Cheating
-
మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది..
గచ్చిబౌలి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఘరానా మోసానికి పాల్పడిన వ్యక్తి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన ప్రకారం..ఖాజాగూడలోని సాయి వైభవ్ లేఅవుట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి డాక్టర్‌గా పనిచేస్తున్న తన కూతురుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. ఈ క్రమంలోనే తెలుగు మ్యాట్రిమోనిలో అమ్మాయి వివరాలు ఉంచాడు. ఈ వివరాలు తెలుసుకున్న రాయపాటి కృష్ణ చౌదరి అనే వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయి నచ్చిందిని చెప్పాడు. తన అక్క మాధురి, నాన్న రంగ ప్రసాద్, అమ్మ రాణిదేవి ఆ్రస్టేలియా ఉంటున్నారని నమ్మించాడు. ఫోన్లో వారితో మాట్లాడించి అమ్మాయి నచ్చిందిని చెప్పించాడు. ఆగస్టు 14న ఇంటికి వచ్చి త్వరలోనే ఎంగేజ్మెంట్ పెట్టుకుందామని చెప్పాడు. అమ్మాయికి కేజీ బంగారు నగలు తీసుకుంటున్నామని, కొంత డబ్బు తక్కువ పడిందని చెప్పాడు. దీంతో తమ అమ్మాయికే నగలు పెడుతున్నారని నమ్మి బాధితులు నవంబర్ 28,29,30 తేదీల్లో రూ.19 లక్షల నగదు, ఆన్లైన్లో రూ.2.2 లక్షలు ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తి కాంటాక్ట్‌లోకి రాకపోవడంతో అనుమానం వచ్చి రెండు నెంబర్లకు ఫోన్ చేయగా రెస్పాండ్ కాలేదు. దీంతో ఈ నెల 12న యువతి తండ్రి రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో బీఎన్ఎస్ 318(40, 316(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా మోసానికి పాల్పడిన వ్యక్తి బాచుపల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇప్పటికే పెళ్లి అయ్యిందని, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఎస్ఆర్నగర్ పీఎస్‌లోనూ అతనిపై కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. తెలుగు మ్యాట్రిమోనిలో సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులతో దిగిన ఫోటోలు పెట్టి..పెళ్లి పేరిట ఇతను మోసాలకు పాల్పడుతున్నాడని గుర్తించారు. వివాహేతర సంబంధమే ప్రాణం తీసిందా? -
అమ్మ ఒడి పేరుతో సైబర్ మోసం
ఆలూరు రూరల్ : సైబర్ నేరగాళ్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. అమ్మ ఒడి పేరుతో అమాయకులను బురిడీ కొట్టించి ముగ్గురు వ్యక్తుల నుంచి ఫోన్లో మాట్లాడుతూనే రూ.26,500 వారి ఖాతాల నుంచి కాజేశారు. బాధితులు తెలిపిన వివరాలు.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికెర గ్రామానికి చెందిన నాగరాజు, మల్లికార్జున బతుకుదెరువు కోసం తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు. వారికి ఆదివారం మధ్యాహ్నం 9266495107 నంబర్ నుంచి ఫోన్ వచ్చింది.తాము అమరావతిలోని విద్యాశాఖ కమిషనరేట్ నుంచి మాట్లాడుతున్నామని చెప్పారు. ‘మీకు అమ్మ ఒడి వచ్చిందా’ అంటూ ఫోన్ చేసిన వ్యక్తి అడిగి.. వారి వ్యక్తిగత వివరాలు సేకరించారు. అతడి మాటలు నమ్మిన నాగరాజు, మల్లికార్జునలు తమకు రాలేదని చెప్పారు. దీంతో ఆగంతకుడు మీ వలంటీర్ ఆనంద్‌ను కాన్ఫరెన్స్‌లో తీసుకుంటున్నానంటూ వలంటీర్‌కు కాల్ చేశాడు. అనంతరం ఆనంద్‌తో తాను అమరావతి నుంచి మాట్లాడుతున్నామని.. మల్లికార్జున, నాగరాజులకు అమ్మ ఒడి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.త్వరలోనే మీ ఐడీలను అప్డేట్ చేస్తామంటూ వారి పూర్తి వివరాలనూ ఫోన్ చేసిన వ్యక్తి తెలుసుకున్నాడు. అనంతరం ‘నీకు పనిచేయడం రాదా’ అంటూ వలంటీర్‌ను దబాయిస్తూ మాట్లాడాడు. ఆగంతకుడు ఫోన్ కట్ చేయగానే.. నాగరాజు ఖాతా నుంచి రూ.12,500, మల్లికార్జున అకౌంట్ నుంచి రూ.9 వేలు, వలంటీర్ ఆనంద్ ఖాతా నుంచి నుంచి రూ.5 వేలు మాయం అయ్యాయి. బాధితులు లబోదిబోమంటూ జరిగిన విషయాన్ని గ్రామస్తులకు ఫోన్ చేసి చెప్పారు. -
పెళ్లి కొడుక్కి ‘సినిమా చూపించిన మావా!’
మరికొద్ది గంటల్లో అక్కడ వివాహ మహోత్సవం జరగాల్సి ఉంది. పెళ్లి బాజాలతో అక్కడంతా కోలాహలం నెలకొంటుందని అనుకునేరు. బదులుగా.. పెండ్లి కొడుకు వీపు విమానం మోత మోగింది. అయితే.. అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు.. ఆ దాడిని ఆపారు. తన్నులు తిన్న ఆ యువకుడికి కడుపు నిండా కమ్మటి భోజనం పెట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈ కథనం చదివి తెలుసుకోండి..సోహన్‌లాల్ యాదవ్‌కు మరో మూడు రోజుల్లో వివాహం జరగాల్సి ఉంది. అయితే సడన్‌గా అతను కనిపించకుండా పోయాడు. దీంతో అతని కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఈలోపు.. ఇదేం తెలియని పెళ్లి కూతురు తరఫువాళ్లు తమ ఏర్పాట్లు చేసుకుంటూ పోతున్నారు. పెండ్లి టైం దగ్గర పడడంతో బాజాభజంత్రీలతో స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. కానీ, అక్కడి నుంచి సీన్ పీఎస్‌కు మారింది.పెళ్లి కొడుకు తరఫు వాళ్లు రాకపోవడంతో.. పెళ్లి కూతురు వాళ్లంతా దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీసుల జోక్యంతో.. అబ్బాయి తరఫు వాళ్లంతా వచ్చారు. చివరకు ఆ అమ్మాయితో వివాహానికి అబ్బాయి ఒప్పుకున్నాడు. అయితే.. అదేరోజు మరో ముహూర్తానికి వివాహం జరగాల్సి ఉంది. కానీ, ఇంతలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. మూడు రోజులపాటు కనిపించకుండా పోయిన ఆ యువకుడు.. మరో ఊరిలో ఇంకో అమ్మాయితో కలిసి ఉన్నాడని అమ్మాయి తరఫు వాళ్లకు తెలిసింది. దీంతో ఆగ్రహంతో గ్రామస్తులంతా అతన్ని చితకబాదారు. ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఆ దాడిని ఆపారు. ఆ యువకుడికి భోజనం పెట్టి మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకందామని చెప్పారు. అయితే.. ఇక్కడే ఆ యువకుడికి ఊహించని షాక్ తగిలింది.పెళ్లి కోసం తాము ఎంతో ఖర్చు చేశామని, ఆ డబ్బంతా ఇచ్చి కదలమని కండిషన్ పెట్టారు. దీంతో ఖంగుతినడం అతని వంతు అయ్యింది. ‘‘మేం ఇక్కడికి ఆలస్యంగా వచ్చాం. ఆ మాత్రం దానికే పెండ్లి రద్దు చేసుకున్నారు. పైగా పరిహారం ఇవ్వమని అడుగుతున్నారు. అది ఇచ్చేదాకా నన్ను కదలనివ్వమంటున్నారు. అంతా చెప్తున్నట్లు నేనేం అదృశ్యం కాలేదు. పని మీద ఊరెళ్లా. నా ఫోన్ పని చేయకుండా పోయింది. బాగు చేసుకునేసరికి పోలీసులు రమ్మని పిలిచారు. పెళ్లికి నేను రెడీ, కానీ వాళ్లు సిద్ధంగా లేరు’’ అని పారిపోయే ప్రయత్నం చేసిన పెళ్లి కొడుకు మొబైల్ వీడియో సందేశం ఒకటి వైరల్ అయ్యింది. ఇక అమ్మాయి తండ్రి మాట్లాడుతూ.. 10 నెలల కిందట నా కూతురికి వివాహం నిశ్చయించా. పెండ్లి కొడుకుగా చేశాక.. అతను నాకు కారు కావాలనే డిమాండ్ చేశాడు. ఇవ్వడానికి మేం సిద్ధంగానే ఉన్నాం. ఆపై కారు వద్దు.. క్యాష్ కావాలన్నాడు. దానికీ మేం ఒప్పుకున్నాం. ఆ తర్వాతే అన్ని ఏర్పాట్లు చేశాం. పెండ్లి రోజు బంధువులంతా వచ్చినా.. పెండ్లి కొడుకు రాలేదు. చివరకు.. మా దగ్గరి బంధువును అక్కడికి పంపిస్తే అతను ఊర్లోనే లేడని సమాచారం ఇచ్చాడు. అందుకే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాం. తీరా అక్కడికి వెళ్లే సరికి పీఎస్‌లో ఆ యువకుడు కూడా ఉన్నాడు. వరకట్నం కేసు పెడతామని వాళ్లు హెచ్చరించారు. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాడు. కానీ, మాకీ పెళ్లి ఇష్టం లేదు. అతను చేసిన మోసం ఇప్పుడే బయటపడింది. ఒకవేళ పెండ్లి తర్వాత బయటపడి ఉంటే నా కూతురి జీవితం నాశనం అయ్యేది. అందుకే పరిహారం చెల్లించమని కూర్చున్నాం. ఉత్తర ప్రదేశ్ అమేథీ పోలీసులు ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. अमेठी : दूल्हे राजा के इंतजार में दुल्हन के हाथों की मेहंदी हो गई फीकीकाफी इंतजार के बाद पुलिस के हस्तक्षेप पर सुबह पहुंची बारातसुबह बारात पहुंचने पर दुल्हन के घरवालों ने दूल्हे को बनाया बंधकशादी में हुए खर्च को लेकर अड़े दुल्हन के घर वाले@amethipolice @Uppolice #Amethi pic.twitter.com/VxYSFPcSUQ— Tasleem choudhary (JOURNALIST) (@tasleem7573) December 3, 2024 -
బంగారం బిజినెస్ పేరుతో మోసం.. బాధితుల్లో టాప్ హీరోయిన్లు..?
సాక్షి,హైదరాబాద్:బంగారం వ్యాపారం ముసుగులో రూ.100 కోట్లకు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలను బురిడీ కొట్టించాడు.వ్యాపారంలో వాటా ఇస్తానని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు.బాలీవుడ్ బ్యూటీ పరిణితి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అంటూ అబద్ధాలు చెప్పాడు. చివరకు ఆ ఫేక్ బంగారం వ్యాపారిని పోలీసులు అరెస్టు చేసి కటాకటాల్లోకి నెట్టారు.బంగారం వ్యాపారం ముసుగులో తృతీయ జ్యువెల్లరీ అధినేత కాంతిదత్ చేసింది పెద్ద మోసం అని తెలుసుకున్న సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా సీసీఎస్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. శ్రీజరెడ్డి అనే మహిళావ్యాపారవేత్త ఫిర్యాదుతో విషయం తొలుత వెలుగులోకి వచ్చింది. దీంతో పోలీసులు కాంతిదత్‌ను అరెస్టు చేశారు.కాంతిదత్ బాధితుల్లో హీరోయిన్ సమంత,కీర్తిసురేష్, డిజైనర్ శిల్పారెడ్డి తదితర ప్రముఖులున్నట్లు సమాచారం.కాంతిదత్ మీద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. 100 మందికిపైగా బాధితులున్నట్లు చెబుతున్నారు. -
భర్త బండారాన్ని.. బయటపెట్టిన భార్య
-
చంద్రబాబు పచ్చి మోసంపై ప్రజాగ్రహం
అమరావతి, సాక్షి: ఏపీలో సంక్షేమ వారధులుగా ముద్రపడిపోయిన వలంటీర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు పెద్ద షాకే ఇచ్చారు. గతంలో వాళ్లపై తీవ్ర విమర్శలు గుప్పించి.. ఎన్నికలటైంలో వాళ్లను కొనసాగిస్తానని, జీతం సైతం పెంచుతామని స్వయంగా ఆయన ప్రకటించారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ వ్యవస్థకే మంగళం పాడేశారు.ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో వలంటీర్ వ్యవస్థ మొదలైంది. సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిదారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ వ్యవస్థను మొదలుపెట్టారాయన. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంతకాలం.. వీళ్ల ద్వారానే పౌర సేవలు నిరాటంకంగా సాగాయి. ఎండా, వాన, చలి లెక్కచేయకుండా.. చివరకు కరోనా టైంలోనూ ప్రాణాలకు తెగించి మరీ సేవల్ని అందించారు వాళ్లు. దేశవ్యాప్తంగా వలంటీర్ వ్యవస్థ గురించి చర్చ నడిచింది. అయితే.. ఎన్నికలకు నెలముందు.. టీడీపీ రాజకీయం నడిపించి వలంటీర్లను సంక్షేమ పథకాల పంపిణీకి దూరంగా ఉంచింది. దీంతో లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ఈలోపు ఎన్నికలయ్యాయి. అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా వాళ్లకు ఎలాంటి విధులు అప్పగించలేదు. మరోవైపు.. తమ విధులకు సంబంధించి 2.66 లక్షల మంది వాలంటీర్ల ఆందోళనకు గురయ్యారు. కలెక్టరేట్ల చుట్టూ తిరిగి వినతి పత్రాలు సమర్పించారు. ఇంకోపక్క.. నామ మాత్రంగా సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ కొనసాగించారు. దీంతో వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందా? అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే.. ఇక్కడ వైఎస్సార్సీపీ అనుమానాలే నిజమయ్యాయి. జగన్ ఆలోచనను తుడిచేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది ఆ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. అందుకు తగ్గట్లే.. అసెంబ్లీ సాక్షిగా ఏపీ మంత్రి చేసిన ప్రకటనతో.. చంద్రబాబు ప్రభుత్వం వలంటీర్ల ఊపిరి తీసింది. వలంటీర్లు విధుల్లో లేరని, వాళ్లను కొనసాగించేది లేదని, అలాంటప్పుడు జీతాల పెంపు ఎక్కడిదంటూ? చెప్పడంతో చంద్రబాబు పచ్చి మోసంపై.. ప్రజల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.బుధవారం మండలిలో మండలి ప్రశ్నోత్తరాల సందర్భంగా వలంటీర్ వ్యవస్థపై ప్రశ్న YSRCP ఎమ్మెల్సీల ప్రశ్న.. గ్రామ, వార్డు వలంటీర్లకు గౌరవ వేతనం ఎప్పుడు పెంచుతారు?మంత్రి వీరాంజనేయస్వామి సమాధానం.. ప్రస్తుతం రాష్ట్రంలో వలంటీర్లు పనిచేయడంలేదని చెప్పారు. వారికి ఈ ఏడాది మే వేతనం రూ.277.21 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం వలంటీర్లను నియమించిందని, ఆ తర్వాత వారిని కొనసాగిస్తూ జీవో ఇవ్వలేదని, అందుకే తాము వారిని కొనసాగించలేమని అన్నారు. వలంటీర్ వ్యవస్థే లేనప్పుడు జీతాల పెంపు అంశం ఎలా వస్తుంది. -
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో రూ.26 లక్షలకు కుచ్చుటోపీ
బంజారాహిల్స్: ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.26 లక్షలు వసూలు చేసి ముఖం చాటేసిన భార్యాభర్తలపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ రోడ్డునెంబర్–10లోని వెంకటగిరి స్రవంతినగర్‌లో నివసించే ఆరెవరపు వాసు టీసీఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గత ఏడాది జనవరిలో అక్కడే పనిచేస్తున్న చల్లా శ్రీరామ్ కిరణ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాసుకు పరిచయం అయ్యాడు. తనకు పెద్ద పెద్ద కంపెనీల్లో పరిచయాలు ఉన్నాయని, ఐబీఎం కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. దీంతో వాసు తన స్నేహితులను సంప్రదించి ఒక్కొక్కరి నుంచి రూ.2– 2.5 లక్షల వరకు 17 మంది దగ్గర రూ.26 లక్షలు వసూలు చేసి చల్లా శ్రీరామ్కిరణ్కు ఇచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ 17 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా వీరంతా ఆయా కంపెనీల్లో జాయిన్ కావడానికి వెళ్లినప్పుడు అవి బోగస్ ఆఫర్ లెటర్లు అని తేలింది. లబోదిబోమంటూ బాధితులు చల్లా శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిని సంప్రదించారు. అయితే మరో కంపెనీలో జాబ్‌లు ఇప్పిస్తానని, తనను నమ్మాలని చెప్పాడు. నెలలు గడుస్తున్నా వీరికి జాబ్‌లు ఇవ్వకపోగా డబ్బులు తిరిగి ఇవ్వమంటే ముఖం చాటేశాడని బాధితుడు వాసు పోలీసులకు ఇచి్చన ఫిర్యాదులో పేర్కొన్నారు. బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో ఉద్దేశపూర్వకంగా తమ వద్ద నుంచి రూ.26 లక్షలు వసూలు చేసి మోసగించిన శ్రీరామ్‌కిరణ్, ఆయన భార్య సంధ్యారాణిలపై చర్యలు తీసుకోవాల్సిందిగా బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఇద్దరి పైనా ఐపీసీ సెక్షన్ 406, 420 కింద చీటింగ్ కేసు నమోదు చేసి జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రూ.229 కోట్ల మోసం..ఇద్దరి అరెస్టు
సాక్షి,హైదరాబాద్: అధిక వడ్డీ ఆశ చూపి రూ.229 కోట్లు కొల్లగొట్టిన మాదాపూర్ డీకేజెడ్ టెక్నాలజీ సంస్థ ఇద్దరు డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన డైరెక్టర్లు సయ్యద్ అష్ఫక్ రాహిల్ ఈ కేసులో ఏ2గా ఉండగా అయిషా నాజ్ ఏ9గా ఉన్నారు.17 వేల 5 వందల మంది నుంచి పెట్టుబడికి రెండింతలువ లాభం ఇస్తామని ఆశ చూపి రూ.229 కోట్ల మేర డిపాజిట్లు సేకరించిన డీకేజెడ్ కంపెనీ ఇటీవల బోర్డు తిప్పి డిపాజిట్‌దారులను మోసగించింది. -
నా భర్త నన్ను మోసం చేయలేదు.. షకీబ్ భార్య క్లారిటీ (ఫోటోలు)
-
లేడీ.. కిలాడీ
-
Big Question: ఏపీ చెవిలో సూపర్ పువ్వు
-
పెళ్లి పేరుతో ఘరానా మోసం
గాందీనగర్(విజయవాడ సెంట్రల్): పెళ్లి పేరుతో ఒంటరి, విడాకులు తీసుకున్న మహిళలను మోసం చేస్తున్న కేటుగాడిని విజయవాడ గవర్నర్‌పేట పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో నిందితుడి మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన తుమ్మా మోహన్‌రెడ్డి వ్యసనాలకు బానిసై భార్య, పిల్లలను వదిలేశాడు. ఉన్న డబ్బులన్నీ షేర్ మార్కెట్లో పోగొట్టుకున్నాడు. అనంతరం సులభంగా డబ్బులు సంపాదించేందుకు ‘పెళ్లి కొడుకు’ అవతారం ఎత్తాడు. తెలుగు మ్యాట్రిమోని, షాదీ డాట్ కామ్ తదితర వెబ్సైట్లలో రకర కాల పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు. ఒంటరి మహిళలను పరిచయం చేసుకునేవాడు. మాయమాటలతో నమ్మించి.. డబ్బు, బంగారం తీసుకొని పారిపోయేవాడు. ఈ క్రమంలో తెలుగు మ్యాట్రిమోని ద్వారా విజయవాడకు చెందిన ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు. తన పేరు ‘కార్తీక్‌రెడ్డి.. సాఫ్ట్వేర్ ఉద్యోగిని.. విల్లాలు ఉన్నాయి’ అంటూ మాయమాటలు చెప్పాడు. పెళ్లి చేసుకుందామని ఒప్పించాడు. ఫొటోషూట్ కోసం నగలతో రావాలని సూచించాడు. ఆ ఫొటోలను తన తల్లిదండ్రులకు చూపించి పెళ్లికి ఒప్పిస్తానని ఆమెను నమ్మించాడు. దీంతో ఆమె ఈ ఏడాది ఏప్రిల్ 14న విజయవాడలోని ఓ హోటల్‌కు వెళ్లింది. ఫొటోషూట్ కోసం సిద్ధమై రావాలని ఆమెను వాష్‌రూమ్‌కు పంపించాడు. ఆమె తెచ్చిన 16 తులాల బంగారం, సెల్‌ఫోన్‌తో హోటల్ నుంచి ఉడాయించాడు. దీనిపై బాధితురాలు గవర్నర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి విచారించగా.. అతని మోసాలన్నీ బయటపడ్డాయి. మోహన్‌రెడ్డి మోసాలివే.. » 2021 సెపె్టంబర్లో తెలంగాణలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఓ మహిళ కారును తీసుకెళ్లిపోయి అమ్మేశాడు. » 2023 నవంబర్‌లో గుంటూరుకు చెందిన మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. రూ.7 లక్షలు తీసుకుని పారిపోయాడు. » 2023 నవంబర్‌లో తెలంగాణలో ఓ మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి 25 తులాల బంగారం అపహరించాడు. » 2023 జనవరిలో తెలంగాణలోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భర్తతో విడిపోయి ఒంటరిగా ఉన్న డాక్టర్‌ను పరిచయం చేసుకుని.. ఆమె క్రెడిట్ కార్డు ద్వారా రూ.లక్షలు వాడుకుని పారిపోయాడు. -
నా బాయ్‌ఫ్రెండ్ మోసం చేశాడు!
తమిళం, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటించి గుర్తింపు పొందిన నటి నివేద పేతురాజ్. తమిళంలో తిరునాళ్ కూత్తు చిత్రంతో కథానాయకగా పరిచయమైన ఈమె ఆ తర్వాత టిక్ టిక్ టిక్, సంఘతమిళన్ వంటి పలు చిత్రాల్లో నటించారు. అలా విజయ్ సేతుపతి, విజయ్ ఆంటోని వంటి హీరోల సరసన నటించినా ఇప్పటికీ స్టార్ ఇమేజ్ కోసం పోరాడుతూనే ఉన్నారు. అలాగే తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం అవకాశాలు తగ్గడంతో వెబ్ సిరీస్‌లలో నటిస్తున్నారు. ఈమె నటించిన పరువు అనే వెబ్ సిరీస్ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తమిళంలో కొత్త చిత్రాలకు కమిట్ అయినట్టు చెబుతున్న నివేద పేతురాజ్ ఇటీవల కారులో వెళుతూ ఒక ట్రాఫిక్ పోలీస్తో గొడవ పడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది తాను నటిస్తున్న వెబ్ సిరీస్ ప్రమోషన్లో ఒక భాగం అని ఆ తర్వాత తెలిసింది. కాగా ఈమె ఇటీవల ఒక భేటీలో ఇలా పేర్కొన్నారు. తన నెగెటివ్ ఆలోచనలన్నీ వాస్తవ రూపం దాల్చుతున్నాయని చెప్పారు. ఒకరోజు తన బాయ్‌ఫ్రెండ్ తన మోసం చేశాడని ఊహించుకున్నానన్నారు. ఆ తర్వాత అదే విధంగా జరిగిందన్నారు .తన బాయ్‌ఫ్రెండ్ మరెవరినో తీసుకుని వెళ్లిపోయాడని చెప్పారు. లేకపోతే ప్రస్తుతం తాను వాడుతున్న కారు నుంచి భవిష్యత్తులో కొనుక్కు పోయే కారు వరకు తన నెగటివ్ ఆలోచనలలేనని నటి నివేద పేతురాజు పేర్కొన్నారు. కాగా ఈ 32 ఏళ్ల పరువాలగుమ్మలో మంచి నటినే కాకుండా బైక్ రేసర్ క్రీడాకారిణి కూడా ఉన్నారన్నది గమనార్హం. -
అక్రమాలకు పాల్పడిన టీచర్ల జంట.. రూ. 9 కోట్లు రికవరీకి చర్యలు
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే అక్రమాలకు పాల్పడితే.. అది కూడా తమకు ఉద్యోగాన్నిచ్చిన ప్రభుత్వాన్నే మోసగించాలని చూస్తే.. దాని పర్యవసానం ఎలా ఉంటుందో రాజస్థాన్‌లో వెల్లడయ్యింది. తమ స్థానంలో డమ్మీ టీచర్లను నియమించి, ఉద్యోగ విధులను చేస్తున్నట్లు నాటకమాడిన ఉపాధ్యాయ దంపతులపై ఇప్పుడు కోలుకోలేని దెబ్బ పడింది.రాజస్థాన్‌లోని బరన్ జిల్లాలో తమ స్థానంలో డమ్మీ టీచర్లను ఏర్పాటు చేసి, వారి చేత పాఠశాలలో విద్యాబోధన చేయిస్తున్న ఉపాధ్యాయ దంపతుల అక్రమాలపై విద్యాశాఖ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీరి నుంచి రూ.9 కోట్ల 31 లక్షల 50 వేల 373 రికవరీ చేయాలని విద్యాశాఖ తన ఫిర్యాదులో పోలీసులను కోరింది.మీడియాకు అందిన సమాచారం ప్రకారం విష్ణు గార్గ్ 1996 నుండి, అతని భార్య మంజు గార్గ్ 1999 నుంచి బరన్ జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే వీరు తమ బదులు డమ్మీ టీచర్లను నియమించి, వారిచేత విద్యార్థులకు బోధన సాగేలా చూస్తున్నారు. 2017లోనే వీరి వ్యవహారం బయటపడింది. అయితే రాజస్థాన్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ఉపాధ్యాయులపై విద్యాశాఖ ఉచ్చు బిగించింది.పోలీసులు, విద్యా శాఖ సంయుక్తంగా దాడులు నిర్వహించి, ఈ ఇద్దరు ఉపాధ్యాయుల స్థానంలో నియమితులైన ముగ్గురు డమ్మీ ఉపాధ్యాయులను పట్టుకున్నారు. విషయం తెలుసుకున్న ఆ ఉపాధ్యాయ దంపతులు అరెస్టుకు భయపడి పరారయ్యారు. అక్రమాలకు పాల్పడిన ఈ ఇద్దరు ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్ తెలిపారు. -
యూఎస్ మహిళను బురిడి.. 300 విలువ చేసే నగలను రూ. 6 కోట్లకు అమ్మి
విదేశీ మహిళను ఓ నగల వ్యాపారి నిట్ట నిలువునా మోసం చేశాడు, నాణ్యమైన బంగారు నగలపేరుతో ఒకటి కాదు రెండు కాదు ఆరు కోట్ల రూపాయల దోపిడికి పాల్పడ్డాడు. ఈ ఘోరం రాజస్థాన్‌లో వెలుగుచూసింది. వివరాలు..అమెరికాకు చెందిన చెరిష్ అనే మహిళ జైపూర్‌లోని జోహ్రీ బజార్‌లోని బంగారు దుకాణం యజమాని నుంచి బంగారు పాలిష్‌తో కూడిన బెండి అభరణాలను కొనుగోలు చేసింది. అయితే వాటికి అక్షరాల రూ. 6 కోట్లు వెచ్చించింది. డాది ఏప్రిల్‌లో యూఎస్‌లో జరిగిన ఎగ్జిబిషన్లో ఆ ఆభరణాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో అవి నకిలీవని తేలింది. వాటి విలువ కేవలం రూ. 300 మాత్రమేనని తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే సదరు మహిళ జైపూర్‌కి వచ్చి షాప్ యజమాని గౌరవ్ సోనీని నిలదీసింది.అయితే దుకాణం యాజమాని ఆమె ఆరోపణలను కొట్టిపాడేశాడు. దీంతో చెరిష్ జైపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే యూఎస్ ఎంబసీ అధికారుల నుంచి కూడా సహాయం కోరింది. స్పందించిన అధికారులు ఈ విషయాన్ని పరిశీలించవలసిందిగా జైపూర్ పోలీసులను కోరారు.కాగా 2022లో ఇన్స్టాగ్రామ్ ద్వారా గౌరవ్ సోనీతో పరిచయం ఏర్పడిందని.. గత రెండేళ్లుగా ఆభరణాల కోసం ₹ 6 కోట్లు చెల్లించినట్లు ఆ మహిళ పోలీసులకు తెలిపింది. ప్రస్తుతం గౌరవ్, అతని తండ్రి రాజేంద్ర సోనీ పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
Mosh Pub: అమ్మాయిలను ఎరగా వేసి దందా చేస్తున్న మోష్ పబ్..
సాక్షి,హైదరాబాద్: డేటింగ్ యాప్స్ కేంద్రంగా పబ్స్ యజమానులు, కొందరు యువతులు చేస్తున్న భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ యాప్స్ ఆధారంగా వ్యాపారులు, బడా బాబులకు ఎర వేయడం, వాళ్లను పబ్స్‌కు రప్పించడం ఇందులో మొదటి ఎత్తు. సదరు యువతులకు మద్యం పేరుతో సాఫ్ట్ డ్రింక్స్ సరఫరా చేసే పబ్స్ నిర్వాహకులు భారీ బిల్లుల్ని మాత్రం వెంట వచి్చన వారికి ఇస్తాయి. ఇలా వచ్చిన సొమ్ములో కొంత వాటా ఆ యువతులకు ఇస్తున్నాయి. కొన్నాళ్లుగా గుట్టుగా సాగుతున్న ఈ దందాలో అనేక మంది బాధితులుగా మారినా ఎవరూ బయటపడలేదు. సోమవారం హైటెక్ సిటీ సమీపంలోని మోష్ పబ్‌లో మోసపోయిన వ్యాపారి సోషల్ మీడియా ద్వారా తన గోడు వెళ్లబోసుకోవడంతో వెలుగులోకి వచి్చంది. ఓ యువతి వలలో పడి రూ.40,505 బిల్లు చెల్లించిన ఆ బాధితుడి వ్యధ ఇది.. టిండర్ యాప్ ద్వారా పరిచయం.. నగరానికి చెందిన వ్యాపారికి డేటింగ్ యాప్ టింబర్ ద్వారా రితికగా పేరు చెప్పుకున్న యువతి పరిచయమైంది. కాసేపు చాటింగ్ చేసిన ఈమె కలుద్దామంటూ ఆఫర్ ఇచ్చింది. వ్యాపారి సైతం ఆసక్తి చూపించడంతో హైటెక్ సిటీ మెట్రో స్టేషన్నుమీటింగ్ పాయింట్‌గా చెప్పింది. సోమవారం సాయంత్రం అక్కడకు వచ్చిన వ్యాపారిని కలిసిన రితిక కొద్దిసేపటికి సమీపంలోని ఓ భవనం నాలుగో అంతస్తులో ఉన్న పబ్‌కు వెళ్దామని చెప్పింది. అక్కడకు చేరుకున్న తర్వాత కొద్దిసేపు తీయగా మాట్లాడిన రితిక మద్యం తాగుదామంటూ అడిగింది. వ్యాపారి అంగీకరిచడంతో వెయిటర్‌ను కలిసి ఆ పబ్‌లో ఉన్న వాటిలో ఖరీదైన మద్యం ఆర్డర్ ఇచ్చింది. డేటింగ్ యాప్ ద్వారా వల వేయాలని, పడిన వారిని పబ్‌కు తీసుకురావాలని పబ్ యజమానులు–యువతి మధ్య ఒప్పందం ఉంది. ఈ నేపథ్యంలోనే ‘పబ్స్ అండ్ గారల్స్’ కలిసి వినూత్న స్కామ్‌కు తెరలేపారు. మద్యం పేరుతో కూల్‌డ్రింక్స్ సరఫరా.. వ్యాపారితో కలిసి సదరు యువతి రాకను గమనించే పబ్ నిర్వాహకులు వెయిటర్‌ను అప్రమత్తం చేస్తారు. దీంతో అతడు ఏ మద్యం ఆర్డర్ తీసుకున్నా.. గ్లాసుల్లో సరఫరా చేసేది మాత్రం కూల్‌డ్రింకే. రితిక సైతం ఆ రోజు ఒక్కో పెగ్గు రూ.1,799 ఖరీదు చేసే పది పెగ్గుల మద్యం ఆర్డర్ చేసింది. ఈ పేరుతో పబ్ నిర్వాహకులు సరఫరా చేసిన కూల్‌డ్రింక్ తాగుతూపోయింది. దీంతో రూ.20 ఖరీదు చేసే కూల్‌డ్రింక్‌కు యువతి సహకారంతో మద్యం రంగుపూసిన నిర్వాహకులు రూ.1,799 చొప్పున వసూలు చేశారు. ఈ ‘మద్యం’తో పాటు ఇతర డ్రింక్స్, తినుబండారాలు కలిపి రూ.40,505 (పన్నులతో కలిపి) బిల్లు చేసింది. చివరకు వెయిటర్ బిల్లు తీసుకువచి్చన తర్వాత అది వ్యాపారి చేతిలో పెట్టిన యువతి వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ ఉడాయించింది. దాదాపు పది పెగ్గులు తాగిన ఆ యువతిలో ఎలాంటి తేడా లేకపోవడం, తూలకుండా నేరుగా నడిచి వెళ్లడంతో పాటు ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో వ్యాపారికి అనుమానం వచ్చింది. ఆ పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్ పరిశీలించి షాక్ అయ్యాడు. అక్కడ వేదనలు నిత్యకృత్యం సదరు పబ్‌లో ఇలాంటి మోసాలు నిత్యకృత్యమంటూ అనేక మంది వెలిబుచ్చిన వేదనలు ఆ రివ్యూస్‌లో ఆ వ్యాపారికి కనిపించాయి. ఓ వ్యక్తి రూ.16 వేలు, మరో వ్యక్తి రూ.24 వేలు, ఇంకొకరు రూ.20 వేలు చొప్పున చెల్లించారని తెలిసింది. వీరిలో ఒకరైతే బాత్రూమ్కు వెళ్లిన ఆ యువతి కోసం దాదాపు ఏడెనిమిది గంటలు పబ్‌లోనే వేచి ఉన్నారట. దీనికోసం ఆయన చేసిన ఖర్చు మందు బిల్లుకు అదనం. రితిక, కృతిక పేర్లతో కొందరు యువతులు ఇదే పబ్ నిర్వాహకులతో కలిసి ఈ దందా చేస్తున్నారని, అలా వచి్చన మొత్తంలో యువతులు కొంత కమీషన్ తీసుకుంటున్నారని వ్యాపారి గుర్తించారు. ఈ విషయంపై పబ్ నిర్వాహకులను ప్రశ్నించగా.. వారి నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. అంతలోనే రంగ ప్రవేశం చేసిన బౌన్సర్లు బలవంతంగా బిల్లు కట్టించి పంపారు. దీంతో ఆ వ్యాపారి తన గోడును సోషల్ మీడియా ద్వారా వెళ్లబోసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మోష్ పబ్‌పై కేసు నమోదు హైటెక్ సిటీలోని మోష్ పబ్ యాజమాన్యంపై శుక్రవారం సుమోటో కేసు నమోదు చేసినట్లు మాదాపూర్ ఎస్సై ఎన్వీ రమణ తెలిపారు. కొన్ని ఆన్లైన్ డేటింగ్ యాప్స్ ద్వారా అమ్మాయిలతో ఎరవేసి, అలా వచ్చిన కస్టమర్లకు విలువైన మద్యం తాగించి, వారి నుంచి ఎక్కువ మొత్తంలో బిల్లులు వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన అంశాల ఆధారంగా నమోదైన ఈ కేసు దర్యాప్తులో ఉందని, వెలుగులోకి వచి్చన అంశాల ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆయా యువతులకు, పబ్‌కు మధ్య సంబంధం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.బాధితుల భయమే వీరికి వరం ఇలా యువతుల వల్లో పడిన బాధితుల్లో అనేక మంది వివాహితులు, ఉన్నత కుటుంబాలకు చెందిన వాళ్లు ఉంటున్నారు. దీంతో తాము మోసపోయామని తెలిసినా.. యువతి కోసం వెళ్లామని బయటపడితే పరువుపోతుందని భయపడుతున్నారు. దీంతో కొందరు మాత్రం పబ్‌కు సంబంధించిన గూగుల్ రివ్యూస్‌లో విషయం పొందుపరుస్తున్నా.. అనేక మంది మిన్నకుండిపోతున్నారు. ఇదే అటు పబ్ నిర్వాహకులు, యువతులకు వరంగా మారుతోంది. ఈ తరహా దందాలో ఆ ఒక్క పబ్‌లోనే కాదని, నగరంలోని అనేక పబ్బుల్లో జరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి. వాటిలోకి ఈ ‘జంటలు’ ప్రవేశిస్తున్న సమయంలో కేవలం యువకుల వివరాలు మాత్రమే అడిగి, నమోదు చేసుకుంటున్నారు. ఈ హనీట్రాప్ దందాపై తమకు ఎలాంటి సమాచారం, ఫిర్యాదులు లేవని పోలీసులు చెబుతున్నారు. ఇలా చేయడం కచి్చతంగా నేరమే అని, దీనికి యువతులతో పాటు పబ్స్ నిర్వాహకులు బాధ్యులని స్పష్టం చేస్తున్నారు. బాధితులుగా మారిన ఎవరైనా ముందుకు వచ్చి ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. -
భారీగా బయటపడ్డ అక్రమ ఆస్తుల చిట్టా
-
అపార్ట్మెంట్ కట్టలేదు..స్థలం అమ్మేశారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో భారీ అపార్ట్మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రచారం చేసి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన భారతి బిల్డర్స్ కు చెందిన ముగ్గురు యజమానులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓ డబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలను డీసీసీ కె.ప్రసాద్ వెల్లడించారు. నగరానికి చెందిన దూపాటి నాగరాజు, మల్పూరి శివరామకృష్ణలు 2021 లో మాదాపూర్‌లో భారతి బిల్డర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భారతి లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీ లాంచ్ ఆఫర్‌కు తెరలేపారు. చదరపు అడుగు రూ.3,200కే విక్రయిస్తు న్నామని ప్రచారం చేశారు. ఈ మేరకు కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిర్వహించారు.రూ.60 కోట్లు వసూలు..: తమ ప్రణాళికను అమలు చేసేందుకు తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని కంపెనీ సీఈఓగా నియమించారు. భారీ కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది కస్టమ ర్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేశారు. కానీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. మరోవైపు రూ.100 కోట్ల విలువైన 6.23 ఎకరాల స్థలాన్ని సంస్థ యజమానులు రెట్టింపు ధరకు ఇతర వ్యక్తులకు విక్రయించేశారు. అటు అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభం కాక, వాటా స్థలమైనా దక్కే అవకాశం లేక కస్టమర్లు రోడ్డున పడ్డారు. బాధితుల్లో ఒకరైన బీవీఎస్ ప్రసాద్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులు నాగరాజు, శివరామకృష్ణ, నర్సింహారావులను అరెస్టు చేశారు. -
సేనానికి ప్యాకేజీ.. నమ్ముకున్నవారికి నిరాశ..!
వారంతా పదేళ్ళుగా జనసేన జెండా మోస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఆ జెండా కర్రలే మిగిలాయి. పార్టీని నమ్మినవారిని పవన్‌కల్యాణ్ నిలువునా ముంచేశారు. అందుకే వారంతా ఆ జెండా కర్రలతోనే తిరగబడుతున్నారు. పవన్ చేసిన మోసానికి తాము బలయ్యామని మండిపడుతున్నారు. ప్యాకేజీ స్టార్‌గా మారిపోయి పార్టీని చంద్రబాబుకు అద్దెకిచ్చిన పవన్ అందరినీ నట్టేట ముంచేశారని రోదిస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పూర్తిగా అదృశ్యమవుతుందని శాపనార్థాలు పెడుతున్నారు. అసలు జనసేనలో ఏం జరుగుతోందో చూద్దాం. ఎవరైనా రాజకీయ పార్టీ స్థాపిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తారు. అంతకంటే ముందు పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేస్తారు. నాయకుల్ని తయారు చేసుకుంటారు. కాని జనసేనను పదేళ్ళ క్రితం స్థాపించిన పవన్‌కల్యాణ్ తన పార్టీని టీడీపీకి అద్దెకిచ్చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు కోసమే కష్టపడుతున్నారు. అందుకు తగిన ప్రతిఫలం ప్యాకేజీ రూపంలో అందుకుంటున్నారు. ఇవన్నీ జనసేనలో పదేళ్ళుగా పనిచేస్తున్నవారే చెబుతున్న మాటలు. తనకు కులం లేదంటూ కులాల మధ్య చిచ్చు పెట్టిన పవన్ తన సొంత కులానికి, బీసీలకు పూర్తిగా అన్యాయం చేశారని పవన్‌ను నమ్మి మునిగిపోయిన నాయకులు చెబుతున్నారు. అందుకే జనసేన జెండా మోసినందుకు సిగ్గుపడుతూ ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వెళ్ళిపోతున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి చెందిన పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ తీరును ఎండగడుతూ జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పశ్చిమ సీటును తనకు ఇస్తున్నట్లు ప్రకటించి చివరికి చంద్రబాబు ఆదేశం మేరకు ఆయన బినామీ సుజనాచౌదరికి బీజేపీ తరపున టిక్కెట్ దక్కేలా చేశారని పోతిన చెప్పారు. పవన్ చేసిన మోసానికి ఆగ్రహించిన పోతిన తన కార్యాలయంలో ఆయన ఫ్లెక్సీలను, ఫోటోలను తొలగించారు. బడుగు బలహీన వర్గాల వారిని పవన్ కళ్యాణ్ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు బినామీ కోసం బీసీ నేతనైన తనను బలి పశువును చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలే త్యాగాలు చేయాలా అగ్రకుల నేతలతో త్యాగాలు చేయించలేరా అంటూ పవన్‌ను నిలదీశారు పోతిన మహేశ్.. కైకలూరు టిక్కెట్ ఆశించిన బివి రావు కూడా పోతిన మహేష్ దారిలోనే పయనించి..జనసేన పార్టీకి రాజీనామా చేశారు. గతంలో ఆయన కైకలూరు నుంచి జనసేన తరపున పోటీ చేశారు. ఈసారి పొత్తులో భాగంగా చంద్రబాబు తొత్తుగా వ్యవహరించే బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌కు కైకలూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన బి వి. రావు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేసారు. పితాని బాలకృష్ణ ఉభయగోదావరి జిల్లాలో బలమైన శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నేత. ముమ్మిడివరం జనసేన ఇన్‌ఛార్జ్‌గా పనిచేసేవారు.. బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బీసీలు అంటే తనకు అభిమానమని తెలిపారు. చివరికి పవన్ కళ్యాణ్ మాటలు నీటి మీద రాతలు గానే తేలిపోయాయి. ముమ్మిడివరం సీటును పొత్తులో భాగంగా టిడిపికి కేటాయించారు. బీసీలకు జరుగుతున్న మోసాన్ని తట్టుకోలేక పితాని బాలకృష్ణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. కాకినాడ మాజీ మేయర్ పొలసపల్లి సరోజ కాకినాడ రూరల్ సీటుపై గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తనకే సీటు వస్తుందని ఆశించారు. కానీ అక్కడ సరోజని కాదని మరొకరికి పవన్ సీటు ఇచ్చారు. దీంతో ఆమె ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ తీరుపై భగ్గుమన్నారు. పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. అనకాపల్లి లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది.. అనకాపల్లిలో మొదటి నుంచి పార్టీ కార్యక్రమాలను నియోజకవర్గ ఇంఛార్జ్‌గా పరుచూరి భాస్కరరావు బాధ్యతలు నిర్వహించేవారు. పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ భాస్కరరావే ఖర్చు భరించేవారు. భాస్కరరావుని కాదని ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు పవన్ కళ్యాణ్ జనసేన తరపున కేటాయించారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన భాస్కరరావు జనసేన పార్టీకి రాజీనామా చేశారు. పిఠాపురంలో మాకినీడు శేషుకుమారికి సీటు ఇస్తామని చెప్పి ఆమెతో పార్టీ కోసం భారీగా ఖర్చు పెట్టించారు. పిఠాపురంలో పోటీ చేయాలని భావించిన పవన్ ఆమెను పక్కనపెట్టారు. పార్టీకి పనిచేసిన మహిళా నేతగా పిఠాపురంలో ఆమెకు సీటు ఇవ్వకపోయినా వేరే నియోజకవర్గంలో సీటు ఇస్తారని ఆమె ఆశించారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆమెకు ఎక్కడా సీటు లేదంటూ చెప్పేశారు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై జనసేనకు రాజీనామా సమర్పించి ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకా మిగిలిన మరికొందరు నేతలు కూడా జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. -
ఒక రోజు అద్దెతో ఐదేళ్లు తిష్ట.. న్యూయార్క్ హోటల్లో వింతవైనం!
సాధారణంగా ఎవరైనా ఏదైనా హోటల్లో బస చేయానుకుంటే ఒక రోజో, రెండు రోజులో ఉంటారు. అయితే అమెరికాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా హోటల్లో ఐదు సంవత్సరాలు గడిపాడు.. అది కూడా అద్దె లేకుండా.. నమ్మశక్యం కాని ఈ నిజం వెనుకనున్న కథనాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. వార్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ తెలిపిన వివరాల ప్రకారం మిక్కీ బారెటో(48) న్యూయార్క్‌లోని మాన్హాటన్లో ఉన్న ఒక హోటల్‌కు తానే యజమానినని చెప్పుకుంటూ ఐదేళ్లుగా అద్దె చెల్లించకుండా అందులోనే ఉంటున్నాడు. ఈ వ్యవహారంలో తప్పుడు ఆస్తుల రికార్డులు సృష్టించినందుకు తాజాగా పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 1930లో నిర్మితమైన ఈ వెయ్యి గదుల ఆర్ట్ డెకో న్యూయార్కర్ హోటల్లో ఐదేళ్ల క్రితం మిక్కీ బారెట్‌తో పాటు అతని ప్రియురాలు 200 డాలర్లకు (రూ. 16,500) ఒక గదిని బుక్ చేసుకున్నారు. మిక్కీ లాస్ ఏంజిల్స్ నుండి న్యూయార్క్‌కు వచ్చినప్పుడు తన ప్రియురాలిలో కలిసి ఈ గదిలో దిగాడు. తరువాత హోటల్ గదుల బుకింగ్ చట్టానికి సంబంధించిన అక్రమాల గురించి మిక్కీ తన ప్రియురాలికి చెప్పాడు. ఎవరైనా 1969 కి ముందు నిర్మించిన భవనంలో ఒకే గదిలో నివసిస్తున్నట్లయితే, వారు ఆరు నెలల లీజు కింద గదిని తీసుకోవచ్చు. హోటల్లో ఒక రాత్రి బస చేసేందుకు డబ్బులు చెల్లించిన తరువాత గదిని లీజుకు అడిగాడు. అయితే దీనికి హోటల్ యాజమాన్యం నిరాకరించింది. మిక్కీ ఈ విషయమై కోర్టును ఆశ్రయించాడు. ప్రాథమిక విచారణలో న్యాయమూర్తి ఇందుకు అనుమతించకపోవడంతో, మిక్కీ సుప్రీంకోర్టుకు ఆశ్రయించాడు. ఈ కేసులో విజయం సాధించిన మిక్కీకి బస చేసేందుకు హోటల్ గదిని ఇవ్వాలని, తాళం చెవిని కూడా అందించాలని కోర్టు ఆదేశించింది. దీంతో 2019 నుంచి 2023, జూలై వరకు అద్దె చెల్లించకుండా అదే హోటల్లో నివసిస్తున్నాడు. అయితే 2019లో ఒక నకిలీ అగ్రిమెంట్ లెటర్‌ను సృష్టించి, తానే హోటల్ యజమానినని ప్రకటించుకున్నాడు. తరువాత హోటల్ గదుల అద్దెను వసూలు చేయడం మొదలుపెట్టాడు. అనంతరం హోటల్ పేరిట బ్యాంక్ ఖాతా తెరిచి, నగదు తనకు బదిలీ అయ్యేందుకు ప్రయత్నించాడు. తాజాగా అతనిపై చీటింగ్ కేసు నమోదయ్యింది. అయితే తాను హోటల్ నుంచి ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని మిక్కీ ఒక ప్రకటనలో తెలిపాడు. -
పేకాటలో హైటెక్ చీటింగ్!
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ కేంద్రంగా సాగిన పేకాటలో హైటెక్ చీటింగ్ దందాలు వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. మహబూబ్‌నగర్‌కు చెందిన శ్రీను నేతృత్వంలోని తొమ్మిది మందితో కూడిన ముఠాను పట్టుకున్నారు. వీరితో పాటు పేకాట ఆడుతున్న నలుగురినీ అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ అధికారులకు అప్పగించారు. నిందితులకు నోటీసులు జారీ చేశామని బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పి.సతీష్ బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. మహబూబ్‌నగర్‌లోని సుభా‹Ùనగర్‌కు చెందిన సింగిడి శ్రీనివాస్ అలియాస్ శ్రీను తన స్నేహితులతో కలిసి తరచూ గోవాలోని క్యాసినోవాలకు వెళ్లి వస్తుండేవారు. అక్కడ పేకాటలో భారీగా నష్టపోయిన ఇతగాడు అదే ఆటలో మోసాలకు పథక రచన చేశాడు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సూర్య, మెరి్వన్, చంద్రశేఖర్, గుర్మీత్ సింగ్, సంతోష్ కుమార్, సయ్యద్ నయీం, వేణు, వినోద్‌లతో ముఠా ఏర్పాటు చేశాడు. ఎదుటి వారి పేక ముక్కలు కనిపించేలా.. ఆన్లైన్లో ఆర్డర్ ఇచి్చన శ్రీను రూ.25 వేలు వెచి్చంచి ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్‌ను ఖరీదు చేశాడు. పేకాట సమయంలో ఎవరైనా దీన్ని ధరిస్తే ఎదుటి వ్యక్తి చేతిలోని ముక్కలు ఏంటో తెలుసుకోవచ్చు. దీన్ని ఎలా వినియోగించాలనేది మెరి్వన్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకుని ధరిచడం మొదలెట్టాడు. గోవాలో పేకాట నేపథ్యంలో పరిచయమైన సరితకు తాము రాడిసన్ హోటల్ కేంద్రంగా భారీ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చాడు. దీంతో ఈమెతో పాటు బంధువులు, స్నేహితులు అయిన సాయి కృష్ణ, వినోద్‌కుమార్, కుమారీ అక్కడకు వచ్చి పేకాట ఆడేందుకు ఆసక్తి చూపారు. దీంతో ముందే రూ.1.5 లక్షల తన ఖాతాలో డిపాజిట్ చేయించుకున్న శ్రీను.. తన ముఠాకు చెందిన వాళ్లనూ పేకాట ఆడే వారి మాదిరిగానే రంగంలోకి దింపాడు. తన ఖాతాలో పడిన మొత్తం నుంచి రూ.24 వేలు వెచి్చంచిన శ్రీను.. రాడిసన్ హోటల్లో స్వీట్ రూమ్ బుక్ చేశాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు అక్కడుకు చేరుకున్న అంతా పేకాట ఆడటం మొదలెట్టారు. వినోద్ తదితరులకు శ్రీను రూ.4,500 విలువైన కాయిన్లు కూడా ఇచ్చాడు. ఎక్స్‌రే విజన్ కాంటాక్ట్ లెన్స్ ధరించిన మెరి్వన్ వినోద్‌కుమార్, సరిత చేతుల్లోని పేక ముక్కలు తెలుసుకుని.. తన ముఠా సభ్యుల సాయంతో వాళ్లు ఓడిపోయేలా చేస్తున్నాడు. ఇది పశ్చిమ మండల టాస్‌్కఫోర్స్ పోలీసులకు సమాచారం అందడంతో దాడి చేసిన అధికారులు 13 మందినీ అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.2400 నగదు, 4500 కాయిన్లు, లెన్స్‌ను స్వాధీనం చేసుకుని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. శ్రీను తన గ్యాంగ్‌లోని వారికి ఒక్కో విడతకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నాడని, లెన్స్ ధరించి సాంకేతిక సహకారం అందించే మెరి్వన్‌కు మాత్రం రూ.5 వేలు చొప్పున ఇస్తున్నాడని పోలీసులు గుర్తించారు. శ్రీను ఖాతాలో ఉన్న రూ.84 వేలు సైతం ఫ్రీజ్ చేశారు. ఈ గ్యాంగ్ గతంలోనూ కొందరిని ఇలా మోసం చేసినట్లు అనుమానిస్తున్న పోలీసులు ఆ కోణంలో ఆరా తీస్తున్నారు. పేకాట శిబిరం నిర్వహిస్తున్న శ్రీను, అతడి గ్యాంగ్‌తో పాటు పేక ఆడటానికి వచి్చన నలుగురికీ నోటీసులు జారీ చేశారు. -
మహిళ కనిపిస్తే.. వేధింపులేనా? మీరేం మనుష్యులు
మహిళలకు సంబంధించి ఓ ముఖ్యమైన విషయాన్ని సోషల్‌మీడియాలో ప్రస్తావించారు డాక్టర్ శ్రీకాంత్ మిరియాల. ఆయన ట్విట్టర్ వేదికగా రాసిన పోస్టు యథాతధంగా.. నేను వైద్యం చేసిన ఎంతోమంది ఆడవాళ్లు (వయసు నిమిత్తం లేకుండా), నా స్నేహితురాళ్ల అనుభవాలు ఇవి. ఈ దురదృష్ట అనుభవాలు అన్ని దేశాల్లో ఉన్నప్పటికీ మనదేశంలో బాగా ఎక్కువ. ఏమిటివి? వీధుల్లో, బస్సుల్లో,రైళ్లలో, ఇళ్లలో,ఆడుకునే స్థలాల్లో, పనిచేసే ప్రదేశాల్లో, గుళ్లలో సమయం సందర్భం ఏదైనాగానీ ఆడవాళ్ళ వెంటబడటం, తేరిపార చూడటం, సైగలు చెయ్యటం, ఫోటోలు తీయటం మాత్రమే కాకుండా కావాలని రాసుకుని వెళ్ళటం, ఇంకా మితిమీరి తాకటం, ముట్టటం, పట్టుకోవడం, కొట్టటం, హఠాత్తుగా మీద పడడం లాంటివి చేసి చాలా ఇబ్బంది పెడతారు. ఇలా ఎందుకు చేస్తారు అన్నదానికి మానసిక శాస్త్ర పరంగా చాలా కారణాలున్నప్పటికీ ఇది చెడ్డ ప్రవర్తన. ఒకసారి చేసి పట్టుబడనప్పుడు వీళ్లలో ధైర్యం పెరిగి మళ్లీ మళ్లీ చేస్తూ, వారి చర్యల తీవ్రత కూడా పెరుగుతుంది. ముందు భయంతో చేసి, చేశాక ఆనందాన్ని పొందే వీళ్లు తర్వాత తర్వాత దాడికి గురైన ఆడవాళ్ల ముఖంలో ఉండే భయాన్ని, షాక్ ని చూసి ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. వీళ్లని నియంత్రించే ఒకే ఒక్క మార్గం ఎదిరించటం, పట్టుకుని ప్రశ్నించడం. అలా జరిగిన చాలా సందర్భాల్లో అందరూ కలిసి దేహశుద్ధి చేస్తారు. ఒకసారి పట్టుబడ్డాక చాలామంది మానేస్తారు కానీ కొంతమంది కొనసాగిస్తారు. వీళ్లని కఠినంగా శిక్షించటం ద్వారా ఈ నేరాల తీవ్రత కొంతవరకు తగ్గించవచ్చు. ఈమధ్య వచ్చే కొన్ని సినిమాలు కూడా ఇటువంటి ప్రవర్తనని ఎగదోస్తున్నాయి. ఇటువంటి సంఘటనలు ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెడతాయి. వాళ్లని చాలా బాధకి గురిచేస్తాయి. కోపం, దిగులు, బయటికెళ్లాలంటే భయం, వణుకు, నిస్సహాయత మొదలైన అనుభూతులకి గురవ్వటమే కాకుండా ఆత్మన్యూనత, తమనితాము నిందించుకోవడం, తమ వస్త్రాలంకరణని ప్రశ్నించుకోవడం, తోడు లేనిదే బయటికి వెళ్లకపోవడం చేస్తుంటారు. పైగా ఈబధని ఎవరితో చెప్పుకోలేక సతమతమౌతుంటారు. చెప్పినా కూడా కొన్నిసార్లు వీళ్లే నిందలకు గురవుతుంటారు. కొన్ని గుర్తుపెట్టుకోండి. 1. ఈ అనుభవాలు మీ ఒక్కరికే కాదు, దాదాపు అందరి ఆడవాళ్లలో ఉంటాయి. ఒకసారి మీ అమ్మాయి/సోదరి/భార్య/స్నేహితురాళ్లతో చర్చించండి. వారికి సాంత్వన చేకూర్చి ధైర్యాన్ని ఇచ్చినవాళ్లవుతారు. 2. తప్పు ఎప్పుడూ దాడి చేసినవాళ్లదే. మీరు ఒంటరిగా బయటికి వెళ్ళటం, మీ వస్త్రాలంకరణ, మీ మాటలు ఇవేవీ కూడా వారు మీతో అలా ప్రవర్తించడానికి పచ్చజెండా కాదు. 3. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. రోడ్డుపై వెళ్ళేటప్పుడు జాగరూకతతో ఉండండి, ఎదుటివాళ్లపై అనుమానం ఉంచి వాళ్లు మిమ్మల్ని దరి చేరేటప్పుడు బ్యాగ్ ఒక చేతి నుంచి ఇంకో చేతికి మార్చటం, చేతులు విదల్చటం వంటి హఠాత్చర్యల వలన దాడిచేసేవాళ్లు దూరం జరుగుతారు. 4. దాడి జరిగినప్పుడు వెంటనే పట్టుకుని ప్రశ్నించండి. వాళ్లు హెడ్లైట్ల కింద దొరికిన కుందేలులా స్థాణువైపోతారు. 5. ఇటువంటి అనుభవాలు మిమ్మల్ని తీవ్ర మానసిక ఇబ్బందికి గురిచేసినా లేక మీ లైంగిక జీవితాన్ని అస్తవ్యస్తం చేసినా మానసిక నిపుణుల్ని కలవండి. డాక్టర్ శ్రీకాంత్ మిరియాల -
గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో నయా మోసం
దన్వాడ: ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో కొందరు కేడీలు నయా మోసానికి తెరలేపారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసేందుకుగాను రూ.236 చొప్పున వసూలు చేసి వినియోగదారులను బురిడీ కొట్టించారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం కిష్టాపూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఇండియన్ గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో బుధవారం ఆరుగురు వ్యక్తులు వినియోగదారుల ఇళ్లకు వెళ్లారు. ప్రతి సంవత్సరం గ్యాస్ కనెక్షన్ చెకప్ చేసుకోవాల్సి ఉంటుందని.. ఇందుకుగాను రూ.236 చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు. గ్యాస్ కనెక్షన్ చెకప్ చేయించుకోకపోతే సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు. వీరి మాటలు నమ్మిన కొందరు వినియోగదారులు.. గ్యాస్ కనెక్షన్ చెకప్ కోసం రూ.236 చొప్పున చెల్లించారు. గ్రామంలో మొత్తం 300 కనెక్షన్లు ఉండగా.. 200 మంది నుంచి దాదాపు రూ.50వేల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. కొందరికి అనుమానం వచ్చి గురువారం గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులను సంప్రదించగా.. తాము ఎలాంటి చెకప్‌లు చేయడంలేదని తెలిపారు. తమ కార్యాలయంలోనే సిలిండర్‌ను పూర్తి స్థాయిలో చెక్‌చేసి, వినియోగదారులకు అందజేస్తామని తెలియజేశారు. కాగా గ్యాస్ కనెక్షన్ చెకప్ పేరుతో డబ్బులు వసూలు చేసిన దుండగులు.. అందుకు సంబంధించిన రసీదులు ఇవ్వడం గమనార్హం. ఏదేమైనప్పటికీ రోజురోజుకు కొత్త కొత్త మోసాలు వెలుగు చూస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మా లో తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. -
హోంగార్డు ఉద్యోగాల పేరిట ఐపీఎస్ అధికారి ఘరాన మోసం
మంగళగిరి: హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు ఓ ఐపీఎస్ అధికారి శఠగోపం పెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రస్తుతం వేరే శాఖలో విధులు నిర్వహిస్తున్న ఒక ఐపీఎస్ అధికారి గతంలో రాష్ట్రంలో వివిధ హోదాలలో పనిచేశారు. ఏలూరులో పనిచేసిన సమయంలో ఏలూరుకు చెందిన ఒక మహిళతో సహజీవనం చేశారు. అనంతరం ఐజీపీ హోంగార్డు రాష్ట్ర అధికారిగా పనిచేసిన సమయంలో ఆ మహిళ కుటుంబ సభ్యులు ఐజీపీ సహకారంతో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 200 మందికిపైగా నిరుద్యోగులు ఒక్కొక్కరి నుంచి రూ.6 నుంచి రూ.7 లక్షలు వసూలు చేశారు. అధికారి ఐజీపీగా ఉన్న సమయంలో కొందరికి హోంగార్డు ఉద్యోగాలు ఇచ్చారు. అధికశాతం మందికి పోస్టింగులు ఇవ్వలేకపోయారు. దీంతో నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో 2022లో ఐజీపీ హోంగార్డ్స్ పేరుతో తాను పోస్టులో లేకపోయినా తనే ఐజీపీ హోంగార్డు అయినట్లు సంతకాలు చేసి నకిలీ అపాయింట్మెంట్లు ఇచ్చారు. వాటితో అభ్యర్థులు పోలీస్ ఉన్నతాధికారులను కలవగా అనుమానం వచ్చి రహస్యంగా విచారణ చేశారు. అవి నకిలీ అపాయింట్మెంట్లు అని తేలడంతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అదే సమయంలో బాధిత నిరుద్యోగి తలాజి విజయ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభించిన పోలీసులు విచారణలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలతో విస్తుపోయినట్లు తెలిసింది. నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన కొంతనగదు దళారుల ఖాతాల నుంచి ఐజీపీతోపాటు ఆయన ప్రియురాలి ఖాతాలకు వెళ్లినట్లు గుర్తించారు. వీరు హైదరాబాద్‌లో విల్లాలు కొన్నట్టు సమాచారం. దీంతో అధికారి ప్రియురాలి పెద్ద అల్లుడితోపాటు మధ్యప్రదేశ్‌కు చెందిన దళారులు ఏడుగురిని రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరెస్టులతో అప్రమత్తమైన అధికారి మంగళవారం హైకోర్టులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
ఇద్దరితో ప్రేమాయణం.. ప్రియుడి కోసం యువతుల కొట్లాట
వెంగళరావునగర్(హైదరాబాద్): ఇద్దరు యువతులను మోసం చేసి మూడో యువతితో పెళ్లితంతుకు సిద్ధమైన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఆ వ్యక్తి తనకు మాత్రమే సొంతమంటూ మహిళలు కేసు పెట్టిన విచిత్రమైన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఏపీలోని రాయచోటి ప్రాంతానికి చెందిన బాబా ఫక్రుద్దీన్ అనే యువకుడు మాదాపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తుంటాడు. అదే ఆస్పత్రిలో పని చేసే యువతి రెండేళ్ల క్రితం అతనికి పరిచయం అయింది. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి వెంగళరావునగర్ డివిజన్లోని ఒక బస్తీలో నివాసం ఉంటున్న యువతి రూముకు అనేకమార్లు వచ్చి తన కోర్కెను తీర్చుకున్నాడు. కొన్ని రోజుల తర్వాత ఆమెకు చెప్పకుండా కార్ఘానాలోని మరో ఆస్పత్రిలో చేరాడు. అక్కడ పనిచేసే ఇంకో యువతితో సేమ్ సీన్ రిపీట్ చేశాడు. కట్ చేస్తే... (ఈ నెల 6న) ఎవరికీ చెప్పకుండా స్వగ్రామం వెళ్లాడు. అక్కడ తన ఇంటి పక్కనే ఉంటున్న యువతిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ నెల 24న నిశ్చితార్థం చేసుకోవాలనుకుని అనుకున్నాడు. పక్కాగా ప్లానింగ్ చేసి ఉంగరాలు, దండలు మార్చుకోవాలనుకునే సమయంలో సినీ ఫక్కీలో మధురానగర్ ఎస్ఐ ఇక్బాల్ షడన్‌గా రంగ ప్రవేశం చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు నిశ్చితార్థాన్ని చివరి నిమిషంలో అడ్టుకున్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా వారికి అతని ఫ్లాష్‌బ్యాక్ మొత్తం చెప్పి నిందితుడిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. సమస్య పరిష్కారం అయిందనుకున్నారంతా... అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. ఫక్రుద్దీన్‌ను మధురానగర్‌కు తీసుకువచ్చారని తెలుసుకున్న బాధిత యువతులు బుధవారం రాత్రి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. అర్ధరాత్రి వరకు వీడు నా వాడు అంటే కాదు నా వాడంటూ ఇరువురు యువతులు వాదులాడుకున్నారు. దీంతో పోలీసులు అయోమయంలో పడ్డారు. ముందుగా నేను మోసపోయాను, కాబట్టి నాకే సొంతమంటూ ఒకరు, కాదు నేనూ సర్వస్వం అర్పించాను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు న్యాయం చేయాలంటూ పోలీసులను వేడుకున్నారు. సమస్య ఎలా పరిష్కరించాలో అర్థంకాక మధురానగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌తోపాటు ఎస్ఐ ఇక్బాల్ తలలు పట్టుకున్నారు. ఎట్టకేలకు బాబా ఫక్రుద్దీన్‌ను పోలీసులు రిమాండ్ తరలించి ఊపిరిపీల్చుకున్నారు. చదవండి: తెలియకుండా విదేశాలకు భార్య! భర్త ఆత్మహత్య