
సాక్షి, విజయవాడ : కంకిపాడు లాకుల వద్ద గుర్తు తెలియని ఓ వృద్ధురాలు మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని పెనమలూరుకు చెందిన పరిశె అమ్మనమ్మగా పోలీసులు గుర్తించారు. అయితే వారంరోజుల క్రితం వృద్ధురాలు అమ్మనమ్మ ఇంట్లో నుంచి అదృశ్యమైనట్లు బంధువులు పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అమ్మనమ్మ విగత జీవిగా కనిపించడంతో పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.