
సాక్షి, విజయవాడ: పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు
మరోవైపు, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తుల్లో పశ్చిమ సీటు బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట బల ప్రదర్శనలు చేపట్టారు. వెస్ట్ టిక్కెట్ తనదే అంటున్న వక్కలగడ్డ భాస్కర్.. ఇటీవల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు.
‘‘వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారని, ఏడుగురు ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపించాం. ముగ్గురు పేర్లను అధినాయకత్వం పరిశీలిస్తోంది. టిక్కెట్ తనకు వస్తుందని ఆశిస్తున్నానని శ్రీరామ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment