వాషింగ్టన్: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లోని మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్‌లైన్‌లో అమ్ముతున్నట్లు తేలింది.
సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్‌మన్ స్కాట్‌లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కత్రినా మసాచుసెట్స్‌లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్‌ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్ యాజమాన్యం సెడ్రిక్‌పై వేటు కూడా వేసింది.
చదవండి: అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి!
Comments
Please login to add a commentAdd a comment