Shakthi kapoor
-
కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు
బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగులోనూ ప్రభాస్ సరసన 'సాహో'లో హీరోయిన్ గా చేసింది. అయితే శ్రద్ధా ఎంతో ప్రేమతో బహుమతిగా ఇచ్చిన ఇంటి ఈమె తండ్రి ఏకంగా కోట్ల రూపాయలకు అమ్మేశాడు. బాలీవుడ్ సర్కిల్ లో ఈ విషయమే మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: దిగ్గజ హీరో శివాజీ గణేశన్ ఇల్లు జప్తు.. హైకోర్ట్ సంచలన ఆదేశం)బాలీవుడ్ సెలబ్రిటీలు ఓవైపు నటిస్తూనే రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటారు. అంటే ఓ బంగ్లా లేదంటే అపార్ట్ మెంట్ కొనడం, కొన్నిరోజుల తర్వాత దాన్ని లక్షలు లేదంటే కోట్ల రూపాయల లాభానికి అమ్మడం లాంటివి చేస్తుంటారు. అమితాబ్ ఈ విషయంలో ముందుంటాడు. ఇప్పుడు శ్రద్ధా కపూర్ తండ్రి శక్తి కపూర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నాడేమో?ఎందుకంటే కొన్నాళ్ల క్రితం శ్రద్ధా కపూర్.. ముంబైలోని జుహూ ప్రాంతంలో సిల్వర్ బీచ్ హెవెన్ కో-ఆపరేటివ్ సొసైటీలో ఓ అపార్ట్ మెంట్ ని బహుమతిగా ఇచ్చింది. ఇప్పుడు దీన్నే రూ.6.11 కోట్లకు శక్తి కపూర్ విక్రయించారట. మూడు నెలల క్రితమే అంటే డిసెంబరులోనే ఈ డీల్ జరిగిపోయింది. ఇది జరిగిన కొన్నిరోజులకే పిరమాల్ మహాలక్ష్మి సౌత్ టవర్ లో మరో అపార్ట్ మెంట్ కొనుగోలు చేశారు. మరి ఇదెప్పుడో అమ్మేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?) -
మా అమ్మాయిని షూటింగ్‌కి పంపను
‘‘పని ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. అయితే ప్రాణాలను పణంగా పెట్టేంత ముఖ్యం కాదని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నేనైతే బయటికి వెళ్లి పని (షూటింగ్) చేయను. మా అమ్మాయి (శ్రద్ధాకపూర్)ని కూడా షూటింగ్ చేయడానికి అనుమతించను’’ అంటున్నారు బాలీవుడ్ బడా విలన్ శక్తీ కపూర్. ‘ఇక సినిమా, టీవీ షూటింగ్స్ చేసుకోవచ్చు’ అని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సినీపరిశ్రమవారికి అనుమతి ఇస్తున్నాయి. కొన్ని నియమ నిబంధనలు కూడా విధించాయి. మహారాష్ట్రలో షూటింగులు మొదలయ్యాయి కూడా. అయితే ఎన్ని జాగ్రత్తలు పాటించినా షూటింగ్స్‌లో పాల్గొనడం అంత శ్రేయస్కరం కాదంటున్నారు శక్తీ కపూర్. ‘‘భయం (కరోనా) అనేది మనల్ని ఇంకా వదిలిపెట్టలేదు. మనతోపాటే ఉంది. ముందు ముందు మరింత ప్రమాదం పొంచి ఉంది. అందుకే నా పిల్లలను మాత్రం బయటకు పంపను. ఇండస్ట్రీలోని మా గ్రూప్‌లో ఉన్న కొంతమందితో ‘ఆరోగ్యపరమైన సమస్య వచ్చి హాస్పిటల్లో చేరి బిల్లులు కట్టేకన్నా కొంతకాలం వేచి ఉండటం మంచిది’ అని చెప్పాను. ఎందుకంటే బయటి పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు శక్తీ కపూర్. కరోనా బారినపడినవారి సంఖ్య పెరుగుతుండటంతో హాస్పటల్స్‌లో బెడ్స్ కొరత ఏర్పడుతోంది. ఇదే విషయం గురించి శక్తీ కపూర్ మాట్లాడుతూ – ‘‘హాస్పిటల్స్‌లో బెడ్స్ లేవు. పైగా హాస్పిటల్లో జాయిన్ అయితే బిల్ బాంబ్లా మోత మోగిపోతుంది. చికిత్స చేయించుకుని హాస్పటల్ బిల్ కట్టలేకపోవడంతో ఒక వ్యక్తిని తాడుతో కట్టేశారని ఈ మధ్య న్యూస్‌లో చూశాను. దీని గురించి ఓ వీడియో చేయబోతున్నాను. ప్రపంచం చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మానవీయత అనేది లేదేమో అనిపిస్తోంది’’ అన్నారు. -
రావణుడిగా హీరోయిన్ తండ్రి
దేశ రాజధాని ఢిల్లీలో ఏటా ఘనంగా నిర్వహించే దసరా వేడుకల్లో ఈసారి ఓ హీరోయిన్ తండ్రి రావణాసురుడి వేషం వేసి అందరినీ అలరించారు. తన అందం, అభినయంతో ప్రస్తుతం బాలీవుడ్‌ని ఊపేస్తున్న గులాబి బాల శ్రద్ధా కపూర్ తండ్రి, ప్రముఖ నటుడు శక్తి కపూర్ ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో రావణాసురుడి వేషం వేసి అందరినీ ఆకట్టుకున్నారు. ఉత్తరాదిలో దసరాను ఎంతో వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రధానంగా రాంలీలా మైదానంలో భారీ ఎత్తున రావణాసురుడి బొమ్మను పెట్టి.. దాన్ని దహనం చేయించడం అలవాటు. అలాగే పలువురు ప్రముఖులు కూడా వీటిలో రకరకాల వేషాలు వేస్తుంటారు. ఈసారి ఢిల్లీ ఎర్రకోట వేడుకల్లో శక్తి కపూర్ తన నటనా సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా ప్రజలకు చూపించారు. సినిమాల్లో విలన్‌గా ఎంత భయపెట్టగలడో కమెడియన్‌గా అంతే నవ్వించగల విలక్షణ నటుడు 'శక్తి కపూర్'. ఆయన ముద్దుల తనయ శ్రద్ధా కపూర్ కూడా తండ్రి బాటలోనే తన మార్క్ నటనతో బాలీవుడ్లో స్థానం సుస్థిరం చేసుకుంటోంది. -
మెసేజ్‌లతో చంపేశారు..
బాలీవుడ్ విలన్ శక్తికపూర్ను కొందరు ఆకతాయిలు మెసేజ్‌లతో ‘చంపేశారు’. వెండితెరపై ప్రేక్షకులను గడగడలాడించిన విలన్ కాస్తా మెసేజ్‌ల తాకిడికి బిక్కచచ్చిపోయాడు. ఇంతకూ ఏం జరిగిందంటే, ఖండాలా వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శక్తికపూర్ దుర్మరణం చెందాడని కొందరు ఆకతాయిలు ‘వాట్సప్’లో మెసేజ్ పుట్టించారు. ఈ మెసేజ్ శరవేగంగా బాలీవుడ్ అంతటా పాకింది. దీంతో శక్తికపూర్ ఫోన్‌కు శనివారం వేకువ జామునే సంతాప సందేశాల వెల్లువతో పాటు, సన్నిహితుల నుంచి ఫోన్‌కాల్స్ మొదలవడంతో అందరికీ పేరు పేరునా తాను క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకోవడానికి నానా తంటాలు పడ్డాడు.