![Coronavirus Started Spreading In China Since August 2019 - Sakshi](/styles/webp/s3/article_images/2020/06/9/covid.jpg.webp?itok=ynpHpZmh)
వాషింగ్టన్: ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయటపడింది. చైనాలో ఉద్భవించిన దీని గురించి గతేడాది డిసెంబర్‌లోనే ప్రపంచానికి తెలిసినప్పటికీ, అంతను మునుపే ఆ దేశంలో వైరస్ విజృంభణ మొదలైందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సాటిలైట్ నుంచి తీసిన ఫొటోల ద్వారా గతేడాది ఆగస్టు నుంచే కరోనా ఉనికి ప్రారంభమైందని తెలిపింది. కిక్కిరిసిన ఆసుపత్రులు- పార్కింగ్, అక్కడి జనాభా సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన పదాల ఆధారంగా ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఈ విషయాన్ని వెల్లడించింది. (ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట!)
2019లో సాటిలైట్ ఫొటోల ఆధారంగా వూహాన్‌లో ఆసుపత్రుల దగ్గర జనాల రద్దీ అధికంగా కనిపించిందని, అనూహ్య రీతిలో పార్కింగ్ స్థలం కూడా నిండిపోయిందని తెలిపింది. పైగా అదే సమయంలో ఎక్కువ మంది జనాలు కరోనా ముఖ్య లక్షణమైన దగ్గుతో పాటు విరేచనాలు వంటి పదాలను గూర్చి సెర్చింజన్‌లో వెతికారని పేర్కొంది. ఇంతకు మునుపు సీజన్ల కన్నా భిన్నంగా ఆగస్టులో ఈ పదాల గురించి వెతికిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో అప్పటి నుంచే వైరస్ వ్యాప్తి ప్రారంభమైందని అభిప్రాయపడింది. హువాన్ మార్కెట్‌లో కరోనాను గుర్తించే సమయానికి ముందే అది ఉనికిలో ఉందన్న వాదనకు మా ఆధారాలు మద్దతిస్తున్నాయంది. కాగా చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదవగా 78,341 మంది కోలుకున్నారు (చైనాను మించిన మహారాష్ట్ర)
Comments
Please login to add a commentAdd a comment