vijayawada west
-
చంద్రబాబు స్కెచ్.. పోతిన మహేష్ ఆశలు గల్లంతు
సాక్షి, విజయవాడ: పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తున్నట్లుగా తొలుత చెప్పారు. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ తానే అభ్యర్థినంటూ ప్రచారాన్ని మొదలుపెట్టారు. కానీ చంద్రబాబు స్కెచ్‌తో ఆయనకు షాక్ తగిలింది. విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించడంతో.. జనసేన ఆశలు గల్లంతయ్యాయి. బీజేపీ నుంచి సుజనా చౌదరిని బరిలోకి దించింది బీజేపీ. దీంతో ఎప్పటి నుంచి జనసేన తరపున విజయవాడ వెస్ట్ టికెట్ ఆశించిన పోతుల మహేష్ పోరాటం వృథాగా మారింది. పవన్ హామీతో విజయవాడ వెస్ట్ టికెట్ తనకే వస్తుందని పోతిన మహేష్ బలంగా నమ్మారు. పదిరోజులుగా తన వర్గంతో ధర్నాలు,దీక్షలు చేశారు, అయినా నిరాశ తప్పలేదు. తాజాగా ఆ సీటు బీజేపీకి ఖరారు కావడంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు పోతిన మహేష్, విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తమకే కేటాయించాలని జనసేన పట్టుబట్టింది. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఈ నియోజక వర్గాన్ని బీజేపీకి కేటాయించడానికి సుముఖత చూపారు. మరోవైపు బీజేపీ నుంచి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై తర్జన భర్జనలు సాగాయి. వైశ్య సామాజిక వర్గం నుంచి వక్కల గడ్డ భాస్కరరావు, బీసీ నగరాలు సామాజికవర్గం నుంచి అట్లూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాం టికెట్ల రేసులో ఉన్నామంటూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఇంతలో చంద్రబాబు మరోసారి తన పాచిక వేశారు. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరిని విజయవాడ వెస్ట్ నియోజక వర్గం నుంచి బరిలోకి దిపారు. -
పవన్‌పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్‌గా పోటీ?
సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ సీటు పంచాయితీ పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలని పోతిన మహేష్ కోరగా, టిక్కెట్ ఇచ్చేది లేదంటూ పవన్ తేల్చేశారు. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలంటూ మహేష్ పట్టుబట్టారు. పవన్ కుదరదని చెప్పడంతో రెబల్‌గా బరిలోకి దిగాలని పోతిన నిర్ణయించారు.ఇండిపెండెంట్‌గా పోటీచేస్తానని పవన్‌కు పోతిన స్పష్టం చేశారు. పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు? -
విజయవాడ వెస్ట్: దేవుడా పవన్ మనసు మార్చు.. జనసైనికుల నిరసన
సాక్షి, విజయవాడ: పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్‌కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తుల్లో పశ్చిమ సీటు బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట బల ప్రదర్శనలు చేపట్టారు. వెస్ట్ టిక్కెట్ తనదే అంటున్న వక్కలగడ్డ భాస్కర్.. ఇటీవల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ‘‘వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారని, ఏడుగురు ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపించాం. ముగ్గురు పేర్లను అధినాయకత్వం పరిశీలిస్తోంది. టిక్కెట్ తనకు వస్తుందని ఆశిస్తున్నానని శ్రీరామ్ అన్నారు. -
పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు
సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు సొంత పార్టీ కార్యకర్తలు షాక్ ఇచ్చారు. చిలకలూరిపేట బొప్పూడి సభను పెడన, విజయవాడ వెస్ట్ జనసేన కార్యకర్తలు బాయ్‌కాట్ చేశారు. పెడన టికెట్ విషయంలో జనసేన కార్యకర్తలు పట్టు వీడటం లేదు. తమ డిమాండ్ల ను పవన్ పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్ఛార్జ్ పోతిన మహేష్‌కు సీటు వస్తుందని జనసైనికులు ఆశించారు. టికెట్ బీజేపీకి వెళ్లడంతో జనసేన శ్రేణులు మండిపోతున్నారు. ఈ క్రమంలో బొప్పూడి సభకు పోతిన మహేష్ ఒంటరిగానే వెళ్లారు. అయితే సభలో పవన్‌ను నిలదీయాలని మహేష్‌కు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం. చదవండి: పిఠాపురంలో పవన్ పరిస్థితి ఏమిటో? -
చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు
ఏ పార్టీ కనిపిస్తే ఆ పార్టీతో పొత్తుకు సిద్ధమవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలో తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. గెలిచేది లేకపోయినా..టిక్కెట్ కోసం మాత్రం పోటీ ఎక్కువవుతోంది. ఈ మధ్యలో జనసేన నేతలు సీన్లోకి ఎంటరై పొత్తులో భాగంగా ఈ సీటు మాదే అంటున్నారు. ఇప్పుడు బెజవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఏం చేయాలో తెలియక చంద్రబాబు తల పట్టుకుంటున్నారని టాక్. ఆఖరు నిమిషం వరకు టిక్కెట్ల విషయం తేల్చే అలవాటు చంద్రబాబుకు లేదని అందరికీ తెలుసు. అందుకే బెజవాడ వెస్ట్ తమ్ముళ్ళు చివరి వరకు మేము ఆగలేమని..వెంటనే తేల్చాలని పార్టీ అధినేతను డిమాండ్ చేస్తున్నారని సమాచారం. టీడీపీ ఆవిర్భవించాక 1983లో ఒకే ఒక్కసారి ఇక్కడ పచ్చ జెండా ఎగిరింది. ఈ నలభై ఏళ్ళ కాలంలో మళ్ళీ అక్కడ టీడీపీ జెండా ఎగిరింది లేదు. కాని ఈసారి ఎలాగైనా గెలవాల్సిందే అని చంద్రబాబు అక్కడి నేతలకు హుకుం జారీ చేశారట. ఇప్పుడు బుద్ధా వెంకన్న, జలీల్‌ఖాన్‌లు టిక్కెట్ కోసం పట్టుబడుతున్నారు. తమ మనసులో మాట అప్పుడప్పుడు అధిష్టానానికి వినిపించే ప్రయత్నం చేసిన బుద్ధా వెంకన్న , జలీల్ ఖాన్ ఇప్పుడు టిక్కెట్ కోసం నేరుగా పంచాయతీ పెట్టేస్తున్నారట. తాజాగా బుద్ధా వెంకన్న వెస్ట్ నియోజకవర్గంలో తనకు ఉన్న బలం చంద్రబాబుకు తెలియచేసేందుకు ఓ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ టీడీపీ టిక్కెట్ కోసం తాను పెట్టుకున్న అప్లికేషన్ ను ర్యాలీగా వెళ్లి బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో ఉంచి మరీ పూజలు చేయించాడట. తెలుగుదేశం పార్టీ, అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబంపై ఈగ వాలకుండా చూసుకుంటున్న తనకే టిక్కెట్ అడిగే హక్కు ఉందని బుద్ధా వెంకన్న అంటున్నారు. తనకే టిక్కెట్ ఇచ్చి తీరాలంటూ పబ్లిక్‌గానే తన డిమాండ్ ను చంద్రబాబు ముందు ఉంచారట. ఒకవేళ పొత్తులో భాగంగా వెస్ట్ టిక్కెట్ ఇవ్వడానికి కుదరకపోతే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ ఇవ్వాలని తన డిమాండ్ల చిట్టాను చంద్రబాబుకు వినిపించారట. గతంలో ఒకసారి తనకు టిక్కెట్టివ్వకపోతే ఎక్కడ స్విచ్ వేస్తే.. ఎక్కడ బల్బు వెలుగుతుందో తనకు తెలుసని బెదిరించిన బుద్ధా తాజాగా చేసిన వ్యాఖ్యలు బెజవాడ టీడీపీలో రచ్చకు దారి తీసాయి. ఇదిలా ఉంటే నాకేం తక్కువ అంటూ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ టిక్కెట్ రేస్ లోకి దూసుకొచ్చారు. బుద్ధా వెంకన్న ర్యాలీ నిర్వహించాడని తెలియగానే... నేనే లోకల్...నాకే టిక్కెట్టివ్వాలంటూ జలీల్ ఖాన్ పార్టీ నాయకత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎవడు పడితే వాడు టిక్కెట్ అంటే కుదరదు...టీడీపీ కూడా పశ్చిమ టిక్కెట్ ను మైనార్టీలకు కేటాయించాలి...ఆ టిక్కెట్ తనకే ఇవ్వాలి అని చంద్రబాబును నిలదీస్తున్నారట. తనకు బెజవాడ వెస్ట్ టిక్కెట్ ఇవ్వకపోతే ఉరేసుకుంటానని జలీల్‌ఖాన్ బెదిరిస్తున్నారట. టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేయడంతో పాటుగా.. పవన్ కళ్యాణ్‌ను కూడా అర్థిస్తున్నారట. వెస్ట్ టిక్కెట్ కోసం జనసేన పట్టుపట్టవద్దని తనకే మద్దతుగా నిలవాలని పవన్‌ను ప్రత్యేకంగా కలిసి విజ్ఞప్తి చేశారట. తనకు టిక్కెట్ ఇవ్వకపోతే పరిణామాలు వేరేలా ఉంటాయని చంద్రబాబును జలీల్‌ఖాన్ వార్నింగ్ ఇస్తున్నాడట. ఇలా ఓ వైపు బుద్ధా వెంకన్న...మరోవైపు జలీల్ ఖాన్ టిక్కెట్ కోసం కుస్తీ పడుతుంటే..పశ్చిమ నియోజకవర్గం జనసేన శ్రేణుల్లో కలవరం మొదలైందని టాక్. పొత్తులో భాగంగా పశ్చిమ టిక్కెట్ జనసేనకు వస్తుందని నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పోతిన మహేష్ గంపెడాశతో ఉన్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు టిక్కెట్ కోసం కొట్లాడుకోవడంతో తనకు దక్కకుండా పోతుందనే ఆందోళన పోతిన మహేష్‌కు పెరిగిపోతోందట. అందరితోనూ పొత్తులు పెట్టుకుంటూ సంతోషపడుతున్న చంద్రబాబుకు టిక్కెట్ల విషయంలో సొంత పార్టీ నేతలతోనే తలనొప్పులు ఎదురవ్వడంతో దిక్కు తోచడంలేదని చెబుతున్నారు. మరి బెజవాడ వెస్ట్‌లో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
బెజవాడ టీడీపీకి ఏమైంది?.. మళ్లీ కొత్త రగడ!
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉందంటే ఉందని అనుకోవడమే గాని.. అక్కడ 1983 తర్వాత పచ్చ జెండా ఎగిరింది లేదు. వామపక్షాలతో పొత్తు కుదిరినపుడు గెలిస్తే సీపీఐ అభ్యర్థి.. లేదంటే అప్పట్లో కాంగ్రెస్ నేతలు గెలిచేవారు. గత రెండుసార్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండానే పశ్చిమలో ఎగురుతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఇప్పుడు పచ్చ పార్టీలో పంచాయతీ నడుస్తోంది. పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న ఎంపీ కేశినేని నానితో లోకల్ లీడర్లకు అసలు పడటంలేదు. చాన్నాళ్లుగా ఈ గొడవ పచ్చ పార్టీలో నడుస్తూనే ఉంది. రాబోయే ఎన్నికల్లో బెజవాడ వెస్ట్ టిక్కెట్ అభ్యర్థి విషయంలో ఎంపీ కేశినేని నాని పార్టీ అధినేత చంద్రబాబును కలవడంపై ఇప్పుడు కొత్తగా రగడ మొదలైందట. 1983 తర్వాత పశ్చిమ సీటును మర్చిపోయిన తెలుగుదేశం పార్టీ జెండా ఈసారి ఎలాగైనా ఎగరేయాలని చంద్రబాబు కలగంటున్నారట. తమ్ముళ్లే కుమ్మేసుకుంటున్నారు విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో పశ్చిమ నియోజకవర్గ ఇంఛార్జిగా ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి కేశినేనికి బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పడటంలేదని టాక్. వీరి మధ్య గ్యాప్ బాగా పెరిగిపోయి... మూడున్నరేళ్లుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉన్నాయట పశ్చిమ పార్టీలో పరిస్థితులు. కొన్నాళ్లుగా తన సోదరుడు కేశినేని శివనాధ్ పార్టీలో యాక్టివ్ కావడంతో కేశినేని నాని ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పార్టీ అధినేత తనకు అధికారం ఇవ్వడంతో ఈ సెగ్మెంట్లో దాన్ని బాగా ఉపయోగించుకుంటున్నారని చెప్పుకుంటున్నారు. నాని ట్రావెల్స్‌కు స్టాప్ లేదా? తనతో ఒకప్పుడు టచ్ లో ఉన్న నేతలందరినీ కలుపుకుని పోతూ ఇటీవల వరుసగా కార్యక్రమాలు చేస్తూ హడావిడి చేస్తున్నారట కేశినేని నాని. ఈ క్రమంలో వయోభారంతో మొన్నటి వరకూ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న జలీల్ ఖాన్ సైతం ప్రస్తుతం యాక్టివ్ అయ్యారు. జలీల్‌ఖాన్ ఇప్పుడు కేశినేని నాని వెంట తిరుగుతుండటంపై నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. మూలన ఉన్న నేత బయటకు రావడం వరకు బానే ఉంది. అయితే తాజాగా కేశినేని నాని తన అనుచరుడైన ఎం.కె.బేగ్ ను వెంటబెట్టుకుని చంద్రబాబు దగ్గరకు వెళ్లడంతో పశ్చిమ టీడీపీలో కొత్త చిచ్చు రాజేసిందట. టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కు వెళ్లిన కేశినేని నాని ఈసారి పశ్చిమ టిక్కెట్టు ఎం.కె. బేగ్ కు ఇవ్వాలంటూ చంద్రబాబును కోరినట్లు సమాచారం. చదవండి: ఏది నిజం ?: సీబీఐ నుంచి రామోజీ ‘లై’వ్ రిపోర్టింగ్ నాలుగో కృష్ణుడి ఎంట్రీ ఈ విషయం బయటికి తెలియడంతో ఇప్పుడు బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలతో పాటు జలీల్ ఖాన్ కూడా నాని పై గుర్రుగా ఉన్నారట. గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి కూడా తన కుటుంబానికే సీటు దక్కుతుందని ఆశలు పెట్టుకున్న జలీల్ ఖాన్ కు తాజా పరిణామాలు మింగుడు పడటం లేదట. విదేశాల్లో ఉంటూ ఎన్నికలకు ఏడాది ముందు వచ్చి హడావిడి చేసే ఎం.కె.బేగ్ కు టిక్కెట్ ఇవ్వాలని నాని అడగటంపై లోలోన ఉడికిపోతున్నారట. నిన్న మొన్నటి వరకూ కేశినేని నాని అంటే పీకల్లోతు కోపం ఉన్న బుద్ధా వెంకన్న , నాగుల్ మీరాల సరసన ఇప్పుడు జలీల్ ఖాన్ కూడా చేరిపోయారన్న చర్చ జరుగుతోంది. ఇక వెస్ట్ తమ్ముళ్లు మాత్రం ఇప్పటికి ముగ్గురు కృష్ణులు అయిపోయారు ... ఇక నాలుగో కృష్ణుడు వచ్చాడంటూ సెటైర్లు వేసుకుంటున్నారట. పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
విజయవాడ పశ్చిమ సభలో వైఎస్ షర్మిల
-
‘జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు లేదు’
సాక్షి, విజయవాడ: అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.2500 కోట్లు ఇస్తే ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు ఒక్క భవనం కూడా నిర్మించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేకపోయారని అన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను ఇలా అన్ని రంగాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. జాబు రావాలంటే బాబు రావలన్నారని.. కానీ ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం రాలేదని విమర్శించారు. ఆయన కుమారుడు లోకేష్‌కు మాత్రం మంత్రి పదవి వచ్చిందని, ఒక్క ఎన్నిక కూడా గెలవకున్నా ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కృష్ణా జిల్లాలోని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాసరావుని, ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్‌ని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు. సభలో వైఎస్ షర్మిల ప్రసంగిస్తూ.. ‘‘రాష్ట్రానికి ఊపిరి లాంటి ప్రత్యేక హోదాను చంద్రబాబు తాకట్టుపెట్టారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ మోరోసారి హోదా పేరుతో మోసం చేస్తున్నారు. గతంలో నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి.. ఇప్పుడు కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. తమకు బీజేపీ, టీఆర్ఎస్తో పొత్తు ఉందంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్సీపీకి ఎవ్వరితోనూ పొత్తు అవసరం లేదు. వైఎస్ జగన్ సింగిల్‌గా వస్తారు. టీఆర్ఎస్తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా?. వైఎస్ జగన్‌ను సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యంలేక.. మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఫరూక్ అబ్దుల్లా, దేవెగౌడ వంటి నేతలను తోడు తెచ్చుకుంటున్నారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. గడిచిన ఐదేళ్లు ఆయన బాధ్యత కాదా?. మరోసారి ఆయనకు అధికారం అప్పగిస్తే మన బతుకులను నాశనం చేస్తారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన అవినీతి గత 40 ఏళ్లలో జరగలేదని ఆయనతో పనిచేసిన మాజీ సీఎస్ అజయ్ కల్లం బహిరంగంగా చెప్పారు. ఇలాంటి వ్యక్తికి మరోసారి అధికారం ఇస్తామా?. పౌరుషం గురించి చంద్రబాబు మాట్లాడం హాస్యాస్పదం. పిల్లనిచ్చిన సొంత మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఓట్ల కోసం టీడీపీ నేతలు మీ ఇళ్లకు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు గతంలో ఇచ్చిన హామీల గురించి నిలదీయండి. ఒకపైపు ప్రజలను మోసం చేసిన చంద్రబాబు మరోవైపు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వైఎస్ జగన్. న్యాయం వైపు నిలబడండి. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి. ప్రతి పేదవాడిని ఆదుకుంటాం. యూనివర్సెల్ హెల్త్ స్కీం ద్వారా అందరికి ఉచిత వైద్యం కల్పిస్తాం. మహిళలకు, రైతులకు రుణాలు ఇస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తాం. 75శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చే విధంగా చట్టం తీసుకువస్తారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలంటే వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలి’’ అని అన్నారు. -
జలీల్‌ఖాన్ కూతురి నామినేషన్ ఆమోదం..!
సాక్షి, విజయవాడ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. ఆ పార్టీ అభ్యర్థి షబానా ఖాతూన్ నామినేషన్‌ను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. షబానాకు అమెరికా పౌరసత్వం ఉన్న కారణంగా ఆమె నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశముందని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. షబానాకు ఎలాంటి విదేశీ పౌరసత్వం లేదని రిటర్నింగ్ అధికారి రాజేశ్వరి నామపత్రాలు చూసి ఖరారు చేశారు. అమెరికా పౌరసత్వం ఉండడంతో తన నామినేషన్ రద్దు చేస్తారని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు షబానా. కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్‌పై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ కారణంగానే షబానాను చంద్రబాబు ఎన్నికల బరిలో నిలిపారు. -
మైనర్ బాలికతో కానిస్టేబుల్ అదృశ్యం!
సాక్షి, విజయవాడ: కృష్ణా జిల్లా కానూరులో మైనర్ బాలికతో కానిస్టేబుల్ అదృశ్యం కావడం తీవ్ర అలజడి రేపుతోంది. విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి హరి - ఇంటర్ చదువుతున్న బాలికపై కన్నేశాడు. కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ తనను ముగ్గులోకి దింపా. ఈ క్రమంలోనే కాలేజీకి వెళ్లిన బాలికను తన వెంట తీసుకొని వెళ్లిపోయారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు.. పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురి జాడ తెలపాలని ఫిర్యాదు చేశారు. బాలిక వయస్సు 17 ఏళ్లు కావడంతో - కానిస్టేబుల్ బండి హరిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రస్తుతం వారి జాడ కోసం గాలిస్తున్నారు. -
జలీల్ ఖాన్‌పై భగ్గుమంటున్న టీడీపీ నేతలు
సాక్షి, అమరావతి: విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఓవరాక్షన్‌పై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు విజయవాడ పశ్చిమ సీటును తన కుమార్తె షాబానాకు కేటాయించారని జలీల్‌ఖాన్ ప్రకటించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ కేటాయించినట్టు చంద్రబాబు చెప్పకుండానే జలీల్ ఖాన్ ప్రచారం చేసుకోవడం ఏమిటని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ నేతలు కన్నెర్ర జేస్తున్నారు. ఈమేరకు జలీల్ ఖాన్‌పై వారు పార్టీ అధినేత చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా జలీల్ ఖాన్ వ్యవహరిస్తున్నారని టీడీపీ పశ్చిమ నియోజకవర్గం నేతలు విమర్శిస్తున్నారు. ఇటీవల జలీల్‌ఖాన్ ఉండవల్లిలో చంద్రబాబును కలిశారు. పశ్చిమ నియోజకవర్గానికి తన స్థానంలో తన కూతురుకు సీటివ్వాలని అధినేతను కోరారు. దీనిపై చంద్రబాబు.. నియోజకవర్గంలో తిరగాలని, బాగా పనిచేయాలంటూ షాబానాకు సూచించారు. అనంతరం జలీల్‌ఖాన్ బయటికొచ్చి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తన కుమార్తెకు చంద్రబాబు సీటు ఖరారు చేశారని చెప్పారు. విజయవాడలోని తన ఇంటివద్ద తన కుమార్తెకు సీటు వచ్చిందంటూ టపాసులు కాల్చి హడావుడి చేశారు. ఈ విషయం తెలిసిన చంద్రబాబు.. తాను సీటు ఎక్కడ ఖరారు చేశానంటూ జలీల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. -
కృష్ణాజిల్లాలో కమలం-సైకిల్ పొత్తు చిత్తు
టీడీపీలో పొత్తు చిచ్చులు తెచ్చిపెడుతోంది. పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, కైకలూరు నియోజకవర్గాలను పొత్తులో భాగంగా కమలదళానికి చంద్రబాబు కట్టబెట్టారు. అయితే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ ఈసారి బీజేపీ తరఫున అదే స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో టీడీపీ నాయకులు ఈ స్థానం విషయమై భగ్గుమంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును ముస్లిం మైనారిటీలకు కేటాయించాలి తప్ప బీజేపీకి పొత్తులో వదలకూడదని డిమాండ్ చేస్తున్నారు. కైకలూరు స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని కూడా అక్కడి నేతలు అంగీకరించడంలేదు. దీంతో ఇరుపార్టీల మధ్య పొత్తు వ్యవహారం ఏమాత్రం సత్ఫలితాలు ఇస్తుందన్నది అనుమానంగానే మారింది.