manager
-
గూగుల్ ఇండియా మేనేజర్‌గా ప్రీతి
న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ఇండియా నూతన కంట్రీ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్‌గా ప్రీతి లోబానా నియమితులయ్యారు. గూగుల్‌లో ఆసియా పసిఫిక్ రీజియన్ ప్రెసిడెంట్‌గా ఇటీవల పదోన్నతి పొందిన సంజయ్ గుప్తా స్థానంలో ఆమె చేరారు. ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రయోజనాలను వినియోగదారులందరికీ అందించడం, ఆవిష్కరణలను పెంపొందించేందుకు వ్యూహాన్ని రూపొందించడంలో ప్రీతి కీలకపాత్ర పోషిస్తారని గూగుల్ సోమవారం ప్రకటించింది. ‘జీ–టెక్ కస్టమర్ ఎక్స్‌పీరియెన్స్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎనిమిదేళ్ల అనుభవం కలిగిన ప్రీతి ఇప్పుడు గూగుల్ ఇండియా విక్రయాలు, కార్యకలాపాల వ్యవహారాలకు నేతృత్వం వహిస్తారు. ‘ఇది భారత్ అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పురోగతిలో కంపెనీ నిబద్ధతను పెంచుతుంది’ అని తెలిపింది. గూగుల్‌కు ముందు ఆమె నాట్‌వెస్ట్ గ్రూప్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్, ఏఎన్జెడ్ గ్రిండ్లేస్ బ్యాంక్‌లలో నాయకత్వ స్థానాల్లో విధులు నిర్వర్తించారు. భారత్‌లోని విభిన్న మార్కెట్లలో వ్యాపార వ్యూహం, ఉత్పత్తి నిర్వహణ, కార్యాచరణ వంటి అంశాలలో నైపుణ్యం సాధించారు. -
ఉద్యోగికి యాక్సిడెంట్.. మేనేజర్ రియాక్షన్‌కు షాక్!
ఆఫీసులకు ఆలస్యంగా వస్తే.. ఉద్యోగులు తమ ఆలస్యానికి అనేక కారణాలు చెబుతారు. కారణం బలమైనదైతే బాస్ కూడా ఏమి అనలేరు. అయితే ఇటీవల ఒక ఉద్యోగి ఆఫీసుకు లేటుగా రావడానికి కారు ప్రమాదం కారణమని చెప్పినా.. మేనేజర్ వ్యవహరించిన తీరు ఉద్యోగిని చాలా బాధించింది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.ఉద్యోగి కారు ప్రమాదానికి గురై ముందు భాగం భారీగా దెబ్బతినింది. ఈ విషయాన్ని మేనేజర్‌ను తెలియజేస్తూ.. దెబ్బతిన్న కారు ఫోటోలను షేర్ చేశారు. ఉద్యోగికి ఏమైందో అడగటం మానేసి.. మీరు ఏ సమయానికి ఆఫీసుకు రావాలనుకుంటున్నారో తెలియజేయండి అని మెసేజ్ చేశారు. అంతటితో ఆగకుండా.. కుటుంబంలో ఎవరైనా చనిపోతే తప్పా గైర్హాజరు క్షమించరానిదని వెల్లడించారు.ఉద్యోగి, మేనేజర్ మధ్య జరిగిన ఈ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్స్.. ఉద్యోగి సోషల్ మీడియాలో షేర్ చేశారు. మీ మేనేజర్ ఇలా చెబితే మీరందరూ ఎలా స్పందిస్తారు? అని ప్రశ్నించారు.దీనిపైన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ విరుచుకుపడుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు ఉద్యోగి క్షేమం గురించి అడగకుండా.. పని గురించే ఆలోచించే మేనేజర్ మీద చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద పెద్ద ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తాను, అని ఒక వ్యక్తి అంటే.. ఆ కంపెనీకి ఇకపై వెళ్ళవద్దు అని సలహా ఇచ్చారు. ఎందుకు ఉద్యోగం వదిలేసావు అనే విషయాన్ని ఎవరైనా అడిగితే, స్క్రీన్ షాట్స్ చూపించండి అని అన్నారు. మేనేజర్‌కు కూడా ఇలాంటి అవస్థ వచ్చేలా చేస్తానని ఇంకొకరు పేర్కొన్నారు.what would y’all respond with if your manager says this? pic.twitter.com/bZznlPZrLT— kira 👾 (@kirawontmiss) October 22, 2024 -
నల్లా కనెక్షన్ కోసం లంచం.. మణికొండ జల మండలి మేనేజర్ అరెస్ట్
మణికొండ: మంచినీటి కనెక్షన్ ఇచ్చేందుకు లంచం డిమాండ్ చేసి వసూలు చేసిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగితో పాటు జలమండలి మేనేజర్‌ను అవినీతి నిరోధక శాఖ( ఏసీబీ) అధికారులు అరెస్టు చేశారు. మణికొండ జలమండలి డివిజన్–18లో మేనేజర్‌గా పనిచేస్తున్న స్ఫూర్తి రెడ్డితో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను వలపన్ని పట్టుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలోని వేంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉపేంద్రనాథ్‌రెడ్డి ఇచి్చన ఫిర్యాదు మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారుల బృందం దాడులు చేసి వారిని అరెస్టు చేశారు. తన అపార్ట్‌మెంట్‌కు రెండు నీటి కనెక్షన్లకు ఆన్లైన్లో ధరఖాస్తు చేసి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవటంతో ఉపేంద్రనాథ్‌రెడ్డి జలమండలి కార్యాలయానికి వచ్చి మేనేజర్ స్ఫూర్తిరెడ్డిని కలిశాడు. ఆమె సమాధానం చెప్పకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నవీన్‌గౌడ్‌ను కలవాలని సూచించింది. అతన్ని కలవగా ఒక్కో కనెక్షన్‌కు రూ.15 వేల చొప్పున రూ.30 వేలు ఇస్తే మీ పని అయిపోతుందని సలహా ఇచ్చారు. దాంతో అతను ఏసీబీని ఆశ్రయించి మంగళవారం వారి సూచన మేరకు మణికొండ మర్రిచెట్టు సర్కిల్లో ఉన్న జలమండలి కార్యాలయం వద్ద నవీన్‌గౌడ్‌కు డబ్బులు ఇవ్వగానే ఏసీబీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. విచారణలో మేనేజర్ ఆదేశం మేరకే డబ్బు తీసుకున్నానని పేర్కొనటంతో ఆమెను కూడా అరెస్టు చేశారు. వసూలు చేసిన మొత్తంలో మేనేజర్‌తో పాటు డీజీఎం, జీఎంలకు వాటా ఇవ్వాల్సి ఉందని ఏసీబీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో నవీన్‌గౌడ్ అంగీకరించాడు. దాంతో ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపారు. దాడులలో ఏసీబీ సీఐలు ఆజాద్, జగన్మోహన్రెడ్డి, నవీన్‌లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
Nizamabad: పోలీసుల అదుపులో బ్యాంక్ మేనేజర్?
ఖలీల్‌వాడి: ఖాతాదారుల నుంచి డబ్బులు కాజేసిన బ్యాంక్ మేనేజర్ అజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నగరంలోని పెద్దబజార్ యూనియన్ బ్యాంకులో ఖాతాదారులను మచ్చిక చేసుకొని వారి రుణాలను, డబ్బులను తీసుకొని బ్యాంక్ మేనేజర్ పరారైన విషయం తెలిసిందే. కేసులో బ్యాంక్ మేనేజర్‌పై ఇప్పటి వరకు 26 మంది నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్‌శాఖ మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టింది. ఒక పోలీసు బృందం హైదరాబాద్‌లో నాలుగు రోజులుగా మకాం వేసి మేనేజర్ అజయ్ ఆచూకీకి కోసం వాకబు చేశారు. దీంతోపాటు సాంకేతిక రంగాన్ని ఆధారం చేసుకొని కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాల ద్వారా అజయ్ ఎక్కడ ఉన్నారనే దానిపై ఆరా తీశారు. పక్కా సమాచారం మేరకు ఆదివారం హైదరాబాద్‌లో బ్యాంక్ మేనేజర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం రాత్రే అదుపులోకి తీసుకుని బ్యాంకులో ఖాతాదారులకు సంబంధించిన లావాదేవీలపై విచారణ చేపట్టినట్లు తెలిసింది. -
దర్శన్ మేనేజర్ సూసైడ్
బెంగళూరు: రేణుకాస్వామి అనే యువకుడి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ ఇప్పటికే అరెస్టయ్యారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం(జూన్ 18) హీరో దర్శన్ ఫాంహౌజ్ మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు.బెంగళూరులోని దర్శన్ ఫామ్‌హౌస్‌లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శ్రీధర్ చనిపోతూ ఒక సూసైడ్‌నోట్ రాయడంతో పాటు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశాడు. ఒంటరితనం వేధించడం వల్లే చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు లేఖ, వీడియోలో శ్రీధర్ తెలిపారు. తన చావుకు తానే బాధ్యుడినని వేరే ఎవరూ కారణం కాదని స్పష్టం చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా, తన ప్రియురాలు నటి పవిత్ర గౌడకు అశ్లీల సందేశాలు పంపుతూ దూషిస్తూ మెసేజ్‌లు పెట్టినందుకే రేణుకాస్వామిని దర్శన్ హత్య చేయించాడని ఆరోపణలున్నాయి. -
కన్నడ హీరో దర్శన్ మేనేజర్ సూసైడ్.. ఘటనాస్థలిలో కీలక ఆధారాలు!
హీరో దర్శన్ అభిమాని హత్య కేసు శాండల్‌వుడ్‌ను కుదిపేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్ర గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసును బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో దర్శన్ కారు కనిపించడంతో పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చారు. ప్రస్తుతం ఈ కేసులో పవిత్ర గౌడ, దర్శన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా మరో షాకింగ్ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. దర్శన్‌కు చెందిన బెంగళూరు ఫామ్‌హౌస్‌ను చూసుకునే మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని మృతదేహాన్ని ఫామ్‌హౌస్ సమీపంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్కడే సూసైడ్ నోట్‌తో పాటు వీడియో సందేశం పోలీసులకు లభించాయి.విపరీతమైన ఒంటరితనం కారణంగానే జీవితాన్ని ముగిస్తున్నట్లు సూసైడ్ నోట్లో మేనేజర్ శ్రీధర్ పేర్కొన్నాడు. ఈ కేసులో తన మిత్రులు, బంధువులకు ఎలాంటి సంబంధం లేదని.. తన మరణానికి తానే కారణమని సూసైడ్ నోట్లో రాసుకున్నాడు. అయితే మేనేజర్ ఆత్మహత్యకు, దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసుకు మధ్య ఉన్న సంబంధంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
Telangana: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పలువురు అధికారులు
సాక్షి, హన్మకొండ/నల్లగొండ జిల్లా: లంచం తీసుకొని అవినీతికి పాల్పడుతున్న పలువురు అధికారుల్ని తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటుతున్నారు. తాజాగా పలువురు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు అడ్డంగా దొరికిపోయారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని ఓ హోటల్లో లంచం తీసుకుంటూ హుజురాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీకాంత్ ఏసీబీకి చిక్కారు. హుజురాబాద్ డిపోలో పనిచేస్తున్న ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన తాటికొండ రవీందర్ అనే ఆర్టీసీ డ్రైవర్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చార్జిమెమో అందించారు. అయితే శాఖా పరమైన కేసు కొట్టివేయడం కోసం డిపో మేనేజర్ శ్రీకాంత్ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు గతంలోనే రూ. 10,000 అందించగ.. మంగళవారం మరో రూ. 20000 రూపాయలు లంచం ఇస్తున్న క్రమంలో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. అదే విధంగా.. రూ.18 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ సోమశేఖర్ ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫార్మసీకి అనుమతి ఇచ్చేందుకు సోమశేఖర్ లంచం డిమాండ్ చేయగా.. బాధితుడు ఏసీబీని ఆధ్రయించడంతో అధికారులు పక్కా ప్రణాళికతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆసిఫాబాద్‌లో ఎస్సై రాజ్యలక్ష్మి రూ. 25వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఓ వ్యక్తి నుంచి ఆమె రూ.40 వేలు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం -
ఎస్బీఐలో రూ.4.50 కోట్లు కాజేసిన మేనేజర్
సూర్యాపేట: తను పనిచేస్తున్న ఎన్‌బీఐ బ్యాంకులోని సొమ్మునే ఓ మేనేజర్ కాజేశారు. 2022 నుంచి 2023 వరకు 24 మంది ఉద్యోగుల పేరుతో రుణాలు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. షేక్ సైదులు సూర్యాపేట ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ బ్యాంక్ రుణం తీసుకునేందుకు అర్హత కలిగిన వారిని ఎంచుకొని కుంభకోణానికి శ్రీకారం చుట్టాడు. బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అర్హత ఉన్నా, సాంకేతిక కారణాలు చూపి, అవసరమైన అదనపు పత్రాలు లేవంటూ రుణ దరఖాస్తును మొదటగా తిరస్కరించేవాడు. ఆపై అదే దరఖాస్తు ఆధారంగా, దరఖాస్తుదారుడి పేరు, వివరాలతో నకిలీ పత్రాలు సృష్టించి, వారి పేర్లతో మరోసారి రుణం కోసం దరఖాస్తు చేసేవాడు. దీనికి రుణం మంజూరు చేసినట్టు బ్యాంకు రికార్డుల్లో పొందుపర్చేవాడు. ఇలా ఒక్కో దరఖాస్తుదారుడి పేరుతో కనిష్టంగా రూ.15 లక్షలు కాజేశాడు. ఈ మొత్తాన్ని తన సొంత ఖాతాల్లోకి మళ్లించాడు. వెలుగులోకి వచ్చింది ఇలా.. ఉద్యోగుల పేరుతో రుణం తీసుకొని తన ఖాతాల్లోకి మళ్లించుకున్న సైదులు గత సంవత్సరం హైదరాబాద్‌లోని సీసీసీ (కమర్షియల్ క్లయింట్గ్రూప్) మేనేజర్‌గా బదిలీ అయ్యాడు. అయితే తాను తీసుకున్న ఈ రుణాలకు ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించేవాడు. 2024 ఫిబ్రవరి ఈఎంఐ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు బ్యాంకు నుంచి నోటీసులు వచ్చాయి. దీంతో అసలు విషయం తెలుసుకున్న బాధితులు సూర్యాపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కాగా ఇతను రామంతాపూర్ ఎస్బీఐ మేనేజర్‌తో కలిసి ఇదే తరహా మోసం చేసి రూ. 2.84 కోట్లు, సికింద్రాబాద్‌లో వెస్ట్ మారేడ్‌పల్లి బ్రాంచ్ నుంచి రూ. 9.50 కోట్లు కాజేసినట్టు సమాచారం. కొందరు ఉద్యోగులకు తెలిసే చేశారా ? పోలీస్‌శాఖలో 11 మంది ఉద్యోగులు, వైద్యారోగ్యశాఖలో ఇద్దరు, విద్యాశాఖలో ఇద్దరు, ఎక్సైజ్‌లో ఇద్దరు, కలెక్టరేట్లో వివిధ శాఖలకు చెందిన ఐదుగురు, ఇద్దరు ప్రైవేటు ఉద్యోగులు ఇలా మొత్తం 24 మంది ఉద్యోగుల పేరుతో బ్యాంక్ మేనేజర్ రుణం తీసుకున్నాడు. అయితే తమ పేరున రుణాలు తీసుకున్నట్టు కొందరు ఉద్యోగులకు ముందుగానే తెలిసినట్టు సమాచారం. మేనేజర్‌తో ఉద్యోగులు పర్సెంటేజీ మాట్లాడుకొని రుణం తీసుకునేందుకు అంగీకరించినట్టు తెలుస్తోంది. మరి కొంతమంది ఉద్యోగులు మేనేజర్ మాయమాటలకు మోసపోయినట్టు సమాచారం. -
ఎన్ఆర్ఐ మహిళకు రూ.16 కోట్లు టోకరా ఇచ్చిన బ్యాంకు మేనేజర్
ఐసీఐసీఐ బ్యాంకు అధికారి బారిన పడి ఎన్ఆర్ఐ మహిళ పెద్దమొత్తంలో డబ్బును కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వయంగా ఐసీఐసీఐ బ్యాంకు ఖాతా మేనేజర్ నకిలీ పత్రాలు సృష్టించి బ్యాంకు రికార్డులను తారుమారు చేసి కోట్ల రూపాయలను కొట్టేశాడు. మరొక బ్యాంక్ ఉద్యోగి తన డబ్బులపై ఎక్కువ వడ్డీ ఆఫర్ చేయడంతో, తన సొమ్ముకోసం ఆరా తీసిన నేపథ్యంలో ఈ స్కామ్ బయటపడింది. బీబీసీ కథనంప్రకారం ఎన్ఆర్ఐ శ్వేతా శర్మ 2016లో భారత్‌కు తిరిగి వచ్చింది. అమెరికాలో డిపాజిట్లపై వడ్డీరేట్లు తక్కువగా ఉండటంతో ఇండియాలో సొమ్మును డిపాజిట్ చేయాలని నిర్ణయించుకుంది. పాత గురుగ్రామ్‌లోని బ్యాంకు బ్రాంచ్ని సందర్శించిన తర్వాత బ్యాంక్ అధికారి సలహా మేరకు శ్వేతా శర్మ 2019లో ప్రవాస భారతీయుల కోసం ఉద్దేశించిన NRE ఖాతాను తెరిచింది. 5.5-6 శాతం వడ్డీ రేటుతో ఫిక్స్డ్ డిపాజిట్ చేసింది 2019,సెప్టెంబర్-2023 డిసెంబర్ 2023 మధ్య నాలుగేళ్ల వ్యవధిలో తమ సేవింగ్స్ దాదాపు రూ13.5 కోట్లను డిపాజిట్ చేసింది. వడ్డీతో కలిపి ఈ మొత్తం విలువ రూ. 16 కోట్లు ఉంటుందని శ్వేతా చెబుతున్నారు. స్నేహితురాలి ద్వారా తనకు పరిచయమైన బ్యాంకు అధికారి మోసపూరితంగా తనకు ఫేక్ స్టేట్మెంట్లు ఇచ్చాడని పేర్కొంది. ఫేక్ ఈమెయిల్ ఐడీని సృష్టించి, బ్యాంకు రికార్డుల్లో తనమొబైల్ నంబర్‌ను మార్చేసి, మెసానికి పాల్పడ్డాడని వాపోయింది. భారత్‌లో ఎఫ్‌డీల్లో పెట్టుబడులు పెట్టమని మోసపూరితంగానే ఒప్పించాడని, నకిలీ ఖాతాలు సృష్టించి, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, డెబిట్ కార్డులు, చెక్ బుక్‌లను తన (బ్యాంకు అధికారి) పేరు మీద తీసుకున్నాడని ఆరోపించింది. అందుకే బ్యాంకు నుంచి తనకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదని తెలిపింది. అలాగే డిపాజిట్లలో ఒకదానిపై రూ.2.5 కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకున్నాడని తన దృష్టికి వచ్చిందని కూడా వెల్లడించింది. బ్యాంక్ ప్రతినిధి కూడా మోసాన్ని అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన ఐసీఐసీఐ బ్యాంకు గత మూడేళ్లు బాధితురాలి ఖాతాలో జరిగిన ఈ లావాదేవీలు బ్యాలెన్స్‌ల గురించి కస్టమర్ తనకు తెలియదని చెప్పడం విస్మయానికి గురి చేస్తోందని వ్యాఖ్యానించింది.ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఫైల్ చేసేటప్పుడు అయినా ఆమె ఈ వ్యత్యాసాన్ని గమనించి ఉండాల్సిందని పేర్కొంది. అయినా దర్యాప్తు ఫలితాలను బట్టి, తాత్కాలికంగా ఆమె ఖాతాలో రూ.9.27 కోట్లు జమ చేశామని బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపింది. రెండు వారాల్లోగా సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు హామీ ఇచ్చినప్పటికీ ఫిర్యాదు చేసి ఆరు వారాలకు పైగా గడిచిపోవడం గమనార్హం. -
అతను మా కుమారుడి లాంటి వ్యక్తి.. జగపతిబాబు పోస్ట్ వైరల్!
టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు జగపతిబాబు. విభిన్నమైన పాత్రలతో తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. గతేడాది డిసెంబర్లో రిలీజైన ప్రభాస్ సలార్ మూవీలో రాజమన్నార్ పాత్రతో అభిమానులను మెప్పించారు. అంతే కాకుండా కన్నడ మూవీ కాటేరాలో సైతం కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తోన్న పుష్ప-2లో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అభిమానులనతో టచ్‌లో ఉంటారు. తాజాగా తన మేనేజర్ బర్త్ డే సందర్భంగా ఇన్‌స్టాలో ఫోటోను షేర్ చేశారు. జగపతిబాబు తన ఇన్‌స్టాలో రాస్తూ..' మా మేనేజర్ మహేష్. మా కొడుకు లాంటి వ్యక్తి పుట్టిన రోజు సందర్బంగా ఎప్పటికీ నా ఫ్యామిలీతో పాటు ఉండే.. మా ఫ్యామిలీ మెంబర్స్‌తో మా ఇంట్లో భోజనాల పండగ…. నాకు ఒక్కడికే రోజంత మజ్జిగా... పాపం నేను.' అంటూ పోస్ట్ చేశారు. ఇప్పటికే చాలాసార్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ప్రతి సందర్భాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటూనే ఉన్నారు. View this post on Instagram A post shared by Jaggu Bhai (@iamjaggubhai_) -
Adilabad:అవార్డు అందుకున్న రోజే హఠాన్మరణం
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయ మేనేజర్ చెన్నమాధవ దివాకర్ (56) హఠాన్మ రణం చెందారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం ఉదయం నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ఆయన కలెక్టర్ రాహుల్‌రాజ్ చేతుల మీదుగా ఉత్తమ అధికారిగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అనంతరం పట్టణంలోని అంబికానగర్‌లో గల తన ఇంటికి వెళ్లారు. అల్పాహారం తింటుండగా శ్వాస సమస్య తలెత్తడంతో కుటుంబీకులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. దివ్యాంగుడైన దివా కర్కు భార్య నాగలక్ష్మి, కుమా రులు మణికంఠ సాయి, గిరిధర్ సాయి ఉన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్‌కు చెందిన దివాకర్ 2003లో ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో టైపిస్ట్‌గా నియుక్తులయ్యారు. అంచెలంచెలుగా ఎదిగి మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థిరపడ్డారు. అవార్డు వచ్చిన ఆనందంలో ఇంటికి వెళ్లిన ఆయన గంట వ్యవధిలోనే మృత్యుఒడికి చేరడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చదవండి: బేగంపేట పీజీ ఉమెన్స్ హాస్టల్లో కలకలం.. బాత్రూంలోకి చొరబడ్డ ఆగంతకులు -
దారుణం: భార్యను సముద్రంలో ముంచి చంపి.. ఆపై..!
పనాజీ: గోవాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను సముద్రంలో ముంచి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. వివాహేతర సంబంధంపై భార్య ప్రశ్నించినందుకు నిందితుడు హత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గోవాలోని కాబో డి రామా బీచ్‌లో ఈ ఘటన జరిగింది. గౌరవ్ కటియార్(29) సౌత్ గోవాలోని ఓ లగ్జరీ హోటల్లో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. దీక్షా గంగ్వార్(27) అనే యువతిని గతేడాదే వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ లక్నోకు చెందినవారు. గోవాలోనే నివసిస్తున్నారు. అయితే.. కటియార్ వివాహేతర సంబంధంపై గంగ్వార్ ఇటీవల ప్రశ్నించింది. దీంతో భార్యను హత్య చేయాలనే కుట్ర పన్నిన కటియార్.. ఆమెను బీచ్‌కు షికారుకు తీసుకువెళ్లాడు. ఎవరూ లేని రాళ్ల ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆమెను నీళ్లలో ముంచి చంపేశాడు. ఆ తర్వాత యథావిధిగా కార్యాలయానికి తీరిగివచ్చాడు. తన భార్య చనిపోయిందో? లేదో నిర్దారించుకోవడానికి మళ్లీ ఓ సారి వెళ్లి చూశాడు. ఆ తర్వాత తన భార్య నీళ్లలో మునిగి చనిపోయిందని పోలీసులకు తెలిపాడు. ఆందోళన పడుతున్నట్లు హంగామా సృష్టించాడు. అయితే.. ఓ యాత్రికుడు తీసిన వీడియో ఆధారంగా కటియార్ కుట్ర బయటపడింది. కటియార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డబ్బుల కోసం బామ్మను చంపేశాడు -
సమంతను మోసం చేసిన మేనేజర్.. ఎంతో నమ్మితే, చివరకు ఇలా..
చిత్రపరిశ్రమలో హీరోహీరోయిన్ల మేజేజర్ల హవా మాములుగా ఉండదు. నిర్మాతకు హీరో,హీరోయిన్లకు మధ్య వారధిలా వాళ్లు పని చేస్తుంటారు. నిర్మాతకు డేట్స్ కావాలంటే.. సదరు హీరో, హీరోయిన్ల మేనేజర్లను సంప్రదించాల్సిందే. రెమ్యునరేషన్ మొదలు.. డేట్స్ వరకు ప్రతీది మేనేజర్ల చేతిలోనే ఉంటుంది. ఏ హీరో, హీరోయిన్ అయినా.. మేనేజర్లు చెప్పేదే విని ఓకే చెబుతారు. వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. తన మేనేజర్ని ఇంటి మనిషిలా భావించి, అన్నీ అతని చెప్పినట్లుగానే చేసేది. అంత నమ్మకంగా ఉన్న వ్యక్తి.. సామ్‌ని ఆర్థిక మోసం చేశాడనే వార్త కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది. సమంతకు తెలియకుండా రూ. కోటిని కాజేసేందుకు ప్రయత్నించాడట. ఈ విషయం సమంత దృష్టికి రావడంతో అతన్ని విధుల నుంచి తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. కుటుంబ సభ్యుడిగా భావించిన వ్యక్తి మోసం చేయడాన్ని సామ్ జీర్ణించుకోలేకపోయిందట. తొలుగ నమ్మకపోయినా.. ముఖ్యమైన వ్యక్తి చెప్పడంతో ఆమె అతన్ని దూరం పెట్టినట్లు సమాచారం. త్వరలోనే మరో కొత్తవ్యక్తిని తన మేనేజర్‌గా నియమించుకునే పనిలో ఉన్నారట. అసలు విషయం ఇదేనా? మయో సైటిస్ బారిన పడడంతో సామ్ ఒప్పుకున్న ఓ చిత్రం షూటింగ్ ఆలస్యం అయింది. దీంతో నిర్మాతలకు తన వల్ల నష్టం జరిగిందని, తన రెమ్యునరేషన్ తగ్గించాలని సామ్ భావించారట. ఈ విషయాన్ని తన మేనేజర్‌తో చెప్పి, రూ. కోటి వరకు తగ్గించి తీసుకోమని చెప్పిందట. అయితే మేనేజర్ మాత్రం నిర్మాతల దగ్గర ఆ కోటి కూడా తీసుకోవాలనుకున్నాడట. సదరు నిర్మాతల దగ్గరకు వెళ్లి బ్యాలెన్స్ గా ఉన్న రూ. కోటిని క్యాష్ రూపంలో ఇవ్వమని అడిగారట. అంత డబ్బు క్యాష్‌గా ఇవ్వడం సాధ్యం కాదని చెప్పడంతో.. తన స్నేహితుడి అకౌంట్‌కి పంపమని చెప్పాడట. వారికి అనుమానం కలగడంతో ఈ విషయాన్ని సామ్ దగ్గర వరకు తీసుకెళ్లారు. ఇలా మేనేజర్ అసలు రూపం బయటపడింది. ఇక సినిమా విషయాలకొస్తే.. సమంత- విజయ్ దేవరకొండ జంటగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. దీంతో పాటు రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో సీటడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇందులో వరుణ్ ధావణ్ కీలక పాత్ర పోషించాడు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్క్రీమింగ్ కానుంది. -
అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 'మాయా గ్యాంగ్'.. అసలేంటిది..?
ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్‌ప్రీత్ గిల్‌ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్‌ప్రీత్‌ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్‌కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్‌లో పని చేస్తున్నాడు. Bhajanpura murder: Delhi Police nabs 18-year-old man, says case solved Read @ANI Story | https://t.co/CwwQ54udMf#BhajanpuraCase #DelhiPolice pic.twitter.com/JjWFK7aA5M — ANI Digital (@ani_digital) August 31, 2023 అమెజాన్ మేనేజర్ హత్య.. ఢిల్లీకి చెందిన హర్‌ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్‌తో కలిసి సుభాష్ విహార్‌లోని ఇరుకైన సందులో బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్‌ప్రీత్ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్‌కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
‘చికెన్ కర్రీలో ఎలుక’ ఎపిసోడ్లో ట్విస్ట్!
రెస్టారెంట్లో చికెన్ కర్రీలో చచ్చిన ఎలుక కనిపించడం.. ఆ వార్త ప్రముఖంగా వార్తల్లో, సోషల్ మీడియా ద్వారా వైరల్ అవ్వడం తెలిసిందే. అయితే.. ముంబై బాంద్రాలో జరిగిన ఈ ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. కస్టమర్లు ఫుల్‌గా తాగొచ్చి అల్లరి చేయడమే కాకుండా.. తప్పుడు కేసు బనాయించారని రెస్టారెంట్ మేనేజర్ వాపోతున్నాడు. ఫిర్యాదుదారుల కథనం ప్రకారం.. అనురాగ్ సింగ్ అనే వ్యక్తి తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి బాంద్రా వెస్ట్ పరిధిలోని పాలి నాకాలోని పాపా పంచావో దా దాబా రెస్టారెంట్‌కు భోజనం చేసేందుకు వెళ్లాడు. అక్కడ చికెన్, బ్రెడ్‌తో మటన్ తాలి ఆర్డర్ చేశారు. ఫుడ్ తింటుండగా మాంసం ముక్క రుచిలో తేడా అనిపించడంతో పరీక్షించి చూడగా అందులో చనిపోయిన చిన్న ఎలుక కనిపించింది. దీనిపై కంగుతిన్న కస్టమర్ రెస్టారెంట్ మేనేజర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం ఇవ్వలేదు. మేనేజర్ తీరుపై ఆగ్రహంతో బాంద్రా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు ఆధారంగా బాంద్రా పోలీసులు రెస్టారెంట్ మేనేజర్, చెఫ్‌తో పాటు సర్వర్‌ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. తాగి వచ్చి డ్రామాలు గత 22 ఏళ్లుగా రెస్టారెంట్ నడుస్తోంది. ఇంతవరకు ఇలాంటివి జరగలేదు. మద్యం మత్తులో ఆ ఇద్దరూ మా రెస్టారెంట్‌కు వచ్చారు. వచ్చాక కూడా తాగుతూ కనిపించారు. మందు కోసం డిమాండ్ చేశారు. మాది కేవలం ఫుడ్ డైనింగ్ మాత్రమని స్పష్టం చేసినా వినిపించుకోలేదు. సర్వర్‌తో గొడవ పడ్డారు. చివరకు చచ్చిన ఎలుకతో డ్రామాకు దిగారు. డబ్బు ఇస్తేనే సైలెంట్‌గా వెళ్లిపోతామని చెప్పారు. మేం ఒప్పుకోకపోవడంతో ఇంత రాద్ధాంతం చేశారు. సీసీటీవీ ఫుటేజీ గమనిస్తే.. వాస్తవాలు బయటపడతాయి అని మేనేజర్, సర్వర్లు చెబుతున్నారు. బెయిల్‌పై విడుదల అయితే రెస్టారెంట్ పేరును దెబ్బ తీయడంతోపాటు డబ్బు వసూలు చేసే ఉద్దేశంతోనే రెస్టారెంట్‌పై అపవాదు మోపారని నిందితుల తరపు న్యాయవాది చెబుతున్నారు. మంగళవారం నిందితులు ముగ్గురినీ బెయిల్‌పై విడుదల చేశారు పోలీసులు. కలుషిత ఆహారం నేరం కింద కేసు నమోదు అయ్యిందని.. ఎలుక బయటపడిందిగా చెబుతున్న ప్లేట్‌ను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్‌కు పంపామని.. నివేదిక వస్తే అసలు విషయం బయటపడుతుందని బాంద్రా పోలీస్ అధికారి చెబుతున్నారు. @MumbaiPolice Rat found in our gravy at #papaPanchodadhaba near Pali naka Bandra West . No manager or owner is ready to listen . We called police and 100 as well . No Help yet . @mumbaimirror @TOIMumbai pic.twitter.com/YRJ4NW0Wyk — Stay_Raw (@AMINKHANNIAZI) August 13, 2023 చదవండి: సింగిల్‌గా ఉంటే.. చిరుతైనా గమ్మునుండాల్సిందే!లేదంటే.. -
భారత క్రికెట్లో విషాదం.. సునీల్ దేవ్ కన్ను మూత
భారత క్రికెట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు మేనేజర్‌గా పనిచేసిన సునీల్ దేవ్(75) కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గరువారం తుది శ్వాస విడిచారు. గతంలో సునీల్ దేవ్ ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శిగా పనిచేశారు. సునీల్ దేవ్ బీసీసీఐ సబ్ కమిటీలలో స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా తన సేవలు అందించారు. ముఖ్యంగా ఆయన 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు భారత జట్టుకు అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్‌గా వ్యవహరించారు. 2007 టీ20 ప్రపంచకప్‌ను ధోని సారధ్యంలోని భారత జట్టు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. అదే విధంగా 1996లో దక్షిణాఫ్రికా పర్యటన, 2014 ఇంగ్లండ్ టూర్లో కూడా ఆయన టీమిండియాకు మేనేజర్‌గా పనిచేశారు. ఆయన మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: Virat Kohli: కోహ్లితో పాటు ప్రపంచకప్ గెలిచారు! ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ నుంచి ఇప్పుడిలా! జడ్డూను చూశారా? -
చంద్రయాన్–3లో ఖమ్మం వాసి!
ఖమ్మంఅర్బన్: శాస్త్ర, సాంకేతిక రంగంలో కీలకమైన చంద్రయాన్–3 ప్రయోగం విజయవంతమైంది. అయితే, ఈ ప్రయోగంలో ఖమ్మంకు చెందిన శాస్త్రవేత్త ఆపరేషన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఖమ్మం శ్రీనగర్‌కాలనీకి చెందిన రిటైర్డ్ పీఆర్ డీఈ వల్లూరి కోటేశ్వరరావు కుమారుడు వల్లూరి ఉమామహేశ్వరరావు 2013లో ఇస్రో శాస్త్రవేత్తగా చేరారు. వివిధ స్థాయిల్లో పదేళ్ల నుంచి ప్రయోగాల్లో పాలు పంచుకుంటున్న ఆయనకు చంద్రయాన్–3లో ఆపరేషన్ మేనేజర్‌గా అవకాశం దక్కింది. బెంగళూరు కేంద్రంగా ఇస్రోలో ఆపరేషన్ డిజైనింగ్ విభాగంలో 1,500 మందికి పైగా పనిచేస్తుండగా... ఆపరేషన్ మేనేజర్లుగా 30మందిని ఎంపిక చేశారు. ఇందులో ఉమామహేశ్వరరావు కూడా ఉండడం విశేషం. ఈసందర్భంగా ఆయన ఫోన్లో ‘సాక్షి’తో మాట్లాడుతూ దేశ సాంకేతిక రంగంలో కీలకమైన ప్రయోగంలో తాను పాలు పంచుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. -
మేనేజర్‌తో విబేధాలు.. స్పందించిన రష్మిక
టాలీవుడ్లో హీరోయిన్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నేషనల్ క్రష్‌గా స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు యూత్‌లో ఫుల్ క్రేజ్. అయితే తన మేనేజర్ చేతిలో సుమారు రూ.80 లక్షల వరకు మోసపోయిందని, దీంతో అతన్ని తొలగించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా రష్మిక ఈ విషయంపై తొలిసారి స్పందించింది. తాము విడిగా పనిచేయాలని నిర్ణయించుకోవడం నిజమేనని తెలిపింది. (ఇదీ చదవండి: మా నాన్న అందుకే అలా అయ్యారు.. రాకేష్ మాస్టర్ కుమారుడు ఫైర్) కానీ ఈ నిర్ణయం వెనక ఎలాంటి గొడవలు లేవని తెలిపింది. తామిద్దరూ ఆరోగ్యకర వాతావరణంలో కలిసి పనిచేశామని చెప్పుకొచ్చింది. పరస్పర ఒప్పందంతో విడిగా తమ కెరీర్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ప్రొఫెషనల్‌గా వ్యవహరించే పనిలో ఉండే వాళ్లం కాబట్టి అలాగే కలిసి ఇంతవరకు వర్క్ చేశామని పేర్కొంది. ఇప్పుడు కూడా అంతే హుందాగా తామిద్దరం విడిగా పనిచేయాలని అనుకుంటున్నట్లు రష్మికతో పాటు ఆమె మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) -
రష్మికను మోసం చేసిన మేనేజర్!
సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్నిరోజుల్లోనే టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో రష్మిక మందన చోటు సంపాదించుకుంది . ఇక ‘పుష్ప’ సినిమాతో ఈ బ్యూటీ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలతో ఫిదా చేస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. తాజాగా మీడియా కథనాల ప్రకారం రష్మిక గురించి ఒక వార్త వైరల్ అవుతుంది. (ఇదీ చదవండి: శ్రీజతో విడాకులు.. కల్యాణ్ దేవ్ కన్ఫర్మ్ చేసినట్లేనా?) తన వద్ద చాలా రోజులుగా ఎంతో నమ్మకంగా పనిచేస్తున్న మేనేజర్ మోసం చేశాడని తెలుస్తోంది. ఆమె నుంచి దాదాపు రూ. 80 లక్షలు దొంగలించాడని సమాచారం. దీంతో రష్మిక అతన్ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ వ్యవహారంపై ఆమె మౌనంగానే ఉంది. మరోవైపు రష్మిక ఈ ఏడాది ‘పుష్ప2’ తో పాటు, రణ్‌బీర్‌కపూర్, సందీప్ వంగా కాంబినేషన్లో వస్తున్న ‘యానిమల్’ చిత్రంలోనూ నటిస్తోంది. (ఇదీ చదవండి: రాజకీయాల్లో సినిమా ఇంపాక్ట్.. గతం ఏం చెబుతోంది?) -
బంఫర్ ఆఫర్ అంటే ఇదే! జాబ్ నుంచి తీసేసినందుకు రూ.210 కోట్లు వచ్చాయ్
వాషింగ్టన్: జాతివివక్ష నెపంతో తనను జాబ్ నుంచి తొలగించారని ఓ ఉద్యోగిని వేసిన కేసులో ప్రముఖ కాఫీ సంస్థ స్టార్‌బక్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ ఉద్యోగినికి 25.6 మిలియన్ల డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం రూ.210కోట్లు) చెల్లించాలని ఫెడరల్ జ్యూరీ సంస్థను ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. ఫిలిప్స్ అనే మహిళ పని చేస్తున్న దుకాణంలో ఇద్దరు నల్లజాతీయులు వచ్చారు. కాసేపటి తర్వాత వారిలో ఒకరు దుకాణంలోని వాష్‌రూంని వాడుకుంటామని ఆమెను అడిగారు. అయితే స్టోర్‌లో ఏమి కొనుగోలు చేయన కారణంగా సిబ్బంది అందుకు అంగీకరించలేదు. అయితే తాము వ్యాపారం పని మీద ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నామని వాళ్లు చెప్పారు. దీంతో ఆగ్రహించిన స్టోర్ సిబ్బంది.. వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించగా.. అందుకు వారిద్దరూ నిరాకరించారు. చివరికి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ వ్యవహారమంతా అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్ కావడం.. అది కాస్త వైరల్ కావడంతో తీవ్ర నిరసనకు దారితీసింది. ఆ ఆందోళనలు సద్దుమణిగేలా చేసేందుకు సంస్థ చర్యలు తీసుకుంది. అందులో భాగంగా రీజినల్ మేనేజర్ షానన్ ఫిలిప్స్‌ను ఉద్యోగం నుంచి తొలగించి.. దుకాణ మేనేజర్‌ను మాత్రం విధుల్లోనే ఉంచింది. రీజినల్ మేనేజర్ శ్వేత జాతీయురాలు కాగా, మేనేజర్ నల్ల జాతీయుడు కావడం గమనార్హం. శ్వేతజాతీయురాలినైన తనపై జాతి వివక్ష ప్రదర్శించి శిక్షించారంటూ ఆమె 2019లో స్టార్‌బక్స్‌పై దావా వేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యూజెర్సీలోని ఫెడరల్ జ్యూరీ.. స్టార్‌బక్స్ సంస్థకు 25.6 మిలియన్ల డాలర్ల జరిమానాను విధించింది. చదవండి: ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం! -
ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!
వాషింగ్టన్: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్లైన్లో అమ్ముతున్నట్లు తేలింది. సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్మన్ స్కాట్లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్రినా మసాచుసెట్స్‌లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్‌ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్ యాజమాన్యం సెడ్రిక్పై వేటు కూడా వేసింది. చదవండి: అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి! -
Hyderabad: ఓయో రూమ్స్ మేనేజర్ ఆత్మహత్య
హైదరాబాద్: ఓయో హోటల్లో మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ వివరాల ప్రకారం.. ఉత్తర్‌ప్రదేశ్ కుషమ్‌కాష్ గ్రామానికి చెందిన అనుర«ద్‌సింగ్, సచిన్‌సింగ్(30) ఇద్దరూ నాచారం మల్లాపూర్‌లో ఉంటూ ఓయో హోటల్లో పనిచేస్తున్నారు. మూడు నెలలుగా మల్కాజిగిరి మారుతీనగర్‌లోని సాయి మాన్సన్ ఓయో హోటల్ నిర్వహిస్తున్నాడు. 16వ తేదీ రాత్రి తన రూమ్‌లోకి వెళ్లిన సచిన్‌సింగ్ తలుపు తీయలేదు. తలుపు పగులగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొనని దర్యాప్తు చేస్తున్నారు. -
నీట్‌గా స్కెచ్ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి
అన్నానగర్(చెన్నై): నకిలీ పత్రాలతో బ్యాంకులో రూ.1.28 కోట్ల రుణం తీసుకుని మోసం చేసిన ప్రైవేట్ కంపెనీ మేనేజర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కోయంబత్తూరు వేలండిపాళయంలో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులో ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ లోన్ అనే పథకం కింద జీతం ఖాతా ఉన్న వారికి రుణం ఇస్తున్నారు. 2019–20 వరకు కోయంబత్తూరుకు చెందిన ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా ఉన్న మార్టిన్ సాకో, విజయకుమార్ కంపెనీలో పని చేస్తున్నట్లు 44 మందికి నకిలీ పత్రాలు సిద్ధం చేసి రూ.1.28 కోట్ల రుణం పొందారు. బ్యాంకు ఆడిట్లో నకిలీ పత్రాలతో రుణం తీసుకున్నట్టు తేలింది. దీంతో మండల మేనేజర్ సెంథిల్‌కుమార్ కొబయాషి మునిసిపల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యాంక్ మేనేజర్ దండపాణి, జయప్రకాష్ నారాయణన్, అసిస్టెంట్ మేనేజర్ రాధిక, ప్రైవేటు సెక్యూరిటీ కంపెనీలో చీఫ్ మేనేజర్‌గా పని చేసిన మార్టిన్ సాకో, విజయకుమార్‌పై కేసు నమోదు చేశారు. వీరిలో రాధిక, విజయకుమార్ తదితరులను అరెస్టు చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్టిన్ సాకో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతను ఊటీలో ఉన్నట్లు సమాచారం అందగా అరెస్టు చేసి విచారిస్తున్నారు. -
గౌరీ ఖాన్ పనికి షారూఖ్ మేనేజర్ పూజా ఫిదా! ఆమె సంపాదన ఎంతో తెలిస్తే..!
సాక్షి, ముంబై: ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన నటుల్లో ఒకరు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్. షారూఖ్ భార్య గౌరీ ఖాన్ ముంబైలో ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్. ఇంటీరియర్ డిజైనర్‌గా సెలబ్రిటీల ఇళ్లకు మేక్ఓవర్లు చేసి భారీగానే ఆర్జిస్తోంది. ఫలితంగా ఆమె కూడా ముంబైలోని టాప్ ధనవంతుల్లో ఒకరు. అయితే షారూఖ్‌ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ గౌరీఖాన్‌పై ప్రశంసలు కురిపించి ఇటీవల వార్తల్లో నిలిచారు. అసలింతకీ పూజా దద్లానీ ఎవరు? గౌరీ ఖాన్ ఏం చేశారు? షారుఖ్ ఖాన్ మేనేజర్‌గా 2012 నుంచి పనిచేస్తున్న పూజా దద్లానీకి ఫ్యామిలీతో మంచి అనుబంధమే ఉంది. మంచి సన్నిహితురాలు కూడా. ఖాన్ దీంతో చాలా సెలబ్రిటీ పార్టీలకు ఆహ్వానిస్తారు. తాజాగా పూజా కొత్త ఇంటిని గౌరీ ఖాన్ డిజైన్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది. దీంతో ఆమె సంపాదన, నికర విలువ తదితర అంశాలపై ఆసక్తి నెలకొంది. పూజా దద్లానీ తన కొత్త ఇంటి గురించి ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కొత్త ఇంట్లోకి అడుగు పెడుతున్నా.. ఆనందంతో కొత్త కలల వైపు అడుగులు వేస్తున్నా.. ఈ కొత్త ప్రయాణంలో తన ఇంటిని అందంగా డిజైన్ చేయడానికి గౌరీ ఖాన్‌ను మించిన గొప్పవాళ్లు ఎవరుంటారు. ఇంటిని అందమైన కలల సౌధంగా మార్చేశారు అంటూ ఇన్‌స్టా స్టోరీలో ఆమెపై ప్రశంసలు కురిపించింది. దీంతో పూజా ఇంటి ఖరీదైన ఇంటీరియర్ డెకరేషన్ నెటిజనులను ఆకట్టుకుంటోంది. View this post on Instagram A post shared by Pooja Dadlani Gurnani (@poojadadlani02) బాలీవుడ్ టాప్ హీరో షారూక్‌కు చెందిన కేకేఆర్, రీ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ వంటి వ్యాపారాలను కూడా పూజా దద్లానీ నిర్వహిస్తుంది. దీంతో పూజా దద్లానీ సంపాదన చాలామంది సీఈవోల వేతనం కంటే చాలా ఎక్కువట. దద్లానీ సంపద నికర విలువ రూ. 45 కోట్ల నుంచి రూ. 50 కోట్ల మధ్య ఉంది. నెలకు 7 కోట్ల నుండి 9 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం. ముంబైలోని లిస్టా జ్యువెల్స్ డైరెక్టర్ హితేష్ గుర్నానీని పూజా వివాహం చేసుకోగా, వీరికి రేనా దద్లానీ అనే కూతురు ఉంది. -
కోవిడ్‌లోనూ రెచ్చిపోయిన నాగేంద్ర బాబు.. వలలో ఎందరో సినీ ప్రముఖులు
సాక్షి, హైదరాబాద్: సిటీ నటి జీవితను టార్గెట్ చేసి, ఆమె మేనేజర్ నుంచి రూ.1.25 లక్షలు కాజేసి, కటకటాల్లోకి చేరిన చెన్నై వాసి టిక్కిశెట్టి నాగేంద్రబాబుకు (29) ఘనమైన నేరచరిత్రే ఉంది. కోవిడ్ సీజన్లోనూ ఇతగాడు తనదైన పంథాలో, సమకాలీన అవసరాలకు అనువుగా మార్చుకుని రెచ్చిపోయాడని బయటపడింది. ఇతడి తాజా నేరాల చిట్టా బయటపడడానికి కస్టడీలోకి తీసుకుని విచారించాలని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు నిర్ణయించారు. దీనికి అనుమతి కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నాగేంద్రబాబు స్వస్థలం విజయవాడ. ఇతగాడు 2016 నుంచి మోసాలు చేయడం మొదలెట్టాడు. అప్పట్లో ఫ్యాన్సీ ఫోన్ నెంబర్లు ఇప్పిస్తానంటూ అనేక మంది నుంచి డబ్బు దండుకున్నాడు. ఈ మోసాలకు సంబంధించి ఇతడిపై విజయవాడలో మూడు కేసులు నమోదయ్యాయి. చెన్నైకు మకాం మార్చిన నాగేంద్ర అక్కడి లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్‌గా పని చేశాడు. కోవిడ్–19 వ్యాక్సిన్లు మార్కెట్లోకి విడుదలైన కొత్తలో వాటికి ఉన్న డిమాండ్‌ను క్యాష్ చేసుకున్నాడు. ఇతగాడు తొలుత తాను టార్గెట్ చేసిన వ్యక్తుల మొబైల్ నంబర్లను వివిధ మార్గాల్లో సేకరించే వాడు. గత ఏడాది వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారిగా అనేక మందికి ఫోన్లు చేశాడు. ప్రముఖ హాస్యనటుడు, ప్రముఖ నిర్మాతలకు ఫోన్లు చేశాడు. వారితో పాటు వారివద్ద పని చేసే వారికీ వ్యాక్సిన్లు వేస్తానంటూ రూ.లక్ష చొప్పున తీసుకుని మోసం చేశాడు. ఓ టెలివిజన్ ఛానెల్‌ను ఇలానే టార్గెట్ చేసిన నాగేంద్ర వారితో ఏకంగా తాను మంత్రి కేటీఆర్ సన్నిహితుడినంటూ చెప్పుకుని రూ.1.5 లక్షలు వసూలు చేశాడు. ఓ యువ నిర్మాతకు మీడియా అవార్డు ఇప్పిస్తానంటూ చెప్పి ఆమె నుంచి రూ.3.5 లక్షలు కాజేశాడు. ఈ నేరాలకు సంబంధించి హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, సైబరాబాద్ రాయదుర్గం తదితర ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. గత ఏడాది సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు. బెయిల్‌పై బయటకు వచ్చినా తన పంథా మార్చుకోకుండా కొనసాగిస్తున్నాడు.