
ఈమె ప్రస్తుతం స్టార్ హీరోయిన్. తండ్రి విలన్ పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు కావడంతో సులువుగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఒకేఒక్క పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేసింది. మరి ఇంతలా చెప్పాం కదా ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?
(ఇదీ చదవండి: పెళ్లికి ముందే విడాకులు.. హైదరాబాద్ అబ్బాయితో తమన్నా కటిఫ్)
పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి మరెవరో కాదు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. 2010 నుంచి హీరోయిన్ గా వరస సినిమాలు చేస్తోంది. తొలుత గ్లామరస్ రోల్స్ చేసింది. 'ఆషికి 2' మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన 'సాహో'లో హీరోయిన్ ఈమెనే. కాకపోతే పెద్ద హిట్ కాకపోవడంతో మరో తెలుగు మూవీలో చేయలేదు.
రీసెంట్ టైంలో 'స్త్రీ 2' అనే హీరోయిన్ ఓరియెంటెడ్ హారర్ మూవీలో నటించింది. ఇదేమో ఏకంగా రూ.600 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డులు నెలకొల్పింది. 'పుష్ప 2'లోని కిస్సిక్ పాట కోసం ఈమెనే తొలుత సంప్రదించారు గానీ రెమ్యునరేషన్ సమస్యలతో నో చెప్పేసింది.
(ఇదీ చదవండి: కూతురిచ్చిన గిఫ్ట్.. రూ.6 కోట్లకు అమ్మేసిన నటుడు)
ప్రస్తుతానికైతే ఈమె కొత్తగా ఏ మూవీ చేస్తున్నట్లు లేదు. గానీ ఎన్టీఆర్ తొలి హిందీ మూవీ అయిన 'వార్ 2'లో శ్రద్ధా కపూర్.. ఐటమ్ సాంగ్ చేస్తుందనే రూమర్స్ వస్తున్నాయి. మరి అవి నిజమో కాదో చూడాలి.
సినిమాల సంగతి పక్కనబెడితే 38 ఏళ్ల శ్రద్ధా పెళ్లి గురించి ఎప్పటికప్పుడు రూమర్స్ వస్తూనే ఉంటాయి. హీరో ఆదిత్య రాయ్ కపూర్, ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ఠ ఇలా చాలా పేర్లు వినిపించాయి. ప్రస్తుతం రైటర్ రాహుల్ మోదీతో డేటింగ్ వార్తలు వస్తున్నాయి. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో?
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 11 సినిమాలు.. మరి థియేటర్లలో?)
Comments
Please login to add a commentAdd a comment