ప్రేమా...పెళ్లీ...జాన్తానయ్... | Husband's complaints about his wife in vijayawada | Sakshi
Sakshi News home page

ప్రేమా...పెళ్లీ...జాన్తానయ్...

Published Thu, Jun 12 2014 11:07 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

ప్రేమా...పెళ్లీ...జాన్తానయ్... - Sakshi

ప్రేమా...పెళ్లీ...జాన్తానయ్...

విజయవాడ : వాళ్లిద్దరూ ఇంజినీరింగ్ విద్యనభ్యసించారు. ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కొద్దికాలం క్రితమే పెళ్లి చేసుకున్నారు. కలసి కాపురం కూడా చేశారు. అయితే హఠాత్తుగా ఆమె ప్రేమా లేదు... పెళ్లీలేదు.. అంటూ భర్తను వదిలేసి మరో పెళ్లికి సిద్ధపడింది. దాంతో భార్య తనను మోసం చేసిందంటూ బాధిత భర్త పెనమలూరు పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల్లోకి వెళితే కానూరుకు చెందిన ఓ యువకుడు ఇంజినీరింగ్ చదివి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. పోరంకికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరు గత జనవరిలో గుణదలలో వివాహం చేసుకున్నారు. వీరు కొంతకాలం కలిసి ఉన్న తరువాత ఆమె భర్తతో కాపురం చేయబోనని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. తన భార్య మరో వ్యక్తిని వివాహం చేసుకుంటోందని ఫిర్యాదు చేశాడు.

ఈ నేపథ్యంలో పోలీసులు ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను పిలిచి విచారణ జరిపారు. అయితే తనను బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని, తనకీ పెళ్లి ఇష్టం లేదని ఆమె తెలపటంతో పోలీసులకు ఏంచేయాలో పాలుపోక ఎవరిదారి వారు చూసుకోండని...చేతులెత్తేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement