krishna district
-
‘అమ్మా’నవీయం!
గన్నవరం/కొమరోలు: కన్న తల్లులే బిడ్డలకు భారమవుతున్నారు. నవ మాసాలు మోసి కనీపెంచిన అమ్మలను అమానవీయంగా వదిలించుకుంటున్నారు. గన్నవరం సమీపంలో ఎముకలు కొరికే చలిలో శనివారం రాత్రి ఓ తల్లిని వదిలి వెళ్లగా, ప్రకాశం జిల్లా కొమరోలులో ఓ తల్లి వారం రోజులుగా నడిరోడ్డుపై నరకయాతన అనుభవిస్తున్నా.. కుమారుల మనసు కరగలేదు. ఎముకలుకొరిచే చలిలో 85 ఏళ్ల అవ్వ కృష్ణా జిల్లా గన్నవరం శివారు ఆల్ఫా హోటల్‌కు సమీపంలో శనివారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో కారులో 85 ఏళ్ల ఓ వృద్ధురాలిని కొంత మంది వ్యక్తులు తీసుకొచ్చారు. కిందికి దింపి అక్కడో ఓ కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయారు. చలికి గజగజ వణుకుతున్న ఆ వృద్ధురాలిని కొంతమంది గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన గన్నవరం పోలీసులు అక్కడికి చేరుకుని వృద్ధురాలి ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాట్లాడలేని స్థితిలో ఉండడంతో స్థానిక బీకేఆర్ వృద్ధాశ్రమానికి తరలించారు. ఆమె వద్ద లభ్యమైన ఆధార్ కార్డులోని వివరాల ప్రకారం ఆమె గన్నవరం మండలం కొండపావులూరుకు చెందిన నక్కా లక్ష్మీకాంతంగా గుర్తించారు. ఆ వివరాల ఆధారంగా పోలీసులు ఆ వృద్ధురాలి కుటుంబ సభ్యులను పిలిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. దుప్పటి కూడా లేక నడిరోడ్డుపైనే 75 ఏళ్ల అమ్మ ప్రకాశం జిల్లా కొమరోలు మండలం వెన్నంపల్లికి చెందిన కలిగవిన వెంకటలక్ష్మమ్మ(75) భర్త కొంత కాలం కిందట మృతిచెందాడు. అనంతరం ఆమె ముగ్గురు కుమారుల వద్ద ఉంటూ కాలం గడుపుతోంది. ఆస్తుల పంపకాల అనంతరం తల్లిని మాత్రం వారు పట్టించుకోవడం మానేశారు. ఏడాది కాలంగా ఓ గుడిసెలో వదిలేశారు. ప్రతినెలా వచ్చే వృద్ధాప్య పింఛన్‌ను కూడా వారే బలవంతంగా తీసుకెళుతున్నారు. వెంకట లక్ష్మమ్మ నివాసం ఉంటున్న గుడిసె కూడా శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో ఇటీవల కుమారులు తల్లిని ఇళ్లకు తీసుకెళ్లి.. మళ్లీ వారం కిందట వెన్నంపల్లెలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వారం రోజులుగా చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ నానా యాతనపడుతోంది.కట్టుబట్టలు తప్ప కనీసం దుప్పటి కూడా లేకపోవడంతో ఆ అమ్మ కష్టాలు వర్ణనాతీతం. గ్రామస్తులే అన్నం పెడుతున్నారు. వృద్ధురాలి దీన స్థితిని చూసి చలించిపోయి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొమరోలు ఎస్ఐ వెంకటేశ్వర్లునాయక్కు గ్రామానికి చేరుకుని కుమారులతో ఫోన్లో మాట్లాడారు. తల్లి బాగోగులు చూసుకోవాలని లేకుంటే.. అనాథాశ్రమానికి తరలిస్తామని చెప్పారు. -
పెడన టీడీపీలో ఆధిపత్య పోరు.. ఎన్నికల అధికారిపై కత్తితో దాడికి యత్నం
సాక్షి, కృష్ణా జిల్లా: పెడన నియోజకవర్గం నీటి సంఘం ఎన్నికల్లో టీడీపీలో ఇరు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో ఓడిపోవడంతో ఎలక్షన్ ఆఫీసర్‌పై కత్తితో దాడికి యత్నించారు. పామర్తి వెంకటేశ్వరావును పెడన మండల పార్టీ అధ్యక్షుడు చల్లపాటి ప్రసాద్ బలపరచగా, పామర్తి బ్రహ్మయ్యను నందిగామ సర్పంచ్ బొడ్డు సీతయ్య (చినబాబు) బలపర్చారు. ఎన్నికల్లో బ్రహ్మయ్యకు 10 ఓట్లు, వెంకటేశ్వరరావుకు 2 ఓట్లు వచ్చాయి.ఎన్నిక పూర్తయిన తర్వాత ఓటమిని తట్టుకోలేకపోయిన పామర్తి వెంకటేశ్వరరావు.. ఇంటికెళ్లి కత్తి తీసుకొచ్చారు. ఎన్నికల అధికారి వద్ద ఉన్న పత్రాలు లాక్కునేందుకు యత్నించారు. పత్రాలు ఇవ్వకపోవడంతో ఎన్నికల అధికారి జి.మధుశేఖర్‌పై కత్తితో దాడికి యత్నించారు. దాడిని అడ్డుకోవడంతో మధుశేఖర్ చేతికి స్వల్పగాయమైంది. దాడి అనంతరం తన చేతిని గాయపరచుకుని పామర్తి వెంకటేశ్వరరావు కిందపడిపోయారు. పామర్తి వెంకటేశ్వరరావుపై ఎన్నికల అధికారి మధుశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రిని రైతులు నిలదీశారు. 10 రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు.ఈ క్రాప్ జరిగినప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. 1262 ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నించడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు కొనడం లేదంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాయంత్రానికల్లా ధాన్యం కొని.. రేపటికల్లా డబ్బులు పడేలా చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’ -
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
సాక్షి, కృష్ణాజిల్లా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వ్యాన్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు(30) ,భానుప్రకాశ్ (26), చింత బాబీ(36)గా గుర్తించారు.కారు మచిలీపట్నం వైపు వెళ్తుండగా, చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బొలేరో వ్యాన్ వెళ్తుంది. టైరు పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. చేపల వ్యాన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
ఇది రెడ్‌బుక్ పాలన: వైఎస్ జగన్ ధ్వజం
అబద్ధాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. కానీ రేపు మనమనుకుంటున్న ఈ సమస్యలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. ఆరు నెలలు తిరక్క మునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు.. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ‘రాష్ట్రంలో ఎక్కడ చూసినా రెడ్ బుడ్ రాజ్యాంగం నడుస్తోంది. ప్రజలకు మంచి చేశాం కాబట్టి మాకు ఓటు వేయండి.. అని అడిగే పరిస్థితి టీడీపీకి లేదు. ఎక్కడ చూసినా వ్యవస్థలన్నీ కూప్పకూలిపోయిన పరిస్థితే కనిపిస్తోంది’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘మన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి మధ్య ఇప్పటికే ప్రతి ఇంట్లో పోలిక మొదలైంది. మన ప్రభుత్వ హయాంలో ఎలా ఉండేది.. ఈ ఆరు నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఎలా పని చేస్తోంది.. అన్న చర్చ ప్రతి ఇంట్లో నడుస్తోంది’ అని స్థానిక సంస్థల ప్రజానిధులకు చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లతో సమావేశమయ్యారు. సంక్రాంతి తర్వాత పార్లమెంటు యూనిట్‌గా జిల్లాల బాట పడతానని, దాదాపు జనవరి ఆఖరు నుంచి ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతానని చెప్పారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, ప్రతి పార్లమెంటును ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడకి వచ్చి బస చేస్తానన్నారు. బుధవారం మూడు నియోజకవర్గాల కార్యకర్తలతో, గురువారం మరో నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని, అక్కడే ఉంటూ వారితో మమేకమవుతూ, వారికి తోడుగా ఉంటూ వారికి మరింత దగ్గరయ్యే కార్యక్రమం చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే » రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది మీ అందరికీ తెలిసిన విషయమే. ఎంపీపీల పరంగా, జెడ్పీటీసీ సభ్యుల పరంగా, మేయర్ల పరంగా జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో మన వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. 46 చోట్ల ఎన్నికలు జరిగితే 44 జెడ్పీటీసీ స్థానాల్లో మన పార్టీ గెలిచింది. ఎంపీపీలు, ఎంపీటీసీల స్థానాల్లో కూడా దేవుడి దయతో గొప్ప విజయాన్ని అందుకున్నాం. ఇవాళ స్థానిక సంస్థల్లో ఎక్కడ చూసినా మనమే కనిపిస్తాం. అయినా జనరల్ బాడీ మీటింగ్ ఎక్కడ జరిగినా మనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. » మనం చెడు చేసి ప్రతిపక్షంలో కూర్చోలేదు. మీరంతా ప్రజాప్రతినిధులుగా ఎన్నికలప్పుడు తిరిగిన వాళ్లే. ప్రతి ఇంటికి, గడప గడపకూ మనం వెళ్లినప్పుడు ఏ ఇంటికి వెళ్లినా చిక్కటి చిరునవ్వుతోనే ప్రజలు అక్కున చేర్చుకున్నారు. కారణాలు ఏమైనా ఎన్నికలకు వచ్చే సరికి మనం అనుకున్న ఫలితాలు రాలేదు. మనందరికి తెలిసిన విషయం ఏమిటంటే.. జగన్ కుటుంబానికి అంతా మేలు చేశాడు. కానీ చంద్రబాబునాయుడు మాత్రం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానని చెప్పాడు. కాబట్టి ఆ ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు మనం చూశాం. అతి నిజాయతీ.. అతి మంచితనం మనకున్న సమస్యలు » అబద్ధాలు చెప్పడం మనకు చేతగాదు. అతి నిజాయితీ, అతి మంచితనం మనకున్న సమస్యలు. జగన్ ఇవన్నీ చేయగలిగాడు.. చంద్రబాబునాయుడు వీటికన్నా ఓ రెండు మూడింతలు ఎక్కువ చెబుతున్నాడు.. అదీ మోడీతో కలిసి వస్తున్నాడు చేయగలుగుతాడేమోనని ఆశపడ్డారు. మన పరిపాలన కాలంలో మనం ఇంత చక్కగా బటన్లు నొక్కాం కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనన్న ఆశ ప్రజలకు కలిగింది. దానివల్ల 10 శాతం మన ఓటు బ్యాంకు తగ్గింది. కానీ ఆరు నెలలు తిరక్క మునుపే ఇవాళ పరిస్థితి చూస్తే.. ప్రతి ఇంట్లో ఒకటే చర్చ జరుగుతోంది. » జగన్ కనీసం పలావు అయినా పెట్టేవాడు.. చంద్రబాబునాయుడు బిర్యానీ పెడతానన్నాడు.. తీరా చూస్తే పలావు పోయింది, బిర్యానీ పోయిందని చర్చ జరుగుతోంది. కానీ రేపు మనమనుకుంటున్న సమస్యలే మళ్లీ మనల్ని అధికారంలోకి తెస్తాయి. అన్నింటా తిరోగమనమే » ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. జనవరి నుంచి ఫీజులు పెండింగ్. మన హయాంలో ప్రతి త్రైమాసికం అయిన వెంటనే ఒక నెల తనిఖీలకు గడువు ఇచ్చి, మరుసటి నెల ఇచ్చే పరిస్థితి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన ఫీజులు ఏప్రిల్‌లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇచ్చాం. » ఇవాళ జనవరి, ఫిబ్రవరి, మార్చి క్వార్టర్, ఏప్రిల్, మే, జూన్ క్వార్టర్, జూలై, ఆగషు్ట, సెపె్టంబరు క్వార్టర్.. అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ జనవరి నాటికి సంవత్సరం ఫీజులు పిల్లలకు ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది. ఒక్క ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలే రూ.2,800 కోట్లు. మన హయాంలో ప్రతి ఏప్రిల్‌లో వసతి దీవెన రూ.1,100 కోట్లు ఇచ్చేవాళ్లం. అవి కూడా బకాయిలే. వ్యవస్థని నడిపించే ఈ కార్యక్రమాలు కుప్పకూలుతున్న పరిస్థితి. దాదాపు రూ.3,900 కోట్లు కేవలం పిల్లల చదువులకు సంబంధించిన బకాయిలు ఉన్నాయి. » ఆరోగ్యశ్రీకి సంబంధించి మార్చి నుంచి నెట్వర్క్ ఆసుపత్రులకు రూ.2,200 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవాళ పేదవాడు ఆసుపత్రి గడప ఎక్కాలంటే, డాక్టర్లు ఉచితంగా వైద్యం అందిస్తారన్న నమ్మకం సన్నగిల్లింది. ఆరోగ్య ఆసరా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది ఎక్కడుంది అనుకునే పరిస్థితికి ప్రజలు వచ్చారు. 108, 104 డయల్ చేసినా ఆంబులెన్స్ వస్తుందన్న పరిస్థితి లేదు. వాళ్లు స్ట్రైక్‌లు, ధర్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై నిలదీయండి » ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం’ కార్యక్రమాన్ని మొదలు పెట్టేలోగా జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్ధాయి వరకు వివిధ విభాగాలకు సంబంధించిన అధ్యక్షులు, అన్ని కమిటీలు పూర్తి చేయాలని జిల్లా అధ్యక్షులకు ఇప్పటికే చెప్పాం. నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ తర్వాత బూత్ కమిటీల నుంచి గ్రామ కమిటీలు ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా చేపడతాం. » సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలి. చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాలను నిలదీయాలి. ఇది జరగాలంటే మండల, మున్సిపాల్టీ , వార్డు స్ధాయిలో మీరు చాలా కీలకమైన పాత్ర పోషించాలి. మండల, గ్రామ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసే దిశగా మీరంతా అడుగులు ముందుకు వేయాలి.అబద్ధాలు చెప్పలేదు.. చెప్పగలిగిందే చేశాం » మనం కుటుంబం మొత్తాన్ని ఒకటిగా చేసి మంచి చేశాం. మనం అబద్ధాలు చెప్పలేదు. మనం చేయగలిగింది మాత్రమే చెప్పాం. వాళ్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి ఇంట్లో ఎవరు కనిపించినా అబద్ధపు హామీలు ఇచ్చారు. ఇద్దరు పిల్లలు కనిపిస్తే.. నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని.. తల్లులు కనిపిస్తే నీకు రూ.18 వేలు అని.. కాస్త పెద్ద వయస్సులో 50 ఏళ్లు దాటిన అమ్మలు, అత్తలు కనిపిస్తే మీకు రూ.48 వేలు అని.. ఆ ఇంట్లో ఉద్యోగం వెతుక్కుంటున్న 20 ఏళ్ల పిల్లవాడు కనిపిస్తే నీకు రూ.36 వేలు అని.. అదే ఇంట్లోంచి రైతు బయటకు వస్తే నీకు రూ.20 వేలు అని.. చెప్పే పరిస్థితి చూశాం. » ‘వాళ్లు ప్రతి ఇంటికి వెళ్లి చంద్రబాబు సీఎం అయితే ఇవన్నీ జరగబోతున్నాయని ప్రలోభాలు పెట్టారు.. సాధ్యం కాని హామీలిచ్చారు.. అవి సాధ్యం కాదని తెలిసినా హామీలిస్తూ వాళ్లు ప్రచారం చేస్తున్నారు.. ప్రతి ఒక్కరినీ చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు’ అని చాలామంది నాకు చెప్పారు. చీకటి తర్వాత వెలుగు తప్పదు » కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత పగలు రాక తప్పదు. ఇది సృష్టి ధర్మం. కాబట్టి ఇది కచి్చతంగా గుర్తుపెట్టుకోండి. కష్టాల్లో ఉన్నప్పుడు పోరాటం చేయగలిగితే మనం తిరిగి నిలబడగలుగుతాం. కాలం గడిచే కొద్దీ ఈ భయాలు పోతాయి. మరో రెండు మూడు నెలల్లో అందరూ ధైర్యంగా రోడ్డు మీదకు వస్తారు. అందరిలో ఈ ధైర్యం రావాలి. ఎందుకంటే ప్రజల తరపున, ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి. ప్రజా వ్యతిరేకత పెరుగుతోంది. ప్రజల తరఫున వారికి అండగా నిలవగలిగితే.. ప్రజలు మనతో పాటు నడుస్తారు. మీరందరూ ఎంపీపీ, జడ్పీటీసీ వంటి మండల స్థాయి నాయకులు.. మీరు ఇంకా ఎదగాలంటే ప్రతిపక్షంలో మీరు ఏ రకమైన పాత్ర పోషిస్తున్నారు అన్నదే నిర్ణయిస్తుంది. » కష్టమొచ్చినప్పుడు అందరూ నన్ను గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు. పలుమార్లు బెయిల్ పిటిషన్ వేస్తే.. రిజెక్ట్ అయ్యేది. ప్రతిపక్షంలో ఉంటూ రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్‌తో యుద్ధం చేశా. టీడీపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసి నా మీద పిటిషన్లు వేశాయి. ఇంత మందితో యుద్ధం చేస్తున్నా.. నేను బెయిల్ పిటిషన్ వేసినప్పుడల్లా అన్న మాటేమిటంటే.. నేను బయటకు వస్తే ఇన్ప్లూయన్స్ చేస్తానని చెప్పే వారు. కేంద్రంలో, రాష్ట్రంలో వాళ్ల ప్రభుత్వాలే ఉన్నప్పటికీ నేను ప్రభావితం చేస్తానని బెయిల్ తిరస్కరించారు. ఇలా 16 నెలలు గడిపారు. కానీ ఏమైంది? ఆ తర్వాత బయటకు వచ్చా. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన సాగించాం. » నా కార్యక్రమం మొదలైన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు నాతో పాటు మీరూ, నేనూ ఇద్దరం కలిసి పార్టీని బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. ఇది మన ఎజెండా. గతంలో మనకు 151 స్థానాలు వచ్చాయి. ఈసారి తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్‌కు పరిమితం చేయాలి. కచ్చితంగా దేవుడు ఈ పని చేయిస్తాడన్న నమ్మకం ఉంది. ఏ మంచీ చేయకుండా కేవలం అబద్ధాలు, మోసం చేసినప్పుడు అది కోపం కింద మారుతుంది. ప్రజల్లో ఆ కోపం రెట్టింపు అవుతుంది. మన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ రోజు మనం తప్పకుండా చూస్తాం. మోసమే పరమావధిగా ఉన్న వాళ్లను ప్రజలు ఏం చేస్తారో కూడా మనం చూస్తాం. ఈ రోజు నుంచి ఎన్నికలు అయ్యే వరకు.. అది రెండేళ్లయినా, మూడేళ్లయినా నేను మిమ్నల్ని కోరేది ఒక్కటే. మనలో పోరాట పటిమ సన్నగిల్లగూడదు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కష్టాలుంటాయి, నష్టాలుంటాయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎల్లకాలం అధికారంలోనే ఉండం. కానీ కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నాం, ఎలా ప్రవర్తించాం అన్నది మాత్రమే మనల్ని పైకి తీసుకువస్తుంది. అది కచి్చతంగా గుర్తుపెట్టుకోవాలి. వ్యక్తిత్వం, విలువలు, విశ్వసనీయతలను మనం పడేస్తే మళ్లీ దక్కించుకోవడం కష్టం. కష్టకాలం అనేది మనకొక పరీక్ష. గ్రామ స్థాయిలో కార్యకర్త నుంచి ఎమ్మెల్యే, ఎంపీ వరకు ప్రతి ఒక్కరికీ ఫేస్ బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ ఉండాలి. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దాన్ని వీడియో తీసి అప్ లోడ్ చేయాలి. యూట్యూబ్‌లో కూడా పోస్ట్ చేయాలి. సంవత్సరం పూర్తయ్యే సరికి గ్రామంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబును ప్రశ్నిస్తూ ప్రతి ఇంట్లోంచి వాయిస్ రావాలి. అది మనం చేస్తూ, మన కార్యకర్తలతో చేయించాలి. సూపర్ సిక్స్ ఏమైంది? ఏమైంది సూపర్ సెవన్? మాకు చెప్పిన మాటలు ఏమయ్యాయి? అన్న దగ్గర నుంచి మొదలయ్యే ప్రశ్నల వర్షం.. ఏమైంది మా స్కూల్? ఏమైంది మా హాస్పిటల్? ఏమైంది మా పంటల కొనుగోలు పరిస్థితి? ఏమైంది మా ఆర్బీకే? అంటూ ప్రశ్నల పరంపర కొనసాగాలి. ఆ దిశగా అడుగులు ముందుకు పడాలి. విద్య, వైద్యంతోపాటు చివరకు ధాన్యం కొనుగోలు పరిస్థితీ దయనీయంగా ఉంది. దళారీలు కొనేదాకా ప్రభుత్వం అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా లేదు. ధాన్యం కొనుగోలుకు ఎంఎస్పీ రూ.1,720 అయితే రైతులు కృష్ణా జిల్లాలోనే రూ.300 తక్కువకు అమ్ముకుంటున్నారు. ఆర్బీకేల ద్వారా దళారీల వ్యవస్ధను తీసేసి, ఈ–క్రాప్ చేసి పారదర్శకంగా మనం కొనుగోలు చేసినట్టు.. ఈ ప్రభుత్వం కొనాల్సిన సమయంలో కొనుగోలు చేస్తే.. రైతులకు మద్దతు ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం అలా చేయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇలా ప్రతి వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది. రాష్ట్రంలో మరోవైపు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. దొంగ కేసులు పెడుతున్నారు. ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వాన పరిస్థితులు చూస్తున్నాం. ఒక వైపు మంచి చేయకపోగా.. మరోవైపు ప్రశ్నించే గొంతులను అణిచి వేయాలని చూస్తున్నారు. మామూలుగా ఆరు నెలలకు ఊహించిన దానికన్నా అధ్వానంగా ప్రభుత్వ వ్యతిరేకత పెరిగింది. ఎన్నికలు ఎప్పుడు వచి్చనా మంచిదే. వీళ్లు ఈ మాదిరిగా ఇన్నిన్ని అబద్ధాలు ఆడి, ఇన్ని మోసాలు చేసిన వీళ్ల పరిస్థితి రేపు ఎన్నికల్లో ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పాల్సిన పనిలేదు. – వైఎస్ జగన్ -
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గతి ఇదే.. వైఎస్ జగన్ (ఫోటోలు)
-
ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజా ప్రతినిధులతో వైయస్ జగన్
-
అన్నదాత ఆక్రందన
-
కాగితం కళ: పేపర్ సూపర్
‘హౌ టూ....’ అని గాలించేందుకు అప్పట్లో గూగులమ్మ లేదు. రిఫర్ చేసేందుకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేవు. ‘కాగితం కళ’పై చిన్నప్పటి నుంచి ఇష్టం పెంచుకున్న మేడా రజని ఎలాంటి సౌకర్యాలు లేని కాలంలో తనకు తోచిన రీతిలో రకరకాల డిజైన్లు చేసేది. ‘కాగితం కళ’ అనేది ఆమె బాల్య జ్ఞాపకం కాదు. బతుకు బాట వేసిన సాధనం. ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న ఉత్తేజం....ప్రకృతి పాఠశాలలో ఎన్నో నేర్చుకోవచ్చు. కృష్ణాజిల్లా మచిలీపట్నం మండలం గిలకలదిండికి చెందిన రజనికి ప్రకృతి ప్రసాదమైన పూలను చూస్తూ గడపడం అంటే ఎంతో ఇష్టం. విరబూసిన పూల నుంచి స్ఫూర్తిపొంది, తనలోని సృజనాత్మకతకు పదును పెట్టేది. ‘పేపర్ క్విల్లింగ్’ ఆర్ట్‌ని సాధన చేసేది. ఇది తన అభిరుచి మాత్రమే కాదు ఆర్థికంగా బలాన్ని ఇచ్చింది. తన పరిధిలో మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. గ్రామీణప్రాంంతాలకు వెళుతూ పేద విద్యార్థులకు ‘పేపర్ క్విల్లింగ్’లో ఉచిత శిక్షణ ఇచ్చేలా చేస్తోంది.‘శ్రీ క్రియేషన్స్’ అనే సంస్థకు శ్రీకారం చుట్టి క్రియేటివ్ క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ శిక్షణా తరగతులను ఆఫ్ లైన్, ఆన్లైన్లో నిర్వహిస్తోంది. ‘సింధు డిజైన్స్’ పేరుతో శుభకార్యాల కోసం అందమైన ఆకృతిలో పేపర్ బ్యాగులు, కాగితపు పూలతో చేసిన ఫ్లవర్ వాజ్‌లు, బొకేలు, పూల జడలు, పేపర్ క్విల్లింగ్ ఆర్ట్స్‌తో చేసిన ఫొటో ఫ్రేమ్‌లు... మొదలైనవి తయారు చేస్తోంది.‘కళ’కున్న గుణం ఏమిటంటే మనల్ని ఖాళీగా కూర్చోనివ్వదు! ఎప్పుడూ ఏదో తెలుసుకునేలా చేస్తుంది. నేర్చుకునేలా చేస్తుంది.‘పేవర్ ఆర్ట్ గురించి నాకు బాగా తెలుసు’ అని ఎప్పుడూ అనుకోలేదు రజిని. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటుంది. విదేశీ కళలకు లోకల్ ఫ్లేవర్ జోడించడం గురించి రకరకాలుగా ఆలోచిస్తుంటుంది.చండీగఢ్ కేంద్ర విశ్వవిద్యాలయం నుంచి దూరవిద్యలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన రజని ‘నా కళ నా దగ్గరే ఉండాలి’ అని అనుకోలేదు. తనకు తెలిసిన కళకు సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి మరీ కొత్త తరానికి పరిచయం చేస్తోంది.‘క్రియేటివ్ హార్ట్స్– ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అకాడమీ’ జాతీయ స్థాయిలో నిర్వహించినపోటీలో రజని తయారు చేసిన రాధాకృష్ణ పేపర్ క్విల్లింగ్ ఆర్ట్ ‘గోల్డెన్ బ్రష్ అవార్డు’ గెలుచుకుంది. ఇలాంటి పురస్కారాలు ఆమె ప్రయాణంలో ఎన్నో ఉన్నాయి.‘అవార్డ్ అందుకున్నాను అనే ఆనందం కన్నా నా వల్ల పదిమంది ఈ కళలో ప్రాంవీణ్యం సాధించారనే విషయం గొప్పగా ఉంటుంది’ అంటుంది రజిని. తన ఆర్ట్‌వర్క్‌కు సంబంధించిన ప్రదర్శనలను దేశంలో ఎన్నోచోట్ల ఏర్పాటు చేసి ప్రశంసలు అందుకున్న రజని పేపర్ ఆర్ట్‌లో మరెన్నో ప్రయోగాలు చేయాలనుకుంటోంది.‘నేర్చుకున్నది ఎప్పుడూ వృథాపోదు’ అనేది ఆమె నోటినుంచి వినిపించే మాట. నిజమే కదా! ఉత్సాహం ఇస్తుంది. ఉపాధి ఇస్తుంది. ఇతరులకు ఉపాధి కలిగించేలా చేస్తుంది. ఎంతో ఇచ్చింది...చిన్నప్పుడు ఆడుతూ పాడుతూ నేర్చుకున్న పేపర్ క్రాఫ్ట్ నాకు ఉత్సాహాన్నిచ్చింది. ఉపాధి కల్పించింది. పేరు తెచ్చింది. నేను కన్న కలలు నిజం చేసుకునేందుకు ఉపయోగపడింది. ఈ కళలో రాణించేందుకు ఓర్పు, శ్రద్ధ, ఏకాగ్రత, సృజనాత్మకత ఉండాలి. నేర్చుకున్నచోటే ఉండి΄ోకుండా కాలంతో పాటు కొత్త కళలు, సాంకేతికతపై దృష్టి పెట్టాలి.– మేడా రజని– ఎస్.పి. యూసుఫ్, సాక్షి, మచిలీపట్నం -
కృష్ణా జిల్లా యనమలకుదురులో గ్యాంగ్ వార్
-
విద్యార్థిని తొడ కొరికిన కీచక టీచర్
కోడూరు: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయుడు అభం శుభం తెలియని చిన్నారులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రాక్షసానందం పొందాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా కోడూరు మండలంలో నరసింహపురంలో చోటుచేసుకుంది. నరసింహపురం ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు పది మంది పిల్లలు చదువుతున్నారు. ఆ పాఠశాలలో పనిచేస్తున్న అవనిగడ్డకు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు కటికల వేణుగోపాలరావు.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఓ ప్రైవేట్ టీచర్‌ను నియమించుకుని విద్యార్థులకు చదువు చెప్పిస్తున్నాడు. బాధ్యత మొత్తం ఆ టీచర్ మీద వదిలేసి వేణుగోపాలరావు పాఠశాలలో తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో వేణుగోపాలరావు మూడో తరగతి విద్యార్థినితో నాలుగు రోజుల నుంచి అసభ్యంగా ప్రవరిస్తున్నాడు. చెప్పుకోలేని చోట తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. సోమవారం ఉదయం ఆ విద్యార్థిని పాఠశాలకు వెళ్లగానే వేణుగోపాలరావు వేరే గదిలోకి తీసుకువెళ్లి బెంచిపై కూర్చొబెట్టి తొడపై కొరికాడు. విద్యార్థిని వద్దు సార్ అని ఏడుస్తున్నా కనికరించకుండా పళ్లగాట్లు పడేలా కొరికాడు. ఈ విషయం ఇంట్లో చెబితే చంపేస్తానని బెదిరించినట్టు విద్యార్థిని తల్లిదండ్రులకు తెలిపింది. ఉపాధ్యాయుడు నాలుగు రోజుల నుంచి తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. ఎక్కడ పడితే అక్కడ తాకుతున్నాడని చెప్పింది. తల్లిదండ్రులు విద్యార్థిని తొడపై పంటిగాట్లు గమనించారు. దీనిపై మండల విద్యాశాఖ అధికారులకు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో కోడూరు పోలీసులను ఆశ్రయించారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో వేణుగోపాలరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. -
కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి
సాక్షి, కృష్ణా జిల్లా: పామర్రు మండలం కొండాయపాలెం వద్ద కారు కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. గుడివాడ నుంచి పామర్రు వైపు వెళ్తున్న కారు.. కొండాయపాలెం వద్దకు రాగానే అదుపుతప్పి కాల్వలోకి దూసుకుపోయింది.కాల్వలో నీరు ఎక్కువగా ఉండటంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు. సమాచారం అందుకున్న పామర్రు పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సాయంతో కారును బయటకు తీశారు. మృతదేహాలను గుడివాడ ఆసుపత్రి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
జనం లేని పవన్ ‘పల్లె పండుగ’ సభ
విజయవాడ, సాక్షి: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జనం లేక ఖాళీ కూర్చిలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.JUST IN | No crowd at Deputy Chief Minister #PawanKalyan's Palle Panduga program in Kankipadu, Krishna district, on Monday.📹: G N Rao (@hindugnr1) pic.twitter.com/KsCfT77m6V— The Hindu (@the_hindu) October 14, 2024చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
పామర్రు టీడీపీలో రచ్చకెక్కిన ఇసుక టెండర్ల వివాదం..
సాక్షి, కృష్ణా: ఓ వైపు మద్యం మాఫియాను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా ఇసుక మాఫియాకు గేట్లు ఎత్తేసింది. ఉచితం పేరుతో ఇసుకను బంగారంలా మార్చింది చాలదన్నట్లు.. మరింతగా దోపిడీ చేసేందుకు రహస్యంగా పెద్ద స్కెచ్చే వేసింది. జనమంతా పండుగ సందడిలో ఉంటే.. సందట్లో సడేమియాలా ఇసుక రీచ్‌లను తను అనుకున్న వారికి హస్తగతం చేసింది. ఎటువంటి ఇసుక పాలసీ లేకుండానే 70 లక్షల టన్నులకంటూ 108 ఇసుక రీచ్‌లకు టెండర్లు పిలిచి ఆగమేఘాల మీద వాటిని ఖరారు చేసేసింది.తాజాగా కృష్ణా జిల్లా పామర్రు టీడీపీలో ఇసుక టెండర్ల వివాదం రచ్చకెక్కింది. ఇసుక టెండర్ కోసం టీడీపీ నేతలు మధ్య తగాదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇసుక టెంబర్ బెదిరింపు వీడియో ఒకటి కలకలం రేపుతోంది. బెనర్జీ అనే టీడీపీ నేతకు ఇసుక టెండర్ వేయొద్దంటూ ఎమ్మెల్యే వర్గం నేత సురేష్ బెదిరింపులకు పాల్పడినట్లు ఇందులో ఉంది. ఇసుక టెండర్లలో ఎవ్వరూ పాల్గొనకూడదని సురేష్ హుకుం జారీ చేశారు. ఇసుక టెండర్ వేసిన బెనర్జీని వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేశారు. ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడించిన వీడియో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. -
మచిలీపట్నంలో టీడీపీ Vs జనసేన
సాక్షి, కృష్ణా జిల్లా: మచిలీపట్నంలో టీడీపీ, జనసేనల మధ్య బ్యానర్ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.దీంతో యర్రంశెట్టి నానిపై టీడీపీ నేతలు దాడి చేయడమే కాకుండా ఆయన ఇళ్లంతా ధ్వంసం చేశారు. ఈ దాడిలో యర్రంశెట్టి నాని గాయపడ్డారు.అనంతరం ఇరువర్గాల మధ్య పార్టీ పెద్దలు సెటిల్మెంట్ చేశారు. అయితే, సెటిల్మెంట్ చేసిన మరుసటి రోజు మరోసారి యర్రంశెట్టి నాని ఇంటిపై టీడీపీ దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న శాయన శ్రీనిసరావును రక్తం కారేలా టీడీపీ నేతలు తీవ్రంగా కొట్టారు.బ్యానర్ చించినందుకు కాళ్లు పట్టించుకుని టీడీపీ నేతలు క్షమాపణ చెప్పించుకున్నారు. టీడీపీ నేత శంఖు శ్రీను కాళ్లు పట్టుకుని యర్రంశెట్టి నాని , శాయన శ్రీనివాసరావు క్షమాపణ చెప్పారు. జనసేన, టీడీపీ నేతలు ఒకరిపైఒకరు చిలకలపూడి స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు.ఇదీ చదవండి: తమ వాళ్ల కోసం సోషల్ మీడియా పోస్టులు -
నాడు జగన్ హయాంలో... నేనున్నా...!
వస్తున్న వర్షాన్నో... వచ్చే వరదనో ఆపటం సాధ్యం కాకపోవచ్చు. కానీ ముందుగా తెలుసుకుని హెచ్చరించే వ్యవస్థలొచ్చాయి. వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగే సామర్థ్యం ఉండనే ఉంది. శిబిరాలకు చేరిన వారికి ఆహారం, నీళ్లు అందిస్తే చాలు. అప్పటికి వాళ్ల ప్రాణాలు కుదుటపడతాయి. వరద తగ్గాక మళ్లీ వారి జీవితాలు మొదలవుతాయి. ఈ ప్రక్రియలోనే వాళ్లకి ప్రభుత్వ అండ కావాలి. ముందుగా హెచ్చరించి... శిబిరాలకు తరలించి... సాయం అందించగలిగే యంత్రాంగం ప్రభుత్వానికే ఉంటుంది. ఆ బాధ్యత కూడా ప్రభుత్వానిదే. గత జగన్ ప్రభుత్వ హయాంలో వలంటీర్ల వ్యవస్థ ఎలా పని చేసిందో చెప్పడానికి ఈ ఒక్క ఫోటోనే నిదర్శనం నాడు జగన్ హయాంలో బాధితులకు పునరావాసం ఇలా.. రెండేళ్ల కిందట ఇదే స్థాయిలో వరదలు ఉభయగోదావరి జిల్లాలను ముంచెత్తినపుడు... నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఏ ఒక్కరినీ కన్నీరు పెట్టనివ్వలేదు. ముందుగా హెచ్చరించి శిబిరాలకు తరలించడానికి, శిబిరాల వద్ద అప్పటికప్పుడు వండిన ఆహారం అందించడానికి వలంటీర్ల వ్యవస్థ అద్భుతంగా అక్కరకొచ్చింది. ముఖ్యమంత్రి తన కార్యాలయం నుంచే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులకు తగు ఆదేశాలివ్వటంతో సహాయ కార్యక్రమాలు పక్కాగా జరిగాయి. సహాయ కార్యక్రమాలకు అడ్డు రాకూడదన్న ఉద్దేశంతో నాలుగు రోజుల తరవాత పరిస్థితి ఉపశమించాక ముఖ్యమంత్రి ఆ ప్రాంతానికి వెళ్లారు. బాధితుల్లో ఏ ఒక్కరైనా ఫిర్యాదు చేస్తే ఒట్టు!!. అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లేటపుడు చేతిలో రూ.2వేలు పెట్టి మరీ పంపింది నాటి ప్రభుత్వం.నేడు బాబు హయాంలో... ఎక్కడన్నా..?మరిప్పుడో..? ఇదేమీ అకస్మాత్తుగా పడిన వర్షాల వల్ల వచ్చిన ముప్పు కూడా కాదు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నా... ఎగువ నుంచి వస్తున్న వరదను ప్రస్తుత చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో కృష్ణా నదికి ఉధృతంగా ప్రవాహం వచ్చి ఎగదన్నింది. దీంతో బుడమేరుకు పలు చోట్ల గండ్లు పడ్డాయి. ఇది చాలదన్నట్లు... ముందస్తు హెచ్చరికలు కూడా లేకుండా బుడమేరు గేట్లు ఎత్తేశారు. దీంతో విజయవాడ నగరంలోని పలు ప్రాంతాలతో పాటు రూరల్ ప్రాంతాలూ దారుణంగా మునిగిపోయాయి. ఒక్కరినైనా ముందుగా హెచ్చరిస్తే ఒట్టు. ఇక శిబిరాలూ లేవు.. వాటికి తరలించటాలూ లేవు. సహాయ కార్యక్రమాల ఊసేలేదు. పైపెచ్చు కరకట్టపై కట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికే దిక్కులేదు. ఆ విషయం బయటపడకుండా ఆయన సహాయ కార్యక్రమాల పర్యవేక్షణ పేరిట కలెక్టరేట్లో మకాం వేశారు. అక్కడికొక క్యారవాన్ తెప్పించుకుని... దాన్లోనే బస చేశారు. తన ఇల్లు మునుగుతోందన్న వార్తలపై అడ్డంగా దబాయిస్తూ... చరిత్రలో ఎన్నడూ ఎరుగని వర్షం వచ్చింది కాబట్టి పరిస్థితి ఇలా అయిందని బుకాయిస్తూ... తప్పుడు వార్తలు రాస్తే కఠిన చర్యలు తప్పవని బెదిరిస్తూ హుంకరింపులకు దిగారు. ఎల్లో మీడియా... సేమ్ టు ‘షేమ్’చంద్రబాబుకు కొమ్ముకాసే ఎల్లో మీడియా వైఖరి షరా మామూలే. ఉభయగోదావరి వరదల్లో ఎక్కడో ఒకరికో, ఇద్దరికో సాయం అందకపోతే ఆ ఒక్కరి గురించే పేజీలకు పేజీలు వండేసి అబద్ధాలతో నాటి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించిన ఎల్లో మీడియా... ఇప్పుడు కూడా ముందస్తు సమాచారం ఉన్నా అధికార యంత్రాంగం తగు చర్యలు చేపట్టలేకపోయిందంటూ... అనుకున్న విధంగా సహాయక చర్యలు లేవంటూ సుతిమెత్తగా సన్నాయి నొక్కులు నొక్కింది. ముఖ్యమంత్రి కలెక్టరేట్లో బస చేసిన వార్తలకే పెద్దపీట. అక్కడ బస చేయటం వల్ల ఉపయోగం ఏంటన్నది దుర్గమ్మకెరక. బాధితుల్లో ఎవరిని పలకరించినా... తమ చెంతకు ఎవరూ రాలేదని, ఎలాంటి సహాయమూ చేయలేదనే చెబుతున్నారు. బోట్లు లేవు.. తరలింపులు లేవు... నీళ్లు లేవు.. ఆహారం లేదు.. సహాయ సామగ్రి లేవు. అసలు ప్రభుత్వ యంత్రాంగమే కనిపించలేదు. ఈ విషయం వరద ప్రాంతాలను సందర్శించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి వెళ్లినపుడు స్పష్టంగా బయటపడింది. బాధితుల ఆవేదనంతా బయటపడింది. ‘‘ఇప్పటిదాకా మీరు తప్ప ఇక్కడకు వచ్చి మమ్మల్ని పలకరించిన వాళ్లు ఎవ్వరూ లేరు’’ అని విజయవాడలోని సింగ్ నగర్ వాసులు వ్యాఖ్యానించారంటే పరిస్థితి చెప్పకనే తెలుసుకోవచ్చు.కృష్ణలంక వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్(ఫోటో గ్యాలరీ) -
హాస్టల్ బాత్రూంలో స్పై కెమెరాలు..
-
గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో హిడెన్ కెమెరాల కలకలం
-
AP: గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినిల ఆందోళన
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు పెట్టి విద్యార్థినిల వీడియోలు తీయడం తీవ్ర కలకలం సృష్టించింది. ఫైనల్ ఇయర్ విద్యార్థే ఇందుకు కారణమని అతడిని చితకబాదారు. ఈ సందర్భంగా రాత్రంతా విద్యార్థులు ధర్నాకు దిగారు.వివరాల ప్రకారం.. గుడివాడ మండలం శేషాద్రిరావు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాలు అమర్చారు. ఓ విద్యార్థిని సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థినిలు.. మేనేజ్మెంట్కు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ వారు చర్యలు తీసుకోకపోవడంతో వారంతా ఆందోళనలు చేపట్టారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము 3:30 గంటల వరకు విద్యార్థినిలు నిరసనల్లో పాల్గొన్నారు. గుడివాడ లోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ లోని అమ్మాయిల హాస్టల్ బాత్రూం లో స్పై కెమెరా లు అమర్చి - వాళ్ల వీడియో లు చిత్రీకరించి - వాటిని బాయ్స్ హాస్టల్ వాళ్లకి అమ్మి డబ్బులు తీసుకుంటున్నారు - ఇప్పటికి 300 వీడియో లు అమ్మినట్టు సమాచారం ఈ మొత్తం ప్రక్రియ ని నాల్గవ సంవంత్సరం… https://t.co/WPuHnUa0Vh pic.twitter.com/xhIuXZQnlh— 𝐀𝗋α𝗏𝗂𐓣ᑯα𝐒αꭑ𝖾𝗍α🚩 (@HarieswarH) August 30, 2024 ఈ ఘటనకు కారణమైన విజయ్ను అక్కడికి తీసుకురావడంతో అతడిపై విద్యార్థినిలు దాడి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు మాట్లాడుతూ.. వాష్‌రూమ్‌లో కెమెరాలు అమర్చి.. వీడియోలు తీశారు. ఆ వీడియోలను అమ్ముకుంటున్నారని ఆరోపించారు. అనంతరం, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన విజయ్ను ఆసుపత్రికి తరలించారు. అలాగే, విజయ్ను విచారించిన తర్వాత.. అతడి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇక, విద్యార్థినిలకు సంబంధించి దాదాపు 300 వీడియోలు ఉన్నట్టు తెలుస్తోంది. వివరాలను వెల్లడించేందుకు పోలీసులు నిరాకరించినట్టు సమాచారం. 🚨 గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఘోర దుర్ఘటన.లేడీస్ హాస్టల్ బాత్రూంలో 29వ తేదీ సాయంత్రం హిడెన్ కెమెరా పట్టుబడింది. దీంతో బాలికలలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.అందిన సమాచారాన్ని బట్టి సుమారుగా 300 పైగా వీడియోలు బాయ్స్ హాస్టల్‌కు చేరినట్లు వినికిడి. వీటిని బాయ్స్… pic.twitter.com/3rALM0f5D8— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) August 30, 2024 -
గుడివాడ కూటమిలో భగ్గుమన్న విభేదాలు
గుడివాడరూరల్: కృష్ణాజిల్లా గుడివాడ కూటమి పార్టీల్లో విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు రచ్చకెక్కింది. పట్టణంలోని నాగవరప్పాడు సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో రెండు పార్టీల మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవలే ఏర్పాటు చేసిన ఆ జెండా దిమ్మను ప్రారంభించడానికి వీల్లేదని, దానిని తొలగించాలని టీడీపీ నేత దారం నరసింహారావు డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆదివారం అర్ధరాత్రి నరసింహారావుకు జన సైనికులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరసింహారావు పలుగుతో జెండా దిమ్మను ధ్వంసం చేశాడు.ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి బూరగడ్డ శ్రీకాంత్ జనసేన కార్యకర్తలతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నరసింహారావు వెళ్లిపోయారు. వెంటనే జనసేన కార్యకర్తలు ఎంఎన్‌కె రహదారిపై బైఠాయించారు. నరసింహారావును అప్పగించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.లిఖితపూర్వక ఫిర్యాదు ఇస్తే అతనిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో జనసైనికులు ఆందోళన విరమించి బైక్ ర్యాలీగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి నరసింహారావుపై ఫిర్యాదు చేశారు. జనసేన పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసిన దారం నరసింహారావును టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని బూరగడ్డ శ్రీకాంత్ డిమాండ్ చేశారు. ఆధిపత్యం కోసం దారం నరసింహారావు పట్టణంలో వర్గ విభేదాలు సృష్టించి సంఘ విద్రోహ శక్తిలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. -
ప్రైవేటు బస్సు బోల్తా.. 25 మందికి గాయాలు
కృత్తివెన్ను (పెడన) : ప్రైవేటు బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో బస్సు బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది, కారులో ఉన్న నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండల పరిధిలోని 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగింది. కృత్తివెన్ను ఎస్ఐ కె. నాగరాజు తెలిపిన వివరాల మేరకు.. పశి్చమ గోదావరి జిల్లా మొగల్తూరు నుంచి ఓ ప్రైవేటు బస్సు బుధవారం హైదరాబాద్‌కు బయల్దేరింది.రాత్రి 8.30 గంటల సమయంలో కృత్తివెన్ను మండలం యండపల్లి–మునిపెడ గ్రామాల మధ్య విజయవాడ నుంచి రావులపాలెం వెళ్తున్న కారు, ఈ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు రోడ్డు మార్జిన్లో పలీ్టకొట్టింది. కారు ముందు భాగం దెబ్బతింది. ప్రమాద సమయంలో బస్సులో 19 మంది ప్రయాణికులు, బస్సు డ్రైవరు, క్లీనరు ఉండగా వారిలో డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక కారులో ఉన్న నలుగురూ గాయపడ్డారు. వీరిని మచిలీపట్నం సర్వజనాసుపత్రికి తరలించారు. బస్సు ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. -
దివిసీమ బిడ్డకు ‘జగనన్న దీవెన’
మోపిదేవి(అవనిగడ్డ): పేదింటి బిడ్డలు ఉన్నతంగా జీవించాలనేదే వైఎస్ జగన్ తపన. అందులో భాగంగానే జగనన్న విదేశీ విద్యా దీవెన తెచ్చారు. ఎందరో భావి భారత పౌరులకు అందించారు. ఆ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కృష్ణాజిల్లా దివిసీమ బిడ్డ. ఐక్యరాజ్య సమితిలో ఉన్నత స్థాయి రాజకీయ సమూహం ముందు ’సుస్థిర అభివృద్ధి’ అనే అంశంపై ప్రసంగించే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు. అందరి చేత శెభాష్ అనిపించుకున్నాడు.వివరాల్లోకి వెళితే... కృష్ణాజిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి శివారు అడపావారిపాలెం గ్రామానికి చెందిన పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు కృష్ణకిషోర్ ఆగస్టు 2023 నుంచి యూఎస్ఏలోని కొలంబియా యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ పబ్లిక్ అఫైర్స్ (సీపా–ఎస్ఐపీఏ)లో మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మిని్రస్టేషన్ విద్య అభ్యసిస్తున్నాడు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృష్ణకిషోర్‌కు జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.కోటి మంజూరు చేసింది. నాటి ప్రభుత్వం అందించిన సాయానికి పూర్తి న్యాయం చేస్తూ కృష్ణకిషోర్ అమెరికాలో అదీ ఐక్యరాజ్య సమితి ఆహా్వనంతో ఉన్నత స్థాయి ప్రతినిధుల ముందు తన వాణి వినిపించే అద్భుత అవకాశాన్ని పొందాడు.న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగిన సుస్థిర అభివృద్ధి (సస్టైనబుల్ డెవలప్మెంట్) అంశంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆహా్వనం అందుకున్నాడు. ఎస్ఐపీఏ స్టూడెంట్ అసోసియేషన్ అకడమిక్ చైర్మన్‌గా, సౌత్ ఏసియన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న కృష్ణకిషోర్ ప్రపంచ విశ్వవిద్యాలయాల అధ్యక్షులు, కార్పొరేట్ నాయకులు, సీనియర్ యునైటెడ్ నేషన్స్ అధికారులతో వేదికను పంచుకుని పది నిమిషాల పాటు ప్రసంగించి ఆకట్టుకున్నాడు.జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటాం. ఆయన అందించిన జగనన్న విదేశీ విద్యా దీవెనతోనే మా బాబు కృష్ణకిషోర్ అమెరికా వెళ్లాడు. అటు ప్రభుత్వానికి, ఇటు మాకు పేరు ప్రతిష్టలు తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉంది. – తల్లిదండ్రులు పండలనేని శివప్రసాద్, అన్నపూర్ణ -
లోకేష్‌ను బుట్టలో వేసుకునే ప్లాన్.. మొత్తానికే మోసం!
వారికి ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకమే లేదు. కాని ఊహించని విజయం వారిని వరించింది. టీడీపీ అధికారంలోకి వచ్చింది. గెలవం అనుకున్న సీట్లలో గెలిచిన ఆ ఇద్దరికీ మంత్రి పదవులపై కన్ను పడింది. క్యాబినెట్లో బెర్త్ కన్ఫామ్ కావాలంటే పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవాలి. ఇందుకోసం ఇద్దరు ఎమ్మెల్యేలు ఓ ప్లాన్ చేశారు. మంత్రి పదవుల కోసం బరితెగించి తమ ప్రత్యర్థులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై దాడులకు తెగించారు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు?తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న ప్రాంతం కృష్ణాజిల్లా. సామాజికవర్గం పరంగానూ...పార్టీ పరంగానూ బలమైన జిల్లా కావడంతో ఇక్కడినుంచి గెలుపొందిన నేతలకు పార్టీలోనూ అంతే వెయిటేజ్ ఉంటుంది. ఐతే ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్ధులు గెలవడంతో మంత్రివర్గంలో తమకు స్థానం దక్కదేమో అనే టెన్షన్ గన్నవరం, గుడివాడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో మొదలైందట. గెలిచినవారందరూ మంత్రి పదవుల కోసం తమకున్న పరిచయాలతో లాబీయింగ్ చేస్తుంటే ఈ ఇద్దరు మాత్రం...పార్టీలో చంద్రబాబు తర్వాత అంతటి అధికారం చెలాయించే చినబాబు లోకేష్‌ను ప్రసన్నం చేసుకుంటే తమ పని సులువు అవుతుందని భావించారట. పార్టీలో నెంబర్ టూగా ఉన్న లోకేష్ దృష్టిలో పడితే తమ స్థానం పదిలమనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తల్ని టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది.తమ లక్ష్యం నెరవేరాలంటే వైఎస్ఆర్సీపీలోని చిన్నా చితకా నాయకులు, క్యాడర్‌ను లక్ష్యంగా చేసుకుంటే వర్కవుట్ కాదని భావించారట. అందుకే గుడివాడలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వెనిగండ్ల రాము వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నానిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. గుడివాడలో ఎలాగైనా గెలవాలనుకున్న చంద్రబాబు కోరిక తీరింది కాబట్టి...కొడాలి నానిని కూడా ఇబ్బంది పెడితే పార్టీ దృష్టి ...చినబాబు దృష్టి తనపై పడుతుంది....అప్పుడు మంత్రి పదవి రేసులో తన పేరు కూడా ఉంటుందనే ఆలోచన చేశారట వెనిగండ్ల రాము. ఈ ఆలోచనతోనే కౌంటింగ్ పూర్తయిన రోజు రాత్రి కొడాలి నాని కార్యాలయంపై దాడి చేయించిన వెనిగండ్ల రాము..తర్వాత కొడాలి నాని ఇంటి పైకి కూడా కొంత మందిని టీడీపీ గూండాలను ఉసిగొల్సి పార్టీ వర్గాల్లో చర్చకు తెరతీసారట.గుడివాడలో వెనిగండ్ల రాము అనుసరించిన స్ట్రాటజీనే గన్నవరంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యార్లగడ్డ వెంకట్రావ్ కూడా అమలు చేశారట. కొడాలి నాని తర్వాత టీడీపీ ఓడించాలనుకున్న నేతల్లో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఉన్నారు. అటు గుడివాడతో పాటు ఇటు గన్నవరంలోనూ టీడీపీ గెలవడంతో కచ్చితంగా తనకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని యార్లగడ్డ ఆశపడ్డారట. అందుకే విజయవాడలోని వల్లభనేని వంశీ ఇంటి పై టీడీపీ గూండాలు ... కిరాయి మూకలతో దాడులకు పాల్పడ్డారని తెలుస్తోంది. వంశీ ఇంటిపై కత్తులు...కర్రలు...రాళ్లతో దాడి చేశారు. భారీగా మోహరించిన పోలీసులు అతికష్టం మీద వంశీ ఇంటి పరిసరాల నుంచి టీడీపీ గూండాలను తరిమికొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. వంశీ ఇంటిపైకి యార్లగడ్డ వెంకట్రావ్ మనుషులతో పాటు విజయవాడ సెంట్రల్ నుంచి గెలిచిన బొండా ఉమా కూడా తన గూండాలను పంపించి దాడి చేయించారని తెలుస్తోంది.టీడీపీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు , లోకేష్ కు టార్గెట్ లిస్ట్ లో ఉన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ ఇళ్ళపై అటాక్ చేయడం వల్ల అధిష్టానంతో పాటు చినబాబు దృష్టిలో తాము హీరోలుగా నిలుస్తామని...తద్వారా క్యాబినెట్ లో చోటు దక్కడం ఖాయమని యార్లగడ్డ వెంకట్రావు, వెనిగండ్ల రాము, బొండా ఉమా భావించారట. కట్ చేస్తే.. చంద్రబాబు మంత్రుల జాబితా ప్రకటించాక వారి ఆలోచనలు తారుమారై..ఆశలు ఆవిరయ్యాయట. కూటమి క్యాబినెట్ లో యార్లగడ్డకు కానీ ... వెనిగండ్ల రాముకి కానీ.. బోండా ఉమాకు కానీ చోటు దక్కపోవడంతో ముగ్గురూ షాక్‌కు గురయ్యారట. చినబాబును బుట్టలో వేసుకుందామని ఆలోచిస్తే... మొత్తానికే మోసం వచ్చిందని... ఇప్పుడేం చేయాలో అంటూ దిక్కులు చూస్తున్నారని కృష్ణా జిల్లాలో టాక్ నడుస్తోంది. -
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం... 24 మందితో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
అత్తింటి వేధింపులతో గర్భిణి బలవన్మరణం
పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ఓ గర్భిణి బలవన్మరణానికి పాల్పడింది. వారసుడు కావాలని అత్తింటివారు వేధించడంతో కడుపులో ఉన్న ఆడబిడ్డను చంపలేక తానే ప్రాణాలు తీసుకుంది. సీఐ టి.వి.వి.రామారావు కథనం మేరకు.. యనమలకుదురు పుట్టరోడ్డుకు చెందిన కావ్యశ్రీ (19)కి రెండేళ్ల కిందట విజయవాడ కండ్రికకు చెందిన సందు శ్రీకాంత్‌తో(31) వివాహమైంది. శ్రీకాంత్ సచివాలయంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. పదినెలల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన కావ్యశ్రీ, ఇటీవల మళ్లీ గర్భం దాల్చింది. ఆమెకు ప్రస్తుతం ఐదో నెల. భర్త శ్రీకాంత్ నాలుగు రోజుల క్రితం కావ్యశ్రీకి విజయవాడలో స్కానింగ్ చేయించగా, ఆడపిల్ల పుడుతుందని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో దంపతుల మధ్య గొడవ మొదలైంది. ఆడపిల్ల వద్దు, వారసుడే కావాలని కావ్యశ్రీపై భర్త శ్రీకాంత్‌తోపాటు అత్త వెంకటేశ్వరమ్మ, మామ లక్ష్మణరావు ఒత్తిడి తెచ్చారు. దీంతో భార్యాభర్తలు గత బుధవారం ఆస్పత్రికి వెళ్లగా, అబార్షన్ చేస్తే ప్రమాదమని డాక్టర్ హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. అయితే శ్రీకాంత్ స్నేహితుడు కానిస్టేబుల్ శ్యామ్ తన పరపతితో అబార్షన్ చేయిస్తానని చెప్పడంతో భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ మొదలైంది. అబార్షన్ చేయించుకోనని కడుపులో బిడ్డను చంపలేనని శుక్రవారం రాత్రి కావ్యశ్రీ తన భర్తకు తేల్చి చెప్పింది. శనివారం ఉదయం భార్యాభర్తలు మళ్లీ అబార్షన్ విషయమై చర్చించుకున్నారు. అనంతరం కావ్యశ్రీ స్నానానికి వెళ్తూ భర్తకు ఫోన్ ద్వారా ఓ మెసేజ్ చేసింది. ‘తాను వారసుడిని ఇవ్వలేనని,..కడుపులోని బిడ్డను చంపలేనని.. తనను ఛీదరించుకోవద్దని.. పదినెలల కుమార్తెను తన తల్లిదండ్రులే పెంచాలని..తనను క్షమించాలని’ ఆ మెసేజ్‌లో పేర్కొంది. కావ్యశ్రీ బాత్రూమ్ నుంచి ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో కటుంబసభ్యులు, భర్త బాత్రూమ్ తలుపులు తెరిచి చూడగా వెంటిలేటర్‌కు కావ్యశ్రీ ఉరేసుకుని కొనఊపిరితో ఉంది. ఆమెను వెంటనే కానూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ పరిస్థితి విషమించడంతో కావ్యశ్రీ ఆదివారం ఉదయం మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కావ్యశ్రీ భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.