penamaluru
-
రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పదవుల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నియామకాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రెండు నియోజకవర్గాలకు వైఎస్సార్సీపీ ఇన్‌చార్జ్‌ల నియామకం జరిగింది.వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా జోగి రమేష్, పెనమలూరు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా దేవభక్తుని చక్రవర్తిలను నియమించారు.కాగా, ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా, అనుబంధ విభాగాలకు అధ్యక్షులుగా మరికొందరిని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించిన సంగతి తెలిసిందే. మొత్తం 15 విభాగాలకు అధ్యక్షులను నియమించారు. -
‘బ్లాక్మెయిల్ చేసేవారికే TDP టికెట్లా?’
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: విపక్ష కూటమిలో టికెట్ల పంచాయితీ కొలిక్కి రావడం లేదు. పొత్తులో భాగంగా ఓ పార్టీకి టికెట్ వెళ్లడంతో మిగిలిన పార్టీల్లోని ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కకపోవడంతో బహిరంగంగా ఆందోళనకు, విమర్శలకు దిగుతున్నారు. తాజాగా పెనమలూరు టీడీపీలో ముసలం రాజుకుంది. బొడే ప్రసాద్‌కు పెనమలూరు టికెట్ ఇవ్వడంపై చలసాని పండు(వెంకటేశ్వరరావు) కుమార్తె దేవినేని స్మిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బోడే ప్రసాద్‌కు టికెట్ కేటాయించడంపై తీవ్ర అభ్యతరం వ్యక్తం చేస్తూ.. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌పై ఫైర్ అయ్యారు. చంద్రబాబు,లోకేష్ తమ కుటుంబాన్ని నమ్మించి మోసం చేశారని స్మిత ఆవేదన వ్యక్తం చేశారు. 2009లో తమ తండ్రి ఓటమికి పార్టీనే కారణమని మండిపడ్డారు. సొంత పార్టీ నేతలే తన తండ్రికి వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టారు. తండ్రి చనిపోయిన తర్వాత అండగా ఉంటామని అందరూ హామీ ఇచ్చారన్నారు. మామగారు చనిపోయిన బాధలో ఉన్నా పార్టీ కోసం రైతు ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. అయినా 2014, 2019 లోనూ టిక్కెట్ ఇవ్వలేదని విమర్శించారు. చదవండి: చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం ఈసారి టికెట్ ఇస్తామని లోకేష్ హామీ ఇచ్చారని.. చంద్రబాబు, లోకేష్ మాటలు నమ్మి ఇంటింటికీ తిరిగి పార్టీని బలోపేతం చేసినట్లు తెలిపారు. బోడే ప్రసాద్‌కే ఏవిధంగా సీటిస్తారని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్క్ చేసుకునేది తామైతే.. టిక్కెట్లు లాబీయిస్టులకిస్తారా అని మండిపడ్డారు. ఈసారి తమకు టికెట్ ఇవ్వాలని రెండేళ్లుగా అడుగుతున్నామని.. మా నాన్నను గెలిపించుకుంటామని బాబుని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు, లోకేష్ అనేక మార్లు టిక్కెట్ కోసం అడిగామన్నారు. ‘టికెట్ ఎందుకు ఇవ్వలేకపోయారో కనీసం పిలిచి కూడా చంద్రబాబు మాకు చెప్పలేదు. చంద్రబాబు, లోకేష్ అపాయింట్మెంట్ కోసం ట్రై చేశాం. లోకేష్‌కు వాట్సాప్‌లలో మెసేజ్‌లు పెట్టాం. మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. మా మెసెజ్‌లకు సమాధానం ఇవ్వం లేదు. చంద్రబాబు అరెస్ట్ సమయంలోనూ మేం భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం చేశాం. టికెట్ లేదంటే బోడే ఏడ్చాడు.. బ్లాక్ మెయిల్ చేశాడు. మేం బోడేలా చేయలేదు కదా. మాకు పార్టీ ఇచ్చే విలువ ఇదేనా? బోడే ప్రసాద్ లాగా బ్లాక్ మెయిల్ చేసే వారికే చంద్రబాబు టికెట్లు ఇస్తారా? నా వెనుక ఎవరూ లేరనేగా ఆడిపిల్లనైన నన్ను ఏడిపిస్తున్నారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. మేం చేసిన తప్పేంటో చంద్రబాబు సమాధానం చెప్పాలి. విలువలేని పార్టీకోసం మేం ఎందుకు పనిచేయాలి?. చంద్రబాబు సతీమణిలాగే మేం కూడా నిజం గెలవాలని కోరుకుంటున్నాం. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం’ అని దేవినేని స్మీత తెలిపారు. -
అధిష్టానం పిలుపు.. బోడె స్టంటేనా!
కంకిపాడు: టీడీపీ అధిష్టానం నుంచి పిలుపువచ్చిందంటూ పెనుమలూరు మాజీఎమ్మెల్యే బోడే ప్రసాద్ అనుచరగణం సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రచారం అంతా పబ్లిసిటీ స్టంటేనని టీడీపీ వర్గాలే పెదవి విరుస్తున్నాయి. ఈ చర్యలు పార్టీ వర్గాలు, శ్రేణులను గందరగోళానికి, అయోమయానికి గురిచేసేందుకేనని పేర్కొంటున్నాయి. పెనమలూరు సీటు వ్యవహారం తేలాలంటే మరో రెండు రోజులు నిరీక్షించక తప్పదని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీ అధిష్టానం సీటు కేటాయింపులో తనకు అన్యాయం చేసిందంటూ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రజల్లోకి వెళ్లారు. స్వతంత్రంగా అయినా పోటీకి సిద్ధమంటూ కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో బోడె ప్రసాద్ భేటీ అయినప్పటికీ, చివరికి ఆయనకు అక్కడా రిక్త హస్తమే మిగిలింది. ఈ విషయాన్ని బోడె ప్రసాద్ స్వయంగా కార్యకర్తలకు స్పష్టంచేశారు. అయితే బోడె యనమలకుదురు కాలవకట్ల మీద ప్రచారం చేస్తున్న క్రమంలో సోమవారం అధిష్టానం నుంచి మళ్లీ పిలుపు వచ్చిందని తీపికబురు వినబోతున్నామంటూ బోడె వర్గీయులు సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టారు. దీంతో బోడెకు దాదాపుగా సీటు ఖరారు అయ్యిందా? అన్నట్లు ప్రచారం చేశారు. అయితే బోడె తనవెంట ఎవరినీ తీసుకెళ్లకుండా ఆయన ఒక్కడే కారులో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి వెళ్లినప్పటికీ అక్కడ చంద్ర బాబుతో భేటి కాలేదని, అక్కడి పెద్దలను కలిసి వచ్చినట్లుగా టీడీపీలోని మరో వర్గం చెబుతోంది. దీంతో కేవలం పబ్లిసిటీ కోసం, పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేయడమే లక్ష్యంగా బోడె తనవర్గీయులతో కలిసి ఇలా పబ్లిసిటీ స్టంట్ చేశారని విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. ఏదో ఒకటి తేలి ఉంటే నియోజకవర్గంలో సంబరాలు జరిగేవి కాదా? అన్నప్రశ్నలూ వ్యక్తమవుతున్నాయి. రోజుకో విధంగా జరుగుతున్న ప్రచారాలు, కొత్త వ్యక్తుల రంగప్రవేశం టీడీపీ శ్రేణులను అయోమయంలో పడేస్తున్నాయి. అధిష్టానం సీటు తేల్చకుండా సాగదీస్తుండటంపై వారిలో ఉత్కంఠ నెలకొంది. సీటు ఎవరికి ఇస్తారనే విషయాన్ని తేల్చకుండా ఇలా కార్యకర్తలను నిరీక్షణకు గురిచేస్తుండటం తగదంటూ చంద్రబాబు తీరుపై మండిపడుతున్నారు. -
పెనమలూరులో మళ్లీ వైఎస్ఆర్ సీపీ జెండా ఎగరవేస్తాం
-
Penamaluru: చుక్కలు చూపిస్తాం.. బోడే అనుచరులు హెచ్చరిక
సాక్షి, కృష్ణా జిల్లా: పెనమలూరులో బోడే ప్రసాద్‌కు టిక్కెట్ దక్కక పోవడంపై కార్యకర్తల్లో తీవ్ర అసహనం వ్యక్తమవుతోంది. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు తీరుపై బోడే అనుచరులు, కార్యకర్తలు మండిపడుతున్నారు. 40 ఏళ్లుగా పార్టీలో ఎందుకున్నామా అనినిపిస్తోందంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బోడే కాలికి బలపం కట్టుకుని పెనమలూరులో తిరిగారు. చంద్రబాబు,లోకేష్ కూడా బోడే మాదిరి తిరగలేదు. చంద్రబాబు జైల్లో ఉంటే మా ఇంట్లో మనిషిలాగా భావించాం. 53 రోజులు నిరాహారదీక్షలు చేశాం. నేటి నుంచి టీడీపీ,చంద్రబాబు ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం. చంద్రబాబు సీఎం కుర్చీలో ఎలా కూర్చుంటాడో చూస్తాం. పెనమలూరుకు వచ్చే టీడీపీ అభ్యర్ధికి రేపటి నుంచి చుక్కలు చూపిస్తాం’’ కార్యకర్తలు హెచ్చరించారు. ఇదీ చదవండి: ఫైనల్‌గా ఫిక్స్.. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీ -
ఆ సర్వేతో చంద్రబాబు షాక్.. ముందు నుయ్యి వెనుక గొయ్యి
ఆ నియోజకవర్గంలో ఎలాగైనా పాగా వేయాలని చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారట కానీ ఎవరిని బరిలోకి దించాలో తెలియక కిందామీదా పడుతున్నారట. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జికే సీటివ్వాల.. లేక బయటి నుంచి ఎవరినైనా తెచ్చి పోటీ పెట్టాలో తేల్చుకోలేకపోతున్నారట. అందుకే మీ ఓటు ఎవరికి వేస్తారంటూ రోజుకొకరి పేరుతో సర్వే చేయిస్తున్నారట చంద్రబాబు. కాని.. ప్రజలు టీడీపీలో ఎవరికీ అనుకూలంగా లేకపోవడంతో పచ్చ బాస్ తలపట్టుకున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, అక్కడి పరిస్థితి ఎలా ఉంది? తొలి విడత సీట్లను ప్రకటించేసి చేతులు దులిపేసుకున్న చంద్రబాబుకు కృష్ణాజిల్లా పెనమలూరు సీటు విషయంలో మాత్రం ఏం చేయాలో పాలుపోవడం లేదట. వాస్తవానికి సామాజికవర్గం పరంగా, పార్టీ పరంగా టీడీపీకి మంచి పట్టున్న ప్రాంతం పెనమలూరు నియోజకవర్గం. కానీ ఇప్పుడు పెనమలూరు నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. దీంతో ఈసారి ఎలాగైనా పెనమలూరులో టీడీపీ జెండా ఎగరవేయాలని చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కృష్ణాజిల్లాలో గన్నవరం, గుడివాడతో పాటు పెనమలూరు పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట చంద్రబాబు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ...పెనమలూరులో వైసీపీని ఢీకొట్టే అభ్యర్ధి మాత్రం చంద్రబాబుకు దొరకడం లేదని టాక్. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పదేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాను కాబట్టి తనకే టిక్కెట్ అని ఆయన ఆశపడుతున్నారు. కానీ పెనమలూరు విషయంలో చంద్రబాబు ఆలోచనలు మరోలా ఉన్నాయని తెలుస్తోంది. బోడే కాకుండా గట్టి అభ్యర్ధిని బరిలోకి దించాలని రకరకాల ఆప్షన్స్ ను పరిశీలిస్తున్నారట. ఇటీవల టీడీపీలో చేరిన వసంత కృష్ణప్రసాద్ తో పాటు దేవినేని ఉమా పేరు మొన్నటి వరకూ పెనమలూరులో బలంగా వినిపించాయట. కానీ వసంతకు మైలవరం దాదాపు ఖాయమైపోవడంతో ఉమా అయితే ఎలా ఉంటుందనే విషయంపై చంద్రబాబు ఓ సర్వే చేయించారట. పెనమలూరు అభ్యర్ధిగా ఉమా మీకు కావాలంటే ఓటేయండంటూ ఐవీఆర్ ఎస్ కాల్స్ ద్వారా సర్వేలో కార్యకర్తలు, ప్రజల అభిప్రాయాలు సేకరించారట. ఈ సర్వేలో ఉమాకు అనుకూలమైన ఫలితాలు రాకపోవడంతో తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత ఎం.ఎస్.బేగ్ పేరుతో మరో సర్వే చేయించారట. దీనిలోనూ పెద్దగా అనుకూలత రాలేదట. ఇదిలా ఉంటే ఇటీవల టీడీపీలో చేరిన కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తుమ్మల చంద్రశేఖర్.. కొలుసు పార్ధసారధి ద్వారా పెనమలూరు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఇలా రోజుకో పేరుతో చంద్రబాబు సర్వేలు చేయిస్తున్న సమయంలో మాకేం తక్కువ అని నిలదీస్తున్నారట పెనమలూరు లోకల్ తెలుగు తమ్ముళ్లు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని ఎవరెవరి పేరుతోనే సర్వేలు చేయించడమేంటని మండిపడుతున్నారట. ఎక్కడెక్కడి నుంచో అభ్యర్ధుల్ని తెచ్చి బలవంతంగా తమపై రుద్దే బదులు ఆ టిక్కెట్ ఏదో తమకే ఇవ్వాలన్న డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారట. ఎం.ఎస్.బేగ్ పేరిట సర్వే చేయించిన తరుణంలో మైనార్టీ కోటాలో తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారట టీడీపీ మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ బాజీ షాహిద్. మొదటి జాబితాలో మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు సీటు ప్రకటిస్తారని అంతా ఆశించారు. అలా జరిగేలా లేదని తేలిపోవడంతో బోడేకు టిక్కెట్ ఇవ్వకపోతే మైనార్టీ అభ్యర్ధిగా తనకే కేటాయించాలి కానీ వలస వచ్చే వారికి ఇస్తే మాత్రం సహకరించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారట. పార్టీ కోసం కష్టపడిన వారిని చంద్రబాబు గుర్తించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారట. పెనమలూరు టిక్కెట్ విషయంలో చంద్రబాబు నాన్చుడు ధోరణి మాని త్వరగా తేల్చేయాలని అక్కడి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పెనమలూరులో జెండా పాతడం ఎలా అంటూ చంద్రబాబు రకరకాలుగా తిప్పలు పడుతున్నారు. ఇదే విధంగా జాగు చేస్తే..అంతా కలిసి టీడీపీ జెండా పీకేసేలా ఉన్నారన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారిందట. ఇదీ చదవండి: ఎచటి నుంచో ఆ పవనం! -
చంద్రబాబుకు పెనమలూరు సెగ
సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడలో నిరసన సెగ తగిలింది. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వర్గం చంద్రబాబు కాన్వాయ్ వైపు దూసుకొచ్చింది. బోడె ప్రసాద్‌కే పెనమలూరు టికెట్ ఇవ్వాలని ఆయన మద్దతుదారులు నినాదాలు చేశారు. ఇసుక కుంభకోణం కేసులో పూచీకత్తులు సమర్పించడానికి తడిగడప సీఐఈడీ కార్యాలయానికి చంద్రబాబు వచ్చిన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరిక నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా బోడె ప్రసాద్ వర్గం ఆందోళన చేపట్టింది. నిరసనకారులను అడ్డుకోవడం పోలీసుల వల్ల కూడా కాలేకపోయింది. దీంతో పోలీసులు ఏర్పాట్లు చేసిన బారికేడ్లను సైతం తోసేసి ఫ్లకార్డులతో బాబు వైపు దూసుకొచ్చారు. కాగా ఇసుక పాలసీ కేసుతో పాటు ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, మద్యం పాలసీ కేసులో బాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
సామాజిక జైత్రయాత్ర.. దేశంలోనే ఆదర్శవంతమైన పాలన
సాక్షి, కృష్ణా జిల్లా: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చేకూరిన సంక్షేమాన్ని వివరిస్తూ వారిని చైతన్య పరిచే లక్ష్యంతో చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పెనమలూరు నియోజకవర్గంలో గురువారం సాగింది. కంకిపాడు ప్రధాన సెంటర్లో జరిగిన బహిరంగ సభలో ప్రజలకు సంక్షేమ పాలనను ప్రజాప్రతినిధులు, నాయకులు వివరించారు. తాడిగడప వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మధ్యాహ్నం.. మంత్రులు, ఎమ్మెల్యేల మీడియా సమావేశం అనంతరం మోటర్ బైక్ ర్యాలీ కంకిపాడు వరకూ సాగింది. చంద్రబాబుకు ఇదే నా సవాల్: మంత్రి జోగి రమేష్ దేశంలో సామాజిక న్యాయాన్ని పాటించిన ఒకే ఒక్క సీఎం జగన్. 14 ఏళ్లలో సామాజిక న్యాయం చేశానని చెప్పే దమ్ము చంద్రబాబుకు ఉందా?. రాజ్యసభ స్థానాలను చంద్రబాబు వందల కోట్లకు అమ్ముకున్నాడు. నలుగురు బీసీలను సీఎం జగన్ రాజ్యసభకు పంపించారు. అచ్చెన్నాయుడు, చంద్రబాబుకు ఇదే నా సవాల్. మీ మేనిఫెస్టోతో రండి.. మా మేనిఫెస్టోతో వస్తాం. చర్చించే దమ్ముందా?. చంద్రబాబుకే గ్యారంటీ లేదు. ఇక మనకేం గ్యారంటీ ఇస్తాడు జగన్ పాలనలోనే సామాజిక న్యాయం: మంత్రి మేరుగ నాగార్జున సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం జరిగింది. దళితులను గుండెల్లో పెట్టుకున్న నాయకుడు సీఎం జగన్.చంద్రబాబు ఏరోజూ వెనుకబడిన వర్గాలను పట్టించుకోలేదు.చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదు.వెనుకబడిన వర్గాలను గత ప్రభుత్వం ఓటు బ్యాంకుగానే చూసింది ప్రజలు గుర్తించాలి: ఎంపీ మోపిదేవి వెంకటరమణ అణగారిన వర్గాలను గతంలో ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. సంక్షేమాన్ని అందిస్తూ సీఎం జగన్ దేశంలోనే గొప్ప నాయకుడిగా నిలిచారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు మరోమారు పొత్తులతో చంద్రబాబు, పవన్ వస్తున్నారు. ఈ నాలుగున్నరేళ్లలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమాన్ని అందించిందో ప్రజలు గుర్తించాలి. మళ్లీ ఈ రాష్ట్రానికి వైఎస్ జగన్‌ని సీఎంగా చేసుకోవాలి. సీఎం జగన్ ఉంటేనే మన భవిష్యత్తు మారుతుంది. -
అక్కడ తమ్ముళ్ల పరిస్థితి అగమ్యగోచరం!
ఆ నియోజకవర్గంలో చంద్రబాబు సామాజికవర్గం డామినేషన్ ఉందని చెప్పుకునేవారు. కాని గత ఎన్నికల్లో అక్కడ టీడీపీ తుక్కు తుక్కుగా ఓడిపోయింది. అందుకే ఈ సారి అక్కడ మళ్ళీ పట్టు నిలుపుకోవాలని పచ్చ పార్టీ బాస్ తెగ ఆరాటపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేను కాకుండా బాగా డబ్బు ఖర్చు పెట్టగల అభ్యర్థిని దించాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. బాస్ తీరుతో ఈసారి టిక్కెట్ రాదేమోనని ఆ మాజీ ఎమ్మెల్యేకు గుండె దడ మొదలైందట. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తీరుతో కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని తమ్ముళ్లు పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందట. ఎవరికి వారే తమకే టిక్కెట్టు దక్కుతుందని ఇన్నాళ్లూ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న నేతలకు చంద్రబాబు నిర్ణయాలు షాకిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిస్తే..2014లో సైకిల్ జెండా ఎగిరింది. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ప్రభంజనంలో సైకిల్ పార్టీ ముక్క చెక్కలైంది. అయితే ఈ సారి ఎలాగైనా పెనమలూరు నియోజకవర్గంలో పాగా వేయాలని టీడీపీ పెద్ద కసరత్తే చేస్తున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా పెనమలూరు టిక్కెట్ కోసం టీడీపీలో పెద్ద ఫైటే నడుస్తోందని సమాచారం. ప్రస్తుతం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తో పాటు మాజీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్, చలసాని వెంకటేశ్వరరావు మేనల్లుడు దేవినేని గౌతమ్ వేర్వేరు గ్రూపులుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు చేసుకుంటున్నారట. వీరంతా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేసుకుంటూ టిక్కెట్ తమదే అని చెప్పుకుంటున్నారట. ఇలాంటి సమయంలో చంద్రబాబు పెనమలూరు నియోజకవర్గంలో వీరందరినీ కాదని వేరే అభ్యర్ధిని బరిలోకి దించాలని ఆలోచన చేస్తున్నట్లు ప్రస్తుతం టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే మూడు గ్రూపులతో ఎవరి వెంట నడవాలో అర్ధంకాక తలపట్టుకుంటున్న క్యాడర్ చంద్రబాబు తాజా నిర్ణయంతో మరింత కన్ఫ్యూజన్ లో పడ్డారట. పెనమలూరు నియోజకవర్గంలో కమ్మ, కాపు సామాజికవర్గాలు బలమైనవి. దీంతో ఇప్పుడు ఈ రెండు సామాజికవర్గాల ఓట్లను గంపగుత్తగా తమ ఖాతాలో వేసుకోవాలనేది చంద్రబాబు ఆలోచనట. ప్రస్తుత టీడీపీ ఇంఛార్జి బోడే ప్రసాద్ కమ్మ సామాజికవర్గానికి చెందిన వాడే అయినప్పటికీ 2024 ఎన్నికల్లో దండిగా ఖర్చు పెట్టగలిగిన కమ్మనేతను బరిలోకి దించాలనుకుంటున్నారట చంద్రబాబు. బోడే ప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ధీటైన అభ్యర్ధి కాదని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే కమ్మ సామాజికవర్గాన్ని ఆకట్టుకునేందుకు దేవినేని ఉమా లేదా కేశినేని చిన్ని పేర్లను పరిశీలిస్తున్నారట. వీరెవరూ కాకపోతే కొనకళ్ల నారాయణ తమ్ముడు కొనకళ్ల బుల్లయ్యను బరిలోకి దించి బిసి ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోవాలని ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈక్రమంలోనే గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా దేవినేని ఉమా, కొనకళ్ల నారాయణ, కొనకళ్ల బుల్లయ్య పాల్గొంటున్నారట. ఇంతవరకూ బాగానే ఉంది కానీ ఇప్పటి వరకూ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్న బోడే ప్రసాద్ కు ఈ పరిణామాలతో అసంతృప్తికి గురవుతున్నారు. నాలుగేళ్లుగా పార్టీని కాపాడుకుంటూ ...ఎలాంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా రోడ్డెక్కి నిరనసలు చేసిన తనను కాదని ఇప్పుడు మరో అభ్యర్ధిని నిలబెట్టాలని చూడటంపై బోడే లోలోన రగిలిపోతున్నాడట. ఆ మధ్య చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు దీక్షలు చేపట్టిన సమయంలో...బోడే మాట్లాడుతూ, ఎవరెవరో వచ్చి తమకే టిక్కెట్ అంటున్నారు.. పార్టీ కోసం కష్టపడిన తనను పక్కన పెట్టాలని చూడటం కరెక్ట్ కాదని బహిరంగంగానే తన ఆవేదన వెళ్ళగక్కారు. అప్పటి ఆవేదన ఇప్పుడు నిజమైతే తన బాధను ఎవరికి చెప్పుకోవాలో తెలియక బోడే ప్రసాద్ కుమిలిపోతున్నారట. -
అనుమానాస్పద స్థితిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి..
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా పెనమలూరు మండల పరిధిలోని పెదపులిపాక గ్రామ శివారు డొంకరోడ్డులో బుధవారం తెల్లవారు జామున ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహం కలకలం రేపింది. మృతదేహం కాలిపోయిన స్థితిలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటనపై పెనమలూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని వల్లూరుపాలేనికి చెందిన సుధాకర్, రూతమ్మలు విజయవాడ సున్నపుబట్టీల వద్ద ఉంటున్నారు. సుధాకర్ వాచ్‌మేన్‌గా పని చేస్తాడు. వారి కుమారుడు జమ్మలమూడి జీవన్(21) విజయవాడ వన్‌టౌన్‌లోని పొట్టిశ్రీరాములు ఇంజినీరింగ్‌కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం జీవన్ మిత్రుడు శ్యామ్ పుట్టిన రోజు సందర్భంగా గురునానక్‌నగర్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో పార్టీ చేసుకున్నారు. అర్ధరాత్రి వరకు పార్టీలో ఉన్న జీవన్.. మిత్రుడి యాక్టీవా తీసుకుని బయటకొచ్చాడు. ఆ తర్వాత పెదపులిపాక శివారులోని డొంక రోడ్డులో కాలిపోయి శవమై కనిపించాడు. జీవన్‌ను ఎవరైన పథకం ప్రకారం హత్య చేశారా.. లేక బలవన్మరణానికి పాల్పడ్డాడా.. అనే విషయం మిస్టరీగా మారింది. ఘటనపై పెనమలూరు పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి పలు విషయాలు సేకరించారు. జీవన్ మంగళవారం రాత్రి 12:20 గంటలకు మిత్రుడి వాహనంపై రెస్టారెంట్ నుంచి బయటకొచ్చాడు. అక్కడి నుంచి యనమలకుదురు పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి సీసాలో రూ.100 పెట్రోల్ పోయించుకున్నాడు. ఈ దృశ్యాలు పెట్రోల్ బంక్ వద్ద సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ తర్వాత అర్ధరాత్రి 1.40 గంటలకు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. రూ.12 వేలు ఈఎంఐ డబ్బు వాడుకున్నాను.. ఇంటికి రావడం లేదు.. అమ్మ సారీ.. అని చెప్పాడు. ఆ తర్వాత జీవన్ ఫోన్ పని చేయలేదు. అంతకు ముందు రోజే జీవన్ తన ఇన్‌స్ట్రాగామ్‌లో.. దిస్ ఈజ్ లాస్ట్ డే. అని పెట్టగా మిత్రులు ఎగతాళి చేశారు. దీనికి జీవన్.. రాత్రి చూస్తారుగా అని పోస్టు పెట్టాడు. ఈ విషయాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి. జీవన్ మృతదేహం వద్ద ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని కాల్స్‌ను పరిశీలిస్తున్నారు. రాత్రి పార్టీలో ఉన్న మిత్రులను పోలీసులు ప్రశి్నస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. (చదవండి: సీరియల్ రేపిస్ట్‌ను దోషిగా తేల్చిన కోర్టు.. 30 మంది పిల్లలను దారుణంగా..) -
గుణదల మహిళది హత్యే?.. వివాహేతర సంబంధంతో.. పదేపదే..
సాక్షి, పెనమలూరు: కానూరులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళది హత్యేనని తేలింది.ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సమాచారం. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని చెబుతున్నారు. కానూరులో గురువారం రాత్రి గుణదలకు చెందిన ముమ్మిడివరపు గౌరమ్మ (50) కానూరు శివారు పంచాయతీరాజ్ ఎంప్లాయిస్ కాలనీలో నిర్మానుష్య ప్రాంతంలో అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఆమె గుణదల నుంచి వచ్చి ఇక్కడ ఎలా చనిపోయిందనేది పెద్ద మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలి ఫోన్‌కాల్ డేటాను పరిశీలించగా ఆమె యనమలకుదురుకు చెందిన జయరావు అనే వ్యక్తితో ఎక్కువగా మాట్లాడినట్లు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా జయరావు ఆచూకీని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారని తెలిసింది. గుణదలకు చెందిన మృతురాలు గౌరమ్మ, ప్రసాదంపాడు బ్యాంకు వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యనమలకుదురు నివాసి జయరావుకు గత కొద్ది కాలంగా పరిచయం ఉంది. జయరావుకు వివాహం అయింది. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అయితే గౌరమ్మ తరచుగా జయరావుకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టసాగింది. దీంతో గురువారం మద్యం తాగిన జయరావు బైక్‌పై గౌరమ్మను కానూరు శివారుకు తీసుకు వచ్చాడు. అక్కడ వీరి మధ్య వివాదం ఏర్పడటంతో ఆమెను ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఆ తరువాత అతను అక్కడి నుంచి పారిపోయాడు. పోస్టుమార్టంలో ఊపిరాడక పోవటంతోనే గౌరమ్మ చనిపోయిందని తేలడంతో కేసు విచారణ వేగవంతం చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో పై విషయాలు నిందితుడు వెల్లడించాడని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల నుంచి పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పెనమలూరులో పచ్చ రాజకీయం.. ఆ క్రెడిట్ కొట్టేయడానికే చీప్ పాలిటిక్స్
ఆ మాజీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నపుడు నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఐదేళ్ళలో ఒక కాలువపై చిన్న వంతెన కూడా పూర్తి చేయించలేకపోయాడు. అన్ని రకాలుగా జనాన్ని దోచుకుతిన్నాడు. ఇప్పుడు మాజీగా మిగిలాక కూడా జనంపై కక్ష తీర్చుకుంటున్నాడు. ప్రతి విషయాన్ని రాజకీయం చేస్తూ ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకీ ఆ నాయకుడు ఎవరో, ఆయన గొడవేంటో.. మీరే చదవండి సైకిల్ పని వివాదం సృష్టించడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వాన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పనులతో పచ్చ పార్టీ నాయకులు గంగవెర్రులెత్తుతున్నారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేయడానికి నానాపాట్లు పడుతున్నారు. తాజాగా వివాదాలకు కేరాఫ్ గా నిలిచే విజయవాడ నగర శివార్లలోని పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ చీప్ పాలిటిక్స్ చూసి జనం అసహ్యించుకుంటున్నారు. యనమలకుదురులో అసంపూర్తిగా ఆగిపోయిన వంతెన వద్ద బోడే ప్రసాద్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. అక్కడి కాల్వపై వంతెన నిర్మాణానికి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో శంకుస్థాపన జరిగింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్న ప్రస్తుత పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొలుసు పార్ధసారధి చొరవతో ఈ వంతెన మంజూరైంది. శంకుస్థాపన జరిగిన వెంటనే పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున పెనమలూరు నుంచి పోటీ చేసిన బోడే ప్రసాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. టీడీపీ హాయాంలో ఐదేళ్ళలో వంతెన పనులు పూర్తిచేయలేకపోయారు. బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో చిన్న వంతెన నిర్మాణాన్ని కాంట్రాక్టర్ ఐదేళ్ల పాటు సాగదీశాడు. వంతెనపై పచ్చ రాజకీయం 2019 ఎన్నికల్లో బోడే ప్రసాద్ ఓడిపోయి పార్థసారథి విజయం సాధించారు. కాంగ్రెస్ హయాంలో తాను శంకుస్థాపన చేసిన వంతెన ఇంకా పూర్తికాకపోవడంతో వంతెన నిర్మాణంపై పార్ధసారధి ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్ శాఖ అడ్డంకులన్నీ తొలగించి వంతెన నిర్మాణం పూర్తిచేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఇదే అదనుగా మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ కాంట్రాక్టర్ తో కోర్టులో కేసు వేయించాడు. అప్పటి వరకూ జరిగిన పనులకు బిల్లులు చెల్లించలేదని.. అవి చెల్లించాలంటూ కాంట్రాక్టర్ కోర్టుకెళ్లాడు. గత రెండేళ్లుగా కోర్టులో పోరాడి, కాంట్రాక్టర్ కు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడంతో పాటు అసంపూర్తిగా మిగిలిపోయిన వంతెనను పూర్తిచేసేందుకు అన్ని అనుమతులు తీసుకొచ్చారు. మరికొద్ది రోజుల్లో పనులు తిరిగి మొదలు కానున్నాయి. విషయం తెలిసిన టీడీపీ నేత బోడే ప్రసాద్ తన వల్లే పనులు మొదలవుతున్నాయని చెప్పుకునేందుకు ఇప్పుడు కొత్తగా చిల్లర రాజకీయాలకు తెరతీసాడు. ఇదేం ఖర్మరా బాబూ..! తన ఐదేళ్ళ పదవీ కాలంలో పూర్తి చేయకపోగా.. ఇప్పుడు వంతెన పూర్తి చేసిన క్రెడిట్ అధికార పార్టీ ఎమ్మెల్యే పార్ధసారధికి వెళ్తుందనే అక్కసుతో బోడే ప్రసాద్ ఇదేం ఖర్మరా బాబూ అంటూ వంతెన వద్ద ఆందోళన చేపట్టాడు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు శాంతియుత నిరసన తెలిపారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం ఏర్పడటంతో పోలీసులు మోహరించారు. ఇదే అదనుగా భావించిన బోడే ప్రసాద్.. మహిళలను అడ్డం పెట్టకుని వైసీపీ శ్రేణులపై భౌతికదాడులకు పాల్పడ్డారు. ఫలితంగా పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వంతెన వద్ద నిరసన పేరుతో బోడే ప్రసాద్ చాలా సేపు డ్రామా నడిపించాడు. బోడే చేపట్టిన నిరసన డ్రామాపై వైసీపీ శ్రేణులతో పాటు స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు అవసరమైన వంతెనను ఐదేళ్లలో పూర్తిచేయకుండా ఇప్పుడు క్రెడిట్ కొట్టేయడానికి ఇలా చీప్ పాలిటిక్స్ ప్లే చేయడాన్ని తప్పుబడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టర్ల దగ్గర్నుంచి డబ్బు దండుకుని.. అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన బోడే ప్రసాద్ ఇప్పుడు ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడాన్ని సహించబోమని వైసీపీ శ్రేణులు హెచ్చరిస్తున్నాయి. - హితైషి, పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
గెలవడం సంగతి తర్వాత.. ఆ ముగ్గుర్ని ఒకటి చేసేదెలా?
అక్కడ టీడీపీ టిక్కెట్ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారట. గత ఎన్నికల్లో అక్కడ గెలిచింది వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి. అయితే టీడీపీలో ఒక మాజీ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్సీ, ఓ మాజీ మంత్రి మనవడు టిక్కెట్ కోసం పడుతున్నారని టాక్. అభ్యర్థిని నేనే అంటూ ముగ్గురూ ప్రచారం చేసుకుంటున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏదో, దాని కథేంటో చూద్దాం.. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి, ఆ తర్వాత జరిగిన పంచాయతీ, పరిషత్, మున్సిపల్.. వరుసగా అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం ఓడింది. రోజురోజుకు ప్రజలకు దూరంగా, భారంగా మారిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. ఇప్పటికీ ఢంకా బజాయించడంలో మాత్రం తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామంటూ లేని బింకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన బాగా నమ్మకం పెట్టుకున్న పాత కృష్ణా జిల్లాలోనే పరిస్థితి భిన్నంగా ఉంది. కృష్ణా జిల్లాలో పెనమలూరులో 2014లో టీడీపీ తరపున గెలిచిన బోడే ప్రసాద్ 2019లో ఓడిపోయారు. అయితే ఇప్పటికీ ఆయనే పెనమలూరు టీడీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. చంద్రబాబు సపోర్ట్ నాకే ఉంది రాబోయే ఎన్నికల్లో పెనమలూరు నుంచి పోటీచేసేది నేనే అంటూ బోడే ఇప్పట్నుంచే ప్రచారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు బోడే ప్రసాద్‌కు పోటీగా మరో ఇద్దరు లైన్లోకి వచ్చారట. మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి బాబూ రాజేంద్ర ప్రసాద్ ఎప్పట్నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్నారు. గత నాలుగైదు ఎన్నికల నుంచి ప్రతిసారీ టిక్కెట్ కోసం చివరి వరకూ పోరాడటం.. భంగపడటం ఆయనకు అలవాటైంది. దేవినేని ఉమ మద్దతుతో ఈసారైనా టిక్కెట్ దక్కకపోతుందా అనే ఆశలో ఉన్నారాయన. చదవండి: (Galla Jayadev: ఎంపీ అన్న సంగతే మరిచిపోయారేమో..?) వీరిద్దరికీ పోటీగా చలసాని పండు మేనల్లుడు దేవినేని గౌతం కూడా 2024లో పెనమలూరులో పోటీచేసేది నేనే అని చెప్పుకుంటున్నాడు. లోకేష్ సపోర్ట్ తనకు ఉందని... టికెట్ తనకే వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. చిన్నబాబు తనకే హామీ ఇచ్చాడని, ఈ సారి పోటీ చేయడం ఖాయమంటున్నాడు. ప్రస్తుతం పెనమలూరు నియోజకవర్గంలో ఈ ముగ్గురూ పార్టీ కార్యక్రమాలు వేర్వేరుగా నిర్వహస్తుండటంతో తమ్ముళ్లు అయోమయంలో ఉన్నారు. అసలే గెలుపుపై ఆశల్లేవు, ఆపై కుమ్ములాటలెందుకని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం పిలుపునిచ్చే ఏ కార్యక్రమంలోనూ ఈ ముగ్గురూ కలిసి పాల్గొనడం లేదట. మా రూటే సెపరేటంటూ విడివిడిగా కార్యక్రమాలు చేసుకుంటూ తమకే పార్టీ సపోర్ట్ ఉందని ప్రచారం చేసుకుంటున్నారట. ఈ ముగ్గురూ చాలదన్నట్లు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా చేసిన వడ్డే శోభనాద్రీశ్వర్రావు కుటుంబం నుంచి ఆయన మనవడు వడ్డే సాయి కూడా టికెట్ కోసం తెరవెనుక పావులు కదుపుతున్నట్లు తాజాగా ప్రచారం మొదలైంది. ప్రస్తుతం పెనమలూరు టీడీపీలో చోటుచేసుకున్న ఈ పరిణామాలు పార్టీ అధినేతకు తలనొప్పిగా మారుతున్నాయట. అసలే అవకాశాలు అంతంతమాత్రంగా కనిపిస్తున్న పెనమలూరులో టిక్కెట్ కోసం ఇప్పట్నుంచే ట్రయాంగిల్ ఫైట్ మొదలవ్వడంతో చంద్రబాబుకు ఏం చేయాలో పాలుపోవడం లేదట. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని గాడిలో పెట్టడం ఎలా అని తలపట్టుకుంటున్నారట చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో గెలవడం సంగతి దేవుడెరుగు.. ముందు ఈ ముగ్గురినీ ఎన్నికల నాటికి ఒకే తాటిపైకి తేవడం ఎలా అని బాబోరు తెగ మదన పడిపోతున్నారట. చదవండి: (Daggubati Purandeswari: కాలం చెల్లినట్లేనా?.. బీజేపీ ఏదో ఆశిస్తే.. జరిగిందేదో!) -
జామ్ జా‘మనీ’.. ఎకరాకు రూ.3 లక్షల ఆదాయం.. ఈ పంటకు భలే గిరాకీ!
నిరంతరం కష్టాలు, నష్టాలు చవిచూసే రైతుకు జామ పంట ధీమానిస్తోంది. ఏడాదిలో మూడుసార్లు ఫలసాయాన్నిస్తోంది. జిల్లాలో అధికంగా మామిడి సాగవుతుంటే, పెనుమూరులో మాత్రం జామ పంట భరోసా కల్పిస్తోంది. తెగుళ్ల బెడదను తట్టుకుని నిలబడుతోంది. తరతరాలుగా సాగవుతూ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది. మంచి రంగునూ, రుచినీ సొంతం చేసుకుంది. అత్యుత్తమ దిగుబడులతో.. రాష్ట్ర సరిహద్దులను కూడా దాటుతూ రైతుల ‘పంట’ పండిస్తోంది. పెనుమూరు (చిత్తూరు): ప్రజలకు ఆరోగ్యకరమైన జామ పండ్ల సాగుకు పెనుమూరు ప్రసిద్ధి చెందుతోంది. రైతులు ఏడాదిలో మూడు సార్లు దిగుబడులు సాధిస్తున్నారు. అత్యధిక ఫలసాయం, ఆదాయం ఇచ్చే పంట జామ. ఇతర రాష్ట్రాలు, పట్టణాలకు పెనుమూరు నుంచి జామను రవాణా చేస్తున్నారు. రెండు శతాబ్దాల క్రితం దాసరాపల్లెకు చెందిన నాగిరెడ్డి తొలిసారిగా జామ పంట సాగు చేశాడు. ఆయన జామ సాగులో మంచి లాభాలు పొందడం చూసి దాసరాపల్లెలో ఉన్న 50 కుటుంబాలు జామ పంట సాగు చేస్తున్నారు. దాసరాపల్లెను ఆదర్శంగా తీసుకొని కారకాంపల్లె, పెద్దరాజుపల్లె, ఉగ్రాణంపల్లె, చెళంపాళ్యం, రామాపురం, పెనుమూరు గ్రామాల్లో 150 ఎకరాల్లో వివిధ రకాల జామ సాగవుతోంది. జామ సాగుపై ఉన్న మక్కువతో వారసత్వంగా కూడా రైతులు సాగు చేస్తున్నారు. తొలుత రసాయన ఎరువుల వినియోగంతో జామ సాగు చేశారు. పెట్టుబడి పెరగడంతో కష్టాలు, నష్టాలు చవి చూశారు. మూడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం ద్వారా జామ సాగు చేస్తున్నారు. ఏడాదిలో మూడు పంటలు సాధారణంగా జామలో ఏడాదికి రెండు పంటలు మాత్రమే దిగుబడి సాధించవచ్చు. అయితే శాస్త్రీయ పద్ధతులతో ‘‘చందన మాధురి’’ రకంతో మూడు పంటలు అందుకుంటున్నారు. ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఘన జీవామృతం, ధ్రవ జీవామృతం, పంచగవ్య భీజామృతం, పళ్ల ద్రావణం, వేప కషాయం, వానపాముల ఎరువుల వినియోగంతో జామ సాగు చేస్తున్నారు. రైతులు జామ తోటల్లో కోళ్లు, పొట్టేళ్లు పెంచుతూ భూమిని సారవంతం చేస్తున్నారు. వీటితో పాటూ మూడు పర్యాయాలు పచ్చిరొట్ట పైర్లు సాగు చేస్తూ సేంద్రియ ఎరువులు సహజంగా అందిస్తున్నారు. ఏటా భూసార పరీక్షలు చేస్తూ సూక్ష్మపోషకాలు అందిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నారు మార్కెటింగ్ మెలకువలు స్థానికంగా జామ కాయలు విక్రయించడం వల్ల ఆదాయం ఆశాజనకంగా లేదు. దీంతో మార్కెట్ మెలకువలపై రైతులు దృష్టి సారించారు. పల్లెల్లో కన్నా పట్టణాల్లో జామ కాయల ధర, డిమాండ్ ఉండడాన్ని గుర్తించారు. సేంద్రియ ఉత్పత్తులు కొనే సంస్థలను, వ్యాపారులను సంప్రదించి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు రవాణా చేస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. స్థానికంగా ఒక కిలో జామ కాయలు రూ.20 ఉండగా పట్టణాల్లో రూ.80 నుంచి 100 వరకు పలుకుతోంది. వీటితో పాటూ డయాబెటిక్ సెంటర్లకు ప్రత్యేక ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్నారు. అంతే కాకుండా వివిధ పట్టణాల్లో నిర్వహించే ఆర్గానిక్, కిసాన్ మేళాల్లో ఈ దిగుబడులు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ.3 లక్షలు ఉద్యానవన పంటల్లో ప్రస్తుతం జామ సాగు మంచి ఆదాయాన్నిస్తోంది. పైగా ఈ పంటకు తెగుళ్ల బెడద పెద్దగా ఉండదు. పెట్టుబడులు కూడా తక్కువే. మార్కెట్లో విక్రయించుకోవడం సులభంగా ఉంది. అదీకాక ఏడాదికి మూడు పంటలు ఇవ్వడంతో మంచి ఆదాయం పెరుగుతోంది. జామను సేంద్రియ పద్ధతులతో సాగుచేయడం, మార్కెట్ మెలకువలతో అమ్ముకోవడం ద్వారా ఎకరా పంటకు ఏడాదిలో రూ.3లక్షల వరకు నికర ఆదాయం వస్తోంది. కాయలతో పాటూ మొక్కలు అంటుకట్టి కొందరు రైతులు మరింత ఆదాయం పొందుతున్నారు. మూడు తరాలుగా ఇదే పంట మా గ్రామంలో సుమారు రెండు శతాబ్దాలకుపైగా జామ తోటలు సాగవుతున్నాయి. మా కుటుంబానికి మూడు తరాలుగా జామ తోటలు సాగు చేయడం వారసత్వంగా వస్తోంది. ప్రస్తుతం మూడు ఎకరాలు సాగు చేస్తూ మంచి ఆదాయం పొందుతున్నాం. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన జామ పండ్లు పండిస్తున్నాం. ఏడాదిలో మూడు పర్యాయాలు దిగుబడులు సాధిస్తున్నాం. – పి.హేమావతి, జామరైతు, దాసరాపల్లె జామతోనే బతుకుతున్నాం పండ్ల తోటల పెంపకంలో ప్రస్తుతం తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంట జామ. దీనికి చీడపీడలు కూడా అంతగా ఉండవు. జామ పండ్లను ఎక్కడైనా, ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. పేదవాడి ఆపిల్‌గా పేరు పొందిన జామ పంట సాగు చేసి సంతోషంగా బతుకుతున్నాం. ఐదు ఎకరాల్లో జామ సాగు చేసి ఇద్దరు పిల్లలను విద్యా వంతులను చేశాం. రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షలు ఆదాయం పొందుతున్నాం. – కె.జ్యోతి, పెనుమూరు మండలం సంతల్లోనూ అమ్మకం పెనుమూరు జామకు ప్రసిద్ధి చెందింది. అందుకే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల నుంచి జామ పండ్ల కొనుగోలుకు వ్యాపారులు వస్తున్నారు. కొందరు రైతులు స్వయంగా తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పుత్తూరు పట్టణాల్లో వ్యాపారులకు హోల్ సేల్‌గా జామ కాయలు విక్రయిస్తున్నాం. చాలామంది రైతులు స్వయంగా వారపు సంతల్లో కాయలు విక్రయిస్తున్నారు. ఆదాయం కూడా బాగానే ఉంది. – ధరణి వేణి, దాసరాపల్లె, పెనుమూరు మండలం -
సాప్ట్వేర్ కొలువు వదిలి దేశీ వరి వంగడాలను సంరక్షిస్తున్న యువ ఇంజనీర్
ఆయనో సాఫ్ట్వేర్ ఇంజనీర్.. బిట్స్ పిలానీలో మాస్టర్ డిగ్రీ చదివారు. ప్రముఖ సాప్ట్వేర్ కంపెనీలో ఐదేళ్లు పనిచేశారు. స్వతహాగా రచయిత కావడంతో సాఫ్ట్వేర్ కొలువు వదిలి సృజనాత్మక రంగంలో అడుగుపెట్టారు. ఇంకా ఏదో చేయాలన్న తపన.. సరిగ్గా అదే సమయంలో కేరళకు చెందిన ఎర్ర బియ్యం (నవార)లో ఉన్న ఔషధ గుణాల గురించి తెలుసుకొని ఆశ్చర్య పోయారు. ఇలాంటి పురాతన ధాన్యపు సిరులపై అధ్యయనంకోసం 8 రాష్ట్రాల్లో పర్యటించారు. 251 పురాతన వరి రకాలను సేకరించారు. వాటిని సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించాలని ప్రతినబూనారు. ఆ దిశగా అడుగులేస్తున్నారు. ఆయనే నందం రఘువీర్. కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఈయన గడిచిన నాలుగేళ్లుగా పురాతన విత్తనాలను సంరక్షించే కృషిలో నిమగ్నమయ్యారు. వాటిని యువ రైతులకు అందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలులో దేశీ విత్తన బ్యాంక్‌ను ఏర్పాటు చేస్తున్నారు. తనతో కలిసొచ్చే రైతులతో తొలిదశలో 8 జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేయబోతున్నారు. దేశీ వంగడాల విశిష్టతను వివరించే పుస్తక రచన చేస్తున్నారు. పురాతన విత్తన సంపదను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలన్న సంకల్పంతో ఉద్యమిస్తున్న రఘువీర్ ‘సాక్షి’తో తన అనుభవాలను పంచుకున్నారు. ఆయన చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే... పోషక విలువలతో పాటు 14 శాతానికి పైగా ఫైబర్ కలిగిన ‘నవార’ బియ్యం తిన్న తర్వాత నా ఆలోచన మారింది. అసలు ఇలా ఎన్ని రకాల పురాతన వరి రకాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఉత్సుకతతో నాలుగేళ్ల క్రితం తొలి అడుగు వేశా. తమిళనాడు, కేరళ, కర్నాటక, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్‌లలో పర్యటించాను. ఎక్కువ భాగం ఆదివాసీల నుంచి విత్తనాలు సేకరించాను. వాటిని ఎలా దాచుకోవాలి. ఎలా సంరక్షించాలి. ఎలా సాగు చేయాలో వారి దగ్గర నేర్చుకున్నా. నా పర్యటనలో పురాతన వరి విత్తన సంరక్షణోద్యమ పితామహుడు డాక్టర్ దేవల్దేవ్ (ఒడిషా) వద్ద నెల రోజుల పాటు శిక్షణ పొందా. ఈయన వద్ద ప్రపంచంలో మరెక్కడా లేని 1500కు పైగా వంగడాలున్నాయి. దేశీ వంగడాల పరిరక్షణకు కృషి చేస్తున్న డాక్టర్ వందనా శివను కలిసాను. పురాతన వంగడాలపై విశిష్ట కృషి చేసిన ప్రసిద్ధ శాస్త్రవేత్త డాక్టర్ ఆర్.హెచ్.రిచారియా నుంచి సేకరించిన విత్తనాలతో డెహ్రాడూన్ సమీపంలో 50 ఎకరాల్లో ‘నవధాన్య’ పేరిట విత్తన పరిరక్షణకు నడుం బిగించారు. ఆమె వద్ద ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. 251 దేశీ వరి రకాల సేకరణ ఇప్పటి వరకు 251 రకాల అత్యంత పురాతనమైన వరి విత్తనాలను సేకరించాను. వీటిలో భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) కల్గిన వంగడాలు 10కి పైగా ఉన్నాయి. పెనమలూరులో 1.3 ఎకరాల్లో ఈ విత్తనాల సంరక్షణ చేస్తున్నా. ఇప్పటి వరకు 48 మంది రైతులకు ఉచితంగా విత్తనాలు అందించాను. నేను నేర్చుకున్న విషయాలను పుస్తక రూపంలో తెచ్చే పనిలో ఉన్నా. ఇందులో పురాతన వరి రకాలు, వాటి వివరాలు,æ గొప్పదనం, చరిత్ర, ఔషధ గుణాలు, వంటకాలు వంటి వివరాలుంటాయి. ఈ ఏడాది 8 జిల్లాలలో విత్తన నిధులను ఏర్పాటు చేస్తున్నా. గిరిజన ప్రాంతమైన పెదబయలు మండలంలో దేశీ విత్తన నిధిని ఏర్పాటు చేస్తున్నా. రూ. 50 వేల నికరాదాయం ప్రకతి వ్యవసాయంలో పురాతన వరి రకాలను సాగు చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఎకరాలో ఖర్చులు పోను 50 వేలు నికర లాభం పొందవచ్చు.« ధాన్యాన్ని 4 నెలల పాటు నిల్వ చేసి.. బియ్యంగా మార్చి అమ్మగలిగితే దీనికి రెట్టింపు ఆదాయం ఆర్జించొచ్చు. తగిన జాగ్రత్తలతో విత్తనంగా అమ్మితే చక్కని ఆదాయం పొందవచ్చు. దేశీ వరి విత్తనోత్పత్తిలో మెలకువలు తక్కువ స్థలంలో ఎక్కవ రకాలు పండించాలనుకుంటే ఖచ్చితంగా రకానికి రకానికి మధ్య కనీసం 3 మీటర్ల దూరం ఉండాలి. మధ్యలో గుడ్డ కట్టాలి. ఒకేసారి పుష్పించకుండా ఉండేలా నాటుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా దేశవాళీ వరి సంరక్షణ పేరిట ఒక ఎకరంలో 100 రకాలు సాగు చేస్తే వాటిలో ఉండే ఔషధ గుణాలు, చీడపీడలను తట్టుకునే లక్షణాలు, సువాసనలను కోల్పోతాయి. కేంద్రం భౌగోళిక గుర్తింపునిచ్చిన వాటిలో ప్రధానంగా నవార, పాలకడ్ మిట్ట, పొక్కలి, వాయనాడ్ గంధకసాల, కాలానమక్, కైపాడ్, జోహా, అజారా ఘణసాల్, అంబెమొహర్, తులైపాంజ్, గోవిందో బోగ్, కటార్ని, చౌకోహ, సీరగ సాంబ రకాలు ఉన్నాయి. ఎర్ర బియ్యంలో 100 రకాలు, నల్ల బియ్యంలో 20 రకాలకు పైగా మన దేశంలోనే ఉన్నాయి. ఎకరాకు 13 నుంచి 30 బస్తాల దిగుబడినిచ్చే పురాతన రకాలున్నాయి. మార్కెట్లో వీటికి డిమాండ్ ఎక్కువ. ధర కూడా ఎక్కువే. 70 నుంచి 240 రోజుల్లో పండే పురాతన వరి రకాలు నా దగ్గర ఉన్నాయి. – పంపాన వరప్రసాదరావు, సాక్షి, అమరావతి దేశీ వరి వంగడాల ప్రత్యేకతలు నవర: రెడ్ రైస్ (ఎర్ర బియ్యం). కేరళకి చెందిన ఈ రకానికి 2007లో భౌగోళిక గుర్తింపు వచ్చింది. వీటిలో పీచు పదార్థం ఎక్కువ. ఒక రోజు నాన బెట్టి, ఒక గంటసేపు ఉడికించాలి. అత్యంత బలవర్ధకమైన బియ్యమిది. డయాబెటిక్ వారికి అత్యంత సురక్షితమైన ఆహారం. పాలక్కడ్ మట్ట: కేరళకు చెందిన మరో ఎర్ర బియ్యపు రకం. చోళ రాజులు తినేవారట. ముంపును తట్టుకునే పంట ఇది. ఇడ్లీ తరహా వంటలకు అనుకూలం. పోక్కలి: ఉప్పు నీటిలో పెరిగే రకం. కేరళలో ఎర్నాకుళం, త్రిస్సూర్ పరిసరాల్లో సాగు చేస్తారు. ఇది కూడా ఎర్ర బియ్యమే. వరి పొలంలో చేపలను పెంచే సమీకృత వ్యవసాయానికి ఇది అనుకూలం. ఇందులో ప్రొటీన్స్ అధికంగా ఉంటాయి. అధిక శక్తినిస్తుంది. సముద్రవేటకు వెళ్లే జాలర్లు ఎక్కువగా వాడుతుంటారు. వయనాడు గంధకశాల: కేరళలోని వయనాడు కొండల మీద పెరిగే సుగంధ భరితమైన రకమిది. ఈనికSదశలో మంచి సువాసన వెదజల్లుతుంది. పూర్వం పండుగల వేళ ప్రసాదాల తయారీకి ఉపయోగించేవారు. ఆదివాసీలు నేటికీ అధికంగా పండిస్తున్నారు. కాలానమక్: అత్యంత సువాసన కల్గిన తెల్ల వరి రకమిది. ధాన్యపు పొట్టు నల్లగా ఉంటుంది. బియ్యం తెల్లగా ఉంటుంది. క్రీ.పూ. 600 ఏళ్ల నాటి రకం ఇది. గౌతమ బుద్ధుని కాలంలోనూ పండించినట్టు చారిత్రక ఆధారాలున్నాయట. కపిలవస్తు (నేపాల్), ఉత్తరప్రదేశ్‌లలో నేటికీ సాగులో ఉంది. చకావో: మణిపూర్ బ్లాక్ రైస్ అని దీనికి పేరు. పంట కాలం 120 రోజులు. ఔషధ విలువలు కల్గిన నల్ల బియ్యం. వీటిలో యాంటి ఆక్సిడెంట్స్ అధికం. మార్కెట్లో ఈ రకం బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. పాయసం తరహా వంటకాలకు బాగా అనువైనది. ప్రతి రైతూ పండించుకొని తినాలి! నేను ప్రతి రైతునూ కోరుకునేది ఒక్కటే. తనకున్న భూమిలో కొంత భాగంలోనైనా తన కోసం పోషకాలు, ఔషధ విలువలు కలిగిన పంటలు పండించుకోవాలి. పురాతన వరి, కూరగాయలు, దుంప రకాలS విత్తనాలు నేటికీ అందుబాటులో ఉన్నాయి. అధిక దిగుబడి మాయలో పడిపోకుండా ప్రతీ రైతు పురాతన వరి విత్తనాలను సేకరించి తాము తినడానికి పండించుకోవాలి. విత్తనాన్ని సంరక్షించు కోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రపంచాన్ని ఎవరూ మార్చలేరు. ముందుగా మనం మారి, ఆ తర్వాత పది మందికీ చెబితే ఖచ్చితంగా పది మందైనా మన బాటలోకి వస్తారు. ఈ స్ఫూర్తితో నేను ఈ ఉద్యమంలో ముందుకెళ్తున్నాను. – నందం రఘువీర్ (70138 20099), దేశీ వంగడాల సంరక్షకుడిగా మారిన యువ ఇంజనీర్, పెనమలూరు, కృష్ణా జిల్లా -
ఆస్ట్రేలియాకు పారిపోయిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరులో డిప్యూటీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌పై దాడి చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గుట్టు చప్పుడు కాకుండా దేశం వదిలి పారిపోయారు. నాలుగు రోజుల తర్వాత సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. ఈ నెల 17న పెనమలూరులో రేషన్‌షాపును పీడీఎస్ డీటీ గుమ్మడి విజయ్‌కుమార్ తనిఖీ చేశారు. స్టాకు తేడా ఉండటంతో రిపోర్టు రాస్తుండగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తన అనుచరులతో వచ్చి డీటీ విజయ్‌కుమార్, వీఆర్వో మంగరాజుపై దాడి చేశారు. ఈ దాడి తర్వాత కనిపించకుండాపోయారు. పోలీసులు గాలించినా ప్రయోజనం లేకుండా పోయింది. బోడె అనుచరులు 9 మందిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నాలుగు రోజులు తర్వాత బోడె ప్రసాద్ ఆస్ట్రేలియాలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాద్ పారిపోయి అక్కడ తల దాచుకున్నారని, ఆ తర్వాత 19వ తేదీన శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఆస్ట్రేలియాకు పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఆ రేషన్ డీలర్ టీడీపీ కార్యకర్తే.. సోషల్ మీడియాలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శనివారం వీడియో విడుదల చేశారు. రేషన్ డీలర్ లుక్కా అరుణ్‌బాబు టీడీపీ కార్యకర్త అని మరోసారి బహిరంగపరిచారు. రేషన్ షాపు తనిఖీ చేయడం నేరమని, డీటీని ప్రశ్నించేందుకు వెళితే అక్రమ కేసులు పెట్టారని చెప్పారు. తనపై ఎన్ని కేసులు పెట్టిన భయపడేదిలేదని, చంద్రబాబుని ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానన్నారు. అనుచరులను జైలు పాల్జేసి తాను మాత్రం కుటుంబ సభ్యులతో విదేశాలకు పారిపోవడంపై ఆ పార్టీ శ్రేణులే మండిపడుతున్నాయి. రేషన్ షాపులో అక్రమాలు జరగకపోతే స్టాకులో 330 కిలోల బియ్యం, 152 ప్యాకెట్ల పంచదార ఏమైనట్టని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. -
బోడె... మామూలోడు కాదు.. ఆది నుంచీ అంతే! ఏకంగా 33 కేసులు
సాక్షి ప్రతినిధి, విజయవాడ/పెనమలూరు: వివాదాలు, గొడవలు, దౌర్జన్యాలకు లెక్కేలేదు. సెటిల్మెంట్లు, దందాలు, అధికారులపై దాడులకు అంతూ పొంతూ లేదు. అధికారంలో ఉన్నప్పుడే కాదు, లేనప్పుడూ దూకుడు తగ్గలేదు. ఒకటీ రెండూ కాదు ఏకంగా 33 కేసులు నమోదు చేయించుకొన్న ఘనుడు పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బోడె ప్రసాద్. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. రెండు రోజుల క్రితం పెనమలూరులో ఓ రేషన్ షాపు తనిఖీలకు వెళ్లిన డెప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓలపై హత్యాయత్నానికి పాల్పడి మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. మన బోడె కేసుల చిట్టా పరిశీలిస్తే దిమ్మ తిరిగిపోవాల్సిందే. సామాన్యుల నుంచి అధికారుల వరకు.. పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెతుత్తున్నాయి. పోలీసు కేసుల్లో ఇరుక్కోవటం, అధికారులపై దౌర్జన్యం చేయడం ఆయనకు కొత్త కాదు. అయినా టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీ నేతలు బోడెకు అండగా నిలుస్తున్నారు. బోడె ప్రసాద్ గత చరిత్రను ఒక్క సారి పరిశీలిస్తే.. టీడీపీ పాలనలో వెలుగు చూసిన కాల్‌మనీ, సెక్స్ రాకెట్ ఘటనలో ఆయన ప్రమేయం ఉన్నట్లు అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అప్పట్లో పార్టీ అధికారంలో ఉండటంతో ఆయనపై కాల్‌మనీ కేసులు నమోదు కాలేదు. చదవండి👉 తెలుగుయువత నేత ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ బోడె ప్రసాద్ సింగపూర్‌లో పర్యటనలో ఉండగా తనకు బదులు మరో వ్యక్తితో పోరంకిలో ఉన్నత విద్య పరీక్ష రాయించారన్న వివాదం కూడా ఉంది. అంతేకాదు గతంలో వణుకూరులో ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ తవ్వకాలను అప్పటి విజయవాడ సబ్‌కలెక్టర్ మీషా సింగ్ అడ్డుకున్నారు. మట్టి తవ్విన పొక్లెయిన్‌ను స్వాధీనం చేయాలని మీషాసింగ్ ఆదేశించగా బోడె ప్రసాద్ దురుసుగా ప్రవర్తించి పొక్లెయిన్‌ను దాచేసి, సబ్‌కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించిన ఘటన సంచలనం కలిగించింది. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డే లేదు. జగన్నాథపురంలో ప్రభుత్వ భూమిలో ఇళ్ల స్థలాలు ఇస్తానంటూ బందరు రోడ్డు విస్తరణ బాధితుల వద్ద డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటి వరకూ పట్టాలు ఇవ్వలేదు. యనమలకుదురులో గ్రూప్ హౌస్‌లు ధ్వంసం వ్యవహారంలో కూడా బోడె ప్రసాద్ పేరు ప్రముఖంగా వినిపించింది. చదవండి👉🏻 నకిలీ మందుల ఊసే ఉండకూడదు సమస్యలను నివేదించడానికి వచ్చిన ప్రజలను దూషిస్తున్న బోడె ప్రసాద్ (ఫైల్) కేసుల్లో ఘనాపాటి బోడె ప్రసాద్ దురుసు ప్రవర్తనతో ఇప్పటి వరకు 33 పోలీసు కేసులు నమోదయ్యాయి. ఆరు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా డెప్యూటీ తహసీల్దార్ గుమ్మడి విజయ్‌కుమార్‌పై దాడి కేసులో ఆయన పారిపోయాడు. ఈ కేసులో తొమ్మిది మంది కటకటాల పాలై, బొడే ఒక్కరే పారిపోవడం వెనుక పోలీసుల మెతక వైఖరి ఉందన్న విమర్శలున్నాయి. ఓ పోలీసు అధికారి లోపాయికారీగా ఆయనకు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నియోజకవర్గ స్థాయి నేత పోలీస్‌స్టేషన్‌లో కూర్చొని బోడెను కేసు నుంచి తప్పించేందుకు చర్చలు సాగించినట్లు ప్రచారం జరుగుతోంది. బోడె ఒక్కడే పారిపోడం దీనికి ఊతం ఇవ్వడంతోపాటు స్థానిక పోలీసు అధికారుల తీరుపై అనుమానాలకు తావిస్తోంది. తరచూ వివాదాల్లో నిలిచే ఆయనపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించకుండా, రౌడీ షీట్ ఓపెన్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి👉 నారాయణ, లింగమనేని పిటిషన్లపై విచారణ వాయిదా -
పుట్టింటికి వెళ్లిన భార్య.. బాధతో భర్త.. చివరికి విషాదం..
పెనమలూరు(కృష్ణా జిల్లా): భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెనమలూరుకు చెందిన పోలగాని నాగరాజు(25)కు అదే గ్రామానికి చెందిన బంకా కృపతో వివాహమైంది. శుక్రవారం వడ్లు కాటా వేసే పనికి వెళ్లిన నాగరాజు రాత్రి ఇంటికి చేరాక భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. విషయం తెలిసిన నాగరాజు తండ్రి రాంబాబు కొడుకు ఇంటికి వచ్చి చూడగా నాగరాజు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపారు. చదవండి: సోడా తాగి వస్తా.. ఇంట్లో నుంచి వెళ్లిన వివాహిత అదృశ్యం -
విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన
-
హాస్టల్లో ఉండలేనమ్మా!, 10 నిముషాల్లోనే ఘోరం
పెనమలూరు/పెద్దతిప్పసముద్రం: ఓ ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన పోరంకిలోని శ్రీ చైతన్య క్యాంపస్‌లో సోమవారం చోటు చేసుకుంది. కృష్ణాజిల్లా పెనమలూరు సీఐ ఎం.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలం రంగసముద్రం గ్రామానికి చెందిన మదన్‌మోహన్‌రెడ్డి, మంజుల దంపతుల కుమార్తె బట్టి శిరీష (17) పోరంకిలోని శ్రీచైతన్య సరస్వతీ సౌధంలో ఇంటర్ (బైపీసీ) రెండో సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ప్రాక్టికల్స్ పరీక్ష రాసిన ఆమె తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 7వ తేదీన ఇంటికి వెళ్లింది. మరలా సోమవారం తల్లితో కలిసి పోరంకిలోని కాలేజీకి వచ్చింది. తాను హాస్టల్లో ఉండలేనని తల్లికి చెప్పగా.. ఆమె నచ్చజెప్పింది. దీంతో రూమ్‌లోకి వెళ్లి వస్తానని చెప్పి అరుంధతి బ్లాక్ రూమ్ నంబర్ 247లోకి వెళ్లింది. పది నిమిషాలైనా కుమార్తె తిరిగి రాకపోవడంతో తల్లి, కాలేజీ యాజమాన్యం రూమ్‌లోకి వెళ్లి చూడగా శిరీష చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. ఆమెను వెంటనే కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లగా, అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. సమాచారం అందుకున్న యువతి తండ్రి మదన్‌మోహన్‌రెడ్డి హుటాహుటిన సోమవారం కళాశాలకు వెళ్లారు. -
12న వలంటీర్లకు అవార్డులు
పెనమలూరు: ఈ నెల 12న పోరంకిలో నిర్వహించనున్నపెనమలూరు నియోజకవర్గ వలంటీర్ల అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొంటున్నట్టు కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు. ఆయన బుధవారం పోరంకి శివారులోని మురళీ రిసార్ట్స్‌ను పరిశీలించి అవార్డుల కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ప్రతి నియోజకవర్గంలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లలో ఐదుగురికి సేవా వజ్ర, ఐదుగురికి సేవా రత్న, ఏడాదిగా ఎటువంటి అంతరాయం లేకుండా పని చేస్తున్న వలంటీర్లకు సేవా మిత్ర అవార్డులు ప్రదానం చేస్తున్నట్టు తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో పనిచేస్తున్న 1,500 మంది వలంటీర్లలో ఉత్తమ సేవలందించిన వలంటీర్లకు సీఎం చేతుల మీదగా అవార్డులిస్తామన్నారు. కార్యక్రమంలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, సీపీ బత్తిన శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
‘వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందని గడప లేదు’
సాక్షి, కృష్ణా : అనేక సంక్షేమ పథకాలతో దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్నారని పెనమలూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. నేడు వైఎస్సార్ తమ మధ్య లేకపోవడం ప్రతి పేదవాడికి తీరనిలోటు అని పేర్కొన్నారు. బుధవారం వైఎస్సార్ 11వ వర్ధంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ నియోజకవర్గంలో పార్టీలకతీతంగా అందరూ వైఎస్సార్‌కు ఘనమైన నివాళులు ఆర్పిస్తున్నారని తెలిపారు. ఆయన పాలనలో రాష్ట్రంలో లబ్ధి పొందని ఇంటి గడప లేదని వ్యాఖ్యానించారు. (ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది) కుల,మత,పార్టీలు చూడకుండా పేదవారందరికి పధకాల ద్వారా మేలు చేశారని పార్థసారధి గుర్తు చేసుకున్నారు. పేదవాడి చదువుకై విప్లవాత్మక ఆలోచన చేసి..పేద పిల్లలు చదివితే ఆ కుటుంబాల అభివృద్ధి చెందుతాయని ఫీజు రీయింబర్స్మెంట్ తెచ్చారన్నారు. పేదలందరికి ఇళ్ళు కట్టించిన గొప్ప వ్యక్తి, మొదటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని కీర్తించారు. దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారికోసం ఆరోగ్య శ్రీ తీసుకు వచ్చారని, దీని వల్ల పేదోడు కూడా కోటేశ్వరుడితో సమానంగా వైద్యం పొందేలా చేశారని కొనియాడారు.(‘పశ్చిమ’ తీరం.. అభివృద్ధి సమీరం) ‘మన అదృష్టం కొద్ది ఆయన తనయుడు మన ముఖ్యమంత్రిగా వచ్చి ఆయన ఆశయాలు నెరవేర్చుతున్నారు. నాన్న ఒక్క అడుగు వేస్తే రెండడుగులు వేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట ఇచ్చారు. చెప్పిన రీతిలోనే తండ్రి రీయింబర్స్మెంట్ తీసుకు వస్తే తనయుడు అమ్మ ఒడితో పేదలకు అండగా నిలబడ్డారు. తండ్రి 45 లక్షల ఇళ్లు కడితే విభజిత రాష్టంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నారు. పేదల పాలిట నిజమైన దేవుడు జగన్మోహన్రెడ్డి’ అని ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. (రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు) -
టీడీపీ నేత పాల వ్యాన్‌లో అక్రమ మద్యం
సాక్షి, ఉయ్యూరు(పెనమలూరు): టీడీపీ నేతకు చెందిన విజయ పాల వ్యాన్‌లో అక్రమ మద్యం పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో మద్యం సీసాలు దొరకడంతో పాల వ్యాపారం మాటున అక్రమ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారన్న అనుమానాలు నెలకొన్నాయి. పట్టుబడిన వ్యాన్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ సన్నిహితుడైన కంకిపాడు మండలం తెన్నేరు గ్రామ టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాది కావడం, ఆయన విజయ పాల సరఫరాకు కాంట్రాక్ట్ పద్ధతిపై వ్యాన్ తిప్పుతుండంతో అక్రమ మద్యం వ్యాపారం టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. టీడపీ నేత పాలవ్యాన్‌లో లిక్కర్ బాటిళ్లు తరలిస్తున్నారు మద్యం సీజ్.. ముగ్గురు అరెస్ట్ విజయ పాల డెయిరీలో అక్రమ మద్యం సీసాలు పట్టుబడిన వైనం సంచలనమైంది. అవనిగడ్డ నుంచి వస్తున్న పాల వ్యాన్‌లో 50 క్వార్టర్ మద్యం బాటిళ్లు, 5 ఫుల్ బాటిళ్లు సంచిలో మూటగట్టి ఉన్నాయి. ఆదివారం ఉయ్యూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేసే క్రమంలో పాల వ్యాన్‌లో మద్యం ఇవి బయటపడ్డాయి. సీఐ నాగప్రసాద్, ఎస్ఐ గురుప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది మద్యం బాటిళ్లను స్వా«దీనం చేసుకుని పాల వ్యాన్‌ను సీజ్ చేసి క్యాషియర్ పాలేపు గుప్తా, సిబ్బంది పట్టాభిరావు, వికాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. పాల వ్యాన్ కంకిపాడు మండలం తెన్నేరు గ్రామానికి చెందిన టీడీపీ అధ్యక్షుడు యార్లగడ్డ రాజాదిగా గుర్తించారు. రాజా టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌కు అత్యంత సన్నిహితుడు కావడంతో పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. చట్ట ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. చదవండి: తెలుగు తమ్ముళ్లకు రైతుల ముసుగు కాంట్రాక్ట్ రద్దుచేసిన విజయ డెయిరీ చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): విజయ పాల వ్యాన్‌లో మద్యం తరలిస్తున్న కాంట్రాక్టర్‌పై సదరు సంస్థ చర్యలు తీసుకుంది. ఉయ్యూరులో విజయ పాల వ్యాన్‌లో మద్యం రవాణా చేస్తున్న ఘటనపై విజయ డెయిరీ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఈశ్వర్‌బాబు స్పందించారు. పాల వ్యాన్‌ను నడుపుతున్న వై. రాజా కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా పాల వ్యాన్లను ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించనున్నట్లు జేఎండీ పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల దాతృత్వం
సాక్షి, కృష్ణా జిల్లా: కష్టకాలంలోనూ పేదలకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు స్ఫూర్తి కలిగించేలా ఉన్నాయని పెనమలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి అన్నారు. గురువారం ఎమ్మెల్యే ఆరు లక్షల రూపాయల వ్యయంతో పదివేల కూరగాయల కిట్లు, 30 వేల కోడిగుడ్లు పంపిణీ చేశారు. వీటిని కంకిపాడు మండలం ఉప్పులూరు నుంచి పంపిణీ చేశారు. ఒక్కో కిట్టులో అయిదు రోజులకు సరిపడా కూరగాయలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్ల రేషన్, బియ్యం కార్డులేని ప్రతీ పేదవాడికి ఆర్థిక భరోసాకు ఉచిత బియ్యం సీఎం ఆదేశించారని తెలిపారు. (లాక్‌డౌన్‌ను పొడిగించిన తొలి రాష్ట్రం.. ) పశ్చిమగోదావరి జిల్లా: తణుకు వైఎస్సార్సీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పలువురి వాలంటీర్లకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లను ఉచితంగా పంపిణీ చేశారు. యలమంచిలి మండలం చించినాడ, నెరేడుమిల్లి గ్రామాల్లో నియోజకవర్గ ఇంచార్జి, డీసీసీబీ చైర్మన్ కవురు శ్రీనివాస్, మండల కన్వీనర్ పొత్తూరి బుచ్చిరాజు.. లాక్డౌన్ కారణంగా వారం రోజులకు సరిపడా కూరగాయలు పంపిణీ చేశారు. (‘తెలియక తప్పు చేశా..నరకం చూశా’ ) అనంతపురం: పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి.. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఒక్కో పాత్రికేయుడికి 25 కిలోల బియ్యం, కందిపప్పు, నూనె, గోధుమ పిండి తదితర వస్తువులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా సమాచారం ప్రజలకు చేరవేయడంలో మీడియా సోదరుల పాత్ర కీలకమైందన్నారు. విపత్కర సమయంలో పాత్రికేయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. మరోవైపు గుంటూరులోని తెనాలి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్.. 250 మంది పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే ప్రకాశంలోని సింగరాయకొండ మండలం ఊళ్ళపాలెం పల్లెపాలెం గ్రామాలలో కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ వెంకయ్య సుమారుగా 3లక్షల విలువచేసే నిత్యవసర వస్తువులు అందజేశారు. (నా అభిమాన హీరో సినిమాలు చూస్తున్నా: టైగర్) -
ఎన్నారై భర్త మోసం.. ఫొటోలు మార్ఫింగ్ చేసిన మరిది
సాక్షి, కృష్ణా: ఎన్నారై భర్త మోసం చేయడంతో ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. రెండో పెళ్లి చేసుకుని విదేశాలకు పారిపోతున్న అతడిని ఎలాగైనా అడ్డుకోవాలని స్టేషను దగ్గర ఆందోళనకు దిగింది. వివరాలు... కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన అనూష అనే మహిళకు 2015 అక్టోబరులో మధు అనే వ్యక్తితో వివాహం జరిగింది. ఈ క్రమంలో వీరిరువురు కొంతకాలం మలేషియాలో కాపురం ఉన్నారు. ఆ తర్వాత అనూషను వదిలించుకోవాలనే ఉద్దేశంతో మధు ఆమెను అక్కడే వదిలేసి ఇండియాకు తిరిగివచ్చేశాడు. ఈ నేపథ్యంలో తనకు అన్యాయం జరిగిందని గుర్తించిన అనూష అత్తింటికి చేరుకుని భర్తను నిలదీసింది. దీంతో అదనపు కట్నం తేవాలంటూ అత్తింటి వారు ఆమెను వేధించారు. అనూష మరిది రాజేశ్ ఏకంగా వదిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో భర్త మధు మీద అనూష గతంలో కేసు పెట్టింది. ఇదిలా ఉండగా మధు మరో మహిళను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని అనూష స్థానిక పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేసింది. రెండో భార్యతో పెనుగంచిప్రోలు ఆలయంలో పూజలు చేస్తుండగా తమ బంధువులు వీడియోలు తీశారని పేర్కొంది. వారిద్దరూ కలిసి జర్మనీకి వెళ్లేందుకు వీసా కూడా రెడీ చేసుకొన్నారని ఆరోపించింది. పోలీసు కేసు నడుస్తుండగా వీసాకు క్లియరెన్స్ ఎలా వచ్చిందో అర్థంకావడం లేదని అనూష వాపోయింది. మరోవైపు అనూష భర్త మధు మాత్రం తనకు ఎవరితోనూ వివాహేతర సంబంధం లేదని... భార్య ఆరోపిస్తున్నట్లుగా సదరు అమ్మాయి తనకు కేవలం స్నేహితురాలు మాత్రమే అని పేర్కొన్నాడు. ఇక మధు తల్లిదండ్రులు అనూష కేవలం అనుమానంతో ఆరోపణలు చేస్తోందని చెప్పుకొచ్చారు.