jogi ramesh
-
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి నేతలు దౌర్జన్యాలు చేసి గెలిచారు
-
కూటమి కాదు.. కుట్రల ప్రభుత్వం: జోగి రమేష్
సాక్షి,తాడేపల్లి:ప్రజాస్వామ్యాన్ని కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని,అరాచకాలు,అక్రమాలు,దౌర్జన్యాలు చేసి మున్సిపాలిటీల్లో పదవులు దక్కించుకున్నారని వైఎస్సార్సీపీ సీనియర్‌నేత మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. సోమవారం(ఫిబ్రవరి3) తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో ఏ కార్పొరేషన్,మున్సిపాలిటీల్లోనూ టీడీపీకి బలం లేదు.మా పార్టీ వారిని కిడ్నాప్ చేసి గెలుపొందటం సిగ్గుచేటు. మా కార్పొరేటర్లు వెళ్లే బస్సు మీద రాళ్ల దాడి చేయడం దారుణం. తిరుపతి ప్రతిష్టను దిగజార్చారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల హామీలను అమలు చేయలేదు. 2019లో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి మోదీని తిట్టారు. ఇప్పుడు మళ్ళీ ఢిల్లీ వెళ్లి మోదీని మెచ్చుకుంటూ,కేజ్రివాల్‌ను తిట్టారు. అసలు చంద్రబాబు ఒక మనిషేనా? ఆయనకు సిగ్గుందా? సిద్దాంతాలు,విలువలు లేని ఏకైక మనిషి చంద్రబాబు.ఐటీ రైడ్స్ నుంచి రక్షించుకోవడానికే ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.ఇది కూటమి ప్రభుత్వం కాదు,కుట్రల ప్రభుత్వం.వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి గెలవాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు కుట్రలో పావుగా మారారు.ఈ దాడులు,దౌర్జన్యాలపై ఈసీ స్పందించాలి. అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఈసీ అడ్డుకోవాలి’అని జోగి రమేష్ డిమాండ్ చేశారు. -
ఆరు నెలలు కాలేదు జనం నడ్డి విరగ్గొట్టారు
-
టీడీపీ సుద్దులన్నీ బీసీ నేతలకు మాత్రమేనా?
తెలుగుదేశం పార్టీ రాను రాను మరీ సంకుచితమైన రాజకీయ పార్టీగా మారిపోతోంది. రాజకీయాలన్నీ ఎన్నికల సమయానికి మాత్రమేనని ఆ తరువాత అందరూ కలిసి పని చేయాలని సుద్దులు చెప్పిన చంద్రబాబు ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. దివంగత నేత గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ సందర్భంగా గౌడ సంఘం నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్సీపీ నేతలు, రాష్ట్ర మంత్రులు ఒకే వేదికను పంచుకోవడాన్ని ఆ పార్టీ నేతలు పెద్ద రాద్ధాంతం చేస్తున్నారు. నూజివీడులో జరిగిన ఈ కార్యక్రమానికి సొంత నియోజకవర్గం కావడంతో పార్థసారథి, లచ్చన్న మనవరాలిగా శిరీష వెళ్లారు. వైఎస్సార్సీపీ నేతలు జోగి రమేశ్ కూడా హాజరయ్యారు. అంతే.. టీడీపీ నేతలు జోగి రమేష్ వేదిక పంచుకోవడమే తప్పని, పార్ధసారథిలో వైఎస్సార్సీపీ వాసనలు పోలేదని, శిరీష తప్పు చేశారని టీడీపీ కులోన్మాదులు, లోకేష్ మెప్పుకోసం తాపత్రాయ పడుతున్న నేతలు పెద్ద ఇష్యూ చేసేశారు. అక్కడితో ఆగనూ లేదు. అదేదో పెద్ద నేరం అన్నట్లు టీడీపీ నాయకత్వం పార్ధసారథి, శిరీష్ లతో క్షమాపణ చెప్పించింది. ఎంత దారుణం! వారు కూడా తమ ఆత్మగౌరవాన్ని వదలుకుని చంద్రబాబుకు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లకు క్షమాపణ చెప్పేశారు. అయినా సరే టీడీపీ నేతలు కొందరు పార్దసారథిని విమర్శలతో ట్రోల్ చేశారు. దీంతో ఆయన తాను ఎంత చిత్తశుద్దితో పని చేస్తున్నా టార్గెట్ బాధపడడం చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్మాదం ఈ స్థాయికి చేరిందా? అన్న ప్రశ్న వస్తుంది. దీన్ని కులోన్మాదం అనాలా? లేక ఇంకేమైనానా? బీసీ వర్గానికి చెందిన నేతలు మాత్రమే ఇలా కలవకూడదని ఏమైనా టీడీపీ ఆంక్షలు పెట్టిందా? ఎందుకంటే.. కమ్మ, కాపు, రెడ్డి తదితర అగ్రవర్ణాలలోని టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ వారితో, ఇతర పార్టీల నేతలతో కలిసి తిరిగినా, సభలలో మాట్లాడినా, వ్యాపారాలు చేసినా అభ్యంతరం వ్యక్తం కావడం లేదు. గతంలో చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన జోగి రమేష్‌ను ఆహ్వానిస్తారా? అంటూ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వంటి వారు విరుచుకుపడ్డారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు అప్పట్లో ఆనాటి సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం చెబుతానంటూ నాటి మంత్రి జోగి రమేష్ చంద్రబాబుకు ఇంటికి వెళ్లారు. టీడీపీ నేతలు దీన్నే ఒక పెద్ద దాడిగా ప్రచారం చేసింది. అధికారంలోకి వచ్చాక జోగిపై కేసు కూడా పెట్టేశారు. అంతమాత్రాన ఆయన ఇలాంటి సభలలో పాల్గొనకూడదని అంటే దానిని ఉన్మాదం అనక ఏమంటాం? విశేషం ఏమిటంటే టీడీపీకి మద్దతు ఇచ్చే కొందరు విశ్లేషకులు కూడా చాలా పెద్ద ఘోరం జరిగిందని టీవీలలో ఇంగితం లేకుండా మాట్లాడారు. ఈనాడు పత్రిక అయితే నీచాతినీచంగా పార్థసారథి, శిరీషల ఫోటోలు వేసి ‘ఇంగితం ఉందా’ అని, కనీస ఇంగితం లేకుండా వార్త రాసింది. ఈనాడు మీడియా స్థాయి అబద్ధాలు చెబుతోందని ఇంతకాలం విమర్శించుకున్నాం కానీ.. దాని స్థాయి అట్టడుగుకు చేరిందనేందుకు ఇదో నిదర్శనంగా నిలుస్తుంది. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉండేవారు. ఎన్.టిఆర్. తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు పార్టీలోకి రాలేదు. సినిమాలలో నటించే వారికి రాజకీయం ఏమి తెలుసు అని విమర్శలు కూడా చేశారు. కాని 1983లో టీడీపీ అధికారంలోకి రావడంతోనే బాబు పార్టీ మారిపోయారు. టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబుకు పార్టీ సభ్యత్వం ఇవ్వద్దని కొందరు సీనియర్ నేతలు అన్నా, ఎన్.టి.ఆర్. వారికేదో చెప్పి పార్టీలోకి తీసుకున్నారు. తాజా పరిస్థితులతో పోలిస్తే ఇప్పుడు ఎన్.టి.ఆర్కు ఇంగితం లేదనుకోవాలా? పార్టీలో గ్రూపు నడిపి, చివరికి ఎన్.టి.ఆర్.పదవికే ఎసరు పెట్టిన చంద్రబాబును ఏమనాలి? ఆ సమయంలో చంద్రబాబును ఎన్.టి.ఆర్. పలురకాలుగా దూషించిన వీడియోలు ఇప్పటికీ అందుబాటులోనే ఉన్నాయి. ఎన్టీఆర్‌కు విలువల్లేవని విమర్శించిన నోటితోనే చంద్రబాబు తాము ఆయన వారసులమని కూడా ప్రకటించుకున్నారు. ఇంగితం లేనిది ఎవరికి?ఎన్.టి.ఆర్. బతికున్నంత కాలంలో అసభ్యకరమైన కార్టూన్లూ, నగ్న కేరికేచర్లు ప్రచురించిన ఈనాడు మరణానంతరం అవసరమైనప్పుడల్లా ఆయన్ను యుగపురుషుడని కొనియాడుతూ కథనాలు రాసింది. ఇక్కడ కూడా ఇంగితం లేనిది ఎవరికి? తన రాజకీయ జీవితం మొత్తం కప్పగెంతులేసిన చంద్రబాబు ఎవరెవరిని ఎప్పుడు దూషించింది.. అదే నోటితో ఎలా పొగిడిందీ తెలియందెవరికి? అందులో ఎవరికీ ఇంగితం జ్ఞాపకం రాకపోవడమే రాజకీయ వైచిత్రి! ఇవన్నీ మరచి కేవలం జోగి రమేష్‌తో ఒక వేదిక పంచుకున్నందుకు పార్థసారథి, శిరీషలకు ఇంగితం లేదని ధ్వజమెత్తుతున్నారు. లచ్చన్న ఒక కుల నాయకుడా అని వీరు తెలివిగా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రమాణం అన్ని కుల సంఘాలకూ వర్తింపజేస్తున్నారా మరి? కమ్మ కుల సంఘం మీటింగ్‌లో ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? చంద్రబాబునే ఎందుకు పొగుడుతున్నారు. కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు ఆ కుల మీటింగ్‌లోకి హాజరైతే తప్పు లేదా? అంతెందుకు మాజీ మంత్రి పుల్లారావు, మరి కొందరు టీడీపీ నేతలు గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తుండే వారు అంటారు. వంగవీటి రంగ హత్య గురించి బాబుకు ముందే తెలుసన్న తీవ్ర విమర్శలతో చేగొండి హరిరామయ్య పుస్తకం రాస్తే దాని ఆవిష్కరణ సభకు టీడీపీ, వైఎస్సార్సీపీ, బీజేపీ పక్షాల నేతలందరూ హాజరయ్యారే.... టీడీపీ అప్పుడు ఎవరితోనూ క్షమాపణ చెప్పించ లేదే! మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పుట్టిన రోజు వేడకులకు రష్యా వెళ్లిన వారిలో టీడీపీ వారు కూడా ఉన్నారంటారు అంతేకాదు... టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలు కొందరు కలిసి జూదమాడతారట. వీటికి రాని అభ్యంతరం లచ్చన్న విగ్రహావిష్కరణ సభకు వైఎస్సార్సీపీ నేత హాజరైతే వచ్చిందా? రెడ్డి జన సంఘం సభలకు కూడా వివిధ పార్టీల వారు హాజరవుతుంటారు. అంతెందుకు! లచ్చన్న మరణం తర్వాత జరిగిన ఒక కార్యక్రమంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, బీవీ రాఘవులుతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. అంటే చంద్రబాబు తప్పు చేసినట్లేనా? ఎన్నికల తర్వాత అంతా రాష్ట్రం కోసమే ఆలోచించాలని, ఎన్నికల సమయంలోనే రాజకీయాలు అని చంద్రబాబు తరచుగా ప్రచారం చేసేవారు.ఇప్పుడు ఇలా ఎందుకు వ్యవహరించినట్లు? అంటే తన కుమారుడు, మంత్రి లోకేష్ కేవలం అవగాహన రాహిత్యంతో పార్థసారథి, శిరీషలపై ఆగ్రహం వ్యక్తం చేస్తే, దానిని ఆమోదించి చంద్రబాబు కూడా మాట్లాడారా? తెలిసో, తెలియకో లోకేష్ మాట్లాడి ఉంటే సరిచేయాల్సిన పెద్దరికం చంద్రబాబుదే అవుతుంది కదా? అది కూడా చేయలేక పోయారంటే బాబు ఎంత నిస్సహాయంగా ఉంటున్నది అర్థం చేసుకోవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా రాష్ట్ర ఖజానాకు మేలు చేసే లక్ష్యంతో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టర్‌గా నవయుగ సంస్థను తప్పించి మెగా సంస్థను ఎంపిక చేశారు. దీన్ని చంద్రబాబుసహా పలువురు టీడీపీ నేతలు విమర్శించారు. కానీ ఇప్పుడు అదే మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో కలిసి చంద్రబాబు టూర్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి స్వస్థలమైన డోకిపర్రులోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి చంద్రబాబు వెళ్లారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు కృష్ణారెడ్డి మంచివాడైపోయారా? మామూలుగా అయితే ఎవరూ వెళ్లవద్దని అనరు. కాని నూజివీడు ఘటన తర్వాత ఇవన్ని ప్రశ్నలు అవుతాయి. 2019 కి ముందు ఎన్ని ఘటనలు జరిగాయి. ప్రస్తుతం అలయ్ బలయ్ అంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు అప్పట్లో ఎన్ని మాటలు అనుకున్నారు. మళ్లీ అదే పవన్ కళ్యాణ్ కోసం చంద్రబాబు ఎంత తాపత్రయపడింది తెలుసు కదా? అలాగే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు, లోకేష్ లను ఎన్నేసి మాటలు అన్నారు. అసలు తన తల్లినే దూషించారని టీడీపీపై ఆరోపించారు. కాని ఏ ఇంగితం పెట్టుకుని మళ్లీ కలిశారని అంటే ఏమి చెబుతాం. బీజేపీతో తేడా వచ్చాక బీజేపీ అధ్యక్ష హోదాలో తిరుపతి వచ్చిన అమిత్ షాపై టీడీపీ వారు రాళ్లు వేశారు. ప్రధాని మోడీని చంద్రబాబు, బాలకృష్ణ తదితరులు దూషించారు. దేశ ప్రధానిని పట్టుకుని టెర్రరిస్టు, పెళ్లాన్ని ఏలుకోలేని వాడు అంటూ పరుష పదాలతో మాట్లాడిన వీరు, తర్వాత కాలంలో మోడీ అంత గొప్పవాడు లేడని చెబుతున్నారు. అమిత్ షా అప్పాయింట్ మెంట్ కోసం రోజుల తరబడి డిల్లీలో ఎదురు చూశారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు స్వయంగా లోకేష్ డిల్లీ వెళ్లి, తన పెద్దమ్మ సాయంతో అమిత్ షాను కలిసి వచ్చారే! ఇందులో ఎవరికి ఇంగితం ఉన్నట్లు?ఎవరికి లేనట్లు? చంద్రబాబు ఎవరినైనా ఏమైనా అనవచ్చు. ఎవరితోనైనా జట్టు కట్టవచ్చు? అది గొప్పతనం. ఆయన తిడితే అంతా తిట్టాలి. ఆయన పొగిడితే అంతా పొగడాలి. ఎటు తిరిగి ఆయన చేతిలో ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి భజన మీడియా ఉంది కనుక ఏమి చేసినా చెల్లిపోతోంది.పార్థసారథి తండ్రి కెపి రెడ్డయ్య గతంలో కాంగ్రెస్, టీడీపీలలో పనిచేశారు. ఎంపీగా పీవీ నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడడానికి మరి కొందరితో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అప్పట్లో రెడ్డయ్యపై టీడీపీ వారు ఆరోపణలు చేసేవారు. అయినా రెడ్డయ్య వాటన్నిటిని ధీటుగా ఎదుర్కునేవారు. రెడ్డయ్య నోటికి అంతా భయపడే పరిస్థితి ఉండేదని చెబుతారు. ఇప్పుడు ఆయన కుమారుడు పార్థసారథి కూడా ఒకరకంగా అదే ఆత్మగౌరవ సమస్యను ఎదుర్కుంటున్నారు. కాంగ్రెస్ లోను, ఇప్పుడు టీడీపీలోను మంత్రిగా ఉన్నారు. శిరీష తండ్రి గౌతు శివాజి కూడా ఆరుసార్లు టీడీపీ ఎమ్మెల్యే. అలాంటి కుటుంబానికి చెందిన శిరీషను టీడీపీ నాయకత్వం అవమానించి క్షమాపణ కోరుతుందా?ఒకప్పుడు సమరసింహా రెడ్డి మంత్రిగా ఏదో కాకతాళీయంగా మరో మంత్రి కటారి ఈశ్వరకుమార్తో మాట్లాడుతూ బీసీలా..వంకాయలా అని అన్నారు. అది కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది. చంద్రబాబు నాయుడు గత టరమ్ లో బీసీ నేతలు కొందరు సచివాలయానికి వస్తే దేవాలయంవంటి ఇక్కడకు వచ్చి ప్రశ్నిస్తారా? అని మండిపడ్డారు. మరో సందర్భంలో మత్యకారులను ఉద్దేశించి తోకలు కట్ చేస్తానని అనడం వివాదాస్పదమైంది. ఈ మధ్యనే కాకినాడ సీపోర్టు యజమాని కేవీ రావు పై అభియోగాలు చేస్తూ లేఖ రాసిన సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా టీడీపీ కులోన్మాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. అవమానాలకు గురి కావల్సి వచ్చింది. టీడీపీ బీసీ నేతలు ఇలాంటి వాటిని భరిస్తుండడం విశేషం. కనీసం ధైర్యంగా తాము తప్పు చేయలేదని చెప్పలేకపోతున్నారు. మరో వైపు జగన్ బీసీలకు అత్యంత గౌరవం ఇచ్చి ఎన్నడూ లేని విధంగా వారికి నాలుగు రాజ్యసభ సీట్లు ఇచ్చి గౌరవించారు. వారిలో ముగ్గురు పార్టీని వీడడం దురదృష్టకరం. తమను గౌరవించేవారు కావాలో, లేక అవమానించేవారు కావాలో బీసీ నేతలే నిర్ణయించుకోవాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
నీకు నిజంగా దమ్ముంటే.. వసంత కృష్ణ ప్రసాద్ కి జోగి రమేష్ సవాల్
-
వసంత కృష్ణ ప్రసాద్ మైలవరం వీరప్పన్: జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: దొంగకోళ్లు పట్టేవాడికి, టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్‌కు తేడా లేదని.. మైలవరం నియోజకవర్గంలో సహజ వనరుల్ని లూటీ చేస్తున్నాడంటూ మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వసంతకృష్ణ ప్రసాద్‌ను మైలవరం వీరప్పన్‌గా అభివర్ణించారు. మైలవరంలో బ్రాందీ షాపులు పెట్టుకున్నా వసంత కృష్ణప్రసాద్‌కు కమీషన్లు ఇవ్వాలి’’ అంటూ దుయ్యబట్టారు.‘‘గతంలో కృష్ణప్రసాద్ ఏడుస్తున్నాడనే నేను మైలవరానికి ఏనాడూ రాలేదు. వసంత కృష్ణప్రసాద్‌కు మీడియా సమక్షంలో నాతో చర్చకు వచ్చే దమ్ముందా? అంటూ జోగి రమేష్ సవాల్ విసిరారు. ‘‘పర్వతనేని ఇంటి ముందు సీటు కోసం అబ్బా కొడుకులు తిట్టుకుని, కొట్టుకున్నారు. ఎన్ని పుస్తకాలు రాసినా మీ చరిత్రకి సరిపోవు. సిగ్గుమాలిన, సంస్కారం లేని కుటుంబం మీది. వసంత కృష్ణప్రసాద్ బూడిద అక్రమాలపై పోరాడతాం’’ అని జోగి రమేష్ హెచ్చరించారు.జగన్, జోగి రమేష్ ఫోటోలు చూస్తే భయమా? బ్యానర్లు తీసేయమని అధికారులకు చెబుతున్నారు. నేను మా పార్టీ అధ్యక్షుడిని ఒప్పిస్తా.. నువ్వు కూటమికి రాజీనామా చెయ్యి. పార్టీలతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్‌గా మైలవరంలో పోటీచేద్దాం... సిద్ధమా?. రాబోయే ఎన్నికల్లో మైలవరం నుంచి వైఎస్సార్సీపీఅభ్యర్థిగా పోటీ చేస్తున్నా. 2027 తర్వాత కృష్ణ ప్రసాద్ చాప, దిండు సర్దుకుని వెళ్లిపోతాడు’’ అంటూ జోగి రమేష్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: YSRCP సోషల్ మీడియా యాక్టివిస్టుల అక్రమ నిర్బంధం.. ఏపీ హైకోర్టు సీరియస్.. కీలక ఆదేశాలు జారీ -
చంద్రబాబు బ్యాచ్ ని రఫ్పాడించిన జోగి రమేష్
-
వారిని వదిలిపెట్టను.. జోగి రమేష్ వార్నింగ్
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: కేసులకు భయపడను.. నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఇబ్రహీంపట్నం గడ్డమీదే ఉన్నా.. నా మీదకు రాకుండా.. నా కుమారుడిపై కేసు పెట్టారు. ఈ రోజుతో అయిపోదని గుర్తు పెట్టుకోండి’’ మాజీ మంత్రి జోగి రమేష్ హెచ్చరించారు. బుధవారం.. మైలవరం నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో.. మీ ఇంటికి మా ఇల్లు కూడా అంతే దూరమని గుర్తుంచుకోండి. నా జోలికి వస్తే ఎవరినైనా వదిలిపెట్టనని తేల్చి చెప్పారు.మంచి మనసున్న నేత వైఎస్ జగన్. ఆయన చెప్పాడనే 2019లో నేను మైలవరం నుంచి పక్కకు వెళ్లా.. ఈ క్యాండెట్ చివరి వరకూ ఉండడని జగనన్నతో ఆరోజే నేను చెప్పా.. ఆయనను నమ్మించి మోసం చేసి ఎన్నికల ముందు గోడ దూకేశాడు. రావాల్సిన బిల్లులన్నీ రాగానే పార్టీ మారిపోయాడు’’ అంటూ మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్ మండిపడ్డారు.‘‘నాతో పాటు చావోరేవో తేల్చుకునేవాళ్లే వైఎస్సార్సీపీలో ఉండండి. ఇక్కడి మాటలు అక్కడికి మోసేవాళ్లు మైలవరంలో మాతో ఉండనవసరం లేదు. మా మోచేతి నీళ్లు తాగి.. ఇప్పుడు మైలవరం ఎమ్మెల్యే కారు కూతలు కూస్తున్నాడు. ఇక పై జగనన్న గురించి మాట్లాడితే తాటతీస్తాం. కేసులకు మేం భయపడం.. మా వాళ్లజోలికి వస్తే చూస్తూ ఊరుకోం’’ అని జోగి రమేష్ చెప్పారు.‘‘జనవరిలో మైలవరంలో వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని ఘనంగా ప్రారంభించుకుందాం. కార్యకర్తలకు అన్ని రకాలుగా అండగా ఉంటా. ఈ రోజు ఓడిపోయాం.. కానీ మళ్లీ వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకుందాం. ఐదు నెలల్లోనే కూటమి ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత వచ్చింది. 2027లో ఎన్నికలు రాబోతున్నాయ్.. మళ్లీ గెలిచేది మనమే’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
బాబూ.. కక్ష సాధింపు ఆనందం వీడాలి: జోగి రమేష్
సాక్షి, మంగళగిరి: ఏపీలో కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవని ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.కాగా, మాజీ మంత్రి జోగి రమేష్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రాజకీయాల్లో విశ్వసనీయత అవసరం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం పాటిస్తున్నారు. చంద్రబాబు ఇంటికి ఎందుకు వెళ్లానో విచారణలో చెప్పాను. అయ్యన్న పాత్రుడు.. వైఎస్ జగన్‌పై చేసిన విమర్శలకు నిరసన చేసేందుకు వెళ్ళాను. అయితే, నాపై దాడి చేసి.. మళ్లీ నా మీదనే కేసు పెట్టారు. అధికారం ఎవరికీ శాశ్వత కాదని చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి. ఏపీలో చరిత్ర మళ్లీ పునరావృతం అవుతుంది. కక్ష ఉంటే నాపై తీర్చుకోవాలి. నా కొడుకుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు.కూటమి నేతలకు రాజకీయ విలువలు లేవు. హామీలు అమలు చేయకుండా కుట్రలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ అమలు చేస్తే ప్రజలు సంతోషిస్తారు. మంచి పాలన చేయాలని కానీ.. కక్ష సాధించడం సరికాదు. ఇటువంటి ఆనందాన్ని చంద్రబాబు వీడాలి. కక్ష సాధింపు కుట్రలతో రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. నా కొడుకుని అగ్రిగోల్డ్ భూముల కేసులో ఇరికించారు. అగ్రిగోల్డ్ భూములను అక్రమంగా మేము కొనుగోలు చేయలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, సత్య ప్రసాద్ దగ్గరకు నేనే వచ్చి అగ్రిగోల్డ్ గురించి వివరిస్తా.లోకేష్ రెడ్ బుక్ తీస్తే ఏమి అవుతుంది?. వైఎస్సార్సీపీని అడ్డుకోవాలని చూస్తే సాధ్యం కాదు. మళ్ళీ నన్ను విచారణకు రమ్మని పిలవలేదు. 2002 నుంచి ఒకటే ఫోన్ నెంబర్ వాడుతున్నా. నేను మళ్ళీ విచారణకు రమ్మంటే వస్తాను. వారు అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాను. ఇప్పుడు మీరు పరుష పదజాలం వాడితే మీ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. నాకు పార్టీ సపోర్ట్ ఉంది. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చాను. తప్పుడు కేసులు పెట్టి ప్రభుత్వం వేధించాలని చూస్తుంది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తా..
-
కక్ష కట్టారు.. కేసులకు భయపడేది లేదు: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: తనపై చంద్రబాబు కక్షసాధింపునకు దిగారని.. తన కుమారుడిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేశారని మాజీ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరయ్యారు. న్యాయవాదులతో కలిసి పీఎస్‌కు వచ్చిన జోగి రమేష్ మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ప్రతి పశ్నకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.‘‘ప్రజలంతా సూపర్ సిక్స్ పథకాల అమలు ఎప్పుడని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు, లోకేష్ మాత్రం రెడ్ బుక్ అమలు చేసే పనిలో ఉన్నారు. కేసులకు భయపడేది లేదు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారు’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
అతి తెలివితేటలు వద్దు.. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం
-
YSRCP నేతలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు
-
బాబుపై జోగిరమేష్ భార్య ఫైర్
-
కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
-
టార్గెట్ జోగి రమేష్!
సాక్షి ప్రతినిధి, విజయవాడ/ఇబ్రహీంపట్నం: మాజీమంత్రి, వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు తెరతీసింది. చట్టానికి లోబడి, నిబంధనల ప్రకారం భూమి కొనుగోలు చేసి, దానిని విక్రయించిన వ్యవహారంలో అక్రమ కేసు నమోదు చేసింది. పత్రికల్లో ప్రకటన ఇచ్చి మరీ కొనుగోలు చేసిన ఓ భూ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టిస్తూ, అక్రమ కేసు నమోదు చేశారు. జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌తోపాటు, చిన్నాన్న వెంకటేశ్వరరావును నిందితులుగా చేరుస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతేకాక.. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల తర్వాత ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ నివాసంలో సోదాలతో పేరుతో హల్చల్ చేశారు. అనంతరం.. జోగి రాజీవ్‌ను ఎలాంటి నోటీసులివ్వకుండానే అదుపులోకి తీసుకుని గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జోగి సతీమణి శకుంతల.. మా బిడ్డ ఏం పాపం చేశాడంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం.. ఏసీబీ కార్యాలయం వద్దకు జోగి రమేష్ చేరుకుని, అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. నిజానికి.. గతంలో టీడీపీ నేతలు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు నిరసన తెలిపేందుకు జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లారు. ఆ ఉదంతంతో చంద్రబాబు అతనిపై కక్షగట్టి ఇప్పుడు వేధింపులకు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇక జోగి రమేష్ తనయుని అరెస్టు వార్త తెలియగానే వైఎస్సార్సీపీ నేతలు పేర్ని నాని, వెలంపల్లి, దేవినేని అవినాష్, మాజీమంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతోపాటు, వైఎస్సార్సీపీ శ్రేణులు గొల్లపూడిలోని ఏసీబీ కార్యాలయం వద్దకు వచ్చారు. వారిని కార్యాలయంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. అక్రమ ఆరెస్టులపై పోరాడతామని, తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులన్నీంటిని ఎదుర్కొంటామని చెప్పారు. తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసింది. ఇందులో జోగి రాజీవ్, జోగి వెంకటేశ్వరరావు, అడుసుమిల్లి మోహనరంగాదాసు, వెంకట సీతామహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేశ్, డిప్యూటీ తహశీల్దార్ విజయకుమార్, విజయవాడ రూరల్ తహశీల్దారు, నున్న సబ్‌రిజి్రస్టార్ ఉన్నారు. సీఐడీ కేసు విచారణలో ఉండగానే ఏసీబీ హడావిడిగా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇక ఏసీబీ కార్యాలయంలో మంగళవారం దేదీప్యను విచారించారు. మరోవైపు.. గతంలో చంద్రబాబు ఇంటివద్ద నిరసన చేపట్టిన కేసులో జోగి రమే‹Ùకు మంగళవారం తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీచేశారు. మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై విజయవాడ ఏసీబీ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేతలు పలువురు మీడియాతో మాట్లాడారు. వారేమన్నారంటే.. అక్రమ కేసులపై పోరాటం చేస్తాంమాజీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో అక్రమ కేసులు పెడతారని, అక్రమంగా అరెస్టులు చేస్తారన్నారు. అసలు ఈ కేసులో లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యారా? అని ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా, విచారణకు పిలవకుండా జోగి రమేష్‌ను టార్గెట్ చేశారన్నారు. చంద్రబాబును నిలదీయకుండా వదలమన్నారు. జోగి రమేష్‌కు పొలం అమ్మిన వారు ముద్దాయిలు కారు.. కొనుక్కున్న వారు లేరు.. మరి అలాంటప్పుడు జోగి రమేష్ కుటుంబ సభ్యులు మాత్రమే ముద్దాయిలా? అని ప్రశ్నించారు. ఈ తప్పుడు కేసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. నిజానికి అగ్రిగోల్డ్ ఆస్తులు చంద్రబాబు మనుషులే కొన్నారని నాని చెప్పారు. జోగి రమేష్ సతీమణి మాట్లాడుతూ.. అప్పటి సీఎం జగన్‌గారిని ఉద్దేశించి టీడీపీ నేతలు దారుణంగా మాట్లాడడంవల్లే తన భర్త నిరసన తెలపడానికి చంద్రబాబు నివాసానికి వెళ్లారని.. దాన్ని మనసులో పెట్టుకుని ఇలా వేధిస్తారా? అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోందని, అందుకే బీసీ అయిన జోగి రమేష్ కుటుంబంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మాజీమంత్రి వెలంపల్లి అన్నారు. ఏ తప్పూ చేయకపోయినా జోగి రమేష్ కుటుంబాన్ని వేధిస్తున్నారని.. తాము పరామర్శకు రావొద్దా అని మాజీమంత్రి మేరుగ నాగార్జున ప్రశ్నించారు. అలాగే, జోగి రమేష్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని.. అందుకే జగన్ ఆదేశాల మేరకు తామంతా ఇక్కడకు వచ్చామని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ చెప్పారు. 14 రోజులపాటు రిమాండ్ ఇదిలా ఉంటే.. జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏసీబీ కార్యాలయం నుంచి మంగళవారం రాత్రి ఏసీబీ అధికారులు న్యాయమూర్తి హిమబిందు ఎదుట హాజరుపర్చగా ఇరువర్గాల వాదనల అనంతరం న్యాయమూర్తి ఈనెల 23వరకు రిమాండ్ విధించారు. నిందితుని తరఫున మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి వాదనలు వినిపించారు.మా నాన్నపై కక్ష తీర్చుకునేందుకే..నా తండ్రిపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకే అక్రమ కేసులు పెట్టారు. ఈనాడులో ప్రకటన చూసే కొన్నాం.. అలాగే, ప్రకటన ఇచ్చే అమ్మాం. ఈ వ్యవహారాన్ని లీగల్‌గానే కోర్టులోనే తేల్చుకుంటాం. – జోగి రాజీవ్, జోగి రమేష్ తనయుడు నాపై కక్షతో నా కొడుకుపై కేసు.. మా అబ్బాయి మీద కేసు నమోదు చేయడం దుర్మార్గం. చంద్రబాబూ.. నీకు నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు. అటాచ్ అయిన అగ్రిగోల్డ్ భూములు ఎవరైనా కొంటారా? కావాలనే కక్షతోనే నా కొడుకుని అరెస్టుచేశారు. ఇది బలహీనవర్గాలపైన, గౌడ కులస్తుపైన దాడిగా నేను భావిస్తున్నా. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో తమ కుటుంబం తప్పుచేసినట్లు రుజువుచేస్తే ఆత్మహత్య చేసుకుంటాం. – జోగి రమేష్, మాజీమంత్రి ఇద్దరిని అరెస్టు చేశాం విజయవాడ రూరల్ అంబాపురం గ్రామంలో సీఐడీ అటాచ్మెంట్లో ఉన్న అవ్వా శేషనారాయణకు చెందిన అగ్రిగోల్డ్ భూమి కొనుగోలుపై వచ్చిన ఫిర్యాదుతో ప్రస్తుతం జోగి రాజీవ్, సర్వేయర్ రమే‹Ùలను అరెస్ట్‌చేశాం. ఇందులో ఐదుగురు నిందితులను గుర్తించాం. తదుపరి విచారణ తరువాత మిగిలిన వారిని అరెస్టుచేస్తాం. – సౌమ్యలత, ఏసీబీ అడిషనల్ ఎస్పీ -
మా 175 మందిని అరెస్ట్ చేసుకో..
-
వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్‌గా టీడీపీ కక్ష సాధింపు: పేర్ని నాని
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేతలపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పథకాల అమలు చేయకుండా.. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమ్తెతారు. అగ్రిగోల్డ్ భూములు జోగి రమేష్ కుమారుడు కొన్న భూములకు దగ్గరలో కూడా లేవన్నారు.2022లో పేపర్ ప్రకటన జోగి రమేష్ ఇచ్చారు. ఆయన దగ్గర స్థలం కొన్నప్పుడు కూడా వాళ్లు కూడా పేపర్ ప్రకటన ఇచ్చారు. సీబీఐ కూడా ఎక్కడా అభ్యంతరాలు చెప్పలేదు. ఆగస్ట్ 2న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. చంద్రబాబుపై జోగి రమేష్ గట్టిగా మాట్లాడారు కాబట్టే కక్ష కడుపులో పెట్టుకొని ఆయన కొడుకుపై అక్రమ కేసులు పెట్టారు.’’ అని పేర్ని నాని మండిపడ్డారు.‘‘175 నియోజకవర్గాల్లో అందరిని జైల్లో వేసిన పోరాటం ఆపం. టీడీపీ చేసే తప్పులపై పోరాటం చేస్తాం.. 2029లో టీడీపీని కులగొట్టేందుకు కావాల్సిన పోరాటం చేస్తాం. పొలం అమ్మిన వారు ముద్దాయిలుగా లేరు.. అమ్మిన వాళ్లు చంద్రబాబు చుట్టాలయి వుంటారు. అరెస్టులు చేసి తప్ఫడు కేసులు పెట్టి మానసిక ఆనందం పొందుతున్నారు. రెడ్ బుక్‌లో ఎవరెవరు పేర్లు ఉన్నాయో వాళ్లను వేధిస్తున్నారు. ఒకే సంఘటనకు రెండు కేసులు పెట్టారు. మానసిన ఆనందం తాత్కాలికం..’’ అని పేర్ని నాని దుయ్యబట్టారు. -
నా ఇంటి మీదకు వచ్చావ్.. అందుకే నా ఈ రివెంజ్..
-
కొడుకు అరెస్ట్ పై కన్నీళ్లు పెట్టుకున్న జోగి రమేష్ భార్య
-
అన్యాయంగా నా కొడుకు అరెస్ట్: జోగి రమేష్
-
జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ సోదాలు
-
చంద్రబాబూ.. వంకర బుద్ధి మార్చుకో: జోగి రమేష్
సాక్షి, విజయవాడ: మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వైఖరిపై జోగి రమేష్ నిరసన తెలిపారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ధర్నాకు దిగారు.‘‘అగ్రిగోల్డ్‌లో మా కుటుంబం తప్పు చేసినట్టు నిరూపిస్తే.. విజయవాడ నడిరోడ్డుపై ఉరి వేసుకుంటాం. చంద్రబాబు మాపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. మా కుమారుడు విదేశాల్లో చదివాడు, ఉద్యోగం చేశాడు. బలహీనవర్గాలపై దాడి ఇది.. గౌడ కులం నుంచి అంచెలంచెలుగా ఎదిగా. కోపం ఉంటే నాపై కక్ష తీర్చుకోండి. నా కుమారుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు’’ అని జోగి రమేష్ ధ్వజమెత్తారు.చంద్రబాబూ.. నీకూ కొడుకులు ఉన్నారు.. తప్పుడు కేసులు బనాయించడం మంచిది కాదు. చంద్రబాబు వంకర బుద్ది మార్చుకోవాలి. ఇది జోగి రమేష్ మీద.. జోగి రాజీవ్‌పై జరిగిన దాడి కాదు.. బలహీన వర్గాలపై జరిగిన దాడి. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చండి.. డైవర్షన్ పాలిటిక్స్ వద్దు.. హామీలు నెరవేర్చి ప్రజలకి మంచి చేయండి ’’ అంటూ జోగి రమేష్ హితవుపలికారు. -
మాజీ మంత్రి జోగి రమేష్‌పై అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలు
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ శ్రేణులపై అధికార కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా వారిపై పలు అక్రమ కేసులు నమోదు చేస్తూ రాజకీయ వేధింపులకు గురి చేస్తోంది. వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆయన ఇంటిలో మంగళవారం ఉదయం పోలీసులు సోదాలు చేపట్టారు. ఎందుకొచ్చారోకూడా సమాచారం ఇవ్వకుండా పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీసులు తీరుపై జోగి రమేష్ కుటుంబ సభ్యులు, అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.రెండు నెలల క్రితం జోగి రమేష్ ఇంటిపై రాళ్లతో దాడులుఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. జూన్ 16న జోగి రమేష్‌పై రాళ్ల దాడి చేశారు. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై రాళ్ల దాడి
సాక్షి,ఎన్టీఆర్ జిల్లా: ఎన్నికల ఫలితాల అనంతరం జనసేన, టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు.తాజాగా, మాజీ మంత్రి జోగిరమేష్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటిపై జనసేన,టీడీపీ సానుభూతి పరులు రాళ్లురువ్వారు. AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరారు. రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. -
చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది ?
-
బాబు.. దోచుకుంది దాచుకునేందుకు విదేశాలకు వెళ్లావా?: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు విదేశీ పర్యటనను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు మంత్రి జోగి రమేష్. ఎన్నిసార్లు అడిగినా చంద్రబాబు విదేశీ పర్యటనపై ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు.కాగా, మంత్రి జోగి రమేష్ శనివారం మీడియాతో మాట్లాడుతూ..‘చంద్రబాబు విదేశీ పర్యటన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మొదట హైదరాబాద్ నుండి దుబాయ్ వెళ్లారని అన్నారు. ఆ తర్వాత అక్కడ్నుండి ఎక్కడకు వెళ్లారు?. వైద్యం కోసం అమెరికా వెళ్లాడని ఎల్లోమీడియా రాసింది. అబ్బే ఆయన అమెరికా రాలేదని ఆయన పార్టీ నేతలే అన్నారు. అసలు ఇంత రహస్యంగా ఎందుకు వెళ్లారు? ఎక్కడకు వెళ్లారు?. చంద్రబాబుకు ప్రచార పిచ్చి బాగా మురిదిపోయింది.ఈ రహస్య పర్యటన వెనుక కారణం ఏంటి?. దోచుకున్న డబ్బుని దాచుకోవటానికి వెళ్లారా?. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి వెళ్లారో ప్రజలకు చెప్పాలి. ఏ దేశం వెళ్లినా ఒక ఫోటో దిగి పంపించే చంద్రబాబు.. ఈసారి ఎందుకు ఫోటోలు కూడా పంపలేదు?. అసలు ఈ పది రోజులు ఎక్కడకు వెళ్లారో ఎందుకు చెప్పటం లేదు?. ప్రతిపక్ష నాయకుడు కాబట్టి ఆయన పర్యటన గురించి ప్రజలకు అవసరం. మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తాడని టైంతో సహా మేము చెప్పాం. మరి చంద్రబాబు పర్యటనపై ఎందుకంత గోప్యత?. ఇప్పటికైనా చంద్రబాబు పర్యటన వివరాలను ప్రజలకు వివరించాలి.అవినీతిపరుడైన ఏబీ వెంకటేశ్వరరావును టీడీపీ నేతలు అక్కున చేర్చుకున్నారు. దేవినేని ఉమా సహా అందరూ వెళ్లి అవినీతిపరుడిని సత్కరించారు. ఈరోజు వచ్చే ఎగ్జిట్ పోల్స్ దెబ్బకి టీడీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. నాలుగో తేదీన ఫలితాలు చూసిన తర్వాత చంద్రబాబుకు మూర్చ వస్తుంది. ఆ రోజున కూటమి కుదేలవుతుంది. వైఎస్సార్సీపీ శ్రేణులంతా సంబరాలకు సిద్ధం కావాలి. పండుగ వాతావరణంలో సంబరాలు జరుపుకోవాలి. సీఎం జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వాలని పిలుపునిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
ఈ ఫోటోలో వ్యక్తి కనబడుట లేదు: జోగి రమేష్
-
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్లిన చంద్రబాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి -
ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ అడ్రస్ గల్లంతు
-
పవన్, బాబు, లోకేష్ పై జోగి రమేష్ పంచులు
-
కుటుంబాన్ని బండ బూతులు తిట్టిన చంద్రబాబుతో పవన్ పొత్తు..!
-
పెనమలూరులో తుఫ్యాన్
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది. ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది. నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. బోడె.. నీకో దండం ‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్‌రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది. జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్‌కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్ఆర్ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి. జోగికి ప్రజాదరణ సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది. సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు. -
ప్రజలను వెధవలు అంటారా?
పెనమలూరు: ‘రాష్ట్ర ప్రజలను వెధవలు అని కించపరుస్తారా... ఇది మీ పెత్తందారి ఆలోచనలకు నిదర్శనం...’ అని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కృష్ణాజిల్లా గంగూరులోని తన కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం దెబ్బతీసిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, అగ్రవర్ణ పేదలు అందరూ సీఎం వైఎస్ జగన్ వైపే ఉన్నారని, రాష్ట్రానికి మళ్లీ జగనన్న సీఎం అవుతారని అనేక సర్వేలు స్పష్టంచేశాయని చెప్పారు. దీంతో టీడీపీ దిక్కుతోచక అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం రంగంలోకి వచ్చిందని, ప్రజలను డబ్బులతో ప్రలోభాలకు గురిచేయాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ ప్రయత్నంలో ‘డబ్బుతో ఓట్లు కొనవచ్చు... తెలుగు ప్రజలు వెధవలు...’ అంటూ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేత కోమటి జయరాం చేసిన ప్రసంగాన్ని జోగి రమేష్ మీడియాకు చూపించారు. ఇక్కడే పుట్టి, ఇక్కడే చదివి, విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించుకున్న తరువాత తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ మాట్లాడటం దారుణమని, ఇది పెత్తందారుల మనస్తత్వానికి నిదర్శమని మండిపడ్డారు. కోమటి జయరాం, టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం నేతలపై ఎన్నికల కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. ఎన్ఆర్ఐలు చంద్రబాబును నమ్మి రాజకీయాల్లో తలదూర్చి అక్రమాలకు పాల్పడితే నట్టేట ముంచుతాడని జోగి రమేష్ హెచ్చరించారు. ఎన్ఆర్ఐలు డబ్బు సంచులతో గ్రామాల్లోకి వచ్చి ఓటర్లను ప్రభావితం చేయాలని చూస్తే జనం తరిమికొడతారని, దొంగ ఓట్లు వేయటానికి ప్రయత్నిస్తే జైలుకు వెళతారని స్పష్టంచేశారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో ఓడిపోయి హైదరాబాద్‌కు పలాయనం చిత్తగిస్తారని, ఇక ఆయన ఎన్ఆర్ఐలను ఎలా కాపాడుతారో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్ఆర్ఐలు తాము పుట్టి, పెరిగి, చదువుకున్న ప్రాంతానికి నిస్వార్థంగా సేవ చేయాలని, స్వార్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని కోరారు. పేదలకు మేలు చేస్తున్న సీఎం జగన్‌కు ఎన్ఆర్ఐలు మద్దతు తెలిపితే ప్రజలందరికి మరింత మంచి జరుగుతుందని చెప్పారు. -
చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం: జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయమని అన్నారు రాష్ట్ర గృహనిర్మాణశాఖ మత్రి జోగి రమేష్. ఎన్నికల్లో ఓడిపోయాక, బాబు అండ్ కో.. హైదరాబాద్‌కు పారిపోతారని దుయ్యబట్టారు. చంద్రబాబు, పవన్, విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడటానికి మీకు సిగ్గు లేదా అని మండిపడ్డారు. చంద్రగిరి నుంచి బాబు, భీమవరం నుంచి పవన్ ఎందుకు పారిపోయారని సూటిగా ప్రశ్నించారు. సీఎంపై దాడి జరిగితే అవహేళనగా మాట్లాడతారా?: విజయవాడ నడిబొడ్డున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై దాడి జరిగితే, ఆ దాడి ఒక డ్రామా అని, పథకం ప్రకారం చేశారని చంద్రబాబు, లోకేష్‌లు సిగ్గు లేకుండా మాట్లాడతారా?. సంస్కార హీనంగా అవహేళన చేస్తారా? మీరు అసలు మనుషులేనా? ముఖ్యమంత్రిపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఇది ఐదు కోట్ల మంది ప్రజలపై జరిగిన దాడి. మరీ ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, ఇతర వర్గాల పేదలపై జరిగిన దాడిగా ప్రజలంతా చూస్తున్నారు. పేదలను నేనున్నాను.. మీకు అండగా ఉంటాను.. అంటూ ప్రతి గడపనూ ఆదుకున్న మనసున్న ముఖ్యమంత్రి జగన్‌పై జరిగిన దాడిని నరరూప రాక్షసులైన నారా చంద్రబాబు, ఆయన దత్త పుత్రుడు పవన్ కల్యాణ్ అవహేళన చేశారు. వీళ్లు విలువలు, విశ్వసనీయత లేని రాజకీయ అజ్ఞానులు. ఆ బలమైన రాయి కొంచెం కింద కంటికి తగిలి ఉంటే కన్ను పోయేది. అదే కణతకి తగిలి ఉంటే ప్రాణమే పోయేది. ఇలాంటి కోల్డ్ బ్లడెడ్ హత్యలకు పురిగొల్పిన చంద్రబాబు అండ్ కో.. ఈ రోజు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. ఎవరు దాడి చేశారు..దాడి చేసిన వారి వెనుక ఎవరున్నారు అనేది మొత్తం పోలీసుల విచారణలో బయటకు వస్తుంది. ముందుగానే చంద్రబాబు భుజాలు తడుముకోవడం దేనికీ? కుట్ర కోణమంతా బయటకు వస్తుంది.. చంద్రబాబు కాస్త వెయిట్ చేయాలి. అంత సంఘటన జరిగినా. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు జగనన్నకు మెండుగా ఉన్నాయి కనుక ప్రాణాపాయం తప్పింది. ఆయనకు తలకు గాయమైందని తెలియగానే కోట్లాది మంది ప్రజలు ప్రార్ధనలు చేశారు. జగనన్నపై ప్రేమ ప్రతి గడపలో కనిపించింది. జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి సిద్ధం సభలతో బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతుంటే విషనాగులు కాటువేయాలని చూస్తున్నాయి. జైత్రయాత్రను అడ్డుకునేందుకు, చంద్రబాబు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నాడు. దాడి జరగకముందు రోజే.. ముఖ్యమంత్రిపై రాళ్ళతో దాడులు చేయండి.. కొట్టండి అని బహిరంగ సభలో చెప్పాడు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంత సంస్కార హీనంగా మాట్లాడాడో ప్రజలంతా చూశారు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 45 ఏళ్ల అనుభవం దేనికీ పాతిపెట్టడానికా? చంద్రబాబు సభలు పెడితే జనం రాక వేచిచూడాల్సిన పరిస్థితి ఉంది. మిమ్మల్ని చూడ్డానికి ఎవరు వస్తారు? మీ సొల్లు వినీ వినీ జనం విసుగెత్తిపోయారు. జగన్ యాత్రలో కోట్లాది మంది జనం రోడ్ల మీదకు వస్తున్నారు. అక్కచెల్లెమ్మలు, యువకులు యాత్రలో పాల్గొంటున్న తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. రామోజీ, రాధాకృష్ణా..ఆ వచ్చే ప్రజలను కళ్లు తెరిచి చూడండి. జనం రాలేదు..జనం వెళ్లిపోయారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు. పేదల పక్షాన జగనన్న ఉన్నారు. ప్రజలు చంద్రబాబును నమ్మం గాక నమ్మం అని చెప్తున్నారు. చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయింది ఎవరు బాబూ?: చంద్రబాబు పెడనలో నిన్న ఇష్టారీతిన మాట్లాడాడు. అసలు నీ నియోజకవర్గం చంద్రగిరి. నువ్వు పారిపోయింది కుప్పానికి. ఈ ఎన్నికల్లో కుప్పంలో నువ్వు ఓడిపోయి, హైదరాబాద్ పారిపోవడం ఖాయం. నీ పార్ట్నర్ గతంలో ఎక్కడ పోటీ చేశాడు? భీమవరం, గాజువాకలు వదిలి, ఇప్పుడు పిఠాపురం ఎందుకు పారిపోయాడు? పిఠాపురంలో గ్లాసు పగిలిపోతే హైదారాబాద్‌లో షూటింగులు చేసుకుంటాడు. చంద్రబాబు కొడుకు లోకేశ్..ఎక్కడ పోటీ చేస్తున్నాడు..? మంగళగిరి నీ సొంతమా? దమ్ముగా, ధైర్యంగా ఉన్నాం. జగనన్న సైనికుల్లా ఉన్నాం..ఆయన వెంటే నడుస్తాం. ఆయన్ను ఎవరైనా ఏదన్నా అంటే మీ చెమడాలు వలుస్తాం. జగన్ ఏం చేశారని మీరు అంతగా కడుపుమంటను ప్రదర్శిస్తున్నారో చంద్రబాబు, పవన్‌లు చెప్పాలి. మీకు చేతగానిది ఐదేళ్లలో ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చేసి చూపించారు. జగన్ మా బిడ్డ, మా పెద్ద కొడుకు అని ప్రజలు చెబుతున్నారు. మాకు ఇళ్లు కట్టిస్తున్నాడు..మా పిల్లల్ని చదివిస్తున్నాడు..మా ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నాడని ప్రజలు గడపగడపలో చెబుతున్నారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి-సంస్కరణలు చూసి, దేశమంతా ఏపీౖవైపు చూస్తుంది. దిక్కు మాలిన చంద్రబాబు రేపు..దిక్కు లేని వాడు అవ్వబోతున్నాడు. మే 13న పోలింగ్ స్టేషన్ కు ఎప్పుడు వెళదామా.. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఈ ఇద్దరు మోసగాళ్లు.ఢిల్లీ వెళ్లి బీజేపీతో కలిశారు. కొత్తేముంది..2014లోనూ మీరు ముగ్గురేగా పోటీ చేసింది. గెలిచిన తర్వాత ముగ్గురూ తిట్టుకుని.. మూడు ముక్కలయ్యారు. పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు ఇతను పెద్ద పుడింగా..ఇతని వల్ల మేం గెలిచామా? అని తిట్టారు. చంద్రబాబేమో, మోడీని, వారి కుటుంబ సభ్యులందరినీ తిట్టాడు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మీరు కలుస్తారు? సిగ్గుందా? జూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం: మీరు బంగాళాఖాతంలో కలపడం కాదు..రేపు ఫలితాల తర్వాత టీడీపీ, జనసేన పార్టీల అడ్రస్ గల్లంతు కాబోతుంది. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కల్యాణ్..ఇద్దరూ ఓడిపోయి హైదరాబాద్ పారిపోబోతున్నారు. మనసు పెట్టి ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు జగన్ గారు. 3648 కిలోమీటర్ల సుధీర్ఘ పాదయాత్ర చేసి, ప్రజల సంకల్పాన్ని మేనిఫెస్టో చేసుకుని ముందుకెళ్లారు. ఆ మేనిఫెస్టో ప్రతి గడపకు చేరింది కాబట్టే వారు జగన్ గారిని ప్రతి గుండెలో పెట్టుకున్నారు. చంద్రబాబు ఖతం అయిపోబోతున్నాడు. టీడీపీ వారికి చెప్తున్నా. చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయం. ఆ విషయం తెలుసుకుని చాలా మంది ఆ రెండు పార్టీల నుంచి మావైపు వచ్చారు. ఇప్పుడు జనసేన, టీడీపీ కాళీ అయిపోతున్నాయి. మిగిలిన వారికి కూడా చెప్తున్నా.. జగనన్న వెంట నడవండి. ప్రజా సేవలో మమేకం కండి. జగన్ పార్టీ చూడడం లేదు..మతం, కులం ఏమీ చూడటం లేదు. చంద్రబాబును నమ్మొద్దు..అతను పెద్ద మోసకారి. పార్టీ పెట్టిన వ్యక్తినే పైకి పంపించిన ఘనుడు. చివరికి జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా వెన్నుపోటు పొడిచాడు. అతని సినిమాలు ఆడనివ్వకుండా చేశాడు. చంద్రబాబును ప్రజలు బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాటికే సర్వేలన్నీ చెప్తున్నాయి. జగన్ గారిది వన్‌సైడ్ వార్ అని స్పష్టంగా చెప్తున్నారు. వైఎస్సార్సీపీ 175కి 175 స్థానాల్లో విజయఢంకా మోగించబోతోంది. -
కుప్పంలో బాబు, పిఠాపురంలో పవన్ అడ్రస్ గల్లంతే
-
సీఎం జగన్ పై దాడి...జోగి రమేష్ ఆగ్రహం
-
ఆ విషయం బాబుకు తెలుసు కాబట్టే బీజేపీతో పాట్లు
-
విలువలు లేని దుర్మార్గుడు చంద్రబాబు
కంకిపాడు: రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత లేని దుర్మార్గుడు, మోసగాడు చంద్రబాబు అని గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ ధ్వజమెత్తారు. మామకు వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో సీఎం అయ్యారన్నారు. సూట్కేస్లకు సీట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో జోగి రమేశ్ సోమవారం మీడియాతో మాట్లాడారు. ఉయ్యూరు ప్రజాగళం సభలో చంద్రబాబు తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బాబు రోడ్‌షోకు, ఉయ్యూరు సభకు జనం నుంచి ఏ మాత్రం స్పందన లేదన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో, పొర్లాడతాడో, తెగతెంపులు చేసుకుంటాడో, కాళ్ల బేరానికి వెళ్లి కాళ్లు పట్టుకుంటాడో తెలియదని ఎద్దేవా చేశారు. పనికిమాలిన రాజకీయాలు చేసే ఘనత ఆయనకే సొంతమన్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం కాదని, కనీసం కుప్పంలో అయినా ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఆరాటపడుతున్నారన్నారు. అయితే కుప్పంలో కూడా చంద్రబాబుకు ఓటమి తప్పదన్నారు. వెన్నుపోటు రాజకీయాలపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. యూత్ కాంగ్రెస్ నేతగా, వంగవీటి మోహన రంగా అనుచరుడిగా రాజకీయంగా ఎదిగానన్నారు. వైఎస్సార్ మనసు గెలుచుకున్నానని, జగనన్న పక్కన చోటు దక్కించుకున్నానని తెలిపారు. చంద్రబాబులాగా దొడ్డి దారిలో తాను ఏ పదవీ పొందలేదన్నారు. ఎమ్మెల్యే పార్థసారథి పెనమలూరు సీటు ఆశిస్తే అడ్డంగా మోసం చేసి నూజివీడు పంపలేదా? అని నిలదీశారు. రెండుసార్లు ఎంపీగా గెలిచిన బీసీ నేత కొనకళ్ల నారాయణకు కనీసం సీటు కూడా ఇవ్వకుండా మోసం చేయలేదా? అని ప్రశ్నించారు. బోడె ప్రసాద్ ఇక్కడ గెలవలేడని, కాల్‌మనీ, సెక్స్ రాకెట్ అభియోగాలు ఉన్నాయని పక్కనపెడితే ఆయన కుటుంబం అంతా కన్నీరుమున్నీరుగా ఏడ్చింది చంద్రబాబు వల్ల కాదా? అని మండిపడ్డారు. మైలవరం సీటు రూ.100 కోట్లకు చంద్రబాబు అమ్ముకున్నాడని దేవినేని ఉమా విమర్శించలేదా? అని ప్రశ్నించారు. మోసపూరిత, వెన్నుపోటు రాజకీయాలకు కేరాఫ్ చంద్రబాబని నిప్పులు చెరిగారు -
చంద్రబాబుకు జోగి రమేష్ సవాల్
-
పెనమలూరులో మళ్లీ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేస్తాం
-
పవన్ వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ ఫైర్
-
పవన్ కు మంత్రి జోగి రమేష్ స్ట్రాంగ్ కౌంటర్
-
బీసీ డిక్లరేషన్ పేరిట బాబు, పవన్ మరో మోసం
సాక్షి, అమరావతి: బీసీ డిక్లరేషన్ అబద్ధాల వీరులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మరో మోసానికి తెర తీశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు–బ్యాక్ బోన్ క్లాసులనే వైఎస్సార్సీపీని కాపీ కొట్టారని ధ్వజమెత్తారు. ఈ మేరకు వారిద్దరూ మంగళవారం ప్రకటన జారీ చేశారు. బీసీలంటే బ్యాక్ బోన్ క్లాసులని వైఎస్సార్సీపీ 2019 ఎన్నికల ముందు ఏలూరు డిక్లరేషన్‌లో చెప్పిన మాటల్ని గుర్తు చేశారు. 2014 ఎన్నికల సందర్భంగా బీసీలకు 143 వాగ్దానాలిచ్చిన టీడీపీ అందులో ఒకటి కూడా అమలు చేయలేదని గుర్తు చేశారు. ఇప్పుడు 50 ఏళ్లకే పెన్షన్, బీసీ సబ్‌ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్లు ఖర్చు సహా పలు కల్లబొల్లి హామీలు గుప్పిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ వర్గం ప్రజలు బాబు, పవన్‌ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. వీరు ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌కు ఎలాంటి విలువ లేదన్నారు. 40 ఏళ్ల బాబు రాజకీయ జీవితంలో బీసీల్ని బాగా వాడుకుని చివరికి కత్తెర్లు, ఇస్త్రీ పెట్టెల కులాలుగా అవమానించే సంస్కృతి నుంచి బయటపడలేదన్నారు. రూ.2.55 లక్షల కోట్ల జమ గడచిన 57 నెలల పాలనలో తమ ప్రభుత్వం డీబీటీ ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.55 లక్షల కోట్లు జమ చేసిందని మంత్రులు చెల్లుబోయిన, జోగి రమేష్ గుర్తు చేశారు. అందులో బీసీలకు డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.1.71 లక్షల కోట్ల మేర మేలు చేశామన్నారు. బాబు అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల మేర మేలు చేస్తామంటున్నారని, ఈ లెక్కన పరిశీలిస్తే తమ ప్రభుత్వం చేసిన దానికంటే రూ.25 వేల కోట్లు తక్కువే చేస్తామని అంటున్నారని పేర్కొన్నారు. 2014లో బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయిస్తానని, చివరకు రూ.19 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసి బాబు దగా చేశారన్నారు. నిరుపేదలైన బీసీల పిల్లలకు ఇంగ్లిష్ మీడియం విద్య, ఇళ్ల పట్టాలు పంపిణీపై కోర్టులకు వెళ్లి అడ్డుకున్నారన్నారు. బీసీలకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలన్స్ వస్తుందన్న ఘనుడు బాబు అన్నారు. బీసీ అక్కచెల్లెమ్మలకు ఈ రోజు ఇస్తున్న చేయూత వంటి పథకం 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఏ ఒక్క రోజైనా అమలు చేశారా అని నిలదీశారు. -
సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం జగన్‌దే: జోగి రమేష్
-
ఐప్యాక్‌కి పీకేకు సంబంధం లేదు: మంత్రి జోగి రమేష్
సాక్షి, విజయవాడ: ఒక పీకే(పవన్ కల్యాణ్) అయిపోయాడు.. ఇప్పుడు ఇంకొక పీకే(ప్రశాంత్ కిషోర్) వచ్చాడంటూ.. మంత్రి జోగి రమేష్ విసుర్లు విసిరారు. తాజాగా ఏపీ రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. మంత్రి జోగి రమేష్ పలు ప్రశ్నలు సంధించారు. ‘‘ప్రశాంత్ కిషోర్‌కి అసలు ఆంధ్రాలో టీమ్ ఉందా?.. అతను సర్వేలెప్పుడు చేశాడు?. ఐ ప్యాక్ కి ప్రశాంత్ కిషోర్ కి సంబంధం లేదు. ఎల్లో మీడియాలో డబ్బాలు కొట్టేందుకు ఆయనేవో రెండు మాటలు మాట్లాడాడు. ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏమైంది?. ప్రశాంత్ కిషోర్ ని ఎవరూ పట్టించుకోరు. టీడీపీ రాసి ఇచ్చిన స్క్రిప్ట్‌నే పీకే చదువుతున్నారు’’ అంటూ విమర్శలు గుప్పించారు. .. ‘చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని.. ఎంతంది పీకేలు వచ్చినా, చంద్రబాబు వచ్చినా జగన్ గెలుపును ఆపలేరని.. జగనన్న పాలనను ఆశీర్వదించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నార’ని మంత్రి జోగి రమేష్ అన్నారు. -
‘చంద్రబాబు ఫ్యూచర్ భువనేశ్వరి ముందే కనిపెట్టేశారు’
సాక్షి, విజయవాడ: భువనేశ్వరి ఆమె మనసులో మాట బయటపెట్టారని, రాష్ట్ర ప్రజలంతా చంద్రబాబును అసహ్యించుకుంటున్నారని మంత్రి జోగి రమేష్ అన్నారు. నారా భువనేశ్వరి వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ.. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారు. భువనేశ్వరి ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ప్రజల మనసులో ఉన్న ఆకాంక్షను ఆమె గమనించారని మంత్రి వ్యాఖ్యానించారు. భువనేశ్వరి సరదాగా చెప్పిన మాట కాదు.. ఆమె మనసులో ఉన్న భావనే బయటపెట్టారు. 35 ఏళ్ల నుంచి కుప్పానికి చంద్రబాబు ఏం చేయలేదు. చంద్రబాబు కుప్పానికీ పనికిరాడు. రాష్ట్రానికీ పనికిరాడని సొంత భార్యే చెప్పేసింది. సిద్ధాంతం, విలువలు, విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు. 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు 175 స్థానాల్లో టీడీపీని నిలబెట్టలేని అసమర్ధుడయ్యాడు. టీడీపీని కొన్ని ప్రాంతాలకే పరిమితం చేశాడు. పవన్‌కు 50, 60 పంచాలి.. మరో పార్టీకి ఇంకొన్ని పంచాలనే ఆలోచనలో ఉన్నాడు. చంద్రబాబు దిక్కులేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇవన్నీ గమనించారు కాబట్టే చంద్రబాబును పక్కకు తోసేయాలని భువనేశ్వరి ఆలోచన’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ పనికిరాడు.. ఎన్టీఆర్ కూతురుగా తానే బెటర్ అని భువనేశ్వరి భావిస్తున్నట్లున్నారు. చంద్రబాబు ఓడిపోతున్నాడని భువనేశ్వరి ముందే కనిపెట్టారు. ఎన్టీఆర్ కూతురుగా తనకైనా ఓట్లేస్తారని భువనేశ్వరి అనుకుంటున్నారు. ఈసారి కుప్పంలో చంద్రబాబు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం’’ అని జోగి రమేష్ చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబుకి రెస్ట్.. కుప్పం బరిలో భువనేశ్వరి? -
మంగళగిరిలో లోకేష్ ని మడతపెట్టి.. మంత్రి జోగి రమేష్ పంచులే పంచులు
-
‘మంగళగిరిలో లోకేష్‌ను మడత పెట్టేస్తాం’
గుంటూరు: మంగళగిరి నియోజకవర్గంలో బీసీ సీటులో నారా లోకేష్ పోటీ చేయటం దారుణమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. జోగి రమేష్ బుధవారం మంగళగిరి వైఎస్సార్సీపీ సామాజిక సాధికార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్సార్సీపీ లోకేష్‌ను మడత పెట్టేస్తుందని అన్నారు. వైఎస్సాఆర్సీపీ దెబ్బకు లోకేష్ పారిపోతాడని అన్నారు. మంగళగిరి అని పలకటమే చేతకాని లోకేష్ మంగళగిరిలో పోటీ చేయటమా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయి రకరకాల వేషాలలో దొంగలు వస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు పిలునిచ్చారు. సీఎం జగన్‌కు అండగా ఉండాలి.. అట్టడుగు వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకురావాలని ఎంతోమంది మేధావులు ఆలోచన చేశారని మంత్రి మెరుగు నాగార్జున అన్నారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కరే మేధావుల ఆలోచనలనకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అన్ని విధాల పైకి తీసుకొచ్చారు తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సామాజిక న్యాయాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని.. ఆయనకు అందరూ అండగా ఉండాలని అన్నారు. బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు పేదలకు దేవుడని వైఎస్సార్సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవి అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లోనే సామాజిక న్యాయం అమలవుతుందని తెలిపారు. మంగళగిరిలో బీసీలను అణగదొక్కి లోకేష్ పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అగ్రవర్ణాల సిట్టింగ్ ఎమ్మెల్యేను పక్కనపెట్టి మంగళగిరి సీటును బీసీలు కేటాయించారని అన్నారు. వైఎస్సార్సీపీ మరోసారి గెలిపించుకోకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంతా 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతారని ఎంపీ నందిగాం సురేష్ అన్నారు. దొంగల ముఠా.. పచ్చ మీడియా చెప్పే విషయాలను రాసే కథనాలను ప్రజలు నమ్మవద్దని తెలిపారు. -
చంద్రబాబుకు మంత్రి జోగి రమేష్ సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో నాపై పోటీ చేసే దమ్ముందా? అంటూ చంద్రబాబుకు సవాల్ విసిరారు మంత్రి జోగి రమేష్. కంకిపాడులో పెనమలూరు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు సర్వేలు కూడా చేయించుకున్నాడని, ఎవరు పోటీ చేసినా గెలిసేది తానేనన్నారు. ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్‌ను ఎదుర్కోలేరు. ప్రతిపక్షాలను కృష్ణా నదిలో కలిపేస్తామన్నారు. ‘‘ప్రజల గుండెల్లో జగన్ నిలిచిపోయారు. ఢిల్లీలో కాంగ్రెస్ పీఠాన్ని వణికించిన ధీరుడు సీఎం జగన్. ఆయనపై సోనియా, రాహుల్ కుట్రలు పన్నారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తాడు. కాంగ్రెస్ ముందుపోటు పొడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో 175కు 175 స్థానాలు గెలుస్తాం. పెనమలూరు గడ్డ వైఎస్సార్సీపీ అడ్డా’’ అని మంత్రి పేర్కొన్నారు. ఇదీ చదవండి: షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి: సజ్జల -
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
-
ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధం: మంత్రి జోగి రమేష్
సాక్షి, ఎన్టీఆర్: ఎక్కడి నుంచైనా తాను పోటీకి సిద్ధమని మంత్రి జోగి రమేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తాను పోటీకి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా సీఎం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. కేశినేని నాని నిజం తెలుసుకొని, సీఎం జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు వైఎస్సార్సీపీలో చేరారని తెలిపారు. నందిగామలో జగనన్న వాకింగ్ ట్రాక్‌ను మంత్రి జోగి రమేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, మొండితోక జగన్ మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, తదితర నేతలు పాల్గొన్నారు. సుమారు రూ. కోటి రూపాయల వ్యయంతో 700 మీటర్ల వాకింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కేశినేని నానికి వైఎస్ జగన్‌పై అభిమానం ఉన్నా..చంద్రబాబు తిట్టమని చెప్పడం వల్లే సీఎంపై విమర్శలు చేశారని మండిపడ్డారు. నానికి విజయవాడ ఎంపీ స్థానం కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ ఎంపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకోబోతుందని పేర్కొన్నారు. పెనమలూరులో ప్రత్యర్థిగా పార్థసారథి అయినా, చంద్రబాబు అయినా తన పోటీ అక్కడి నుంచే ఉంటుందని స్పష్టం చేశారు. -
ఎన్నికలకు ముందే బాబు, పవన్ అస్త్ర సన్యాసం
సాక్షి, అమరాతి: ప్రజల్లో గుర్తింపు లేని చంద్రబాబు, ఎన్నికల కమిషన్ వద్ద గుర్తింపులేని పవన్ కళ్యాణ్.. వారిద్దరూ కలిసి వైఎస్సార్సీపీని ఏం చేయగలరని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అన్ని స్థానాల్లో పోటీ చేసే దమ్ము జనసేనకు ఉందా అని పవన్‌ను నిలదీశారు. ఓటమికి కారణాలను ముందే వెతుక్కుంటున్నారని, ఎన్నికలకు ముందే అస్త్ర సన్యాసం చేశారని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర పూర్తయి ఐదేళ్ళు అయిన సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్రం కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు ఓటమి ఖాయమని, కుప్పం ప్రజలు తరిమికొడతారని ఆయనకు తెలిసిపోయిందని అన్నారు. సీఎం వైఎస్ జగన్‌ను ఎదుర్కోలేమని తెలిసి ఇద్దరూ కలిసి ఎన్నికల కమిషన్ వద్దకు వెళ్లి వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారని అన్నారు. ఒక రోజు లక్షల ఓట్లు తొలగించారని, మరో రోజు లక్ష ఓట్లు జోడించారని ఎల్లో మీడియాతో పచ్చి అబద్ధాలు రాయిస్తున్నారన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం లేక ఎన్నికల కమిషన్‌కు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. అసలు 175 నియోజకవర్గాలలో పోటీ చేయటానికి టీడీపీ, జనసేనకు అభ్యర్థులు ఉన్నారా అని ప్రశ్నించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ... దళితులను అక్కున చేర్చుకున్న నేత సీఎం జగన్ అని అన్నారు. చంద్రబాబు దళితులను అడ్డు పెట్టుకుని రాజకీయాలు మాత్రమే చేస్తారని, చేసే మేలేమీ ఉండదని విమర్శించారు. దళితులపై పవన్ ఆరోపణలు సరికాదన్నారు. కుప్పంలో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ముందుగానే దొంగ ఓట్లు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు నారాయణమూర్తి, రాజశేఖర్, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు
-
జనసేనకు ఎలక్షన్ కమిషన్ దగ్గర గుర్తింపు లేదు: జోగి రమేష్
-
‘బాబూ.. ఆ సీటు అమ్ముకున్నావా? లేదా..?’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబును బీసీలెవ్వరూ నమ్మరని, రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. నిన్నటి దాకా తన సొంత సామాజికవర్గం తప్ప మిగతా సామాజిక వర్గాల వారందర్నీ చంద్రబాబు హీనంగా, చులకనగా చూశాడు. ఇప్పుడేమో రేపోమాపో ఎన్నికలగానే మళ్లీ ఆయన వేషం మార్చాడంటూ మంత్రి దుయ్యబట్టారు. పెడనలోని మార్కెట్ యార్డులో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. బీసీలపై చంద్రబాబు దొంగ ప్రేమ: మీ తోకలు కత్తిరిస్తాం.. అంతుచూస్తానంటూ.. బీసీల్ని బెదిరించిన ఈ చంద్రబాబు మళ్లీ ఇప్పుడు బీసీలపై దొంగ ప్రేమ కురిపిస్తున్నాడు. ఈ రోజు జయహో బీసీ పేరిట పార్టీ కార్యక్రమం పెట్టుకుని అందులో ఆయనతో పాటు అచ్చెన్నాయుడు, బండారు సత్యన్నారాయణ, ఇంకా కొంతమంది బీసీలకేదో చేసినట్టు పెద్దపెద్దగా రంకేలేస్తున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ నేతలు బీసీల విషయంలో ఎంతగా పశ్చాతాప్తం పడ్డా.. వాళ్ల మాటల్ని బీసీలు నమ్మరు గాక నమ్మరు. బీసీలకు పెద్దన్నగా జగన్‌కు ఆదరణ: అణగారిన వర్గాలు, బడుగు, బలహీనవర్గాల్ని గుర్తించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధిలోకి తెచ్చి అక్కునజేర్చుకుని బీసీలకు పెద్దన్నగా నిలిచిన సీఎం జగన్. అందుకే, ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ చూసినా బీసీలంతా జగనన్న పట్ల ఆదరణ చూపుతూ మళ్లీ మా సీఎం నువ్వేనన్నా అని అంటున్నారు. 75 సంవత్సరాల దేశ చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిలబెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే.. ఏకైక వ్యక్తి వైఎస్ జగన్ మాత్రమే అని చెప్పుకోవాలి. గర్వంగా చెప్పుకుంటున్నాం... కేబినెట్లో 25 మంది మంత్రులుంటే.. అందులో 17 మందిని నాతో సహా బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులిచ్చి గౌరవించిన ఘనత మన ముఖ్యమంత్రి జగనన్నకే దక్కుతోంది. 9 రాజ్యసభ స్థానాల్లో 4 స్థానాల్ని బలహీనవర్గాలకు కట్టబెట్టి బీసీల్ని అగ్రస్థానంలో నిలబెట్టి మన ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకులు మా జగనన్న అని మేం గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎస్సీల రాజ్యసభ్య సీటును అమ్ముకున్న నీచుడు చంద్రబాబు: చంద్రబాబు రాజ్యాంగ పదవుల నియామకంలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపుసోదరులందరినీ మోసం చేశాడు. ఎస్సీ సామాజికవర్గానికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని.. తెలుగుదేశం పార్టీ సీనియర్‌గా ఉన్న వర్ల రామయ్య గారికి కబురు పంపితే.. పాపం, ఆయన భారీ ర్యాలీగా విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చేలోగానే.. ఆ రాజ్యసభ సీటును నీ సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రనాథ్‌కుమార్‌కు అమ్ముకున్నావా..లేదా..? అనేది చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నాను. మోసానికి కేరాఫ్ చంద్రబాబు: చంద్రబాబు పేరు చెబితే మోసం గుర్తుకొస్తుంది. సుదీర్ఘ కాలం రాజకీయం అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన 14 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండి ఏ ఒక్క అక్కచెల్లెమ్మల ఖాతాల్లోనైనా ప్రభుత్వం తరఫున ఒక్క రూపాయి జమ చేశాడా..?. డ్వాక్రా అక్కచెల్లమ్మలకు రుణమాఫీ అని చెప్పి చేతులెత్తిపోయాడు. ఆయన ఎగొట్టిన రుణమాఫీని వైఎస్ జగన్ వచ్చాక అమలు చేసిన పరిస్థితి మీ అందరూ గుర్తుచేసుకోవాలి. అదే విధంగా రైతుల్ని కూడా రుణమాఫీ పేరిట నిలువునా ముంచిన వ్యక్తి చంద్రబాబు. ఆయన పాదం పెడితేనే పచ్చని పంటలు కూడా నిలువెల్లా మాడిమసైపోతాయి. చంద్రబాబు ఉంటే కరువు.. కరువంటే కేరాఫ్ చంద్రబాబు అనేది గుర్తు. మానవత్వమే జగనన్న కులం: అదే మన జగనన్న అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి నేటి వరకు అంటే 2019 నుంచి ఇప్పటి దాకా ప్రతీ అక్కచెల్లెమ్మలు, రైతులు, అవ్వాతాతలు, విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వసంక్షేమం ఎంత జమ అయిందో అందరూ లెక్కగట్టండి. కులం, మతం, రాజకీయం, ప్రాంతం చూడకుండా మన జగనన్న ఇప్పటికీ డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సొమ్ము అక్షరాలా రూ.2.41 లక్షల కోట్లు. జగనన్న మనసున్న మనిషి. మానవత్వమే ఆయన కులం. కనుకే, ఈరోజు అన్ని సామాజికవర్గాల అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, రైతులు, యువత ఆయన్ను ఆశీర్వదిస్తున్నారు. ప్రశ్నిస్తానన్న పవన్‌కళ్యాణ్ అప్పట్లో ఏం చేశాడు..?: గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్‌కళ్యాణ్..?. గతంలో మీరిద్దరూ కలిసే పోటీ చేశారు కదా..? ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా నీ దత్తదండ్రి చంద్రబాబును నువ్వు ప్రశ్నించావా..?. రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచితే.. ఆ పాపంలో నువ్వు కూడా భాగస్వామిగా ఉండలేదా..?. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? గ్రామగ్రామాన జగన్ మార్కు ఇది: చంద్రబాబుది దద్దమ్మ పాలన అని పిల్లోడు కూడా చెబుతున్నాడు. అదే మా జగనన్న ముఖ్యమంత్రిగా తన మార్క్‌ను గ్రామగ్రామాన చూపించారు. ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్నన్న మార్క్ కనపడుతుంది. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు–నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. అందరం ఏకతాటిపైకొచ్చి బాబు, పవన్‌లను చిత్తుగా ఓడిస్తాం: చంద్రబాబు అధికార హయాంలో ప్రజల ఖాతాల్లో ఎందుకు ఒక్క రూపాయి కూడా జమచేయలేకపోయాడని అందరూ ఆలోచన చేయాలి. అదే ప్రభుత్వం.. అదే బడ్జెట్. మరి, మా ప్రభుత్వం పేదలకిచ్చిన సొమ్మంతా గత పాలకులు ఏం చేశారు..? అంటే, వాళ్లు దోచేసుకున్నారు.. పంచుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో జమచేసిన సంక్షేమ లబ్ధిని లెక్కగట్టి.. చంద్రబాబు దవడ పగిలేటట్టు రేపటి ఎన్నికల్లో ఆయనకు అందరూ బుద్ధిచెప్పాలి. ఈ రోజు ఎక్కడ చూసినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లను చిత్తుచిత్తుగా ఓడించడం ఖాయం. ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్ -
రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడైనా ఉందా ?
-
చంద్రబాబు కోసం పవన్ ఏ గడ్డయినా తింటారు: మంత్రి జోగి రమేష్
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల నిర్మాణాల్లో అవినీతి జరిగినట్లు ప్రధాని మోదీకి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లేఖ రాయటంపై మంత్రి జోగి రమేశ్ మండిపడ్డారు. ఆ లేఖలో సీబీఐతో పాటు ఈడీ ఎంక్వైరీ చేయాలని పవన్ కల్యాణ్ కోరారు. అసలు జనసేన అధ్యక్షుడు ఏ ఆధారాలతో లేఖ రాశారని జోగి రమేశ్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జోగి రమేశ్ ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలపై వివరాలను వెల్లడించారు. 30.65 లక్షల అక్కచెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను, ఇళ్ల నిర్మాణ ప్రక్రియను ప్రతిపక్షాలు అడ్డుకోవాలని చూస్తున్నాయని అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో పాటు అగ్రవర్ణాల పేద అక్కచెల్లెమ్మలకు ఇస్తున్న ఇళ్లలో స్కాం జరిగిందంటూ ప్రధానికి లేఖ రాయటం సరికాదు. ప్రధాని మోదీకి పవన్ కల్యాణ్ రాసిన 13 అంశాలపై మీడియా ద్వారా పూర్తి వివరాలతో సమాధానాన్ని పంపిస్తున్నానని జోగి రమేశ్ తెలిపారు. ఒక్క రూపాయి అవినీతి జరగలేదు. అంతా ఆన్లైన్ పేమెంట్లు. మరి, అవినీతికి ఆస్కారం ఎక్కడ పవన్?, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కల్యాణ్‌కు ఇళ్లు ఉందా? ఆధార్ కార్డు ఉందా? డోర్ నెంబర్ ఉందా? కనీసం ఓటు అయినా ఉందా? ఎంత దుర్మార్గులు మీరు. పచ్చి దుర్మార్గుడు అయిన చంద్రబాబు తాబేదారు పవన్ కల్యాణ్ ఏ గడ్డి అయినా కరవటానికి సిద్ధపడతాడు. 75 ఏళ్ల దేశ చరిత్రలో ఇప్పటి వరకు జరగనటువంటి అభివృద్ధి, సంక్షేమం నాలుగేళ్ల ఎనిమిది నెలల్లో ఇంత అభివృద్ధి జరుగుతోంది. జగనన్న ముఖ్యమంత్రి కాగానే.. పాదయాత్రలో కష్టాలు, కన్నీళ్లు పడ్డ అక్కచెల్లెమ్మలు, నిరుపేదలు గూడులేక నిరాశ్రయులుగా ఉన్న వారికి సీఎం జగన్ అడ్రస్ ఇచ్చారు. ఎప్పటి నుంచో కలలుగా మిగిలిపోయిన 30.65 లక్షల పేదింటి అక్కచెల్లెమ్మల సొంతింటి కలను సీఎం జగన్ నిజం చేశారు. అక్కచెల్లెమ్మలకు పట్టాలు ఇవ్వటంతో పాటు ఇప్పటికే వారిలో 21.75 లక్షల మందికి గృహ నిర్మాణం చేపట్టారు. కొన్ని లక్షల అక్కచెల్లెమ్మలు గృహ ప్రవేశాలు చేసుకుని జయహో జగనన్న అని నినదిస్తున్నారు. మరి, ఇందులో స్కాం జరుగుతోందా? ఇంటి నిర్మాణానికి చేతికి డబ్బులు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కటీ ఆన్లైన్ పేమెంట్ జరుగుతోంది. బుర్ర లేకుండా స్కాం అని పవన్ కల్యాణ్ అనటం ఏమిటి? ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియకుండా పేదల గృహాల మీద స్కాం అని లేఖ రాయటమా? గతంలో చంద్రబాబు నెరవేర్చని హామీలను ఏనాడైనా ప్రశ్నించావా పవన్ గతంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, బీజేపీ కలిసే పోటీ చేశారు. ఇళ్ల స్థలం లేని అక్కచెల్లెమ్మలకు మూడు సెంట్ల స్థలం ఇస్తామని ఆనాడు హామీలు ఇచ్చారు. మరి, ఆ హామీలు నెరవేర్చారా? దానిపై ఏనాడైనా చంద్రబాబును పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? రైతు రుణమాఫీ అంటూ రైతుల్ని చంద్రబాబు నట్టేట ముంచాడు. ఆ పాపంలో భాగస్వామిగా ఉన్న పవన్ ఏనాడైనా ప్రశ్నించాడా? డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ఎన్నికల్లో వాగ్ధానం చేశామని ఎందుకు చేయలేదని చంద్రబాబును ఎప్పుడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? ఇంటికో ఉద్యోగం ఇస్తామని చంద్రబాబు మోసం చేశారు. దానిపైన చంద్రబాబును ఏనాడైనా పవన్ కల్యాణ్ ప్రశ్నించాడా? 14 ఏళ్ల పాటు సీఎంగా చేసిన చంద్రబాబు ఇళ్లస్థలాలు ఇవ్వలేని దద్దమ్మ. కానీ ఈనాడు సీఎం జగన్ ఇళ్ల స్థలాలు ఇవ్వటమే కాకుండా, ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఇంత మంచి చేస్తున్న సీఎం జగన్ మోహన్ రెడ్డికి పవన్ కల్యాణ్ సెల్యూట్ చేయకుండా స్కాం జరుగుతోందంటూ లేఖలు రాయటం ఏమిటి? రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా సీఎం జగన్ మార్క్ కనిపిస్తుంది. మరి, చంద్రబాబు తన మార్క్ చూపించగలడా?,చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌లు కోరుకున్న గ్రామానికి వెళ్దాం. వారి మార్క్ ఏ ఒక్కటి ఉన్నా చెప్పండి. ఈరోజున రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా వైఎస్ జగన్ మార్క్ కనపడుతుంది. ఇదిగో.. సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్, నాడు-నేడు ద్వారా రూపురేఖలు మారిన స్కూల్స్, 108, 104.. ఇలా సీఎం జగన్ ముద్ర ప్రతి గ్రామంలో స్పష్టంగా కనపడుతుంది. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించటమే కాదు.. చూపిస్తున్నారు. కుప్పంలో ఏ గ్రామానికి అయినా వెళ్దాం. అంతెందుకు నారావారిపల్లెకు వెళ్లినా జగనన్న మార్క్ కనపడుతుంది. మరి, రాష్ట్రంలో చంద్రబాబు మార్క్ ఎక్కడ ఉందో చూపించండి. ఇంత కడుపు మంట మీకు ఎందుకు రా బాబూ. రాష్ట్రంలో శరవేగంగా ఇళ్ల నిర్మాణం జరుగుతూ.... జయహో జగనన్న అంటుంటే.. కడుపుమంట, కడుపు ఉబ్బరంతో ప్రతిపక్ష నాయకులు ఉడికి పోతున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, అగ్రవర్ణ నిరుపేదలపై ప్రతిపక్షాలు ఎందుకు విషం చిమ్ముతున్నాయి. చంద్రబాబు, పవన్, లోకేశ్ ఎక్కడికంటే అక్కడకి పోదాం. ప్రజలను అడుగుదాం. ఎవరు మేలు చేశారో ప్రజలే చెబుతారు. ఇప్పుడు చంద్రబాబు కుప్పంలో ఎయిర్‌పోర్టు కడతారంట. కుప్పంలో ఎయిర్‌పోర్టా? 14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశావు చంద్రబాబు. కుప్పంలో పంటలు పండిస్తే.. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముతారంట. కనీసం కుప్పం ప్రజలకు గుక్కెడు మంచినీళ్లు చంద్రబాబు ఇవ్వలేదు. ఆర్డీఓ ఆఫీసు తెచ్చుకోలేదు. రెవిన్యూ డివిజనల్ ఆఫీసు జగన్ గారు కుప్పం ప్రజలకు ఇచ్చారు. పేద ప్రజలు ఇళ్లు కట్టుకుని సంతోషంగా ఉన్నా విషం కక్కుతున్నారు. పవన్ కల్యాణ్ లేఖపై చర్చకు సిద్ధం. పవన్ కల్యాణ్ సిద్ధమా? పవన్ కల్యాణ్ లేఖలో ప్రతి అంశం మీద చర్చించటానికి సిద్ధంగా ఉన్నాను. చర్చకు పవన్ కల్యాణ్ రావాలి. ఎక్కడైనా ఒక్క రూపాయి తేడా ఉందో చూపించండి. ఎన్నికలు వస్తున్నాయని రాష్ట్రానికి రావటం హోటల్లో పడుకోవటం. ఒక గంట కార్యకర్తలతో మాట్లాడి.. 23 గంటలు పడుకోవటం పవన్ కల్యాణ్ చేస్తున్నారు. కాకినాడ చుట్టుప్రక్కల అభివృద్ధి ఎలా జరుగుతుందో వెళ్లి చూడు పవన్ కల్యాణ్. నేడు 17వేలకు పై చిలుకు జగనన్న కాలనీలు కడుతున్నాం. కట్టేవి ఇళ్లు కాదు. ఊళ్లకు ఊళ్లే వేగంగా శరవేగంగా నిర్మాణం జరుగుతున్నాయి. పేదల హృదయాల్లో చిరస్థాయిల్లో నిలబడాలని కోరుకుంటున్నాడు కాబట్టే.. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ.2.50 లక్షల కోట్లు డీబీటీ ద్వారా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించారు. ప్రతి ఇంటిలో ఆనందం.. ప్రతి గ్రామంలో అభివృద్ధిని సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఇంతకన్నా ఏమి కావాలి? కళ్లు కుట్టి.. కడుపు మంటతో పచ్చ రోగుల్లా.. ప్రధానికి లేఖలు రాస్తున్నారు. పేదల ఇళ్లపై కాదు.. చంద్రబాబు అవినీతిపై ప్రధానికి లేఖ రాయి పవన్ పవన్ కల్యాణ్ లేఖ రాయాల్సింది గృహ నిర్మాణాల మీద కాదు.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం మీదనో.. చంద్రబాబు మీద జరిగిన ఐటీ రైడ్స్ మీదనో లేఖలు రాయాలి. త్వరలో మేం కూడా చంద్రబాబు అవినీతి మీదన లేఖ రాయబోతున్నాం. చంద్రబాబు దోచేసిన స్కిల్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు ఎంత ముట్టింది? పవన్ కల్యాణ్‌కు ఏ విధంగా మనీలాండరింగ్ జరిగింది. ఎంత ప్యాకేజీ తీసుకున్నాడో లేఖ రాస్తాం. చంద్రబాబు హయాంలో ఐటీ, ఈడీ రైడ్స్ చేస్తే తప్పు. పవన్ దృష్టిలో చంద్రబాబు నోట్లో వేలు పెడితే కొరకలేని వాడు. చంద్రబాబు అవినీతిపై పవన్ లేఖలు రాయడు. ఎందుకు అంటే.. చంద్రబాబు దగ్గర పవన్ ప్యాకేజీ తీసుకున్నాడు కాబట్టి. గతంలో గ్యాస్‌కు నెలకు రూ.100 సబ్సిడీ అని రూ.7200 చంద్రబాబు ఎగ్గొట్టాడు. రేపో మాపో ఎన్నికలకు వెళ్తాం. చంద్రబాబు, పవన్ చేసే దుర్మార్గాలు ప్రజలకు తెలియవా? ఇద్దరు కలసి సూపర్ 6 అని మేనిఫెస్టో పెడతారంట. సీఎం కాకముందు ప్రజలు అది ఇస్తా.. ఇది ఇస్తా అని చెబుతారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు ఫ్రీగా బస్సు ఎందుకు ఇవ్వలేదు. గ్యాస్ బండ్లు ఎందుకు ఇవ్వలేదు. 2014లో గ్యాస్ సిలిండర్‌కు నెలకు రూ.100లు చొప్పన ఐదేళ్లకు రూ.7200 ఇస్తానని చెప్పి నయాపైసా అక్కచెల్లెమ్మల అకౌంట్లలో వేయలేదు. ఇవాళ గ్యాస్ సిలిండర్లు అంటే అక్కచెల్లెమ్మలు నమ్ముతారా? ఆ గ్యాస్ సిలిండర్లతోనే మిమ్మల్ని కొడతారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే విజయం ప్రతిపక్ష పార్టీలు పొత్తులు.. ఎంతమందితో పెట్టుకున్నా.. వైఎస్ఆర్సీపీని ఇంచు కూడా కదిపించలేరు. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ఆర్సీపీ విజయదుందిభి మోగించబోతోంది. జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీన్ని ఎవ్వరూ ఆపలేరు. ఇళ్ల స్థలాలుపై వివరాలు ఇవిగో పవన్.. ప్రభుత్వ ఎంత ఇచ్చామో, ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎంత భూమి కొనుగోలు చేశామో వివరాలు పంపిస్తున్నాము. ఎక్కడా కూడా నయాపైసా తేడా ఉండదు. పేపర్, పెన్ను ఉందని ఇంగ్లీషులో నాలుగు మాటలు రాసి ప్రధాని మోడీకి పంపించటం కాదు. ప్రధాని మోడీని ఏమి అడగాలి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వే జోన్ ఇవ్వమని అడగాలి. కేంద్రంలో బీజేపీతో రాష్ట్రంలో టీడీపీతో లింకులు. గృహ నిర్మాణానికి ఇస్తున్న డబ్బులు సరిపోవట్లేదు. ఇంకా పెంచమని మోడీని పవన్ కల్యాణ్ అడిగితే ప్రజలు హర్షిస్తారు. గృహాలు కట్టుకుని సంతోషంగా ఉన్న పేదింటి అక్కచెల్లెమ్మలపై కడుపు మంట ఎందుకు? గృహాలు, ఇళ్ల స్థలాల వివరాలను పవన్ కల్యాణ్‌కు పంపిస్తున్నాం. మీడియా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సామాజిక సాధికార యాత్ర చూసిన తరువాత చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. చంద్రబాబు పార్టీలో ఏ ఒక్క బీసీలు మిగల్లేదు. గత ఎన్నికల ముందు కూడా జయహో బీసీ అని రాజమండ్రిలో చంద్రబాబు సభ పెట్టాడు. అది అట్లర్ ప్లాఫ్ అయిపోయింది. ఈరోజు బీసీలు ఎవ్వరూ టీడీపీలో లేరు. చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా.. ఎన్ని పనికిమాలిన వాగ్ధానాలు చేసినా టీడీపీని బీసీలు ఎవ్వరూ నమ్మరు. ఒకప్పుడు బీసీలు టీడీపీని నిలబెడితే వారిని చంద్రబాబు తన్ని తరిమేశారు. నేడు బీసీలు అంతా సీఎం జగన్ వెంట అడుగులో అడుగు వేస్తున్నారు. రాష్ట్రంలో టీడీపీ భూస్థాపితం కావటం ఖాయం. ఇదీ చదవండి: 2023 సుభిక్షం.. సంతోషం -
చంద్రబాబు పొత్తులు..ఏకిపారేసిన మంత్రి జోగి రమేష్
-
మేనిఫెస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా?: జోగి రమేష్ సవాల్
సాక్షి, తాడేపల్లి: తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైస్సార్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. 99.5% హామీలను అమలు చేసిన నేత సీఎం జగన్మోహన్రెడ్డి అని చెప్పిన జోగి రమేష్.. దీనిని తాము నిరూపిస్తామని తెలిపారు. మేనిఫస్టోలపై చర్చకు వచ్చే దమ్ముందా? అని ప్రశ్నించారు. టీడీపీ 2014 నాటి మేనిఫెస్టో, వైఎస్సార్సీపీ 2019 నాటి మేనిఫెస్టో మీద చర్చకు రాగలరా?అని ప్రశ్నించారు. మేనిఫెస్టో అంటే తమకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని తెలిపారు. మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టే ధైర్యంగా ప్రతి ఇంటికీ వెళ్ళి మళ్ళీ ఓట్లు అడగగలుగుతున్నామన్నారు. చరిత్రలో ఎవరైనా ఎన్నికల తర్వాత ఇలా ఇంటికి వెళ్ళి అమలు చేసిన కార్యక్రమాల గురించి చెప్పారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. చంద్రబాబులాగా మేనిఫెస్టోని నెట్ నుంచి తొలగించలేదని దుయ్యబట్టారు. మేనిఫెస్టోని చించి శనక్కాయల పొట్లాలుగా మార్చలేదని మండిపడ్డారు. 2014లో మేనిఫెస్టోని అమలు చేయలేదు కాబట్టే చంద్రబాబును జనం చిత్తుచిత్తుగా ఓడించారని గుర్తు చేశారు. ‘అసలు చంద్రబాబుకు ఏపీతో ఏం పని?. ఈ రాష్ట్రంలో ఆధార్ కార్డు ఉందా?. ఇల్లు, డోర్ నెంబర్ ఉందా?. ఇలాంటి అడ్రస్ లేని వ్యక్తులు మా గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి. రైతులు, డ్రాక్రా మహిళలకు రుణమాఫీ పేరుతో దారుణంగా మోసం చేశారు. నిరుద్యోగ భృతి పేరుతో యువతను మోసం చేశారు. అలాంటి మోసకారి, దుర్మార్గుడు అయినందునే చంద్రబాబుకు ఈ గతి పట్టింది. 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న జగన్ లాంటి సీఎం దేశంలో ఎక్కడైనా ఉన్నారా?. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా?. ‘చంద్రబాబు దిక్కుమాలిన మేనిఫెస్టోని అసలు ఎవరైనా నమ్ముతారా?. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మోకాళ్ల మీద నడిచినా ఆ పాపం పోదు. మళ్ళీ ఈరోజు మహిళలకు ఉచిత ప్రయాణమని అంటున్నారు. మేము ఎలాంటి ప్రకటనా చేయకపోయినా మాపై ఆరోపణలు చేస్తున్నారు. రామోజీ, రాధాకృష్ణ, చంద్రబాబు, పవన్, లోకేష్ ఉండేది, తినేది హైదరాబాదులో. అక్కడ కూర్చుని ఏపీలో రాజకీయాలు చేయటం ఏంటి?. ఈ ఎన్నికల తర్వాత వారు ఈవైపు ఇక కన్నెత్తి కూడా చూడరు’ అని జోగి రమేష్ విమర్శించారు. చదవండి: అర్హులకే నంది అవార్డులు.. ఎవరికీ అన్యాయం జరగదు: పోసాని -
ఇద్దరు పీకేలు...పీకేది ఏమీ లేదు..
-
ఓట్ల నమోదులో టీడీపీ ఓవరాక్షన్.. ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
సాక్షి, విజయవాడ: ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర సంఘం ప్రతినిధులను వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. ఈసీ ప్రతినిధులను జోగి రమేష్, పేర్ని నాని, కొఠారు అబ్బయ్య చౌదరి కలిశారు. ఈ సందర్బంగా ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఈసీ బృందానికి ఫిర్యాదు చేశారు. అనంతరం, మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏపీలో ఓట్ల నమోదులో టీడీపీ చేస్తున్న అవకతవకలపై ఫిర్యాదు చేశాం. తెలంగాణలో ఓట్లు ఉన్న వాళ్ళకి ఇక్కడ తొలగించాలని కోరాం. అక్కడ ఓటు హక్కు వినియోగించి మళ్ళీ ఇక్కడ ఓటు నమోదుకు టీడీపీ ప్రయత్నం చేస్తోంది. డబుల్ ఎంట్రీ క్రిమినల్ చర్య. దీని కోసం హైదరాబాద్‌లో టీడీపీ క్యాంపెయిన్ చేస్తోంది. దానిపై ఫిర్యాదు చేశాం. రాష్ట్ర యంత్రాంగం మొత్తం ప్రభుత్వ కార్యకలాపాలు మానేసి ఎన్నికల ఫిర్యాదుల్లోనే ఉండాలని టీడీపీ తప్పుడు ఫిర్యాదులు చేస్తోంది. కోనేరు సురేష్ అనే వ్యక్తి ఈ తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారు.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరాం. కోనేరు సురేష్ తప్పుడు ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆశ్చార్యపోయారు. మై పార్టీ డ్యాష్ బోర్డ్ అనే యాప్‌లో ఓటర్ లిస్టులో ఫోటోలు, అడ్రస్, కులం అన్ని వివరాలు ఉన్నాయి. దానిపై చర్యలు తీసుకోవాలని కోరాం. టీడీపీ సేకరిస్తున్న వ్యక్తిగత సమాచారం వ్యవహారంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ-జనసేన కలిసి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని ఫిర్యాదు చేశాం. మేనిఫెస్టో రూపంలో కాకుండా వ్యక్తిగతంగా ఇంటింటికెళ్లి ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు ఇచ్చాం. టీడీపీ మేనిఫెస్టో ప్రచారంతో చంద్రబాబు సంతకంతో లెటర్లు ఇస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం. 2019లో ఓటర్ జాబితాలో ఉన్న ఓట్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. ఫేక్ ఓట్లను నిరూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దొంగే దొంగ అన్నట్లు టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు’ అని సైటెర్లు వేశారు. -
రైతులకు అండగా కొడాలి నాని మరియు పేర్ని నాని
-
ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్సీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం. -మంత్రి జోగి రమేష్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇదీ చదవండి: బాబు కోసం ఇంత బరితెగింపా!? -
ఒకరికి ఒక చోటే ఓటుండాలి
సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యంలో ఒకరికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. ఇది వైఎస్సార్సీపీ సిద్ధాంతమని మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్ స్పష్టం చేశారు. ఓటర్ల ముసాయిదా జాబితాలో కొందరికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్లు తాము గుర్తించామన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణతో పాటు విదేశాల్లో ఉన్న వారికి సైతం ఇక్కడ ఓట్లు ఉన్నాయన్నారు. వాస్తవానికి ఆధార్ కార్డు ఎక్కడ ఉంటే.. అక్కడే ఓటు హక్కు ఉండటం న్యాయమని స్పష్టం చేశారు. బుధవారం వైఎస్సార్సీపీ నాయకుల బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఓటర్ల జాబితాలో చోటుచేసుకున్న అవకతవకలు, డూప్లికేట్ ఓట్లు, డీ రిజిస్ట్రేషన్ (తెలంగాణ), ఓటర్ల రీఎన్రోల్మెంట్ (ఆంధ్రప్రదేశ్) అంశాలపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మంత్రులు మేరుగు నాగార్జున, జోగి రమేష్, శాసనమండలిలో ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కూడిన వైఎస్సార్సీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖేష్‌కుమార్ మీనాను కలిసి వినతిపత్రం సమర్పించారు. తొలగించారని ఒకరోజు.. చేర్పించారని మరో రోజు: మంత్రి రమేష్ ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ.. ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు ఉండాలని.. కానీ.. ఒకే వ్యక్తికి రెండు, మూడుచోట్ల ఓట్లు ఉన్నట్టు తమ పార్టీ గుర్తించిందన్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రెండుచోట్ల కొందరికి ఓట్లు ఉన్నట్టు తమ పరిశీలనలో తేలిందన్నారు. ఇలాంటివి కొన్ని తాము గుర్తించామని.. వాటి గురించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి వివరించామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయలేని టీడీపీ నేతలు కొందరు తమ పార్టీపై రోజూ ఎల్లో మీడియాలో వార్తలు రాయిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల సిబ్బంది లక్షల ఓట్లు తొలగించారని ఒక రోజు.. లక్షల ఓట్లు చేర్పించారని ఇంకో రోజు రాస్తున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోతామని తెలిసే టీడీపీ అనుకూల పచ్చమీడియా అలాంటి రాతలు రాస్తోందన్నారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత 70 రోజులు పత్తా లేకుండా పారిపోయిన లోకేశ్, మంత్రులకు భయం చూపెడతానంటున్నాడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమన్నారు. పీపుల్స్ యాక్ట్ ప్రకారం చర్యలు కోరాం: మంత్రి మేరుగు నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ.. గత నెలలో ఎన్నికల సంఘానికి వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రెండుచోట్ల 16 లక్షలకు పైగా ఓటర్లుగా నమోదయ్యారన్నారు. అలాంటి వాటిని తొలగించాలని కోరామన్నారు. 1950 పీపుల్స్ యాక్ట్ సెక్షన్–17 ప్రకారం ఏ నియోజకవర్గంలో అయినా ఒక వ్యక్తికి ఒకచోట మాత్రమే ఓటు హక్కు ఉండాలన్నారు. దాని ప్రకారం చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరామన్నారు. తెలంగాణలో ఈ నెల 30న ఎన్నికలు జరుగుతున్నాయని, అక్కడ ఓటు హక్కు వినియోగించుకుని, అక్కడ ఓట్లు క్యాన్సిల్ చేయించుకుని ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునేలా కొందరు చూస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు ఓటు వేసి.. ఆ తర్వాత మన రాష్ర్టంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోవాలని కోరినట్టు వివరించారు. ఈ మేరకు అధికారులకు క్లియర్‌గా ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. రాజ్యాంగాన్ని రక్షించుకుందాం’ అనేది తమ నినాదమన్నారు. యుద్ధానికి రాకుండానే.. అస్త్ర సన్యాసం చేసే సన్నాసులు ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు, పవన్ కల్యాణే అని మేరుగ ఎద్దేవా చేశారు. -
ప్రజాస్వామ్యంలో ఒకచోటనే ఓటు ఉండాలి: మంత్రి జోగి రమేష్
-
లోకేష్ యువగళం పాదయాత్రపై జోగి రమేష్ అదిరిపోయే సెటైర్లు
-
లోకేష్ ని ఏకిపారేసిన మంత్రి జోగి రమేష్
-
జోగి రమేష్ కుమార్తె పెళ్లి.. దంపతులకు సీఎం జగన్ ఆశీర్వాదం
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. మంత్రి జోగి రమేష్ కుమార్తె వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధువరులను సీఎం జగన్ ఆశీర్వదించారు. వివరాల ప్రకారం.. గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కుమార్తె వివాహా వేడుకకు సీఎం వైఎస్ జగన్ హాజరయ్యారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వివాహ వేడుకకు సీఎం జగన్ వెళ్లారు. ఈ సందర్బంగా వేడుకలో వధువు రేష్మా ప్రియాంక, వరుడు అమోఘ్ సతీష్ గుత్తేదార్లను ముఖ్యమంత్రి జగన్ ఆశీర్వదించారు. -
తణుకులో కదం తొక్కిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, భీమవరం/తణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శనివారం జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కదం తొక్కారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో తాము సాధించిన సాధికారతను ఎలు గెత్తి చాటారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు నేతృత్వంలో వేల్పూరు రోడ్డులో యాత్ర ప్రారంభమై నరేంద్ర సెంటర్ వరకు సాగింది. బస్సు యాత్రకు నియోజకవర్గం, పరిసర ప్రాంతాల ప్రజలు ఘనస్వాగతం పలికారు. దారిపొడవునా రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరి బాణసంచా, పూలవర్షంతో బ్రహ్మరథం పట్టారు. తణుకు సెంటర్లో వేలాది జనం సమక్షంలో జరిగిన సభలో మంత్రులు, నేతలు ప్రసంగించారు. రామోజీకి ఎందుకింత కడుపుమంట? : మంత్రి జోగి రమేష్ బడుగు, బలహీన వర్గాలు సాధించిన సామాజిక సా«దికారతను ఓ వేడుకలా నిర్వహిస్తూ చేపట్టిన సాధికార బస్సు యాత్రలపై రామోజీరావుకు ఎందుకింత కడుపు మంట అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక సాధికార సభలో ఆయన మాట్లాడుతూ.. సభ మొదలవ్వడానికి కొన్ని గంటల ముందు ఖాళీ కుర్చీల ఫొటోలు తీసి, సభ అయిపోయి జనాలు వెళ్లాక ఖాళీ కుర్చీ ఫొటోలు తీసి జనాలు రాలేదంటూ రామోజీరావు, రాధాకృష్ణ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై అక్కసుతో విషపు రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు. వెనుక బడిన వర్గాల వారిని చట్ట సభలకు పంపించి వారిని ధైర్యంగా నిలబడేలా చేసింది సీఎంజగన్ మాత్రమేనన్నారు. పేదవాడికి చదువు, వైద్యం అందించిన ఘనత జగన్‌కు దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. సీఎం జగన్ అందించిన సంక్షేమంలో 80 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే దకిందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. రూపాయి అవినీతికి తావు లేకుండా లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లోకి వేశారన్నారు. గత ప్రభుత్వాలు అన్నీ కలిపి 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే, ఒక్క జగన్ హయాంలోనే 2.70 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని, వీటిలో 76 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు వచ్చాయని తెలిపారు. హోంమంత్రి తానేటి వనిత మాట్లాడుతూ రాష్ట్రంలో సామాజిక న్యాయం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ద్వారానే సాధ్యమైందన్నారు. ఈ సమవేశంలో మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎంపీలు మార్గాని భరత్, నందిగం సురేష్, ఎమ్మెల్సీ పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్‌పై దేశవ్యాప్తంగా నమ్మకం: అలీ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్ చేసిన మేలుకు సూచనగా ఇప్పు డు చేస్తున్నవి యాత్రలు మాత్రమేనని, 2024లో జాతర జరగబోతోందని, ఇందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ప్రముఖ సినీ నటుడు, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా) అలీ చెప్పారు. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో మోత మోగించిన సీఎం జగన్.. ఈ సారి 175కి 175 నియోజకవర్గా లనూ కైవసం చేసుకుంటారని తెలిపారు. సీఎం జగన్‌పై అందరికీ అపార నమ్మకం ఉందన్నారు. ఆ నమ్మకంతోనే వైజాగ్ సమ్మిట్‌కు అదాని, అంబానీలతో సహా దిగ్గజ పారిశ్రామికవేత్తలు వచ్చి ఏపీలో పరిశ్రమలు ఏర్పా టు చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల ప్రతి కుటుంబంలో ఒక్క ఉద్యోగం వచ్చినా ఆర్థికంగా ఆ కుటుంబం నిలదొక్కుకుంటుందని, ఇదంతా సీఎం సుపరిపాలనతోనే సాధ్యమైందన్నారు. -
గృహ నిర్మాణశాఖపై సమీక్ష.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: గృహ నిర్మాణ శాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే 7.43 లక్షల ఇళ్లను అక్కచెల్లెమ్మలకు అందించామన్న అధికారులు.. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా ముందుకు సాగుతున్నామని అధికారులు తెలిపారు. కాలనీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు. సీఎం జగన్ మాట్లాడుతూ, మౌలిక సదుపాయాల కల్పనలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. కరెంటు, తాగు నీరు ఉన్నాయా? లేవా? అన్న వాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇప్పటివరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలన్న సీఎం.. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పనిచేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలని, ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్న దానిపై వారికి అవగాహన ఇవ్వాలి’’ అని సీఎం సూచించారు. ఈ సమీక్షా సమావేశానికి గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ జవహర్‌రెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, గృహనిర్మాణశాఖ స్పెషల్ సెక్రటరీ దీవాన్ మైదీన్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ వీ జీ వెంకటరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: చంద్రబాబు మెడికల్ రిపోర్ట్ ఇచ్చింది వైద్యులా? రాజకీయ నేతలా?: సజ్జల -
పొన్నూరు గడ్డపై మంత్రి జోగి రమేష్ మైండ్ బ్లోయింగ్ స్పీచ్
-
సామాజిక న్యాయంలో చరిత్ర సృష్టించిన జగన్
పామర్రు: సామాజిక న్యాయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశంలోనే చరిత్ర సృష్టించారని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అక్కున చేర్చుకొని, అనేక కార్యక్రమాలతో ఈ వర్గాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చి సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రీ ఈ ఘనత సాధించలేదన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా గురువారం కృష్ణాజిల్లా పామర్రులో ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేబినెట్ సహా అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్ద పీట వేశారని, మహిళలకు 50 శాతం పదవులిచ్చారని అన్నారు. ఇది ఓ చరిత్రగా నిలిచిపోతుందని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలు ఊపిరిగా ఉన్న సీఎం వైఎస్ జగన్‌ని ప్రజా క్షేత్రంలో ఎవరూ ఓడించలేరని, పవన్ కళ్యాణ్ షణ్ముఖ వ్యూహం, చంద్రబాబు, లోకేశ్, రామోజీ, రాధాకృష్ణతో కలిసి ఎన్ని వ్యూహాలు పన్నినా జగన్ ముందు పనిచేయవన్నారు. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకొన్నారని, సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపించి చరిత్ర సృష్టించారని చెప్పారు. రాజ్యసభ సీటిస్తానని ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. అదే సీటును వంద కోట్లకు కనకమేడల రవీంద్రకుమార్‌కు అమ్ముకున్నారని తెలిపారు. ఇలా అడుగడుగునా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అవమానించిన చంద్రబాబును మరోసారి చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలంటూ అక్కున చేర్చుకున్న సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలను కోరారు. ఉన్నత స్థితికి బడుగు వర్గాలు: మంత్రి నాగార్జున మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే, జగజ్జీవన్‌రామ్, సాహూ మహరాజ్, అబ్దుల్ కలామ్ వంటి మహానుభావుల ఆలోచనా విధానాలకు అనుగుణంగా సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను ఉన్నత స్థితికి చేరుస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమం కోసం లక్షల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా, రూపాయి లంచం లేకుండా పేదవారి చెంతకు సంక్షేమ పథకాలను చేరుస్తున్నారని అన్నారు. 31 లక్షల మంది పేద అక్కచెల్లెమ్మలకు ఇళ్ళ పట్టాలిచ్చి వారి కుటుంబాలకు గూడు కల్పించిన సీఎంగా దేశంలోనే రికార్డు సృష్టించారన్నారు. అంతర్జాతీయ స్థాయి విద్యను, అత్యాధునిక కార్పొరేట్ వైద్యాన్ని పేదవారికి అందిస్తున్న ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. పైగా, రుణాలు మాఫీ చేస్తానని రైతులు, మహిళలను మోసం చేశారని, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎందుకూ పనికిరారని అవహేళన చేశారని తెలిపారు. మన విలువలు కాపాడుకోవడానికి 2024లో తిరిగి జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. బాబును ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఎప్పటికీ క్షమించరు : ఎంపీ సురేష్ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సోమరిపోతులవుతారన్న చంద్రబాబును ఈ వర్గాలు ఎప్పటికీ క్షమించబోవని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ఆరు లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన చంద్రబాబు సోమరిపోతు కాదా అని ప్రశ్నించారు. రెండెకరాల నుంచి లక్షల కోట్లు ఎలా సంపాదించారో చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు చెబితే వారు కూడా కోటీశ్వరులు అవుతారని అన్నారు. రూ.370 కోట్లు అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళితే టీడీపీ ఆందోళనలు చేయడం సిగ్గుచేటన్నారు. నిజం గెలవాలి అని చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చెబుతున్నారని, నిజం గెలిస్తే చంద్రబాబు జీవితాంతం జైలులోనే ఉంటారని అన్నారు. బడుగులను అందలమెక్కిస్తున్న సీఎం జగన్: ఎంపీ మోపిదేవి అనేక పథకాలతో రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలను సీఎం జగన్ అందలమెక్కిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎదిగేలా కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ మాట్లాడుతూ గతంలో పెన్షన్ కావాలంటే నాయకులకు దండాలు పెడితేనో, టీడీపీ కండువాలు కప్పుకుంటేనే మంజూరయ్యేదన్నారు. సెంటర్లో కనబడి దండం పెట్టకపోతే పెన్షన్ రద్దయ్యేదని చెప్పారు. సీఎం జగన్ పాలనలో కులం, మతం, రాజకీయాలతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ సంక్షేమ పధకాలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, సింహాద్రి రమేష్ బాబు, పేర్ని నాని, ముస్తాఫా, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక పాల్గొన్నారు. -
‘సీఎం జగన్ పాలనే కావాలని ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’
సాక్షి, కృష్ణా జిల్లా: చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు కాదని.. ఒక జాతికి మాత్రమే అధ్యక్షుడు అంటూ మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు అయితే.. తెలంగాణలో పార్టీని ఎందుకు మూసేశారు?. అందుకే చంద్రబాబు వాళ్ల జాతికి మాత్రమే అధ్యక్షుడు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎవరూ బయటకు రాలేదు.. వాళ్ల జాతి తప్ప మరెవరూ బయటికి రాలేదు’’ అని దుయ్యబట్టారు. ‘‘జగనన్న ఈ రాష్ట్రానికి ఎందుకు ముఖ్యమంత్రిగా కొనసాగాలనే కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించుకుంటున్నాం. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి ఉండటం చారిత్రాత్మకమైన విషయం. ముక్త కంఠంతో ఈ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారు’’ అని మంత్రి చెప్పారు. సీఎం జగన్ పాలన మాకు కావాలి. మా పిల్లల భవిష్యత్తుకు కావాలి. మా కుటుంబ ఆర్థిక స్థితిగతులు ఎదగడానికి కావాలి. మా ఆరోగ్య పరిరక్షణకు ఔషధంలా పనిచేస్తున్న జగనన్న మాకు కావాలి. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది గడపలకు బటన్ నొక్కి డబ్బులు పంపించారు. ఆ డబ్బుతో మా కుటుంబాలు సంతోషంగా ఆర్థికంగా బాగున్నాయని ప్రతి అక్క, చెల్లి అంటున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది సీఎం జగన్ నాలుగున్నరేళ్లలో చేసి చూపించారు’’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. చదవండి: జగనే ఎందుకంటే.. -
‘ప్రజలు ఛీ కొట్టినా నారా లోకేష్‌కు బుద్ది రాలేదు’
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే అర్హత టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌కు ఉందా? అని ఏపీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. దొంగచాటుగా మంత్రి అయిన లోకేష్.. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని, ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా లోకేష్‌కు బద్ది రాలేదని జోగి రమేష్ దుయ్యబట్టారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జోగి రమేష్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్‌కు ఈడీ, ఐటీ ఎవరి పరిధిలో ఉన్నాయో తెలియదా? అని జోగి రమేష్ నిలదీశారు. కక్షసాధింపు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నరని, చంద్రబాబు పాపం పండింది కాబట్టే దొరికిపోయారని అన్నారు. ‘సీఎం జగన్ హీరో.. లోకేష్ జీరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని సీఎం జగన్ హీరో అయ్యారు. చంద్రబాబు తప్పు చేయలేదని లోకేష్ ఎందుకు చెప్పలేకపోతున్నారు? 3,300 కోట్ల దోచుకునేందుకు చంద్రబాబు ప్లాన్ చేశారు ఆధారాలతో సహా స్కిల్ స్కామ్ కేసులో బాబు దొరికిపోయారు కనుకే జైలుకు వెళ్లాడు. స్కాం బయట పడ్డాక రిమాండ్‌కు వెళ్లారు. రాజ్ భవన్ బయట లోకేష్ గుక్కపట్టి ఏడుస్తున్నాడు. చంద్రబాబుని అరెస్టు చేశారనీ, జైలుకు పంపారని ఏడుపు మొదలెట్టాడు. అధికార మదంతో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు. మా ఎంపీలు, ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? గవర్నర్‌కు ప్రజాస్వామ్యం, చట్టం గురించి తెలియదని లోకేష్ అనుకుంటున్నారు. సిద్దార్దలూత్ర లాంటి గంటకు కోటన్నర తీసుకునే లాయర్లతో వాదించినా ఎందుకు బెయిల్ రాలేదు?. కన్ను బాగలేదు, కాలు బాగులేదని చెప్పుకుని బయటకు వచ్చారు. చంద్రబాబుకు మెడికల్ గ్రౌండ్స్లేనే తప్ప సాధారణ బెయిల్ ఎందుకు రాలేదో తెలుసుకో లోకేష్. మమ్మల్ని తొక్కితాడంట. ఆల్రెడీ మేము తొక్కేసి, తాట తీశాం అన్న సంగతి తెలుసుకో. ఇదే స్కిల్ స్కాంలో ఈడీ అధికారులు నలుగురిని అరెస్టు చేశారని ఎందుకు చెప్పలేదు?. సీఐడీ మా పరిధిలో ఉందన్నావు సరే మరి ఈడీ, ఐటీ శాఖ ఎవరి పరిధిలో ఉంది? చంద్రబాబుకు ఐటీ నోటీసులు ఇవ్వలేదా? టీడీపీకి కాదు, తన జాతికి చంద్రబాబు జాతీయ అధ్యక్షుడు. అధికారం ఉంటే మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాదా?. ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని వ్యూహాలు వేసినా టీడీపీ అడ్రస్ గల్లంతే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలన్నీ ఒక తాటి మీదకు వచ్చి జగనే మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నారు. ఇది గుర్తు పెట్టుకుని లోకేష్ పిచ్చిప్రేలాపనలు మానుకోవాలి’ అని జోగి రమేష్ పేర్కొన్నారు. -
చంద్రబాబుకి 25 రోజులే టైం ఉంది: జోగి రమేష్
-
ఏపీలో జైత్రయాత్రలా సాగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార యాత్ర
-
దేశంలో సామాజిక సాధికారత సాధించిన తొలి సీఎం జగన్
అవనిగడ్డ: స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా మన రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం చేసి సామాజిక సాధికారత సాధించిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. గురువారం కృష్ణా జిల్లా అవనిగడ్డలో జరిగిన సామాజిక సాధికార సభలో మంత్రి మాట్లాడారు. అన్ని పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళలకు సీఎం జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతూ పేదలకు ఉన్నతస్థాయి విద్య, వైద్యాన్ని చేరువ చేశారని చెప్పారు. ప్రతి పేద పిల్లవాడికి ఫీజుల నుంచి చదువుకోవడానికి అవసరమైన అన్ని వనరులు సీఎం జగన్ సమకూరుస్తున్నారని అన్నారు. గతంలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, వందల కోట్లు తీసుకొని ఆయన సామాజిక వర్గానికి చెందిన వారికే పదవులు అమ్ముకున్నారని విమర్శించారు. సీఎం జగన్ నలుగురు బీసీలను రాజ్యసభకు పంపి చరిత్ర సృష్టించారని చెప్పారు. గతంలో చంద్రబాబు బీసీల తోక కట్ చేస్తానని అన్నారని, ఎస్సీల్లో పుడతారని ఎవరు కోరుకుంటారని హీనంగా మాట్లాడారన్నారు. 2019 ఎన్నికల్లో ఆ బీసీలు, ఎస్సీలే చంద్రబాబు తోక కట్‌చేశారని చెప్పారు. కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి మోహనరంగాను పొట్టన పెట్టుకున్న చంద్రబాబుకే పవన్‌కళ్యాణ్ వత్తాసు పలకడం సిగ్గుచేటన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ గతంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా యాదవులకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారన్నారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారని చెప్పారు. రాష్ట్ర మంత్రివర్గంలో ఎక్కువ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చారన్నారు. పౌష్టికాహారం సూచీలో 24వ స్థానం నుంచి 8వ స్థానానికి తెచ్చారని, పేదరికాన్ని 15 నుంచి 6 శాతానికి తగ్గించిన ఘనత కూడా సీఎం జగన్‌దే అని అన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ గతంలో ఎందరో మేధావులు సామాజిక న్యాయం కోసం ఎన్నో ఉద్యమాలు చేసినా సాధ్యం కాలేదని, ముఖ్యమంత్రి వైస్ జగన్ దానిని సాధ్యం చేసి చూపించారని చెప్పారు. రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం, లక్షలాది అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ స్ధలాలు, నాడు – నేడు ద్వారా విద్య, వైద్య రంగాలను ఆధునికంగా తీర్చిదిద్దారని తెలిపారు. చంద్రబాబు రాజకీయాలను కలుషితం చేశారని, సీఎం జగన్ సమూలంగా ప్రక్షాళన చేసి, పేదల సంక్షేమానికి పాటుపడుతున్నారని చెప్పారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి విద్య, అత్యాధునిక వైద్యం, అవినీతి రహిత సంక్షేమం ద్వారా పేదల ఇళ్లల్లో వెలుగులు నింపిన సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. మాజీ సీఎం చంద్రబాబు పేదల ఇళ్లలో దీపాలు ఆర్పే వ్యక్తి అని అన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఎన్నో అవమానాలకు గురిచేసి, జైలుకి పంపించారని, అదే వర్గాలను సీఎం జగన్ అక్కున చేర్చుకొని, పార్లమెంట్‌కు పంపించారని చెప్పారు. పేదలకు ఇంగ్లిష్ మీడియం విద్య రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని చెప్పారు. అమరావతిలో పేదలకు ఇళ్ళ స్ధలాలు రాకుండా కోర్టుల ద్వారా అడ్డుపడిన ఘనుడు కూడా చంద్రబాబే అన్నారు. సీఎం జగన్‌కు మరోసారి అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలబెడతారన్నారు. గతంలో చాలా మంది నాయకులు పేదరికాన్ని తగ్గిస్తామని మాటలే చెప్పారని, సీఎం జగన్ దానిని ఆచరణలో చేసి చూపించారని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ప్రశంసించారు. సీఎం జగన్ రూ.2.40 లక్షల కోట్లు నేరుగా పేదల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పేద కుటుంబాలను బలోపేతం చేశారని చెప్పారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ సామాజిక సాధికారత సాధించిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. కృష్ణా జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఓసీకి రిజర్వ్ అయినప్పటికీ, బీసీ అయిన తనకు ఆ సీటు ఇచ్చి సీఎం వైఎస్ జగన్ సామాజిక సాధికారతకు అసలైన అర్ధం చెప్పారని కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక చెప్పారు. 22ఎ నిషేధిత భూముల సమస్యను పరిష్కరించడంతో పాటు అడిగిన వెంటనే కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పేర్ని వెంకట్రామయ్య (నాని), కైలే అనిల్‌కుమార్, ఎమ్మెల్సీలు పోతుల సునీత, జంగా కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
పేదల జీవితాల్లో వెలుగులు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్రంలోని పేదల జీవితాల్లో ఇప్పుడే వెలుగులు చూస్తున్నామని, ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి ఫలితమేనని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా శనివారం సాయంత్రం బాపట్ల అంబేడ్కర్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలు, అగ్రవర్ణ పేదలకు చేసిన మేలును వివరించారు. ఈ సభలో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్ల పాలనలో సీఎం వైఎస్ జగన్ సామాజిక ధర్మాన్ని పాటిస్తున్నారని, అన్ని వర్గాలకు మేలు చేకూర్చారని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా బడుగు, బలహీనవర్గాలు సగర్వంగా సామాజిక సాధికార యాత్ర చేసే అవకాశం కల్పించారని తెలిపారు. కేబినేట్లో 15 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించారని, దేశంలో మరే ఇతర రాష్ట్రంలో ఇంత స్థాయిలో భాగాన్ని ఇచి్చన ముఖ్యమంత్రి లేరని అన్నారు. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు రూ.100 కోట్లకు అమ్ముకునే వారని, ఈ రోజున పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణారావును రాజ్యసభ సభ్యులను చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతోందని వివరించారు. మోషేన్ రాజును శాసన మండలి చైర్మన్‌ను చేశారన్నారు. నెట్లో చూసి ఇంగ్లిష్ నేర్చుకోవచ్చంటున్న పవన్ కళ్యాణ్.. అతని పిల్లలకూ అలానే నేర్పుతారా అంటూ నిలదీశారు. ఈ యాత్రను లోకేశ్ గాలియాత్ర అంటున్నారని, ఇది గాలియాత్ర కాదని, ప్రజా వ్యతిరేకులైన చంద్రబాబు అండ్ కోపై దండయాత్ర అని చెప్పారు. సాధికార యాత్రకు జనం లేరని రాధాకృష్ణ, రామోజీ, టీవీ 5 బీఆర్ నాయుడు ప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే వచ్చి ఈ యాత్రలకు ప్రభంజనంలా వస్తున్న ప్రజలను చూడాలని సవాల్ చేశారు. జగన్ కటవుట్ చూస్తేనే జనం ఇలా వస్తే.. జగనే స్వయంగా వస్తే బాపట్ల పట్టుద్దా అని అన్నారు. ప్రతి కుటుంబానికి లబ్ధి: ఎంపీ మోపిదేవి వైఎస్ జగన్ పాలనలో ప్రతి పేద కుటుంబం ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా లబ్ధి పొందిందని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేంతవరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం జరగలేదన్నారు. జగన్ పాలనలోనే అందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు లభించాయని చెప్పారు. జగనన్న పాలనలో మహిళా ఆర్థికాభివృద్ధి సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదరికం లేకుండా చేసేందుకు పలు కార్యక్రమాలు చేపట్టారని ఎమ్మెల్సీ పోతుల సునీత చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళా సాధికారిత జగనన్న పాలనలోనే సాధ్యమైందని చెప్పారు. భువనేశ్వరి ఏనాడూ మహిళల కోసం బయటకు రాలేదని, ఈ రోజు అవినీతి చేసి జైలుకు వెళ్లిన భర్త కోసం బయటకు వచ్చి డ్రామాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. జగన్ పాలన దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే కోన రఘుపతి రాష్ట్రంలో వైఎస్ జగన్ అందిస్తున్న పరిపాలన దేశానికే రోల్‌మోడల్‌గా ఉందని, దేశం మొత్తం మనవైపే చూస్తోందని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి చెపాపరు. మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు గురించి జగనన్న ఆలోచిస్తున్నారన్నారు. పేదల గురించి ఇంతగా ఆలోచించే వ్యక్తిని ఇంతవరకు చూడలేదన్నారు. మనకు జిల్లాను ఇచి్చనందుకు, మెడికల్ కళాశాల ఇచ్చినందుకు తిరిగి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సి ఉందన్నారు. జగనన్నతోనే పేదల అభ్యున్నతి బాపట్ల ఎంపీ నందిగం సురేష్ మాట్లాడుతూ పేద పిల్లల ఉచిత చదువుల కోసం, మహిళల ఆర్థికాభివృద్ధి కోసం, ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం కోసం, రైతు భరోసా కోసం మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనుడు జగనన్న అని చెప్పారు. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అవహేళన చేస్తే.. వైఎస్ జగనన్న ఎస్సీలు మేనమామలని అన్నారని గుర్తు చేశారు. అమరావతి భూములతో చంద్రబాబు అవినీతి చేస్తే, ఆ భూములను పేదలకు పంచిన వ్యక్తి జగనన్న అని కొనియాడారు. చంద్రబాబు రూ.370 కోట్లు కాజేస్తే అది చిన్న అమౌంటేనని పవన్ చెప్పడం సిగ్గుచేటుగా పేర్కొన్నారు. చంద్రబాబు ఎస్సీ, బీసీలను దొంగలని జైల్లో పెడితే జగనన్న ఢిల్లీలో కూర్చొపెట్టారని చెప్పారు. వైఎస్ జగన్‌కు భయం పరిచయం చేస్తానని లోకేశ్ అంటున్నాడని, సోనియా గాంధీకే ఆయన భయపడలేదని, పిల్లకుంక లోకేశ్ ఎంత అని ఎద్దేవా చేశారు. -
లోకేష్ వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన మంత్రి జోగి రమేష్