ప్రచారంలో దూసుకెళ్తున్న పార్టీ అభ్యర్థి జోగి రమేష్
ఆరోపణల ఉచ్చులో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్
టీడీపీకి కలిసిరాని జనసేన, బీజేపీ వర్గాలు
కంకిపాడు: సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ సమయం సమీపించే కొద్దీ పెనమలూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గెలుపుపై వైఎస్సార్ సీపీలో ధీమా వ్యక్తమవుతుండగా, టీడీపీ డీలా పడుతోంది. వైఎస్సార్ సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రామగ్రామాన ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాల లబ్ధి, అభివృద్ధి కార్యక్రమాలతో వైఎస్సార్ సీపీకి అడుగడుగునా అపూర్వ ఆదరణ లభిస్తోంది.
ప్రజలంతా పారీ్టకి వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. కూటమి విధానాలు నచ్చక టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు ఆ పారీ్టలను వీడి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకుల్లో ఆందోళన మొదలైంది. ప్రచారంలో బీజేపీ అంటీముట్టనట్టు ఉండటం, జనసేనలోని వర్గాలు కలిసిరాకపోవడంతో టీడీపీ నాయకుల వెన్నులో వణుకు మొదలైంది.
నాలుగోసారి నియోజకవర్గానికి ఎన్నికలు
పెనమలూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య కృష్ణా జిల్లాలోనే అత్యధికం. ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు తాజాగా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. నియోజకవర్గంలో మొత్తం 2,94,928 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1,42,349 మంది, మహిళలు 1,52,577 మంది, ఇతరులు ఇద్దరు ఉన్నారు. నియోజకవర్గ పునరి్వభజన ప్రక్రియతో 2009లో కంకిపాడు, ఉయ్యూరు, పెనమలూరు మండలాలతో పెనమలూరు నియోజకవర్గం ఏర్పాటైంది. ఆయా మండలాలతో పాటుగా ఉయ్యూరు నగర పంచాయతీ, తాడిగడప మునిసిపాలిటీ కూడా ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి.
నియోజక వర్గంలో ఇప్పటి వరకూ 2009, 2014, 2019లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు నాలుగో సారి ఎన్నికలు జరుగుతున్నాయి. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 177 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ 31,448 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. 2019లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథి 11,317 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. ఈ దఫా పెనమలూరు స్థానం కోసం వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ బరిలో నిలిచారు. టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్‌తో పాటు మరో తొమ్మిది మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
బోడె.. నీకో దండం
‘టీడీపీ అభ్యర్థి బోడె ప్రసాద్ వ్యవహారశైలిలో ఇప్పటికీ మార్పులేదు. కనీసం కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించడంలేదు’ అని ఆ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. ఇదెక్కడి గోల. ఆయనకో దండం. ఇష్టం లేకున్నా కొనసాగుతున్నాం అంటూ ఆ పార్టీ శ్రేణులే మధనపడుతున్న పరిస్థితి. కూటమి నేతృత్వంలో చేపడుతున్న ప్రచారానికి స్పందన అంతంత మాత్రంగా ఉంటోంది. అధికారం లేకున్నా ఐదేళ్లు ప్రజలతోనే ఉన్నానని అండగా నిలవాలని ప్రచారంలో గొప్పగా చెప్పుకొంటున్నారు.
2014 నుంచి 2019 వరకూ కేవలం కొద్ది మంది అనుయాయులను పక్కనపెట్టుకుని అందలం ఎక్కించారంటూ పలువురు పెదవి విరుస్తున్నారు. ఇసుక విక్రయాలు, మట్టి అక్రమ వ్యాపారం, సెక్స్‌రాకెట్, కాల్ మనీ, బిల్డర్ల నుంచి అక్రమ వసూళ్లు వంటి అనేక ఆరోపణలు బోడె ప్రసాద్ చుట్టూ ఉచ్చులా బిగుస్తున్నాయి. స్వపక్షంలోనూ విపక్షం ఉండటం, నాయకులు కలిసినా మనసులు కలవకపోవడంతో కూటమి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బీజేపీలోని ఓ వర్గం ఇప్పటికే దూరంగా ఉంటోంది.
జనసేన వర్గాలు పూర్తిగా కలిసి పనిచేయటం లేదు. సీనియర్ నాయకుడు చలసాని వెంకటేశ్వరరావు (పండు) వర్గానికి అన్యాయం జరగడంతో ఆయన కుమార్తె చలసాని స్మిత, గౌతమ్, ఆమె వర్గం టీడీపీకి షాక్ ఇచ్చింది. వారంతా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచారు. స్థానికుడు అన్న ఒక్క అనుకూలం తప్ప బోడె ప్రసాద్‌కు మిగిలినవన్నీ ప్రతికూల అంశాలే. తొలుత సీటు ఖరారు కాక అధిష్టానంపై ధిక్కార స్వరం వినిపించి స్వతంత్ర అభ్యరి్థగా పోటీ చేస్తాననడం, ఆఖరికి ఎన్‌ఆర్‌ఐల పుణ్యమాని సీటు తెచ్చుకోవడం ఇబ్బందిగా ఉందంటూ ఆ పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు. ఎలాగూ ఎదురుగాలి వీస్తుండటంతో ఇండెంట్ వేసి చందాలు రాబడుతూ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టే పనిలో నేతలు ఉన్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.
జోగికి ప్రజాదరణ
సిట్టింగ్ ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలోకి ఫిరాయించటంతో వైఎస్సార్ సీపీ అధిష్టానం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమే‹Ùకు పెనమలూరు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. అంతేకాకుండా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిపింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో ఇప్పటికే జోగి రమేష్ ప్రజలకు చేరువయ్యారు. ఆయన పారీ్టలోని అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ విస్తృతంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నారు. వైఎస్సార్ సీపీ విజయాన్ని కాంక్షిస్తూ జోగి కుటుంబం యావత్తూ ప్రచారాన్ని సాగిస్తూ ప్రజాదరణ చూరగొంటోంది.
సమస్యలు విన్న వెంటనే ‘నేనున్నా.. పరిష్కరించే బాధ్యత నాది’ అని జోగి భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ విధానాలు నచ్చి, టీడీపీ, జనసేన పక్షాల్లో ఇమడలేక అనేక మంది ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పటికే వైఎస్సార్ సీపీలో చేరి పార్టీ బలోపేతంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీతో పాటు ఇవ్వని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అర్హులందరికీ అందించింది. పాలనను గ్రామస్థాయికి తీసుకొచ్చింది. వలంటీరు వ్యవస్థ ద్వారా సంక్షేమాన్ని గడపకు చేర్చి అన్ని వర్గాల సంక్షేమానికి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పాల్పడుతోంది. ఇవన్నీ జోగికి అనుకూల అంశాలు.
Comments
Please login to add a commentAdd a comment