Success
-
కోహ్లీ లేకపోతే.. టీసీఎస్ లేదు
ప్రపంచంలోనే టాప్ ఐటీ కంపెనీల్లో ఒకటి.. 6,00,000 మంది ఉద్యోగులు.. దాదాపు 46 దేశాల్లో కార్యకలాపాలు.. సృజనాత్మక పనితనానికి పెట్టింది పేరు.. ఐటీ పరిశ్రమలో దిగ్గజ కంపెనీగా వెలుగొందుతున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురించి తెలియనివారుండరు. టాటా గ్రూప్ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు రతన్ టాటా, జేఆర్డీ టాటాలు. టీసీఎస్‌ను స్థాపించడం కూడా వారిలో ఒకరి ఆలోచనే అని చాలామంది అనుకుంటారు. కానీ భారతదేశాన్ని ఐటీ రంగంలో ప్రపంచంలో ముందుంచేలా చేసిన టీసీఎస్ స్థాపన ఆలోచన ఒక పాకిస్థానీదని తక్కువ మందికే తెలిసుంటుంది. ఆ విశేషాలు ఏమిటో చూసేద్దాం.భారత ఐటీ పితామహుడుమార్చి 2025 నాటికి రూ.12.92 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన ప్రపంచ ఐటీ పరిశ్రమలో టాప్ కంపెనీల్లో ఒకటిగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) పుట్టుకకు ప్రస్తుతం పాకిస్థాన్‌కు చెందిన ‘భారత ఐటీ పితామహుడు’గా పిలువబడే ఫకీర్ చంద్ కోహ్లీ అనే వ్యక్తి. ఆయన చేసిన కృషి టీసీఎస్‌ను ఇండియాలో ఐటీ పవర్ హౌజ్‌గా మార్చేందుకు కారణమైంది. దాంతోపాటు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భారత్ కేంద్రంగా మారేందుకు తోడ్పడింది.అప్పటి భారత్.. ఇప్పటి పాకిస్థాన్‌లో పుట్టి..భారత్-పాకిస్థాన్ విభజనకు ముందు 1924లో (అప్పుడు పాకిస్థాన్ భారత్‌లోనే ఉండేది) ప్రస్తుత పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఫకీర్ చంద్ కోహ్లీ జన్మించారు. అతని విద్యాభ్యాసం లాహోర్‌లో జరిగింది. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఇంగ్లీష్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. కెనడాలో క్వీన్స్ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదివి, అమెరికాలోని ప్రతిష్ఠాత్మక మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) నుంచి సిస్టమ్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ సాధించారు.టీసీఎస్ పుట్టిందిలా..కోహ్లీ 1951లో భారతదేశానికి తిరిగి వచ్చి టాటా ఎలక్ట్రిక్ కంపెనీలో చేరారు. తాను కంప్యూటర్ ఆధారిత ఆటోమేషన్ ద్వారా కార్యకలాపాలను ఆధునీకరించడంలో నిష్ణాతుడు. దాంతో త్వరగా సంస్థలో ఎదిగారు. అతడి వినూత్న విధానాలు అప్పటి టాటా గ్రూప్ ఛైర్మన్ జేఆర్డీ టాటా దృష్టిని ఆకర్షించాయి. ఆయన కొత్త వెంచర్‌కు నాయకత్వం వహించే సామర్థ్యాన్ని కోహ్లీలో చూశారు. ఒకరోజు భవిష్యత్తులో టెక్నాలజీ అభివృద్ధి చెందుతుందనే ఆలోచనను జేఆర్డీతో పంచుకుంటూ.. అందుకుగల కారణాలను కోహ్లీ విశ్లేషించారు. దాంతో 1968లో టీసీఎస్ ఆవిర్భవించింది. కోహ్లీ దాని సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కంపెనీకి తొలి సీఈఓగా నియామకం అయ్యారు.కొత్త శిఖరాలకు టీసీఎస్భారత సాంకేతిక మౌలిక సదుపాయాలు అంతగా లేని సమయంలో సాఫ్ట్వేర్ సర్వీసుల్లో దేశం ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని కోహ్లీ ఊహించారు. ఆయన నాయకత్వంలో టీసీఎస్ ఒక మోస్తరు కార్యకలాపాల నుంచి దేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థగా అభివృద్ధి చెందింది. సాఫ్ట్వేర్ ఎగుమతులకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రపంచ వేదికపై దేశాన్ని విశ్వసనీయ సంస్థగా నిలిపింది. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ వంటి దిగ్గజ సంస్థలతో అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడంలో కోహ్లీ వ్యూహాత్మక దూరదృష్టి ఎంతో తోడ్పడింది. ఇది టీసీఎస్‌ను కొత్త శిఖరాలకు చేర్చింది. 2003 నాటికి కంపెనీ బిలియన్ డాలర్ల(రూ.8,300 కోట్లు) ఆదాయాన్ని సాధించడంలో సహాయపడింది.నాస్కామ్కు అధ్యక్షుడు, ఛైర్మన్‌గా..భారతదేశం అభివృద్ధి చెందాలంటే బలమైన ఐటీ ఎకోసిస్టమ్ అవసరమని ఆయన అర్థం చేసుకున్నారు. భారతదేశపు ప్రముఖ ఐటీ అడ్వకసీ సంస్థ(న్యాయ కార్యకలాపాలు నిర్వహణ) నాస్కామ్కు 1995-1996 కాలంలో అధ్యక్షుడిగా, ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జాతీయ ఐటీ విధానాలను రూపొందించడంలో, పరిశ్రమ, విద్యా సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.ఇదీ చదవండి: ఆర్థిక తారతమ్యాల భారతం!పద్మభూషణ్‌తో సత్కారంకోహ్లీ ప్రభావం కార్పొరేట్ విజయాలకే పరిమితం కాలేదు. టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ సహా భావి నాయకులకు ఆయన మార్గనిర్దేశం చేశారు. 1999లో పదవీ విరమణ చేసిన తరువాత కూడా వయోజన అక్షరాస్యత, ప్రాంతీయ ల్యాంగ్వేజీ కంప్యూటింగ్ వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని హైలైట్ చేశారు. 2002లో భారతదేశపు మూడో అత్యున్నత పౌరపురస్కారం పద్మభూషణ్‌ను అందుకున్నారు. వినియోగదారుల హక్కుల కార్యకర్త, న్యాయవాది స్వర్ణ్ కోహ్లీని వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు సంతానం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే వారసత్వాన్ని మిగిల్చిన ఆయన 2020 నవంబర్ 26న తన 96వ ఏట కన్నుమూశారు. -
నాలుగు వారాల కొరియన్ డైట్ ప్లాన్ : 6 రోజుల్లో 4 కిలోలు
అధిక బరువును తగ్గించుకోవాలంటే..భారీ కసరత్తే చేయాలి. చెమట చిందిస్తేనే అదనపు కొవ్వు కరుగుతుంది. అయితే ఇది అంత ఈజీ కాదు. పట్టుదల, కృషి ఉండాలి. అలాగే ఏదో యూట్యూబ్‌లోనో, ఇంకెవరోచెప్పారని కాకుండా, శరీరంపై మనంతీసుకుంటున్న ఆహారంపైనా అవగాహన పెంచుకుని, శ్రద్ధపెట్టి, నిపుణుల సలహా తీసుకని ఈ ప్రక్రియను మొదలు పెట్టాలి. విజయం సాధించాలి. అలా కేవలం ఆరు రోజుల్లో నాలుగు కిలోల బరువు తగ్గించుకుందో మోడల్. ఆ తరువాత తన సక్సెస్ గురించి ఇన్‌స్టాలో షేర్ చేసింది.సియోల్‌లో ఉంటున్న ఫ్రీలాన్స్ మోడల్' షెర్రీ తరచుగా ఫిట్నెస్ రహస్యాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఆసక్తికరమైన వీడియోను పోస్ట్ చేసింది. కండరాల నష్టం లేకుండా 6 రోజుల్లో 4 కిలోల బరువు తగ్గిన విధానాన్ని తన అభిమానులతో పంచుకుంది. దీన్ని కొరియన్ 'స్విచ్ ఆన్' డైట్ అంటారట. ఆహారం, ఉపవాసం, అధిక ప్రోటీన్ భోజనం ఈ మూడు పద్దతులను అనుసరించినట్టు తెలిపింది. View this post on Instagram A post shared by Sherrie 셰리 🌸 | 외국인 모델 (@shukiiii)ఆహారం జీవనశైలి మార్పుల వివరాలనుఇలా పంచుకుంది..“నేను ఎలాంటి ఆహారం/జీవనశైలి మార్పులు చేసుకోవాలి లాంటి సలహా ఇవ్వడం లేదు. అంత ఎక్స్‌పర్ట్‌ని కూడా కాదు. కేవలం నా సొంత అనుభవం. కాబట్టి దీన్ని దయచేసి నా అనుభవంలాగే తీసుకోండి అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది.చదవండి: సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ పెళ్లి ఫోటోలు వైరల్, ఎవరు తీశారో ఊహించగలరా?షెర్రీ వెయిట్ లాస్ జర్నీఆరు రోజుల్లో 4 కిలోలు తగ్గాను , ఎలా చేశానంటే.. తొలుత 'స్విచ్ ఆన్ (డైట్)' గురించి చెప్తా. ఇది చాలా కాలం పాటు బరువును నిలుపుకోవడంలో నాకు సహాయపడుతుంది. ఇది ఒక కొరియన్ వైద్యుడు అభివృద్ధి చేసిన 4 వారాల కార్యక్రమం. ఇది కండరాల నష్టాన్ని నివారించడంతో పాటు కొవ్వు జీవక్రియను సక్రియం చేయడంలో , ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలోసహాయపడుతుంది. ప్రాథమికంగా ఇది ఎలా పనిచేస్తుంది...”కండరాల శక్తి కోల్పోకుండా బరువుతగ్గాలంటే సరైన పోషకాహారం అవసరం. తగినంత ప్రోటీన్ తినేలా చూసుకుంది. అలాగే కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లేకుండా జాగ్రత్త పడింది. ఉపవాసాలను కూడా తన డైట్ ప్లాన్‌లో చేర్చుకుంది.ఇంకా ఇలా చెప్పింది:మొదటి వారం: ప్రోటీన్ షేక్స్, కూరగాయలు , అధిక ప్రోటీన్ భోజనం తీసుకుంది. తద్వారా శరీరం నుంచి మలినాలు బైటికిపోతాయి. గట్ ఆరోగ్యం బలపడుతుంది. రెండో వారం అధిక మజిల్ రికవరీ కోసం ప్రోటీన్ భోజనం , ఉపవాసాలు చేసింది. మూడో వారంలో ఎక్కువ ఫాస్టింగ్ని ప్రాధాన్యత ఇచ్చింది. అలాగే అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ, ఎక్కువ కొవ్వు కరిగేలా జాగ్రత్త పడింది. ఏమి తినాలి ? ఏమి తినకూడదు?షెర్రీ స్విచ్ డైట్ ప్లాన్ ప్రకారం మూడు రోజుల్లో తొలి రోజు అల్పాహారం, భోజనం, స్నాక్స్ , రాత్రి భోజనం అన్నీ ప్రోటీన్ షేక్ మీల్స్ మాత్రమే. ఇక మిగిలిన రెండు రోజుల్లో ప్రోటీన్ షేక్స్ 'కార్బ్-లెస్' మిశ్రమం, ఇంకా మల్టీ-గ్రెయిన్ రైస్, ఉడికించిన కొవ్వు లేని చికెన్, చేపలు, స్కిన్ లెస్ చికెన్, గింజలు, గుడ్లు, బెర్రీలు, అరటిపండు, చిలగడదుంపలు వంటి ఆహారాలతో కూడిన సాధారణ భోజనం.ఈ డైట్ ప్రోగ్రామ్‌లో కెఫిన్, ఆల్కహాల్, ప్రాసెస్ చేసిన మాంసం, చక్కెర లాంటి పూర్తిగా నిషిద్ధం.స్విచ్ ఆన్ డైట్ కండరాలను కాపాడుతూ, ప్రస్తుత శక్తికోసం బాడీలోని అదనపు కొవ్వును కరిగిస్తుంది. గత ఏడాది కొవ్వు శాతాన్ని తగ్గించడంలో డైట్ సహాయపడింది. శీతాకాలంలో ఎక్కువ మొబిలిటీ లేక హార్మోన్లను ప్రభావితం చేయడంతో పాటు పేగు ఆరోగ్య సమస్యలకు దారితీసిందని అలాగే తన శరీరం నీరు పడుతుందని చెప్పుకొచ్చింది. అందుకే మళ్లీ ఈ డైట్ ప్రారంభించే ముందు 3 రోజుల ఉపవాసంతో ప్రతిదీ రీసెట్ చేసాననీ తెలిపింది. అలాగే ఈసారి పాల ఉత్పత్తులు లేకుండా కొన్ని మార్పులు చేసాను. తద్వారా తన డైట్‌ను యాంటీ ఇన్ఫ్లమేటరీగా మార్చి, ఫైబర్‌పై ఎక్కువ దృష్టి పెట్టినట్టు చెప్పింది. స్విచ్ ఆన్ డైట్ అంటే ఏమిటి?శాస్త్రీయంగా, బరువు తగ్గడం, గట్ హెల్త్ కోసం దక్షిణ కొరియాలో ట్రెండింగ్‌లో ఉన్నవిధానమే స్విచ్ ఆన్ డైట్. ఇది మజిల్స్‌కు నష్టం లేకుండా కొవ్వు కరిగించుకునేలా 4 వారాల జీవక్రియ రీసెట్ ప్రోగ్రామ్. డాక్టర్ పార్క్ యోంగ్-వూ దీన్ని రూపొందించారు. భారీ కేలరీలను తగ్గించడం, క్రాష్ డైటింగ్ లాంటి విధానం గాకుండా అడపాదడపా ఉపవాసం, శుభ్రంగా తినడం, జీవక్రియను సమతుల్యం చేయడంపై దృష్టి పెడుతుంది, అదే సమయంలో గట్ ఆరోగ్యానికి కాపాడుకునేలా జాగ్రత్త పడటం. నోట్: ఇది షెర్రీ వ్యక్తిగత అనుభవం మాత్రం అని గమనించగలరు. అధిక బరువును తగ్గించు కోవాలనుకుంటే, నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం. -
డీ–డాకింగ్ సక్సెస్
సాక్షి బెంగళూరు: ఖగోళంలో భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ఉపకరించే కీలక సాంకేతికతను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఇప్పటికే అనుసంధానం(డాకింగ్) ద్వారా ఒక్కటిగా జతకూడిన స్పెడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో బుధ వారం తొలిప్రయత్నంలోనే విజయవంతంగా వేరు చేసింది. స్పెడెక్స్ ఉపగ్రహాల డీ–డాకింగ్(విడదీత) ప్రక్రియ సజావుగా సాగిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గురువారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. ‘‘చందమామపై పరీక్షలు, మానవ సహిత వ్యోమనౌక ప్రయాణాలు, చంద్రయాన్–4, గగన్ యాన్ ప్రయోగాలకు బాటలు వేస్తూ ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్ డీఎక్స్02) శాటిలైట్ల తో డీ–డాకింగ్ సాంకేతికతను పరీక్షించాం. ఇస్రో బృందానికి అభినందనలు. ఈ ఘనత ప్రతి ఒక్క భారతీయుడి ఎదను ఉప్పొంగేలా చేసింది’’ అని మంత్రి తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. ఇప్పటికే ఇటీవల డాకింగ్ సాంకేతికతను పరీక్షించి ఆ టెక్నాలజీని అందిపుచ్చుకున్న దేశాల సరసన నిలిచిన భారత్ తాజాగా డీ–డాకింగ్ సాంకేతికతనూ ఒడిసిపట్టి అంతరిక్ష రంగంలో మరోసారి తన సత్తా చాటింది. డాకింగ్ సాంకేతికతను పరీక్షించేందుకు గత ఏడాది డిసెంబర్ 30వ తేదీన ఇస్రో స్పేడెక్స్ మిషన్‌ను ప్రయోగించింది. ఇందులో భాగంగా ఛేజర్ (ఎస్‌డీఎక్స్01), టార్గెట్ (ఎస్‌డీఎక్స్02) శాటిలైట్లను వేర్వేరు కక్ష్యల్లో నింగిలోకి ప్రవేశపెట్టింది. ఇవి కొద్దిరోజుల వ్యవధిలో దశలవారీగా చాలా నెమ్మదిగా ఒకే లక్ష్యలోకి చేరుకున్నాక వీటి అనుసంధానం(డాకింగ్) కోసం ప్రయత్నించారు. పలుమార్లు విఫలయత్నంచేసి ఎట్టకేలకు ఈఏడాది జనవరి 16వ తేదీన విజయవంతంగా వాటి డాకింగ్‌ను పూర్తిచేసింది. స్పేడెక్స్ మిషన్‌లో భాగంగా వీటిని డీ–డాకింగ్ సైతం చేయాల్సి ఉంది. డాకింగ్‌ను విజయవంతం చేసేందుకు పలుమార్లు ప్రయత్నించిన ఇస్రో.. డీ–డాకింగ్‌ను మాత్రం తొలి ప్రయత్నంలో పూర్తిచేయడం విశేషం. శాటిలైట్లు, మాడ్యూళ్ల వంటి వస్తువులను అంతరిక్షంలో అనుసంధానం చేయగల్గితేనే భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష ప్రయోగ కేంద్రంవంటి వాటిని అంతరిక్షంలో నిర్మించగలం. ‘‘ 45 డిగ్రీల కోణంలో 460 కిలోమీటర్ల వృత్తాకార కక్ష్యలో అన్‌డాకింగ్ ప్రక్రియను గురువారం విజయవంతంగా పరీక్షించిన నేపథ్యంలో తదుపరి ప్రయోగాలను త్వరలో మొదలుపెట్టబోతున్నాం. విడిపోయాక ఈ రెండు ఉపగ్రహాలు పూర్తి ‘ఆరోగ్యవంతం’గా ఉన్నాయి. డీ–డాకింగ్‌కు మార్చి 10 నుంచి 25వ తేదీ వరకు అనువైన సమయం. అందుకే ఈ సమయంలోనే డీ–డాకింగ్ చేపట్టాం. బెంగళూరు, లక్నో, మారిషస్‌లోని గ్రౌండ్ స్టేషన్ల నుంచి నియంత్రిస్తూ ఈ అన్డాకింగ్ను పూర్తిచేశాం’’ అని ఇస్రో ప్రకటించింది. ‘‘ ఇస్రో శాస్త్రవేత్తలకు అంతరిక్షంలో కూడా హద్దే లేదు. భారత ఘనత అంతరిక్షంలో మరోసారి ప్రభవించింది. డీ–డాకింగ్‌ను పూర్తిచేసిన ఇస్రో బృందానికి నా అభినందనలు. దేశం సొంతంగా అంతరిక్ష కేంద్రం నిర్మించుకోవాలన్న ప్రధాని మోదీ కల సాకారమయ్యేందుకు ఇస్రో బాటలువేసిందని గర్వపడాల్సిన క్షణమిది’’ అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆనందం వ్యక్తంచేశారు. -
శ్రమతోనే సక్సెస్
పూసర్ల వెంకట సింధు... ఒలింపిక్స్‌లో పతకాలు సాధించింది.కామన్వెల్త్... వరల్డ్ చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు సొంతం చేసుకుంది.ప్రపంచవేదికల మీద దేశ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది.భారత మాత మెడలో పతకాల హారం వేసి బంగారు సింధు అయింది.ఈ ఏడాది మహిళాదినోత్సవాన్ని శ్రీమతి సింధుగా వేడుక చేసుకుంటోంది.సాధికారత దిశగా పయనిస్తున్న మహిళలకు అభినందనలు చెప్పింది.ఈ తరంలో మహిళలు బిజినెస్, స్పోర్ట్స్‌తోపాటు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. కేవలం తమకు తాము నిలదొక్కుకోవడంతో సరిపెట్టడం లేదు, ఆ రంగంలో నంబర్ వన్‌గా నిలవడానికి శ్రమిస్తున్నారు. నంబర్ వన్ లక్ష్యాన్ని సాధిస్తున్నారు కూడా. ఈ స్ఫూర్తిని, ఇదే పంథాను కొనసాగించాలని అభిలషిస్తున్నాను. సక్సెస్‌కు దారి! ప్రతి ఒక్కరూ తమ కోసం తాము కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. వాటిని చేరుకోవడానికి తగినంత శ్రమించాలి. సక్సెస్ అనే లక్ష్యాన్ని చేరడానికి ఉన్న ఏకైక దారి హార్డ్‌వర్క్. హార్డ్‌వర్క్‌తో మాత్రమే విజయానికి చేరువ కాగలుగుతాం. అది కూడా ఒక నెల శ్రమతోనో ఏడాది శ్రమతోనో శిఖరాన్ని చేరాలని ఆశించకూడదు. కొన్నేళ్ల కఠోరశ్రమ, అంకితభావంతో శ్రమించినప్పుడే సక్సెస్ మనదవుతుంది. అయితే కొందరికి సక్సెస్ కొంత త్వరగా రావచ్చు, మరికొందరికి ఆలస్యం కావచ్చు. మన మీద మనం నమ్మకాన్ని కోల్పోకూడదు. ఆశను వదులుకోకూడదు, నిరాశపడకూడదు. మనం మనవంతుగా శ్రమిస్తూ ఉండాలి. సక్సెస్ వచ్చినప్పటి నుంచి మరింత బాధ్యతగా పని చేయాలి. సక్సెస్ అనే శిఖరాన్ని చేరాం అని రిలాక్స్ కాకూడదు. నంబర్ వన్‌కి చేరడానికి నేనలాగే కష్టపడ్డాను, కష్టపడుతూనే ఉంటాను కూడా. అమ్మానాన్న... భర్త! ఇప్పటి వరకు నన్ను, నా ఆర్థిక వ్యవహారాలను అమ్మానాన్న చూసుకునేవారు. టోర్నమెంట్‌కి తోడుగా నాన్న వచ్చేవారు. ఇప్పుడు మా వారు వస్తున్నారు. నా గురించి అన్నీ వాళ్లే చూసుకుంటారు. నా ఫోకస్ అంతా ఆట మీదనే కేంద్రీకరించడానికి తగిన వెసులుబాటునిస్తున్నారు. పేరెంట్స్ నడిపించాలి! దేశానికి కొత్తతరం క్రీడాకారులు తయారు కావాలి. క్రీడాకారులను తయారు చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు స్పోర్ట్స్ మీద ఆసక్తి ఉన్నప్పటికీ తల్లిదండ్రుల సహకారం లేకపోతే క్రీడాకారులు తయారుకారు. పిల్లలను క్రీడల దిశగా నడిపించడం పేరెంట్స్ చేతిలోనే ఉంటుంది. ఆటలు, చదువు రెండూ కీలకమే. రెండింటినీ ఎలా బాలెన్స్ చేసుకోవాలో నేర్పించగలిగింది కూడా పేరెంట్సేనని నా అభి్రపాయం. పేరెంట్స్‌కి కోరిక ఉన్నప్పటికీ పిల్లలకు ఆడాలనే ఆసక్తి లేకపోతే ఆ పిల్లలు దీర్ఘకాలం కొనసాగడం కష్టం. అలాగే ఆటల పట్ల ఆసక్తి ఉన్న పిల్లలకు పేరెంట్స్ సహకారం లేకపోతే తొలి అడుగు కూడా పడదు. అందుకే తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం.సింధుగానే గుర్తించాలి! సమాజం నన్ను సింధుగానే గుర్తించాలి. ‘పీవీ సింధు’ అనగానే చేతిలో రాకెట్‌తో నా రూపం కళ్ల ముందు మెదులుతుంది. అలా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాను. దేశం కోసం ఆడగలిగే స్థాయికి చేరాను. దేశం కోసం ఆడాను. దేశానికి ఎన్నో పతకాలను సాధించాను. దేశానికి గౌరవాన్ని పెంచడంలో నా శ్రమ కూడా ఉందని సంతోషపడుతున్నాను. ఈ గుర్తింపు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
సమతుల్యత సాధించాలి
‘‘ఏ రంగంలోనైనా నాయకత్వం వహించడానికి దూరదృష్టి, కొత్త ఆవిష్కరణలపై అవిశ్రాంత కృషి అవసరం. సాంకేతికతంగా వస్తున్న మార్పులను అమలు చేయడంలో, టీమ్ వర్క్‌ను బలోపేతం చేయడంలో ముందుండాలి. బలమైన నాయకులుగా ఉండాలంటే పనిలో నైపుణ్యాలతో పాటు వైవిధ్యాన్నీ పెంపొందించాలి. సక్సెస్ ఉద్దేశం ఒక్కరమే ఎదగడం కాదు, అర్థవంతమైన మార్పుతో మనతోపాటు ఉన్నవారితో కలిసి నడవడం.సమతుల్యం చేయడంలోనే సవాళ్లువైద్య రంగంలో మహిళలు అతిపెద్ద కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ నిత్యం సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వృత్తిపరంగా ఎదగడంలోనూ, వ్యక్తిగత బాధ్యతలతో బాలెన్స్ చేయడం అనేది అతిపెద్ద అడ్డంకిగా మారింది. కెరీర్– ఇల్లు రెండింటినీ సమర్థంగా నిర్వహించడానికి సమాజం ఇప్పటికీ మహిళలపై చెప్పలేనన్ని అంచనాలను ఉంచుతోంది. రెండుచోట్లా మహిళలు అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వాతావరణం ఉండాలి. అలా లేకపోవడంతో ‘ఆమె సమర్ధత’కు ప్రతిబంధకాలు ఏర్పడుతున్నాయి. మన సమాజంలో మరొక సవాల్ లోతుగా పాతుకుపోయిన లింగ వివక్ష. నాయకత్వ అవకాశాలను పరిమితం చేసేది ఇదే.నాయకత్వం జెండర్‌తో కాదు సామర్థ్యం వల్లే సాధ్యం అని నిరూపించడానికి మహిళ మరింత కష్టపడి పనిచేయాలి. మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మరింత చురుగ్గా వ్యవహరించాలి. డెసిషన్ మేకర్స్ జాబితాలో ఎక్కువ మంది మహిళలకు స్థానం ఉండేలా చూసుకోవాలి. మిగతావాటికన్నా వైద్యరంగం భిన్నమైనది, లోతైనది కూడా. ఎందుకంటే ఇక్కడప్రాణాలను కాపాడటం, ఆరోగ్య ఫలితాలలో మంచి మార్పులు తీసుకురావడంపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, సరిహద్దులను దాటి ఆలోచించడం, యథాతథ స్థితి కొనసాగేలా టీమ్స్‌ను ప్రోత్సహించడం... వంటివి వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలో మనల్ని ముందు ఉంచుతుంది.నెట్‌వర్క్‌ను నిర్మించుకోవాలిసాధారణంగా మహిళలు రిస్క్ తీసుకొని, తమ స్థానాన్ని సాధించేందుకు వెనకాడతారు. మీ ముందు చూపును, అంతర్దృష్టిని నమ్మండి. బలమైన మద్దతునిచ్చే నెట్‌వర్క్‌ను నిర్మించుకోండి. విజయం ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు. మిమ్మల్ని సవాలు చేసేవారు, మార్గదర్శకులు, సహచరులు, టీమ్స్‌తో ముందుకు కదలాలి. నేర్చుకోవడాన్ని ఎప్పుడూ ఆపవద్దు. సవాళ్లను సోపానక్రమాలుగా స్వీకరించాలి. ప్రతి అడ్డంకిని నూతనంగా ఆవిష్కరించడానికి, అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం అనుకోవాలి. మహిళా వ్యవస్థాపకులు పరిశ్రమలను రూపొందిస్తున్నారు, ఇది మన సమయం అని గుర్తించండి’’ అంటూ మహిళాభ్యున్నతికి మార్గదర్శకం చేస్తున్నారు డాక్టర్ సంగీతారెడ్డి. మార్పులు తప్పనిసరిరోల్ మోడల్స్ మార్గదర్శకత్వంతో పాటు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్లాలి. వ్యవస్థాగత అడ్డంకులను పరిష్కరించాలి. పనిప్రదేశంలో సమాన వేతనం, నిష్పాక్షికమైన కెరీర్ పురోగతికి మద్దతు ఇవ్వాలి. ముఖ్యంగా, మహిళల అభివృద్ధి నుండి మహిళల నేతృత్వంలోని అభివృద్ధికి మారాలి. మహిళలు ఆరోగ్య సంరక్షణలో పాల్గొనేవారు మాత్రమే కాదు, భవిష్యత్తుకు చురుకైన రూపశిల్పులుగా మారాలి.– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
పరీక్షల్లో విజయం సాధించాలంటే..?
పరీక్షలు విద్యార్థుల జీవితంలో కీలకమైన మైలురాళ్లు. చాలామంది విద్యార్థులు పరీక్షల సమయానికి తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. మెదడు ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటుంది? మన మనస్సు పరీక్షలకు అనుగుణంగా ఎలా సిద్ధం కావాలి? అనే విషయాలు తెలుసుకోవడం అవసరం.మానసిక స్థిరత్వం, సమర్థమైన అధ్యయన పద్ధతులు, దృఢమైన ఆత్మవిశ్వాసం పరీక్ష విజయాన్ని నిర్దేశించే మూడు ప్రధాన అంశాలు. పరీక్షల సమయంలో ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం, మెదడును ఒత్తిడికి అలవాటు చేయడం, చదువును ఒక ఉల్లాసభరితమైన ప్రక్రియగా మార్చుకోవడం ఎంతో అవసరం. పరీక్షలలో విజయం అనేది జ్ఞానం కన్నా మానసిక దారుఢ్యం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఈరోజు ఈ వ్యాసంలో అందించే పద్ధతులను అనుసరిస్తే, పరీక్షలపై భయం కాకుండా, ఆత్మవిశ్వాసం పెంచుకుని విజయాన్ని సాధించగలుగుతారు.ఒత్తిడిలో మెదడు ఎలా స్పందిస్తుంది?పరీక్షల సమయంలో ఒత్తిడికి గురైనప్పుడు, మెదడు అమిగ్డాలా అనే భాగాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఇది మన భయాలకు, ఆందోళనకు ఆధారమైన భాగం. అమిగ్డాలా మిగతా మెదడు భాగాల కంటే హై అలర్ట్‌లోకి వెళ్ళి, ఒత్తిడిని పెంచే కార్టిసోల్ హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఈ పరిస్థితిలో మూడు రకాల ప్రతిచర్యలు కనిపిస్తాయి:Fight Mode: పరీక్షను సవాలుగా తీసుకుని మరింత కృషి చేయడంFlight Mode: పరీక్షలంటే భయపడి చదవడంపై ఆసక్తి చూపలేకపోవడం, అంటే తప్పించుకుని పారిపోవడంFreeze Mode: పరీక్ష సమయంలో మెదడు పనిచేయకపోవడం, గుర్తొచ్చిన విషయాలు మర్చిపోవడం.ఇందులో ఫ్లైట్, ఫ్రీజ్ మోడ్స్ వల్ల ఎలాంటి ఉపయోగమూ లేకపోగా మీ లెర్నింగ్‌ను, జ్ఞాపకశక్తిని దెబ్బతీస్తాయి. ఫైట్ మోడ్‌లో ఉండటం పరీక్షల్లో విజయానికి కచ్చితంగా అవసరం. అందుకే మీరో ఫైటర్‌లా మారండి. పరీక్షలను చాలెంజ్‌గా తీసుకుని ముందుకు సాగండి. విజయానికి సానుకూల దృక్పథం పరీక్షలో విజయానికి ఆ మూడు గంటలు మీ మైండ్ సెట్ ఎలా ఉంటుందనేది అతి ముఖ్యమైన విషయం. నేనింతే సాధించగలననే ఫిక్స్డ్ మైండ్ సెట్ నుంచి నేను సాధించగలననే గ్రోత్ మైండ్ సెట్ అభివృద్ధి చేసుకోవాలి. అది మానసిక స్థితిని శక్తిమంతంగా మార్చి, ప్రతిభను మరింత పెంచుతుంది. అందుకోసం ఓ మూడు టెక్నిక్స్ తెలుసుకుందాం. ఆటో సజెషన్: ‘‘నేను ఈ పరీక్షను విజయవంతంగా రాయగలను’’అని ప్రతిరోజూ మనసులో అనుకోవడం. సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ ఉదాహరణలు చదవడం, ఆయా వీడియోలు చూడడం కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.విజువలైజేషన్: పరీక్ష హాలులో ప్రశాంతంగా సమాధానాలు రాస్తున్నట్లు మనసులో ఊహించడం. ఇలా చేయడం వల్ల ఊహించిన అనుభవాలను నిజంగా అనుభవించినట్లు మెదడు గుర్తుంచుకుంటుంది. దానికి ఊహకూ, నిజానికీ మధ్య తేడా తెలియదు. స్వీయ కరుణ: తప్పులు చేసినా, వాటిని నేర్చుకునే అవకాశంగా చూడటం అవసరం. ఇతరులతో పోల్చుకోవడం మానేసి, మీతో మీరే పోటీ పడాలి. మీ ప్రగతిని చూసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని పూర్తిచేయడం ద్వారా మనసుకు ఓవర్‌లోడ్ కాకుండా ఉంటుంది.ఒత్తిడిని సమర్థంగా నిర్వహించడం నేర్చుకోవాలి. అందుకోసం పలు సైంటిఫిక్ టెక్నిక్స్ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని ఈరోజు తెలుసుకుందాం. అలాగని జస్ట్ తెలుసుకుంటే సరిపోదు, వాటిని రోజూ ప్రాక్టీస్ చేయాలి. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచడం: మనసు ప్రశాంతంగా ఉండాలంటే శరీరం ప్రశాంతంగా ఉండాలి. అందుకోసం డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్‌ను ప్రాక్టీస్ చేయాలి. అదేమంత కష్టమైన పనికాదు. వెరీ సింపుల్. నాలుగు సెకన్లు లోపలికి శ్వాస తీసుకోవడం, ఏడు సెకన్లు శ్వాసను బంధించడం, ఆ తర్వాత ఎనిమిది సెకన్లు నెమ్మదిగా వదిలేయడం. దీనివల్ల మెదడులో ఆక్సిజన్ పెరిగి ప్రశాంతతను అందిస్తుంది.వ్యాయామం: రోజూ 20 నిమిషాలు నడక లేదా తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఆక్సిజన్ సరఫరా మెరుగుపడి ఒత్తిడి తగ్గుతుంది.దీంతో పాటు సరైన ఆహారం, నిద్ర అవసరం. గుడ్లు, కాయధాన్యాలు, ఉల్లిపాయలు, వాల్నట్స్ వంటి ఆహార పదార్థాలు మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. పరీక్షల ముందు కనీసం 7 గంటలు నిద్రపోవడం అవసరం. రాత్రంతా మేల్కొని చదివితే మెదడు పనితీరు మందగిస్తుంది. ---సైకాలజిస్ట్ విశేష్, www.psyvisesh.com(చదవండి: 'గోచీ పండుగ': వినడానికి వింతగా ఉన్నా..పండుగలో మాత్రం..!) -
రూ.1,700తో అమెరికా వెళ్లి రూ.16,400 కోట్లు సంపాదన
దృఢ సంకల్పం, పట్టుదల ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలమని ప్రముఖ పారిశ్రామికవేత్త రాజ్ సర్దానా నిరూపించారు. ఢిల్లీలో ప్రభుత్వం నిర్మించిన ఒక చిన్న ఇంట్లో ఉంటూ జీవనం సాగించిన సర్దానా వ్యాపారంలో ఎదిగి యునైటెడ్ స్టేట్స్లో బిలియనీర్‌గా స్థిరపడ్డారు. జేబులో కేవలం 100 డాలర్ల(సర్దానా అమెరికా వెళ్లే సమయానికి విలువ రూ.1700)తో అమెరికాలో అడుగుపెట్టిన ఆయన తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఏకంగా రెండు బిలియన్ డాలర్ల(ప్రస్తుతం రూ.16,490 కోట్లు) నికర సంపదని సృష్టించారు. రాజ్ సర్దానా జీవిత ప్రయాణం ఎంతోమంది పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.ఢిల్లీలో జీవితం ప్రారంభం..1947 విభజన తర్వాత భారతదేశానికి వలస వచ్చిన పంజాబీ తల్లిదండ్రులకు 1960లో సర్దానా జన్మించారు. న్యూఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో పెరిగారు. ఎలాంటి సదుపాయాలు లేని సాధారణ జీవితం సాగించారు. ‘నా తల్లిదండ్రులు నా ఎదుగుదలకు అలుపెరగని కృషి చేశారు. ఎన్నో విలువలు నేర్పించారు. నాకు, నా సోదరుడికి నాణ్యమైన విద్యను అందించడానికి చాలా కష్టపడ్డారు’ అని అథారిటీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్దానా గుర్తు చేసుకున్నారు.అమెరికాకు తరలివెళ్లి..సర్దానా 1981లో జార్జియా టెక్‌లో మెకానికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ చేయడానికి యునైటెడ్ స్టేట్స్కు వెళ్లారు. అమెరికా వెళ్లే సమయానికి తన వద్ద కేవలం 100 డాలర్లు(ప్రస్తుతం దాని విలువ రూ.8,500) ఉన్నాయి. పొట్టకూటికోసం కాలేజీ క్యాంటీన్లో పని చేయాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ సంపాదించగా వచ్చిన డబ్బుతోనే చదువు పూర్తిచేశాడు. గ్రాడ్యుయేషన్ తరువాత సర్దానా హెచ్-1 వీసా (నేటి హెచ్-1 బీ వీసా) పొంది హౌమెట్ ఏరోస్పేస్లో కెరియర్ ప్రారంభించారు.కెరియర్లో ఒడిదొడుకులు1987 నాటికి సర్దానా తోమహాక్ క్షిపణి ఇంజిన్లను తయారు చేసే టెలీడైన్ సీఏఈ అనే సంస్థలో ప్రతిష్ఠాత్మక ఉద్యోగంలో చేరాడు. అయితే 1990లో ప్రచ్ఛన్న యుద్ధం(యూఎస్-సోవియట్ యూనియర్ మధ్య యుద్ధం) ముగియడంతో క్షిపణి ఉత్పత్తి నిలిచిపోయింది. దాంతో సర్దానా ఉద్యోగం కోల్పోయారు. ‘అప్పటికే నేను తనఖాతో ఇల్లు కొన్నాను. ఆరు నెలల కుమార్తె ఉంది. నా తల్లిదండ్రులు కూడా నాతో నివసిస్తున్నారు. ఆ సమయంలో నా కుటుంబాన్ని పోషించడానికి ఆదాయం లేదు’ అని సర్దానా ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో ఆర్థిక అనిశ్చితి ఎదుర్కొన్న ఆయన సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని పారిశ్రామికవేత్తగా ఎదగాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే తన వద్ద ఉన్న పొదుపు 25,000 డాలర్లు(ఇప్పటి విలువ రూ.21.86 లక్షలు)తో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.ఇదీ చదవండి: ఆకాశవీధిలో పెరిగిన ప్రయాణికులుఇన్నోవా సొల్యూషన్స్ఐటీ సేవలకు భవిష్యత్తులో గిరాకీ ఉంటుందని గ్రహించిన రాజ్ తరువాతి కాలంలో కొన్ని ఐటీ సంస్థలను కొనుగోలు చేసి ఇన్నోవా సొల్యూషన్స్ అనే ఐటీ సేవల సంస్థను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఇన్నోవా సొల్యూషన్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. సర్దానా సంస్థల నికర విలువ రెండు బిలియన్ డాలర్లు(రూ.16 వేల కోట్లు)గా ఉంది. ఢిల్లీలోని ప్రభుత్వ గృహంలో నివసించి కేవలం జేబులో 100 డాలర్లతో అమెరికా వెళ్లిన సర్దానా ప్రస్తుతం బిలియనీర్‌గా ఎదిగి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. -
మా తప్పు వల్లే గూగుల్ సక్సెస్!
మైక్రోసాఫ్ట్ (Microsoft) సీఈఓ సత్య నాదెళ్ల తన అతిపెద్ద వృత్తిపరమైన పశ్చాత్తాపం గురించి ఇటీవల ఓపెన్ అయ్యారు. గూగుల్ (Google) విజయవంతంగా క్యాష్ చేసుకున్న వెబ్ సెర్చ్ మార్కెట్ ఆధిపత్యాన్ని అంచనా వేయడంలో విఫలమైనట్లు అంగీకరించారు. వెబ్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, సెర్చ్ అత్యంత విలువైన వ్యాపార నమూనాగా మారుతుందని గ్రహించలేదని ఆయన అన్నారు.చేజారిన అవకాశం..వెబ్ మార్కెట్ వికేంద్రీకృతంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ మొదట్లో భావించిందని, కేవలం వెబ్ సెర్చ్ అంత పెద్ద బిజినెస్ మోడల్‌గా అంచనా వేయలేకపోయిందని సత్య నాదెళ్ల (Satya Nadella) అంగీకరించారు. ఈ పొరపాటు గూగుల్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, సెర్చ్ చుట్టూ భారీ వ్యాపారాన్ని నిర్మించడానికి దారితీసిందని చెప్పుకొచ్చారు. "వెబ్ లో అతిపెద్ద వ్యాపార నమూనాగా మారిన దానిని మేము మిస్ అయ్యాము. ఎందుకంటే వెబ్ అంతటా విస్తృతమవుతుందని మేమంతా భావించాము" అని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.గూగుల్ దూరదృష్టిసెర్చ్ ప్రాముఖ్యతను మైక్రోసాఫ్ట్ తక్కువగా అంచనా వేసినప్పటికీ, దాని సామర్థ్యాన్ని గూగుల్ గుర్తించింది. దూరదృష్టిని ప్రదర్శించింది. వ్యూహాన్ని లోపరహితంగా అమలు చేసింది. సెర్చ్ ద్వారా వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో విలువను చూసి గూగుల్ దాన్ని ఎలా క్యాపిటలైజ్ చేసిందో సత్య నాదెళ్ల వివరించారు. "వెబ్ ను ఆర్గనైజ్ చేయడంలో సెర్చ్ అతిపెద్ద విజేత అవుతుందని ఎవరు ఊహించి ఉంటారు? మేము స్పష్టంగా దానిని చూడలేదు, గూగుల్ దాన్ని చూసింది.. చాలా బాగా అమలు చేసింది" అని అంగీకరించారు.నేర్చుకున్న పాఠాలుసాంకేతిక మార్పులను అర్థం చేసుకుంటే సరిపోదని సత్య నాదెళ్ల ఉద్ఘాటించారు. విలువ సృష్టి ఎక్కడ జరుగుతుందో కంపెనీలు గుర్తించాలి. సాంకేతిక పురోగతిని కొనసాగించడం కంటే వ్యాపార నమూనాలలో మార్పులకు అనుగుణంగా మారడం చాలా సవాలుతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ బిజినెస్ మోడల్ మార్పులు టెక్ ట్రెండ్ మార్పుల కంటే కూడా కఠినంగా ఉంటాయని సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఈ అవకాశాన్ని కోల్పోయినప్పటికీ, సత్య నాదెళ్ల సీఈవోగా (CEO) బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ పై బలమైన దృష్టితో మైక్రోసాఫ్ట్ ఎదుగుదలకు నాయకత్వం వహించారు. సాంకేతిక మార్పులకు అనుగుణంగా ముందుకు సాగేందుకు, టెక్ పరిశ్రమలో మైక్రోసాఫ్ట్ నూతన ఆవిష్కరణలు, నాయకత్వం వహించేలా కంపెనీని నడిపిస్తున్నారు.సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్ లో చేరిన సత్య నాదెళ్ల అనేక ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. మంగళూరు విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ, విస్కాన్సిన్-మిల్వాకీ వర్సిటీ నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టా పొందారు. -
రయ్‌మని గాల్లో ఎగిరిన కారు..ధర ఎంతంటే..
కాలిఫోర్నియా:ప్రపంచంలోని అన్ని టాప్ సిటీల్లో నివసించే వారికి ఒకటే ప్రధాన సమస్య. ఉదయం ఆఫీసులకు వెళ్దామంటే రోడ్లపై కదలకుండా చేసి చిరాకు తెప్పించే ట్రాఫిక్. ఈ పద్మవ్యూహాన్ని తప్పించుకుని హాయిగా గాలిలో ఎగురుకుంటూ వెళ్లేందుకు ఎగిరే కార్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.ఇలాంటి ఎగిరే కారును ఒకదానిని అమెరికా కాలిఫోర్నియాలోని రోడ్లపై పరీక్షించింది వాటిని తయారు చేసిన కంపెనీ అలెఫ్ ఏరోనాటిక్స్.టెస్ట్‌లో భాగంగా నలుపు రంగులో ఉన్న ఓ ఎగిరే కారు తొలుత మామూలు కారులానే రోడ్డుపై రయ్‌మని దూసుకెళ్లింది.ఇలా వెళ్లిన కొద్ది సేపటికి కారు హెలికాప్టర్లా నిట్టనిలువునా గాల్లోకి లేచి ఎగురుకుంటూ వెళ్లింది. ఈ పరీక్ష విజయవంతమైనట్లు కంపెనీ ప్రకటించింది. పరీక్ష సమయంలో రోడ్డుపై ఎవరు లేకుండా కారు ఎగిరే ప్రదేశంలో ఏవీ అడ్డు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేసిన విద్యుత్‌తో నడిచే ఎగిరేకారు ధర ఒక్కోటి 30వేల డాలర్లు.కంపెనీకి కస్టమర్ల నుంచి 3వేల కార్లకు ఇప్పటికే ఆర్డర్లు వచ్చాయి.నలుగురు కూర్చొని వెళ్లగలిగే 200 కిలోమీటర్లు గాలిలో ఎగిరే రేంజ్, 400 కిలో మీటర్లు రోడ్డు రేంజ్ ఉన్న మోడల్ జెడ్ సెడాన్ కారు 2035కల్లా అందుబాటులోకి తీసుకురానున్నారు,. -
ఆరు అలవాట్లు.. విజయానికి అడ్డు గోడలు
మనం లోతుగా దృష్టిసారిస్తేగానీ గ్రహించలేని మనలోని కొన్ని అలవాట్లు మన విజయానికి అడ్డుగోడలుగా నిలుస్తుంటాయి. వీటిని గుర్తించి, మన తీరుతెన్నులను మార్చుకున్నప్పడే మనం విజయబావుటా ఎగురవేయగలుగుతాం. ఆ అలవాట్లు ఏమిటో, వాటిని మనలో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.విజయానికి అడ్డుపడే అలవాట్లివే..1. ప్రతీ పనిని వాయిదా వేయడంమనలో చాలామంది తాము చేయాల్సిన ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు. ఇటువంటి అలవాటును ప్రొక్రాస్టినేషన్(Procrastination) అని అంటారు. ఇటువంటి అలవాటు ఎవరిలో ఉన్నా, విజయం అనేది వారి దరిదాపులకు కూడా చేరదని మానసిక నిపుణులు చెబుతుంటారు. చేయాల్సిన పనిని తగిన సమయంలో మొదలుపెట్టి, పూర్తిచేయడం వలన విజయానికి చేరువవుతాం.2. నెగిటివ్ ఆలోచనలుమనలోని ఆలోచనలే మన పనులలో ప్రతిబింబిస్తుంటాయి. మనలో మనం, మనతో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మనం ప్రవర్తిస్తుంటాం. నిత్యం నెగిటివ్ విషయాలు (Negative Talks) మాట్లాడుకోవడమనేది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో పాజిటివ్‌గా వ్యవహరించడం విజయానికి దోహదపడుతుంది. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తుంది.3. రిస్క్ తీసుకోకపోవడంఎవరైనా ఏదైనా కొత్త పనిని చేపట్టేందుకు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడితే వారికి విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే రిస్క్ తీసుకునైనా సరే ఏరైనా మంచి పనిని ప్రారంభించాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతాం.4. లైఫ్ స్టయిల్లో చెడు అలవాట్లురోజువారీగా తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపై దృష్టిపెట్టినప్పుడే శరీరం బలిష్టంగా మారుతుంది. అప్పుడే మానసికంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉంటూ విజయంవైపు ముందడుగు వేయగలుగుతాం.5. ప్రతీదాన్నీ సమస్యగా చూడటంఎవరైనా ప్రతీ అంశాన్ని సమస్యగా తీసుకుంటే వారు జీవితంలో ముందుకు సాగలేరు. అన్నింటినీ సమస్యలుగా చూడకుండా, వాటికి పరిష్కారాలను కనుగొంటే విజయావకాశాలు దగ్గరవుతాయి.6. ఇతరులను సంతోష పెట్టాలనుకోవడంచాలామంది ఇతరులను సంతోషపెట్టాలని, వారి మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంటారు. దీనిని చెడ్డ అలవాటు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఈ తరహాలో ప్రవర్తించే వ్యక్తి తన లక్ష్యాన్ని మరిపోతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి అలవాట్లను దూరం చేసుకున్న వ్యక్తి విజయానికి దగ్గరవుతాడని వారు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు -
‘తెలుగు వికీపీడియా పండగ-2025’ విజయవంతం
సాక్షి,తిరుపతి: తిరుపతిలో ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించిన "తెలుగు వికీపీడియా పండగ 2025" ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 50 మందికి పైగా తెలుగు వికీపీడియా సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం, 2003లో ప్రారంభమైన తెలుగు వికీపీడియా ఇప్పటివరకు లక్షకుపైగా వ్యాసాలను కలిగి ఉండడం విశేషం.సదస్సు సందర్భంగా "తెలుగు వికీపీడియాను విస్తరించే మార్గాలు", "సభ్యుల వ్యాస రచనా నైపుణ్యాల మెరుగుదల", "వ్యాసాలను ప్రజలకు మరింత ఆసక్తికరంగా రూపొందించే పద్ధతులు" వంటి కీలక అంశాలపై ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. అదనంగా, "తెలుగు వికీపీడియాలో చేరండి.. అందరికీ విజ్ఞానం పంచండి" అనే నినాదంతో తిరుపతి నగర వీధుల్లో వికీపీడియా సభ్యులు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కరపత్రాలను పంచి ప్రజలకు వికీపీడియాపై అవగాహన కల్పించారు."తెలుగు వికీపీడియా బడి" పేరుతో త్వరలో ఆన్లైన్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్టు నిర్వాహకులు వెల్లడించారు. కొత్త సభ్యులు వీటి ద్వారా వికీపీడియాలో భాగస్వాములు కావచ్చని తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో తెలుగు వికీపీడియాకు విశేష సేవలు అందించిన వారిని ఈ వేడుకల్లో సత్కరించారు. ఉత్తమ నిర్వాహకుడిగా యర్రా రామారావు సత్కారం పొందారు. వికీ పునస్కార గ్రహీతల్లో ఎన్.ఆర్. గుళ్ళపల్లి, శ్రీరామమూర్తి, బత్తిని వినయ్ కుమార్ గౌడ్, స్వరలాసిక, టి. సుజాత, రవిచంద్ర, రామేశం, ఐ. మహేష్, బి.కె. విశ్వనాధ్ తదితరులున్నారు. -
తండేల్ మూవీ సక్సెస్ మీట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా శోభిత- నాగచైతన్య (ఫోటోలు)
-
బీజేపీ ఖాతాలోకే మిల్కిపూర్?
యూపీలోని అయోధ్య పరిధిలోగల మిల్కిపూర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పెద్ద ఆధిక్యాన్ని సాధించింది. ఎన్నికల సంఘం అందించిన డేటా ప్రకారం బీజేపీ 11 వేలకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉంది. దీంతో అందరి దృష్టి ఈ సీటుపైనే ఉంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. అవధేష్ ప్రసాద్ ఎంపీ అయిన తర్వాత ఈ సీటు ఖాళీ అయింది. ఈ సీటు కోసం సమాజ్‌వాదీ పార్టీ, బిజెపి మధ్య గట్టి పోటీ నెలకొంది. సమాజ్‌వాదీ పార్టీ అజిత్ ప్రసాద్‌ను బరిలోకి దింపగా, బీజేపీ చంద్రభాను పాస్వాన్‌ను ఎన్నికల్లో నిలబెట్టింది.అయోధ్యలోని మిల్కిపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 3 లక్షల 70 వేల మంది ఓటర్లు ఉన్నారు . ఉప ఎన్నికల్లో 10 మంది ఎన్నికల బరిలో దిగారు. కాగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి బీఎస్పీ నిరాకరించింది. మిల్కిపూర్ అసెంబ్లీ స్థానం రిజర్వ్డ్ సీటు. ఈ స్థానంలో పెద్ద సంఖ్యలో దళిత ఓటర్లు ఉన్నారు. వారు మద్దతు ఇచ్చే పార్టీ గెలవడం దాదాపు ఖాయమనే అంచనాలున్నాయి. -
Delhi Election 2025: 12 ఏళ్ల ‘ఆప్’ ప్రస్థానం
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో గత మూడు ఎన్నికల్లో అమోఘ విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2012లో ఏర్పడిన ఈ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీగా ఎలా అవతరించింది? అనే ప్రశ్న చాలామంది మదిలో మెదులుతుంటుంది. ఆప్ ఎదుగుదల వెనుక ఆసక్తికర కథనాలు ఉన్నాయి.దేశంలో నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి, నాటి సర్కారు అవినీతికి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి అన్నా హజారే నాయకత్వం వహించారు. ఈ ఉద్యమంలో అరవింద్ కేజ్రీవాల్ కీలకపాత్ర పోషించారు. లోక్‌పాల్ బిల్లుకు సంబంధించి ఢిల్లీ నుండి ప్రారంభమైన ఉద్యమం దేశంలోని ప్రతి మూలకు వ్యాపించింది. ఉద్యమం ముగిసిన తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కొత్త పార్టీ ఏర్పాటును ప్రకటించారు.2012లో ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడింది. అరవింద్ కేజ్రీవాల్ ఆ పార్టీకి కన్వీనర్ అయ్యారు. రాజకీయ నేతలు కుమార్ విశ్వాస్, యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తదితరులు పార్టీని ఏర్పాటు చేయడంలో భాగస్వాములయ్యారు. తరువాత వారందరూ వేర్వేరు కారణాలతో పార్టీని వీడారు.2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి అందించిన మద్దతుతో ఢిల్లీలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన ఆప్ మొదటిసారి అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ తొలి ఎన్నికల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. ఆ తర్వాత 2015లో తిరిగి ఎన్నికలు జరిగాయి. నాడు ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం 70 సీట్లలో 67 స్థానాలను గెలుచుకుంది.కాంగ్రెస్ ఖాతాను కూడా తెరవలేకపోయింది. బీజేపీ కేవలం మూడు సీట్లకు పడిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితమే కనిపించింది. ఢిల్లీ ఓటర్లు అరవింద్ కేజ్రీవాల్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేశారు. దీని తరువాత పార్టీ క్రమంగా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించింది. అనంతరం పంజాబ్ ఎన్నికల్లో అతిపెద్ద విజయం సాధించింది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
హీరో నాగచైతన్య 'తండేల్' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
ఒడిశా నుంచి దుబాయ్: సక్సెస్ కోసం 17 ఏళ్ళు
కష్టాల సుడిగుండాలు దాటి.. సక్సెస్ సాధించిన వాళ్ళు ఎందరో. అలాంటి కోవకు చెందిన వారిలో ఒకరు ఒడిశాలోని రూర్కెలాకు చెందిన 'సౌమేంద్ర జెన' (Soumendra Jena). ఓ చిన్న ఇంట్లో జీవితాన్ని ప్రారంభించిన ఈయన ఇప్పుడు దుబాయ్‌లో విలాసవంతమైన భవనం, పోర్స్చే టైకాన్, జీ వ్యాగన్ బ్రబస్ 800 వంటి ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇటీవల తన స్ఫూర్తిదాయకమైన విజయగాథను పంచుకోవడానికి ఫోటోలను షేర్ చేశారు.సౌమేంద్ర జెన తన ఎక్స్ ఖాతాలో రెండు ఫోటోలను షేర్ చేశారు. ఒక ఫొటోలో చిన్న ఇల్లు, మరో ఫోటోలో విలాసవంతమైన ఇల్లు, దాని ముందర ఖరీదైన కార్లు ఉన్నాయి. అప్పట్లో ఇది నా ఇల్లు. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. 12వ తరగతి వరకు (1988 నుంచి 2006 వరకు) ఇక్కడే చదువుకున్నాను. నా జ్ఞాపకాల కోసం మళ్ళీ 2021లో ఇక్కడికి వచ్చాను.ఇప్పుడు దుబాయ్‌లో నాకు విలాసవంతమైన ఇల్లు ఉంది. కార్లు ఉన్నాయి. ఇదంతా.. నా 17 సంవత్సరాల శ్రమ, నిద్రలేని రాత్రులు వల్లనే సాధ్యమైందని చెప్పుకొచ్చాడు. విజయం సాధించడనికి సమయం పడుతుంది. దీనికి ఎలాంటి షార్ట్కట్లు లేవు అని అన్నారు.సోషల్ మీడియాలో సౌమేంద్ర జెనా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పలువురు నెటిజన్లు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. 17 ఏళ్లలో మీరు ఏమి చేశారో నేను తెలుసుకోవచ్చా? ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నాను, కానీ ఇప్పుడు నేను నా కోసం ఇల్లు నిర్మించుకోలేకపోతున్నానని ఒకరు కామెంట్ చేస్తే.. మరొకరు, విజయానికి సమయం, కృషి, అదృష్టం, సహాయం అన్నీ అవసరం. నువ్వు దుబాయ్‌లో ఉన్నావు. అదే ఒడిశాలో ఉండి ఉంటే ఇలా సక్సెస్ సాధించడం కష్టమయ్యేదని అన్నారు.ఇదీ చదవండి: కొత్త కారు కొంటున్నారా?: ఇలా చేస్తే.. ట్యాక్స్‌లో 50 శాతం తగ్గింపుసౌమేంద్ర జెన ఫైనాన్స్ సెక్టార్లో ఒక ప్రముఖ కంటెంట్ క్రియేటర్‌గా స్థిరపడ్డారు. ప్రస్తుతం ఇతనికి ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్‌లో 4,87,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ల ద్వారానే ఆర్ధికపరమైన విషయాలను, పెట్టుబడికి సంబంధించిన సలహాలను ఇస్తూ ఉంటాడు.This was my home back then—a small town in Odisha, Rourkela, where I was born, grew up, and studied till class 12 (1988-2006). Revisited in 2021 for the memories!Today, my home in Dubai tells the story of 17 years of relentless hard work, sleepless nights, and no shortcuts.… pic.twitter.com/nw5tCdtwKE— Soumendra Jena (@soamjena) January 24, 2025 -
వికాస్ ఇంజిన్ రీస్టార్ట్ విజయవంతం: ఇస్రో
సాక్షి, బెంగళూరు: మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో శుక్రవారం వికాస్ లిక్విడ్ ఇంజిన్‌ను విజయవంతంగా రీస్టార్ట్ చేసినట్లు ఇస్రో తెలిపింది. రాకెట్ లాంఛర్లకు ద్రవీకృత ఇంధన దశల్లో వికాస్ ఇంజిన్ ఎంతో కీలకమైందని పేర్కొంది. భవిష్యత్తులో ప్రయోగించే రాకెట్ లాంఛర్ల పునరి్వనియోగానికి సంబంధించిన సాంకేతికతలో జనవరి 17వ తేదీని ఓ మైలురాయిగా ఓ ప్రకటనలో ఇస్రో అభివర్ణించింది. వివిధ పరిస్థితుల్లో విక్రమ్ ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసి, పనితీరును అంచనా వేసేందుకు వరుస గా పరీక్షలు చేపట్టనున్నట్లు వివరించింది. ‘ఈ పరీక్షలో 60 సెకన్ల పాటు ఇంజిన్‌ను పనిచేయించి, 120 సెకన్ల పాటు ఆపేశాం. తిరిగి స్టార్ట్ చేసి ఏడు సెకన్లపాటు పనిచేయించాం. ఈ పరీక్షలో ఇంజిన్ మామూలుగానే పనిచేసింది. అన్ని పరామితులను ఆశించిన రీతిలో అందుకుంది’అని ఇస్రో వివరించింది. డిసెంబర్ 2024లో నూ ఇలాంటి పరీక్షనే విజయవంతంగా నిర్వహించామని తెలిపింది. అప్పుడు కేవలం ఏడు సెకన్లపాటే ఇంజిన్‌ను మండించి, 42 సెకన్ల వరకు ఆపేసి ఉంచామని వివరించింది. -
వైఎస్ఆర్ సీపీ పోరుబాట సక్సెస్
-
Success Story: పట్టుదలకు మారుపేరు అనురాగ్ గౌతమ్
పట్టుదల, ఏకాగ్రత విజయానికి మూలసూత్రాలని చెబుతారు. వీటిని ఆశ్రయించినవారు ఏ రంగంలోనైనా రాణిస్తారని అంటారు. పట్టుదలతో చదివి విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారిని మనం చూసేవుంటాం. అలాంటి వారిలో ఒకరే అనురాగ్ గౌతమ్.యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) తాజాగా ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని బొకారోకు చెందిన అనురాగ్ గౌతమ్ ఐఈఎస్ ఫలితాల్లో దేశంలోనే మొదటి స్థానాన్ని సాధించాడు. ఆల్ ఇండియా ర్యాంక్ వన్ (ఏఐఆర్ 1) సాధించి, అనురాగ్ అందరి అభినందనలు అందుకుంటున్నాడు.అనురాగ్ గౌతమ్ బొకారో డీపీఎస్ స్కూలులో చదువుకున్నాడు. అతని తండ్రి అనుపమ్ కుమార్ బొకారో స్టీల్ ప్లాంట్‌లో అధికారి. అతని తల్లి కుమారి సంగీత గృహిణి. చిన్నతనం నుంచే అనురాగ్‌కు చదువుపై అమితమైన ఆసక్తి ఉంది. పాఠశాల విద్య పూర్తిచేసిన అనురాగ్ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఉన్నత విద్యాభ్యాసం చేశారు.తన కుమారుడు ఎన్టీఎస్ఈ, కేవీపీవై తదితర పరీక్షలలో విజయం సాధించాడని అనురాగ్ తండ్రి అనుపమ్ కుమార్ తెలిపారు. అయితే ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ (ఐఈఎస్) అధికారి కావడం అనురాగ్ కల అని, తొలి ప్రయత్నంలో విఫలమైనా ధైర్యం కోల్పోకుండా, రాత్రి పగలు కష్టపడి ఎట్టకేలకు ఈ పరీక్షలో విజయం సాధించాడన్నారు. రెండవ ప్రయత్నంలో దేశం మొత్తం మీద అగ్రస్థానంలో నిలిచి అనురాగ్ తన కలను నెరవేర్చుకున్నాడన్నారు.అనురాగ్ సాధించిన విజయం గురించి తెలుసుకున్న డీపీఎస్ బొకారో ప్రిన్సిపాల్ డాక్టర్ గంగ్వార్ కూడా అనురాగ్‌ను అభినందించారు. ఈ విజయం అతని కుటుంబానికే కాకుండా, రాష్ట్రానికే గర్వకారణమన్నారు. ఎవరైనా అంకితభావంతో పనిచేస్తూ, లక్ష్యం దిశగా పయనించినప్పుడు ఏ సవాలూ పెద్దది కాదనేందుకు ఈ విజయం ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఇది కూడా చదవండి: అతనిది హర్యానా.. ఆమెది ఫ్రాన్స్.. ప్రేమ కలిపిందిలా.. -
అల్లు అర్జున్ 'పుష్ప 2' సక్సెస్ మీట్ (ఫొటోలు)
-
యూపీఎస్సీ కోసం.. అధిక జీతం వదులుకుని.. ‘కనిష్క్’ సక్సెస్ స్టోరీ
న్యూఢిల్లీ: విజేతల కథనాలు ఎవరికైనా సరే శక్తివంతమైన ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. అడ్డంకులను అధిగమించడానికి, లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించడానికి ప్రేరణ కల్పిస్తాయి. కష్టపడి పనిచేయడమే విజయం వెనుకనున్న రహస్యం అని అవగతమయ్యేలా చేస్తాయి. యూపీఎస్సీలో ఉత్తీర్ణత సాధించడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఒక యువకుడు కోటి రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని కాదనుకున్నాడు. పట్టుదలగా చదివి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్)ను సాధించాడు.కనిష్క్ కటారియాది రాజస్థాన్‌లోని జైపూర్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బొంబాయి నుండి కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యారు. అనంతరం అతనికి దక్షిణ కొరియాలోని శామ్సంగ్ కంపెనీలో కోటి రూపాయల జీతంతో ఉద్యోగానికి ఆఫర్ వచ్చింది. వెంటనే ఆయన ఆ సంస్థలో డేటా సైంటిస్ట్‌గా చేరారు. కొన్నేళ్ల తర్వాత కనిష్క్ భారత్‌కు తిరిగి వచ్చి బెంగళూరులో ఉన్న ఒక అమెరికన్ స్టార్టప్‌లో చేరారు. ఆ ఉద్యోగంలో అధిక జీతం వస్తున్నప్పటికీ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్)లో చేరాలనే తన ఆశయాన్ని నెరవేర్చుకునేందుకు ఉద్యోగాన్ని వదిలి జైపూర్‌కు తిరిగి వచ్చాడు.తరువాత రాజధాని ఢిల్లీకి చేరుకుని యూపీఎస్సీ పరీక్షకు కోచింగ్ తీసుకున్నాడు. తన మొదటి ప్రయత్నంలోనే ఆల్ ఇండియా ర్యాంక్ సాధించాడు. గణితాన్ని తన ఐచ్ఛిక సబ్జెక్ట్‌గా ఎంచుకుని పరీక్షలో విజయం సాధించారు. కనిష్క్ రాత పరీక్షలో 942 మార్కులు, పర్సనాలిటీ టెస్ట్‌లో 179 మార్కులు సాధించారు. మొత్తం మీద 2025 మార్కులకు గాను 1,121 మార్కులు దక్కించుకున్నారు.రాజస్థాన్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన అతని తండ్రి సన్వర్ మల్ వర్మ నుండి కనిష్క్ ప్రేరణ పొందారు. తండి అడుగుజాడల్లో నడుస్తూ తన కలను సాకారం చేసుకున్నారు. కనిష్క్ కటారియా రాజస్థాన్ ప్రభుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ (డీఓపీ)లో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు. ఇది కూడా చదవండి; లండన్‌లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
సోషల్ మీడియాకు దూరం.. సివిల్స్‌కు దగ్గర.. ఐఏఎస్ అధికారి నేహా సక్సెస్ స్టొరీ
ఈ ఆధునికయుగంలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా.. ఈ రెండూలేని మన రోజువారీ జీవితాన్ని ఊహించలేం. అయితే సాంకేతిక పరిజ్ఞానం సృష్టిస్తున్న అద్భుతాలు మన దృష్టిని లక్ష్యాల నుంచి పక్కకు మళ్లీస్తున్నాయి. దీంతో చాలామంది తమ కెరియర్, జీవిత లక్ష్యాల సాధనలో వెనుకబడుతున్నారు. దీనిని గుర్తించిన నేహా బయద్వాల్ తన కెరియర్ ఉన్నతి కోసం కఠిన నిర్ణయం తీసుకున్నారు.యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ)లో తన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు నేహా బయద్వాల్ సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశంలోని అత్యంత కష్టతరమైన పరీక్షల్లో ఒకటైన సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో విజయం సాధించేందుకు మూడేళ్ల పాటు మొబైల్‌ఫోన్‌కు దూరంగా ఉంటూ, ప్రిపరేషన్ కొనసాగించాలని ఆమె నిశ్చయించుకున్నారు.రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించిన నేహా.. జైపూర్‌లో తన పాఠశాల విద్యను, భోపాల్‌లో హైస్కూల్ విద్యను పూర్తి చేశారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం కారణంగా నేహా తరచుగా పాఠశాలలు మారవలసి వచ్చేది. నేహా తండ్రి, శ్రవణ్ కుమార్ సీనియర్ ఆదాయపు పన్నుశాఖ అధికారి. ఆయనే నేహా ఐఏఎస్ అధికారి కావడానికి ప్రేరణగా నిలిచారు. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన ఆమె యూపీఎస్సీ సీఎస్ఈ కోసం ప్రిపరేషన్ ప్రారంభించారు. తన మొదటి మూడు ప్రయత్నాలలో నేహా పరీక్షను క్లియర్ చేయడంలో విఫలమయ్యారు.ఈ నేపధ్యంలో సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ వినియోగం తన దృష్టిని మరలుస్తున్నాయని గ్రహించిన ఆమె వాటికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. మూడేళ్ల పాటు యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం వాటికి దూరంగా ఉన్నానని నేహా మీడియాకు తెలిపారు. తన ప్రిపరేషన్ సమయంలో నేహా స్నేహితులు, బంధువులకు కూడా దూరంగా ఉన్నారు. ఇలా అనేక ఒడిదుడుకులతో పోరాడి, తన సామాజిక జీవితాన్ని కూడా త్యాగం చేసిన నేహా.. 2021లో తన నాల్గవ ప్రయత్నంలో యూపీఎస్సీ సీఎస్ఈని ఛేదించి, 569 ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్) సాధించి, తన కలను సాకారం చేసుకున్నారు. నేహా ఐఎస్ అధికారిగా ఎంపికైనప్పుడు ఆమె వయసు 24 మాత్రమే. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలో నేహా ఇంటర్వ్యూలో 151 మార్కులతో కలిపి మొత్తం 960 మార్కులు సాధించారు. ఈ విజయం తరువాత నేహా బయద్వాల్ సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 28 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు.ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన సిక్కోలు తేజం.. ఇదో సువర్ణావకాశం -
రూ.25 వేలతో మూడేళ్లలో రూ.33 కోట్ల వ్యాపారం!
కాలేజీ డ్రాపవుట్ అయిన ఓ యువకుడు తన స్నేహితుడి సాయంతో రూ.25,000 పెట్టుబడితో వ్యాపారం సాగించి మూడేళ్లలో ఏకంగా రూ.33.61 కోట్ల వ్యాపారాన్ని విస్తరించాడు. అసలు కాలేజీ డ్రాపవుట్ అయ్యాక తాను ఏ బిజినెస్ ఎంచుకున్నాడు.. తన వ్యాపారాన్ని ఎలా విస్తరించాడో ఈ కథనంలో తెలుసుకుందాం.డారియన్ క్రెయిగ్(31) కొన్ని కారణాల వల్ల కాలేజ్ డ్రాపవుట్ అవ్వాల్సి వచ్చింది. ఇళ్లు గడవడం ఇబ్బందిగా ఉండడంతో చిన్న ఉద్యోగం చేరాడు. ఒకరోజు ఆఫీస్‌కు వచ్చిన క్రెయిగ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. తాను ఉద్యోగం కోల్పోయే నాటికి తన బ్యాంకు అకౌంట్లో కేవలం 7 డాలర్లు(రూ.600) ఉన్నాయి. తాను ఎలాగై జీవితంలో ఎదగాలని నిర్ణయించుకున్నాడు. డబ్బు సంపాదించాలనుకున్నాడు. అందుకోసం తన చిన్ననాటి స్నేహితుడు బ్రాండన్ ఎకోల్స్ సాయంతో 300 డాలర్లు(రూ.25,000) అప్పుచేసి వ్యాపారం మొదలు పెట్టాడు. ‘వైఆల్ స్వీట్ టీ’ పేరుతో టీ బిజినెస్ ప్రారంభించాడు. 2021లో మొదలుపెట్టిన ఈ వ్యాపారం అభివృద్ధి చెంది మూడేళ్లలో ఏటా రూ.33.61 కోట్ల ఆదాయం సమకూర్చే స్థాయికి ఎదిగింది.వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి విశేష ఆదరణయునైటెడ్ స్టేట్స్లో కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ ద్వారా నేరుగా వినియోగదారులకు తమ టీ ఉత్పత్తులను అందిస్తున్నారు. సుమారు 600 రిటైల్ అవుట్లెట్లతో వ్యాపారం సాగిస్తున్నారు. విభిన్న ఫ్లేవర్లలో టీను అందిస్తున్నారు. ఇటీవల క్రెయిగ్, ఎకోల్స్ తమ కంపెనీ విస్తరణకు వెంచర్ క్యాపిటలిస్ట్‌ల సాయం కోరగా విశేష ఆదరణ లభించిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: రిలయన్స్ బ్రాండ్స్ ఎండీగా వైదొలిగిన మెహతాకష్టాలు సహజం.. సరైన నిర్ణయాలు ముఖ్యంఉద్యోగం రాలేదనో, డబ్బు లేదనో, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయనో చాలా మంది కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ క్రెయిన్, ఎకోల్స్లాగా జీవితంలో కష్టపడి ఎదుగుతున్నవారు కోట్లల్లో ఉన్నారు. కాబట్టి జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు వాటిని సమర్థంగా ఎలా ఎదుర్కోవాలో ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. -
హైపర్ సోనిక్ పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: భారత సైనిక దళాల్లో మరో కీలక అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవిలో దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని విజయంతంగా పరీక్షించారు. గగనతల రక్షణ వ్యవస్థలకు చిక్కకుండా అత్యధిక వేగంతో దూసుకెళ్లి, శత్రువుల స్థావరాలను ధ్వంసం చేయడం ఈ క్షిపణి ప్రత్యేకత. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మిస్సైల్ కలిగి ఉన్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరింది.ఈ పరీక్షను చరిత్రాత్మక ఘట్టంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివర్ణించారు. క్రిటికల్, అడ్వాన్స్డ్ మిలటకీ టెక్నాలజీ కలిగిన దేశాల సరసన చేరామంటూ ßæర్షం వ్యక్తంచేశారు. అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకునే విషయంలో కీలక మైలురాయిని అధిగమించామని పేర్కొంటూ ఆయన ‘ఎక్స్’లో పోస్టుచేశారు. అద్భుతమైన ఘనత సాధించామని ఉద్ఘాటించారు. డీఆర్డీఓతోపాటు సైనిక దళాలకు ఆయన అభినందనలు తెలియజేశారు.ప్రత్యేకతలేమిటి? ⇒ దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని హైదరాబాద్‌లోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్‌లో దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ)తోపాటు పలు ప్రభుత్వం, ప్రైవేట్ రంగ సంస్థలు సహకారం అందించాయి. ఇది వివిధ రకాల పేలోడ్స్‌ను 1,500 కిలోమీటర్లకు పైగా దూరానికి మోసుకెళ్లగలదు. ప్రయాణం మధ్యలో దిశను మార్చుకోగలదు. ⇒ సాధారణంగా హైపర్‌సానిక్ మిస్సైల్స్ పేలుడు పదార్థాలు లేదా అణు వార్హెడ్లను మోసుకెళ్తాయి. ధ్వని వేగం కంటే ఐదు రెట్లు అధిక వేగంతో దూసుకెళ్తాయి. అంటే గంటకు 1,220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ⇒ కొన్ని అడ్వాన్స్డ్ హైపర్సోనిక్ మిస్సైల్స్ ధ్వని వేగం కంటే 15 రెట్లు వేగంతో ప్రయాణిస్తాయి. ⇒ ప్రస్తుతం రష్యా, చైనా దేశాలు హైపర్సోనిక్ క్షిపణుల అభివృద్ధిలో ముందంజలో ఉన్నాయి. ఫ్రా న్స్, జర్మనీ, ఆ్రస్టేలియా, జపాన్, ఇరాన్, ఇజ్రా యెల్ తదితర దేశాలు సైతం ఈ తరహా క్షిప ణుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాయి. ⇒ చెనా సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో అత్యాధునిక సైనిక శక్తిని బలోపేతం చేసుకోవాలని ఇండియా నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొట్టమొదటి దీర్ఘశ్రేణి హైపర్సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ⇒ తదుపరి తరం ఆయుధ వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ(ఏఐ)తో పని చేసే ఆయుధాలు, పరికరాల అభివృద్ధికి భారత్ ప్రాధాన్యం ఇస్తోంది. ⇒ పృథీ్వ, ఆకాశ్, అగ్ని తదితర క్షిపణులను డీఆర్డీఓ గతంలో అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. -
అడ్వయిజర్లతో ఆర్థిక ప్రణాళిక ఈజీ!
ప్రతి కుటుంబానికి ఆర్థిక ప్రణాళిక అవసరం. వివిధ దశల్లో లక్ష్యాలను సాకారం చేసుకుంటూ విజయవంతంగా సాగిపోవడానికి మెరుగైన మార్గాన్ని చూపిస్తుంది. జీవిత లక్ష్యాలను నిర్ణయించుకోవడం, అందుకు అనుగుణంగా పెట్టుబడుల ప్రణాళికల రూపకల్పన, వాటి ఆచరణ ఇవన్నీ ఆర్థిక విజయంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, మనలో ఎక్కువ మందికి ఆర్థిక అంశాలపై కావాల్సినంత అవగాహన ఉండదు. ఇలాంటప్పుడే నిపుణుల సేవలు అవసరం పడతాయి. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఎంత కాలం పాటు, ఎంత చొప్పున ఇన్వెస్ట్ చేయాలి? ఏ సాధనాలను ఎంపిక చేసుకోవాలి.. వీటిని తేల్చడం నిపుణులకే సాధ్యపడుతుంది. అంతేకాదు పెట్టుబడి పెట్టడంతోనే పని ముగిసినట్టు కాదు. తమ లక్ష్యాలు, ఆకాంక్షలకు అనుగుణంగానే పనితీరు చూపిస్తున్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. ఈ పనిని సులభతరం చేసే వారే ఇన్వెస్ట్మెంట్ అడ్వయిజర్లు లేదా ఫైనాన్షియల్ ప్లానర్లు. వీరిని ఎలా ఎంపిక చేసుకోవాలి? ఎవరు ఎంపిక చేసుకోవాలి? వీరి సేవలు ఎలా ఉంటాయి? తదితర అంశాలపై అవగాహన కలి్పంచే కథనమిది... తమకు అనుకూలమైన ఆర్థిక సలహాదారును ఎంపిక చేసుకోవడం విజయంలో కీలకంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మంచి ట్రాక్ రికార్డు అని కాకుండా.. తమ లక్ష్యాల ప్రాధాన్యాన్ని చక్కగా అర్థం చేసుకోగలిగే నిపుణులను ఎంపిక చేసుకోవడం అవసరం. ‘‘ఆర్థిక ప్రణాళిక ఆరంభించడానికి సరైన సమయం అంటూ ఏదీ లేదు. ఎంత ముందుగా ఆరంభిస్తే అంత మెరుగైన ఫలితాలు అందుకోవచ్చు’’ అనేది సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మైంట్ అడ్వయిజర్ల, సహజ్‌మనీ వ్యవస్థాపకుడు అభిõÙక్ కుమార్ అభిప్రాయం. అందుకని కెరీర్ ఆరంభంలోనే ఆర్థిక నిపుణుల సాయంతో మెరుగైన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, ఆ దిశగా అడుగులు వేయడం ద్వారా బంగారు భవిష్యత్‌కు బాటలు వేసుకున్నట్టు అవుతుంది.నిజంగా అవసరమా? మన విద్యా వ్యవస్థ చాలా విషయాలను నేర్పుతుంది. కానీ ఆర్థిక విషయాలు, ప్రణాళికల గురించి ఎక్కడా కనిపించదు. వివాహం కోసం భారీగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి. కనీసం రూ.కోటి ఉంటేనే కానీ సొంతింటి కల సాకారం కాదు. పిల్లల విద్య కోసం ఏటా రూ.లక్షలు వెచి్చంచాలి. ఖరీదైన వైద్యం, రిటైర్మెంట్ తర్వాత జీవన అవసరాలు వీటన్నింటికీ సన్నద్ధంగా ఉండాలి. భారీ ఆదాయం ఆర్జించే వారికి తప్పించి, ప్రణాళిక లేకుండా వీటిని విజయవంతంగా అధిగమించడం సామాన్య, మధ్యతరగతి వారికి అంత సులభం కాదు. అర్హత కలిగిన, సెబీ రిజిస్టర్డ్ నిపుణుల సాయంతో వీటిని అధిగమించేందుకు తేలికైన మార్గాలను గుర్తించొచ్చు. ‘‘తమ జీవితంలో ఆర్థికంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పుడే చాలా మందికి ఫైనాన్షియల్ అడ్వయిజర్ లేదా ప్లానర్ అవసరం తెలిసొస్తుంది. ఇందుకు నిదర్శనం ఇటీవల చూసిన కరోనా విపత్తు. ఆ సమయంలో అత్యవసర నిధి సాయం ప్రాధాన్యాన్ని చాలా మంది అర్థం చేసుకున్నారు’’ అని ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్స్ బోర్డ్ (ఎఫ్‌పీఎస్‌బీ) ఇండియా సీఈవో క్రిషన్ మిశ్రా పేర్కొన్నారు. ఒకటికి మించి లక్ష్యాలు కలిగి, పొదుపు, మదుపు పట్ల ఆసక్తి కలిగిన వారు నిపుణుల సాయంతో అదనపు ప్రయోజనం పొందొచ్చు. ఆర్థిక అంశాల పట్ల ఎంతో కొంత అవగాహన ఉన్న వారు సైతం.. పొదుపు, పెట్టుబడుల పట్ల తగినంత సమయం వెచి్చంచలేనట్టయితే నిపుణుల సాయానికి వెనుకాడొద్దు. అనుకోని అవసరాలు ఏర్పడితే కొందరు రుణాలతో అధిగమిస్తుంటారు. ఆ రుణం తర్వాత మళ్లీ రుణం ఇలా రుణ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ఎంత సంపాదించినా చివరికి మిగిలేదేమీ ఉండదు. స్వీయ తప్పిదాలు, అవగాహనలేమితో ఆర్థిక సంక్షోభాలను కొనితెచ్చుకున్నట్టు అవుతుంది. ఆర్థిక నిపుణులను కలవడం వల్ల లక్ష్యాల పట్ల స్పష్టత వస్తుంది. ఆర్థిక సవాళ్లను అధిగమించడం ఎలాగన్న స్పష్టత వస్తుంది. మెరుగైన బాట తెలుస్తుంది. దీంతో మానసిక ప్రశాంతత సాధ్యపడుతుంది. మెరుగైన ఆర్థిక ప్రణాళిక ఉన్న కుటుంబాల్లో మానసిక ప్రశాంతత పాళ్లు ఎక్కువని పలు సర్వేలు సైతం స్పష్టం చేశాయి.అందుబాటులో ఉన్న ఆప్షన్లు.. ఆర్ఐఏలు సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు వీరు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫైనాన్స్ డిగ్రీ, కనీసం ఆయా విభాగంలో ఐదేళ్ల పాటు సేవలు అందించిన/పనిచేసిన అనుభవంతోపాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్ (ఎన్ఐఎస్ఎం) నుంచి ఎక్స్ఏ, ఎక్స్‌బీ సర్టిఫికెట్ కలిగి ఉంటారు. వీరు తమ క్లయింట్ల ప్రయోజనాల కోసమే కృషి చేయాలి. ఎవరి నుంచి ఏ రూపంలోనూ కమీషన్లు స్వీకరించరాదని సెబీ నిబంధనలు నిర్దేశిస్తున్నాయి.సీఏలుఅకౌంటింగ్, పన్ను, ఆడిట్ అంశాల్లో చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏలు) ఎంతో శిక్షణ పొంది ఉంటారు. ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ప్రత్యేక నైపుణ్యాలు సీఏలకు ఉండాలని లేదు. అయినా కానీ, పన్ను కోణంలో తమ క్లయింట్లకు పెట్టుబడుల సూచనలు చేయవచ్చు.సీఎఫ్‌పీలు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్లు తగిన కోర్సులు, పరీక్షలు పూర్తి చేసి ఎఫ్‌పీఎస్‌బీ నుంచి సర్టిఫికేషన్ పొందిన వారు. వ్యక్తుల ఆర్థిక ప్రణాళిక, పన్నులు, బీమా, రియల్ ఎస్టేట్ ప్లానింగ్ తదితర సేవలు అందిస్తారు.క్యూపీఎఫ్పీలు క్వాలిఫైడ్ పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్స్ (క్యూపీఎఫ్‌పీ) ఆరు నెలల కఠోర శిక్షణ అనంతరం నెట్వర్క్ ఎఫ్పీ నుంచి క్యూపీఎఫ్‌పీ సర్టిఫికేషన్ పొందుతారు. పర్సనల్ ఫైనాన్స్ అంశాలు, నైపుణ్యాల గురించి వీరు పూర్తి స్థాయి శిక్షణ తీసుకుంటారు. తమ క్లయింట్ల ఆర్థిక శ్రేయస్సు దిశగా వీరు.. పొదుపు, పెట్టుబడులు, బీమా, పన్నులు, రుణాలు తదితర అన్ని రకాల వ్యక్తిగత ఆర్థిక అంశాల్లో సేవలు అందిస్తారు.ఎవరిని ఎంపిక చేసుకోవాలి? సెబీ–ఆర్ఐఏలు లేదా సీఎఫ్‌పీలు, క్యూపీఎఫ్పీలలో ఎవరిని అయినా ఎంపిక చేసుకోవచ్చు. కానీ, పెట్టుబడుల సలహాలు అందించాలంటే ముందుగా సెబీ నుంచి రిజి్రస్టేషన్ తీసుకోవాల్సిందే. అందుకే ఆర్ఐఏలకు అదనంగా సీఎఫ్‌పీ లేదా చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (సీఎఫ్ఏ) లేదా క్యూపీఎఫ్‌పీ అర్హతలు ఉన్నవారిని ఎంపిక చేసుకోవడం మెరుగైనదని నిపుణుల సూచన. సీఎఫ్‌పీ, సీఎఫ్ఏ, క్యూపీఎఫ్‌పీ, సీఏ అన్నవి అదనపు అర్హతలుగానే చూడాలి. ‘‘ఫైనాన్షియల్ ప్లానర్‌ను ఎంపిక చేసుకునే ముందు వారికున్న అర్హతలను నిర్ధారించుకోవాలి. వివిధ రకాల అర్హతలు ఫైనాన్షియల్ ప్లానింగ్ పరంగా వివిధ అవసరాలకు సరిపోయే విధంగా ఉంటాయి. క్లయింట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే దిశగా కొందరు అడ్వయిజర్లు మార్గదర్శనం చేస్తారు. అదే సీఎఫ్‌పీలు అయితే సమగ్రమైన ఆర్థిక ప్రణాళికా పరిష్కారాలు సూచిస్తారు. రిటైర్మెంట్ కోసం ప్రణాళిక, ఎస్టేట్ ప్లానింగ్ (తదనంతరం వారసులకు బదిలీ), పన్ను ప్రణాళిక, వ్యక్తిగత ఆర్థిక అంశాలకు వీరు పరిష్కారాలు సూచిస్తారు. పెట్టుబడి సలహాదారుల మాదిరిగా కాకుండా సీఎఫ్‌పీలు ఆర్థిక లక్ష్యాలను సాధించే దిశగా సమర్థవంతమైన పరిష్కార మార్గాలను చూపిస్తారు’’ అని ఎఫ్‌పీఎస్‌బీ సీఈవో క్రిషన్ మిశ్రా సూచించారు. సీఏలు తమ కోర్సులో భాగంగా ఆర్థిక అంశాల నిర్వహణపైనా అధ్యయనం చేస్తారు. అయినప్పటికీ ప్రాక్టీసింగ్‌కు వచ్చే సరికి ఎక్కువ మంది సీఏలు ప్రధానంగా పన్ను అంశాల్లో పరిష్కారాలు, సేవలకు పరిమితం అవుతుంటారు. కాకపోతే తమకున్న అర్హతలు, అనుభవం ఆధారంగా కొందరు ఇతర సూచనలు కూడా చేస్తుంటారు. సీఎఫ్‌పీ సర్టిఫికేషన్ కలిగిన సెబీ ఆర్ఐఏ మంచి ఎంపిక అవుతారని, ఆర్థిక ప్రణాళికపై వీరికి సమగ్రమైన అవగాహన ఉంటుందని గుడ్ మనీ వెల్త్ ప్లానర్స్ వ్యవస్థాపకుడు మణికరణ్ సింఘాల్ సూచించారు. ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎంపిక విషయంలో తమ స్నేహితులు, బంధువుల సాయాన్ని తీసుకోవచ్చు.ఫీజుకు తగ్గ ప్రతిఫలం! ఆర్థిక నిపుణుల సేవల గురించి తెలిసినా.. వారికి భారీగా ఫీజులు చెల్లించుకోవాల్సి వస్తుందని కొందరు వెనకడుగు వేస్తుంటారు. నిజానికి నిపుణుల సేవలతో లాభపడే దాని కంటే వారికి చెల్లించే ఫీజు చాలా చాలా తక్కువ. కొంచెం మొత్తానికి వెనుకాడితే.. ఒక్క తప్పటడుగుతో భారీగా నష్టపోవాల్సి రావచ్చు. అందుకే కొంత ఖర్చయినా నిపుణులను ఆశ్రయించడమే మంచిది. సెబీ 2013లో ‘ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నిబంధనలు’ తీసుకొచి్చంది. అప్పటి వరకు కమీషన్ ఆధారితంగా వీరు సేవలు అందించే వారు. దీంతో ఎక్కువ కమీషన్ కోసం కొందరు తమ ప్రయోజన కోణంలో సలహాలు ఇచ్చే వారు. దీన్ని నివారించేందుకు.. ఫీజుల ఆధారిత నమూనాను సెబీ తీసుకొచి్చంది. సెబీ ఆర్ఐఏ చట్టం 2013 కింద.. స్థిరమైన ఫీజు లేదా, క్లయింట్ తరఫున తాము నిర్వహించే పెట్టుబడుల విలువలో నిర్ణీత శాతం (ఏయూఎం ఆధారిత) మేర ఫీజు కింద తీసుకోవచ్చు. ‘‘ఫీజు ఆధారిత సేవల నమూనాలో ఇన్వెస్టర్ విజయంపైనే ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ల ఆదాయం ఆధారపడి ఉంటుంది. మెరుగైన సూచనలు అందించకపోతే, క్లయింట్లను కోల్పోవాల్సి వస్తుంది. కమీషన్లకు అవకాశం లేకపోవడంతో ఎలాంటి పక్షపాతం లేని సూచనలు అందించడానికి వీలుంటుంది’’ అని మిశ్రా వివరించారు. ఆర్ఐఏలకు ఫీజులను డిజిటల్ విధానంలో, వారి ఖాతాకే చెల్లించాలి. నగదు రూపంలో, లేదా వేరెవరి ఖాతాకో బదిలీ చేయొద్దు.ఫీజు పరిమితులుఆర్ఐఏలకు సంబంధించి చార్జీల విషయంలో సెబీ పరిమితులు విధించింది. ఫిక్స్డ్ ఫీజు అయితే ఏడాదికి రూ.1.25 లక్షలు మించకూడదు. లేదా, ఇన్వెస్టర్ పెట్టుబడుల విలువలో ఏటా 2.5 శాతం మించి ఫీజు వసూలు చేయరాదు.ఈ అంశాలపై స్పష్టత అవసరం... ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు పూర్తి వివరాలు అందించినప్పుడే వారి నుంచి సరైన సూచనలు, సలహాలు పొందడానికి వీలుంటుంది. ముఖ్యంగా తమ ఆదాయం, ఖర్చులు, పెట్టుబడులు, రుణాలు, ఆస్తులు, పిల్లలు, వారికి సంబంధించి విద్య, వివాహ లక్ష్యాలు, భవిష్యత్తులో ఏవేవి సమకూర్చుకోవాలని అనుకుంటున్నారు? కుటుంబ ఆరోగ్య చరిత్ర ఇత్యాది వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా కోర్టు వివాదాలు, ఇతరత్రా కోరిన సమాచారం కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాల ఆధారంగా మెరుగైన ప్రణాళిక, సూచనలు, పరిష్కారాలు సూచించేందుకు ఆస్కారం ఉంటుంది.– సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఒక్క రోజు అమ్మాయిలకు అధికారం ఇస్తే..సూపర్ సక్సెస్!
దసరా నవరాత్రుల సందర్భంగాఉత్తర ప్రదేశ్‌లో హఠాత్తుగా పది జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చారు.అందరూ హైస్కూల్ గర్ల్ స్టూడెంట్లే. ‘జనతా దర్శన్’ పేరుతో సాగే ప్రజా దర్బార్లలో పాల్గొని సమస్యలు విని పరిష్కారాలకోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఇది ఉత్తుత్తికి కాదు.స్త్రీ శక్తి నిరూపణ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంచాలా సీరియస్‌గా నిర్వహించిన ‘ఆడపిల్లలకు ఒక రోజు అధికారం’ కార్యక్రమంలోజిల్లా యంత్రాంగం చేతులు కట్టుకుని వారి మాట వింది.ఈ అమ్మాయిలు ఈ అనుభవంతో ఐ.ఏ.ఎస్ కావాలనే తలంపునకు వచ్చారు. ప్రతి రాష్ట్రం ఇలాంటి ప్రయత్నం చేయాలి. అమ్మాయిలు చదువుకోవడం, విదేశాలకు వెళ్లి పై చదువులు చదవడం, మగవారికి మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగాలు తామూ చేయడం చూస్తూనే ఉన్నాం. చరిత్రలో మొదటిసారి అమెరికాలో అధ్యక్షపదవికి ఒక మహిళ పోటీ పడటం వరకూ ఈ మహిళా చైతన్యం సాగింది. అయినప్పటికీ మహిళల పట్ల వివక్ష, కుటుంబాలలో మగ పిల్లాడికి దక్క ప్రాధాన్యం, చదివించే విషయంలో అబ్బాయిలకు మంచి కోర్సు అమ్మాయిలకు అప్రధానమైన కోర్సు దేశంలో సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి మైండ్‌సెట్‌ని మార్చడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ‘శక్తి మిషన్’ అనే కార్యక్రమం నిర్వహిస్తోంది. మహిళల స్వావలంబనే కాదు... అమ్మాయిల ఆత్మవిశ్వాసం పెంచడం ఈ కార్యక్రమం ఉద్దేశం. ఇందులో మరో ముఖ్యమైన కార్యక్రమం ‘అమ్మాయిలకు ఒకరోజు అధికారం’. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మొన్నటి అక్టోబర్ 12న దాదాపు పది జిల్లాలలో ఈ కార్యక్రమం కింద ఇంటర్ లోపు చదువుతున్న అమ్మాయిలకు జిల్లా కలెక్టర్‌గా, ఎస్.పి.గా, సి.డి.ఓ. (చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా) పూర్తి అధికారాలు ఇచ్చారు. సర్వోన్నత ఉద్యోగాల్లో ఉంటే పేదవారికి, బలహీనులకు ఎలా న్యాయం చేయవచ్చో ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు తెలియచేయడమే కాదు... వారు అధికారంలో ఉంటే మిగిలిన సిబ్బంది ఎలా వ్యవహరిస్తారో నిజంగా చేసి చూపించారు. ఆ విధంగా ఇదో స్ఫూర్తినిచ్చే కార్యక్రమం.కూరగాయల రేట్లు ఇవా?లక్ష్మీపూర్ ఖేరి జిల్లాకు ఎనిమిదవ తరగతి చదువుతున్న అగరిమ ధావన్ ఒకరోజు కలెక్టర్ అయ్యింది. ఆమె ఆ రోజు తన దగ్గరకు వచ్చిన ప్రజల సమస్యలు వింది. అందులో భాగంగా కూరగాయల రేట్లు పెరగడం వల్ల ఇబ్బంది పడుతున్నామన్న ఫిర్యాదు వింది. వెంటనే కింది స్థాయి అధికారులను పిలిచి ‘కూరగాయల రేట్లు ఇలా ఉంటే ఎలా? వీటిని క్రమబద్ధీకరించరా?’ అని ప్రశ్నించి వాటి అదుపునకు చర్యలు తీసుకోమంది. వెంటనే అందుకు తగిన చర్యలు మొదలయ్యాయి. జౌన్పూర్ జిల్లాకు ఇంటర్ చదువుతున్న సాజల్ గుప్తా కలెక్టర్ అయ్యింది. ప్రజాదర్బార్ లో 87 ఫిర్యాదులు ఆమె వద్దకు వచ్చాయి. వాటిలో 14 ఫిర్యాదులను అక్కడిక్కడే ఆమె పరిష్కరించింది తన అధికారాలతో. ఇక మహరాజ్ గంజ్‌కు కలెక్టర్ అయిన నిధి యాదవ్ అనే అమ్మాయి ఆ ప్రాంత వాసులకు రావాల్సిన (హైవే నిర్మాణం వల్ల) నష్టపరిహారాన్ని అప్పటికప్పుడు మంజూరయ్యేలా చేసింది. అదే జిల్లాకు ఎస్.పి.గా అధికారాలు స్వీకరించిన గోల్టీ అనే అమ్మాయి తన పరిధిలోని స్టేషన్లలో ఆడవాళ్లు ఇబ్బంది పడుతున్న కేసులను మొదటగా ఇన్వెస్టిగేట్ చేసి పరిష్కరించాలని గట్టి ఆదేశాలు ఇచ్చింది. మిర్జాపూర్, ఘాజీపూర్, షామ్లీ, శ్రావస్థి, బాందా తదితర జిల్లాలలో కూడా ఆ జిల్లాల్లో చురుగ్గా చదువుతున్న అమ్మాయిలను ఎంపిక చేసి కలెక్టర్, ఎస్.పి. బాధ్యతలు అప్పజెప్తే వారు ఒక రోజంతా అద్భుతంగా బాధ్యతలు నిర్వహించడమే కాదు... విజిట్లకు కూడా వెళ్లారు.ఒక రోజు ఆఫీసర్ఎన్.శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమాలో అర్జున్ ఒక్క రోజు కోసం సి.ఎం. అయినా అతని నిర్ణయాలన్నీ అమలవుతాయి. ఇక్కడ కూడా ఈ అమ్మాయిలు తీసుకున్న నిర్ణయాలు అమలయ్యాయి. అమలు అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమంలో కొన్ని జిల్లాల్లో తాసిల్దార్లుగా కూడా అమ్మాయిలను నియమించారు ఒకరోజు కోసం. కలెక్టర్‌గా నియమితమైన అమ్మాయి, తాసిల్దార్లుగా నియమితమైన అమ్మాయిలు కలిసి మాట్లాడుకుని ఆ రోజున తమ టేబుళ్ల మీద ఉన్న సమస్యలను చకచకా పరిష్కరించడం అందరినీ ఆకర్షించింది. ఎస్.పి.గా చేసిన అమ్మాయిలు కొందరు ఎఫ్ఐఆర్ల మీద కూడా సంతకాలు చేశారు.కలెక్టర్లమవుతాంఈ కార్యక్రమంలో పాల్గొన్న అమ్మాయిలందరూ ప్రజల సమస్యలు విన్నారు. తాము బాగా చదువుకున్న ఆ సమస్యలను పరిష్కరించే అధికార స్థానంలో వెళ్లవచ్చని గ్రహించారు. ‘మేము బాగా చదువుకుంటాం’ అని ఆత్మవిశ్వాసంతో చెప్పారు. ఈ సందర్భంగా వీరందరూ కాన్వాయ్‌లలో ఆఫీసులకు చేరుకున్నారు. వీరందరూ భవిష్యత్తులో ఇంతకుమించిన బాధ్యతాయుత స్థానాల్లోకి వెళ్లాలని కోరుకుందాం. -
భుజాలపై మోసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చిన భారీ యాక్షన్ చిత్రం దేవర. సెప్టెంబర్ 27 థియేటర్ల ముందుకొచ్చిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.అయితే దేవర బ్లాక్‌బస్టర్ హిట్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్, అభిమానులపై ప్రశంసలు కురిపించారు. దేవరలో హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్ నటనను కొనియాడారు. తమ పాత్రలకు ప్రాణం పోసి, కథకు జీవం ఇచ్చారన్నారు.అలాగే దేవర డైరెక్టర్ కొరటాల శివతో పాటు మూవీకి పనిచేసిన సాంకేతిక సిబ్బందికి సైతం ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపారు. అనిరుధ్ రవిచందర్ అద్భుతమైన సంగీతమందిచాడన్నారు. దేవర సినిమాను తమ భుజాలపై మోసి ఇంతటి ఘనవిజయం అందించిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని వెల్లడించారు. మీ ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చిందని ఎన్టీఆర్ ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు. Grateful. pic.twitter.com/YDfLplET7S— Jr NTR (@tarak9999) October 15, 2024 -
ది గోట్ సరికొత్త రికార్డ్.. కేక్ కట్ చేసిన విజయ్
విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ది గోట్. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ. 400 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. విజయ్ సరసన మీనాక్షి చౌదరి నటించగా.. ఈ సినిమాలో త్రిష ప్రత్యేక సాంగ్‌లో మెరిశారు.తాజాగా దళపతి విజయ్ తన చిత్రం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (GOAT) సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నాఈ చిత్రం తమిళనాడులో రూ. 100 కోట్ల షేర్ సాధించడంతో నిర్మాత అర్చన కల్పాతితో కలిసి కేక్ కట్ చేశారు. అర్చనతో కలిసి నటుడు కేక్ కట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.కాగా.. ఈ చిత్రంలో విజయ్ రెండు పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, వైభవ్, ప్రేమి అమరేన్, యుగేంద్రన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్‌తో నిర్మించింది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. Celebrating #TheGreatestOfAllTime moment with @actorvijay na❤️❤️❤️ @archanakalpathi for achieving #100CRORESSHAREINTAMILNADU @vp_offl @Jagadishbliss bro thanks @Ags_production @agscinemas @aishkalpathi pic.twitter.com/JdaTdxpvCq— raahul (@mynameisraahul) October 12, 2024 -
ఆపరేషన్ తోడేలు సక్సెస్
లక్నో:ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్ జిల్లాను కొన్ని నెలలపాటు వణికించిన తోడేళ్ల కథ ముగిసింది.ఆపరేషన్ భేడియా విజయవంతమైంది. బహ్రెయిచ్‌లో మనుషులపై దాడులు చేసిన ఆరు తోడేళ్లలో ఐదు ఇప్పటికే పట్టుబడగా తాజాగా శనివారం(అక్టోబర్5) ఆరో తోడేలును గ్రామస్తులు మట్టుబెట్టారు. మేకను వేటాడుతుండగా గ్రామస్తులు ఆరో తోడేలును కొట్టి చంపినట్లు అటవీ అధికారులు తెలిపారు.ఐదో తోడేలు పట్టుబడ్డాక 24 రోజులుగా ఆరో తోడేలు ఒక్కతే తప్పించుకు తిరుగుతూ అటవీ అధికారులను ముప్పుతిప్పలుపెట్టింది. అయితే గ్రామస్తుల దాడిలో మరణించిన ఆరో తోడేలు మ్యాన్ఈటర్ అని చెప్పలేమని అటవీ అధికారులు అన్నారు.గత కొన్ని నెలలుగా బహ్రెయిచ్‌లో ఆరు తోడేళ్ల గుంపు అక్కడి ప్రజలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేసింది. తోడేళ్లు జరిపిన దాడుల్లో తొమ్మిది మంది పిల్లలు, ఒక మహిళ మృతి చెందగా 50 మంది దాకా గాయపడ్డారు. ఆపరేషన్ భేడియా సక్సెస్ కావడంతో బహ్రెయిచ్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ చదవండి: నెత్తురోడుతున్న బస్తర్ అడవులు -
ఆ 'కల' కోసం కాలేజీ వదిలేసి.. చివరకు..
మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.ప్రతి ఇంట్లోని డెస్క్‌పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే.. 1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు. -
నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్
జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'. ఈయన తన అద్భుతమైన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. అతి తక్కువ వయసులోనే ధనవంతుడై.. ఆ తరువాత అన్నీ కోల్పోయానని అన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.20 ఏళ్ళ వయసులోనే మల్టీ మిలియనీర్‌గా ఎదిగాను. యుఎస్‌లో జీవితం ఒక కలలా అనిపించింది. ఎంతగా అంటే నేను ఫెరారీని కూడా ఆర్డర్ చేసాను. కానీ అది వచ్చిన వెంటనే, అంతా అదృశ్యమైంది. డాట్ కామ్ బుడగ పగిలిపోయింది, దానితో డబ్బు మాయమైంది. ఉన్న డబ్బు పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వచ్చిందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.2003 నాటికి నేను గెలిచిన.. ఓడిపోయిన జ్ఞాపకం తప్పా మరేమీ మిగలలేదు. అన్నింటిని కోల్పోవడం వల్ల వచ్చే ధైర్యంతో నేను మరొక డాట్-కామ్ వెంచర్‌ను (షాదీ.కామ్) నిర్మించడానికి సన్నద్దమయ్యాను. డొమైన్ ధర 25,000 డాలర్లు. ఆ తరువాత మా వద్ద కేవలం 30,000 డాలర్లు మాత్రమే మిగిలింది. ప్రజలందరూ నన్ను పిచ్చివాడిగా భావించారు. అంతే కాకుండా నేను ప్రారంభించిన వ్యాపారం గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.ఎవరు ఏమనుకున్నా.. నేను మాత్రం ఇదే గేమ్ ఛేంజర్ అని భావించాను. ఇదే సరైనదని ముందుకు వెళ్ళాను. మళ్ళీ పూర్వ వైభవం పొందాను. నా ప్రయాణం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నేను ఓటమి చూసినా మళ్ళీ ఎదగగలనని నిరూపించానని అనుపమ్ మిట్టల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం గెలుపు, ఓటములతో నిర్దారించలేము. విజయం అనేది జనాదరణ పొందిన అభిప్రాయంతో పాటు వెళ్లడం కాదు. మీపై మీరు విశ్వాసంతో ముందుకు నడవడమే. రిస్క్ తీసుకోవాలి, గెలిచే వరకు ఆటను ఆపొద్దని మిట్టల్ సూచించారు. -
Haryana: అందరి దృష్టి ఆ సీటుపైనే..
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల తేదీలు వెల్లడయ్యాయి. రాష్ట్రంలోని మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ ఒకటిన పోలింగ్ జరగనుంది. అక్టోబర్ 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. రాష్ట్రంలోని 90 స్థానాల్లో ఒకటైన బధ్రా అసెంబ్లీ స్థానంపై అందరి దృష్టి నిలిచింది . ఈ సీటు హర్యానాలోని కీలకమైన సీట్లలో ఒకటి.బధ్రా అసెంబ్లీ స్థానం భివానీ మహేంద్రగఢ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ సీటులో మొత్తం 1.5 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 97,247, మహిళా ఓటర్ల సంఖ్య 86,708. ఈ స్థానంలో జాట్ ఓటర్లు అధికంగా ఉన్నారు. ఈ సీటుకున్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడి నుంచి ఒకసారి ఎన్నికల్లో గెలిచిన వారు మరోమారు విజయం సాధించలేదు.2019 అసెంబ్లీ ఎన్నికల్లో బధ్రా అసెంబ్లీ స్థానం నుంచి జననాయక్ జనతా పార్టీ నేత నైనా చౌతాలా భారీ విజయాన్ని దక్కించుకున్నారు. నైనాకు 52,543 ఓట్లు వచ్చాయి. నాటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రణబీర్ సింగ్ మహేంద్రకు 38,898 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సుఖ్వీందర్‌కు 32,685 ఓట్లు వచ్చాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుఖ్విందర్ మాంధీ విజయం సాధించగా, 2009లో ఐఎన్ఎల్డీ నేత కల్నల్ రఘ్బీర్ సింగ్ బధ్రా ఎన్నికల్లో విజయం సాధించారు. -
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నీట్, జేఈఈ క్రాక్ చేసి.. మెడికల్, ఐఐటీ వద్దంటూ..
ఏదైనా సాధించాలనే తపన మనసులో గాఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు నీట్, జేఈఈ పోటీపరీక్షలు మినహాయింపు కాదని నిరూపించాడు అసోంకు చెందిన ఓ కుర్రాడు. సీబీఎస్సీ 12వ తరగతి బోర్డు పరీక్షలో టాపర్‌గా నిలవడమే కాకుండా నీట్, జేఈఈలలో మంచి స్కోర్ సాధించాడు. అయినప్పటికీ తన అభిరుచికే పట్టంకడుతూ.. మెడికల్ సీటు, ఐఐటి మద్రాస్ అవకాశాన్ని వదిలి ఐఐఎస్సీలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.ఆ కుర్రాడి పేరు అధిరాజ్ కర్. అసోంతోని గౌహతి నివాసి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించి, సీబీఎస్సీ బోర్డు 12వ తరగతి పరీక్షలో కెమిస్ట్రీలో వందశాతం మార్కులు సాధించడంతోపాటు టాపర్‌గా నిలిచాడు. అలాగే నీట్ యూజీలో అసోంలో టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా మద్రాస్ ఐఐటీలోనూ సీటు దక్కించుకున్నాడు. అయితే అధిరాజ్ అటు ఐఐటీగానీ, ఇటు ఎంబీబీఎస్‌లను ఎంచుకోకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)లో సైన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.అధిరాజ్ కెమిస్ట్రీ, బయాలజీలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తరహాలోని వివిధ జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచాడు. పరిశోధనారంగంలో అతనికున్న అభిరుచి అతనిని ఐఐఎస్సీ వైపు నడిపించింది. అకడమిక్ విద్యకు అతీతంగా అధిరాజ్కు వన్యప్రాణుల సంరక్షణ, సంగీతంపై అమితమైన ఆసక్తి ఉంది. ఈ నేపధ్యంలోనే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ నేచర్ వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అధిరాజ్ గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ కర్, డాక్టర్ మధుశ్రీ దాస్‌ల కుమారుడు. -
మీరు లేకపోతే నేను లేను : ప్రభాస్ స్వీట్ వీడియో
ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ భారీ బడ్జెట్ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే ఏకంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ మూవీని నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి స్టార్స్ నటించారు. కల్కి సూపర్ హిట్ కావడంపై రెబల్ స్టార్ ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.ప్రభాస్ మాట్లాడుతూ..' ఇంత పెద్ద హిట్ అందించినందుకు మీకు ఫ్యాన్స్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకపోతే నేను జీరోనే. థ్యాంక్ యూ నాగ్ అశ్విన్. దాదాపు మాది ఐదేళ్ల ప్రయాణం. ఇంత పెద్ద సినిమాను అందించినందుకు వైజయంతి మూవీస్, నిర్మాతలకు నా ధన్యవాదాలు. అద్భుతమైన క్వాలిటీతో పెద్ద సినిమాను ప్రేక్షకులకు అందించారు. ఇలాంటి అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. అలాగే దీపికా, కమల్ సార్, అమితాబ్ సార్, దిశా పటానీకి మనస్ఫూర్తిగా నా అభినందనలు' అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. కాగా.. ప్రభాస్ తదుపరి మారుతి డైరెక్షన్లో ది రాజాసాబ్‌లో కనిపించనున్నారు. WE HAVE MUCH BIGGER PART 2 🔥A sweet note from Rebel star #Prabhas, celebrating the blockbuster success of #Kalki2898AD ❤️#EpicBlockbusterKalki @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD #TeluguFilmNagar pic.twitter.com/g5CdfE9a1E— Telugu FilmNagar (@telugufilmnagar) July 14, 2024 -
చతికిలపడిన ఆమ్ ఆద్మీ పార్టీ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్నికల సమయంలో అరెస్ట్ చేయడం ఆ పార్టీకి నష్టం చేకూర్చిందా? ఇండియా కూటమి అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సాయం అందిస్తామన్న ఆమ్ ఆద్మీ పార్టీ మాటలు ఒట్టి మాటలుగానే మిగిలిపోయాయా? ఫలితాలను విశ్లేషిస్తే ఇవన్నీ నిజమని అనిపించక మానవు. ఢిల్లీ మొదలుకొని పంజాబ్, గుజరాత్, హర్యానాల్లోనూ పోటీ చేసిన ఈ పార్టీ గెలిచింది మాత్రం మూడంటే మూడు!రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ పార్టీ ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, హర్యానాతో పాటు అసోంలో కూడా తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇండియా కూటమిలో భాగంగా ఉన్నప్పటికీ, పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో ఆప్ తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో కలసి సీట్లను పంచుకుంది. ఢిల్లీలోని నాలుగు స్థానాల్లో ఆప్ అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా హర్యానాలోని కురుక్షేత్ర, గుజరాత్‌లోని భావ్‌నగర్, బరూచ్, అస్సాంలోని దిబ్రూఘర్,సోనిత్పూర్ల నుంచి కూడా ఆప్ అభ్యర్థులు పోటీ చేశారు.పంజాబ్‌లోని అన్ని స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే ఉన్నందున 13 సీట్లలో కనీసం 10 సీట్లు గెలుచుకుంటామని ఆప్ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే హోషియార్పూర్, ఆనంద్‌పూర్ సాహిబ్, సంగ్రూర్ మినహా మిగిలిన 10 స్థానాల్లో ఆప్ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.ఢిల్లీలో కాంగ్రెస్‌తో ఆప్ పొత్తు పెట్టుకుని దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల నుంచి పోటీకి దిగింది. అయితే నాలుగు స్థానాల్లోనూ ఆప్ ఓటమిని చవిచూసింది. హర్యానాలోని కురుక్షేత్ర స్థానాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకోలేకపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సుశీల్ గుప్తా బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ చేతిలో 29 వేల ఓట్ల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.గత అసెంబ్లీ ఎన్నికల నుంచి గుజరాత్లో ఆప్ హల్ చల్ చేయడం ప్రారంభించింది. ఇప్పుడు భావ్‌నగర్, భరూచ్ స్థానాల్లో ఒంటరిగా పోటీకి దిగింది. అయితే ఈ రెండు స్థానాల్లోనూ ఓటమి పాలయ్యింది. ఈ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు.దిబ్రూగఢ్, సోనిత్పూర్ స్థానాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. దిబ్రూగఢ్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్ విజయం సాధించారు. సోనిత్పూర్ సీటులో ఆప్ మూడో స్థానంలో నిలిచింది. -
మూడోసారీ మోదీనే ప్రధాని: అయోధ్య ప్రధాన పూజారి
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి అఖండ విజయాన్ని ఆపాదించాయి. అయితే జూన్ 4న ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ ప్రభుత్వం ఏర్పాటు కానున్నదో తెలిసిపోనుంది. అన్ని ప్రాంతాలలో మాదిరిగానే అయోధ్యలో కూడా లోక్‌సభ ఎన్నికలపై చర్చలు జరుగుతున్నాయి.ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని కావాలని కోరుకుంటూ రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ ప్రతిరోజూ బాలరాముని ముందు వేడుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పూర్తి మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, మూడోసారి కూడా మోదీ ప్రధాని కాబోతున్నారని జోస్యం చెప్పారు.మోదీ మూడోసారి దేశానికి ప్రధాని అవుతారని తాను గతంలోనే చెప్పానని సత్యేంద్ర దాస్ తెలిపారు. తాను చెప్పినది జూన్ 4న రుజువుకానున్నదని అన్నారు. దేశ ప్రధాని మోదీకి రామ్‌లల్లా ఆశీస్సులు ఉన్నాయని, ఆయన ప్రజలకిచ్చిన హామీలను నెరవేరుస్తారని దాస్ పేర్కొన్నారు. -
కేంద్రంలో కూటమిదే విజయం: జార్ఖండ్ సీఎం
2024 లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. దేశంలో ఏ ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. అయితే దీనికి ముందే ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం దేశంలో ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఇండియా కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడేందుకు అవకాశం లేదు. అయితే ఎగ్జిట్ పోల్ కరెక్ట్ కాదని ఇండీయా కూటమి నేతలు అంటున్నారు. తాము 295 సీట్లు గెలుచుకుని, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు.జార్ఖండ్ ముక్తి మోర్చా ఇండయా కూటమిలో భాగం. రాష్ట్రంలో ఇండియా కూటమి 10కి పైగా సీట్లను గెలుచుకుంటుందని జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపై సోరెన్ అన్నారు. ఇతర రాష్ట్రాల సీట్లతో కలిపి తాము మొత్తం 295 సీట్లు గెలుస్తామన్నారు. ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నదానిలో వాస్తవం లేదు. జార్ఖండ్‌లో కూటమి పరిస్థితి బాగానే ఉందన్నారు. కాగా మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇండియా కూటమి లోక్‌సభలో 295 సీట్లు గెలవడం ఖాయమన్నారు. -
ఈ నేతల విజయం పక్కా? పోరు నామమాత్రం?
2024 లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే వివిధ ప్రైవేట్ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. ఈ వివరాలపై జనం అమితమైన ఆసక్తికనబరుస్తున్నారు. ఎగ్జిట్‌పోల్స్ ప్రకారం ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది మంది నేతలు గెలుపు ఖాయమని తెలుస్తోంది. పైగా వీరికి పోరు నామమాత్రంగా ఉండనున్నదని కూడా ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.ప్రధాని నరేంద్ర మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోనూ ఆయన వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమయ్యారు. 2019 ఎన్నికల్లో మోదీకి ప్రత్యర్థిగా నిలబడిన వారందరికీ డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఈసారి మోదీ 10 లక్షలకు పైగా ఓట్లు సాధిస్తారని బీజేపీ చెబుతోంది.రాజ్‌నాథ్ సింగ్రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈసారి కూడా లక్నో పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. రాజ్ నాథ్ కూడా ఈసారి హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన ఐదు లక్షలకు పైగా ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.హేమమాలినిమథుర లోక్‌సభ స్థానం నుంచి హేమమాలిని వరుసగా మూడోసారి పోటీకి దిగారు. గత 10 ఏళ్లలో తాను ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. హేమ మాలిని మథుర నుంచి హ్యాట్రిక్ సాధించడానికి సిద్ధమవుతున్నారు.అఖిలేష్ యాదవ్ కన్నౌజ్ లోక్‌సభ స్థానం నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎస్ఫీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అజంగఢ్ నుండి గెలిచారు. అయితే 2022 అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే అయ్యాక, ఆయన తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేశారు. అఖిలేష్‌పై బీజేపీకి చెందిన సుబ్రతా పాఠక్ రంగంలోకి దిగారు.డింపుల్ యాదవ్ఈసారి డింపుల్ యాదవ్ మెయిన్పూర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. 2022లో ములాయం సింగ్ మరణానంతరం ఇక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ విజయం సాధించారు. మెయిన్పూర్ సీటు ఎస్పీకి కంచుకోటగా పేరొందింది. ములాయం సింగ్ యాదవ్ ఇక్కడి నుంచి ఎన్నికల్లో విజయం సాధించారు.అనుప్రియా పటేల్అప్నా దళ్ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్.. మీర్జాపూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా రెండు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈసారి కూడా ఆమె మీర్జాపూర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తూ, హ్యాట్రిక్ సాధించేందుకు సిద్ధమవుతున్నారు.రాహుల్ గాంధీకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీకి దిగారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. గత ఎన్నికల్లో రాహుల్ అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆయన కాంగ్రెస్‌కు రిజర్వ్డ్ స్థానమైన రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల బరిలోకి దిగారు.స్మృతీ ఇరానీస్మృతీ ఇరానీ కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2019లో అమేథీ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో రాహుల్ స్మృతీ ఇరానీకి ఘోర పరాజయాన్ని అందించారు. అయితే 2019 ఎన్నికల్లో ఆమె రాహుల్ గాంధీని ఓడించారు. ప్రస్తుతం స్మృతి ఇరానీకి ప్రత్యర్థిగా గతంలోసోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కేఎల్ శర్మ రంగంలోకి దిగారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. -
యాంటీ రేడియేషన్ మిసైల్... ‘రుద్ర ఎమ్-2’ పరీక్ష సక్సెస్
భువనేశ్వర్: ఉపరితల యాంటీ రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2ను భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ సెంటర్ నుంచి బుధవారం(మే29) ఈ మిసైల్‌ను పరీక్షించారు.ఈ సూపర్‌సానిక్ మిసైల్‌ను భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డీఆర్డీవో అభివృద్ధి చేసింది. యాంటీ రేడియేషన్ మిసైల్‌ను భారత్ దేశీయంగా అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి. ఇది శత్రువుల నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకుని పనిచేస్తుంది.ప్రస్తుతం శత్రువుల నిఘా వ్యవస్థలను నిర్వీర్యం చేయడానికి భారత్ రష్యాకు చెందిన కేఎహెచ్-31 యాంటీ రేడియేషన్ మిసైళ్లను వినియోగిస్తుంది. వీటి స్థానంలో త్వరలో రుద్రను వాడనున్నారు. రుద్ర అనుకున్న లక్ష్యాల మేర పనిచేసిందని, ఈ పరీక్ష పూర్తిగా విజయవతమైందని డీఆర్డీవో ఒక ప్రకటనలో తెలిపింది. రుద్ర పరీక్ష విజయవంతమైందని, దీనిని అభివృద్ధి చేసిన డీఆర్డీవోకు అభినందనలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు పెట్టారు. -
లోక్‌సభకు ఎక్కువసార్లు నెగ్గింది ఎవరంటే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో పలువురు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కొందరు ఐదోసారి, మరికొందరు ఏడోసారి ఎంపీల రేసులో ఉన్నారు. 1952లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ఇప్పటి వరకు 17 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం 18వ లోక్‌సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే లోక్‌సభకు ఎక్కువసార్లు ఎవరు గెలిచారనే విషయానికొస్తే..ఇంద్రజీత్ గుప్తా(11 సార్లు): లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక సార్లు గెలిచిన వ్యక్తిగా కమ్యూనిస్టు నేత ఇందర్జిత్ గుప్తా రికార్డు సృష్టించారు. 1960లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1999లో చివరిసారిగా ఎంపీ అయ్యారు. ఇంద్రజిత్ గుప్తా తన జీవితకాలంలో 11 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.సోమనాథ్ ఛటర్జీ(10 సార్లు):1929 జూలై 25న అస్సాంలోని తేజ్‌పూర్‌లో జన్మించిన సోమనాథ్ ఛటర్జీ లోక్‌సభ ఎన్నికల్లో 10 సార్లు గెలిచారు. ఛటర్జీకి 1996లో 'అత్యుత్తమ పార్లమెంటేరియన్ అవార్డు' లభించింది.పీఎం సయీద్ (10 సార్లు):పీఎం సయీద్ 1967 నుండి 1999 వరకు వరుసగా 10 సార్లు ఎంపీ అయ్యారు. ఆయన తొలి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు.అటల్ బిహారీ వాజ్‌పేయి(9 సార్లు)మూడుసార్లు దేశ ప్రధానిగా పనిచేసిన అటల్ బిహారీ వాజ్‌పేయి తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు. రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అటల్ జీకి నాలుగు దశాబ్దాలకు పైగా పార్లమెంటరీ అనుభవం ఉంది. మరికొందరు నేతలు కూడా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారుకమల్ నాథ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఒకరు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా లోక్‌సభ స్థానం ఆయనకు బలమైన కోటగా పరిగణిస్తారు. కమల్‌నాథ్ 1980లో తొలిసారిగా ఇక్కడి నుంచి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేశారు.మాధవ్ రావ్ సింధియా: దివంగత నేత మాధవరావు సింధియా 1971లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. తొమ్మిది సార్లు ఎంపీగా ఉన్నారు. గ్వాలియర్ లోక్‌సభ స్థానం నుంచి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయిని కూడా ఆయన ఓడించారు.ఖగపతి ప్రదాని: ఒడిశాలోని నబరంగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి వరుసగా తొమ్మిది సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ దివంగత నేత ఖగపతి ప్రదాని రికార్డు సృష్టించారు. 1999లో రాజకీయాల నుంచి తప్పుకున్నారు.గిరిధర్ గోమాంగ్: కాంగ్రెస్ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గోమాంగ్ లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు విజయం సాధించారు. కోరాపుట్ నియోజకవర్గం నుంచి అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధించారు.రామ్‌విలాస్ పాశ్వాన్: తొమ్మిదిసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన నేతల్లో రామ్‌విలాస్ పాశ్వాన్ పేరుంది. రామ్ విలాస్ బీహార్‌లోని హాజీపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు, రోస్రా లోక్‌సభ స్థానం నుంచి ఒకసారి గెలుపొందారు.జార్జ్ ఫెర్నాండెజ్: లోక్‌సభ ఎన్నికల్లో తొమ్మిది సార్లు గెలిచిన నేతల్లో జార్జ్ ఫెర్నాండెజ్ కూడా ఒకరు. 1967లో తొలిసారిగా ముంబై సౌత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్నికల్లో గెలుపొందారు. అతను బీహార్‌లోని ముజఫర్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి ఐదుసార్లు, నలంద నుంచి మూడుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో గెలిచారు.బాసుదేబ్ ఆచార్య: పశ్చిమ బెంగాల్‌లోని బంకురా లోక్‌సభ స్థానం నుంచి సీపీఐ(ఎం) నేత వాసుదేబ్ ఆచార్య తొమ్మిది సార్లు ఎంపీగా గెలుపొందారు. వాసుదేబ్ ఆచార్య 1980లో తొలిసారిగా బంకురా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.మాణిక్‌రావ్ హోడల్యా గవిత్: మహారాష్ట్రకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నేత మాణిక్‌రావ్ హోడల్యా గవిత్ లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా తొమ్మిదిసార్లు విజయం సాధించారు. 1981లో తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.వీరంతా ఎనిమిది సార్లు: బీజేపీ నేత సంతోష్ గంగ్వార్ లోక్‌సభ ఎన్నికల్లో బరేలీ స్థానం నుంచి ఎనిమిది సార్లు గెలిచారు. సుల్తాన్పూర్ నుంచి బీజేపీ అభ్యర్థి మేనకా గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఎనిమిదిసార్లు విజయం సాధించారు. సుమిత్రా మహాజన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. -
ప్రముఖ నటికి సర్జరీ.. షాకయ్యానన్న మాజీ భర్త!
బాలీవుడ్ నటి రాఖీ సావంత్ ఇటీవల తీవ్రమైన అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. అయితే రాఖీసావంత్ గర్భాశయంలో భారీ కణతి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆమెకు సర్జరీ చేయాల్సి వచ్చిందని ఆమె మాజీ భర్త రితేశ్ సింగ్ తెలిపారు.ప్రస్తుతం రాఖీ సావంత్‌కు శస్త్రచికిత్స విజయవంతంగాపూర్తైనట్లు ఆమె మాజీ భర్త తెలిపారు. తాజాగా ఆమెకు ఆపరేషన్ చేసిన వైద్యులు దాదాపు 10 సెంటిమీటర్ల కణతిని తొలగించారని పేర్కొన్నారు. మే 18న శస్త్రచికిత్స చేసి కణితిని తొలగించారని వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతర ఆమె అపస్మారక స్థితిలో ఉందని మాజీ భర్త చెప్పారు. రాఖీ గర్భాశయంలో కణితి చాలా పెద్దదిగా ఉందని.. దాదాపు అరచేతి పరిమాణంలో ఉందని రితేశ్ తెలిపారు. మొదటిసారి అది చూసి తాను షాకయ్యానని చెప్పారు. ఆమెకు దాదాపు మూడు గంటల పాటు ఆపరేషన్ జరిగినట్లు వివరించారు. రాఖీ కోలుకోవాలంటూ ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. -
శిబు సోరెన్ రాజకీయ జీవితంలో విజయాలెన్ని?
దేశ రాజకీయాల్లో అత్యంత జనాకర్షణ కలిగిన నేతలు అరుదుగా కనిపిస్తారు. వారిలో ఒకరే జార్ఖండ్ అధికార ప్రాంతీయ పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత శిబు సోరెన్. పొడవాటి జుట్టు, మాసిన గడ్డంతో కనిపించే ఈ నేతకు 80 ఏళ్లు. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిబు సోరెన్ అక్కడి బహిరంగ సభల్లో ప్రతీకాత్మకంగా కనిపిస్తుంటారు. అంటే మోర్చా వేదికల్లో పోస్టర్లు, బ్యానర్లలో ఆయన ఫొటో తప్పక కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేయనప్పటికీ ఆయన పేరు జార్ఖండ్‌లో వాడవాడలా వినిపిస్తుంటుంది. వడ్డీ వ్యాపారుల ఆగడాలు, మాదక ద్రవ్యాల విముక్తిపై పోరాటంతో శిబు సోరెన్ రాజకీయ ప్రయాణం మొదలైంది. ధన్‌బాద్‌కు ఆనుకుని ఉన్న తుండి ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని శిబు తన పోరాటాన్ని ప్రారంభించారు. తొలుత పాఠశాలలో విద్యపై గ్రామీణులకు అవగాహన కల్పించారు.1977లో శిబు సోరెన్ తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి విఫలమయ్యారు. అయితే 1980లో లోక్‌సభలో మొదటి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత 1986, 1989, 1991, 1996లలో విజయాన్ని హస్తగతం చేసుకుంటూ వచ్చారు. 1998 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేత బాబులాల్ మరాండీ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే 2004, 2009, 2014లలో దుమ్కా పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి తిరిగి విజయాన్ని దక్కించుకున్నారు.శిబూ సోరెన్ మొత్తం ఎనిమిది సార్లు దుమ్కా లో విజయపతాకం ఎగురవేశారు. శిబు సోరెన్ రెండుసార్లు రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు. 1984లో ఒకసారి జామా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ సీటులో ఆయన పెద్ద కోడలు సీతా సోరెన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. శిబు సోరెన్‌పై పలు హత్యారోపణలు ఉన్నాయి. అయితే విచారణ తర్వాత అతనిని కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. శిబు సోరెన్ వివిధ కాలాల్లో మూడుసార్లు జార్ఖండ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. -
ఒకే సీటుపై మూడు సార్లు పోటీకి దిగిన మూడో ప్రధానిగా మోదీ!
యూపీలోని వారణాసి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ.. దేశ తొలి ప్రధాని నెహ్రూ, వాజ్‌పేయిల రికార్డును సమం చేశారు. ఈ మాజీ దివంగత ప్రధానులిద్దరూ ఒకే లోక్‌సభ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి భారీ ఓట్లతో విజయం సాధించారు. ఇప్పుడు మోదీ కూడా ఒకే లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయడం ద్వారా సరికొత్త రికార్డు నెలకొల్పారు.పండిట్ నెహ్రూ 1951, 1957, 1962లో మూడుసార్లు ప్రయాగ్‌రాజ్ జిల్లాలోని ఫుల్పూర్ సీటుకు ఎంపీగా ఉన్నారు. మూడుసార్లు ప్రధానిగా దేశ పగ్గాలను చేపట్టారు. భారతరత్న పండిట్ అటల్ బిహారీ వాజ్‌పేయి లక్నో నుంచి ఐదుసార్లు ఎంపీగా ఉన్నప్పటికీ, 1996, 1998, 1999లో ఎంపీ అయిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టారు. తాజాగా నరేంద్ర మోదీ 2014, 2019లో వారణాసి ఎంపీగా ఎన్నికయ్యారు. రెండు పర్యాయాలు ఆయన నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వారణాసి నుంచి మూడోసారి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా, ఒకే లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడుసార్లు ఎన్నికల్లో పోటీ చేసిన ఘనత దక్కించుకున్నారు.భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో 14 మంది ప్రధానులు దేశాన్ని పాలించారు. వారిలో తొమ్మిది మంది ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే కావడం విశేషం. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి మొదలైన ఈ ట్రెండ్ నరేంద్ర మోదీ వరకూ వచ్చింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధి, చౌదరి చరణ్ సింగ్, రాజీవ్ గాంధీ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి యూపీలోని వివిధ స్థానాల నుండి ఎన్నికలలో గెలిచి పార్లమెంటుకు చేరుకున్నారు. -
51 ఏళ్ల వయసులో మరోసారి ప్రభుత్వ ఉద్యోగం!
రాజేంద్ర సింగ్.. మొదట భారత ఆర్మీలో సైనికుడు. తరువాత బ్యాంకులో సెక్యూరిటీ గార్డు. ఇప్పుడు బ్యాంకులో క్లర్కు. 51 ఏళ్ల వయసులో ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి.. విజయానికి వయసు అడ్డంకి కాదని నిరూపించాడు.వయసు మీదపడ్డాక మరోసారి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన రాజేంద్ర సింగ్ రాజస్థాన్‌లోని సికార్ జిల్లా లక్ష్మణగఢ్ పట్టణంలో కుటుంబంతో పాటు ఉంటున్నాడు. రాజేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడుతూ తన కుటుంబ సభ్యులలోని ఐదుగురు భారతీయ సైన్యంలో చేరారని, మొదట తన తండ్రి, తరువాత ముగ్గురు సోదరులు, ఇప్పుడు తన పెద్ద కుమారుడు సైన్యంలో చేరారన్నారు.ఇండియన్ ఆర్మీలో 18 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తర్వాత రాజేంద్ర సింగ్ వీఆర్ఎస్ తీసుకున్నారు. తర్వాత 2014లో ఎస్బీఐ లక్ష్మణ్‌గఢ్‌లో సెక్యూరిటీ గార్డుగా ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఆల్వార్ అండ్ సికార్ జోన్‌లోని బ్యాంకులో క్లర్క్ పోస్ట్ దక్కించుకున్నారు. ఇందుకు నిర్వహించిన పోటీ పరీక్షలో రాజస్థాన్‌లో నాల్గవ ర్యాంక్ సాధించారు.సైన్యం నుంచి రిటైర్ అయ్యాక చాలామంది ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే రాజేంద్ర సింగ్ తన భార్య అమృతా దేవి ప్రోత్సాహంతో 51 ఏళ్ల వయస్సులో మరోమారు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. ఇందుకోసం ఎస్బిఐ నిర్వహించిన పోటీ పరీక్షలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. తన సక్సెస్ క్రెడిట్ అంతా తన భార్యకే దక్కుతుందని రాజేంద్ర సింగ్ తెలిపారు. రాజేంద్ర సింగ్ 1991లో భారత సైన్యంలో సైనికుడిగా నియమితులయ్యారు. సైన్యంలో 18 ఏళ్లపాటు సేవలందించిన తర్వాత 2009లో హవల్దార్ పదవి నుంచి వీఆర్ఎస్ తీసుకున్నారు. 2014లో ఎస్బీఐలో గార్డ్‌గా నియమితులయ్యారు. 2024, మార్చి 28న జరిగిన ఎస్బీఐ బ్యాంక్ క్లర్క్ పరీక్షకు హాజరై, ఉత్తీర్ణత సాధించారు. రాజేంద్ర సింగ్‌కు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు నితేష్ బీఎస్ఎఫ్లో సైనికుడు. చిన్న కుమారుడు కార్తీక్ బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. -
అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
అమెరిలో ఏప్రిల్ 27 వ తారీకు సాయంత్రం (భారత దేశ కాలమానము ఏప్రెల్ 28 ఉదయము) తొలి ప్రపంచ తెలుగు సమితి, "వరల్డ్ తెలుగు కన్సార్టియం" అంతర్జాల సమావేశం అద్భుతంగా జరిగింది.ఎనిమిది దేశాలకు చెందిన 27మంది వక్తలు, సంధానకర్తలతో సభ కళ కళ లాడింది. ఈ సభలో వంగూరి చిట్టెన్ రాజు, లలిత రామ్, వంశీ రామ రాజు, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, రాధిక మంగిపూడి, షామీర్ జానకీ దేవి, శ్రీహవిష దాస్ , తెలుగు సాహిత్య ప్రపంచం లోని అతిరధ, మహారధులు పాల్గొన్నారు. మహాకవులు, రచయితలు, వాగ్గేయకారులు, వారి రచనల పై ఉత్తేజమైన ప్రసంగాలు ప్రత్యక్ష ప్రసారమయ్యాయి.ఈ సమావేశాన్ని యూట్యూబ్ లో వీక్షించవచ్చు. -
వార్ వన్ సైడే
నిన్ను చూడటానికే వచ్చానన్నా..బాపట్ల జిల్లా సంతమాగలూరు మండలం పుట్టావారిపాలెం అడ్డరోడ్డు వద్ద ఏప్రిల్ 10న మధ్యాహ్నం 1.30 గంటలకు 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలో సీఎం జగన్‌ను చూసేందుకు వేల్చూరు పంచాయతీ పరిధిలోని రామిరెడ్డిపాలెంకు చెందిన వెంకాయమ్మ పరుగెత్తుకొస్తోంది. మధ్యలో చెప్పులు తెగిపోయినా లెక్క చేయకుండా తారు రోడ్డుపై ఉత్త కాళ్లతోనే పరుగులు తీస్తున్న ఆమెను చూసిన సీఎం జగన్.. బస్సు ఆపించారు. ఆమెను దగ్గరికి పిలిచారు. ‘ఏం తల్లీ బాగున్నావా? ఏమైనా సమస్య ఉందా..’ అంటూ ఆత్మియంగా పలకరించారు. ‘జగనన్నా.. నీ పాలనలో నాకు ఎలాంటి సమస్య లేదు. నిన్ను దగ్గరి నుంచి చూద్దామని, పలకరిద్దామనే వచ్చా’ అని చెబుతూ మురిసిపోయింది.► కృష్ణా జిల్లా నందివాడ మండలం పుట్టగుంటకు ఒక కిలోమీటరు దూరంలో ఏప్రిల్ 15వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మండుతున్న ఎండలో సీఎం జగన్‌ను చూసేందుకు పొలాల వెంట 20–25 మంది మహిళలు పరుగులు పెడుతూ వస్తున్నారు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి కిందకు దిగారు. మహిళలంతా సీఎం జగన్ చుట్టూ చేరారు. ‘విజయవాడలో మీపై రాయితో దాడి చేశారని తెలిసి తల్లడిల్లిపోయాం. మంచి చేసిన మిమ్మల్ని ప్రజలంతా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే అక్కసుతో టీడీపీ వాళ్లు మీపై దాడి చేయించారు.. జాగ్రత్తగా ఉండు జగనన్నా.. మీరు బాగుంటేనే మేం బాగుంటాం’ అంటూ తోడబుట్టిన అన్నగా భావిస్తూ పరామర్శించారు. ► కాకినాడ జిల్లా సామర్లకోట ముఖ ద్వారం వద్ద ఏప్రిల్ 19న మధ్యాహ్నం ఒంటి గంటకు మండే ఎండలో వేలాది మంది మహిళలు రోడ్డుపై నిలబడ్డారు. సీఎం జగన్ బస్సు అక్కడకు రాగానే మహిళలు హర్షధ్వానాలు చేశారు. బస్సు దిగిన సీఎం జగన్.. వారితో ముచ్చటించారు. ‘జగనన్నా.. మీరు మాకు మంచి చేశారు. మేం మళ్లీ మిమ్మల్ని గెలిపించుకుని సీఎంగా చేసుకుంటాం’ అంటూ భరోసా ఇచ్చారు. గుమ్మడి కాయలతో దిష్టి తీసి.. హారతులు ఇచ్చి దీవించారు. ► వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో ఆత్మియత, అనుంబంధాలకు అద్దం పట్టే ఇలాంటి దృశ్యాలు అడుగడుగునా కన్పించాయి. ఇలాంటి దృశ్యాలు రాజకీయాల్లో అత్యంత అరుదుగా కన్పిస్తుంటాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మాటపై నిలబడి.. నిబద్ధత, నిజాయితీతో పని చేసే నాయకుడిని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారనడానికి సీఎం జగన్ బస్సు యాత్రే నిదర్శనమని స్పష్టం చేస్తున్నారు.బస్సు యాత్ర సాగినంత దూరం.. మండుటెండైనా అర్ధరాత్రయినా లెక్క చేయకుండా స్కూలు పిల్లల నుంచి అవ్వాతాతల వరకు మానవ హారంగా ఏర్పడి సీఎం జగన్‌కు నీరాజనాలు పలకడం దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచిపోతుందని చెబుతున్నారు. ‘ఫలానా పనులు చేస్తాం.. మాకు ఓటేయండి’ అని రాజకీయ నాయకులు ఎన్నికలప్పుడు అడగడం సాధారణమని, కానీ.. ‘జగనన్నా.. మీరు మంచి చేశారు.. మిమ్మల్ని మళ్లీ గెలిపించి సీఎంగా చేసుకుంటాం’ అని ప్రజలు అడుగడుగునా భరోసా ఇస్తుండటం చరిత్రలో తామెన్నడూ చూడలేదని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. –మరిన్ని వివరాలు ఐఐఐలోసాక్షి, అమరావతి: రాష్ట్రంలో 22 రోజుల పాటు సాగిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో సీఎం జగన్‌ను చూసేందుకు ఆద్యంతం జనం ప్రభంజనంలా తరలివచ్చారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి బస్సు యాత్రను ఆరంభించారు. బుధవారం శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి సమీపంలో అక్కవరం బహిరంగ సభతో పాదయాత్రను ముగించారు. 23 జిల్లాల్లో 86 నియోజకవర్గాల్లో 2,188 కి.మీల దూరం బస్సు యాత్ర సాగింది.యాత్రలో 16 భారీ బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. వివిధ వర్గాల ప్రజలతో ఆరు ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నం తదితర తొమ్మిది ప్రాంతాల్లో భారీ రోడ్ షోలు నిర్వహించారు. బస్సు యాత్ర ప్రారంభమైన ఇడుపులపాయ నుంచి ఈనెల 13న విజయవాడలో జరిగిన రోడ్ షో వరకూ యాత్ర సాగినంత దూరం కెరటాల్లా జనం పోటెత్తారు. విజయవాడలో లక్షలాది మంది ప్రజలు రోడ్ షోలో సీఎం జగన్‌కు నీరాజనం పలుకుతుండడం చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకుని పదునైన రాయితో గురిపెట్టి కొట్టి హత్యాయత్నానికి పాల్పడ్డారు. విజయవాడ నుంచి సునామీలా పోటెత్తిన జనం విజయవాడలో తనపై హత్యాయత్నం జరిగిన తర్వాత.. వైద్యుల సలహా మేరకు ఈనెల 14న విశ్రాంతి తీసుకున్న సీఎం జగన్ ఈ నెల 15 నుంచి యాత్రను కొనసాగించారు. సీఎం జగన్‌పై టీడీపీ నేతలు హత్యాయత్నానికి తెగబడటంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. ఈనెల 15 నుంచి సీఎం జగన్ బస్సు యాత్రకు సునామీలా జనం పోటెత్తి సంఘీభావం తెలిపారు. ఎన్టీఆర్, కృష్ణా, గోదావరి జిల్లాల్లో దారి పొడవునా జనం బారులు తీరి సీఎం జగన్‌కు మద్దతు తెలిపారు.రాజమహేంద్రవరంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది ప్రజలు కదలిరావడం కూటమి వెన్నులో వణుకు పుట్టించింది. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన రోడ్ షోకు లక్షలాది మంది జనం పోటెత్తడంతో కూటమి వణికిపోయింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. ఘోర పరాజయం భయంతో వణికిపోతున్న టీడీపీ సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి(ఉత్తరాంధ్ర), దెందులూరు(ఉత్తర కోస్తా), రాప్తాడు(రాయలసీమ), మేదరమెట్ల(దక్షిణ కోస్తా)లో సీఎం జగన్ నిర్వహించిన సిద్ధం సభలకు లక్షలాది మంది పోటెత్తడంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచిపోయాయి. టీడీపీ–జనసేన జత కలిశాక తాడేపల్లి గూడెంలో నిర్వహించిన జెండా సభ, బీజేపీతో టీడీపీ–జనసేన పొత్తు కుదిరాక చిలకలూరిపేటకు ప్రధానిని రప్పించి నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమి ఆందోళన చెందింది.ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం జగన్ నిర్వహించిన బస్సు యాత్రకు.. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర.. ప్రాంతం ఏదైనా జనం నీరాజనాలు పలికారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 16 సభలకు లక్షలాది మంది ప్రజలు పోటెత్తారు. ఉమ్మడి రాష్ట్ర.. తెలుగు రాష్ట్రాల చరిత్రలో విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్నంలలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోలు అతి పెద్ద మానవ హారంగా నిలిచిపోతాయని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు.ఇదే సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా నిర్వహించిన సభలకు.. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరితో కలిసి వారిద్దరూ నిర్వహించిన సభలకు జనం రాకపోవడంతో ఘోర పరాజయం తప్పదనే నిర్ణయానికి ఆ నేతలు వచ్చేశారు. తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. సీఎం జగన్‌పై దూషణలకు దిగుతూ, వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడాలని ఆ పారీ్టల కార్యకర్తలను రెచ్చగొడుతుండటమే అందుకు తార్కాణం. సీఎం జగన్ బస్సు యాత్ర రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిందని, ఎన్నికల్లో పోటీ ఏకపక్షమేనని.. వైఎస్సార్సీపీ విజయం లాంఛనమేనని తేల్చి రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగడంతో టీడీపీ–జనసేన–బీజేపీ నేతల్లో ప్రకంపనలు రేపుతోంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీల తరఫున పోటీ చేసిన అభ్యర్థులతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు భారీ ఎత్తున వైఎస్సార్సీపీలో చేరడం.. వేలాది మంది క్రియాశీలక కార్యకర్తలు వారి బాటనే అనుసరించడంతో ఆ పార్టీ నేతల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. ఘోర పరాభవం తప్పదనే నిర్ణయానికి వచ్చిన టీడీపీ, జనసేన అధ్యక్షుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్.. తీవ్ర నిరాశ, నిస్పృహలతో సీఎం జగన్‌పై దూషణలకు దిగుతున్నారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
నాడు కాంగ్రెస్ ఖాతాలో 414.. నేడు బీజేపీ అధిగమించేనా?
దేశంలో ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ నేడు సొంతంగా కనీస ఓట్లను కూడా పొందలేని స్థితికి చేరిందనే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 1991 నుంచి పార్టీ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. 1991 తర్వాత 2009 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రమే కాంగ్రెస్ 200 సీట్ల సంఖ్యను తాకగలిగింది. మరి ఈసారి పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాలి. 1951-52లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 364 సీట్లు వచ్చినట్లు ఎన్నికల సంఘం లెక్కలు చెబుతున్నాయి. ఆ పార్టీకి మొత్తం 44.99 శాతం ఓట్లు వచ్చాయి. 1962లో లోక్‌సభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతంతో పాటు సీట్లు కూడా తగ్గాయి. ఓట్లు 44.71 శాతం ఉండగా, సీట్లు 361కి తగ్గాయి. 1967లో పార్టీ ప్రజాదరణ మరింత క్షీణించింది. ఓట్లు 40.78 శాతానికి, సీట్లు 283కి తగ్గాయి. అయితే 1971లో పార్టీకి వైభవం తిరిగివచ్చింది. ఓట్లు 43.68 శాతానికి, సీట్లు 352కి పెరిగాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని 28 సీట్లు, బీహార్‌లో 39 సీట్లు, మహారాష్ట్రలో 42 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లోని 73 సీట్లు వచ్చాయి. 1977లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. లోక్‌సభ పదవీకాలం నవంబర్‌తో ముగియాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఆ ఏడాది ఎన్నికలు ప్రకటించారు. ఎమర్జెన్సీతో ఆగ్రహించిన ప్రజానీకం ఏకమై కాంగ్రెస్‌ను కేవలం 154 సీట్లకు పరిమిత చేశారు. ఓట్ల శాతం కూడా 34 శాతానికి తగ్గింది. మరోవైపు జనతా పార్టీ 295 సీట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే జనతా పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయింది. 1980లో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 42.69 శాతం ఓట్లతో 353 సీట్లు వచ్చాయి. 1984లో కూడా పార్టీ ఈ సంఖ్యను దాటేసింది. నాడు ప్రధాని ఇందిరా గాంధీని ఆమె సొంత సెక్యూరిటీ గార్డులే హత్య చేశారు. దీంతో దేశంలో కాంగ్రెస్‌పై సానుభూతి వెల్లువెత్తింది. 1984 నాటి రికార్డును పార్టీ ఇప్పటి వరకు దాటలేదు. నాడు సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ఓట్లు 48 శాతానికి పెరిగాయి. సీట్లు కూడా రికార్డు స్థాయిలో 414కు పెరిగాయి. గత పదేళ్లలో అటు బీజేపీగానీ, ఇటు కాంగ్రెస్‌గానీ ఈ రికార్డును దాటలేదు. కాగా లోక్‌సభలో మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం. 1984 తర్వాత కాంగ్రెస్‌కు ఒక్కసారి కూడా ఒంటరిగా మెజారిటీ రాలేదని గణాంకాలు చెబుతున్నాయి. 1989లో 39.53 శాతం ఓట్లు, 197 సీట్లు వచ్చాయి. 1991లో పార్టీ 36.40 శాతం ఓట్లు, 244 సీట్లు సాధించగలిగింది. ఆ సమయంలో బీజేపీకి తొలిసారిగా 120 సీట్లు రాగా, 20 శాతానికి పైగా ఓట్లు ఆ పార్టీకి దక్కాయి. 2004 ఎన్నికల వరకు కాంగ్రెస్ పరిస్థితి దిగజారుతూనే వచ్చింది. 1996లో కాంగ్రెస్‌కు 140 సీట్లు, బీజేపీకి 161 సీట్లు వచ్చాయి. 1998లో ఆ పార్టీ 141 సీట్లు గెలుచుకోగా, బీజేపీ 184 సీట్లు గెలుచుకుంది. 1999లో బీజేపీ 182 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు కాంగ్రెస్‌కు 114 సీట్లు దక్కాయి. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. -
గ్రామీణ యువతికి ఆరు నెలల్లో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు
రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంత యువతులు ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో తాము యువకులకు ఏమాత్రం తక్కువకాదని నిరూపిస్తున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలో మూడు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన కల్పన దీనికి ఉదాహరణగా నిలిచారు. రాజస్థాన్‌లోని ఫతేపూర్ షెఖావతి పరిధిలోని రినౌ గ్రామానికి చెందిన కల్పనా బిర్దా ఒక సాధారణ రైతు కుటుంబానికి చెందిన యువతి. ఆమె తొలుత సీహెచ్ఎస్ఎల్లో క్లర్క్ ఉద్యోగం సంపాదించింది. తరువాత ఆడిటర్‌గా ఉద్యోగం దక్కించుకుంది. ఇప్పుడు సీజీఎస్టీలో ఇన్స్పెక్టర్ ఉద్యోగం చేజిక్కించుకుంది. కుటుంబంలోని ముగ్గురు అక్కాచెల్లెళ్లలో కల్పన పెద్దది. బనస్థలి విద్యాపీఠ్‌లో చదువు పూర్తి చేసింది. కాలేజీలో చదువుతున్నప్పుడే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యింది. కల్పన తండ్రి మహిపాల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆమె తల్లి పొలం పనులతో పాటు ఇంటిపనులకు కూడా చేస్తుంది. కల్పన ఇన్స్పెక్టర్గా ఎంపికకావడంతో వారి ఇంటిలో ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. కల్పన మీడియాతో మాట్లాడుతూ తాను పోటీపరీక్షల కోసం తొలుత ఢిల్లీలో కొన్ని రోజులు కోచింగ్ తీసుకున్నానని, ఆ తర్వాత ఇంట్లోనే చదువుకున్నానని తెలిపింది. చదువుతో పాటు ఎప్పటికప్పుడు రివిజన్ కూడా చేసుకునేదానినని, ఈ రివిజన్ కారణంగానే పోటీ పరీక్షల్లో విజయం సాధించగలిగానని తెలిపింది. -
‘టిల్లు స్క్వేర్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తేజస్ మార్క్1ఏ సక్సెస్
సాక్షి బెంగళూరు: అధునిక యుద్ధసామర్థ్యాలను సంతరించుకున్న నూతన తేజస్ మార్క్1ఏ తేలికపాటి యుద్ధవిమానం తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. గురువారం బెంగళూరులోని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) కేంద్రం నుంచి టేకాఫ్ తీసుకుని 18 నిమిషాలపాటు గాల్లో నిర్దేశిత ‘పథం’లో చక్కర్లు కొట్టింది. దీంతో తన లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తిచేసుకుంది. తేజస్ ఎంకే1ఏ సిరీస్‌లో ఎల్ఏ5033 మొట్టమొదటి తేలికపాటి యుద్ధ విమానం. హెచ్‌ఏఎల్‌లోని చీఫ్ టెస్ట్ పైలెట్ గ్రూప్ కెపె్టన్ కెకె వేణుగోపాల్(రిటైర్డ్) ఈ విమానాన్ని నడిపారు. విమాన ప్రయాణం విజయవంతమవడంతో త్వరలోనే ఈ సిరీస్‌తో అధునాతన యుద్ధవిమానాలను తయారుచేసి భారత వాయుసేనకు అప్పగించనున్నారు. ‘‘ అంతర్జాతీయ పరిణామాలు, ఆయుధాల సరఫరా వ్యవస్థపై ఒత్తిడి నెలకొన్న ఈ తరుణంలో వేగంగా అధునాతన డిజైన్‌తో స్వదేశీ 4.5 నూతనతరం యుద్ధవిమానాన్ని తయారుచేయడంలో హెచ్ఏఎల్ సఫలీకృతమైంది. ఈ విజయంలో కీలక భాగస్వాములైన రక్షణ శాఖ, భారత వాయుసేన, రక్షణ పరిశోధనాభివృద్ది సంస్థకు కృతజ్ఞతలు’ అని హెచ్ఏఎల్ చీప్ మేనేజింగ్ డైరెక్టర్ అనంతకృష్ణన్ చెప్పారు. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు, ఆయుధాలు, ఆధునిక ఎల్రక్టానిక్ రాడార్, కమ్యూనికేషన్ సిస్టమ్, స్వీయ రక్షణకు జామర్ పాడ్లను దీనిలో అమర్చారు. 2028 ఫిబ్రవరిలోపు 83 తేజస్ మార్క్1ఏలను తయారుచేసి భారత వాయుసేనకు అందించనుంది. భారత వాయుసేనలో ఇప్పటికే తేజస్ ‘ ఫ్లయింగ్ డ్యాగర్’, ‘ ఫ్లయింగ్ బుల్లెట్’ పేరుతో రెండు బృందాలు ఉన్నాయి. -
2019లో భారీ విజయాన్నందుకున్న ఎంపీలు వీరే!
2024 లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నాహాలు ముమ్మరం చేశాయి. ఎన్నికల సంఘం ఎన్నికల తేదీలను కూడా ప్రకటించింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక ఓట్లతో గెలిచిన టాప్- 5 అభ్యర్థులంతా బీజేపీకి చెందినవారే కావడం విశేషం. వారెవరో ఎక్కడెక్కడి నుంచి పోటీ చేశారో తెలుసుకుందాం. 1. నవ్సారి (గుజరాత్). సీఆర్ పాటిల్ ఈ స్థానం నుండి 2019లో బీజేపీ చెందిన సీఆర్ పాటిల్ 6 లక్షల 89 వేల 668 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌కు చెందిన ధర్మేష్ పటేల్‌పై విజయం సాధించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీ.. సీఆర్‌పాటిల్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టింది. సీఆర్ పాటిల్ గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు. గత మూడు లోక్‌సభ ఎన్నికల్లో ఆయన విజయ పతాకం ఎగరేశారు. 2. కర్నాల్ (హర్యానా)- సంజయ్ భాటియా హర్యానాలోని ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సంజయ్ భాటియా 6 లక్షల 56 వేల 142 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మపై విజయం సాధించారు. సంజయ్ భాటియాకు 70 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. అయితే రాబోయే ఎన్నికల్లో బీజేపీ సంజయ్ భాటియాకు టిక్కెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను అభ్యర్థిగా నిలబెట్టింది. 3. ఫరీదాబాద్ (హర్యానా)- కృష్ణపాల్ గుర్జార్ హర్యానాలోని ఫరీదాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి కృష్ణపాల్ గుర్జార్ కాంగ్రెస్ అభ్యర్థి అవతార్ భదానాపై 6 లక్షల 38 వేల 239 ఓట్లతో విజయం సాధించారు. ఈసారి కూడా బీజేపీ కృష్ణపాల్ గుర్జార్‌ను రంగంలోకి దించింది. 4. భిల్వారా (రాజస్థాన్) - సుభాష్ చంద్ర బీజేపీ అభ్యర్థి సుభాష్ చంద్ర కాంగ్రెస్ అభ్యర్థి రామ్ పాల్ శర్మపై 6 లక్షల 12 వేల ఓట్లతో విజయం సాధించారు. 2024 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి పేరు ఇంకా ఖరారు కాలేదు. ఈ టికెట్ కోసం పలువురు బీజేపీ నేతలు పోటీ పడుతున్నారు. 5. వడోదర (గుజరాత్)- రంజన్‌బెన్ భట్ గుజరాత్‌లోని వడోదర నుంచి బీజేపీ అభ్యర్థి రంజన్‌బెన్ భట్ 5.89 లక్షల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రశాంత్ పటేల్‌పై విజయం సాధించారు. బీజేపీ మరోసారి రంజన్‌బెన్ భట్‌ను రంగంలోకి దించింది. గత రెండు లోభసభ ఎన్నికల్లోనూ ఆయన విజయం దక్కించుకున్నారు. 2014లో ప్రధాని నరేంద్రమోదీ ఇక్కడి నుంచి వైదొలగినప్పటి నుంచి రంజన్‌బెన్ భట్ ఈ స్థానం నుంచి పోటీ చేస్తూ వస్తున్నారు. -
విశ్వక్ సేన్ ‘గామి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'హనుమాన్' మూవీ 50 రోజుల సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నెలకు రూ. 60 లక్షలు సంపాదిస్తున్న ‘పోహె వాలా’
నిజాయతీగా కష్టపడే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరనడానికి ‘పోహెవాలా’ ఫుడ్ స్టార్టప్ వ్యవస్థాపకులు, మహారాష్ట్రకు చెందిన చాహుల్ బల్పాండే, పవన్ వాడిభాస్మే ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచారు. చాహుల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాక, పవన్ ఎంబీఏ డిగ్రీ అందుకున్నాక ఒక కంపెనీలో ఉద్యోగాల్లో చేరారు. సదరు కంపెనీ వారికి సకాలంలో జీతాలు ఇవ్వలేదు. దీంతో ప్రతి నెలా డబ్బుకు ఇబ్బంది ఎదురయ్యేది. దీంతో వారిద్దరూ పగటిపూట అదే ఆఫీసులో పనిచేస్తూ, రాత్రి పూట నాగపూర్‌లో పోహె విక్రయాలు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే వీరు తయారు చేసే పోహెకు ఆహార ప్రియుల నుంచి విశేష ఆదరణ లభించింది. దీంతో వీరిద్దరూ 2018లో తమ ఉద్యోగాలను వదిలేసి, పూర్తిస్థాయిలో పోహె విక్రయాలు ప్రారంభించారు. వీరు తమ బ్రాండ్‌కు ‘పోహె వాలా’ అనే పేరు పెట్టారు. అనంతరం అనేక రకాల పోహెలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేవలం ఆరు సంవత్సరాలలో, వారు దేశంలోని 15 నగరాల్లో తమ అవుట్లెట్లను ప్రారంభించారు. ప్రస్తుతం పవన్, చాహుల్ ప్రతి నెలా రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని సంపాదిస్తున్నారు. చాహుల్, పవన్‌లు ఫుడ్ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పుడు తొలుత రాత్ర వేళ చిన్నగా పోహె విక్రయాలు ప్రారంభించారు. దీంతో ఈ వ్యాపారంలో సాధ్యాసాధ్యాలను తెలుసుకోవడంతో పాటు కస్టమర్లు ఏం కోరుకుంటున్నారనేది గ్రహించారు. 2018 మేలో వీరు నాగ్‌పూర్‌లో తమ పోహె వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదట్లో రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పోహె విక్రయించేవారు. ఇది వారికి మార్కెట్‌పై లోతైన అవగాహన కలిగేందుకు ఉపయోగపడింది. ప్రస్తుతం భారీ స్థాయిలో వ్యాపారం సాగిస్తున్న వీరు మొత్తం 13 రకాల పోహెలను తయారు చేస్తుంటారు. ఆర్గానిక్ పోహె అమ్మకాలు ప్రారంభించినది కూడా వీరే కావడం విశేషం. నేడు పోహెవాలా బ్రాండ్ పనీర్ పోహె, ఇండోరి పోహె, నాగ్‌పూర్ స్పెషల్ తారీ పోహె, చివ్దా పోహె, మిశ్రా పోహె చాలా ప్రసిద్ధి చెందాయి. ఒక ఇంటర్వ్యూలో చాహుల్ బాల్పాండే మాట్లాడుతూ నిజానికి ఏ వ్యాపారానికీ హెచ్చు తగ్గులుండవని, వ్యాపారం విజయవంతం కావడానికి వినూత్న ఫార్ములా, నాణ్యత, మార్కెటింగ్ నైపుణ్యాలు అవసరమని అన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ముందు సరైన వ్యూహాన్ని రూపొందించడం ముఖ్యమన్నారు. వీరు ‘పోహెవాలా’కు సొంత వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించారు. దీని సాయంతో ఆన్‌లైన్‌లోనూ పోహె విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
నేడు మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు?
లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ కాంగ్రెస్‌లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయని సమాచారం. దానికి నేటి నుంచే శ్రీకారం పడేలా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు, ఎంపీ నకుల్‌నాథ్‌తో సహా పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరబోతున్నారనే వార్తలు గుప్పు మంటున్నాయి. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ నష్టం వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, అతని కుమారుడు ఎంపీ నకుల్‌నాథ్ ఆదివారం (ఫిబ్రవరి 18) బీజేపీలో చేరవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు కమల్‌నాథ్, నకుల్‌నాథ్‌లు బీజేపీలో చేరవచ్చనే వార్తలు గుప్పుమంటున్నాయి. కమల్‌నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ బీజేపీలో చేసే కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా హాజరుకానున్నారు. కమల్ నాథ్ తనయుడు నకుల్ నాథ్ తన సోషల్ మీడియా ఖాతా ‘ఎక్స్’ బయో నుండి కాంగ్రెస్ పేరును తొలగించారు. కుమారుడి రాజకీయ భవిష్యత్తుపై కమల్ నాథ్ ఆందోళన చెందుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క సీటును మాత్రమే గెలుచుకోగలిగింది. కమల్‌నాథ్‌కు కంచుకోటగా పేరుగాంచిన చింద్వారాలో ఇది జరిగింది. నకుల్‌నాథ్ గట్టిపోటీ ఎదుర్కొన్నాక విజయం సాధించారు. కమల్‌నాథ్ తొమ్మిది సార్లు ఎంపీగా పని చేశారు. ఆయన కుమారుడు నకుల్ నాథ్ 2019 ఎన్నికల్లో లోక్‌సభ సభ్యునిగా ఎన్నికయ్యారు. -
ISRO: సముద్రంలోకి కార్టోశాట్–2
బెంగళూరు: పాత ఉపగ్రహాలతో ఆయా కక్ష్యల్లో పెరిగిపోతున్న అంతరిక్ష చెత్తను కాస్తయినా తగ్గించే లక్ష్యంతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. దాదాపు 17 సంవత్సరాల క్రితం ప్రయోగించాక చాలా ఏళ్లు దేశానికి సేవలందించిన కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా భూవాతావరణంలోకి తీసుకొచ్చి హిందూ మహాసముద్రంలో పడేలా చేసింది. ఫిబ్రవరి 14వ తేదీ మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని ఇస్రో శుక్రవారం ప్రకటించింది. పట్టణ ప్రణాళికలకు సాయపడేలా అత్యంత స్పష్టమైన హై రెజల్యూషన్ ఇమేజీలు తీసేందుకు 2007 జనవరి పదో తేదీన 680 కేజీల ఇస్రో కార్టోశాట్–2 ఉపగ్రహాన్ని 635 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో విజయవంతంగా పంపింది. ఇది 2019 ఏడాదిదాకా పనిచేసింది. తర్వాత కక్ష్య తగ్గించుకుంటూ క్రమంగా భూవాతావరణంలోకి ప్రవేశించి అత్యంత వేగంగా తిరుగుతూ మండి, ధ్వంసమై అతి చిన్న ముక్కలుగా మారిపోనుంది. అలా కావడానికి సాధారణంగా 30 సంవత్సరాల సమయం పడుతుంది. ఈలోపు ఉపగ్రహాలుండే కక్ష్యల్లో అంతరిక్ష చెత్తను తగ్గించేందుకు ముందుగానే దీనిని భూవాతావరణంలోకి రప్పించారు. -
Australia : యాత్ర 2 కార్ ర్యాలీ.. YSRCP సిద్ధం
‘‘యాత్ర 2” సినిమా విజయవంతమైన సందర్భంగా వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా కన్వీనర్ సూర్యనారాయణ రెడ్డి నేతృత్వంలో “టీమ్ మెల్బోర్న్ - వైఎస్సార్సీపీ ఆస్ట్రేలియా’’ ఆధ్వర్యంలో కార్ ర్యాలీ నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జీవితంలోని కీలక ఘటనలను, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి, YSRCP అధ్యక్షడు వైఎస్ జగన్ రాజకీయ ప్రారంభ దశలోని ముఖ్యమైన అంశాలను ఆధారంగా సినిమాని తెరకెక్కించడంలో దర్శకుడు మహి రాఘవ సక్సెస్ అయ్యాడని ప్రశంసించారు. ప్రజల మనసులను గెలిచిన మారాజు డా.వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి జీవన వృత్తాంతాన్ని చక్కగా సినిమాగా రూపొందించారని ప్రశంసించారు. ఈ ర్యాలీని మెల్బోర్న్ టీమ్ సభ్యులు కృష్ణారెడ్డి, భరత్, రామాంజి, నాగార్జున, మణిదీప్, సతీష్‌లు చక్కగా సమన్వయం చేశారు. సిద్ధం పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు, వైఎస్సార్సీపీ పోరాటానికి తిరుగులేని మద్దతునిస్తూ “జై జగన్”, “జోహార్ వైఎస్ఆర్”, “ఎన్నికల సమరానికి మేము సిద్ధం” నినాదాలతో.. వేదిక వద్ద వాతావరణం మారుమోగింది. ఉత్సాహభరితమైన ర్యాలీ తరువాత, వైఎస్సార్సీపీ మద్దతుదారులు "యాత్ర 2" చిత్రం ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసారు. 2024లో జరగబోయే ఏపీ 175 అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే లోక్‌సభ 25 స్థానాల ఎన్నికలకు YSRCP సిద్ధంగా ఉందని, సీఎం జగన్ నినాదం వైనాట్ 175ని నిజం చేసేందుకు ప్రతీ ఒక్క ప్రవాసాంధ్రుడు కృషి చేస్తారని తెలిపారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన ప్రయోజనలు, విద్యా, వైద్య, పారిశ్రామిక, మౌలిక సదుపాయాల్లో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రతీ ఒక్క ఎన్నారై స్టార్ క్యాంపెయినర్‌గా మారి ప్రచారం చేస్తారని తెలిపారు. -
వైఎస్సార్సీపీకి మద్దతుగా మెల్బోర్న్లో భారీ కార్ ర్యాలీ
-
Parliament Budget Session 2024: ‘ఇది కర్తవ్య కాలం’
న్యూఢిల్లీ: ‘‘కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వదిలిపెట్టిన సవాళ్లను ఎన్డీయే ప్రభుత్వం గత పదేళ్లలో విజయవంతంగా అధిగమించింది. దేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి కఠిన నిర్ణయాలు తీసుకుంది’’ అని కేంద్ర ప్రభుత్వం తమ శ్వేతపత్రం(వైట్ పేపర్)లో వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థపై రూపొందించిన 59 పేజీల ఈ శ్వేతపత్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. యూపీఏ సర్కారు హయాంలో దేశ ఆర్థిక పరిస్థితి, మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన ఆర్థిక ప్రగతిని వైట్ పేపర్లో ప్రస్తావించారు. దీనిపై శుక్రవారం లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. చర్చ అనంతరం మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తారు. ‘‘2014లో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ అత్యంత బలహీనంగా ఉంది. ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఆర్థిక క్రమశిక్షణ మచ్చుకైనా లేదు. అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. నిజంగా అదొక సంక్షోభ పరిస్థితి. యూపీఏ ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఆర్థిక వ్యవస్థ వెనక్కిపోయింది. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో అప్పటి ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. యూపీఏ పాలనలో భారత్ ప్రపంచంలో అత్యంత బలహీన ఐదు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉండేది. యూపీఏ హయాంలో లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అప్పటి అవినీతి వ్యవహారాలు దేశ ప్రజల విశ్వాసాన్ని బలహీనపర్చాయి. 2013లో విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. దానివల్ల మనం పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. అప్పటి బలహీన నాయకత్వం వల్ల రక్షణ రంగం సైతం సన్నద్ధత కోల్పోయింది. 2014లో దారుణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థ యూపీఏ నుంచి ఎన్డీయే ప్రభుత్వానికి వారసత్వంగా వచ్చింది. ఆర్థిక వ్యవస్థను, పరిపాలనా వ్యవస్థను గాడిలో పెట్టే పనికి ఎన్డీయే ప్రభుత్వం పూనుకుంది. ఒక క్రమపద్ధతిలోకి తీసుకొచ్చింది. ఆర్థికంగా దేశానికి మంచి జరగాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను మోదీ ప్రభుత్వం గుర్తించింది. దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులను పటిష్టంగా మార్చింది. ఇప్పుడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. ప్రపంచంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత్ అవతరించింది. మోదీ నాయకత్వంలో మన దేశం ప్రస్తుతం ప్రపంచంలో మొదటి ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా మారింది. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల వల్ల కేవలం పదేళ్లలోనే ఈ ఘనత సాధ్యమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల పరిణామాలు, సవాళ్లు ఉన్నప్పటికీ మన ఆర్థిక వ్యవస్థ పురోగమనంలో కొనసాగుతోంది. చేయాల్సింది ఇంకా మిగిలే ఉంది. నిద్రించేలోగా చేరాల్సిన మైళ్లు, ఎక్కాల్సిన పర్వతాలు ఎన్నో ఉన్నాయి. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుకోవాలి. అదే మన గమ్యం. ఇది మనందరి కర్తవ్య కాలం’’ అని శ్వేతపత్రంలో ఎన్డీయే ప్రభుత్వం పిలుపునిచ్చింది. -
చిలకలూరిపేటలో సామాజిక సాధికార బస్సు యాత్ర సక్సెస్
-
మూడు ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్
జెరూసలేం: గాజాలో హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకరపోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపినట్లు ఇరాన్ ప్రకటించింది. సిమోర్ఘ్ రాకెట్‌తో వాటిని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్లు తెలిపింది. సెమ్నాన్ ప్రావిన్స్‌లోని ఇమామ్ ఖొమైనీ అంతరిక్ష కేంద్రంలో రాత్రివేళ ఈ ప్రయోగం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో మహ్దా అనేది పరిశోధక ఉపగ్రహం కాగా, కేహాన్–2, హతెఫ్–1 అనేవి జీపీఎస్, కమ్యూనికేషన్‌కు సంబంధించిన నానో శాటిలైట్లని ప్రభుత్వ టీవీ తెలిపింది. గాజాపై యుద్ధంలో సైనికపరంగా జోక్యం చేసుకోనప్పటికీ, ఇటీవల జరిగిన ఇస్లామిక్ స్టేట్ భారీ ఆత్మాహుతి దాడి, ఇరాన్ అండదండలున్న హౌతీ తిరుగుబాటుదారులు విదేశీ నౌకలపై దాడులు చేయడం వంటివి ఇరాన్ మతపెద్దలపై ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలోనే ఉపగ్రహ ప్రయోగాలు చేపట్టినట్లుగా భావిస్తున్నారు. -
HANUMAN Blockbuster Success Meet: 'హనుమాన్' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్‌ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
ఫ్యూయల్ సెల్ పరీక్ష సక్సెస్: ఇస్రో
బెంగళూరు/హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్షంలో ఉపగ్రహాలు తదితరాలకు నిరంతర ఇంధన సరఫరాలో కీలకం కాగల ప్యూయల్ సెల్ పనితీరును విజయవంతంగా పరీక్షించినట్టు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో పేర్కొంది. ‘‘జనవరి 1న పీఎస్ఎల్వీ–సి58 ద్వారా భూ దిగవ కక్ష్యలోకి చేర్చిన ఫ్యూయల్ సెల్ ఆధారిత ఇంధన వ్యవస్థ (ఎఫ్‌సీపీఎస్)లోని పాలీమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రేన్ పరీక్ష విజయవంతమైంది. దీనిద్వారా కొద్ది సమయం పాటు 180 వాట్ల విద్యుదుత్పత్తి జరిగింది’’ అని శుక్రవారం తెలిపింది. సంప్రదాయ బ్యాటరీ సెల్స్‌తో పోలిస్తే ఈ ఫ్యూయల్ సెల్స్‌కు చాలా తక్కువ ఖర్చవుతుంది. పైగా ఇవి అధిక సామర్థ్యంతో పని చేస్తాయి. పూర్తిగా పర్యావరణహితం కూడా. వీటిని అంతరిక్షంతో పాటు భూమిపై కూడా పలురకాలుగా వాడుకోవచ్చు’’అని వివరించింది. భావి అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన డిజైన్లపై అవగాహనకు వచ్చేందుకు తాజా పరీక్ష దోహదపడుతుందని చెప్పింది. కృష్ణబిలాలపై పరిశోధనల నిమిత్తం జనవరి 1న ప్రయోగించిన ఎక్స్‌పోశాట్ బాగా పని చేస్తోందని ఇస్రోర చైర్మన్ ఎస్.సోమనాథ్ ప్రకటించారు. -
Devil Success Celebrations: కల్యాణ్ రామ్ ‘డెవిల్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
టాటా రాకతో ఆ కంపెనీ దశ తిరిగింది!
కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ యాజమాన్యంలో నష్టాలబాటలో పయనించిన 'నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్' (NINL), టాటాల చేతికి చిక్కడంతో అభివృద్ధి బాటలో పరుగులు తీస్తూ.. నేడు వేలకోట్లు ఆర్జిస్తూ ముందుకు సాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు 2500 ఎకరాల ప్రాంగణంలో విస్తరించిన కంపెనీ ఒకప్పుడు పాములు, తేళ్లకు నిలయంగా మారి యంత్రాలన్నీ తుప్పు పట్టిన దశలో ఉన్న కంపెనీని.. రూ.12100 కోట్ల చెల్లింపుతో 2022 జులై 04న టాటా స్టీల్ ఒడిశాకు చెందిన నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (NINL) కొనుగోలు చేసింది. 'ఎన్ఐఎన్ఎల్' టాటా చేతిలో పడ్డ కేవలం 90 రోజుల్లోనే తిరిగి ప్రారంభమైందని.. కంపెనీ ఎండీ అండ్ సీఈఓ 'సుధీర్ కుమార్ మెహతా' వెల్లడించారు. అంతే కాకుండా.. అప్పులతో సతమవుతున్న కంపెనీ లాభాల బాట పట్టి ఇప్పుడు ఆర్థికంగా మంచి పనితీరు కనబరుస్తోందని తెలిపారు. అప్పులతో కొట్టుమిట్టాడుతున్న కంపెనీ గత ఏడాది నుంచి ఇప్పటికే రూ.4600 కోట్ల ఆదాయాన్ని ఆర్జించినట్లు సమాచారం. ఆగస్ట్‌లో టేక్ ఓవర్ అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులందరికీ మొత్తం జీతం చెల్లించినట్లు కూడా అధికారులు స్పష్టం చేశారు. ఇదీ చదవండి: స్టార్టప్‌లూ వదిలిపెట్టలేదు! ఈ ఏడాది ఎంతమందిని తొలగించాయంటే.. ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌కు 120 కి.మీ దూరంలో ఉన్న కళింగనగర్లోని NINL సంవత్సరానికి 1 మిలియన్ టన్నుల ఉక్కు తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉన్న పెద్ద కంపెనీ. నిధుల కొరతతో సహా వివిధ కారణాలతో ఈ ప్లాంట్ సుమారు మూడేళ్లపాటు మూతపడింది. ఆ తరువాత టాటా గ్రూపు చేజిక్కించుకుని 2024 అక్టోబర్ 24న మొదటి బిల్లెట్ను విడుదల చేసింది. ప్రస్తుతం కంపెనీ ఆశించిన స్థాయికంటే కూడా బాగా లాభాలను ఆర్జిస్తోందని తెలుస్తోంది. -
‘ధమాకా’ 1 ఇయర్ మరియు ‘ఈగిల్’ ట్రైలర్ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
2023.. భారతీయ రైల్వేలో అద్భుతాలివే..
2023 సంవత్సరం ముగియబోతోంది. కొద్ది రోజుల్లో కొత్త సంవత్సరం మనందరి జీవితాల్లో ప్రవేశించనుంది. 2023లో భారతీయ రైల్వే అనేక విజయాలను నమోదు చేసుకుంది. ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేసే భారతీయ రైల్వే 2023లో ఏమి సాధించిందో ఇప్పుడు చూద్దాం. అత్యంత పొడవైన రైల్వే స్టేషన్.. ప్రపంచంలో భారీ నెట్వర్క్ కలిగిన రవాణా సాధనాలలో భారతీయ రైల్వే ఒకటి. ఈ ఏడాది ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా భారత్‌లోని ఒక రైల్వే స్టేషన్ రికార్డు సృష్టించింది. గతంలో యూపీలోని గోరఖ్‌పూర్ స్టేషన్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే స్టేషన్‌గా రికార్డు సృష్టించింది. దీని పొడవు 1,366.4 మీటర్లు. అయితే ఈ సంవత్సరం మార్చి లో హుబ్లీ రైల్వే స్టేషన్ అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫారం కలిగిన స్టేషన్‌గా కొత్త రికార్డు సృష్టించింది. ఈ ప్లాట్‌ఫారమ్ పొడవు 1,507 మీటర్లు. ఈ ప్లాట్ఫారం ఘనత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది. అమృత్ భారత్ స్టేషన్ అమృత్ భారత్ స్టేషన్ల ద్వారా భారతీయ రైల్వే రూపురేఖలు మారనున్నాయి. దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి ఆగస్టు 6న ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ స్టేషన్లు 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఉన్నాయి. వీటి అభివృద్ధికి రూ.24,470 కోట్లు ఖర్చుకానుంది. ఈ పథకం ద్వారా దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లు మరింత అభివృద్ధి చెందనున్నాయి. మూడువేల కొత్త రైళ్లు.. పెరుగుతున్న ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా భారతీయ రైల్వే రాబోయే నాలుగైదు సంవత్సరాలలో మూడువేల అదనపు కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఇటీవల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ ప్రస్తుతం రైల్వే ఏటా ఎనిమిది వందల కోట్ల మంది ప్రయాణికులను వారి గమ్య స్థానాలకు చేరవేస్తున్నదని అన్నారు. ప్రయాణికుల పెరుగుదల దృష్ట్యా మరో మూడువేల రైళ్లు అవసరమని అన్నారు. ప్రతి సంవత్సరం 200 నుండి 250 కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని అన్నారు. 400 నుండి 450 వందే భారత్ రైళ్లకు ఇవి అదనం అని పేర్కొన్నారు. లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు సుగమ్య భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రైల్వేలు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లలో వికలాంగులు, వృద్ధులు, పిల్లలకు ఉపయోగపడేలా లిఫ్టులు, ఎస్కలేటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. 2021-22లో 208 లిఫ్టులు, 182 ఎస్కలేటర్లు ఏర్పాటు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 215 లిఫ్టులు, 184 ఎస్కలేటర్లను రైల్వేశాఖ ఏర్పాటు చేసింది. 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు భారతీయ రైల్వేల ద్వారా ప్రతిరోజూ దాదాపు మూడు కోట్ల మంది ప్రయాణిస్తున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ రైల్వేలు 68 వేల కిలోమీటర్ల పొడవైన రైల్వే నెట్‌వర్క్‌ను కలిగివుంది. ఉపాధి కల్పన విషయంలో భారతీయ రైల్వే చాలా దేశాల కంటే ముందుంది. భారతీయ రైల్వేలో 13 లక్షల మందికి పైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇది కూడా చదవండి: సీతారాముల స్వస్థలాలు ‘అమృత్ భారత్’తో అనుసంధానం! -
అంతకుమించిన స్థాయి లేదు
‘‘చిత్ర పరిశ్రమలో బాక్సాఫీసు లెక్కలు, స్థానాలు, స్థాయి అని మాట్లడుతుంటారు. నాకు సంబంధించి శుక్రవారం నా సినిమా విడుదలైతే.. ‘నాని సినిమాకి వెళ్దాం రా’ అని ప్రేక్షకులు అన్నారంటే అదే గొప్ప స్థాయి.. దానికి మించిన స్థాయి ప్రపంచంలో మరొకటి లేదని నమ్ముతాను. ఆ స్థాయి, స్థానాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అని హీరో నాని అన్నారు. శౌర్యువ్ దర్శకత్వంలో నాని, మృణాల్ ఠాకూర్ జంటగా, బేబీ కియారా ఖన్నా కీలకపాత్రలో నటించిన చిత్రం ‘హాయ్ నాన్న’. మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న రిలీజైంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాని మాట్లాడుతూ–‘‘మా సినిమాపై ప్రేక్షకులు ఎన్నో ప్రశంశలు కురిపిస్తున్నారు. నేను నమ్మంది నిజమైనందుకు ఆనందంగా ఉంది. ‘హాయ్ నాన్న’ కి ఇంత పెద్ద విజయం అందించిన తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఇలాంటి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటాను’’ అన్నారు. ‘‘నానిగారు ‘హాయ్ నాన్న’ కథని నా కోసం, తెలుగు సినిమా కోసం ఎంపిక చేసుకున్నారని భావిస్తున్నాను’’ అన్నారు శౌర్యువ్. ‘‘హాయ్ నాన్న’ చరిత్రలో నిలిచిపోయే చిత్రం’’ అన్నారు డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల. కెమెరామేన్ షాను మాట్లాడారు. -
అనుకున్నది సాధించడమంటే ఇదే.. వీడియో వైరల్
దేశీయ పారిశ్రామిక దిగ్గజం, మహీంద్రా అండ్ మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన చాలా విషయాలను షేర్ చేస్తూ ఉంటాడు. ఇందులో భాగంగానే తాజాగా తన ట్విటర్ ఖాతా ద్వారా మండే మోటివేషన్ పేరుతో ఒక వీడియో పోస్ట్ చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక చిన్న ఫాంటా బాటిల్ కనిపిస్తుంది. దాని చుట్టూ చేరిన రెండు తేనెటీగలు ఎంతో చాకచక్యంగా బాటిల్ మూతను తీసేయడం చూడవచ్చు. ఆ బాటిల్ మూట కొంచెం వదులుగా ఉండటంతో అవి రెండు చెరోవైపు తిప్పుతూ మూతను తీసేయం గమ్మత్తుగా అనిపిస్తుంది. చూడటానికి ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ వీడియోను ఆనంద్ మహీంద్రా తన అథికారిక ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. టీమ్ వరకు అసాధ్యాలను సుసాధ్యం చేస్తుంది, సక్సెస్ ఎప్పుడూ వ్యక్తిగత విజయంగా ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించారు. ఇదీ చదవండి: ఒక్కప్లాన్‌తో 14 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు.. జియో టీవీ బంపర్ ఆఫర్ ప్రస్తుతం ఈ వీడియో సోషల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వేలమంది వీక్షించిన ఈ వీడియోకి.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే తేనెటీగలను చూసి కూడా నేర్చుకోవాల్సింది చాలానే ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. These winged insects , Honey Bees, are not commonly known to have the faculties & skills for this task. Teamwork makes the impossible possible. Success doesn’t always have to be an individual achievement. #MondayMotivation pic.twitter.com/KV8EIEUFMm — anand mahindra (@anandmahindra) December 18, 2023 -
‘హాయ్ నాన్న’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
రెండు వారాల గ్యాప్‌లో రెండు హిట్లు
‘‘నేను మాటలు అందించిన ‘కోట బొమ్మాళి’ (నవంబర్ 24), ‘హాయ్ నాన్న’ (డిసెంబరు 7) చిత్రాలు రెండు వారాల గ్యాప్‌లో విడుదలై సక్సెస్ అవడం సంతోషంగా ఉంది. ‘కోట బొమ్మాళి’ ΄పోలిటికల్ థ్రిల్లర్. ‘హాయ్ నాన్న’ ఎమోషన్స్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్. రెండు విభిన్నమైన కథలకు మాటలు అందించిన నాకు మంచి పేరొచ్చింది. నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాసు, డైరెక్టర్ సుకుమార్గార్లు ప్రత్యేకంగా అభినందించడం మరచిపోలేను’’ అన్నారు. మాటల రచయిత నాగేంద్ర కాశీ. ఇంకా తన కెరీర్ గురించి నాగేంద్ర మాట్లాడుతూ– ‘‘నాది కోనసీమ జిల్లా అమలాపురం. నాన్న నాగేశ్వరరావు, అమ్మ సత్యవతి. రచన, సాహిత్యంపై ఇష్టంతో ఇంటర్ చదివే రోజుల నుంచే కథలు రాయడం మొదలుపెట్టాను. నేను రాసిన కథలతో ‘నల్ల వంతెన’ అనే తొలి పుస్తకం పబ్లిష్ చేశాను. దీనికి నాలుగు అవార్డులు వచ్చాయి. తొలిసారి ‘పలాస 1978’ సినిమాకి కో రైటర్‌గా పని చేశా. ఆ తర్వాత ‘తోలు బొమ్మలాట’ మూవీకి రచనా సహకారం చేశాను. ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమాకి కథ ఇచ్చాను. నా ‘నల్ల వంతెన’లో ఓ కథ నచ్చడంతో నాకు ‘సుకుమార్ రైటింగ్స్‌లో’ చాన్స్ ఇచ్చారు డైరెక్టర్ సుకుమార్‌గారు. ‘విరూపాక్ష’కి రైటింగ్ విభాగంలో చేశా. ఆ తర్వాత రామ్‌చరణ్– బుచ్చిబాబుగార్ల మూవీకి బుచ్చిబాబుగారితో కలిసి మాటలు రాస్తున్నాను. ‘పుష్ప 2’ సినిమాకి రచయితల విభాగంలో చేస్తున్నాను. అలాగే రష్మిక నటిస్తున్న ‘రెయిన్బో’కి మాటలు అందిస్తున్నాను. సుకుమార్‌గారి వద్ద పని చేసే చాన్స్ రావడం నా లక్. భవిష్యత్తులో డైరెక్టర్ కావాలని ఉంది. ఐదు కథలు సిద్ధం చేసుకున్నాను’’ అన్నారు. -
పాడ్‌కాస్ట్‌కు మరింతగా పెరుగుతున్న ఆదరణ!
వీడియోలను విరివిగా చూడటం అనేది కోవిడ్ కాలం తర్వాత వేగంగా పెరిగింది. ఇంట్లోనే ఉండాల్సిన నాటి సమయంలో వినోదం కోసం వీడియోలను చూస్తూ టైమ్‌పాస్ చేశారు. వీడియోలపై ప్రేక్షకులకు పెరుగుతున్న క్రేజ్‌ను గమనించిన బడా టెలివిజన్ నెట్‌వర్క్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లోకి ప్రవేశించాయి. ఇప్పుడు ఓటీటీలకు ప్రత్యామ్నాయంగా పాడ్కాస్ట్ల ట్రెండ్ మరింతగా పెరుగుతోంది. పాడ్‌కాస్ట్..అంటే మోడ్రన్ రేడియో.. విద్య, వినోదం, వార్తలు, మత ప్రసంగాలు, నవలలు, మతపరమైన పుస్తకాలు, సాహిత్యం... ఇలా సమస్తం ఇప్పుడు ఆడియో రూపంలో మనకు అందుబాటులోకి వస్తున్నాయి. యువత, ఉద్యోగులు, మహిళలు, విద్యార్థులలో పాడ్కాస్ట్పై విపరీతమైన క్రేజ్ పెరుగుతోంది. భారీ కోచింగ్ సెంటర్లు, పాఠశాలలు, కళాశాలలు చదువును ఎలా సులభతరం చేయాలనే దానిపై దృష్టి సారిస్తున్నాయి. కోవిడ్ కాలంలో ఆన్లైన్ తరగతులు విరివిగా నిర్వహించేవారు. అయితే ఇప్పుడు పెద్దపెద్ద విద్యా కేంద్రాలు సిలబస్‌ను ఆడియో రూపంలో మార్చడానికి, విద్యార్థులకు సరళమైన భాషలో పాఠాలను బోధించేందుకు కృషి చేస్తున్నాయి. ఆడియో బుక్కు సంబంధించిన మెటీరియల్‌ను వివిధ సబ్జెక్టుల నిపుణులు సరళమైన భాషలో సిద్ధం చేస్తున్నారు. వాటిని నిపుణుల సహకారంతో ఆడియో బుక్‌గా మార్చి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు. మొబైల్లోని విద్యాసంబంధిత పాడ్‌కాస్ట్‌ను ఆన్ చేసి, చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని విద్యార్థులు సులభంగా వాటిని వినవచ్చు. అర్థం కాని సందర్భంలో మరోమారు వినేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది. వినోదం కోసం ఇప్పుడు స్టోరీ పాడ్‌కాస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా వివిధ రకాల కథలను వినేందుకు అవకాశం ఏర్పడుతోంది. క్రైమ్, హర్రర్, కామెడీ ఇలా విభిన్న తరహాలలోని కథలు మనం వినవచ్చు. సెలబ్రిటీ వాయిస్‌లలో రికార్డ్ చేసిన పాడ్‌కాస్ట్‌లు, ఆడియో పుస్తకాలు ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. వాటికి విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రేరణాత్మక ప్రసంగాలు మొదలుకొని మతపరమైన ప్రసంగాల వరకు సమస్తం పాడ్‌కాస్ట్ రూపంలో మన ముందుకు వచ్చాయి. వివిధ పాడ్‌కాస్ట్ యాప్‌లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. పలువురు మోటివేషనల్ స్పీకర్లు తమ పాడ్‌కాస్ట్‌లను విడుదల చేస్తున్నారు. ప్రపంచం, దేశం, రాష్ట్రం, స్థానిక వార్తలను అందించే పలు పాడ్‌కాస్ట్‌లు ఆదరణ పొందుతున్నాయి. న్యూస్ యాప్‌లలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి వేళల్లో ప్రత్యేక పాడ్‌కాస్ట్ బులెటిన్లను చాలామంది క్రమం తప్పక వింటున్నారు. ఇప్పుడు పాడ్‌కాస్ట్‌లలో షేర్ ట్రేడింగ్ మొదలుకొని ఉద్యోగంలో విజయం వరకు అనేక రకాల సమాచారం విశేష ఆదరణ పొందుతోంది. ఇది కూడా చదవండి: ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే.. -
బీజేపీ విజయానికి.. కాంగ్రెస్ ఓటమికి.. ఐదు కారణాలివే!
రాజస్థాన్ ఎన్నికల ఫలితాల్లో ఏడు డివిజన్లలో భిన్నమైన తీరుతెన్నులు కనిపించాయి. జైపూర్ డివిజన్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. డివిజన్లోని 50 స్థానాలకు గాను గతసారి బీజేపీ 10 స్థానాల్లో విజయం సాధించగా, ఈసారి 26 స్థానాల్లో విజయం సాధించి కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టివేసింది. ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ విజయానికి కారణాలేమిటి? కాంగ్రెస్ ఓటమికి కారణాలేమిటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రాజకీయ నిపుణులు దీనిపై విశ్లేషణ అందించారు. బీజేపీ విజయానికి ఐదు కారణాలు పార్టీలో ఐక్యత నెలకొంది. నేతలంతా అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా చూసుకున్నారు. ప్రధాని మోదీ పాలనే అజెండాగా రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీకి దిగడం లాభదాయకంగా మారింది. టికెట్ల కేటాయింపులో రాష్ట్రానికి చెందిన నేతలందరి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం ప్రయోజనకరంగా మారింది. ఎన్నికల ప్రచారంలో జాతీయ నేతలతో పాటు రాష్ట్ర నేతలు కూడా అన్ని ప్రాంతాలలో పర్యటించారు. ‘సనాతనం’ అంశంతో ఓట్లర్లను ఆకర్షించేందుకు బీజేపీ చేసిన ప్రయత్నం కలిసివచ్చింది. కాంగ్రెస్ ఓటమికి ఐదు కారణాలు రాష్ట్రంలోని సీనియర్ నేతల మధ్య తలెత్తిన వర్గపోరు కారణంగా కార్యకర్తల ఐక్యతలో చీలిక ఏర్పడింది. టిక్కెట్ల కేటాయింపులో సీనియర్ నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో ప్రత్యక్షంగా నష్టపోయారనే వాదన వినిపిస్తోంది. బ్యాడ్ ఇమేజ్ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులకు కూడా టిక్కెట్లు కేటాయించారు. పార్టీ నేతలు మితిమీరిన ప్రకటనలు చేయడంతో ప్రజలు వాటిని నమ్మలేదు. రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు పెరగడం కాంగ్రెస్ పాలనపై ప్రతికూల ప్రభావం చూపింది. ఇది కూడా చదవండి: రాజస్థాన్‌కు యూపీ సీఎం.. కారణమిదే! -
ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యే.. ఇప్పుడు ఊహించని ఫలితం!
ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈసారి 90 స్థానాలకు గాను 54 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. కాంగ్రెస్ 35 సీట్లకే పరిమితమయ్యింది. ఐదు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఛత్తీస్‌గఢ్ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సాజా స్థానం నుంచి ఏడు సార్లు కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఎమ్మెల్యేగా ఎన్నికైన మంత్రి రవీంద్ర చౌబేపై బీజేపీ అభ్యర్థి ఈశ్వర్ సాహు విజయం సాధించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతర జిల్లా సాజా అసెంబ్లీ ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన హింసాత్మక ఘటనలో ఈశ్వర్ సాహు కుమారుడు మృతి చెందాడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈశ్వర్ సాహుకు బీజేపీ టికెట్ ఇచ్చింది. వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబేని కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దింపింది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈశ్వర్ సాహు తొలిసారి ఎన్నికల బరిలో నిలిచారు. తన కుమారుడి మృతితో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.10 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఈశ్వర్ సాహు ఆ సాయం తీసుకోలేదు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు భువనేశ్వర్ సాహును బీరాన్‌పూర్, బెమెతారాలో జిహాదీల వర్గం హత్య చేసింది. బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదు. ఈ నేపధ్యంలో అతని తండ్రి ఈశ్వర్ సాహుకు ‘సాజా’ స్థానం నుండి పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్ ఇచ్చింది. ఇది కూడా చదవండి: పొత్తు లేకనే కాంగ్రెస్ చిత్తు?.. ఇండియా అలయన్స్ నేతలు ఏమంటున్నారు? -
17 రాష్ట్రాల్లో కాషాయ దళం.. దూసుకుపోతున్న మోదీ మ్యాజిక్!
దేశంలో జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో బీజేపీ విజయభేరీ మోగించింది. మధ్యప్రదేశ్‌లోని 230 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 164 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో రాజస్థాన్ తన చరిత్రను పునరావృతం చేసి, అధికారాన్ని మార్చుకుంది. ఇక్కడ బీజేపీ 115 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లో కూడా బీజేపీ స్పష్టమైన మెజారిటీ అంటే 90 సీట్లలో 54 గెలుచుకుంది. ఈ మూడు రాష్ట్రాలు లోక్‌సభ ఎన్నికలకు కీలకమైనవి. ఎందుకంటే ఈ రాష్ట్రాల్లో 65 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2024 ఎన్నికలకు ఈ రాష్ట్రాలు చాలా కీలకమైనవి. ఈ మూడు రాష్ట్రాల్లో విజయం సాధించాక 17 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీటిలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉండగా కొన్నింటిలో మిత్రపక్షాలతో కలిసి అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాం, గోవా రాష్ట్రాల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రభుత్వం ఉంది. కాగా మహారాష్ట్ర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, మేఘాలయ, పుదుచ్చేరిలలో మిత్రపక్షాలతో చేయికలిపింది. దేశ రాజకీయ మ్యాప్‌ను పరిశీలిస్తే ప్రస్తుతం దేశంలోని 57 శాతానికి పైగా ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2017 సంవత్సరంలో దేశంలోని 78 శాతం ప్రాంతంలో బీజేపీ అధికారంలో ఉంది. 2018లో బీజేపీ పలు ఓటములను ఎదుర్కొంది. మొదట కర్ణాటకలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది. 2019 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో తన సత్తాను చాటుకుంది. అయితే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాల పరంపర కొనసాగింది. 2019 నాటికి బీజేపీ 34శాతం రాజకీయ విస్తీర్ణానికి తగ్గింది. బీజేపీ పాలన కేవలం 44 శాతం జనాభాపై మాత్రమే ఉంది. అయితే ఈ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించడంతో పార్టీ గ్రాఫ్ మరింతగా పెరిగింది. ఈ విజయాలను మోదీ మ్యాజిక్ అని రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఇది కూడా చదవండి: తగ్గిన మహిళా ఎమ్మెల్యేల సంఖ్య..20కే పరిమితం! -
ప్రయోగాలు చేసే సమయం ఇది!
‘‘నా కెరీర్లో ఎప్పుడూ విభిన్నమైన సినిమాలు, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనుకుంటాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేశ్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు.. ‘దసరా’, ‘మామన్నన్ ’ సినిమాల విజయాల తర్వాత కథ ఎంపికలో మీ ఆలోచనలు ఏవైనా మారాయా? అనే ప్రశ్న ఎదురైంది. ఇందుకు కీర్తీ సురేశ్ బదులిస్తూ.. ‘‘నేను నటించిన సినిమా హిట్టు అయిందనో, ఫ్లాప్ అయిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. అయితే నేనెప్పుడూ భిన్నంగా చిత్రాలు చేయాలనుకుంటా. ఎందుకంటే నాకిది ప్రయోగాలు చేసే సమయం. అందుకు తగ్గట్టే కథలను ఎంపిక చేసుకుంటున్నా. నా వద్దకు వస్తున్న కథలు, పాత్రలు నా ఊహలకు, కలలకు మించిన విధంగా ఉంటున్నాయి. అలాంటప్పుడు మళ్లీ కథల గురించి ఆలోచించుకోవాల్సిన అవసరం ఏముంటుంది? ఆ ప్రయాణాన్ని బాగా ఆస్వాదించాలనే దానిపైనే దృష్టిపెడితే సరిపోతుంది’’ అన్నారు. కాగా కీర్తీ సురేశ్ ప్రస్తుతం ‘సైరెన్ , రఘు తాత, రివాల్వర్ రీటా’ చిత్రాలు, ‘అక్క’ అనే వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నారు. -
‘జై శ్రీరాం’ నినాదాలతో కాంగ్రెస్ సంబరాలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యప్రదేశ్‌లో 230 సీట్లు, రాజస్థాన్‌లో 199 సీట్లు, ఛత్తీస్‌గఢ్‌లో 90 సీట్లు, తెలంగాణలో 119 సీట్లలో ఎవరు విజయం సాధించనున్నారో నేడు తేలిపోనుంది. ఇదిలావుండగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడకముందే కాంగ్రెస్ పంథా మారిపోయింది. కాంగ్రెస్ ఇప్పుడు ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు మొదలుపెట్టింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్‌కు ముందు, కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయం వెలుపల హనుమంతుని వేషధారణలో కనిపించారు. వారంతా ‘జై శ్రీరామ్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హనుమంతుని వేషధారణలో ఉన్న ఓ కాంగ్రెస్ కార్యకర్త ‘సత్యం మాత్రమే గెలుస్తుంది, జై శ్రీరామ్’ అంటూ నినదించాడు. ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయం బయట పండుగ వాతావరణం నెలకొంది. కార్యకర్తలు డప్పులు వాయిస్తూ, పటాకులు పేలుస్తున్నారు. ఒక కార్యకర్త కృష్ణుని వేషధారణతో అక్కడికి వచ్చాడు. కొందరు కార్యకర్తలు రామరాజ్యం పోస్టర్లు అతికించారు. ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో లడ్డూలను సిద్ధం చేశారు. కార్యాలయం వెలుపల పార్టీ మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ మధ్యప్రదేశ్‌లో బీజేపీకి ఆధిక్యం చూపాయి. రాజస్థాన్‌లో ఈసారి అధికారం మారవచ్చని కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో అంచనాలు వెలువడ్డాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుందని జోస్యం చెబుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ ప్రకారం తెలంగాణలో కాంగ్రెస్, అధికార బీఆర్ఎస్ మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఇది కూడా చదవండి: అది కింగ్‌మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం? #WATCH | Ahead of the counting of 4-state elections, a Congress worker - dressed as Lord Hanuman - stands outside the party HQ in Delhi. He says, "Truth will triumph. Jai Sri Ram!" pic.twitter.com/L61e28tBln — ANI (@ANI) December 3, 2023 -
అది కింగ్‌మేకర్ ప్రాంతం.. గెలిస్తే ప్రభుత్వ ఏర్పాటు ఖాయం?
మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టేవారికి ‘మాల్వా-నిమాడ్’ ప్రాంతం ఎంతో ముఖ్యమైనది. 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో ఈ ప్రాంతం ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమని చెబుతుంటారు. మాల్వా-నిమాడ్ ప్రాంతంలోని 15 జిల్లాల్లో మొత్తం 66 సీట్లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తరువాత మాల్వా-నిమాడ్ మధ్యప్రదేశ్‌లో కింగ్‌మేకర్‌గా మారిపోయింది. ఈ ప్రాంతంలో తమ జెండాను ఎగురవేసిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తూ వస్తోంది. గత ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మాల్వా-నిమాడ్ ప్రాంతం కీలకంగా కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి మాల్వా-నిమాడ్లో విజయం సాధించడమే ప్రధాన కారణమంటారు. ఇక్కడి 35 స్థానాలపై కాంగ్రెస్ జెండా ఎగురవేయగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేవలం 28 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భోపాల్ సింహాసనాన్ని అధిష్టించేందుకు కాంగ్రెస్‌కు మాల్వా-నిమాడ్ విజయం ఎంతగానో సహాయపడింది. 2013 అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే మాల్వా-నిమాడ్లో బీజేపీ 57 సీట్లు గెలుచుకుని ప్రకంపనలు సృష్టించింది. నాడు కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాలకే పరిమితమైంది. మాల్వా-నిమాడ్ సీట్లలో విజయం సాధించిన కారణంగా 2013లో బీజేపీ ప్రభుత్వం, 2018లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అందుకే ఈసారి కూడా ఈ ప్రాంతంపై రెండు పార్టీలూ దృష్టిపెట్టాయి. ఇది కూడా చదవండి: అగ్నిప్రమాదం.. ఇద్దరు సజీవ దహనం! -
Aditya-L1 mission: పని మొదలెట్టిన ఆదిత్య–ఎల్ 1
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడిని అధ్యయనం చేసేందుకు రోదసీలోకి దూసుకెళ్లిన ఆదిత్య–ఎల్ 1 తన ప్రయాణంలో మరో మైలురాయిని అందుకుంది. ఈ ఉపగ్రహంలోని ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పరిమెంట్ అనే పరికరం తన కార్యకలాపాలను మొదలుపెట్టిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రకటించింది. ఈ పరికరంలోని రెండు విభిన్న భాగాలు తమ పరిశోధనలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇవి సౌర గాలులను అధ్యయనం చేస్తున్నాయి’ అని ఇస్రో వెల్లడించింది. సంబంధిత వివరాలను ఇస్రో తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్‌చేసింది. ‘సోలార్ విండ్ పారి్టకల్ ఎక్స్పరిమెంట్’లో భాగమైన సూపర్‌థర్మల్ అండ్ ఎనర్జిటిక్ పారి్టకల్ స్పెక్ట్రోమీటర్(స్టెప్స్)ను సెపె్టంబర్ పదో తేదీన, సోలార్ విండ్ అయాన్ స్పెక్ట్రోమీటర్(స్విస్)ను నవంబర్ రెండో తేదీన యాక్టివేట్ చేయడం తెల్సిందే. ఈ రెండు భాగాలు తమ కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని ఇస్రో పేర్కొంది. స్విస్‌లో ఉన్న రెండు సెన్సార్లు 360 డిగ్రీలో చక్కర్లు కొడుతూ విధులు నిర్వర్తిస్తున్నాయి. నవంబర్ నెలలో సోలార్ విండ్ అయాన్లు, ప్రైమరీ ప్రోటాన్స్, ఆల్ఫా పారి్టకల్స్లను ‘స్విస్’ విజయవంతంగా లెక్కగట్టి విశ్లేíÙంచగలిగిందని ఇస్రో ప్రకటించింది. ఈ సెన్సర్ సేకరించిన ఎనర్జీ హస్ట్రోగామ్ను పరిశీలించారు. దీంతో ప్రోటాన్, అయనీకరణ చెందిన హీలియం, ఆల్ఫా పారి్టకల్స్లో కొన్ని భిన్న లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ తాజా విశ్లేషణతో సౌర గాలుల విలక్షణతపై ఇన్నాళ్లూ నెలకొన్న ప్రశ్నలకు సమాధానాలు దొరికే అవకాశముందని ఇస్రో శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తంచేశారు. సౌర గాలుల్లోని అంతర్గత ప్రక్రియలు.. భూమిపై ఏ విధమైన ప్రభావం చూపుతాయనే విషయంపై సమగ్ర అధ్యయనం చేసేందుకు తాజా డేటా సహాయకారిగా ఉంటుందని ఇస్రో పేర్కొంది. లాగ్రాంజ్ పాయింట్ వద్ద చోటుచేసుకునే కరోనల్ మాస్ ఎజెక్షన్పై ఓ అవగాహనకు రావచ్చని వెల్లడించింది. సూర్యుడిపై అధ్యయనం కోసం ఈ ఏడాది సెప్టెంబరు 2న నింగిలోకి దూసుకెళ్లిన ‘ఆదిత్య – ఎల్ 1’ తన ప్రయాణంలో దాదాపు చివరి దశను చేరుకుంది. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్–1 చేరాక దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ ఆదిత్య – ఎల్ 1 సూర్యుడిని అధ్యయనం చేయనుంది. -
25 ఏళ్లుగా ఎంట్రన్స్‌లో ఫెయిల్.. 55వ ఏట ఎంఎస్‌స్సీ పట్టా!
‘కష్టపడి పనిచేసేవారు ఎప్పటికీ ఓడిపోరు.. ఓర్పుతో ప్రయత్నాలు సాగిస్తుంటే విజయం సాధిస్తారని జబల్పూర్(మధ్యప్రదేశ్)కు చెందిన రాజ్‌కరణ్ బారువా నిరూపించారు. 55 ఏళ్ల రాజ్‌కరణ్ బారువా సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ గుడిసెలో నివసిస్తున్నాడు. అయితే 25 ఏళ్లుగా ఫెయిల్ అవుతున్నప్పటికీ పట్టువీడని రాజ్‌కరణ్ ఎట్టకేలకు ఎంఎస్సీ గణితశాస్త్రంలో పట్టా సాధించాడు. ఈ విజయాన్ని సాధించడానికి రాజ్‌కరణ్ తన సంపాదనలో అత్యధిక భాగాన్ని వెచ్చించాడు. రాజ్‌కరణ్ తొలుత ఆర్కియాలజీలో ఎంఏ ఉత్తీర్ణత సాధించడంతో పాటు సంగీతంలో డిగ్రీ కూడా పూర్తి చేశాడు. ఆ తర్వాత పాఠశాలలో సంగీతం బోధిస్తుండగా, తోటి ఉపాధ్యాయుడు గణితం బోధించే తీరును చూసి ముగ్ధుడయ్యాడు. దీంతో రాజ్‌కరణ్‌కు గణితంలో ఎంఎస్సీ చేయాలనే ఆలోచన వచ్చింది. 1996లో గణిత సబ్జెక్టుతో ఎంఎస్సీ చేయడానికి రాణి దుర్గావతి విశ్వవిద్యాలయం (జబల్పూర్)లో అడ్మిషన్ తీసుకున్నాడు. 1997లో తొలిసారిగా ఎమ్మెస్సీ ప్రవేశ పరీక్షకు హాజరైనా ఫెయిల్ అయ్యాడు. ఇలా ప్రతీ ఏడాదీ ప్రవేశ పరీక్షలో విఫలమవుతున్నా నిరాశకు గురికాలేదు. ఎట్టకేలకు 2020లో ఎంఎస్సీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఇటీవలే ఎంఎస్సీ ఫైనల్‌ను పూర్తి చేశాడు. రాజ్‌కరణ్ బంగ్లాలలో పని చేస్తూ, యజమానుల నుంచి పలు అవమానాలు ఎదుర్కొన్నాడు. సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా ఉన్నత చదువులు కొనసాగించాలనే తపనతో అన్ని కష్టాలను భరించాడు. రాజ్‌కరణ్ ఆల్ ఇండియా రేడియోలో అనేక ప్రదర్శనలు ఇచ్చాడు. పలు పాటల క్యాసెట్లను కూడా విడుదల చేశాడు. ప్రస్తుతం రాజ్ కరణ్ తన తల్లి, సోదరునితోపాటు ఉంటున్నాడు. రాజ్‌కరణ్‌కు ఇంకా పెళ్లికాలేదు. తనకు ప్రభుత్వ సహాయం అందిస్తే పాఠశాలను ప్రారంభించాలనుకుంటున్నట్లు రాజ్ కరణ్ తెలిపాడు. ఫెయిల్యూర్‌తో కుంగిపోకుండా విద్యార్థులు చదువులో ముందుకు సాగాలని రాజ్ కరణ్ సలహా ఇస్తుంటాడు. ఇది కూడా చదవండి: టన్నెల్ రెస్క్యూలో కీలకంగా హైదరాబాద్ సంస్థ -
ఉత్తరాఖండ్ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్
-
ఆయన సపోర్టు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు : ఉత్తరాఖండ్ సీఎం
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్నవారిని రక్షించే రెస్క్యూ ఆపరేషన్ విజయం సాధించింది. 41 మంది కార్మికులను సురక్షితంగా సొరంగంనుంచి బయటికి తీసుకువచ్చారు. అనంతరం వారిని ఆసుపత్రికి తరలించారు. 17 రోజులు సుదీర్ఘ నిరీక్షణ తరువాత వారంతా ఈసంక్షోభం నుంచి బైటపడటంతో కార్మికుల కుటుంబాలు, రెస్క్యూ సిబ్బందితోపాటు, దేశ వ్యాప్తంగా సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో భాగమైన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ప్రధానమంత్రి మోదీ నిరంతరం తనతో టచ్‌లో ఉంటూ, రెస్క్యూ ఆప్‌కు సంబంధించిన అప్డేట్లు తెలుసుకున్నారనీ పలు సలహాలిచ్చారని సీఎం వెల్లడించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) ఎలాగైనా అందరినీ క్షేమంగా రక్షించడమే కర్త్యవ్యంగా పెట్టుకున్నాననీ, ఈ విషయంలో ప్రధాని సపోర్టు లేకుంటేఇది సాధ్యమయ్యేది కాదంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు కార్మికులందరికీ తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించి, క్షేమంగా ఇళ్లకు చేరేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని మోదీ తనను ఆదేశించారని వెల్లడించారు. కాగా ఈ విజయంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానిమోదీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తదితర ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆనందాన్ని ప్రకటించారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) (అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ) #WATCH | Uttarkashi (Uttarakhand) tunnel rescue: CM Pushkar Singh Dhami says, " I want to thank all the members who were part of this rescue operation...PM Modi was constantly in touch with me and was taking updates of the rescue op. He gave me the duty to rescue everyone safely… pic.twitter.com/TldZLK6QEB — ANI (@ANI) November 28, 2023 -
అద్భుతం..ఉద్వేగమైన క్షణాలివి: ఆనందోత్సాహాల వెల్లువ
ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా సిల్క్యారా టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది సురక్షితంగా బయటకు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. కార్మికులు క్షేమంగా తిరిగి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో పాల్గొన్న ప్రతీ ఒక్కరికీ ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. వారి ధైర్యం, సంకల్పం కార్మిక సోదరులకు కొత్త జీవితాన్నిచ్చాయన్నారు. మానవత,జట్టు కృషికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారంటూ రెస్క్యూ టీంను ప్రశంసించారు. ఉత్తరకాశీలో కార్మిక సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం అందరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది. ధైర్యం, సహనం అందరికి స్ఫూర్తిని కలిగిస్తున్నాయంటూ కార్మికులను అభినందించారు. అందరికీ శుభాకాంక్షలు అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఇంతకాలం నిరీక్షణ తర్వాత కార్మికులు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం. ఈ సమయంలో సహనంతో ఆయా కుటుంబాలన్నీ చూపించిన ఓర్పు, ధైర్యాన్ని అభినందించకుండా ఉండలేమని కొనియాడారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) उत्तरकाशी में हमारे श्रमिक भाइयों के रेस्क्यू ऑपरेशन की सफलता हर किसी को भावुक कर देने वाली है। टनल में जो साथी फंसे हुए थे, उनसे मैं कहना चाहता हूं कि आपका साहस और धैर्य हर किसी को प्रेरित कर रहा है। मैं आप सभी की कुशलता और उत्तम स्वास्थ्य की कामना करता हूं। यह अत्यंत… — Narendra Modi (@narendramodi) November 28, 2023 రాష్ట్రపతి. ద్రౌపది ముర్ము కూడా కార్మికులును వెలికి తీసుకొచ్చిన ఘటనపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర నితిన్ గడ్కరీ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. తన సందేశాన్ని వీడియో రూపంలో ట్విటర్లో షేర్ చేశారు. అలాగే నటుడు సోనూ సూద్ ట్విటర్ ద్వారా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. (ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర) सिल्क्यारा टनल बचाव कार्य में शामिल सभी का धन्यवाद। #SilkyaraTunnelRescue pic.twitter.com/H8r0JsRELY — Nitin Gadkari (@nitin_gadkari) November 28, 2023 Uttarkashi rescue operation complete. All 41 workers rescued from the collapsed #SilkyaraTunnel ❤️❤️❤️❤️ A M A Z I N G 🙏 — sonu sood (@SonuSood) November 28, 2023 -
ఇంత కన్నా గొప్ప విజయం ఏముంటుంది : ఆనంద్ మహీంద్ర
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీ సిల్క్యారా టన్నెల్లో చిక్కుకున్ వారిని ఒక్కొక్కరినీ బయటికి తీసుకువచ్చారు. దీంతో అక్కడంతా ఉద్విగ్న వాతావరణం నెలకొంది. 17 రోజుల పాటు సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులు మంగళవారం (నవంబరు 28) తొలిసారి వెలుగు ముఖం చూశారు. Uttarkashi tunnel rescue | Uttarakhand CM Pushkar Singh Dhami meets the workers who have been rescued from inside the Silkyara tunnel. pic.twitter.com/8fgMiHPkAD — ANI (@ANI) November 28, 2023 బయటకు తీసుకొచ్చిన వారిని అత్యవసర వైద్య పరీక్షల నిమత్తం ముందుగానే సిద్ధంగా ఉంచుకున్న అంబులెన్స్‌ల ద్వారా ఆసుపత్రికి తరలించారు. దీనిపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లి విరిసాయి. 423 గంటలు, 41 జీవితాలు!!! రెస్క్యూ ఆపరేషన్స్‌లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు!! అంటూ నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. రెస్క్యూ ఆపరేషన్‌ను దగ్గరుండి పరిశీలించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సిల్క్యారా సొరంగం లోపల నుండి బైటికి వచ్చిన కార్మికులను కలిసి ఆనందం ప్రకటించారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: ఉద్వేగ క్షణాలు, పూలదండలు ,గ్రీన్ కారిడార్) ముఖ్యంగా ఆనంద్ మహీంద్ర ఈ ఆపరేషన్‌పై సక్సెస్‌పై స్పందించారు. 41 మంది విలువైన ప్రాణాలను కాపాడేందుకు గత 17 రోజులుగా అవిశ్రాంతంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఏ క్రీడా విజయం సాధించగలిగే దానికంటే గొప్పగా, దేశ స్ఫూర్తిని ఇనుమడింప చేశారు. మా ఆశల్ని ద్విగుణీ కృతం చేశారని పేర్కొన్నారు. మన ఆశయం, కృషి కలెక్టివ్‌గా ఉంటే, ఐక్యంగా ఉంటే ఏ సొరంగం నుండి బయటపడటం కష్టం కాదు, ఏ పని అసాధ్యం కాదని మరోసారి గుర్తు చేసారు అంటూ ఆయన ట్వీట్ చేశారు. (ఉత్తరాఖండ్ టన్నెల్: మన ఊరూ కాదు,పేరూ కాదు అయినా! ఎవరీ ఆర్నాల్డ్ డిక్స్) It’s time for gratitude. Thank you to EVERY single person who worked tirelessly over the past 17 days to save these 41 precious lives. More than any sporting victory could have, you have uplifted the spirits of a country & united us in our hope. You’ve reminded us that no tunnel… https://t.co/ZSTRZAAJOl — anand mahindra (@anandmahindra) November 28, 2023 -
కలిసొచ్చిన చంద్రయాన్ 3 సక్సెస్ - బిలియనీర్ల జాబితాలోకి కొత్త వ్యక్తి
చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రునిపై ల్యాండ్ అయిన తర్వాత భారతదేశంలో ఒక వ్యక్తి బిలియనీర్ జాబితాలోకి చేరాడు. ఇంతకీ ఈయన ఎవరు? ఇతని వల్ల చంద్రయాన్-3కు ఉపయోగం ఏమిటి? నెట్ వర్త్ ఎంత అనే మరిన్ని వివరాలు వివరాలు ఇక్కడ పరిశీలిద్దాం. కేన్స్ టెక్నాలజీ ఇండియా ఫౌండర్ 'రమేష్ కున్హికన్నన్' (Ramesh Kunhikannan) చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించారు. రోవర్, ల్యాండర్ రెండింటికీ అవసరమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లను అందించి చంద్ర మిషన్ విజయంలో భాగస్వామి అయ్యారు. దీంతో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి కేన్స్ షేర్లు విపరీతంగా పెరిగాయి. కేన్స్ షేర్లు భారీగా పెరగటం వల్ల కంపెనీలో 64 శాతం వాటా కలిగిన కున్హికన్నన్ ఆస్తులు తారాస్థాయికి చేరి బిలియనీర్ల జాబితాలో ఒకరుగా నిలిచాడు. ఈయన మొత్తం సంపద 1.1 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ. వంద కోట్లు కంటే ఎక్కువ. కేన్స్ టెక్నాలజీ ఇండియా తన 137 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయంలో సగానికి పైగా ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీలను తయారు చేయడం ద్వారా పొందుతుందని ఫోర్బ్స్ నివేదించింది. ఈ సంస్థ ఆటోమోటివ్, ఏరోస్పేస్, మెడికల్ అండ్ డిఫెన్స్ పరిశ్రమలకు ఎలక్ట్రానిక్ సిస్టమ్‌లు సరఫరా చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా వల్ల లాభం మైసూర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కున్హికన్నన్ 1988లో ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ తయారీదారుగా కేన్స్‌ను స్థాపించారు. అతని భార్య సవిత రమేష్ 1996లో కంపెనీలో చేరి ప్రస్తుతం సంస్థ చైర్‌పర్సన్‌గా ఉంది. స్థానిక తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్రం ప్రారంభించిన “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమం కేన్స్ ఇండియాకు చాలా ఉపయోగపడింది. ఇదీ చదవండి: భవిష్యత్తు అంతా ఇందులోనే.. లింక్డ్ఇన్ సంచలన రిపోర్ట్! భారతీయ పరిశ్రమలలో పెరుగుతున్న ఎలక్ట్రానిక్స్ వినియోగం కారణంగా, కంపెనీ వార్షిక ఆదాయం 2020 ఆర్థిక సంవత్సరంలో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2024 మార్చి నాటికి కంపెనీ ఆదాయం సుమారు 208 మిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
Bhagavanth Kesari: 'భగవంత్ కేసరి' సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
నకిలీ న్యాయవాది విజయగాథ.. 26 కేసులు గెలిచి..
వ్యక్తి సామర్ధ్యం అనేది అతని విద్య, లేదా నైపుణ్యాల ద్వారా వెలుగులోకి వస్తుంది. అలాగే మనిషి ఎంత విద్యావంతుడైతే అతను తన వృత్తిలో అంత మెరుగ్గా ఉంటాడని అంటుంటారు. అయితే ఇటువంటి బలమైన నమ్మకాలను సైతం వమ్ము చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. వృత్తిపరమైన విజయంతో అందరినీ ఆశ్చర్యపరిచిన నకిలీ న్యాయవాది ఉదంతం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ కథ కెన్యాకు చెందిన ఒక వ్యక్తిది. అతను ఒక ఉన్నత న్యాయవాద సంస్థలో లాయర్‌గా తన పేరు నమోదు చేసుకోవడమే కాకుండా తన క్లయింట్ల తరపున వాదించి 26 కేసులలో విజయం సాధించాడు. ఈ నకిలీ లాయర్ పేరు బ్రియాన్ మ్వెండా న్జాగి. అతను నిజమైన న్యాయవాది కాదని న్యాయమూర్తులు కూడా గుర్తించలేకపోవడం విశేషం. లా కోర్సు చేయకుండానే బ్రియాన్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. కెన్యా లా సొసైటీ అతనిని అనుమానించిన నేపధ్యంలో అతని మోసపూరిత చర్యలు వెలుగు చూశాయి. బ్రియాన్ అనే నిజమైన న్యాయవాది తాను ప్రాక్టీస్ చేయకపోయినా తన ఖాతా యాక్టివ్‌గా ఉండటాన్ని చూసి, అతను కెన్యా లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుదారు అటార్నీ జనరల్ కార్యాలయంలో పని చేస్తున్నాడు. అందుకే అతనికి ప్రాక్టీస్ సర్టిఫికెట్ అవసరం లేకపోవడంతో అతను తన ఖాతాను ఎప్పుడూ ఉపయోగించలేదు. అయితే ఒకరోజు అతను తన ఖాతా లాగిన్ చేసినప్పుడు, అతనికి అనుమానం వచ్చింది. దీంతో అతను లా సొసైటీకి ఫిర్యాదు చేశాడు. దీంతో అతని పేరు మీద మరొకరు లాయర్‌గా వ్యవహరిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ నేపధ్యంలో నకిలీ న్యాయవాదిని అరెస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో అతని వృత్తి నైపుణ్యాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. ఇది కూడా చదవండి: హఠాత్తుగా నాగుపాము తిరగబడితే... -
యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్ తన మొదటి ప్రయత్నంలో అంతరిక్ష సంస్థలో జాబ్ పొందలేకపోయాయని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NIT) గోవా తొమ్మిదవ కాన్వకేషన్‌లో వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్‌గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్లెస్ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్‌కు చైర్మన్ అయ్యానని చెప్పుకొచ్చాడు. మొదట శాటిలైట్ సెంటర్లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్ఎల్వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్ పదవి కూడా వరించిందని తెలిపాడు. నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు. డాక్టర్ కె శివన్ గురించి ఏప్రిల్ 1957లో కన్యాకుమారిలోని తారక్కన్‌విలై గ్రామంలో ఒక మామిడి రైతుకు జన్మించిన 'శివన్' పాఠశాల విద్యను తమిళ మాధ్యమ పాఠశాల నుంచి, ఆ తరువాత 1980లో మద్రాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ డిగ్రీ పూర్తి చేసాడు.1982లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొంది ఇస్రోతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. 2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. ఆ తరువాత 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించాడు. -
MAD Movie:'మ్యాడ్'మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
తిరుపతి పద్మావతిలో మరో గుండె మార్పిడి
తిరుపతి తుడా(తిరుపతి జిల్లా)/పెనమలూరు: తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు మరోసారి గుండె మార్పిడి చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు. ఆదివారం రాత్రి 39 ఏళ్ల యువకుడికి గుండె మార్పిడి చేశారు. ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి నేతృత్వంలో వైద్యులు అతడి ప్రాణాలను కాపాడారు. 39 ఏళ్ల యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండె ఏలూరు జిల్లా, దొండపూడికి చెందిన మత్తి సురేష్‌బాబు (49) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని విజయవాడలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చేర్చారు. బ్రెయిన్ డెడ్ కావడంతో, కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. ఈక్రమంలో ఏలూరు జిల్లా కైకలూరుకు చెందిన 39 ఏళ్ల యువకుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇందుకోసం అవయవదాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ డైరెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి సీఎంఓకు సమాచారం అందించారు. అన్ని అనుమతులు రావడంతో యువకుడికి 49 ఏళ్ల వ్యక్తి గుండెను అమర్చారు. డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితోపాటు డాక్టర్ గణపతిలతో కూడిన ఏడుగురు వైద్యులు, టెక్నీషియన్ల బృందం ఆదివారం దాదాపు 6 గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స విజయవంతం చేశారు. మరోసారి మానవత్వం చాటుకున్న సీఎం వైఎస్ జగన్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. గుండె తరలింపునకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేయించారు. చికిత్సకు అవసరమైన రూ.12 లక్షల నిధులను సీఎం రిలీఫ్ ఫండ్, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ద్వారా వెంటనే మంజూరు చేశారు. గుండె తరలింపునకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎంఓను ఆదేశించారు. విజయవాడ నుంచి తిరుపతి చేరుకున్న అనంతరం విమానాశ్రయం నుంచి గుండె తరలింపునకు అధికారులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. ఎస్పీ పరమేశ్వరరెడ్డి ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేవలం 23 నిమిషాల్లో పద్మావతి కార్డియాక్ ఆసుపత్రికి గుండెను తరలించారు. దారిపొడవునా పోలీసులు ప్రొటోకాల్ పాటించి, కట్టుదిట్టమైన భద్రత ఇచ్చారు. నలుగురికి పునర్జన్మ ఏలూరు జిల్లా దొండపూడికి చెందిన మాతి సురేష్‌బాబు (49) ఈనెల ఆరో తేదీన భవనం పైనుంచి పడిపోవడంతో బలమైన గాయాలు అయ్యాయి. బ్రెయిన్ డెడ్ అవడంతో కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చారు. దీంతో కృష్ణాజిల్లా, పెనమూరులోని క్యాపిటల్ ఆస్పత్రి, జీవన్‌దాన్ స్వచ్ఛంద సేవాసంస్థ సహకారంతో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. గుండెను శ్రీ పద్మావతి కార్డియాక్ ఆస్పత్రిలోని 39 ఏళ్ల వ్యక్తికి అమర్చారు. కాలేయం, మూత్రపిండం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మణిపాల్ ఆస్పత్రికి, మరో మూత్రపిండం విజయవాడలోని క్యాపిటల్ ఆస్పత్రికి తరలించడంతో సురేష్‌బాబు నలుగురికి పునర్జన్మ ఇచ్చినట్లయింది. ఈ సందర్భంగా మృతుడి కుటుంబ సభ్యులను, బంధువులను ఏపీ జీవన్‌దాన్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ డాక్టర్ కె.రాఘవేంద్రరావు, జీవన్‌దాన్ సంస్థ ప్రధాన వైద్యుడు డాక్టర్ కె.రాంబాబు ప్రత్యేకంగా అభినందించారు. -
అంతరిక్ష కేంద్రం ఏర్పాటుపై దృష్టి: ఇస్రో
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతంతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) దృష్టి ఇప్పుడు ప్రతిష్టాత్మక అంతరిక్ష పరిశోధన ప్రాజెక్టులపై పడిందని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్)కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో భాగంగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం, దీర్ఘకాల మానవ అంతరిక్షయానంతోపాటు భవిష్యత్తు మిషన్ల కోసం వివిధ అవకాశాలను అన్వేíÙస్తోందని తెలిపారు. అంతరిక్ష కేంద్రం ఏర్పాటు భారతీయ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థకు ఎలా ప్రయోజనకరంగా ఉంటుందనే విషయం పరిశీలిస్తున్నామన్నారు. సమీప భవిష్యత్తులో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి, రోబోటిక్ ఆపరేషన్‌తో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించుకున్నట్లు వివరించారు. ప్రస్తుతానికి మానవ సహిత అంతరిక్ష యానంపై దృష్టిసారించామన్నారు. గగన్‌యాన్ కార్యక్రమం అదే దిశగా సాగుతోందని చెప్పారు. అది నెరవేరితే, ఆ తర్వాత వచ్చే 20–25 ఏళ్లలో చేపట్టే మిషన్లలో స్పేస్ స్టేషన్ ఏర్పాటు ఉంటుందన్నారు. తద్వారా ఇప్పటికే ఈ దిశగా విజయం సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరుతుందన్నారు. చైనా గ్లోబల్ టెలివిజన్ నెట్వర్క్(సీజీటీఎన్) -
సంపద సృష్టికి సక్సెస్ మార్గం!
పొదుపు మొత్తాన్ని పెట్టుబడిగా మలిచి, మంచి రాబడి తెచ్చుకోవాలని అందరూ కోరుకుంటారు. కానీ, ఈ విషయంలో సక్సెస్ చూసే వారు కొద్ది మందే ఉంటారు. పెట్టుబడి అనేది వాస్తవిక దృక్పథం, విస్తృతమైన అధ్యయనం, సమాచార విశ్లేషణ ఆధారంగానే ఉండాలి. లేదంటే.. చిన్న తప్పులకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎంతగా అధ్యయనం చేసినప్పటికీ, ఒక్క తప్పు దొర్లినా ఆశించిన ఫలితం రాకుండా పోతుంది. అందుకే మంచి రాబడి కోసం పెట్టుబడి ఉంటే చాలదు. అనుసరించే మార్గం తెలియాలి. ఇన్వెస్టర్‌గా ఎలాంటి తప్పులు చేయకూడదనే అవగాహన కలిగి ఉండాలి. నువమా వెల్త్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ ప్రెసిడెంట్ రాహుల్ జైన్ పెట్టుబడుల విషయంలో ఎలాంటి తప్పులకు దూరంగా ఉండాలనే విషయాల గురించి వెల్లడించారు. తగినంత వ్యవధి పెట్టుబడులకు తగినంత వ్యవధి ఇవ్వాలి. పెట్టుబడుల విజయానికి ఇది కీలకం అవుతుంది. నిర్ణీత కాలానికోసారి పెట్టుబడుల సమీక్షకు కొంత సమయం కేటాయించుకోవాలి. చాలా మంది ఇన్వెస్టర్లు కీలకమైన ఈ సమీక్షకు దూరంగా ఉంటుంటారు. ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను కలసి పెట్టుబడుల విషయంలో వారి నుంచి కీలక సూచనలు తీసుకోవాలి. దీనివల్ల మీరు అనుసరిస్తున్న పెట్టుబడులు మీ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యానికి అనుగుణంగానే ఉన్నాయా? అన్నది తెలుసుకునే వీలు చిక్కుతుంది. పెట్టుబడులను సమీక్షించడం వల్ల మెరుగుపరుచుకునే అవకాశాలు, మార్పులు చేర్పులకు అవకాశం లభిస్తుంది. మారుతున్న మార్కెట్, ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొనే విధంగా పెట్టుబడుల నిర్వహణ సాధ్యపడుతుంది. అవకాశాలను అందిపుచ్చుకుని, రిస్క్‌ను అధిగమించొచ్చు. లోపాలను ఆరంభంలోనే తొలగించుకోవచ్చు. కనుక ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను కలిసి సమీక్షించుకోవాలి. పొదుపు చేయలేకపోవడం తగినంత పొదుపు చేయడం పెట్టుబడులకు కీలకం. లేదంటే లక్ష్యాలకు కావాల్సినంత పెట్టుబడులు సమకూర్చుకోలేరు. పొదుపులో 50–30–20 బడ్జెట్ సూత్రాన్ని అనుసరించాలి. నెలవారీ నికర ఆదాయం నుంచి 50 శాతమే ఖర్చు చేయాలి. అది కూడా గ్రోసరీ, యుటిలిటీ, పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి అద్దె కోసం. ఇక 30 శాతాన్ని అత్యవసరం కాని రెస్టారెంట్ ఫుడ్, పర్యటనలు, గ్యాడ్జెట్ల కొనుగోలు, మూవీ తదితర వాటికి కేటాయించుకోవాలి. మరో 20 శాతాన్ని పొదుపు చేసి, దాన్ని పెట్టుబడిగా మార్చుకోవాలి. అస్సెట్ అలోకేషన్ గుడ్లు అన్నింటినీ ఒక్కటే బుట్టలో పెట్టేయకూడదన్న సూత్రం తెలిసే ఉంటుంది. అలాగే పెట్టుబడులు అన్నింటికీ తీసుకెళ్లి ఒకే సాధనంలో ఉంచేయకూడదు. ఎందుకంటే ఆయా విభాగం నిర్ణీత కాలం పాటు ప్రతికూల పనితీరు చూపించినట్టయితే పోర్ట్‌ఫోలియో విలువపై (పెట్టుబడులు) ప్రభావం పడుతుంది. నష్టాలు కనిపిస్తాయి. అందుకే పెట్టుబడులను వివిధ సాధనాల (అస్సెట్ క్లాసెస్) మధ్య వర్గీకరించుకోవాలి. దీనివల్ల ప్రత్యేకంగా ఒక్కో విభాగంలో ఉండే రిస్క్‌ను అధిగమించే అవకాశం ఉంటుంది. వైవిధ్యం చేసుకోవడం వల్ల వివిధ విభాగాల్లో ఏదైనా ఒకటి రెండు ప్రతికూల ఫలితాలు చూపించినా, అదే కాలంలో మిగిలిన విభాగాల్లో మెరుగైన పనితీరు నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. తగినంత వైవిధ్యం కోసం పెట్టుబడులను ఈక్విటీ, ఫిక్స్డ్ ఇన్కమ్ (డెట్), కమోడిటీ, రియల్ ఎస్టేట్ బంగారం మధ్య విస్తరించుకోవాలి. ఇలా చేయడం వల్ల వీటిల్లో ఏదైనా ఒకటి రెండు విభాగాలు ప్రతికూలతలు ఎదురు చూసినా, మిగిలినవి ఆదుకుంటాయి. సరైన పెట్టుబడి సాధనం ఆర్థిక మార్కెట్లు ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటాయి. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక, భౌగోళిక అంశాలు వివిధ పెట్టుబడి సాధనాల పనితీరును ప్రభావితం చేస్తుంటాయి. కనుక సరైన లేదా కచ్చితమైన పెట్టుబడి సాధనం కోసం అన్వే షించడం అనేది అవకాశాలను కోల్పోయేందుకు దారితీయవచ్చు. పరిమితికి మించి సమాచారాన్ని మెదడులోకి చేర్చుకోవడం వల్ల నిర్ణయాల్లో జాప్యానికి దారితీస్తుంది. దీంతో అనుకూలమైన పెట్టుబడి అవకాశాలను కోల్పోవాల్సి రావచ్చు. అందుకే ఇన్వెస్టర్లు తమ లక్ష్యాలు, రిస్క్ సామర్థ్యాలకు అనుకూలమైన పెట్టుబడి సాధనాన్ని ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేయాలి. టిప్స్ ఫాలో అవ్వడం నేడు సోషల్ మీడియాలో సలహాలిచ్చే వారు కోకొల్లలు కనిపిస్తుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్, టెలీగ్రామ్, యూట్యూబ్‌లో భారీ సంఖ్యలోనే అకౌంట్లు ఉన్నాయి. వేగంగా లాభాలు సంపాదించాలనే ఆశే ఇన్వెస్టర్లను నష్టపోయేలా చేస్తుంటుంది. టిప్స్ సాయంతో త్వరగా పెట్టుబడిని రెట్టింపు చేసుకోవాలనే ధోరణి ఇక్కడ పనికిరాదు. పెట్టుబడి ప్రపంచం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయాలు, టెక్నాలజీలో పురోగతి తదితర ఎన్నో అంశాలు మార్కెట్లను ప్రభావితం చేస్తుంటాయి. వీటిని ఎవరూ కచ్చితంగా అంచనా వేయలేరు. కనుక పెట్టుబడుల విషయంలో స్వీయ అప్రమత్తత, అవగాహన అవసరం. అవసరమైతే నిపుణుల సాయం తీసుకోవాలే కానీ, ఉచిత టిప్స్‌ను అనుసరించడం సురక్షితం కాదు. కంపౌండింగ్ పెట్టుబడులకు కాలం కూడా కీలకమే. ఎంత ఎక్కువ వ్యవధి ఉంటే అంత అధికంగా అది కాంపౌండింగ్ (వృద్ధి) అవుతుంది. కాంపౌండింగ్ అంటే పెట్టుబడిపై వృద్ధి కాకుండా, రాబడి కూడా వృద్ధి చెందడం. దీన్ని రాబడిపై రాబడిగా చెబుతారు. ముందుగానే పెట్టుబడిని ఆరంభించడం వల్ల ఈ కాంపౌండింగ్ ప్రయోజనంతో దీర్ఘకాలంలో మంచి సంపదను సృష్టించుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో మ్యూచువల్ ఫండ్ పథకంలో పెట్టుబడులు మొదలు పెట్టినా, కనీసం 5–10 ఏళ్లపాటు వాటిని కొనసాగించినప్పుడే కాంపౌండింగ్ ప్రయోజనం కనిపిస్తుంది. మధ్యలో నిలిపివేస్తే పూర్తి స్థాయిలో ఆ ఫలితం కనిపించదు. కాంపౌండింగ్ ప్రయోజనాన్ని పూర్తి స్థాయిలో పొందేందుకు ఎంతో ఓపిక, క్రమశిక్షణ అవసరం. రిస్క్ అంతర్భాగం పెట్టుబడుల్లో రిస్క్ అంతర్భాగంగా ఉంటుంది. ప్రతీ పెట్టుబడితోనూ వచ్చే రిస్క్‌ను అర్థం చేసుకున్నప్పుడే దాన్ని అధిగమించడం సాధ్యపడుతుంది. మార్కెట్ అనుసంధానిత సాధనం అయిన స్టాక్, ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసే ముందు వాస్తవ అంశాలను తెలుసుకోవాలి. కంపెనీల ఆర్థిక మూలాలు, క్రెడిట్ నాణ్యత ఇవన్నీ చూడాలి. మీ రిస్క్ సామర్థ్యం (అస్థిరతలను ఏ మేరకు భరించగలరు) గురించి తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అధిక రిస్క్ తీసుకునేట్టు అయితే ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇతరులను అనుసరించడం మెజారిటీ ఇన్వెస్టర్లు సాధారణంగా ఇతరుల పెట్టుబడులను, నిర్ణయాలను అనుసరిస్తుంటారు. సరైన సమయంలో కొనుగోళ్లు, విక్రయాలు చేయడం కాకుండా, దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. ఒకే సమయంలో ఎక్కువ మంది ఏదైనా సాధనాన్ని అనుసరించినప్పుడు అక్కడ ధరలు కృత్రిమంగా పెరిగిపోతాయి. దీన్నే స్పెక్యులేషన్ బబుల్‌గా చెబుతారు. దీంతో ఆయా సాధనాల విలువలు ఖరీదుగా మారతాయి. దీంతో తదుపరి మార్కెట్ కరెక్షన్లో అవి ఎక్కువ నష్టాన్ని చూసే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఇన్వెస్టర్ తనకుంటూ ఓ విధానాన్ని రూపొందించుకోవాలి. మార్కెట్ ధోరణులను అధ్యయనం చేయడం అలవాటు చేసుకోవాలి. తమ రిస్క్ సామర్థ్యం పరిధిలోనే పెట్టుబడుల నిర్ణయాలు ఉండాలి. తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టాలి. నిపుణుల సాయం చాలా మంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను తామే నిర్వహించుకోగలమని భావిస్తుంటారు. ఈ విషయంలో నిపుణుల సాయం తీసుకుంటే మెరుగైన ఫలితాలకు అవకాశం ఉంటుందని మర్చిపోవద్దు. ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ప్లానర్లు, వెల్త్ మేనేజర్లు అందరూ ఫైనాన్షియల్ మార్కెట్ల పట్ల లోతైన విషయ పరిజ్ఞానంతో ఉంటారు. ఆధునిక ధోరణులు, ఆర్థిక, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తుంటారు. దీనికి అనుగుణంగా పెట్టుబడుల విధానాల్లో మార్పులు చేస్తుంటారు. కనుక నిపుణుల సాయంతో రాబడిని మరింత పెంచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మార్కెట్ పతనాల్లో నిపుణుల సాయం ఎంతో ఆదుకుంటుంది. మనో ధైర్యాన్ని, మెరుగైన మార్గాన్ని చూపుతుంది. వారి విలువైన సలహాలతో రిస్క్‌ను సులభంగా అధిగమించగలరు. లక్ష్యం లేకుండా పెట్టుబడికి లక్ష్యం ఉండాలి. లక్ష్యం లేకపోతే అది చుక్కాని లేని నావ మాదిరే అవుతుంది. మీరు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారనేది మీకు తెలిసి ఉండాలి. లక్ష్యం తెలిసినప్పుడే చేసే పెట్టుబడి ఆశించిన రాబడులు ఇస్తుంది. వివిధ లక్ష్యాలకు భిన్నమైన పెట్టుబడి వ్యూహాలు అవసరం పడొచ్చు. మీ పెట్టుబడుల విధానానికి మీ లక్ష్యం బ్లూప్రింట్ మాదిరిగా పనిచేస్తుంది. మీ లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అని మూడు భాగాలుగా వర్గీకరించుకోవాలి. నెలల నుంచి గరిష్టంగా రెండు సంవత్సరాల కాలానికి సంబంధించినవి స్వల్పకాల లక్ష్యాల కిందకు వస్తాయి. అత్యవసర నిధి, సెలవుల్లో పర్యటనలకు కావాల్సినది సమకూర్చుకోవడం ఇలాంటివి స్వల్పకాల లక్ష్యాలు అవుతాయి. 2–5 ఏళ్ల కాల అవసరాలు మధ్యకాలిక లక్ష్యాల కిందకు వస్తాయి. ఇల్లు లేదా కారు కొనుగోలుకు కావాల్సిన డౌన్ పేమెంట్ సమకూర్చుకోవడం వంటివి మధ్యకాల లక్ష్యాలు అవుతాయి. ఇక 10–20 ఏళ్లు అంతకుమించిన కాలానికి ఉద్దేశించినవి దీర్ఘకాల లక్ష్యాల కిందకు వస్తాయి. పిల్లల ఉన్నత విద్య, రిటైర్మెంట్ లక్ష్యాలు దీర్ఘకాలానికి సంబంధించినవి అవుతాయి. ఈ లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలి. స్వల్పకాలం, మధ్యకాలానికి సంబంధించి పెట్టుబడులను ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాలు అయిన బ్యాంక్ ఎఫ్డీలు, కార్పొరేట్ బాండ్లు, ఎన్‌సీడీల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం ఉద్దేశించిన పెట్టుబడులను మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఫిక్స్డ్ ఇన్కమ్ సాధనాల మధ్య వర్గీకరించుకోవచ్చు. మీ ఆదాయం, రుణ బాధ్యతలు, రిస్క్ సామర్థ్యం ఆధారంగా అనుకూలమైన సాధనాలను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ఫైనాన్షియల్ అడ్వైజర్ సాయం తీసుకోవాలి. -
తెరపైకి మళ్లీ డబుల్ డెక్కర్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: వందేభారత్ రైళ్లు సూపర్ సక్సెస్ కావటంతో, ఫెయిల్యూర్‌గా ముద్రపడ్డ డబుల్ డెక్కర్ రైళ్లపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఆక్యుపెన్సీ రేషియో లేక ఒక్కొక్కటిగా మూలపడుతూ వస్తున్న డబుల్ డెక్కర్ రైళ్లను మళ్లీ పట్టాలెక్కించి విజయవంతం చేయాలని భావిస్తోంది. బెర్తులు ప్రవేశపెట్టి.. డబుల్ డెక్కర్ రైళ్లు కేవలం పగటి వేళ మాత్రమే తిరిగేలా రైల్వే ప్రవేశపెట్టింది. దీంతో వాటిల్లో కేవలం చైర్ కార్ మాత్రమే ఉండేది. సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వేగంతోనే వాటిని నడిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి నడిచే సూపర్ ఫాస్ట్ రైళ్లకు దాదాపు 11 గంటల ప్రయాణ సమయం పడుతోంది. రాత్రి వేళ కావటంతో సూపర్ ఫాస్ట్ రైళ్లలో ప్రయాణికులు పడుకుని ప్రయాణిస్తుండటంతో వారికి పగటి సమయం వృథా కావటం లేదు. కానీ, డబుల్ డెక్కర్ రైళ్లలో పగటి వేళ అన్ని గంటలు ప్రయాణించాల్సి రావటంతో ప్రయాణికులకు ఒక రోజు సమయం వృథా అయ్యేది. డబుల్ డెక్కర్ రైళ్లు ప్రారంభమైన కొత్తలోనే సికింద్రాబాద్–తిరుపతి, సికింద్రాబాద్–విశాఖపట్నం మధ్య ప్రవేశపెట్టారు. ఈ రెండు ప్రాంతాలకు వెళ్లే వారు పగటి సమయం మొత్తం రైళ్లలోనే గడపటంతో ఒక రోజు మొత్తం వృథా అయినట్టుగా భావించేవారు. ఫలితంగా వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో వారం రోజుల్లోనే 14 శాతానికి చేరింది. దీంతో ఆ రెండు సర్వీసులను రైల్వే రద్దు చేసింది. ఇటీవలే వందేభారత్ రైళ్లు పట్టాలెక్కి, అదే పగటి వేళ పరుగుపెడుతున్నా కిక్కిరిసిపోతున్నాయి. వాటి ఆక్యుపెన్సీ రేషియో 110 శాతం నుంచి 120 శాతంగా ఉంటోంది. వీటి వేగం ఎక్కువ కావటంతో, తక్కువ సమయంలోనే గమ్యం చేరుతున్నాయి. కానీ, వందేభారత్ తరహా లో అన్ని మార్గాల్లో డబుల్ డెక్కర్ రైళ్ల వేగా న్ని పెంచటం సాధ్యం కాదు. దీంతో వాటిల్లో బెర్తులు ప్రవేశపెట్టి రాత్రి వేళ తిప్పే యోచనలో రైల్వే ఉంది. ప్రయాణికులతోపాటు సరుకులు కూడా.. ఇక పైడెక్‌లో ప్రయాణికులు, దిగువ డెక్‌లో సరుకులను ఏకకాలంలో తరలించే ప్యాసింజర్ కమ్ గూడ్స్ నమూనాలో కూడా డబుల్ డెక్కర్ రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే భావిస్తోందని సమాచారం. దీనికి సంబంధించి డిజైన్లను రైల్వే అనుబంధం సంస్థ ఆర్డీఎస్ఓ పరిశీలిస్తోందని ఓ అధికారి పేర్కొన్నారు. వెరసి డబుల్ డెక్కర్ రైళ్లకు మళ్లీ డిమాండ్ కల్పించాలని రైల్వే భావిస్తోంది. -
SP సుమతి గురువు ఎవరో తెలుసా..?
-
నాడే విడుదల వీర శూర సూర్యచిత్ర
ఆదిత్య ఎల్1 మిషన్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన సందడి ఆకాశంలోనే కాదు అంతర్జాలంలోనూ కనిపిస్తోంది. సూర్యుడి చుట్టూ పరిభ్రమించిన సైన్స్–ఫిక్షన్ నుంచి సినిమాల వరకు ఎన్నో విషయాలు అంతర్జాలంలో చక్కర్లు కొడుతున్నాయి. మచ్చుకు ఫేస్బుక్లో ఒక వీడియో... జర్నీ టు ది ఫార్ సైడ్ ఆఫ్ ది సన్(1969) సినిమా తాలూకు ట్రైలర్ ఇది. ‘అపోలో హ్యాజ్ కాంకర్డ్ ది మూన్’ ‘వేర్ టూ నౌ ఇన్ స్పేస్?’ టైటిల్స్‌తో ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత... ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకువెళుతుంది. ఇప్పటి సినిమాలకు ఏమాత్రం తగ్గని ఉత్కంఠ ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. ‘నాట్ ది ఎండ్’ అని ఊరిస్తూ ట్రైలర్ ముగుస్తుంది. -
నిర్మాతకు డబ్బులొస్తే చాలు: డైరెక్టర్
‘ఎంతో కష్టపడితే దర్శకుడిగా ‘’తో తొలి చాన్స్ వచ్చింది. సినిమా బ్లాక్‌బస్టర్ అయిందా లేదా అన్నది కాదు.. నిర్మాతకు డబ్బులొస్తే అదే పెద్ద సక్సెస్’’ అని సాయి సునీల్ నిమ్మల అన్నారు. యామిన్ రాజ్, విరాట్ కార్తీక్, ప్రియాంక రేవ్రి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. సాయి సునీల్ నిమ్మల దర్శకత్వంలో ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సీహెచ్ నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి అతిథులుగా హాజరైన నటులు అరవింద్ కృష్ణ, శివారెడ్డి మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్,పాటలు చాలా బాగున్నాయి. సినిమా హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమాలో ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు, డ్రామా ఉన్నాయి’’ అన్నారు యామిన్ రాజ్. -
Chandrayaan-3: జాబిల్లిపై భారత్ నడక
బెంగళూరు/న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్‌లో తయారు చేసిన ఈ రోవర్ ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం పెరుగుతుందా? చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మార్చుకొని పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ విజయం పట్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది. 26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు. మనిషి మనుగడకు అవకాశం శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్‌లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. అందుకే చంద్రయాన్–3 ల్యాండర్ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. రోవర్ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు. గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్ దిగింది. రోవర్‌లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా చేయిస్తాయని తెలిపారు. -
మూన్‌పై ల్యాండ్ ఎలా కొనాలి? ధర తక్కువే! వేద్దామా పాగా!
చంద్రయాన్-3 సాప్ట్ ల్యాండ్ అయింది. దీంతో చందమామపై మనుషులు జీవించేందుకు ఆస్కారం కలుగుతుందా? అక్కడ ల్యాండ్ ఎంత ఉంటుంది. మూన్ ఎస్టేట్, చందమామ విల్లాస్, జాబిల్లి రిసార్ట్స్ అంటూ అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారం సోషల్‌మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బాలీవుడ్హీరో షారుఖ్ ఖాన్, దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చంద్రుడిపై సైట్ కొన్నారన్న వార్తల నేపథ్యంలో మరింత చర్చ జోరుగా నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ బిజినెస్‌కు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ధనిక వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు చంద్రునిపై ప్రాపర్టీ కొన్నారు. మరికొందరు అంతరిక్షంపై వారి ఆసక్తి, అభిరుచి కారణంగా కొందరు దీనిని భవిష్యత్తు పెట్టుబడిగా భావిస్తారు. చంద్రునిపై భూమిని కొనగలరా? చంద్రునిపై భూమిని సొంతం చేసుకోవాలని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. భూమిని కొనుగోలు చేయవచ్చు,కానీ దాని యాజమాన్య హక్కులు పొంద లేరు. దానిని క్లెయిమ్ చేసుకోలేరు. దీనికి సంబంధించి 1967లో భారత్‌తో 104 దేశాలు ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడు పెద్ద దేశాలు, సోవియట్ యూనియన్, అమెరికా, యూఏ కలిసి బఔటర్ స్పేస్ ట్రీటీ అని పిలిచే అంతర్జాతీయ ఒప్పందాన్ని రూపొందించాయి. దీని ప్రకారం చందమామపై సైట్(Lunar Land Purchase)ని కొనుగోలు చేయడానికి ఒక మార్గం ఉంది. లూనార్ రిజిస్ట్రీ అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, కొనుగోలు చేయాలనుకుంటున్న ప్రాంతాన్ని ఎంచుకోవచ్చు. ఇందులో సీ ఆఫ్ ట్రాంక్విలిటీ, లేక్ ఆఫ్ డ్రీమ్స్ వంటి అనేక ప్రాంతాలుంటాయి. ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం లూనార్ ల్యాండ్ రిజిస్ట్రీ, ప్రైవేట్ యాజమాన్యం కోసం భూమిని కొనుగోలు చేయడం అసాధ్యం, చట్టవిరుద్ధం. కానీ, ది లూనార్ రిజిస్ట్రీ వంటి ఏజెన్సీలు ఇప్పటికీ ఖగోళ భూమిని విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. చంద్రునిపై ల్యాండ్ కొన్న కొందరు ప్రముఖులు చంద్రునిలోని లాకస్ ఫెలిసిటాటిస్ (ఆనంద సరస్సు) ప్రాంతంలో చంద్రునిపై ఒక ఎకరం భూమిని కొనుగోలు చేసినట్లు AIIMS జోధ్‌పూర్ నర్సింగ్ ఆఫీసర్ మీనా బిష్ణోయ్ (Meena Bishnoi) ఇద్దరు కుమార్తెల కోసం చంద్రునిపై భూమిని కొనుగోలు చేసినట్లు చెప్పారు. లూనా సొసైటీ జారీ చేసిన సర్టిఫికెట్‌ను కూడా ఆమె చూపించారు. బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) 52వ పుట్టినరోజు సందర్భంగా స్వయంగా వెల్లడించినట్టుగా ఆస్ట్రేలియాలోని ఓ అభిమాని చంద్రుడిపై ప్రాపర్టీని(Land On Moon) బహుమతిగా ఇచ్చాడట. అలాగే అంతరిక్షం, నక్షత్రాలు, సైన్స్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్న యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్(Sushanth Singh Rajput). సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కొన్న ప్రాంతాన్ని మేర్ ముస్కోవియన్స్ లేదా 'మస్కోవి సీ' అని పిలుస్తారు.మూన్ ల్యాండ్‌ను 2018, జూన్ 25న సుశాంత్ తన పేరున రిజిస్టర్ చేయించుకున్నాడు. అలాగే సూరత్‌కి చెందిన ఒక బిజినెస్ మేన్ తన రెండేళ్ల కూతురి కోసం చంద్రుడిపై కొంత భూమిని కొనుగోలు చేశాడు. అజ్మీర్‌కు చెందిన ధర్మేంద్ర అనిజా తన వివాహ వార్షికోత్సవం సందర్బంగా తన భార్య సప్నా అనిజాకు చంద్రునిపై మూడు ఎకరాల భూమిని బహుమతిగా ఇచ్చాడు. 20 ఏళ్ల క్రితమే 5 ఎకరాలు రాజీవ్ వి బగ్ధి దాదాపు 20ఏళ్ల క్రితమే 5 ఎకరాల ప్లాట్‌ను కొనుగోలు చేయడం గమనార్హం.2003లో చంద్రునిపై ఒక ప్లాట్‌ను కేవలం 140 డాలర్లకు (సుమారు రూ. 9,500)కి కొనుగోలు చేశారు.లూనార్ రిపబ్లిక్ జారీ చేసిన అన్ని అధికారిక పత్రాలప్రకారం జూలై 27, 2003న న్యూయార్క్‌లోని లూనార్ రిజిస్ట్రీ ద్వారా 'రాజీవ్ బగ్దీ 32.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 15.6 డిగ్రీల పశ్చిమాన మారే ఇంబ్రియం (వర్షాల సముద్రం) వద్ద ఉన్న ఆస్తికి నిజమైన, చట్టపరమైన యజమాని. రేఖాంశ ట్రాక్ -30'. అంతేకాదు 2030 నాటికి మూన్ టూరిజం ప్రారంభమవుతుందని బగ్ది ఆశాభావం వ్యక్తం చేశారు. -
చంద్రయాన్‌పై కార్పొరేట్ల హర్షం.. ఎవరేమన్నారంటే..
చంద్రయాన్–3 విజయవంతం కావడంపై పలువురు కార్పొరేట్లు హర్షం వ్యక్తం చేశారు. చంద్రయాన్ టీమ్‌ను ప్రశంసించారు. గర్వకారణం... ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణం. భారత అంతరిక్ష, సాంకేతిక ప్రయాణంలో ఒక కీలక మైలురాయి. ప్రధాని నరేంద్ర మోదీకి, ఇస్రో బృందానికి శుభాభినందనలు. రాబోయే తరాలకు ఇది ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. – ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ చైర్మన్ సామర్థ్యానికి నిదర్శనం ఇస్రో, భారత సైంటిస్టులు అందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. అంతరిక్ష పరిశోధనలో భారతదేశ సామర్థ్యాలకు ఈ విజయం ఒక నిదర్శనం. ఈ అపూర్వ ఘట్టంలో భాగం కావడం మాకెంతో గర్వకారణం. – ఎస్ఎన్ సుబ్రమణ్యన్, ఎల్అండ్టీ సీఈవో జాబిల్లి చేతికి అందింది మానవ జాతి ఆరంభం నుంచి చంద్రుడిని చూస్తూ కలలు కంటూనే ఉంది. చందమామ తన మాయా జాలంతో మనల్ని స్వాప్నికులుగా మార్చింది. నేడు ఆ మాయ, సైన్స్ కలిసి జాబిల్లిని మన చేతికి అందించాయి. – ఆనంద్ మహీంద్రా, పారిశ్రామిక దిగ్గజం చారిత్రక క్షణం ఇస్రో బృందానికి అభినందనలు. మీరు దేశానికి గర్వకారణం. అంతరిక్ష పరిశోధనలను విజయవంతంగా అమలు చేయగలగడం దేశానికి తన సామర్థ్యాలపై గల నమ్మకానికి నిదర్శనం. ఇది 140 కోట్ల మంది భారతీయులకు చారిత్రక క్షణం. – గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్ అద్భుత ఘట్టం భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో ఇది మరో అద్భుత ఘట్టం.. మన అంతరిక్ష పరిశ్రమ సామర్థ్యాలకు నిదర్శనం. మూడు దశాబ్దాలుగా భారతీయ స్పేస్ ప్రోగ్రామ్‌తో అనుబంధం కలిగి ఉండటం మాకు గర్వకారణం. – పర్వత్ శ్రీనివాస్ రెడ్డి, ఎంటార్ టెక్నాలజీస్ ఎండీ ఇదీ చదవండి: చంద్రయాన్-3 విజయం: ఈ కంపెనీలకు భాగస్వామ్యం -
Chandrayaan 3: భూమిపై సంకల్పం.. జాబిల్లిపై సాకారం
న్యూఢిల్లీ: చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతం కావడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి అభినందనలు తెలియజేశారు. భారత జాతీయ పతాకాన్ని రెపరెపలాడిస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇప్పుడు చంద్రుడిపై భారత్ అడుగుపెట్టిందని అన్నారు. ఇది కేవలం భారత్ విజయం కాదని చెప్పారు. ఈ ఘనత ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని చెప్పారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వెళ్లిన మోదీ బుధవారం సాయంత్రం చంద్రయాన్–3 సాఫ్ట్ ల్యాండింగ్ ప్రక్రియను టీవీలో ప్రత్యక్షంగా వీక్షించారు. ల్యాండింగ్ సకెŠస్స్ అయిన వెంటనే ఇస్రో సైంటిస్టులను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు. బ్రిక్స్ సదస్సు కోసం ప్రస్తుతం తాను దక్షిణాఫ్రికాలో ఉన్నప్పటికీ తన మనసు, ఆత్మ మొత్తం భారత్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచంలోని బలమైన జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న ఈ శుభసందర్భంలో చంద్రయాన్–3 ప్రయోగం సఫలం కావడం మరింత ఆనందాన్ని ఇస్తోందన్నారు. భూగోళంపై మనం తీసుకున్న సంకల్పం చందమామపై నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విజయం చిరస్మరణీయమని తెలిపారు. ఈ అద్భుత క్షణం శాశ్వతంగా మదిలో నిలిచిపోతుందని చెప్పారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందంటూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనయ్యారు. ఇదొక చరిత్రాత్మక సందర్భమని ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందుతున్న భారత్‌కు ఇది ప్రతీక అని చెప్పారు. కొత్త చరిత్రను భారత్ లిఖించిందని వెల్లడించారు. నవ భారతదేశంలో నూతన శిఖరాలకు చేరుకుంటున్నామని, అందుకు మనమంతా సాకు‡్ష్యలమని వివరించారు. శాస్త్రవేత్తల అంకితభావం వల్లే.. అమృతకాలంలో ఇది మొదటి విజయమని అన్నారు. ఇది అమృత వర్షమని అభివర్ణించారు. ఆకాశమే హద్దు కాదని భారత్ పదేపదే నిరూపిస్తోందని ప్రధాని మోదీ చమత్కరించారు. ఇప్పటిదాకా ఎవరూ చేరుకోని జాబిల్లి దక్షిణ ధ్రువానికి భారత్ చేరుకుందని ఉద్ఘాటించారు. మన శాస్త్రవేత్తల అంకితభావం, నైపుణ్యం వల్లే ఈ విజయం సాధ్యమైందన్నారు. చందమామకు సంబంధించిన మన ఊహాగానాలు, ప్రచారంలో ఉన్న కథలు ఇక మారుతాయని, సామెతలు కొత్త తరం కోసం కొత్త అర్థాలను వెతుక్కుంటాయని వ్యాఖ్యానించారు. భూమిని తల్లిగా, చంద్రుడిని మామగా మనం భావిస్తామని చెప్పారు. ‘చందమామ దూర్ కే’ అంటుంటామని, ఇకపై ‘చందమామ ఏక్ టూర్ కే’ అనే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని వివరించారు. తద్వారా జాబిల్లిపై పర్యటనలు త్వరలో ప్రారంభమవుతాయని పరోక్షంగా స్పష్టం చేశారు. సూర్యుడిపై పరిశోధనల కోసం ‘ఆదిత్య–ఎల్1’ ప్రయోగానికి ఇస్రో సిద్ధమవుతోందని చెప్పారు. శుక్రగ్రహంపైనా అధ్యయనం చేసే ప్రణాళిక ఉందన్నారు. అనంతరం ప్రధాని మోదీ ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్‌తో మాట్లాడారు. అభినందనలు తెలిపారు. -
Chandrayaan 3 Success Celebrations: చంద్రయాన్-3 ల్యాండింగ్ సక్సెస్‌పై అంబరాన్నంటిన సంబురాలు (ఫొటోలు)
-
చంద్రయాన్-3 సక్సెస్.. ప్రకాశ్ రాజ్‌ను ఓ రేంజ్లో ఆడేసుకుంటున్న నెటిజన్స్!
యావత్ భారత్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చంద్రయాన్-3 సక్సెస్ అయింది. ఇస్రో శాస్త్రవేత్తల అహర్నిషలు కృషి చేసిన కష్టానికి ఫలితం దక్కింది. ఆగస్టు 23, 2023 భారతదేశ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయంగా లిఖించబడింది. ఇంతటి ఘనత సాధించిన మన శాస్త్రవేత్తలను ఘనతను ప్రపంచ మొత్తం అభినందిస్తోంది. ఈ విజయం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. (ఇది చదవండి: జాబిల్లిపై ఇండియా జయకేతనం.. టాలీవుడ్ స్టార్స్ విషెస్ ) అయితే ఇంతకుముందు విక్రమ్ ల్యాండర్ గురించి నటుడు ప్రకాశ్ రాజ్ ఓ ఫోటోను ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. శాస్త్రవేత్తల మనోభావాలు దెబ్బతినేలా ఇస్రో ఛైర్మన్ ఛాయ్ పోస్తున్న ఫోటోను షేర్ చేశారు. దీనిపై పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. అంతే కాకుండా ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్ కావడంతో ప్రకాశ్ రాజ్‌పై సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. చంద్రయాన్ తీసిన ప్రకాశ్ రాజ్ ఫోటో ఇదేనంటూ.. అతను బురదలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాల్లోని ప్రకాశ్ రాజ్ క్లిప్స్‌ను షేర్ చేస్తూ నెటిజన్స్ ఆడేసుకుంటున్నారు. చంద్రయాన్-3 నుంచి రోవర్ ప్రగ్యాన్ తీసిన మొదటి చిత్రం ఇదేనంటూ నెటిజన్స్ ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇస్రో విజయం పట్ల కంగ్రాట్స్ చెబుతూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. (ఇది చదవండి: కొందరి జీవితాలు అంతే.. ప్రకాశ్ రాజ్‌కు అనుపమ్ ఖేర్ గట్టి కౌంటర్..!) Early Pictures coming in from Moon after landing of #Chandrayaan3. 🌕#justasking #PrakashRaj 😂😂 pic.twitter.com/c1pqizkNbC — Keshav Soni (@ImKeshavSoni) August 23, 2023 For Prakash Raj ji, 1 Like = 1 Slap 1 Retweet = 100 Slap#justasking pic.twitter.com/zRJkdib1bm — WTF (@WeTheFukrey) August 23, 2023 BREAKING NEWS:- First picture coming from the Moon by #VikramLander Wowww Prakash Raj #justasking pic.twitter.com/UsinHfbzlx — Kadak (@kadak_chai_) August 21, 2023 PROUD MOMENT for INDIA and to Humankind.. 🙏🏿🙏🏿🙏🏿Thank you #ISRO #Chandrayaan3 #VikramLander and to everyone who contributed to make this happen .. may this guide us to Explore and Celebrate the mystery of our UNIVERSE .. #justasking — Prakash Raj (@prakashraaj) August 23, 2023 -
ఇక జాబిల్లిపై కోట్లాది భారతీయుల కొత్త కలలు: ఆనంద్ మహీంద్ర
చంద్రయాన్-3 అఖండ విజయంపై సర్వత్రా ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఈ అద్బుత,చారిత్రక విజయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కురుస్తోంది. ఈ నేపథ్యంలో బిలియనీర్, పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. Chandrayaan-3 Mission: 'India🇮🇳, I reached my destination and you too!' : Chandrayaan-3 Chandrayaan-3 has successfully soft-landed on the moon 🌖!. Congratulations, India🇮🇳!#Chandrayaan_3#Ch3 — ISRO (@isro) August 23, 2023 మానవజాతి ప్రారంభమైనప్పటి నుండి మనం చంద్రుని వైపు చూశాం. మన మనస్సులో జాబిల్లి మాయాజాలం, స్వప్నాలు ఇక నిజం కాబోతున్నాయి. చంద్రుడిపై కలలు నేడు, మేజిక్ &సైన్స్ సమ్మిళిత కృషితో జాబిల్లి మన చేతికి చిక్కింది. ఇక 1.4 బిలియన్ల భారతీయుల మనస్సుల్లో జాబిల్లిపై సరికొత్త డ్రీమ్స్. జై హింద్! అంటూ ఆనంద్ మహీంద్ర ట్వీట్‌చేశారు. (చంద్రయాన్-3 అద్భుత విజయం! ప్రముఖుల ప్రశంసలు) ఈ మిషన్ తప్పక విజయం సాధిస్తుందని ముందే బల్లగుద్ది మరీ చెప్పిన నటుడు మాధవన్ చంద్రయాన్3 సక్సెస్‌తో ఆయన సంతోషానికి అవధుల్లేవు అంటూ మరో ట్వీట్ చేశారు. ఐఆర్సీటీసీ కూడా చంద్రయాన్-3 విజయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. కాగా అంతరిక్ష పరిశోధనలో భారత్ తన దైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్ మిషన్ చంద్రయాన్-3 విజయవంత మైం. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండ్ కావడంతో అంతర్జాతీయ ఖ్యాతిని గడించింది. From the dawn of humankind we have gazed at the moon and let it work its magic on our minds. The moon turned us into dreamers. Today, magic & science merge and having the moon in our grasp will spark new dreams in the minds of 1.4 billion Indians. Jai Hind. 🇮🇳… pic.twitter.com/I4I9vJD4WE — anand mahindra (@anandmahindra) August 23, 2023 Words are not enough to describe this achievement Jai Hind, my heart swells with pride. I hope I can stay sane.🤗🤗🙏🚀🚀🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 pic.twitter.com/2rTFpHzEWn — Ranganathan Madhavan (@ActorMadhavan) August 23, 2023 Congratulations to the entire @ISRO team for making history by successfully reaching the moon, and to continuously aiming higher and farther! 🚀🌕 #ISRO #Chandrayaan3Mission #IndiaOnTheMoon #VikramLander pic.twitter.com/bQZX02sGDz — IRCTC (@IRCTCofficial) August 23, 2023 -
60 వేలమందిలో ఒక్కడు.. 23ఏళ్లకే జాబ్ - ఫోన్ కొనలేని స్థాయి నుంచి సీజీవోగా..
మనిషి గట్టిగా అనుకోవాలే గానీ ఏదైనా సాధిస్తాడు అనటానికి మరో నిదర్శనం 23 సంవత్సరాల 'శ్వేతాంక్ పాండే' (Shwetank Pandey). ఇంతకీ ఇతడెవరు, సాధించిన విజయం ఏమిటి అనే మరిన్ని వివరాలు క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. శ్వేతాంక్ పాండేకి చిన్నప్పటి నుంచి గేమ్స్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే అతన్ని ఒక గేమింగ్ కంపెనీలో రూ.10 లక్షల ప్యాకేజీతో జాబ్ కొట్టేలా చేసింది. గేమ్స్ ఆడితే భవిష్యత్ ఉండదనే పాత కాలపు నమ్మకానికి చెక్ పెట్టి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ iQOOలో చీప్ గేమింగ్ ఆఫీసర్ (CGO)గా ఎంపికయ్యాడు. 60వేల మందికి ఒకడు.. నిజానికి శ్వేతాంక్ పాండే ఒక స్మార్ట్‌ఫోన్ కొనటానికి ఏడాదంతా ఉద్యోగం చేసినట్లు వెల్లడించాడు. అలాంటిది ఇప్పుడేకంగా మొబైల్ తయారీ కంపెనీలోనే మంచి జాబ్ కొట్టేశాడు. ఐకూలో చీప్ గేమింగ్ ఆఫీసర్ ఉద్యోగానికి 60వేల మంది పోటీ పడితే అందులో పాండే గొప్ప ప్రతిభ చూపి ఉద్యోగం కైవసం చేసుకున్నాడు. తనకు ఇష్టమైన గేమింగ్స్ ఆడటానికి ఇంట్లో వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో 12వ తరగతి చదువుకునే రోజుల్లోనే ఈ-స్పోర్ట్స్ ఆడటం మొదలుపెట్టి గ్రాడ్యుయేట్ కూడా పూర్తి చేసాడు. ఓపక్క చదువుకుంటూనే తాను అనుకునే రంగంలో ముందుకు వెళ్ళడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకున్నాడు. ఇదీ చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే కారు! అంబానీ కారు అదిరిపోలా.. చదువు పూర్తయిన తరువాత ఒక సంవత్సరం ఉద్యోగం చేసి.. తరువాత ఒక ఫోన్ కొనుగోలు చేసి అందులోనే గేమింగ్ ఆడటం మొదలుపెట్టాడు. ఇలా సాధించిన మెళకువలతోనే ఐకూలో ఉద్యోగం సాధించగలిగాడు. ఆ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడే ఫైనల్ వరకు చేరతాననే నమ్మకం ఉండేదని పాండే వెల్లడించాడు. -
మీ నవ్వులు చూడాలనుకుంటున్నా– విజయ్ దేవరకొండ
‘‘నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి నా సక్సెస్‌లో, ఫెయిల్యూర్స్‌లో ఇంత ప్రేమ ఇచ్చిన మీకు(ఫ్యాన్స్) థ్యాంక్స్. జీవితంలో చాలా మారాయి. ఎత్తు, పల్లాలు చూస్తున్నా. నా చుట్టూ మనుషులు మారుతున్నారు.. నా గురించి ఏదో మాట్లాడతారు. కానీ, మీ (ఫ్యాన్స్) ప్రేమ స్థిరంగా ఉంటుంది.. అందుకే సెప్టెంబర్ 1న మీ మొహాల్లో నవ్వులు చూడాలనుకుంటున్నా’’ అని హీరో విజయ్ దేవరకొండ అన్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన ‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’ లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ–‘‘నీ మొహంలో నవ్వు చూడాలని మాత్రమే పనిచేస్తున్నా’ అంటూ గత నెల రోజులుగా చెబుతున్నాడు శివ నిర్వాణ. నాక్కూడా నవ్వులు చూడాలని ఉంది. కానీ, నాకంటే ఎక్కువగా సమంత మొహంలో నవ్వులు చూడాలని ఉంది. తను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడింది. అలాగే శివ నిర్వాణలోనూ నవ్వులు చూడాలనుంది’’ అన్నారు. సమంత మాట్లాడుతూ–‘‘మీ కోసం(అభిమానులు, ప్రేక్షకులు) కష్టపడుతున్నాను.. తిరిగి ఆరోగ్యంగా వస్తాను.. ‘ఖుషి’తో బ్లాక్ బస్టర్ ఇస్తానని మీకు మాట ఇస్తున్నాను’’ అన్నారు. శివ నిర్వాణ మాట్లాడుతూ–‘‘ఖుషి’ చూస్తే మీకు(ప్రేక్షకులు) విజయ్, సమంత కనిపించరు.. విప్లవ్, ఆరాధ్య మాత్రమే కనిపిస్తారు. సినిమా చూసి బయటికెళ్లేటప్పుడు ఈ మూవీని మరోసారి చూద్దామనిపిస్తుంది’’ అన్నారు. ‘‘డియర్ కామ్రేడ్’ మేము అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ‘ఖుషి’ పెద్ద హిట్ కాబోతోంది’’ అన్నారు నవీన్ యెర్నేని. ‘‘శివ నిర్వాణతో మా బ్యానర్లో మరో సినిమా చేయనున్నాం’’ అన్నారు వై.రవిశంకర్. ‘‘ఖుషి మ్యూజికల్ కన్సర్ట్’కి విచ్చేసిన విజయ్, సమంతలకి థ్యాంక్స్. ఈ వేడుకని గ్రాండ్‌గా చేసేందుకు సహకారం అందించిన నవీన్, రవిశంకర్, దినేశ్గార్లకు కృతజ్ఞతలు’’ అన్నారు చిత్ర సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్. ఈ కార్యక్రమంలో మైత్రీ మూవీస్ సీఈవో చెర్రీ, కెమెరామేన్ జి.మురళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి తదితరులు పాల్గొన్నారు. -
తప్పులు చేయకపోతే...???
సర్వసాధారణంగా లోకంలో ..ఎవరయినా విజయం సాధిస్తే..దానికి వారు ఎంత కష్టపడిందీ పదేపదే చెప్పుకుని పొంగిపోతుంటారు. అది సహజం కూడా. కానీ అపజయం ఎదురయితే మాత్రం... ‘మనం చేయాల్సింది చేశాం కానీ ఫలితం లేకపోయింది’ అంటారు.. అంటే విజయం అయితే తన స్వంతం. అదే వైఫల్యం చెందితే అందరినీ కలుపుకుంటారు. తన వైఫల్యాన్ని అంగీకరించరు..ఇది కూడా ఎక్కువగా చూస్తుంటాం. కానీ విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ విజేత, రామన్ ఎఫెక్ట్ సష్టికర్త సర్ సివి రామన్ ఏమంటారంటే... ‘‘ఎక్కడ నేను వైఫల్యం చెందానో దానికి యజమానిని నేను. నేనే కర్తను, నేనే భోక్తను, నేనే దానికి పూర్తిగా బాధ్యుణ్ణి. అసలు నేను వైఫల్యం చెందకపోతే .. నేను నేర్చుకోవడం ఎలా సాధ్యపడుతుంది!!!’’– అని. దిద్దుకుందామన్న స్పృహ లేకపోతే దోషం కానీ, దిద్దుకోవడానికి సిద్ధంగా ఉండి.. తాను పొందిన వైఫల్యాలను అనుభవంగా స్వీకరించి, అది నేర్పిన పాఠాలతో మరింత జాగ్రత్తగా తమ ప్రయత్నాలను కొనసాగిస్తానంటే... ఇక సమస్యే ముంది!!! నిజానికి అందరిలో ఉండాల్సిన లక్షణం అది. సుందరకాండలో స్వామి హనుమ... ‘‘నాలుగు అంగుళాలు కూడా వదలకుండా లంకా పట్టణమంతా గాలించేసాను. సీతమ్మ కనబడలేదు. అంటే సీతమ్మ ఇక్కడ లేదేమో.. సీతమ్మ క్షేమ సమాచారం లేకుండా నేను తిరిగి వెడితే..అక్కడ రాముడు శరీరం వదిలేస్తాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, కోసల రాజ్య ప్రజలు, వానర రాజ్యంలో ఉన్నవాళ్ళు...అందరూ హతాశులైపోతారు. నేను వెళ్ళి సీతమ్మ సమాచారం దొరకలేదని చెప్పి ఇంతమందిని బాధపెట్టడం కంటే ఈ సముద్రపు ఒడ్డున కూర్చుని ప్రాయోపవేశం చేస్తాను. శరీరం వదిలేస్తాను’’ అన్నాడు... హనుమ అంత బలశాలి లంకంతా వెతికి సీతమ్మజాడ తెలియకపోతే... ఎంత నిరాశ, ఎంత నిస్పృహæ... అది కొద్దిసేపే... వెంటనే తన బాధ్యతలను గుర్తు చేసుకున్నాడు.. ‘అసలు మనిషికి శోకం పొందకుండా ఉండడం, బాధ పడకుండా ఉండడం, వైఫల్యానికి బాధపడినా దాన్ని విడిచి మళ్లీ... దిద్దుకుని ఉత్సాహం పొంది ఎక్కడ వైఫల్యం చెందాడో అక్కడ తిరిగి విజయం అందుకోవడానికి సాధన మొదలుపెట్టడం ముఖ్యం’ అనుకున్నాడు. ఎక్కడ వస్తువు పోగొట్టుకున్నామో అక్కడ వెతికితే ఫలితం... ఎక్కడ వైఫల్యం చెందామో అక్కడ విజయం సాధిస్తే అది ఇచ్చే తృప్తి, అది నేర్పిన పాఠం, అది నేర్పిన అనుభవం ఎప్పటికీ గుర్తుండిపోతాయి... అటువంటి పరిస్థితులు ఎదురయినప్పుడు మరింత స్ఫూర్తినిస్తాయి... అన్న వివేకం మనల్ని ముందుకు నడిపించడమే గాక మరిన్ని విజయాలను రుచి చూపిస్తుంది. అంతే తప్ప నేనేది చేసినా ఇంతే... అయినా నాకా శక్తి ఎక్కడిది.. అని నిరాశపడితే జీవితం ముందుకు కదలదు. మేడమీద ఉన్న కిటికీలోంచి ఇద్దరు వ్యక్తులు బయటికి చూస్తే... ఒకడికి కింద ఉన్న బురదనేల, మురికి కనిపించి నిరాశ పరిస్తే.. మరొకడికి ఆకాశంలో నక్షత్రాలు, చంద్రుడు, వెలుగులు కనిపించి మురిపిస్తాయి. వాళ్ళ దక్పథాల్లోనే తేడా.. ఆశావాదం ఉన్న వాళ్లు జీవితంలో వృద్ధిలోకి వస్తారు... నిరాశావాదులు నిరాశను ప్రయత్నపూర్వకంగా వదిలించుకోవాలి. రామన్ చెప్పినట్లు వైఫల్యాలను మనసారా అంగీకరిస్తే... అది మనల్ని ఎన్నటికీ నిరాశపరచకపోగా... కొత్త శక్తినిస్తుంది. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
JioBharat phone: సక్సెస్‌ను పట్టేసిన అంబానీ.. ఇక దూకుడే..
ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 17.69 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌తో భారతదేశపు అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. అనేక రంగాల్లో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తోంది. భారత టెలికాం పరిశ్రమలో అత్యధిక మార్కెట్ వాటాతో తిరుగులేని సంస్థగా ఉన్న రిలయన్స్ జియో బ్రాండ్ గత కొన్నేళ్లుగా అనేక ఉత్పత్తులను భారతీయ మార్కెట్‌కు సరసమైన ధరతో అందిస్తోంది. అందులో భాగంగా ఇటీవలే జియో భారత్ వీ2 (JioBharat V2) ఫోన్‌ను విడుదల చేసింది. దీని ధర రూ.999 మాత్రమే. భారతదేశంలో ఇంటర్నెట్ కలిగిన అత్యంత చవకైన ఫోన్ ఇదే. మరిన్ని ఫోన్ల ఉత్పత్తి.. ట్రయల్ దశలో రూ.99 కోట్ల విలువైన 10 లక్షల ఫోన్లను మాత్రమే రిలయన్స్ జియో విక్రయానికి ఉంచింది. ఈ ఫోన్లన్నీ అమ్ముడుపోయిన తర్వాత మరిన్ని జియో భారత్‌వీ2 ఫోన్లను తయారు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసిన తర్వాత రిలయన్స్ జియో ‘జియో భారత్’ ఫోన్ల అమ్మకాల్లో పురోగతిని గమనించిందని, 10 లక్షల ఫోన్ల విక్రయాల ట్రయల్ పూర్తవ్వగానే ఈ ఫోన్ల ఉత్పత్తిని మరింత పెంచేందుకు సిద్ధమైందని బ్రోకరేజ్ సంస్థ బీఎన్పీ పారిబాస్ ఓ నివేదికలో పేర్కొంది. జియో భారత్ వీ2 ఫోన్లలో 1.77 అంగుళాల QVGA TFT స్క్రీన్, 1000mAh రిమూవబుల్ బ్యాటరీ ప్రధాన ఫీచర్లు. ఇంకా ఇందులో జియో సినిమా, తాజా వెబ్ సిరీస్‌లు, బ్లాక్‌బస్టర్ సినిమాలు, హెచ్‌బీఓ ఒరిజినల్స్, స్పోర్ట్స్ కంటెంట్ టీవీ షోలతో సహా విస్తారమైన నాన్-స్టాప్ వినోదాన్ని అందించే యాప్ ప్రధానంగా ఉంటుంది. అలాగే ప్రముఖ ఉచిత మ్యూజిక్ యాప్ జియో సావన్, జియో ప్లే వంటివి కూడా ఉన్నాయి. ఇదీ చదవండి: Nokia 110 4G/2G: నోకియా చిన్న ఫోన్ రూ. 1,699లకే.. యూపీఐ పేమెంట్లూ చేసుకోవచ్చు! ప్రస్తుతానికి కార్బన్ కంపెనీ భాగస్వామ్యంతో జియో భారత్ వీ2 ఫోన్లను రిలయన్స్ జియో ఉత్పత్తి చేస్తోంది. ఇందు కోసం రానున్న రోజుల్లో ఇతర కంపెనీలూ రిలయన్స్ జియోతో జత కలిసే అవకాశం ఉంది. అతి తక్కువ ధరతోపాటు ఈ ఫోన్ కోసం రిలయన్స్ సరసమైన డేటా ప్లాన్లను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జయహో! రాకెట్ వుమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్
చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. శుక్రవారం (జూలై 14) మధ్యాహ్నం 2.35 గంటలకు శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 తొలిదశ విజయవంతమైంది. అత్యంత ప్రతిష్టాత్మక మూన్ మిషన్‌కు చంద్రయాన్-3ని చేరువ చేసేందుకుద్దేశించిన బాహుబలి రాకెట్ మొత్తం మూడు దశలనూ దాటుకుని రాకెట్ కక్ష్యలోకి దూసుకెళ్లింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఘనత, శాస్త్రవేత్తలపై అభినందలు ప్రకటించారు. (తొలి కంప్యూటర్ అందించిన టెక్ దిగ్గజం, బిలియనీర్ ఎవరో తెలుసా? ) ప్రపల్షన్ మాడ్యూల్ రాకెట్ నుంచి విడిపోయి,చంద్రయాన్ 3 ఉపగ్రహం చంద్రుడి వైపుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ శుక్రవారం ప్రకటించారు. చంద్రయాన్-3 ని ఎల్వీఎం 3 రాకెట్ ద్వారా భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టామంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. 24 రోజుల పాటు ఇది భూమి చుట్టూ ప్రదక్షిణలు చేయనుంది. ఆగస్టు 23 లేదా 24 న చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుందని ఇస్రో అంచనా వేస్తోంది. మరోవైపు ఈకీలక ప్రయోగం వెనుక ఉన్న కీలక శక్తి ఒక మహిళగా ఉండటం విశేషంగా నిలుస్తోంది. యూపీలో లక్నోలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. స్పేస్ పట్ల అభిరుచి, అంతరిక్ష కార్యకలాపాలకు సంబంధించిన వార్తా కథనాలను సేకరించే ఆసక్తి, వీటన్నింటికీ సవాల్‌ను స్వీకరించే నైజం ఆమెను విజయ తీరాలను చేర్చింది. చిన్న వయస్సులోనే అంతరిక్ష శాస్త్రంపై ఉన్న మక్కువ నవంబర్ 1997లో ఇస్రోలో చేరడంతో ఆమె కల నెర వేరింది. తాజా విజయంతో యావద్దేశం గర్వపడేలా చేశారు. సంబరాల్లో కుటుంబం: చంద్రయాన్ 2 ప్రాజెక్టు సఫలం కావడంతో రీతు కరిధాల్ కుటుంబం సంబరాల్లో మునిగిపోయింది. ఈ ఆనంద క్షణాలను స్వీట్లు పంచుతూ సెలబ్రేట్ చేసుకుంది. ఇది చాలా సంతోషకరమైన క్షణం, సోదరిని చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ రీతూ కరిధాల్ సోదరుడు రోహిత్ కరిధాల్ ఆనందాన్ని ప్రకటించారు. (DelhiFloods: మూడు రోజుల్లో రూ.200కోట్లు నష్టం, ఇండస్ట్రీ కీలకహెచ్చరికలు) #WATCH | Lucknow: Chandrayaan-3 mission director Ritu Karidhal's family celebrates, and distributes sweets as ISRO's LVM3 M4 vehicle successfully launched it into orbit. Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. pic.twitter.com/qcalBIjjN7 — ANI (@ANI) July 14, 2023 #WATCH |ISRO chief S Somanath and the team behind #Chandrayaan3 share their delight after the LVM3 M4 vehicle successfully launched it into orbit. "Chandrayaan-3, in its precise orbit, has begun its journey to the Moon. Health of the Spacecraft is normal," says ISRO. pic.twitter.com/cRlegcsgHI — ANI (@ANI) July 14, 2023 రాకెట్ విమన్ ఆఫ్ ఇండియా రీతు కరిధాల్ శ్రీవాస్తవ, ఇంట్రస్టింగ్ సంగతులు ⇒ చంద్రయాన్ 3 మిషన్‌కు ఇస్రో శాస్త్రవేత్త , లక్నోకుచెందిన రీతూ కరిధాల్ శ్రీవాస్తవ నాయకత్వం వహించారు. ⇒ చిన్నప్పటినుంచి అంతరిక్షం అంటే ఆసక్తి, పలు నేషనల్, ఇంటర్నేషనల్ జర్నల్స్ లో ఆమె 20కి పైగా పేపర్స్ ను పబ్లిష్ చేశారు. ⇒ ఇస్రో వర్గాల్లో రాకెట్ విమన్ ఆఫ్ ఇండియాగాపాపులర్ లక్నో యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో ఎంఎస్సీ చేశారు. ఆ తర్వాత బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ ⇒ రీతూ 1997 నుండి ISROలో పని చేస్తున్నారు. ⇒ చంద్రయాన్- 2 ప్రాజెక్టుకు మిషన్ డైరెక్టర్ కూడా ⇒ మంగళ్ యాన్’ప్రాజెక్టుకు డిప్యూటీ ఆపరేషన్స్ డైరెక్టర్‌గా సేవలు. ⇒ మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చేతుల మీదుగా ‘ ఇస్రో యంగ్ సైంటిస్ట్’ అవార్డు ⇒ మంగళయాన్ ప్రాజెక్టు కోసం చేసిన కృషికి గానూ 2015 లో ఇస్రో టీమ్ అవార్డ్ ⇒ 2017లో విమన్ అచీవర్స్ ఇన్ ఏరోస్పేస్ పురస్కారం ⇒ కరిధాల్‌కు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
నింగిలోకి చంద్రయాన్.. ఇస్రో శాస్త్రవేత్తల సంబరాలు
-
11 ఏళ్లకే రూ.72 కోట్లకు యజమాని.. బిజినెస్‌లో సక్సెస్.. లైఫ్ ఎంజాయ్ చేస్తూ..
సాధారణంగా 11 ఏళ్ల చిన్నారులు వీడియో గేమ్స్ ఆడటం, చదువుకోవడం లేదా ఏదో ఒకటి తింటూ కనిపిస్తారు. అయితే ఆ చిన్నారి వీరందరికీ భిన్నంగా ధనవంతుల మాదిరిగా విదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ చిన్నారి కోట్లకు అధిపతి. వ్యాపారంలో విజయం సాధించింది. ఈ చిన్నారి పేరు పీక్సీ కర్టీస్. ఆమె స్థాపించిన కంపెనీ పీక్సీ ఫిడ్గెట్స్.. పిల్లల బొమ్మలను, దుస్తులను విక్రయిస్తుంటుంది. పీక్సీ చైల్డ్ ఇన్ఫ్లుయెన్సర్గానూ పేరు పొందింది. ఆ చిన్నారి సోషల్ మీడియా అకౌంట్‌ను ఆమె తల్లి రాక్సీ హ్యాండిల్ చేస్తుంటుంది. ది సన్ రిపోర్టును అనుసరించి పీక్సీ రూ. 72 కోట్లకుపైగా ఆస్తికి యజమాని. ఆ చిన్నారి తన 15 ఏళ్లకే రిటైర్మెంట్ తీసుకుంది. యూరప్‌కు ప్రైవేట్ జెట్‌లో విహారయాత్రలు చేసేందుకు వెళ్లింది. పెద్దవారి మాదిరిగా చర్మ సౌందర్యం కోసం అనేక ట్రీట్మెంట్లు తీసుకుంటోంది. ఆమె దగ్గర పలు లగ్జరీ వాహనాలు ఉన్నాయి. పీక్సీ ఇన్‌స్టాగ్రామ్‌కు 1,36,000కు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. పీక్సీ తల్లి కూడా ఇదేవిధమైన లగ్జరీ లైఫ్ గడుపుతోంది. ఆమె తన కుమార్తె కోసం 193,000 పౌండ్లు (సుమారు రెండు కోట్లు) వెచ్చించి కార్లు కొనుగోలు చేసింది. వీటిలో 43 వేల పౌండ్లు(సుమారు 44 లక్షలు) విలువైన మెర్సిడీస్ బెంజ్ కారు కూడా ఉంది. రాక్సీ తన కుమార్తె గురించి మాట్లాడుతూ తన కుమార్తె అన్ని పనులకు ఈ కార్లను వాడదని, తన సోదరునితో పాటు స్కూలుకు వెళ్లేందుకు, ఇతర ముఖ్యమైన పనుల కోసం మాత్రమే ఈ కార్లను వాడుతుందని తెలిపారు. సోషల్ మీడియాలో పీక్సీ గురించిన కథలనాలను చూసిన యూజర్స్ పలు విధాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ ఆ చిన్నారి ఎప్పుడూ ఫోను చూస్తూనే కనిపిస్తుందని అన్నారు. మరో యూజర్ 11 ఏళ్ల చిన్నారికి ఇంజక్షన్ ప్లాంపర్ అవసరం ఏముందని, ఆమె పెద్ద అయ్యాక అందం కోసం వివిధ థెరపీలు చేయించాల్సి ఉంటుందన్నారు. ఇంకొక యూజర్ 11 ఏళ్ల చిన్నారికి 3 వేల డాలర్ల విలువైన బ్యాగ్ ఇవ్వడం తగినది కాదన్నారు. ఇది కూడా చదవండి: సముద్రంలో పర్యాటకుల సయ్యాటలు.. సడన్‌గా షార్క్ దూసుకురావడంతో.. -
ఆదిపురుష్ మూవీ సక్సెస్ సెలెబ్రేషన్స్ (ఫోటోలు)
-
'నా సక్సెస్‌లో సగం క్రెడిట్ కేన్మామదే'
ఐపీఎల్ 16వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ ప్లేయర్ సాయి సుదర్శన్ ఒక సంచలనం. ముఖ్యంగా సీఎస్కేతో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో సాయి సుదర్శన్ 47 బంతుల్లోనే 96 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకముందు ముంబై ఇండినయ్స్తో జరిగిన క్వాలిఫయర్-2లోనూ 43 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్లో ఆడే అవకాశం తక్కువగా వచ్చినప్పటికి అందివచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకున్నాడు సాయి సుదర్శన్. ఓవరాల్‌గా ఈ సీజన్లో సాయి సుదర్శన్ 8 ఇన్నింగ్స్‌లు ఆడి 362 పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్(టీఎన్ఎపీల్ 2023)లో బిజీగా ఉన్న సాయి సుదర్శన్ పీటీఐకి ఇంటర్య్వూ ఇచ్చాడు. తన సక్సెస్‌లో సగం క్రెడిట్ న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌దే అని తెలిపాడు. ఇక కేన్ విలియమ్సన్ ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అయితే సీజన్లో తొలి మ్యాచ్‌లోనే గాయపడిన కేన్ విలియమ్సన్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ''నా షాట్ల ఎంపికలో కొత్తదనం కనిపిస్తుంటే అది కేన్ విలియమ్స్‌న్ వల్లే. గాయంతో కేవలం ఒక్క మ్యాచ్‌కు మాత్రమే పరిమితమయి స్వదేశానికి వెళ్లినప్పటికి కేన్ మామతో నిత్యం టచ్‌లో ఉన్నా. బ్యాటింగ్‌లో టిప్స్‌తో పాటు కొంత ఫీడ్‌బ్యాక్ ఇచ్చేవాడు. అంతేకాదు ఒక గేమ్‌లో ఇన్నింగ్స్ డీప్‌గా ఎలా ఆడాలనేదానిపై.. లిమిటేషన్స్ లేకుండా ఆటపై పట్టు ఎలా సాధించాలనే దానిపై సూచనలు ఇచ్చాడు. ఐపీఎల్ 2023 సీజన్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సమయంలో అతను ఎంపిక చేసుకున్న షాట్స్‌ను గమనించేవాడిని. అతను మూడు ఫార్మాట్లలోనూ ఆడగల సమర్థుడు. అలాంటి ప్లేయర్ నుంచి బ్యాటింగ్‌లో బెటర్‌గా ఆడడం ఎలా అని నేర్చుకోవడం నాకు పెద్ద విషయం. ఇక మాథ్యూ వేడ్ పాడిల్, స్కూప్ షాట్స్ ఎలా ఆడాలో నేర్పించాడు.'' అంటూ తెలిపాడు. Sai Sudharsan said, "even when Kane Williamson left Gujarat Titans after injury, he was in regular touch with me, providing valuable feedback. He was telling me how to take the game deeper and how to maximise our abilities with our limitations". (To Indian Express). pic.twitter.com/1TjCD0pGqf — Mufaddal Vohra (@mufaddal_vohra) June 14, 2023 చదవండి: కౌంటీల్లో సరికొత్త చరిత్ర.. 501 పరుగుల టార్గెట్‌ను ఊదేశారు 'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే? -
NEET UG Topper: ‘సార్’ కలను సాకారం చేసిన చదువుల తల్లి
స్కూలు రోజుల నుంచే మిస్బాహ్ చదువులో ఎంతో చురుకు. 10 వ తరగతిలో 92 శాతం మార్కులు తెచ్చుకుంది. 12 వ తరగతి బోర్డు పరీక్షలో 86 శాతం మార్కులు దక్కించుకుంది. ఆమె తండ్రి కుటుంబ పోషణకు టైర్ల పంక్చర్ దుకాణాన్ని నడుపుతున్నాడు. NEET UG Topper: మహారాష్ట్రలోని జాల్నా పట్టణంలో పంక్చర్ దుకాణం నడుపుతున్న అన్వర్ ఖాన్ కుమార్తె మిస్బాహ్ NEET UG పరీక్ష క్రాక్ చేసి కుటుంబంలో అవధులు లేని ఆనందాన్ని నింపింది. మిస్బాహ్ నీట్ పరీక్షలో 720 మార్కులకు 633 స్కోర్‌తో విజయం సాధించింది. ఈ విషయం తెలియగానే జాల్నా పట్టణంలోని వారంతా ఆమెను అభినందనల్లో ముంచెత్తుతున్నారు. మిస్బాహ్ ఇంటి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. తండ్రి అన్వర్ ఖాన్ మోటార్‌సైకిళ్లకు పంక్చర్లు వేస్తూ, కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటి పరిస్థితులు బాగోలేకపోయినా తనకుమార్తె ఎంతో శ్రమించి, రెండవ ప్రయత్నంలోనే నీట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిందని అన్నారు. ఇప్పుడు తన కుమార్తె ఎంబీబీఎస్ చేయాలనే కలను సాకారం చేసుకుంటున్నదన్నారు. నీట్ పరీక్షలో తమ కుమార్తె విజయం సాధించడంతో ఆ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. ఈ సందర్భంగా తండ్రి అన్వర్ ఖాన్ మాట్లాడుతూ ‘ఒకవేళ అంకుశ్ సార్ మార్గదర్శకత్వం లేకుంటే మిస్బాహ్ ఈ విజయాన్ని సాధించలేకపోయేది. గడచిన రెండు మూడేళ్లుగా తన కుమార్తె పట్టణంలోని అంకుశ్ సార్ దగ్గర ఉచితంగా నీట్ క్లాసులకు హాజరవుతోంది. దీనికితోడు ఎంతో కష్టపడి చదవడంతో తన కుమార్తె పట్టణం నుంచి నీట్ పరీక్షలో టాపర్‌గా నిలిచిందని’ అన్నారు. జాల్నాలో నీట్ పరీక్షకు శిక్షణ అందిస్తున్న అంకుశ్ సార్ మీడియాతో మాట్లాడుతూ ‘ మేము విద్యార్థులు కోసం ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. దీనిలో భాగంగా పేద విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ అందిస్తున్నాం. దీనిలో మిస్బాహ్ ఉచిత కోచింగ్ తీసుకుంది. ఇప్పుడు మా కృషికి తగిన ఫలితం దక్కినట్లు అనిపించింది’ అని అన్నారు. మిస్బాహ్ మీడియాతో మాట్లాడుతూ ‘ఇంటిలోని ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. అయినా పగలనక, రాత్రనక కష్టపడి చదివాను. ఓటమిని ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఎంబీబీఎస్ డాక్టర్‌గా పేదలకు వైద్య సేవలు అందిస్తాను’ అని తెలిపింది. ఇది కూడా చదవండి: అటు అండమాన్.. ఇటు దుబాయ్.. ఎక్కడికి వెళ్లడం సులభం? -
పాతవి అమ్ముతూ కోట్లు సంపాదిస్తున్నాడు
-
కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!
Minu Margeret success story: సక్సెస్ సాధించడం అంటే మాటల్లో చెప్పుకున్నంత ఈజీ అయితే కాదు. కఠోర శ్రమ, నిరంతర కృషి, అకుంఠిత దీక్ష చాలా అవసరం. ఇవన్నీ ఎవరైతే తు.చ తప్పకుండా పాటిస్తారో వారికి విజయం లభిస్తుంది. అలా కస్టపడి సక్సెస్ సాధించిన వారిలో ఒకరు 'మిను మార్గరెట్' (Minu Margeret). ఇంతకీ ఈమె సాధించిన సక్సెస్ ఏంటి? కంపెనీ టర్నోవర్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బెంగళూరుకు చెందిన మిను మార్గరెట్ బిజినెస్ ప్రారంభించడానికి ముందు విప్రో, గోల్డ్‌మేన్ శాక్స్ వంటి కంపెనీలలో పనిచేసింది. స్వతహాగా ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉన్న ఈమె ఉద్యోగం చేయడానికి పెద్దగా ఆసక్తి చూపేది కాదు. ఈ కారణంగానే 2020లో బ్లిస్‌క్లబ్ (BlissClub) అనే కంపెనీని ప్రారంభించింది. రెండు సార్లు ఫెయిల్యూర్.. ఈ బ్లిస్‌క్లబ్ సంస్థను ప్రారంభించడానికి ముందు ఈమె 'రెంట్ యువర్ వార్డ్రోబ్' పేరుతో అమెరికాకు చెందిన రెంట్ ది రన్‌వే సంస్థ స్ఫూర్తితో దుస్తులను అద్దెకు ఇచ్చే కంపెనీని ప్రారంభించింది. ఇది ఆశించినంత విజయం సాధించకపోవడంతో కొన్ని రోజులకే మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ తరువాత ఆటోమేటెడ్ లాండ్రోమేట్ అనే బిజినెస్ స్టార్ట్ చేసి అది కూడా అతి తక్కువ కాలంలోనే నిలిపివేసింది. రెండు సార్లు అనుకున్న సక్సెస్ పొందకపోవడంతో ఏ మాత్రం నిరాశ చెందకుండా 2020లో బ్లిస్‌క్లబ్ ప్రారంభించి.. కేవలం ఒక సంవత్సరం వ్యవధిలోనే రూ. 18 కోట్ల కంటే ఎక్కువ ఆదాయం పొందగలిగింది. (ఇదీ చదవండి: బ్యాంక్ జాబ్ వదిలి బెల్లం బిజినెస్.. రూ. 2 కోట్ల టర్నోవర్!) మిను మార్గరెట్ బెంగళూరులోని క్రైస్ట్ యూనివర్శిటీలో బి.కామ్ పూర్తి చేసి, ఆ తర్వాత యూకేలో చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్స్ నుంచి CA చేసింది. ఆ తరువాత కాలంలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) నుంచి మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో మేజర్స్ పూర్తి చేసింది. (ఇదీ చదవండి: చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్) ఎంబీఏ పూర్తి చేసిన తరువాత మహిళల కోసం యాక్టివ్‌వేర్ బ్రాండ్‌ను ప్రారంభించాలని భావించింది. ఆమె కాలేజీ రోజుల్లోనే అల్టిమేట్ ఫ్రిస్బీ ఆడేది, కావున చురుకైన జీవనశైలి ఉన్న మహిళలు ఏమి కోరుకుంటున్నారో ఆమెకు బాగా తెలుసు. మహిళలకు అవసరమైన దుస్తులను దుస్తులను అందించడానికి ఈ కంపెనీ ప్రారంభించింది. ఈ కంపెనీ ఉన్నతికి చాలామంది సహకరించినట్లు కూడా తెలుస్తోంది. మొత్తానికి 2022 ఆర్థిక సంవత్సరంలో ఆమె ఆదాయం రూ. 36 లక్షల నుంచి రూ. 15 కోట్లకు చేరింది. కంపెనీ ప్రారంభించిన కేవలం 18 నెలలో రూ. 100 కోట్లు వార్షిక ఆదాయం గడించినట్లు సమాచారం. కంపెనీ ప్రస్తుతం 30 కంటే ఎక్కువ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు నివేదికల ద్వారా తెలిసింది. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన రెండు ఆఫ్‌లైన్ స్టోర్లు అందుబాటులో ఉన్నాయి. ఆయితే బిజినెస్ ఎక్కువగా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా జరుగుతుందని చెబుతున్నారు. ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
జయాపజయాలు
మానవ జీవితం ద్వంద్వాలమయం. కష్టసుఖాలు, కలిమిలేములు, జయాపజయాలు జీవన గమనంలో సహజ పరిణామాలు. జయాపజయాల గురించి మన సమాజంలో పట్టింపు మోతాదు కంటే ఎక్కువే! విజేతలకు వీరపూజలు చేయడం, పరాజితులను విస్మృతిలోకి తోసిపారేయడం సర్వ సాధారణం. అయితే, జయాపజయాలు దైవాధీనాలని ఆధ్యాత్మికవాదుల విశ్వాసం. ఎవరెన్ని సూక్తులు చెప్పినా, ఎవరూ గెలుపు కోసం ప్రయత్నాలను మానుకోరు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమకు గెలుపు దక్కాలనుకునే పట్టుదలతో పగ్గాలు విడిచిన గుర్రాల్లా దూసుకుపోయేవారు కొందరు ఉంటారు. గెలుపు కోసం ఎలాంటి అడ్డదారులు తొక్కడానికైనా, ఎంతటి నీచానికి దిగజారడానికైనా తెగబడేవారు ఇంకొందరు ఉంటారు. శక్తికి మించిన విజిగీషతో రగిలిపోయేవారు చరిత్రను రక్తసిక్తం చేస్తారు. అడ్డదారుల్లో పడి అడ్డదిడ్డంగా పరుగులు తీసి, అడ్డు వచ్చినవాళ్లను నిర్దాక్షిణ్యంగా తొక్కిపడేసి అందలాలెక్కుతారు. విజయోన్మత్తతను తలకెక్కించుకుని విర్రవీగుతారు. కాలం ఎప్పుడూ ఒక్కలాగానే ఉండదు. మార్పు దాని సహజ స్వభావం. కాలం మారి, పరిస్థితులు వికటించినప్పుడు విజేతలమనుకుని అంతవరకు విర్రవీగిన వారు పెనుతుపాను తాకిడికి కుప్పకూలిన తాటిచెట్లలా నేలకూలిపోతారు. మన పురా ణాల్లో దుర్యోధనుడు, మన సమీప చరిత్రలో హిట్లర్ వంటి వారు అలాంటి శాల్తీలే! ‘అజ్ఞానపు టంధయుగంలో/ తెలియని ఏ తీవ్రశక్తులో/ నడిపిస్తే నడిచి మనుష్యులు/ అంతా తమ ప్రయోజకత్వం/ తామే భువి కధినాథులమని/ స్థాపించిన సామ్రాజ్యాలూ/ నిర్మించిన కృత్రిమ చట్టాల్/ ఇతరేతర శక్తులు లేస్తే/ పడిపోయెను పేకమేడలై’ అన్నాడు మహాకవి శ్రీశ్రీ. అజ్ఞానపుటంధ యుగంలోనే కాదు, వర్తమాన అత్యాధునిక యుగంలోనూ పరిస్థితుల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. మొరటు బలం, మూర్ఖత్వం, మోసం, కుట్రలతో సాధించిన అడ్డగోలు విజయాలను తలకెక్కించుకుని, అదంతా తమ ప్రయోజకత్వంగా తలచి విర్రవీగే విజయోన్మత్తులలో దేశాధి నేతల మొదలుకొని చిల్లరమల్లర మనుషుల వరకు నేటికీ ఉన్నారు. ఇలాంటి వాళ్లలోనే దుర్యోధ నుడికి గుడి కట్టి పూజించేవాళ్లు, హిట్లర్‌ను ఆరాధించే వాళ్లు, లేని సుగుణాలను కీర్తిస్తూ నిరంకు శులకు బాకాలూదే వాళ్లు కనిపిస్తారు. గోబెల్స్‌కు బాబుల్లాంటి దుష్ప్రచార నిపుణులు నిర్విరామంగా ఊదరగొడుతూ, జీవితానికి గెలుపే పరమార్థమనే భావనకు ఆజ్యం పోస్తున్నారు. వీళ్ల ప్రభావం కారణంగానే ఓటమిని జీర్ణించుకోలేని తరం తయారవుతోంది. మనుషుల స్థితిగతులను గెలుపు ఓటములతోనే అంచనా వేయడం మన సమాజానికి అలవాటైపోయింది. గెలవాలనే ఒత్తిడి ఒకవైపు, ఓటమి భయం మరోవైపు బతుకుల్లో ప్రశాంతతను ఆవిరి చేస్తున్నాయి. పరీక్షలను ఎదుర్కొనే విద్యార్థుల నుంచి ఎన్నికలను ఎదుర్కొనే రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరికీ ఈ ఒత్తిడి తప్పడం లేదు. గెలుపు ఒత్తిడి కొందరిని మానసికంగా కుంగదీస్తుంది. ఇంకొందరిని అడ్డదారులు తొక్కిస్తుంది. సమాజంలో ప్రబలుతున్న ఈ ధోరణిని సొమ్ముచేసుకోవడానికి కొందరు మేధావి రచయితలు విజయ సోపానమార్గాలను పుస్తకాలుగా అచ్చోసి జనాల మీదకు వదులుతారు. నానావిధ ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిత్వ వికాస ప్రవచనాలతో ఊదరగొడతారు. ‘విజయానికి కావలసినది పదిశాతం ప్రేరణ, తొంభైశాతం కఠోర శ్రమ’ అన్నాడు థామస్ ఆల్వా ఎడిసన్. విద్యుత్తు బల్బును కనుక్కొనే ప్రయత్నంలో ఆయన వెయ్యి వైఫల్యాలను చవిచూశాడు. ‘విద్యుత్ బల్బును కనుక్కోవడంలో వెయ్యిసార్లు విఫలమై, ఇప్పుడు సాధించారు కదా! ఇప్పుడు మీకేమనిపిస్తోంది?’ అని ఒక పాత్రికేయుడు ఆయనను ప్రశ్నించాడు. ‘వెయ్యిసార్లు నేను విఫలమవలేదు. వెయ్యి అంచెల తర్వాత విద్యుత్ దీపాన్ని కనుక్కోగలిగాను’ అని బదులిచ్చాడాయన. వైఫల్యాలే విజయానికి సోపానాలని గ్రహించడానికి ఎడిసన్ అనుభవమే మంచి ఉదాహరణ. గెలుపు కోసం ప్రయత్నించే వాళ్లు ఓటమికి కూడా మానసిక సంసిద్ధతతో ఉండాలి. ఓటమి ఎదురైనప్పుడు రెట్టించిన పట్టుదలతో పునఃప్రయత్నం చేయడానికి తగిన శక్తి యుక్తులను సమకూర్చుకోవడానికి తగిన ఓరిమితో ఉండాలి. ఈ రెండూ లోపించడం వల్లనే పరీక్షల్లో వైఫల్యం ఎదురైనప్పుడు అర్ధంతరంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారెందరో! స్వేచ్ఛగా జీవితాన్ని జీవించడమే ఒక సాఫల్యం. ఈ ఎరుక లేకనే చాలామంది జీవితాలను వ్యర్థం చేసుకుంటారు. చిల్లర గెలుపుల కోసం, పదవుల కోసం, పదవులను పదిలపరచుకోవడం కోసం అధికార బలసంపన్నుల ముందు సాగిలబడతారు. ‘వాని జన్మంబు సఫల మెవ్వాడు పీల్చు/ ప్రాణవాయువు స్వాతంత్య్ర భరభరితమొ/ పరుల మోచేతి గంజికై ప్రాకులాడు/ వాని కంటెను మృతుడను వాడెవండు?’ అన్నాడో చాటు కవి. ‘విజయమే అంతిమం కాదు. వైఫల్యమేమీ ప్రాణాంతకం కాదు’ అని తేల్చేశాడు బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్. కాబట్టి వైఫల్యం ఎదురైనంత మాత్రాన ముంచుకొచ్చే ముప్పేమీ ఉండదు. విజయం సాధించినంత మాత్రాన అమాంతంగా ఒరిగిపడే ఆకాశమూ ఉండదు. ‘వైఫల్యాల నుంచి ఏమీ నేర్చుకోకపోవడమే మన అసలు పొరపాటు’ అంటాడు అమెరికన్ పారిశ్రామికవేత్త హెన్రీ ఫోర్డ్. వైఫల్యాలే మనకు గుణపాఠాలు నేర్పే గురువులు. గురువులను గౌరవించడం మన సంప్రదాయం. వైఫల్యాలను గౌరవించడం, విజయాలను వినయంగా శిరసావహించడమే మన కర్తవ్యం! -
అమెరికాలో ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆంధ్రప్రదేశ్ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంత మైంది. అమెరికాలో వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు బాణాసంచాతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. మే 07న హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో నిర్వహించిన ఈ సభలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 275 మందికి పైగా పాల్గొన్నారు. తొలుత దివంగత నేత, తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత, మహానేత రాజశేఖర రెడ్డికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి వల్లూరు, వెంకట్ రెడ్డి కల్లూరి, పార్థ బైరెడ్డి తదితరులు జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించారు. వివిధ జాతీయ తెలుగు సంఘాల ప్రతినిధులు - రిపబ్లిక్ పార్టీ లీడర్ వర్జీనియా ఆసియన్ అడ్విసోరీ బోర్డు మెంబెర్ శ్రీమతి శ్రీలేఖ పల్లె, ఉమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ (వెట) నుంచి శ్రీమతి శైలజ, నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట) నుంచి శ్రీ సతీష్ రెడ్డి నరాల, కాపిటల్ ఏరియా తెలుగు సొసైటీ (కాట్స్) నుంచి శ్రీ అనిల్ రెడ్డి నందికొండ, అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ (ఆప్త) నుంచి సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల, ఇతర ప్రముఖులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొన్నారు. వైస్సార్సీపీ మిడ్ అట్లాంటిక్ ఇంచార్జి పార్థ బైరెడ్డి ముఖ్య అతిధులను వేదికకు ఆహ్వానించారు. రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమెరికా అడ్వైసర్ అండ్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబెర్ (ఈవెంట్ ఆర్గనైజర్) వ్యాఖ్యాతగా వ్యవహరించి సభను దిగ్విజయంగా నడిపారు. మేరీల్యాండ్ స్టేట్ 10th డిస్ట్రిక్ట్ సెనెటర్ బెంజమిన్ బ్రూక్స్ మరియు అతని ప్రతినిధి కెన్నీ బ్రౌన్ తమ రాష్ట్రానికి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాకను సాదరముగా ఆహ్వానించారు. వర్జీనియా డెమొక్రాట్ లీడర్ శ్రీ శ్రీధర్ నాగిరెడ్డి.. మంత్రిని వాషింగ్టన్ డల్లాస్ ఎయిర్ పోర్ట్ లో సాదరముగా అమెరికా రాకను ఆహ్వానించారు. స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ.. శ్రీ రాజశేఖర రెడ్డి ఆశయాలను, ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ, ప్రస్తుత ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పని తీరు తెన్నులను మనస్ఫూర్తిగా పొగిడారు. శివ రెడ్డి మాట్లాడుతూ ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకు రావడం చాల గొప్ప విషయమన్నారు. రమేష్ రెడ్డి ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా "రాజన్న సువర్ణ రాజ్యం" కొరకు గత నాలుగు సంవత్సరాలుగా అహర్నిశలు పాటుపడుతూ ప్రతి పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న వై యస్ జగన్ రాష్టానికి మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చే 2024 ఎన్నికల్లో గెలుపొందేవిధంగా నవతరం పాటుపడాలన్నారు. దివంగత నేత రాజశేఖరుడి తనయుడు పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరం జన నేత జగన్ కి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. మాట నిలబెట్టుకుంటూ, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలను నాలుగేళ్ల పరిపాలనలో 98 శాతానికి పైగా నెరవేర్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంపూర్ణ ప్రజా మద్దతు నిలువెత్తు నిదర్శనమన్నారు. గత 48 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన ద్వారా చేస్తున్న మేలును ఇంటింటా వివరించి.. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే లక్ష్యంగా వైయస్ఆర్సీపీ చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం మంచి పరిమాణం అన్నారు. జార్జ్ ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఎలా సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు. అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు నేడు మల్లీ జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా వచ్చి వీరభూస్తున్నారని పునరుధ్ఘాటించారు. నేటి ఆర్ధిక మంత్రి బుగ్గన, సీఎం జగన్ మధ్య సఖ్యత నాటి ఆర్ధిక మంత్రి కొణజేటి రోశయ్య, ,డాక్టర్ వైఎస్ సఖ్యతను తలపిస్తున్నారని పొగిడారు. అనంతరం సౌర్య ప్రసాద్ కొచ్చెర్ల మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని 2024 లో తిరిగి అధికారంలోకి తీసుకురావాలని అందుకు అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు. గోరంట్ల వాసు బాబు విద్య యెక్క ఆవశ్యకతను తెలియచేస్తూ తాను ఎలా పేద విద్యార్థులకు భోధనాభ్యసన పరికరములు, భోధన సామాగ్రి సాయం చేస్తున్నారో తెలిపారు. ఈ సభలో ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీ రాష్ట్రం పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుందన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్సార్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమం, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతోంది. పెద్ద ఎత్తున జరుగుతున్న పారిశ్రామిక అభివృద్ధి, రెవిన్యూ జనరేషన్, యువతకు ఉపాధి, స్కిల్ విషయాలు ఏవీ పచ్చమీడియా పట్టించు కోదు. 192 స్కిల్ హబ్‌ల ద్వారా పెద్ద ఎత్తున శిక్షణ ఇస్తున్నాం. 95 వేల మందికి శిక్షణ ఇస్తే వారిలో 85 శాతం మందికి ఉద్యోగాలు ఇప్పించిన పరిస్థితి. మంత్రి మాట్లాడుతూ ప్రపంచాన్ని మార్చే శక్తి విద్య ఒక్కటే ...రాష్ట్రంలో పేదల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే సరైన మార్గం అని నమ్మి రాష్ట్రంలో ప్రతి విధ్యార్ధి ఉన్నత విద్యను అభ్యసించాలని ఆకాంక్షిస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వై.యస్. జగన్ గారు విద్య ,ఉద్యోగం పై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో మన పార్టీని బలోపేతం చేయాలనీ, పేదలకు ఆలంబనగా నిరంతరాయంగా కొనసాగుతున్న సంక్షేమ పథకాలు, జనాభాలో దాదాపు 90 శాతం మందికి నేరుగా అందుతున్న నగదు, అవినీతికి తావులేని స్వచ్ఛమైన పారదర్శక పాలన.. జనాదరణను సోషల్ మీడియా ద్వారా తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. మేం ఏది చెప్పినా ప్రజలు నమ్ముతున్నారనుకుంటున్నారు. అందుకే చెప్పిన అబద్ధాన్నే పది సార్లు చెబుదాం అనే సిద్ధాంతాన్ని నమ్ముకుని చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా బతుకుతోందని దుయ్యబట్టారు. కొంతకాలంగా రాష్ట్రంలోని ప్రగతి, రాష్ట్రానికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఎల్లో మీడియా తప్పుడు వార్తలు రాస్తున్నాయని, వారి రాతలు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసేలా, ప్రజల ఆలోచన విధానాన్ని మార్చాలనే ప్రయత్నంలా కనిపిస్తోందని అన్నారు. వారు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా తిరిగి 2024 లో రాజన్న రాజ్యం తథ్యం అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు జన నేత శ్రీ వైయస్ జగన్ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు. తమకు క్షేత్రస్థాయిలో పరిస్థితి తెలుసు కాబట్టే ‘వైనాట్ 175’ అంటున్నామని అన్నారు. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కోన సాగిస్తూ ముఖ్యమంత్రి శ్రీ జగన్ నవరత్నాలు రూపంలో చేస్తున్న సుపరిపాలన భేషుగా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్ వైయస్ఆర్ అడుగుజాడల్లోనే నడుస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేయడాన్ని భారత దేశం మొత్తం ఒక కొలమానం గ చూడడాన్ని చాల గొప్పగా ఉందని ప్రసంశించారు. రానున్న 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుని, మళ్ళి శ్రీ జగన్ గారు ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మేరీల్యాండ్, వర్జీనియా, న్యూ జెర్సీ, డెలావేర్, నార్త్ కరోలినా రాష్ట్రముల వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యులు, ఇతర ప్రాంతాల నుండి అనేకులు పాల్గొన్నారు. రామ్ (RAAM) నాయకులు న్యూజెర్సీ నుంచి రామ్మోహన్ రెడ్డి ఎల్లంపల్లి , వర్జీనియా నుంచి శ్రీధర్ నాగిరెడ్డి ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. కళ్యాణి , శ్రీధర్ వన్నెంరెడ్డి తమ హొటల్ పారడైస్ ఇండియన్ కుసిన్ లో అందరికి పసందైన విందు భోజనంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మెళనా కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది. చివరగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రమేష్ రెడ్డి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. -
ఉగ్రం మూవీ సక్సెస్ సెలబ్రేషన్...
-
Ugram Movie : 'ఉగ్రం' చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన
-
ఏపీలో జగనన్నే మా భవిష్యత్తు విజయవంతం
-
రూ. 5వేలు పెట్టుబడితో రూ. 750 కోట్ల వ్యాపార సామ్రాజ్యం - తయారైందిలా..!
జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఎన్నో సాహసాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి సాహసాలు చేసినప్పుడే నలుగురికి ఆదర్శమవవుతారు, సమాజం మిమ్మలి గుర్తిస్తుంది. ఇలా సాహసాలు చేసినవారిలో ఒకరు 'దేవేందర్ కుమార్ జైన్'. కేవలం ఐదు మందితో రూ. 5వేలు పెట్టుబడితో ప్రారంభమై ఈ రోజు కోట్లు గడిస్తున్నారు. ఈయన విజయం వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? ప్రస్తుతం ఆయన ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. నోయిడాలో ఉన్న స్టేషనరీ ఉత్పత్తుల తయారీ సంస్థ 'లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్' గురించి అందరూ వినే ఉంటారు. 1963లో ప్రారంభమైన ఈ కంపెనీ కేవలం రూ. 5000 పెట్టుబడితో మొదలైంది. అప్పట్లో ఇందులో ఉన్న ఉద్యోగులు కేవలం ఐదు మంది మాత్రమే. ప్రస్తుతం ఈ సంస్థ 95 దేశాల్లో ఉంది, ఇందులోని ఉద్యోగుల సంఖ్య సుమారు నాలుగు వేల కంటే ఎక్కువ. సుమారు ఆరు దశాబ్దాలు పూర్తి చేసుకున్న ఈ కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 750 కోట్లు (2023 మార్చి నాటికి). ఇప్పుడు వార్షక ఆదాయం రూ. 1000 కోట్లకు పెంచాలనే లక్ష్యంతో కంపెనీ కృషి చేస్తోంది. 1975లో మొదటిసారి ఈ కంపెనీ ఫైబర్ టిప్ టెక్నాలజీని ప్రవేశపెట్టి, 1976 నాటికి మార్కర్లు, హైలైటర్ వంటి వాటిని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. 1980లో కంపెనీ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా జపనీస్ బ్రాండ్ పైలట్ పంపిణీదారుగా నిలిచింది. ఆ తరువాత లక్సర్ కంపెనీ 1986లో ప్రపంచ వినియోగదారులపై ద్రుష్టి కేంద్రీకరించి అనేక కొత్త ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఇందులో పర్మినెంట్ మార్కర్, ఫ్లోర్ సెంట్ హైలైటర్ వంటి ఉన్నాయి. ఇవన్నీ ఆధునిక కాలంలో మంచి అమ్మకాలను పొందాయి. (ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని కొత్త ఎలక్ట్రిక్ బైక్ - ధర రూ. 55,555 మాత్రమే!) లక్సర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ తరువాత దశలో డ్రాయింగ్, స్కెచింగ్ వంటి వాటికోసం కూడా కొత్త ఉత్పత్తులను తీసుకువచ్చింది. కంపెనీ తన ఉత్పత్తులలో నానో టెక్నాలజీ ఉపయోగించి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టింది. వీటికి కంపెనీ 'నానో క్లీన్' అని పేరు పెట్టింది. (ఇదీ చదవండి: రూ. 32,999 ఫోన్ కేవలం రూ. 2,999కే సొంతం చేసుకోండిలా..!) రూ. 5000తో ప్రారంభమైన కంపెనీ పెన్నులు, స్టేషనరీ దగ్గర మాత్రమే ఆగిపోకుండా వివిధ రంగాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఇందులో లక్సర్ గ్రూప్ హాస్పిటల్, రియల్ ఎస్టేట్, రిటైల్, నానో క్లిప్ టెక్నాలజీ వంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా కంపెనీ అభివృద్ధికి దోహదపడ్డాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలను తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సలహాలను మాతో పంచుకోండి. -
వందేభారత్ సూపర్ సక్సెస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్తగా పట్టాలెక్కిన రెండు వందేభారత్ రైళ్లూ సూపర్ సక్సెస్ అయ్యాయి. టికెట్ ధర ఎక్కువైనా ప్రయాణికులు వాటిల్లో వెళ్లేందుకు ఎగబడుతున్నారు. దీంతో సికింద్రాబాద్–విశాఖపట్నం, సికింద్రాబాద్–తిరుపతి రైళ్లు కిక్కిరిసి పరుగులు పెడుతున్నాయి. సికింద్రాబాద్–తిరుపతి రైలు సగటు ఆక్యుపెన్సీ రేషియో 131 శాతం ఉండగా, తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు 134 శాతం నమోదవుతోంది. సికింద్రాబాద్–విశాఖపట్నం వందేభారత్ సగటు ఆక్యుపెన్సీ రేషియో 128 శాతం ఉండగా, తిరుగు ప్రయాణంలో 106 శాతంగా నమోదవుతోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పట్టాలెక్కిన వందేభారత్ రైళ్ల ఆక్యుపెన్సీలో ఇవే టాప్‌లో నిలవటం విశేషం. వేగమే ప్రధానం.. కాచిగూడ–తిరుపతి మధ్య 2017లో డబుల్ డెక్కర్ రైలును ప్రారంభించారు. అది మధ్యాహ్నం పూట ప్రయాణించేది కావటంతో బెర్తులకు బదులు చైర్‌కార్ మాత్రమే ఉంటుంది. దీంతో దానికి ఏమాత్రం ఆదరణ లేక ఆక్యుపెన్సీ రేషియో 12 శాతానికి పడిపోయింది. ఫలితంగా దాన్ని రద్దు చేశారు. ఇప్పుడు దానిలాగే మధ్యాహ్నం వేళ, చైర్‌కార్‌తో ప్రయాణించే వందేభారత్‌ను ప్రవేశపెట్టినప్పుడు రైల్వే అధికారులకు డబుల్ డెక్కర్ రైలే గుర్తొచ్చింది. దీంతో తిరుపతి వందేభారత్‌కు కేవలం 8 కోచ్‌లను మాత్రమే ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల నుంచి అనూహ్య ఆదరణ లభించింది. అధిక ఛార్జీ, పగటి వేళ ప్రయాణం, బెర్తులు ఉండకపోయినప్పటికీ జనం ఎగబడుతున్నారు. విశాఖపట్నం వందేభారత్ విషయంలోనూ ఇదే జరిగింది. ఇందుకు వందేభారత్ వేగమే కారణమని స్పష్టమవుతోంది. విశాఖ, తిరుపతిలకు సాధారణ రైళ్లలో 12 నుంచి 14 గంటల సమయం పడుతుంటే వందేభారత్ కేవలం 8 గంటల్లో గమ్యం చేరుస్తోంది. ఉదయం బయలుదేరితే మధ్యాహా్ననికల్లా గమ్యం చేరుతుండటంతో ప్రయాణికులకు ఒక పూట ఆదా అవుతోంది. సికింద్రాబాద్–విశాఖ వందేభారత్‌లో.. విశాఖ వెళ్లేప్పుడు ఎక్కువ మంది ప్రయాణిస్తుండగా, సికింద్రాబాద్–తిరుపతి సర్వీసులో మాత్రం, తిరుపతి నుంచి వచ్చేటప్పుడు ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియో నమోదవుతోంది. తిరుపతిలో దర్శనాలు పూర్తి చేసుకున్నాక, మధ్యాహ్నం రైలెక్కి అదే రోజు రాత్రికల్లా నగరానికి చేరుకోగలుగుతుండటం వారికి కలిసి వస్తోంది. తిరుపతి రైలు ఆదాయం అదుర్స్ జనవరి 15న విశాఖ వందేభారత్ రైలు ప్రారంభమైంది. కాగా ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 19 వరకు దాని ద్వారా రైల్వేకు రూ.31 లక్షల ఆదాయం నమోదైంది. అయితే తిరుపతి సర్విసులో 8 కోచ్‌లు మాత్రమే ఉన్నా, పది రోజుల్లో రూ.17.50 లక్షల ఆదాయం వచ్చింది. త్వరలో తిరుపతి రైలుకు కోచ్‌ల సంఖ్యను 16కు పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
PSLV-C55 సక్సెస్ పై సీఎం జగన్ హర్షం
-
Virupaksha : విరూపాక్ష సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
Dasara Movie : ‘దసరా’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
న్యూజెర్సీలో TTA ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్ అండ్ గ్రీట్
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ TTA న్యూయార్క్ చాప్టర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెసిడెంట్ వంశీ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ కార్యక్రమంలో టీటీఏ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వంశీ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కమ్యూనిటీ సర్వీసెస్, భవిష్యత్ లక్ష్యాలతో పాటు వచ్చే ఏడాది జరగనున్న టీటీఏ కన్వెన్షన్ గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు వంశీరెడ్డి తెలిపారు. ఇక న్యూయార్క్ చాప్టర్ సభ్యులను ఆయన అభినందించారు. తమకు అండగా ఉంటూ సహాయసహాయకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.ఇక టీటీఏ కార్యకలాపాలు మరింత విస్తరించడంపైనా ఈ సందర్భంగా చర్చించినట్టు న్యూయార్క్ చాప్టర్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం అవటం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారతీయ నావికా దళం ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ– డీఆర్డీఓ దేశీయంగా రూపొందించిన ఈ క్షిపణి షిప్ లాంచ్డ్ వెర్షన్‌ను అరేబియా సముద్రంలో పరీక్షించినట్లు సీనియర్ ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. భారత్–రష్యా సంయుక్త భాగస్వామ్య బ్రహ్మోస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ జలాంతర్గాములు, విమానాలు, ఓడలతోపాటు నేలపై నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులను ఉత్పత్తి చేస్తోంది. బ్రహ్మోస్ క్షిపణులు ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో ప్రయాణించగలవు. వీటిని భారత్ ఎగుమతి కూడా చేస్తోంది. ఇందుకు సంబంధించి గత ఏడాది ఫిలిప్పీన్స్‌తో 375 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి యాంటీ షిప్ వెర్షన్‌ను గత ఏడాది ఏప్రిల్‌లో భారత్ విజయవంతంగా ప్రయోగించింది. -
‘బలగం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
‘పులి మేక’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
శ్రీ పద్మావతి హెర్ట్ కేర్ సెంటర్ లో తొలి హార్ట్ ట్రాన్స్ ప్లాంటెషన్ విజయవంతం
-
‘అమిగోస్’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం
-
'ధమాకా' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
పొలిటికల్ కారిడార్: సామజిక న్యాయ నామ సంవత్సరం
-
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
గుంటూరులో సందడి చేసిన హిట్-2 టీమ్ ( ఫొటోలు)
-
బిగ్ క్వశ్చన్: బీసీల గుండె చప్పుడుగా వైఎస్ జగన్
-
అడివి శేష్ సక్సెస్ కు కారణం అదే ..!
-
ప్రధాని మోదీ విశాఖ పర్యటన విజయవంతమైంది : బీజేపీ ఎంపీ జీవీఎల్
-
'ఓరి దేవుడా' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
'గాడ్‌ఫాదర్' మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఐపీవో అదిరింది
న్యూఢిల్లీ: కన్జూమర్ వస్తు రిటైల్ చైన్ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా పబ్లిక్ ఇష్యూ సూపర్ సక్సెస్ సాధించింది. ఇష్యూ చివరి రోజు శుక్రవారానికల్లా 72 రెట్లు అధికంగా స్పందన లభించింది. షేరుకి రూ. 56–59 ధరలో చేపట్టిన ఇష్యూలో భాగంగా 6.25 కోట్ల షేర్లను కంపెనీ విక్రయానికి ఉంచింది. అయితే ఏకంగా 449.53 కోట్ల షేర్లకు బిడ్స్ దాఖలయ్యాయి. బజాజ్ ఎలక్ట్రానిక్స్ బ్రాండుతో కంపెనీ రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్) విభాగంలో 169.54 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల నుంచి 63.59 రెట్లు అధికంగా బిడ్స్ దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్లు సైతం 19.7 రెట్లు అధికంగా దరఖాస్తు చేశారు. -
దిగ్విజయంగా ముగిసిన 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, న్యూజిలాండ్ తెలుగు సంఘం, తెలుగు మల్లి ఆస్ట్రేలియా, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, మలేషియా తెలుగు సంఘం, వంశీ ఆర్ట్ థియేటర్స్ భారతదేశం, వీధి అరుగు నార్వే, దక్షిణాఫ్రికా తెలుగు సాహిత్య వేదిక, తెలుగు తల్లి కెనడా, సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో, ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన “8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు" 3వ రోజు కార్యక్రమం, అక్టోబర్ 2, 2022, ఆదివారం అంతర్జాలం ద్వారా 14 గంటల పాటు దిగ్విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీనటులు, రచయిత తనికెళ్ల భరణి ముఖ్య అతిథిగా పాల్గొనగా, పారిస్ నుండి డా. డేనియల్ నేజర్స్ సదస్సు సమాపన సమావేశంలో పాల్గొని స్వచ్ఛమైన తెలుగులో ప్రసంగించారు. అంతకు ముందు సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో మొదటి రెందు రోజుల సాహిత్య ప్రసంగాలూ న్యూజీలాండ్ లో ప్రత్యక్ష వేదిక, అలాగే అంతర్జాలంలోనూ 24 గంటలు నిర్విరామంగా జరిగిన సంగతి తెలిసినదే. సింగపూర్ నుండి కవుటూరు రత్నకుమార్, రాధాకృష్ణ గణేశ్న ప్రధాన సాంకేతిక నిర్వాహకులుగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్ష ప్రసారం చేయబడిన ఈ నాటి సదస్సులో సుమారు 75 మంది భారతదేశ వక్తలు తమ వైవిధ్యభరితమైన సాహిత్య ప్రసంగాలను అందించారు. రాధిక మంగిపూడి (ముంబై), సుబ్బు పాలకుర్తి (సింగపూర్), గౌతమ్ లింగా (జొహానెస్ బర్గ్), జయ పీసపాటి (హాంగ్ కాంగ్), రాధిక నోరి (అమెరికా), శ్రీసుధ (ఖతర్) ఈ సదస్సులోని ఆరు వేదికలను సమర్థవంతంగా నిర్వహించగా డా. ఎస్ ఆర్ ఎస్ కొల్లూరి(అమలాపురం) నిర్వహణలో ఒక ప్రత్యేక కవి సమ్మేళన వేదిక, కథా పఠనాలు, శారద కాశీవజ్ఝల (అమెరికా) నిర్వహణలో సాహిత్యం క్విజ్ మొదలైన ఆసక్తికరమైన అంశాలతో ఈ సదస్సు అందరినీ ఆకట్టుకుంది. ‘వసంతవల్లరి’ అయ్యగారి వసంతలక్ష్మి గళంలో “వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరికామెడీ కథలు” ఆడియో పుస్తకాన్ని తనికెళ్ళ భరణి ఆవిష్కరించగా, “డయాస్పోరా తెలుగు కథ, సాహిత్యం అంటే ఏమిటి?” అనే వ్యాస సంకలనాన్ని సంపాదకులు వంగూరి చిట్టెన్ రాజు పరిచయం చేశారు. వంశీ రామరాజు, రామ చంద్రమౌళి, గంటి భానుమతి, చిత్తర్వు మధు మొదలయిన లబ్ఢప్రతిష్టులు, సిలిలిక, అనఘ దత్త మొదలయిన చిన్నారుల ప్రసంగాలతో సదస్సు ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. ముగింపు వేదికలో మూడు రోజుల సదస్సు విశేషాలను సమీక్షిస్తూ సుమారు 25 దేశవిదేశాల వక్తలకీ, 18 మంది వేదిక నిర్వాహకులకీ, 30 మంది సాంకేతిక నిర్వాహకులకీ, ఆర్ధిక సహకారం అందజేసిన దాతలకీ, మీడియా ప్రతినిధులకీ నిర్వాహకులు తమ ధన్యవాదాలు తెలిపారు. 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం సభ్యులు కార్యక్రమ నిర్వహణలో పాలుపంచుకున్నారు. అలాగే వచ్చే ఏడాది జూన్ 22, 23, 24 తేదీలలో ఫ్రాన్స్ లోని పారిస్ మహా నగరంలో INALCO University ఆధ్వర్యంలో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, తదితరుల సహకారంతో తెలుగు భాష, సాహిత్యం, కళా రూపాలు, జానపదాలని ఫ్రాన్స్ దేశవాసులకి పరిచయం చేయడానికి ఒక సమగ్రమైన కార్యక్రమానికి రూప జరుగుతోంది ఆ సాంస్కృతిక కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నాం అనీ ప్రొఫెసర్ డేనియల్ నెజెర్స్ (యూనివర్శిటీ ఆఫ్ పారిస్), వంగూరి చిట్టెన్ రాజు తమ సంయుక్త ప్రకటనలో తెలియ జేశారు. -
ఉక్రెయిన్‌దే విజయమా? రష్యా ఓడిపోవడం ఖాయమా?
Battlefield developments unclear, Russian and Ukrainian militaries: ఈ ఏడాది ప్రారంభంలో ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. అప్పటి నుంచి యుద్ధంలో చాలా అనుహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. తొలుత రష్యా ధాటికి ఉక్రెయిన్ సైన్యం నేలకొరిగిపోతుందేమో అన్నట్లు భయానకంగా విరుచుకుపడింది. దీంతో ఉక్రెయిన్ గడ్డ ఎటూ చూసిన శవాల దిబ్బలతో హృదయవిదారకంగా మారిపోయింది. రష్యా బలగాలు మొదటగా కీవ్‌ని స్వాధీనం చేసుకునే దిశగా సాగిన దాడులు కాస్త విఫ్లలమయ్యాయి. దీంతో తూర్పు ఉక్రెయిన్ దిశగా బలగాలను మళ్లించి తీవ్రంగా విరుచుకుపడింది రష్యా. ఉక్రెయిన్ వేర్పాటువాదుల ప్రాంతాల నుంచి దాడులు చేసే వ్యూహంతో సాగి క్రమంగా పుంజుకోవడం ప్రారంభంమైంది. వేలాది ఉక్రెయిన్ సైనికులు నేలకొరగడంతో బలగాల కొరత, ఆయుధాల కొరతను ఎదుర్కొంది ఉక్రెయిన్. తదనంతరం పాశ్చాత్యదేశాల సహకారంతో రష్యాతో అలుపెరగని పోరు సాగించింది. అంతేకాదు రష్యా బలగాలు భీకరమైన దాడులతో ఉక్రెయిన్ భూభాగంలో ఐదోవంతును నియంత్రించింది. ఐతే అనుహ్యంగా ఈ నెలలో ఉక్రెయిన్ బలగాలు పుంజుకుంటూ రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను తిరిగి దక్కించుకుంది. తూర్పు డోన్బాస్ని స్వాధీనం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు వ్యాదిమర్ పుతిన్ లక్ష్యాన్ని నిర్విర్వం చేసింది ఉక్రెయిన్ సైన్యం. ఏది ఏమైనప్పటికీ ఈ యుద్ధం రెండోవ ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్ చూసిన అతి పెద్ధ సాయుధ సంఘర్షణగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ మేరకు యూఎస్ రక్షణ కార్యదర్శి లియోన్ పనెట్లా ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ...రష్యా ఒకవేళ ఓడుపోయే ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం అత్యంత ప్రమాదకరమైన అణుదాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉందన్న భయాందోళలను ఎక్కువ అవుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో లండన్ కింగ్స్ కాలేజ్‌లో యుద్ధ అధ్యయనాల ఎమెరిటస్ ప్రొఫెసర్, సైనిక చరిత్రకారుడు లారెన్స్ ఫ్రీడ్మాన్ మాట్లాడుతూ...ఈ యుద్ధం ఊహించని వాటిని తారుమారు చేస్తుందని చెప్పారు. ఇక రానున్న శీతకాలం యుద్ధ ప్రతిష్టంభనకు గురిచేస్తుందన్న ఊహాగానాలను తోసిపుచ్చుతూ...రష్యా పతనం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు. రష్యా సైనిక ఓటమిని చవిచూస్తుందన్నారు. అదీగాక దళాల ఆయుధాలకు కీలకమైన ప్రాంతం ఇజియంను రష్యా వదిలివేయడం అదర్నీ ఆశ్చర్యపరిచిందని వాషింగ్టన్ థింక్ ట్యాంక్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్ తన నివేదికలో పేర్కొంది. ఐతే ఉక్రెయిన్‌లో ప్రత్యేక సైనిక ఆపరేషన్ దాని అసలు లక్ష్యాలను సాధించే వరకు దాడి కొనసాగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ కరాఖండీగా చెప్పడం గమనార్హం. ఖార్కివ్ ఎదురు దాడిలో ఉక్రెయిన్ బలగాలు అనుహ్యంగా దాడులను తిప్పిడుతూ... మొహరించే సామర్థ్యాన్ని పెంపొందించుకుందని రష్యన్ సైనిక నిపుణడు సీఎన్ఏ సెక్యూరిటీ థింక్ ట్యాంక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ యుద్ధం రష్యన్ మిలటరీకి అనుకూలమైనది కాదని నర్మగర్భంగా చెప్పాడు. మానవశక్తి, సైనిక కొరత తదితర సమస్యలను రష్యా ఎదరుర్కొంటుందని తెలిపాడు. ఇటీవల రష్యా బలగాల తిరోగమనంతో రష్యా కూడా ఉక్రెయిన్ భూభాగాన్ని స్వాధీనం చేసుకునే ప్రజాభిప్రేయ సేకరణను నిలిపేసింది. మరోవైపు రష్యా ఈ దాడులను ఉపసంహరించుకోవాలనే రాజకీయ నిర్ణయం తీసుకోకపోతే తామే స్వయంగా వెళ్లి విజ్క్షప్తి చేస్తామని లండన్‌లోని ల్యాండ్ వార్ఫేర్ సీనియర్ రీసెర్చ్ ఫెలో జాక్ వాట్లిగ్ చెబుతుండటం గమనార్హం. ఇదీ చదవండి: చందమామే దిగి వచ్చిందా! -
మారుతి సక్సెస్ మంత్ర ఇదే! సీక్రెట్ రివీల్ చేసిన ఛైర్మన్
న్యూఢిల్లీ: ఆటోమొబైల్ పరిశ్రమలో మారుతి సుజుకీ ఇండియా విజయం మాదిరే.. ఇతర రంగాల్లోనూ భారత్ విజయం సాధించాలని సంస్థ చైర్మన్ ఆర్సీ భార్గవ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సంస్థ భారత్‌లో కార్యకలాపాలు మొదలు పెట్టి 40 ఏళ్లు అవుతున్న సందర్భంగా భార్గవ మీడియాతో మాట్లాడారు. భారత ఆటోమోటివ్ పరిశ్రమ అభివృద్ధిలో మారుతి సుజుకీ ఇండియా ఎంతో కీలక పాత్ర పోషించినట్టు చెప్పారు. ఆటో విడిభాగాల సప్లయ్ చైన్, అనుబంధ రంగాల అభివృద్ధికి తోడ్పడిందని, ఇప్పుడు ఇవి ప్రపంచ మార్కెట్లో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు. ‘‘తయారీలో భారత్ పాత్ర చాలా తక్కువ. కానీ, ఆటోమొబైల్ రంగంలో భారత్ నాలుగో అతిపెద్ద కార్ల తయారీ మార్కెట్‌గా ఉంది. అంతే కాదు ఆటో విడిభాగాల పరిశ్రమ సైతం గత ఆర్థిక సంవత్సరంలో 19 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు చేసింది. కనుక వీటిల్లో కొన్నింటిని మా కృషి వైపు నుంచి చూడాలి’’అని భార్గవ వివరించారు. మారుతీ సుజుకీ ప్రపంచంలోనే అత్యంత విజయవంంతమైన జపనీస్ కారు జాయింట్ వెంచర్‌గా పేర్కొన్నారు. (Eicher Motors: సీఎఫ్‌వో గుడ్‌బై, ఐషర్ మోటార్స్ ఢమాల్!) ఇతర రంగాల్లోనూ.. నిపుణుల అంచనాలకు భిన్నంగా ఎంతో విజయవంతమైన కంపెనీగా మారుతి సుజుకీ ఇండియా అవతరించినట్టు భార్గవ చెప్పారు. మారుతి విషయంలో విజయం సాధ్యమైనప్పుడు, ఇతర పరిశ్రమల్లోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. ‘‘మారుతి విజయానికి కారణం భారత ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకునే సామర్థ్యం. జపనీస్ యాజమాన్య సామర్థ్యం. వనరుల సమర్థ వినియోగం, భాగస్వాములు, యాజమాన్యం, పనివారు, ఇతర భాగస్వాముల మధ్య విశ్వాసం’’అని భార్గవ వివరించారు. మారుతి సుజుకీ ప్రయాణం అంత సాఫీ ఏమీ కాదని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నట్టు చెప్పారు. దేశీ కార్ల మార్కెట్లో సుజుకీ 43 శాతం మార్కెట్ వాటా కలిగి ఉంది. -
కార్తికేయ 2 సక్సెస్‌పై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ హీరోలకు చురక
ఎలాంటి అంచనాలు లేకుండ విడుదలైన ‘కార్తికేయ 2’ చిత్రం ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. ముఖ్యంగా బి-టౌన్ థియేటర్లపై ఈ మూవీ దండయాత్ర చేస్తోంది. అక్కడి స్టార్ హీరో సినిమాలను సైతం వెనక్కి నెట్టి భారీగా వసూళ్లు చేస్తోంది. కేవలం 50 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రస్తుతం అక్కడ మూడు వేలకు పైగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సినిమాలకు ఆదరణ లేకపోవడంతో థియేటర్ నిర్వాహకులు ఈ సినిమాలు ఆపేసి కార్తికేయ 2ను రన్ చేస్తున్నారు. మొత్తంగా వారం రోజులు గడిచేసరికి ఈ మూవీ రూ.60.12 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ 2 ఊహించని బ్లాక్‌బస్టర్ హిట్ అందుకోవడంతో సినీ విశ్లేషకులు, ప్రముఖులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. తాజాగా కార్తికేయ 2 భారీ విజయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ఆర్ఆర్ఆర్, కేజీయఫ్ 2 సినిమాల కంటే కార్తికేయ 2 బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అంటూ క్రేజీ కామెంట్స్ చేశాడు. ‘హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 చిత్రం రెండవ శుక్రవారం రోజున అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా, అక్షయ్ కుమార్ రక్షాబంధన్ కంటే డబుల్ కలెక్షన్స్ సాధించింది. రాజమౌళి ఆర్ఆర్ఆర్, ప్రశాంత్ నీల్ కేజీయఫ్ 2 కంటే ఇది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్’ అని తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీంతో బాలీవుడ్ హీరోకలు చురక పెడుతూ వర్మ చేసిన కామెంట్స్ నెట్టింట చర్చనీయాంశమయ్యాయి. కాగా దర్శకుడు చందూ ముండేటి దర్శకత్వంలో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈచిత్రంలో వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి కీ రోల్ పోషించారు. కాల భైరవ సంగీతం అందించాడు. . @actor_nikhil ‘s #karthikeya2 produced by @abhishekofficl on 2nd Friday doing DOUBLE COLLECTIONS of #AamirKhan ‘s #LSJ and @AkshayKumar ‘s #RakshaBandhan proves on ROI,K2 is BIGGER BLOCKBUSTER than @ssrajamouli ‘s #RRR and @Prashant_neel ‘s #KGF2 ..CONGRATS to @chandoomondeti — Ram Gopal Varma (@RGVzoomin) August 20, 2022 -
ఆహా అనిపిస్తున్న మానస్ 'ఊరెళ్లిపోతా మామ'..
Sri Manas Oorellipota Mama Movie: పాత సినిమాల నుంచి.. నిజ జీవితం నుంచి నిరంతరం నేర్చుకుంటూ తనను తాను నటుడిగా.. వ్యక్తిగా తీర్చిదిద్దుకుంటున్నానని అంటున్నాడు యంగ్ హీరో శ్రీ మానస్. హైదరాబాద్‌కు చెందిన శ్రీ మానస్ నటించిన "ఊరెళ్లిపోతా మామ" చిత్రం అసలు సిసలు తెలుగు ఓటీటీ "ఆహా"లో మంచి స్పందన అందుకుంటోంది. మెరీనా సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వరుణ్, శుభలేఖ సుధాకర్, మహేష్ విట్టా, టిఎన్ఆర్, మ్యాడి, సెహరా పద్మా జయంతి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని అంజన్ రెడ్డి దర్శకత్వంలో తాడిపత్రి వెంకట కొండారెడ్డి, జి దామోదర్ రెడ్డి, ఎస్ మారుతి ప్రసాద్, కె హిమాన్విత్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా విజయం సాధించడంపట్ల శ్రీ మానస్ సంతోషం వ్యక్తం చేశాడు. శర్వానంద్, శ్రీ విష్ణు వంటి హీరోలను పరిచయం చేసిన దొరైరాజ్ దర్శకత్వంలో రూపొందిన "పటారుపాలెం ప్రేమకథ"తో హీరోగా పరిచయమైన శ్రీ మానస్.. తనను హీరోగా పరిచయం చేసిన దొరైరాజ్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెబుతున్నాడు. త్వరలో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న "పొట్లగిత్త" చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు శ్రీ మానస్. ఈ మూవీకి వెంకట్ దర్శకత్వం వహిస్తున్నారు. హీరోగా మాత్రమే కాదు.. ప్రాధాన్యం ఉన్న పాత్రలు వస్తే "క్యారెక్టర్స్ రోల్స్" చేయడానికి సైతం తాను సిద్ధమేనంటున్నాడు.