mahesh
-
కుల గణన.. కాంగ్రెస్ పార్టీ పేటెంట్
సనత్‌నగర్ (హైదరాబాద్): కులగణన కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, అది జరగనిదే స్థానిక సంస్థల ఎన్నిక లు జరగవని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. యూనివర్సిటీ వైస్చాన్స్లర్ల నియామకాల్లో కూడా నలుగురు బీసీలకు, ఇద్దరు ఎస్సీలు, ఒక ఎస్టీకి అవకాశం ఇవ్వాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చెప్పారు. ‘సమగ్ర కుల గణన–బీసీ రిజర్వేషన్ల పెంపుపై’బీసీల రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం బుధవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్లో జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావుతో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ, కులగణన అంశాన్ని తెరమీదకు తీసుకువచి్చన నేత రాహుల్ గాంధీ అన్నారు. ఎవరికి దక్కాల్సిన ఫలాలు వారికి అందాలనే ఉద్దేశంతో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించడం జరిగిందని గుర్తుచేశారు. నాలుగైదు రోజుల్లో కులగణనపై విధి విధానాలను ఖరారు చేసి ఆ దిశగా ముందుకు సాగుతామన్నారు. రాష్ట్ర ఖజానా అధ్వాన్న స్థితిలో ఉందని, నెలసరి ఆదాయం 18 వేల కోట్లు కాగా, గత ప్రభుత్వం చేసిన ఏడున్నర లక్షల కోట్ల అప్పులు తీర్చేందుకే ఎక్కువ శాతం ఆదాయం కేటాయిస్తూ వస్తున్నట్లు చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అనవసర ప్రాజెక్టులతో దుబారా చేసి అప్పులపాలు చేసిందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ కులగణన అంశాన్ని లేవనెత్తగానే బీజేపీ కూడా స్వరం మార్చి ఆర్ఎస్ఎస్తో మద్దతు తెలియజేస్తోందన్నారు. బీజేపీ హయాంలో పెట్టుబడిదారులకు న్యాయం జరిగిందే తప్ప ప్రజలకు జరగలేదని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరణ చేసిందే తప్ప లాభాల్లో ఉన్న వాటి జోలికి వెళ్లలేదని, నేడు బీజేపీ లాభాల్లో ఉన్న సంస్థలను కూడా ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తోందన్నారు. బీఆర్ఎస్ కూడా కులగణనకు మద్దతు అంటూ ఇప్పుడు చెబుతోందని, గత పదేళ్లు ఆ పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కామారెడ్డి డిక్లరేషన్‌కు అనుగుణంగా కులగణన జరిపి తీరుతామని, ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ కులగణన చేసి తీరాల్సిందేనన్నారు. జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ కులగణనపై గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేపట్టామని, చివరిగా హైకోర్టులో కేసు కూడా వేశామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కులగణనపై స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాము కులగణన మార్చ్ చేపట్టాలనే ఆలోచనను విరమించుకున్నామని జాజుల తెలిపారు. -
తొలిరోజు 285 దరఖాస్తులు... 30 పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: పార్టీ కార్యకర్తలు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం టీపీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ‘మంత్రులతో ముఖాముఖి’కార్యక్రమం ప్రారంభమైంది. తొలిరోజు కార్యక్రమానికి హాజరైన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజల నుంచి 4 గంటల పాటు దరఖాస్తులు తీసుకున్నారు. దాదాపు 285 దరఖాస్తులు రాగా, అందులో 30కి పైగా సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. ఇందుకోసం బాధితుల సమక్షంలోనే ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులతోపాటు పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసిన దామోదర.. వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ముఖ్యంగా 317 జీవో కారణంగా ఇబ్బందులు పడుతున్న గురుకుల ఉపాధ్యాయులు, పలు ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు వచ్చి తమ అర్జీలను అందజేశారు. ఇందిరమ్మ ఇళ్లు కావాలని, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలను పరిష్కరించాలని, రేషన్‌కార్డులు కావాలని, ఉపాధి కల్పించాలని, చిన్నారుల ఆరోగ్య సమస్యలకు సాయం చేయాలని, 108 సిబ్బందికి ఏఎన్ఎం ఉద్యోగ నోటిఫికేషన్లలో వెయిటేజీ ఇవ్వాలని కోరుతూ పలువురు దరఖాస్తులు సమర్పించారు. గత పదేళ్లలో తమపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాలని మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. తొలిరోజు వచ్చిన దరఖాస్తులన్నింటినీ కంప్యూటరీకరించామని, ఎప్పటికప్పుడు ఈ సమస్యల పరిష్కార దశలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గాంధీభవన్ వర్గాలు చెప్పాయి. అద్భుత ఆలోచన: మంత్రి దామోదర గాంధీభవన్‌లో ప్రజావాణి చేపట్టడం అద్భుతమైన ఆలోచన అని మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్‌ను అభినందించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను పరిష్కరించే మాట అటుంచితే కనీసం వారి గోడు వినేవారు కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు తాము ప్రజల సమస్యలు విని పరిష్కరించే దిశలో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ ఆయా శాఖలకు పంపుతామని, వీలున్న దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి: టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ కాంగ్రెస్ పారీ్టకి ప్రజలు, కార్యకర్తలంటే ఎంతో గౌరవమని, అందుకే వారి సమస్యల పరిష్కారం కోసం గాంధీభవన్‌లో ప్రజావాణి లాంటి కార్యక్రమాన్ని చేపట్టామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. వారంలో రెండు రోజులు మంత్రులు గాంధీభవన్‌కు వచ్చి ప్రజలు, కార్యకర్తలతో మమేకమవుతారని, వారి సమస్యలపై అర్జీలు తీసుకుంటారని చెప్పారు. ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని ఆయన కార్యక్రమ ప్రారంభ సభలో చెప్పారు. -
గాందీభవన్ ఆదేశాలను పాటిస్తాం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరంగా గాం«దీభవన్ నుంచి వచ్చే ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని, ముఖ్యమంత్రి సహా యావత్ మంత్రిమండలి ఇందుకు కట్టుబడి ఉంటుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌గౌడ్ బాధ్యతల స్వీకరణ సభలో భట్టి మాట్లాడారు. సామాజిక న్యాయం జరిగేది కాంగ్రెస్ పారీ్టలోనేనని.. ఇందుకు మహేశ్‌గౌడ్‌ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించడమే నిదర్శనమని పేర్కొన్నారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల శ్రమ కారణంగానే పార్టీ అధికారంలోకి వచి్చందని.. కార్యకర్తలను సముచితంగా గౌరవిస్తామని చెప్పారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లే బాధ్యతలను కార్యకర్తలు తీసుకోవాలన్నారు. సమన్వయంతో ముందుకెళ్లాలి: దీపాదాస్మున్షీ పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్మున్షీ సూచించారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, స్థానిక సంస్థల ఎన్నికలను సవాల్‌గా తీసుకుని పనిచేయాలని కోరారు. మరింత బలోపేతం చేయాలి: ఉత్తమ్ కాంగ్రెస్ సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని చెప్పేందుకు మహేశ్‌గౌడ్ నియామకమే నిదర్శనమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. కార్యకర్తల శ్రమ, త్యాగాలతోనే తాము పదవుల్లో ఉన్నామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డికి సీఎం పరామర్శ చిన్నచింతకుంట: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం పరామర్శించారు. మధుసూదన్‌రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్‌లో జరిగిన దశదినకర్మ కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరయ్యారు. మధుసూదన్‌రెడ్డిని, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సీఎం వెంట మంత్రి జూపల్లి, చిన్నారెడ్డి, మల్లురవి ఉన్నారు.సీఎం రేవంత్ ఇంటి సమీపంలో బ్యాగు కలకలం బంజారాహిల్స్ (హైదరాబాద్): సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికి సమీపంలో ఆదివారం ఓ గుర్తుతెలియని బ్యాగు కనిపించడం కలకలం రేపింది. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని రంగోలి స్టోర్ నుంచి సీఎం ఇంటికి వెళ్లేదారిలో ఈ బ్యాగును సీఎస్‌డబ్లూ (సిటీ సెక్యూరిటీ వింగ్) అధికారులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు వెంటనే వెళ్లి.. ఆ బ్యాగ్‌ను పరిశీలన కోసం అక్కడి నుంచి తరలించారు. ఇది సీఎం నిత్యం ప్రయాణించే మార్గం కావడం గమనార్హం. బ్యాగ్‌ను పరిశీలించిన అధికారులు అందులో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేవని గుర్తించినట్లు పోలీసువర్గాలు చెప్తున్నాయి. కానీ అధికారికంగా ఏ ప్రకటనా చేయకుండా గోప్యత పాటిస్తున్నారు. -
పవన్ కళ్యాణ్... చర్చకు రెడీ... పోతిన మహేష్ ఓపెన్ ఛాలెంజ్
-
అమ్మ సాక్షిగా అవినీతి
-
చేతకాని ప్రభుత్వం 4పులిహోర ప్యాకెట్లు..400 ఫోటోలు
-
శ్రవణమే.. నయనం
పుట్టుకతోనే అంధత్వంతో అంతా చీకటి. కానీ తన కళతో చుట్టూ ఉన్న ప్రపంచానికి వెలుగులు పంచాడు. అంధత్వంతో పాటు పేదరికం పుట్టినప్పటి నుంచి అతడిని వెక్కిరిస్తూ వస్తోంది. అయినా తన సంకల్పం ముందు ఇవన్నీ దిగదుడుపే అయ్యాయి. ఢోలక్, కంజీర, రిథమ్ ప్యాడ్ వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అతడి పేరే సిరిపురం మహేశ్. మంచిర్యాల జిల్లా హాజీపురం మండలం దొనబండ మహేశ్ స్వగ్రామం. ఇటీవలే నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన మహేశ్ తన ప్రతిభతో ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాడు. చిన్నప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి ఉండేది. పుట్టుకతోనే చూపు లేకపోయినా తనకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని తన నమ్మకం. శాంతారాం అనే తన చిన్ననాటి స్నేహితుడు ఢోలక్‌ను పరిచయం చేశాడు. అప్పటి నుంచి సంగీతంపై ఆసక్తి పెరిగిందని మహేశ్ పేర్కొన్నాడు. అయితే దుర్గం శంకర్ అనే మాస్టారు ఢోలక్లో మెళకువలు నేరి్పంచి, తనను ఇంతవరకూ తీసుకొచ్చాడని గుర్తు చేసుకున్నాడు. చాలా ఫంక్షన్లలో జరిగే ఆర్కెస్ట్రాల్లో వాయిద్య పరికరాలను వాయిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. అవార్డులు, రివార్డులు తెలుగు టాలెంట్స్ మ్యూజిక్ అవార్డు, తెలంగాణ ప్రభుత్వం కళోత్సవం సందర్భంగా రెండుసార్లు అవార్డు తనను వరించింది. ఆర్కెస్ట్రాలో ఢోలక్, కంజీర వాయిస్తుంటే చాలా మంది ఆశ్చర్యపోయి మెచ్చుకునే వారని మహేశ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇక సంగీతంతో పాటు తెలుగులో కూడా ప్రావీణ్యం సాధించాడు మహేశ్. పేరడీ పాటలు, కవితలు కూడా రాస్తుంటాడు. అదే నా కల.. భవిష్యత్తులో తెలుగు టీచర్‌గా స్థిరపడాలనేది తన కల అని చెబుతున్నాడు. అంధులకు తెలుగులో వ్యాకరణం నేర్చుకోవడం చాలా కష్టం. కానీ నిజామ్ కాలేజీలో చంద్రయ్య శివన్న అనే తెలుగు మాస్టారు ఎంతో ఓపికగా పాఠాలు నేరి్పంచేవారని చెప్పుకొచ్చారు. పదో తరగతి వరకూ బ్రెయిలీ లిపిలో పాఠాలు ఉండేవని, ఇంటర్ తర్వాత అంధులు పాఠాలు నేర్చుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నాడు. చంద్రయ్య మాస్టారు పుస్తకాలను పీడీఎఫ్‌లోకి మార్చి తన లాంటి వారికి ఇచ్చేవారని చెప్పాడు. -
స్కూల్ లైఫ్ ఆరంభం
పులివెందుల మహేశ్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘స్కూల్ లైఫ్’. సావిత్రీ కృష్ణ హీరోయిన్గా నటిస్తున్నారు. నైనీషా, రాహుల్ త్రిశూల్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లోప్రారంభమైంది. ఈ మూవీ పూజా కార్యక్రమానికి హీరో కిరణ్ అబ్బవరం, డైరెక్టర్ వి. సముద్ర ముఖ్య అతిథులుగా హాజరై, యూనిట్‌కి అభినందనలు తెలిపారు. పులివెందుల మహేశ్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ నా ఒక్కడిదే కాదు.సినిమా మీద ఉన్న ఇష్టంతో పాటు కథ నచ్చి క్రౌడ్ ఫండింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో పాటు నా ఇల్లు అమ్మి ఈ సినిమా తీస్తున్నాను. మా బడ్జెట్ సరిపోకపోవడంతో కథ నచ్చి, నన్ను నమ్మి సహకారం అందిస్తున్న నిర్మాత రాహుల్ త్రిశూల్గారికి కృతజ్ఞతలు’’ అన్నారు. రాహుల్ త్రిశూల్ మాట్లాడుతూ– ‘‘స్కూల్ లైఫ్’ రెగ్యులర్ షూటింగ్‌ని ఆగస్టు 2నప్రారంభించి సెప్టెంబర్ 2 వరకు సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ధర్మ ప్రభ, సంగీతం: హర్ష ప్రవీణ్. -
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్‌ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్‌నగర్‌కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్‌పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్‌ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్‌ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్‌కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్‌నగర్‌కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్‌కుమార్‌రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్‌రెడ్డి బృందం పోస్ట్‌మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్‌కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
మాజీ ఎంపీటీసీ మహేష్ హత్య కేసులో
-
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్‌ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్‌లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్‌లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్‌లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్‌కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్‌తో కలిసి గజేందర్‌ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్‌కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్‌కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్‌కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్‌ను మొదట వె నుక నుంచి బైక్‌తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్‌ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కేసీఆర్ లేఖలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన తప్పులకు శిక్ష పడుతుందేమోనని భయపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేజీలకు పేజీలు లేఖలు రాసి భయపెట్టే ప్రయ త్నం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్‌కుమార్‌గౌడ్ వ్యాఖ్యానించారు.విద్యుత్ ప్రాజెక్టులు, కొనుగోళ్ల విషయంలో విచా రణ జరుపుతున్న కమిషన్‌కు 12 పేజీల లేఖ రాసే బదులు కమిషన్ ముందుకు వెళ్లి తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన తప్పులు ఒప్పుకుని విచారణకు సహకరించాలని, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం, అక్రమాలు ప్రజలకు తెలియాలని శనివారం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్‌గౌడ్ అభిప్రాయపడ్డారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్‌నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్‌కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్‌కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్‌కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
-
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్‌బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్‌గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
-
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్‌లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్‌ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్‌ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్‌ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్‌లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్‌గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్‌కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్‌సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్‌కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఒకరి గురించి ఒకరు భజన ఈ భజన బ్యాచ్ మనకు అవసరమా
-
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్‌కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్‌లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్‌లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
మహేష్‌బాబుతో సన్‌రైజర్స్ ఆటగాళ్లు.. (ఫోటోలు)
-
పవన్ బాక్ మనీ దందా.. ఐటీకి దిల్ రాజు ఫిర్యాదు
-
అల్లు అర్జున్ తెలుసు కదా.. బ్రాండ్ అంటే అతను..నువ్వు కాదు..!
-
బాబును జైల్లో కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తులు "ఆధారాలతో"
-
జనసేనలో మహిళలకు జరిగేది ఇదే..!