సాక్షి, విశాఖపట్నం: ఆంధ్ర విశ్వవిద్యాలయంతో ఆరేటి ఉమ మహేశ్వరరావుకు ఎటువంటి సంబంధం లేదని ఏయూ దళిత ప్రొఫెసర్లు షరోన్‌రాజ్, ఏన్ సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. యూనివర్సిటీ యాక్టివ్ రోల్స్‌లో కూడా లేని మహేష్ ఏయూ ప్రతిష్టను మసక బార్చే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడని మండిపడ్డారు. ఏయూ వీసీ ప్రసాద్‌రెడ్డి పారదర్శక పాలన అందిస్తూ, అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. సమాచారహక్కు చట్టం పేరుతో అనేక మంది ప్రొఫెసర్ల, నాన్ టీచింగ్ సిబ్బంది బ్లాక్ మెయిలింగ్‌కు గురవుతున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆరేటి ఉమా మహేశ్వరరావుపై గవర్నర్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరేటి మహేష్‌ను యూనివర్సిటీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న మహేష్‌పై పోలీసులు అధికారులతో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment