‘పవన్‌.. జోకర్‌ లాంటి బాబు, లోఫర్‌ లాంటి లోకేశ్‌ మాటలు నమ్మకు’ | Kottu Satyanarayana Serious Comments Over Pawan And Chandrababu | Sakshi
Sakshi News home page

పవన్‌కు ప్రాణహాని అంటే అది చంద్రబాబు దగ్గర నుంచే: కొట్టు సత్యనారాయణ

Published Sun, Jun 18 2023 2:57 PM | Last Updated on Sun, Jun 18 2023 8:19 PM

Kottu Satyanarayana Serious Comments Over Pawan And Chandrababu - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నాడు. వారాహి యాత్ర పేరుతో పవన్‌ అవాకులు చెవాకులు పేలుతున్నాడు. పవన్‌ను ఎవరికైనా చూపించండిరా అని ప్రజలు అనుకుంటున్నారని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. 

కాగా, కొట్టు సత్యనారాయణ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. గుంట నక్క లాంటి చంద్రబాబుని ప్రజలు ఓడించాలనుకున్నారు. అతనితో ఉన్నవ్‌ కాబట్టే పవన్‌ నిన్ను కూడా ప్రజలు ఓడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కష్టం చూసి ప్రజలు మెచ్చుకుని సీఎం పదవి ఇచ్చారు. కాపు సామాజిక వర్గాన్ని కించపరిచేలా పవన్‌ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు కాపుల ఓట్ల కోసం పవన్‌ను వాడుకుంటున్నాడు. పవన్ కల్యాణ్‌ వెంట కాపులు రారు. పవన్‌.. 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తానని చెప్పే దమ్ముందా?. పవన్‌కు ప్రాణహాని అంటే అది చంద్రబాబు దగ్గర నుంచే ఉంటుంది. 

టీడీపీ హాయంలో కృష్ణా పుష్కరాల పేరిట 44 ఆలయాలను కూల్చేశారు. మా పాలనలో 250 ఆలయాలకు రూ.281 కోట్లు కేటాయించాం. చంద్రబాబును ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పవన్‌.. జోకర్‌ లాంటి బాబు, లోఫర్‌ లాంటి లోకేశ్‌ మాటలు నమ్మకు అంటూ హితవు పలికారు. గత పారిపాలన చూసి చంద్రబాబు, పవన్‌ గానీ.. ఓట్లు వేయమని అడిగే దమ్ము, ధైర్యం సత్తా మీకు ఉందా?. సీఎం జగన్‌ను తిడితే ఆయనను ఎన్నుకున్న ప్రజలను తిట్టినట్టే అవుతుంది.. ఇది తెలుసుకో పవన్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇది కూడా చదవండి: జనసేనలో గలాటా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement