మూన్‌పై ల్యాండ్‌ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా! | Chandrayaan-3: How to buy land on moon? check details here - Sakshi
Sakshi News home page

మూన్‌పై ల్యాండ్‌ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!

Published Thu, Aug 24 2023 3:39 PM

 Chandrayaan3 How to buy land on moon check details here - Sakshi

చంద్రయాన్‌-3 సాప్ట్‌ ల్యాండ్‌ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా?  అక్కడ ల్యాండ్‌ ఎంత  ఉంటుంది.  మూన్ ఎస్టేట్‌,  చందమామ విల్లాస్‌, జాబిల్లి రిసార్ట్స్‌ అంటూ అక్కడి రియల్‌  ఎస్టేట్‌ వ్యాపారం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.  ఇప్పటికే బాలీవుడ్‌హీరో షారుఖ్‌ ఖాన్‌, దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌  చంద్రుడిపై  సైట్‌ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. 

చంద్రునిపై భూమిని కొనగలరా?
చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది  ఆలోచిస్తూ ఉంటారు. భూమిని  కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి  1967లో భారత్‌తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూ​ఏ  కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి.  దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి.  ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ,  ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి.

చంద్రునిపై ల్యాండ్‌ కొన్న కొందరు ప్రముఖులు
చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్‌పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను కూడా ఆమె చూపించారు.

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా  ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట.

అలాగే  అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్‌ పట్ల ఎంతో  ఆసక్తి ఉన్న యాక్టర్‌ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌(Sushanth Singh Rajput).  సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్‌ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్‌కి చెందిన ఒక బిజినెస్‌ మేన్‌ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు.

అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా  తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు.

20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు
రాజీవ్ వి బగ్ధి  దాదాపు 20ఏళ్ల  క్రితమే 5 ఎకరాల ప్లాట్‌ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్‌ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్‌లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement