kankipadu
-
జనం లేని పవన్ ‘పల్లె పండుగ’ సభ
విజయవాడ, సాక్షి: గ్రామాల్లో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసే ‘పల్లె పండుగ-పంచాయతీ వారోత్సవాలు’ రాష్ట్రం వ్యాప్తంగా ఇవాళ(సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా కంకిపాడులో సోమవారం డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘పల్లె పండుగ’ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సభలో జనం లేక ఖాళీ కూర్చిలు దర్శనమిచ్చాయి. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.JUST IN | No crowd at Deputy Chief Minister #PawanKalyan's Palle Panduga program in Kankipadu, Krishna district, on Monday.📹: G N Rao (@hindugnr1) pic.twitter.com/KsCfT77m6V— The Hindu (@the_hindu) October 14, 2024చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’ -
‘మణప్పురం’లో బంగారం మాయం
కంకిపాడు: కృష్ణా జిల్లా కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థలో ఖాతాదారులు తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. ఆ సంస్థ బ్రాంచ్ హెడ్ మరో వ్యక్తితో కలిసి ఏకంగా రూ.6కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను స్వాహా చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కంకిపాడు ఎస్ఐ కె.సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్రాంచ్‌లో 1,477 మంది ఖాతాదారులు 16 కిలోల బంగారు ఆభరణాలను తనఖా పెట్టి రుణాలు పొందారు. సోమవారం రాత్రి బ్రాంచ్ హెడ్‌గా ఉన్న పావని విధులు ముగించుకుని వెళ్లారు. ఆమె మంగళవారం విధులకు హాజరుకాలేదు. కొందరు ఖాతాదారులు తాము తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు విడిపించుకునేందుకు మంగళవారం మణప్పురం బ్రాంచ్‌కు వచ్చారు. వారు ఇచ్చిన రశీదుల ప్రకారం చూడగా, బ్రాంచ్‌లో ఆభరణాలు కనిపించలేదు. దీంతో సిబ్బంది తమ సంస్థ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కంకిపాడు బ్రాంచిలోని రికార్డులను పూర్తి స్థాయిలో పరిశీలించిన అనంతరం సంస్థ ఉన్నతాధికారులు అర్ధరాత్రి సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. జిల్లా ఎస్పీ జాషువా ఆదేశాలతో బుధవారం గన్నవరం డీఎస్పీ జయసూర్య, సీసీఎస్, కంకిపాడు, పెనమలూరు, ఉయ్యూరు పోలీసులు రంగంలోకి దిగి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తం 951 మంది ఖాతాదారులకు సంబంధించిన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించలేదని తేల్చారు. అపహరణకు గురైన బంగారు ఆభరణాల విలువ బహిరంగ మార్కెట్లో రూ.6కోట్లకు పైగా ఉంటుంది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం రూ.3.08 కోట్ల విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలు కనిపించడం లేదని మణప్పురం అధికారులు పేర్కొన్నారు. ఖాతాదారుల్లో ఆందోళన మణప్పురం కంకిపాడు బ్రాంచ్‌లో పది కిలోలకు పైగా బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు తెలియడంతో తనఖా పెట్టి రుణాలు తీసుకున్న ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నమ్మకంగా పని చేస్తున్న సిబ్బందే బంగారం చోరీ చేశారని తెలిసి నివ్వెరపోతున్నారు. మరోవైపు ఈ బ్రాంచ్‌లో సీసీ కెమెరాలు కూడా పని చేయడం లేదని పోలీసులు గుర్తించారు. రెండు నెలలుగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలిసినా పట్టించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మణప్పురం ఆఫీసు కింద ఉన్న షాపుల సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలే పోలీసుల విచారణకు తోడ్పడ్డాయి. బ్రాంచ్ హెడ్ పావని పనే... బంగారు ఆభరణాల చోరీ వెనుక బ్రాంచి హెడ్‌గా పనిచేస్తున్న రెడ్డి వెంకట పావని హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆమె సోమవారం రాత్రి విధులు పూర్తి^ó సుకున్న అనంతరం తనతోపాటు వచ్చిన మరో వ్యక్తితో కలిసి కార్యాలయం మూసివేసి కారులో వెళ్లినట్లు సీసీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించారు. సీసీ ఫుటేజ్‌లో కారు నంబరు ఆధారంగా దావులూరు టోల్గేట్ వద్ద వివరాలు సేకరించారు. ఈ మేరకు బంగారు ఆభరణాల చోరీలో పావనికి సహకరించిన వ్యక్తిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. -
మూడంతస్తుల మేడలో.. పావురాలతో 'ప్రేమలో'..
పావురం.. ప్రేమకు ప్రతిరూపం.. శాంతికి చిహ్నం. అటువంటి పావురాల పట్ల అపారమైన ప్రేమను పెంచుకున్న ఆయన వాటి కోసం ఏకంగా ఓ ప్రేమ మందిరాన్నే నిర్మించాడు. అందులో సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి, కంటికి రెప్పలా వాటిని చూసుకుంటున్నాడు. కృష్ణా జిల్లా మానికొండ గ్రామంలో పావురాలకు ఇల్లు కట్టిన ప్రేమికుడు చెరుకువాడ శ్రీనివాసరావు గురించి మీ కోసం ఈ కథనం. – సాక్షి, అమరావతి కంకిపాడు నుంచి గుడివాడ వెళ్లే మార్గం అది. అక్కడ మానికొండ వెంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో పచ్చని పొలాల నడుమ మూడంతస్తుల భవనం ఒకటి కనిసిస్తుంది. ఆ భవనాన్ని సమీపించే కొద్దీ ఓ వింతైన అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే అది కేవలం ఇల్లు కాదు. అదో పావురాల ప్రపంచం. మూడంతస్తుల ఆ మేడలో ప్రతి అంతస్తులోను ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన అరలు.. వాటిల్లో వందల రకాల పావురాలు సందడి చేస్తుంటాయి. పావురాల శత్రు ప్రాణులు కానీ, వాటి భక్షక ప్రాణులు కానీ ఆ భవనంలోకి ప్రవేశించలేవు. అంటే.. పిల్లి, డేగ వంటి జంతువులు బయటి నుంచి జొరబడకుండా ఇనుప కంచెతో కట్టుదిట్టమైన రక్షణ వలయం, ఆఖరికి దోమలు కూడా దూరకుండా దోమల మెష్ సైతం ఏర్పాటు చేసి ఉంటుంది. మన ఇళ్లలో ఉన్నట్లే వాటికి కూడా ప్రతి గదిలో ఫ్యాన్లు, లైట్లు ఉంటాయి. 20 రకాల గింజలతో పావురాలకు వేళకు బలమైన ఆహారం, వాటికి సుస్తీ చేస్తే మందులు వంటి ప్రత్యేక ఏర్పాట్లన్నీ ఉంటాయి. అంతేనా.. మ్యూజిక్ సిస్టం ఏర్పాటు చేసి ప్రతి ఉదయం తన ప్రేమ పక్షులకు ఆహ్లాదకరమైన సంగీతాన్ని కూడా వినిపిస్తున్నాడు పావురాల ప్రేమికుడు శ్రీనివాసరావు. అరుదైన జాతులు.. 1,150కి పైగా పావురాలు పావురాలకు మాత్రమే నిర్మించిన ఈ నిలయంలో అనేక జాతులకు చెందిన దాదాపు 1,150కి పైగా పావురాలు కనువిందు చేస్తాయి. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించే పావురాలతో పాటు యూరప్, అమెరికా, సింగపూర్, దుబాయ్, బంగ్లాదేశ్, బెల్జియం, చైనా, జర్మనీ తదితర దేశాలకు చెందిన వందకుపైగా అరుదైన జాతులను అనేక వ్యయ ప్రయాసలకోర్చి సేకరించారు శ్రీనివాసరావు. రూ.5 వేల నుంచి రూ.85 వేలు విలువ చేసే అరుదైన పావురాలను కొనుగోలు చేసి మరీ పెంచుతున్నారు. జెయింట్ హంగేరియన్, అమెరికన్ పాంకెయిన్స్, జాకోబిన్స్, షీల్డ్, వార్లెస్ హ్యుమర్స్, ఓరియంటల్ ఫెరల్, యూరోపియన్ లాహోర్, అమెరికన్ నన్స్, మాల్టీస్, సాండీల్ ముకీస్, చైనీస్ ఓవెల్స్, పెంచ్ మొడెనా, కింగ్స్, షేక్ షెర్లీ, అమెరికన్ ఎలిమెంట్స్, కాప్చినో, జర్మన్ బ్యూటీ హ్యుమర్, వాల్గట్ పౌటర్, హెన్నా పౌటర్, మూన్ మార్క్ పౌటర్, బోటెడ్ ఎల్మెంట్, పెషర్ వంటి అనేక జాతులకు చెందిన పావురాలను మనం ఇక్కడ చూడొచ్చు. నెమలి వలే పురి విప్పి ఆడేవి, తల నిండా జూలుతో ఆకర్షణీయంగా ఉండేవి, బూట్లు మాదిరిగా కాళ్ల నిండా ఈకలతో విలక్షణమైనవి, రంగు రంగుల రెక్కలు తొడిగినవి.. ఇలా ఇక్కడి విలక్షణమైన పావురాలన్నింటినీ చూసేందుకు మన రెండు కళ్లూ చాలవు. పావురం.. ప్రేమకు ప్రతిరూపం ప్రపంచ వ్యాప్తంగా పావురాలను ప్రేమకు, శాంతికి ప్రతిరూపంగా భావిస్తారు. రెండు పావురాలు జత కడితే ఇక జీవితాంతం ఆ రెండే కలిసి జీవిస్తాయి. జంటలోని ఒక పావురం అనుకోకుండా చనిపోతే మిగిలిన పావురం కూడా బెంగతో చనిపోతుంది లేదా చనిపోయే వరకు ఒంటరిగానే జీవిస్తుంది. అంతే తప్ప వేరొక పావురంతో ఎట్టి పరిస్థితిలోనూ జత కట్టదు. పావురం అంటే ప్రాణం ప్రేమంటే ఇద్దరు వ్యక్తులకు సంబంధించే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి, పక్షులు, జంతువులతోనూ మనకు ప్రేమానుబంధం ఉంటుంది. నాకు చిన్నప్పటి నుంచి పావురాలంటే ప్రాణం. తొలుత కొన్నింటిని ఇంటి వద్దే పెంచేవాడిని. 8 ఏళ్ల క్రితం ప్రత్యేకంగా వాటి కోసమే ఇల్లు నిర్మించాను. ఉదయాన్నే లేచి వాటిని చూడందే ఆ రోజు మొదలవ్వదు. వాటితో ఉంటే నా వ్యయప్రయాసలు, సమస్యలు అన్నీ మరిచిపోతుంటాను. అన్ని వందల పావురాల్లో ప్రతి పావురం నాకు ప్రత్యేకమే. ఏ ఒక్క పావురాన్ని వేరు చేసినా నేను గుర్తించగలను. నేను లేని సమయాల్లో నా భార్య పద్మావతి, కుమార్తె రవళి చాలా శ్రద్ధతో వాటిని సంరక్షిస్తారు. పావురాలతో నాకున్న అనుబంధాన్ని గౌరవించి నా కుటుంబసభ్యులు అందిస్తున్న సహకారం ఎనలేనిది. – చెరుకువాడ శ్రీనివాసరావు, మానికొండ, కృష్ణా జిల్లా మా నాన్నకు అవి కూడా పిల్లలే.. మేము పుట్టక ముందు నుంచే మా నాన్న పావురాలను పెంచుకుంటున్నారు. నేను, నా సోదరుడు సుధీర్ చదువుకుని స్థిరపడ్డాం. మాకు ఉండటానికి ఇల్లు కట్టినట్టే.. పావురాలకూ ప్రత్యేకంగా ఇల్లు కట్టిన మా నాన్నకు అవి అంటే ప్రాణం. అందుకే నేను వివాహమై అత్తగారింటికి వెళ్లినా, మా నాన్న పెంచుకుంటున్న పావురాలను భవిష్యత్‌లోనూ మేము సంరక్షించాలని నిర్ణయించుకున్నాం. ఇదే మా నాన్నకు మేమిచ్చే బహుమానం. – దాసరి రవళి, శ్రీనివాసరావు కుమార్తె -
శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
కంకిపాడు: ఇంటర్మీడియెట్ విద్యార్థి ఉరి వేసుకుని బలవన్మరణం చెందిన ఘటన కృష్ణా జిల్లా ఈడుపుగల్లులో బుధవారం చోటుచేసుకుంది. కంకిపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం పట్టణానికి చెందిన ఎం.స్నేహిత్ వర్మ (17) కంకిపాడు మండలం ఈడుపుగల్లులోని శ్రీచైతన్య శ్రీప్రభ క్యాంపస్‌లో సీనియర్ ఇంటర్ (బైపీసీ) చదువుతున్నాడు. బుధవారం మధ్యాహ్నం హాస్టల్ భవనంలో ఖాళీగా ఉన్న ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. (చదవండి: టమాటా ధర పైపైకి.. కిలో రూ.42) -
అత్తాకోడళ్లు చోరీ చేసి.. డైపర్‌లో దాచి..
కంకిపాడు: పట్టపగలు ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన అత్తాకోడళ్లను కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ డి.కాశీవిశ్వనాథ్ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. కంకిపాడు బస్టాండ్ సెంటరులోని ఓ ఇంట్లో పచ్చిపాల రత్న రామకోటేశ్వరరావు కుటుంబం ఉంటోంది. ఈనెల 23న ఉదయం రత్న రామకోటేశ్వరరావు ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చాడు. ఇంటి వెలుపల ఓ బాలింత రోజుల వయస్సు బిడ్డకు పాలిస్తూ కనిపించింది. తాళం తెరిచి ఇంట్లోకి వెళ్లిన రామకోటేశ్వరరావు ఇంట్లో ఫ్యాన్లు, టీవీ ఆన్‌లో ఉండడం, బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండడం, ఓ మహిళ ఇంట్లో వెతుకులాడుతుండడం చూసి నిర్ఘాంతపోయాడు. దీంతో ఇరుగుపొరుగువారిని పిలిచాడు. స్థానికులు ఇంట్లోని మహిళతోపాటు, బయట ఉన్న బాలింతనూ పట్టుకుని పోలీసులు అప్పగించారు. ఫిర్యాదుపై చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. చోరీ చేసి.. డైపర్‌లో దాచి.. ఈ ఇద్దరు మహిళలూ విజయవాడ మాచవరానికి చెందిన బోయపాటి ధనలక్ష్మి, బోయపాటి సాధ్వితని, వీరిద్దరూ వరుసకు అత్తాకోడళ్లని, పాతనేరస్తులని పోలీసులు గుర్తించారు. గతేడాది నవంబరులో సీసీఎస్ పోలీసులు పలు చోరీ కేసుల్లో ఈ ఇద్దరినీ అరెస్టు చేశారని, ఈ ఏడాది జనవరిలో జైలు నుంచి విడుదలయ్యారని తేల్చారు. అప్పట్లో అరెస్టయ్యేనాటికి గర్భిణిగా ఉన్న సాధ్విత ఈ నెల 8న ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. రోజుల వయస్సు ఉన్న బిడ్డతో సాధ్విత, ధనలక్ష్మి ఇద్దరూ మాచవరం నుంచి ఆటోలో కంకిపాడుకు వచ్చి తాళం వేసి ఉన్న ఇల్లును ఎంచుకుని మధ్యాహ్నం సమయంలో చొరబడ్డారు. బీరువాలో ఉన్న చెవి బుట్టలు, ఉంగరం, మేటీలు, వెండి వస్తువులు, రూ.6 వేలు నగదు అపహరించారు. చోరీ సొత్తును బిడ్డకు వేసిన డైపర్‌లో దాచారు. సాధ్విత ఇంటి బయటకు వచ్చేసి బిడ్డకు పాలిస్తుండగా, ధనలక్ష్మి లోపల ఇంకా ఏమైనా దొరుకుతాయేమోనని వెతుకుతున్న సమయంలో ఇంటి యజమాని రావడంతో నిందితులిద్దరూ పట్టుబడ్డారు. వీరి వద్ద చోరీ సొత్తును పోలీసులు రికవరీ చేశారు. వీరిద్దరిపైనా విజయవాడ పోలీసు కమిషనరేట్ పరిధిలో 6 కేసులు ఉన్నాయి. 200 తాళం చెవులు స్వాధీనం అత్తా కోడళ్లు పగటిపూటే చోరీలకు పాల్పడుతుంటారని, వీరి వద్ద చోరీకి వినియోగించే సుమారు 200 వరకూ ఇళ్ల తాళం చెవులను స్వాధీనం చేసుకున్నామని సీఐ కాశీ విశ్వనాథ్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించామని వివరించారు. సమావేశంలో ఎస్ఐ వై.దుర్గారావు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: పని చేయాలని చెప్పడమే పాపమైంది.. -
శ్రీచైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
సాక్షి, కంకిపాడు: కృష్ణా జిల్లాపునాదిపాడు శ్రీచైతన్య క్యాంపస్‌లో ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అనంతపురానికి చెందిన దాసరి లాస్యశ్రీ (16)ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతోంది. బుధవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోరంకిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.ఎస్ఐ వై. దుర్గారావు సహచర విద్యార్థులను విచారించారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీశారు. మృతురాలి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ దుర్గారావు తెలిపారు. -
పిల్లలకు ఎలుకలమందు పెట్టిన తల్లి
సాక్షి, కంకిపాడు: మతిస్థిమితం సరిగా లేక ఓ తల్లి తన పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి, తానూ తిన్న సంఘటన మండలంలోని పునాదిపాడులో చోటుచేసుకుంది. ఆత్మహత్యా యత్నం ఘటనపై స్థానిక పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మండలంలోని పునాదిపాడు గ్రామానికి చెందిన కనకభవానికి మతిస్థిమితం సరిగా లేదు. కనక భవాని పిల్లలు జ్యోతి ప్రసన్న (7), కుమార్ (5). మధ్యాహ్నం సమయంలో పిల్లలు ఇద్దరూ వాంతులు చేసుకోవటాన్ని స్థానికులు గమనించి తల్లి భవానీని ప్రశ్నించారు. ఎలుకల మందు తెచ్చి భోజనంలో కలిపి పిల్లలకు పెట్టి తానూ తిన్నానని చెప్పింది. వెంటనే తల్లిని, పిల్లలను వైద్యం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యసేవలు అనంతరం వారి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ప్రాణాపాయం లేదని పోలీసులు సమాచారం అందింది. ఈ మేరకు ఆసుపత్రి వర్గాల నుంచి అందిన సమాచారంతో ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వై.దుర్గారావు తెలిపారు. చదవండి: అమ్మ ఎక్కడంటే ఏం చెప్పాలి.. -
అదృశ్యమైన వృద్ధురాలు.. విగత జీవిగా..
సాక్షి, విజయవాడ : కంకిపాడు లాకుల వద్ద గుర్తు తెలియని ఓ వృద్ధురాలు మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని పెనమలూరుకు చెందిన పరిశె అమ్మనమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే వారంరోజుల క్రితం వృద్ధురాలు అమ్మనమ్మ ఇంట్లో నుంచి అదృశ్యమైనట్లు బంధువులు పెనమలూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అమ్మనమ్మ విగత జీవిగా కనిపించడంతో పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అంగన్వాడీ వంట.. ఇంటి పంట!
కంకిపాడు: అదొక అంగన్వాడీ కేంద్రం. అద్దె భవనంలో నడుస్తోంది. అయినా అక్కడ ఉన్న పెరడును సద్వినియోగం చేసుకుని నూట్రీ గార్డెన్‌ను ముచ్చటగా తీర్చిదిద్దారు. అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలను స్థానికంగానే సమకూర్చుకుంటున్నారు. న్యూటీ గార్డెన్ నిర్వహణతో మిగతా అంగన్వాడీ కేంద్రాలకూ ఆదర్శంగా నిలుస్తోంది కంకిపాడులోని ఐదో నంబరు అంగన్వాడీ కేంద్రం. స్థలం చిన్నదే.. ఈ అంగన్వాడీ కేంద్రం పట్టణంలోని రజక రామాలయం సమీపంలో నడుస్తోంది. ఈ కేంద్రానికి టీచరుగా వై.నళినీకుమారి, ఆయాగా బి.రజని విధులు నిర్వహిస్తున్నారు. కేంద్రానికి ఎదురుగా సుమారు అర సెంటు స్థలం ఉంది. ఈ స్థలంలో న్యూట్రీ గార్డెన్ ఏర్పాటు చేయాలని అంగన్వాడీ సిబ్బంది నిర్ణయించుకున్నారు. ఆలోచన వచ్చిందే తడువుగా విజయవాడ నుంచి కూరగాయల విత్తనాలను కొనుగోలు చేశారు. ఉన్న కొద్ది స్థలంలోనే బెండ, వంగ, మిర్చి, గోరుచిక్కుడు, వీటితో పాటు ఆకుకూరల విత్తనాలు చల్లారు. పోషకాలతో కూడిన ఆహారం కొద్ది రోజులుగా ఈ గార్డెన్లో పండిన ఆకుకూరలు, ఇతర కూరగాయలనే అంగన్వాడీ కేంద్రంలో కూరలు సిద్ధం చేసేందుకు వినియోగిస్తున్నారు. సేంద్రియ పద్ధతిలో కూరగాయలను పండిస్తున్నారు. ప్రతి రోజూ వంటలో ఆకుకూరలు, బెండకాయలు, వంకాయలు, చిక్కుడు వినియోగిస్తున్నారు. ప్రతి రెండు రోజులకు ఒకసారి పెరడును శుభ్రం చేస్తూ అంగన్వాడీ కేంద్రానికి అవసరమైన కూరగాయలు, ఆకుకూరలను సమకూర్చుకుంటున్నారు. అన్ని అంగన్‌వాడీకేంద్రాల్లోనూ గార్డెన్లు అన్ని అంగన్వాడీ కేంద్రాల వద్ద న్యూట్రీ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నాం. ఈ కేంద్రంలో నిర్వహణ చాలా బావుంది. ప్రతి ఒక్కరూ గార్డెన్ల నిర్వహణపై శ్రద్ధ వహించి చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య సంరక్షణకు బాధ్యతగా పనిచేయాలి.– జి.ఉమాదేవి, సీడీపీవో,కంకిపాడు -
ఎన్నో ప్రశ్నలు... మరెన్నో అనుమానాలు!
సాక్షి, కంకిపాడు (కృష్ణా) : గోదాము అగ్ని ప్రమాదం వ్యవహారంపై ఇంకా స్పష్టత లేదు. ప్రమాదంలో జరిగిన నష్టం ఎంత?, ప్రమాదానికి గల కారణాలు? ఏవీ తేలలేదు. అగ్నిమాపక శాఖకు పోలీసు శాఖ నుంచి నివేదిక చేరలేదు. పోలీసు శాఖకు బాధితులు స్పష్టమైన ఫిర్యాదు ఇవ్వలేదు. దీంతో విచారణ ఎంత వరకూ వచ్చిందంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.. అన్న చందంగా ఉంది. వివరాల్లోకి వెళితే... మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడులో బ్రిటానియా ఇండస్ట్రీస్, బ్రిటానియా డెయిరీలు శ్రీ వీవీఎన్‌ఎస్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో నడుస్తున్నాయి. గత మే ఆఖరులో అందుబాటులోకి వచ్చిన ఈ గోదాములో బ్రి టానియా సంస్థ ఉత్పత్తులను నిల్వ చేశారు. ఈనెల 3వ తేదీ తెల్లవారుజామున గోదాము అగ్నిప్రమాదానికి గురైంది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి కంపెనీ ప్రతినిధులు, అగ్నిమాపక శాఖకు సమాచారం తెలిపే లోపే మంటలు గోదామును చుట్టుముట్టాయి. గోదా ము పూర్తిగా కాలిపోయింది. అందులో నిల్వ ఉంచిన బ్రిటానియా ఉత్పత్తులు మసయ్యాయి. తేలని విచారణ.. ప్రమాదంలో రూ.4 కోట్లకుపైగా నష్టం వాటిల్లి ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే దీనిపై స్పష్టత లేదు. గోదాము ప్రాంగణాన్ని ఆ శాఖ డైరెక్టర్ జయరాం నాయక్, జిల్లా అగ్నిమాపక అధికారి అవినాష్ జయసింహ, ఇతర సిబ్బంది సందర్శించారు. అగ్నిమాపక శాఖ నుంచి ఎలాంటి అనుమతులు పొందలేదని డైరెక్టర్ జయరాం నాయక్ వెల్లడించారు. దీంతో పాటుగా అగ్నిప్రమాద నివారణకు ముందస్తు జాగ్రత్తలు కూడా ఏవీ చేపట్టలేదని వెల్ల డించారు. నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది స్పష్టమైంది. ఇదిలా ఉంటే గోదాము నిర్మాణానికి సంబంధించి సీఆర్డీఏకు ప్రతిపాదనలు పంపారు. అయితే గోదాము నిర్మాణం అనంతరం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఆ సంస్థలు పొందలేదు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌తోనే ఉత్పత్తులను గోదాములో భద్రపరచటానికి అవకాశం ఉంది. ఈ సర్టిఫికెట్ లేకుండా గోదామును ప్రారంభించి అందులో సరుకు నిల్వ చేయటం నిబంధనలకు విరుద్ధం. గోదాముకు అతి సమీపంలో రెండు అపార్టుమెంట్లలో పలువురు ప్రజలు నివాసం ఉంటున్నారు. గోదాము ఏర్పాటుకు సంబంధించి ఎన్వోసీ కూడా పంచాయతీ నుంచి తీసుకోలేదు. సీఆర్డీఏ సర్టిఫికెట్ అనంతరం ఆ దిశగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఆ సర్టిఫికెట్ రాలేదని, పలుమార్లు కబురు పంపినా స్పందన లేదని పంచాయతీ పూర్వ కార్యదర్శి లక్ష్మీ శివకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. కారణాలు తెలపని వైనం.. ఇదిలా ఉంటే బ్రిటానియా సంస్థ మాత్రం రూ.4 కోట్లు విలువైన సరుకు ప్రమాదంలో దగ్ధమైందని అగ్నిమాపక శాఖ అధికారులకు స్పష్టం చేసింది. అయితే ప్రమాదం ఎలా జరిగింది? అందుకు గల కారణాలు ఏంటి? అన్నది నేటికీ తేలలేదు. విద్యుత్ షార్టు సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన ముందు రోజు రాత్రి గోదాములో వెల్డింగ్ పనులు జరిగాయని, అందులో ఏవైనా నిప్పురవ్వలు పడటంతో అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై విచారణ సాగిస్తున్నట్లు అగ్నిమాపక శాఖ చెబుతోంది. అయితే పోలీసు శాఖ నుంచి ఎఫ్ఐఆర్ నమోదై, తద్వారా అగ్నిమాపక శాఖకు నివేదిక చేరాలి. నేటి వరకూ కంకిపాడు పోలీసు స్టేషన్లో ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. సంబంధిత ప్రతినిధులు పోలీసు స్టేషన్‌కు వచ్చి సరుకు నిల్వ, ప్రమాదంపై స్పష్టమైన ఫిర్యాదు ఇవ్వలేదని పోలీసు శాఖ చెబుతోంది. అయితే అగ్నిమాపక అధికారులు మాత్రం పోలీసు శాఖను ఆశ్రయించారని, వారం రోజుల్లో నివేదిక వస్తుందని, తద్వారా ప్రమాదంపై స్పష్టమైన వివరణ ఇస్తామని చెబుతున్నారు. ఈ రెండు శాఖల నడుమ వ్యక్తమవుతున్న వేర్వేరు ప్రకటనలు మొత్తంగా అగ్ని ప్రమాదం అంశంపై అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. అగ్ని ప్రమాదంలో గోదాము, అందులో నిల్వ చేసిన సరుకు మాత్రమే కాలిపోయాయి. అదే గోదాములో కానీ, పక్కనే ఉన్న అపార్టుమెంటు వాసులకు పొగ వల్ల ఏదైనా ప్రమాదం వాటిల్లితే దానికి బాధ్యులు ఎవరు?, చర్యలు ఏం తీసుకునేవారు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఎస్ఐ షరీఫ్‌ను వివరణ కోరగా ప్రమాదం జరగ్గానే గోదాము వద్దకు వెళితే అక్కడ సిబ్బంది నుంచి సహకారం అందలేదన్నారు. తర్వాత స్టేషన్‌కు వచ్చి స్పష్టమైన ఫిర్యాదు చేయలేదన్నారు. పూర్తి వివరాలతో ఫిర్యాదు ఇవ్వమని సూచించామని, నేటికీ ఫిర్యాదు తమకు అందలేదని వివరించారు. -
కొనసాగుతున్న విచారణ
సాక్షి, కంకిపాడు(పెనమలూరు): బిస్కెట్ కంపెనీ గోదాములో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ప్రమాదం ఎలా జరిగింది? నష్టం ఎంత వాటిల్లింది? అనే అంశాలపై ఇంకా స్పష్టత రాలేదు. అగ్నిమాపక శాఖ అధికారులు ఆ దిశగా విచారణ సాగిస్తున్నారు. మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడులో నిర్మించిన బ్రిటానియా బిస్కెట్ గోదాములో శనివారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించే లోపే మంటలు గోదామును చుట్టుముట్టి సర్వం బుగ్గిపాలైంది. గోదాము షట్టర్లకు తాళాలు ఉండటంతో ప్రమాద స్థాయి అధికంగా ఉండటంతో షట్టర్ల తాళాలు తీయటం సాధ్యం కాలేదు. దీంతో జేసీబీ సాయంతో గోదాము గోడలను ధ్వంసం చేయించారు. జిల్లాలోని ఆరు ప్రాంతాల నుంచి అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గోదాములో నిల్వ చేసిన సరుకు బూడిదైంది. గోదాము రేకులు మంటల ధాటికి కాలిపోయాయి. ఆదివారం కూడా గోదాము నుంచి పొగ వెలువడింది. కొనసాగుతున్న విచారణ.. అగ్ని ప్రమాదం ఘటనపై అగ్నిమాపక శాఖ దర్యాప్తు సాగిస్తోంది. ప్రమాదం విద్యుత్ షార్టు సర్క్యూ వల్ల జరిగిందా? గోదాములో నిర్వహించిన వెల్డింగ్ పనులు వల్ల ఏర్పడిందా? మరేదైనా కారణమా? అన్న వివిధ కోణాల్లో ఆ శాఖ విచారణ చేస్తుంది. ఆదివారం కూడా ప్రమాదం జరగటానికి గల కారణాలు వెలుగులోకి రాలేదు. ప్రమాదంలో ఏర్పడ్డ నష్టం వివరాలు కూడా తేలలేదు. అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోకపోవటం, ప్రమాద నివారణ జాగ్రత్తలు చేపట్టకపోవటంతో అగ్నిప్రమాద స్థాయి, నష్ట తీవ్రత అధికంగా ఉన్నాయన్న వాదన అగ్నిమాపక శాఖలో వ్యక్తమవుతుంది. అన్ని అనుమతులు ఉన్నాయా? బ్రిటానియా కంపెనీ ఉత్పత్తులు నిల్వ చేసిన గోదాముకు పూర్తి స్థాయి అనుమతులు ఉన్నాయా? అనే అనుమానాలు ప్రస్తుతం వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు లేవని ఆ శాఖ డైరెక్టర్ జయరాం నాయక్ ఇప్పటికే వెల్లడించారు. మరో వైపు మే నెలలో గోదాములో సరుకు నిల్వ చేయటం ప్రారంభించారని తెలుస్తుంది. సీఆర్డీఏ నుంచి గోదాము నిర్మాణానికి అనుమతులు కోసం పంచాయతీని సంప్రదించారని, తరువాత పూర్తి స్థాయి అనుమతులు వచ్చాక ఎన్వోసీ కోసం ఎలాంటి అనుమతి పత్రాలను ప్రొద్దుటూరు పంచాయతీకి అప్పగించలేదని సమాచారం. కనీసం అగ్నిప్రమాదం సంభవిస్తే ప్రమాద నివారణకు సైతం ముందస్తు చర్యలు తీసుకోకపోవటం వల్ల నష్టం భారీగా సంభవించిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఈ విషయమై ప్రొద్దుటూరు పంచాయతీ పూర్వ కార్యదర్శి శివకృష్ణను వివరణ కోరగా, సీఆర్డీఏ అనుమతులు కోసం పంచాయతీని సంప్రదిస్తే అందుకు అవసరమైన తీర్మానం ఇచ్చామన్నారు. అయితే పూర్తి అనుమతులకు సంబంధించి ఎలాంటి ప్రతులు తమకు అందలేదన్నారు. అనుమతి పత్రాలు, పన్నుల విధింపులకు పలుమార్లు కంపెనీ ప్రతినిధులను సంప్రదించినా స్పందించలేదన్నారు. -
బిస్కెట్ల గోదాములో అగ్నిప్రమాదం
సాక్షి, కంకిపాడు(కృష్ణా) : అగ్నికీలల ధాటికి సర్వం బూడిదైంది. కోట్ల రూపాయల ఆస్తి అగ్నికి అర్పణమైంది. మండలంలోని ప్రొద్దుటూరు శివారు కొణతనపాడు అడ్డరోడ్డు సమీపంలోని బిస్కెట్ గోదాములో శనివారం తెల్లవారుఝామున భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో రూ.4కోట్లుపైగా ఆస్తినష్టం వాటిల్లి ఉండొచ్చని అంచనా. వివరాల్లోకి వెళితే...కొణతనపాడు పరిధిలోని పంట పొలాల్లో జాతీయ రహదారి వెంబడి శ్రీ వీవీఎన్‌ఎస్ లాజిస్టిక్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబంధించిన గోదాములు ఉన్నాయి. ఇందులో బ్రిటానియా ఇండస్ట్రీస్, బ్రిటానియా డైరీ నడుస్తున్నాయి. బ్రిటానియా ఉత్పత్తులను ఈ గోదాములో భద్రపరుస్తారు. ఈ ఏడాది మే ఆఖరున గోదామును ప్రారంభించి ఆ సంస్థకు చెందిన ఉత్పత్తులను గోదాములో నిల్వ చేస్తున్నారు. అర్ధరాత్రి ప్రమాదం... శుక్రవారం రాత్రి 7.30 గంటలు దాటాక కార్మికులు గోదాము షట్టర్లు దించి తాళాలు వేశారు. అర్ధ రాత్రి దాటాక గోదాములో మంటలు చెలరేగాయి. స్థానికంగా విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ సిబ్బంది ప్రమాదాన్ని గుర్తించి సమీపంలో ఉన్న అపార్టుమెంటులో నివాసం ఉంటున్న కంప్యూటరు విభాగం సిబ్బందికి తెలిపారు. విషయం తెలుసుకున్న కంకిపాడు పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. గోదామును మంటలు చుట్టుముట్టాయి. ఎగిసిపడుతున్న మంటలు, బిస్కెట్లు«, ప్లాస్టిక్ దగ్ధమై నల్లని పొగ వెలువడింది. ఆరు ఫైర్ఇంజిన్ల ద్వారా అదుపు వ్యాపిస్తున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఆ శాఖ డైరెక్టర్ కె.జయరాం నాయక్, డీఎఫ్ఓ అవినాష్ జయసింహ, అసిస్టెంట్ డీఎఫ్ఓ అమర్లపూడి శేఖర్ల పర్యవేక్షణలో ఉయ్యూరు, ఆటోనగర్, విజయవాడ మెయిన్, గుడివాడ, పామర్రు, గన్నవరం ప్రాంతాలకు చెందిన అగ్ని మాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసేందుకు యత్నించాయి. అయితే గోదాములో సరుకు నిల్వ చేసిన తరువాత చుట్టూ ఉన్న షట్టర్లకు తాళాలు వేశారు. మంటలు వ్యాపించటంతో షట్టర్ల తాళాలు తీయటం సాధ్యం కాలేదు. దీనికి తోడు ఎగిసిపడ్డ మంటలతో గోదాము పైకప్పు కమురుకుపోయి కూలిపోయింది. ఇనుప గడ్డర్లు సైతం ధ్వంసం అయ్యాయి. దీంతో గోదాము లోపల ఉన్న బిస్కెట్ బాక్సులుదగ్ధం కాకుండా నిరోధించటం సాథ్యం కాలేదు. తెల్లవారుఝామున 6 గంటలు దాటాక పొక్లెయిన్ సహాయంతో గోదాము గోడలను ధ్వంసం చేసి షట్టర్లను తొలగించటంతో అగ్నిమాపకసిబ్బంది మంటలను అదుపు చేయటానికి వీలు ఏర్పడింది. ప్రమాద కారణాలపై విచారణ గోదాములో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవటంపై అగ్నిమాపక శాఖ విచారణ చేపట్టింది. విద్యుత్ షార్టు సర్క్యూటే ప్రమాదానికి కారణం అయి ఉంటుందన్న భావన వినిపిస్తుంది. అయితే శుక్రవారం రాత్రి వెల్డింగ్ పనులు గోదాములో జరిగాయని, పనులు పూర్తయ్యాక షట్టర్లు మూశారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఏదైనా నిప్పు రవ్వలు బిస్కెట్ నిల్వలపై పడి క్రమేపీ రాజుకుని ప్రమాదం చోటుచేసుకుందా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గోదాము, అందులో నిల్వ ఉంచిన సరుకు సుమారుగా రూ.4 కోట్లపైగా నష్టం జరిగి ఉంటుందని అందులో పనిచేసే ఉద్యోగి ఒకరు చెప్పారు. కారణాలు, నష్టంపై వివరాలు సేకరిస్తున్నారు. నిర్లక్ష్యమే కొంప ముంచిందా ? నిర్లక్ష్యం కొంప ముంచిందా? అంటే అవుననే అంటున్నారు అగ్నిమాపక శాఖ సిబ్బంది. గోదామును నిర్మించి ఈ ఏడాది మేలో ప్రారంభించారు. ఇంకా గోదాము విస్తరణ, వసతుల కల్పన పనులకు వెల్డిండ్ పనులు చేపట్టారు. గోదాము నిర్వహణపై సీఆర్డీఏ పరిశీలన కూడా మరో రెండు రోజుల్లో జరగాల్సి ఉంది. ఇది పూర్తికాకుండానే ప్రమాదంలో గోదాము దగ్ధమైంది. అగ్నిమాపక శాఖ నుంచి ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు లేవని గుర్తించారు. ఆ శాఖ నుంచి అనుమతులు లేవని స్వయానా ఆ శాఖ డైరెక్టర్ జయరాం నాయక్, అసిస్టెంట్ డీఎఫ్ఓ శేఖర్లు వెల్లడించారు. దీన్ని బట్టి ప్రమాద తీవ్రత నివారణ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ప్రమాదం తీరుపై విచారణ సాగిస్తామని అధికారులు తెలియజేశారు. స్థానికుల ఆందోళన నివాస ప్రాంతాల నడుమ ఏర్పాటుచేసిన గోదాములో సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవటంపై స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అర్థరాత్రి ఎగిసిపడ్డ మంటలను చూసి గోదాము సమీపంలో ఉన్న మూడు అపార్టుమెంట్లు, ఓ ప్రైవేటు కళాశాల వసతిగృహంలో విద్యార్థులు భీతిల్లారు. అగ్ని ప్రమాద నివారణకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది చొరవతో మంటలు అదుపులోకి రావటంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. -
ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి సారించాలి
సాక్షి, కంకిపాడు: ఎన్నికల కోడ్ అమలుపై దృష్టి పెట్టాలని విజయవాడ సబ్‌కలెక్టరు, నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి మిషా సింగ్ ఆదేశించారు. మంగళవారం ఆమె కంకిపాడులో పర్యటించారు. గోసాల సెంటరులో ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న వాహనాల వివరాలను తెలుసుకున్నారు. అనంతరం బస్టాండు సెంటరులో ప్రచారంలో ఉన్న వాహనాన్ని సిబ్బందితో తనిఖీ చేయించి అనుమతులు తీసుకున్నారో? లేరో? పరిశీలించారు. అనుమతులు లేని ఓ ప్రచార వాహనాన్ని మండల పరి షత్ కార్యాలయానికి తరలించారు. తహసీల్దార్ మమ్మీ, స్క్వాడ్ ప్రతినిధి లక్పతి, ఇతర సిబ్బందితో సబ్‌కలెక్టరు మాట్లాడారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. నిబంధనలు పాటించకుండా ప్రచారం సాగిస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోగోలు తొలగించండి ఈడుపుగల్లు(కంకిపాడు):విద్యాశాఖ ద్వారా పంపిణీ చేయనున్న సైకిళ్లపై ప్రభుత్వ లోగోలను తొలగించాలని విజయవాడ సబ్ కలెక్టరు మిషాసింగ్ ఆదేశించారు. ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా సీఎం, మంత్రి ఉన్న ఫోటోలతో ఉన్న లోగోను సైకిళ్లపై అమర్చి విద్యార్థినులకు పంపిణీకి సన్నాహాలు చేయడంతో అధికా రులు నిలుపుదలచేయించిన విషయం తెలిసిందే. దీంతో ఈడుపుగల్లు జెడ్పీహైస్కూల్లో అందుబాటులో ఉంచిన సైకిళ్లను మంగళవారం ఆమె పరిశీలించారు. విద్యాశాఖ ద్వారా పంపిణీ జరుగుతున్నందున ప్రభుత్వ లోగోలు తొల గించాలన్నారు. జిల్లా విద్యాశాఖ నుంచి పంపిణీ తేదీ తీసుకుని లబ్ధిదారులకు సైకిళ్లు అందించాలని, లోగోలను పోలీ సుస్టేషన్‌లో అప్పగించాలని అధికారులను ఆదేశించారు. -
హత్యాయత్నమా?... ఆత్మహత్యాయత్నమా...?
కంకిపాడు (పెనమలూరు) : రక్తపు మడుగులో ఓ యువకుడు అపస్మారక స్థితిలో పడి ఉన్న ఘటన మండల కేంద్రమైన కంకిపాడులో మంగళవారం చోటు చేసుకుంది. హత్యాయత్నం జరిగిందా?, లేక ఆత్మహత్యాయత్నం చేశాడా? కారణాలు ఏమిటి? అన్నవి ప్రశ్నలుగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పట్టణంలోని లాకురోడ్డు మద్యం దుకాణం వెనుక రోడ్డులో రియల్ వెంచర్ ఉంది. ఈ వెంచర్‌లోని ఓ ఖాళీ రేకుల షెడ్డులో రక్తపు మడుగులో ఓ యువకుడు పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. యువకుడు రక్తపు మడుగులో ఎడమ చెవికి గాయమై అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. మద్యం అధికంగా సేవించి ఉన్నట్లు నిర్ధారించారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి (30) ని 108 అంబులెన్స్‌లో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డ వ్యక్తి వివరాలు లభ్యం కాలేదు. హత్యాయత్నమా?... ఆత్మహత్యాయత్నమా...? ఘటన వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం సేవించేందుకు తరచూ ఇక్కడ ఉన్న వెంచర్లోకి మందుబాబులు వెళ్తుంటారు. అలాగే వెళ్లిన వ్యక్తుల్లో మద్యం తాగాక ఘర్షణ ఏర్పడి దాడికి దారి తీసిందా?, లేక మద్యం మత్తులో తనకు తాను గాయపర్చుకున్నాడా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మద్యం దుకాణం వద్ద, లాకు రోడ్డు కూడలి ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ సేకరిస్తే కొంత సమాచారం తెలిసే అవకాశం ఉంది. దీంతో పాటు అపస్మారక స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తెలివిలోకి వస్తే ఏం జరిగిందో తెలుస్తుంది. ఘటనపై వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు. -
రఘువీరారెడ్డి అరెస్ట్.. పీఎస్‌కు తరలింపు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేస్తున్నవారిని సీఎం చంద్రబాబు అరెస్ట్ చేయించడం దారుణమని పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడ జాతీయ రహదారిపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. పోలీసులు ఆయనతో పాటు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి కంకిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ... ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. చంద్రబాబు తన కేసుల కోసమే కేంద్రానికి ప్రత్యేక హోదా తాకట్టు పెట్టారని ఆరోపించారు. చంద్రబాబుకు సిగ్గుంటే ముందు తన కేంద్ర మంత్రులు, ఎంపీలతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. హైవేపై ఆగిన ట్రాఫిక్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కడప-తిరుపతి జాతీయ రహదారిని కాంగ్రెస్ నాయకులు దిగ్బంధించారు. దీంతో ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. -
బస్సును ఓవర్టేక్ చేసి..
కంకిపాడు: ముందున్న బస్సును ఓవర్టేక్ చేయబోయే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని బైక్ ఢీకొట్టటంతో ఇద్దరు చనిపోయారు. కంకిపాడు మండలం ఉప్పులూరులో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కుంచెపు భీమయ్య, లక్ష్మణరావు, ఉప్పు వీరాస్వామి బైక్‌పై హనుమాన్‌పేట వైపు వెళ్తున్నారు. వారు తమ ముందున్న బస్సును ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న లారీని వేగంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో భీమయ్య, లక్ష్మణరావు అక్కడికక్కడే చనిపోగా వీరాస్వామి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని వెంటనే విజయవాడ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ విజయభాస్కర్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
దొంగల బీభత్సం... మహిళ దారుణ హత్య
కంకిపాడు: కృష్ణాజిల్లా కంకిపాడు మసీదు సెంటర్లో బుధవారం వేకువజామున దారుణం జరిగింది. కర్రి శ్రీదేవి అనే మహిళ ఒంటరిగా ఇంట్లో వుండటంతో దొంగలు చోరీకి ప్రయత్నించారు. అడ్డు వచ్చిన శ్రీదేవిని గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న 70 కాసుల బంగారం, 4 లక్షల నగదు ఆపహరించారు. మృతురాలి కుటుంబసభ్యులు తెల్లవారు జామున వచ్చి చూస్తే శ్రీదేవి మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. రాజమండ్రికి చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి దంపతులు పదేళ్ళ కిందట కంకిపాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే శ్రీనివాసరెడ్డి తన కుమారుడు సతీష్ రెడ్డితో కలిసి తరచూ క్యాంప్‌లకు వెళ్లుతుంటాడు. ఇది గమనించిన నిందితులు శ్రీదేవి ఒంటరిగా వున్న సమయం చూసి ఆమెపై దాడిచేసి, ఇంట్లోని సొత్తును చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటుచేశారు. ఈ హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. -
కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం
-
కృష్ణా జిల్లాలో దోపిడి దొంగల బీభత్సం
కంకిపాడు (కృష్ణాజిల్లా) : కృష్ణాజిల్లా కంకిపాడు మసీదు సెంటర్ లో బుధవారం వేకువజామున దారుణం జరిగింది. కర్రి శ్రీదేవి అనే మహిళ ఒంటరిగా ఇంట్లో వుండటంతో దొంగలు చోరీకి ప్రయత్నించారు. ప్రతిఘటించిన శ్రీదేవిని గొంతు కోసి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న 70 కాసులు బంగారం .4 లక్షల నగదు ఆపహరించారు. మృతురాలి కుటుంబసభ్యులు తెల్లవారుజామున వచ్చి చూసే సరికి శ్రీదేవి మృతదేహం కనిపించింది. వెంటనే వారు కంకిపాడు పోలీసులకు సమాచారం అందించారు. రాజమండ్రికి చెందిన కర్రి శ్రీనివాసరెడ్డి, శ్రీదేవి దంపతులు పదేళ్ళ కిందట కంకిపాడుకు వచ్చి స్థిరపడ్డారు. ఫైనాన్స్ వ్యాపారం చేసే శ్రీనివాసరెడ్డి తన కుమారుడు సతీష్ రెడ్డితో కలిసి తరచూ క్యాంప్ లకు వెళుతుంటాడు. ఇది గమనించిన నిందితులు శ్రీదేవి ఒంటరిగా వున్న సమయం చూసి ఆమెపై దాడిచేసి, ఇంట్లోని సొత్తును చోరీ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీములు ఏర్పాటుచేశారు. ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. -
హక్కుల సాధనకు ఐక్య ఉద్యమం
కంకిపాడు : హక్కుల సాధనకు రజక వృత్తిదారులు ఐక్యంగా ఉద్యమించాలని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య పిలుపునిచ్చారు. రజకవృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా 3వ మహాసభలు కంకిపాడులోని కోదండ రామ కల్యాణ మండపంలో ఆదివారం జరిగాయి. చిక్కవరపు వెంకట రెడ్డియ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో భాస్కరయ్య మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పాలకులు విస్మరించారని విమర్శించారు. రజక ఫెడరేషన్‌కు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని రూ.వెయ్యి కోట్ల బడ్జెట్‌ను కేటాయించాలని డిమాండ్ చేశారు. 50 ఏళ్లు పైబడిన వృత్తిదారులకు నెలకు రూ.2,500 పింఛను ఇవ్వాలన్నారు. ఆర్థిక వివక్ష, రాజకీయ, సామాజిక వెనుకబాటులో రజకులు ఉన్నారన్నారు. రజకుల సంక్షేమాన్ని పాలకులు పట్టించుకోకపోతే బంగాళాఖాతంలో కలిపేయాలని సూచించారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం సంఘటితంగా ఉద్యమించాలని కోరారు. నిర్ధిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని ఆందోళనలు చేపట్టాలని సూచించారు. మహాసభలో రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నమరివేడు గురుశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాటూరి నాగభూషణం, బాపట్ల సుబ్బారావు, విజయవాడ నగర కార్యదర్శి కె.శ్రీనివాసరావు, జిల్లా కమిటీ సభ్యురాలు కాకర్ల బుజ్జి, చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నర్సింహారావు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక రజక వృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా చిక్కవరపు వెంకట రెడ్డియ్య (మచిటీపట్నం), ప్రధాన కార్యదర్శిగా కాటూరి నాగభూషణం (మచిలీపట్నం), ఉపాధ్యక్షులుగా బాపట్ల సుబ్బారావు(ఉయ్యూరు), బోగిరెడ్డి వెంకట శ్యామ్ (మచిలీపట్నం), వెంట్రప్రగడ వెంకటేశ్వరరావు(అవనిగడ్డ)ను ఎన్నుకున్నారు. సహాయ కార్యదర్శిగా పెడసనగంటి పాండురంగారావు (తాడిగడప), సత్యకోలు శ్రీనివాసరావు (ముదినేపల్లి), పి.రాంబాబు (గుడ్లవల్లేరు), కోశాధికారిగా కోడూరు పరశురామయ్య (ఉయ్యూరు), మరో 39 మందితో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నూతన అధ్యక్షుడు వెంకట రెడ్డియ్య తెలిపారు. -
చంద్రబాబూ... నీకు చాకిరేవే
కంకిపాడు: రజకులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి చాకిరేవేనని ఏపీ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మన్నూరు భాస్కరయ్య హెచ్చరించారు. శనివారం రజక వృత్తిదారుల సంఘం తూర్పు కృష్ణాజిల్లా మూడో మహాసభలను పురస్కరించుకుని కంకిపాడులో భారీ ప్రదర్శన, మార్కెట్‌యార్డులో బహిరంగ సభ నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు చిక్కవరపు వెంకట రెడ్డియ్య అధ్యక్షతన జరిగిన సభలో భాస్కరయ్య మాట్లాడుతూ చంద్రబాబు సర్కారు రజకులను మోసం చేస్తోందని ఆరోపించారు. మూడు బడ్జెట్లలో రజకులకు కేవలం రూ. 125 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల రజక కుటుంబాల్లో 75 శాతం మందికిపైగా వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయన్నారు. భద్రత కరువైన రజక మహిళలు రజక మహిళలపై దాడులు, అత్యాచారాలు పెరిగిపోతున్నా పాలకులు పట్టించుకోవటం లేదని భాస్కరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు పెద్ద పీట వేస్తామని చెప్పుకుంటున్నారే తప్ప ఆచరణలో బీసీ వర్గంలో కూడా కనీస గుర్తింపు లేకుండా పోయిందని వాపోయారు. శీతాకాల సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు మాదిరిగా రజకుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం చేయాలని, రజక ఫెడరేషన్‌కు రూ వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలోనూ మేలు చేయకపోతే తగిన గుణపాఠం చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం. రామకృష్ణ, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్న మరివేడు గురుశేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటూరి నాగభూషణం, బాపట్ల సుబ్బారావు, కంకిపాటి వీరరాఘవయ్య, అవనిగడ్డ వెంకటేశ్వరరావు, పెడసనగంటి రంగారావు, కూడేటి సాయి, చిక్కవరపు నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య
కంకిపాడు : ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రమైన కంకిపాడులో బుధవారం చోటుచేసుకుంది. ఓ మహిళ ఇంటి తలుపు కొట్టాడని నమోదైన కేసులో పోలీసులు కొట్టడం వల్లే తన భర్త చనిపోయాడంటూ మృతుడి భార్య ఆరోపిస్తుంది. వివరాల్లోకి వెళితే...దివిసీమకు చెందిన బొంగు చిన్నా (32) చిన్నతనంలోనే కంకిపాడుకు వచ్చాడు. స్థానికంగా ఉన్న ఇబ్రహీం అనే హోటలు యజమని అతడ్ని చేరదీసి, పెళ్లి చేశాడు. చిన్నా, స్వప్న దంపతులకు సాయిశ్రీ గాయత్రి (10), పవన్ (7) సంతానం. మూడు రోజులు క్రితం ఓ కేసు విషయమై చిన్నా పోలీసుస్టేçÙన్కు వెళ్లాడు. కేసు నమోదు కావడంతో బుధవారం కోర్టుకు వెళ్లి జరిమానా కూడా కట్టాడు. మధ్యాహ్నం 2 గంటల తరువాత భార్య స్వప్న ఇబ్రహీం హోటల్లో పనిచేసేందుకు వెళ్లింది. భోజనం కూడా చేయకుండా చిన్నా పడుకున్నాడని, వెళ్లి చూడమని ఇబ్రహీంతో చెప్పింది. దీంతో ఇబ్రహీం చిన్నా ఇంటికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని వేళ్లాడుతూ కన్పించాడు. దీంతో స్థానికులకు విషయం పోలీసులకు తెలియజేశారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం తరలింపులో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మృతికి కారణమైన మహిళను అరెస్టు చేయాలంటూ పలువురు స్థానిక మహిళలు పోలీసులను డిమాండ్ చేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హనీష్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. నా భర్త చావుకు కారణం వాళ్లే... తాను, తన భర్తతోపాటు కలిసి çహోటల్లో పనిచేసే ఓ మహిళతో చిన్నాకు వివాహేతర సంబంధం ఉందని తెలిసిందని, మూడు రోజుల క్రితం మద్యం తాగి ఆమె ఇంటికి వెళ్లి తలుపు కొడితే ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని మృతుడి భార్య స్వప్న కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆ కేసులో పోలీసులు పిలిచి కొట్టారని, కోర్టులో ఫైన్ కట్టి వచ్చి ఉరివేసుకున్నాడని వాపోయింది. తన భర్త చావుకు వాళ్లే కారణమని, తనకు, తన పిల్లలకు న్యాయం జరిపించాలని విలపించింది. -
కాటూరులో వ్యక్తి దారుణ హత్య
కంకిపాడు (కృష్ణా జిల్లా) : ఉయ్యూరు మండలం కాటూరులో జాగర్లమూడి నాని బాబు(42) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అదే గ్రామానికి చెందిన మహంకాళి అనే వ్యక్తి శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో నానిబాబుని కత్తితో పొడిచి చంపాడు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ప్రారంభం
ఈడుపుగల్లు (కంకిపాడు) : గ్రామ పరిధిలోని ఆర్కే వ్యాలీ భవనంలో ఏర్పాటు చేసిన కమిషనర్ కార్యాలయాన్ని రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్‌కల్లం బుధవారం ప్రారంభించారు. వివిధ విభాగాధిపతుల చాంబర్లను పరిశీలించారు. అనంతరం కమిషనర్ చాంబర్లో ఆ శాఖ ఉద్యోగులతో ఇష్టాగోష్టి నిర్వహించారు. అజయ్‌కల్లం మాట్లాడుతూ దసరాకు పూర్తి స్థాయిలో ప్రభుత్వ శాఖలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్ జే శ్యామలరావు, కమిషనర్ కార్యదర్శి సీ నాగరాణి, అడినల్ సీసీ జీ వెంకటేశ్వర్లు, పంపాపతి, జాయింట్ కమిషనర్ యు.ఏడుకొండలు, డిప్యూటీ కమిషనర్లు రఘునాథ్, వై.కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. -
ఇళ్ల జోలికొస్తే ఖబడ్దార్
కంకిపాడు : రాజధాని ప్రాంతమైన విజయవాడను అందంగా తీర్చిదిద్దే పేరుతో కాల్వగట్ల వాసులను తొలగించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కొలుసు పార్థసారధి అన్నారు. ఇళ్ల తొలగింపునకు పూనుకుంటే మాత్రం ‘ఖబడ్దార్ చంద్రబాబు, పేదల పక్షాన ఉద్యమిస్తాం’ అని హెచ్చరించారు. కంకిపాడులోని పార్టీ కార్యాలయంలో గురువారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. అభివృద్ధి, సుందరీకరణ పేరుతో ఇళ్ల కూల్చివేతకు కుట్రపన్నుతున్నారన్నారు. భగవంతుడు, దేవుడి ఆలయాలకే దిక్కులేదని, భగవంతుడి విగ్రహాలను స్టోర్‌రూమ్‌లో పడేసిన టీడీపీ ప్రభుత్వం, తమను కూడా రోడ్డుకు లాగుతుందేమో అని పేదలు భయపడుతున్నారన్నారు. ఇళ్లు తొలగింపునకు పూనుకుంటే మాత్రం చూస్తూ ఊరుకోమన్నారు. ప్రభుత్వం తగిన మూల్యం చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇళ్లు తొలగించాక వారికి ఎక్కడ స్థలాలు చూపుతావో చెప్పు అని ప్రశ్నించారు. అర్హులైన ప్రతి మనిషికి ఐదు కిలోలు రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంక్షేమ పథకాలను పేదలకు అందించాలని, లేదంటే ప్రజలే తరిమి కొడతారని హెచ్చరించారు. పుష్కర పనుల్లో వేల కోట్ల అవినీతి పుష్కర పనుల్లో టీడీపీ వేల కోట్లు అవినీతికి పాల్పడుతోందని పార్థసారధి విమర్శించారు. వేల కోట్లు ఖర్చు ప్రజల కోసమా? ప్రచార ఆర్భాటం కోసమా? అని ప్రశ్నించారు. కృష్ణానది ప్రవాహం వెంబడి ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఘాట్లు ఏర్పాటుచేసి పుష్కరాలకు ఏర్పాట్లు చేయకుండా భక్తులను విజయవాడ రప్పించే ప్రయత్నం చేయటం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. అభివృద్ధి కోసం కేటాయించిన కోట్లాది రూపాయలు కేవలం పుష్కరాల 12 రోజులు కోసం మాత్రమే కాదని, అభివృద్ధి శాశ్వత ప్రాతిపదికగా జరగాలని సూచించారు. పుష్కర పనుల్లో జరిగిన అవినీతిపై నిజాయితీపరుడైన అధికారితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ, బీజేపీల నాటకాలు ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ విజయవంతమైందన్నారు. టీడీపీ ఎంపీలు ఓ వైపు పార్లమెంటులో ధర్నాలు చేస్తూనే మరో వైపు హోదా రాదంటూ ప్రజల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, టీడీపీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. సమావేశంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బండి నాంచారయ్య, పెనమలూరు నియోజకవర్గ నేత తుమ్మల చంద్రశేఖర్, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బాకీ బాబు, ముసలయ్య, జే. నాగేశ్వరరావు పాల్గొన్నారు.