![Pothina Mahesh Decision To Contest As An Independent - Sakshi](/styles/webp/s3/article_images/2024/03/21/potinamahesh.jpg.webp?itok=3TfYZ8P7)
సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ సీటు పంచాయితీ పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలని పోతిన మహేష్ కోరగా, టిక్కెట్ ఇచ్చేది లేదంటూ పవన్ తేల్చేశారు. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలంటూ మహేష్ పట్టుబట్టారు. పవన్ కుదరదని చెప్పడంతో రెబల్‌గా బరిలోకి దిగాలని పోతిన నిర్ణయించారు.ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని పవన్‌కు పోతిన స్పష్టం చేశారు.
పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Comments
Please login to add a commentAdd a comment