సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్మాదిలా మాట్లాడాడు. పవన్ తన పార్టీని అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శలు చేశారు. కాగా, మంత్రి కొట్టు సత్యనారాయణ సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘పవన్ కల్యాణ్ ఉన్మాదిలా మాట్లాడాడు. రంగా హత్యకు కాపులు, బలిజలు బాధ్యత వహించాలా?. రంగాను హత్య చేసింది టీడీపీ కాదా?. నేను కొట్లో కూర్చునే రాజకీయాల్లోకి వచ్చాను.
పవన్ కల్యాణ్ పార్టీని అద్దెకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. ముద్రగడ కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎక్కుడున్నావ్?. కనీసం విచారం తెలిపావా?. ఇప్పుడు కులం గురించి మాట్లాడుతున్నావ్?. కాపు నియోజకవర్గానికి నువ్వు ఏమైనా చేశావా?. ప్రతీ విషయంలో నీ ప్యాకేజీ బయటపడుతోంది. నీ వ్యవహారం చూస్తే ప్యాకేజీ స్టార్ అనే అనుమానం వస్తోంది’ అంటూ వ్యాఖ్యలు చేశారు.
మేం తలుచుకుంటే పవన్ కల్యాణ్ లెక్కకాదు..
మరోవైపు, మంత్రి జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ముసుగు దొంగల నిజస్వరూపం బయటపడింది. పవన్ కల్యాణ్.. ప్యాకేజీ కల్యాణ్. ప్యాకేజీకి అమ్ముడుపోయే వాడే పవన్ కల్యాణ్. చరిత్రలో నువ్వు ఎప్పుడైనా నేను ముఖ్యమంత్రిని అవుతా అని అన్నావా?. చంద్రబాబు సంకలో పవన్ కల్యాణ్ లేడా?. ఆ చెప్పు అయినా నీదేనా.. లేక నీ యజమానిదా?. 2019లో చెప్పులు అరిగేట్టు మిమ్మల్ని కొట్టినా బుద్ధి రాలేదు.
విశాఖ గర్జన సక్సెస్‌ను జీర్ణించుకోలేక కర్రలు, రాళ్లతో దాడి చేశారు. సైకోలను మా మీదకు పంపారు. పవన్ కల్యాణ్ పిచ్చికుక్క అని ఏడాదిన్నర క్రితమే చెప్పాను. అభివృద్ధి ప్రతీ గడపకు చేరాలన్నదే మా ప్రభుత్వం ఆలోచన. మా సిద్ధాంతం, ఎజెండా పరిపాలన వికేంద్రీకరణ అయితే.. పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లు, ముగ్గురు పెళ్లాల గురించి మాట్లాడుతున్నారు. పొద్దున బీజేపీకి విడాకులిచ్చి.. ఇప్పుడు చంద్రబాబును పెళ్లి చేసుకున్నాడు. అధికారం కోసం అర్రులు చాస్తారా?. సిద్ధాంతం లేదు, విలువలు లేవు, మానవత్వం లేదు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎంత మంది కలిసి వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఇంచు కూడా కదిలించలేరు. మేం తలుచుకుంటే పవన్ కల్యాణ్ లెక్కకాదు. టైమ్, డేట్, ప్లేస్ నువ్వు చెప్పు.. ఎవరేంటో తేల్చుకుందాం. కొట్లాడుకోవడం కాదు.. చర్చించుకుందాం. 14 ఏళ్లలో నీ యజమాని ఏం చేశాడు?. మూడేళ్లలో మేము ఏం చేశామో మాట్లాడుకుందాము. నిజంగా నువ్వు రాజకీయ నాయకుడివి అయితే.. చంద్రబాబుకు అమ్ముడుపోకపోతే.. నీకు దమ్ముంటే.. ఒంటరిగా పోటీ చేస్తానని చెప్పు. ప్యాకేజీ స్టార్ అని వంద సార్లు అంటాము. నీలాంటి నీచుడికి 2024లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment