
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ప్రభాస్ సరసన 'సాహో'లో హీరోయిన్ గా చేసింది. అయితే శ్రద్ధా ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఇంటి ఈమె తండ్రి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్మేశాడు. బాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు.
(ఇదీ చదవండి: దిగ్గజ హీరో శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం)
బాలీవుడ్ సెలబ్రిటీలు ఓవైపు నటిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. అంటే ఓ బంగ్లా లేదంటే అపార్ట్ మెంట్ కొనడం, కొన్నిరోజుల తర్వాత దాన్ని లక్షలు లేదంటే కోట్ల రూపాయల లాభానికి అమ్మడం లాంటివి చేస్తుంటారు. అమితాబ్ ఈ విషయంలో ముందుంటాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడేమో?
ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహూ ప్రాంతంలో సిల్వర్ బీచ్ హెవెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు దీన్నే రూ.6.11 కోట్లకు శక్తి కపూర్ విక్రయించారట. మూడు నెలల క్రితమే అంటే డిసెంబరులోనే ఈ డీల్ జరిగిపోయింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పిరమాల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో మరో అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. మరి ఇదెప్పుడో అమ్మేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
Comments
Please login to add a commentAdd a comment