సాక్షి, తాడేపల్లి: పెడనలో అటెన్షన్ ప్లే చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా ప్రయత్నించారని మంత్రి జోగి రమేష్ విమర్శించారు. సినిమా స్టైల్లో రాళ్లదాడి జరగబోతుందంటూ డైలాగులు వేశారని దుయ్యబట్టారు. తీరాచూస్తూ సభ అట్టర్ ప్లాప్ అయ్యిందని మండిపడ్డారు. టీడీపీ, జనసేన కలిసినా రెండు వేలమందిని కూడా జనాన్ని తెచ్చుకోలేక పోయారని అన్నారు.పెడన ప్రజలను రౌడీలు అన్నందుకు పవన్ వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యాక్సిన్ కాదు అది వైరస్
కేవలం రెండు వేలమందితో కూడా సభ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని మంత్రి విమర్శించారు. అవనిగడ్డలో ప్లాప్ షో నిర్వహించాని అన్నారు. టీడీపీ, జనసేన కలయిక వ్యాక్సిన్ కాదు అది వైరస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్, చంద్రబాబుక కలయిక విషంతో సమానమని అన్నారు. టీడీపీ, జనసేన కలిసిన తర్వాత మరింత దిగజారిపోయారని మండిపడ్డారు. రెండు చోట్లా ఓడిపోయిన పవన్ నిసిగ్గుగా మాట్లాడుతున్నాడని దుయ్యబట్టారు. పవన్‌కు సిగ్గు, మనసాక్షి లేదని విమర్శించారు.
రౌడీలతో పోల్చుతావా పవన్?
‘మీ వెకిలి వేషాలు చూశాక ప్రజలు నిర్దారణకు వచ్చేశారు. 2014లో మీరు చేసిన స్కాంలను జనం చూశారు. దోచిన సొమ్ము షెల్ కంపెనీలకు పంపిన వైనాన్ని సీఐడీ బయట పెట్టింది. చివరికి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో కూర్చున్నారున. అత్తారింటికి దారేది సినిమా ఎక్కడో పైరసీ జరిగితే మా పెడన కళంకారీ తమ్ముళ్లను పవన్ కొట్టించారు. కలంకారీ పరిశ్రమ దేశానికే గర్వకారణం. సీఎం జగన్ ప్రభుత్వం ఆ కళాకారులను గౌరవించి సత్కరించింది. అలాంటి వారిని రౌడీలతో పోల్చుతావా పవన్?
చదవండి: పరిటాల సునీత, శ్రీరామ్‌లపై కేసు నమోదు
కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉంది
చంద్రబాబు పాలన అవినీతి రాజ్యం అంటూ గతంలో పవన్ మాట్లాడారు. టీడీపీ ప్రజాద్రోహి అన్నారు. పవన్ సీఎం కావాలంటే మా కులం బ్లడ్ ఎక్కించుకోవాలన్నారు. మొన్న రాజమండ్రి జైల్లో పవన్ ఆ కులం బ్లడ్ ఎక్కించుకున్నారా?. పవన్‌కు సిగ్గులేనందుక వారి బ్లడ్ ఎక్కించుకున్నారేమో?. కానీ కాపు ప్రజలకు దమ్ము, ధైర్యం ఉంది. పవన్ లాగ వ్యవహరించరు.
టీడీపీ వారికి ఇదేం ఖర్మ!
వంగవీటి రంగాని ఘోరంగా నరికి చంపిన వారికి పవన్ భుజాన వేసుకొని మోస్తున్నారు. మీలాంటివారిని ప్రజలు నమ్మరుకాక నమ్మరు. చంద్రబాబు, పవన్, ఎల్లోమీడియా, మరికొందరు బ్రోకర్లు పావలాలు పంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ వారికి ఖర్మ పట్టింది. పవన్ వారాహి మీద మాట్లాడుతుంటే టీడీపీ నేతలు కొల్లు రవీంద్ర కింద నిలపడే ఖర్మ పట్టింది.
పేదల పక్షాన జగన్, పెత్తందార్ల పక్షాన పవన్,
పవన్ భారతీయుడో, రష్యావాడో తెలియదు. రష్యా వాడైతే ఏపీకి రావాలంటే కచ్చితంగా పాస్ పోర్టు కావాల్సిందే. పేదల పక్షాన జగన్, పెత్తందార్ల పక్షాన పవన్, చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు పని అయిపోయిందని పవన్ చెప్తున్నారు. టీడీపీ వారు ఇప్పటికైనా మైండ్ సెట్ మార్చుకోవాలి. చంద్రబాబు, పవన్ కలయిక అపవిత్రమైనది, ఒక విషబీజం లాంటిది. వీరి వలన ప్రజలకు నష్టమే తప్ప లాభం లేదు. 2024 తర్వాత పవన్‌తో నేను సినిమా తీస్తా. జానీ-కూలీ, గబ్బర్ సింగ్-రబ్బర్ సింగ్ పేరుతో సినిమా తీస్తా’ అంటూ మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment