achieve
-
100 జీఈఆర్‌ను నిజాయితీగా సాధించాలి
సాక్షి, అమరావతి: నంద్యాల జిల్లా బనగానపల్లి గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్లు 100% విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించారని పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ తెలి పారు. నంద్యాల జిల్లాలో శనివారం పర్యటించిన ఆయన పలు పాఠశాలల పనితీరును పరిశీలించారు. బనగానపల్లిలోని వలంటీర్లు తమ పరిధిలోని గృహాల్లో బడిఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో నమోదు చేయించారు. దీంతో ఈ వలంటీర్లకు యాప్ ద్వారా బ్యాడ్జి వచ్చిది. వీరు తమ పరిధిలో ఒకటికి రెండుసార్లు డేటాను పరిశీలించి.. ‘నా సర్వే సరైంది.. ఇది నా చాలెంజ్.. మిషన్ జీఈఆర్ 100 శాతం ఆంధ్రా’ అనే క్యాప్షన్‌తో బ్యాడ్జి స్క్రీన్‌షాట్‌ను వారి వాట్సాప్ స్టేటస్‌లో ఉంచారు. వీరి సవాలును స్వీకరించిన మిగతా 60 వేల మంది వలంటీర్లు కూడా తమ పరిధిలోని డేటాను మరోసారి తనిఖీ చేసి, వాట్సాప్ స్టేటస్ పెట్టాలని ప్రవీణ్ ప్రకాశ్ సూచించారు. నూరు శాతం జీఈఆర్‌ను నిజాయితీ, నిబద్ధతతో సాధించాలన్నారు. -
25 శాతం వృద్ధిపై శ్రీరామ్ ప్రాపర్టీస్ కన్ను
న్యూఢిల్లీ: శ్రీరామ్ ప్రాపర్టీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల విక్రయాల (బుకింగ్‌లు) పరంగా 25 శాతం వృద్ధిని సాధించాలనే లక్ష్యంతో ఉంది. ఈ విషయాన్ని సంస్థ చైర్మన్, ఎండీ ఎం.మురళి ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలో (2022–23) ఇళ్ల విక్రయ బుకింగ్‌ల ద్వారా రికార్డు స్థాయిలో రూ.1,846 కోట్ల ఆదాయం నమోదు చేసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం. 2021–22లో విక్రయాల ఆదాయం రూ.1,482 కోట్లతో పోలిస్తే 25 శాతం వృద్ధి నమోదైనట్టు మురళి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఖ్యా పరంగా 20 శాతం, విలువ పరంగా 25 శాతం వృద్ధిని సాధించాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. 2021–22లో ఈ సంస్థ 3.8 మిలియన్ చదరపు అడుగుల మేర విక్రయాలు చేయగా, 2022–23లో 4.02 మిలియన్ చదరపు అడుగుల అమ్మకాలను సాధించింది. పెరుగుతున్న ఇళ్ల డిమాండ్‌కు అనుగుణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పలు ప్రాజెక్టులను ప్రారంభించనున్నట్టు మురళి తెలిపారు. ‘‘మార్కెట్ ఎంతో అనుకూలంగా ఉంది. మధ్యస్థ, అందుబాటు ధరల ఇళ్లకు మించి డిమాండ్ నెలకొంది. పలు అంశాల కారణంగా వచ్చే 3–5 ఏళ్లపాటు డిమాండ్ కొసాగుతుందని అంచనా’’అని మురళి వివరించారు. ఇతర రంగాల్లో స్థిరమైన వృద్ధి కారణంగా రియల్ ఎస్టేట్‌లోనూ వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే శ్రీరామ్ ప్రాపర్టీస్ 2021 డిసెంబర్లో స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అవయింది. గత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.68 కోట్లకు చేరుకుంది. -
ఆంధ్రా యూనివర్సిటీ మరో అరుదైన ఘనత
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): ఆంధ్ర యూనివర్సిటీ మరో అరుదైన ఘనతను సాధించింది. యూనివర్సిటీ పరిధిలో చేసిన పరిశోధనల థీసిస్‌లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో అద్భుత ప్రగతిని కనబరిచింది. శోధ్‌గంగ వెబ్సైట్లో కేవలం తొమ్మిది నెలల్లోనే 7,635 థీసిస్‌లను అప్లోడ్ చేసి 179వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది. ఏయూలో 1942 నుంచి చేసిన పరిశోధనలకు సంబంధించిన గ్రంథాలను కూడా శోధ్‌గంగలో పొందుపరించింది. తద్వారా విలువైన పరిశోధన పత్రాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మరికొన్ని థీసిస్‌లు అప్లోడ్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: 5న అల్పపీడనం.. ఏపీలో వర్షాలు ఇదీ శోధ్‌గంగ లక్ష్యం... దేశవ్యాప్తంగా పరిశోధన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి, భవిష్యత్ తరాల పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఇన్‌ఫ్లిబినెట్ సంస్థ శో««ద్గంగ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దేశంలోని 584 విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని పరిశోధన గ్రంథాలను ఎప్పటికప్పుడు దీనిలో పొందుపరుస్తున్నాయి. ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు 3,98,264 థీసిస్‌లు అప్లోడ్ చేశాయి. పరిశోధకులు కోర్సుల వారీగా తమకు అవసరమైన థీసిస్‌లను ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని చదువుకోవడంతోపాటు రెఫరెన్స్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. 179 నుంచి 9వ స్థానానికి... శోధ్‌గంగలో థీసిస్‌ల అప్‌లోడ్‌కు సంబంధించి ఏయూ మార్చి నెలలో 179వ స్థానంలో ఉంది. శోధ్‌గంగ ప్రాధాన్యతను గుర్తించిన ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి గ్రంథాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో యూనివర్సిటీలో దశాబ్దాలుగా ఉన్న 7,635 థీసిస్‌లను ఇప్పటివరకు శో«ధ్గంగలో అప్లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఏయూ నుంచి అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ కోర్సులకు చెందిన 3,388, సైన్స్ కోర్సులకు చెందిన 2,316, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన 1,270, ఫార్మసీ కోర్సులకు చెందిన 487, న్యాయవిద్యకు చెందిన 174 థీసిస్‌లు అప్లోడ్ చేశారు. గతంలో పరిశోధన గ్రంథాలను చేతితో రాసి, టైప్ చేసి సమరి్పంచేవారు. వీటితోపాటు దశాబ్దాల కిందట చేసిన పరిశోధనల పుస్తకాలను కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ చేశారు. తొలి ఐదు స్థానాల్లో నిలవడమే లక్ష్యం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని శోధ్‌గంగలో తొలి ఐదు స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. యూనివర్సిటీలో జరిగే పరిశోధనల గ్రంథాలను శో««ద్గంగలో ఉంచడం వల్ల దేశవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉంటాయి. నూతన పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా, మార్గదర్శకంగా నిలుస్తాయి. త్వరలో మరిన్ని థీసిస్‌లు స్కానింగ్ ప్రక్రియ పూర్తిచేసి అప్లోడ్ చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయి. – ఆచార్య పి.వెంకటేశ్వర్లు, చీఫ్ లైబ్రేరియన్, డాక్టర్ వీఎస్ కృష్ణా గ్రంథాలయం, ఏయూ -
గౌతమ్ రెడ్డి ఆశయ సాధనకు మేకపాటి కుటుంబం సిద్ధం
-
ముక్తి అంటే ఏమిటి? ఎలా సాధించాలి?
శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొని, స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటమే ‘జ్ఞానం’. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతో అనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే ‘యోగం’ (యోగ సాధన) మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే ఉండాలి, ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా – స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉండాలంటే మనం బ్రహ్మనిష్ఠ, కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యం గురువు ద్వారా సందేహాలను తొలగించుకోవాలి. అలా జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయడం, విచారణ చేయడం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యాలి. సత్కార్యాలను సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మబుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే గురువులు ఇలా గట్టిగా చెబుతుంటారు. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? మోక్షాన్ని గనక పొందాలంటే భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, పరోపకారాలు (దానధర్మాలు) చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి – నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు? వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువు ను సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యుడికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే వారు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించేవారై ఉండాలి. ► మీరు ఇతరులను ఆదుకుంటే ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు. ► మీరు ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తే , మీ అభివృద్ధికి ఇతరులు కృషి చేస్తారు. ► మీరు ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తేనే, మీ కోసం ఇతరులు సమయాన్ని వెచ్చిస్తారు. ► మీరు ఇతరులకు ఆత్మ విజ్ఞానాన్ని పంచితే , మీకు సృష్టి ఆత్మ విజ్ఞానం పంచుతుంది. ► మీరు ఇతరుల దైవత్వానికి కృషి చేస్తేనే , మీరు దైవత్వం పొందగలుగుతారు. ► ‘పరోపకారం‘ (దానాలు) చేయాలని నిజంగా మీరు నిర్ణయించుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ► ‘పరోపకారం’ ద్వారా అన్ని సమస్యలలో నుంచి సులభంగా, వేగంగా, శాశ్వతంగా బయటపడవచ్చు. ► సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. కాని కలియుగంలో అన్నిటికన్నా ప్రధానం ► ‘పరోపకారం’. (దానాలు) చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..? జీవితంలోని ఏ సమస్యలైనా ‘పరోపకారం’ ద్వారా తొలగిపోతాయి. సర్వ అనారోగ్యాలను, సమస్త సమస్యలను ‘పరోపకారం’ ద్వారా శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయండి. మంచి పనులు చేయండి. అడగక ముందే వారి అవసరాన్ని కనిపెట్టి, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. ఏ సహాయం చేయగలుగుతారో అదే చేయండి. మీకు సహాయం చేసే వీలు లేకపోతే కనీసం సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పండి. మీరు ఏదైనా సహాయం చేస్తేనే మీకు సహాయాలు లభిస్తాయి. మీరు ప్రేమను పంచితేనే, మీరు ప్రేమను పొందగలుగుతారు. బయటి ప్రవర్తన – లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే మనస్సు పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే – నిరంతరం భగవంతుని పూజలు, యజ్ఞలు, పరోపకారం (దానాలు), తపస్సులు, ఆధ్యాత్మిక సాధనలు భక్తితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో వ్యవహరిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది. – భువనగిరి, కిషన్ యోగి -
సుస్థిర అభివృద్ధికి పరిశోధనలు అవసరం
సాక్షి, హైదరాబాద్: అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని శాస్త్రవేత్తలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో శాస్త్ర పరిజ్ఞానానిది ముఖ్య పాత్ర అని నొక్కి చెప్పారు. దేశ సుస్థిర అభివృద్ధి, శ్రేయస్సుకు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలు ఎంతో కీలకం అన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) 78వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో పుదుచ్చేరి నుంచి ఆమె వర్చువల్‌గా మాట్లాడారు. కొత్త ఆవిష్కరణల పేటెంట్ల దరఖాస్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ఔషధ ముడిపదార్థాల కోసం విదేశాలపై ఆధారపడాల్సి రావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశంలోనే వాటిని ఉత్పత్తి చేసుకోవాలని సూచించారు. -
హామిల్టన్ @ 90
బుడాపెస్ట్: అచ్చొచ్చిన ట్రాక్‌పై మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దూసుకెళ్లాడు. తన కెరీర్లో 90వ పోల్‌ను సాధించాడు. శనివారం జరిగిన ఫార్ములా వన్ (ఎఫ్1) హంగేరి గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో అందరికంటే వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను పోల్ సిట్టర్‌గా నిలిచాడు. దాంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. తాజా పోల్ విజయంతో ఏడో సారి ఈ ఘనత సాధించిన హామిల్టన్... ఇదే ట్రాక్‌పై అత్యధిక పోల్ పొజిషన్ల మైకేల్ షూమాకర్ రికార్డును సమం చేశాడు. క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 13.447 సెకన్లలో పూర్తి చేసిన హామిల్టన్ అగ్రస్థానంలో నిలవగా... మెర్సిడెస్‌కే చెందిన మరో డ్రైవర్ వాల్తెరి బొటాస్ 0.107 సెకన్లు తేడాతో ల్యాప్‌ను పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. గత ఏడాది పోల్ పొజిషన్ సాధించిన రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఈ సారి మాత్రం ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 4. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 5. వెటెల్ (ఫెరారీ), 6. లెక్లెర్క్ (ఫెరారీ), 7. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 8. నోరిస్ (మెక్లారెన్), 9. సెయింజ్ (మెక్లారెన్), 10. గాస్లీ (అల్ఫా టోరి). -
అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి
- అభివృద్ధి లక్ష్యాలను సమగ్రంగా సాధించాలి - దిశ చైర్మన్, ఎంపీ మురళీమోహన్ కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు కల్పిస్తున్న నిధులను సమర్థవంతంగా వినియోగించి అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని దిశ కమిటీ చైర్మన్, పార్లమెంట్ సభ్యుడు ఎం.మురళీమోహన్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ విధాన గౌతమి సమావేశ హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షక కమిటీ (దిశ) సమావేశం కమిటీ చైర్మన్, రాజమహేంద్రవరం ఎంపీ మాగంటి మురళీమోహన్ అధ్యక్షతన జరిగింది. 17 శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలు, ప్రణాళికల పురోగతిని కమిటీ విస్తృతంగా సమీక్షించి ఆయా అంశాలు మరింత పటిష్టంగా అమలు చేసేందుకు అధికారులకు సూచనలు జారీ చేసింది. సమావేశంలో తొలుత గ్రామీణ నీటి సరఫరాపై జరిగిన చర్చలో జిల్లాలో దశాబ్దాల క్రితం నిర్మించిన తాగునీటి పథకాల పైపులైన్ల స్థానంలో కొత్తవాటిని చేపట్టాలని, పెరిగిన జనాభా, ఆవాసాలకు అనుగుణంగా ఓవర్‌హెడ్ ట్యాంకులు ప్రతిపాదించాలని ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కోరారు. విద్యాశాఖ సమీక్షలో మధ్యాహ్న భోజన పథకం కింద పోషక విలువలు లేని చిన్న గుడ్లు సరఫరా అవుతున్నాయని, 50 నుంచి 60 గ్రాములు ఉండే నాణ్యమైన గుడ్లు సరఫరా జరిగేలా చూడాలని రాజహహేంద్రవరం మున్సిపల్ చైర్పర్సన్ పంతం రజనీ శేషసాయి కోరారు. నిధుల కేటాయింపున్నా పాఠశాల వంట షెడ్ల నిర్మాణాలు జరగకపోవడం పట్ల ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ, కొన్ని పనులు తనకు అప్పగిస్తే కేటాయించిన నిధులతోనే షెడ్లు కట్టి చూపిస్తానన్నారు. విపక్షాల గళం... పాఠశాలలో స్వీపర్లను నియమిచారు కాని గడిచిన మూడు నెలల జీతాల చెల్లింపులు లేవని, దీంతో వారు పనిచేయడం మానివేశారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు.రూరల్ హెల్త్ మిషన్ పరంగా గ్రామాల్లో చేపడుతున్న శానిటేషన్‌పై పర్యవేక్షణ కొరవడిందని ఎమ్మెల్యే చిర్ల పేర్కొన్నారు. ఏజెన్సీ పరిధిలో ఆరోగ్యపరంగా పటిష్ట చర్యలు తీసుకోవాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి కోరారు. ముంపు మండలాల్లో అంబులెన్స్ అందుబాటులో ఉంచాలన్నారు. వ్యవసాయ శాఖ సమీక్షలో వ్యవసాయ యాంత్రీకరణ కింద గిరిజన రైతులకు పవర్ టిల్లర్లకు బదులు పెద్ద ట్రాక్టర్లు సరఫరా చేయాలని సూచించారు. పంచాయతీ శాఖ సమీక్షలో పన్నుల రిజవిజన్ పై ప్రజల్లో సరైన అవగాహన కల్పించడంలోను, కార్పొరేట్ కళాశాలల నుంచి పన్నులు వసూలు చేయడంలోను అధికారుల వైఫల్యాన్ని ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యకం చేశారు. విద్యుత్తు శాఖ సమీక్షలో ప్రజా ప్రతినిధులకు సరైన సమాచారం అందించడంలో ఆ శాఖాధికారులు వైఫల్యంపై ఎంపీ తోట నరసింహం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కర రామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యేలు వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, జ్యోతుల నెహ్రూ, పులవర్తి నారాయణమూర్తి, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, డీఆర్డీఏ పీడీ ఎస్.మల్లిబాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 80 శాతం సభ్యులు గైర్హాజర్... కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న పథకాలపై సమగ్ర చర్చ జరిగే సమావేశానికి సుమారు 80 శాతం మంది సభ్యులు గైర్హాజరయ్యారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్లు సభ్యులుగా ఉంటారు. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిపి పది మందే హాజరయ్యరు. ఇతర ప్రజాప్రతినిధుల హాజరు కూడా అంతంత మాత్రంగా ఉండడంతో కుర్చీలన్నీ ఖాళీగానే దర్శనమిచ్చాయి. పది గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.45 గంటలకు ప్రారంభమయింది. సుమారు 45 నిమిషాలపాటు సభ్యుల రాక కోసం కమిటీ చైర్మన్ వేచి ఉన్నారు. -
మస్తాన్‌బాబు ఆశయాలను సాధిస్తా : భద్రయ్య
రంపచోడవరం : ప్రభుత్వం అవకాశం కల్పిస్తే ఐరోపాలోని ఆల్ప్స్ పర్వతాలను అధిరోహించి మల్లి మస్తాన్‌బాబు ఆశయాలను నెరవేరుస్తానని ప్రపంచంలోని ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన గిరిజన యువకుడు దూబి భద్రయ్య అన్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మంగళవారం రంపచోడవరం వచ్చిన భద్రయ్యను ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు అభినందించారు. పీఎంఆర్సీ, ఐటీడీఏ ఆధ్వర్యంలో భద్రయ్యకు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భద్రయ్య మాట్లాడుతూ కృషి, పట్టుదల ఐటీడీఏ ఇచ్చిన సహకారంతో ఈ లక్ష్యాన్ని సాధించానన్నారు. అనంతరం పీఓ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చారని, ఐటీడీఏ తరఫున ఉపాధి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సబ్కలెక్ట్ రవిపటాన్శెట్టి, ఈఈ పీకే నాగేశ్వరావు, సీహెచ్ఓ డి.శ్రీనివాస్, ఏపీడీ శంకర్ నాయక్, డీఈలు శ్రీనివాస్, హరికృష్ణ, ఏఎంఓ డీఎస్కుమార్ తదితరులు పాల్గొన్నారు. పదిరోజుల ప్రయాణం... ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి తిరిగి రావడానికి పది రోజుల సమయం పట్టిందని భద్రయ్యఅన్నారు.నార్త్కోల్ నుంచి ఏబీసీ-1,2,3లు దాటుకొని 8848 మీటర్ల ప్రయాణించి ఎవరెస్టును ఎక్కడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఎవరెస్టు శిఖరం అధిరోహణలో ఎక్కడా భయపడలేదని తెలిపారు. మైనస్ జీరో డిగ్రీల వద్ద తన శరీరం సహకరిస్తుందని నిర్ధారించుకున్న తర్వాతే తన ప్రయాణం సాగిందన్నారు. ఆరుగురు సభ్యుల బృందంలో 8500 మీటర్లు పైకి ఎక్కిన తరువాత ఒకరు వెనుదిరిగారని తెలిపారు. మంచుకొండల్లో రాత్రిపూట నడక ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిందన్నారు. ఎవరెస్టు శిఖరం ఎక్కడానికి ఏడురోజులు, తిరిగిరావడానికి మూడు రోజుల సమయం పట్టిందన్నారు. ఎవరెస్టు ఎక్కడానికి సహరించిన ఐటీడీఏ పీఓ, ఇతర అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు శాశ్వత ఉపాధి అవకాశం కల్పించాలని కోరారు. పోలీస్ శాఖలో చేరాలన్న తన కోరిక నెరవేరకపోవడంతో ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని సాధించానన్నరు. గిరిజనుడిగా కొండల్లో సాగిన తన జీవనం ఎవరెస్టును అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడిందన్నారు. ఎవరెస్టు అధిరోహించాలని కోరిక ఉన్నవారికి తాను శిక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. -
సమైక్యాంధ్ర సాధించే వరకూ పోరు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర సాధించే వరకూ పోరు కొనసాగుతుందని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గొడారిగుంటలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సమైక్యాంధ్ర పోస్టర్‌ను ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను మరింత భాగస్వామ్యులను చేసేందుకు విస్తృత ప్రచారం చేయనున్నామన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీకి పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వైఎస్సార్ సీపీ సిటీ యూత్ కన్వీనర్ కిషోర్, నాయకులు విళ్ల సత్యనారాయణ, ఐ.శ్రీను, సంగిశెట్టి అశోక్, కోనాడ ప్రకాష్, రెహ్మాన్‌ఖాన్, కుసుమకుమారి, చిల్ల లక్ష్మి, శివకుమారి, కుండల సాయికుమార్, జార్జ్, బషీర్, అల్లి రాజబాబు, కట్టా రమణ, మెర్ల చౌదరి, గాంధీ, చాట్ల చైతన్య, పమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట ్ల నిరసన ప్రదర్శన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదివారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి రామారావుపేట, టూటౌన్ మీదుగా భానుగుడి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలుగుతల్లి విగ్రహ పాదాలను పాలతో కడిగి పూలమాలలు వేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ జేఏసీ సీమాంధ్ర కన్వీనర్ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ముందుకు వెళ్లేందుకు జిల్లా జేఏసీకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను స్తంభింపజేస్తామన్నారు. సంఘ నాయకులు కొండలరావు, రాజబాబు, వీరన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
సమైక్యాంధ్ర సాధించే వరకూ పోరు
కాకినాడ సిటీ, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్ర సాధించే వరకూ పోరు కొనసాగుతుందని కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక గొడారిగుంటలోని క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించిన సమైక్యాంధ్ర పోస్టర్‌ను ద్వారంపూడి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలను మరింత భాగస్వామ్యులను చేసేందుకు విస్తృత ప్రచారం చేయనున్నామన్నారు. సమైక్యాంధ్ర రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీకి పార్టీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కాకినాడ నగర కన్వీనర్ ఆర్‌వీజేఆర్ కుమార్, వైఎస్సార్ సీపీ సిటీ యూత్ కన్వీనర్ కిషోర్, నాయకులు విళ్ల సత్యనారాయణ, ఐ.శ్రీను, సంగిశెట్టి అశోక్, కోనాడ ప్రకాష్, రెహ్మాన్‌ఖాన్, కుసుమకుమారి, చిల్ల లక్ష్మి, శివకుమారి, కుండల సాయికుమార్, జార్జ్, బషీర్, అల్లి రాజబాబు, కట్టా రమణ, మెర్ల చౌదరి, గాంధీ, చాట్ల చైతన్య, పమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట నిరసన ప్రదర్శన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ఆదివారం నగరంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి రామారావుపేట, టూటౌన్ మీదుగా భానుగుడి సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు. నిరసన ప్రదర్శనలో భాగంగా నగరంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. తెలుగుతల్లి విగ్రహ పాదాలను పాలతో కడిగి పూలమాలలు వేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ల అసోసియేషన్ జేఏసీ సీమాంధ్ర కన్వీనర్ బి.నాగేశ్వరరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమాన్ని మరింత ముందుకు వెళ్లేందుకు జిల్లా జేఏసీకి పూర్తి సహకారం అందిస్తామన్నారు. క్షేత్రస్థాయిలో ఉపాధి పనులను స్తంభింపజేస్తామన్నారు. సంఘ నాయకులు కొండలరావు, రాజబాబు, వీరన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.