‘సుశాంత్‌ నాకు చంద్రుడిని చూపించాడు’ | Shraddha Kapoor Says Sushanth Show Me The Moon Through His Telescope | Sakshi
Sakshi News home page

వైరలవుతోన్న హీరోయిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ సందేశం

Published Thu, Jun 18 2020 9:46 PM | Last Updated on Thu, Jun 18 2020 9:52 PM

Shraddha Kapoor Says Sushanth Show Me The Moon Through His Telescope - Sakshi

హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌ ఎక్కడైనా.. ఎప్పుడైనా పాటపాడుతూ అందుకనుగుణంగా డ్యాన్స్‌ చేసేవాడని.. ప్రతిరోజూ చాలా హుషారుగా ఉండేవాడని అంటున్నారు హీరోయిన్‌ శ్రద్ధాకపూర్‌. ‘చిచోరే’లో తన సహనటుడైన సుశాంత్‌తో ఉన్న జ్ఞాపకాలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. సుశాంత్‌ మానవత్వం, తెలివి, జీవితంపై ఆసక్తిగల వ్యక్తి అని ఆమె గుర్తుచేసుకున్నారు. అంతేకాక  టెలిస్కోప్‌ నుంచి సుశాంత్‌ తనకు చందమామను చూపించాడని.. ఆ అనుభవాన్ని ఎప్పటికి మర్చిపోలేనన్నారు శ్రద్ధ. ఈ క్రమంలో ‘ఏమి జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. కానీ, ఇది చాలా కష్టంగా అనిపిస్తున్నది. అంతా శూన్యంలా తోస్తోంది.. సుశాంత్‌.. డియర్‌ సుశ్‌..’ అంటూ శ్రద్ధ వ్యాఖ్యానించారు. 2019లో విడుదలైన చిచోరే సినిమాలో శ్రద్ధాకపూర్, సుశాంత్‌ సరసన నటించిన సంగతి తెలిసిందే. (బాలీవుడ్‌ బంధుప్రీతిపై వైరల్‌ వీడియో​)

కాగా, సినిమా షూటింగ్‌ అప్పుడు సుశాంత్‌ను తాను సెట్‌లో గమనిస్తుండేదానినని, అతడితో మాట్లాడేందుకు ఇష్టపడేదానినని శ్రద్ధా కపూర్‌ గుర్తుచేసుకున్నారు. తాము ఎక్కువగా విశ్వం, లైఫ్‌ ఫిలాసఫీల గురించి చర్చించుకునేవాళ్లమని ఆమె తెలిపారు. అతనితో ఉన్నంతసేపు గమ్మత్తైన ప్రదేశంలో ఉన్నట్లు అనిపించేదన్నారు. పని విషయంలో సుశాంత్‌ ఎంతో అంకితభావం ప్రదర్శించేవాడని తెలిపారు. తనతో పాటు తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించేవాడని గుర్తు చేసుకున్నారు. ఒకసారి ‘చిచోరే’ టీమ్‌ అంతా సుశాంత్‌ ఇంటికి వెళ్లారని.. అక్కడి ప్రకృతి సౌందర్యానికి తాము ఫిదా అయ్యామన్నారు. సుశాంత్‌ తనకు తానే సాటి అని తెలిపారు. మెసేజ్‌తో పాటు చిచోరే షూటింగ్‌ సమయంలో తీసుకున్న ఫోటోని, విన్సెంట్ వాన్ గోహ్ ‘స్టారి నైట్’ ఫోటోతో కలిపి ఉన్న చిత్రాన్ని పోస్ట్‌ చేశారు. శ్రద్ధా కపూర్‌ మెసేజ్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 
 

Been trying to accept what has happened and coming to terms with it is very difficult. There is a huge void... Sushant...! Dearest Sush...! Full of humility, intelligence, curiosity about life, seeing beauty in everything, everywhere! He danced to his own tune! I always looked forward to seeing him on set, wondering what captivating interaction we would have next! Apart from being a wonderful co-actor who put his heart and soul in to his work, he was at his core, an amazing person. He cared for people and wanted to see them happy. His kind smile, the conversations we had at shoot about the Cosmos, different philosophies, the moments we spent together, were filled with magical wonderment! During a lovely musical and poetry filled get together at his home (he loved music and poetry), he showed me the moon from his telescope and I was so speechless that I could see it’s exquisite beauty up close!! He wanted to share that feeling! Our Chhichhore gang went to his beautiful home in Pavna, where we were awestruck together with the peace and calm of the nature around us - he loved nature! He saw things through a kaleidoscopic lens and wanted to share that with everyone around him. He was mesmerized by the simplest things and would muse on them in a genius way...! He was truly, One of a kind... I’ll miss you.. dearest Sush.. Shine on... ✨💜

A post shared by Shraddha ✶ (@shraddhakapoor) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement