Harvard Medical School
-
ఇదేం పాడు పని.. మార్చురీలోని శవాలతో వ్యాపారం!
వాషింగ్టన్: వైద్య పరిశోధనల కోసం విరాళంగా ఇచ్చిన మృతదేహాల అవయవాలను అమ్ముకుంటున్న ఓ ముఠా గుట్టురట్టయ్యింది. ఈ దారుణం అమెరికాలోని హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హార్వర్డ్ మెడికల్ స్కూల్లోని మార్చురీకి మేనేజర్‌గా పనిచేసిన సెడ్రిక్ లాడ్జ్ ఈ వ్యాపారం చేస్తున్నట్లు బయటపడింది. అతను మృతదేహాలను ముక్కలుగా చేసి.. తల, మెదడు, చర్మం, ఎముకలను తస్కరించి, ఆన్లైన్లో అమ్ముతున్నట్లు తేలింది. సెడ్రిక్ తన భార్య డెనిస్ (63)తో కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నాడు. మానవ అవశేషాలను కత్రినా మక్లీన్, జాషువా టేలర్, మాథ్యూ లాంపి వంటి వ్యక్తులకు విక్రయించినట్లు దర్యాప్తులో బయటపడింది. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, కేసులో ప్రమేయం ఉన్న మరో ఇద్దరు అనుమానితులను జెరెమీ పాలీ, కాండస్ చాప్మన్ స్కాట్లుగా గుర్తించారు. నిందితులపై కుట్ర, దొంగిలించిన వస్తువులను అంతరాష్ట్ర రవాణా చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కత్రినా మసాచుసెట్స్‌లోని పీబాడీలో కాట్స్ క్రీపీ క్రియేషన్స్ పేరుతో ఒక స్టోర్‌ని కలిగి ఉంది. దొంగిలించిన ఈ శరీర భాగాలను ఆమె ఆ దుకాణంలో విక్రయించినట్లు అధికారులు కనుగొన్నారు. 2018 నుంచి 2022 మధ్య ఈ వ్యవహారంలో లక్ష డాలర్ల వరకు లావాదేవీలు జరిగి ఉండవచ్చని సమాచారం. అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ.. సెడ్రిక్ లాడ్జ్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచింది. గత నెలలోనే హార్వర్డ్ యాజమాన్యం సెడ్రిక్పై వేటు కూడా వేసింది. చదవండి: అమెరికా గుడ్ న్యూస్: వీలైనన్ని ఎక్కువ వీసాలిచ్చేందుకు తీవ్ర కృషి! -
వైరస్‌తో వాసన కోల్పోయేది ఇందుకే..
కరోనా సోకిన వారిలో కొంతమందికి వాసన చూసే శక్తి ఉండదని మనందరికీ తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. కరోనా వైరస్ కారణంగా వాసనలను గుర్తించే శక్తి తాత్కాలికంగా పోతుందని గత పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేసినా.. కోవిడ్–19 కారక వైరస్‌తో జరుగుతున్న నష్టం భిన్నమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణ కరోనా వైరస్ల వల్ల నెలలపాటు వాసన చూసే శక్తిని కోల్పోతుంటే.. కరోనాతో బారినపడ్డ వారిలో నాలుగు వారాల్లోనే ఆ శక్తి మళ్లీ వస్తున్నట్లు చెప్పారు. సాధారణ వైరస్ల బారిన పడినప్పుడు వాసనను గుర్తించి మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేసే సెన్సరీ న్యూరాన్లు దెబ్బతింటున్నాయని కోవిడ్ –19 విషయంలో న్యూరాన్లు దెబ్బతినడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ..తాజా అధ్యయనం ప్రకారం కరోనా వైరస్ ఈ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే ఇతర కణాల్లోకి చొరబడుతుండటం వల్లనే రోగులు వాసన చూసే శక్తిని కోల్పోతున్నట్లు స్పష్టమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వాసనను గుర్తించి మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేసే న్యూరాన్లు మాత్రం ఈ వైరస్ బారిన పడకపోవడం! కరోనా వైరస్ శరీర కణాల్లోకి చొరబడేందుకు ఆధారంగా చేసుకునే ఏస్ –2 రిసెప్టర్ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే జన్యువులు ఈ న్యూరాన్లలో లేవు. కానీ.. ఈ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే కణాల్లో మాత్రం ఉంటుంది. అంతేకాకుండా. రక్తనాళ కణాలు, కొంతమేరకు మూలకణాల్లోనూ ఏస్–2 రిసెప్టర్ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసే జన్యువులు ఉంటాయి. దీన్నిబట్టి కోవిడ్–19 రోగుల్లోని ఈ సహాయక కణాలను వైరస్ ఆక్రమించడం వల్లనే వాసన చూసే శక్తి తాత్కాలికంగా లేకుండా పోతోందని తెలుస్తోంది. వ్యాధి నుంచి కోలుకున్న తరువాత ఈ శక్తి మళ్లీ వారికి అందుతుండటం గమనార్హమని ఈ అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త సందీప్ రాబర్ట్ దత్తా తెలిపారు. కోవిడ్–19 బారిన పడ్డ వారిలో ఘ్రాణశక్తి శాశ్వతంగా కోల్పోయే అవకాశాల్లేవని తమ అధ్యయనం ద్వారా స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. ఈ విషయాన్ని ధ్రువీకరించుకునేందుకు మరికొంత సమాచారం అవసరమని చెప్పారు. మనిషి శ్వాసకోశంలో ఎక్కువగా కనిపించే ఏస్–2 జన్యువుతోపాటు కరోనా వైరస్ కణంలోకి చొరబడేందుకు అవసరమైన ఒక ఎంజైమ్‌ను ఉత్పత్తి చేసే జన్యువులపై తాము పరిశోధనలు చేశామని, ఈ రెండూ వాసన చూసే వ్యవస్థ తాలూకు ఉపరితల కణాల్లో మాత్రమే ఉంటూ.. న్యూరాన్లలో మాత్రం లేవని తెలిసిందని ఆయన చెప్పారు. ఎలుకలు, ఇతర జంతువులపై కూడా ఇదే రకమైన పరిశీలనలు జరిపినప్పుడు వాటి న్యూరాన్లూ ఏస్–2 రిసెప్టెర్ జన్యువులను కలిగి లేవని స్పష్టమైందని ఈ సమాచారం మొత్తాన్నిబట్టి న్యూరాన్లతో కలిసి పనిచేసే కణాల్లో ఏస్–2 రిసెప్టర్ జన్యువులు ఉండటమే కోవిడ్ రోగులు వాసన శక్తిని కోల్పోయేందుకు కారణమని స్పష్టమైందని వివరించారు. -
చైనాలో ఆగస్టులోనే కరోనా విజృంభణ!
వాషింగ్టన్: ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయటపడింది. చైనాలో ఉద్భవించిన దీని గురించి గతేడాది డిసెంబర్లోనే ప్రపంచానికి తెలిసినప్పటికీ, అంతను మునుపే ఆ దేశంలో వైరస్ విజృంభణ మొదలైందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సాటిలైట్ నుంచి తీసిన ఫొటోల ద్వారా గతేడాది ఆగస్టు నుంచే కరోనా ఉనికి ప్రారంభమైందని తెలిపింది. కిక్కిరిసిన ఆసుపత్రులు- పార్కింగ్, అక్కడి జనాభా సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన పదాల ఆధారంగా ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఈ విషయాన్ని వెల్లడించింది. (ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట!) 2019లో సాటిలైట్ ఫొటోల ఆధారంగా వూహాన్లో ఆసుపత్రుల దగ్గర జనాల రద్దీ అధికంగా కనిపించిందని, అనూహ్య రీతిలో పార్కింగ్ స్థలం కూడా నిండిపోయిందని తెలిపింది. పైగా అదే సమయంలో ఎక్కువ మంది జనాలు కరోనా ముఖ్య లక్షణమైన దగ్గుతో పాటు విరేచనాలు వంటి పదాలను గూర్చి సెర్చింజన్లో వెతికారని పేర్కొంది. ఇంతకు మునుపు సీజన్ల కన్నా భిన్నంగా ఆగస్టులో ఈ పదాల గురించి వెతికిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో అప్పటి నుంచే వైరస్ వ్యాప్తి ప్రారంభమైందని అభిప్రాయపడింది. హువాన్ మార్కెట్లో కరోనాను గుర్తించే సమయానికి ముందే అది ఉనికిలో ఉందన్న వాదనకు మా ఆధారాలు మద్దతిస్తున్నాయంది. కాగా చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదవగా 78,341 మంది కోలుకున్నారు (చైనాను మించిన మహారాష్ట్ర) -
కరోనా ఎదుర్కోవాలంటే ఇలా చేయండి!
వాషింగ్టన్: చైనాలో పుట్టి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా అమెరికాలోనూ విజృంభిస్తోంది. అక్కడ ఇప్పటికే 3,485 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదు కాగా 65 మృతి చెందారు. ఇక ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు యోగా చేయాలని ప్రఖ్యాత హార్వార్డ్ మెడికల్ స్కూల్ సూచిస్తోంది. కరోనా వల్ల తలెత్తే భయం, ఊపిరితీసుకోవడంలో ఇబ్బందులను యోగా, ధ్యానం దూరం చేస్తాయని తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటితో వ్యక్తి పూర్తిగా రిలాక్స్ కావొచ్చునని ‘కోపింగ్ విత్ కరోనా వైరస్ యాంగ్జయిటీ’ కథనంలో వెల్లడించింది. (చదవండి: కంగారెత్తిస్తున్న కరోనా) ఇలా చేస్తే మంచి ఫలితాలు.. ‘రెగ్యులర్‌గా యోగా చేసేవారిలో ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. మెడిటేషన్ ఎలా చేయాలో హెడ్‌స్పేస్, కామ్, యోగా స్టూడియో, పోకెట్ యోగా వంటి ఎన్నో యాప్‌లు సులభంగా నేర్పిస్తున్నాయి’అని హార్వార్డ్ మెడికల్ స్కూల్ ఫ్యాకల్టీ, సైకియాట్రిస్ట్ జాన్ షార్ప్, కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ మెడిసన్‌కు చెందిన డేవిడ్ జెఫెన్ పేర్కొన్నారు. ‘ఇప్పటికే మీరు యోగా చేస్తున్నవారైతే.. అలాగే కొనసాగించడం మంచిది. కానీ, కొత్తగా యోగా చేస్తాను అనుకుంటే.. పెద్దగా ఫలితాలు ఉండకపోవచ్చు. కానీ, ఆరోగ్యం విషయంలో పరధ్యానంగా ఉన్నప్పుడు నూతనంగా చేపట్టే పనులు ఎంతోకొంత మేలు చేస్తాయి’అని వారు తెలిపారు. (చదవండి: ఉగ్రవాదులూ..యూరప్ వెళ్లొద్దు: ఐసిస్) శ్వాస సంబంధమైన వ్యాయామాలు చేయడం, హైజీన్‌గా ఉండటం, ఆఫీసుల్లో మునుపటిలా కాకుండా పనులు తగ్గించుకోవడం, ఇతరులకు దూరం పాటించడం, ఆరోగ్యరంగ నిపుణుల సలహాలు పాటించి, ఏం చేయాలి, ఏం చేయకూడదో తెలుసుకుని మసలుకుంటే కరోనాకు దూరంగా ఉండొచ్చునని చెప్తున్నారు. ఇక కోవిడ్-19 భయాలను తగ్గించేందుకు, ప్రజల్లో మానసిక ఆరోగ్యాన్ని, ధైర్యాన్ని పెంచేందుకు హోమం కాల్చడం, దైవ ప్రార్థనలు చేస్తామని ప్రపంచ హిందూ కాంగ్రెస్ వెల్లడించింది. హార్వార్డ్ మెడికల్ స్కూల్ సూచనల్ని ఉటంకిస్తూ.. ఆసనాలు, ధ్యానం, ప్రాణాయామం వైరస్ బారినపడి ఐసోలేషన్‌లో ఉండాల్సి వచ్చినప్పుడు ఆందోళనను తగ్గిస్తాయని ప్రపంచ హిందూ కాంగ్రెస్ ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వాహకుడు అనిల్ శర్మ చెప్పారు. (ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తొలి బాధితుడు) -
పుషప్స్‌తో గుండె పదిలం
లండన్ : పుషప్స్‌తో గుండెకు మేలని, రోజుకు 40 పుషప్స్ చేసే పురుషులకు గుండె పోటు, స్ర్టోక్ ముప్పు 96 శాతం తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. ట్రెడ్మిల్ టెస్ట్‌లతో పోలిస్తే ఫిట్నెస్ స్ధాయిలను పరీక్షించేందుకు పుషప్స్ మెరుగైన మార్గమని పేర్కొంది. రోజుకు పది నుంచి 40 పుషప్స్ చేసే వారిలో దీర్ఘకాలంలో గుండె జబ్బులు, గుండె పోటు అవకాశాలు గణనీయంగా తగ్గాయని తమ పరిశోధనలో వెల్లడైందని హార్వర్డ్ వర్సిటీకి చెందిన డాక్టర్ జస్టిన్ యంగ్ పేర్కొన్నారు. గుండె జబ్బును గుర్తించడంలో రోగి స్వయంగా వెల్లడించే అంశాలతో పాటు, ఆరోగ్య, జీవనశైలి ఆధారంగానే వైద్యులు ఓ అంచనాకు వస్తున్నారని, కార్డియోరెస్పిరేటరీ ఫిట్నెస్ వంటి కీలక హెల్త్ రిస్క్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ అథ్యయనం వెల్లడించింది. పుషప్స్ సామర్ధ్యాన్ని సులభంగా, ఎలాంటి వ్యయం లేకుండా పరీక్షించవచ్చని, దీంతో రాబోయే రోజుల్లో వారి గుండె ఆరోగ్యాన్ని అంచనా వేయవచ్చని అథ్యయన రచయిత స్టెఫాన్స్ కేల్స్ వెల్లడించారు. ఫిబ్రవరి 2000 నుంచి నవంబర్ 2007 మధ్య దాదాపు వేయి మంది ఫైర్ఫైటర్లపై జరిపిన పరిశోధనలో ఈ అంశాలు గుర్తించామన్నారు. అథ్యయన వివరాలు జామా నెట్వర్క్ ఓపెన్‌లో ప్రచురితమయ్యాయి. -
మెడికల్ ప్రొఫెసర్లకు 'హార్వర్డ్' శిక్షణ
హైదరాబాద్: ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వందమంది వైద్య ప్రొఫెసర్లకు బోస్టన్‌కు చెందిన ప్రముఖ మెడికల్ యూనివర్శిటీ అయిన హార్వర్డ్ మెడికల్ స్కూల్లో శిక్షణ ఇవ్వనున్నారు. వైద్యవిద్యలో వస్తున్న మార్పులు, అధునాతన వైద్య చికిత్స పద్ధతులు వంటి వాటిపై గత ఫిబ్రవరిలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తొలి దశలో 100 మంది ప్రొఫెసర్లకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైద్య విద్యా సంచాలకులకు లేఖ రాసింది. ప్రొఫెసర్ల జాబితా వీలైనంత త్వరగా ఇవ్వాలని కోరినట్టు ఎన్టీఆర్ వర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి. ప్రొఫెసర్లకు కనీసం ఐదేళ్ల సర్వీసు ఉండాలని నిబంధన విధించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. సుమారు 1900 ఎంబీబీఎస్ విద్యార్థులు, వెయ్యి మందివరకూ పీజీ వైద్య విద్యార్థులు ఉన్నారు. ఈ కళాశాలల్లో ఇన్నొవేటివ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు, సీఎంఈ (కంటిన్యుటీ మెడికల్ ఎడ్యుకేషన్) ప్రోగ్రాంలు నిర్వహించేందుకు హార్వర్డ్ మెడికల్ స్కూల్ అంగీకరించింది. ఇందులో భాగంగానే ముందుగా వివిధ స్పెషాలిటీలకు చెందిన ప్రొఫెసర్లను ఎంపిక చేయనున్నారు. ఎంపిక ప్రక్రియ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలో జరగనున్నట్టు వైద్యవిద్యా వర్గాలు తెలిపాయి. -
యాంటీబయోటిక్స్‌తో మతిభ్రమణం!
పరిపరి శోధన చిన్నా చితకా ఇబ్బందులకు ఎడా పెడా యాంటీబయోటిక్స్ వాడటం చాలామందికి అలవాటే. అయితే, మోతాదు చూసుకోకుండా ఇష్టానుసారం యాంటీబయోటిక్స్ వాడితే ఇబ్బందులు తప్పవని అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోతాదుకు మించిన యాంటీబయోటిక్స్ వాడటం వల్ల శారీరక సమస్యలు మాత్రమే కాదు, కొందరిలో తాత్కాలిక మతిభ్రమణం వంటి మానసిక సమస్యలు కూడా తలెత్తుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్త డాక్టర్ శామిక్ భట్టాచార్య చెబుతున్నారు. దీర్ఘకాలంగా మోతాదుకు మించి యాంటీబయోటిక్స్ వాడేవారిలో రకరకాల భ్రమలు కలగడం, సంధి ప్రేలాపనలు వంటి లక్షణాలు కనిపిస్తాయని తమ పరిశోధనల్లో గుర్తించినట్లు ఆయన తెలిపారు.