సాక్షి, కృష్ణాజిల్లా: కంకిపాడు వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేపల వ్యాన్‌ను కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులను మచిలీపట్నం బలరాంపేటకు చెందిన చీలి ప్రభు(30) ,భానుప్రకాశ్ (26), చింత బాబీ(36)గా గుర్తించారు.
కారు మచిలీపట్నం వైపు వెళ్తుండగా, చేపల లోడుతో మచిలీపట్నం నుంచి విజయవాడ వైపు బొలేరో వ్యాన్ వెళ్తుంది. టైరు పేలడంతో డివైడర్ దాటుకుని వెళ్లి చేపల వ్యాన్‌ను కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. చేపల వ్యాన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment