పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు  | vijayawada west pedana janasena Leaders Boycott Boppudi Pm Modi Meeting | Sakshi
Sakshi News home page

పవన్‌కు షాక్ ఇచ్చిన జనసేన కార్యకర్తలు 

Published Sun, Mar 17 2024 5:56 PM | Last Updated on Sun, Mar 17 2024 6:42 PM

vijayawada west pedana janasena Leaders Boycott Boppudi Pm Modi Meeting - Sakshi

సాక్షి, విజయవాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు సొంత పార్టీ కార్యకర్తలు షాక్‌ ఇచ్చారు. చిలకలూరిపేట బొప్పూడి సభను  పెడన, విజయవాడ వెస్ట్ జనసేన కార్యకర్తలు బాయ్‌కాట్‌ చేశారు. పెడన టికెట్ విషయంలో జనసేన కార్యకర్తలు పట్టు వీడటం లేదు.  తమ డిమాండ్ల ను పవన్ పట్టించుకోకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సభకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

కూటమి పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీటు బీజేపీకి ఇవ్వడంతో జనసేన కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ జనసేన నాయకుడు, పార్టీ ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్‌కు సీటు వస్తుందని జనసైనికులు ఆశించారు. టికెట్‌ బీజేపీకి వెళ్లడంతో జనసేన శ్రేణులు మండిపోతున్నారు. ఈ క్రమంలో బొప్పూడి సభకు పోతిన మహేష్ ఒంటరిగానే వెళ్లారు. అయితే సభలో పవన్‌ను నిలదీయాలని మహేష్‌కు కార్యకర్తలు చెప్పినట్లు సమాచారం.
చదవండి: పిఠాపురంలో పవన్‌ పరిస్థితి ఏమిటో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement