Andhra University
-
ఏయూ హాస్టల్‌కి నాట్స్ ఆధ్వర్యంలో ఉచిత మంచాలు
ఆంధ్ర యూనివర్సీటీలో విద్యార్ధుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్, గౌతు లచ్చన్న బలహీన వర్గాల సంస్థ గ్లో, ఆంధ్ర యూనివర్సీటీ పూర్వ విద్యార్థి తాళ్లూరి పూర్ణ చంద్రరావుల ఆర్ధిక సహకారంతో మంచాలను విరాళంగా ఇచ్చారు. ఆంధ్ర యూనివర్సీటీలో కొత్తగా నిర్మించిన విశ్వేశ్వరయ్య వసతి గృహానికి కూడా ఆర్థిక చేయూతను అందించారు. మరిన్ని NRI వార్తలకోం ఇక్కడ క్లిక్ చేయండి!విద్యార్ధులకు నిద్రకు ఇబ్బంది లేకుండా అల్యూమినియంతో తయారుచేసిన 432 మంచాలను తయారు చేయించి ఏయూ హాస్టల్‌కి బహుకరించారు. ఈ కార్యక్రమంలో నాట్స్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి, నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి, నాట్స్ బోర్డు మాజీ ఈసీ సభ్యులు, శ్రీనివాస్ బొల్లు, నాట్స్ బోర్డ్ డైరెక్టర్ శ్రీనివాస్ పిడికిటి, నాట్స్ బోర్డ్ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్ అరసడ,నాట్స్ అమెరికా తెలుగు సంబరాల కమిటీ కార్యదర్శి శ్రీనివాస్ మల్లాది, గ్లో సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఏయూలో రీసెర్చ్ స్కాలర్స్ ఆందోళన
విశాఖ విద్య: హాస్టల్లో నీరు తాగలేకపోతున్నామని, భోజనం తినలేకపోతున్నామంటూ ఆంధ్ర యూనివర్సిటీలోని(Andhra University) పరిశోధక విద్యార్థులు శనివారం ఆందోళనకు దిగారు. అధికారులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో జీఎంసీ బాలయోగి రీసెర్చ్ హాస్టల్ ముందు బైఠాయించారు. పోలీసులు సర్దిచెప్పినా వినలేదు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు కదిలేది లేదని తెగేసి చెప్పారు. వైస్ ఛాన్సలర్ శశిభూషణరావు వెంటనే పరిస్థితిని చక్కదిద్దాలని వర్సిటీ సైన్స్ కాలేజి ప్రిన్సిపల్ రామరాజుకు సూచించారు. ఆయన విద్యార్థులతో మాట్లాడారు.తాగు నీరు పరిశుభ్రంగా ఉండటంలేదని, మెనూ ప్రకారం కాకుండా, కాంట్రాక్టర్ ఇష్టం వచ్చినట్లుగా సప్లై చేసే కూరగాయలతోనే వండి పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ముందురోజు సాయంత్రం ఉడకబెట్టిన దుంపలు, కూరగాయలనే మరుసటి రోజు పెడుతున్నారని, ఆ భోజనం తినలేకపోతున్నామని వాపోయారు. ఈ విషయం చీఫ్ వార్డెన్‌కు చెప్పినా పట్టించుకోలేదని, స్కాలర్స్‌తో సమావేశం పెట్టమని కోరినా స్పందించలేదని తెలిపారు. దీంతో చీఫ్ వార్డెన్ విజయ్‌బాబును తొలగిస్తున్నట్లు వీసీ ప్రకటించారు. రామరాజుకు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్స్ చీఫ్ వార్డెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.సోమవారం రీసెర్చ్ స్కాలర్స్‌తో సమావేశం నిర్వహించాలని రామరాజుకు సూచించారు. సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని వీసీ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. హాస్టళ్లలో సమస్యలతో విద్యార్థులు సతమతం ఇటీవలే ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ హాస్టల్ విద్యార్థులు వీసీ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఇప్పుడు రీసెర్చ్ స్కాలర్స్ హాస్టల్ ముందు బైఠాయించారు. దీంతో వర్సిటీ హాస్టళ్లలో విద్యార్థులు సమస్యలతో సతమతమవుతున్నట్లు అర్ధమవుతోంది.స్కాలర్షిప్లివ్వని కూటమి సర్కారు.. హాస్టళ్లలో విద్యార్థుల నుంచే వసూళ్లు కూటమి ప్రభుత్వం వచ్చాక స్కాలర్షిప్లు కూడా రాలేదు. డబ్బులు చెల్లించిన వారికే వర్సిటీ హాస్టళ్లలో భోజనం పెడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. సైన్సు హాస్టల్లో ఇటీవల మూడు కంప్యూటర్లు కొనుగోలు చేయగా, ఆ డబ్బు కూడా విద్యార్థుల నుంచే వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం స్కాలర్షిప్లు ఇవ్వకపోవటంతో ప్రైవేటు హాస్టళ్ల మాదిరే, డబ్బులు పోగు చేసి అన్నీ తామే సమకూర్చుకోవాల్సి వస్తోందని, చివరకు వంట చేసే వారికిచ్చే జీతాలు కూడా తమ వద్దే వసూలు చేస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. -
ఏయూ ర్యాగింగ్‌లో టీడీపీ నేతల కుమారులు?: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. చంద్రబాబు పాలనలో ఏయూ వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ రక్కసి పురుడు పోసుకుంది.. అక్కడ దారుణం జరుగుతున్నా ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తోందన్నారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ఆంధ్ర యూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి రావడంతో బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్‌లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో కూడా పెట్టారు.ఆంధ్రయూనివర్శిటీలో కొంతకాలంగా లేని ర్యాగింగ్ రక్కసి మళ్లీ పురుడు పోసుకుని విద్యార్ధినిలు నేరుగా మీడియా ముందుకి బట్టబయలు అయ్యింది. హాస్టల్ రూమ్స్ లో అసభ్యకరంగా డ్యాన్సులు చేయాలంటూ ఫస్టియర్ విద్యార్థినులపై దురుసుగా ప్రవర్తిస్తూ కొంతమంది సీనియర్లు ఇబ్బంది పెట్టి వీడియోలు తీసి…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 8, 2024దీనిపై స్పందించిన కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. మాకు డ్యాన్స్ రాదని చెబితే.. అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది. బాధిత విద్యార్ధినిల తల్లిదండ్రుల మనోవేదన అర్థం చేసుకోండి. టీడీపీ నాయకుల సుపుత్రులు కూడా దీనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం నిద్రపోతుందా? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్, చిరంజీవి, బాలకృష్ణ, పవన్ సినీ పరిశ్రమ నుండి రాలేదా?: వైఎస్సార్సీపీ శ్యామల -
ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం
సాక్షి,విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆంధ్రా యూనివర్సిటీ అర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో జూనియర్ మహిళా విద్యార్థినులను సీనియర్ మహిళా విద్యార్థినులు ర్యాగింగ్ చేశారు. అసభ్యకరమైన డ్యాన్సులు చేయాలంటూ ఒత్తిడి చేశారు. అలా చెయ్యలేం. డ్యాన్స్ రాదు అంటే అబ్బాయిలు దగ్గరకి వెళ్లి నేర్చుకొని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టారు. అయితే ర్యాగింగ్ అంశం బయటకి రావడంతో వైస్‌ఛాన్సలర్ తూతూ మంత్రంగా చర్యలు తీసుకున్నారు. జూనియర్లను ర్యాగింగ్ చేసిన ఐదుగురు సీనియర్లను 15 రోజులు పాటు సస్పెండ్ చేశారు.ఇదీ చదవండి: స్టీల్‌ప్లాంట్ ఉద్యమం అణిచి వేతలో కూటమి ప్రభుత్వం -
ఇదేనా ‘దూర’దృష్టి!
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నాక్ ర్యాంకింగ్‌తో ఆంధ్రా యూనివర్సిటీని అగ్రస్థానంలో నిలబెట్టగా.. ఇప్పుడు సొంత బాకా కొట్టుకునేందుకే అన్నట్టుగా మార్చేశారు. ఏయూలో ఎంఏ జర్నలిజం దూరవిద్య పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన పరీక్షలో ఏయూ వీసీ శశిభూషణరావు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రభుత్వ మెప్పు పొందేందుకు టీడీపీ కరపత్రికగా ఉన్న ఈనాడు గురించి ప్రశ్నలు సంధించారు.వీసీ, ఏయూ అధికారుల వ్యవహారంపై విద్యార్థులు నిర్ఘాంతపోయారు. హిస్టరీ ఆఫ్ మాస్ మీడియా పరీక్ష ప్రశ్నపత్రంలో విద్యార్థులకు వింత అనుభవం ఎదురైంది. సెక్షన్–ఏ లో మొదటి ప్రశ్నలో ఏవైనా 5 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటూ 4 మార్కులు ప్రశ్న ఇచ్చారు. ఇందులో ఎనిమిది టాపిక్స్ ఇవ్వగా.. అందులో ఏడు మాత్రం సిలబస్‌లో ఉన్నవే ఇచ్చారు. కానీ.. సిలబస్‌లో లేని ‘ఈనాడు’ గురించి కూడా రాయాలంటూ ప్రశ్నపత్రంలో ఇవ్వడంపై విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఈనాడు గురించి సిలబస్‌లో ఉంటే కచ్చితంగా ప్రశ్న ఇచ్చినా ప్రిపేరై రాసేవాళ్లమని.. కానీ, ఎక్కడాలేని ప్రశ్నని ఇస్తే.. తాము ఎలా రాస్తామంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎనిమిదింటిలో నాలుగు ప్రశ్నలు మాత్రమే తెలుసనీ.. ఈనాడు బదులు సిలబస్‌లో ఉన్నది ఇచ్చి ఉంటే మరో ప్రశ్న కూడా రాసేవాళ్లమని చెబుతున్నారు. కేవలం ప్రభుత్వం మెప్పు పొందేందుకే వైస్ చాన్సలర్ ఈ విధంగా ప్రశ్నపత్రం తయారు చేయించి ఉంటారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో పరీక్షలో ఇంకెవరి గురించి రాయమని ప్రశ్నపత్నం తయారు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాష్ట్రానికి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 31 ఉన్నత విద్యా సంస్థలు జాతీయ స్థాయిలో సత్తా చాటాయి. ఉన్నత సదుపాయాలు, ఇతర వనరులతో అత్యుత్తమ ప్రమాణాలు సాధించే సంస్థలకు కేంద్ర ప్రభుత్వం అందించే నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)–2024లో ఉత్తర ర్యాంకులను సాధించాయి. ఆయా విభాగాల్లో గరిష్టంగా 100 సంస్థలకు వాటి ప్రమాణాలు అనుసరించి ర్యాంకులకు ఎంపిక చేసింది. పది అంశాల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకులిస్తోంది. అలాగే, అన్ని విభాగాల్లో స్వయం సమృద్ధి సాధించిన సంస్థలకు ఓవరాల్ కేటగిరీలో ర్యాంకులు ఇచ్చి0ది.గతేడాది కంటే పెరిగిన ర్యాంకులు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యా సంస్థలు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో గణనీయమైన పురోగతిని సాధించాయి. గతేడాది 25 సంస్థలకు ర్యాంకులు దక్కితే.. ఈ ఏడాది ఆ సంఖ్య 31 సంస్థలకు పెరిగింది. ఓవరాల్ ర్యాంకుల్లో ఈ ఏడాది మూడు సంస్థలు చోటు దక్కించుకున్నాయి. » కేఎల్‌యూ 55.47 స్కోరుతో 40వ ర్యాంకు, ఆంధ్ర వర్సిటీ 54.97 స్కోరుతో 41వ ర్యాంకు, 47.43 స్కోరుతో ఏఎన్‌యూకి 97వ ర్యాంకు వచ్చింది. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీకి 87వ ర్యాంకు దక్కింది. » వర్సిటీల విభాగంలో ఐదు సంస్థలు.. కేఎల్‌యూ, ఆంధ్ర వర్సిటీ, ఏఎన్‌యూ, విజ్ఞాన్, శ్రీవెంకటేశ్వర వర్సిటీలు ర్యాంకులు పొందాయి. » ఇంజనీరింగ్ కాలేజీ విభాగంలోనూ కేఎల్‌యూ, ఐఐటీ తిరుపతి, ఏఎన్‌యూ, విజ్ఞాన్ వర్సిటీలకు, మేనేజ్మెంట్ విభాగంలో ఐఐఎం–విశాఖపట్నం, కేఎల్‌యూ, క్రియా వర్సిటీ–శ్రీసిటీ సంస్థలు ర్యాంకులను కైవసం చేసుకున్నాయి. » ఫార్మసీ విభాగంలో గతేడాది తొమ్మిది సంస్థలకు ర్యాంకులు వస్తే ఈ ఏడాది ఆరు సంస్థలకు పరిమితమయ్యాయి. ఈ విభాగంలో ఎస్వీ వర్శిటీకి 60వ ర్యాంకు వచ్చి0ది. ఏయూ 34వ ర్యాంకు సాధించింది. » ఇక ఈ ఏడాది కొత్తగా బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా, గీతం, దామోదర సంజీవయ్య జాతీయ లా వర్సిటీకి జాతీయ ర్యాంకులొచ్చాయి. » ఆర్కిటెక్చర్–ప్లానింగ్ విభాగంలో స్పా విజయవాడ, గీతం సంస్థలకు, అగ్రికల్చర్ విభాగంలో ఎన్జీరంగా, శ్రీ వేంకటేశ్వర (ఎస్వీ) వెటర్నరీ వర్సిటీలకు ర్యాంకులు పొందాయి. ఎస్వీ వెటర్నరీ వర్సిటీ 33వ ర్యాంకు సాధించింది.ఏయూకు ఐదు విభాగాల్లో ర్యాంకులు.. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకుల్లో విశాఖలోని ఆంధ్ర వర్సిటీకి ఐదు విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు దక్కాయి. » ఓవరాల్ విభాగంలో 41వ స్థానంలో నిలిచి మెరుగైన ప్రదర్శన కనబర్చింది. » దీంతోపాటు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా చేర్చిన స్టేట్ పబ్లిక్ వర్సిటీల్లో విభాగంలోనూ జాతీయ స్థాయిలో 65.96 స్కోరుతో 7వ ర్యాంకు పొందింది. » వర్సిటీ కేటగిరీలో 43వ ర్యాంకు, ఇంజనీరింగ్ కేటగిరీలో 90వ ర్యాంకు, ఫార్మసీ విభాగంలో 34వ ర్యాంకులు వచ్చాయి. » న్యాయ కళాశాల 16వ ర్యాంకు సొంతం చేసుకుంది. » ఇక స్టేట్ పబ్లిక్ వర్సిటీ విభాగంలో ఏయూతో పాటు ఏఎన్‌యూకు 20వ ర్యాంకు, శ్రీవెంకటేశ్వర వర్సిటీకి 39వ ర్యాంకు దక్కాయి. 51–100 మధ్య ర్యాంకుల్లో ఆచార్య ఎన్జీరంగా, జేఎన్టీయూ–అనంతపురం, శ్రీపద్మావతి వర్సిటీ, యోగి వేమన వర్సిటీలు నిలిచాయి. -
రాజకీయ కేంద్రంగా ఏయూ
సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల కాలంలో.. దేశంలోనే నంబర్–3 విశ్వవిద్యాలయంగా పరిఢవిల్లిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజకీయాలకు దూరంగా.. విద్యార్థుల అభివృద్ధికి, యూనివర్సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేయగా.. టీడీపీ ప్రభుత్వం మాత్రం రాజకీయ కేంద్రంగా మార్చేసింది. టీడీపీ ఆధ్వర్యంలో ఏయూ వీసీ ప్రాంగణం వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమం ఏయూ చరిత్రలో మాయనిమచ్చగా నిలిచిపోతుంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఏయూని సందర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుని రాజకీయ కార్యాలయంగా మార్చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంపులుగా దూసుకొస్తూ.. రాజకీయ నినాదాలు చేస్తూ.. మాజీ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ, జనసేన శ్రేణుల చర్యలతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఏయూ వీసీ చాంబర్పైకెక్కి హడావిడి చేశారు. పోలీసులు నిలువరించినా పట్టించుకోకుండా యూనివర్సిటీలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించారు.ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఏయూ వీసీ వ్యవహారంపై విచారణ చేసి శిక్షించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. రాజీనామా చేసినంత మాత్రాన ప్రసాదరెడ్డితో పాటు ఆయన అరాచకాల్లో భాగస్వామ్యులైన వారెవరినీ వదిలిపెట్టే సమస్యే లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఏయూలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు. -
ప్రభుత్వం మారితే వీసీలు మారాలా?: మేరుగు నాగార్జున
సాక్షి, విశాఖపట్నం/గుంటూరు: ఆంధ్రా యూనివర్సిటీలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు శనివారం హల్ చల్ చేశారు. అరుపులతో హడావుడి చేశారు. అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్ష సాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ ప్రభుత్వం.. చివరకు సరస్వతీ నిలయాలైన విశ్వవిద్యాలయాలపైనా విరుచుకుపడుతోంది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న వైస్ ఛాన్సలర్లు వెంటనే రాజీనామా చేసి వెళ్లిపోవాలని అల్టిమేటం జారీచేసిన సంగతి తెలిసిందే.యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై మాజీ మంత్రి మేరుగు నాగార్జున గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ, వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరమన్నారు. తాను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశానని తెలిపారు.‘‘ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం....గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది. విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు. ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదు....గవర్నర్ వీసీని అపాయింట్ చేస్తారు. ఇంత దారుణంగా టీడీపీ వ్యవహరించడం సరికాదు. అధికారం ఉంది కదా అని ఇలా వ్యవహరించడం తప్పు. ఇలా ఎప్పుడైనా జరిగిందా?...ఆంధ్రా యూనివర్శిటీలో టీడీపీ అపాయింట్ చేసిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం చక్కగా పనిచేయించుకుని సాగనంపింది, అక్కడే కాదు మిగిలిన యూనివర్శిటీలు, ఉన్నత విద్యామండలిలో కూడా ఇలాగే జరిగింది. విద్యా వ్యవస్ధను నాశనం చేయద్దు. నేను నా అనుభవంతో చెప్తున్నా, ఇకనైనా ఒక పద్దతి ప్రకారం నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన తప్పులు ఇకనైనా సరిదిద్దుకోవాలి....వైఎస్ జగన్ సెక్యూరిటీపై కూడా బురదచల్లుతున్నారు. మేం ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు ప్రభుత్వాన్ని చక్కగా నడపాలని మేం కోరుకుంటున్నాం. మేం ఎక్కడా క్యాడర్‌ను ఉసిగొల్పలేదు’’ అని మేరుగు నాగార్జున పేర్కొన్నారు. -
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి, రిజిస్ట్రార్ స్టీఫెన్సన్ రాజీనామా చేశారు. రాజీనామా చేయాలంటూ ప్రసాద్‌రెడ్డి, స్టీఫెన్‌పై టీడీపీ నేతలు నుంచి ఒత్తిడి రావడంతో వారు రాజీనామా చేశారు.నిన్న వీసీ ఛాంబర్ ముందు టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఓవరాక్షన్ చేశారు. ప్రసాద్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ ఛాంబర్ వద్ద నిరసనకు దిగారు. కొన్ని రోజులుగా వీసీని భయబ్రాంతులకు గురిచేసే విధంగా టీఎన్ఎస్ఎఫ్ నేత ప్రణవ్ గోపాల్ వ్యవహరించారుగతంలో ఎన్నడూ లేని విధంగా ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధిలో ప్రసాద్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. ఆయనను ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్ర వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేశారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.కాగా, తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి. ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామంటూ బెదిరింపులకు దిగారు. -
ఏయ్.. రాజీనామా చేయ్! ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డికి బెదిరింపులు
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డికి గత కొన్ని రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. తక్షణమే తన పదవి రాజీనామా చేయాలంటూ కాల్స్ వస్తున్నాయి. ఇలా హైదరాబాద్ కి చెందిన మాధవనాయుడు అనే వ్యక్తి ఏయూ రిజిస్టర్డ్ ఆఫీస్‌కు ఫోన్ చేసి బెదిరింపులకు దిగ్గుతున్నాడని యూనివర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. పీవీజీడీ ప్రసాద్ రెడ్డిని వీసీ పదవికి తక్షణమే రాజీనామా చేసి విదేశాలకు వెళ్లిపోవాలని లేకుంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నట్లు సమాచారం. -
ఏయూను వదలని ‘ఎల్లో’ కుతంత్రం!
సాక్షి, విశాఖపట్నం: ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎల్లో మీడియా బరితెగించేస్తోంది. అధికారులు, పోలీసులు, వలంటీర్లు.. ఇలా ప్రతి ఒక్కరినీ తప్పుపడుతూ సొంత తీర్పులిచ్చేస్తున్న ఎల్లో మీడియా ఇప్పుడు విశ్వవిద్యాలయాలను కూడా వాటి పని వాటిని చేసుకోనీయడం లేదు. ప్రతిదానికి యాగీ చేయడం.. వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేసేస్తున్నారని అసత్యాలు, అబద్ధాలు అచ్చేయడమే పనిగా పెట్టుకుంది. చివరకు జాతీయ స్థాయిలో పేరు ప్రతిష్టలున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని కూడా ఎల్లో మీడియా తమ రాజకీయ ప్రయోజనాలకు రోడ్డుకు ఈడుస్తోంది. ఇదెలా తప్పు? ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకుని ఉద్యోగాలు సాధించినవారికి శుక్రవారం వారి తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలని విశ్వవిద్యాలయం సంకల్పించింది. అయితే ఇందులో కూడా ఎల్లో మీడియా తప్పులు వెతికింది. ఎచీవర్స్ డే పేరిట విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పిలిపించి వైఎస్సార్సీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారని అభూతకల్పనలతో ఈనాడు పత్రిక ఒక అశుద్ధ కథనం అచ్చేసింది. ఏయూ ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేస్తుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని.. తన కథనంలో రంకెలేసింది. దీంతో ఈనాడు పత్రిక దుర్బుద్ధికి భయపడిన అధికారులు అచీవర్స్ డేని రద్దు చేస్తున్నట్టు గురువారం ప్రకటించారు. ఫలితంగా ఏయూలో చదువుకుని ఉద్యోగాలు సాధించి తమ తల్లిదండ్రుల చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవాలని ఆశించిన 2,287 మంది తీవ్రంగా నిరాశ చెందారు. కాగా టీడీపీ విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీ మాత్రం ఎలాంటి ఎన్నికల కోడ్ వర్తించదంటూ ఏప్రిల్ 24న అచీవర్స్ డే నిర్వహించడం గమనార్హం. అక్రమాల ‘గీతం’ కోసమే పన్నాగం.. ఈ ఏడాది ఏయూ సైన్స్ కళాశాల పరిధిలో 802, ఇంజనీరింగ్‌లో 900, ఆర్ట్స్‌లో 410, బీఈడీలో 175కి పైగా ఉద్యోగాలు విద్యార్థులకు లభించాయి. ఏ ప్రభుత్వ విశ్వవిద్యాలయానికి ఇప్పటి వరకూ సాధ్యం కాని రికార్డును ఏయూ సొంతం చేసుకుంది. సైన్స్‌లో ఏకంగా 802 ఉద్యోగాలు రావడం ఇదే తొలిసారి. ఇంతటి ఘనమైన కీర్తిని సొంతం చేసుకున్న సమయంలో అచీవర్స్డేని తప్పుపడుతూ, దాన్ని ఎన్నికలకు ముడిపెడుతూ ఈనాడు పత్రిక తన దుర్బుద్ధిని చాటుకుంది. విద్యార్థి విశ్వవిద్యాలయంలో చేరినప్పుడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని సాధించిన సందర్భంగా ఏటా ఏయూలో అచీవర్స్ డే నిర్వహిస్తున్నారు.వేదికపై విద్యాన్థితో పాటు వారి తల్లిదండ్రులను సత్కరించి, వారికి విద్యార్థితో పాదాభివందనం చేయిస్తారు. ఏయూలో విద్యార్థులకు నియామక పత్రాలు అందించి, తల్లిదండ్రులను గౌరవించే ఈ కార్యక్రమాన్ని నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్) నిపుణుల బృందం సైతం ఇటీవల ప్రశంసించింది. అయితే దీన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకపోయింది. పేద కుటుంబాల పిల్లలకు లక్షల రూపాయల వేతనాలతో ఉద్యోగాలు సాధించడంతో ప్రభుత్వ యూనివర్సిటీ అయిన ఏయూ ప్రతిష్ట పెరిగింది. దీంతో టీడీపీ నేత భరత్‌కు చెందిన గీతం యూనివర్సిటీకి, టీడీపీకి కంటగింపుగా ఏయూ మారింది. టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరత్ స్వయంగా గీతం డీమ్డ్ వర్సిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తన వర్సిటీ ఉద్యోగులతో విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని సిబ్బంది ప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనుమతి ఇచ్చి రద్దు చేశారు.. క్లాజ్ –22 ప్రకారం ఎన్నికల సమయంలోనైనా యూనివర్సిటీల పరిధిలో అపాయింట్మెంట్స్, రిక్రూట్మెంట్స్ ఆపడానికి వీల్లేదు. అందుకే.. 15 రోజుల ముందుగానే జాయింట్ కలెక్టర్ డా.మయూర్ అశోక్‌కు ఏయూ అధికారులు అచీవర్స్ డే కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి అభ్యంతరం లేదని జేసీ కూడా అనుమతులు మంజూరు చేశారు. అచీవర్స్ డే కోసం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే విశాఖకు చేరుకున్నారు. అయితే ఈనాడు విషకథనంతో అధికారులు చివరి క్షణంలో అచీవర్స్ డేకు ఇచ్చిన అనుమతులను రద్దు చేశారు. నేనెలా ప్రభావితమవుతాను? నాకు 22 ఏళ్లు. పూర్తి పరిణితి చెందిన నేను సమావేశంలో ఒక వ్యక్తి చెప్పే ప్రసంగానికి ప్రభావితమై ఓటు వేస్తానని ఎలా అనుకుంటున్నారు? విద్యను రాజకీయంతో ముడిపెట్టడం ఏమాత్రం సరికాదు. ఏటా అచీవర్స్ డేను నిర్వహిస్తుండగా ఈ ఏడాది అడ్డుకోవడం తప్పు. – ఒ.గోవర్ధన్, బయోటెక్నాలజీ విభాగంచాలా బాధగా ఉంది.. నేను నాలుగు ఉద్యోగాలకు ఎంపికయ్యాను. 10 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తల్లిదండ్రుల సమక్షంలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకోవచ్చని చాలా సంతోషించాను. ఇప్పుడు అచీవర్స్‌డే రద్దు కావడం పట్ల చాలా బాధగా ఉంది. – ఎ.స్వాతి, స్టాటిస్టిక్స్ విభాగం -
‘‘డిజిటల్ యుగంలో డా.అంబేద్కర్ భావజాలం’’ పుస్తకంపై విజయభాను కోటే రివ్యూ
పుస్తక సమీక్ష: “Dr. Ambedkar’s Ideology in the Digital Era” (రచయిత- డా. జేమ్స్ స్టీఫెన్ మేకా (రిజిస్ట్రార్-ఆంధ్ర విశ్వవిద్యాలయం) ప్రపంచం మరుపులో కూరుకుపోతున్నట్లు కనిపించినప్పుడు, కొంతమంది వ్యక్తులు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు. ప్రతిధ్వనులను కలిగించే స్వరాలను ఎక్కుపెడతారు. డాక్టర్ జేమ్స్ స్టీఫెన్ మేకా గారిని తన తాజా పుస్తకం "డాక్టర్ అంబేద్కర్స్ ఐడియాలజీ ఇన్ ది డిజిటల్ ఎరా" గురించి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అదే భావోద్వేగం కలిగింది. “మీ పుస్తకం శీర్షిక వినూత్నంగా ఉంది. అసలు డిజిటల్ శకానికి, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వారధి కట్టాలని మీకు ఎలా అనిపించింది?” ఈ ప్రశ్నకు సమాధానంగా డాక్టర్ జేమ్స్ స్టీఫన్ చూపించిన వీడియో చూసి నేను, నా సహచరుడు ఒక రకమైన దిగ్భ్రాంతికి గురయ్యాము. డాక్టర్ అంబేడ్కర్ చైర్ గా సేవలు అందించిన డాక్టర్ జేమ్స్ స్టీఫన్ వంటి అంబేడ్కరిస్ట్ ను టీవీ కార్యక్రమం మీలో ఎవరు కోటీశ్వరుడు వేదనకు గురిచేసింది. ఈ కార్యక్రమంలో అడిగిన ఒక ప్రశ్నకు హాట్ సీట్ లో పాల్గొంటున్న వ్యక్తి మాత్రమే కాక కార్యక్రమంలో పాల్గొన్న ప్రేక్షకులు కూడా అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం తెలియని పరిస్థితుల్లోకి భారతదేశం వెళ్లిపోతోందని అర్థం అయిన ఆయన ఆ సమస్యను తీవ్రమైన సమస్యగా గుర్తెరిగి, పరిష్కారంగా ఈ పుస్తకాన్ని రచించారు. ఆ “మీలో ఎవరు కోటీశ్వరుడు” ప్రోగ్రామ్ వీడియోలో అడిగిన ప్రశ్న, “వీరిలో బాబాసాహెబ్ గా పేరొందిన వారు ఎవరు? దీనికి పార్టిసిపెంట్‌కు జవాబు తెలియక, షోలో భాగంగా “ఆడియన్స్ పోల్” ఎంచుకోవడం, అందులో అంబేడ్కర్ కు 27శాతం మాత్రమే ఓటింగ్ రావడం, చివరికి వల్లభాయి పటేల్ అని జవాబు చెప్పడంతో తనకు సమస్య తాలూకా తీవ్రత అర్థంఅయిందనీ, పనులెన్ని ఉన్నా, లోపల మండుతున్న ఒక నిప్పు రవ్వ నిద్రపోనివ్వని కారణంగా ఈ రచన జరిగిందని చెప్తారు డా. జేమ్స్ స్టీఫన్. అంబేడ్కర్ అనుచరులు ఆయనను ఆప్యాయంగా, అభిమానంతో పిలిచే పేరు “బాబాసాహెబ్”. బాబా అంటే తండ్రి, సాహెబ్ అంటే సార్ అనే గౌరవ సంబోధన. అంబేడ్కర్ “బాబాసాహెబ్” గా భారతదేశం లోనే కాక అంతర్జాతీయంగా కూడా పేరు పొందారు. మన దేశంలో విశ్వవిద్యాలయాలు ఆయన పేరుతో ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఒక జిల్లా, డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా. అంబేడ్కర్ జయంతిని ఘనంగా జరిపే భారతావనిలో నేటి యువత ఆ రోజుకు ఉన్న ప్రాముఖ్యతను. ఆ వ్యక్తి భారతదేశానికి చేసిన అత్యున్నత సేవను, ఆ వ్యక్తి చరిత్రలో వేసిన ముద్రను తెలియని స్థితిలోకి జారిపోతున్నారన్న ఆలోచన, ప్రస్తుతం సమాజంలో, ముఖ్యంగా నేటి యువతలో అంబేడ్కర్ గురించిన అవగాహన పెంచడానికి, డిజిటల్ వ్యవస్థను వినియోగించడం ఎలా అన్న అంశాన్ని లోతైన అధ్యయనాల ద్వారా ఈ పుస్తకంలో తెలియజేశారు. అంతే కాక అంబేడ్కర్ సిద్ధాంతాలు నేటి డిజిటల్ యుగానికి ఏ రకంగా అవలంబించవచ్చో తెలియజేశారు. ఈ 20 అధ్యాయాల పుస్తకం నిజమైన అంబేద్కర్‌ను ప్రపంచానికి పరిచయం చేయవలసిన ఆవశ్యకతను వెల్లడిస్తుంది. అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను ప్రస్తుత మరియు భవిష్యత్తు తరాలకు అందించబడాలని నిక్కచ్చిగా చెబుతుంది. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన ఇండియా వీడీఎం ఇండియా ఆన్ ద మూవ్ ఛైర్మన్ ఆచార్య శ్రీ అజయ్ కుమార్ "ఈ పుస్తకం అంబేద్కర్ యొక్క విజన్, ఒక గొప్ప నాయకుని ఆశయాలు మరియు ఆలోచనలను డిజిటల్ యుగం యొక్క పరివర్తన శక్తితో సమకాలీకరించే ఉన్నతమైన పనిని పూర్తి చేస్తుంది." అన్నారు. ఒక వ్యక్తి జీవితాన్ని, ఆ వ్యక్తి సిద్ధాంతాలను ప్రస్తుత కాలానికి అన్వయించాలంటే ఆ వ్యక్తి గురించిన లోతైన అధ్యయనం చెయ్యాలి, ఆ సిద్ధాంతాలు ఏ కాలానికైనా అవలంబించదగినవని తెలియాలంటే, అనుసంధాన ప్రక్రియ బలంగా ఉండాలి. ఈ పుస్తకంలో రచయిత చేసినది అదే! చరిత్ర భవిష్యత్తుకు పునాదిగా పనిచేస్తుంది. మనం డాక్టర్ అంబేద్కర్‌ను కేవలం గురువుగా మాత్రమే కాకుండా, వారి ఆలోచనలు మరియు దృష్టిని మన భవిష్యత్తుకు అన్వయించగల వ్యక్తిగా కూడా గుర్తుంచుకోవాలి. ఏ కాలానికైనా వర్తించే ఆలోచనలను కొద్ది మంది మాత్రమే ప్రతిపాదించగలరు. అలాంటి వారిలో డాక్టర్ అంబేద్కర్ ఒకరు. డాక్టర్ అంబేద్కర్ జీవితం అన్ని కాలాలకు ఆదర్శంగా నిలుస్తుంది. జ్ఞానాన్ని ఆయుధంగా వాడుకున్న యోధుని గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలి. భారతదేశపు మొదటి న్యాయ మంత్రిగా ఆయన ఎప్పుడూ గుర్తింపు పొందారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్‌గా ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని రూపొందించారు. రాజ్యాంగాన్ని పాటించినంత కాలం ఆయన మన పౌర జీవితాల్లో జీవిస్తారు. అంబేద్కర్ తన విద్యను సమానత్వం, సౌభ్రాతృత్వం మరియు స్వేచ్ఛను ప్రోత్సహించడానికి ఉపయోగించారు. మహిళలు సాధికారత సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళలకు ఉన్నత చదువులు, ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. 20 అధ్యాయాలుగా విభజించబడ్డ ఈ పుస్తకంలో ఒక్కో అధ్యాయాన్ని పుస్తకం యొక్క మూల లక్ష్యాన్ని నిర్మాణాత్మకంగా చేరేలా రచించారు. డాక్టర్ అంబేడ్కర్ జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్యమైన అంశాలను లేవనెత్తుతూ ఆయన ఎదుర్కొన్న వివక్ష ఎంత కాలం, ఎలా ఆయన జీవితాన్నివెంటాడిందో తెలియజేస్తూ, ఆయనలో వివక్షకు వ్యతిరేకంగా తలెత్తిన తిరుగుబాటు ధోరణి, ఆ తిరుగుబాటుకు సూచనగా ఆయన విద్యను ఆయుధంగా ఎంచుకోవడం, ఆ తిరుగుబాటును వ్యక్తీకరించడానికి ఆయన రచనను ఆయుధంగా, వ్యక్తీకరణ సాధనంగా ఎంచుకోవడం గురించి సూక్ష్మంగా అయినా, పదునుగా తెలియజేస్తారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ భావజాలం అప్పట్లో ఒక తిరుగుబాటుగానే పరిగణించబడింది. తన సిద్ధాంతాలను సమాజ మార్పుకు పునాదులుగా చేయడానికి ఒక వ్యక్తి చేసిన అనితరసాధ్య, నిరంతర సంఘర్షణల ఫలితమే అంబేడ్కరిజం. ఆయన సిద్ధాంతాలు లేదా భావజాలం యొక్క పురోగతి వేల యుద్ధాలను దాటిన అనుభవంగా మనం చెప్పవచ్చు. ఇక డాక్టర్ అంబేడ్కర్ దూరదృష్టి గల నాయకుడని ఆయన రచనలు చదివే ఈ నాటి యువతకు అర్థం అవుతుంది. ఆయన దృష్టిలో సమ న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక చేర్పు అనే అంశాలను నేటి సాంకేతిక యుగానికి అనుసంధానం చేస్తూ, డిజిటల్ డివైడ్ లేని సమాజం వైపు అడుగులు వేయడం వలన సాంకేతిక సమసమాజ చేర్పుకు నాంది పలకాలని పిలుపును ఇవ్వడం ఈ పుస్తకం యొక్క ఒక ముఖ్య ఉద్దేశ్యం. సాంకేతిక విప్లవం నేటి కాలపు విజయం అని అభివర్ణించే ఈ కాలంలో విద్య మరియు సాంకేతిక సాధికారత గురించి, సాంకేతిక ప్రజాస్వామ్యం గురించి రచయిత లేవనెత్తిన అంశాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. ఇక ఈ కాలంలో మనం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య సమాచార గోప్యత లేకపోవడం లేదా సమాచార దోపిడీ (మనకు తెలియకుండానే మన సమాచారం ఇతరులు వినియోగించడం. ఉదాహరణకు మనకు తెలియని కంపెనీల నుండి, బ్యాంకుల నుండి మనకు ఫోన్ రావడం రోజూ జరుగుతూనే ఉంటుంది. అది సమాచార చౌర్యం అని తెలిసినా మనకు ఏమి చెయ్యాలో తెలియదు) గురించి వివరించారు రచయిత. ప్రపంచ సమాజం మొత్తం ఇపుదు డిజిటల్ ఆక్టివిజం లోనే ఉందన్నది వాస్తవం. సాంకేతిక క్రియాశీలత వలన ఎన్ని లాభాలు ఉన్నాయో అన్నే నష్టాలు ఉన్నాయి అని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతూనే ఉంటారు. అయితే ఈ సాంకేతిక క్రియాశీలత వలన ఎన్నో పనులు సులభంగా జరిగిపోతున్నాయి. ఉదాహరణకు బ్యాంకింగ్ సేవలు, ఆన్లైన్ సేవలను గురించి చెప్పుకోవచ్చు. మరి సామాజిక మాధ్యమాల విషయానికి వస్తే నేడు వార్తా పత్రికల కన్నా సామాజిక మాధ్యమాల ద్వారా వార్తలను తెలుసుకునేవారి సంఖ్య పెరిగింది. ఈ మాధ్యమాలు చర్చావేదికలుగా మారాయి. దేశపు సాధారణ పౌరుల నుండి అత్యున్నత అధికారులు, రాజకీయ నాయకులు కూడా తమ అకౌంట్ల ద్వారా సమాచారాన్ని, ప్రకటనలను వెలువరిస్తున్నారు. ఇంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్న సాంకేతిక క్రియాశీలత ద్వారా సామాజిక మార్పు సాధ్యాసాధ్యాల గురించి రచయిత విపులంగా చర్చిస్తారు. ఆల్గారిథమిక్ బయాస్ అనేది సమాజంలో ఇప్పటికే ఉన్న పక్షపాతాలను ప్రతిబింబించే డేటాపై అల్గారిథమ్‌లను రూపొందించినప్పుడు లేదా శిక్షణ ఇచ్చినప్పుడు సంభవించే దైహిక మరియు అన్యాయమైన వివక్షను సూచిస్తుంది. డాక్టర్ అంబేద్కర్ ఆలోచనలను నిలబెట్టడానికి, అల్గారిథమిక్ డెసిషన్ మేకింగ్‌లో ఇటువంటి పక్షపాతాలను నిశితంగా పరిశీలించి సరిదిద్దడానికి కృషి చేయాలి. డాక్టర్ అంబేడ్కర్ భావజాలాన్ని నేటి సాంకేతిక యుగం లో సామాజిక న్యాయం మరియు సమత్వం గురించి చర్చిస్తూ, అట్టడుగు వర్గాలను ఈ డిజిటల్ యుగంలో సామాన్య హక్కుదారులుగా ఎలా చేర్చాలో చర్చిస్తారు. సాంకేతిక యుగంలో జరుగుతున్న అన్యాయాలు, వివక్షలను కూకటివేళ్ళతో ఎలా పెకిలించాలో దిశానిర్దేశం చేస్తారు. అలాగే డిజిటల్ విద్య అవసరత, తద్వారా ఉపాధి లేదా సామాన అవకాశాల ఆవశ్యకత గురించి చర్చిస్తారు. డాక్టర్ అంబేడ్కర్ సమసమాజ స్థాపన కొరకు పాటు పడ్డారు. అది విద్య, సాధికారత వలనే సాధ్యం అవుతుందని భావించారు. ఈ సిద్ధాంతాన్ని పరిగణనలోకి తీసుకుని, సాంకేతిక సాధికారత, సామాజిక సమానత్వం తీసుకురావడంలో సాంకేతికత పాత్ర గురించి వివరిస్తూ, జీవితకాల అభ్యాసం వలన వనగూరే లాభాలను గురించి ప్రకటిస్తారు. ఈ పుస్తకంలో ఒక మంచి అంశం చాలా చోట్ల కేస్ స్టడీస్ (ఉదాహరణ అధ్యయనాలు) ను తీసుకోవడం. డాక్టర్ అంబేడ్కర్ ఆశయాలు, సిద్ధాంతాలను పునాదిగా చేసుకుని నేటి కాలపు స్థితులకు అనుగుణంగా పౌరులను చైతన్యపరచడంలో రచయిత సఫలీకృతులు అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దూరదృష్టి గల సంఘ సంస్కర్త మరియు భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి. ఈ ఆదర్శాల గురించి లోతైన అంతర్దృష్టులను అందించారు. డిజిటల్ వ్యాపారంలో సైతం అసమాన్యతల తొలగింపు గురించి చర్చిస్తూ పౌర నిర్వహణ లేదా పౌర భాగస్వామ్యం గురించి రాసిన విధానం పౌరులందరినీ ఆలోచింపజేస్తుంది. అట్టడుగు వర్గాలకు అందని కొన్ని ప్రయోజనాలు, అనుమతి అసమాన్యతల గురించి చర్చిస్తూ భౌగోళిక అంశాలను గురించి వివరించడం, ఆన్లైన్ అభ్యాస మార్గాలలో అసమానతల నిర్మూలనకు మార్గాలను నిర్దేశించడం జరిగింది. అసమానతలు దేశ ఆర్థికాభివృద్ధిపై చూపే ప్రభావం, వ్యవస్థాపకత లక్ష్యాలను చేరుకోలేకపోవడానికి కారణాలను తెలియజేస్తుంది ఒక అధ్యాయం. ఇక ఆన్లైన్ అంశాలలో బ్లాగింగ్, వీడియోల ద్వారా సమాచార ప్రచారం, సామాజిక మాధ్యమాల ద్వారా సమాచార ప్రసారం మొదలైన ఎన్నో విషయాలను చర్చిస్తాయి ఇందులోని అధ్యాయాలు. నేటి కాలంలో టెలీ మెడిసిన్, ఆన్లైన్ హెల్త్ కేర్ మొదలైన అంశాలను కూడా తన పుస్తకంలో చేర్చారు రచయిత. డాక్టర్ అంబేడ్కర్ సూత్రాల ఆధారంగా సాంకేతిక అసమానతలను అధిగమించేందుకు సోపానాలను ఒక అధ్యాయంలో వివరించారు రచయిత. సమాచారం సాధికారతకు సోపానం అంటారు రచయిత. అందుకే డిజిటల్ గ్రంధాలయాలకు ఓపెన్ యాక్సెస్ గురించి మాట్లాడుతారు. అందరికీ సామాన విద్య గురించి మాట్లాడుతూ ఆన్లైన్ విద్య అందరికీ అందుబాటులో ఉండాలి అంటారు. డిజిటల్ విద్య అంతరాన్ని తగ్గించడంపై అందరం దృష్టి పెట్టాలి. అలాగే డిజిటల్ లిటరెసీను పెంపొందించే కార్యక్రమాల ఆవశ్యకత, డిజిటల్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, జ్ఞానసముపార్జనను ప్రజాస్వామీకరించడం వంటి విలువైన అంశాలను ఈ పుస్తకంలో చేర్చారు. ఈ ప్రక్రియలో భాగంగా మనం ఎదుర్కొనే సవాళ్ళు, సమస్యలకు పరిష్కారాలను, డాక్టర్ అంబేడ్కర్ చారిత్రక ఉద్యమాలను ఉదాహరణలుగా చూపుతూ చర్చించారు. డిజిటల్ వేదికల సద్వినియోగం, అంతర్జాతీయ సహకారం యొక్క ఆవశ్యకత, వెసులుబాటు అవకాశాలు, మార్గాలు, సమాచార భద్రత, సమాచార జీవావరణ వ్యవస్థ (డేటా ఏకొ సిస్టమ్), సమాచార దోపిడీ వలన కలిగే హాని, సమాచార ఆధారిత వివక్ష, సమాచారం యొక్క నైతిక వినియోగం, నిఘా పటిష్టత మొదలైనవాటి గురించిన సంక్షిప్త సమాచారం ఈ పుస్తకంలో ఉంది. రచయిత గోప్యతను మానవ హక్కుగా పేర్కొంటూ రాసిన అధ్యాయం అందరూ చదివి తీరాలి. ఈ అంశాలన్నింటినీ డాక్టర్ అంబేడ్కర్ దృష్టికి, సిద్ధాంతాలకీ అన్వయించి వివరించిన విధానం బావుంది. అదే విధంగా ఆన్లైన్ నేరాలు, సైబర్ బుల్లియింగ్ మొదలైన వేధింపుల గురించి, ఫిర్యాదు పద్ధతుల గురించి ఈ పుస్తకంలో విపులంగా ఉంది. సురక్షితమైన ఆన్లైన్ వేదికల సృష్టి యొక్క ఆవశ్యకతను వివరించారు. కృత్రిమ మేధస్సు సాంకేతికతలో పురోగతి, తద్వారా ఎదుర్కొనే సవాళ్ళు, నైతిక అనిశ్చితి గురించి వివరిస్తూ, సామాజిక సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన ఈ గవర్నెన్స్, డిజిటల్ వ్యవస్థాపకతల గురించి డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలతో పోలుస్తూ కొన్ని అధ్యాయాలు రాశారు. వెనుకబడిన సమూహాలకు అందుబాటులో సాంకేతికత ఉండాలన్నది ఆయన వాదన. తద్వారా సామాన అవకాశాలు దక్కుతాయని ఉదాహరణ అధ్యయనాల ద్వారా నిరూపించిన తీరు అమోఘం. డాక్టర్ అంబేడ్కర్ సిద్ధాంతాలను నేటి సాంకేతితక ద్వారా ప్రచారం చేయడానికి పూనుకోవాల్సిన ఆవశ్యకత అవగతం అవుతుంది చదివిన ప్రతి ఒక్కరికీ. అంబేడ్కర్ గురించి అందరికీ తెలియాలి! నేటి సమాజానికే కాదు, ఏ కాలానికైనా ఆయన దార్శనికత వెలుగు చూపే దివ్వె అవుతుందని తెలియాలి! అంబేద్కర్ భావజాలాన్ని డిజిటల్ యుగానికి చేర్చాలనే ఆలోచన భారతదేశ పౌరులతో పాటు మొత్తం ప్రపంచ పౌరులలో అంబేద్కర్ భావజాలం యొక్క అక్షరాస్యతను మెరుగుపరుస్తుందన్నది వాస్తవం. ఈ పుస్తకం మన అందరి భవిష్యత్ ఆలోచనా సరళి మార్పును, భవిష్యత్ తరాలకు అంబేడ్కర్ ఆశయాలను చేర్చేందుకు తీసుకోవలసిన చర్యల ఆవశ్యకతను సూచిస్తుంది. శరవేగంతో పరుగులు పెడుతున్న అభివృద్ధి భారతదేశాన్ని ఏ స్థాయిలో నిలబెట్టగలదో అంచనా వేసేందుకు కొన్ని అధ్యయనాలు, కొన్ని ఆచరణలు అవసరం అని అందరికీ తెలుసు. భారతదేశ భవిష్యత్తు గురించి అత్యున్నత దృక్పథాన్ని కలిగి ఉన్న జాతీయ నాయకుడికి భిన్నమైన భావజాలం ఉంది. దూరదృష్టి కలిగిన ఆ దార్శనికుని మార్గదర్శకత్వాన్ని పూర్తిగా అందిపుచ్చుకోగలిగితే, అది భారతదేశాన్ని అభివృద్ధిలో శిఖరాగ్రంలో ఉంచగలదన్న విషయాన్ని అర్థం చేసుకుని, సాంకేతికత పరంగా కూడా ఆ భావజాలాన్ని వినియోగించుకోగలగాలి. ఇంత విపులంగా అంబేడ్కర్ ఆశయాల సాధన కొరకు నేటి కాలం సాంకేతికతను సమ్మిళితం చేయగలిగే విధానాలను సూచిస్తూ రచించిన ఈ పుస్తకం ఎంతో మంది పరిశోధకులు, పౌరులు, విద్యార్థులు, విధాన నిర్ణేతలు, సాంకేతిక పరిజ్ఞాన అభ్యాసకులకు మార్గదర్శిగా ఉండగలదు. - విజయభాను కోటే ఫ్రీలాన్స్ రైటర్, టీచర్, హ్యుటగాజీ ఎక్స్పర్ట్ 8247769052 (పుస్తకం దొరుకు చోటు: Amazon: Dr. Ambedkar's Ideology in The Digital Era https://a.co/d/9erV5My) -
విశాఖలో అమెరికా నావికుల సందడి (ఫొటోలు)
-
ఆంధ్రా వర్సిటీలో అమెరికా నావికుల సందడి
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీలో అమెరికా నావికులు సందడి చేశారు. విశాఖ తీరంలో ‘టైగర్ ట్రయంఫ్’ పేరుతో జరుగుతున్న భారత్-అమెరికా ద్వైపాక్షిక సైనిక విన్యాసాల్లో భాగంగా శుక్రవారం ఆంధ్రా వర్సిటీ క్యాంపస్‌ను యూఎస్ సెయిలర్లు సందర్శించారు. ఈ సందర్భంగా అమెరికా నావికులకు స్థానిక ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు. వర్సిటీ క్యాంపస్‌లో యూఎస్ సర్వీస్ సభ్యులు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. కుడ్యచిత్రాలు చిత్రించారు. మహిళా క్యాడెట్లతో యూఎస్ఎస్ సోమర్సెట్ కమాండింగ్ ఆఫీసర్ కెప్టెన్ మిచెల్ బ్రాండ్, మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్ కమాండర్ ఆఫ్ ట్రూప్స్ లెఫ్టినెంట్ కల్నల్ లిండ్సే మాత్విక్ చర్చించారు. టైగర్ ట్రయంఫ్ అనేది భారత్, యునైటెడ్ స్టేట్స్ మధ్య అతిపెద్ద ద్వైపాక్షిక సైనిక విన్యాసం. విశాఖపట్నంలో మార్చి 18 నుంచి 30 తేదీల్లో జరుగుతోంది. మొదటి టైగర్ ట్రయంఫ్ 2019లో విశాఖపట్నంలోనే జరిగింది. -
నా విశాఖ.. నా కల
‘నా కలల నగరం విశాఖ.. పూర్తిస్థాయిలో స్మార్ట్ సిటీగా మారాలి. విద్య కోసం ఇతర ప్రాంతాలు, దేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో విశ్వవిద్యాలయాలు రావాలి. ఏయూను రోల్‌మోడల్‌గా తీసుకుని విద్యా సంస్థలు ఎదగాలి. వైద్య రంగంలో మరిన్ని వసతులు సమకూరాలి. ఇజ్రాయిల్‌కు దీటుగా పరిశోధన రంగంలో ప్రగతి సాధించాలి. పూర్తిస్థాయి సాంకేతికతో సేవలందించే విశ్వ నగరంగా రూపాంతరం చెందాలి. సెల్‌ఫోన్, వాలెట్ లేకుండా బయటకు వెళ్లినా మన పనులు మనం చేసుకుని వచ్చే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందాలి. విశాఖ పేరు చెబితే బీచ్ గుర్తుకొస్తుంది. తీర ప్రాంతంలో స్వదేశీ, విదేశీయులను ఆకట్టుకునే నిర్మాణాలు జరగాలి. ఇక్కడ ప్రకృతి అందాలను తిలకించే విదేశీయులు ఇక్కడే స్థిరపడేలా వసతులు సమకూరాలి’ అంటూ విశాఖపై తనకున్న విజన్‌ను ఏడేళ్ల చిన్నారి వివరించి తీరు అందరినీ ఆలోచింపజేసింది. ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వ విద్యాలయం కన్వెన్షన్ సెంటర్ వేదికగా మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సు విజయవంతమైంది. విశాఖ యువత నుంచి ఈ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించింది. అంతర్జాతీయంగా విశాఖ ఎదగడానికి అనువైన పరిస్థితులు, వసతులున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. విశాఖ సామర్థ్యాలను వివరిస్తూ యువత తమ ఆలోచనలను పంచుకుంది. ఏడేళ్ల చిన్నారి తపస్వి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ఏయూ న్యాయ కళాశాల విద్యార్థిని డి.హర్షిత మాట్లాడుతూ విలియం షేక్స్పియర్ జీవించి ఉంటే తన రచనల్లో వెనిస్ నగరం కంటే విశాఖ నగరాన్నే అధికంగా ప్రస్తావించి ఉండేవారన్నారు. విశాఖలో ప్రకృతి రమణీయత ఎంతో ప్రత్యేకమన్నారు. ప్రపంచానికే పవర్ జనరేటర్‌గా విశాఖ నిలుస్తుందన్నారు. వై నాట్ వైజాగ్ అనే స్థాయికి విశాఖ నేడు ఎదిగిందన్నారు. ఇది నా నగరం.. ఇదీ విశాఖ నగరం.. మన కథను మనమే రాద్దామంటూ తన ఉత్సాహభరిత ప్రసంగంతో యువతను ఆకట్టుకుంది. సదస్సులో నిపుణుల ప్రసంగాలతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సస్టైనబుల్ అర్బనైజేషన్, ఎంటర్ప్యూనర్ప్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అంశాలపై నిర్వహించిన మూడు చర్చగోష్టులలో నిపుణులు, యువత విశాఖ నగరంపై తమ అంచనాలు, ఆకాంక్షలు, అవకాశాలను వివరించారు. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య డి.సూర్యప్రకాశరావు, ప్రిన్సిపాళ్లు ఆచార్య కె.శ్రీనివాసరావు, వై.రాజేంద్రప్రసాద్, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు ఆంజనేయ వర్మ, విశాఖపట్నం ఆటోనగర్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు పాండురంగ ప్రసాద్, ఐఐఎంవీ ఫీల్డ్ సీఈవో గుహన్ రామనాథన్, తారమండల్ వ్యవస్థాపకుడు వినీల్ జడ్సన్ తదితరులుప్రసంగించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని తమ భవిష్యత్‌కి బాటలు వేసే నగరంగా విశాఖ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. -
సాగుబడి: ఆంధ్రా వర్సిటీలో ఆర్గానిక్ పంటలు!
'నగరవాసులకు ఆరోగ్యదాయకమైన సేంద్రియ ఇంటిపంటలను, ప్రకృతి వ్యవసాయ పాఠాలు నేర్పించడానికి విశాఖ నగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. రైతు ఉత్పత్తిదారుల సంస్థతో కలిసి యూనివర్సిటీ ఆవరణలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ఏర్పాటు చేసింది. అనేక రకాల ఆకుకూరలను ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో నగరంలోనే పండించి తాజాగా నగరవాసులకు అందిస్తోంది. నగరంలో పుట్టి పెరిగే విద్యార్థులకు మట్టి వాసనను పరిచయం చేయటం.. సేంద్రియ ఇంటిపంటల సాగు పనులను చేస్తూ నేర్చుకునే వినూత్న అవకాశాన్ని నగరవాసులకు కల్పించటం ప్రశంసనీయం. ఈ సామాజిక కార్యక్రమంలో కీలకపాత్ర పోషిస్తున్న ‘ఎయు– అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్’ నిర్వాహకులు ఉషా రాజు, హిమబిందు కృషిపై అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా ప్రత్యేక కథనం'. పదిహేనేళ్లుగా సేంద్రియ టెర్రస్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం ఉన్న పౌష్టికాహార నిపుణురాలు ఉషా రాజు, హిమబిందు ఆంధ్రా యూనివర్సిటీతో కలసి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. మన మన్యం రైతు ఉత్పత్తిదారుల సంస్థ నిర్వాహకులు కూడా అయిన వీరు విశాఖపట్నం నగరం మధ్యలోని ఆంధ్రా యూనివర్సిటీ ఆవరణలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రజలకు ప్రకృతితో కలసి జీవించడం నేర్పుతున్నారు. వాలంటీర్లు పాల్గొనేందుకు అవకాశం ఇస్తూ అర్బన్ కమ్యూనిటీ ఫార్మింగ్‌ని ఆచరించి చూపుతున్నారు. నగర వాసులు తమ ఇంటిపైన కూడా ఆరోగ్యదాయకమైన సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేసుకునే విధంగా ప్రోత్సహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డిని కలిసి వర్సిటీలో అర్బన్ గార్డెనింగ్ హబ్‌కు అనువైన స్థలం కేటాయించాలని ఉషా రాజు, హిమబిందు కోరారు. ప్రజలకు ఆరోగ్యదాయకమైన ఆకుకూరలు అందుబాటులోకి రావటంతో పాటు ప్రకృతి సేద్యంపై అవగాహన కలుగుతుందన్న ఆశయంతో ఆయన అందుకు అంగీకరించారు. వృక్షశాస్త్రం, ఫుట్ టెక్నాలజీ, ఫార్మసీ విద్యార్థులను ఈ అర్బన్ సాగులో భాగస్వాముల్ని చేయాలని వీసీ సూచించారు. ఆకుకూరలను నగరంలోనే పండిస్తున్నాం..! మా ‘మన మన్యం ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్’ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలో 4 జిల్లాలకు చెందిన 120 మంది రైతులు సభ్యులు. ప్రకృతి వ్యవసాయంలో పండించిన బియ్యం, పప్పులు తదితర ఉత్పత్తులను ‘అవని ఆర్గానిక్స్’ పేరుతో విశాఖ నగరంలోని 4 రైతుబజార్లలోని మాకు కేటాయించిన స్టోర్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం. అయితే, ఆకుకూరలను నగరానికి దూరంగా పొలాల్లో పండించి ఇక్కడికి తెచ్చి వినియోగదారులకు అందించేటప్పటికి కనీసం 25% పోషకాలు నష్టం జరుగుతోంది. ఈ సమస్యను అధిగమించడానికి తాజా ఆకుకూరలను నగరంలోనే ప్రకృతి వ్యవసాయంలో పండించి వినియోగదారులకు అందించాలని తలచాం. మా ఆలోచననుప్రోత్సహించిన ఆంధ్రా యూనివర్సిటీ సహకారంతో 80 సెంట్ల ఖాళీ స్థలంలో అనేక రకాల సాధారణ ఆకుకూరలతో పాటు కలే, లెట్యూస్, బాక్చాయ్ వంటి విదేశీ ఆకుకూరలను, కనుమరుగైన కొన్ని రకాల పాతకాలపు ఆకుకూరలను సైతం పండించి, ప్రజలకు తాజాగా విక్రయిస్తున్నాం. స్థలంతోపాటు నీటిని యూనివర్సిటీ ఇచ్చింది. వైర్ ఫెన్సింగ్, డ్రిప్‌లు, సిబ్బంది జీతాలను మా ఎఫ్.పి.ఓ. సమకూర్చుతోంది. నగరంలో పుట్టి పెరిగే పాఠశాల విద్యార్థులకు, నగరవాసులకు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో ఇంటిపంటల సాగును నేర్పించాలన్నది మా లక్ష్యం. వాలంటీర్లు ఎవరైనా ప్రతి రోజూ ఉదయం 7–9 గంటల మధ్యలో నగరం మధ్యలో ఉన్న ఆంధ్రా యూనివర్సిటీకి వచ్చి గార్డెనింగ్ పనులను చేస్తూ నేర్చుకోవచ్చు. నచ్చిన ఆకుకూరలు తామే కోసుకొని కొనుక్కెళ్ల వచ్చు. స్కూలు విద్యార్థులకు ఇంటిపంటలు, ప్రకృతి వ్యవసాయ పనులను పరిచయం చేయడానికి ఇదొక మంచి అవకాశమని మేం భావిస్తున్నాం. యూనవర్సిటీలో ఈ పంటలను 2 ఎకరాలకు విస్తరించే ఆలోచన ఉంది. – ఉషా రాజు, ఎయు–అవని ఆర్గానిక్స్ అర్బన్ గార్డెనింగ్ హబ్, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం 80 సెంట్లలో బహుళ పంటల సాగు.. ఆ విధంగా 2023 నవంబర్ చివరి నాటికి ఏయూ ఫార్మ్ టెస్టింగ్ లాబరేటరీ (ఎలిమెంట్) ఎదురుగా ఉన్న సుమారు 80 సెంట్ల ఖాళీ స్థలంలో ఏర్పాటైన అర్బన్ గార్డెనింగ్ హబ్‌లో ప్రకృతి సేద్యం ్రపారంభమైంది. కలుపు మొక్కలను తొలగించి నేలను సాగుకు అనుకూలంగా మార్చటానికి దాదాపు మూడు వారాల సమయం పట్టింది. తొలుత ఆకుకూరల సాగును ్రపారంభించారు. పాలకూర, తోటకూర, మెంతికూర, చుక్కకూర, బచ్చలి, గోంగూర, పొన్నగంటి, గలిజేరు, ఎర్రతోటకూర, పుదీనా వంటి పది రకాల ఆకుకూరలను చిన్నమడులుగా చేసుకొని సాగు చేస్తున్నారు. సలాడ్లలో వినియోగించే అరుదైన బాక్చాయ్ వంటి మొక్కలతో పాటు గోధుమ గడ్డి, ఆవ ఆకులు, చేమదుంపలు, కేరట్, బీట్రూట్, చిలగడదుంప వంటి దుంప పంటలనూ ఇక్కడ సాగు చేస్తున్నారు. ప్రస్తుతం చిత్రాడ బీర, వంగ, బొప్పాయి కాత దశకు వస్తున్నాయి. త్వరలో దొండ పాదులు సైతం నాటబోతున్నారు. ప్రతీ మూడు నెలలకు నాలుగైదు రకాల కూరగాయలు పెంచే విధంగా వీరు ప్రణాళిక చేసుకుని పనిచేస్తున్నారు. ఆకర్షితులవుతున్న ప్రజలు.. పశువుల పేడ తదితరాలతో తయారు చేసిన ద్రవ జీవామృతం, ఘనజీవామృతంతో ఇక్కడ పూర్తి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. డ్రిప్, స్ప్రిక్లర్లు ఏర్పాటు చేసుకుని పొదుపుగా నీటిని వాడుతున్నారు. అనేక రకాల పంటలను కలిపి పండించటం వల్ల ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పెద్దగా పురుగు పట్టడం లేదు. తమ కళ్ల ముందే ఆరోగ్యదాయకంగా సాగవుతున్న పంటలు వర్సిటీ ఆవరణలో నిత్యం వాకింగ్‌కు వచ్చే వందలాది మందిని ఆకర్షిస్తున్నాయి. కొద్దిసేపు ఈ ్రపాంగణంలో గడుపుతూ.. ఆకుకూరలు, కూరగాయలను ఎలా పెంచుతున్నారో అడిగి తెలుసుకుంటూ.. కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. కమ్యూనిటీ ఫార్మింగ్.. ప్రతీ ఆదివారం కమ్యూనిటీ ఫార్మింగ్నిప్రోత్సహిస్తున్నారు. నగరవాసులు స్వచ్ఛందంగా ఇక్కడకు వచ్చి కొద్దిసేపు వ్యవసాయం నేర్చుకోవడం కోసం భాగస్వాములయ్యేందుకు అవకాశం కల్పించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఇక్కడకు వచ్చి కాసేపు పంట మొక్కల మధ్య సరదాగా గడుపుతున్నారు. దీనితో వారికి ఒత్తిడి నుంచి ఉపశమనం, మానసిక ప్రశాంతత లభిస్తోందని చెబుతున్నారు. వలంటీర్లకు అవకాశం.. అర్బన్ కిచెన్ గార్డెనింగ్, ప్రకృతి వ్యవసాయంపై ఆసక్తి ఉన్న నగరవాసులకు ఇక్కడ వలంటీర్లుగా పని చేసే అవకాశం కల్పిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ప్రకృతి వ్యవసాయం అలవాటు చేయడం, ప్రతీ ఇంటిలో టెర్రస్ గార్డెన్లు అభివృద్ధి చేసుకునే విధంగాప్రోత్సహించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని నిర్వాహకులు ఉమా రాజు, హిమ బిందు చెబుతున్నారు. ప్రస్తుతం ఏయూలో చదువుకుంటున్న కొంత మంది విద్యార్థులు ఇక్కడ పనిచేస్తున్నారు. మొక్కలపై తమకున్న ఆసక్తితో స్వచ్ఛందంగా ఉదయపు వేళల్లో రెండు గంటల సమయం వెచ్చిస్తున్నారు. విద్యార్థులనుప్రోత్సహిస్తూ వారికి అవని ఆర్గానిక్స్ ప్రత్యేకంగా స్టైఫండ్‌ను అందిస్తోంది. కూరగాయల మొక్కలు, ఇండోర్ ΄్లాంట్స్ను విశాఖవాసులకు అందుబాటులో ఉంచే విధంగా నర్సరీని ్రపారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ప్రజల ఆరోగ్యంపై ఏయూ ఉన్నతాధికారులతో పాటు అవని ఆర్గానిక్స్ నిర్వాహకులకు శ్రద్ధ ఉండటం, సామాజిక బాధ్యతగా అర్బన్ గార్డెనింగ్ హబ్‌ను ్రపారంభించటం ఆదర్శ్రపాయం మాత్రమే కాదు, ఇతరులకు అనుసరణీయం కూడా! – వేదుల నరసింహం, సాక్షి, విశాఖపట్నం ఫోటోలు: పి.ఎల్ మోహన్ రావు, సాక్షి, విశాఖపట్నం తిరుపతిలో 9 నుంచి ఆర్గానిక్ మేళా.. తిరుపతి గవర్నమెంట్ యూత్ హాస్టల్ గ్రౌండ్స్ (పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ వెనుక)లో మార్చి 9,10,11 తేదీల్లో ఉ.6.30– రాత్రి 8 గం. వరకు ‘కనెక్ట్ 2ఫార్మర్’ సంస్థ ఆధ్వర్యంలో ఆర్గానిక్ మేళా జరగనుంది. రైతులు తమ సేంద్రియ/ప్రకృతి వ్యవసాయోత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించేందుకు సహకరించటం.. దిగువ, మధ్య తరగతి కుటుంబాలకు ఆర్గానిక్ ఆహారోత్పత్తులను అందుబాటులోకి తేవటం తమ ముఖ్య ఉద్దేశమని కనెక్ట్ 2ఫార్మర్ ప్రతినిధి శిల్ప తెలి΄ారు. ప్రతి నెలా రెండో శని, ఆదివారాల్లో తిరుపతిలో ఆర్గానిక్ మేళా నిర్వహిస్తున్నామని, ఈ నెల ప్రత్యేకంగా 3 రోజుల మేళా నిర్వహిస్తున్నామన్నారు. 9న మొక్కల గ్రాఫ్టింగ్, 5 అంచెల పంట విధానంపై శిక్షణ ఇస్తారు. ఆసక్తి గల రైతులు, ఇంటిపంటల సాగుదారులు 63036 06326 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. 11న గృహిణులకు సిరిధాన్యాల వంటల పోటీ ఉంది. 83091 45655 నెంబర్‌కు వివరాలు వాట్సాప్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆంధ్ర, తెలంగాణ నుండి 12 చేనేత సంఘాలు చేనేత వస్త్రాలను అందుబాటులోకి తెస్తున్నారు. పిల్లల కోసం భారతీయ సాంప్రదాయ యుద్ధ కళ అయిన కలరీ, వంటింటి వ్యర్థాలతో కంపోస్ట్, పెన్ కలంకారీ పై వర్క్‌షాప్‌లు జరుగనున్నాయి. ఇతర వివరాలకు.. 91330 77050. 7న మిద్దెతోట రైతులకు పురస్కారాలు.. ఈ నెల 7న ఉ. 11 గం.కు హైదరాబాద్ రెడ్‌హిల్స్‌లోని ఫ్యాప్సీ భవన్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో పట్టణ ప్రాంతాల్లో మిద్దెతోటలు, ఇంటిపంటలు సాగు చేసుకునే 24 మంది అర్బన్ రైతులకు ‘తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోట పురస్కారాల’ ప్రదానోత్సవం జరగనుందని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వెంకటేశ్వరరావు తెలి΄ారు. తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ సమాచార కమిషనర్ ఎం. హనుమంతరావు, మిద్దెతోటల నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి అతిథులుగా పాల్గొంటారు. అందరూ ఆహ్వానితులే. ఇవి చదవండి: షేర్ ఎట్ డోర్ స్టెప్: దానానికి దగ్గరి దారి -
ఎడెక్స్‌తో ఒప్పందం రాష్ట్ర విద్యార్థులకు వరం
ఏయూక్యాంపస్: ప్రతిష్టాత్మకమైన ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం రాష్ట్ర యువతకు వరంగా నిలుస్తుందని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని యువతకు ఎడెక్స్ కోర్సులు అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తంచేస్తూ ఏయూ విద్యా విభాగం ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులు ‘థాంక్యూ సీఎం సార్..’ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఏపీ యువత పోటీపడాలని, ఇందుకనుగుణంగా విద్య ప్రమాణాలు, సామర్థ్యాలను పెంపొందించడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అందరికీ సమాన అవకాశాలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, వాటిని యువత సద్వినియోగం చేసుకుంటూ నూతన అవకాశాలను అందిపుచ్చుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు. విద్యా విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజు మాట్లాడుతూ మన విద్యార్థులు ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్ వంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచి నేరుగా కోర్సులు చదివి సర్టిఫికేషన్ పొందే అవకాశం నేడు లభించిందన్నారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు సైతం అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో కోర్సులు పూర్తిచేసే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఏయూ రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్‌స్టీఫెన్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు, విద్య విభాగం ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇంధన సామర్థ్య పరిశోధనల్లో ముందడుగు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వినూత్న ఇంధన సామర్ధ్య సాంకేతికతలను ప్రోత్సహించే లక్ష్యంతో, ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియెన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఈఈడీసీఓ) ముందడుగు వేసింది. ఇంటీరియర్ పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటర్ (ఐపీఎంఎస్‌ఎం) సాంకేతికతతో ఎనర్జీ ఎఫిషియెంట్ సబ్మెర్సిబుల్ మోటార్‌ను విజయవంతంగా తయారు చేసింది. దీని కోసం సబ్మెర్సిబుల్ వాటర్ పంపింగ్ అప్లికేషన్ల కోసం రూపొందించిన ఎలక్ట్రికల్ మోటార్ డ్రైవ్ సిస్టమ్ డిజైన్ ప్రోటోకాల్‌ను ఆంధ్రా విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసింది. ఈ పరిశోధన ప్రాజెక్ట్‌లోని మోడల్ మోటార్‌ను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యుత్ సౌధలో శుక్రవారం ఆవిష్కరించారు. వ్యవసాయ రంగంలో పంపుసెట్లు కీలకపాత్ర పోషిస్తాయని, ఐపీఎంఎస్‌ఎం మోటార్ల ద్వారా ఈ రంగంలో విద్యుత్‌ను ఆదా చేయవచ్చని ఆయన తెలిపారు. ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ఈసీఎం) ద్వారా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) నిధులతో దాదాపు 20 వ్యవసాయ పంపుసెట్లలో ఐపీఎంఎస్‌ఎం సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఏపీఈపీడీసీఎల్‌ను ఈ సందర్భంగా విజయానంద్ ఆదేశించారు. ఆంధ్రా వర్సిటీ ప్రొఫెసర్ మల్లికార్జున్ రావు, ఏపీఎస్‌ఈఈడీసీఓ టెక్నికల్ హెడ్ శ్రీనివాసులుతో కలిసి మోటార్ పనితీరును ఏపీఎస్ఈసీఎం సీఈఓ కుమార రెడ్డి వివరించారు. ఐపీఎంఎస్‌ఎం మోటార్లు సంప్రదాయ ఎలక్ట్రిక్ మోటార్లకు ప్రత్యామ్నాయమని, ఇండక్షన్ మోటార్లతో పోల్చితే తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ మోటార్లకు 80 శాతం సామర్థ్యం ఉండగా, ఐపీఎంఎస్‌ఎం అనేది 90 శాతం ఉందని వెల్లడించారు. సంప్రదాయ మోటారు జీవిత కాలం సుమారు పదేళ్లుకాగా, అధిక గ్రేడ్ మెటీరియల్స్ కారణంగా ఐపీఎంఎస్‌ఎం మోటార్ సుమారు 18 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకూ పనిచేస్తుందని చెప్పారు. తక్కువ నిర్వహణ వ్యయం,30శాతం తక్కువ విద్యుత్ వినియోగం ఉంటుందని ఆయన వివరించారు. -
నిక్ వుజిసిక్ నోట అమ్మ ఒడి.. సీఎం జగన్‌పై ప్రశంసలు
విశాఖపట్నం, సాక్షి: తమ స్ఫూర్తిదాయక ప్రసంగాలతో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురిచేసిన ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రశంసలు గుప్పించారు. మంగళవారం ఆంధ్రా విశ్వవిద్యాలయంలో యువతను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. సీఎం జగన్ తనతో పాటు ఎంతో మందికి ప్రేరణ అని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి నాకు ఒక ఇన్స్పిరేషన్. దేశంలోని యువతకు కూడా ఆయన ఇన్స్పిరేషనే. విద్యా రంగంలో సీఎం జగన్మోహన్రెడ్డి అనేక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. తన విజన్‌తో బడుల్లో మౌలిక వసతుల్ని ఏర్పాటు చేయడంతో పాటు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రమోట్ చేశారు. అమ్మ ఒడిలాంటి పథకాలు విద్యార్థులకు ఎంతో మేలు చేస్తున్నాయని నిక్ వుజిసిక్ కితాబిచ్చారు. ఆపై అక్కడి యువతను ఉద్దేశిస్తూ.. యువత తలచుకుంటే ప్రపంచాన్ని మార్చగలరు. మీ విజయాన్ని ఆస్వాదించండి. మీ హార్ట్, మీ మైండ్లోకి నెగిటివ్ వాయిస్ రానివ్వకండి. ఎప్పుడూ పాజిటివ్ థాట్స్ తో ఉండండి. మీ కలలను నిజం చేసుకోండి. సహనం అనేది ఒక గొప్ప బలం. ఎన్ని ఓడి దుడుకులు వచ్చినా బలంగా ఉండాలి. ఆశ మాత్రం వదలకూడదు. ఇండియాలో ఇకనుంచి ఐదు భాషలో వీడియో అందిస్తాను అని ప్రసంగించారాయన. నిక్ గురించి.. చేతులు,కాళ్లు లేకుండా జన్మించిన నిక్, తన తల్లిదండ్రులు అందించిన ప్రోత్సాహంతో ఒక్కోమెట్టు ఎక్కారు. తన జన్మకు ఒక లక్ష్యం ఉండాలన్న సంకల్పంతో ఎన్నో అవరోధాలు, అవమానాలు ఎదురైనా చలించకుండా, కాళ్లుచేతుల లేకపోయినా మెక్కవోని దీక్షతో ఈత కొట్టడం, సర్ఫింగ్ చేయడం, గోల్ఫ్ ఆడటం, నోటిలో పెన్ను పెట్టుకుని రాయడం, కాలి వేళ్లతో టైపింగ్ చేయడం వంటి విభిన్న సామర్ధ్యాలను అందిపుచ్చుకున్నారు. ఈ క్రమంలో ఒక మంచి వక్తగా కూడా పేరు తెచ్చుకున్నాడు. నిరాశ, నిస్పృహతో కొట్టుమిట్టాడుతున్న యువతకు తన జీవితం ఒక స్ఫూర్తి, ప్రేరణ ఇచ్చేలా ముందుకుస సాగాడు. అన్ని అవయవాలు సక్రమంగా, ఎన్నో అవకాశాలు అందుబాటులో ఉన్నా క్షణికావేశంతో, చిన్నపాటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతకు నిక్ జీవితం ఒక ప్రేరణగా నిలుస్తుంది. నేడు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిని నిక్ తన ప్రసంగాలతో స్ఫూర్తిని నింపుతూ యువతలో మనోధైర్యాన్ని నింపుతున్నారు. -
ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డిపై ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలెన్నో..!
ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. వీసీ ప్రసాద్‌రెడ్డిపై విషం చిమ్ముతోంది. ప్రైవేటు వర్సిటీల అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిష్టాత్మక యూనివర్సిటీని తెలుగుదేశం పార్టీ పట్టించుకోకపోవడంతో మసకబారిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చొరవతో కొత్త ఊపిరులందుకుంది. ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా మరలా ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి నియామకంపై ఎల్లో ఏడుపులు మాములుగా లేవు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి 2019లో మొదటిసారి వీసీగా ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి చాలా ధైర్యంగా తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా సామాజిక, రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులను ఎల్లో గ్యాంగ్ ఎదుర్కొంది. ఎల్లో మీడియా ఏడుపునకు కారణాలు చాలానే ఉన్నాయి. నారా లోకేష్ తోడల్లుడుకి చెందిన గీతం సంస్థకు పోటీగా ఏయూలో సౌకర్యాలను మెరుగుపరిచి, క్యాంపస్ రూపురేఖలు మార్చి, తరగతి బోధన విధానాలను మెరుగుపరిచి, హాస్టళ్లను ఆధునీకరించి, 150కి పైగా ఇంక్యుబేషన్ సెంటర్లు, స్టార్టప్‌లను మొదలుపెట్టి ఏయూని దేశంలోనే ఒక ప్రఖ్యాత సంస్థగా మార్చారు. దీనికి రుజువు ఈమధ్యనే ఏయూని సందర్శించిన NAAC (National Assessment Accreditation Council) టీమ్ ఏయూకి 4 మార్కులకుగాను 3.74 మార్కులను వేసి ఏయూకి ప్రతిష్టాత్మక NAAC A++ ర్యాంక్ ప్రకటించింది. నగరం నడిబొడ్డున ఏయూని ఆనుకుని ఏయూ చుట్టూ ఉన్న భూములను దశాబ్దాలుగా ఆక్రమించి వ్యాపార సముదాయాలు నిర్మించి వ్యవహారాలు నడిపిన కుహనా ఖద్దరు చొక్కాల చెర నుంచి వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను విడిపించి ఆక్రమణదారుల పీచమనిచారు. దీంతో ఎల్లోగ్యాంగ్ గుక్కపట్టి ఏడ్చారు. యూనివర్శిటీ గ్రౌండ్, చుట్టూ ఉండే పరిసరాలను పూర్తిగా ప్రక్షాళించి తుప్పలు పొదలు లేకుండా పరిశుభ్రం చేసి ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు సాగించేందుకు ఏ చిన్న అవకాశం లేకుండా కట్టడి చేయడంతో ఎల్లో గ్యాంగ్ ఆపసోపాలు పడ్డారు. ఇంతకుముందు ప్రభుత్వాన్నో, ఏయూ ఉన్నత అధికారులనో ఇబ్బందులు పెట్టాలంటే ఏయూ క్లాసుల్లోకి వెళ్లి బలవంతంగా విద్యార్థులను బయటకు తీసుకొచ్చి ధర్నాలు చేయించి పబ్బం గడుపుకునే కుహనా యువ రాజకీయ విద్యార్థి లీడర్స్ తోకలను కత్తిరించి వారిని క్యాంపస్ నుంచి బయటకు పంపారు. ఎల్లోగ్యాంగ్ హాహాకారాలు చేశారు. రాజకీయ మీటింగ్‌లకు కుల సంఘాల మీటింగ్‌లకు బలవంతంగా ఏయూ ఉద్యోగులు విద్యార్థుల నుంచి చందాలు వసూలు చేసే కుల విద్యార్థి సంఘాల కుహనా వ్యక్తులను క్యాంపస్ లోకి అడుగుపెట్టకుండా కట్టడి చేయడంతో ఎల్లోగ్యాంగ్ పెడబొబ్బలు పెట్టారు. హాస్టళ్లలో మత్తు పదార్థాలను చొప్పిస్తూ అసాంఘిక కార్యకలాపాలు సాగించే బేవర్స్‌లను మెడ పట్టుకుని బయటకు గెంటి ఏయూ ప్రశాంతతని కాపాడటంతో ఎల్లోగ్యాంగ్ విలవిల్లాడిపోయారు. ఒకప్పుడు దెయ్యాల కొంపగా ఎల్లో గ్యాంగ్‌తో అభివర్ణించిబడిన ఏయూ నేడు ప్రభుత్వ విధి విధానాలు, ప్రసాద్‌రెడ్డి అకుంఠిత దీక్ష మూలంగా అత్యంత సుందరంగా రూపుదిద్దుకోవడంతో రాబోయే పరిణామాలను ముందుగానే బేరీజు వేసుకుని లెక్కలు వేసుకుంటూ, తర్జనభర్జనలు పడుతూ పచ్చ గ్యాంగ్ ఉడికిపోతుంది. ఏం చెయ్యాలో పాలుపోక, ఏయూ ప్రగతిని అడ్డుకునే కుట్రలో భాగంగా విద్యా వ్యాపార రంగంలో పాతుకుపోయిన ఎల్లోగ్యాంగ్.. మీడియా ముసుగులో తెర వెనుక చేరి.. ప్రసాద్ రెడ్డిపై విషం చిమ్ముతోంది. ఇదీ చదవండి: భయపెట్టి.. ప్రభుత్వ భూములూ హాంఫట్! -
ఏయూపై ఎల్లో మీడియా విషం
విశాఖ సిటీ: ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయంపై పచ్చ మీడియా విషం కక్కుతోంది. వాస్తవాలను పక్కన పెట్టి రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ అసత్య కథనాలు ప్రచురిస్తోంది. టీడీపీ నేత లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభకు ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానం ఇవ్వలేదన్న అక్కసుతో అసత్య కథనాన్ని ప్రచురించింది. ఆ మైదానంలో ఆదివారం వరకు ఆర్గానిక్ మేళా జరిగిన విషయం, దాని కోసం వేసిన భారీ టెంట్లు, షెడ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. కళ్లున్న కబోదిలా విషపు రాతలు రాసింది. విఖ్యాత విద్యా సంస్థ ఆంధ్రా యూనివర్శిటీకి రాజకీయాలను ముడిపెడుతూ అవాస్తవాలు రాసిన పచ్చపత్రికపై విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్గానిక్ మేళా కారణంగా.. లోకేశ్ పాదయాత్ర ముగింపు సభను ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించడానికి అనుమతి కోరారు. అయితే ఆ మైదానంలో ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు సేంద్రీయ రైతులు, ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఆర్గానిక్ మేళా నిర్వహించారు. దీని కోసం ఏయూ నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు. ఈ మేళాకు అనూహ్య స్పందన వచ్చింది. ఆదివారం రాత్రి మేళా ముగిసింది. ఇప్పటికీ మైదానంలో వేసిన టెంట్లు, షెడ్లు, ఇతర సామగ్రి తొలగింపు పనులు జరుగుతున్నాయి. ఈ సమయంలో బుధవారం భారీ బహిరంగ సభ కోసం మైదానం కేటాయించాలని టీడీపీ నాయకులు కోరారు. ఆర్గానిక్ మేళా టెంట్లు, సామగ్రి తొలగించడానికి మరికొంత సమయం పడుతుంది. టీడీపీ సభకు వేదిక, ఇతర ఏర్పాట్లకు కనీసం నాలుగు రోజుల ముందే మైదానాన్ని అప్పగించాలి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే సభకు మైదానం కేటాయించడం సాధ్యం కాదని ఏయూ అధికారులు టీడీపీ నాయకులకు సమాధానమిచ్చారు. ఆ విషయాన్ని వారు కూడా అంగీకరించారు. ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ, పచ్చ పత్రిక మాత్రం లోకేశ్ సభకు మైదానం కేటాయించలేదన్న అక్కసుతో తప్పుడు రాతలు రాసింది. అసలు విషయాన్ని వక్రీకరిస్తూ ఉద్దేశపూర్వకంగానే మైదానం ఇవ్వలేదని ఏయూపైన, వైస్ చాన్సలర్పైనా అవాస్తవాలను ప్రచురించింది. ఏయూ వీసీ, ప్రొఫెసర్లు వైసీపీ ప్రతినిధులు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. ఏయూ సొమ్ము వాడుకున్నది చంద్రబాబే.. వాస్తవానికి ఆంధ్రా యూనివర్శిటీ సొమ్మును సొంత ప్రచారానికి వాడుకున్న ఘనుడు చంద్రబాబే. 2018లో జ్ఞానభేరి పేరుతో చంద్రబాబు ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ నిర్వహించారు. ఈ సమయంలో సొంత డబ్బా కొట్టుకోడానికి ఆంధ్రా యూనివర్శిటీ నిధులు రూ.6 కోట్లు వాడుకున్నారు. ఆయన సొంత ప్రచారం కోసం ఏయూ సొమ్ముని, మైదానాలను వాడుకున్న విషయాన్ని పచ్చ పత్రిక ప్రశ్నించదు. కానీ, అనివార్య కారణాల వల్ల మైదానం కేటాయించలేదన్న అక్కసుతో పిచ్చి రాతలు రాయడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. -
దేశరక్షకులకు ఏయూ బాసట
దేశరక్షణ కోసం చిన్నతనంలోనే పనిచేసే సైనికులు.. ఉద్యోగ విరమణ తరువాత ఉపాధి అవకాశాల కోసం అన్వేషిస్తూ.. విద్యార్హతల విషయంలో భంగపడేవారు. సైనికుల సమస్యలకు పరిష్కారం చూపుతూ త్రివిధ దళాల్లో పనిచేస్తున్న సైనికులకు ఉన్నత విద్యను చేరువచేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయం.. వారి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకొచ్చింది. దేశంలోనే తొలిసారిగా సైనికోద్యోగులకు ఉన్నత విద్య అవకాశాలను, నైపుణ్యం కలిగిన కోర్సులను అందించింది. సైనికులకు మరిన్ని సేవలందించేందుకు సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా మార్చింది. -సాక్షి, విశాఖపట్నం దేశరక్షణ కోసం అహర్నిశలు సరిహద్దుల్లో పోరాడుతున్న ఉద్యోగులకు, మాజీ సైనికులకు అవసరమైన విద్యాసంబంధ కోర్సులను అందించాలని ఏయూ సంకల్పించింది. దీన్ని ఆచరణలో పెట్టే దిశగా 2017లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఇండియన్ నేవీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఏయూతో ఒప్పందాలు చేసుకునేందుకు వారు ముందుకొచ్చారు. ఇంటర్ విద్యార్హతతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేవారికి డిప్లొమా కోర్సులను అందించడం ప్రారంభించారు. అలా ఒక డిప్లొమా కోర్సుతో మొదలుపెట్టిన ఏయూ అధికారులు ఇప్పుడు 26 డిప్లొమా కోర్సుల్ని అందిస్తున్నారు. కెమికల్, ఎలక్ట్రికల్, అకౌంటింగ్–మేనేజ్మెంట్, ఆఫీస్ మేనేజ్మెంట్, ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనింగ్, సెక్యూరిటీ అండ్ ఇంటెలిజె¯న్స్ సర్విస్, టీచింగ్ అండ్ ఎడ్యుకేష¯న్ సర్వీసెస్, హౌస్‌కీపింగ్, మ్యూజిక్, ఎయిర్‌ఫీల్ట్ సేఫ్టీ, అకౌంటింగ్ అండ్ ఆడిట్ మేనేజ్మెంట్, క్యాటరింగ్ మేనేజ్మెంట్, ఎయిర్‌సేఫ్టీ, మెటరలాజికల్ అసిస్టెŒన్స్ తదితర కోర్సులు అందిస్తున్నారు. సైనికులకు విద్యనందించాలన్న ఆశయంతో ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌ని స్కూల్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్‌గా ప్రత్యేక కేంద్రంగా మార్చి సేవలను విస్తరించారు. బీఎస్సీ డిగ్రీలు, పీహెచ్‌డీలు ఐఎన్ఎస్ విశ్వకర్మలో పనిచేస్తున్న సిబ్బందికి డిగ్రీలు అందించే దిశగా అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఉద్యోగ విరమణకు దగ్గరలో ఉన్నవారికోసం ప్రత్యేకంగా నూతన ఉపాధి అవకాశాల కల్పన గురించి ఆలోచించిన ఏయూ.. పలు ప్రీ రిలీజ్ కోర్సులను ప్రారంభించింది. ఏడాదికి 15 బ్యాచ్‌ల వరకు ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. ఒక్కో కోర్సులో 30 నుంచి 50 మంది వరకు సైనికోద్యోగులు పాల్గొంటున్నారు. వీటికి ప్రత్యేకమైన సిలబస్ రూపొందించి ఏయూ అకడమిక్ సెనేట్‌లో ఆమోదించారు. ఇప్పటివరకు 58 బ్యాచ్‌లను నిర్వహించిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 2,900 మందికిపైగా సైనికోద్యోగులకు ధ్రువపత్రాల్ని అందించింది. ఎగ్జిక్యూటివ్ కేటరిగీలో ఉన్న ఎయిర్‌ఫోర్స్ అధికారులకు పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పిస్తోంది. ఇప్పటికే 38 మంది అధికారులు పీహెచ్డీ చేశారు. కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్తో జత హైదరాబాద్‌లో ఉన్న కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్, దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీతో ఏయూ ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ వార్ఫేర్ కాలేజీతో ఎం.ఏ. పొలిటికల్ సైన్స్ అండ్ స్ట్రాటజిక్ స్టడీస్ కోర్సుల్ని అందిస్తోంది. గ్రూప్ కెపె్టన్, వింగ్ కమాండర్ స్థాయి వారికి ఈ కోర్సును అందిస్తున్నారు. ఎయిర్‌ఫోర్స్ అకాడమీలోని జూనియర్ ఆఫీసర్ ట్రైనీగా పనిచేస్తున్న వారికి పీజీ డిప్లొమాని డిజైన్ చేసి అందిస్తున్నారు. ఇంజినీరింగ్ విద్యను మధ్యలో ఆపేసిన ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ నేవీ అధికారులకోసం బీటెక్‌లో లేటరల్ ఎంట్రీ విభాగం ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు దాదాపు ఆరువేలమంది సైనికులు ఈ ఎంవోయూ ఫలితంగా బీఏ డిగ్రీలను పొంది బ్యాంకులు తదితర రంగాల్లో ఉద్యోగులుగా స్థిరపడ్డారు. దేశరక్షణకు ప్రాణాలకు తెగించి శ్రమిస్తున్న సైనికులకు ఏయూ వందనం చేస్తోంది. వారి సేవల్ని గుర్తించి.. సైనికుల జీవితాల్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు ఉన్నతవిద్య అందిస్తోంది. గత వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి చొరవతో ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇంజనీరింగ్, లా, ఫార్మసీ కోర్సుల్లో సైనికోద్యోగులకు, సైనిక వీరులకు ప్రవేశాలు కల్పిల్పిస్తున్నాం. నేవీ సిబ్బంది ఎంటెక్ చదివే అవకాశం ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో శిక్షణ పొందిన సైనికోద్యోగులకు బీపీఈడీ కోర్సు సర్టిఫికెట్లు ఇస్తున్నాం. ఇండియన్ కోస్ట్‌గార్డ్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తోను ఎంవోయూ కుదుర్చుకున్నాం. – ప్రొఫెసర్ జేమ్స్ స్టీఫెన్, ఏయూ రిజిస్ట్రార్ -
ఏయూ వీసీ నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం
సాక్షి, అమరావతి:ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) నియామక ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయబోమంది. విశ్వవిద్యాలయం వీసీగా ప్రసాద్‌రెడ్డి పనిచేసిన కాలంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై పిటిషనర్ ఇచ్చిన వినతిపత్రంపై ఛాన్సలర్ (గవర్నర్) తగిన నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణను 8 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రసాద్‌రెడ్డి వీసీగా ఉన్న సమయంలో పలు అక్రమాలు చోటుచేసుకున్నాయని, ఆయన తీసుకున్న నిర్ణయాలపై విచారణ జరిపించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పూర్వ విద్యార్థుల సంఘం హైకోర్టులో పిల్ దాఖలు చేసింది. పిటిషనర్ తరఫున న్యాయవాది పిచ్చయ్య వాదనలు వినిపిస్తూ.. ప్రసాద్‌రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారన్నారు. ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా.. ప్రకటన జారీ చేయకుండా ఏకపక్షంగా నియామకాలు చేశారన్నారు. అడ్డగోలుగా చెట్లను నరికేయించారని తెలిపారు. తిరిగి ప్రసాద్‌రెడ్డినే వీసీగా నియమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రసాద్‌రెడ్డి తీరుపై ఛాన్సలర్‌కు ఈ నెల 1న ఫిర్యాదు చేశామన్నారు. ఇప్పటివరకు ఛాన్సలర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. నవంబర్ 1న ఫిర్యాదు చేసి, స్పందించేందుకు తగిన సమయం ఇవ్వకుండా నవంబర్ 10న ఎలా పిల్ దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. స్పందించేందుకు సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందంది. ప్రసాద్‌రెడ్డినే తిరిగి వీసీగా నియమిస్తున్నారా? అని విశ్వవిద్యాలయం తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తాను తెలుసుకుని పూర్తి వివరాలు కోర్టు ముందుంచుతానని విశ్వవిద్యాలయం న్యాయవాది వి.సాయికుమార్ తెలిపారు. వీసీగా ప్రసాద్‌రెడ్డి కాల పరిమితి 24తో ముగిసిందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం, ఫిర్యాదుపై తగిన నిర్ణయం తీసుకునేందుకు ఛాన్సలర్‌కు తగిన సమయం ఇద్దామని తెలిపింది. విచారణను 8 వారాలకు వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. ఈ సమయంలో పిచ్చయ్య స్పందిస్తూ.. వీసీ నియామక ప్రక్రియను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ దశలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం సీజే ధర్మాసనం తేల్చిచెప్పింది. -
Akkineni Nagarjuna-Akhil: విశాఖ ఏయూలో నాగార్జున, అఖిల్ సందడి (ఫొటోలు)
-
మైక్రోప్లాస్టిక్‌పై ప్రత్యక్ష పరిశోధన
ఏయూ క్యాంపస్: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అంశాల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఇప్పటి దాకా కంటికి కనిపించే ప్లాస్టిక్ ఒక ఎత్తయితే, కనిపించని సూక్ష్మ కణాలుగా మారిన మైక్రో ప్లాస్టిక్ మరింత భయపెడుతోంది. దీనికి కారణం సముద్రాలు సూప్ ఆఫ్ మైక్రోప్లాస్టిక్స్‌గా మారడమే. ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్లాస్టిక్ వస్తువులు సూక్ష్మ కణాలుగా విభజన చెంది, జలచరాల శరీరంలో చేరుతున్నాయి. సీఫుడ్‌ను మానవులు పెద్ద ఎత్తున ఆహారంగా తింటున్న క్రమంలో మైక్రో ప్లాస్టిక్ క్రమేణా మానవుల శరీరాల్లోకి కూడా వచ్చి చేరుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) మెరైన్ లివింగ్ రిసోర్సెస్ విభాగం, యూరోపియన్ కమిషన్ సహాయంతో పరిశోధనలు చేపట్టింది. విస్తృత పరిశోధనకు శిక్షణ ఈ పరిశోధనల్లో భాగంగా సముద్ర జీవుల్లో చేరే మైక్రో ప్లాస్టిక్‌ను గుర్తించడం, గణించడం, అధ్యయనం చేయడం ప్రధానంగా జరుగుతోంది. ఈ రంగంలో నిపుణులను తయారు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకోసం శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రా యూనివర్సిటీ 50మందిని ఎంచుకుంది. విశ్వవిద్యాలయం పరిశోధకులు, అధ్యాపకులు, మత్త్స్య శాఖ సిబ్బంది, అధికారులు, జీవీఎంసీ అధికారులను భాగస్వాముల్ని చేసింది. ప్రత్యక్ష నైపుణ్య శిక్షణ అయితే ఈ శిక్షణను ఏయూ ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహిస్తోంది. కేవలం పాఠాలకే పరిమితం కాకుండా ప్రత్యక్ష నైపుణ్య శిక్షణతో ప్రతి ఒక్కరిలో దీనిపై విస్తృత అవగాహన ఏర్పడుతోంది. మూడు రోజుల శిక్షణలో భాగంగా రెండు రకాల చేపల్లో మైక్రో ప్లాస్టిక్స్‌ని అధ్యయనం చేశారు. ఐదు మైక్రాన్స్ కంటే తక్కువ మందం కలిగిన సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు సముద్రపు నీటిలో, ఇసుకలో, చేపల్లో ఉండటాన్ని ఈ శిక్షణలో ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. చేపల శరీర భాగాల్లో మైక్రోప్లాస్టిక్ గుర్తింపు నాచుపై చేరినప్పుడు చేపలు తినడంతో నాచు, మైక్రోప్లాస్టిక్ వాటి శరీరంలోని లివర్, కిడ్నీ, పేగుల్లో పెద్ద ఎత్తున చేరుతోంది. మూడు అంశాలపై శిక్షణ సేకరించిన సముద్రపు నీటిని వడబోసి, వ్యర్థాలను వేరుచేసి ఫొరియర్ ట్రాన్స్ఫామ్ ఇన్ఫ్రారెడ్ స్పెకోŠట్రస్కోపీ (ఎఫ్టీఐఆర్) సహాయంతో మైక్రోప్లాస్టిక్ పరిమాణాన్ని గణిస్తారు. ఇసుకలో ఉన్న మైక్రోప్లాస్టిక్‌ను ఇలాగే గణిస్తారు. చేపల్లో గుర్తించేందుకు శరీర భాగాలను వేరుచేసి జీవ పదార్థం జీర్ణమయ్యేలా రసాయనాల ప్రక్రియ చేపడుతున్నారు. మిగిలిన పదార్థాలను ఎండబెట్టి ఎఫ్‌టీఐఆర్‌లో పరీక్షిస్తారు. అయితే ప్రజలు ఎక్కువగా తింటున్న పండుగప్ప, కవ్వళ్లు చేపలతో ఈ ప్రయోగం చేయగా, లివర్, కిడ్నీల్లో పెద్ద ఎత్తున మైక్రోప్లాస్టిక్‌ను గుర్తించారు. మంచి ఆలోచన ఎంఎల్ఆర్ విభాగంలో మూడు రోజుల శిక్షణ మంచి ఆలోచన. వర్తమాన సమస్యల్లో ఇది ప్రధానమైన అంశం. మైక్రోప్లాస్టిక్ ప్రమాదం అన్ని జీవులపై ఉంటుంది. సముద్ర జీవుల్లో ఈ అధ్యయనం ఎంతో అభినందనీయం. – డాక్టర్ వి.హేమ శైలజ, ఏయూ పర్యావరణ శాస్త్ర విభాగం విలువైన సమాచారం మూడు రోజుల శిక్షణలో విలువైన సమాచారం, జ్ఞానం పొందాం. నిపుణుల ప్రసంగాలు, ప్రత్యక్ష శిక్షణ ఎంతో ఉపయోగపడ్డాయి. ఇటువంటి శిక్షణ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలి. – డాక్టర్ జి.శ్రావణ్ కుమార్, అధ్యాపకులు, జీవీపీ కళాశాల కమిషన్ సహకారం మరువలేం యూరోపియన్ కమిషన్ సహకారంతో ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాం. సమాజ ఉపయుక్త అంశంలో పరిశోధన చేపట్టాలని యూరోపియన్ యూనియన్ సూచించిన విధంగా పరిశోధనలు చేస్తున్నాం. అదే సమయంలో కొంత మందికి శిక్షణ ఇస్తూ అవగాహన పెంచుతున్నాం. – ఆచార్య పి.జానకీరామ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ -
ఆంధ్రా వర్సిటీకి తొలిసారిగా A డబుల్ ప్లస్ గ్రేడ్
-
విద్యా తేజం.. ఆంధ్రా విశ్వవిద్యాలయం
(సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం) : ఉన్నతమైన, ప్రకాశవంతమైన చదువులకు ప్రతీకగా... ‘తేజస్వినావధీతమస్తు’ అనే సమున్నత ఆశయంతో ఏటా వేలాది మంది విద్యార్థులను మేధావులుగా తీర్చిదిద్దుతున్న ఆంధ్రా విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యున్నత వర్సిటీల్లో ఒకటిగా నిలిచింది. సాగర తీరంలో, విశాలమైన ప్రాంగణంలో, ప్రశాంత వాతావరణంలో అత్యున్నత వసతులు, ప్రమాణాలతో విద్యనందిస్తూ నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నాక్)ను మెప్పించి, ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ పొందింది. నాక్ ఏయూలోని వసతులను ప్రత్యక్షంగా పరిశీలించి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్‌ను మంజూరు చేసింది. దేశంలో అత్యున్నత కోర్సులు, బోధన, సౌకర్యాలు, కలిగిన అతి కొద్ది యూనివర్సిటీలకు దక్కే ఈ గ్రేడ్‌ను ఏయూ కూడా సాధించడం విశేషం. దేశంలో 3.74 స్కోర్ బెంగళూరు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలతో పాటు ఆంధ్రా యూనివర్సిటీకి మాత్రమే దక్కింది. టాప్ స్కోర్ దక్కిన నేపథ్యంలో 2030 వరకూ వర్సిటీకి ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ ఉండనుంది. ఈ ర్యాంకులను అధికారికంగా ఈ నెల 14న ప్రకటించనున్నట్టు తెలిసింది. ఏయూ చరిత్రలో తొలిసారిగా.. నాలుగు పుస్తకాల్లోని పాఠాలు బోధించి, మార్కులతో కూడిన పట్టాని చేతిలో పెట్టి పంపించే రోజులకు స్వస్తి చెబుతూ.. యూనివర్సిటీ ఇటీవలి కాలంలో విద్యార్థి అభివృద్ధికి మార్గదర్శిగా.. పరిశోధనలకు ప్రధాన కేంద్రంగా మారుతోంది. వివిధ దేశాలు, యూనివర్సిటీలు, సంస్థల ఒప్పందాలతో చదువుకు సహకారం అందిస్తూ.. ప్రతి విద్యార్థినీ ఉన్నతంగా తీర్చిదిద్దుతూ జాతీయ స్థాయిలో అత్యున్నత స్థానం పొందింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 2002లో తొలిసారిగా 86.05 స్కోర్‌తో నాక్ ఏ గ్రేడ్ పొందింది. తరువాత 2008లో 3.64తో ఏ గ్రేడ్‌ను, 2016లో 3.6 స్కోర్‌తో మరోసారి ఏ గ్రేడ్‌ను సాధించింది. తాజాగా జాతీయ స్థాయిలో అత్యుత్తమంగా ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ని పొందింది. ఏయూలో అత్యుత్తమ విద్యా విధానాలకు, సమర్ధతకు ఈ ర్యాంకు నిదర్శనం. రానున్న ఆరేళ్ల కాలానికి ఈ ర్యాంకు యూనివర్సిటీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిలుస్తుంది. మూడు రోజులు క్షుణ్ణంగా పరిశీలన ఈ నెల 4, 5, 6 తేదీలలో ఏయూలో నాక్ బృందం పర్యటించింది. వర్సిటీలో మౌలిక వసతులు, బోధన ప్రగతి తదితర అంశాలను కమిటీ సభ్యులు ప్రత్యక్షంగా, క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టి, నిర్వహిస్తున్న స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఫర్ డిఫెన్స్ స్టడీస్, యోగా, సైకాలజీ, స్పోర్ట్స్ విభాగాలతో పాటు విభిన్న విభాగాలలో సాధిస్తున్న ప్రగతిని ప్రత్యక్షంగా పరిశీలించారు. 4.0 స్కేల్ పై 3.74 స్కోర్‌ను అందిస్తూ.. ఏ ప్లస్ ప్లస్ గ్రేడ్ మంజూరు చేశారు. ఈ విజయం వెనుక సీఎం వైఎస్ జగన్ ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంతటి ఘనవిజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికత ఉంది. విశ్వవిద్యాలయాన్ని అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్న సీఎం జగన్ ఆకాంక్షలకు, ఆలోచనలకు అనుగుణంగా పలు మార్పులు చేస్తున్న వైస్ చాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి కృషి ఉంది. వీరిద్దరూ కలిసి గత నాలుగేళ్లుగా వర్సిటీలో పలు సంస్కరణలు తెచ్చారు. విశ్వవిద్యాలయాల్లో ఎన్నడూ లేని విధంగా స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పడం, చైర్ ప్రొఫెసర్లని ఏర్పాటు చేయడం తదితర మార్పులు చేశారు. సమాజ ఉపయుక్తంగా, పరిశ్రమల అవసరాలు తీర్చే వైవిధ్య పరిశోధన కేంద్రంగా మార్చారు. ఇంజనీరింగ్‌తో సమానంగా సైన్స్, ఆర్ట్స్ కోర్సులను ఉపాధి కల్పించేవిగా రూపుదిద్దారు. ప్రపంచంలోని ఏ పరిశ్రమకైనా అవసరమైన మానవ వనరులను తీర్చిదిద్దేలా యూనివర్సిటీ రూపాంతరం చెందింది. విశ్వవిద్యాలయంలో చేరే ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు ఈ సంస్కరణలు ఊతమిస్తున్నాయి. ఇక్కడ చదివే ప్రతి విద్యార్థీ ఉన్నత సంస్థల్లో ఉపాధి పొందేలా విద్యా ప్రణాళికలను రూపొందించారు. దీంతో వేలాదిమందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రా యూనివర్సిటీ 100 పేటెంట్స్ కోసం దరఖాస్తు చేసింది. ఇక్కడి స్టార్టప్ సెంటర్లో 150 స్టార్టప్స్ ప్రారంభమయ్యాయి. ఇవన్నీ విశ్వవిద్యాలయాన్ని ఉన్నత స్థానంలో నిలబెట్టాయి. విశ్వవిద్యాలయం ఏ డబుల్ ప్లస్ గ్రేడ్ సాధించి, దేశంలో ఉన్నత స్థానాన్ని పొందడంపై వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ జేమ్స్ స్టీఫెన్, రెక్టార్లు, ప్రొఫెసర్లు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. ఏయూలో కోర్సుల వివరాలు.. యూజీ ప్రోగ్రామ్స్ – 36 పీజీ ప్రోగ్రామ్స్ – 118 పీహెచ్డీ – 57 పీజీ డిప్లొమా – 03 డిప్లొమా – 08 సర్టిఫికెట్/అవేర్నెస్ – 03 టీచింగ్ స్టాఫ్ – 538 మంది నాన్ టీచింగ్ స్టాఫ్ – 2,270 మంది విద్యార్థులు – 10,338 మంది -
ఇదేనా మహిళలను గౌరవించడం!
‘ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దైవత్వం వికసిస్తుంది. ఎక్కడ స్త్రీలు పూజింపడరో అక్కడ సత్కర్మలకు విలువ ఉండద’ని భారతీయ సంస్కృతి తెలియజేస్తోంది. త్రిశక్తి రూపంగా, ప్రకృతికి ప్రతిరూపంగా, ఆదిశక్తిగా స్త్రీని ఆరాధించడం, పూజించడం భారతీయ సంప్రదాయం. మాతృదేవోభవ అంటూ తల్లిని తొలి దైవంగా గౌరవించే విశిష్ట సంస్కృతి భారతీయుల సొంతం. వేదకాలం నుంచి నేటి ఆధునిక యుగం వరకు అన్ని రంగాలలో స్త్రీలను గౌరవించడం, ప్రోత్సహించడం జరుగుతోంది. పురాణే తిహాసాల నుంచి నేటి ఆధునిక సమాజం వరకు పరిశీలిస్తే వేదా ధ్యయనం, కళలు, యుద్ధ నైపుణ్యాలు నుంచి నేటి ఆధునిక సమాజంలో విభిన్న బాధ్యతలను అలవోకగా నిర్వహిస్తు న్నారు మన మహిళలు. అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కూతురుగా, కోడలిగా విభిన్న బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించే శక్తి కేవలం మహిళలకే ఉంది. తాను పుట్టినింటిని వదిలి, కుటుంబాన్నీ, బంధువులనూ వదలి, వేరొకరి ఇంటికి వెళ్లి వారికోసం నిస్వార్థంగా కృషి చేసే మహా మనిషి స్త్రీ మూర్తి. భారత దేశంలో స్త్రీకి అత్యంత ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఆదిమ కాలం నుంచీ ఉంది. అటువంటి సమాజంలో నేడు జరుగు తున్న కొన్ని సంఘటనలు మనిషితనం దిగజారడానికి అద్దం పడుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మంత్రి ఆర్.కె. రోజాపై తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఉన్నత స్థానంలో, మంత్రి పదవిలో ఉన్న మహిళ గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర ప్రజలందరినీ కదిలించింది. మహిళలను కించపరచడం, దూషించడం, వారి పట్ల అసభ్యకరంగా వ్యవహరించడం ఎంతమాత్రం హర్షణీయం కాదు. దీనిపై స్త్రీ, పురుషులనే వ్యత్యాసం లేకుండా సమాజంలో ప్రతి వ్యక్తీ స్పందించాల్సిన అవసరం ఉంది. రాజకీయ విలువలు, మానవీయ విలువలు, ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలుగా ఈ వ్యాఖ్యలు నిలుస్తున్నాయి. సభ్య సమాజం బండారు ఉపయోగించిన పదజాలాన్నీ, వ్యాఖ్యల్నీ ముక్త కంఠంతో ఖండిస్తూ ఉంది. అంతరిక్షంలోకి సైతం మహిళలు వెళుతున్న ఈ కాలంలో ఇటువంటి అవమానాలకు మహిళలను గురిచేయడం సమంజసం కాదు. బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ స్త్రీ, పురుషులను సమానంగా చూడాలని కాంక్షించారు. స్త్రీల హక్కుల కోసం న్యాయ శాఖమంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. ఇటువంటి మహనీయులు పుట్టిన ఈ దేశంలో, రాజ్యాంగ నిర్మాతల ఆశయా లకు విరుద్ధంగా మాట్లాడుతున్న వీరిని అంబేడ్కర్ వ్యతిరేక వాదులుగా చూడా ల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎవరైనా సరే మహిళలను అవహేళన చేయడాన్నీ, అవమానకరంగా మాట్లాడటాన్నీ ఉపేక్షించరాదు. ఇటువంటి సంఘటనలపై న్యాయస్థానాలు సైతం స్వచ్ఛందంగా స్పందించాలి. సుమోటోగా వీటిని స్వీకరిస్తూ మహిళల హక్కుల పరిక్షణకు పాటుపడాలి. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక పటిష్ఠ వ్యవస్థనూ, చట్టాన్నీ ఏర్పాటు చేసే దిశగా న్యాయకోవిదులు దృష్టి సారించాలి. ప్రజాస్వామ్య వాదులూ, మానవీయ వాదులూ అంతా దీనిని ఖండించాల్సిన అవ సరం ఉంది. ఇది మనందరి సామాజిక బాధ్యత. - వ్యాసకర్త విద్యావిభాగాధిపతి, ఏయూ. ‘ 94907 98631 -
నాగకేసరి చెట్ల నుంచి జీవ ఇంధనం
కొయ్యూరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఆసక్తి, విషయ పరిజ్ఞానం, సాధించాలనే తపన ఉంటే దేనినైనా సాధించవచ్చని నిరూపించింది ఓ గిరిపుత్రిక. తల్లిదండ్రులు తనని చదివించలేని పరిస్థితుల్లో ఉన్నా, మొక్కవోని దృఢ సంకల్పంతో ఉన్నత చదువుల్లో ప్రతిభ చూపారు రాజేంద్రపాలేనికి చెందిన దిబ్బ చంద్రవతి. ఆమె తల్లిదండ్రులు దిబ్బ సుందర్రావు, సింగారమ్మ కూలీలు. చంద్రవతి పదో తరగతి మండలంలోని పెదమాకవరం పాఠశాలలోను, ఇంటర్ పాడేరు బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో పూర్తి చేశారు. డిగ్రీ విశాఖలో చదివారు. అనంతరం ఆంధ్రా యూనివర్సిటీలో రెండేళ్లు ఎంఫిల్ చేశారు. పీహెచ్‌డీలో భాగంగా ‘నాగ కేసరి చెట్ల నుంచి జీవ ఇంధన తయారీ’పై పరిశోధనకు శ్రీకారం చుట్టారు. యూనివర్సిటీ ఆచార్యులు ఎస్బీ పడాల్ పర్యవేక్షణలో పరిశోధన నిర్వహించారు. దీనిపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురణలు జరగడంతో ఆమెను డాక్టరేట్ వరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో విలువైన ఔషధాలు ఉన్నాయని తెలిపారు. ఆదిమజాతి గిరిజనులు వృక్షాలతో అన్యోన్యంగా ఉంటారని, వివిధ రకాల రోగాలకు వారి పరిసరాల్లో పెరిగే మొక్కలు, చెట్లను ఉపయోగిస్తారని చెప్పారు. అడవిలో పెరిగే నాగ కేసరి చెట్ల నుంచి సేకరించిన విత్తనాలను నూనెగా మార్చి జీవ ఇంధనంగా తయారు చేశామని ఆమె వివరించారు. తక్కువ ఖర్చుతో ఇంధనాన్ని తయారు చేయవచ్చునని తెలిపారు. పరిశోధన పూర్తి కావడంతో ఏయూ ఉప కులపతి పీవీజీడీ ప్రసాద్ రెడ్డి నుంచి ఈనెల తొమ్మిదిన డాక్టరేట్ అందుకున్నట్టు ఆమె తెలియజేశారు. -
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్యరంగ అనుబంధ కోర్సులు
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైద్య రంగానికి అనుబంధంగా కొత్త కోర్సులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగం, నేషనల్ అసోసియేషన్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ ఇన్ ఇండస్ట్రీ(నారీ) సంయుక్త ఆధ్వర్యాన గురువారం బీచ్‌రోడ్డులోని ఏయూ సాగరిక కన్వెన్షన్‌లో ‘రీసెంట్ ట్రెండ్స్ ఆన్ ఆప్లికేషన్స్ ఆఫ్ రేడియో ఐసోటోప్స్ అండ్ రేడియేషన్ టెక్నాలజీస్’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా ఉన్నత విద్యాసంస్థలు అన్ని అంశాల్లోనూ భాగస్వాములుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ నేపథ్యంలో 98 ఏళ్ల ప్రస్థానం కలిగిన ఆంధ్ర వి«శ్వవిద్యాలయంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఏయూ ఫార్మసీ, మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, సైకాలజీ వంటి మెడికల్ సంబంధిత కోర్సులను అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం అనేక రంగాల్లో రేడియేషన్ టెక్నాలజీ పాత్ర పెరుగుతోందని, ఈ రంగంలో ఉన్న అద్భుత అవకాశాలను వినియోగించుకునేందుకు యువ పరిశోధకులు కృషి చేయాలన్నారు. డాక్టర్ అబ్రహాం వర్గీస్ మాట్లాడుతూ రేడియేషన్ టెక్నాలజీలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని రంగాలు, పరిశ్రమల్లో పెద్ద ఎత్తున ఈ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువ పరి«శోధకులు, ఆచార్యులు నూతన ఆవిష్కరణలకు కృషి చేయాలని సూచించారు. అనంతరం వీసీ ప్రసాదరెడ్డి, ‘నారీ’ ప్రధాన కార్యదర్శి పీజే చాండీ, డాక్టర్ అబ్రహాం తదితరులు సదస్సు ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. రేడియేషన్ టెక్నాలజీకి సంబంధించిన పరికరాలతో కూడిన ఎగ్జిబిషన్‌ను అతిథులు, విద్యార్థులు తిలకించారు. బ్రిట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రదీప్ ముఖర్జి, ఏయూ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కె.శ్రీని, సదస్సు చైర్మన్ ఆచార్య దుర్గాప్రసాద్, న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాధిపతి ఆచార్య లక్ష్మీనారాయణ, జాతీయ స్థాయిలో వివిధ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. -
ఒకే కుటుంబంలో ముగ్గురికి పీహెచ్‌డీలు
గూడెంకొత్తవీధి: వారిది సామాన్య మధ్యతరగతి కుటుంబం..ఉన్నత చదువులు చదవాలన్న సంకల్పం.. పట్టుదల.. వారి కలలను సాకారం చేసింది. ఒకే కుటుంబంలో ముగ్గురికి డాక్టరేట్ లభించింది. శనివారం ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ)లో జరిగిన 87–90 స్నాతకోత్సవాల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెంకొత్తవీధి మండలంలోని సీలేరుకు చెందిన గసాడి శాంతి, ఆమె భర్త సత్యవర ప్రసాద్, అతని సోదరుడు ఆనంద్ లు ఏయూ వీసీ ప్రసాదరెడ్డి చేతుల మీదుగా పీహెచ్డీ పట్టాలు అందుకున్నారు. ప్రస్తుతం సీలేరు మహిళా పోలీసుగా పనిచేస్తోన్న గసాడి శాంతి 2013–18 మధ్య సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో ప్రొఫెసర్ ప్రేమానందం సారథ్యంలో పీహెచ్డీ పూర్తి చేశారు. ఈమె భర్త సత్య వరప్రసాద్, అతని సోదరుడు ఆనంద్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ పొలిటికల్ ప్రొఫెసర్ జాలాజీ రవి సారథ్యంలో పూర్తి చేశారు. -
ఆంధ్రాయూనివర్సిటీ టాపర్‌గా గవిడి మానస
చీపురుపల్లి: సాధారణ కుటుంబంలో జన్మించి చదువుల తల్లిగా ఎదిగింది. టాపర్‌గా నిలవడానికి కావాల్సింది బ్యాక్‌గ్రౌండ్ కాదని, కేవలం కష్టపడి చదవడమేనని రుజువు చేసింది. టాపర్‌గా నిలవడానికి అహర్నిశలు కృషి చేసి ఆంధ్రాయూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలిచి నేటి యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచింది చీపురుపల్లి పట్టణానికి చెందిన గవిడి మానస. 2020–21 విద్యాసంవత్సరంలో మానస ఆంధ్రాయూనివర్సిటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ పూర్తి చేసి టాపర్‌గా నిలిచింది. అయితే ఆ విద్యా సంవత్సరానికి మానస యూనివర్సిటీ స్థాయిలో టాపర్‌గా నిలవడంతో ఆమెను 18 అవార్డులు వరించాయి. వాటిలో 4 బంగారు పతకాలు ఉన్నాయి. యూనివర్సిటీల్లో టాపర్లుగా నిలిచిన విద్యార్థులకు వివిధ సంస్థలు పతకాలు, ప్రశంసలు ఇస్తుంటాయి. అందులో భాగంగానే మానసకు 18 అవార్డులు లభించాయి. అయితే గత మూడేళ్లుగా ఆంధ్రాయూనివర్సిటీలో స్నాతకోత్సవాలు జరగకపోవడంతో వరుసగా మూడు స్నాతకోత్సవాలును శనివారం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవానికి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, జీఎంఆర్ సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా మానస మెరిట్ ధ్రువీకరణతో బాటు పతకాలు అందుకుంది. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీలోనే భౌతికశాస్త్రంపై మానస పీహెచ్డీ చేస్తోంది. ఇదిలా ఉండగా మానస తండ్రి శాంతారావు ఇందిరక్రాంతి పథం(వెలుగు)లో సీసీ గా విధులు నిర్వహిస్తుండగా తల్లి పైడిరాజు వీఓ ఏగా పని చేస్తోంది. మానస ఒకేసారి 18 అవార్డులు తెచ్చుకోవడం, యూనివర్సిటీ టాపర్‌గా నిలవడంతో స్థానికంగా హర్షాతిరేకాలు వెల్లువెత్తాయి. -
యూనివర్సిటీలు సామాజిక బాధ్యత పెంచే కేంద్రాలు
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు జ్ఞానాన్ని పెంచడమే కాకుండా విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంచే కేంద్రాలుగా నిలుస్తున్నాయని ఏపీ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏయూ కట్టమంచి రామలింగారెడ్డి కాన్వొకేషన్ హాల్లో శనివారం నిర్వహించిన ఆంధ్ర విశ్వ విద్యాలయం స్నాతకోత్సవానికి చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిశ్రమలు–శాస్త్ర రంగంలో జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జున, అవంతి ఫీడ్స్ సంస్థ ఎండీ అల్లూరి ఇంద్రకుమార్, సాహిత్యం–కళా రంగాలలో ఎస్వీ యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్‌లకు గౌరవ డాక్టరేట్లను గవర్నర్ అందించారు. 690 మంది డాక్టరేట్లను, 600 మంది మెడల్స్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య హాస్టల్, భారత్–ది జీ20 ప్రెసిడెన్షియల్ హాస్టల్, శతాబ్ది క్లాసిక్ హాస్టల్ భవనాల్ని గవర్నర్ ప్రారంభించారు. అనంతరం గవర్నర్ నజీర్ మాట్లాడుతూ.. జ్ఞానం అంతఃదృష్టి కలిగి ఉండాలని, దానికి నైతికత జోడిస్తేనే విలువ ద్విగుణీకృతమవుతుందని వ్యాఖ్యానించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నత విద్య జ్ఞాననిధిగా మారిందని.. దేశంలోని అత్యంత పురాతన విశ్వవిద్యాలయాలలో ఒకటిగా నిలుస్తోందని అన్నారు. శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న ఈ విశ్వవిద్యాలయం సర్ సీఆర్ రెడ్డి, సర్వేపల్లి, డాక్టర్ వీఎస్ కృష్ణ వంటి వారి సారథ్యంలో ఎంతో ప్రగతి సాధించిందని కొనియాడారు. ఏయూ అమలు చేస్తున్న నూతన విధానాలను ఇతర విశ్వవిద్యాలయాలు సైతం అమలు చేస్తే ప్రతిభ కలిగిన యువతను దేశంలో స్థిరపడే విధంగా చేయడం సాధ్యమన్నారు. నాక్‌లో ప్రతిసారి అత్యుత్తమ గ్రేడ్ సాధించడం శుభపరిణామమని అభినందించారు. ఏయూ తెలుగు ప్రజలందరిదీ: బొత్స రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు ప్రజలందరిదీ అన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని.. విద్య కోసం ఏ రాష్ట్రం చేయనంత ఖర్చు చేస్తున్నామని వివరించారు. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సమగ్రాభివృద్ధి, విద్యా నైపుణ్యం దిశగా ఏయూ అడుగులు వేస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతకు అనుగుణంగా ఇంజినీరింగ్, సైన్స్, ఫార్మసీ రంగాల్లో ఆవిష్కరణలు జరిపే సౌలభ్యంతో కూడిన మౌలిక వసతులు కలి్పస్తూ ప్రోటో టైప్, కమర్షియలైజేషన్ దిశగా నడిపిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నెలకొలి్పన నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ 17 స్టార్టప్స్‌కు స్థానం కలి్పంచిందన్నారు. ఏయూ పరిశోధన, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపయుక్తంగా 54 ఎంఓయూలు చేసుకున్నట్టు చెప్పారు. ఏయూ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
రిజిస్ట్రేషన్ల సులభతరానికే కార్డు–2.0
దొండపర్తి(విశాఖ దక్షిణ): ప్రజలకు సులభతర, సురక్షిత రిజిస్ట్రేషన్ సేవలు అందించాలన్న లక్ష్యంతోనే కార్డు–2.0 సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఇన్స్పెక్టర్ జనరల్ రామకృష్ణ తెలిపారు. నూతన దస్తావేజుల రిజిస్ట్రేషన్ విధానం కార్డు–2.0పై ఉన్న అపోహలను తొలగించేందుకు మంగళవారం ఆంధ్ర యూనివర్సిటీలో అవగాహన సదస్సు నిర్వహించారు. నూతన విధానం, సాఫ్ట్వేర్ పనితీరు, దాని ప్రయోజనాలను వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 1999లో అప్పటి అవసరాలకు తగినట్లుగా రూపొందించిన రిజిస్ట్రేషన్ సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికీ వినియోగిస్తున్నామని చెప్పారు. అయితే, రిజిస్ట్రేషన్ల విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రజల కష్టాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నింటికీ చెక్‌పెట్టి, మెరుగైన, సులభతరమైన రిజిస్ట్రేషన్ సేవలు అందించేందుకు సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రెండువేల గ్రామాల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి వచ్చాయని, త్వరలోనే మరో రెండువేల గ్రామాల్లో సేవలు ప్రారంభించేందుకు ఏర్పాట్లుచేస్తున్నామని చెప్పారు. ఈ కొత్త సాఫ్ట్వేర్ ద్వారా సులువుగా దస్తావేజుల తయారీ నుంచి రిజిస్ట్రేషన్ల కోసం గంటల తరబడి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వేచి ఉండే పరిస్థితి లేకుండా ముందుగానే అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకునే వెసులుబాటు ఉంటుందని తెలిపారు. ప్రధానంగా చిన్నచిన్న కారణాలతో దస్తావేజులను సబ్‌రిజిస్ట్రార్ తిరస్కరించే అవకాశం ఉండదని ఐజీ వివరించారు. ప్రయోగాత్మకంగా 23 చోట్ల.. ఈ కార్డు–2.0ను ప్రయోగాత్మకంగా 23 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలుచేస్తున్నట్లు చెప్పారు. ఇందులో నిషేధిత భూములు, స్టాంప్ డ్యూటీ విలువ, మార్కెట్ విలువ, డాక్యుమెంట్ జనరేషన్, సులువుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆటో మ్యుటేషన్ ఇలా అన్ని సేవలను ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఇప్పటికే ఆయా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నూతన విధానం ద్వారా అందిస్తున్న సేవలకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని.. ఎటువంటి ఫిర్యాదులు, ఇబ్బందులు తలెత్తలేదని ఐజీ రామకృష్ణ చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించి సాఫ్ట్‌వేర్‌ను అందుకు అనుగుణంగా మార్పులు చేస్తామన్నారు. విష ప్రచారాన్ని నమ్మొద్దు ఇక కార్డు–2.0పై కొంతమంది మిలిటెంట్ తరహాలో విషప్రచారం చేస్తున్నారని వాటిని ప్రజలు, డాక్యుమెంట్ రైటర్లు నమ్మొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆన్లైన్, ఈ–సైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్లను తనఖా సంస్థలు, బ్యాంకులు అంగీకరించవన్నది తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు. అలాగే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్–2000 వచ్చిన తరువాత ఈ–సైన్ ద్వారా ప్రజలు దస్తావేజుల మీద సంతకాలు చేయవచ్చని తెలిపారు. ఈ నూతన విధానం ద్వారా వ్యవసాయ, వ్యవసాయేతర భూముల డబుల్ రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట పడుతుందన్నారు. అదే విధంగా డాక్యుమెంట్ రైటర్ల ఉపాధి దూరమవుతుందనడంలో నిజంలేదన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ బాలకృష్ణ పాల్గొన్నారు. -
ఏయూలో ఉద్యోగాలు కోత కథనాలన్నీ అవాస్తవాలే
ఏయూ క్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యుల ఉద్యోగాల భర్తీలో 200 పోస్టులకు కోత అని, ఏయూకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేసిందంటూ పత్రికల్లో వచ్చిన కథనాల్లో ఏమాత్రం వాస్తవాలు లేవని ఏయూ అకడమిక్ డీన్ ఆచార్య ఎ.కిశోర్‌బాబు తెలిపారు. శనివారం పచ్చ పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయన వివరణ ఇచ్చారు. 2015–16లో అప్పటి టీడీపీ ప్రభుత్వం నియమించిన రేషనలైజేషన్ కమిటీ అధ్యయనం తరువాత 2017లో ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్ 39ని విడుదల చేసిందని, దీనిలో ఏయూలో 936 ఖాళీలకు గాను రేషనలైజేషన్ తరువాత 750 ఉద్యోగాలు ఉన్నట్లు తేల్చిందని చెప్పారు. కమిటీ సూచించిన ఖాళీల్లో తొలి దశలో 281, రెండో దశలో 104 ఉద్యోగాలు వెరసి 391 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేయాలంటూ జీవో 39లో పేర్కొందని తెలిపారు. అయినప్పటికీ ఒక్క ఖాళీని కూడా భర్తీ చేయలేకపోయిందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ జీవోఎంఎస్ 61ని విడుదల చేస్తూ ఏయూలో ఒకే దఫాలో మొత్తం 726 ఖాళీలు భర్తీ చేయాలని సూచించిందని చెప్పారు. ప్రస్తుత రేషనలైజేషన్ కమిటీ గత ఎనిమిది నెలల కాలంగా శాస్త్రీయంగా పరిశీలన జరిపి అందరి నుంచి వివరాలు తీసుకుని 726 ఉద్యోగాలు భర్తీచేయడానికి నోటిఫికేషన్ సిద్ధం చేయాలని సూచించిందని వెల్లడించారు. దీనిని పరిశీలిస్తే ఏయూలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో భర్తీ చేయాలని విడుదల చేసిన ఖాళీల కంటే అధికంగా ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రస్తుత ప్రభుత్వం సూచించిందనే వాస్తవాన్ని తెలుసుకోవాలన్నారు. ఏయూ అవసరాల దృష్ట్యా మరిన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం 24 పోస్టులే తగ్గాయి ప్రస్తుతం ఏయూలో దూరవిద్య కేంద్రం పూర్తిగా ఆటోమేషన్ చేయడంతో పాటు విజయనగరం, కాకినాడ, తాడేపల్లిగూడెం పీజీ సెంటర్లను మూసివేయడం, ఇతర విశ్వవిద్యాలయాల్లో విలీనం చేయడం జరిగింది. క్యాంపస్‌లో న్యూక్లియర్ కెమిస్ట్రీ, బయో ఇనార్గానిక్ కెమిస్ట్రీ, బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ వంటి కోర్సులకు విద్యార్థుల నుంచి తగినంత స్పందన లేకపోవడంతో నిలిపివేశారు. దీనికారణంగా కేవలం 24 ఉద్యోగాలు మాత్రమే తగ్గాయనే వాస్తవాన్ని గుర్తెరగాలని సూచించారు. -
ఏయూతో యూకే యూనివర్సిటీ ఎంవోయూ
ఎంవీపీకాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయంతో యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హైలాండ్స్ అండ్ ఐస్లాండ్స్ అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ ఈసీ హాల్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, సౌత్ ఇండియా బ్రిటిష్ కౌన్సిల్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, యూకే ఇంటర్నేషనల్ హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషనర్ సనమ్ అరోరా ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఒప్పందంలో భాగంగా ఎంబీఏ, ఎమ్మెస్సీ అప్లయిడ్ డేటా ప్రాసెస్ కోర్సుల్లో రెండు యూనివర్సిటీలు సంయుక్త సహకారంతో ముందుకెళ్తాయని చెప్పారు. ఏయూ ద్వారా రాష్ట్రంలోని ఏ విద్యార్థి అయినా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని చెప్పారు. యూకే ఇండియా ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా ఈ కోర్సులు చేసే విద్యార్థులకు 10 శాతం ఫీజు రాయితీతో పాటు స్కాలర్షిప్ అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రపంచంలోని టాప్ వర్సిటీల్లో ఏపీ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనలకు అనుగుణంగా ఆంధ్రా యూనివర్సిటీ విదేశాల్లోని ప్రఖ్యాత వర్సిటీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, బేమ్ గ్లోబల్ సొసైటీ సీఈవో నవిందర్ కెప్లీష్, ఏయూ ఇంటర్నేషనల్ అఫైర్ అసోసియేట్ డీన్ డాక్టర్ శ్రీనివాసరావు, ఏయూ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
పవన్ క్షమాపణ చెప్పాలి
ఏయూ క్యాంపస్ : ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆంధ్ర విశ్వవిద్యాలయంపై చౌకబారు విమర్శలు చేయడం పవన్‌కళ్యాణ్ మానుకోవాలని ఏయూ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జి.రవికుమార్ ఘాటుగా బదులిచ్చారు. ఏయూ ప్రతిష్టకు భంగం కలిగేలా పవన్ చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఆయన ఖండించారు. ఉద్యోగులు, విద్యార్థుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన జనసేన అధినేత వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాలకు అందించే ర్యాంకింగ్ అనేది ప్రధానంగా విద్యార్థులు, ఆచార్యుల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ♦ ర్యాంకింగ్‌లో పాల్గొనే విద్యా సంస్థల సంఖ్యపై కూడా వర్సిటీల ర్యాంకులు ఆధారపడి ఉంటుంది. 2019లో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌కి కేవలం వెయ్యి విద్యా సంస్థలు పాల్గొంటే, 2023లో 2,478 సంస్థలు పాల్గొన్నాయి. ♦ తొలి 100 స్థానాల్లో నిలిచే విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్ 2.5 నుంచి 4 మార్కుల వ్యత్యాసం మాత్రమే ఉంటుంది. ర్యాంకింగ్ విధానంలో ఐఐటీలు, కేంద్రీయ, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు కొంతమేర ప్రయోజనం పొందుతున్నాయి. ♦ గతంలోనే ఐఐటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆచార్య రాంగోపాల్ ర్యాంకింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని సూచించారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, కేంద్ర, డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు పరిమితులు (పారామీటర్స్) వేరుగా ఉండాల్సిన అవసరముందని అన్నారు. ♦ ఇక ఏయూలో విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల్లో ఉద్యోగాలు సాధించే వారి సంఖ్య 2018తో పోలిస్తే 25 శాతానికి పైగా పెరిగింది. 2023లో ఏయూ విద్యార్థులు పొందిన అత్యధిక వార్షిక వేతనం రూ.84.5 లక్షలు. 2018లో విద్యార్థులు సాధించిన అత్యధిక వార్షిక వేతనం కేవలం రూ.22 లక్షలు మాత్రమే. ♦ కేంద్ర విశ్వవిద్యాలయాల కంటే మిన్నగా ఏయూలో ఏర్పాటుచేసిన టెక్ స్టార్టప్, ఇంక్యుబేషన్ సెంటర్ పనిచేస్తున్నాయి. ఇప్పటికే 124కి పైగా సాఫ్ట్వేర్ సంస్థలు ఇక్కడ పనిచేస్తున్నాయి. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్‌లో ఏయూ స్టార్టప్–ఇంక్యుబేషన్ సెంటర్ 14వ ర్యాంకు సాధించింది. తొలి 13 స్థానాల్లో ఐఐటీలు మాత్రమే నిలిచాయి. ♦ జాతీయ విశ్వవిద్యాలయాల తరహాలో 18 చెయిర్ ప్రొఫెసర్లు కలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఏయూ. దీనిపై ఉన్న నమ్మకంతో నవరత్న కంపెనీల నుంచి అమెరికాలో స్థిరపడిన భారతీయులు, ఏయూ పూర్వవిద్యార్థులు ఐఐటీ ఢిల్లీ తరహాలో ఇక్కడ చెయిర్ ప్రొఫెసర్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇలా.. వర్సిటీలో ఇంత అభివృద్ధి జరుగుతున్నా తెలుసుకోకుండా ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ని పవన్ చదవడం సరికాదు. ఇప్పటికైనా తప్పు తెలుసుకుని ఏయూకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి. విద్య, వివేకంలేని వ్యక్తిలా పవన్ విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ ఏయూ క్యాంపస్ : జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు విద్య, వివేకంలేని వ్యక్తి మాటల్లా ఉన్నాయని విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు పులపా రవీంద్రనాథ్ ఠాగూర్ విమర్శించారు. ఏయూపై పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఏయూను శుక్రవారం సందర్శించిన ఆయన మాట్లాడుతూ.. ప్రజలు హర్షించేలా పవన్ మాట్లాడాలని హితవు పలికారు. నిజమైన విద్యావంతుడు, సంస్కారవంతులెవరూ ఏయూని ఉద్దేశించి ఇలా మాట్లాడరన్నారు. పవన్ ఈ ప్రశ్నలకు బదులివ్వు.. ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు భారతీయ విద్యావ్యవస్థపై పవన్ అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదని ఏయూ విద్యా విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్ రాజు అన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థపై ఆరోపణలు చేసే ముందు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం సమంజసం కాదన్నారు. ఇన్ని అసత్య ఆరోపణలు చేసిన పవన్‌కు తాను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నానని.. వాటికి ఆయన సమాధానం చెప్పాలని షారోన్‌రాజు సవాల్ విసిరారు. అవి.. ♦ ఏయూకి 2018లో ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.150 కోట్లు నిధులను పసుపు–కుంకుమ పథకానికి ఎందుకు మళ్లించారు. అప్పుడు మీరు దీనిపై ఎందుకు ప్రశ్నించలేదు? ♦ ఏయూ సొంత నిధుల నుంచి రూ.5 కోట్లు వెచ్చించి జ్ఞానభేరి సభను చంద్రబాబు నిర్వహించారు. వాటిని ఎందుకు తిరిగి చెల్లించలేదు? ♦విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగ నియామకాలపై 1996 నుంచి 2006 వరకు, తిరిగి 2014 నుంచి 2018 వరకు ఎందుకు నిషేధం విధించారు? ♦పోలమాంబ ఆలయం పక్కనే, ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న రూ.300 కోట్లు విలువైన స్థలాన్ని ఇటీవల ఏయూ స్వాధీనం చేసుకుంది. ఇంతకాలం ఈ స్థలం ఎవరి గుప్పిట్లో ఉందో మీకు తెలుసా? ♦ 2019–2023 మధ్య 200 మందికిపైగా ఆచార్యులు ఏయూలో పదవీ విరమణ చేశారు. అయినప్పటికీ ఏయూ జాతీయ స్థాయిలో మెరుగైన ర్యాంకులు, స్కోర్‌ను మెరుగుపర్చుకుంటూ వస్తోంది. దార్శనికత కలిగిన రాష్ట్ర సీఎం ప్రపంచ స్థాయి విధానాలను అమలుచేయడంవల్లే ఇది సాధ్యపడింది. ఈ విషయం మీకు తెలుసా? -
రాజకీయ లబ్ది కోసమే పవన్ ఏయూ పై విమర్శలు చేస్తున్నారు
-
ఏయూ అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం జగన్ (ఫోటోలు)
-
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
ఏయూలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్’
ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ‘మేకపాటి గౌతంరెడ్డి ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడిటేషన్ అండ్ దమ్మ’ నిర్మాణానికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి భూమి పూజ చేశారు. శనివారం ఉదయం ఏయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అసెంబ్లీ మందిరం వెనుక భాగంలో నూతనంగా మహాబోధి సొసైటీ నిర్వహించే ఈ కేంద్రం నిర్మాణాన్ని భూమి పూజతో ప్రారంభించారు. భవనం నిర్మాణానికి అవసరమైన రూ.1.4 కోట్లను రాజమోహన్‌రెడ్డి అందించనున్నారు. భూమి పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏయూలో ఏర్పాటవుతున్న ఇలాంటి మంచి కార్యక్రమంలో తాను భాగం కావడంపై సంతోషం వ్యక్తం చేశారు. నగరం మధ్యలో విశాఖ ప్రజలకు ఉపయుక్తంగా ఇంతటి సువిశాల ప్రాంగణంలో మెడిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన గొప్పదన్నారు. దీనికి తన కుమారుడు మేకపాటి గౌతంరెడ్డి పేరు పెట్టడం సంతోషకరమన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయ అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ధమ్మ చార్య విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. విశాఖను రాజధానిగా చేస్తే అంతర్జాతీయ ఖ్యాతి విశాఖ మన రాజధాని అయ్యేలా అందరూ చూడాలని మాజీ ఎంపీ మేకపాటి కోరారు. మద్రాసు నుంచి విడిపోయినప్పుడే విశాఖ రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా చేసి అక్కడ హైకోర్టు ఏర్పాటు చేసి ఉంటే ప్రజలంతా సంతోషించేవారని చెప్పారు. అలా జరిగి ఉన్నట్లయితే అంతర్జాతీయ నగరంగా విశాఖ ఈ పాటికే రూపుదిద్దుకునేదని, ఇప్పటికే చాలా ఆలస్యమైందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ఎంపిక చేయడం మంచి పరిణామమన్నారు. బహుశా న్యాయ వ్యవస్థ సైతం దీనికి సహకరిస్తుందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. -
ఉద్యోగాలు పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు సత్కారం
-
ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగ విప్లవం
-
ఏయూలో వియత్నాం విద్యార్థుల సందడి
-
Global Investment Summit: విశాఖ ధగ ధగ
విశాఖ జీఐఎస్ వేదిక నుంచి సాక్షి ప్రతినిధుల బృందం: రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని విధంగా దేశ, విదేశీ కార్పొరేట్ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023కు వేదికగా విశాఖ సిద్ధమైంది. పారిశ్రామిక అభివృద్ధికి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవికతకు దగ్గరగా జరగబోతున్న ఈ సదస్సు కోసం ప్రపంచ వాణిజ్యవేత్తలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం. ముఖేష్ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్ అదానీ, సంజీవ్ బజాజ్, అర్జున్ ఒబెరాయ్, సజ్జన్ జిందాల్, నవీన్ జిందాల్, మార్టిన్ ఎబర్ హార్డ్డ్, హరిమోహన్ బంగూర్, సజ్జన్ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. నేటి ఉదయం 10.15 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సదస్సును లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కార్పొరేట్ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు స్వాగతం పలుకుతున్న ప్రజలు 14 రంగాల్ని ప్రమోట్ చేస్తున్న ప్రభుత్వం ► రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్ జగన్ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ► రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్, ఎంఎస్ఎంఈ, స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్ అండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్, టూరిజం అండ్ హాస్పిటాలిటీ, అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్ అండ్ అప్పరెల్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, పెట్రోలియం అండ్ పెట్రోకెమికల్స్ తదితర రంగాలపై ఫోకస్ చేస్తోంది. ► ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. ► సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్ అవుట్ బిజినెస్ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్ సౌకర్యం కల్పించారు. ► సభా ప్రాంగణంలో అత్యంత ఆకర్షణీయంగా ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. దీని చుట్టూ వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఉంటాయి. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థకు సంబంధించిన కార్యాలయ నమూనా, లేపాక్షి హస్త కళా ప్రదర్శన స్టాల్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఏరోస్పేస్, మారిటైమ్ బోర్డు, కియా మోటర్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తదితర పరిశ్రమలకు చెందిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. దారులన్నీ.. వైజాగ్ వైపే.. ► వేదికకు ఎదురుగా ఏయూకు చెందిన మరో 25 ఎకరాల మైదానాన్ని పార్కింగ్ కోసం సిద్ధం చేశారు. ప్రముఖ పారిశ్రామిక ప్రతినిధులు, కేంద్ర మంత్రులు 25కు పైగా ఛార్టర్డ్ ఫ్లైట్స్‌లో రానున్నారు. వాటికి విశాఖ, రాజమండ్రి ఎయిర్‌పోర్టులలో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. తొలిరోజు రాతిర సాగరతీరం సమీపంలోని వుడాపార్క్ ఎంజీఎం గ్రౌండ్స్‌లో అతిథులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 500 డ్రోన్లతో లేజర్ ప్రదర్శన ద్వారా పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తారు. దిగ్గజ పారిశ్రామిక వేత్తలతో సీఎం ముఖాముఖి తొలిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు 21 మంది కార్పొరేట్ ప్రముఖులు ప్రసంగించనున్నారు. 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను సీఎం కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సీఎం వైఎస్ జగన్.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముఖేష్ అంబానీ, కేఎం బిర్లా, కరణ్ అదానీ, అర్జున్ ఒబెరాయ్, సంజీవ్ బజాజ్, ఎబర్‌హార్డ్, నవీన్ జిందాల్, సుమిత్ బిదానీ తదితరులతో ముఖాముఖి చర్చలు నిర్వహిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల్ని వారికి స్వయంగా వివరించనున్నారు. రెండో రోజు శనివారం ఉదయం 9.15 నుంచి 10.45 గంటల వరకు పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఉదయం ఎంవోయూల అనంతరం ముగింపు సమావేశంలో 10 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శర్బానంద సోనోవాల్ ప్రసంగించనున్నారు. అనంతరం రాష్ట్రంలో ఉత్పత్తికి సిద్ధమైన పలు యూనిట్లను ముఖ్యమంత్రి జీఐఎస్ వేదిక నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్న వైఎస్సార్సీపీపీ నేత విజయసాయిరెడ్డి సీఎం వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం సాక్షి, విశాఖపట్నం: ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్–2023’లో పాల్గొనేందుకు విశాఖకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. గురువారం సాయంత్రం 4 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి 5 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న ముఖ్యమంత్రికి టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మంత్రి గుడివాడ అమర్నాథ్, మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, భీశెట్టి సత్యవతి, వీఎంఆర్డీఏ చైర్పర్సన్ అక్కరమాని విజయనిర్మల, కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున, సీపీ సీహెచ్ శ్రీకాంత్, జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ రాజాబాబు స్వాగతం పలికారు. అనంతరం రుషికొండలోని రాడిసన్ బ్లూ హోటల్‌కు చేరుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP Global Investors Summit 2023: పెట్టుబడులకు రాచబాట
రాష్ట్ర ప్రగతిని చూడండి విశాఖలో మార్చి 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సమావేశాలకు ప్రతి ఒక్కరూ హాజరై రాష్ట్ర ప్రగతి, అందాలను ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నా. మీ అందర్నీ త్వరలో విశాఖ సదస్సులో కలుస్తా. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సహజ వనరులకు నిలయమైన ఆంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ కీలకమైన 15 రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. తొలిరోజైన మార్చి 3వ తేదీన తొమ్మిది రంగాలపై, రెండో రోజు 6 రంగాలపై చర్చలు జరగనున్నాయి. ఇందుకోసం ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీ–గ్రీన్ హైడ్రోజన్, హెల్త్‌కేర్–మెడికల్ ఎక్విప్మెంట్, ఏరోస్పేస్–డిఫెన్స్, పెట్రోలియం–ప్రెటో కెమికల్స్, స్కిల్ డెవలప్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ఫ్రా–లాజిస్టిక్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్–ఈవీ, స్టార్టప్స్–ఇన్నోవేషన్స్, ఉన్నత విద్య, టూరిజం, టెక్స్టైల్, ఫార్మా స్యూటికల్స్ రంగాలను ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఆయా రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ఒనగూరే లాభాలను వివరిస్తూ ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థల అభిప్రాయాలతో వీడియో విజువల్స్ సిద్ధం చేయడమే కాకుండా ప్రత్యేక సెషన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న మార్పులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం లాంటి అంశాలపై పారిశ్రామికవేత్తలు, నిపుణులు పాల్గొనేలా మొత్తం 15 సెమినార్లను నిర్వహించనుంది. ఇందుకోసం ప్రధాన సమావేశ మందిరానికి అదనంగా మరో మూడు సెమినార్ హాల్స్‌ను సిద్ధం చేశారు. విశాఖకు కార్పొరేట్ దిగ్గజాలు వాస్తవ పెట్టుబడులే లక్ష్యంగా నిర్వహిస్తున్న జీఐఎస్ 2023లో పాల్గొనేందుకు దేశ విదేశాలకు చెదిన కార్పొరేట్ దిగ్గజ సంస్థలు విశాఖకు తరలి వస్తున్నాయి. రిలయన్స్ గ్రూపునకు చెందిన ముఖేష్ అంబానీ, అదానీ గ్రూపు గౌతమ్ అదాని, అర్సల్ మిట్టల్ గ్రూపు సీఈవో ఆదిత్య మిట్టల్, ఆదిత్య బిర్లా గూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా, టెస్లా కోఫౌండర్ మార్టిన్ ఎంబరహర్డ్ లాంటి 22 మందికిపైగా కార్పొరేట్ ప్రముఖులు ప్రారంభ సమావేశంలో పాల్గొంటారని అధికారులు వెల్లడించారు. మార్చి 3వతేదీన తొలి రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.15 వరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అధ్యక్షతన జీఐఎస్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిషన్‌రెడ్డి, ఆర్కే సింగ్‌తో పాటు వివిధ రంగాలకు చెందిన కేంద్ర కార్యదర్శులు ఇందులో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సెమినార్లు నిర్వహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేశారు. సెమినార్లు జరుగుతున్న సమయంలోనే ప్రధాన సమావేశ మందిరంలో ఆహార వ్యవస్థలో మారుతున్న పరిణామ క్రమాలపై ప్రత్యేక చర్చ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అనంతరం అతిథుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం విందు ఇవ్వనుంది. సీఎం సమక్షంలో ఒప్పందాలు.. సమ్మిట్ రెండో రోజు మార్చి 4న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 వరకు సెమినార్లు జరుగుతాయి. అనంతరం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో పెట్టుబడుల ఒప్పందాల అనంతరం ముగింపు సమావేశం జరగనుంది. ముగింపు సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ చైర్మన్ డాక్టర్ సతీష్‌రెడ్డి, వెల్ప్సన్ గ్రూపు ఎండీ రాజేష్ మండవేవాలా, దివీస్ ల్యాబ్ సీవోవో కిరణ్ దివీ, లారస్ ల్యాబ్ ఫౌండర్ సీఈవో చావా సత్యనారాయణతోపాటు మొత్తం 10 మంది కార్పొరేట్ ప్రముఖులు పాల్గొంటారు. కేంద్ర మంత్రులు సర్బానంద్ సోనావాలా, రాజీవ్ చంద్రశేఖరన్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ముగింపు సమావేశానికి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధును ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. రంగాల వారీగా సెమినార్లు, వక్తల వివరాలు మార్చి 3వతేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 3.50 వరకు అంశం: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మోడరేటర్: సౌరభ్‌గౌర్, రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి వక్తలు: డాక్టర్ సత్యనారాయణ డైరెక్టర్ ఐఐటీ తిరుపతి, రవి తంగిరాల మాస్ మ్యూచువల్ హెడ్, ఫ్రొఫెసర్ కోన్ ముజాకిస్ డైకిన్ యూనివర్సిటీ కోఫౌండర్, శ్రీధర్ కోసరాజు ఐటాప్ ప్రెసిడెంట్, లక్స్రావు చేపూరి సీఈవో టెక్నోజెన్, విజయ్ భాస్కర్ రెడ్డి టెక్‌బుల్ డైరెక్టర్ ► అంశం: ఆటోమొబైల్– ఎలక్ట్రిక్ వాహనాలు మోడరేటర్: పీస్ ప్రద్యుమ్న, రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శి వక్తలు: మాట్రిన్ ఎంబర్హార్డ్ టెస్లా కోఫౌండర్, కేవీ ప్రదీప్ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఎండీ, రాజేష్ మిట్టల్ ఇసుజు ఇండియా ప్రెసిడెంట్, కబ్దాంగ్లీ కియా ఇండియా చీఫ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్, శశాంక్ శ్రీవాత్సవ మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, కమల్ బాలి వోల్వో గ్రూపు ప్రెసిడెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. ► అంశం: రెన్యువబుల్ ఎనర్జీ మోడరేటర్: రమణారెడ్డి, నెడ్‌క్యాప్ ఎండీ వక్తలు: గురుదీప్‌సింగ్ ఎన్టీపీసీ సీఎండీ, అనిల్ చలమలశెట్టి గ్రీన్కో సీఈవో, నవాల్ సైని బ్రూక్‌ఫీల్డ్ ఎండీ, సుబ్రమణ్యం పులిపాక నేషనల్ సోలార్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సీఈవో, డేవిడ్ ఏ కొల్లార్డ్ స్కేల్ ఫెసిలిటేషన్ మేనేజింగ్ పార్టనర్–సీఈవో, విపుల్ తులి సెంబ్‌కార్ప్ సౌత్ ఏషియా సీఈవో, విశ్వేశర రెడ్డి షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ ఎండీ. సాయంత్రం 4 నుంచి 4.50 వరకు ► అంశం: ఇండస్ట్రియల్ లాజిస్టిక్ – ఇన్ఫ్రా మోడరేటర్: రవీంద్రనాథ్‌రెడ్డి, డిప్యూటీ సీఈవో ఏపీ మారిటైమ్ బోర్డు వక్తలు: సుమిత్ దావ్రా డీపీఐఐటీ ప్రత్యేక కార్యదర్శి(లాజిస్టిక్స్), జీబీఎస్ రాజు చైర్మన్ జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, రవి సన్నారెడ్డి చైర్మన్ శ్రీసిటీ, రవికాంత్ యమర్తి లాజిస్టిక్స్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, సుకుమార్ కామేశ్వరన్ సీవోవో టీవీఎస్ సప్లైచైన్ సొల్యూషన్స్, అనయ్ శుక్లా సీసీవో వెల్సపన్ వన్ లాజిస్టిక్స్. ► అంశం: స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్ మోడరేటర్: సౌరభ్ గౌర్, కార్యదర్శి రాష్ట్ర ఐటీ శాఖ వక్తలు: బీవీ నాయుడు, కర్నాటక డిజిటల్ ఎకానమీ మిషన్ చైర్మన్, విజయ్ శేఖర్ శర్మ, పేటీఎం ఫౌండర్ చైర్మన్, శ్వేత రాజ్‌పాల్ కొహ్లి సీక్వోయా క్యాపిటల్ చీఫ్ పబ్లిక్ పాలసీ ఆఫీసర్, పడాల భూదేవి సవర వుమెన్ సామాజిక కార్యకర్త, రాజా శ్రీనివాస్ ఆర్ఎన్ఐటీ సొల్యూషన్స్ ఫౌండర్ సీఈవో, అంకిత్ అగర్వాల్ ఫూల్ కంపెనీ ఫౌండర్ సీఈవో, హర్షిల్ మాథూర్ రజోర్‌పే సీఈవో–కోఫౌండర్. అంశం: హెల్త్‌కేర్ అండ్ మెడికల్ ఎక్విప్మెంట్ మోడరేటర్ : టి.కృష్ణబాబు, ముఖ్య కార్యదర్శి, వైద్యశాఖ వక్తలు: దిలీప్ జోష్ మణిపాల్ హాస్పిటల్ గ్రూపుసీఈవో, డాక్టర్ గురునాథ్ రెడ్డి కాంటినెంటల్ హాస్పిటల్ చైర్మన్ అండ్ ఎండీ, డాక్టర్ ముఖేష్ తిప్రాఠి ఎయిమ్స్ మంగళగిరి డైరెక్టర్, విభవ్ గార్గ్ బోస్టన్ సైంటిఫిక్ డైరెక్టర్, ఆనంద్ కే ఎస్ఆర్ఎల్ డయాగ్నస్టిక్స్ సీఈవో, డాక్టర్ జితేంద్ర శర్మ ఏపీ మెడ్‌టెక్ జోన్ ఎండీ సీఈవో సాయంత్రం 5 నుంచి 5.50 వరకు అంశం: ఎలక్ట్రానిక్స్ మోడరేటర్ : సౌరభ్ గౌర్, కార్యదర్శి ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ వక్తలు: జోష్ ఫల్గర్ భారత్ ఎఫ్ఐహెచ్ కంట్రీ హెడ్– ఎండీ, శశికుమార్ జి సాల్కామ్ మాన్యుఫాక్చరింగ్ ఇండియా ఎండీ, దాసరి రామకృష్ణ ఎఫ్ట్రానిక్స్ ఎండీ, ప్రోఫెసర్ జాక్ సింగ్ చీఫ్ సైంటిస్ట్ గవర్నమెంట్ ఆఫ్ సారస్వక్, దేవిదాస్ కస్బేకర్ బ్లూస్టార్ క్లైమెటిక్ సీఈవో. ► అంశం: అగ్రి అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ మోడరేటర్: చిరంజీవి చౌదరి కార్యదర్శి ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ వక్తలు: మనోజ్ అహుజా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, సతోషి ససకి ఐఎల్వో సౌత్ ఏషియా డిప్యూటీ డైరక్టర్, జే రాజన్ అముల్ సౌత్ ఇండియా జోనల్హెడ్, పి.వెంకటరావు బ్లూస్టార్ ప్రెసిడెంట్ సీవోవో, హెన్రిక్ స్టమ్ క్రిస్టెన్సన్ బ్లెండ్ హబ్ కార్ప్ ఫౌండర్, బలరామ్ సింగ్ యాదవ్ గోద్రేజ్ ఆగ్రోవెట్ ఎండీ. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కోసం విశాఖలోని ఏయూ మైదానంలో వేదికను నిర్మిస్తున్న దృశ్యం మార్చి 4వతేదీ.. ఉదయం 10.30 నుంచి 11.20 వరకు అంశం: పెట్రో అండ్ పెట్రో కెమికల్స్ మోడరేటర్ : ప్రకాష్ గౌర్ సీఈవో ఎన్హెచ్ఎల్ఎంఎల్ వక్తలు: అరుణ్ బరోకా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, జనార్థన్ రామానుజులు ఎస్ఏబీఐసీ వైస్ ప్రెసిడెంట్, ఏవీ సహనే ఐవోసీఎల్ ఈడీ, డీవీఎస్ నారాయణ రాజు డెక్కన్ ఫైన్ కెమికల్స్ ► అంశం: ఉన్నత విద్య మోడరేటర్: హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఏపీఎస్సీహెచ్ఈ. వక్తలు : ఫ్రొఫెసర్ యూబీ దేశాయ్ ఐఐటీ హైదరాబాద్ ఫౌండింగ్ డైరెక్టర్, డాక్టర్ జీ విశ్వనాథన్ విట్ యూనివర్సిటీ చాన్సలర్, పద్మశ్రీ ఎన్ బాలకృష్ణన్ ఐఐఎస్సీ బెంగళూరు ఎయిరోడైనమిక్స్ ప్రొఫెసర్, డాక్టర్ బుద్ధా చంద్రశేఖర్ సీవోవో ఏఐసీటీఈ, ఎం చంద్ర శేఖర్ ఐఐఎం విశాఖ డైరెక్టర్, ప్రొఫెసర్ జంధ్యాల బిజీ తిలక్ కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ ► అంశం: టెక్స్టైల్ అండ్ అప్పరెల్ మోడరేటర్ : ఆర్సీఎం రెడ్డి ఎండీ సీఈవో స్కూల్‌నెట్ ఇండియా వక్తలు: యూపి సింగ్ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, రాజేష్ మండవేవాలా వెల్సపన్ గ్రూపు ఎండీ, నారెన్ గోయంకా టెక్స్‌పోర్ట్ ఇండస్ట్రీస్, సుచిరా సురేంద్రనాథ్ బ్రాండిక్స్ డైరెక్టర్, ప్రశాంత్ అగర్వాల్ వైజర్ అడ్వైజర్స్ కో–ఫౌండర్, సచిన్ మాలిక్ ఏషియా ఫసిఫిక్ రేయాన్ గ్లోబల్ సేల్స్ హెడ్. ఉదయం 11.30 నుంచి 12.20 వరకు ► అంశం: స్కిల్ డెవలప్మెంట్ మోడరేటర్: సౌరభ్‌గౌర్, కార్యదర్శి ఐటీ, స్కిల్ డెవలప్మెంట్ వక్తలు : రాజీవ్ చంద్రశేఖరన్ కేంద్ర సహాయమంత్రి, అతుల్ తివారీ కేంద్రకార్యదర్శి ఎంఎస్డీఈ, అనితా రాజన్ టాటా స్ట్రైవ్ సీఈవో, సంజయ్ విశ్వనాథన్ ఈడీ4ఆల్ కోఫౌండర్, సునిల్ దహియా వాద్వాని ఫౌండేషన్ ఈవీపీ, సంజయ్ అవస్థి యునెస్కో హెడ్, కీర్తి సేత్ నాస్కాం ఫ్యూచర్ స్కిల్ సీఈవో ► అంశం: పర్యాటకం మోడరేటర్: రజిత్ భార్గవ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ వక్తలు : సుభాష్ గోయల్ ఎస్‌టీఐసీ ట్రావెల్స్ చైర్మన్, సంజయ్ సేథి చాలెట్ గ్రూపు సీఈవో ఎండీ, అనిల్ చద్ధా ఐటీసీ హోటల్స్ సీఈవో, దినేష్ చద్దా తాజ్‌గ్రూపు సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, సంజయ్ రాజ్ ఎండీ,సరోవర్ గ్రూపు, పూజా రే మైఫేర్ ఎండీ, ఆర్ శ్రీనివాస్ ఎక్స్ డెలాయిట్ గ్లోబల్ హెడ్(టూరిజం) ► అంశం: ఫార్మా లైఫ్ సైన్సెస్ మోడరేటర్: జే.నివాస్, కమిషనర్ వైద్య ఆరోగ్య శాఖ వక్తలు: సతీష్‌రెడ్డి డాక్టర్ రెడ్డీస్ చైర్మన్, సత్యనారాయణ చావా లారస్ ల్యాబ్ ఫౌండర్ సీఈవో, ఎంఎన్‌రావు మైలాన్ ల్యాబ్ కంట్రీ హెడ్, విక్రం శుక్లా ఫైజర్ వైస్ ప్రెసిడెంట్, అజుమా ఫుజిమురా ఈసాయి ఫార్మాస్యూటికల్స్ అడ్మినిస్ట్రేషన్ హెడ్ -
ఔషధాల రక్షణ కీలకం
సాక్షి, విశాఖపట్నం: ఫార్మా పరిశ్రమలు కేవలం ఔషద ఉత్పత్తులపైనే కాకుండా... వాటి రక్షణ, నిల్వలపైనా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) సీనియర్ పాలసీ అడ్వైజర్ బ్రూకీ హెగిన్స్ చెప్పారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏయూ ఫార్మశీ కళాశాల, యూఎస్ ఎఫ్‌డీఏ ఆధ్వర్యాన రెండు రోజులపాటు నిర్వహించిన వర్క్‌షాప్ శుక్రవారం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన బ్రూకీ హెగిన్స్... ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఫార్మా రంగానికి సంబంధించిన పలు విషయాలను వెల్లడించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.... నిరంతర పరిశీలన ► ఆహార ఉత్పత్తులే కాదు, ఔషధాల తయారీ, నిల్వల విషయంలో సరైన పద్ధతుల్లో నాణ్యత, భద్రత ప్రమాణాలను పరిశీలిస్తున్నాం. ► మందులు, వైద్య పరికరాల పరిరక్షణకు ఎఫ్‌డీఏ గైడ్‌లైన్స్ పాటించాల్సిందే. ► ఫార్మా పరిశ్రమలు క్లీన్ రూమ్ ప్రమాణాలను పాటించాలి. ముఖ్యంగా స్టెరైల్గా భావించే ఔషధాలను ఉత్పత్తి చేసిన అనంతరం సూక్ష్మజీవుల బారినపడకుండా భద్రపరచాలి. లేదంటే వాటిని వినియోగించేవారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ►అసెప్టిక్ ప్రాసెసింగ్ (సూక్ష్మ కణాలు చేరకుండా భద్రపరచడం) అనేది ఫార్మా ఉత్పత్తుల కార్యకలాపాల్లో అత్యంత ముఖ్యమైనది. ప్రమాదకరమైనది కూడా. ► సాధారణంగా ఒక మనిషి శరీరం నుంచి రోజూ లక్షలాది బ్యాక్టీరియాలు విడుదలవుతుంటాయి. వీటి ద్వారా మందులు తయారుచేసే సమయంలోనే కొన్నిసార్లు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అందుకే డ్రగ్స్ తయారీలో గ్లోవ్ లెస్ రోబోటిక్స్ అసలైన ప్రత్యామ్నాయంగా భావించవచ్చు. ► డ్రగ్స్ తయారీ, భద్రత విషయంలో భారత్‌లోని ఫార్మా పరిశ్రమలు అద్భుతంగా వ్యవహరిస్తున్నాయి. ► జనరిక్ ఔషధాల తయారీ, సరఫరాలో భారత్ నంబర్ వన్‌గా ఉంది. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద డ్రగ్ పరిశ్రమగా, విలువ ప్రకారం పదో స్థానంలో భారత్ ఉంది. ఫార్మారంగంలో అమెరికాతో సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. -
యూనివర్సిటీల్లో పరిశోధనల్ని ప్రోత్సహించాలి
సాక్షి, విశాఖపట్నం: విశ్వవిద్యాలయాలు బోధనలకు మాత్రమే పరిమితమవుతున్నాయని, పరిశోధనలకు దూరంగా ఉండటం బాధాకరమని రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ చెప్పారు. అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఏఐయూ) సహకారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశ ఉపకులపతుల సదస్సు–2023ని ఏయూ కన్వెన్షన్ హాల్లో గవర్నర్ మంగళవారం ప్రారంభించారు. రెండురోజుల సదస్సులో తొలిరోజు ‘రీసెర్చ్ అండ్ ఎక్స్‌లెన్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేటివ్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అంశంపై గవర్నర్ ప్రసంగించారు. ఉన్నతవిద్యలో పరిశోధనల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాల్ని చేసుకోవాలని, అదేవిధంగా యూనివర్సిటీలు బోధనకే పరిమితం కాకూడదని సూచించారు. పరిశోధన రంగంవైపు విద్యార్థుల్ని ప్రోత్సహించాలని, ఇందుకనుగుణంగా రీసెర్చ్ రంగంలో పెట్టుబడుల్ని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచస్థాయి ర్యాంకింగ్‌లలో అత్యుత్తమ స్థానంలో భారతీయ విశ్వవిద్యాలయాలు స్థానం సాధించాలని ఆకాంక్షించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్ కలిగిన దేశంగా భారత్ ఉందని నాస్కామ్ స్పష్టం చేసిందని, 2022 నాటికి దేశంలో 80 వేలకు పైగా స్టార్టప్ సంస్థలున్నాయని తెలిపారు. కోవిడ్ సమయంలో అమెరికా, చైనా, యూకే సహా 50 దేశాలకు మనదేశం మార్గదర్శిగా నిలవడాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. నూతన విద్యావిధానంలో పరిశోధనలకు అత్యంత ప్రాధాన్యం కల్పించినట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ సాకారం చేసే దిశగా సమష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. ఏయూ వీసీ ప్రొ.పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధానమంత్రి మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆకాంక్షల్ని సాకారం చేసే దిశగా ఆంధ్ర విశ్వవిద్యాలయం పనిచేస్తోందని తెలిపారు. ఏఐయూ అధ్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానాన్ని పరిరక్షించడంతో పాటు పరిశోధనలకు అనుగుణంగా ఉన్నతవిద్యని ఇంగ్లిష్తో పాటు స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్నత విద్యని పటిష్టం చేసేందుకు గవర్నర్, ముఖ్యమంత్రి ఐదు లక్ష్యాల్ని ఏర్పాటు చేసుకుని వాటిని సాధించే దిశగా పనిచేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా హయ్యర్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ బోర్డు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సదస్సులో తొలుత ఏఐయూ ప్రత్యేక సంచికని గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సదస్సులో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా, ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షుడు రామ్మోహన్రావు, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్, 140 విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
జీవోను రాజకీయ కోణంలో చూడకండి
ఏయూ క్యాంపస్: ప్రజల ప్రాణాలకు రక్షణ కవచంగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 1 నిలుస్తుందని పలువురు మేధావులు అభిప్రాయపడ్డారు. జీవోను రాజకీయ కోణంలో చూడొద్దని కోరారు. ఎవరి స్వేచ్ఛను ప్రభుత్వం హరించలేదని స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏయూ, విశాఖ నగర మేధావుల వేదిక సంయుక్తంగా బుధవారం ‘ప్రజల ప్రాణాలకు రక్ష జీవో నంబర్ 1’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ప్రభుత్వం ప్రజల ప్రాణాలను రక్షించాలనే ఏకైక లక్ష్యంతో తీసుకువచ్చిన జీవో ఇదని వక్తలు స్పష్టం చేశారు. దీన్ని తామంతా స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది చిన్నారావు, డాక్టర్ ఎ.కె.ఎం.పవార్, ఆచార్య ఎన్.సత్యనారాయణ, డాక్టర్ రాజమాణిక్యం, డాక్టర్ ఎస్.శ్రీనివాసరావు, డాక్టర్ బాలకోటయ్య, డాక్టర్ అంబేడ్కర్ రాజు, డాక్టర్ ఎ.సీతారత్నం, డాక్టర్ రాజ్‌కుమార్, తదితరులు ప్రసంగించారు. జీవో నంబర్ 1 మన బాధ్యతను గుర్తు చేసింది. ఈ జీవోతో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం, ఇబ్బంది కలగదు. – ఆచార్య జేమ్స్ స్టీఫెన్, అంబేడ్కర్ చైర్ ప్రొఫెసర్, ఏయూ ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా సమావేశాలు పెట్టుకోవచ్చని జీవో స్పష్టం చేస్తోంది. దీన్ని వక్రీకరిస్తూ ఎమర్జెన్సీని తలపిస్తోందని ప్రచారం చేయడం సరికాదు. – ఆచార్య కె.శ్రీరామమూర్తి, పూర్వ ప్రిన్సిపాల్, ఏయూ ఆర్ట్స్ కళాశాల ర్యాలీలు, సభలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని జీవో స్పష్టం చేస్తోంది. – ఆచార్య ఎన్.ఎ.డి.పాల్, బీసీడీఈ సమన్వయకర్త విమర్శించే వ్యక్తులు ముందుగా జీవోను చదివి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఈ జీవో తెచ్చింది. – ఆచార్య పి.విశ్వనాథం, గౌరవ ఆచార్యులు, డీసీఎంఎస్ విభాగం ఏయూ మహిళా ఉద్యోగుల సంఘం తరఫున జీవో నంబర్ 1ని తాము స్వాగతిస్తున్నాం. ఇటువంటి జీవోలు ప్రజల రక్షణకు, భద్రతకు ఉపయుక్తంగా నిలుస్తాయి. – ఆచార్య టి.శోభశ్రీ, ప్రిన్సిపాల్, ఐఏఎస్ఈ జీవో నంబర్ 1 అప్రజాస్వామికం అనడం సరికాదు. కందుకూరు, గుంటూరు ఘటనలు పునరావృతం కాకుండా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఈ జీవో తీసుకువచ్చారు. – ఆచార్య పి.అర్జున్, గౌరవ ఆచార్యులు, సోషల్ వర్క్ విభాగం నిషేధం, ఆంక్షలకు వ్యత్యాసం ఉందనే విషయాన్ని గమనించకుండా కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ జీవోపై వాస్తవాలు తెలిపే విధంగా విస్తృత చర్చలు జరపాలి. – పాకా సత్యనారాయణ, న్యాయవాది ప్రజల ప్రాణాలు ఎంతో ప్రధానం. ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేయడం అర్థరహితం. – ఆచార్య విజయ్‌మోహన్, డీన్, విద్యార్థి వ్యవహారాలు కొంత మంది ఏకపక్షంగా ఈ జీవోను వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. ఇది సరికాదు. – ఆచార్య ఎస్.పుల్లారావు, అర్థశాస్త్ర విభాగాధిపతి అన్ని పార్టీలకు ఈ జీవో వర్తిస్తుంది, ఎక్కడా నిషేధం లేదు.. కేవలం నిబంధనలు మాత్రమే ఉన్నాయి. వీటిని అనుసరిస్తూ సమావేశాలు, ర్యాలీలు జరుపుకోవడానికి ఇబ్బంది ఏముంది? – ఆచార్య ఎ.పల్లవి, క్రీడా విభాగాధిపతి, ఏయూ -
ఆధునికతకు అంబేడ్కరిజాన్ని జోడించాలి
యువతరాన్ని అంబేడ్కర్‌తో అనుసంధానం చేయాలి. వాస్తవిక సమాజ పరిస్థితులను దగ్గరగా పరిశీలిస్తూ యుక్తవయసులోనే విప్లవాత్మకమైన ఆలోచనలు చేసిన వ్యక్తి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్. అత్యధిక ఆదాయాన్ని సంపాదించిపెట్టే వృత్తిగా నిలచే బారిష్టర్‌ను చదివే అవకాశం ఉన్నా, సమాజానికీ, దేశానికీ ఉపయుక్తంగా నిలచే అర్థశాస్త్రాన్ని కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తిచేసిన ఆయన వ్యక్తిత్వం నేటి తరానికి అవగతం కావా ల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌ని ఒక రివల్యూషనరీ థింకర్‌గా చెప్పవచ్చు. అంబేడ్కర్ ఆలోచనలే పునాదిగా ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ స్థాపన జరిగింది. ప్రపంచవ్యాప్తంగా అగ్ర రాజ్యాల ఆర్థిక వ్యవస్థలు సైతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా... భారతీయ ఆర్థిక వ్యవస్థ చెక్కుచెదరకుండా తగిన సుస్థిరత్వాన్ని కలిగి ఉందంటే అలా ఉండటానికి అంబేడ్కర్ ఆలోచనలు, ప్రయత్నాలు సఫలీ కృతం అయ్యాయనే అర్థమవుతుంది. ఎకనామిక్స్‌లో చదువు పూర్తయిన తర్వాత మాత్రమే ఆయన బారిష్టర్ చదువు కున్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి పీహెచ్‌డీని పూర్తిచేసిన ఆయన ప్రతిభను ప్రస్తుత తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్‌ను దర్శించిన ఆలోచనలు అంబేడ్కర్ సొంతం. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత చైనా ఎప్పటికైనా భారత్‌కు ముప్పు తెస్తుందని గుర్తించిన వ్యక్తి అంబేడ్కర్, ఐక్యరాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం చైనాకు బదులు భారత్‌కు వచ్చే విధంగా కృషిచేయాలని ఆయన చేసిన సూచనలను నాటి నేతలు పక్కన పెట్టడం అందరికీ తెలిసిందే. దీని పర్యవసానాలను చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చైనా తన వీటో అధికారాన్ని భారత్‌కు వ్యతిరేకంగా 9 పర్యాయాలు వాడుకుంది. వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తించడం, పారిశ్రామికీకరణతో కలిగిన మార్పులు, ఎకనామిక్ హోల్డింగ్.. వంటి అంశాలు నేడు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నాయి. కానీ వీటిని అంబేడ్కర్ 1927–28లోనే ప్రస్తా వించారనే విషయం చాలా మందికి తెలియదు. అంబేడ్కర్‌ను కేవలం రాజ్యాంగ నిర్మాతగా మనం పిలుస్తుంటాం. ఆయన చేసిన పనుల్లో ఒకటిగా మాత్రమే ఇది నిలుస్తుంది. దీనితో పాటు దేశ ఆర్థిక, సామాజిక పరిస్థితులూ, స్థితిగతులపై సమగ్ర అవగాహనా, ఆలోచనా భవిష్యత్ ప్రణాళిక కలిగిన ఏకైక వ్యక్తిగా ఆయన్ని పేర్కొనవచ్చు. దేశాన్ని ఆధునికత, పట్టణీకరణ, పారిశ్రామికీకరణతో కూడిన నాగరికత కలిగి స్వయం సమృద్ది సాధించిన దేశంగా పునర్నిర్మించాలని ఆకాంక్షించిన ఏకైక తత్వవేత్త అంబేడ్కర్. అంబేడ్కర్ ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను నేటి యువతలోనికి చొప్పించి భవిష్యత్ భారతావనిని పునర్నిర్మించే ప్రయత్నం జరగాలి. ఈ ప్రయత్నం చేసే దిశగా ఆంధ్ర విశ్వ విద్యాలయంలో నెలకొల్పిన ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చైర్’ కృషిచేస్తుంది. గ్రంథాలయాలు, బ్యాంక్‌లు, తరగతులు, అభ్యసన విధానాలు, ఆర్థిక వ్యవస్థలు డిజిటల్ రూపంలోకి మారిపోయాయి. వీటినే ఆధారంగా చేసుకుని డిజిటల్ మాధ్యమాలను లాభదాయకంగా చేసుకుంటూ సమకాలీన యువతకు, సమకాలీన విధానాలతో అబేడ్కర్ ఆలోచనలు, తత్వాలను చేరువ చేసే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుంది. సోషల్ సైంటిస్ట్‌లతో పాటు సోషల్ ఇంజనీర్స్‌ను సమ న్వయం చేస్తూ, సమ్మిళితంగా పనిచేస్తే సమస్యలకు సాంకేతికంగా పరిష్కారాలను చూపడం సాధ్యపడుతుంది. అంబేడ్కర్‌ను కేవలం సోషల్ సైన్స్ విభాగాలకే పరిమితం చేయకుండా టెక్నాలజీకి అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్, ఫార్మసీతో పాటు ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న అన్ని విభాగాల విద్యార్థులను ఐక్యం చేస్తూ డిజిటల్ మాధ్యమాలు వేదికగా అంబేడ్కర్‌ను వైవిధ్యమైన కోణాలలో పరిచయం చేస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. (క్లిక్ చేయండి: ‘భీమా కోరేగావ్’ స్ఫూర్తితో పోరాడుదాం!) - ఆచార్య ఎం. జేమ్స్ స్టీఫెన్ ‘డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పీఠం’ ప్రొఫెసర్, ఆంధ్ర విశ్వవిద్యాలయం -
ఆంధ్రా యూనివర్సిటీ మరో అరుదైన ఘనత
ఏయూక్యాంపస్(విశాఖపట్నం): ఆంధ్ర యూనివర్సిటీ మరో అరుదైన ఘనతను సాధించింది. యూనివర్సిటీ పరిధిలో చేసిన పరిశోధనల థీసిస్‌లను ఆన్లైన్లో అప్లోడ్ చేయడంలో అద్భుత ప్రగతిని కనబరిచింది. శోధ్‌గంగ వెబ్సైట్లో కేవలం తొమ్మిది నెలల్లోనే 7,635 థీసిస్‌లను అప్లోడ్ చేసి 179వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంది. ఏయూలో 1942 నుంచి చేసిన పరిశోధనలకు సంబంధించిన గ్రంథాలను కూడా శోధ్‌గంగలో పొందుపరించింది. తద్వారా విలువైన పరిశోధన పత్రాలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో మరికొన్ని థీసిస్‌లు అప్లోడ్ చేయడానికి యూనివర్సిటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చదవండి: 5న అల్పపీడనం.. ఏపీలో వర్షాలు ఇదీ శోధ్‌గంగ లక్ష్యం... దేశవ్యాప్తంగా పరిశోధన జ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచడానికి, భవిష్యత్ తరాల పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేందుకు ఇన్‌ఫ్లిబినెట్ సంస్థ శో««ద్గంగ వెబ్‌సైట్‌ను రూపొందించింది. దేశంలోని 584 విశ్వవిద్యాలయాలు తమ పరిధిలోని పరిశోధన గ్రంథాలను ఎప్పటికప్పుడు దీనిలో పొందుపరుస్తున్నాయి. ఈ వెబ్సైట్లో ఇప్పటివరకు 3,98,264 థీసిస్‌లు అప్లోడ్ చేశాయి. పరిశోధకులు కోర్సుల వారీగా తమకు అవసరమైన థీసిస్‌లను ఈ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. వీటిని చదువుకోవడంతోపాటు రెఫరెన్స్‌గా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. 179 నుంచి 9వ స్థానానికి... శోధ్‌గంగలో థీసిస్‌ల అప్‌లోడ్‌కు సంబంధించి ఏయూ మార్చి నెలలో 179వ స్థానంలో ఉంది. శోధ్‌గంగ ప్రాధాన్యతను గుర్తించిన ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి గ్రంథాలయ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో యూనివర్సిటీలో దశాబ్దాలుగా ఉన్న 7,635 థీసిస్‌లను ఇప్పటివరకు శో«ధ్గంగలో అప్లోడ్ చేశారు. దీంతో ప్రస్తుతం తొమ్మిదో స్థానానికి చేరుకుంది. ఏయూ నుంచి అత్యధికంగా ఆర్ట్స్, కామర్స్ కోర్సులకు చెందిన 3,388, సైన్స్ కోర్సులకు చెందిన 2,316, ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధించిన 1,270, ఫార్మసీ కోర్సులకు చెందిన 487, న్యాయవిద్యకు చెందిన 174 థీసిస్‌లు అప్లోడ్ చేశారు. గతంలో పరిశోధన గ్రంథాలను చేతితో రాసి, టైప్ చేసి సమరి్పంచేవారు. వీటితోపాటు దశాబ్దాల కిందట చేసిన పరిశోధనల పుస్తకాలను కూడా స్కానింగ్ చేసి అప్లోడ్ చేశారు. తొలి ఐదు స్థానాల్లో నిలవడమే లక్ష్యం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని శోధ్‌గంగలో తొలి ఐదు స్థానాల్లో నిలపడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. యూనివర్సిటీలో జరిగే పరిశోధనల గ్రంథాలను శో««ద్గంగలో ఉంచడం వల్ల దేశవ్యాప్తంగా పరిశోధకులకు అందుబాటులో ఉంటాయి. నూతన పరిశోధకులకు ఇవి ఎంతో ఉపయుక్తంగా, మార్గదర్శకంగా నిలుస్తాయి. త్వరలో మరిన్ని థీసిస్‌లు స్కానింగ్ ప్రక్రియ పూర్తిచేసి అప్లోడ్ చేసే దిశగా పనులు కొనసాగుతున్నాయి. – ఆచార్య పి.వెంకటేశ్వర్లు, చీఫ్ లైబ్రేరియన్, డాక్టర్ వీఎస్ కృష్ణా గ్రంథాలయం, ఏయూ -
స్టార్టప్ ల విషయంలో ఆంధ్రా యూనివర్సిటీకి దేశంలోనే ఐదో ర్యాంకు
-
నేరేడు పండ్లలోనే కాదు.. ఆకుల్లోనూ గుణాలు.. పరిశోధన చేశారిలా..
సాక్షి, విశాఖపట్నం: ఇప్పటి వరకు నేరేడు పండ్లలోనే ఔషధ గుణాలు ఉంటాయని మనకు తెలుసు. కానీ నేరేడు ఆకుల్లోనూ ఔషధ గుణాలున్నట్లు కనుగొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులు. సమాజానికి ఉపయుక్తంగా నిలిచే అంశంపై అధ్యయన ప్రక్రియలో భాగంగా నేరేడు ఆకుల్లో ఔషధ గుణాలను అన్వేషించే ప్రాజెక్ట్‌ను వీరు చేపట్టారు. హెచ్‌వోడీ ఎ.కృష్ణమంజరి పవార్ పర్యవేక్షణలో నందిన, శ్రీదేవి, అనూష, కళ్యాణ్, రాజ్‌సుశితశ్రీ , శిరీష తమ పరిశోధనల్లో నేరేడు ఆకుల్లో రెండు ఫ్లావనాయిడ్స్‌ను గుర్తించారు. దాదాపు 50 గ్రాముల ఆకుల పొడిలో కొర్సిటిన్ 0.342 మైక్రో గ్రాములు, రూటిన్ 1.397 మైక్రో గ్రాములున్నట్లు తేల్చారు. ఈ ఫ్లావనాయిడ్స్ మధుమేహం, క్యాన్సర్ నియంత్రణకు ఉపకరిస్తాయి. పరీక్ష చేశారిలా.. తొలుత కొన్ని నేరేడు ఆకులను తీసుకుని ఆరబెట్టారు. వాటిలో తేమ పూర్తిగా ఆరిపోయాక పొడి చేసి.. సన్నని జల్లెడతో వడగట్టారు. అనంతరం నేరేడు ఆకుల పొడి ఇథనాల్, మిథనాల్‌లలో కరుగుతోందని గుర్తించారు. ఇన్ఫ్రారెడ్ కిరణాలలో ఈ పొడిని పరిశీలించారు. ఈ పరీక్షతో ఆ పొడిలో ఫ్లావనాయిడ్స్ ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లుగా నిలుస్తాయి. మలినాలను తొలగించే వ్యవస్థగా పనిచేస్తాయి. తదుపరి దశలో సినోడా టెస్ట్ చేసి దానిలో ఉన్న ఫ్లావనాయిడ్స్ రకాన్ని గుర్తించారు. టీఎల్సీ (థిన్ లేయర్ క్రొమెటోగ్రఫీ) చేసి కొర్సిటిన్, రూటిన్‌లు ఉన్న శాతాన్ని గుర్తించారు. విద్యార్థులు తమ రిపోర్టును వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డికి అందజేశారు. సమాజ ఉపయుక్త అంశంపై పనిచేస్తున్న విద్యార్థులను వీసీ అభినందించారు. గతేడాది ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఫోర్టిఫైడ్ రైస్‌పైన ఇదే విధంగా అధ్యయనం చేశారు. విశ్వవిద్యాలయంలో జరిపే ప్రతి పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా అధికారులు కృషిచేస్తున్నారు. చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. -
డిసెంబర్ 17న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం డిసెంబర్ 17వ తేదీన నిర్వహించనున్నట్లు వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి తెలిపారు. ఏయూ సెనేట్ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ప్రత్యేక అతిథిగా అవంతి ఫీడ్స్ లిమిటెడ్ సీఎండీ ఎ.ఇంద్రకుమార్ హాజరవుతారని చెప్పారు. పూర్వ విద్యార్థుల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు జీఎంఆర్ సంస్థల అధినేత జీఎం రావు(జీఎంఆర్) అధ్యక్షత వహిస్తారని పేర్కొన్నారు. దేశం గర్వించే సంస్థ ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి డిసెంబర్ 17న ఏయూలోని ఇంక్యుబేషన్ సెంటర్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఫార్మసీ విభాగం, అమెరికన్ కార్నర్ వంటివి సందర్శిస్తారన్నారు. అదే రోజు సాయంత్రం బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరవుతారని తెలిపారు. ఇటీవల విశాఖలో ఇన్ఫోసిస్ సంస్థ సేవలు ప్రారంభించిందని, యువతకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న నారాయణమూర్తి ఏయూకు అతిథిగా రావడం శుభపరిణామమన్నారు. త్వరలో ఇథియోపియాలోనూ ఏయూ పూర్వవిద్యార్థుల సంఘ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది వ్యవస్థాపక ఉత్సవ సమారోహన కార్యక్రమాలను 2023, ఏప్రిల్ 26 నుంచి ఘనంగా ప్రారంభిస్తామని, శతాబ్ది ఉత్సవాలు 2025, ఏప్రిల్ 26వ తేదీన ప్రారంభమవుతాయని వివరించారు. అనంతరం పూర్వవిద్యార్థుల సంఘ కార్యక్రమ వివరాలతో కూడిన పోస్టర్‌ను వీసీ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో పూర్వవిద్యార్థుల సంఘ చైర్మన్ ఆచార్య బీల సత్యనారాయణ, ఉప్యాధ్యక్షుడు ఎ.మన్మోహన్, రెక్టార్ ఆచార్య కె.సమత, రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆచార్య బి.మోహన వెంకటరామ్, సంయుక్త కార్యదర్శి కుమార్ రాజా పాల్గొన్నారు. -
ప్రధాని పర్యటన.. వైజాగ్‌లో ట్రాఫిక్ ఆంక్షలివే
సాక్షి, విశాఖపట్నం: ప్రధాని నరేంద్ర మోదీ వైజాగ్ పర్యటన నేపథ్యంలో శనివారం ఉదయం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమలు అవుతున్నాయి. ప్రధాని సభ సందర్భంగా 8,600 మంది పోలీస్ సిబ్బందితో భద్రత ఏర్పాట్లు. ఏయూ సభా ప్రాంగణం వద్ద ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేశారు. ► ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ పరిసరాల్లో ఈ రోజు సాధారణ వాహనాల రాకపోకల నిషేధం విధించారు. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 3 వరకు శ్రీకాకుళం విజయనగరం నుంచి విశాఖ మీదుగా వెళ్లే వాహనాలు ఆనందపురం సబ్బవరం మీదుగా మళ్లిస్తారు. ► అనకాపల్లి నుంచి శ్రీకాకుళం వెళ్లే వాహనాలు లంకెలపాలెం సబ్బవరం పెందుర్తి మీదగా మళ్లింపు ఉంటుంది. ► శనివారం మధ్యాహ్నం మూడు వరకు మద్దిలపాలెం, ఆంధ్ర యూనివర్సిటీ .. పెదవాల్తేరు . కురుపాం సర్కిల్... స్వర్ణ భారతి స్టేడియం.. పరిసరాల్లో పూర్తిగా సాధారణ వాహనాల రాకపోకలపై నిషేధం విధించారు. ► అలాగే జ్ఞానాపురం హోల్‌సేల్ కూరగాయల మార్కెట్ కు సెలవు ప్రకటించిన మార్కెట్ కమిటీ. ప్రధాని సభకు మూడు లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 8 నుంచి 11 మధ్య అత్యవసరమైతే బయటకు రండి. ఆ సమయంలో ప్రధాని సభకు వెళ్లే ప్రజల వాహనాలకు ప్రాధాన్యత ఇస్తాం. ప్రధాని సభకు వెళ్లే వాహనాలకు రూట్ మ్యాప్ ఇచ్చాం..వీటిని కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటాం. ప్రధాని సభకు వెళ్లే వీఐపీలకు గ్రీన్ ఛానల్ రూట్ ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీకాంత్ వెల్లడించారు. -
రెండు రోజుల పర్యటన.. విశాఖకు ప్రధాని, సీఎం..
దొండపర్తి (విశాఖ దక్షిణ): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం విశాఖకు రానున్నారు. ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఈ నెల 12వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రధానితో కలిసి సీఎం పాల్గొననున్నారు. రూ.7,614 కోట్లతో చేపట్టనున్న ఐదు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. రూ.7,619 కోట్లతో పనులు పూర్తి చేసిన ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు హాజరవుతారని భావిస్తున్నారు. పీఎం, సీఎంతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమానికి వస్తున్న దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ప్రధాని మోదీ పర్యటన సాగేదిలా.. 11వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు మధురై విమానాశ్రయం నుంచి బయలుదేరి సాయంత్రం 7.25 గంటలకు విశాఖ పాత విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగకు చేరుకుంటారు. తర్వాత చోళ (నౌకా దళానికి చెందిన గెస్ట్ హౌస్)కు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 12వ తేదీ ఉదయం 10.10 గంటలకు చోళ నుంచి బయలుదేరి 10.30 గంటలకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్లో జరగనున్న బహిరంగ సభకు హాజరవుతారు. అనంతరం 9 అభివృద్ధి ప్రాజెక్టులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకొని తిరుగు ప్రయాణమవుతారు. గవర్నర్ విశ్వభూషణ్ రాక: రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ 11వ తేదీ సాయంత్రం 4.20 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. నోవాటెల్ హోటల్లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత రాత్రి 7 గంటలకు ఐఎన్ఎస్ డేగకు చేరుకొని ప్రధానికి స్వాగతం పలుకుతారు. అనంతరం నోవాటెల్‌కు చేరుకొని రాత్రి బస చేస్తారు. 12న 10.20 గంటలకు ఏయూకు చేరుకొని ప్రధానితో కలిసి పలు శంకుస్థాపనలు, ప్రాజెక్టుల ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. ఆ తర్వాత గన్నవరం పయనమవుతారు. సీఎం జగన్ పర్యటన సాగేదిలా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం సాయంత్రం 6.35 గంటలకు విశాఖలోని ఐఎన్ఎస్ డేగకు చేరుకుని, ప్రధానికి స్వాగతం పలుకుతారు. రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు. శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల అనంతరం ప్రధానికి వీడ్కోలు పలికి.. తిరిగి తాడేపల్లిలోని నివాసానికి బయలుదేరుతారు. -
ఆధారాలు ఉన్నందునే ఆక్రమణల తొలగింపు
దొండపర్తి (విశాఖ దక్షిణ): అన్యాక్రాంతమైన భూములను ఆంధ్రా యూనివర్శిటీ తిరిగి స్వాధీనం చేసుకోవడం దారుణమా? ఆక్రమిత భూముల్లో నిర్మించిన దుకాణాలను తొలగించడం కూల్చివేతల కలకలమా? ఏయూ ఆస్తులను కబ్జా చేసి అనుభవిస్తున్న ప్రైవేట్ వ్యక్తులపై టీడీపీ నేతలకు ఎందుకంత ప్రేమ? ఈనాడు ప్రచురించినట్లుగా 16 షాపుల్లో 200 మంది పని చేస్తుంటే అవి చిన్న దుకాణాలా? టీడీపీ నాయకుల డ్రామాలు, ఎల్లో మీడియా కథనాల్లో నిజం ఉందా? కబ్జాదారుల చెర నుంచి తమ భూములను ఆంధ్రా యూనివర్శిటీ స్వాధీనం చేసుకుంటే టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రైవేట్ వ్యక్తులను సమర్థించటాన్ని అంతా తప్పుబడుతున్నారు. ఏయూ స్థలాన్ని ఆక్రమించి షెడ్లు నిర్మించిన వారి వద్ద ఆ స్థలానికి సంబంధించి ఎలాంటి పత్రాలు లేవు. దుకాణదారులంతా తమ వస్తువులు తీసుకొని మధ్యాహ్నానికే అక్కడ నుంచి వెళ్లిపోయారు. చాలా ఏళ్లుగా ఆక్రమణలకు గురైన విలువైన ఏయూ భూములను స్వాధీనం చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఏయూ పూర్వ విద్యార్థులు, నగరపౌరులు దీనిని స్వాగతిస్తున్నారు. ► విశాఖలో ఆంధ్ర యూనివర్సిటీకి పాత సీబీఐ జంక్షన్ నుంచి పోలమాంబ ఆలయం వరకు సువిశాలమైన భూమి ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారికి ఆనుకుని ఉన్న విలువైన స్థలాన్ని కొందరు ఆక్రమించి అనధికారంగా దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. బడాబాబుల అండదండలతో కార్ షెడ్లు, మాంసం దుకాణాలు, టీ పాయింట్లు, టిఫిన్ సెంటర్లు నిర్వహిస్తూ అద్దెలు వసూలు చేసుకుంటున్నారు. టీడీపీ హయాంలో కబ్జాదారులు దుకాణాలను నిర్మించుకుని నెమ్మదిగా విస్తరించినా కన్నెత్తి కూడా చూడలేదు. తాజాగా ఏయూ అధికారులు మరోసారి జీవీఎంసీకి ఫిర్యాదు చేయడంతో అక్రమ నిర్మాణాలను సోమవారం తొలగించారు. ► పెదవాల్తేరు పోలమాంబ ఆలయానికి ఆనుకుని ఏయూకు 2.5 ఎకరాల భూమి ఉంది. 1941లోనే దీన్ని నిర్ణీత రుసుము చెల్లించి కొనుగోలు చేసింది. కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అప్పటి నుంచి ఆ భూమి ఏయూ స్వాధీనంలోనే ఉంది. టౌన్ సర్వే రిజిస్టర్ ప్రకారం ఈ భూములు ఏయూకు చెందినవేనని 1989 నాటి అడంగల్ కాపీలు ఏయూ వద్ద ఉన్నాయి. ► 1992లో ఈ స్థలాన్ని ఆక్రమించుకోడానికి ప్రయత్నించిన కొందరు కోర్టుకు వెళ్లగా స్పెషల్ కోర్టు ఏయూకు అనుకూలంగా తీర్పునిచ్చింది. 1993 ఫిబ్రవరి 16న తహశీల్దార్ స్వయంగా ఇక్కడ ఉన్న తాటాకు ఇళ్లను తొలగించారు. ఆక్రమణదారులైన కుందం అప్పారావుతో పాటు మరో 13 మంది నుంచి భూమిని స్వాధీనం చేసుకొని ఖాళీ స్థలాన్ని ఏయూకు అప్పగించారు. దీనిపై ఏయూకే సర్వహక్కులు ఉన్నాయంటూ తహశీల్దార్ ఏయూకు లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు. ► పెట్రోల్ బంక్ నుంచి పోలమాంబ ఆలయం వరకు రహదారి విస్తరణకు ఏయూకు చెందిన ఈ స్థలం నుంచే కొంత భూమిని జీవీఎంసీకి అప్పగించింది. దీనికి పరిహారంగా ఏయూకు జీవీఎంసీ ప్రత్యామ్నాయ భూమిని సైతం ఇచ్చింది. అందులోనే ఏయూ అంతర్జాతీయ విద్యార్థినుల హాస్టల్ సముదాయాన్ని నిర్మించింది. అన్ని ఆధారాలున్నాయి.. ఆక్రమణలు తొలగించిన స్థలం నిస్సందేహంగా ఏయూదే. ఆ పత్రాలన్నీ మావద్ద ఉన్నాయి. గతంలో పనిచేసిన వీసీలు, రిజిస్ట్రార్లు కూడా వీటిని స్వాధీనం చేసుకోవాలని ఉత్తర ప్రత్యుత్తరాల రూపంలో అప్పటి ప్రభుత్వాలను కోరారు. – ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి, వీసీ -
ఆంగ్లంపై ఏపీ చర్యలు భేష్
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్): ఆంగ్ల భాషను అందరికీ చేరువ చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు అభినందనీయమని అమెరికన్ కాన్సుల్ జనరల్ (హైదరాబాద్) జెన్నిఫర్ లార్సన్ అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన ఆమె అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ గ్రామీణ ప్రాంతాలకు సైతం ఆంగ్ల భాషను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లు వంటివి అందిస్తోందా అని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డిని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అత్యధిక శాతం విద్యార్థులకు కళాశాల రుసుములను, హాస్టల్ చార్జీలను జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాల ద్వారా చెల్లిస్తోందని వివరించారు. ఏయూలో ఇంక్యుబేషన్, స్టార్టప్‌లకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రోత్సహిస్తున్నామన్నారు. భారత్, అమెరికా దేశాల విద్యార్థులు స్టార్టప్ రంగాలలో పరస్పరం కలసి పనిచేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటైందన్నారు. ఏడాది కాలంలో ముప్పైకి పైగా కార్యక్రమాలను అమెరికన్ కార్నర్ నిర్వహించడాన్ని జెన్నిఫర్ ప్రశంసించారు. ఏయూలో 58 దేశాలకు చెందిన వెయ్యి మందికిపైగా విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని రిజిస్ట్రార్ ఆచార్య వి.కృష్ణమోహన్ వివరించగా, అత్యధికంగా విదేశీ విద్యార్థులను కలిగి ఉండటంతో జెన్నిఫర్ హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులతో మాటామంతి గ్లోబల్ వర్చువల్ స్కూల్ ఇంగ్లిష్ ప్రోగ్రాంలో భాగంగా ఆంగ్ల భాషలో తర్ఫీదు పొందుతున్న విద్యార్థులతో జెన్నిఫర్ లార్సన్ అమెరికన్ కార్నర్లో సమావేశమయ్యారు. తరగతులు జరుగుతున్న విధానం, విద్యార్థుల ప్రగతిపై ఆరా తీశారు. అమెరికన్ కార్నర్లో నిర్వహించిన కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పిస్తున్న వసతులు తదితర వివరాలు పాలకమండలి సభ్యుడు జేమ్స్ స్టీఫెన్ వివరించారు. రెక్టార్ కె.సమత, రిజిస్ట్రార్ వి.కృష్ణమోహన్, ప్రిన్సిపాల్స్ కె.శ్రీనివాసరావు, వి.విజయలక్ష్మి, టి.శోభశ్రీ, ఎస్కే భట్టి, డీన్లు ఎన్.కిశోర్‌బాబు, కె.బసవయ్య పాల్గొన్నారు. -
ఏయూలో జియోలాజికల్ ఎగ్జిబిషన్
ఏయూ క్యాంపస్: విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ జియాలజీ విభాగంలో ఏయూ, ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ (ఇంటాక్) విశాఖ ప్రాంతీయ కేంద్రం సంయుక్తంగా శనివారం ఏర్పాటు చేసిన జియోలాజికల్ ఎగ్జిబిషన్ విద్యార్థులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో అరుదైన శిలాజాలను సేకరించే అలవాటు కలిగిన కందుల వెంకటేష్ కోట్ల సంవత్సరాల చరిత్ర ఉన్న చేప శిలాజం, నత్త గుల్లలు, శంఖాలను, డైనోసార్ల శిలాజాలను, కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన జీవుల శిలాజాలను, అంతరిక్షం నుంచి భూమిని ఢీకొట్టిన ఉల్క శకలం, భూమి లోపల సహజ సిద్ధంగా ఏర్పడిన అరుదైన, అందమైన ఖనిజాలను ప్రదర్శించారు. ప్రముఖ ఛాయాచిత్ర గ్రాహకుడు బీకే అగర్వాల్ విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రముఖ జియో డైవర్సిటీ కలిగిన ప్రాంతాల చిత్రాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత మాట్లాడుతూ శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే విధంగా ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన విద్యార్థుల్లో ఉత్సుకతను కలిగిస్తుందన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ..ఈ ఎగ్జిబిషన్లో అరుదైన మినరల్స్, శిలలు ప్రదర్శనలో ఉంచినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా లభించే అరుదైన శిలలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం విద్యార్థులకు ఏర్పడిందన్నారు. ఇంటాక్ విశాఖ కన్వీనర్ రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ.. యునెస్కో అక్టోబర్ 6 ను ఇంటర్నేషనల్ జియో డైవర్సిటీ డేగా ప్రకటించిందని వెల్లడించారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శనను తిలకించారు. -
షుగర్ టెస్టు కోసం ఆంధ్రా వర్సిటీ అద్భుత ఆవిష్కరణ.. డివైస్ స్పెషల్ ఇదే!
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆవిష్కరించింది. ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు. ఈ బయోసెన్సార్ పరికరంలో ఒక చుక్క బ్లడ్ వేస్తే.. సెకను వ్యవధిలోనే కచ్చితమైన మధుమేహం వివరాలు వచ్చేస్తాయి. ఈ డివైజ్‌ను ఆండ్రాయిడ్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌కు అనుసంధానం చేస్తే షుగర్ లెవల్స్ వివరాలు డిస్ప్లే అవుతాయి. మరోవైపు ఈ డివైజ్ ద్వారా కేవలం మధుమేహం మాత్రమే కాకుండా కోవిడ్, క్యాన్సర్, బీపీ, ఫ్యాట్, థైరాయిడ్ తదితర వ్యాధులకు పరీక్షలు చేసేలా, గాలిలో కాలుష్యాన్ని కనుగొనేలా అభివృద్ధి చేయాలని ఏయూ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం యాంటీజన్ యాంటీబాడీ ఇమ్మొబలైజేషన్ మెథడ్ ద్వారా చిప్స్ తయారీకి పరిశోధనలు కొనసాగుతున్నాయి. క్యాన్సర్ పరీక్షలకు అనుగుణంగా పరికరాన్ని అభివృద్ధి చేసేందుకు బార్క్, కోవిడ్, ఇతర వ్యాధులకు సంబంధించిన స్ట్రిప్స్ తయారీ కోసం ఢిల్లీకి చెందిన పలు సంస్థలు ఏయూతో చర్చలు జరుపుతున్నాయి. ఏయూ చరిత్రలో తొలి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆంధ్ర విశ్వవిద్యాలయం చరిత్రలో ఒక పరిశోధన పేటెంట్ పొంది, సాంకేతికత బదలాయింపు జరిగిన తొలి పరికరం ఇదే కావడం విశేషం. ఈ పరికరాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు విశాఖకు చెందిన అక్షయ ఇన్నోటెక్ సంస్థ ఇటీవల ఏయూతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా సాంకేతికతను బదలాయింపు చేసుకుని త్వరలోనే ప్రజలకు అతి తక్కువ ధరకు ఈ పరికరాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో.. కోవిడ్ సమయంలో ప్రతి పరీక్షకు ఎక్కువ ఖర్చు చేసేవారు. అందువల్ల పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరం తయారు చేయాలన్న ఆలోచన మొదలైంది. వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సహకారంతో ఏయూ ల్యాబ్‌లోనే పరిశోధనలు ప్రారంభించి సఫలీకృతులయ్యాం. ఆప్టిక్ ఫైబర్ టెక్నాలజీతో అన్ని పరీక్షలను ఈ పరికరం ద్వారా తెలుసుకునేలా చేస్తున్నాం. ప్రస్తుతం ఒక డివైజ్ మల్టీపుల్ స్ట్రిప్స్ వాడుతున్నాం. భవిష్యత్తులో ఒక పరికరం.. ఒకే చిప్ అనే విధంగా పరిశోధనలు చేస్తున్నాం. – డాక్టర్ అపరంజి, ఏయూ బయో కెమిస్ట్రీ ప్రొఫెసర్ -
అమరావతిని మరో హైదరాబాద్ చేస్తారా?
ఏయూక్యాంపస్: రైతుల పేరుతో చేపట్టిన బూటకపు పాదయాత్రను అడ్డుకుంటామని ఆంధ్రా యూనివర్సిటీ (ఏయూ) ఆచార్యులు, ఉద్యోగులు, పరిశోధకులు నినదించారు. గతంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి ఎంతో నష్టపోయామన్నారు. టీడీపీ నాయకులు అమరావతిని మరో హైదరాబాద్‌గా మార్చాలని ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దీనికి కొన్ని రాజకీయ పార్టీలు వంతపాడటం రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమేనని చెప్పారు. విశాఖపట్నంలోని ఏయూలో జ్యోతిరావుపూలే విగ్రహం వద్ద బుధవారం వారు సమావేశమయ్యారు. మూడు రాజధానులకే తమ మద్దతని చెప్పారు. ఈ సందర్భంగా వర్సిటీ విద్య విభాగాధిపతి డాక్టర్ టి.షారోన్‌రాజు విలేకరులతో మాట్లాడుతూ కొంతమంది రియల్టర్లు, పెట్టుబడిదారులు చేస్తున్న ఈ యాత్రను తాము అడ్డుకుంటామన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్ర సమగ్ర వికాసం సాధ్యపడుతుందన్నారు. మూడు రాజధానులతో రాష్ట్రంలో మూడు ప్రాంతాలు ఎంతో అభివృద్ధి సాధిస్తాయని చెప్పారు. ఏయూ ఉద్యోగ సంఘం నాయకుడు డాక్టర్ జి.రవికుమార్ మాట్లాడుతూ పారిశ్రామిక, ఐటీ, వాణిజ్య, వ్యవసాయ రంగాల్లో విరాజిల్లుతున్న విశాఖను పరిపాలన రాజధానిగా చేసుకోవడం ఎంతో అవసరమని చెప్పారు. ఉత్తరాంధ్ర విద్యార్థులకు మెరుగైన అవకాశాలు రావడానికి మూడు రాజధానుల నిర్ణయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అమరావతిలో జరుగుతున్న ఉద్యమం కేవలం తాత్కాలికంగా పెట్టుబడిదారులు నడిపిస్తున్న ఉద్యమంగా కనిపిస్తోందన్నారు. విద్యార్థి జేఏసీ కన్వీనర్ బి.కాంతారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని కోరారు. తద్వారా ఉత్తరాంధ్ర వలసలు తగ్గి, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. దీన్ని అడ్డుకునే విధంగా బూటకపు పాదయాత్రలు చేయడం సరికాదని చెప్పారు. టీడీపీ నాయకులు ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచి వారి మనోభావాలను గౌరవించకపోవడం విచారకరమన్నారు. వారు వెంటనే స్పష్టమైన వైఖరి తెలిపాలని కోరారు. విశాఖ జిల్లాలోకి పాదయాత్రను ఎట్టిపరిస్థితుల్లోను అడుగు పెట్టనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ నెల 17న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద, 19వ తేదీన ఎన్ఏడీ కూడలి వద్ద విద్యార్థులతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. డాక్టర్ ఎం.కళ్యాణ్, డాక్టర్ శాంతారావు, మురళి, విద్యార్థులు సాయికృష్ణ, భరత్, నవీన్‌దాస్, బాలాజీ, శివ, పృధ్వీ, మాధవ్‌రెడ్డి, రామ్‌కుమార్‌రెడ్డి, జగన్, సోమశేఖర్ పాల్గొన్నారు. -
Andhra University: ఏయూ దూరవిద్య.. మరింత చేరువ
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): దూరవిద్య విధానం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యను చేరువ చేయడమే లక్ష్యంగా ఆంధ్రా విశ్వవిద్యాలయం (ఏయూ) పనిచేస్తోంది. విద్యార్థులు దేశంలో ఎక్కడ నుంచైనా సేవలు పొందే దిశగా మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే ఆన్లైన్లో బీకామ్, ఎంఏ సోషియాలజీ కోర్సులను అందిస్తున్న ఏయూ దూరవిద్య కేంద్రం మరిన్ని సేవలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం అందిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల ప్రవేశాలు, పరీక్షలకు దరఖాస్తు, ఫీజుల చెల్లించడం వంటి వాటిని ఆన్లైన్లోనే చేసేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సెప్టెంబర్ 5న ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల చేయగా ఆన్లైన్లో 250 మంది దరఖాస్తు చేసుకున్నారు. అక్టోబర్ 25 వరకు దరఖాస్తుకు అవకాశముంది. ఈ దూర విద్యా కోర్సులకు రెగ్యులర్ కోర్సుల తరహాలోనే సెమిస్టర్ విధానం ఉంటుంది. అదేవిధంగా గ్రేడింగ్ విధానం కూడా ప్రవేశపెట్టారు. విద్యార్థుల ముంగిటకే సేవలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు సైతం సులువుగా తమకు నచ్చిన కోర్సులను అభ్యసించేలా ఆన్లైన్లో ప్రవేశాలు పొందే అవకాశం ఏయూ కల్పిస్తోంది. దీనిలో భాగంగా విద్యార్థులు andhrauniversity.edu.inలో నిర్దేశిత లింక్‌ను క్లిక్ చేయాలి. అనంతరం లెర్నర్ ఎన్రోల్మెంట్పై క్లిక్ చేయాలి. అక్కడ విద్యార్థులు తమ వ్యక్తిగత, సామాజిక, విద్యా సంబంధ వివరాలు సమర్పించాలి. అలాగే పదో తరగతి, కులధ్రువీకరణ, విద్యార్హత తెలిపే సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి. దీంతో దరఖాస్తు చేయడం పూర్తవుతుంది. ఆ తర్వాత కోర్సుల వారీగా నిర్దేశిత ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. తర్వాత వర్సిటీ అధికారులు.. విద్యార్థుల దరఖాస్తు, తదితర వివరాలను పరిశీలించి.. అర్హత ఉన్నట్లయితే ప్రవేశాన్ని ధ్రువీకరిస్తారు. ఫోన్లో ఇంటర్నెట్ ద్వారా కూడా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థి దూరవిద్యా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదు. -
స్టార్టప్‌లకు కేంద్రంగా భారత్
సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్‌లో టెక్నికల్ స్టార్టప్‌లకు భారతదేశం కేంద్ర బిందువుగా మారనుందని ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ ప్రమోషన్ కౌన్సిల్(ఈఎస్సీ) చైర్మన్ సందీప్ నరూలా తెలిపారు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యాన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మంగళవారం నిర్వహించిన ‘ఏపీ స్టేట్ స్టార్టప్ కాన్క్లేవ్’ను ఏయూ వీసీ డాక్టర్ పీవీజీడీ ప్రసాదరెడ్డితో కలిసి సందీప్ నరూలా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్టప్‌లకు సంబంధించిన సాంకేతికతను అందిపుచ్చుకునే విషయంలో పరస్పర సహకారం కోసం ఏయూ ఇన్నోవేటివ్ సొసైటీ, ఏయూ ఇంక్యుబేషన్ సెంటర్, ఈఎస్సీ సంస్థ ఎంవోయూ చేసుకున్నాయి. అనంతరం సందీప్ నరూలా మాట్లాడుతూ దేశంలో లోకల్ స్టార్టప్‌లు పెరగడం శుభపరిణామమన్నారు. స్టార్టప్‌లు స్థానిక ఆర్థిక ప్రగతికి ఊతమిస్తాయన్నారు. ఔత్సాహికుల ఆలోచనలను విజయవంతమైన వ్యాపారంగా మార్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఏయూ సహకారం అందించడం అభినందనీయమని కొనియాడారు. ప్రతి రాష్ట్రంలో స్టార్టప్‌ల పోటీలు నిర్వహిస్తున్నామని, వీటిలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి త్వరలోనే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని తెలిపారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమమైన స్టార్టప్‌లను ఎంపిక చేసి, శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న అంతర్జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామని సందీప్ వివరించారు. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా(ఎస్టీపీఐ) సీనియర్ డైరెక్టర్ డాక్టర్ దేవీష్ త్యాగి మాట్లాడుతూ ఎస్టీపీఐకి దేశ వ్యాప్తంగా 62 కేంద్రాలు ఉన్నాయని, విశాఖ కేంద్రంలో బీపీవో 2.0 ప్రాజెక్టు అమలుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో నెక్స్ట్ జనరేషన్ ఇంక్యుబేషన్ స్కీమ్ అమలుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఏయూలోని స్టార్టప్ సెంటర్లో 38 అంకుర పరిశ్రమలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఈఎస్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గుర్మీత్ సింగ్, ఎస్టీపీఐ డైరెక్టర్ రామ్‌ప్రసాద్, ఈఎస్సీ ఏపీ చాప్టర్ చైర్మన్ సుధాకర్ పంతుల, ఏయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కృష్ణమోహన్ పాల్గొన్నారు. -
ఆంధ్ర యూనివర్సిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
-
వీడియో వైరల్: ఏయూ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు రేగింది. ఒక వర్గం విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు దాడి చేశారు. ఒక వర్గం విద్యార్థులు గంజాయి తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇరువర్గాల విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు -
నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు.. బాగున్నారా..
సాక్షి, విశాఖపట్నం: ‘బాగున్నారా.. కాఫీ చాలా చాలా బాగుంది.. నాకు కొంచెం కొంచెం తెలుగు వచ్చు’ అంటూ ఇథియోపియా కేంద్ర మంత్రి ఎర్గోగి టిస్‌ఫాయే తెలుగులో మాట్లాడి అబ్బురపరిచారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంత్రపాలజీ విభాగంలో పీహెచ్డీ చేశానని, ఆ సమయంలో విశాఖలో ఉన్నప్పుడు కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నానని చెప్పారు. పూర్తిగా తెలుగులో మాట్లాడలేకపోయినా, అర్థం చేసుకోగలనన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ తనకు తల్లితో సమానమని, వర్సిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. శుక్రవారం ఏయూకు విచ్చేసిన ఆమె ఇష్టాగోష్టిలో పలు విషయాలను పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే.. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వవిద్యార్థి పురస్కారం నేను ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్(ఐసీసీఆర్) అందించిన స్కాలర్‌షిప్‌తో చదువుకున్నాను. ఏయూలో ప్రొఫెసర్ల బోధన నాకు ఎంతో నచ్చింది, ఉపకరించింది. మానవ అధ్యయనానికి భారత్ సరైన వేదిక అని నాకు అనిపించింది. ఇక్కడ విభిన్న సంస్కృతులు, భాషలు, వైవిధ్యాల సమ్మేళనం దర్శనమిస్తుంది. ఐసీసీఆర్ నుంచి విశిష్ట పూర్వ విద్యార్థి పురస్కారం అందుకోవడం ఆనందాన్ని ఇచ్చింది. ఏయూ విద్యార్థిగా నేను గర్విస్తాను. భారత్‌ను ఎంచుకోమంటాను ప్రతీ సంవత్సరం ఇథియోపియా నుంచి పెద్దసంఖ్యలో విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. వీరికి భారత్‌కు వెళ్లాలని నేను సూచిస్తున్నాను. ముఖ్యంగా ఏయూలో చదువుకోవాలని, ఇక్కడ వాతావరణం, ప్రజలు బాగుంటారని వారికి పలు సందర్భాలలో తెలియజేస్తున్నా. వాతావరణం, ఆహారం, ప్రజలు తదితర అంశాల్లో భారత్, ఇథియోపియా దేశాల మధ్య సారూప్యత అధికంగా ఉంటుంది. ఏయూతో కలసి పని చేస్తాం నాకు తల్లితో సమానమైన ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలసి పనిచేస్తాం. స్టార్టప్ రంగంలో ఇథియోపియాకు కొంత సహకారం, మార్గదర్శకత్వం అవసరం. ఏయూ ఇప్పటికే ఈ రంగంలో మంచి ప్రగతిని సాధించింది. ఈ దిశగా ఏయూ సహకారం తీసుకుంటాం. డ్యూయల్ డిగ్రీ కోర్సులను సైతం నిర్వహించే ప్రదిపాదన ఉంది. తెలుగు ప్రజలు మంచివారు నా పీహెచ్డీ పూర్తిచేసే క్రమంలో తెలుగు ప్రజలతో ఉండే అవకాశం లభించింది. ఇక్కడి ప్రజలు చాలా మంచివారు. విశాఖ సుందరమైన నగరం. ఇక్కడ ఉన్న సమయంలో కొన్ని తెలుగు పదాలను నేర్చుకున్నారు. ఎవరు, ఎంత.. ఇలా అనేక పదాలను నేను ఇప్పటికీ మరచిపోలేదు. ఉన్నతంగా ఎదిగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన ఇథియోపియా దేశస్తులు ఉన్నత స్థితిలో రాణిస్తున్నారు. విభిన్న శాఖల్లో మంత్రులుగా, విశ్వవిద్యాలయాల ఉపకులపతులుగా సేవలు అందిస్తున్నారు. వీరంతా ఏయూ పూర్వవిద్యార్థులే అనే విషయం మరువలేదు. ఇథియోపియాలో భారత్ పెట్టుబడులు ఇథియోపియా దేశంలో అనేకమంది భారతీయులు పెట్టుబడులు పెడుతున్నారు. వాటిని స్వాగతిస్తున్నాం. అదే విధంగా పెద్దసంఖ్యలో భారతీయులు ఇథియోపియా విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్నారు. మా దేశంలో శాంతిని కాంక్షిస్తాం. ఇండియా ఇన్క్రెడిబుల్ నేను తొలిసారిగా విద్యార్థిగా ఇథియోపియా నుంచి భారత్‌కు వచ్చే సమయంలో విమానాశ్రయంలో ‘ఇన్క్రెడిబుల్ ఇండియా’ అనే పదాన్ని చూశాను. ఇది నిజమా అనే భావన నాకు కలిగింది. తరువాత నేను భారత్‌లో ఉన్న కాలంలో చూసిన పరిస్థితులు, అనుభవాల తరువాత ఇది సరిగ్గా సరిపోతుందనే భావన నాకు కలిగింది. ఇథియోపియాలో ఏయూ ముద్ర ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేపట్టే సంస్కరణలు, అభివృద్ధి ఆలోచనలు ఇథియోపియాపై ప్రభావం చూపుతాయి. ఇక్కడ అధికారులు చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు విద్యార్థుల నుంచి ఇథియోపియాకు చేరతాయి. పరోక్షంగా ఇథియోపియా విద్యా వ్యవస్థను ఏయూ ప్రభావితం చేస్తుందని చెప్పవచ్చు. (క్లిక్: పెంపుడు కుక్కతో ‘టెక్కీ’ లవ్ జర్నీ.. ఎందుకో తెలుసా..?) -
రహదారి నిర్మాణంలో నయా టెక్నాలజీ
సాక్షి, విశాఖపట్నం: సమస్యకు పరిష్కారం చూపాలి. సమాజానికి ఉపయుక్తంగా నిలవాలి. పరిశోధనల ప్రధాన ఉద్దేశం ఇది. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్)గా పనిచేస్తున్న సాలూరు మురళీకృష్ణ పట్నాయక్ ఇదే ఉద్దేశంతో పరిశోధన చేసి.. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ స్వీకరించారు. ఏయూ సివిల్ ఇంజినీరింగ్ విభాగం ఆచార్యులు పి.వి.వి సత్యనారాయణ పర్యవేక్షణలో ఆయన పరిశోధన చేశారు. వాల్తేరు డీఆర్ఎం అనూప్ కుమార్ సత్పతి నుంచి అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా సాలూరుకు చెందిన మురళీకృష్ణ పట్నాయక్ చిన్నతనం నుంచి విద్యపై ఆసక్తిని పెంచుకున్నారు. తండ్రి సాలూరు శంకరనారాయణరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావడంతో.. ఆయనే ప్రేరణగా నిలిచారు. పట్నాయక్ పాలిటెక్నిక్‌లో సివిల్ ఇంజినీరింగ్ చదివారు. రైల్వేలో 1988లో ఉద్యోగంలో చేరి ఏఎంఐఈ పూర్తి చేశారు. అనంతరం ఏయూలో ఎంటెక్ చదివారు. అనంతరం పీహెచ్‌డీలో ప్రవేశం పొంది విజయవంతంగా పూర్తి చేశారు. వ్యర్థాలకు అర్థం చెప్పాలనే... విద్యుత్ ఉత్పత్తిలో భాగంగా నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్లలో భారీగా యాష్(బూడిద) ఏర్పడుతుంది. దీనిని నిల్వ చేయడం, పునర్వినియోగం విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు తలకుమించిన భారం. అదే విధంగా క్రషర్‌ల్లో వివిధ సైజ్‌ల్లో కంకర తయారు చేసినపుడు క్రషర్ డస్ట్ ఏర్పడుతుంది. ఈ రెండు పరిశ్రమల్లో ఉత్పత్తి అయ్యే యాష్, క్రషర్ డస్ట్‌లు పర్యావరణపరంగా సమస్యలకు కారణమవుతున్నాయి. పర్యావరణ ప్రాధాన్యం కలిగిన ఇటువంటి అంశాన్ని తన పరిశోధన అంశంగా పట్నాయక్ ఎంచుకున్నారు. ఎన్టీపీసీలో నిరుపయోగంగా ఉన్న యాష్‌ను, వివిధ క్రషర్‌ల్లో ఏర్పడే డస్ట్‌ను ఉపయుక్తంగా మార్చే దిశగా తన పరిశోధన ప్రారంభించారు. గ్రావెల్‌కు ప్రత్యామ్నాయంగా.. రహదారులు, రైల్వే లైన్లు నిర్మాణం చేసే సమయంలో నిర్ణీత ఎత్తు వరకు నేలను చదును చేయడం, రాళ్లు, గ్రావెల్, మట్టి, కంకర వంటి విభిన్న మెటీరియల్స్‌ను ఉపయోగిస్తారు. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. వీటిలో కొన్నింటికి ప్రత్యామ్నాయంగా ఉచితంగా లభించే యాష్‌ను ఉపయోగిస్తే కలిగే సామర్థ్యాన్ని పట్నాయక్ అంచనా వేశారు. నాలుగు పొరలుగా రహదారిని నిర్మిస్తారు. సబ్ గ్రేడ్, సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్, సర్ఫేసే కోర్స్‌గా ఉంటుంది. మధ్య రెండు పొరలుగా వేసే సబ్ బేస్ కోర్స్, బేస్ కోర్స్‌లో గ్రావెల్, కంకర వివిధ పాళ్లలో కలిపి వినియోగిస్తారు. ఈ రెండింటి లభ్యత తక్కువగా ఉంది. పైగా అధికంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటికి ప్రత్యామ్నాయంగా తగిన పాళ్లలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించే అంశాన్ని ప్రయోగశాల పరిస్థితుల్లో ఆయన అధ్యయనం చేశారు. సీబీఆర్ రేషియో ప్రామాణికంగా.. రహదారుల నిర్మాణంతో నాణ్యతను గుర్తించడానికి, గణించడానికి కాలిఫోర్నియా బేరింగ్ రేషియో(సీబీఆర్)ను ప్రామాణికంగా తీసుకున్నారు. సీబీఆర్ రేషియో 30 కంటే అధికంగా ఉంటే నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు లెక్క. ప్రస్తుతం వినియోగిస్తున్న గ్రావెల్, కంకరలకు బదులు తగిన పరిమాణంలో బాటమ్ యాష్, క్రషర్ డస్ట్‌లను కలిపి వినియోగించి.. సీబీఆర్ రేషియోను ఆయన గణించారు. కేంద్ర జాతీయ రహదారులు –మంత్రిత్వ శాఖ నిర్ధారించిన ప్రామాణికాలు పరిశీలిస్తే.. సబ్ బేస్ కోర్స్‌కు లిక్విడ్ లిమిట్ 25 కన్నా తక్కువ, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 30 కన్నా అధికంగా ఉండాలి. పట్నాయక్ ప్రయోగశాల పరిస్థితుల్లో చేసిన ప్రయోగాల ఫలితాలను విశ్లేషిస్తే.. లిక్విడ్ లిమిట్ 22 నుంచి 24, ప్లాస్టిసిటీ ఇండెక్స్ 6 కన్నా తక్కువగా, సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 వరకు వచ్చాయి. ఎర్ర కంకర(గ్రావెల్)కు బాటమ్ యాష్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 65 వరకు, క్రషర్ డస్ట్‌ను 20 నుంచి 100 శాతం వరకు కలపగా సీబీఆర్ వాల్యూ 33 నుంచి 72 శాతం వరకు రావడం ఆయన గుర్తించారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా.. థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో బాటమ్ యాష్ నిల్వలు పెరిగిపోతున్నాయి. ఇది థర్మల్ విద్యుత్ సంస్థలకు పెనుభారంగా మారింది. క్రషర్ యూనిట్ల ద్వారా క్రషర్ డస్ట్ వెలువడుతోంది. యాష్, క్రషర్ డస్ట్ పర్యావరణానికి సమస్యగా మారాయి. వీటిని ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ పరిశోధన చేశాను. ప్రయోగశాల పద్ధతిలో అధ్యయనం చేశాను. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో, రైల్వే లైన్ల నిర్మాణంలో శాస్త్రీయ అధ్యయనంతో నిర్ణీత పరిమాణంలో వీటిని వినియోగించవచ్చు. తద్వారా నిర్మాణ భారం తగ్గుతుంది. పర్యావరణానికి మేలు జరుగుతుంది. పశ్చిమబెంగాల్లో తుమ్లుక్ థిగా రైల్వే లైన్ నిర్మాణంలో బాటమ్ యాష్‌ను వినియోగించారు. భవిష్యత్‌లో ఇటువంటి నిర్మాణాలు జరగాల్సిన అవసరం ఉంది. – డాక్టర్ సాలూరు మురళీకృష్ణ పట్నాయక్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్(బ్రిడ్జెస్), వాల్తేర్ డివిజన్ -
ఏయూలో అల్లూరి అధ్యయన కేంద్రం
ఏయూ క్యాంపస్: అల్లూరి సీతారామరాజుకు.. ఉమ్మడి విశాఖ జిల్లాకు విడదీయలేని అనుబంధం ఉంది. ఆయన ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను ముందుకు నడిపించే విధంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో అల్లూరి సీతారామరాజు చరిత్ర– ఆదివాసీ అధ్యయన కేంద్రం పనిచేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సేవలందిస్తోంది. వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి సంపూర్ణ సహకారంతో న్యాయ కళాశాల ఆచార్య వి.విజయలక్ష్మి ఈ కేంద్రానికి సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు. అల్లూరి చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటుకు వీసీ ప్రయత్నిస్తున్నారు. దీని ద్వారా అల్లూరి సీతారామరాజుపై లోతైన అధ్యయనం చేసే అవకాశం కలుగుతుంది. ఈ కేంద్రంలో పూర్తిస్థాయిలో మౌలిక వసతుల కల్పనకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దాతల సహకారం ఏయూ పాలక మండలి ఆమోదంతో ఏర్పాటైన అల్లూరి అధ్యయన కేంద్రాన్ని మరింత అభివృద్ధి చేయడానికి నగరానికి చెందిన పలువురు దాతలు ముందుకొస్తున్నారు. వైఎస్సార్ సీపీ ఉత్తర సమన్వయకర్త, నెడ్‌క్యాప్ చైర్మన్ కె.కె రాజు వర్సిటీ కోరిన విధంగా ఈ కేంద్రానికి సహాయం అందిస్తానని ప్రకటించారు. ఏయూ పాలక మండలి సభ్యుడు, హోబెల్ బెల్లోస్ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కె.వి.ఎస్ ఆంజనేయవర్మ అల్లూరి సీతారామరాజు పేరుతో చెయిర్ ప్రొఫెసర్ ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. మారుతి కనస్ట్రక్షన్స్ అధినేత యు.రామకృష్ణరాజు కేంద్రం అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. దాతల సాయంతో ఏర్పాటు చేసిన అల్లూరి పాలరాతి విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించనున్నారు. (క్లిక్: ఎర్ర మిరపకాయల గుత్తి.. బ్రిటిషర్ల హడల్..) పూర్తిస్థాయిలో సేవలందిస్తాం అల్లూరి అధ్యయన కేంద్రం సేవలను విస్తరిస్తాం. విద్యార్థుల్లో అల్లూరిపై మరింత లోతైన అవగాహన కలిగించే విధంగా వక్తృత్వ, వ్యాసరచన, పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించాం. గిరిజన విద్యార్థులకు సాఫ్ట్‌స్కిల్స్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తాం. – ఆచార్య వి. విజయలక్ష్మి, సంచాలకులు, అల్లూరి అధ్యయన కేంద్రం అనుసంధానం చేస్తూ అభివృద్ధి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అరకు, పాడేరులో డిజిటల్ స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాం. వీటితో అల్లూరి అధ్యయన కేంద్రాన్ని అనుసంధానం చేస్తాం. తద్వారా అల్లూరి, ఆదివాసీ అంశాలపై అవగాహన, పరిశోధనలు చేసేలా చర్యలు తీసుకుంటాం. – ఆచార్య పి.వి.జి.డి ప్రసాద రెడ్డి, ఉపకులపతి -
ఇదేం దిగజారుడు.. ట్విట్టర్లో ఆ పోస్టులేంటి అయ్యన్న..
సాక్షి, విశాఖపట్నం: పవిత్రమైన ఏయూ ప్రతిష్టను దిగజార్చేవిధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలతో ట్విట్టర్లో పోస్టుచేసిన టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులు, ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం వారు నగర పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ – 1 గరుడ సుమిత్‌సునీల్‌కు ఫిర్యాదు లేఖ అందజేశారు. చదవండి: అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు గత 40 ఏళ్లగా ఏయూ పరిసర ప్రాంతాల్లో దట్టంగా తుప్పలు, చెట్లు, పొదలు ఉండడంతో అక్కడ ఆకతాయులు, అల్లరిమూకలు చేరి గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు సేవించడానికి అనువైన ప్రదేశంగా మార్చుకుంటున్నారని.., అందుకే ఏయూ వీసీ ప్రసాదరెడ్డి ఆ ప్రాంతాన్ని ‘నాడు – నేడు’ కార్యక్రమంలో భాగంగా నెల రోజులుగా శుభ్రం చేయిస్తున్నారని పేర్కొన్నారు. అసాంఘిక కార్యాకలాపాలకు అవకాశమిచ్చేలా ఉన్న పొదలు, తుప్పలను తొలగించి క్రీడా మైదానంగా తయారుచేస్తుంటే దానిపై విమర్శలు చేస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఏయూపై లేనిపోని ఆరోపణలు చేస్తూ విద్యార్థులు, ఉద్యోగుల్లో గ్రూప్‌లను సృష్టించి విధ్వంసకర వాతావరణాన్ని తీసుకొస్తున్న టీడీపీ నేత అయ్యన్నపాత్రుడుపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు. ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ జీఎల్ఎస్ రవికుమార్, ప్రొఫెసర్లు షారోన్‌రాజు, పుల్లారావు, సుబ్బారావు, ప్రేమానంద్, ఎన్ఏడీ పాల్, గెస్ట్ ఫ్యాకెల్టీ తుల్లి చంద్రశేఖర్ యాదవ్, విద్యార్థి నాయకులు బి.కాంతారావు, చరణ్, పీతాన్ ప్రసాద్, పవన్, రాజుగౌడ్, ఆనంద్రత్నకుమార్, శ్యాంసుందర్‌రావు, కళ్యాణ్, ఎంప్లాయిస్ నాయకులు త్రినాథరెడ్డి, రమాణారెడ్డి, లక్ష్మణరెడ్డి, రాంబాబు, లా కాలేజ్ విద్యార్థులు తదితరులు ఫిర్యాదు అందజేశారు. -
అయ్యన్న పాత్రుడు క్షమాపణ చెప్పాలి
-
‘అంబేడ్కర్ కోనసీమ జిల్లా’గానే కొనసాగించాలి
ఏయూ క్యాంపస్: కోనసీమకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఆచార్యులు, మేధావులు కోరారు. విదేశాల్లో సైతం అంబేడ్కర్ విగ్రహాలు, సెంటర్లు పెడుతుంటే.. మన రాష్ట్రంలో మాత్రం అడ్డుకోవడం దారుణమన్నారు. శనివారం విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో నిర్వహించిన మేధావుల చర్చాగోష్టిలో ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మాజీ ప్రిన్సిపాల్ ఆచార్య కె.శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకున్నవారు ఇలా విధ్వంసాలకు పాల్పడరన్నారు. సీఎం జగన్ దావోస్ పర్యటిస్తూ.. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువస్తున్న సమయంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం విచారకరమన్నారు. మహిళా విద్య కోసం అంబేడ్కర్ ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఏయూ లా కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డి.సూర్యప్రకాశరావు మాట్లాడుతూ.. కొలంబియా యూనివర్సిటీలో సైతం అంబేడ్కర్ కార్నర్ ఉందన్నారు. అంబేడ్కర్‌ను గౌరవించడమంటే.. మనల్ని మనం గౌరవించుకోవడమేనన్నారు. ఉత్తరాంధ్ర కాపు సంఘం అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ఠాగూర్ మాట్లాడుతూ.. సమాజ శ్రేయస్సును ఆకాంక్షించే అంబేడ్కర్ పేరును కోనసీమ జిల్లాకు పెట్టడం స్వాగతించాల్సిన అంశమన్నారు. సమావేశంలో పాలకమండలి సభ్యులు ఆచార్య జేమ్స్ స్టీఫెన్, ఆచార్యులు డి.వి.ఆర్ మూర్తి, కె.పల్లవి, కె.విశ్వేశ్వరరావు, చల్లా రామకృష్ణ, ఎన్.విజయమోహన్, డాక్టర్ జి.రవికుమార్, రెక్టార్ కె.సమత, ప్రిన్సిపాల్స్ పి.రాజేంద్ర కర్మార్కర్, టి.శోభశ్రీ, డీన్లు ఆచార్య ఎన్.సత్యనారాయణ, టి.షారోన్ రాజు, పాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఏయు ఇంటర్నేషనల్ స్టూడెంట్ వీడ్కోలు వేడుకలు
-
విశాఖ జాబ్ మేళాకు భారీ స్పందన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ) ప్రాంగణంలో వైఎస్సార్సీపీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళా కార్యక్రమాన్ని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ జాబ్ మేళా ద్వారా ఉద్యోగాలు పొందిన 22,227 మంది యువతకు అభినందనలు. చదువుతో పాటు ఉపాధి కల్పించాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. ఇంత పెద్ద ఉపాధి లభించడం సీఎం జగన్‌కు సంతోషం కలిగించే అంశమని అన్నారు. తొలి రోజు 13, 663 రెండో రోజు 8,557 మందికి ఉద్యోగాలు లభించాయి. మొత్తం 22,227 మంది రెండు రోజుల్లో ఉపాధి కల్పించడం వైఎస్సార్సీపీ సాధించిన రికార్డు. అత్యధికంగా ఏడాదికి 12 లక్షలు 50 వేలు, అత్యల్పంగా నెలకు 15 వేలు వేతనం ఉద్యోగాలు అందించాము. రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా విద్యార్థులు ఎదగాలి’’ అని అన్నారు. -
మానవునిపై కన్నెర్ర చేస్తోన్న ప్రకృతి.. దీనికి కారణం ఎవరు?
ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. దాదాపు 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అకాల వర్షాలు.. తుపాన్లు ఇలా ప్రకృతి మానవునిపై కన్నెర్ర చేస్తోంది. దీనికి కారణం ఎవరు? మొదట్లో మానవుడు తన చర్యల ద్వారా పర్యావరణానికి ఏ ఇబ్బంది కలగని విధంగా జీవించాడు. కాలక్రమేణా మానవుడి జీవన శైలిని మారింది. తన ఆశలు, అవసరాలు తీర్చుకునేందుకు.. వాటి కోసం ప్రకృతిలోని సహజ వనరులను విపరీతంగా వాడుకోవడం మొదలు పెట్టాడు. తన మనుగడకే ప్రమాదం కొనితెచ్చుకుంటున్నాడు. ఆగ్నేయ ఆసియాలో తొలిసారిగా.. ఆగ్నేయ ఆసియాలో తొలిసారిగా వాతావరణం, సముద్ర శాస్త్రాలను బోధించే విభాగాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో 1948లో ప్రారంభించారు. వాతావరణ, సముద్ర శాస్త్ర రంగాల్లో సుశిక్షితులైన మానవ వనరులను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో జాతీయ, అంతర్జాతీయ సంస్థల సహకారం, సమన్వయంతో ఈ విభాగం ఏర్పాటైంది. ఇస్రో, ఎన్ఐవో, ఐఐటీఎం, ఐఎండీ, ఎస్ఏసీ, ఇన్కాయిస్, డీఆర్డీవో వంటి పరిశోధన సంస్థలు ఏయూలోని వాతావరణ శాస్త్ర విభాగంతో కలసి పనిచేస్తున్నాయి. బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాల్లో ఏర్పడే తుపానుల రియల్ టైమ్ ప్రిడిక్షన్, కాలానుగుణంగా వర్షపాతం, గణాంక నమూనాలు, రుతుపవనాల అంచనా, గమనం, తీరుతెన్నులు తదితర అంశాలపై ఇక్కడ లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం విభాగంలో ఎమ్మెస్సీ(మెటియోరాలజీ), ఎమ్మెస్సీ(ఫిజికల్ ఓషనోగ్రఫీ), ఎమ్మెస్సీ (అట్మాస్ఫియరిక్ సైన్స్), ఎమ్మెస్సీ (ఓషన్ సైన్స్)లతో పాటు ఎంఫిఎల్, పీహెచ్డీ కోర్సులను అందిస్తున్నారు. రొక్కం రామనాథం ఆలోచనలతో.. మెటియోరాలజీ విభాగాన్ని స్థాపించడానికి అవసరమైన అవగాహన, జ్ఞానం పొందడానికి ఏయూ భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులైన రొక్కం రామనాథంను వర్సిటీ యాజమాన్యం లండన్ పంపింది. అక్కడ ప్రముఖ వాతావరణ శాస్త్రవేత్త బి.జె మేసన్ వద్ద ఆయన శిక్షణ తీసుకున్నారు. ఆచార్య రామనాథం ప్రత్యేకంగా రాడార్‌ను డిజైన్ చేశారు. పుణేలో నిరుపయోగంగా ఉన్న రాడార్లను తీసుకువచ్చి.. అవసరమైన మరమ్మతులు చేసి విభాగంలో వినియోగించేవారు. దీని సహాయంతో విభాగంలో రిసీవింగ్ స్టేషన్ ఏర్పాటు చేసి, వాతావరణ మార్పులకు సంబంధించిన సమాచారం తెలుసుకునేవారు. తర్వాత కాలంలో ఆచార్య రామనాథం యూఎన్డీపీ సహకారంతో కెనడాలో ప్రపంచ వాతావరణ సంస్థకు సేవలు అందించారు. ఆయన తర్వాత ఆచార్య వి.పి.సుబ్రహ్మణ్యం, ఐ.సుబ్బరామయ్యలు కూడా ప్రపంచ వాతావరణ సంస్థకు సేవలు అందించారు. వీరంతా ఏయూలో చదువుకుని, ఇక్కడే ఆచార్యులుగా పనిచేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసే సామర్థ్యాలు కలిగిన ఎంతో మంది నిపుణులను ఏయూలోని ఈ కేంద్రం అందించింది. వ్యవసాయం, కాలుష్యం, క్లైమేట్ చేంజ్, రుతుపవనాలు, తుపానులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది. ఇక శాటిలైట్ల రాకతో వాతావరణ సమాచారం అందించే విధానాల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. ప్రస్తుతం ప్రతి అర గంటకు వాతావరణ మార్పులు తెలుసుకునే సాంకేతిక వ్యవస్థ అందుబాటులో ఉంది. ఈ రోజు ప్రత్యేకత ఏంటంటే.? ప్రపంచ వాతావరణ సంస్థ 1950 నుంచి ఏటా మార్చి 23న ప్రపంచ వాతావరణ దినోత్సవం నిర్వహిస్తోంది. సమాజ భద్రత, శ్రేయస్సుకు జాతీయ వాతావరణ, హైడ్రాలజీ(నీటి సంబంధ) సేవల ప్రాధాన్యాన్ని తెలియజేయడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశం. ప్రతి సంవత్సరం వాతావరణ దినోత్సవాన్ని ఓ ప్రత్యేకమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తోంది. సమయోచితంగా వాతావరణం, నీటి సమస్యలను ప్రతిబింబించే విధంగా ఇవి ఉంటాయి. ఈ సంవత్సరం ‘ఎర్లీ వార్నింగ్ అండ్ ఎర్లీ యాక్షన్’ అంశంపై కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. పర్యావరణ మార్పుల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, నీరు తీవ్రమైన ప్రభావానికి లోనవుతున్నాయి. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పర్యావరణ క్షీణత ఫలితంగా విపత్తుల సంఖ్య పెరిగిపోతోంది. వాతావరణం ఎలా ఉంటుంది అని చెప్పడం కంటే.. కచ్చితమైన వివరాలతో ప్రజల జీవితాలను, జీవనోపాధిని పరిరక్షించడానికి వాతావరణం ఎలా ఉపకరిస్తుందో తెలియజేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. విశాఖది మారిటైం క్లైమేట్ విశాఖ నగరంలో మారిటైం క్లైమేట్ మనకు దర్శనమిస్తుంది. సముద్ర మట్టానికి కొంత ఎత్తులో ఉండటం వలన కొంత చల్లని వాతావరణం ఉంటుంది. సెప్టెంబర్‌లో వర్షపాతం అధికంగా ఉంటుంది. వేసవిలో ఎండలు 38–42 డిగ్రీల వరకు ఉంటాయి. గతంతో పోల్చితే క్యుములో నింబస్ మేఘాలు బాగా తగ్గాయి. తేమ అధికంగా ఉంది. – ఆచార్య ఒ.ఎస్.ఆర్.యు భానుకుమార్, వాతావరణ శాస్త్ర విభాగం పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది ఆంధ్ర విశ్వవిద్యాలయం మెటియోరాలజీ విభా గం విలువైన సమాచారాన్ని అందించే పరిశోధన కేంద్రంగా నిలుస్తోంది. డీఎస్టీకి సంబంధించిన క్లైమేట్ ప్రాజెక్ట్‌లు, పిడుగులు పడటాన్ని గుర్తించే లైటెనింగ్ సెన్సార్ వంటి ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహిస్తున్నాం. – ఆచార్య ఎస్.వి.ఎస్.ఎస్ రామకృష్ణ, వాతావరణ శాస్త్ర విభాగం మానవ వనరులు అందిస్తోంది ఏయూ వాతావరణ శాస్త్ర విభాగం దేశానికి అవసరమైన విలువైన వాతావరణ శాస్త్ర నిపుణులను తయారు చేసి అందించే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తోంది. వాతావరణ మార్పులు, గాలి కాలుష్యం, తుపానులు, రుతుపవనాలు, సముద్రాలపై అధ్యయనం చేసే కేంద్రంగా విభాగాన్ని తీర్చిదిద్దారు. ఇటీవల సెర్బ్ నుంచి పరిశోధన ప్రాజెక్టులను సాధించాం. – ఆచార్య సి.వి నాయుడు, విభాగాధిపతి, వాతావరణ శాస్త్ర విభాగం -
అలరించిన ఫ్రెషర్స్ డే: డ్యాన్స్‌లు, ఫ్యాషన్ షో, యువత కేరింత (ఫోటోలు)
-
ఏయూపై విపక్షాల విషప్రచారం
-
భావి తరాలకు వరం
దొండపర్తి (విశాఖ దక్షిణ): మూడు రాజధానులకు మద్దతుగా శుక్రవారం ఆంధ్రా యూనివర్సిటీలో నిర్వహించిన చర్చా వేదికలో మేధావుల ఫోరం తీర్మానం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి తీర్మానం ప్రతిని పంపనున్నట్లు తెలిపింది. పరిపాలనా వికేంద్రీకరణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం భావితరాలకు వరం లాంటిదని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీరామమూర్తి పేర్కొన్నారు. ‘పరిపాలనా వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్ సమతౌల్య అభివృద్ధి’పై విశాఖ ఏయూలోని టీఎల్ఎన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు అన్ని ప్రాంతాల అభివృద్ధిని విస్మరించడం రాష్ట్రానికి శాపంగా పరిణమించిందని, రూ.లక్ష కోట్లతో ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకోవడం అవివేకమన్నారు. నీటి వనరులు, వ్యవసాయ భూములు పుష్కలంగా ఉన్న కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలను నాశనం చేస్తూ గత సర్కారు తీసుకున్న నిర్ణయాలను తప్పుబట్టారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్ దూరదృష్టితో తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం అభినందనీయమన్నారు. ఉద్యమించక ముందే మద్దతివ్వండి.. విభజనతో ఆస్తులు తెలంగాణకు, అప్పులు ఆంధ్రప్రదేశ్‌కు మిగిలాయని ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి, భవిష్యత్ తరాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలన్న సంకల్పంతో సీఎం జగన్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ఏయూ ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయ్‌మోహన్ తెలిపారు. పటిష్ట నాయకత్వం, పాలకులకు దూరదృష్టి లేకపోవడం వల్ల ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరుగుతూ వస్తోందని న్యాయ కళాశాల ప్రొఫెసర్ సూర్యప్రకాష్ చెప్పారు. అమరావతి ప్రాంతం హైదరాబాద్‌లా అభివృద్ధి చెందాలంటే వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. విద్యార్థులు, యువత ఉద్యమబాట పట్టకముందే ప్రతిపక్షాలు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని ప్రొఫెసర్ షరాన్ రాజ్ డిమాండ్ చేశారు. మరోసారి ప్రాంతీయ విద్వేషాలు తలెత్తకుండా ఉండాలంటే మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ఏయూ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ రవి పేర్కొన్నారు. ఎయిడెడ్ కళాశాలల తరఫున ప్రొఫెసర్ మధుసూదనరావు మాట్లాడుతూ తాము గుంటూరు నుంచి వచ్చినప్పటికీ పరిపాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని గట్టిగా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నాన్ టీచింగ్ యూనియన్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షుడు షేక్ ఖాదర్ బాబా తదితరులు పాల్గొన్నారు. -
‘పెన్‌స్టేట్’ వర్సిటీ అధ్యక్షురాలిగా నీలి బెండపూడి
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు)/సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ తొలి మహిళా అధ్యక్షురాలిగా ఏయూ పూర్వవిద్యార్థిని నీలి బెండపూడి నియమితులయ్యారు. ఈ నెల 9వ తేదీన జరిగిన పెన్సిల్వేనియా (పెన్‌స్టేట్) యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశంలో ఏకగ్రీవంగా నీలి బెండపూడిని నూతన అధ్యక్షురాలిగా ఎన్నుకున్నారు. వచ్చే సంవత్సరం జనవరిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుతం నీలి బెండపూడి యూనివర్సిటీ ఆఫ్ లూయిన్ విల్లీ కెంటగీ అధ్యక్షురాలిగా, మార్కెటింగ్ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. నీలి బెండపూడి విశాఖ నగరంలో జన్మించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా స్వీకరించారు. అనంతరం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. గతంలో ఆమె కేన్సాస్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చాన్సలర్‌గా సేవలందించారు. నీలి బెండపూడి తల్లిదండ్రులు ఆచార్య రమేష్ దత్త, పద్మదత్త ఇరువురూ ఏయూ ఆంగ్ల విభాగం ఆచార్యులుగా పనిచేశారు. నీలి బెండపూడిని ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి అభినందించారు. రికార్డు సృష్టించారు : సీఎం జగన్ పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు. విశాఖపట్నంకు చెందిన ఆంధ్రవిశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థిని అయిన నీలి బెండపూడి ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీ పెన్ స్టేట్‌కి ఎన్నికైన తొలి మహిళా ప్రెసిడెంటుగా రికార్డు సృష్టించారన్నారు. కుమార్ అన్నవరపు అభినందనలు.. పెన్ స్టేట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన నీలి బెండపూడికి ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కో–ఆర్డినేటర్ (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం) కుమార్ అన్నవరపు అభినందనలు తెలిపారు. -
ప్రతి నియోజకవర్గంలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం వేదికగా దేశంలో నాలుగో నాస్కామ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (ఐవోటీ–ఏఐ)ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎలక్ట్రానిక్స్, ఐటీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. నాస్కామ్ సెంటర్ వ్యవసాయ, వైద్య రంగాల అవసరాలు తీర్చే దిశగా పనిచేస్తుందన్నారు. అలాగే అమెజాన్‌తో సెంటర్ ఆఫ్ టెక్నాలజీని ఏర్పాటు చేసే ప్రతిపాదనను సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నామన్నారు. వ్యవసాయ, వైద్య, సంక్షేమ రంగాలు టెక్నాలజీతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. ప్రజలను కేంద్రంగా చేసుకుని టెక్నాలజీని అభివృద్ధి చేయాలని కోరారు. తొమ్మిది టెక్నాలజీలను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్– మెషీన్ లెర్నింగ్, రోబోటిక్స్–ఆటోమేషన్, హెచ్–కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, వర్చువల్ రియాలిటీ, బ్లాక్‌చైన్, 5జీ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తున్న వర్క్ ఫ్రం హోం విధానం ఇతర రాష్ట్రాలకు, దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. దీని ప్రారంభానికి రావాలని కేంద్ర మంత్రిని ఆహ్వానించారు. ప్రధాని మోదీ పాలనలో నూతన అవకాశాలు.. కేంద్ర సహాయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రజల జీవనంలో టెక్నాలజీ గణనీయ మార్పును తెస్తోందన్నారు. అంతర్జాతీయంగా నాణ్యమైన సేవలు అందించే కేంద్రంగా ఏయూ నిలిచిందని చెప్పారు. ప్రధాని మోదీ పాలనలో నూతన అవకాశాలను సృష్టించామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థలు కలసి పనిచేస్తే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవచ్చన్నారు. నాస్కామ్ అధ్యక్షురాలు దేబ్జాని ఘోష్ మాట్లాడుతూ.. టెక్నాలజీ విభిన్న సమస్యలకు పరిష్కారాలను చూపుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఐటీ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ షానాయి, రాష్ట్ర ఐటీ, నైపుణ్య శిక్షణ మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, జెడ్పీ చైర్పర్సన్ జె.సుభద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఏ ర్యాంకుకు ఎక్కడ ఎంబీబీఎస్ సీటు? విద్యార్థుల్లో పరేషాన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులొస్తే సీటు వస్తుంది? ఏయూ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు. -
విదేశీ విద్యకు రాచబాట
సాక్షి, అమరావతి: విదేశాల్లోని మంచి విశ్వవిద్యాలయాల్లో విద్యను అభ్యసించాలనుకునే రాష్ట్ర విద్యార్థులకు మంచి రోజులు వచ్చాయి. ప్రధానంగా అమెరికాలో చదవాలనుకునే వారికి రాష్ట్రం నుంచి రాచబాట సిద్ధమైంది. స్టెమ్ (విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లెక్కలు) విద్య, మహిళా సాధికారత, అమెరికన్ సంస్కృతిపై అవగాహన కల్పించడం, అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు పూర్తి సమాచారం అందించే వేదిక ‘అమెరికన్ కార్నర్’ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఏర్పాటైంది. దేశంలోనే ఇది మూడవది కావడం గమనార్హం. తద్వారా లక్షలాది మంది విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్యపై సూచనలు, సలహాలు.. మరెన్నో విధాలుగా సేవలందించడంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు చుక్కానిగా నిలవనుంది. ఈ వ్యవస్థ ద్వారా ఎన్నో సేవలు విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్‌ను గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇక్కడ ఈ కార్నర్ ఏర్పాటయ్యేందుకు కృషి చేసిన అమెరికన్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్‌కు, యూఎస్ ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తన సొంత జిల్లాకు చెందిన మహిళ వీణారెడ్డి అమెరికాలో ఉన్నతమైన పదవిలో ఉండటం సంతోషం కలిగిస్తోందన్నారు. ఇవాళ ప్రారంభమైన ఈ వ్యవస్థ ఎంతో ముందుకు సాగి.. మరెన్నో సేవలందించాలని కోరుకుంటున్నానని చెప్పారు. విశాఖపట్నంలో అమెరికన్ కాన్సులేట్ ఏర్పాటు కావాలన్నదే తమ లక్ష్యమని, దేవుడి దయతో అది కార్యరూపం దాలుస్తుందని ఆశిస్తున్నానని ఆకాంక్షించారు. యూఎస్ కాన్సుల్ జనరల్ జోయల్ రీఫ్‌మన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్–అమెరికా మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడాలన్న సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షను నెరవేర్చడంలో అమెరికన్ కార్నర్ వేదికగా నిలుస్తుందన్నారు. విశాఖపట్నం పర్యటన తనకెన్నో అనుభూతులను మిగిల్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఏపీఎస్సీహెచ్ఈ) చైర్మన్ కె.హేమచంద్రారెడ్డి, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం నుంచి జోయల్ రీఫ్‌మన్, వీణారెడ్డి, ఏపీ ప్రభుత్వ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ కుమార్ అన్నవరపు, ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమెరికన్ కార్నర్ ఉపయోగాలిలా.. ► విశాఖలో ఏర్పాటైన అమెరికన్ కార్నర్ దేశంలో మూడవది. ఇప్పటి వరకు అహ్మదాబాద్, హైదరాబాద్‌లో మాత్రమే పని చేస్తున్నాయి. ► విశ్వవిద్యాలయాలు, కోర్సులు, ఫీజుల వివరాలు, ఆయా ప్రాంతాల భౌగోళిక స్వరూపం, ఆహారం, వసతి సౌకర్యం తదితర అంశాలపై సమగ్ర సమాచారం అందజేస్తుంది. ► ఇక్కడ అన్ని సేవలు ఉచితంగా అందుతాయి. ► విదేశాల్లో విద్య, ఉద్యోగ రంగాలలో యువతకు మార్గదర్శిగా నిలుస్తుంది. ► ముఖ్యంగా మహిళలకు విస్తృత అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పని చేస్తున్న రెండు ప్రభుత్వాల (రాష్ట్ర ప్రభుత్వం, అమెరికా ప్రభుత్వం) ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్య భూమిక పోషించనుంది. ► ఆంగ్లంలో నైపుణ్యం పెంచే దిశగా సీఎం వైఎస్ జగన్ ఎంతగానో కృషి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌తో విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే వారి సంఖ్య పెరుగుతుంది. వీరందరికీ ఎప్పటికప్పుడు తగిన సూచనలిస్తూ సహాయకారిగా నిలుస్తుంది. ► ఒక్కమాటలో చెప్పాలంటే రాష్ట్ర విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ప్రయోజనకారి. -
విశాఖ ఏయూలో 'అమెరికన్ కార్నర్' ప్రారంభం
-
‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
-
‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్సిటీ(ఏయూ)లో ఏర్పాటు చేసిన ‘అమెరికన్ కార్నర్’ కేంద్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఏయూలో అమెరికన్ కార్నర్ ఏర్పాటు కావటం సంతోషకరమని అన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. అహ్మదాబాద్,హైదరాబాద్ తర్వాత విశాఖలో అమెరికన్ కార్నర్ ప్రారంభమైందని తెలిపారు. దేశంలో మూడో కేంద్రంగా.. అమెరిన్ కాన్సులేట్ సహకారంతో విశాఖలో ‘అమెరికన్ కార్నర్’ ఏర్పాటు చేశారు. యూఎస్ విద్య, ఉద్యోగావకాశాల సమాచారానికి సంబంధించి సేవలు అందించనుంది. ఈ కార్యక్రమంలో అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఆప్షన్–3 ఎంచుకున్న వారి ఇళ్ల పనులు అక్టోబర్ 25 నుంచి మొదలవ్వాలి -
నేడు ‘అమెరికన్ కార్నర్’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీ (ఏయూ)లో ఏర్పాటు చేసిన అమెరికన్ కార్నర్ గురువారం నుంచి తన సేవలు ప్రారంభించనుంది. సీఎం వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ఈ కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అమెరికన్ కాన్సులేట్ జనరల్ జోయల్ రీఫ్‌మెన్, యూఎస్ ఎయిడ్ ఇండియా డైరెక్టర్ వీణా రెడ్డి, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి పాల్గొంటారు. ఈ ఏర్పాట్లను అమెరికన్ కాన్సులేట్ అధికారులతో కలిసి బుధవారం వీసీ పర్యవేక్షించారు. -
వర్సిటీలు బహుశాస్త్ర మిశ్రిత కేంద్రాలుగా అవతరించాలి
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఆంధ్రప్రదేశ్‌లోని విశ్వవిద్యాలయాలు బహుశాస్త్ర మిశ్రిత కేంద్రాలు (మల్టీ డిసిప్లీనరీ) అవతరించాల్సిన అవసరం ఉందని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ఆచార్య రాంగోపాలరావు పేర్కొన్నారు. ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా ప్రణాళిక బోర్డు (ఏపీ హెచ్ఈపీబీ) రెండో సమావేశం శనివారం విశాఖలో జరిగింది. ఆంధ్రా యూనివర్సిటీ, ఐఐఎం విశాఖపట్నం, ఐఐపీఈ సంయుక్తంగా ఈ సమావేశానికి ఆతిథ్యమిచ్చాయి. ముఖ్య అతిథిగా వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్న ఆచార్య రాంగోపాలరావు మాట్లాడుతూ.. జ్ఞానాన్ని సంపదగా మలచుకునే ప్రయత్నం జరగాలని చెప్పారు. పేటెంట్లకు దరఖాస్తు చేయడం, అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పెరుగుదల లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. విశ్వవిద్యాలయాల అచార్యులే స్టార్టప్‌లను ఆరంభించే విధంగా నూతన విధానాలను అమలు చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. విద్యను అందించడం, జ్ఞానాన్ని వృద్ధి చేయడం, ఆవిష్కరణలు జరపడం లక్ష్యంగా యూనివర్సిటీలు పనిచేయాలన్నారు. ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దాలి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని ప్రపంచ పౌరునిగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విద్య వ్యాపారం కాకూడదన్న ఉద్దేశంతో పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పేదరికం విద్యకు అవరోధంగా మారకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. త్వరలో విశ్వవిద్యాలయాల ఉప కులపతుల ప్రగతిని సైతం సమీక్షిస్తామన్నారు. విద్యార్థులు సాధించే ప్రగతే విశ్వవిద్యాలయానికి కొలమానంగా మారుతుందనే విషయాన్ని గుర్తించాలన్నారు. రాష్ట్ర పర్యాటక, క్రీడా శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యను సామాన్యులకు చేరువ చేస్తున్న వ్యక్తిగా ముఖ్యమంత్రి నిలిచిపోతారని పేర్కొన్నారు. సీఎం క్రీడలకు అధిక ప్రోత్సాహం కల్పిస్తూ గత రెండేళ్లలో రూ.6.50 కోట్లను వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాల కింద అందించారని తెలిపారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ ఏపీ స్టేట్ రీసెర్చ్ బోర్డు, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు, 13 వేల గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు, డిగ్రీలో ఆంగ్ల మాధ్యమం, స్పోకెన్ ఇంగ్లిష్ ట్యుటోరియల్స్, ఇ–కంటెంట్ అభివృద్ధి, నైపుణ్య శిక్షణ, బ్లెండెడ్ లెర్నింగ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం వంటి నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఏపీ కాలేజ్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి, ఐఐఎం విశాఖ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్, ఐఐపీఈ డైరెక్టర్ ఆచార్య వీఎస్ఆర్కే కె.ప్రసాద్ మాట్లాడారు. ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆచార్య కె.రామమోహన్‌రావు, ఆచార్య టి.లక్ష్మమ్మ, కార్యదర్శి ఆచార్య బి.సుధీర్ ప్రేమ్‌కుమార్, ఏయూ డీన్లు ఆచార్య కె.రమాసుధ, ఆచార్య టి.షారోన్, రాష్ట్రంలో విశ్వవిద్యాలయాల ఉపకులపతులు పాల్గొన్నారు. -
ఒరేయ్ బావా.. గుర్తుందా!
ఒరేయ్ బావా.. గుర్తుందా! ఇసుక బొరియలోంచి బయటకి బుర్రపెట్టి చిన్న అలికిడైతే తుర్రున పారిపోయే ఎండ్రపీతలా నువ్వు క్యాంపస్‌లోకి అడుగుపెట్టిన రోజు గుర్తుందా! సముద్రం సీరియస్‌గా పాఠం చెప్పుకుపోతుంటే ఉద్యోగాలను కలగంటూ ఒడ్డున ఇసుకపై బతుకు పాఠాలను రాసుకుంటున్న పీతల్లా బుద్ధిగా క్లాసులో కూర్చున్న రోజు గుర్తుందా! క్లాసు ఎగ్గొట్టి క్యాంటీన్ దగ్గరున్న బాదం చెట్టుకింద కూర్చొని ‘బాతాఖానీ’ టీ తాగుతుంటే మన తలను అమ్మలా అప్యాయంగా నిమిరే బాదం ఆకు గుర్తుందా! మన పక్క రూమ్మేట్ పాడే బాత్రూం పాటలకు విసుగెత్తి ఎండ ఎర్రగా కాస్తుంటే ఎఫ్.ఎం. పాటల ఒడిలో పడుకున్న మధ్యాహ్నం గుర్తుందా! సీతాకోకచిలుకలను చూడటానికి సాయంత్రం సముద్రానికి పోయి ఉడకపెట్టిన పల్లీలను నాలుగు మాటలుగా నమిలి హాస్టలకు తిరిగొస్తుంటే నా కంట్లో పడిన ఇసుకను ఒడుపుగా నువ్వు నాలుకతో తీసిన సంఘటన గుర్తుందా! ఫస్టు షో సినిమా చూసొచ్చినాక హాస్టల్ మెస్‌లో మిగిలిన ఫుడ్ కోసం ఖాళీ పళ్లేల్లా కొట్టుకునేవాళ్లం గుర్తుందా! రాత్రికి టెర్రస్‌పై చీకటి దుప్పటిని మన వీపుల కింద పరచుకొని చుక్కలను లెక్కపెట్టుకుంటూ మనం మనసుపడ్డ చందమామను ఊహించుకుంటూ నిదరపోయిన రోజు గుర్తుందా! ఏమి రోజులరా అవి...! సముద్రపు అలలను కట్టకట్టి మూటగా భుజాన వేసుకొని కలల చేపలను పట్టే రోజులవి. ఇప్పుడు చూడు క్షణం తీరిక లేక ఉద్యోగాల వలకు చిక్కిన చేపలమై కార్పొరేట్ గద్దల నోటికి చిక్కిన పీతలమై గిలగిల కొట్టుకుంటున్నాం గుప్పిట్లోంచి ఇసుకలా ఆ రోజులు జారిపోయినప్పటికీ బీచ్ నుండి తిరిగొచ్చినాక ప్యాంటు జేబులో మూలకు నక్కిన ఇసుకలాంటి మిగిలిన జ్ఞాపకాలను ఈరోజు నీతో పంచుకుంటున్నాను. (ఏ.యు. క్యాంపస్ రోజులను గుర్తుకు తెచ్చుకొని....) ఒక రోజు ∙ఆర్ యస్ రాజకుమార్ శుభోదయం... మళ్లీ తెల్లకాగితంలా.... మనోభావాల ఆవేదనలు పెకలించి... అక్షరంలా ఘనీభవిస్తోంది... నిర్వేద ఘటనలు.... నవ్వులూ, కన్నీళ్లూ, కొత్త మిళాయింపులూ... ఆకారం లేని వికారంలా... యథాలాపంగా కరిగే రసగుళికలు... మితంగా పరిణితైన ఓ కొత్త పేజీ... పండుటాకులా గలగలా రాలింది. మాయా జలతారు దారాలు.... ఈ లోయ అంచువరకూ..... నిబిడీకృతమయ్యాయి..... సూర్యకాంతికి తెప్పరిల్లితే.... మళ్ళీ గాల్లో తేలుతూ...... మరో తెల్ల కాగితం.... ∙మేలిమి పద్యం ప్రతి పాటకు; ప్రతి మాటకు శ్రుతి యొక్కటి మంద్రమగుచు సోకును చెవులన్ గతి తప్పదు; మధురస సం గతి విప్పుచు నీడవోలె కదలును వెంటన్. (కొంపెల్ల రామకృష్ణమూర్తి ‘కచ్ఛపీనాదము’ ఖండిక నుంచి) ∙∙ ఆ కఠోర మృత్యంగణమా కరాళ దేవతా శూన్యదృక్కులు, ఆ వికార రూపిణీ మహోగ్రభయద రూక్షరేఖ లలవి కాలేదు చూడగ, నిలువలేదు. (సంపత్ ‘మృత్యంగణము’ ఖండిక నుంచి) ∙∙ బ్రతికి శల్యావశిష్టులై వసుధ తిరుగు తోడి వారల కన్నెత్తి చూడకున్న, చచ్చి బూదియౌ వారి ప్రసంగమింక మాసిపోవునటంచు నమ్మంగ రాదొ? (జంపన చంద్రశేఖరరావు ‘తమోగీతి’ నుంచి) ∙మొయిద శ్రీనివాసరావు -
Afghanistan Crisis: వాళ్లుంటే నరకమే!
భవిష్యత్తుపై ఆశలేదు. రేపటి కోసం ఆలోచన చెయ్యడం లేదు. బెంగంతా ఈ రోజు పైనే. మరుక్షణంలో ఏమి జరుగుతుందో! ఇదీ అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి. మనదేశానికి విద్యార్థులుగా వచ్చిన ముగ్గురు మహిళల మనోగతం. ‘‘అఫ్గానిస్తాన్‌లో సామాన్యుల జీవితం కకావికలమైపోయింది. ఉపాధి కరువైన బ్రతుకులు... మహిళలకు ప్రాధాన్యత ఇవ్వని పాలకులు... ప్రాణాలకు విలువివ్వని ఆటవికరాజ్యంలో జీవనం దినదిన గండం కాదు, క్షణక్షణ గండం. సూక్ష్మంగా ఇవే అక్కడ ఉన్న మా వాళ్ల జీవితాలు’’ అంటూ అఫ్గానిస్తాన్ నుంచి విశాఖపట్నం, ఆంధ్రవిశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరం చదువుకున్నాం! ప్రస్తుత పరిస్థితుల్లో అఫ్గానిస్తాన్‌కు వెళ్లే పరిస్థితి లేదని న్యాయ విద్య అభ్యసిస్తున్న అవాస్తా బకాష్ తెలిపారు. జూలై మాసంలో ఆమె కాబూల్‌లో తన కుటుంబంతో గడిపి వచ్చారు. గతంలో తాలిబాన్ల పాలను గుర్తుచేసుకుంటూ... తొమ్మిది సంవత్సరాల వయసులో పాఠశాలలో 4వ తరగతిలో చేరినట్లు తెలిపారు. ‘‘రెండు దశాబ్దాల క్రితం అప్పటి తాలిబాన్ పాలన ముగిసిన తరువాత ప్రాధమిక విద్య నుంచి న్యాయ విద్యలో డిగ్రీ వరకు కాబూల్‌లో పూర్తిచేశాను. మా నాన్న ఆర్మీ అధికారిగా, తల్లి ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మేము మొత్తం ఏడుగురు సంతానం. ఇద్దరమ్మాయిలం. మా సోదరులు కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్, ఎంబిఏ, బీటెక్, జర్నలిజం చేశారు. మా సోదరి వివాహం చేసుకుని నార్వేలో నివస్తోంది’’ అని చెప్పారు అవాస్తా బకాష్. రోజులు వెళ్లదీస్తున్నాం! ‘‘మా కుటుంబం కాబూల్‌లో నివసిస్తోంది. తాలిబాన్ల రాకతో అందరూ ఉపాధిని కోల్పోయారు. దాచుకున్న డబ్బులతో కాలం వెళ్లదీస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఆఫ్గనిస్తాన్ వెళ్తే వాళ్లకు భారం కావడం తప్ప ప్రయోజనం లేదు. గతంలో నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత అఫ్గానిస్తాన్ కార్మిక మంత్రిత్వ శాఖలో లెజిస్లేటర్‌గా, రెండేళ్లు జెండర్ ఆఫీసర్‌గా, ప్రధాని కార్యాలయంలో అవినీతి నిరోధక అధికారిగా రెండేళ్లు పనిచేశాను. న్యాయవిద్యపై ఆసక్తితో ఆంధ్రవిశ్వవిద్యాలయంలో ఎల్ఎల్ఎం కోర్సులో చేరాను. ప్రసుతం ఎల్ఎల్ఎమ్ ఫైనల్లో ఉన్నాను. ఇప్పట్లో వెళ్లలేం! ప్రస్తుత తరుణంలో భారత్‌ను విడిచి అఫ్గానిస్తాన్‌కు వెళ్లలేను. అనుమతిస్తే భారత్‌లో శరణార్థిగా ఉండిపోతాను. తాలిబాన్లు ఇటీవల చంపేసిన వాళ్లలో అప్పట్లో నాతో పనిచేసిన ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు. మేము ఎవ్వరికీ హాని చేయమని చెబుతున్నప్పటికీ తాలిబన్ల ధోరణిలో మార్పు రావడం లేదు, పాత పంథాలోనే వెళుతున్నారు. ఇప్పటికే తాలిబాన్లు ప్రధాని కార్యాలయంలో పనిచేసిన వారిని వదిలి పెట్టమని, వారు అమెరికాకు బానిసలుగా పనిచేసిన వారని బహిరంగంగా ప్రకటించారు. మా దేశానికి వెళితే నా ప్రాణాలకు ముప్పు తప్పుదు. అవకాశం వచ్చినట్టే వచ్చి... అఫ్గానిస్తాన్‌లో 1990 నుంచి మోడరనైజేషన్ ప్రారంభం అయ్యింది. గత ప్రభుత్వం మహిళలకు ప్రత్యేకమైన ఉద్యోగాలు కల్పించింది. మహిళలు విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాలలో అడుగు పెట్టగలిగారు. రాజకీయరంగంలో సైతం రాణించారు. కొన్ని పరిమితులకు లోబడి పురుషులతో సమాన స్థాయిలో అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు వచ్చాయి. నేడు పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇప్పుడు అఫ్గాన్‌లో పురుషుడి సహాయం లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. మూసివేత దిశగా బ్యాంకులు తాలిబాన్లు తమ హవాను కొనసాగించడం అంత సులభం కాదు. విదేశీ బ్యాంకులు ఇప్పటికే తమ శాఖలను మూసివేయాయి. నేషనల్ బ్యాంక్ ఆఫ్ అఫ్గానిస్తాన్ సైతం మూతబడింది. ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా లేవు. సమాజం సైతం తాలిబాన్ పాలనను స్వాగతించడం లేదు. అంతర్గతంగా వీరిపై పోరు ప్రారంభమవుతోంది. ప్రపంచ దేశాల నుంచి కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతున్న నేప«థ్యంలో తాలిబాన్లు తాత్కాలికంగా కొంత సంయమనం పాటిస్తున్నారంతే. కోవిడ్ కంటే ప్రమాదకరం వైద్య రంగంలో పనిచేస్తున్న మహిళలు విధులకు హాజరు కావచ్చని తాలిబాన్లు చెప్పారు. అయినప్పటికీ వారు విధులకు వెళ్లడానికి భయపడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ కంటే తాలిబాన్లే ప్రమాదకరమని నమ్ముతున్నాను. గత 15 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి నేడు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వ కార్యాలయాలు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని అనిశ్చితి నెలకొంది. డాన్సింగ్, సింగింగ్, పెయింటింగ్ వంటి కళారంగాలను పూర్తిగా నిషేధించారు. దీంతో ఆయా కళాకారులు తమ వృత్తిని మార్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం అఫ్గాన్‌లో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. భవిష్యత్తులో వస్తాయని చెబుతున్నారు, కానీ ఆ మాటను నమ్మే పరిస్థితి మాత్రం లేదు’’ అని వివరించారు అవాస్తా బకాష్. ఒక్క రోజులో జీవితాలు మారిపోయాయి అఫ్గానిస్తాన్‌లో మా జీవితాలు కేవలం ఒక్క రోజులోనే తలకిందులయ్యాయి. తాలిబన్లు మొదటగా మహిళలపైనే ఉక్కుపాదం మోపారు. తాలిబాన్లను ఆణచివేస్తామన్న ప్రభుత్వం ఒక్కరోజులోనే వారికి సరెండర్ అవడం అంతా కలగా జరిగిపోయింది. అక్కడ మహిళలు మాత్రమే కాదు, పురుషుల జీవితాలు సైతం ప్రశ్నార్థకంగా మారాయి. గడ్డం పెంచడం, సంప్రదాయ వస్త్రధారణ, టోపీ పెట్టుకోవడం వంటి ఆచారాలను తప్పనిసరిగా ఆచరించాల్సి ఉంటుంది. – ముబారకా, బీసీఏ స్టూడెంట్ ఇస్లాం పదాన్ని దుర్వినియోగం చేస్తున్నారు... తాలిబాన్ల సంఖ్య పెరగడానికి కారణం నిరక్షరాస్యత, పేదరికమే. 14 సంవత్సరాల పిల్లలను మదర్సాలకు పంపిస్తారు. అక్కడ వారి మనసులను ముల్లాలు మార్చివేస్తారు. ముల్లాలు చెప్పిందే వేదంగా భావించిన పిల్లలు తాలిబాన్ వైపు అడుగులు వేస్తున్నారు. తాలిబన్ల విస్తరణ ఇస్లాం అనే పవిత్రమైన పదాన్ని దుర్వినియోగం చేస్తూనే జరిగింది. నిరక్షరాస్యులైన తాలిబాన్లు పరిపాలన చేయడం, విధులను ఎలా నిర్వహిస్తారు? – పేరు చెప్పడానికి ఇష్టపడలేదు – వేదుల వి.ఎస్.వి నరసింహం సాక్షి, విశాఖపట్నం -
‘సింహాద్రి అప్పన్న’కు యునెస్కో గుర్తింపునకు యత్నాలు
సింహాచలం(పెందుర్తి): సింహగిరి వరాహ లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానంలోని శిల్పాలు, శాసనాలకు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని సింహాచలం దేవస్థానం ఈవో ఎం.వి.సూర్యకళ తెలిపారు. వీటిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఆంధ్రా యూనివర్సిటీ వీసీ పి.వి.జి.డి.ప్రసాదరెడ్డిని బుధవారం కలిసి కోరారు. రామప్ప ఆలయానికి మించిన చారిత్రక శిల్పకళా సౌందర్యం సింహాచలం ఆలయానికి ఉందని ఈవో వెల్లడించారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, పురాతన పుస్తకాలు, ఫొటోలను వీసీకి చూపించారు. 11వ శతాబ్దం నుంచి తరతరాల సంస్కృతికి అద్దంపట్టేలా సింహాచలం దేవస్థానంలో శిల్పాలు ఉన్నాయని, శ్రీకృష్ణదేవరాయలు నుంచి గజపతుల వరకు ఉన్న రాజశాసనాలు చరిత్రకు అద్దం పడుతున్నాయని వివరించారు. ఇటీవలే అన్ని శిల్పాలను ప్రత్యేక తైలంతో శుభ్రపరిచినట్టు చెప్పారు. వీటి గురించి భక్తులకు అర్థమయ్యేలా బోర్డులను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఏయూ సహకారం అందిస్తే సింహాచలం ఆలయ విశిష్టతను యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రయ త్నిస్తాయన్నారు. సహకారం అందిస్తాం.. ఆలయ శిల్పకళ, శాసనాలను అధ్యయనం చేసి అన్ని విషయాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహకారం అందిస్తామని వీసీ ప్రసాదరెడ్డి హామీ ఇచ్చారు. నిపుణులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి త్వరలోనే సింహాచలం దేవస్థానంపై పూర్తిస్థాయి పరిశీలన చేయిస్తామన్నారు. యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందేందుకు అన్ని అర్హతలు సింహాచలం దేవస్థానానికి ఉన్నాయని ఈ సందర్భంగా వీసీ అభిప్రాయపడ్డారని ఈవో తెలిపారు. -
ఆంధ్రా యూనివర్సిటీలో ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు
విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఎస్సీ/ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 33 ► పోస్టుల వివరాలు: టైపిస్ట్–01, రికార్డ్ అసిస్టెంట్–02, జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్–01, డ్రాఫ్ట్స్‌మన్–01, అటెండర్–02, గార్డెనర్–02, మెస్ బాయ్/మెయిడ్–06, సెక్యూరిటీ గార్డ్–07, పంప్ అటెండర్–04, కార్పెంటర్–01, ప్లంబర్–03, బాయిలర్–01, ఎలక్ట్రీషియన్–01, వైండర్–01. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి ఏడు, పదో తరగతి, ఐటీఐ(డ్రాఫ్ట్స్‌మెన్), బీఎస్సీ, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. టైపింగ్, ఇతర కంప్యూటర్ నైపుణ్యాలు తెలిసి ఉండాలి. ► వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 47ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: విద్యార్హతలో సాధించిన మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును రిజిస్ట్రార్, ఏయూ, విశాఖపట్నం, ఏపీ చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 31.08.2021 ► వెబ్సైట్: andhrauniversity.edu.in -
ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
సాక్షి, విశాఖపట్నం: ఏయూ పరిధిలో ఆగస్టు 18 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 2 నుంచి రెండో సెమిస్టర్, 4వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. పరీక్షలు ముగిసిన 10 రోజుల్లో ఫలితాలు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి డిగ్రీ తరగతులు నిర్వహించనున్నట్లు వీసీ ప్రసాదరెడ్డి తెలిపారు. గౌరవ ఆచార్యుల నియామకం ఏయూలో పదవీ విరమణ చేసిన నలుగురు ప్రొఫెసర్లను గౌరవ ఆచార్యులుగా నియమిస్తూ ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కామర్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొ.సత్యనారాయణ, ప్రొ.మధుసూదనరావు, ప్రొ.సుదర్శనరావు.. మేథమేటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ప్రొ.కేకేఎం శర్మ హానరీ ప్రొఫెసర్లుగా నియమించారు. -
ఫ్లై ఓవర్ ప్రమాదంపై విచారణ
అనకాపల్లి/అనకాపల్లి టౌన్: అనకాపల్లి పట్టణ సమీపంలో జాతీయ రహదారిపైన నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ బీమ్‌లు కూలిపోయిన ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించడం, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నేతలతోపాటు పలు వర్గాల నుంచి డిమాండ్లు రావడంతో పోలీసులు బుధవారం సుమోటోగా కేసు నమోదుచేశారు. సైట్ ఇన్చార్జి ఈశ్వరరావు, జీఎం నాగేంద్రకుమార్, దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఆంధ్రవిశ్వవిద్యాలయం సివిల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్లు ఆర్వీఎస్. మూర్తి, శ్రీనివాసరావులతో కూడిన బృందం బుధవారం ఘటనా స్థలాన్ని పరిశీలించింది. ప్రమాదానికి గల కారణాలపై ఈ బృందం నివేదిక ఇవ్వనుంది. కాగా ఫ్లై ఓవర్ నిర్మాణ సంస్థ దిలీప్ బిల్డ్ కన్స్ట్రక్షన్ కంపెనీపై మృతుడు సతీష్ కుమార్ బావమరిది శశి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. సంఘటన స్థలాన్ని బుధవారం నేషనల్ హైవే అథారిటీ పీడీ శివకుమార్ సందర్శించారు. -
కంటైన్మెంట్ జోన్‌గా ఆంధ్రా యూనివర్సిటీ
-
కంటైన్మెంట్ జోన్‌గా ఆంధ్రా యూనివర్సిటీ
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు కేసులు పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్ర, శనివారాల్లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో 109 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరోనా సెకండ్ వేవ్‌లో తొలి కంటైన్మెంట్ జోన్‌గా ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంతాన్ని ప్రకటించారు. ఇప్పటికే ఏయూ ఇంజినీరింగ్ హాస్టల్ విద్యార్థులందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వచ్చిన 109 మంది విద్యార్థులను ఏయూ హాస్టళ్లలోనే ఐసోలేట్ చేయాలని కలెక్టర్ వినయ్‌చంద్ ఆదేశించారు. అక్కడే మూడు ఐసోలేషన్ వార్డులు, ఐదు క్వారంటైన్ వార్డులను ఏర్పాటుచేశారు. -
ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కరోనా కలకలం
విశాఖ: మహమ్మారి కరోనా వైరస్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కలకలం రేపుతోంది. మొత్తం 65 మంది విద్యార్థులకు పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో మిగతా విద్యార్థులతో పాటు అధ్యాపకులు, సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో కంటైన్మెంట్ జోన్లోకి ఇంజినీరింగ్ క్యాంపస్‌లోని 7 బ్లాక్‌లను చేర్చారు. క్వారంటైన్లో ఏయూ ఇంజినీరింగ్ కళాశాల వసతిగృహాలు చేశారు. విజయవాడ నుంచి వచ్చిన ఇంజినీరింగ్ విద్యార్థికి తొలి కరోనా కేసు నమోదైంది. దీంతో ఏయూలో 800 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 59 మందికి పాజిటివ్ తేలింది. ఈ సమాచారంతో గ్రేటర్ విశాఖ చీఫ్ మెడికల్ ఆఫీసర్ వసతిగృహాలను సందర్శించారు. కరోనా కేసులు రావడంతో ఏయూలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా వేశారు. పరీక్షల తేదీల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హాస్టల్స్ వద్ద ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటుచేస్తామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని విశాఖ ఆర్డీఓ కిశోర్ చెప్పారు. కరోనా వచ్చిన వారిలో తక్కువగానే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయని, హాస్టల్స్‌లో ప్రత్యేక గదుల్లో ఉంచి మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆర్డీఓ వివరించారు. వెయ్యి మంది విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. మరికొంతమంది రిజల్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. మంత్రి ఆళ్ల నాని ఆరా విశాఖ ఏయూలో కరోనా కేసులపై వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. ఏయూలో 65 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయినట్లు గుర్తించారు. దీంతో విశాఖ డీఎంహెచ్ఓ సూర్యనారాయణతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. రోజు 7,500 మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 6 కోవిడ్ ఆస్పత్రులు ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్ఓ మంత్రికి వివరించారు. కోవిడ్ ఆస్పత్రులో వెయ్యి బెడ్లు సిద్ధం చేశామని, కరోనా సోకిన 15 మంది కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిజిల్లాల వైద్యాధికారులను అప్రమత్తం చేశామని, కరోనా నివారణ చర్యలపై టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి ఆళ్ల నాని సమీక్షిస్తున్నారు. -
మహమ్మారి కరోనా వైరస్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో కలకలం రేపుతోంది
-
విశాఖ: ఆంధ్రా యూనివర్సిటీలో కరోనా కలకలం
-
విశాఖలో ‘అమెరికా కార్నర్’
సాక్షి, అమరావతి: ప్రతిష్టాత్మకమైన అమెరికా కార్నర్ (అమెరికా స్పేస్) దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ప్రారంభమైంది. దేశంలో అహ్మదాబాద్ తరువాత అమెరికా ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెండో కార్నర్ ఇది. ఈ సందర్భంగా మంగళవారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో ఈ కార్నర్‌కు సంబంధించి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సరేష్ సమక్షంలో అమెరికా కాన్సులేట్ అధికారులు, ఆంధ్రా వర్సిటీ అధికారుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఈ కార్నర్ ఆరంభమైనట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర ఉన్నత విద్యా రంగానికి సంబంధించి ఇది చాలా కీలక పరిణామమన్నారు. రాష్ట్రంలో పేద విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఉన్నత విద్య అందించాలని.. విదేశీ విద్యను పేద విద్యార్థులకు అందుబాటులోకి తేవాలనే సదాశయంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషిచేస్తున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయంబర్స్మెంట్ కల్పించడంతో పాటు, విద్యా సంస్థల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడానికి వీలుగా అమ్మఒడి పథకం అమలుచేస్తోందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేసి పేద విద్యార్థులకు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. ఉన్నత విద్యకు సంబంధించి మన రాష్ట్ర విద్యార్థులు, యువతకు అమెరికా కార్నర్ చాలా ఉపయుక్తమవుతుందన్నారు. విద్యార్థులు, యువతలో నైపుణ్యాలు పెంపొందించి వారు మంచి అవకాశాలు పొందడానికి వీలుగా ఈ కేంద్రం పనిచేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ఏపీతో బంధం బలోపేతం ఆంధ్రా వర్సిటీలో అమెరికా స్పేస్ ఏర్పాటుచేయడం ద్వారా అమెరికా, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య బంధం మరింత బలోపేతం కానుందని అమెరికా కాన్సుల్ జనరల్ జోయెల్ రీఫ్‌మన్ అన్నారు. విద్యారంగంలో మార్పులు తీసుకురావడంలో, మహిళా సాధికారతకు, యువతకు ఉత్తమ విద్య అందించి, ఉపాధి అవకాశాలు లభించేలా ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న కృషి.. అందిస్తున్న సహకారం ఎంతో శ్లాఘనీయమన్నారు. ఈ కేంద్రం తప్పకుండా ఆయన ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ఫలితాలు సాధిస్తుందన్నారు. అమెరికా–భారత్‌ల మధ్య విద్యా, సాంస్కృతిక, ఆర్థిక సహకారం, బంధాల బలోపేతానికి ఈ కేంద్రం దోహదపడుతుందన్నారు. ఏయూకి కలికితురాయి విశాఖపట్నానికి.. ప్రత్యేకించి ఆంధ్రా విశ్వవిద్యాలయానికి ఈ రోజు ఒక సుదినమని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి అన్నారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఈ కార్నర్‌ను దేశంలోనే అత్యుత్తమ కార్నర్‌గా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మాట్లాడుతూ.. ఈ కార్నర్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన అమెరికా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికృష్ణ, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ కె. హేమచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ విదేశీ విద్య కోఆర్డినేటర్ డాక్టర్ కుమార్ అన్నవరపు, అమెరికా పబ్లిక్ అఫైర్స్ ఆఫీసర్ డేవిడ్ మోయెర్, ఢిల్లీ నుంచీ రీజినల్ పబ్లిక్ ఎంగేజ్మెంట్ స్పెషలిస్ట్ మార్క్ బుర్రెల్ తదితరులు పాల్గొన్నారు. -
పక్షుల లెక్క 'తేలుద్దాం'
సాక్షి, అమరావతి: పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ‘గ్రేట్ బ్యాక్‌యార్డ్ బర్డ్ కౌంట్’ పేరిట ఏటా అంతర్జాతీయంగా నిర్వహించే పక్షుల గణనకు రాష్ట్రంలోనూ ఆదరణ పెరిగింది. ఫిబ్రవరి 11 నుంచి నాలుగురోజులపాటు నిర్వహిస్తున్న ఈ గణనలో రాష్ట్రానికి చెందిన పలు యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాలలు భాగస్వాములయ్యాయి. తిరుపతి ఐఐటీ, ఎస్వీ యూనివర్సిటీ, ఏలూరులోని సర్ సీఆర్ఆర్ మహిళా కళాశాల, శ్రీకాకుళం జిల్లాలోని రెండు ప్రభుత్వ పాఠశాలలు, ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖలోని ఇందిరాగాంధీ జూపార్క్ కూడా ఇందులో పాలుపంచుకుంటున్నాయి. అలాగే చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లోని పలువురు వలంటీర్లు క్యాంపస్ పక్షుల గణనలో పెద్దఎత్తున పాల్గొంటున్నారు. విజయవాడ నేచర్ క్లబ్, విశాఖ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో సంస్థలు డబ్ల్యూసీటీఆర్‌ఈ, ఈసీసీటీలకు చెందిన వలంటీర్లూ ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రంలో పక్షుల గణన కార్యక్రమంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్)–తిరుపతి కీలక భాగస్వామిగా పనిచేస్తోంది. గతేడాది ఫిబ్రవరిలో నిర్వహించిన పక్షుల గణనలో ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ, ఎస్వీ జూపార్క్, రీజనల్ సైన్స్ సెంటర్, కేంద్రీయ విద్యాలయం పాల్గొని 215 పక్షి జాతులను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా.. ఏటా ఫిబ్రవరిలో జరిగే ఈ పక్షుల గణనలో వివిధ దేశాలకు చెందిన వేలాదిమంది పక్షుల అభిమానులు(బర్డ్ వాచర్స్) పాల్గొంటారు. ఇందులో భాగంగానే క్యాంపస్ బర్డ్ కౌంట్ పేరుతో విద్యా సంస్థలు, ఇతర సంస్థలు వాటి క్యాంపస్‌లలో పక్షుల గణన చేపడతాయి. పరిశీలకులు(బర్డ్ వాచర్స్) పక్షుల కదలికలను గమనించి వాటి ఫొటోలు తీసి https://birdcount.in/event/ cbc2021/ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అంతర్జాతీయంగా క్రమం తప్పకుండా జరిగే ఈ పక్షుల బర్డ్ కౌంట్‌లో 2013 నుంచి మన దేశంలోని సంస్థలు పాల్గొంటున్నాయి. క్యాంపస్ పక్షుల గణనలో గతేడాది ఐఐఎస్ఈఆర్ తిరుపతి దేశంలోనే మూడో క్యాంపస్‌గా నిలిచింది. పక్షుల వైవిధ్యం తెలుసుకునేందుకు దోహదం దేశంలో పక్షుల వైవిధ్యం గురించి తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. పక్షులపై అవగాహన ఉన్న ఎవరైనా 15 నిమిషాలపాటు వాటి కదలికలను గమనించి వెబ్సైట్లో అప్లోడ్ చేయొచ్చు. ఈ సంవత్సరం రాష్ట్రం నుంచి వేలాదిమంది బర్డ్ వాచర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. – ఐఐఎస్ఈఆర్ సిటిజన్ సైన్స్ కో–ఆర్డీనేటర్ రాజశేఖర్ -
'ఆ గేదె బాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది'
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. '28 ఏళ్ల క్రితం ఈనిన ఒక గేదె, చంద్రబాబుకు వందల కోట్ల రూపాయల పాలిచ్చింది. 2014లో ఆ గేదెకు గడ్డి పెట్టేందుకు కొన్న బినామీ భూముల్లో వేల కోట్లుగా నోట్ల కట్టలు పండకపోతే మరి చంద్రబాబుకు కోపం రాదా? అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. (బాబేమో పొర్లిపొర్లి ఏడుస్తున్నాడు..!) మరో ట్వీట్లో.. 'అక్రమ కట్టడాలను చట్ట ప్రకారం కూలిస్తే పచ్చ బ్యాచ్ మొత్తం నెత్తీ నోరు కొట్టుకుంటోంది. ఆంధ్రా యూనివర్సిటీని దయ్యాల కొంపని సదరు ఆక్రమదారుడు వెటకారం చేసినప్పుడు పేదలు చదువుకునే ఏయూని భ్రష్టు పట్టించినప్పుడు ఒక్కరూ మాట్లాడలేదు. పేదల ప్రయోజనాలకన్నా పచ్చనాయకుని ప్రయోజనాలే ఎక్కువైపోయాయా?' అంటూ విమర్శలు గుప్పించారు. (ఆ లాజిక్‌ను చంద్రబాబు ఎప్పుడో గాలికొదిలారు!) -
‘అతన్ని యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలి’
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆరేటి ఉమ మహేశ్వరరావుకు ఎటువంటి సంబంధం లేదని ఏయూ దళిత ప్రొఫెసర్లు షరోన్‌రాజ్, ఏన్ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ యాక్టివ్ రోల్స్‌లో కూడా లేని మహేష్ ఏయూ ప్రతిష్టను మసక బార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి పారదర్శక పాలన అందిస్తూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాచారహక్కు చట్టం పేరుతో అనేక మంది ప్రొఫెసర్ల, నాన్ టీచింగ్ సిబ్బంది బ్లాక్ మెయిలింగ్‌కు గురవుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆరేటి ఉమా మహేశ్వరరావుపై గవర్నర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరేటి మహేష్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహేష్‌పై పోలీసులు అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. -
‘అతను చనిపోయాడన్న వార్తలు అవాస్తవం’
సాక్షి, విశాఖపట్నం : జిల్లా వ్యాప్తంగా కరోనా వైరస్‌కు సంబంధించి అప్రమత్తంగా ఉన్నామని కలెక్టర్ వినయ్ చంద్ తెలిపారు. విశాఖ నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులన్నింటిలో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాఖలో కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తి క్షేమంగానే ఉన్నాడని చెప్పారు. ఐసోలేషన్ వార్డులో బాధితుడికి చికిత్స కొనసాగుతుందని వెల్లడించారు. అతను చనిపోయాడనే వార్తలు అవాస్తమని.. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. విశాఖ నగరంలో క్వారంటైన్ కోసం నాలుగు వేల బెడ్స్ని సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులో 500 పైగా బెడ్స్ని ఐసోలేషన్ కోసం వినియోగించుకోనున్నట్టు చెప్పారు. విశాఖలో ఒక పాజిటివ్ కేసు నమోదైందని.. ఈ నేపద్యంలో 115 బృందాలతో మరొకసారి కొన్ని ప్రాంతాలలో ఇంటింటి సర్వే చేపడుతున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి నెలాఖరువరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, మాల్స్ మూసివేశామన్నారు. కరోనాపై ఎవరూ భయాందోళనలు చెందవద్దని.. కరోనాపై ప్రజలకి అవగాహన కల్పించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉండాలి : ఏయూ రిజిస్టార్ కరోనా దృష్ట్యా ఆంధ్ర్ర యూనివర్సిటీ, దాని అనుబంధ కళాశాలలు, హాస్టళ్లు మూతపడ్డాయి. హాస్టళ్లను ఖాళీ చేయించిన అధికారులు 9 వేల మందికి పైగా విద్యార్థులను, పరిశోధకులను స్వస్థలాలకు తరలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు యూజీసీ ఆదేశాల ప్రకారం మార్చి 31వరకు విద్యార్థులతోపాటు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు సెలవు ప్రకటిస్తున్నట్టు రిజిస్టార్ కృష్ణమోహన్ తెలిపారు. మార్చిలో యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్టు స్పష్టం చేశారు. మార్చి 31 తర్వాత సమీక్ష అనంతరం తదుపరి కార్యచరణ ప్రకటిస్తామన్నారు. స్వస్థలాలకు వెళ్లిన విద్యార్థులు బయట తిరగకుండా ఇంటి వద్దే ఉండాలని సూచించారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దు : మంత్రి అవంతి కరోనా వైరస్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని మంత్రి అవంతి శ్రీనివాస్ ప్రజలను కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా నగరంలోని వివిధ రంగాల ప్రతినిధులతో శుక్రవారం మంత్రి అవంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్‌కు అతిగా భయపడవద్దని, అలా అని నిర్లక్ష్యం కూడా వహించవద్దని తెలిపారు. కరోనా వైరస్ గాలి ద్వారా సోకదని.. ఒకరినొకరు ముట్టుకోవడం వలన వ్యాపిస్తుందని చెప్పారు. మార్చి 31వ తేదీ వరకు అత్యవసర పని ఉంటే తప్ప నగరవాసులు బయటకు రావద్దని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రజలంతా స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ పాటించాలని పిలుపునిచ్చారు. పెళ్లిలు, ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకుంటే మంచిదని సూచించారు. ప్రజలు సభలు, సమావేశాలకు దూరంగా ఉండాలని కోరారు. విద్యాసంస్థలు తప్పకుండా సెలవులు ప్రకటించాలన్నారు. చదవండి : ప్రముఖ బాలీవుడ్ సింగర్‌కు కరోనా పాజిటివ్ తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా -
ఆంధ్ర యూనివర్సిటీ జట్టుకు స్వర్ణం
కటక్: ఖేలో ఇండియా అఖిల భారత విశ్వవిద్యాలయాల క్రీడల్లో భాగంగా పురుషుల బ్యాడ్మింటన్ టీమ్ విభాగంలో ఆంధ్ర యూనివర్సిటీ జట్టు చాంపియన్‌గా నిలిచింది. బుధవారం జరిగిన ఫైనల్లో పొదిలె శ్రీకృష్ణ సాయికుమార్, గారగ కృష్ణప్రసాద్, ప్రణయ్ రెడ్డి, కలగ జగదీశ్, ఆకాశ్ చంద్రన్, ఆదిత్య గోపరాజు బాపినీడు, గూడె సుదీశ్ వెంకట్‌లతో కూడిన ఆంధ్ర యూనివర్సిటీ జట్టు 3–1తో పంజాబ్ యూనివర్సిటీ (చండీగఢ్) జట్టుపై గెలిచింది. తొలి మ్యాచ్‌లో ప్రణయ్ రెడ్డి (ఆంధ్ర) 6–21, 7–21తో కార్తీక్ జిందాల్ చేతిలో ఓడిపోయాడు. అయితే రెండో మ్యాచ్‌లో జగదీశ్ 21–16, 21–19తో అభిషేక్ సైనిపై నెగ్గడంతో స్కోరు 1–1తో సమమైంది. మూడో మ్యాచ్‌లో శ్రీకృష్ణ సాయికుమార్–కృష్ణప్రసాద్ జంట 12–21, 21–18, 21–15తో కార్తీక్ జిందాల్–హార్దిక్ జోడీపై గెలవడంతో ఆంధ్ర యూనివర్సిటీ ఆధిక్యం 2–1కి చేరింది. నాలుగో మ్యాచ్‌లో ఆదిత్య 21–14, 21–17తో హార్దిక్ మక్కర్‌ను ఓడించడంతో ఆంధ్ర యూనివర్సిటీ 3–1తో విజయాన్ని ఖాయం చేసుకొని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. -
వసతి దీవేన పథకంపై ఏయూ విధ్యార్ధులు హర్షం
-
‘వారంతా చరిత్ర హీనులుగా మిగిలిపోతారు’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలన రాజధానిగా విశాఖను ప్రతిఒక్కరు స్వాగతించాలని సీనియర్ జర్నలిస్టురమణమూర్తి ప్రజలను కోరారు. రాష్ట్ర అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా.. పరిపాలన రాజధాని ఏర్పాటును బలపరచడంతో పాటు త్వరితగతిన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను ఏర్పాటు చేయాలని విశాఖ ఆంధ్రయూనివర్శిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆయనతో పాటు ప్రొఫెసర్లు డాక్టరు ప్రేమానందం, డాక్టర్ సరున్ రాజు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బి. కాంతరావు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు రమణమూర్తి మాట్లాడుతూ.. పరిపాలన రాజధాని ఏర్పాటుతో విశాఖకు, ఉత్తరాంధ్రకు మరింత మేలు జరుగుతుందని తెలిపారు. కాగా అమరావతి రైతులు చేసిన త్యాగమేమిటో ప్రజలకి చెప్పాలన్నారు. భూములతో వ్యాపారం చేసి త్యాగాలు చేశామనడం సరికాదన్నారు. అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం చెప్పిన తర్వాత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కి వేలాది మంది భూములిచ్చి త్యాగాలు చేశారని, ఉత్తరాంధ్రకు మేలు జరుగే పరిపాలన రాజధాని నిర్ణయానికి ప్రతి ఒక్కరూ మద్దతు పలకాలన్నారు. విశాఖ రాజధానిగా మారితే ఉద్యోగ, ఉపాధి కల్పన పెరిగి నిరుద్యోగ సమస్య తగ్గుతుందని ఆయన వివరించారు. ఇక ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని మేధావులుగా మనమంతా మద్దతు పలకాలన్నారు. అధికార వికేంధ్రీకరణ ద్వారనే రాష్ట్రమంతా సమాన అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఒక వర్గానికి మేలు చేయడం కోసమే అమరావతి పేరుతో ఉద్యమాలు చేస్తున్నారని ఆయన అన్నారు. డాక్టర్ సరున్ రాజు మాట్లాడుతూ: విశాఖలో పరిపాలన రాజధానిని స్వాగతించాలన్నారు. విశాఖ పరిపాలన రాజధానిని అడ్డుకునేవాళ్లంతా చరిత్రహీనులగా మిగిలిపోతారన్నారు. వెనుకుబాటుకు గురైన ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఒక వరం లాంటిదని, విశాఖను పరిపాలన రాజధానిగా ఏర్పాటు చేయాలన్న సీఎం జగన్ నిర్ణయాన్ని బలపరుస్తున్నామని ఆయన తెలిపారు. -
ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సీఎం జగన్
-
‘చదువుల దేవాలయం ఆంధ్రా యూనివర్సిటీ’
సాక్షి, విశాఖపట్నం : చదువులే మనల్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఆంధ్ర యూనివర్సిటీ చదువుల దేవాలయం అని కొనియాడారు. ప్రపంచానికే మేధావులను అందించిన గొప్ప చరిత్ర ఏయూది అని ప్రశంసించారు. అలాంటి యూనివర్సీటీలో 549 టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే ప్రభుత్వంగా తల దించుకోవాల్సిన పరిస్థితి అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే విద్యావ్యవస్థలో పలు మార్పులు చేపట్టామని సీఎం జగన్ అన్నారు. ప్రతి పాఠశాలలోనూ 9 రకాల కనీస వసతులు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమం మూడు దశల్లో నిర్వహిస్తున్నామన్నారు. మెదటి దశలో 15వేల స్కూళ్లలో మరుగుదొడ్లు, త్రాగు నీరు, బ్లాక్ బోర్డు లాంటి మౌలిక వసతులు కల్పించబోతున్నామని తెలిపారు. వచ్చే ఏడాది ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. ఆ తర్వాత ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెంచుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తూ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తామన్నారు. ఇంగ్లీష్ ల్యాబ్‌లు, బ్రిడ్జ్‌కోర్సులు ఏర్పాటు చేసి టీచర్లకు ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఉన్నత విద్యలో కూడా సమూల మార్పులు తీసుకొస్తామని సీఎం జగన్ అన్నారు. ఉద్యోగాలు వచ్చేలా డిగ్రీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో మార్పులు చేస్తామన్నారు. డిగ్రీ స్థానంలో డిగ్రీ ఆనర్స్‌గా మార్చి, ఒక ఏడాది ప్రాక్టికల్ శిక్షణ అందిస్తామన్నారు. బీకామ్ లాంటి కోర్సులకు మూడేళ్లు చదువులు, ఒక ఏడాది ప్రాక్టికల్ శిక్షణ ఉండేలా మార్పులు చేస్తామని తెలిపారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులకు 100శాతం ఫీజు రియింబర్స్‌మెంట్ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు విద్యాదీవెన పథకం కింద రూ.20వేలు అందిస్తున్నామని గుర్తుచేశారు. విద్యా వ్యవస్థలో మార్పులు రావాలంటే పూర్వ విద్యార్థుల సంఘాల పాత్ర కీలకం అన్నారు. విద్యార్థులకు సహాయపడేలా యూనివర్సీటీలకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఏయూ పూర్వ విద్యార్థుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం నుంచి రూ.50కోట్లను యూనివర్సీటీకి అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అనంతరం రీడింగ్ రూమ్, జీఎం ఆర్ బ్లాక్ హాస్టల్ భవనాలకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సంస్థ సీఈవో సీపీ గుర్నానీ, గ్రంథి మల్లిఖార్జునరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, శిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీఎంఆర్ అధినేత, అలుమ్ని వ్యవస్థాపక చైర్మన్ జీఎం రావు, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, మాజీ డీజీపీ, గంగవరం పోర్ట్ సీఈవో సాంబశివరావు, మాజీ వీసీ ప్రొఫెసర్ బీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘చదువుల దేవాలయం ఆంధ్ర యూనివర్సిటీ’
-
ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో సీఎం జగన్
-
ఏయూ పూర్వవిద్యార్థుల సమ్మేళనం
సాక్షి, అమరావతి : విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం సాయంత్రం ఆంధ్రా యూనివర్సీటీ పూర్వవిద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి సీఎం జగన్ నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో టెక్ మహేంద్ర సంస్థ సీఈవో సీపీ గుర్నానీ, గ్రంథి మల్లిఖార్జునరావు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటక మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్, శిశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీఎంఆర్ అధినేత, అలుమ్ని వ్యవస్థాపక చైర్మన్ జీఎం రావు, ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాదరెడ్డి, మాజీ డీజీపీ, గంగవరం పోర్ట్ సీఈవో సాంబశివరావు, మాజీ వీసీ ప్రొఫెసర్ బీల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ముఖ్య అతిధిగా సీఎం జగన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహించనున్నట్లు యూనివర్శిటీ వైఎస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి, పూర్వ విద్యార్థుల అసోషియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బీలా సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్ 13న నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టెక్ మహీంద్రా సీఈఓ సి.పి గర్నాని ముఖ్య అతిథులుగా హజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తామని ప్రొఫెసర్ పేర్కొన్నారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి ఆంధ్రా యూనిర్శిటీలో డిగ్రీ పట్టా పొందిన పూర్వ విద్యార్థులంతా అహ్వానితులేనని, ఇందుకోసం వారు యునివర్శిటీ వెబ్సైట్ ద్వారా వారి పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. కాగా ఈ పుర్వా విద్యార్థుల అసోయేషన్ దేశంలోనే అతి పెద్ద అసోయేషన్గా రూపుదిద్దుకుంటుందని, ఏయూ యూనివర్శిటీ ద్వారా సుమారు 80 లక్షలకు పైగా విద్యార్థులు వివిధ డిగ్రీలు పొందారని తెలిపారు. ఇక పూర్వ విద్యార్థుల అసోషియేషన్ను ఒక ఛారిటబుల్ ట్రస్ట్గానే నిర్వహించబోతున్నామని, ఇందులోకి మాజీ డీజీపీ సాంబశివరావును కూడా తీసుకున్నామని వారు తెలిపారు. దీని ద్వారా పరీక్షల నిర్వాహణ ఫలితాల విడుదలలో మార్పులు చేశామన్నారు. ‘గతంలో ఆరేడు నెలలకు పైగా ఫలితాలకు సమయం పట్టేది.. కానీ ఇప్పుడు ఈ అసోసియేషన్ ద్వారా ఫలితాలను 25 రోజులలో ఇస్తున్నామన్నారు. అసోషియేషన్ స్థాపకుడు, అధ్యక్షుడు గ్రంధి మల్లికార్జున రావు(జీఎమ్ఆర్) 45 గదుల ప్రత్యేక హాస్టల్‌ను నిర్మించడానికి ముందుకు వచ్చారని, అదే విధంగా పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ఏయూలో మౌలిక సదుపాయాలు పెంచడానికి కృషి చేస్తున్నామని అన్నారు. -
అవంతి ఫీడ్స్‌తో ఏయూ ఎంఓయూ
సాక్షి, విశాఖపట్నం: అవంతి ఫీడ్స్‌తో ఆంధ్రాయూనివర్శిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. ఈ మేరకు పరస్పర అవగాహన ఒప్పందంపై మంగళవారం ఏయూ వీసీ ప్రొఫెసర్ ప్రసాద్‌రెడ్డి, అవంతి ఫీడ్స్ జేఎండీ సీఆర్‌రావు సంతకాలు చేశారు. సుమారు నాలుగు కోట్లతో ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా అవంతి ఫీడ్స్..కార్పొరేట్ సోషల్ బాధ్యత కింద ఆంధ్రా యూనివర్శిటీలో మౌలిక వసతుల కల్పన, మెరైన్ లివింగ్ సోర్స్ విభాగం, విస్తరణ, మత్స్యకారులకు శిక్షణ అందించనుంది. -
'దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకం'
సాక్షి, విశాఖపట్నం : ఇండియన్ ఇన్సిట్యూట్స్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపిఇ) నాలుగో ఆవిర్బావ దినోత్సవ వేడుకలను విశాఖలోని ఆంధ్ర యునివర్సిటీ ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మంత్రి అవంతి శ్రీనివాస్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ .. దేశాభివృద్దిలో యువత పాత్ర చాలా కీలకమని పేర్కొన్నారు. విద్యార్థి దశ దాటిన తర్వాత యువత ఎక్కడున్నా మాతృ దేశాన్ని మరిచిపోవద్దని కోరారు. విశాఖలో ఐఐపిఇ ని అభివృద్ది చేయడంలో డైరక్టర్ ప్రసాద్ కృషి అభినందనీయమన్నారు. దేశంలోని పెట్రోలియం కంపెనీలతో టై అప్ అవ్వడం ద్వారా యూనివర్సిటీ సరికొత్త పరిశోధనలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రాంతంలోనే కెజి బేసిన్ ఉండటం వల్ల ఈ యూనివర్సిటీ లో విద్య పూర్తి చేసిన విధ్యార్ధులకు పూర్తి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.ఈ యూనివర్సిటిలో చేరిన మొదటి బ్యాచ్ కి అభినందనలు తెలియజేస్తూ... విశాఖలోని పెట్రోలియం యూనివర్సిటీ దేశంలోనే అత్యుత్తమ యూనివర్సిటీగా ఎదగాలని ఆకాక్షించారు. విశాఖతో పాటు దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. విద్య, విద్యార్థులన్నా తనకు ఎంతో ఇష్టం : మంత్రి అవంతి పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఐఐపిఇ నాలుగవ ఆవిర్బావ కార్యక్రమంలో పాల్గోవడం ఆనందంగా ఉందన్నారు. కాకినాడలో ఐఐపిఇని స్దాపించాలని చంద్రబాబు ప్రయత్నించినా, విశాఖలో ఉన్న మౌలిక సదుపాయాల దృష్ట్యా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు మొగ్గు చూపడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పెట్రో యూనివర్సిటీకి భూములు కేటాయింపులలో ఇబ్బంధులు తలెత్తకుండా ప్రయత్నాలు చేశానని తెలిపారు. రాజకీయాలలోకి రాకముందే తాను విద్యాసంస్ధలు స్ధాపించానని, విద్య, విధ్యార్ధులన్నా తనకు ఎంతో ఇష్టమన్నారు. విద్యార్ధులు తమకున్న నైపుణ్యంతో వినూత్నంగా ఆలోచించడంతో పాటు భారీ లక్ష్యాలు నిర్దేశించుకోవాలని మంత్రి అవంతి పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నిరక్షరాస్యత ఉండకూడదనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమ్మ ఒడి పధకాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. రాబోయే నాలుగైదు ఏళ్లలో అక్షరాస్యతలో కేరళను దాటగలమనే నమ్మకముందన్నారు. అనంతరం వివిధ విభాగాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు గవర్నర్, మంత్రి చేతుల మీదగా సర్టిఫికేట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, కలెక్టర్ వినయ్ చంద్ , పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ మీనా, డైరక్టర్ చంద్రశేఖర్ , ప్రొఫెసర్ విఎస్ ఆర్ కె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
'జగన్ ప్రజాసంక్షేమ పాలన కొనసాగిస్తున్నారు'
సాక్షి, విశాఖపట్నం : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రా యునివర్సిటీలో విద్యార్థి విబాగం ఆధ్వర్యంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు బి. కాంతారావు ఆధ్వర్యంలో జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సంవత్సరం పాఠశాలలో డ్రాపవుట్స్ తగ్గడానికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అమ్మ ఒడి పథకం ఎంతో ఉపయోగపడిందని తెలిపారు. వంద రోజుల పాలనలోనే నాలుగు లక్షల ఉద్యోగాలను కల్పించి జగన్ చరిత్ర సృష్టించినట్లు పేర్కొన్నారు. సీఎం జగన్ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సాహోసోపేత నిర్ణయాలతో ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు పూర్తి స్థాయి రీయింబర్స్‌మెంట్‌ను కల్పిస్తూ ఎంతో మేలు చేస్తున్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బి. మోహన్‌బాబు, ఎం. కళ్యాణ్, బి. జోగారావు, కె. దీరజ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ సెట్ దరఖాస్తుకు ఈ నెల 11 తుది గడువు
సాక్షి, ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): రాష్ట్ర స్థాయి అర్హత పరీక్ష (ఏపీసెట్) దరఖాస్తుకు ఈ నెల 11వ తేదీతో గడువు ముగియనుందని ఏపీ సెట్ మెంబర్ సెక్రెటరీ ఆచార్య కె.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.1,000 అపరాధ రుసుముతో ఈ నెల 19వ తేదీ వరకు, రూ.2 వేల అపరాధ రుసుముతో ఈ నెల 26వ తేదీ వరకు, రూ.5 వేల అపరాధ రుసుముతో ఆక్టోబర్ 3వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. అక్టోబర్ 20వ తేదీన విశాఖ, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, కర్నూలు, కడప ప్రాంతీయ కేంద్రాల పరిధిలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. జనరల్ అభ్యర్థులు రూ.1,200, బీసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.700 పరీక్ష ఫీజుగా చెల్లించాలన్నారు. మెత్తం 30 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం https://www.andhrauniversity.edu.in, https://apset.net.in వెబ్సైట్ నుంచి పొందవచ్చన్నారు. -
అన్వేషణ మొదలు..
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి పదవికి అర్హులైనవారి కోసం అన్వేషణ మెదలైంది. రాష్ట్రంలోని ఏడు విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించే ప్రక్రియను రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రారంభించింది. వీటిలో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఉంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.ఎస్.వి ప్రసాద్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉపకులపతి పదవులకు అర్హులైన ఆచార్యుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఆంధ్రా వర్సిటీకి ప్రస్తుత వీసీగా(అదనపు బాధ్యతలు) వ్యవహరిస్తున్న ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి.. బాధ్యతలు చేపట్టిన నెలరోజుల్లోనే పాలనలో తనదైన ముద్ర వేశారు. రెక్టార్‌గా, రిజిస్ట్రార్‌గా గతంలో పని చేసిన అనుభవంతో స్వల్పకాలంలోనే పలు మార్పులు చేసి వ్యవస్థను గాడిలో పెడుతున్నారు. రెగ్యులర్ వీసీ పదవికి ఆయన కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ ఉపకులపతిగా ఇటీవలి వరకు పనిచేసిన ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం గత నెల 16న ముగిసింది. ఆయన స్థానంలో పూర్తిస్థాయి వీసీని నియమించాల్సి ఉంది. అంతవరకు తాత్కాలిక ఏర్పాటుగా ఏయూ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ ఆచార్యుడు పి.వి.జి.డి ప్రసాదరెడ్డికి వీసీగా అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే. తాజాగా రెగ్యులర్ వీసీ నియామక ప్రక్రియ మొదలుకావడంతో వర్సిటీలో సందడి నెలకొంది. సెర్చ్ కమిటీ.. వీసీ నియామకానికి ముగ్గురు సభ్యులతో సెర్చ్ కమిటీ ఏర్పాటు కానుంది. ఇందులో సంబంధిత వర్సిటీ నుంచి ఒకరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు, గవర్నర్ నామినీ ఒకరు సభ్యులుగా ఉంటారు. అందిన దరఖాస్తులను ఈ కమిటీ వడపోసి అర్హుడైన ఆచార్యుడి పేరును సిఫార్సు చేస్తుంది. ప్రభుత్వం, గవర్నర్ ఆమోదం పొందిన తరువాత ఆ అభ్యర్థిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియకు కనీసం మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. సెప్టెంబరు 17తో దరఖాస్తు గడువు ముగుస్తుంది. అనంతరం వచ్చిన దరఖాస్తుల పరిశీలన, వడపోత ప్రారంభమవుతుంది. ఇందుకోసం సెర్చ్ కమిటీ పలుమార్లు భేటీ అవుతుంది. ఇవన్నీ పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఆమోదం, గవర్నర్ ఆమోదముద్ర పొందడానికి మరో నెల పడుతుంది. మొత్తం మీద డిసెంబర్ నాటికి వీసీల నియామకం పూర్తి అయ్యే అవకాశముంది. ఇతర వర్సిటీలకు ఏయూ ఆచార్యులే.. ఏయూతోపాటు పద్మావతి మహిళావర్సిటీ, ఆదికవి నన్నయ, ఆచార్య నాగార్జున, కృష్ణా, యోగి వేమన వర్సిటీలకు వీసీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏయూ ఆచార్యులు ఏయూతో పాటు ఆచార్య నాగార్జున, కృష్ణా, నన్నయ, పద్మావతి మహిళా వర్సిటీ పోస్టులకు పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ప్రొఫెసర్‌గా పదేళ్లకు పైగా అనుభవం ఉన్నవారు ఏయూలో అధికంగా ఉన్నారు. వీరంతా వీసీ పదవికి పోటీ పడనున్నారు. ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలకు ఏయూ ఆచార్యులే వీసీలుగా ఉన్నారు. కొత్త పదవుల్లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పలువురు ఆ చార్యులు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వీసీగా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రసాదరెడ్డి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశముంది. నెల రోజుల్లోనే ప్రసాదరెడ్డి ముద్ర.. ప్రస్తుతం ఏయూ వీసీగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆచార్య ప్రసాద రెడ్డి నెలరోజుల్లోనే తనదైన ముద్ర వేశారు. గతంలో రిజిస్ట్రార్‌గా, రెక్టార్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఎంతో కలిసి వస్తోంది. తనదైన శైలిలో విద్యార్థుల సంక్షేమమే ప్రధానంగా ఆయన సేవలు అందిస్తున్నారు. వర్సిటీ ఇంజినీరింగ్ వర్క్స్‌పై ప్రత్యేక కమిటీ వేసి ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నారు. దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న పరీక్షల రీ వాల్యుయేషన్ సమస్యలను వారం రోజుల్లోనే పరిష్కరించారు. వర్సిటీ ఆర్థిక సమస్యల నేపథ్యంలో నూతన వసతిగృహాల నిర్మాణానికి పలువురు దాతలను ఇప్పటికే సమీకరించారు. వర్సిటీ ఆర్థిక పరిస్థితిని బలోపేతంచేస్తూనే..నిధులు దుర్వినియోగం కాకుండా అవసరమైన మేరకే నిధులు ఖర్చుచేస్తున్నారు. నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా పేరున్న ప్రసాదరెడ్డి గతంలో రిజిస్ట్రార్‌గా పనిచేసిన సమయంలో నాటి వీసీ ఆచార్య బీల సత్యనారాయణతో సమన్వయం చేసుకుంటూ పాలన సాగించారు. వర్సిటీ ఉద్యోగులతో సత్సంబంధాలు ఉండటంతో తనదైన ముద్ర వేశారు. -
విద్యాభివృద్ధి దేశ స్థితి గతులనే మార్చేస్తుంది: గవర్నర్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వ విద్యాలయం ఛాన్సలర్‌గా విద్యార్థులను ఉద్దేశించి ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ప్రసంగించారు. విద్యాభివృద్ధి దేశ స్థితి గతులను పూర్తిగా మార్చి వేయగలదనే నమ్మకం ఉందన్నారు. ఆంధ్ర విశ్వ విద్యాయలం దేశ విద్యా వ్యవస్థకు విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు. అంతేకాకుండా భవిష్యత్ లో కూడా ఆంధ్ర విశ్వ విద్యాలయం ఎన్నో విద్యా కుసుమాలను అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చైనా రాజధాని లో కాలుష్య దుప్పటి కప్పి మూడు రోజులు విద్య సంస్థలకు సెలవు ప్రకటించారని, దేశ రాజధాని ఢిల్లీలో కూడా కాలుష్యం విపరీతంగా ఉందని గవర్నర్ పేర్కొన్నారు. విశాఖలో కూడా కాలుష్యం ఎక్కువగా ఉందని, అందరూ కలిసి కాలుష్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. రోజురోజుకూ నీటి కాలుష్యం, వాయు కాలుష్యం పెరుగుతోందనీ, పర్యావరణ పరిరక్షణకు అందరు పాటు పడాలన్నారు. విశ్వ విద్యాలయాలు మొక్కల పెంపకానికి నడుం కట్టాలని గవర్నర్ బిశ్వ భూషణ్ పిలుపునిచ్చారు. -
ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తా
రెండు ప్రతిష్టాత్మక సంస్థల సారథులు కొలువుదీరారు. నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించిన వీఎంఆర్డీయే చైర్మన్‌గా నియమితులైన ప్రభుత్వ మాజీ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్‌గా అదనపు బాధ్యతలు పొందిన ప్రొఫెసర్ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డిలు శుక్రవారం ఆయా సంస్థల కార్యాలయాల్లో అభిమానులు, సిబ్బంది కోలాహలం మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సంస్థల పాలనను, ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తామని ఈ సందర్భంగా వారు చెప్పారు. సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని నవీన పంథాలో నడిపిస్తామని ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాదరెడ్డి అన్నారు. విద్య, బోధనలకే పరిమితం కాకుండా ఏయూను సామాజిక సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా నిలుపుతామన్నారు. ఉద్దానం కిడ్నీ సమస్య, విశాఖ కాలుష్యం వంటి వాటికి వర్సిటీ శాస్త్రీయ పరిష్కారాలు అన్వేషిస్తుందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటలకు వర్సిటీ వీసీగా ఆయన కార్యాలయంలో అదనపు బాధ్యతలను చేపట్టారు. మాజీ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ సమక్షం తొలి ఫైలుపై సంతకం చేశారు. అనంతరం తనను తీర్చిదిద్దన సోదరి డాక్టర్ పి.ఏ.ఎల్ రజని ఆశీస్సులు తీసుకున్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎం.ప్రసాదరావు, రిజిస్ట్రార్ ఆచార్య టి.బైరాగిరెడ్డి ఆయన్ను అభినందించారు. డీఎస్ఎన్ఎల్యూ మాజీ వీసీ ఆచార్య వై.సత్యనారాయణ, ప్రిన్సిపాల్స్ ఆచార్య పేరి శ్రీనివాసరావు, రమణమూర్తి, సుమిత్ర, టి.వినోదరావు తదితరులు పుష్పగుచ్చాలు అందించి అభినందనలు తెలియజేశారు. సేవాకేంద్రం ఏర్పాటు వీసీ ఏయూ సెనేట్ మందిరంలో మీడియా ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. వర్సిటీలో సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు అవసరమైన సేవలు, సమాచారం అందిస్తామన్నారు. విద్యార్థుల సమస్యలకు సత్వర పరిష్కారం అందించే దిశగా ఈ కేంద్రం పని చేస్తుందన్నారు. రానున్న దశాబ్ద కాలం లో వర్సిటీలో చేసే అభివృద్ధి కార్యక్రమాల ప్రణాళికను తాను సిద్ధం చేసుకున్నానని, దానిని త్వరలో వెల్లడిస్తానని తెలిపారు. మాజీ వీసీ ఆచార్య బీల సత్యనారాయణ, ఐఏఎస్ అధికారి ఎం.జి. గోపాల్‌ల నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నానన్నారు. ఆచార్యునిగా తన 32 సంవత్సరాల ప్రయాణంలో విద్యార్థులే మంచి మిత్రులుగా నిలు స్తారన్నారు. నంబర్‌వన్ వర్సిటీగా ఏయూను నిలపాలన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. నిధుల తరలింపు వల్లే సమస్య వర్సిటీకి అధ్యాపకుల కొరత ఉన్నమాట వాస్తవమని, గత ఐదు సంవత్సరాలుగా నియామక ప్రక్రియలో లోపాల కారణంగా ఉద్యోగాలు భర్తీ చేయ డం సాధ్యపడలేదన్నారు. దీనికంటే పెద్ద సమస్య నిధుల కొరతేన్నారు. గత ప్రభుత్వ హయాంలో వర్సిటీకి రావాల్సిన నిధులు పసుపు కుంకుమ పేరుతో తరలిపోయాయన్నారు. ముందుగా వీటిని తిరిగి తెచ్చుకోవడం ఎంతో అవసరమన్నారు. పేద విద్యార్థులకు అండగా.. పేద విద్యార్థులకు అండగా ఏయూ నిలుస్తుందన్నారు. వర్సిటీలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అదనపు సెక్షన్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో త్వరలో చర్చిస్తామని చెప్పారు. వైఎస్సార్‌కు నివాళి వీసీ బాధ్యతల స్వీకరణకు ముందు ఏయూ నిర్మాణానికి 1942లో వేసిన శిలాఫలకం వద్ద పూలు ఉంచారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర రెడ్డి, మహాత్మాగాంధీ, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్, వర్సిటీ వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహాల వద్ద నివాళులర్పించారు. అనంతరం తా ను రిజిస్ట్రార్‌గా పని చేసిన సమయంలో వీసీ గా ఉన్న ఆచార్య బీల సత్యనారాయణ సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆయన్ను ఆచార్యులు, ఉద్యోగులు, విద్యార్థులు అభినందించారు. -
ముఖ్యమంత్రి హామీ నిజం చేస్తా! : వీసీ
సాక్షి, విశాఖపట్నం: ఉత్తరాంధ్రలో ఆంధ్రా యూనివర్సిటీని మొదటి స్థానంలో నిలబెట్టాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాన్ని నిజం చేస్తానని ఏయూ వైస్ చాన్సలర్ పివిజిడి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా బాధ్యతలు చేపట్టిన పివిజిడి ప్రసాద్ రెడ్డికి ఏయూ అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..యూనివర్సిటీలో క్రమశిక్షణకు పెద్దపీట వేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీ నిధులను గత ప్రభుత్వం పసుపు కుంకుమ కోసం వినియోగించిందని ఆరోపించారు. దీంతో నిధుల కొరత ఏర్పడిందని తెలిపారు. ఉన్నదానిలో అభివృద్ధి పనులు చేసుకుంటూ రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీని నడిపిస్తామని స్పష్టం చేశారు. తాను కూడా విద్యార్థి దశ నుంచే ఈ స్థాయికి వచ్చానని అన్నారు. ప్రతీ విద్యార్థికి బంగారు భవిష్యత్‌ను అందిస్తామని భరోసా కల్పించారు. -
‘వైఎస్ జగన్ పిలిచి ఈ అవకాశం ఇచ్చారు’
సాక్షి, విశాఖపట్టణం: ఆంధ్ర యునివర్సిటీ వైఎస్ చాన్స్‌లర్‌గా పీవీజీడీ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రసాద్ రెడ్డి వీసీగా బుధవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ జగన్ భావించినట్లుగా.. ఏయూని దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా తీర్చిదిద్దుతామని అన్నారు. యూనివర్సిటీలో స్థానం సంపాదించిన ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. యూనివర్సిటీలోని విద్య భోదనను సులభతరం చేసేందుకు పాలన విధానాలలో మార్పులు తీసుకొచ్చి, ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే అదనపు ఉద్యోగులను నిమమిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు, లెక్చరర్లకు ఏ సమస్య ఎదురైనా 24 గంటల్లో పరిష్కరిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యూనివర్సిటీని నడిపిస్తామని హామీ ఇచ్చారు. ఎనిమిదేళ్ల క్రితం వీసీగా అవకాశం వచ్చి చేజారినందుకు బాధపడ్డానన్నారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాకా తనను పిలిచి ఈ బాధ్యతలు అప్పగించడం ఆనందంగా ఉందన్నారు. -
చిన్నాన్నే రోల్ మోడల్
సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆచార్య టి.భైరాగిరెడ్డి ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రకాశం జిల్లా కొణిజేడు నుంచి విశాఖపట్నం వరకు ఆయన ప్రస్తానాన్ని ‘సాక్షి’కి వివరించారు. చిన్నతనం నుంచి చిన్నాన్నల నుంచి స్ఫూర్తి పొందానని, కళాశాల రోజుల నుంచి సివిల్ సర్వెంట్‌గా మారి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం ఉండేదని ఆయన వివరించారు. వ్యవసాయ కుటుంబం.. తండ్రి కోటిరెడ్డి వ్యవసాయదారుడు, తల్లి అచ్చమ్మ గృహిణి. కొణిజేడులో పాఠశాల విద్య, ఒంగోలు సీఎస్ఆర్ శర్మ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశారు. ఏయూ నుంచి 1980–82లో వృక్షశాస్త్రంలో పీజీ కోర్సును పూర్తిచేశారు. చిన్నాన్నల ప్రభావంతో.. చిన్నాన్న వెంకారెడ్డి ఐఏఎస్, మరో చిన్నాన్న టి.గోపాలరెడ్డి అడల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా పని చేశారు. వీరి ప్రభావం చిన్నతనం నుంచి భైరాగి రెడ్డిపై బలంగా పడింది. వారి బాటలోనే సివిల్ సర్వెంట్ కావాలని పరితపించారు. పీజీ పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ కోచింగ్‌కు వెళ్లిపోయారు. పరిశోధనలన్నీ సమాజ హితాలే.. పర్యావరణ మంత్రిత్వ శాఖ మంజూరు చేసిన ప్రాజెక్టులో భాగంగా ఆచార్య సుబ్బారెడ్డి వద్ద సీనియర్ రీసెర్చ్ ఫెలోగా చేరి అండమాన్ ఐలాండ్స్‌లో పరిశోధనకు వెళ్లాం. అంతరించి పోతున్న గిరిజన జాతులు, వారి జీవనం, ఆహార శైలి, కట్టుబాట్లు తదితర అంశాలను దగ్గరగా పరిశీలించే అవకాశం ఈ పరిశోధన అందించింది. అక్కడే 9 నెలలు ఉండి 30 ఐలాండ్స్‌లో పరిశోధన జరిపాం. ప్రమాదకరమైన గిరిజన జాతుల నుంచి ఎన్నో ప్రమాదాలు ఎదుర్కొని సమర్థవంతంగా పరిశోధన ముగించాం. ఆచార్య ఎం.వి.సుబ్బారావు పర్యవేక్షణలో తూర్పు కనుమలపై చేసిన మమ్మేలియన్ సర్వే విస్తృత అవగాహన, అడవుల్లో జీవులపై పరిశోధనకు మార్గం చూపింది. వర్సిటీలో ఉద్యోగం... ► వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా 1994లో చేరారు. 2003లో అసోసియేట్‌గా, 2009లో ప్రొఫెసర్‌గా పదోన్నతలు సాధించారు. ఆచార్య ఎన్.సోమేశ్వరరావుతో సంయుక్తంగా విశాఖ పోర్ట్ ట్రస్ట్‌కు విభిన్న ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు. ► బార్క్, కొవ్వాడ అణు విద్యుత్ ప్లాంట్ ప్రతిపాదిత స్థలాల్లో జీవావరణ పరిస్థితులపై పరిశోధన, నగరంలో నీటి నాణ్యతపై పరిశోధన వంటి సమాజ హిత అంశాలపై పరిశోధనలు జరిపించారు. వీసీ సింహాద్రి వదలలేదు.. ► ఆచార్య వై.సి.సింహాద్రి వీసీగా పనిచేసిన కాలంలో నన్ను పరీక్షల విభాగంలో కో కన్వీనర్‌గా నియమించారు. అక్కడ నుంచి వై దొలగాల ని నేను కోరినా ఆయన ఒప్పుకోలేదు. మూడేళ్ల కాలం పరీక్షల విభాగంలోనే పనిచేశాను. చీఫ్ వార్డెన్‌గా ఎంచుకున్నాను.. ► పరిశోధకుడిగా నేను ఎదుర్కొన్న సమస్యలే నన్ను రీసర్చ్ స్కాలర్స్ హాస్టల్ చీఫ్ వార్డెన్‌గా పనిచేసేలా ప్రేరేపించాయి. అక్కడ పరిశోధకుల సమస్యలు తెలుసుకుని వసతి, భోజన ఇబ్బందులు కలగకుండా వీలైనంత వరకు పనిచేశాను. మెరుగు పరచాలి.. పర్యావరణ శాస్త్ర ఆచార్యుడిగా వర్సిటీలో పర్యావరణాన్ని మార్పు చేసే దిశగా కొంత పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతి విభాగంలో పరిశుభ్రమైన తాగునీరు లభించే ఏర్పాటు చేస్తాను. పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దుతాం. వ్యర్థాలను సక్రమంగా నిర్వహించడం, ఎరువుగా మార్చే దిశగా కృషిచేస్తాం. వర్సిటీ విద్యార్థుల ప్రయోగశాలు అభివృద్ధి చేయాల్సి ఉంది. వీటిని ఎంతో మెరుగు పరచి ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్పు చేయాలి. హాస్టల్స్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపుతాను. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా వాటిని తీర్చిదిద్దుతాను. బయాలజీలో పరిశోధనకు గోల్డ్‌మెడల్.. 1984లో ఆచార్య సి.సుబ్బారెడ్డి పర్యవేక్షణలో పర్యావరణ శాస్త్రంలో పీహెచ్‌డీకి చేరారు. ప్లాంట్, యానిమల్ ఇంటరాక్షన్ అంశంపై జరిపిన పరిశోధనకు 1988లో డాక్టరేట్‌తో పాటు బంగారు పతకాన్ని అందుకున్నారు. విభాగమే ఆశ్రయమిచ్చింది.. పరిశోధక విద్యార్థిగా చేరిన నాటి నుంచి విభాగమే ఇల్లుగా మారింది. ఉదయం 8 గంటలకు విభాగానికి చేరుకుని పరిశోధన ప్రారంభించేవారు. మధ్యాహ్నం ఒక గంట విరామం తీసుకుని తిరిగి తన మార్గదర్శి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లే వరకు విభాగంలోనే ఉండేవారు. -
ఏయూ రిజిస్ట్రార్‌గా బైరాగి రెడ్డి
సాక్షి, ఏయూక్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా పర్యావరణ శాస్త్ర విభాగ ఆచార్యులు టి.బైరాగి రెడ్డి నియమితులయ్యారు. వీసీ ఆచార్య నాగేశ్వరరావు శని వారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయనకు ఉత్తర్వులు అందజేసి అభినందించారు. అనంతరం ఆయన 5.15 గంటలకు ఆచార్య కె.నిరంజన్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. వర్సిటీలో ఉదయం నుంచి సందడే.. ఏయూ రిజిస్ట్రార్‌గా ఆచార్య బైరాగిరెడ్డిని నియమిస్తున్నట్లు శనివారం ఉదయం నుంచే వర్సిటీలో విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో పర్యావరణ విభాగంలోని ఆయన కార్యాలయం ఆచార్యులు, ఉద్యోగులతో ఉదయం నుంచే సందడిగా మారింది. అయితే మధ్యాహ్నం వరకు ఎటువంటి అధికారిక సమాచారం అందకపోవడంతో ఉత్కం ఠ నెలకొంది. సాయంత్రం 5గంటలకు ఉత్తర్వులు వెలువడడం, బాధ్యతలు స్వీకరించడం చకచకా జరిగిపోయాయి. అనంతరం ఆచార్య బైరాగి రెడ్డి వర్సిటీలోని వై.ఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి, సి. ఆర్.రెడ్డి, అంబేడ్కర్, జ్యోతిరావుపూలే, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాల వేసి అంజలి ఘటించారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచా ర్య ఎం.ప్రసాదరావు మీడియా రిలేషన్స్ అసోసియేట్ డీన్ ఆచార్య చల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బైరాగి రెడ్డికి వర్సిటీ ఉద్యోగ సంఘాల నేతలు, ఆచార్యులు, పరిశోధకులు, ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు అభినందనలు తెలిపారు. అందరికీ ఆప్తుడు పర్యావరణ ఆచార్యుడిగా సుపరిచితులైన బైరాగిరెడ్డి అందరికీ ఆప్తులు. ఎన్విరాన్మెంటల్ మైక్రో బయాలజీ, ప్లాంట్ యానిమల్ ఇంటరాక్షన్, సాయిల్ క్వాలిటీ, వాటర్ క్వాలిటీ, ఎయిర్ క్వాలిటీ అంశాల్లో నిష్ణాతులు. జీఐఎస్ స్టడీస్ అండ్ పంప్ సెట్స్ ఆఫ్ విశాఖపట్నం, కాకినాడ అంశాల్లో పరిశోధనలు చేశారు. విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్రాంతాల్లో పరిశోధన ప్రాజెక్టులను నిర్వహించారు. పర్యావరణ హితుడు పర్యావరణ, సామాజిక ప్రాధాన్యం గల అంశాలపై ఆయన పరిశోధనలు సాగాయి. అరకు, పాడేరు మండలాల్లో భూగర్భజలాల నాణ్యత, బార్క్ ఏర్పాటు చేస్తున్న ప్రాంతంలో జీవ వైవిధ్యంపైన, కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేసే ప్రాంతలో జీవ, వృక్ష సంపదపైన, కాపులుప్పాడ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంతాలలో భూగర్భ జలాల నాణ్యతపై పరిశోధన చేశారు. ఫార్మా పరిశ్రమల కేంద్రంగా నిలుస్తున్న పైడి భీమవరంలో భూగర్భజలాల పరిశీలన, విశాఖ నగరంలో 60 ప్రాంతాల్లో నీటి నాణ్యతపై అధ్యయనం, భారత అణుసంస్థ పరిశోధన ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించారు. పదవులకు వన్నె తెచ్చారు ఆచార్య బైరాగి రెడ్డి అలంకరించిన పదవులన్నింటికీ వన్నె తెచ్చారు. పరిశోధకుల వసతిగృహం చీఫ్ వార్డెన్, ఏయూ దివ్యాంగుల కేంద్రం కన్వీనర్‌గా, పర్యావరణ శాస్త్ర విభాగాధిపతిగా, బీఓఎస్ చైర్మన్‌గా, సైన్స్ కళాశాల డిప్యూటీ వార్డెన్‌గా, ఏయూ పరీక్షల విభాగం సహ కన్వీనర్‌గా, అసిస్టెంట్ ప్రిన్సిపాల్‌గా సేవలు అందించారు. విశాఖ పోర్ట్ ట్రస్ట్ పర్యావరణ పర్యవేక్షణ కమిటీ సభ్యునిగా, ఆటా సభ్యునిగా, ఏ యూ కాలుష్య నియంత్రణ మండలి ఆడిట్ సభ్యునిగా, రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యునిగా, యూపీఎస్సీ సబ్జెక్ట్ నిపుణుడిగా, వివిధ డిగ్రీ, పీజీ కళాశాల గవర్నింగ్ సభ్యునిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏయూను నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్‌లకు కృతజ్ఞతలు. నాపై ప్రభుత్వం ఉంచిన సమున్నత బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తాను. దేశంలోనే నంబర్ వన్ విశ్వవిద్యాలయంగా ఏయూను తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తాను. వర్సిటీ ఉద్యోగులు, ఆచార్యులు సహకరించాలని కోరుతున్నాను. అందరి సూచనలు, సలహాలు స్వీకరిస్తాను. విద్యార్థుల సంక్షేమం, ఉద్యోగుల శ్రేయస్సు ప్రధాన అజెండాగా ప్రతిక్షణం పని చేస్తాను. – ఆచార్య టి.బైరాగి రెడ్డి, రిజిస్ట్రార్ -
ఏయూ పాలకమండలి రద్దు
ఉన్నత విద్య ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం కట్టింది. సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల ప్రస్తుత పాలకవర్గాలపై వేటు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జారీ చేసిన జీవో ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ పాలకవర్గం కూడా రద్దయ్యింది. 2016 ఫిబ్రవరిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రస్తుత పాలకవర్గాన్ని నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరితోనే పాలకవర్గ పదవీకాలం పూర్తి కాగా.. మరో అరు నెలలు పొడిగిస్తూ అదే ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. మూడేళ్లకుపైగా అధికారంలో ఉన్న పాలకమండలి వర్సిటీ అభివృద్ధికి చేసిన కృషి మచ్చుకైనా కనిపించలేదు. అధికారులు సూచించిన వాటికి తలూపడం తప్ప విలువైన సూచనలు గానీ, తమస్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయించడానికి గానీ ప్రయత్నించకుండా నామమాత్రంగా మిగిలిపోయారు. ఈ పరిస్థితిని మార్చడానికే వైఎస్ జగన్ సర్కారు వర్సిటీలపై వేటు వేయడంతో మంచి పాలకమండలి వస్తుందన్న ఆనందం వర్సిటీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. సాక్షి, విశాఖపట్నం: విశ్వ విద్యాలయాల బలోపేతం.. ప్రక్షాళనపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమర్థ వంతమైన సారథులను నియమించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోని మెత్తం 10 విశ్వవిద్యాలయాల పాలక మండళ్లను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జీవోఆర్టీ 82ను విడుదల చేసింది. దీంతో ఆంధ్రవిశ్వవిద్యాలయం పాలక మండలి రద్దయింది. తాజాగా ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ఆచార్య హేమచంద్రారెడ్డి నియామకం.., నేడు పాలక మండళ్లు రద్దు చేయడం ప్రభుత్వం దూకుడును స్పష్టం చేస్తున్నాయి. ఇదే తరహాలో త్వరలో వర్సిటీల్లో పూర్తిస్థాయిలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో పాలక మండలి సభ్యులుగా ఆచార్య ఎం.ప్రసాదరావు, ఆచార్య జి.శశిభూషణరావు, డాక్టర్ సురేష్ చిట్టినేని, డాక్టర్ ఎస్.విజయ రవీంద్ర, గ్రంధి మల్లికార్జున రావు, డాక్టర్ కె.మురళీదివి, డాక్టర్ పి.సోమనాథరావు, ఆచార్య ఎన్. బాబయ్యలను నియమిస్తూ 2016 ఫిబ్రవరి 3న అప్పటి ప్రభుత్వం జీవోఎంఎస్ 5ను జారీ చేసింది. మూడేళ్ల కాలానికి వీరిని నియమించింది. ఆ ప్రకారం వీరి పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 3వ తేదీతో ముగిసింది. అయితే పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి 24న జీవో 32ను జారీ చేసింది. ప్రస్తుత ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నేపథ్యంలో నేటితో పాలక మండలి పూర్తిస్తాయిలో రద్దయ్యినట్లయింది. అలాగే వచ్చే నెల 16వ తేదీతో ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న, త్వరలో ఖాళీ అయ్యే విశ్వవిద్యాలయాల వీసీల నియామకానికి సైతం త్వరలో నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాలకమండలి సమావేశంలో చర్చిస్తున్న సభ్యులు (పాత చిత్రం) నామమాత్రంగా పాలక మండళ్లు గత ప్రభుత్వ హయాంలో నియమితులైన పాలక మండలి సభ్యులు నామమాత్రంగానే మిగిలిపోయారు. పాలక మండలి సమావేశంలో విశ్వవిద్యాలయాల అభివృద్ధికి వీరు అందించిన సూచనలు మచ్చుకైనా కనిపించలేదు. వర్సిటీ అధికారులు ప్రవేశపెట్టే వివిధ అంశాలను పరిశీలించడం, అనుమతించడం, తిరస్కరించడానికే పరిమితమైంది.వర్సిటీ అధికారులకు, పాలక మండలి సభ్యులకు మధ్య సమన్వయం కుదరడానికి చాలా సమయం పట్టింది. దీంతో వర్సిటీ పాలకులకు, పాలక మండలి సభ్యులకు మధ్య అగాథం పెరిగింది. పాలక మండలి సభ్యులు వర్సిటీ వికాసానికి ఉపకరించే పథకాలు అమలు చేయడానికి సూచనలు చేయలేదు. ఆ వర్సిటీలు యథాతథమే సబ్బవరంలోని న్యాయవిశ్వవిద్యాలయం హైకోర్టు పర్యవేక్షణలో నడుస్తోంది. ఇక మారిటైం యూనివర్సిటీ కేంద్రప్రభుత్వ పరిధిలో నడుస్తోంది.రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో వీటికి వర్తించదు. నెరవేరని ఆశయం విశ్వవిద్యాలయాల పాలక మండలిలో పారిశ్రామిక వేత్తలు ఉండాలనే గత ప్రభుత్వ ఆశయం పూర్తిగా నీరుగారింది. ఏయూ పాలక మండలి సభ్యులుగా నియమితులైన గ్రంధి మల్లికార్జున రావు(జీఎంఆర్), డాక్టర్ మురళీ దివిలు ఒక్క పాలక మండలి సమావేశానికి కూడా హాజరు కాలేకపోయారు.దీంతో వారు నామమాత్రమే అయ్యారు. పాలక మండలి సమావేశంలో చర్చించిన అంశాల ప్రగతిని, అమలును తర్వాత సమావేశం జరిగేలోగా యాక్షన్ టేకెన్ రిపోర్ట్‌గా ఏయూ అధికారులు తయారు చేసి పాలక మండలి సభ్యులకు అందించాల్సి ఉంటుంది. దీన్ని అందించడంలో వర్సిటీ పాలకులు పూర్తిగా విఫలమయ్యారని పాలక మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటనలు ఉన్నాయి. వర్సిటీకి సంబంధించిన ఆర్థిక నిర్వహణ అనుమతులు, ఇతర అత్యవసర అనుమతులు అవసరమైన సందర్భాలలో మాత్రమే పాలక మండలి సమావేశాలు నిర్వహించారు. వాస్తవానికి ప్రతీ మూడు నెలలకు సామేశం జరగాల్సి ఉన్నప్పటికీ అది జరగలేదు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే అవకాశం పాత పాలక మండలి రద్దు కావడంతో త్వరలో నూతన పాలక మండలి ఏర్పాటు అవుతుందని ఆచార్యులు భావిస్తున్నారు. దీంతో పాలక మండలిలో స్థానం పొందడానికి ఆచార్యులు పోటీపడే అవకాశాలు కనిపిస్తున్నారు. సమర్థత, నిబద్ధత కలిగిన వారికే చోటు లభించే అవకాశం అవకాశం ఉంటుందని వర్సిటీ వర్గాలు భావిస్తున్నాయి. -
రచ్చకెక్కిన ఏయూ ఎన్నికలు
సాక్షి, ఏయూ క్యాంపస్(విశాఖ తూర్పు): ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉద్యోగుల సంఘం ఎన్నికలు వివా దాస్పదంగా మారాయి. నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓట్లు చేర్చడంపై అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ పంచాయతీ వీసీ వద్దకు చేరింది. ఏయూ బోధనేతర ఉద్యోగుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్‌ను ఈ నెల 17న విడుదల చేశారు. గురువారం సాయంత్రం 4 గంటలతో నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. బుధవారం నీలాపు శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానళ్లు, గురువారం జి.రవికుమార్ ప్యానల్ నామినేషన్లు దాఖలు చేశాయి. ఇక్కడ వరకు ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఎన్నికల అధికారి ఆచార్య జి.సుధాకర్ గురువారం సాయంత్రం 4.30 గంటలకు కొత్తగా 185 మందిని ఓటర్లుగా చేర్చుతున్నట్టు అభ్యర్థులకు తెలియజేశారు. దీనిని శివారెడ్డి, బుద్దల తాతారావు ప్యానల్ సభ్యులు వ్యతిరేకించారు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలని, నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కొత్తగా ఓటర్లను చేర్చడం ఏమిటని ఎన్నికల అధికారిని నిలదీశారు. వర్సిటీ వీసీ సంతకంతోనే నూతన జాబితా తనకు చేరిందని ఎన్నికల అధికారి చెప్పడతో వివా దం వర్సిటీ వీసీ కార్యాలయానికి చేరింది. వాగ్వాదాలు.. కేకలు వర్సిటీ వీసీ కార్యాలయంలో ఉద్యోగ సంఘాల నాయకుల వాగ్వాదంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వీసీ ఎదురుగానే ఉద్యోగులు ఘర్ణణకు దిగారు. పెద్దగా కేకలు వేశారు. చివరకు వీసీ స్వయంగా వర్సిటీ రెక్టార్, రిజిస్ట్రార్లను పిలిచి మాట్లాడారు. అనంతరం పోటీ చేస్తున్న మూడు ప్యానళ్ల అధ్యక్షులతో సమావేశమయ్యారు. వీసీ సూచన మేరకు న్యాయ నిపుణుల తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల అధికారి జి.సుధాకర్ తెలిపారు. ఏమిటీ జాబితా? ఎందుకీ వివాదం ఎన్నికలు ప్రారంభ సమయంలో, నోటిఫికేషన్ విడుదల సమయంలో వర్సిటీలో 1634 మంది ఓటర్లు ఉన్నట్లు జాబితాను అభ్యర్థులకు సంతకం చేసి ఎన్నికల అధికారి అందజేశారు. తాజాగా గురువారం సాయంత్రం హాస్టళ్లలో పనిచేస్తున్న 185 ఉద్యోగుల జాబితాను దీనికి జత చేయాలని సూచిస్తూ వర్సిటీ వీసీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. వర్సిటీ ఉద్యోగులకు ఎన్నికలు నిర్వహించడానికి ముందు నెలలో రూ.10 వేతనం నుంచి సేకరించారు. మే నెల వేతనాలు నుంచి 1634 మంది ఉద్యోగులకు దీనిని సేకరించారు. తాజాగా జత చేసిన ఉద్యోగులకు గత నెల వేతనాల నుంచి ఎన్నికల నిధిని సేకరించలేదు. వీరికి సంబంధించిన రూ.1850 డీడీ రూపంలో చెల్లించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా ఒక ప్యానల్‌కు సంబంధించిన పోటీదారుడే ఈ రుసుం చెల్లించారని వారు ఆక్షేపిస్తున్నారు. సాధారణంగా హాస్టళ్లలో పనిచేసే ఉద్యోగులకు హాస్టల్ ఎంప్లాయీస్ యూనియన్‌లో మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. వర్సిటీ విభాగాలలో పనిచేసే వారికి ఏయూ ఈయూలో ఓటు హక్కు ఉంటుంది. దీనికి విరుద్ధంగా హాస్టళ్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఓటు హక్కు కల్పించారని పోటీదారులు ఆరోపిస్తున్నారు. దీనిపై వర్సిటీ అధికారులు తగిన చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించాలని పోటీదారులు కోరుతున్నారు. నామినేషన్ల ఘట్టం ముగిశాక చేర్పులా.. ఇప్పటికే వర్సిటీ ఉద్యోగుల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి, నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగి సింది. తాజాగా పలువురి ఓట్లు జాబితాలో చేర్చాలనే ప్రయత్నం ఎంత మాత్రం సమంజసం కాదు. ఎన్నికల అధికారి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ ఎన్నికలు జరిపించాలి. – బుద్దల తాతారావు, పోటీదారుడు ఇదెక్కడి న్యాయం ఉద్దేశపూర్వకంగా కొంతమంది వర్సిటీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. వర్సిటీ ఉన్నతాధికారులను సైతం తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోంది. దీనిని ఎంత మాత్రం సహించేది లేదు. పాత జాబితా ప్రకారం ఎన్నికలు జరిపించాలి. మార్పులు, చేర్పులు అనుమతించరాదు. – నీలాపు శివారెడ్డి, పోటీదారుడు ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.. వర్సిటీలో పనిచేస్తున్న ఎంటీఎస్‌లో కొంత మంది ఉద్యోగులకు గత నెలలో ఎన్నికలకు సంబంధించిన రూ.10 వేలు వేతనం కోత జరగలేదు. దీంతో వీరంతా ఈ నెల మొదటి వారంలో దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు పరిశీలించి వారికి ఓటు హక్కు కల్పించారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా డిజిగ్నేషన్ ఇవ్వకుండా లాస్ట్ గ్రేడ్ కేటగిరీ అంటూ డిజిగ్నేషన్ ఇచ్చారు. ఇటీవల ఎంటీఎస్ పొందిన వారిలో కొంత మందికి ఓటు హక్కు కల్పించి, మరికొంత మందికి మొండి చేయి చూపడం ఎంత వరకు సమంజసం. – డాక్టర్ జి.రవికుమార్, పోటీదారుడు -
సమస్యల్లో ఏయూ మునిగెన్.. వీసీ ఛలో స్వీడన్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రవేశాల ప్రక్రియ అస్తవ్యస్తంగా మారి విద్యార్ధులు తీవ్ర ఆందోళనలో ఉంటే.. ఇవేమీ పట్టించుకోకుండా వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు విదేశీ పర్యటనకు పయనమవుతున్నారు. ఆసెట్ ప్రవేశాల ప్రక్రియ తప్పులు తడకలతో ఇప్పటికే వివాదాలు రేపగా.. తాజాగా బోధనేతర ఉద్యోగ నియామకాలకు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వివాదాస్పదమవుతోంది. ఈ కీలక తరుణంలో దగ్గరుండి అన్నీ చక్కదిద్దాల్సిన వీసీ ఈనెల 21న స్వీడన్ పర్యటనకు సిద్ధం కావడం విమర్శలకు తావిస్తోంది. వచ్చే నెల వీసీ పదవీకాలం ముగియనుంది. దానికి సరిగ్గా నెలరోజుల ముందు ఆయన స్వీడన్ పర్యటన వల్ల వర్సిటీకి ఒరిగేదేమిటని ఆచార్యులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. డిగ్రీ ఫలితాల విడుదలలో జాప్యం, సకాలంలో ఫలితాలు ఇవ్వకుండానే ఆసెట్ కౌన్సెలింగ్ నిర్వహించడం, వాటి ర్యాంకుల కేటాయింపు, కళాశాలలు అలాట్ చేయడం వంటి సవాలక్ష సమస్యల్లో ఏయూ మునిగిపోయిన తరుణంలో వీసీ తీరు, విదేశీ పర్యటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ⇒ వరప్రసాద్ అనే విద్యార్థికి ఎంఈడీలో ప్రవేశం లభించినట్లు మంగళవారం వెబ్సైట్లో కనిపించింది. బుధవారం ఫీజు చెల్లించేందుకు వెబ్సైట్లోకి వెళితే ప్రవేశం పొందలేదని చూపించింది. దాంతో సదరు విద్యార్థి లబోదిబోమంటూ ప్రవేశాల డైరెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాడు. ⇒ మరో విద్యార్థి వెంకట రఘురామ్ అప్లయిడ్ జియాలజీ కోర్సులో ప్రవేశం పొందాడు. ఉదయం ఆన్లైన్లో ఫీజు చెల్లించాడు. దాని చలానా ప్రింట్ తీయడానికి ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు. మళ్లీ ఫీజు చెల్లించాలన్న సందేశం అతన్ని వెక్కిరించింది. అంతే.. సదరు విద్యార్థి, అతని తండ్రి ప్రవేశాల సంచాలకుడి కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించే ప్రయత్నం చేశారు. ⇒ ఇలా ఒకరిద్దరు కాదు.. పెద్ద సంఖ్యలో విద్యార్థులు సీట్ల కేటాయింపు, ఫీజుల చెల్లింపు సమస్యలతో అడ్మిషన్స్ డైరెక్టర్ కార్యాలయానికి వస్తున్నారు. ఈ ప్రక్రియ బాధ్యతలు చూస్తున్న క్యాంపస్ మేనేజ్మెంట్ సంస్థ ప్రతినిధులు వీరికి సమాధానాలు ఇవ్వలేక తలలు పట్టుకుంటున్నారు. రూ.కోట్లు సమర్పించేశారు ఆసెట్ ప్రవేశాల నిర్వహణ కాంట్రాక్టు కింద సదరు సంస్థకు ఏడాదికి రూ.5 నుంచి రూ.7 కోట్ల రూపాయలు చెల్లిస్తారు. ఇంత అధిక మెత్తంలో చెల్లించినా సదరు సంస్థ ఆ ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైంది. ఎంసెట్ వంటి పరీక్షలు, కౌన్సెలింగ్‌లు నిర్వహించే ప్రముఖ సంస్థలను కాదని సీఎంఐకి అప్పనంగా కాంట్రాక్ట్ అప్పగించడం వెనుక లోగుట్టు ఏమిటో అర్ధం కావడం లేదు. నిపుణుల సూచనలు స్వీకరించారా? వర్సిటీకి చెందిన సమాచార సాంకేతిక అంశాల నిర్వహణ విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. సీఎంఐకి ఆటోమేషన్ కాంట్రాక్టు ఇచ్చే ముందు ఆ సంస్థ సామర్థ్యాన్ని, గత అనుభవాన్ని ఏయూ ఉన్నతాధికారులు పరిశీలించారా అనే సందేహం వ్యక్తం అవుతోంది. వర్సిటీలోని అనుభవజ్ఞులైన కంప్యూటర్ సైన్స్ విభాగం ఆచార్యుల సూచనలు స్వీకరించారా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. సీఎంఐకి కట్టబెట్టడమన్నది వీసీ ఏకపక్ష నిర్ణయమా.. పాలకవర్గ సమష్టి నిర్ణయమా తెలియదు కానీ.. మొత్తంగా ఏయూ వర్గాలు విమర్శల పాలవున్నాయి. చేతులెత్తేసిన నిర్వహణ సంస్థ విద్యార్ధుల అడ్మిషన్లకు సంబంధించి వర్సిటీ వినియోగిస్తున్న సాంకేతిక వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే విషయం స్పష్టమవుతోంది. అడ్మిషన్ల ప్రక్రియ బాధ్యతను దక్కించుకున్న బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్(సీఎంఐ) సంస్థకు ఈ వ్యవహారాల్లో ఎటువంటి అనుభవం లేదని, తొలిసారిగా ఏయూపై ఈ సంస్థ ప్రయోగాలు చేసిందనే విషయం తేటతెల్లమవుతోంది. ఇదే సంస్థకు ఏయూ మొత్తాన్ని ఆటోమేషన్ చేసే కాంట్రాక్ట్‌ను ఇవ్వాలని వర్సిటీ ఉన్నతాధికారులు ఇప్పటికే నిర్ణయించారు. ప్రవేశాల ప్రక్రియనే గందరగోళం చేసిన సంస్థకు ఏకంగా వర్సిటీ సాంకేతిక నిర్వహణ మొత్తాన్ని అప్పగిస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేను స్వీడన్ వెళ్తున్నా...ఇక్కడ రిజిస్ట్రార్, రెక్టార్లు చూస్తారు.. స్వీడన్‌లోని బ్లెకినో వర్సిటీతో ఏయూకి ఎంవోయూ ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ మూడేళ్లు చదివిన తర్వాత నాలుగో ఏడాది అక్కడ చదివితే అక్కడి బీఎస్ఈ ఇంజనీరింగ్ సర్టిఫికెట్తో పాటు ఏయూ నుంచి బీటెక్ డిగ్రీ ఇస్తాం.. డ్యూయల్ డిగ్రీ కోర్సు వల్ల స్వదేశంలోనూ, విదేశాల్లోనూ విరివిగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అంతటి ప్రాధాన్య అంశంపై ఎంవోయూ నేపథ్యంలో నేను స్వీడన్ వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ అడ్మిషన్ల ప్రక్రియ కొలిక్కి వస్తోంది. బుధవారం రాత్రి 9.30గంటల వరకు ఏయూలోనే ఉండి స్వయంగా పరిస్థితిని సమీక్షించాను. నేను స్వీడన్‌కు వెళ్లినప్పుడు ఇక్కడ ఇబ్బంది కాకుండా రిజిస్ట్రార్, రెక్టార్లు చూస్తారు.. అని ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ఫ్రొఫెసర్ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధికి చెప్పుకొచ్చారు. తప్పు దిద్దుకుంటున్నారు ఆసెట్ సీట్ల కేటాయింపులో జరిగిన లోపాలను సరిదిద్దే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. సీట్ల కేటాయింపులో లోపాలను ఎత్తిచూపుతూ సాక్షి బుధవారం సంచికలో ‘ఆసెట్.. అడ్మిషన్లు ఫట్’ శీర్షికన ప్రచురించిన కథనం వర్సిటీ వర్గాల్లో కలకలం రేపింది. దాంతో అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టారు. విద్యార్థులకు వారి ర్యాంకులు, రిజర్వేషన్లకు అనుగుణంగా సీట్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎంఐకి కట్టబెట్టడం ఏయూ పెద్దల నిర్ణయం ఏయూ అడ్మిషన్ల ప్రక్రియను బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్‌కు కట్టబెట్టాలన్నది ఏయూ ఉన్నతాధికారులు తీసుకున్న నిర్ణయమని అడ్మిషన్ విభాగం డైరెక్టర్ వెంకటరావు స్పష్టం చేశారు. ఇందులో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆ విషయంలో తమ పాత్ర ఉందన్న వాదనలను ఆయన కొట్టిపారేశారు. అడ్మిషన్లకు సంబంధించి విద్యార్ధులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ బృందం సీఎంఐకి సహకరిస్తోందని వెంకటరావు బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. –వెంకటరావు, అడ్మిషన్స్ డైరెక్టర్ -
అసెట్.. అడ్మిషన్లు ఫట్!
‘మీకు సీట్లు కేటాయించాం. మా వెబ్సైట్ నుంచి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోండి’.. తమ ఫోన్లకు వచ్చిన ఈ ఎస్సెమ్మెస్‌ను చూసి ఉత్సాహంగా చాలామంది విద్యార్థులు అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకున్నారు. కానీ అందులో ఏ సీటు కేటాయించారన్న సమాచారం అందలో లేకపోవడంతో హతాశులయ్యారు. మొదటి దశ సీట్లు పొందినవారు ఈ నెల 19 లోగా ఫీజులు కట్టాలని అదే వెబ్సైట్లో ఫీజులు, చేరికల షెడ్యూల్ పెట్టారు. ఆ ప్రకారం దూరప్రాంతాల నుంచి ఉరుకులు, పరుగుల మీద వచ్చిన విద్యార్థులు.. ఫీజులు తీసుకోవడంలేదని తెలిసి ఉసూరుమన్నారు.ఆసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో నెలకొన్న ఈ గందరగోళం ప్రవేశార్థులను అయోమయానికి, ఆందోళనకు దారితీసింది.గత కొన్నేళ్లుగా ఈ ప్రక్రియ నిర్వహస్తున్న సంస్థను కాదని.. ఉన్న పళంగా మరో కొత్త సంస్థకు అప్పగించడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో వర్సిటీ ఉన్నతాధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. – సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే పురాతన, ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయానికి అపకీర్తి తెచ్చే మరో అంకానికి తెరలేచింది. వర్సిటీ పాలకుల నిర్లక్ష్యం, కాసుల కోసం కొందరు పెద్దల ఆరాటం విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ప్రవేశాల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన పెద్దలు చేసిన తప్పిదం పీజీ, ఇంజినీరింగ్ ప్రవేశాల పక్రియను తలకిందలు చేసింది. తెరపైకి బెంగళూరు సంస్థ గత కొన్నేళ్లుగా ఆసెట్, ఆఈఈటీలకు సంబంధించి పరీక్షలతో సహా అన్ని రకాల అన్లైన్ పక్రియలను హైదరాబాద్‌కు చెందిన ఎస్ఎస్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించింది. 2010 నుంచి 2018 వరకు ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించింది. 2019 ఆసెట్ నిర్వహణ బాధ్యతను మాత్రం వర్సిటీ పెద్దలు అనూహ్యంగా ఆ సంస్థ నుంచి తప్పించి బెంగళూరుకు చెందిన క్యాంపస్ మేనేజ్మెంట్ సంస్థకు అప్పజెప్పారు. ఈ వ్యవహారంలో ప్రస్తుత డైరెక్టర్ ఆచార్య నిమ్మా వెంకటరావు ప్రమేయం ఉందని సమాచారం. అడ్మిషన్ల ప్రక్రియలో పెద్దగా అనుభవం లేని ఆ సంస్థ నిర్వహణ లోపాలతో మొత్తం ప్రక్రియనే గందరగోళంలో పడేసింది. తొలిదశ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయి నెల రోజులవుతున్నా నేటికి సీట్లు కేటాయించలేకపోయింది. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డీవోఏ)లో ఏం జరుగుతుందో బయటకు పొక్కకుండా గుంభనం పాటిస్తుండటం అనుమానాలకు ఆస్కారమిస్తోంది. సీట్లు కేటాయింపులో గందరగోళం ఎట్టకేలకు జరిగిన తొలిదశ సీట్లు కేటాయింపు విద్యార్థులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తొలి దశ కౌన్సెలింగ్‌లో పాల్గొన్న విద్యార్థుల పోన్లకు ఆదివారం రాత్రి సంక్షిప్త సందేశాలు అందాయి. అందులోని సూచన మేరకు వెబ్సైట్లోకి వెళ్లి అటాల్మెంట్ ఆర్డర్లు చూసి విద్యార్థులు కంగుతిన్నారు. అందులో సీటు కేటాయించినట్టు గానీ.. లేదని గానీ ఎక్కడా పేర్కొనలేదు. అలాట్మెంట్ ఆర్డరులోకరెంట్ చాయిస్–1, ప్రయారిటీ –ఎక్స్.. ఇలా అర్థం కాని సమాచారం ఉంది. టాప్ ర్యాంకర్లకు సీట్లు ఏవీ..? దీంతో పాటు టాప్ 10 ర్యాంకులొచ్చిన చాలా మందికి వర్సిటీ కళాశాలల్లో కాకుండా ప్రైవేట్ కళాశాల్లో సీట్లు కేటాయించగా.. మరికొందరికి అసలు సీట్లే కేటాయించలేదు. హుమానిటీస్ (15 కోర్సులు), లైఫ్ సైన్స్ (16 కోర్సులు) కోర్సులకు టెస్ట్ రాసి టాప్ ర్యాంకులు సాధించిన చాలా మందికి సీట్లు కేటాయించలేదు. దాంతో సోమవారం వారంతా ఏయూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వీరిలో టాప్ 5, 8, 10, 18, 41 వంటి ర్యాంకులు సాధించినవారు ఉన్నారు. ప్రకటనలు మాయం తొలిదశ సీట్ల కేటాయింపుపై ఏయూ వెబ్సైట్లో రోజుకో ప్రకటన కనిపించింది. 16వ తేదీ రాత్రి తమకొచ్చిన ఫోన్ సందేశాల మేరకు విద్యార్థులు వెబ్సైట్లోకి వెళ్లారు. సీట్లు పొందినవారు 19 లోపు ఫీజులు చెల్లించాలని అందులో ఉండటంతో మంగళవారం ఉదయం నుంచి ఫీజు చెల్లించేందుకు అనేక మంది ప్రయత్నించినా కుదరలేదు. సీట్లు కేటాయింపులో తప్పిదాల నేపథ్యంలో సోమవారంనాడే పలువురు ఏయూకు వచ్చి గొడవ చేయడంతో వెబ్సైట్ నుంచి ఆ వివరాలు తొలగించారు. ప్రస్తుత సీట్లు కేటాయింపును రద్దుచేసి త్వరలోనే మళ్లీ కేటాయిస్తామని ప్రకటించారు. ఈ నేపధ్యంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ ఫీజుల వసూళ్లు నిలిపేశారు. ఇది తెలియక ఫీజు కట్టేదామని వచ్చిన అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన వారికి సాయంత్రం ఆన్లైన్ పేమెంట్ లింక్ ఓపెన్ అవుతుందని మరో అబద్దం చెప్పి పంపించేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం సీట్లు వచ్చిన వారికి అలాగే కొనసాగిస్తారా? లేక మళ్లీ కేటాయిస్తారా?? అన్న సందేహాలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. కొంత గందరగోళం నిజమే: ఏయూ వీసీ ఆసెట్, ఆఈఈటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ, సీట్ల కేటాయింపుతో పాటు అన్ని రకాల అన్లైన్ ప్రక్రియలను ఈసారి బెంగళూరు సంస్థకిచ్చిన మాట నిజమేనని ఏయూ వీసీ నాగేశ్వరరావు అంగీకరించారు. ఈ ప్రక్రియలో సోమవారం కొందర గందరగోళం నెలకొనడం కూడా వాస్తవమేనని అన్నారు. కొంత మంది విద్యార్ధులు తన వద్దకు వచ్చి సమస్య చెప్పడంతో పరిస్థితిని చక్కదిద్దే చర్యలు చేపట్టామని, ఎవరికీ ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన అన్నారు. అవకతవకలపై విచారణ జరపాలి ఆసెట్ సీట్ల కేటాయింపులో గందరగోళం సృష్టించడం దారుణం. మా మేనకోడలు మైక్రోబయాలజీలో సీటు కోసం ఆసెట్ రాసింది. 57వ ర్యాంకు వచ్చింది. బీసీ–డి రిజర్వేషన్ కూడా ఉంది. మైక్రోబయాలజీతో పాటు బాటనీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సులకు కూడా ఆప్షన్స్ పెట్టాం. అయితే ఇప్పటికీ ఎక్కడా సీటు కేటాయించలేదు. అడిగితే ఏవేవో కారణాలు చెబుతున్నారు. దీంతో ప్రవేశాల పక్రియపై అనుమానాలు కలుగుతున్నాయి. ప్రభుత్వం తక్షణం ఇక్కడి అధికారులపై చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దాలని కోరుతున్నాం. – శివరామనాయుడు, విశాఖపట్నం -
బాబుగారూ.. బదులివ్వండి
ఆంధ్ర యూనివర్సిటీకి చెందిన పలువురు మేధావులు, ప్రొఫెసర్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి రాసిన బహిరంగ లేఖ ఇది. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ప్రస్తావిస్తూ సీఎం సూటిగా సమాధానమివ్వాలని వారు కోరారు. లేఖలోని ప్రధానాంశాలు... గౌరవనీయులైన ముఖ్యమంత్రివర్యులకు బాధ్యత గల దేశ పౌరులుగా, అయిదు సంవత్సరాలపాటు మీ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ఈ లేఖ రాస్తున్నాం. 1. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు గనుక దానికి సంబంధించిన సమస్త వ్యయమూ కేంద్రమే భరించవలసి ఉంది. కానీ బీజేపీతో మీకున్న స్నేహాన్ని ఆసరా చేసుకుని ‘దాన్ని మేమే కడతాం. అందుకయ్యే డబ్బు మాత్రం మంజూరు చేయండి’ అని కోరితే, కేంద్రం అంగీకరించి దాన్ని మీ చేతుల్లో పెట్టింది. ప్రాజెక్టు లావాదేవీలకు సంబంధించి స్పెషల్ పర్పస్ వెహికల్(ఎస్పీవీ) ఖాతా తెరవమని సూచించింది. కానీ అయి దేళ్లు కావస్తున్నా మీరు ఆ ఖాతా ఎందుకు తెరవలేదో చెప్పగలరా? 2. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ‘జాబ్ కావాలంటే బాబు రావాలి’ అని మీరు ప్రచారం చేశారు. మీరు సీఎంగా బాధ్యతలు స్వీకరించేనాటికి రాష్ట్రంలో 2.40 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాధన్ కమిటీకి ఆర్థిక శాఖ ఇచ్చిన నివేదికలో తెలియజేశారు. ఈరోజు వరకూ ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మీరు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌ను 9 ఏళ్లు పాలించారు. అప్పుడు మీరు ఒక్క ఉద్యోగాన్నీ భర్తీ చేయలేకపోయారు. మీ అనంతరం వచ్చిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తన 5 ఏళ్ల 6 నెలల పదవీ కాలంలో అన్ని విశ్వవిద్యాలయా ల్లోనూ అవసరమైన ఉద్యోగాలన్నీ భర్తీ చేశారు. ఆ తర్వాత వచ్చిన సీఎంలు ఈ ఉద్యోగాల భర్తీ గురించి పట్టించుకోలేదు. మీ హయాంలో కూడా అదే పరిస్థితి. విశ్వవిద్యాలయాల్లో కనీసం ఒక్క ఉద్యోగమైనా కొత్తగా ఇవ్వలేదు. ఎందరో డాక్టరేట్లు చేసి నిరుద్యోగులుగా మిగిలి పోయారు. ఉద్యోగాల భర్తీ ఎందుకు చేయలేదో వివరణనిస్తారా? 3. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం కేంద్రం ఇచ్చిన రూ. 3,500 కోట్లకు మీరు ఎన్ని శాశ్వత భవనాలు నిర్మించారో చెప్పగలరా? మన రాష్ట్రంలో ఎందరో నిపుణులైన ఇంజనీర్లు, అపార అనుభవం గల కాంట్రాక్టర్లు ఉండగా రాజధాని నిర్మాణం కోసం జపాన్, సింగపూర్, బ్రిటన్ తదితర దేశాలవారి సలహాలు, సినీ దర్శకుడు రాజమౌళి వంటి వారి సలహాలు మీకు అవసరమా? 4. లక్షలమంది విద్యార్థినీవిద్యార్థులకు ఇవ్వవలసిన ఫీజు రీయింబ ర్స్మెంట్ బకాయిలకు, స్కాలర్ షిప్‌లకు నిధులు మంజూరు చేయ కుండా వాటిని వేరే ప్రయోజనాలకు మళ్లించారు. ఇంతవరకూ కేవలం మూడు నెలలకు మాత్రమే మంజూరు చేశారు. ఈ బకాయిలు చెల్లించక పోవడం వల్ల హాల్ టికెట్స్ తీసుకుంటున్న సందర్భంలో, పరీక్షలు రాస్తున్న సందర్భంలో పేద విద్యార్థులు ఎన్ని బాధలనుభవించారో మీకు తెలుసా? నిధుల మళ్లింపునకు మీకున్న అధికారం ఏమిటి? 5. ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించాక దాన్ని తీసుకు రావలసిన బాధ్యత మీది కాదా? ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ మేలని అసెంబ్లీలో ప్రకటించి, దానికి ధన్యవాదాల తీర్మానం చేయిం చింది మీరు కాదా? ప్రత్యేక హోదా కోసం ఉద్యమించిన విద్యార్థుల పైనా, యువతపైనా కేసులు పెట్టించలేదా? ఈ సమస్యపై సాగుతున్న ఉద్యమంలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డిగారిని అరెస్టు చేయించలేదా? ఇప్పుడు ఏ మొహం పెట్టు కుని కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ కోట్ల రూపాయలు దుబారా చేసి ధర్మ పోరాట దీక్షలు చేశారు? 6. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలైన రిజర్వ్‌బ్యాంక్, ఎల్ఐసీ వారికి ఎకరం రూ. 4 కోట్ల చొప్పున అమ్మారు. అదే చోట ప్రైవేటు విద్యా సంస్థలకు, ప్రైవేటు ఆసుపత్రి నిర్మాణానికి ఎకరం రూ. 50 లక్షలు చొప్పున మాత్రమే విక్రయించారు. మిగిలిన రూ. 3.5 కోట్లు ఎవరి జేబు ల్లోకి వెళ్లాయి? వివరిస్తారా? 7. వివిధ రంగాల్లోని పథకాలకు కేంద్రం విడుదల చేసే గ్రాంట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు యుటిలైజేషన్ సర్టిఫి కేట్(యూసీ)లు కేంద్రానికి పంపవలసి ఉంటుంది. ఆ విషయంలో జాప్యం చేయటం వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి రావలసిన సుమారు రూ. 7,000 కోట్లు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని మన సచివాల యంలో ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నతాధికారుల సమక్షంలో ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్ తెలియజేశారు. నలభయ్యేళ్ల రాజకీయ అనుభవం గల మీరు సక్రమంగా యూసీలు ఎందుకు పంపలేకపోయారో వివరిస్తారా? 8. రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో నిష్ణాతులైన అధికారులు న్నారు. దేశంలోనూ భిన్న రంగాల నిపుణులు ఉన్నారు. వీరిని విస్మరించి పైపై మెరుగుల కోసం, కన్సల్టెన్సీల కోసం ఈ అయిదేళ్లలో రూ. 500 కోట్లు ధారపోశారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా చదరపు అడుగు నిర్మాణా నికి రూ.10,000 చెల్లించారు. ఈ విషయంలో వివరణనివ్వగలరా? 9. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు పేరుతో రాజధాని భూముల్ని కారు చౌకగా సింగపూర్ కంపెనీలకు స్విస్ చాలెంజ్ ద్వారా కట్టబెట్టారు. దీని కింద 1,691 ఎకరాలను ఎకరం రూ. 12 లక్షల చొప్పున ఇచ్చారు. నిబం ధనల ప్రకారం రూ. 6,764 కోట్ల విలువైన ఈ భూమినంతటినీ ఈ విధంగా కేవలం రూ. 243 కోట్లకు అమ్మారు. రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరం రూ. 12 లక్షలకు వస్తుందా? ప్రభుత్వ సంస్థ లకు రూ. 4 కోట్లకు అమ్మిన మీరు ఇలా ఎందుకు చేశారు? 10. రాజధాని ప్రాంతం ఎంపికపై శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను పక్కనబెట్టి మీకు, మీవారికి అనుకూలమైన ప్రాంతంలో రాజ ధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుని, ఆ విషయాన్ని మీ అనుయా యులకు ముందుగా తెలిపి వాళ్లతో కారుచౌకగా భూములు కొనిపిం చారు. ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ అవుతుంది. ఆ రకంగా ఇది భారీ కుంభ కోణం. రాజధాని చుట్టూ ఎవరెవరి భూములు రిజస్టర్ అయినాయో దర్యాప్తు చేయిస్తే దిగ్భ్రాంతికరమైన నిజాలు వెల్లడవుతాయి. ఒక ముఖ్య మంత్రి స్థాయి నాయకుడు చేయాల్సిన పనేనా ఇది? 11. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా జరిగిన సభలో ఓటుకు రూ. 5 వేలు ఇచ్చే స్థోమత ఉందని మీరు అన్నారు. ఇలా మాట్లాడటం ఒక సీఎంగా మీకు తగునో లేదో మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. కానీ మీరు దేశంలోకెల్లా అత్యంత ధనిక సీఎం అని తెహల్కా చెప్పిన మాట వాస్తవమేనని ధ్రువపడింది. 12. విశ్వవిద్యాలయాల్లో కాంట్రాక్టు బోధనా సిబ్బంది మినిమం టైం స్కేల్ ప్రకటిస్తూ ఫిబ్రవరి నెలలో జీవో నం. 24 జారీచేశారు. దానికి ఇప్పటికీ అతీ గతీ లేకుండా పోయింది. ఈ తరహా ఉద్యోగులు 14 విశ్వ విద్యాలయాల్లో 1,860మంది ఎన్నో ఏళ్లుగా అరకొర జీతాలతో గడుపు తున్నారు. వీళ్ల దయనీయ స్థితి మీకు పట్టదా? 13. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు పంపిన జాబితాపై పక్క రాష్ట్ర సీఎం నెలరోజుల లోపులో నిర్ణయం తీసుకుని పంపిస్తే, మీరు 10 నెలలపాటు ఎందుకు జాప్యం చేశారు? ఆ జాబితాలో ఒక ఎస్సీ, ముగ్గురు బీసీలు, ఇద్దరు ఓసీ న్యాయవాదులు ఉన్నారని, మీ సామాజిక వర్గానికి చెందినవారు ఎవరూ లేరనే కదా ఇంతవరకూ ఆ జాబితాను పంపలేదు! 14. 2014లో మీ పార్టీ మేనిఫెస్టోలో న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి ఇచ్చిన ఏ హామీనీ మీరు అమలు చేయలేదని ఏపీ బీసీ అడ్వొకేట్స్ అసోసియేషన్ అధ్యక్షులు పల్లపు క్రిష్ణ ఆరోపించారు. జీపీ, ఏజీపీ, పీపీ, ఏపీపీ తదితర నియామకాల్లో చెప్పిన ప్రకారం రిజర్వేషన్ విధానాన్ని అమలు చేయకుండా ప్రతిచోటా మీ సామాజిక వర్గానికి చెందినవారినే ఆ పోస్టుల్లో నింపారని కూడా అన్నారు. వివరించగలరా! 15. మీ గ్రామం నారావారి పల్లెకే చెందిన యువ పారిశ్రామికవేత్త నవీన్ నాయుడు మీ పాలనలో పారదర్శకత శూన్యం, అది ఉపన్యాసా లకే పరిమితమని ఆరోపించారు. ఉత్తరాదివారికే పనులు కట్టబెట్టి స్థాని కులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అది నిజమా కాదా? 16. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక వంటివి కేంద్ర నిధులకు నోడల్ అధికారులను నియమించుకుని ప్రతి పైసా సద్వినియోగం చేసుకుం టుండగా మన ప్రభుత్వం ఆ నిధులను వెనక్కి పంపే స్థితి నెలకొంది. ఇలా రూ. 250 కోట్లు మీరు సరెండర్ చేయాల్సి రావడం నిజమేనా? 17. మీ అవినీతి బాగోతంపై 19 కేసులుంటే మీరు స్టేలు తెచ్చు కున్న సంగతి అందరికీ తెలుసు. అలాగే ఓటుకు కోట్లు కేసులో మీరు ఆడియో, వీడియో ఆధారాలతో దొరికారు. ఈ కేసులేవీ విచారణకు రాకుండా మేనేజ్ చేస్తున్నారు. అవునా కాదా? 18. అమరావతి డెవలప్మెంట్ పార్టనర్(ఏడీపీ) సమావేశాల నుంచి నన్ను తప్పించండి అని ఆర్థిక శాఖ కార్యదర్శి ఎందుకు లేఖ రాయాల్సివచ్చింది? రాజధాని స్టార్టప్ ఏరియా పేరుతో సింగపూర్ కంపెనీలకు స్విస్ చాలెంజ్కింద 1,691 ఎకరాలు అప్పగించి, అందులో పాల్గొన్న సంస్థలకు కాక సింగపూర్, అమరావతి హోల్డింగ్ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి దానితో రాయితీల వాటాల ఒప్పందాలు చేసు కున్నారు. దీన్ని ఆర్థిక శాఖ కార్యదర్శి రవిచంద్ర తప్పుబట్టినా మీరు ఖాతరు చేయలేదు. ఈ విషయంలో ప్రజలకు ఏం చెబుతారు? 19. ఈమధ్య ఏపీ ప్రభుత్వ మాజీ కార్యదర్శి అజేయ కల్లాం ఒక సభలో మాట్లాడుతూ రాజధాని శంకుస్థాపనలు, శిలాఫలకాలకు రూ. 350 కోట్లు ఖర్చుపెట్టారన్నారు. మీ అనుభవం అవినీతిని పెంచిపోషించ డానికి, వ్యవస్థల నిర్వీర్యానికి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టడానికి తప్ప ఎందుకూ ఉపయోగపడలేదని చెప్పారు. మీ వివరణ ఏమిటి? 20. ఐఐఎం, బెంగళూరులోని ఏడీఆర్‌లు కలిసి దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో భాగంగా ఏపీ ప్రజలను సర్వే చేసినప్పుడు అక్కడి ఓటర్లు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన అంశాలు.. మెరుగైన ఉపాధి/ ఉద్యో గావకాశాలు, తాగునీరు, మెరుగైన అసుపత్రులు/ప్రాథమిక ఆరోగ్యకేం ద్రాలు అని చెప్పారు. ఈ 3 అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అధ్వా నంగా ఉన్నదని సర్వే పేర్కొంది. ఆ 3 అంశాల్లో కనీస సగటును కూడా ప్రభుత్వం అందుకోలేకపోయింది. ఎందుకో ప్రజలకు చెప్పగలరా?} 21. ప్రత్యేక ప్యాకేజీ కావాలంటూ మీరు కేంద్రానికి రాసిన లేఖను కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ బయటపెట్టారు. ఎన్డీఏ నుంచి విడి పోయిన అనంతరం కూడా ఈ విషయంలో మరో లేఖ రాశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం అన్యాయం చేసిందని చెబుతూనే ఇలా ఎందుకు చేశారో చెబుతారా? కేంద్ర మంత్రి రాష్ట్రానికి చేసిన సాయంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలూ చెప్పారు. వాటికి మీరు జవాబు ఎందుకివ్వలేకపోయారు? 22. బీసీలకు మీరు న్యాయం చేయలేదని, పైగా బీసీల ఆత్మగౌ రవం దెబ్బతినే విధంగా బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రా నికి లేఖ రాసిన సంగతిని జస్టిస్ ఈశ్వరయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. క్రిష్ణయ్య పలు సందర్భాల్లో చెప్పారు. మీరు మోదీని అనేకసార్లు కలిసినా చట్టసభల్లో బీసీల కోటా గురించి అడగలే దని, ఆ విషయంలో పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టించిన ఏకైక నాయకుడు జగన్ గారేనని కూడా అన్నారు. దీనిపై మీ స్పందనేమిటి? 23. రిటైర్డ్ ఉన్నతాధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజేయ కల్లాం, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి. లక్ష్మారెడ్డి తదితరులు పలు అంశాల్లో గణాంకాలతోసహా అవినీతి గురించి వెల్లడించారు. వాటిపై వివరణనిచ్చే ధైర్యం, దమ్ము మీకుందా? 24. జీవో నం. 5కు భిన్నంగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌వారు జనరల్ కేటగిరీల్లో రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు అవకాశం లేకుండా చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో గోపాలకృష్ణ ద్వివేదీ ఈ విషయంలో ఒక సర్క్యులర్ పంపారు. దాని ప్రకారం రిజ ర్వుడు అభ్యర్థులు (ఎస్సీ, ఎస్టీ,బీసీ, దివ్యాంగులు) జనరల్ కేటగిరీలో పోటీపడే అవకాశం ఉంది. దీన్ని కూడా ఏపీపీఎస్సీ చైర్మన్ పక్కన బెట్టారు. ఇందువల్ల విద్యా, ఉద్యోగ రంగాల్లో ఆ వర్గాలవారు సీట్లు, ఉద్యోగాలు సాధించే అవకాశాన్ని కోల్పోయారు. ఈ విషయంలో ఏం చెబుతారు? ఎంతో అనుభవం ఉన్నవారని, మీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని భావించి మిమ్మల్ని సీఎంగా చేస్తే మీ వల్ల రాష్ట్రానికి కలిగిన నష్టం, అన్యాయం అంతా ఇంతా కాదు. మీపై వచ్చిన అభియోగాలపై వివరణనిచ్చి ఓట్లడిగితే న్యాయంగా, ధర్మంగా ఉంటుంది. మీరు సంజాయిషీ ఇవ్వనిపక్షంలో మీ పాలన అంతా మోసం, దగా, అక్రమం అని అనుకోవాల్సి వస్తుంది. ఇంటలెక్చ్యువల్స్ ఫోరం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖపట్నం ప్రొ‘‘ ఎల్. వేణుగోపాలరెడ్డి, మాజీ వైస్ ఛాన్సలర్, ప్రొ‘‘ ఈ. విశ్వనాథరెడ్డి, ప్రొ‘‘ ఆర్. నాగభూషణరావు, ప్రొ‘‘ నల్లా బాబయ్య, డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యులు, ప్రొ‘‘ డి.బి.ఆర్.ఎన్.కె. బెనర్జీ, ప్రొ‘‘ డి. ప్రభాకరరావు, ప్రొ‘‘ డి. సువర్ణరాజు, ప్రొ‘‘ కె.తిమ్మారెడ్డి, ప్రొ‘‘ పి. తారాకుమారి -
ప్రధాని సభకే అనుమతివ్వరా..?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీ(ఏయూ) మైదానాన్ని సొంత అవసరాలకు ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటున్న టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు మాత్రం అనుమతి ఇవ్వడం లేదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈ నెల 27న విశాఖపట్నంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని ఏయూ గ్రౌండ్స్‌లో బహిరంగసభ నిర్వహించాలని భావించారు. ఏయూ ఉన్నతాధికారులను సంప్రదించగా, ప్రధాని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని తెగేసి చెప్పారని బీజేపీ నేతలు అంటున్నారు. ప్రధాన మంత్రి సభకు ఈ మైదానాన్ని ఇవ్వొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లున్నాయని, కావాలంటే ముఖ్యమంత్రిని అడగాలని అధికారులు చెబుతున్నారని పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే యూజీసీ నిధులతోనే నడుస్తున్న ఏయూలో ప్రధాని సభకు అనుమతి నిరాకరించడంపై బీజేపీ నేతలు రగిలిపోతున్నారు. ఏయూ మైదానం టీడీపీ సర్కారు సొంత జాగీరా? అని మండిపడుతున్నారు. టీడీపీ సభలకు వాడుకున్నారుగా? ప్రధానమంత్రి సభకు అనుమతి నిరాకరించిన ఏయూ అధికారులు గతంలో టీడీపీ మహానాడు మొదలు పార్టీ సభలకు అడ్డగోలుగా అనుమతులిచ్చేశారని బీజేపీ నేతలు గుర్తుచేస్తున్నారు. 2017 మే నెలలో టీడీపీ మూడు రోజులపాటు ఏయూ గ్రౌండ్స్‌లో మహానాడు సభలు నిర్వహించింది. 2018 మేలో ఇదే ఏయూ గ్రౌండ్స్‌లో ధర్మపోరాట సభ పేరిట తెలుగుదేశం పార్టీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ రెండు సందర్భాల్లోనూ ఏయూను పూర్తిగా టీడీపీ జెండాలతో పసుపుమయం చేసేశారని బీజేపీ నాయకులు చెబుతున్నారు. గతేడాది ఆగస్టులో జ్ఞానభేరి సదస్సు, గత నెలలో పసుపు కుంకుమ పంపిణీ పేరిట టీడీపీ నేతలు డ్వాక్రా మహిళలతో భారీ సభ నిర్వహించారని గుర్తుచేస్తున్నారు. అధికార టీడీపీ నేతల కుమారుల వివాహాలు మొదలు.. గతేడాది మంత్రి లోకేష్‌బాబు పుట్టిన రోజు వేడుకలు కూడా ఏయూలోనే అట్టహాసంగా నిర్వహించారని అంటున్నారు. కుదరదని చెప్పాం... ప్రధానమంత్రి సభకు అనుమతించాలని బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అడిగారు. రాజకీయ పరమైన సభ కాబట్టి కుదరదని చెప్పా. ఒకవేళ ప్రభుత్వం అనుమతిస్తే మాకు అభ్యంతరం లేదు. – నాగేశ్వరరావు, ఏయూ వైస్ చాన్సలర్ పెళ్లిళ్లకు ఇస్తారు.. ప్రధాని సభకివ్వరా? తెలుగుదేశం నాయకులు ఏయూను ఇష్టారాజ్యంగా వాడేస్తున్నారు. టీడీపీ కార్యక్రమాలకే కాదు.. ఆ పార్టీల నేతల వివాహాలకు కూడా గ్రౌండ్స్ వాడుతున్నారు. కానీ, ప్రధానమంత్రి బహిరంగ సభకు అనుమతి ఇవ్వలేమని చెప్పడం దారుణం. వీసీని అనుమతి అడిగితే కుదరదన్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశా. కేవలం ప్రధాని భద్రతా కారణాల దృష్ట్యానే ఏయూ గ్రౌండ్స్ సరైందని భావించి అడుగుతున్నాం. – విష్ణుకుమార్ రాజు, బీజేపీ శాసనసభాపక్ష నేత -
ప్రాక్టీస్ కోసం.. ఇంటర్వ్యూ బడ్డీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్! ఇదో నానుడే కాదు. వ్యాపార సూత్రం కూడా. ఇంటర్వ్యూబడ్డీ చేసేదిదే!!. దేశ, విదేశాల్లోని బహుళ జాతి కంపెనీల వైస్ ప్రెసిడెంట్స్, హెచ్ఆర్ ప్రతినిధులతో పాటూ రిటైర్డ్ ఐఏఎస్ వంటి ఉన్నతాధికారులతో ఒప్పందం చేసుకుంది. మన దేశంతో పాటూ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా దేశాల్లో మాక్ ఇంటర్వ్యూ సేవలందిస్తున్న ఇంటర్వ్యూ బడ్డీ గురించి మరిన్ని వివరాలు ఫౌండర్ ఉజ్వల్ సూరంపల్లి ‘స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు. ‘‘మాది విశాఖపట్నం. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తయ్యాక.. జర్మనీలో మాస్టర్స్ కోసం వెళ్లా. చదువుకుంటూ జాబ్స్ కోసం ప్రయత్నించా. ప్రాక్టీస్ లేకపోవటంతో ఒకటిరెండు ఇంటర్వ్యూల్లో ఫెయిలయ్యా. అప్పుడే అనిపించింది. క్రీడలకు ఉన్నట్టే ఇంటర్వ్యూలకూ ప్రత్యక్షంగా ప్రాక్టీస్ ఉంటే బాగుండునని. అంతే! చదువును మధ్యలోనే ఆపేసి.. విశాఖపట్నం కేంద్రంగా జూలై 2017లో ఇంటర్వ్యూబడ్డీ.ఇన్ను ప్రారంభించాం. విద్యార్థులు, కంపెనీలకూ ఇంటర్వ్యూలు.. విద్యార్హతలు, ఉద్యోగ ఎంపికలతో అకౌంట్‌ను నమోదు చేసుకున్నాక.. హెచ్ఆర్, టెక్నికల్, స్పెషలైజేషన్ విభాగాల్లో కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు ఇంటర్వ్యూ మొదలువుతుంది. ఇంటర్వ్యూబడ్డీతో ప్రెషర్స్‌కు ఇంటర్వ్యూలంటే ఉండే తొందరపాటు, ఒత్తిడి తగ్గుతుంది. విశ్వాసం పెరుగుతుంది. ప్రొఫైల్ ప్రిపరేషన్, వెబ్ ఆర్టికల్స్, ఇంటర్వ్యూ వీడియోలతో పాటూ నైపుణ్య ప్రదర్శన, బలహీనతలతో కూడిన సమగ్ర నివేదికను అందిస్తాం. ఒక్క సెషన్ ప్రారంభ ధర రూ.1,099. ఇటీవలే కంపెనీల కోసం ప్రత్యేకంగా ‘ఇంటర్వ్యూ బడ్డీ వైట్ లేబుల్’ అనే వేదికను ప్రారంభించాం. ఇది.. కంపెనీలకు ఇంటర్వ్యూలను, అభ్యర్థుల జాబితా సేవలను అందిస్తుంది. ప్రస్తుతం అప్రాటిక్స్ వంటి మూడు కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాం. త్వరలోనే మరో 5 కంపెనీలను జోడించనున్నాం. అమెరికా, బ్రెజిల్‌లోనూ యూజర్లు.. 15 వేల మంది రిజిస్టర్ యూజర్లున్నారు. మన దేశంతో పాటూ అమెరికా, మెక్సికో, అర్జెంటీనా నుంచి కూడా యూజర్లున్నారు. ఇప్పటివరకు 5 వేల ఇంటర్వ్యూలను నిర్వహించాం. ప్రస్తుతం నెలకు 200 వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాం. ఐటీ, ఇంజనీరింగ్, హ్యుమానిటీస్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి అన్ని రంగాల్లో మాక్ ఇంటర్వ్యూలుంటాయి. ఆయా రంగాల్లో కనీసం పదేళ్ల అనుభవం ఉన్న ఇండియా, అమెరికాలకు చెందిన 220 మంది ఇంటర్వ్యూ ప్యానెలిస్ట్‌లతో ఒప్పందం చేసుకున్నాం. వీరికి ప్రతి ఇంటర్వ్యూ మీద 25–75 శాతం వరకు కమీషన్ ఉంటుంది. వర్సిటీలు, ఐఐటీ, ఐఐఎంలతో ఒప్పందం గతేడాది రూ.30 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. వచ్చే ఐదేళ్లలో 20 కోట్ల ఆదాయాన్ని, 15 లక్షల ఇంటర్వ్యూలను లకి‡్ష్యంచాం. జనవరి నుంచి ఉత్తర అమెరికాలో సేవలను ప్రారంభిస్తాం. స్థానికంగా ఉన్న పలు వర్సిటీల్లోని విద్యార్థులకు ప్రాక్టీస్ క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాం. మన దేశంలోని ఐఐటీ–రూర్కీ, ఎఫ్ఎంఎస్–ఢిల్లీ, ఐఐఎం–రూటక్, ఢిల్లీ–అంబేడ్కర్ యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకోనున్నాం. రూ.15 కోట్ల నిధుల సమీకరణ ప్రస్తుతం 9 మంది ఉద్యోగులున్నారు. ఇటీవలే వైజాగ్‌కు చెందిన ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ ఆల్కోవ్ పార్టనర్స్ రూ.75 లక్షల పెట్టుబడి పెట్టింది. జనవరిలో సీడ్ ఫండింగ్‌లో భాగంగా యూపీకి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ నుంచి రూ.5 కోట్ల నిధులను సమీకరించనున్నాం. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఫిన్‌ల్యాండ్‌కు చెందిన ఓ ఇన్వెస్టర్ నుంచి రూ.15 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదుర్చుకున్నాం’’ అని ఉజ్వల్ వివరించారు. -
విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్రిక్తత
-
ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్రిక్తత
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యూనివర్సిటీ హాస్టళ్లను మూసివేయడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. పలు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ విడుదలైన నేపథ్యంలో హాస్టళ్లను కొనసాగించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. యూనివర్సిటీ అధికారులు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. యూనివర్సిటీలో పెద్ద ఎత్తున బైఠాయించిన విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు యూనివర్సిటీకి చేరుకున్నారు. విద్యార్థులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. -
ఈ క్షణాలు తీపి గుర్తులు: రతన్ టాటా
సాక్షి, విశాఖపట్నం : విశ్వవిద్యాలయాలకు పరిశ్రమలతో ఇంటరాక్షన్ పెరగాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అభిలాషించారు. అంతేకాకుండా యూనివర్సిటీల్లో పరిశోధనలు విస్త్రతంగా జరగాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తన జీవితంలో ఈ క్షణాలు తీపిగుర్తులుగా మిగిలిపోతాయన్నారు. విశాఖపట్నం క్లీన్ సిటీగా అభివర్ణించారు. ఈ నగరంపైపై ఇప్పటివరకూ దృష్టి సారించలేదని.. ఇకపై పెడతామన్నారు. విశాఖలో టాటా గ్రూప్ ఏ రంగంలో పరిశ్రమ ఏర్పాటు చేయాలనే అంశంపై ముంబైలో చర్చించి ఓ నిర్ణయానికి వస్తామని తెలిపారు. ఇక ఇదే సమ్మేళనంలో పూర్వ విద్యార్థిగా పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ.. నలభై ఏళ్ల తర్వాత ఈ విశ్వవిద్యాలయానికి పూర్వ విద్యార్థిగా రావటం చాలా ఆనందంగా ఉందన్నారు. -
ఆ గట్టునొకరు ఈగట్టునొకరు
ఇద్దరూ ఒక పార్టీకి చెందినవారే.. ప్రజాప్రతినిధులే.. తమ పరిధిలోని ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్న వారే..కానీ ఎవరికివారు నాకెందుకులే.. అన్న భావనతో నిర్లిప్తత వహిస్తున్నారు. కారణం.. వారిద్దరికీ పొసగకపోవడమే.. ఆ ఇద్దరిలో ఒకరు మంత్రి గంటా శ్రీనివాసరావు కాగా.. రెండోవారు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు.వారిద్దరి మధ్య విభేదాలకు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోవడానికి లింకేమిటి? అన్న సందేహం రావచ్చు..లింకు ఉంది.. ఎలా అంటే.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత తదితర సమస్యల పరిష్కారం కోరుతూ గత కొద్దిరోజులుగా ఉద్యమిస్తున్నవారు ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు.. ప్రతిష్టాత్మమైన ఆ విశ్వవిద్యాలయ ప్రాంగణం వెలగపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తూర్పు నియోజకవర్గంలోనే ఉంది. ఇక అదే నియోజకవర్గ పరిధిలో నివాసం ఉంటున్న గంటా శ్రీనివాసరావు స్వయంగా విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న మంత్రి..ఒకే పార్టీకి చెందిన ఈ ఇద్దరు కలిసి ప్రయత్నిస్తే.. ఏయూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడం పెద్ద విషయం కాదు.. అయినా వారిద్దరి మధ్య విభేదాల కారణంగా అది సాధ్యం కాదు.. పోనీ.. ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారా అంటే.. అదీ లేదు.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తే ఆ క్రెడిట్ గంటాకు వెళ్లిపోతుందేమోనని వెలగపూడి.. మంత్రిగా తాను చొరవ చూపితే.. ఆ పేరు వెలగపూడి కొట్టేస్తాడేమోనని గంటా.. ఎవరికి వారు కురచబుద్ధులు ప్రదర్శిస్తుండటంతో ఉద్యమపథంలో ఉన్న ఏయూ ఉద్యోగులు బలవుతున్నారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న 28 రోజుల ఉద్యోగులు, టైమ్‌స్కేల్ సిబ్బంది గత వారం రోజులుగా ఉద్యమిస్తున్నారు. 28 రోజుల ఉద్యోగులకు టైంస్కేల్ కల్పించాలని, టైంస్కేల్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు నెలకు రూ.4 నుంచి 8 వేల వరకు, 28 రోజుల ఉద్యోగులకు నెలకు రూ.12,800, టైంస్కేల్ ఉద్యోగులకు రూ.18వేల నుంచి రూ.23 వేల వరకు వేతనంగా వర్సిటీ చెల్లిస్తోంది. ఉద్యోగులకు రూ 12,600 కనీస వేతనం చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ వర్సిటీ దీన్ని విస్మరించి తక్కువ వేతనాలు చెల్లిస్తోంది. ఉద్యోగుల్లో అధికులు ‘తూర్పు’వాసులే ప్రస్తుతం ఆందోళన చేస్తున్న ఉద్యోగుల్లో అధికశాతం మంది తూర్పు నియోజకవర్గం పరిధిలోనే నివాసం ఉంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును ఎన్నోమార్లు కలిసి తమ సమస్య పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. కానీ ఇప్పటి వరకు ఆయన పట్టించుకోలేదు. గత వారం రోజుల్లో రెండుసార్లు మొక్కుబడిగా దీక్షా శిబిరం వద్దకు వచ్చి వెళ్ళారే గానీ సమస్యల పరిష్కారం దిశగా కనీస యత్నాలు మొదలుపెట్టలేదు. సంబంధిత మంత్రి గంటాతో చర్చిస్తాను అనే మాట కూడా ఆయన నోట వెంట రాలేదు. సమస్యలు పరిష్కారమైతే ఆ క్రిడిట్ మంత్రి గంటాకు వస్తుందనే వెలగపూడి పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం ఆందోళనకారుల నుంచే వ్యక్తమవుతోంది. ఇక మంత్రి గంటా గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఇప్పటివరకు ఆయన వర్సిటీ ఉద్యోగుల గోడు వినే ప్రయత్నమే చేయలేదు. వర్సిటీలోని దీక్షా శిబిరానికి రాకపోయినా, జేఏసీ సభ్యులతో కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు. మంత్రి పిలిస్తే చర్చలకు వెళ్ళేందుకు తాము సిద్ధమని జేఏసీ సభ్యులు ప్రకటించినా గంటా నుంచి పిలుపు రాకపోవడం ఉద్యోగ సంఘాల నేతలను విస్మయ పరుస్తోంది. ఇక గత ఆదివారం వర్సిటీలో జరిగిన పూర్వవిద్యార్థుల సదస్సులోనూ, కాంట్రాక్ట్ అధ్యాపకులు చేసిన సత్కార కార్యక్రమాల్లో పాల్గొన్న గంటా పక్కనే అరకొర జీతాలతో ఉద్యమం చేస్తున్న బోధనేతర ఉద్యోగులను పట్టించుకోకపోవడం గమనార్హం. ఉద్యోగుల గోడు పట్టని వీసీ, రిజిస్ట్రార్ ఉద్యోగులు వారం రోజులుగా దీక్షలు కొనసాగిస్తున్నా వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్లు ఇప్పటివరకు దీక్షా శిబిరం వైపు కన్నెత్తి చూడలేదు. వారిరువురే కాదు.. ఉన్నతాధికారులు కూడా దీక్ష శిబిరం జోలికి పోలేదు. వర్సిటీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులకు లైజన్ అధికారులు ఉంటారు. వీరు ఉద్యోగుల సమస్యలు తెలుసుకుని అధికారులకు వివరిస్తుంటారు. వారు సైతం బోధనేతర ఉద్యోగుల శిబిరానికి రాలేదు. దీంతో అధికారుల వైఖరిపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆచార్య వేణుగోపాలరెడ్డి వీసీగా ఉన్న సమయంలో పాలక మండలి నిర్ణయంతో వందలాది మంది ఉద్యోగులకు 28 రోజులు, టైంస్కేల్ వర్తింప చేశారు. ప్రస్తుత పాలకులు ఈ దిశగా ఆలోచన చేయకుండా కుంటిసాకులు చెబుతున్నారని మండిపడుతున్నారు. కనీసం బుధవారం జరిగే పాలక మండలి సమావేశంలోనైనా తమ సమస్యలను చర్చించి పరిష్కారదిశగా ప్రకటన చేస్తారేమోనని ఉద్యోగులు భావిస్తున్నారు. లేని పక్షంలో తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెబుతున్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మెకు వెళతామని ఇప్పటికే ఉద్యోగులు నోటీసు ఇచ్చారు. ఈ నెల 10న పూర్వవిద్యార్థుల సమావేశం, 19న స్నాతకోత్సవం ఉన్న నేపధ్యంలో వర్సిటీ పాలకులు, ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. దీక్షా శిబిరానికి నేడు విజయసాయిరెడ్డి ఏయూ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బుధవారం సందర్శించి సంఘీభావం తెలపనున్నారు. -
ప్రొఫెసర్లకు భరోసా కల్పించిన వైఎస్ జగన్
-
మరో దుబారా ‘భేరి’
ధర్మపోరాట దీక్షలు, టీడీపీ సమావేశాలతో ఇప్పటికే కోట్లలో పడిన చిల్లును పూడ్చుకోలేక ఆంధ్ర విశ్వవిద్యాలయం విలవిల్లాడుతోంది.ఇవేమీ పట్టని సర్కారు.. జ్ఞానభేరి పేరిట మరో దుబారా పర్వానికి తెరతీసింది. సొంత డబ్బా వాయించుకునేందుకు చంద్రబాబు సర్కారు నిర్వహిస్తున్న ఈ తంతుకు అయ్యే వ్యయాన్ని ఆయా వర్సిటీలే భరించాలని ఇప్పటికే స్పష్టం చేసింది.. దాంతో ఈ ఆర్థిక భారాన్ని ఏయూ నెత్తికెత్తుకోక తప్పలేదు.. ఈ భారంలో కొంత భరించమని తన పరిధిలోని కళాశాలలను ఆదేశించింది.సొంత ప్రచార డబ్బాలో వందలు, వేల కోట్లు పోసేస్తున్న సర్కారు పెద్దలు.. విశ్వవిద్యాలయాలనూ వదలడం లేదు.. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గురువారం నిర్వహించనున్న జ్ఞానభేరికి అక్షరాలా కోటిన్నర రూపాయల చేతిచమురు వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని గంటలపాటు జరిగే కార్యక్రమానికి ఇంత భారీ ఖర్చా అన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇప్పటికే ఆర్ధిక భారంతో కొట్టుమిట్టాడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. కోటిన్నర భారం మోపింది. ఏయూలో గురువారం విద్యార్ధులతో జ్ఞానభేరి పేరిట చంద్రబాబు ఒక రోజు ము ఖాముఖీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పదివేలమంది విద్యార్థులు వచ్చేలా అట్టహాసంగా ఏర్పా ట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దానికయ్యే ఖర్చులు మాత్రం ఏయూనే భరించాలని స్పష్టం చేశారు. ఇందుకు కోటి ఖర్చవతుందని లెక్క వేసిన ఏయూ అధికారులు ఇటీవల కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో సమావేశం నిర్వహించారు. తలో కొంత విరాళాలు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే మహానాడు, టీడీపీ సమావేశాల పేరిట ఏయూపై ఆర్ధికభారం మోపుతున్న పాలకులు ఇప్పుడు వి ద్యార్ధులతో ముఖాముఖీ పేరిట భారం మోపడం వర్శిటీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వ నిర్ణ?ఆలు ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో టీడీపీ సమావేశాలు నిర్వహించి అద్దెలు ఎగ్గొట్టిన సర్కారు.. తాజా గా జ్ఞానభేరి పేరుతో ఏయు నెత్తిన ఖర్చు కుంపటి పెడుతోంది. ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో మహానాడు, పట్టాల పండుగ సహా అనేక కార్యక్రమాలు చేపట్టినా ఏయూకు పైసా చెల్లించలేదు. కొన్ని సభలకు మాత్రం నామమాత్రపు రుసుం చెల్లించి చేతులు దులుపుకుంది. తిరుపతిలో నిర్వహించిన మొదటి జ్ఞానభేరికి రూ.3.50 కోట్లు ఖ ర్చు అయినట్లు అంచనా వేస్తుండగా, దాని కంటే బాగా ఇక్కడ చేయాలని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశించారు. దీంతో ఏయూ అధికారులు ఈసురోమంటూ పనులు ప్రారంభించారు. ఇందు కు రూ.4కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తుండగా ఇందులో 60 శాతం ఉన్నత విద్యా మండలి భరిస్తుందనీ, మిగిలింది ఏయూ భరించాలని ప్రభుత్వం తేల్చింది. ఈ లెక్కన కనీసం రూ.కోటిన్నర ఏయూ చేతి చమురు వదిలిపోతుంది. అయితే ఉన్నత విద్యామండలి ఇవ్వాల్సిన 60 శా తం నిధులు అనుమానమేనని కొందరు అధికారులంటున్నారు. ఇదే జరిగితే కోటిన్నర కాకుండా మొత్తం నాలుగు కోట్లు భరించాల్సిందే. ఇప్పటికే స్టేజ్, ఇతర ఏర్పాట్లకు రూ.కోటి ఖర్చయినట్లు ఏయూ అంచనా వేసింది. దీంతోపాటు విద్యార్థులు, స్టాఫ్, వీఐపీలు, అధికారులు, ఇతరులందరికీ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికీ మరో రూ. కోటి ఖర్చయ్యే అవకాశముంది. విద్యార్థులూ.. షరతులు వర్తిస్తాయి పోనీ.. ఇంతా ఖర్చు చేస్తున్నారు.. కొంతైనా జ్ఞా నం సంపాదించుకుందామని విద్యార్థులు ఆశిస్తే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే దీనికి షరతులు వర్తిస్తాయి. ఎంపిక చేసిన కాలేజీల నుంచి ఎంపిక చేసిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పించేలా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్, నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పన, డీఎస్సీ తదితర ప్రభుత్వ వైఫల్యాలకు చెందిన అంశాలను విద్యార్థులు లేవనెత్తే ప్రమాదముందని గ్రహించి.. ముందుజాగ్రత్త పడ్డారు. ప్రతి కాలేజీ నుంచి ప్రతిభావంతులు, మెరిట్ సర్టిఫికెట్ ఉన్న వారిని.. అందులోనూ గొడవ చెయ్యకుండా ఉండేవారిని మాత్రమే సెలక్ట్ చేసి జ్ఞానభేరి యాప్‌లో నమోదయ్యే అవకాశం ఇచ్చారు. దాని ద్వారా వచ్చే క్యూఆర్ కోడ్ ద్వారా ప్రవేశం పొందేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం గమనార్హం. చంద్రబాబు స్వోత్కర్ష కోసమేనా.. ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్లో జరిగే ఈ కార్యక్రమంలో 15 వేల మంది విద్యార్థులు పాల్గొంటారని అంచనా. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ ప్రముఖుల ప్రసంగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. విద్యార్థులను వివిధ రంగాల్లో మోటివేట్ చేసేందుకు ప్రముఖులు ప్రసంగాలు ఇస్తారు. విశేషమేమిటంటే మోటివేషనల్ స్పీచ్‌కు ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాత్రమే కేటాయించారు. అదే.. చంద్రబాబు చర్వితచరణంగా చెప్పే ఊకదంపుడు ఉపన్యాసానికి గంట సమయం కేటాయించడం విశేషం.విద్యార్థుల్లో జిజ్ఞాసను పెంచే ప్రసంగాలకు కనీసం 20 నిమిషాలైనా ఇవ్వాల్సి ఉండగా అలాంటి వారికి తక్కువ సమయం కేటాయించడం వల్ల ఒరిగేదేమీ లేదని విద్యార్థులు పెదవి విరుస్తున్నారు. పేరుకు జ్ఞానభేరి అయినా.. యువతలో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను మాఫీ చేసుకొని తన వైపు తిప్పుకోడానికే టీడీపీ ప్రయత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
‘వివాద’ కళాపరిషత్
చెప్పిందే వేదం.. చేసిందే చట్టం అన్న రీతిలో ఆంధ్ర విశ్వవిద్యాలయ వ్యవహారాలు సాగుతున్నాయి..విశ్వవిఖ్యాతి గాంచిన ఆంధ్ర విశ్వకళాపరిషత్.. వరుస వివాదాలతో ప్రతిష్ట కోల్పోతోంది.. ఉన్నత విద్యామండలి నిబంధనలను కాదని.. ఈ విశ్వవిద్యాలయంలో నియామకాలు, పదోన్న తులు కొందరి ఇష్టారాజ్యంగా సాగిపోతున్నాయి. తమకు నచ్చిందే చేస్తామన్న ధోరణిలో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారు.మొన్నటికి మొన్న వర్సిటీ ఆగ్రో ఎకనమిక్స్ కేంద్రం డైరెక్టర్ నియామకం వివాదాస్పదమైంది. అన్ని విధాలా అర్హుడైన అర్థశాస్త్రవిభాగాధిపతి ఆచార్య పుల్లారావుకు ఆ పదవి ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు.ఇప్పుడేమో.. ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సడ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్ (ఐఏఎస్ఈ) ప్రిన్సిపల్ నియామకంపైనా వివాదాలు ముసురుకున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి జూనియర్‌ను అందలం ఎక్కించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నియమాలు వ్యక్తులను బట్టి మారిపోతున్నాయి. రాజు తలచుకుంటే.. అన్న రీతిలో ఉన్నతాధిరులు తలచుకుంటే చాలు నిబంధలనలు గాలికి కొట్టుకుపోతున్నాయి. తమకు నచ్చిందే న్యాయమనే రీతిలో ఇక్కడి అధికారుల వ్యవహార శైలికి పలు పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇటీవల వర్సిటీ ఆగ్రో ఎకనమిక్స్ సెంటర్ డైరెక్టర్ నియామకం వివాదాస్పదమైంది. అర్థశాస్త్ర విభా గాధిపతి ఆచార్య పుల్లారావుకు ఆ పదవిని ఇవ్వకుండా నెలల తరబడి కాలయాపన చేస్తున్నారు. పాత విధానాన్ని కాదని కొత్త సంప్రదాయానికి తెర తీసి అధికారులు విమర్శలపాలయ్యారు. తాజాగా ఇదే వర్సిటీ పరిధిలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎస్ఈ)ప్రిన్సిపల్ నియామకం సైతం వివాదాస్పదమైంది. నిబంధలను పక్కన పెట్టి ఆచార్య శివప్రసాద్‌ను ఆ పదవిలో నియమించారు. సీనియర్లను కాదని.. ఐఏఎస్ఈ ప్రిన్సిపల్‌గా పనిచేసిన ఆచార్య రంగనాథన్ పదవీ కాలం గత నెల 30న ముగిసింది. ఆయన తర్వాత వర్సిటీ విద్యా విభాగం, ఐఏఎస్‌ఈలలో సీనియర్ ఆచార్యునికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. దీనికి భిన్నంగా వర్సిటీ అధికారులు కొత్త విధానానికి తెర తీశారు. ముగ్గురి పేర్లతో ప్యానల్ సిద్ధం చేశారు. సీనియారిటీ ఆధారంగా ఆచార్య నిమ్మ వెంటకరావు, ప్రస్తుత విద్యా విభాగాధిపతి ఆచార్య గారలచ్చన్న, ఆచార్య శివప్రసాద్‌ల పేర్లను వరుస క్రమంలో చేర్చారు. సీనియారిటీ ప్రకారం మొదటి స్థానంలో ఉన్న ఆచార్య నిమ్మ వెంకటరావును ప్రిన్సిపల్‌గా నియమించాలి. కానీ మూడో స్థానంలో ఉన్న ఆచార్య శివప్రసాద్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ కావడం.. వెంటనే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఒక్కసారికే అవకాశం.. దాన్ని కాదని.. ఆచార్య శివప్రసాద్ గతంలో ఐఏఎస్ఈ ఇన్చార్జి ప్రిన్సిపాల్‌గా కొంత కాలం పనిచేశారు. ఇటీవల వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక నియమం పెట్టుకున్నారు. ఒక పర్యాయం విభాగాధిపతి, ప్రిన్సిపల్ పదవి చేపట్టిన వారికి మరోసారి అవకాశం ఇవ్వరాదని నిర్ణయించారు. వారు పెట్టుకున్న నియమమే ఇప్పుడు అమలుకు నోచుకోలేదు. అందరికీ పరిపాలనా బాధ్యతలు అందాలనే ఉద్దేశంతో ఈ నిబంధన పెట్టారు. దీని ప్రకారం చూసినా ఆచార్య శివప్రసాద్ ఇప్పటికే ఒక పర్యాయం ప్రిన్సిపల్‌గా పని చేసినందున ఆయనకు మళ్లీ అవకాశం ఇవ్వనవసరం లేదు. అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా.. ఇటీవల ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ పనిచేస్తున్న ఆచార్య కె.గాయత్రీ దేవి రెక్టార్‌గా పదోన్నతి పొందారు. వెంటనే సీనియారిటీ ప్రకారం ఆచార్య కె.రామమోహనరావు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆచార్యులు పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచిన సమయంలో ఆచార్య సీహెచ్.వి రామచంద్రమూర్తి, ఆచార్య సుందరరావు, ఆచార్య ఎ.సుబ్రహ్మణ్యంలు ప్రిన్సిపల్స్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టి కొనసాగారు. అప్పుడు కూడా సీనియారిటీ ప్రకారం వీరికి రెండో పర్యాయం ప్రిన్సిపల్‌గా బాధ్యతలు అప్పగించారు. నేడు ఈ విధానాన్ని కాదని ప్యానల్ విధానంలో ప్రిన్సిపల్‌ను ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చిందని ఆచార్యులు ప్రశ్నిస్తున్నారు. అమలుకు నోచుకోని తీర్మానం గతేడాది జరిగిన అకడమిక్ సెనేట్ సమావేశంలో ఏయూలో ఉన్న విద్య విభాగం, ఐఏఎస్‌ఈలను విలీనం చేస్తూ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్‌గా ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఏడాది కావస్తున్నా ఆ తీర్మానాన్ని అమలు చేయలేదు. రసాయన శాస్త్ర విభాగాలను కలుపుతూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీ, భాష శాస్త్ర విభాగాలను కలుపుతూ ఒకే విభాగంగా తీర్చిదిద్దాలని ప్రతిపాదలు వచ్చాయి. ఇవి కూడా కాగితాలకే పరితం అవుతున్నాయి. -
ఏయూ నూతన రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్
సాక్షి, విశాఖపట్టణం : ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఉమా మహేశ్వర రావుపై వేటు పడింది. గత కొంతకాలం నుంచి వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ల మధ్య ఉన్న అంతర్గత విభేదాలే ఈ చర్యకు కారణమని తెలుస్తోంది. కొత్త రిజిస్ట్రార్‌గా అకాడమిక్ విభాగం డీన్ ప్రొ. కె నిరంజన్ను నియమిస్తూ వీసీ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన పాలకమండలి సమావేశంలో ఇద్దరి మధ్యగల విభేదాలపై పాలకమండలి సభ్యులు చర్చించారు. సమావేశం అనంతరం వీసీ, ఉమా మహేశ్వరరావును తొలగిస్తూ.. కొత్త రిజిస్ట్రార్‌గా ప్రొ. నిరంజన్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. నూతన రిజిస్ట్రార్‌గా నిరంజన్ బాధ్యతలు స్వీకరించారు. -
బీఎస్సీకి బీకామ్ పట్టా: మంత్రి గంటా సీరియస్
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీఎస్సీ చదువుకున్న విద్యార్థికి బీకామ్ పట్టా ఇవ్వడంపై మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌తో ఆయన మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇచ్చారని ఈసందర్భంగా ఆయన ప్రశ్నించినట్టు తెలిసింది. ఈ విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన వీసీకి ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే.. బాధ్యులను విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం విద్యార్థికి షాక్..! శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి.. టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రదిస్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించాలని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాంలే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అదిగో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. -
జలీల్ ఖాన్‌ను తలదన్నే ఫీట్!
బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని ఆ మధ్య ఉవాచించిన ఒక ప్రజాప్రతినిధి ‘అపార’ పరిజ్ఞానంపై ప్రసార,సామాజిక మాధ్యమాల్లో కొన్నాళ్లపాటు ఏకధాటిగా సెటైర్లే.. సెటైర్లు.. కానీ.. ఆయనగారి కంటే ముందు ఒక విద్యాసంస్థ ఆయన్ను తలదన్నే ఫీట్ ప్రదర్శించింది. సదరు ప్రజాప్రతినిధి ఒక్క సబ్జెక్టు విషయంలోనే తన అతి తెలివి ప్రదర్శిస్తే.. ఈ విద్యాసంస్థ మాత్రం ‘కుడి ఎడమైతే పొరపాటు లేదని..’ అనుకుందో ఏమో.. ఏకంగా బీఎస్సీ విద్యార్థికి బీకామ్ పట్టా ఇచ్చేసింది. అలా ఇచ్చిన సంస్థ ఊరూ పేరు లేనిదా.. అంటే.. ఎంతో విశిష్టత, ఉన్నత చరిత్ర కలిగిన మన ఆంధ్ర విశ్వవిద్యాలయమే ఆ ఘనతను సొంతం చేసుకుంది.. పోనీ.. ఏదో పొరపాటు జరిగిపోయింది.. దాన్ని వెంటనే సరిదిద్దారా అంటే.. పట్టా మార్చకుండా మూడేళ్లుగా బాధిత విద్యార్థిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏయూ అధికారుల నిర్వాకంతో ఉద్యోగావకాశాలు కూడా పోగొట్టుకుంటున్న ఆ కుర్రాడు చివరికి ‘సాక్షి’ని ఆశ్రయించాడు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయం.. చెప్పుకోవడానికి దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం.. కానీ తీరులో అంతా గందరగోళం అనడానికి ప్రత్యక్ష ఉదాహరణే.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అట్టాడ శ్రీహరి ఉదంతం. ఆ జి ల్లాలోని నందిగాం మండలం పెంటూరు గ్రామానికి చెందిన శ్రీహరి టెక్కలి బీఎస్ అండ్ జేఆర్ డిగ్రీ కాలేజీలో బీఎస్సీ సీబీజెడ్ కోర్సు చేశాడు. 2015లో డిగ్రీ పట్టా కూడా చేతికొచ్చింది. దాన్ని చూసి ఆనందంతో మెరిసిన అతని కళ్లు.. అందులోని వివరాలు చూసి అంతలోనే బైర్లుకమ్మాయి. మార్కుల వివరాల వద్ద సైన్సు సబ్జెక్టులుగానే పేర్కొన్నా.. పైన మాత్రం బ్యాచిలర్ ఇన్ కామర్స్ అని ఉంది. పొరపాటు జరిగిందని గ్రహించిన శ్రీ హరి వెంటనే కళాశాల యాజమాన్యాన్ని సంప్రది స్తే.. తమకేం సంబంధం లేదని, విశాఖ వెళ్లి ఆం ధ్రా యూనివర్సిటీ అధికారులను సంప్రదించా లని సూచించారు. దీంతో ఆ యువకుడు వర్సిటీ అధికారులను కలిసి.. జరిగిన పొరపాటు గురించి వివరించారు. ‘ఆహా అలా జరిగిందా.. ఏముంది మార్చేద్దాం లే’.. అని చాలా తేలిగ్గా మాట్లాడిన పరీక్షల విభాగం అధికారులు మూడేళ్లయినా తమ తప్పును సరిదిద్దుకోలేదు. బాధిత విద్యార్థిని అది గో.. ఇదిగో.. అంటూ తిప్పుతూనే ఉన్నారు. ఉద్యోగావకాశమూ పోయె.. సర్టిఫికెట్లో తప్పు కారణంగా శ్రీహరికి ఉద్యానవనశాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగం చేజారింది. ఎంపిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఇతని డిగ్రీ పట్టా తిరస్కరణకు గురైంది. బీఎస్సీ అని చెప్పి బీకామ్ సర్టిఫికెట్ ఎలా పెట్టావని సంబంధిత అధికారులు శ్రీహరిని మందలించారు. ‘సార్.. పొరపాటున అలా వచ్చింది.. నేను బీఎస్సీ సీబీజెడ్ చదివానని మొత్తుకున్నా.. సర్టిఫికెట్టే ప్రధానమంటూ అధి కారులు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించారు. పోనీ బీకామ్ సర్టిఫికెట్తో ఏదైనా ఉద్యోగం చేద్దామంటే కామర్స్‌లో అవగాహన లేదు. దీంతో రెం టికీ చెడ్డ రేవడిలా తన పరిస్థితి తయారైందని శ్రీహరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ విద్యార్ధి వేదన మాత్రం వర్సిటీ అధికారులకు ఏమాత్రం పట్టడం లేదు. అలా ఎలా జరిగిందో? వాస్తవానికి వర్సిటీలో బీఎస్సీ, బీకామ్లకు విడివిడిగా విభాగాలున్నాయి. ఒక విభాగానికి సం బంధించిన సర్టిఫికెట్ మరో విభాగంలో కలిసే అవకాశం లేదు. క్లర్క్, సూపరింటెండెంట్ పరిశీలించిన తర్వాతే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సంతకం పెడతారు. ఒకవేళ ముద్రణ సమయంలో పొరపాటు జరిగినా సంబంధిత శాఖ ఉద్యోగులు గమనించాలి. కనీసం తప్పిదం జరిగిన తర్వాతైనా సరిదిద్దకుండా ఏయూ అధికారులు నిర్లక్ష్యం వహించడం విమర్శలపాలవుతోంది. నా వద్దకు వస్తే వెంటనే మార్పిస్తా ఎలా జరిగిందో తెలియదు.. ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది.. దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత మాదే.. ఆ యువకుడు నేరుగానన్ను కలిస్తే సర్టిఫికెట్ మార్పించి ఇస్తాను. – సుధాకర్‌రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ -
అభ్యంతరాల వల్లే ఆ పోస్టును హోల్డ్‌లో పెట్టాం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: వ్యవసాయ ఆర్థిక పరిశోధనా సంస్థకు డైరెక్టర్ ఉండగా గౌరవ సంచాలకుల అవసరం ఏముందని వ్యవసాయ మంత్రిత్వ శాఖ అభ్యంతరం వ్యక్తం చేయడంతోనే ఆచార్య పుల్లారావు నియామకంలో అడ్డంకి ఏర్పడిందని ఏయూ వీసీ ఆచార్య నాగేశ్వరరావు వెల్లడించారు. పుల్లారావును నియమిస్తూ వీసీ ఉత్తర్వులిచ్చి నెలన్నర దాటినా ఇంకా రిజిస్ట్రార్ నుంచి సంబంధిత శాఖకు నియామకపు ఆదేశాలు రాకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంపై ‘వీసీయా ఐతే ఏంటి’ శీర్షికన మంగళవారం సాక్షి దినపత్రికలో వచ్చిన కథనం ఏయూ వర్గాల్లో కలకలం రేపింది. దీనిపై వీసీ నాగేశ్వరరావు మంగళవారం సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ అభ్యంతరాల నేపథ్యంలోనే ఉత్తర్వుల అమలులో జాప్యం జరిగిందే కానీ... తనకు, రిజిస్ట్రార్‌కు ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. అయితే ఎన్నో దశాబ్దాలుగా ఆగ్రో ఎకనామిక్ సెంటర్‌కు గౌరవ సంచాలకులుగా అర్థశాస్త్ర విభాగాధిపతి వ్యవహరించడం ఆనవాయితీగా వస్తున్న మాట నిజమేనన్నారు. ఇదే విషయాన్ని మంత్రిత్వశాఖ ప్రతినిధులకు, యూజీసీ ప్రతినిధులకు వివరించి పుల్లారావుకు గౌరవ సంచాలకుల పోస్టు వచ్చేలా త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
వీసీయా..ఐతే ఏంటి?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: నిబంధనలను అతిక్రమించి మరీ.. అధికార తెలుగుదేశం పార్టీకి సేవ చేసే విషయంలో ఒక్కటిగా వ్యవహరించే ఏయూ వీసీ నాగేశ్వరరావు, రిజిస్ట్రార్ ఉమమాహేశ్వరరావులు.. పాలనాపరమైన విషయాల్లో మాత్రం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్నారు. వైస్ చాన్సలర్ ఉత్తర్వులను, ఆదేశాలను అమలు చేయాల్సిన రిజిస్ట్రార్ వాటిని బుట్టదాఖలు చేయడం ఇప్పుడు ఏయూ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం అర్థశాస్త్ర విభాగాధిపతిగా ఆచార్య డి.పుల్లారావు గత ఏప్రిల్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ విభాగానికి అనుబంధంగా ఆగ్రో ఎకనమిక్స్ సెంటర్ (వ్యవసాయ ఆర్ధిక పరిశోధన సంస్థ) పనిచేస్తోంది. ఏయూ ప్రాంగణంలోని స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ భవనంలోనే ఉన్న ఈ సంస్థ గౌరవ సంచాలకుడిగా అర్థశాస్త్ర విభాగాధిపతి వ్యవహరించడం దశాబ్దాలుగా వస్తున్న ఆనవాయితీ. ఆ మేరకు సంస్థ గౌరవ డైరెక్టర్‌గా పుల్లారావు బాధ్యతలు చేపట్టేలా ఉత్తర్వులివ్వాల్సిందిగా కోరుతూ వర్సిటీ పరిపాలన విభాగంలోని ఏ–5 సెక్షన్ అధికారులు ఫైల్ పంపారు. దాన్ని పరిశీలించిన వీసీ నాగేశ్వరరావు ఆ మేరకు ఉత్తర్వులివ్వాల్సిందిగా సూచిస్తూ ఫైల్‌ను రిజిస్ట్రార్‌కు పంపించారు. కానీ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు ఆ ఫైలును తొక్కిపెట్టేశారు. ఏప్రిల్ 20న వీసీ ఉత్తర్వులివ్వగా.. నెలన్నర దాటినా రిజిస్ట్రార్ ఆ ఫైలును పట్టించుకోలేదు. తన వారిని కొనసాగించేందుకే.. వర్గపోరు నేపథ్యంలో ఇందుకు తెర వెనుక చాలా మంత్రాంగమే నడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌గా గంగాధర్ వ్యవహరిస్తున్నారు. రిజిస్ట్రార్ వర్గానికి చెందిన ఈయన ఎప్పటి నుంచో తమ సంస్థకు గౌరవ డైరెక్టర్ అవసరం లేదని, అన్నీ తామే చూసుకోగలమని వాదిస్తూ వస్తున్నారు. కానీ వర్సిటీ నిబంధనల మేరకు గౌరవ డైరెక్టర్ పోస్టు అనివార్యం కావడంతో ఎప్పటికప్పుడు నియమిస్తున్నారు. కానీ ఈసారి మాత్రం రిజిస్ట్రార్ పూర్తిగా తన వర్గీయుడికి వత్తాసు పలుకుతూ నిబంధనలను, వీసీ ఆదేశాలను పక్కన పెట్టేశారు. పైగా నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ గంగాధర్‌కు చెక్ పవర్ ఇచ్చేందుకు సైతం రంగం సిద్ధం చేశారు. వీసీ, రిజిస్ట్రార్ల తీరుపై ఆచార్యుల్లో అసహనం రిజిస్ట్రార్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నా ఏమీ పట్టించుకోని వీసీ వైఖరిపై ఏయూ ఆచార్యుల్లో అసహనం వ్యక్తమవుతోంది. తన పదవీ బాధ్యతల విషయమై ఆచార్య పుల్లారావు.. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.రామమోహనరావును కలుసుకున్నారు. వర్సిటీ నిబంధనల మేరకు అర్ధశాస్త్ర విభాగాధిపతే ఆగ్రో ఎకనమిక్ సెంటర్ సంచాలకుడిగా వ్యవహరిస్తారని ప్రిన్సిపాల్ స్పష్టం చేశారు. దీనికి ప్రత్యేకంగా ఎవరి ఆదేశాలు అవసరం లేదని, పదవీ బాధ్యతలు చేపట్టవచ్చునని సూచించారు. అయితే వైస్ చాన్సలర్ నుంచి ఎటువంటి మార్గదర్శకాలు రాకపోవడంతో ఆయన వేచిచూసే ధోరణిలోనే ఉన్నారు. నెలన్నర క్రితమే ఆచార్య పుల్లారావును ఆగ్రో ఎకనమిక్స్ సెంటర్ గౌరవ సంచాలకునిగా నియమించాలన్న వీసీ ఆదేశాలు నేటి వరకు అమలవ్వని పరిస్థితిపై రేపోమాపో ఆచార్యులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. -
ఆధునికతకు అక్షరాది కందుకూరి
తెలుగు సమాజంలో ఏ ఒక్క వ్యక్తి పుట్టుకతో అయినా ఇదిగో ఆధునికత మొదలు ఇతనితో అని చెప్పగలమా అంటే, అది ఒక్క కందుకూరి వీరేశలింగం విషయంలోనే సాధ్యం. ఆయన శతవర్ధంతి వత్సరం మే, ఇరవై ఏడున ఆరంభం అవుతున్నది. ఏ చదువులు లేకుండా అజ్ఞానంలో, బలైపోతున్న పసి ఆడపిల్లల జీవితాలు, యుక్తవయసు వచ్చేలోపే బాల వితంతువులుగా లక్షలాదిమంది బాలికలు సమాజంలో ఉండటం, వీటిని ఎవరు సహించినా, తాను వ్యతిరేకినంటూ, వీటిని ప్రశ్నించడానికి 1881లో రాజమండ్రి సోషల్ ప్రావి న్షియల్ క్లబ్లో కందుకూరి వీరేశలింగం ఒక ప్రసంగం చేశారు. దీనికి ప్రధాన ప్రేరణ, ఈ బాల్య వివాహాల జాడ్యం దేశమంతటా ఉండటం. 1880లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం, తొమ్మిదేళ్ల వయసులో భార్య అంటే ఏమో ఎరుగని వయసు బాలురు, పసి భార్యలను పోగొట్టుకున్న వారు దేశంలో 14,773 మంది ఉన్నారు. అదే సంవత్సరం, తొమ్మిదేండ్ల వయసు ఉన్న బాలికలు, తమ భర్తలను పోగొట్టుకున్న వారు, 78,976 మంది లెక్క తేలారు. వీళ్ళు కాకుండా, తరుణ వయసుకొచ్చిన 2,07,388 మంది బాలికలు తమ యవ్వనారంభ జీవితాలను వితంతువులుగా మొదలెడుతున్నారు. ఇవీ సంప్రదాయ భారతదేశపు సంఘం చేస్తున్న దుర్మార్గ పరంపర. ఇది కేవలం తెలుగు ప్రాంతాలకే చెందినదిగా, కొందరు భావించి, గురజాడ (1887–1892 నాటక రచనా కాలం ప్రదర్శన 1892లో) కన్యాశుల్కం నాటకం రాసే నాటికే, ఈ సమస్య లేదు అని చెప్తూ ఉంటారు. అది వాస్తవదూరం. ఈ అగ్రవర్ణ మూర్ఖత్వాన్ని నిరసిస్తూ, గురజాడ వాడిన వాటికన్నా, కటువైన మాటల్లో, ఈ బాల్య వివాహ దురాచారాన్ని రూపుమాపితే గానీ సమాజం బాగుపడదని విశ్వసించిన నాటికి, వీరేశలింగం వయసుడిగిన ముసలివారు కారు. ఆయన వయసు అప్పుడు కేవలం 33ఏళ్ళు. మనం తరచూ చూసే వృద్ధ కందుకూరి ఫోటోకి, ఈ అతి బాల్య వివాహాలపట్ల నిరసన తెలుపుతూ, తొలి వితంతు వివాహాన్ని 1881లో దక్షిణ భారతదేశంలోనే మొదటిసారిగా జరిపించిన వ్యక్తి రూపానికి పొలికే లేదు. దక్షిణ భారత రామ్‌మోహన్‌రాయ్‌గా గుర్తింపదగ్గ ఆధునికుడు వీరేశలింగం. కేవలం అక్షరయోధుడే కాదు, ఆచరణసేనాని కందుకూరి. ప్రసంగాలు, రచనలే కాదు – పెళ్లిళ్లు జరగాలి– అదీ కందుకూరి కార్యదీక్ష. ఆయన రచనలన్నీ, సాంఘికమౌఢ్యాన్ని పేల్చివేసే మందుపాతరలు. ఏకబిగిన వితంతు వివాహదీక్షతో, సంఘసంస్కరణలో జాతీయస్థాయి సంస్కర్తగా తన జీవితకాలంలోనే ఎదిగారు కందుకూరి. అప్పటి జాతీయ సంఘ సంస్కర్తలతో కలిసి, తన కార్యాచరణలో ఉన్నారు. ఈ భిన్న ప్రాంతాల ప్రముఖులు, జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడె అధ్యక్షతలో, దేశంలోని ప్రధాన నగరాల్లో జాతీయ సామాజిక సంస్కరణ సభలను నిర్వహించేవారు. ఈ మేధావులు సంఘసంస్కరణ మన రాజకీయాకాంక్షలతోబాటుగా, అంతకన్నా వేగంగా సాగాలని, అప్పుడే భారతీయ సమాజం ఆధునికం కాగలదని విశ్వసించి ఆచరించినవారు. 1898లో మదరాసులో జరిగిన మహాసభలకు కందుకూరిని అధ్యక్షులను చేసి గౌరవించారు. ఇక్కడ అధ్యక్షహోదాలో ఆంగ్లంలో ప్రసంగించారు కందుకూరి. ఇక్కడే జస్టిస్ మహదేవ్ గోవింద్ రనడే ‘దక్షిణ భారత విద్యాసాగరునిగా’ కందుకూరికి బిరుదునిచ్చారు. అరుదైన ఈ ఆంగ్ల ప్రసంగ పూర్తిపాఠం, ఇటీవల లభ్యమైంది. దీనిని మే 27న, విశాఖపట్నంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం హాల్లో ఒక రోజుపాటు జరిగే శతవర్ధంతి వత్సర ప్రారంభోత్సవంలో విడుదలచేసి ఈ ప్రతిని ప్రదర్శనయోగ్యంగా విజయనగరంలోని గురజాడ స్మారక మందిరానికి, అలాగే, రాజమండ్రిలోని కందుకూరి దంపతుల సమాధి ఉన్న ఆనందాశ్రమానికి, ప్రదర్శన నిమిత్తం జాతికి సమర్పించడం జరుగుతుంది. ‘వ్యాకరణాల సంకెల’ అని, 1895లోనే ‘‘సరస్వతీ నారద విలాపం’’లో రాసిన కందుకూరి, ‘కవితా ఓ కవితా’లో ‘వ్యాకరణల సంకెళ్లు, శ్మశానాల వంటి నిఘంటువులు, చంధస్సర్ప పరిష్వంగం’ అన్న శ్రీశ్రీ కన్నా 45 ఏళ్లు ముందరే, సాహిత్య సరస్వతి భాష బరువుల కింద నలిగి రోదిస్తున్నదని చెప్పిన వాస్తవిక వాది. వీరి రచనల సమగ్ర ప్రచురణలు, వీలైతే నేటి తరాల కోసం, కాస్త సరళ భాషలో తీసుకురావడం, అలాగే, పలు తెలుగు నగరాల్లో కందుకూరి శతవర్ధంతి సందర్భంగా ‘కందుకూరి జయమాల’ సాహిత్య, సాంస్కృతిక సభల నిర్వహణ, ప్రస్తుతం తెలుగు జాతి బాధ్యత. (మే 27న కందుకూరి శతవర్ధంతి సంవత్సరం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విశాఖలోని ఆంధ్రవిశ్వవిద్యాలయంలో మొజాయిక్ సాహిత్య సంస్థ, అరసం సంయుక్తంగా నిర్వహిస్తున్న సందర్భంగా) రామతీర్థ ,వ్యాసకర్త కవి, విమర్శకుడు 98492 00385 -
అయ్యో.. ఏయూ
విఖ్యాత ఆంధ్ర విశ్వవిద్యాలయం రాజకీయ పంకిలంలో నిలువునా కూరుకుపోతోంది. నిబంధనలకు విరుద్ధంగా వర్సిటీ ప్రాంగణాలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగిస్తున్నా అధికారులు, ఆచార్యులు నోరెత్తకపోవడంతో అంతా టీడీపీ నాయకుల ఇష్టారాజ్యంగా సాగుతోంది. గత ఏడాది మహానాడు.. నిన్న గాక మొన్న ధర్మపోరాట సభ నిర్వహించినా.. ఆ సభకు కార్యకర్తలు, వాహనాల ప్రవేశానికి వీలుగా వర్సిటీ గోడలు సైతం పగులగొట్టినా.. విద్యుత్‌ను అడ్డగోలుగా వాడేసుకున్నా.. వర్సిటీ అధికారులు కిక్కురుమనలేదు. ఇవన్నీ ఒకెత్తు అయితే.. ఈనెల 31న జరగనున్న ఏయూ 85వ స్నాతకోత్సవ వేదికపై ముందెన్నడూ లేని విధంగా మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసీనులవుతారని పేర్కొనడం మరో వివాదం రేపుతోంది. వర్సిటీ చరిత్రలో స్నాతకోత్సవ వేదికపై గవర్నర్, ముఖ్య అతిథి, వీసీ, రిజిస్ట్రార్, అకడమిక్ సెనేట్ సభ్యులు మాత్రమే ఆసీనులవుతారు. దీనికి భిన్నంగా మంత్రి గంటా కూర్చుంటారని పేర్కొనడం చర్చనీయాంశమవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: దేశంలోనే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాన్ని టీడీపీ నేతలు రాజకీయ వేదికగా మార్చేశారు. గత నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు, లోకేష్‌బాబుల పుట్టినరోజు వేడుకలనూ ఇక్కడే చేసుకున్న టీడీపీ నేతలకు నగరంలో భారీఎత్తున బహిరంగసభ నిర్వహించాలంటే ఏయూనే గుర్తుకు వస్తోంది. ప్రభుత్వ నిబంధనలు, ఉన్నత విద్యామండలి మార్గదర్శకాలను పట్టించుకోకుండా అనుకున్నదే తడవుగా కార్యక్రమాలు చేసుకుపోతున్నారు. వర్సిటీ భవనాలు, ఖాళీ ప్రదేశాలను వినియోగించుకోవాలంటే ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాలి. కానీ టీడీపీ నేతలు అది కూడా చేయడంలేదు. మంగళవారం జరిగిన ధర్మపోరాట సభ సందర్భంగా వర్సిటీ గోడను సైతం పగులగొట్టి ప్రవేశ మార్గం కల్పించడం వివాదాస్పదమవుతోంది. ఈ గోడ పునర్నిర్మాణానికి రూ.రెండు లక్షలకు పైగా ఖర్చవుతుంది. ఈ డబ్బును ఎవరు చెల్లిస్తారన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఇక ధర్మ పోరాట సభకు వర్సిటీ నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగించినా ఇటు వర్సిటీ అధికారులు గానీ.. అటు ట్రాన్స్‌కో అధికారులు గానీ ఏమీ తెలియనట్టే నిద్ర నటిస్తున్నారు. టీడీపీ నేతల పెళ్లిళ్లకూ ఇచ్చేస్తున్నారు.. వాస్తవానికి వర్సిటీ ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరాన్ని పెళ్లిళ్లకు ఇవ్వకూడదని ప్రస్తుత వీసీ ఆచార్య నాగేశ్వరరావు హయాంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ ప్రకారం వర్సిటీ ఉద్యోగులు సైతం తమ సొంత శుభకార్యాలను ఇతర ఫంక్షన్ హాళ్లలోనే ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ కొద్దిరోజుల క్రితం జరిగిన శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు వివాహా నికి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంతో పాటు, ప్లాటినం జూబ్లీ సమావేశ మందిరాన్ని కూడా ఇచ్చేశారు. వివాహానికి సంబంధించిన అనేక క్రతువులు ఇక్కడే జరిపారు. వర్సిటీ ఉద్యోగులకే ఇవ్వని ప్లాటినం జూబ్లీ సమవేశ మందిరాన్ని రాజకీయ నాయకులకు ఇవ్వడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. స్నాతకోత్సవ వేదికపై మంత్రి గంటా ఆంధ్ర విశ్వవిద్యాలయం 85వ స్నాతకోత్సవం ఈ నెల 31న జరగనుంది. సహజంగా స్నాతకోత్సవ వేదికపై రాష్ట్ర గవర్నర్, ముఖ్య అతిధి, వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్స్, పాలక మండలి, అకడమిక్ సెనేట్ సభ్యులు మాత్రమే ఆసీనులవుతారు. అయితే ఇందుకు భిన్నంగా ఈసారి స్నాతకోత్సవ వేదికపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసీనులు కానున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికను ఇప్పటికే ముద్రించి పంపిణీ చేస్తున్నారు. వాస్తవానికి విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రతి స్నాతకోత్సవం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. దేశంలోనే అత్యుత్తమ ప్రతిభ, నైపుణ్యం, ప్రత్యేకత కలిగిన వారికి ముఖ్య అతిధిగా ఆహ్వానించి డాక్టరేట్ ప్రదానం చేస్తారు. వీరితో పాటు పలువురికి గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేయడం సంప్రదాయంగా వస్తోంది. కార్యక్రమానికి చాన్సలర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ హాజరై స్వయంగా డాక్టరేట్లు, మెడల్స్, పట్టాలు అందిస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఇది ఒక మధురానుభూతిగా నిలుస్తుంది. ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమానికి సైతం రాజకీయ రంగు పులమడమే ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అవును ఇదే మొదటిసారి.. జీవో వచ్చిందిఆ మేరకు గంటా ఆసీనులవుతారు: వీసీ నాగేశ్వరరావు ఏయూ స్నాతకోత్సవ వేదికపై ఒక మంత్రి ఆసీనులవుతుండటం ఇదే మొదటిసారని వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నారు. గురువారం సాక్షి ప్రతినిధితో మాట్లాడారు. వర్సిటీల స్నాతకోత్సవ వేదికల్లో మానవ వనరుల శాఖ మంత్రిని గవర్నర్ పక్కన కూర్చోబెట్టాలని ప్రభుత్వం ప్రత్యేకంగా జీవో జారీ చేసిందని చెప్పారు. ఆ మేరకు పాలకమండలి సమావేశంలో తీర్మానించి 31న జరిగే స్నాతకోత్సవంలో గంటా శ్రీనివాసరావును ప్రత్యేక అతిధిగా గౌరవిస్తామని చెప్పారు. ఇక టీడీపీ ధర్మపోరాట సభ సందర్భంగా వర్సిటీ గోడను ధ్వంసం చేసిన ఘటన గానీ, విద్యుత్ చౌర్యం విషయం గానీ తన దృష్టికి రాలేదన్నారు. -
రోడ్డెక్కిన ఆంధ్రాయూనివర్శిటీ విద్యార్ధులు
-
ఏయూ సొంత జాగీరా
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న ప్రతిష్టాత్మక ఆంధ్ర విశ్వవిద్యాలయం(ఏయూ)ను తెలుగుదేశం పార్టీ నేతలు సొంత జాగీరులా మార్చేస్తున్నా పాలకమండలి సభ్యులు గానీ, అధికారులు గానీ కిమ్మనకపోవడం వివాదాస్పదమవుతోంది. పైగా టీడీపీ నేతలకు వంతపాడుతూ ఉన్నతాధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలపాలవుతోంది. సరిగ్గా గతేడాది మే నెలలోనే ఏయూ గ్రౌండ్స్‌లో ఎటువంటి అనుమతుల్లేకుండా టీడీపీ మహానాడు నిర్వహించిన పార్టీ పెద్దలు మంగళవారం ధర్మపోరాట సభ పేరిట రాజకీయ కార్యక్రమం నిర్వహించడం చర్చాంశనీయమవుతోంది. వర్సిటీలో రాజకీయ పార్టీల సభలు ఏర్పాటు చేయడమే నిబంధలకు విరుద్ధం కాగా.. ఆ సభకు కనీసంగా అనుమతులు తీసుకోకపోవడం టీడీపీ నేతల లెక్కలేని తనానికి అద్దం పడుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఏటా మే నెలాఖరులో నిర్వహించే మహానాడును గతేడాది ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏయూలో నిర్వహించడమే వివాదాస్పదమైతే... అసలు ఏయూ అధికారుల నుంచి నిర్వహణకు కనీస అనుమతులు కూడా పొందని టీడీపీ నేతల బరితెగింపు వ్యవహారంపై అప్పట్లో అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. కనీసం గత అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా జాగ్రత్తగా ఉండాల్సిన ఏయూ అధికారులు ఈ సారి స్వయంగా వారే దాసోహం అన్నారు. దీంతో టీడీపీ ప్రత్యేక హోదాపై ‘అర్ధంతరపు’ ఉద్యమ కార్యాచరణలో భాగంగా మంగళవారం తలపెట్టిన ధర్మపోరాట సభకు వర్సిటీ అధికారులే అనుమతిలిచ్చేశారు. టీడీపీ నాయకులు మాట వరుసకు వచ్చి కలిస్తే... అయ్యో ఫరవాలేదండీ... మీ ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్స్‌ను వాడుకోండి... అంటూ సొంతజాగీరులా అప్పజెప్పేశారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మాత్రం నో తెలుగుదేశం పార్టీకి వంతపాడుతూ ఏయూ గ్రౌండ్స్‌లో సభకు అనుమతిలిచ్చేసిన అధికారులు ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం ఎప్పటికప్పుడు మోకాలడ్డుతూ వస్తున్నారు. 2015 సెప్టెంబర్‌లో ప్రత్యేక హోదా డిమాండ్‌తోనే యువభేరి పేరిట విద్యార్థులు, యువకులతో వర్సిటీ గ్రౌండ్స్‌లో సదస్సు నిర్వహించాలని వైఎస్సార్సీపీ నేతలు భావించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లో రాజకీయ సమావేశాలు, మత సంబంధమైన కార్యక్రమాల నిర్వహణకు అనుమతి ఇవ్వొద్దని ఉన్నత విద్యామండలి జీవో జారీ చేసిందంటూ అప్పట్లో వర్సిటీ అధికారులు హడావుడి చేశారు. అనుమతిలివ్వలేమని చేతులెత్తేశారు. దీంతో వైఎస్సార్సీపీ నేతలు యువభేరిని పోర్టు కళావాణి స్టేడియంలో నిర్వహించుకున్నారు. ఆ తర్వాత 2016 నవంబర్‌లో జై ఆంధ్రప్రదేశ్ పేరిట బహిరంగసభను నిర్వహించేందుకు ఏయూ గ్రౌండ్స్‌ను అడిగితే అప్పు డూ అదే సాకు చెప్పారు. దీంతో వన్‌టౌన్ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించారు. విద్యార్థుల దీక్షలకూ నిరాకరణ ఇక ప్రత్యేక హోదా డిమాండ్‌తోనే వర్సిటీలో విద్యార్థులు దీక్షలు తలపెడితే కనీస మానవత్వం లేకుం డా వర్సిటీ అధికారులు ఉక్కుపాదం మోపా రు. గత ఏప్రిల్‌లో ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీకి చెందిన పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో చేపట్టిన నిరవధిక దీక్షలకు సంఘీభావంగా ఏయూలో విద్యార్థి సంఘాల నేతలు నిరవధిక నిరశన దీక్షలకు దిగారు. ఆ మేరకు కనీసం టెంట్ వేసుకునేందుకు కూడా వర్సిటీ అధికారులు అనుమతివ్వలేదు. వేసిన టెం ట్లు కూడా నిర్దాక్షిణ్యంగా తీసివేయడంతో విద్యార్థి నేతలు మండుటెండలోనే దీక్షలు కొనసాగించారు. టీడీపీ సభకు మాత్రం సై... వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులపై ఇలా లెక్కలేనన్ని ఆంక్షలు పెట్టిన ఏయూ అధికారులు అధికార టీడీపీ నేతలు వచ్చి సభ పెట్టు కుంటామంటే ఏ మాత్రం ఆలోచించకుండా అనుమతులిచ్చేశారు. పోనీ గ్రౌండ్ వరకే పర్మిషన్ ఇచ్చారని భావించినా.. వర్సిటీలో రోడ్ల మధ్యలో ఇష్టారాజ్యంగా గోతులు తీసి స్వాగత ద్వారాలు, కటౌట్లు పెట్టేస్తున్నా వర్సిటీ అధికారులు మిన్నకుం డటం విమర్శలపాలవుతోంది. వాస్తవానికి అధికా రుల్లోని ఓ వర్గం మాత్రం టీడీపీ నేతల బరితెగింపుపై విస్మయం వ్యక్తం చేస్తున్నా బహిరంగంగా మాట్లాడేందుకు మాత్రం సాహసం చేయడం లేదు. ఇక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏయూపై అధికార టీడీపీ పెత్తనం చేస్తున్నా విద్యార్థి సంఘాలు సైతం మౌనంగా ఉండటం చర్చాంశనీయంగా మారింది. ఏయూ అధికారులు టీడీపీ తొత్తుల్లా మారారు... వంశీకృష్ణ విమర్శ ఏయూ ఉన్నతాధికారులు టీడీపీ నేతలకు తొత్తుల్లా మారారని వైఎస్సార్ సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త వంశీకృష్ణ శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గతంలో తాము ఎన్నోమార్లు ప్రత్యేక హోదా ఉద్యమ సభలకు, సదస్సులకు ఏయూ గ్రౌండ్స్‌ను అడిగితే అనుమతులు నిరాకరించిన అధికారులు టీడీపీ నేతలకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇస్తున్నారని విమర్శించారు. అధికారమదంతో ఏయూను సొంత జాగీరులా వాడుకుంటున్న టీడీపీ నేతలకు విద్యార్థులు గుణపాఠం చెప్పే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. అనుమతిచ్చాం.. అద్దెకట్టారో లేదో తెలియదు: వీసీ నాగేశ్వరరావు టీడీపీ అర్బన్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ వచ్చి అనుమతి కావాలని అడిగారు.. సెలవులే కదా అని వర్సిటీ గ్రౌండ్స్‌ను అద్దెకిచ్చాం.. రోజుకు లక్ష వరకు అద్దె చెల్లించాలి.. మరి ఆ డబ్బులు కట్టారో లేదో నాకు తెలియదు... అని ఏయూ వీసీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధితో అన్నారు. ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సహా ఇతర పార్టీల సభలు, సదస్సులకు అనుమతులు ఇవ్వని మీరు... టీడీపీ సభలకు మాత్రమే ఎలా ఇస్తున్నారని ప్రశ్నించగా... అప్పుడు సెలవుల్లేవు.. ఇప్పుడు సెలవులు కదా.. అందుకే ఇచ్చామని చెప్పుకొచ్చారు. వైఎస్సార్సీపీ నేతలు సెలవుల రోజుల్లో అడిగినా పర్మిషన్ ఇవ్వలేదని ప్రస్తావించగా.. ఏమో ఆ తేదీలు గుర్తు లేవు అని సమాధానమిచ్చారు. -
రోజూ 18 పేపర్లు చదువుతా..
సాక్షి, విశాఖపట్నం: ‘అప్పట్లో మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు.. రాజకీయ నాయకులూ లేరు. వారసత్వం లేకున్నా జవసత్వంతో ఈ స్థాయికి (ఉపరాష్ట్రపతి) ఎదిగా. నా జీవితంలో అన్ని పదవులూ చేశా. స్కూలు, కాలేజీ, యూనివర్సిటీల్లో విద్యార్థి నాయకుడిగా పనిచేశాను. కేంద్రంలో కీలక మంత్రి పదవులు చేపట్టాను. బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి అధిరోహించాను. ఇప్పుడు దేశంలోనే రెండో అత్యున్నత పదవిలో ఉన్నాను. ఇలా అన్ని పదవులూ నిర్వహించాను.నేను నా ఈ జీవితాన్ని ఊహించలేదు.’ అని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తన మనసులో భావాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీలో గురువారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) మొదటి బ్యాచ్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ‘నేను యువకుడిగా ఉన్నప్పుడు వాజ్‌పేయి నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆయన బహిరంగ సభకు జనమంతా తరలి రావాలంటూ జట్కాబండిలో మైకులో ఊరంతా ప్రచారం చేశాను. కానీ వాజ్‌పేయి, అద్వానీల్లాంటి వారి మధ్య కూర్చుని ప్రసంగిస్తానని గాని, దేశంలో రెండో అత్యున్నత పదవి (ఉపరాష్ట్రపతి)కి ఎదుగుతానని నేనూహించలేదు.’ అని వివరించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను రైతుల కష్టాలను ఎరుగుదునన్నారు. ‘నేను తాడిచెట్టు ఎక్కగలను. చెరువుల్లో ఈదగలను. చిన్నతనంలో పశువులను కడిగే వాడిని. నాగలిపట్టి పొలం దున్నేవాడిని. ఇవన్నీ నాకు మా తాత నేర్పారు. చేలో పంటను పక్షులు తినకుండా కొట్టేవాళ్లం. పంట ఇంటికొచ్చాక అవి తినడానికి వీలుగా వరి, జొన్న, సజ్జ కంకులను ఇళ్ల పంచలకు వేలాడదీసేవాళ్లం. ఇవన్నీ విద్యార్థులు తెలుసుకుంటే మన నాగరికత, సంస్కృతి ఎంత గొప్పదో అర్థం అవుతుంది.’ అని వివరించారు. నేను రోజూ 18 దినపత్రికలు చదువుతాను. మీరూ పత్రికలు చదవి వాటి ద్వారా జ్ఞానాన్ని అవగతం చేసుకోండి’ అని పిలుపునిచ్చారు. విశాఖలో తిరగని వీధి లేదు.. ‘విశాఖ వస్తే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది. విశాఖలో నేను తిరగని వీధిలేదు. అప్పట్లో ఎన్ఎస్ఎన్ రెడ్డి గెలుపుకోసం ఎన్నికల్లో గట్టిగా పనిచేశా. ఆంధ్ర యూనివర్సిటీలో గోపీ బడ్డీ, ఎండు చేపలు, చావుల మదుం, జగదాంబ జంక్షన్.. ఆర్కే బీచ్.. ఇలా ఒకటేమిటి విశాఖలో ప్రకృతి అందాలన్నీ అన్నీ గుర్తుకొస్తాయి.’ అని విశాఖతో తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడాలని, విలాసాల వైపు వెళ్లొద్దని ఉద్బోధించారు. మావి హ్యాపీ డేస్.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చదువుకునే రోజుల్లో అంతా స్నేహపూర్వకంగా ఉండేవాళ్లం. చదువుకే ఎక్కువ ప్రాధాన్యతిచ్చేవాళ్లం. స్టూడెంట్స్ ఎన్నికలకు గట్టి పోటీ ఉండేది. జై ఆంధ్ర ఉద్యమంలో ఆరు నెలలు డుమ్మా కొట్టాను. మా క్లాస్మేట్స్ 12 మంది జడ్జీలయ్యారు. వారిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకరు. యూనివర్సిటీలో మావి హ్యాపీ డేస్!’ అంటూ స్టూడెంట్ జీవితాన్ని వివరించమని అడిగిన ఓ విద్యార్థికి వెంకయ్యనాయుడు సమాధానం ఇచ్చారు. -
ఉత్తమ విద్యాసంస్థగా ఏయూ
సాక్షి సెంట్రల్ డెస్క్, విజయవాడ : దేశవ్యాప్తంగా ఉన్నత విద్యా సంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ మంగళవారం ర్యాంకులను ప్రకటించింది. మొత్తం 9 విభాగాల్లో(ఓవరాల్, ఇంజనీరింగ్, వర్సిటీ, మేనేజ్మెంట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, మెడికల్, లా, ఆర్కిటెక్చర్) ఈ ర్యాంకులను వెల్లడించింది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ఇండియా ర్యాంకింగ్స్ 2018 పేరుతో వీటిని విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 3,954 విద్యా సంస్థలను పరిశీలించిన అనంతరం ర్యాంకులను ప్రకటించింది. ఈ ఏడాది ఓవరాల్ కేటగిరీలో రాష్ట్రానికి చెందిన నాలుగు విద్యాసంస్థలకు టాప్ – 100లో చోటు లభించింది. దేశంలోని టాప్ ఉన్నత విద్యాసంస్థల్లో (ఓవరాల్‌గా) విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం 36వ ర్యాంక్ సాధించింది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం 74 వ స్థానంలో నిలిచింది. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) 83వ స్థానంలో నిలువగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె 89వ స్థానంలో నిలిచింది. వివిధ విభాగాలకు సంబంధించి టాప్ 100లో చోటు సాధించిన రాష్ట్రానికి చెందిన విద్యాసంస్థల వివరాలు ఇలా ఉన్నాయి తెలంగాణలో.. తెలంగాణకు సంబంధించి గతేడాది ఓవరాల్ కేటగిరీలో ఐదు విద్యా సంస్థలు టాప్–100లో ఉంటే.. ఈసారి నాలుగు విద్యా సంస్థలే ఆ అర్హత సాధించాయి. దేశంలో టాప్ ఉన్నత విద్యా సంస్థల్లో(ఓవరాల్‌గా) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ) 11వ స్థానాన్ని దక్కించుకుంది. గతేడాది 14వ స్థానంతో సరిపెట్టుకున్న సెంట్రల్ వర్సిటీ ఈసారి తన స్థానాన్ని మెరుగు పరుచుకుంది. ఇక హైదరాబాద్ ఐఐటీ, వరంగల్ ఎన్ఐటీలు తమ ప్రమాణాలను మెరుగుపరచుకుని గతేడాది కంటే మెరుగైన స్థానాలను దక్కించుకున్నాయి. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాంకు గతేడాది కంటే ఈసారి మరింతగా పడిపోయింది. గతేడాది 38వ ర్యాంకు తెచ్చుకున్న ఉస్మానియా ఈసారి 45వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. ఐదు అంశాల ప్రాతిపదికగా ర్యాంకులు.. ప్రధానంగా ఐదు అంశాల ప్రాతిపదికగా కేంద్రం ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో టీచింగ్, లెర్నింగ్ రిసోర్సెస్, రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్, గ్రాడ్యుయేషన్ అవుట్ కమ్స్, ఔట్రీచ్ అండ్ ఇన్‌క్లూజివిటీ, పర్సెప్షన్ ఆధారంగా 100 పాయింట్లకు లెక్కించి వచ్చిన పాయింట్ల ద్వారా ఈ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో ప్రధానంగా విద్యా సంస్థల్లో పీహెచ్డీ విద్యార్థులు, శాశ్వత అధ్యాపకులు, అధ్యాపక–విద్యార్థి నిష్పత్తి, సీనియర్ అధ్యాపకులు, బడ్జెట్.. దాని వినియోగం, పబ్లికేషన్స్, ప్రాజెక్టులు, ప్రొఫెషనల్ ప్రాక్టీసెస్, పరీక్షల ఫలితాలు, ప్లేస్‌మెంట్స్, హయ్యర్ స్టడీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, టాప్ యూనివర్సిటీల్లో చేరిన విద్యార్థులు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు చెందిన విద్యార్థుల శాతం, మహిళా విద్యార్థులు, పోటీతత్వం, పరిశోధనలు, వాటి ఫలితాలు తదితర అంశాల ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. అత్యుత్తమ విద్యాసంస్థ ఐఐఎస్సీ దేశంంలోనే అత్యుత్తమ విద్యాసంస్థగా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) నిలిచింది. గతేడాది మాదిరిగానే ఇప్పుడు కూడా ఓవరాల్‌తోపాటు విశ్వవిద్యాలయాల విభాగంలోనూ ఐఐఎస్సీ తొలిస్థానం సాధించింది. అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా ఐఐటీ–మద్రాస్, అత్యుత్తమ మేనేజ్మెంట్ విద్యాసంస్థగా ఐఐఎం–అహ్మదాబాద్, అత్యుత్తమ వైద్య విద్యాసంస్థగా ఢిల్లీలోని ఎయిమ్స్ నిలిచాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 301 విశ్వవిద్యాలయాలు, 906 ఇంజినీరింగ్, 487 మేనేజ్మెంట్, 286 ఫార్మసీ, 101 వైద్య, 71 లా, 59 అర్కిటెక్చర్ విద్యాసంస్థలతోపాటు 1087 సాధారణ డిగ్రీ కళాశాలలను అనేక అంశాలవారీగా పరిశీలించిన అనంతరం ఎన్ఐఆర్ఎఫ్ ఈ ర్యాంకులు ప్రకటించింది. వచ్చే ఏడాది నుంచి అన్ని ప్రభుత్వ విద్యాసంస్థలూ ర్యాంకుల కేటాయింపు కోసం ఎన్‌ఐఆర్‌ఎఫ్‌కు దరఖాస్తులు పంపించాల్సిందేననీ, లేకుంటే వాటికి నిధులను నిలిపేస్తామని కేంద్ర మానవవనరులశాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. యూనివర్సిటీల విభాగంలో - ఆంధ్ర విశ్వవిద్యాలయం (విశాఖపట్నం – 22 - శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) – 49 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 56 - శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (తిరుపతి)– 62 - గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం)– విశాఖ– 85 - శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ (అనంతపురం)– 92 ఇంజినీరింగ్ విభాగంలో... - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం)– 49 - ఏయూ ఇంజినీరింగ్ కాలేజ్ (విశాఖపట్నం) – 65 - శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (తిరుపతి) – 71 - సాగి రామక్రిష్ణంరాజు ఇంజినీరింగ్ కాలేజ్ (భీమవరం) – 85 - యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ (కాకినాడ) – 97 కళాశాల విభాగంలో.. - సిల్వర్‌జూబ్లీ డిగ్రీ కాలేజ్ (కర్నూలు) – 35 - ఆంధ్రా లయోలా కాలేజ్ (విజయవాడ)– 56 మేనేజ్మెంట్ విభాగంలో.. - ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ (సత్యవేడు)– 34 - కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ (వడ్డేశ్వరం) – 46 ఫార్మసీ విభాగంలో.. - ఏయూ కాలేజ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ సైన్సెస్ (ఆంధ్రాయూనివర్సిటీ) – 28 - రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (అనంతపురం) – 39 లా విభాగంలో..: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కాలేజ్ ఆఫ్ లా (విశాఖపట్నం) – 10 ఎస్‌ఆర్‌కేఆర్‌కు జాతీయస్థాయి ర్యాంకింగ్ భీమవరం: జాతీయస్థాయి విద్యాసంస్థల ర్యాంకింగ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు 85వ ర్యాంకు వచ్చిందని ప్రిన్సిపాల్ జి.పార్థసారథి వర్మ తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన వివరాలు వెల్లడిం చారు. కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ న్యూఢిల్లీలో ఈ ర్యాంకులకు ప్రకటించారని చెప్పారు. దేశవ్యాప్తంగా 4,500 యూనివర్సిటీలు, ఐఐటీలు, ఎన్ఐటీలతో సహా పలు సంస్థలకు జాతీయ ర్యాంక్‌లు వచ్చాయని తెలిపారు. -
ప్రముఖ ఇంజనీర్ ఆచార్య శివాజీరావు కన్నుమూత
ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు): ఏయూ మాజీ ఆచార్యుడు, ప్రముఖ ఇంజనీర్ తిపిరినేని శివాజీరావు శనివారం మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సందర్శ నార్థం ఆయన భౌతికకాయాన్ని విశాఖ ఎంవీపీ కాలనీ సెక్టార్ 6లోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులతో పాటు ఏయూ ఆచార్యులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. శనివారం సాయంత్రం జ్ఞానాపురం శ్మశానవాటికలో దహన సంస్కారాలు నిర్వహించారు. ఆచార్య టి. శివాజీరావు 1932లో కృష్ణాజిల్లా ముదినేపల్లిలో జన్మించారు. బెంగళూర్‌లోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పొందారు. టెక్సాస్‌లోని రైస్ యూనివర్సిటీలో ఎంఎస్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పూర్తిచేశారు. అనంతరం రెండేళ్ల పాటు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణానికి ఫీల్డ్ ఇంజనీర్‌గా సేవలందించారు. తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అధ్యాపకుడిగా ప్రస్థానం ప్రారంభించిన ఆయన.. ఆచార్యుడిగా, సివిల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ విభాగాధిపతిగా, ఏయూ ఇంజ నీరింగ్ కళాశాల ప్రిన్సిపల్‌గా సేవలందించి పదవీ విరమణ పొందారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డును సైతం అందుకున్నారు. అనంతరం పలు ఎన్విరాన్మెంటల్, ఇండస్ట్రియల్, హైడ్రోపవర్ ప్రాజెక్టులకు టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌గా సేవలందించారు. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడిగా, బోర్డు టెక్నికల్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించారు. తాజ్‌మహల్, పోలవరంతో పాటు అనేక పర్యావరణ సంబంధిత అంశాలకు సంబంధించి 85కు పైగా ఆయన రచనలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచురితమయ్యాయి. ఆయన అనేక ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ప్రాజెక్టులకు ముఖ్య సలహాదారుగా కూడా వ్యవహరించారు. -
ఒకే ఒక్కడు కోసం.. మళ్లీ పరీక్ష!
పరీక్షలంటే ఆషామాషీ కాదు.. ఏడాదంతా చదివిన దానికి ఫలితం తేల్చేదే పరీక్ష..నిర్ణీత తేదీల్లో నిర్వహించే పరీక్షలకు విద్యార్థులు తప్పనిసరిగా హాజరవ్వాల్సిందే.. తమ ప్రతిభను నిరూపించుకోవాల్సిందే.. గైర్హాజరైతే పరీక్ష తప్పినట్లే.. హాజరుకాని వారికి మళ్లీ పరీక్ష పెట్టే అవకాశం లేదు.ఒకవేళ అరుదైన పరిస్థితుల్లో ఎప్పుడైనా మళ్లీ పరీక్ష పెట్టాల్సివస్తే పాత ప్రశ్నపత్రం కాకుండా.. కొత్తది తయారు చేయాల్సిందే.. ఎలిమెంటరీ నుంచి పీజీ స్థాయి వరకు పాటించే పద్ధతి ఇదే..కానీ ఘనత వహించిన మన ఆంధ్ర విశ్వకళాపరిషత్వారు ఆ సంప్రదాయానికి తిలోదకాలిచ్చేశారు.ఆశ్రిత పక్షపాతంతో పరీక్షలను ప్రహసనప్రాయంగా మార్చేశారు.కేవలం.. ఒకే ఒక్కడి కోసం.. ఎటువంటి సకారణం లేకుండా.. సదరు విద్యార్థి కోరడమే ఆలస్యమన్నట్లు.. అత్యంత ఉదారంగా ఒక్కరోజు వ్యవధిలోనే పరీక్ష పెట్టారు.అదీ.. రెండు రోజుల క్రితమే జరిగిన అసలు పరీక్షలో ఇచ్చిన ప్రశ్నపత్రాన్నే.. ఈ ఒకే ఒక్కడికి ఇచ్చి పరీక్ష రాయించారు.అధికార పార్టీ నేతల సిఫారసులతోనే నిబంధనలను మీరి రిజిస్ట్రార్ ఈ ప్రహసనం కానిచ్చేశారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక్కడి కోసం మళ్లీ పరీక్ష పెట్టారా?.. పాత ప్రశ్నపత్రమే ఇచ్చారా?!..ఇది నిజ మా.. ఇంత ఘోరమా.. అనిపించే ఈ ఉదం తం ఒకింత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏయూ పాలనలోని డొల్లతనం, అవకతవకలు, అస్మదీయుల కోసం ఏదైనా చేసే బరితెగింపుతనాన్ని బట్టబయలు చేసిం ది. ఏయూ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం 2014 బ్యాచ్‌కు చెందిన జీఎస్ఎస్ వెంకటేష్‌కు బీటెక్ సెకండియర్‌లో ఎలిమెం ట్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు మిగిలిపోయింది. మూడేళ్ల నుంచి రాస్తున్నప్పటికీ ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పని చేస్తున్న అతన్ని బీటెక్ సర్టిఫికెట్ సమర్పించాలని సదరు సంస్థ ఒత్తి డి చేసింది. దీంతో మిగిలిపోయిన ఒక్క సబ్జెక్టును ఎలాగైనా అయిందనిపించుకోవాలని భావించాడు. ఇదే తరుణంలో స్పెషల్ ఎగ్జామినేషన్ నిర్వహించేం దుకు ఏయూ నోటిఫికేషన్ వెలువరించింది. వీసీకి తెలియకుండానే.. వాస్తవానికి ఈ వ్యవహారంలో రిజిస్ట్రార్‌కు సర్వాధికారాలు లేవనే చెప్పాలి. ప్రత్యేక పరిస్థితుల్లో అలా ఎగ్జామ్ పెట్టాల్సి వస్తే.. వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకువెళ్లి, అనుమతి తీసుకోవాలి. కానీ వీసీకి చెప్పకుండానే.. విద్యార్థి లేఖ ఇచ్చిన మరుసటి రోజే నవంబర్ 4న ప్రత్యేకంగా అతనికి పరీక్ష నిర్వహించారు. ఇంకో దారుణం ఏమిటంటే.. ఒకటో తేదీన జరిగిన అసలు పరీక్షలో ఏ ప్రశ్నాపత్రం ఇచ్చారో.. 4న నిర్వహించిన పరీక్షకు కూడా అదే పేపర్ ఇచ్చారు. వాల్యుయేషన్ సందర్భంలో ఈ వ్యవహారం బయటపడటంతో వర్సిటీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి, టీఎన్ఎస్ఎఫ్ నేతల సిఫారసు మేరకే రిజిస్ట్రార్ ఇలా అడ్డగోలుగా వ్యవహరించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఏయూ డిగ్రీ పేపర్ లీక్ విషయంలోనూ, పేపర్ రీవాల్యుయేషన్ వ్యవహారాల్లోనూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావుపై లెక్కకు మించిన ఆరోపణలున్నాయి. ఇప్పుడు నిబంధనలకు విరుద్ధంగా మళ్లీ మళ్లీ నిర్వహించిన రిజిస్ట్రార్ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మళ్ళీ పరీక్షకు రిజిస్ట్రార్ సిఫారసు ఈ మేరకు వెంకటేష్ పరీక్షకు దరఖాస్తు చేసుకోగా 310126510030 నెంబరుతో అధికారులు హాల్ టికెట్ జారీ చేశారు. అయితే గత ఏడాది నవంబర్ ఒకటో తేదీన జరిగిన పరీక్షకు అతను హాజరుకాలేదు. కానీ అదే నెల మూడో తేదీన అతను ఏయూకు వచ్చి ఒకటో తేదీనాటి పరీక్షకు హాజరుకాలేకపోయిన తనకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలని రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావును కలిసి లిఖిత పూర్వకంగా కోరాడు. తన గైర్హాజరీకి సరైన కారణం కూడా చూపలేదు. ప్రత్యేకంగా పరీక్ష పెట్టడం కుదరదని,, తదుపరి నోటిఫికేషన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాల్సిన రిజిస్ట్రార్ అందుకు విరుద్ధంగా వ్యవహరించారు. ఆ లేఖపై సంతకం పెట్టడంతో పాటు.. మళ్లీ పరీక్ష నిర్వహించాలని పరీక్షల కంట్రోలర్‌కు మౌఖిక ఉత్తర్వులు జారీ చేశారు. చాలా పెద్ద తప్పు..విచారణకు ఆదేశించా జీఎస్ఎస్ వెంకటేష్ అనే అభ్యర్ధి కోసం నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష పెట్టారన్న విషయం నా దృష్టికి ఆలస్యంగా వచ్చింది. అది చాలా పెద్ద తప్పు. ఓ రకంగా నేరం. వెంటనే ఫలితాలను నిలుపుదల చేయించాను. ఎవరి సిఫారసుతో పరీక్ష పెట్టారనేది నేను అప్పుడే చెప్పలేను. అసలు ఈ విషయం బహిర్గతమైతే వర్సిటీ పరువుకు భంగమే.. వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించాను. – నాగేశ్వరరావు, ఏయూ వీసీ -
కాఫీ గ్లాసు కూడా తీసుకుపొండి
♦ సాహిత్య మరమరాలు ఇది 1939 నాటి సంగతి. ఆంధ్రవిశ్వవిద్యాలయం తరఫున తిరుమల రామచంద్ర, కొమ్మనమంచి జోగయ్య శర్మ ‘ద్విపద భారతం’ ముద్రణప్రతిని సిద్ధపరచడానికి తంజావూరు వెళ్లారు. కాఫీ తాగాలని స్టేషను దగ్గరి హోటల్‌కు వెళ్లారు. అప్పటికి కాఫీ గానీ, మంచినీళ్లుగానీ ఎంగిలి చేసి తాగరాదనే నియమం హోటళ్ల నుంచి పోలేదు. గాజు గ్లాసును మాత్రం ఎంగిలి చేయవచ్చు. అందుకే జోగయ్య శర్మ సర్వరును కాఫీని గాజుగ్లాసులో తెమ్మన్నారు. అతడు ఏ లోకంలో ఉన్నాడో ఇత్తడి గ్లాసులో పట్టుకొచ్చాడు. ఎటూ తెచ్చాడు కదా అని జోగయ్య ఎంగిలి చేసి తాగేశారు. తాగేవరకు ఆగి, దగ్గరికి వచ్చి, ప్రొప్రయిటర్ ‘‘అయ్యా! కప్పు వెల కూడా కడుతున్నాను– కప్పు వాంగిడు పోరగసి– కప్పు వెల కూడా ఇచ్చి కప్పు తీసుకుపొండి’’ అన్నాడు. గోడ మీద నోటీసు చూపించాడు. నాకు తమిళం రాదు, నేను గాజుగ్లాసులోనే తెమ్మన్నాను, అంటారు జోగయ్య. ‘ఇదంతా ముడియాదు, డబ్బు చెల్లించాల్సిందే’ అంటాడు ప్రొప్రయిటర్. ‘హోరాహోరీ పోట్లా’ట తర్వాత, తిరుమల రామచంద్రకు తెలిసిన రాజగోపాలయ్యర్ అనే స్థానిక కాంగ్రెస్ నాయకుడు వచ్చి వారిని శాంతపరిచాడు. గాజుగ్లాసులోనే తెమ్మన్నా ఇత్తడి గ్లాసులోనే తెచ్చిన మతిమరుపు సర్వరుది తప్పుగా తేల్చారు. సర్వరు నష్టపోవడం ఇష్టంలేక జోగయ్య శర్మ గ్లాసు నష్టం చెల్లించడానికి సిద్ధపడ్డారు. ఈలోపు ప్రొప్రయిటరే ‘ఠండా అయి సర్వరును చీవాట్లు పెట్టి’ ఆ గ్లాసును వాళ్ల ఎదుటే గాడిపొయ్యిలో వేసి కాల్చి తోమించారు. (‘పలుకులమ్మ తోటమాలి’లోని తిరుమల రామచంద్ర ‘నా తీరని కోరిక’ వ్యాసం ఆధారంగా)