
మనం లోతుగా దృష్టిసారిస్తేగానీ గ్రహించలేని మనలోని కొన్ని అలవాట్లు మన విజయానికి అడ్డుగోడలుగా నిలుస్తుంటాయి. వీటిని గుర్తించి, మన తీరుతెన్నులను మార్చుకున్నప్పడే మనం విజయబావుటా ఎగురవేయగలుగుతాం. ఆ అలవాట్లు ఏమిటో, వాటిని మనలో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం.
విజయానికి అడ్డుపడే అలవాట్లివే..
1. ప్రతీ పనిని వాయిదా వేయడం
మనలో చాలామంది తాము చేయాల్సిన ప్రతి పనిని వాయిదా వేస్తుంటారు. ఇటువంటి అలవాటును ప్రొక్రాస్టినేషన్(Procrastination) అని అంటారు. ఇటువంటి అలవాటు ఎవరిలో ఉన్నా, విజయం అనేది వారి దరిదాపులకు కూడా చేరదని మానసిక నిపుణులు చెబుతుంటారు. చేయాల్సిన పనిని తగిన సమయంలో మొదలుపెట్టి, పూర్తిచేయడం వలన విజయానికి చేరువవుతాం.
2. నెగిటివ్ ఆలోచనలు
మనలోని ఆలోచనలే మన పనులలో ప్రతిబింబిస్తుంటాయి. మనలో మనం, మనతో మనం ఎలా మాట్లాడుకుంటామో అలాగే మనం ప్రవర్తిస్తుంటాం. నిత్యం నెగిటివ్ విషయాలు (Negative Talks) మాట్లాడుకోవడమనేది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. అదే సమయంలో పాజిటివ్‌గా వ్యవహరించడం విజయానికి దోహదపడుతుంది. కష్టమైన పరిస్థితుల నుంచి బయటపడేలా చేస్తుంది.
3. రిస్క్ తీసుకోకపోవడం
ఎవరైనా ఏదైనా కొత్త పనిని చేపట్టేందుకు రిస్క్ తీసుకోవడంలో వెనుకాడితే వారికి విజయావకాశాలు సన్నగిల్లుతాయి. అందుకే రిస్క్ తీసుకునైనా సరే ఏరైనా మంచి పనిని ప్రారంభించాలి. అప్పుడే విజయానికి దగ్గరవుతాం.
4. లైఫ్ స్టయిల్‌లో చెడు అలవాట్లు
రోజువారీగా తీసుకునే ఆహారం, చేసే వ్యాయామంపై దృష్టిపెట్టినప్పుడే శరీరం బలిష్టంగా మారుతుంది. అప్పుడే మానసికంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి అలవాట్లను అలవరుచుకోవడం ద్వారా ఉత్సాహంగా ఉంటూ విజయంవైపు ముందడుగు వేయగలుగుతాం.
5. ప్రతీదాన్నీ సమస్యగా చూడటం
ఎవరైనా ప్రతీ అంశాన్ని సమస్యగా తీసుకుంటే వారు జీవితంలో ముందుకు సాగలేరు. అన్నింటినీ సమస్యలుగా చూడకుండా, వాటికి పరిష్కారాలను కనుగొంటే విజయావకాశాలు దగ్గరవుతాయి.
6. ఇతరులను సంతోష పెట్టాలనుకోవడం
చాలామంది ఇతరులను సంతోషపెట్టాలని, వారి మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంటారు. దీనిని చెడ్డ అలవాటు అని మానసిక నిపుణులు చెబుతుంటారు. ఈ తరహాలో ప్రవర్తించే వ్యక్తి తన లక్ష్యాన్ని మరిపోతాడని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి అలవాట్లను దూరం చేసుకున్న వ్యక్తి విజయానికి దగ్గరవుతాడని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Railway Station Stampede: రద్దీ నియంత్రణకు మూడు విధానాలు
Comments
Please login to add a commentAdd a comment