చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్ల మేజేజర్ల హవా మాములుగా ఉండదు. నిర్మాతకు హీరో,హీరోయిన్లకు మధ్య వారధిలా వాళ్లు పని చేస్తుంటారు. నిర్మాతకు డేట్స్ కావాలంటే.. సదరు హీరో, హీరోయిన్ల మేనేజర్లను సంప్రదించాల్సిందే. రెమ్యునరేషన్ మొదలు.. డేట్స్ వరకు ప్రతీది మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. ఏ హీరో, హీరోయిన్ అయినా.. మేనేజర్లు చెప్పేదే విని ఓకే చెబుతారు. వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. తన మేనేజర్‌ని ఇంటి మనిషిలా భావించి, అన్నీ అతని చెప్పినట్లుగానే చేసేది.
అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి.. సామ్‌ని ఆర్థిక మోసం చేశాడనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. సమంతకు తెలియకుండా రూ. కోటిని కాజేసేందుకు ప్రయత్నించాడట. ఈ విషయం సమంత దృష్టికి రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోయిందట. తొలుగ నమ్మకపోయినా.. ముఖ్యమైన వ్యక్తి చెప్పడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు సమాచారం. త్వరలోనే మరో కొత్తవ్యక్తిని తన మేనేజర్‌గా నియమించుకునే పనిలో ఉన్నారట.
అసలు విషయం ఇదేనా?
మయో సైటిస్ బారిన పడడంతో సామ్ ఒప్పుకున్న ఓ చిత్రం షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో నిర్మాతలకు తన వల్ల నష్టం జరిగిందని, తన రెమ్యునరేషన్ తగ్గించాలని సామ్ భావించారట. ఈ విషయాన్ని తన మేనేజర్‌తో చెప్పి, రూ. కోటి వరకు తగ్గించి తీసుకోమని చెప్పిందట. అయితే మేనేజర్ మాత్రం నిర్మాతల దగ్గర ఆ కోటి కూడా తీసుకోవాలనుకున్నాడట. సదరు నిర్మాతల దగ్గరకు వెళ్లి బ్యాలెన్స్ గా ఉన్న రూ. కోటిని క్యాష్ రూపంలో ఇవ్వమని అడిగారట. అంత డబ్బు క్యాష్‌గా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో.. తన స్నేహితుడి అకౌంట్‌కి పంపమని చెప్పాడట. వారికి అనుమానం కలగడంతో ఈ విషయాన్ని సామ్ దగ్గర వరకు తీసుకెళ్లారు. ఇలా మేనేజర్ అసలు రూపం బయటపడింది.
ఇక సినిమా విషయాలకొస్తే.. సమంత- విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో వరుణ్ ధావణ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్క్రీమింగ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment