేకపోతున్నానని తెలిపారు. ‘ఇది చాలా విషాదకర ఘటన. ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ సినిమా చూస్తున్న సమయంలో నటిస్తోంది ధోనియా, సుశాంతా అనే విషయం మర్చిపోయి చక్కని అనుభూతి పొందా. ఆ సినిమాలో సుశాంత్ అత్యద్భుతంగా నటించి వినోదం పంచాడు. అంతలోనే ఈ ప్రపంచాన్ని ఒంటరి చేసి దిగంతాలకు పయనమయ్యాడు. గొప్ప ప్రతిభ త్వరగా కనుమరుగైంది’అని వాట్సన్ ట్వీట్ చేశాడు. (చదవండి: ఆవేదన వ్యక్తం చేసిన ‘బిగ్ బీ’) I can’t stop thinking about #sushantsinghrajput. It is just so tragic!!! In The Untold Story, at times you forgot whether it was Sushant or MSD. Amazing portrayal and now the world is much poorer with him not here in it. #gonetoosoon pic.twitter.com/pFYz4cD9jK — Shane Watson (@ShaneRWatson33) June 15, 2020 -
‘ఎందుకు సుశాంత్ ఇలా ముగించావ్?’
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు, అభిమానులను తీవ్ర దిగ్భ్రంతికి గురి చేసింది. ఈ క్రమంలో ‘బిగ్ బీ’ అమితాబ్ బచ్చన్ సుశాంత్ మృతికి సంతాపం తెలుపుతూ ‘ఎవరిని అడగకుండా.. ఎవరితో చెప్పకుండా నీ జీవితాన్ని అంతం చేసుకుంటావా.. నీ అద్భుతమైన ప్రతిభని.. నీ తెలివైన మనస్సును అంతం చేస్తావా.. విశ్రాంతిగా పడుకున్నావా’ అంటూ ట్వీట్ చేశారు. అంతేకాక సుశాంత్ ప్రతిభను, పని తీరును అమితాబ్ ఎంతో మెచ్చుకున్నారు. ‘సుశాంత్ నాల్గవ లైన్ గ్రూప్ డ్యాన్సర్‌గా జీవితాన్ని మొదలు పెట్టి.. నేడు ఎంతో ఎత్తుకు ఎదిగాడు. అతడి సినీ ప్రయాణం ఎందరికో ఆదర్శం’ అన్నారు. ఈ క్రమంలో సుశాంత్‌తో జరిగిన ఓ సంభషణను గుర్తు చేసుకున్నారు అమితాబ్. (సుశాంత్ చివరగా కాల్ చేసింది అతడికే) T 3563 - In memorial Sushant : DAY 4483 Jalsa, Mumbai June 14/15, 2020 Sun/Mon 12:48 AM Why .. Why .. Why .. (cont) https://t.co/uCOUjTIbyn — Amitabh Bachchan (@SrBachchan) June 15, 2020 ‘అంతర్జాతీయ టోర్నమెంట్లో ధోని కొట్టిన సిక్స్ ఐకానిక్ షాట్‌గా గుర్తింపు పొందింది. ధోని బయోపిక్‌లో సుశాంత్ ఆ సన్నివేశానికి వంద శాతం న్యాయం చేశాడు ఇది ఎలా సాధ్యమయ్యింది అని సుశాంత్‌ను అడిగాను. అందుకు అతడు ధోని సిక్స్ కొట్టిన ఆ వీడియోను వందసార్లు చూశానని చెప్పాడు. పని పట్ల అతని నిబద్దత అది. అయితే జీవితంలో మనం చూపే ఈ ‘అతి’ కొన్ని అనర్థాలకు దారి తీస్తుంది’ అని అమితాబ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘ఏ విధమైన మసన్సు ఓ మనిషిని ఆత్మహత్యకు పురిగొల్పుతుందో ఎవరు చెప్పలేకపోయారు. అది ఓ రహస్యంగా మిగిలింది. ఎంతో లాభదాయకమైన జీవితాన్ని ఎవరిని అడగకుండానే ముగించావ్’ అంటూ అమితాబ్ సంతాపం వ్యక్తం చేశారు. డిప్రెషన్ అనేది మానసిక అనారోగ్యం అని.. దీని గురించి జనాలకు అవగాహన కల్పించండి అంటూ నెటిజనులు అమితాబ్‌ను కోరుతున్నారు. (డిప్రెషన్‌ను జయించండిలా..) -
సుశాంత్ చివరగా కాల్ చేసింది అతడికే
బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలోకి నెట్టివేసింది. ప్రతి ఒక్కరు ఈ వార్త అబద్దమైతే బాగుండు అని కోరకుంటున్నారు. అయితే చనిపోవడానికి ముందు సుశాంత్ తన ఆప్త మిత్రుడు మహేష్ శెట్టికి కాల్ చేసినట్లు సమాచారం. ఆదివారం ఉదయం 9.30 గంటలకు తన సోదరితో మాట్లాడిన అనంతరం సుశాంత్, తన స్నేహితుడు మహేష్‌కు కాల్ చేశారు. సుశాంత్ ఆత్మహత్య కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు మహేష్ స్టేట్మెంట్ను రికార్డు చేయనున్నారు. ఈ క్రమంలో మహేష్ శెట్టి టీం మెంబర్స్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ మెసేజ్ షేర్ చేశారు. సుశాంత్ మరణం మహేష్‌ను ఎంతో కుంగదీసిందని.. అతడికి కొంత ప్రైవసీ ఇవ్వాల్సిందిగా మీడియాను, జనాలను కోరారు.(రంగుల ప్రపంచం వెనుక విషాదాలెన్నో..) ఈ క్రమంలో.. ‘సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం మనందరిని తీవ్ర బాధకు, షాక్‌కు గురి చేసింది. ఈ వార్త మహేష్ శెట్టిని ఎంతో కలచివేసింది. అతను తన సోదరుడు, ఆప్త మిత్రుడిని కోల్పోయాడు. సుశాంత్ మరణవార్తను అతడు ఇంకా జీర్ణించుకోలోకపోతున్నాడు. ఆ షాక్ నుంచి ఇంకా బయటకు రాలేదు. మేము, మహేష్ శెట్టి టీం మెంబర్లం అతడి తరపున మిమ్మల్ని, మీడియా వారిని కోరేది ఒక్కటే. ఈ విషాద సమయంలో అతడికి కాస్తా ప్రైవసీ ఇవ్వండి. తేరుకునేందుకు సమయం ఇవ్వండి’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా కోరారు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) View this post on Instagram A post shared by Mahesh Shetty (@memaheshshetty) on Jun 14, 2020 at 10:16pm PDT మహేష్ శెట్టి, సుశాంత్ సింగ్ టీవీలో నటించిన తొలి సీరియల్ ‘కిస్ దేశ్ మైనే హై మేరా దిల్’తో పాటు ‘పవిత్రా రిష్తా’లో కలిసి నటించారు. అప్పటి నుంచి వారి స్నేహం అలా కొనసాగుతూనే ఉంది. కొద్ది రోజుల క్రితం మహేష్ శెట్టి బర్త్‌డే సందర్భంగా సుశాంత్ ‘పుట్టినరోజు శుభాకాంక్షలు మేరీ జాన్’ అంటూ విష్ చే శారు. -
నాన్నను బాగా చూసుకోండి: సుశాంత్
ముంబై: కాలం అనుకూలిస్తే బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ ఏడాదిలోనే ఓ ఇంటివాడయ్యేవాడు. అతనికి పెళ్లి చేయాలన్న తండ్రి కల నెరవేరేది. కానీ అంతలోనే మాయదారి డిప్రెషన్‌తో ప్రాణాలు తీసుకున్నాడు. ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు లోనైన అతని స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు. అతడు నవంబర్‌లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడని తెలిపారు. ఇందుకోసం తండ్రితోనూ చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే ఆ అమ్మాయి వివరాలు మాత్రం వెల్లడించలేదు. మరోవైపు మూడు రోజుల క్రితం సుశాంత్ కుటుంబ సభ్యులు.. నటుడికి ఫోన్ చేసి సంభాషించారు. కరోనా వ్యాపిస్తున్న వేళ ఎట్టి పరిస్థితుల్లోనూ నివాసంలో నుంచి బయట అడుగు పెట్టవద్దని కోరారు. (సుశాంత్ ఆత్మహత్య : విలపించిన సోదరి) ఇంట్లోనే ఉండాలంటూ ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. ఈ సందర్భంగా సుశాంత్ కూడా ఓ మాట కోరాడు. తన తండ్రిని బాగా చూసుకోండంటూ సూచించాడు. కాగా ఆదివారం ఉదయం సుశాంత్ సింగ్ బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. సుశాంత్ ఇక లేడన్న వార్తను అతని కుటుంబ సభ్యులతో పాటు ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నేడు(సోమవారం) సాయంత్రం నటుడి అంత్యక్రియలు జరగనుండగా పాట్నా నుంచి అతని తండ్రితోపాటు బంధువు, బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లూ, ఇతర బంధువులు ముంబైకి చేరుకున్నారు. (సుశాంత్ ఆత్మహత్య: మాజీ ప్రేయసి స్పందన) -
ఒత్తిడిని తగ్గించుకోవడానికి అద్భుత చిట్కా!
పెద్దింటివాడికైనా, పేదింటివాడికైనా మానసిక ఒత్తిడి ప్రశాంతత లేకుండా చేస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించి చికిత్స తీసుకోవడమో, నివారించడమో చేయకపోతే ఘోరమైన దుష్ప్రభావాలు చవిచూడక మానదు. అందుకు నిలువెత్తు ఉదాహరణ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య. అతని చిరునవ్వు కోట్లాదిమంది మనసుల్లో అలజడి రేపే ఆయుధం. అతనికి ఎన్ని కష్టాలున్నాయో, ఎన్ని బాధల సుడిగుండాల్లో చిక్కుకున్నాడో.. కానీ వాటన్నంటినీ గుండెల్లోనే దాస్తూ చిరునవ్వు చెరగనిచ్చేవాడు కాదు. కానీ కాలం కరుగుతున్న కొద్దీ అతనిపై మానసిక ఒత్తిడి పై చేయి అవుతూ వచ్చింది. అంతిమంగా అతను చావుకు తలొంచుతూ అందరికీ శాశ్వత వీడ్కోలు పలికాడు. (అవును... త్వరగా వెళ్లిపోయావ్ సుశాంత్..) నిజంగానే మానసిక ఒత్తిడిని మనం జయించలేమా? అది మనల్ని పొట్టన పెట్టుకునే వరకూ చూస్తూ ఉండాలా? దీనికి ఓ ప్రొఫెసర్ వీడియోతో సమాధానం చెప్పారు. ఆయన ఓ గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని విద్యార్థుల ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు అది ఎంత బరువుందని అడగ్గా... విద్యార్థులు రకరకాల సమాధానాలిచ్చారు. దీనికి ఆ ప్రొఫెసర్ బదులిస్తూ.. ‘ఇక్కడ గ్లాసు బరువు అనేది ప్రామాణికం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకుంటున్నామనేది ముఖ్యం. ఓ నిమిషం దాన్ని అలాగే చేతులతో పట్టుకుని ఉంటే ఏమీ అవదు. గంటసేపు పట్టుకుంటే నా చేయి నొప్పి పెడుతుంది. ఇక రోజంతా పట్టుకునే ఉంటే నా చేయి మొద్దుబారిపోయి చచ్చుబడిపోతుంది. (‘ఆత్మహత్య చేసుకోవాలనిపించేది’ ) కానీ వీటన్నింటికి గ్లాసు బరువు కారణం కాదు. దాన్ని ఎంతసేపు పట్టుకున్నామనేదే ముఖ్యం. అలాగే జీవితంలోని ఒత్తిడి కూడా అంతే. అది కూడా నీళ్ల గ్లాసు వంటిదే. కాసేపు వాటి కోసం ఆలోచిస్తే ఏమీ కాదు. కానీ కొంచెం ఎక్కువసేపు ఆలోచించారనుకో అది మిమ్మల్ని బాధిస్తుంది. అదే రోజంతా ఆలోచిస్తూనే ఉన్నారనుకో.. మీరు మొద్దుబారిపోతారు. ఏ పనీ సరిగా చేయలేరు. కాబట్టి చేయాల్సిందొక్కటే గ్లాసు పక్కన పెట్టేసినట్లు వాటి కోసం ఆలోచించడం వదిలేయండి’ అని సెలవిచ్చారు. ఈ వీడియోను టాలీవుడ్ దర్శకుడు దేవా కట్ట ట్విటర్లో షేర్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతోమంది తప్పకుండా అనుసరించాల్సిన మార్గమిది. -
సుశాంత్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
ముంబై: ముంబైలోని బాంద్రా అపార్ట్మెంట్లో ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తైంది. అతనికి పోస్ట్‌మార్టమ్ చేసిన డా. ఆర్ఎన్ కూపర్ మున్సిపల్ జనరల్ ఆసుపత్రి వైద్యులు సోమవారం పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికను విడుదల చేశారు. సుశాంత్‌ది ఆత్మహత్యగానే ధృవీకరించారు. అయితే అవయవాల్లో విషపూరితాలు ఉన్నాయో లేదో పరీక్షించేందుకు నటుడి అవయవాలను జేజే ఆసుపత్రికి తరలించారు. కాగా 34 ఏళ్ల వయసులోనే సుశాంత్ తన నివాసంలో ఆదివారం ఉరి వేసుకున్న విషయం తెలిసిందే. అతని ఇంట్లో ముంబై పోలీసులు యాంటీ డిప్రెషన్ మందులను స్వాధీనం చేసుకున్నారు. కానీ ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. మరోవైపు ఆయన మరణంపై చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. (సుశాంత్ మృతిపై అనుమానం: సీబీఐ విచారణ) నేడు నటుడి అంత్యక్రియలు జరగగనుండగా.. సుశాంత్ కుటుంబీకులు వారి స్వస్థలమైన పాట్నా నుంచి ముంబైకు పయనమయ్యారు. ఇదిలా వుండగా రెండేళ్లు థియేటర్ ఆర్టిస్ట్‌గా కొనసాగిన సుశాంత్ "కిసీ దేశ్ మే హై మేరా దిల్" సీరియల్‌తో బుల్లితెరపై తెరంగ్రేటం చేశాడు. అనంతరం "కాయ్ పో చె" (2013) చిత్రం ద్వారా బాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. అలా ‘శుద్ధ్ దేశీ రొమాన్స్’, ‘పీకే’, ‘డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి" చిత్రాలు నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితం ఆధారంగా చేసిన ‘ఎం.ఎస్. ధోనీ’తో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన చివరిసారిగా "చిచోర్" చిత్రంలో కనిపించాడు. (సుశాంత్‌సింగ్ ఆత్మహత్య) -
సెల్యూట్ సైనికా
మనందరికీ ప్రత్యేకంగా ఇల్లు ఉంటుంది. కానీ సైనికులు ఇండియా మొత్తం ఇంటిలానే భావిస్తారు. దేశం కోసం ప్రాణాలు విడవడానికి కూడా సిద్ధపడిపోతారు. అలా రియల్ లైఫ్‌లో ప్రాణాలు ఒడ్డిన సైనికులను మనం సిల్వర్ స్క్రీన్‌పై చూడబోతున్నాం. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్’ బ్యాక్‌డ్రాప్ సినిమాల గురించి తెలుసుకుందాం. కమాండో సందీప్ ముంబైలో 2008లో జరిగిన 26/11 ఎటాక్స్ దేశంలో సంచలనం సృష్టించాయి. ఆ దురదృష్టకర సంఘటనలో మరణించిన 174 (దాదాపుగా) మందిలో ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) కమాండో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఒకరు. ఈ సంఘటన ఆధారంగా కొన్ని పుస్తకాలు వచ్చాయి. సినిమాలొచ్చాయి. వాటిలో రామ్‌గోపాల్ వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ 26/11’ ఒకటి. తాజాగా తెలుగు, హిందీ భాషల్లో ‘మేజర్’ అనే టైటిల్‌తో మరో చిత్రం తెరకెక్కనుంది. సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో హీరో అడవి శేష్ నటించనున్నారు. ఈ చిత్రానికి హీరో మహేశ్‌బాబు ఒక నిర్మాత. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. అడవి శేష్, మహేశ్‌బాబు కాపాడతాడు శత్రువులు దేశంలోనే కాదు.. దేశం లోపల కూడా ఉంటారు. ఎవర్నైనా ఎదుర్కోవాల్సింది మన సైనికులే. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ రిజర్వ్›్డ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఎన్ఎస్జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్) ఇలా విభాగాలే వేరు. దేశ రక్షణే అందరి లక్ష్యం. దేశ ప్రధాని రక్షణకోసం ఓ ఎన్ఎస్జీ కమాండో ఎలాంటి సాహసం చేశారనే అంశం ఆధారంగా రూపొందుతున్న తమిళ చిత్రం ‘కాప్పాన్’. (కాపాడతాడు) సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బొమన్ ఇరానీ, మోహన్‌లాల్, ఆర్య, సముద్ర ఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సూర్య, సముద్రఖని ఎన్ఎస్జీ కమాండోలుగా నటిస్తున్నారు. ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్ నటిస్తారని తెలిసింది. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. సూర్య కమాండో అర్జున్ పండిట్ ఆర్మీ ఆఫీసర్లు చేసే సీక్రెట్ ఆపరేషన్స్‌కు విభిన్నమైన పేర్లు పెడుతుంటారు. ఆలాగే గోల్డ్‌ఫిష్ అనే పేరుతో ఓ ఆపరేషన్‌ను షురూ చేశారు కమాండో అర్జున్ పండిట్. ఆ ఆపరేషన్ టార్గెట్ ఎవరు అనేది వెండితెరపై చూడాల్సిందే. వాస్తవ సంఘటనలకు కల్పిత అంశాలను జోడించి అడివి సాయికిరణ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఆపరేషన్ గోల్డ్ ఫిష్’. ఇందులో కమాండో అర్జున్ పండిట్ పాత్రలో ఆది సాయికుమార్ నటించారు. శషా చెట్రి, కార్తీక్ రాజు, పార్వతీశం, నిత్యా నరేశ్ కీలక పాత్రలు చేశారు. ఆది సాయికుమార్ సరిహద్దు సమరం ఓ మంచి సక్సెస్ కోసం సరిహద్దుకు వెళ్లారు హీరో తనీష్. ఇటీవలే ఇండస్ట్రీలో పదేళ్లు పూర్తి చేసుకున్నారు తనీష్. 2008లో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘నచ్చావులే’ హీరోగా ఇతనికి తొలి చిత్రం. ఆ తర్వాత హీరోగా చేయడంతో పాటు కృష్ణవంశీ ‘నక్షత్రం’ సినిమాలో విలన్‌గాను నటించారు. తనీష్ నెక్ట్స్ చిత్రం ‘సరిహద్దు’. హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వి. కార్తికేయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సైనికుడి పాత్రలో నటిస్తున్నారు తనీష్. కార్తికేయ–తనీష్ కాంబినేషన్లో వచ్చిన రంగు సినిమాకు మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. తనీష్ దేశాన్ని రక్షించే సైనికుడంటే ప్రజలందరికీ గౌరవం ఉంటుంది. అందుకే సినిమా సైనికులను కూడా ఆదరిస్తుంటారు. ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘సోల్జర్’ సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇవి కాకుండా రానున్న రోజుల్లో మరెంతో మంది సైనికులను తెరపై చూసే అవకాశం ఉంది. ముఖ్యంగా పాక్ చేతికి చిక్కి, ధైర్యంగా ఇండియా తిరిగొచ్చిన భారత ఆర్మీ కమాండర్ అభినందన్ మీద చాలా సినిమాలు వచ్చే చాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థలు అభినందన్ బయోపిక్ కోసం టైటిల్స్ రిజిస్టర్ చేశారు. మనం ఇంట్లో హాయిగా నిద్రపోగలుగుతున్నామంటే బోర్డర్లో సైనికుల కాపలానే కారణం. అందుకే సెల్యూట్ సైనికా.. రైఫిల్ మేన్ వస్తాడా? ఈ ఏడాది నేషనల్ ఆర్మీడే (జనవరి 15) సందర్భంగా ‘రైఫిల్‌మేన్’ అనే సినిమాలో సోల్జర్‌గా నటించనున్నట్లు వెల్లడించారు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. స్మాల్ టీజర్‌ని కూడా రిలీజ్ చేశారు. సోల్జర్ జస్వంత్‌సింగ్ రావత్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వచ్చాయి. ఆయన జీవితంపై సినిమా తీసే హక్కులు మాకే ఉన్నాయంటూ ఓ ప్రొడక్షన్ హౌస్ ముందుకు వచ్చిందట. దాంతో ప్రస్తుతానికి ‘రైఫిల్‌మేన్’ చిత్రం లీగల్ సమస్యలను ఎదుర్కొంటోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కార్గిల్ అమ్మాయి సరిహద్దులో పాకిస్తాన్‌తో యుద్ధం చేయడానికి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ పైలెట్‌గా మారారు. 1999లో జరిగిన కార్గిల్ వార్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఫస్ట్ ఉమెన్ గుంజన్ సక్సెనా కీలకంగా వ్యవహరించారు. ఆమె జీవితం ఆధారంగా రూపొందనున్న సినిమాలో గుంజన్ పాత్రను జాన్వీ చేస్తున్నారు. ఇందుకోసం జాన్వీ విమానం నడపడంలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. శరన్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ‘కార్గిళ్ గాళ్’ అనే టైటిల్ కూడా పెట్టారని బాలీవుడ్ సమాచారం. ఇటీవల మేజర్ షూటింగ్ లక్నోలో ప్లాన్ చేశారు. వేసవిలోపు ఈ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారట. ఒక్కటంటే ఒక్క సినిమాలో మాత్రమే నటించిన జాన్వీ కపూర్‌కు ఇంత తొందరగా బయోపిక్ చాన్స్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. మరి.. జాన్వీ ఏ మేరకు ఆడియన్స్‌ను మెప్పిస్తుందో తెలియాలి. జాన్వీ కపూర్ అప్పుడు నీరు.. ఇప్పుడు నింగి రెండేళ్ల క్రితం లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్ వర్మగా నీటి లోపల పాకిస్తాన్ శత్రువులతో పోరాడారు రానా. ఇది ‘ఘాజీ’ చిత్రం కోసం. ఇప్పుడు ‘భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ కోసం రానా మళ్లీ లెఫ్టినెంట్ కల్నల్‌గా బాధ్యతలు చేపట్టారు. 1971 ఇండో–పాక్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. గుజరాత్‌లోని భుజ్ ఎయిర్‌పోర్ట్‌పై పాకిస్తాన్ బాంబుల వర్షం కురిపించినప్పుడు ఏం జరిగింది? అనే అంశంపై ఈ సినిమా తెరకెక్కనుంది. అభిషేక్ దుథాయియా దర్శకత్వం వహిస్తారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ వింగ్ కమాండర్ కల్నల్ విజయ్ పాత్రలో హీరోగా నటిస్తారు అజయ్ దేవగన్. మద్రాస్‌కి చెందిన లెఫ్టినెంట్ కల్నల్ పాత్రను రానా చేస్తున్నారు. సంజయ్‌దత్, సోనాక్షీ సిన్హా, పరిణీతీ చోప్రా ఇతర కీలక పాత్రధారులు. అలాగే ‘1945’ (తమిళంలో ‘మడైతిరందు’) అనే సినిమాలో కూడా రానా స్వాతంత్య్రానికి పూర్వం నాటి సైనికుడి పాత్రలో రానా కనిపిస్తారని తెలిసింది. దీనికోసం ప్రత్యేక కసరత్తులు చేశారట. రానా సైన్యంలో చేరతారా? ‘సైనికుడు’ పేరుతో వచ్చిన సినిమాలో మహేశ్‌బాబు నటించారు కానీ సరిహద్దు సైనికుడిలా మాత్రం కనిపించలేదు. అయితే..‘పోకిరి, దూకుడు, ఆగడు’ వంటి చిత్రాల్లో బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఇప్పుడు మహేశ్ సైన్యంలో చేరే సమయం ఆసన్నమైందని ఫిల్మ్ నగర్ సమాచారం. మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఆర్మీ ఆఫీసర్‌గా మహేశ్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. మహేశ్‌బాబు ఆర్మీ ఆఫీసర్ సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు సాగే ఫన్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని టాక్. ఇక వెంకటేశ్‌తో కలిసి నాగచైతన్య నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’. కేఎస్. రవీంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలిసింది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ రాజమండ్రిలో జరిగింది. ఆ లొకేషన్లో ఆర్మీ ఆఫీసర్ కాస్ట్యూమ్స్ కనిపించడంతో నాగచైతన్య ఆర్మీ ఆఫీసర్‌గా నటించబోతున్నారనే టాక్‌కు మరింత బలం చేకూరినట్లయింది. మహేశ్‌బాబు, నాగచైతన్య ఆర్మీ జాయినింగ్ గురించి అధికారిక ప్రకటన వస్తే మరింత స్పష్టత లభిస్తుంది. -
ఆకట్టుకుంటున్న ‘కేదార్నాథ్’ ట్రైలర్
బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీఖాన్(సైఫ్ అలీఖాన్- అమృతా సింగ్ కుమార్తె)ను సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేస్తూ తెరకెక్కుతోన్న సినిమా కేదార్నాథ్. 2013లో చార్ధామ్ ప్రాంతంలో ముఖ్యంగా కేదార్‌నాథ్‌లో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు అభిషేక్ కపూర్ దర్శకుడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేసింది మూవీ యూనిట్. కేదార్నాథ్ యాత్ర ప్రాశస్త్యాన్ని వర్ణిస్తూ మొదలైన ట్రైలర్ సారా- సుశాంత్‌ల పరిచయం, వారి ప్రేమ గురించి తెలిసిన పెద్దలు తీసుకున్న నిర్ణయం తదితర అంశాలతో ఆసక్తికరంగా సాగుతుంది. ఆలయ పరిసరాలను వరద ముంచెత్తడం, సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. హిందూ యువతి- ముస్లిం యువకుడి ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డిసెంబర్ 7న విడుదల చేయనున్నారు. -
డిసెంబర్ 7న ‘కేదార్నాథ్’
బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా కేదార్నాథ్. 2013లో ఉత్తరాదిని, ముఖ్యంగా కేదార్నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు అభిషేక్ కపూర్ దర్శకుడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఆలయ పరిసరాల్లో భారీగా నీరు చేరటం సహాయక చర్యలకు సంబంధించిన విజువల్స్‌తో టీజర్‌ను థ్రిల్లింగ్ గా కట్ చేశారు. ప్రేమ కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గౌడీకుండ్ నుంచి కేదార్నాథ్ మధ్య ప్రాంతంలో చిత్రీకరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
బెంగళూర్ టు ముంబై
సౌత్ నుంచి సూపర్ హిట్ సినిమాల ఎగుమతి ఈ మధ్య బాగా జరుగుతోంది. తాజాగా నాలుగేళ్ల క్రితం దుల్కర్ సల్మాన్, నజ్రియా నజీమ్ నటించిన మలయాళం బ్లాక్‌బస్టర్ ‘బెంగళూర్ డేస్’ కూడా బాలీవుడ్లో రీమేక్ కానుందట. ‘యం.యస్.థోని’ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఈ సినిమాను హిందీ ఆడియన్స్‌కు అందించాలనుకుంటున్నారట. కేవలం నిర్మించడమే కాకుండా మలయాళంలో నివిన్ పౌలీ చేసిన పాత్రను హిందీ రీమేక్‌లో పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారట ఈ యంగ్ హీరో. ఈ సినిమా రైట్స్ ప్రొడ్యూసర్ వివేక్ రంగాచారీతో ఉండటంతో, ఆ నిర్మాతతో రీమేక్ విషయంపై చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తయ్యేలోపు ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారట సుశాంత్ సింగ్. -
బాలీవుడ్‌కు సౌత్ సూపర్ హిట్
దక్షిణాదిలో ఘన విజయం సాధించిన చాలా చిత్రాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ముఖ్యగాం సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోలు కూడా రీమేక్ లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తుండటంతో సౌత్ సినిమా రీమేక్ రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. తాజాగా అర్జున్ రెడ్డి, టెంపర్ లాంటి సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సౌత్ సూపర్ హిట్ చేరనుంది. 2014లో మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమా బెంగళూర్ డేస్. దుల్కర్సల్మాన్, నివిన్ పౌలీ, నిత్యా మీనన్ ప్రధాన, నజ్రియా నజీమ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తానే స్వయంగా నటిస్తూ నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
12 నిజ జీవిత పాత్రల్లో యంగ్ హీరో
ఎమ్ఎస్ ధోని బయోపిక్‌తో ఒక్కసారిగా స్టార్ లీగ్‌లో ఎంటర్ అయిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. ధోని పాత్రలో జీవించిన ఈ యువ నటుడు ఇప్పుడు మరో సాహసానికి రెడీ అవుతున్నాడు. ఒకటి రెండు కాదు ఏకంగా 12 నిజజీవిత పాత్రల్లో నటించేందుకు ఓకె చెప్పాడు. 540బిసి నుంచి 2015 ఏడి మధ్య కాలానికి చెందిన 12 మంది మేధావుల జీవితాలను సిరీస్‌గా రూపొందిస్తున్నారు. ఈ సిరీస్‌లో చాణక్యుడు, రవీంద్రనాథ్ ఠాగూర్, అబ్దుల్ కలాం లాంటి వారి జీవితాలను తెరకెక్కించనున్నారు. ఈ 12 కథలో లీడ్ రోల్స్‌లో నటించేందుకు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రెడీ అవుతున్నాడు. తన స్నేహితుడు వరుణ్ మథుర్‌తో కలిసి సుశాంత్ ఈ సిరీస్‌ను స్వయంగా నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుశాంత్ ఈ సిరీస్ మరింత పేరు తెచ్చిపెడుతుందని భావిస్తున్నారు.