ఏయూలో థీసిస్‌లు భద్రపరిచిన విభాగం
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): ఆంధ్ర యూనివర్సిటీ మరో అరుదైన ఘనతను సాధించింది. యూనివర్సిటీ పరిధిలో చేసిన పరిశోధనల థీసిస్‌లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో అద్భుత ప్రగతిని కనబరిచింది. శోధ్‌గంగ వెబ్‌సైట్‌లో కేవలం తొమ్మిది నెలల్లోనే 7,635 థీసిస్‌లను అప్‌లోడ్ చేసి 179వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది. ఏయూలో 1942 నుంచి చేసిన పరిశోధనలకు సంబంధించిన గ్రంథాలను కూడా శోధ్‌గంగలో పొందుపరించింది. తద్వారా విలువైన పరిశోధన పత్రాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మరికొన్ని థీసిస్‌లు అప్‌లోడ్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
చదవండి: 5న అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
ఇదీ శోధ్‌గంగ లక్ష్యం...
దేశవ్యాప్తంగా పరిశోధన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి, భవిష్యత్ తరాల పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఇన్‌ఫ్లిబినెట్ సంస్థ శో««ద్‌గంగ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దేశంలోని 584 విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని పరిశోధన గ్రంథాలను ఎప్పటికప్పుడు దీనిలో పొందుపరుస్తున్నాయి. ఈ వెబ్‌సైట్‌లో ఇప్పటివరకు 3,98,264 థీసిస్‌లు అప్‌లోడ్ చేశాయి. పరిశోధకులు కోర్సుల వారీగా తమకు అవసరమైన థీసిస్‌లను ఈ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని చదువుకోవడంతోపాటు రెఫరెన్స్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది.
179 నుంచి 9వ స్థానానికి...
శోధ్‌గంగలో థీసిస్‌ల అప్‌లోడ్‌కు సంబంధించి ఏయూ మార్చి నెలలో 179వ స్థానంలో ఉంది. శోధ్‌గంగ ప్రాధాన్యతను గుర్తించిన ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి గ్రంథాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో యూనివర్సిటీలో దశాబ్దాలుగా ఉన్న 7,635 థీసిస్‌లను ఇప్పటివరకు శో«ధ్‌గంగలో అప్‌లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి చేరుకుంది.
ఏయూ నుంచి అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ కోర్సులకు చెందిన 3,388, సైన్స్ కోర్సులకు చెందిన 2,316, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన 1,270, ఫార్మసీ కోర్సులకు చెందిన 487, న్యాయవిద్యకు చెందిన 174 థీసిస్‌లు అప్‌లోడ్ చేశారు. గతంలో పరిశోధన గ్రంథాలను చేతితో రాసి, టైప్ చేసి సమరి్పంచేవారు. వీటితోపాటు దశాబ్దాల కిందట చేసిన పరిశోధనల పుస్తకాలను కూడా స్కానింగ్ చేసి అప్‌లోడ్ చేశారు.
తొలి ఐదు స్థానాల్లో నిలవడమే లక్ష్యం
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని శోధ్‌గంగలో తొలి ఐదు స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. యూనివర్సిటీలో జరిగే పరిశోధనల గ్రంథాలను శో««ద్‌గంగలో ఉంచడం వల్ల దేశవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉంటాయి. నూతన పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా, మార్గదర్శకంగా నిలుస్తాయి. త్వరలో మరిన్ని థీసిస్‌లు స్కానింగ్ ప్రక్రియ పూర్తిచేసి అప్‌లోడ్ చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయి.
– ఆచార్య పి.వెంకటేశ్వర్లు, చీఫ్ లైబ్రేరియన్, డాక్టర్ వీఎస్ కృష్ణా గ్రంథాలయం, ఏయూ
Comments
Please login to add a commentAdd a comment