August
-
టోకు ధరల ఊరట..
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 1.31 శాతంగా (2023 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 4 నెలల్లో ఇంత తక్కువస్థాయి టోకు ద్రవ్యోల్బణం నమోదుకావడం గమనార్హం. కూరగాయలు, ఇంధనం ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కూడా జూలై, ఆగస్టుల్లో 4% లక్ష్యాల దిగువకు (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) చేరిన సంగతి తెలిసిందే. తాజా టోకు గణాంకాల్లో ఫుడ్ ఐటమ్స్ ద్రవ్యోల్బణం 3.11% గా నమోదయ్యింది. కూరగాయల ధరలు 10% తగ్గాయి. అయితే ఆలూ, ఉల్లి ధరలు భారీగా 77.96%, 65.75% చొప్పున పెరిగాయి. -
ఆగస్టులో నెమ్మదించిన ప్యాసింజర్ వాహన విక్రయాలు
న్యూఢిల్లీ: దేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 2% తగ్గినట్లు వాహన తయారీదార్ల సమాఖ్య సియామ్ వెల్ల డించింది. మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం, కంపెనీలు డీలర్లకు తమ డిస్పాచ్‌లను తగ్గించ డం ఇందుకు కారణమని తెలిపింది. ఈ ఆగస్టులో కంపెనీల నుంచి డీలర్లకు 3,52,921 ప్యాసింజర్ వాహనాలు చేరాయి. గతేడాది (2023) ఆగస్టులో ఇవి 3,59,228గా నమోదయ్యాయి. → ద్వి చక్ర వాహన టోకు అమ్మకాలు 9% పెరిగి 15,66,594 యూనిట్ల నుంచి 17,11,662 యూనిట్లకు చేరాయి. స్కూటర్ల విక్రయాలు 6,06,250 యూనిట్ల నుంచి 5,49,290 యూనిట్లకు పెరిగాయి. మోటార్‌సైకిల్ డెలివరీలు 9,80,809 యూనిట్ల నుండి 8% పెరిగి 10,60,866 యూనిట్లకు చేరుకున్నాయి. → త్రి చక్ర వాహనాల అమ్మకాలు 64,944 యూనిట్ల నుంచి 69,962 యూనిట్లకు పెరిగాయి. ‘‘ఈ పండుగ సీజన్లో వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది. కేంద్రం ఇటీవల ప్రకటించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం ఈ–బస్ సేవా పథకాలతో వాహన వినియోగం మరింత పుంజుకుంటుంది’’ అని సియామ్ డైరక్టర్ జనరల్ రాజేష్ మీనన్ తెలిపారు. -
ఈక్విటీ ఫండ్స్ అదే జోరు
న్యూఢిల్లీ: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్‌లోనూ తమ జోరు చూపించాయి. నికరంగా రూ.38,239 కోట్లను ఆకర్షించాయి. ముఖ్యంగా థీమ్యాటిక్ ఫండ్స్, కొత్త పథకాల (న్యూ ఫండ్ ఆఫర్లు/ఎన్‌ఎఫ్‌వోలు) రూపంలో ఎక్కువ పెట్టుబడులను సమీకరించాయి. ఈ ఏడాది జూలైలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లోకి వచి్చన రూ.37,113 కోట్లతో పోల్చి చూస్తే 3.3 శాతం మేర ఆగస్ట్‌లో వృద్ధి నమోదైంది. జూన్‌లో వచి్చన రూ.40,608 కోట్ల పెట్టుబడులు ఇప్పటి వరకు నెలవారీ గరిష్ట రికార్డు కాగా, ఆగస్ట్‌లో పెట్టుబడులు రెండో గరిష్ట రికార్డుగా ఉన్నాయి. ఈ గణాంకాలను మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) విడుదల చేసింది. మొత్తం మీద మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ వ్యాప్తంగా అన్ని రకాల పథకాల్లోకి కలిపి ఆగస్ట్‌లో రూ.1.08 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో ఇవి రూ.1.9 లక్షల కోట్లుగా ఉన్నాయి. దీంతో మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని మొత్తం ఆస్తుల విలువ జూలై చివరికి ఉన్న రూ.65 లక్షల కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి రూ.66.7 లక్షల కోట్లకు చేరింది. కొత్త గరిష్టానికి సిప్ పెట్టుబడులు సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా వచ్చే పెట్టుబడులు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయిలో రూ.23,547 కోట్లుగా నమోదయ్యాయి. జూలైలో ఇవి రూ.23,332 కోట్లుగా ఉన్నాయి. విభాగాల వారీగా పెట్టుబడులు.. → థీమ్యాటిక్ ఫండ్స్ (రంగాలు/ప్రత్యేక థీమ్‌లలో ఇన్వెస్ట్ చేసేవి) పథకాల్లోకి అత్యధికంగా రూ.18,117 కోట్లు వచ్చాయి. ఈ తరహా పథకాలు జూలైలో రూ.18,336 కోట్లు, జూన్‌లో రూ.22,352 కోట్ల చొప్పున ఆకర్షించడం గమనార్హం. → ఆగస్ట్‌లో ఆరు కొత్త పథకాలు ప్రారంభం కాగా, అందులో ఐదు సెక్టోరల్/థీమ్యాటిక్ ఫండ్స్ ఉన్నాయి. ఇవి రూ.10,202 కోట్లను సమీకరించాయి. → లార్జ్‌క్యాప్ పథకాల్లోకి రూ.2,637 కోట్లు వచ్చాయి. మిడ్‌క్యాప్ పథకాలు రూ.3,055 కోట్లు, స్మాల్‌క్యాప్ ఫండ్స్ రూ.3,209 కోట్ల చొప్పున ఆకర్షించాయి. అన్ని రకాల పథకాల్లోకి పెట్టుబడుల రాక ఇన్వెస్టర్లలో మార్కెట్ల పట్ల ఉన్న సానుకూల ధోరణిని తెలియజేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. → ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్‌లోకి పెట్టుబడుల రాక రూ.3,513 కోట్లుగా ఉంది. → కేవలం ఫోకస్డ్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ నికరంగా పెట్టుబడులను కోల్పోయాయి. → డెట్ పథకాల్లోకి నికరంగా రూ.45,169 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో వచ్చిన రూ.1.2 లక్షల కోట్ల కంటే 62 శాతం తక్కువ. → డెట్‌లో ఓవర్‌నైట్ ఫండ్స్ అత్యధికంగా రూ.15,106 కోట్లను ఆకర్షించాయి. ఆ తర్వాత లిక్విడ్ ఫండ్స్, మనీ మార్కెట్ ఫండ్స్ పట్ల ఇన్వెస్టర్లు మొగ్గు చూపించారు. మొత్తం పెట్టుబడుల్లో 86 శాతం ఈ మూడు విభాగాల్లోని పథకాల్లోకే వచ్చాయి. → గోల్డ్ ఈటీఎఫ్‌లు రూ.1,611 కోట్లను ఆకర్షించాయి. జూలైలో వచ్చిన రూ.1,337 కోట్లతో పోల్చి చూస్తే 20 శాతానికి పైగా వృద్ధి కనిపిస్తోంది. → మొత్తం ఫోలియోలు (ఇన్వెస్టర్ల పెట్టుబడి ఖాతాలు) జూలై చివరకి ఉన్న 19.84 కోట్ల నుంచి ఆగస్ట్ చివరికి 20 కోట్ల మార్క్‌ను అధిగమించాయి. -
ఆగష్టులో 27000 మంది!.. ఇలా అయితే ఎలా?
కరోనా మహమ్మారి వ్యాపించిన తరువాత.. ఉద్యోగాలు నీటిమీద బుడగల్లా మారిపోయాయి. ఇప్పటికే లక్షలమంది ఉద్యోగాలు కోల్పోయారు. 2024లో కూడా ఈ సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఆగష్టు నెలలో సుమారు 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు సమాచారం. ఇందులో ఇంటెల్, సిస్కో, ఐబీఎమ్ వంటి దిగ్గజ కంపెనీలు ఉన్నాయి.కంపెనీలు ఎదుర్కుంటున్న ఆర్థిక మాంద్యం.. ఉద్యోగులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. 2024లో ఇప్పటి వరకు సుమారు 422 కంపెనీలు 1.36 లక్షల మంది ఉద్యోగులను తొలగించాయి.సెమీకండక్టర్ లీడర్.. 'ఇంటెల్' ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి 15000 ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఖర్చుల పెరుగుదల.. ఆదాయ వృద్ధి తగ్గడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల సంఖ్యను తగ్గించాల్సి వస్తోందని కంపెనీ సీఈఓ పాట్ గెల్సింగర్ పేర్కొన్నారు.సిస్కో కంపెనీ సుమారు 6000 మంది ఉద్యోగులను తొలగించే పనిలో ఉంది. ఈ సంఖ్య కంపెనీ మొత్తం ఉద్యోగులలో 7శాతంగా ఉంది. కంపెనీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సైబర్ సెక్యూరిటీ మీద దృష్టిపెట్టాలని యోచిస్తోంది. ఇది కంపెనీని అభివృద్ధి మార్గంలో నడిపించడానికి సహాయపడుతుందని సంస్థ సీఈఓ చక్ రాబిన్స్ వెల్లడించారు.ఇదీ చదవండి: వేలకోట్ల సామ్రాజ్యం స్థాపించిన టీచర్ఐబీఎం కంపెనీ రీసర్చ్ అండ్ డెవలప్మెంట్ కార్యకలాపాలను చైనా నుంచి ఉపసంహరించుకున్న తరువాత సుమారు 1000 మంది కంటే ఎక్కువ ఉద్యోగాలు కోల్పోయారు. జర్మన్ చిప్ తయారీ సంస్థ ఇన్ఫినియన్ కూడా 14000 మందిని తొలగించనున్నట్లు సమాచారం. ఇదే బాటలు డెల్, షేర్‌చాట్ వంటి దిగ్గజాలు కూడా అడుగులు వేస్తున్నాయి. -
టెకీల పాలిట దారుణంగా ఆగస్ట్ నెల..
గడిచిన ఆగస్ట్ నెల టెకీల పాలిట దారుణంగా పరిణమించింది. ఈ ఒక్క నెలలోనే టెక్ రంగంలో ఏకంగా 27,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. 40 కంటే ఎక్కువ కంపెనీలు లే-ఆఫ్‌లను ప్రకటించాయి. ఈ తాజా రౌండ్ తొలగింపులను కలుపుకొంటే గడిచిన ఏడాదిగా 422 కంపెనీలలో లేఆఫ్‌లు 136,000 లకు పెరిగాయి.ఈ ఉద్యోగ కోతల్లో ఇంటెల్ అగ్రగామిగా ఉంది. ఇది 15,000 మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. ఇది దాని ఉద్యోగులలో 15%. సీపీయూ చిప్ టెక్నాలజీలో కంపెనీ అగ్రగామిగా ఉన్నప్పటికీ అధిక వ్యయాలు, తక్కువ మార్జిన్ల కారణంగా ఖర్చుల తగ్గింపు ప్రణాళికకు పూనుకుంది. 2020 నుంచి 2023 మధ్యకాలంలో కంపెనీ 10% ఎక్కువ మంది ఉద్యోగులను ఇంటెల్ నియమించుకుంది.ఇక టెలికమ్యూనికేషన్స్ పరికరాల తయారీ సంస్థ సిస్కో సిస్టమ్స్ తన వర్క్ ఫోర్స్‌లో దాదాపు 6,000 మంది లేదా 7 శాతం మంది ఉద్యోగులను తగ్గించుకోనున్నట్లు తెలిపింది. జాబితాలో మరొక పెద్ద పేరు ఐబీఎం. ఈ కంపెనీ చైనాలో దాని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాన్ని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. ఇది వెయ్యి మందికి పైగా ఉద్యోగులను తొలగింపునకు దారితీసింది.మార్కెట్ పరిస్థితులు, మందగించిన ఆర్థిక కార్యకలాపాల కారణంగా జర్మన్ చిప్‌మేకర్ ఇన్ఫినియన్ కూడా 1,400 మంది ఉద్యోగులను తొలగించి, మరో 1,400 మందిని తక్కువ ఖర్చుతో కూడిన ప్రాంతాలకు బదిలీ చేయాలని ప్రణాళిక రచించింది. గోప్రో కంపెనీ తమ వర్క్‌ఫోర్స్‌లో 15% లేదా దాదాపు 140 మంది తగ్గించింది. ఇక యాపిల్ 100 మంది ఉద్యోగులను తొలగించింది.డెల్ టెక్నాలజీస్ కూడా భారీగానే తొలగింపులు చేపట్టనున్నట్లు వార్తల్లో నిలిచింది. బెంగళూరుకు చెందిన రేషామండి అనే అగ్రిటెక్ సంస్థ మొత్తం సిబ్బందిని తొలగించి మూతపడింది. వెబ్ బ్రౌజర్ కంపెనీ అయిన బ్రేవ్ 27 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.సోషల్ మీడియా సంస్థ షేర్‌చాట్ తన ఉద్యోగులలో 5% మందిని వదులుకుంటున్నట్లు ప్రకటించింది. -
అరేబియా సముద్రంలో తుపానా?
న్యూఢిల్లీ: ఆగస్ట్ నెలలో అరేబియా సముద్రంలో తుపాను పుట్టి భారత వాతావరణ శాఖ అధికారులను సైతం సంభ్రమాశ్చర్యాలకు, ఒకింత ఆందోళనకు గురిచేసింది. ఎందుకంటే అరేబియా సముద్రంలో ఆగస్ట్ నెలలో తుపాన్లు ఏర్పడటం చాలా అరుదైన విషయం. అరేబియా సముద్ర పశ్చిమ ప్రాంత జలాలు ఎల్లప్పుడూ చల్లగా ఉంటాయి. చల్లని జలాలు అనేవి తుపాన్లు ఏర్పడేందుకు అనువైన వాతావరణం కాదు. అరేబియా ద్వీపకల్ప భూభాగాల నుంచి వీచే పొడిగాలులు సైతం ఇక్కడ తుపాన్లను ఏర్పర్చలేవు. అయితే తాజాగా గుజరాత్ తీరాన్ని దాటుతూ తుపాను ఏర్పడటం వాతావరణ శాఖ అధికారులను సైతం ఆలోచనల్లో పడేసింది. చివరిసారిగా 1976లో అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడింది. అది కూడా ఒడిశా మీదుగా ఏర్పడిన అల్పపీడనం చివరకు పశ్చిమ–వాయవ్య దిశగా కదిలి చివరకు అరేబియా సముద్రంలో తుపానుగా రూపాంతరం చెందింది. తర్వాత అది అలాగే వెళ్లి ఒమన్ తీరం వద్ద బలహీనపడింది. అరేబియాలో తుపాన్లు ఎందుకు రావంటే?వర్షాకాల సీజన్లో అరేబియా సముద్ర జలాల ఉపరితల ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్‌కన్నా తక్కువకు పడిపోతుంది. దీంతో జూలై, సెప్టెంబర్‌లో తుపాన్లు ఏర్పడటం కష్టం. అల్పపీడనం ఏర్పడినపుడు గాలులు గంటకు 52–61 కి.మీ.ల వేగంతో వీస్తాయి. అదే తుపాను ఏర్పడితే గంటకు 63–87 కి.మీ.ల వేగంతో వీస్తాయి. తుపాను ఏర్పడాలంటే సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత కచ్చితంగా 26.5 డిగ్రీల సెల్సియస్‌ను మించి ఉండాలి. అయితే అరేబియా జలాలు ఇంత వేడి ఉండవు. అదే బంగాళాఖాతంలో ఉండే వాతావరణం తుపాన్లు ఏర్పడటానికి అత్యంత అనువుగా ఉంటుంది. చారిత్రకంగా బంగాళాఖాతం, అరేబియాసముద్రాన్ని కలిపి హిందూ మహాసముద్ర ఉత్తరప్రాంతంగా పరిగణిస్తారు. హిందూ మహాసముద్రం ఉత్తరాన 1976 తర్వాత తుపాను ఏర్పడటం ఇదే తొలిసారికావడం విశేషం. 1891 ఏడాది నుంచి చూస్తే ఇప్పటిదాకా ఈ ప్రాంతంలో ఆగస్ట్నెలలో కేవలం నాలుగుసార్లే తుపాన్లు ఏర్పడ్డాయి. అరేబియా సముద్రప్రాంతంతో పోలిస్తే బంగాళాఖాతంలో తుపాన్లు వచ్చే అవకాశాలు నాలుగు రెట్లు ఎక్కువ. మే, నవంబర్ మధ్యలో ఇవి విజృంభిస్తాయి. భూతాపం కారణమా?మితిమీరిన కాలుష్యం, విచ్చలవిడిగా పెరిగి పోయిన మానవ కార్యకలాపాలు, పారిశ్రా మికీకరణ, శిలాజ ఇంధనాలను మండించడంతో భూతాపోన్నతి కారణంగా వాతావ రణ మార్పులు సంభవిస్తున్నాయి. దీంతో అరేబియా సముద్రంలో తుపాన్లకు ఈ భూతాపోన్నతికి సంబంధం ఉందేమోనని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. భూతాపం కారణంగా ఇది సంభవించినా ఆశ్చర్యపడా ల్సిన పనిలేదని భారత భూవిజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి మాధవన్ రాజీవన్ అభిప్రాయపడ్డారు. ‘‘దశాబ్దాలుగా ప్రాంతీయ వాతావరణంపై శాస్త్రవేత్తలకు ఉన్న అంచనాలను ఈ కొత్త పరిస్థితులు తలకిందులు చేస్తున్నాయి. వాతావరణ మార్పుల్లో కొత్త ధోరణులు అరేబియా సముద్రప్రాంతంపై మరింత లోతైన అధ్యయనం అవసరమని చాటిచెప్తున్నాయి. శతాబ్దాలుగా కొనసాగే వర్షాకాల సీజన్, అల్ప పీడనాలు, తుపాన్ల సీజన్లపై మనకున్న అవగాహనను మరింతగా అప్డేట్ చేసుకో వాల్సిన సమయమొచ్చింది. వాతావరణంలో తరచూ ఇలాంటివే సంభవిస్తే మన ఉష్ణమండల ప్రాంత పరిస్థితుల్లోనూ మార్పులు గణనీయంగా రావొచ్చు. ఇలాంటి తుపాన్లు ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులను వాతావరణ శాస్త్రవేత్తలు మరింత లోతుగా అధ్యయనం చేయాలి’’ అని రాజీవన్ వ్యాఖ్యానించారు. -
సెప్టెంబర్‌లోనూ అధిక వర్షపాతం
న్యూఢిల్లీ: ఆగస్ట్‌లో మాదిరిగానే సెప్టెంబర్‌లోనూ సాధారణానికి మించి వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంచనా వేసింది. ఆగస్ట్‌లో సాధారణానికి మించి 16 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని తెలిపింది. అదేసమయంలో, వాయవ్య భారతంలో రికార్డు స్థాయిలో 253.9 మిల్లీమీటర్ల వర్షం పడిందని, 2001 సంవత్సరం తర్వాత ఆగస్ట్‌లో ఇంత భారీగా వానలు కురియడం ఇది రెండోసారని తెలిపింది. ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర శనివారం ఢిల్లీలో మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు. ‘దేశంలో ఆగస్ట్‌లో 248.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, అంతకుమించి ఈసారి ఆగస్ట్‌లో 287.1 మి.మీ. వర్షం కురిసింది. అదేవిధంగా, జూన్ ఒకటో తేదీన మొదలైన రుతు పవన సీజన్లో దేశంలో సాధారణంగా 701 మి.మీ. వర్షం కురవాల్సి ఉండగా, ఈసారి ఏకంగా 749 మి.మీ. కురిసింది’అని ఆయన వివరించారు. ‘ఆగస్ట్‌లో సాధారణంగా 16.3 రోజులపాటు అల్పపీడన వాతావరణం కొనసాగుతుంది. కానీ, అంతకుమించి 17 రోజుల్లో అల్పపీడనాల ప్రభావం ఉంది. ఆగస్ట్‌లో ఏర్పడిన ఆరు అల్పపీడనాల్లో రెండింటి కారణంగా ఉత్తర, మధ్యభారతంతోపాటు తూర్పు భారతంలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడు సహా దక్షిణ భారతంలో అతి భారీ వర్షాలు కురిశాయి. ఆగస్ట్ నెల మొత్తం రుతు పవనాల ప్రభావం కొనసాగింది’అని ఐఎండీ డీజీ మహాపాత్ర తెలిపారు. అయితే, హిమాలయాలు, ఈశాన్య ప్రాంతంలోని పలు జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. ఈ సీజన్లో అల్పపీడనాల్లో అధిక భాగం దేశ దక్షిణ ప్రాంతంపైనే కేంద్రీకృతం కావడమే ఇందుకు కారణమని చెప్పారు. వాయవ్య భారతంలో అతిభారీ వర్షాలు వాయవ్య భారతం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆగస్ట్‌లో మాదిరిగా∙సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశాలున్నాయని ఐఎండీ డీజీ మృత్యుంజయ వివరించారు. దేశంలోని మిగతా ప్రాంతాల్లో సాధారణానికి మించి వానలు పడొచ్చని అంచనా వేశారు. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌లో దీర్ఘకాలం సగటు 167.9 మి.మీ. మించి వర్షాలు పడొచ్చని చెప్పారు. -
స్వాతంత్ర దినోత్సవం ప్రత్యేకం.. తెలుగులో చూడాల్సిన దేశభక్తి చిత్రాలివే!
యావత్ భారతదేశం గర్వంగా, దేశభక్తిని చాటి చెప్పేలాఅందరం ఆనందంగా జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తి అవుతోంది. గడిచిన ఏడు దశాబ్దాలుగా దేశ భక్తిని చాటి చెప్పే ఏన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ప్రత్యేకంగా దేశభక్తిని చాటి చెప్పే సినిమాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చూడాల్సిన టాలీవుడ్ దేశభక్తి సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి.స్వాతంత్ర దినోత్సవం రోజు చూడాల్సిన తెలుగు సినిమాలివేఅల్లూరి సీతారామరాజుమన్యం వీరుడు అల్లూరి కథతో తెరకెక్కిన సినిమా ఇది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతోపాటు దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.ఖడ్గంకృష్ణవంశీ దర్శకత్వంలో దేశభక్తి కథాంశంతో వచ్చిన సినిమా ఖడ్గం. 1990లో ముంబైలో జరిగిన దాడుల్లో చాలా మంది చనిపోయారు. దాని ఆధారంగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించాడు కృష్ణవంశీ. శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్, రవితేజ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలోని పాటలు కూడా హిట్ అయ్యాయి.సుభాష్ చంద్రబోస్విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన చిత్రం ఇది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాం బాక్సాపీస్ వద్ద బోల్తా పడినప్పటీకీ.. వెంకటేశ్ నటన మాత్రం ప్రేక్షకులను కట్టిపడేసింది.భారతీయుడుశంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా కూడా దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమాలో దేశం మోసం పోరాడే యోధుడిగా.. అవినీతి పరులను అంతం చేసే భారతీయుడిగా కమల్ నటన ఆకట్టుకుంది.సైరా నరసింహారెడ్డిస్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ఇది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్ర పోషించాడు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించాడు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించారు. కర్నూలు జిల్లాలోని ఉయ్యాలవాడ ప్రాంతంలో జన్మించిన నరసింహారెడ్డి దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి పడిన కష్టాన్ని ఈ సినిమాలో కళ్ల కట్టినట్లు చూపించారు.మహాత్మ2009 లో కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీకాంత్, భావన ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ‘కొంతమంది ఇంటిపేరు కాదుర గాంధీ పాట’దేశభక్తి మరోసారి ఉప్పొంగేలా చేసింది.పరమ వీర చక్ర2011లో విడుదలైన తెలుగు చిత్రం ఇది. తేజ సినిమా బ్యానర్‌పై సి.కళ్యాణ్ నిర్మించాడు. దర్శకుడిగా దాసరి నారాయణరావుకు ఇది 150 వ చిత్రం. నందమూరి బాలకృష్ణ, అమీషా పటేల్, షీలా, నేహా ధూపియా, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించారు.ఘాజీ1971లో జరిగిన యదార్ధ యుద్దగాద నేపధ్యంలో విశాఖ సబ్ మెరైన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన సినిమా ఘాజీ. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాలో రానా, తాప్సీ, అతుల్ కులకర్ణి, రాహుల్ సింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు.సర్దార్ పాపారాయుడు1980ల్లో వచ్చిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీ కొడుకులుగా కనిపించారు. సర్దార్ పాపారాయుడు అంటూ ఈ సినిమాలో ఎన్టీఆర్ పలికిన పలుకులను ఎవ్వరూ అంత సులభంగా మర్చిపోలేరు. శ్రీదేవీ, శారద తదితరులు నటించిన ఈ చిత్రానికి దాసరి నారాయణ రావు దర్శకత్వం వహించారు.బొబ్బిలి పులి1982లో ఎన్టీఆర్ ప్రధానపాత్రలో వచ్చిన చిత్రం బొబ్బలి పులి. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీదేవీ, మురళీ మోహన్, జగ్గయ్య, కైకాల సత్యనారాయణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. దేశ భక్తి ప్రధానంగా వచ్చిన ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది.గౌతమిపుత్ర శాతకర్ణిబాలకృష్ణ ప్రధానపాత్రలో నటించిన సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ సినిమాను కృష్ణ జాగర్లమూడి డైరెక్షన్లో తెరకెక్కించారు.ఆర్ఆర్ఆర్రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో బ్రిటీష్ కాలంలో పోరాడిన యోధుల చరిత్ర ఆధారంగా రూపొందించారు. ఇందులో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో మెప్పించగా.. రామ్ చరణ్ బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు.రాజన్న(2011)నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం రాజన్న. 2011లో వచ్చిన ఈ సినిమాను విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో రూపొందించారు.మేజర్అడివిశేష్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మేజర్. ఈ సినిమాను ముంబై ఉగ్రవాద దాడి సమయంలో తన ప్రాణాలను త్యాగం చేసిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు.వీటితో పాటు పల్నాటి యుద్ధం, నేటిభారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్రకేసరి-(1983), మరో ప్రపంచం, మనదేశం(1949) లాంటి దేశ స్వాతంత్ర్య పోరాటాల ఆధారంగా తెరకెక్కించిన చిత్రాలు కూడా ఉన్నాయి. ఇండిపెండెన్స్ సందర్భంగా స్వాతంత్ర్య పోరాటయోధుల చరిత్రను తెలుసుకునేందుకు ఈ సినిమాలు చూసేయండి. -
History of 15th August: ఆగస్టు 15న ఏమేం జరిగాయంటే..
బ్రిటీష్ వారి నుంచి భారతదేశం 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం పొంది, స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంది. ఇదొక్కటే కాదు చరిత్రలో ఆగస్టు 15న పలు ఘటనలు చోటుచేసుకున్నాయి.1972, ఆగస్టు 15న భారత పోస్టల్ సర్వీస్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం మొదలయ్యింది. ఆ రోజున ‘పోస్టల్ ఇండెక్స్ నంబర్’ అంటే పిన్ కోడ్ ఆవిర్భావమయ్యింది. నాటి నుంచి ప్రతి ప్రాంతానికి ప్రత్యేక పిన్ కోడ్ అమలులోకి వచ్చింది.1854: ఈస్ట్ ఇండియా రైల్వే కలకత్తా నుంచి హుగ్లీకి మొదటి ప్యాసింజర్ రైలును నడిపింది. ఈ రైలు అధికారికంగా 1855 నుంచి తన కార్యకలాపాలను ప్రారంభించింది.1866: లీచ్టెన్స్టెయిన్ దేశానికి జర్మన్ పాలన నుండి విముక్తి లభించింది.1872: భారతీయ తత్వవేత్త అరబిందో జననం.1886: రామకృష్ణ పరమహంస కన్నుమూత1945: దక్షిణ కొరియా, ఉత్తర కొరియా రెండూ స్వతంత్రంగా మారాయి.1947: రక్షణ శౌర్య పురస్కారాలైన పరమవీర చక్ర, మహావీర చక్ర, వీరచక్రల ప్రధాన ప్రకటన.1975: బంగ్లాదేశ్‌లో సైనిక విప్లవం.1950: భారతదేశంలో 8.6 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా 30 వేల మంది మృతి.1960: ఫ్రెంచ్ బానిసత్వం నుండి కాంగోకు స్వాతంత్య్రం.1971: బ్రిటీష్ పాలన నుండి బహ్రెయిన్‌కు స్వాతంత్య్రం.1982: రంగులలో జాతీయ టీవీ ప్రసారాలు ప్రారంభం.1990: ఉపరితలం నుండి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణి ఆకాష్ ప్రయోగం విజయవంతం2007: దక్షిణ అమెరికా దేశం పెరూలోని మధ్య తీర ప్రాంతంలో 8.0 తీవ్రతతో భూకంపం. 500 మంది మృతి.2021: తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకుంది. దేశం విడిచిపెట్టిన ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ.2021: హైతీ దేశంలో భూకంపం కారణంగా 724 మంది మృతి. -
ఆ తడబాటుతోనే ఈ ఎడబాటు..
శతాబ్దాల పాటు విదేశీ పాలనలో సర్వం కోల్పోయిన జాతి మేల్కొని స్వాతంత్య్రం సాధించుకోవడం చరిత్రాత్మకమే! భారత స్వాతంత్య్రోద్యమం ప్రధానంగా అహింసాయుతంగా సాగినా, స్వరాజ్యం రక్తపుటడుగుల మీదనే వచ్చిందన్న సత్యం దాచకూడనిది. స్వాతంత్య్రం, దేశ విభజన ఏకకాలంలో జరిగాయి. నాటి హింసకు ఇరవై లక్షల మంది బలయ్యారు. కోటీ నలభయ్ లక్షల మంది నిరాశ్రయులయ్యారు. భారత విభజన ప్రపంచ చరిత్రలోనే అత్యంత రక్తపాతంతో కూడిన ఘటనగా నమోదైంది.విస్మరించలేని వాస్తవాలు స్వాతంత్య్ర సమరంలో భారత జాతీయ కాంగ్రెస్ అగ్రస్థానంలో నిలిచిన సంగతితో పాటు గిరిజన, రైతాంగ పోరాటాలు, విదేశీ గడ్డ మీద నుంచి జరిగిన ఆందోళనలు, తీవ్ర జాతీయవాదులు సాగించిన ఉద్యమాలు, బ్రిటిష్ ఇండియా చట్టసభలలో ప్రవేశించిన భారతీయ మేధావులు నాటి చట్టాలను దేశ ప్రయోజనాలకు అనుగుణంగా మలచడానికి చేసిన కృషి విస్మరించలేనివి. అటవీ చట్టాల బాధతో కొండకోనలలో ప్రతిధ్వనించిన గిరిజనుల ఆర్తనాదాలు, అండమాన్ జైలు గోడలు అణచివేసిన దేశభక్తుల కంఠశోష ఇప్పటికైనా వినడం ధర్మం.విభజన సృష్టించిన హింసాకాండ..రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమైన రెండేళ్లకే వలసల నుంచి ఇంగ్లండ్ వైదొలగడం అవసరమన్న అభిప్రాయం ఆ దేశ నేతలలో బలపడింది. ఆ నేపథ్యంలోనే 1942 నాటి క్విట్ ఇండియా ఘట్టం భారత్ స్వాతంత్య్రోద్యమాన్ని చివరి అంకంలోకి ప్రవేశపెట్టింది. ‘భారత్‌ను విడిచి వెళ్లండి!’ అన్నది భారత జాతీయ కాంగ్రెస్ నినాదం. ‘భారత్‌ను విభజించి వెళ్లండి!’ అన్నది ముస్లిం లీగ్ సూత్రం. ఇదే ప్రతిష్టంభనను సృష్టించింది. స్వాతంత్య్రం రావడానికి సరిగ్గా సంవత్సరం ముందు (16 ఆగస్ట్ 1946) ముస్లిం లీగ్ ఇచ్చిన ‘ప్రత్యక్ష చర్య’ పిలుపు, పర్యవసానాలు ఆ ప్రతిష్టంభనకు అవాంఛనీయమైన ముగింపును ఇచ్చాయి. భారత్‌లో అంతర్యుద్ధం తప్పదన్న భయాలు ఇంగ్లండ్‌కు కలిగించిన పరిణామం కూడా అదే! అంతర్యుద్ధం అనుమానం కాదు, నిజమేనని పంజాబ్ ప్రాంత ప్రముఖుడు మాస్టర్ తారాసింగ్ ప్రకటించారు.అటు పంజాబ్లోను, ఇటు బెంగాల్లోను మతఘర్షణలు తారస్థాయికి చేరాయి. ఈ దృశ్యానికి పూర్తి భిన్నమైన చిత్రం మరొకటి ఉంది. 1946లో జాతీయ కాంగ్రెస్, ముస్లిం లీగ్ భాగస్వాములుగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం విభేదాలతో సతమతమవుతున్నది. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో విభజన ప్రయత్నాలు శరవేగంగా జరిగాయి. భారత స్వాతంత్య్రానికి 1947 ఫిబ్రవరి 20న లేబర్ పార్టీ ప్రధాని క్లెమెంట్ అట్లీ ముహూర్తం ఖరారు చేశాడు. 1947 మార్చి 5న బ్రిటిష్ పార్లమెంట్లో చర్చ జరిగింది. నిజానికి అది భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే అంశం కాదు. ఉపఖండ విభజన గురించి. ఫిబ్రవరి 20 నాటి ప్రకటన ప్రకారం 1948 జూన్ మాసాంతానికి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలి. కానీ ఆ ఘట్టాన్ని 11 మాసాల ముందుకు తెచ్చినవాడు లార్డ్ లూయీ మౌంట్‌బాటన్ , ఆఖరి వైస్రాయ్. ఈ తడబాటే, ఈ తొందరపాటే ఉపఖండాన్ని నెత్తురుటేరులలో ముంచింది.గాంధీజీకి నెరవేరని కోరిక..విభజన సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాడన్న నెపంతో 1947 ఫిబ్రవరిలో వైస్రాయ్ వేవెల్ను వెనక్కి పిలిపించి, 1947 మార్చి 22న మౌంట్‌బాటన్ ను పంపించారు. భారత్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేసేందుకే మౌంట్‌బాటన్ ను నియమించారు. ఈ దశలోనే గాంధీజీకీ, జాతీయ కాంగ్రెస్‌కూ మధ్య ‘మౌన’సమరం మొదలయింది. ‘విభజనను కాంగ్రెస్ ఆమోదిస్తే అది నా శవం మీద నుంచే జరగాలి’ అని మౌలానా అబుల్ కలాం ఆజాద్‌తో గాంధీజీ వ్యాఖ్యానించినా దాని ప్రభావం కనిపించలేదు. 1947 మేలో మౌంట్‌బాటన్ విభజన ప్రణాళికను కాంగ్రెస్, ముస్లిం లీగ్‌ల ముందు పెట్టాడు. ఇది స్వదేశీ సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఇచ్చింది. దీనిని మొదట నెహ్రూ వ్యతిరేకించినా, తరువాత అంగీకరించారు. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులలో 565 సంస్థానాలకు తమ భవిష్యత్తును నిర్ణయించుకునే అధికారాన్ని విభజన ప్రణాళిక ఇచ్చింది.గాంధీజీ లేకుండానే విభజన నిర్ణయం..1947 జూన్ 3న మౌంట్‌బాటన్ భారత్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, విభజన గురించి ప్రకటించారు. కేవలం తొమ్మిది మంది సమక్షంలో విభజన నిర్ణయం ఖరారైంది. నెహ్రూ, పటేల్, జేబీ కృపలానీ (కాంగ్రెస్), జిన్నా, లియాఖత్ అలీ ఖాన్ (లీగ్) బల్దేవ్సింగ్ తదితరులు మాత్రమే ఉన్నారు. ఈ కీలక సమావేశంలో గాంధీజీ లేని సంగతి గమనించాలి. మౌంట్‌బాటన్ పథకానికే 1947 జూలై 5న ఇంగ్లండ్ సింహాసనం ఆమోదముద్ర వేసింది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ పార్లమెంట్ అంగీకారం తెలియచేసింది. ఆగస్ట్ 15వ తేదీకి ఐదు వారాల ముందు 1947 జూలై 8న సరిహద్దు కమిషన్ ఆ పని ఆరంభించింది. కాంగ్రెస్, లీగ్‌ల నుంచి చెరొక నలుగురు సభ్యులుగా ఉన్నారు. సర్ సిరిల్ జాన్ రాడ్‌క్లిఫ్ ఆ కమిషన్ అధ్యక్షుడు. భారతదేశం గురించి ఏమాత్రం అవగాహన లేనివాడని ఆయన మీద ఆరోపణ. కాలదోషం పట్టి మ్యాపుల ఆధారంగా విభజన రేఖలు వచ్చాయి. బెంగాల్, పంజాబ్‌ల విభజనకు కూడా కమిషన్ లు ఏర్పడినాయి.ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పటేల్, మేనన్..యూనియన్ జాక్ దిగితే భారత్‌కు సార్వభౌమాధికారం వస్తుంది. కానీ సంస్థానాలు స్వయం నిర్ణయం తీసుకుంటే కొత్త సార్వభౌమాధికారానికి పెను సవాలు ఎదురవుతుంది. ఈ ప్రమాదాన్ని సకాలంలో గుర్తించిన వారు సర్దార్ పటేల్, బ్రిటిష్ ఇండియాలో రాష్ట్రాల వ్యవహారాల ఇన్ చార్జ్ వీపీ మేనన్ . ఆ సమస్యను పరిష్కరించినవారూ వారే! దేశం మీద స్వతంత్ర భారత పతాకం ఎగిరే నాటికే కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ తప్ప మిగిలిన అన్ని సంస్థానాలను వారు భారత యూనియన్ లోకి తేగలిగారు. ఇది స్వతంత్ర భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దిన నిర్మాణాత్మక ఘట్టం. సాంస్కృతిక ఐక్యతకు రాజకీయ ఐక్యతను జోడిరచిన పరిణామం. 1947 ఆగస్ట్ 15న భారత్ స్వతంత్ర దేశమైంది. – డాక్టర్ గోపరాజు నారాయణరావు -
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ భావోద్వేగం
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 49వ పుట్టినరోజు ఈరోజు (ఆగస్టు 10). ఈ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా హేమంత్ సోరెన్ తన ఎక్స్ హ్యాండిల్లో ఒక చిత్రాన్ని షేర్ చేశారు. దానిలో పాటు హేమంత్ సోరెన్ ఇలా రాశారు.. ‘నా పుట్టినరోజు సందర్భంగా గత ఏడాది నాటి ఒక జ్ఞాపకం నా మదిలో మెదిలింది. అదే ఈ ఖైదీ గుర్తు.. ఇది జైలు నుండి విడుదలైనప్పుడు నాపై ముద్రించారు. ఈ గుర్తు నాది మాత్రమే కాదు.ప్రజలు ఎన్నుకొన్న ముఖ్యమంత్రిని ఎటువంటి ఆధారాలు లేకుండా 150 రోజులు జైలులో ఉంచారు. అందుకే ఈ గుర్తు సామాన్య గిరిజనులకు, అణగారిన వారికి చెందినది. దోపిడీకి గురవుతున్నవారి విషయంలో ఏమేమి జరుగుతుంటాయో ఎవరికీ చెప్పనవసరం లేదు. అందుకే ఈ రోజు నేను మరింత దృఢంగా నిశ్చయించుకున్నాను.. దోపిడీకి గురవుతున్న అణగారిన, దళిత, వెనుకబడిన, గిరిజన, ఆదివాసీలకు మద్దతుగా పోరాడాలనే నా సంకల్పాన్ని బలపరుచుకుంటున్నాను.హింసకు గురవుతూ, న్యాయం అందని ప్రతి వ్యక్తికి, సమాజానికి మద్దతుగా నేను నా గొంతును విప్పుతాను. చట్టం అందరికీ సమానమే. అధికార దుర్వినియోగం లేని సమాజాన్ని మనం నిర్మించాలి. అయితే ఈ మార్గం అంత సులభం కాదు. ఇందుకోసం మనం ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే మనమంతా కలిస్తే ఈ సవాళ్లను అధిగమించగలమనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మన దేశంలోని భిన్నత్వంలోని ఏకత్వమే మన బలం’ అని అన్నారు. आज अपने जन्मदिन के मौक़े पर बीते एक साल की स्मृति मेरे मन में अंकित है - वह है यह कैदी का निशान - जो जेल से रिहा होते वक्त मुझे लगाया गया। यह निशान केवल मेरा नहीं, बल्कि हमारे लोकतंत्र की वर्तमान चुनौतियों का प्रतीक है।जब एक चुने हुए मुख्यमंत्री को बिना किसी सबूत, बिना कोई… pic.twitter.com/TsKovjS1HY— Hemant Soren (@HemantSorenJMM) August 10, 2024 -
10న ప్రధాని మోదీ వయనాడ్ సందర్శన
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న కేరళలోని వయనాడ్‌లో పర్యటించనున్నారు. వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. కేరళలో ప్రస్తుత పరిస్థితులను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 10న వయనాడ్‌లో పర్యటించనున్నారు. గతంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా వయనాడ్‌లో పర్యటించారు. బాధితులను పరామర్శించారు. ప్రస్తుతం కేరళలో సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.ఉత్తర కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలలో 10వ రోజు(గురువారం) కూడా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. శిథిలాల కింద చిక్కుకున్న అవశేషాలను వెలికితీసేందుకు పెద్ద సంఖ్యలో స్నిఫర్ డాగ్‌లను మోహరించారు. ఐఎఎఫ్ హెలికాప్టర్లు చలియార్ నది వెంబడి ప్రాంతాలలో ప్రత్యేక శోధన బృందాలను ల్యాండ్ చేయడానికి ఉపయోగిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలోని బాధితులకు తాత్కాలిక పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. పునరావాసం మూడు దశల్లో జరుగుతుందని రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం తెలిపింది. -
అసలు తగ్గింపు ఇక నుంచే.. శ్రావణం ముంగిట శుభవార్త!
శ్రావణ మాసం వస్తోంది. అసలే పెళ్లిళ్ల సీజన్. అదీకాక శుభకార్యాలు అధికంగా జరిగేది ఈ నెలలోనే. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు అధికంగా ఉంటాయి. శ్రావణ మాసంలో బంగారం కొనుగోలు చేసేవారికి ఇది నిజంగా శుభవార్త. అది ఏంటంటే..ఆగస్టు 1 నుంచి ప్రభుత్వం దిగుమతి సుంకాల తగ్గింపును అమలు చేయడంతో బంగారం ధరలు 9% తగ్గుతాయని అంచనా. తాజా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. అన్ని కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తవడంతో గురువారం నుంచి తక్కువ ధరలో బంగారం మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది.కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా జూలై 23న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బంగారంపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 6 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన ప్రభావం కొన్ని రోజులుగా బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తోంది. అప్పటి నుంచి బంగారం ధరలు రూ.4,000 మేర తగ్గాయి. అయితే అవసరమైన కస్టమ్స్ విధానాల కారణంగా ప్రకటన అమల్లోకి రావడానికి కొంత సమయం పట్టింది. ఇప్పుడు ఈ ఫార్మాలిటీలన్నీ పూర్తయినందున సవరించిన దిగుమతి సుంకం ప్రకారం బయటి నుంచి బంగారం భారత్ చేరుకోవడం ప్రారంభమవుతుంది. ఆగస్టు 1 నుంచి రిటైల్ అమ్మకానికి అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.ఎంత మేర తగ్గుతాయి?కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తి కావడానికి వారం రోజుల సమయం పట్టిందని ఆల్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ చైర్మన్ యోగేష్ సింఘాల్ తెలిపారు. ఆగస్టు 1 నుంచి తగ్గిన దిగుమతి సుంకం ప్రకారం బంగారం దేశంలోకి రావడం ప్రారంభమవుతుంది. ఇది రిటైల్ బంగారం ధరలపై ప్రభావం చూపనుంది. దిగుమతి సుంకంలో 9% తగ్గింపుతో తులం (10 గ్రాములు) బంగారంపై రూ. 5,000 నుంచి రూ. 6,000 తగ్గుతుందని అంచనా వేస్తున్నారు.దిగుమతి సుంకం తగ్గింపు బంగారం బ్లాక్ మార్కెట్‌పై కూడా ప్రభావం చూపుతుందని యోగేష్ సింఘాల్ పేర్కొన్నారు. అధిక సుంకం కారణంగా ఆభరణాల వ్యాపారులు అక్రమ దిగుమతి పద్ధతులు అవలంభించేవారు. దీంతో ఆ భారాన్ని కస్టమర్ల మీద వేసేవారు. ఈ రూపంలో వినియోగదారుల నుంచి 15% వసూలు చేసేవారు. ఇప్పుడు సుంకం తగ్గడంతో అక్రమ పద్ధతులకు నగల వ్యాపారులు స్వస్తి పలికే అవకాశం ఉంటుంది. దీంతో ఆ అదనపు భారం కూడా కస్టమర్లపై తగ్గుతుందని భావిస్తున్నారు. -
రేపటి నుంచే ఫాస్టాగ్ కొత్త రూల్స్.. అవి మార్చుకోవాల్సిందే!
వాహనాల ఫాస్టాగ్‌కు సంబంధించిన కొత్త రూల్స్ ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం ఫాస్టాగ్ యూజర్లు తప్పనిసరిగా కేవైసీ చేయించుకుకోవాలి. లేకుంటే టోల్ ప్లాజాల వద్ద చిక్కులు తప్పవు.నూతన నిబంధనలు ఇవే..ఆగస్టు 1 నుంచి ఫాస్టాగ్ సేవలను అందించే కంపెనీలు 3-5 సంవత్సరాల క్రితం జారీ చేసిన అన్ని ఫాస్టాగ్‌లకు కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఇందుకు అక్టోబర్ 31 వరకు గడువు ఉంటుంది. అదే ఐదేళ్లకు పైబడిన ఫాస్టాగ్‌ను తప్పనిసరిగా మార్చాలి. వాహన యజమానులు తమ ఫాస్టాగ్‌ల జారీ తేదీలను పరిశీలించుకుని తక్షణమే మార్చుకోవాలి.ఆగస్టు 1 నుంచి అన్ని ఫాస్టాగ్‌లను వాహన రిజిస్ట్రేషన్ నంబర్, ఛాసిస్ నంబర్‌తో అనుసంధానం చేయాలని కొత్త నిబంధనలు చెబుతున్నాయి. నూతన వాహన యజమానులు కూడా వాహనాన్ని కొనుగోలు చేసిన 90 రోజుల్లోగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అప్డేట్ చేయాలి. ఫాస్టాగ్ ప్రొవైడర్లు వారి డేటాబేస్‌ను ఖచ్చితమైనదిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి.ఈ మార్పులతో పాటు వాహనాలను సులభంగా గుర్తించడానికి వాహనానికి సంబంధించిన ముందు, వెనుక వైపుల స్పష్టమైన ఫోటోలను ఫాస్టాగ్ ప్రొవైడర్లు అప్లోడ్ చేయాలి. కమ్యూనికేషన్, అప్డేట్స్ సజావుగా సాగేందుకు ప్రతి ఫాస్టాగ్‌ను మొబైల్ నంబర్‌కు కనెక్ట్ చేయాలి. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి చివరి గడువు అక్టోబర్ 31. టోల్‌ప్లాజాల వద్ద ఇబ్బందులు ఎదురవ్వకూడదంటే చివరి నిమిషం వరకు ఉండకుండా ముందుగానే కేవైసీ చేసుకోవడం మంచిది. -
బీఐఎస్ కీలక ప్రకటన: పెరగనున్న చెప్పుల ధరలు
2024 ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న 'బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్' కొత్త నాణ్యతా ప్రమాణాల కారణంగా పాదరక్షలు (చెప్పులు, షూస్) ఖరీదైనవిగా మారుతాయి. పాదరక్షల తయారీదారులు ఐఎస్ 6721 & ఐఎస్ 10702 మార్గదర్శకాలను అనుసరించాలని బీఐఎస్ వెల్లడించింది.పాదరక్షల క్వాలిటీ పెరిగితే ధర పెరుగుతుంది. అయితే రూ. 50 కోట్ల కంటే తక్కువ వార్షిక టర్నోవర్ కలిగిన తయారీదారులకు బీఐఎస్ ఈ నియమం నుండి మినహాయింపు కల్పించింది. ఇప్పటికే తయారు చేసిన పాత స్టాక్‌కు కూడా ఈ నియమం వర్తించదు. అయితే విక్రయదారులు బీఐఎస్ వెబ్సైట్లో పాత స్టాక్ వివరాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.ఆగస్టు 1 నుంచి 46 అంశాలు సవరించిన బీఐఎస్ నిబంధనల పరిధిలోకి వస్తాయి. కంపెనీలకు అవగాహన కల్పించడం కోసం తమ అధికారిక వెబ్సైట్లో ఈ సమాచారాన్ని అప్లోడ్ చేసినట్లు బీఐఎస్ తెలిపింది. ప్రధానంగా రెక్సిన్, ఇన్సోల్, లైనింగ్ వంటి పాదరక్షలలో ఉపయోగించే ముడి పదార్థాలు రసాయన లక్షణాలను కంపెనీలు పరీక్షించాల్సి ఉంటుంది.త్వరలో అమలులోకి రానున్న కొత్త రూల్స్ చెప్పులను బలంగా, మన్నికైనవిగా చేస్తాయి. ఇది వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ధరల పెరుగుదల ఎంత వరకు ఉంటుందనేది.. ఆగష్టు 1 తరువాత తెలుస్తుంది. -
ఆగష్టులో బ్యాంక్ హాలిడేస్: పనిదినాలు 18 రోజులే..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆగష్టు నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ మూసివేతలలో పబ్లిక్ సెలవులు, ప్రాంతీయ సెలవులు, రెండవ & నాల్గవ శనివారాలు.. అన్ని ఆదివారాలలో సాధారణ మూసివేతలు ఉన్నాయి.ఆగస్టు 3: కేర్ పూజ - అగర్తల రాష్ట్రంలో బ్యాంకులకు సెలవుఆగస్టు 4: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 8: టెన్డాంగ్‌లో రమ్ ఫాత్ సిక్కింఆగస్టు 10: రెండో శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 11: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగష్టు 13: పేట్రియాట్ డే (ఇంఫాల్)ఆగస్ట్ 15: స్వాతంత్య్ర దినోత్సవం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 18: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్టు 19: రక్షా బంధన్/రాఖీ - దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుఆగష్టు 20: శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, తిరువనంతపురం)ఆగస్ట్ 24: నాల్గవ శనివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 25: ఆదివారం - దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవుఆగస్ట్ 26: జన్మాష్టమి - దేశంలోని పలు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవుబ్యాంకులకు వెళ్లి చేసుకోవాల్సిన ఏదైనా అత్యవసరమైన పని చేసుకోవాలనుకునే వారు బ్యాంక్ హాలిడేస్ గమనించి ముందుగానే పనులు పూర్తి చేసుకోవాలి. అయితే ఆన్లైన్ సేవలు అన్నీ అందుబాటులో ఉంటాయి.(బ్యాంకింగ్ సెలవుల షెడ్యూల్ మారవచ్చు.. కాబట్టి హాలిడే క్యాలెండర్లో ఏవైనా అప్డేట్లు లేదా రివిజన్ల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. లేదా మీ సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక ప్రకటనలను గమనించాల్సి ఉంటుంది.) -
ఆగస్టు నెలలో బ్యాంకులు పనిచేయని రోజులివే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో ఆగస్టు నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో మన రోజువారీ జీవితంలో భాగమైన బ్యాంకులు రానున్న నెలలో ఎన్ని రోజులు పనిచేస్తాయి.. ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు 13 రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వారాంతపు సెలవుల ఆధారంగా ఆర్బీఐ ఈ సెలవులను నిర్ణయిస్తుంది. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో పరిశీలించి అందుకు అనుగుణంగా మీ బ్యాంకు పనులకు ప్రణాళిక వేసుకోండి.ఆగస్టు నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..» ఆగస్టు 3 (శనివారం)- కేర్ పూజ- అగర్తలలో సెలవు.» ఆగస్టు 4 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్ట్ 8 (గురువారం)-టెండాంగ్ లో రమ్ ఫాత్- సిక్కింలో సెలవు.» ఆగస్టు 10 (రెండో శనివారం)- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్టు 11 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్టు 13 (మంగళవారం)-దేశభక్తుల దినోత్సవం- మణిపూర్‌లో సెలవు.» ఆగస్టు 15 (గురువారం) - స్వాతంత్య్ర దినోత్సవం- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్టు 18 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్టు 19- (సోమవారం)- రక్షా బంధన్/జులానా పూర్ణిమ/బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు- గుజరాత్, త్రిపుర, ఒరిస్సా, » ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు» ఆగస్టు 20- (మంగళవారం)- శ్రీ నారాయణ గురు జయంతి -కేరళలో సెలవు» ఆగస్టు 24 (నాలుగో శని ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్టు 25 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.» ఆగస్టు 26- (సోమవారం)- కృష్ణ జన్మాష్టమి- కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు. -
ఉక్రెయిన్‌కు భారత ప్రధాని మోదీ
వచ్చే నెల (ఆగస్టు)లో ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 2022లో రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించబోవడం ఇదే తొలిసారి.ప్రధాని మోదీ ఇటీవలే రష్యా పర్యటన నుంచి తిరిగి వచ్చారు. ప్రధాని ఉక్రెయిన్ పర్యటన ఖరారైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆగస్టు 23న ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోడిమిర్ జెలన్ స్కీ ప్రధాని మోదీతో టెలిఫోన్లో సంభాషిస్తూ, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు.గత నెలలో ఇటలీలో జరిగిన జీ7 సదస్సు సందర్భంగా కూడా ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ తాజా పరిస్థితులపై వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇటీవలే రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. -
ఆగస్టు 1 నుంచి మారుతున్న రూల్స్ ఇవే..
జూలై నెల ముగింపునకు వచ్చేసింది. ఆగస్టు నెల ప్రారంభం కాబోతోంది. ప్రతి నెలా ఆర్థిక విషయాలకు సంబంధించిన నియమాలలో మార్పు ఉంటుంది. వచ్చే ఆగస్టు నెలలోనూ పలు నిబంధనలు మారనున్నాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ తన క్రెడిట్ కార్డ్ నిబంధనలను మార్చబోతోంది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర కూడా మారనుంది. రానున్న మార్పుల గురించి వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం..ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను ప్రతి నెలా ఒకటో తేదీన నిర్ణయిస్తారు. గత నెలలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధరను ప్రభుత్వం తగ్గించింది. ఈసారి కూడా ప్రభుత్వం సిలిండర్ ధరను తగ్గించే అవకాశం ఉందని భావిస్తున్నారు.హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్క్రెడ్, చెక్, మొబిక్విక్, ఫ్రీచార్జ్, ఇతర సేవలను ఉపయోగించి చేసే రెంటల్ చెల్లింపులపై లావాదేవీ మొత్తంపై 1% ఛార్జ్ ఉంటుంది. ఇది గరిష్టంగా రూ.3000 ఉంటుంది. రూ.15,000 లోపు ఫ్యూయల్ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. అయితే రూ.15,000 కంటే ఎక్కువ లావాదేవీలపై 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ ఉంటుంది.రూ.50,000 లోపు యుటిలిటీ లావాదేవీలపై ఎటువంటి అదనపు ఛార్జీ ఉండదు. రూ.50,000 పైబడిన లావాదేవీలకు 1% గరిష్టంగా రూ.3000 ఛార్జీ విధిస్తారు. బీమా లావాదేవీలకు ఈ ఛార్జీ నుంచి మినహాయింపు ఇచ్చారు. కళాశాల లేదా పాఠశాల వెబ్సైట్లు లేదా వారి పీఓఎస్ మెషీన్ల ద్వారా నేరుగా చేసే చెల్లింపులపై ఎటువంటి ఛార్జీలు ఉండవు. కానీ క్రెడ్, చెక్, మొబిక్విక్ వంటి థర్డ్ పార్టీ యాప్‌ల ద్వారా చేసే చేస్తే 1% ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.3000 ఛార్జీ చెల్లించాల్సి ఉంటుంది.ఆలస్య చెల్లింపు ఛార్జీల్లోనూ బ్యాంక్ సవరణలు చేసింది. ఏదైనా ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లో ఈజీ-ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకుంటే గరిష్టంగా రూ.299 వరకు ఈఎంఐ ప్రాసెసింగ్ ఛార్జీ ఉంటుంది. అర్హత కలిగిన యూపిఐ చెల్లింపులపై టాటా న్యూ ఇన్ఫినిటీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1.5 శాతం, టాటా న్యూ ప్లస్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులకు 1 శాతం న్యూకాయిన్స్ లభిస్తాయి. -
విజయవాడ రూట్లో పలు రైళ్ల రద్దు: ఎస్సీఆర్
సాక్షి,విజయవాడ: ఆగస్ట్ నెలలో ఐదు రోజుల పాటు పలు రైళ్లు రద్దు చేయడంతో పాటు పలు రైళ్లను దారి మళ్లించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు బుధవారం(జులై 3) ఒక ప్రకటన విడుదల చేసింది. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో మూడవ లైన్ ఏర్పాటులో భాగంగా మరమ్మతులు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మరమ్మతుల వల్లే రైళ్ల రద్దు, దారి మళ్లింపు చేసినట్లు తెలిపింది. ఆగస్టు 5 నుంచి ఆగస్ట్ 8 వరకు 37 రైళ్లు రద్దు చేయనుండగా 38 రైళ్లను దారి మళ్లించనున్నారు. -
పుష్ప-2 వాయిదా.. రేసులోకి వచ్చేసిన ఎన్టీఆర్ బామ్మర్ది!
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి పరిచయం హీరో నార్నెనితిన్. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆయ్'. అతనికి జంటగా నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను జీఏ2 బ్యానర్‌పై అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలుదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ ఆయ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ తేదీ విడుదల కావాల్సిన పుష్ప-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.మరోవైపు అదే రోజున హీరో రానా నిర్మాతగా తెరకెక్కిస్తోన్న '35 – ఇది చిన్నకథ కాదు' రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. వీటితో రామ్ పోతినేని-పూరి కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. Gear Up to Celebrate Godavari Emotion, Love, Friendship & much more with the 𝐔𝐋𝐓𝐈𝐌𝐀𝐓𝐄 𝐅𝐔𝐍 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the 𝗦𝗘𝗔𝗦𝗢𝗡 🥳❤️🔥#AAYMovie Grand release in theatres on Independence Day, 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏𝟓𝐭𝐡!😍#AAY #AAYonAUG15 🤩#AlluAravind #BunnyVas… pic.twitter.com/HJV9kDEKgj— Geetha Arts (@GeethaArts) June 25, 2024From the sacred land of Tirupathi ✨Bringing you a lovely narrative that will touch everyone’s heartsPresenting35 ~ Chinna Katha Kaadu❤️🔥Starring @i_nivethathomas @PriyadarshiPN @imvishwadev @gautamitads In cinemas from AUGUST 15th, 2024#35Movie #NandaKisore… pic.twitter.com/4HjdTTXk8o— Rana Daggubati (@RanaDaggubati) June 25, 2024 -
ఆగస్టులో జమ్ముకశ్మీర్ ఎన్నికల ప్రకటన?
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు పరిపాలనా యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆగస్టులో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రతిపాదిత అసెంబ్లీ ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.జేకేలో ఎన్నికల నిర్వహణ విషయమై జూన్ 24 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు సంబంధిత అధికారులకు శిక్షణ అందించనున్నారు. 2014 నవంబర్-డిసెంబర్లో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2015లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 2018 జూన్‌లో ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో అధికారిక ప్రభుత్వం లేదు. -
‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’
అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. 2024 జనవరి 22న నూతన రామాలయంలో మర్యాద పురుషోత్తముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. తాజాగా శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వచ్చే ఏడాది జనవరి 22వ తేదీని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15తో పోల్చారు. రాయ్ మీడియాతోమాట్లాడుతూ దేశంలో 1947, ఆగస్టు 15 ఎంత ముఖ్యమైనదో, 2024 జనవరి 22 కూడా అంతే ముఖ్యమైనదని పేర్కొన్నారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చే సాధనంగా అయోధ్య రామమందిర నిర్మాణం కొనసాగుతున్నదన్నారు. అయోధ్యలో నూతన రామాలయం నిర్మితమవుతుండటంపై దేశ ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. 2024, జనవరి 22న నూతన రామాలయంలో జరిగే బాల రాముని విగ్రహప్రతిష్ణాపన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. నూతన రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: 2024లో బ్యాంక్ సెలవులు ఇవే.. -
ఈపీఎఫ్‌వో కిందకు 16.99 లక్షల మంది
న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు. కేంద్ర కారి్మక శాఖ ఆగస్ట్ నెల ఈపీఎఫ్‌వో పేరోల్ గణాంకాలను విడుదల చేసింది. ఆగస్ట్‌లో 3,210 సంస్థలు మొదటి సారి ఈపీఎఫ్‌వోలో రిజిస్టర్ చేసుకున్నాయి. సుమారు 11.88 లక్షల మంది సభ్యులు ఒక సంస్థలో మానేసి, మరో సంస్థలో చేరడం ద్వారా ఈపీఎఫ్‌లో కిందకు మళ్లీ వచ్చి చేరారు. కొత్త సభ్యుల్లో 18–25 ఏళ్ల వయసువారు 58.36 శాతంగా ఉన్నారు. మొదటిసారి ఉద్యోగంలో చేరిన వారే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిసారి చేరిన చేరిన మహిళలు 2.44 లక్షల మంది ఉన్నారు. నికరంగా చేరిన మహిళా సభ్యుల సంఖ్య 3.43 లక్షలుగా ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, హర్యానా, గుజరాత్ నుంచి నికర సభ్యుల చేరిక అధికంగా ఉంది. ఈ రాష్ట్రాల నుంచి 9.96 లక్షల మంది ఆగస్ట్‌లో ఈపీఎఫ్‌వో కిందకు వచ్చారు. వ్యాపార దుకాణాలు, భవన నిర్మాణం, ఇంజనీరింగ్ కాంట్రాక్టు సేవలు, టెక్స్‌టైల్స్‌లో ఎక్కువ మందికి ఉపాధి లభించింది. 39.87 మంది సభ్యులు నైపుణ్య సేవలకు సంబంధించి ఉన్నారు. -
డీజిల్ అమ్మకాల్లో అదే ధోరణి
న్యూఢిల్లీ: డీజిల్ అమ్మకాల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది. సెపె్టంబర్ నెలలోనూ 3% తక్కువగా విక్రయాలు నమోదయ్యాయి. ఆగస్ట్‌లోనూ డీజిల్ అమ్మకాలు 3.2% తగ్గడం గమనించొచ్చు. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నాలుగు నెలల వర్షాకాల సీజన్లో డీజిల్ అమ్మకాలు తక్కువగా నమోదవుతుంటాయి. ఇక పెట్రోల్ విక్రయాలు 5.4% పెరిగాయి. ప్రభుత్వరంగ ఆయిల్ మార్కె టింగ్ కంపెనీలు హెచ్‌పీసీఎల్, ఐవోసీఎల్, బీపీసీఎల్ ఉమ్మడి గణాంకాలు ప్రతి నెలా విడుదల అవుతుంటాయి. వీటి ప్రకారం సెపె్టంబర్లో డీజిల్ అమ్మకాలు 5.81 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలలో 5.99 మిలియన్ టన్నుల మేర అమ్మకాలు ఉండడం గమనార్హం. ముఖ్యంగా సెపె్టంబర్ నెలలో మొదటి 15 రోజుల్లో డీజిల్ అమ్మకాలు 5 శాతం తగ్గగా, తర్వాతి 15 రోజుల్లో వర్షాలు లేకపోవడంతో పుంజుకున్నాయి. ఇక ఆగస్ట్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డీజిల్ అమ్మకాలు 2.5 శాతం పెరిగాయి. ఆగస్ట్ నెలలో డీజిల్ విక్రయాలు 5.67 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో 6.7 శాతం, మే నెలలో 9.3 శాతం చొప్పున డీజిల్ అమ్మకాలు పెరిగాయి. జూన్ నుంచి తగ్గుతూ వస్తున్నాయి. పెట్రోల్ విక్రయాలు సెప్టెంబర్ నెలలో 2.8 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 5.4 శాతం వృద్ధి కనిపించింది. ఆగస్ట్ నెలలో మాత్రం పెట్రోల్ విక్రయాలు ఫ్లాట్‌గా ఉన్నాయి. -
74 లక్షల వాట్సాప్ అకౌంట్లు బ్యాన్! ఒక్క నెలలోనే..
WhatsApp Accounts Banned: మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ (WhatsApp) భారత్‌లో ఒక్క నెలలోనే ఏకంగా 74 లక్షల అకౌంట్లు బ్యాన్ చేసింది. ఐటీ నిబంధనలకు అనుగుణంగా ఆగస్టు నెలలో 74 లక్షల ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తాజాగా విడుదల చేసిన ఇండియా నెలవారీ నివేదిక పేర్కొంది. ఆగస్టు నెలలో మొతం 74 లక్షల ఖాతాలను బ్యాన్ చేయగా వీటిలో 35 లక్షల అకౌంట్లపై యూజర్ల నుంచి ఫిర్యాదులు రాకముందే ముందస్తుగా చర్యలు తీసుకున్నారు. సంబంధిత అకౌంట్లపై యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలతో పాటు ప్లాట్ఫామ్లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి వాట్సాప్ సొంతంగా తీసుకున్ననివారణ చర్యల వివరాలు 'యూజర్-సేఫ్టీ రిపోర్ట్'లో ఉన్నాయి. ఆగస్టు 1 నుంచి ఆగస్ట్ 31 మధ్య, మొత్తం 74,20,748 వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేశామని, వీటిలో 3,506,905 ఖాతాలపై యూజర్ల నుంచి ఫిర్యాదుల రాకపోయినా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్ తెలిపింది. జూన్‌లోనూ 66 లక్షలు వాట్సాప్ గత జూన్ నెలలోనూ 66 లక్షలకు పైగా అకౌంట్లను బ్యాన్ చేసింది. 2023 జూన్ 1 నుంచి 30వ తేదీ మధ్య మొత్తం 6,611,700 వాట్సాప్ అకౌంట్లను బ్యాన్ చేసింది. ఇందులో 2,434,200 అకౌంట్లను ఫిర్యాదులతో సంబంధం లేకుండా ముందస్తుగా నిషేధించింది. -
మౌలిక రంగం భేష్
న్యూఢిల్లీ: ఎనిమిది పారిశ్రామిక రంగాలతో కూడిన మౌలిక పరిశ్రమ ఆగస్టులో మంచి పనితీరును ప్రదర్శించింది. మౌలిక రంగం సమీక్షా నెల్లో 12.1 శాతం వృద్ధిని (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) నమోదుచేసుకుంది. గడచిన 14 నెలల్లో (2022 జూన్‌లో వృద్ధి రేటు 13.2 శాతం) ఈ స్థాయి భారీ వృద్ధిరేటు నమోదుకావడం ఇదే తొలిసారి. సిమెంట్ (18.9 శాతం), బొగ్గు (17.9 శాతం), విద్యుత్ (14.9 శాతం), స్టీల్ (10.9 శాతం), సహజ వాయువు (10 శాతం) రంగాలు రెండంకెల్లో వృద్ధి సాధించగా, రిఫైనరీ ప్రొడక్టులు 9.5 (శాతం), క్రూడ్ ఆయిల్ (2.1 శాతం), ఎరువుల (1.8 శాతం) రంగాల్లో వృద్ధి రేటు ఒక అంకెకు పరిమితమైంది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023–24) ఏప్రిల్ నుంచి ఆగస్టు ఎనిమిది రంగాల వృద్ధి రేటు 7.7 శాతంగా నమోదయ్యింది. మ్తొతం పారిశ్రామిక ఉత్పత్తిలో ఈ ఎనిమిది పరిశ్రమల వెయిటేజ్ 40.27 శాతం. -
ట్రేడింగ్‌పై మోజు, రా..రమ్మంటున్న లాభాలు, డీమ్యాట్ ఖాతాలు జూమ్
న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లలో ఆకర్షణీయమైన రాబడులు వస్తుండటం, ఖాతా తెరిచే ప్రక్రియ సులభతరం కావడం తదితర అంశాల ఊతంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో 26 శాతం పెరిగింది. 10.1 కోట్ల నుంచి 12.7 కోట్లకు చేరింది. నెలవారీగా చూస్తే కొత్త ఖాతాల సంఖ్య 4.1 శాతం పెరిగింది. జూలైలో 30 లక్షల కొత్త ఖాతాలు రాగా ఆగస్టులో 31 లక్షలు జతయ్యాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాలపై మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చేసిన విశ్లేషణలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన డేటా ప్రకారం ఆగస్టు ఆఖరు నాటికి రెండు డిపాజిటరీల్లో ( ఎన్ఎస్డీఎల్, సీడీఎస్ఎల్) మొత్తం 12.7 కోట్ల డీమ్యాట్ ఖాతాలు రిజిస్టరయ్యాయి. వీటిలో 3.3 కోట్ల ఖాతాలు ఎన్ఎస్డీఎల్లోనూ, 9.35 కోట్ల డీమ్యాట్ అకౌంట్లు సీడీఎస్ఎల్లోనూ ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లలో రాబడులు ఆకర్షణీయంగా ఉండటం, బ్రోకింగ్ సంస్థలు డీమ్యాట్ అకౌంటును తెరిచే ప్రక్రియను సులభతరం చేయడం ఖాతాల పెరుగుదలకు దోహదప డుతున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు. (డిపాజిటర్ల సొమ్ము: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు) అలాగే, ఆర్థిక అక్షరాస్యతతో పాటు యువతలో ట్రేడింగ్‌పై ఆసక్తి పెరుగుతుండటం కూడా ఇందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు. ఎన్ఎస్ఈ యాక్టివ్ క్లయింట్లకు సంబంధించి టాప్ 5 డిస్కౌంట్ బ్రోకింగ్ సంస్థల (జిరోధా, ఏంజెల్ వన్, గ్రో, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్) వాటా జులైలో 61.2 శాతంగా ఉండగా, ఆగస్టులో 60.8 శాతానికి తగ్గింది. -
డెట్ ఫండ్స్ నుంచి ఉపసంహరణలు
న్యూఢిల్లీ: డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆగస్ట్ నెలలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. జూలై నెలలో నికర పెట్టుబడులను ఈ విభాగం ఆకర్షించగా.. ఆగస్ట్‌లో రూ.25,872 కోట్లు వీటి నుంచి బయటకు వెళ్లిపోయాయి. అమెరికాలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఇంకా ముగియకపోవడంతో ఇన్వెస్టర్లు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడుల పట్ల అప్రమత్త ధోరణితో వ్యవహరించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెట్‌లో 16 విభాగాలకు గాను 9 విభాగాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లినట్టు మ్యూచువల్ ఫండ్స్ సంస్థల అసోసియేషన్ (యాంఫి) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. లిక్విడ్ ఫండ్స్ (రూ.26,824 కోట్లు), అల్ట్రా షార్ట్ డ్యురేషన్ ఫండ్స్ (రూ.4,123 కోట్లు)లో ఎక్కువగా అమ్మకాలు నమోదయ్యాయి. ఇవన్నీ స్వల్పకాల పెట్టుబడుల కోసం ఉద్దేశించిన పథకాలు. అలాగే, బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ విభాగం సైతం నికరంగా రూ.985 కోట్ల పెట్టుబడులను కోల్పోయింది. ఇక ఓవర్ నైట్ ఫండ్స్ రూ.3,158 కోట్లు, ఫ్లోటర్ ఫండ్స్ రూ.2,325 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్ రూ.1,755 కోట్ల చొప్పున ఆకర్షించాయి. ఈ ఏడాది జూలైలో డెట్ మ్యూచువల్ ఫండ్స్‌లోకి రూ.61,140 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఈక్విటీల్లోకి పెట్టుబడులు.. ‘‘ప్రస్తుత వడ్డీ రేట్ల వాతావరణం, వడ్డీ రేట్ల గమనంపై నెలకొన్న అనిశి్చతితో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించినట్టు కనిపిస్తోంది. వడ్డీ రేట్ల గమనంపై స్పష్టత వచ్చే వరకు వేచి ఉండే ధోరణి అనుసరించినట్టుగా ఉంది. అదే సమయంలో ఈక్విటీల్లో ర్యాలీ మొదలు కావడంతో డెట్ నుంచి పెట్టుబడులను అటువైపు మళ్లించినట్టున్నారు’’అని మారి్నంగ్ స్టార్ ఇండియా రీసెర్చ్ మేనేజర్ మెలి్వన్ శాంటారియా వివరించారు. తాజా అమ్మకాలతో ఆగస్ట్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణలోని డెట్ ఫండ్స్ పెట్టుబడుల విలువ రూ.14 లక్షల కోట్లకు పరిమితమైంది. జూలై చివరికి ఇది రూ.14.17 లక్షల కోట్లుగా ఉంది. -
ఏడోనెలా ఎగుమతులు రివర్స్..పసిడి దిగుమతులు రయ్!
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ ఎగుమతి–దిగుమతి గణాంకాలు వెలువడుతున్నాయి. భారత్ వస్తు ఎగుమతులు వరుసగా ఏడవనెల వృద్ధిలేకపోగా క్షీణబాటనే నడిచాయి. దిగుమతుల విషయంలో ఈ క్షీణత తొమ్మిది నెలల నుంచి నమోదవుతోంది. అధికారిక గణాంకాలను పరిశీలిస్తే.. ► ఆగస్టులో ఎగుమతులు 2022 ఇదే నెలతో పోల్చితే 6.86 శాతం తగ్గి 34.48 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► ఇదే నెల్లో దిగుమతులు 5.23 శాతం క్షీణించి 58.64 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ► ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం-వాణిజ్యలోటు 24.16 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. జూలైలో ఈ విలువ 20.67 బిలియన్లు కావడం గమనార్హం. ► ఎగుమతుల రంగంలో తేయాకు, కాఫీ, బియ్యం, సుగంధ ద్రవ్యాలు, తోలు, రత్నాలు–ఆభరణాలు, జౌళి, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు పడిపోయాయి. అయితే ముడి ఇనుము, ఎలక్ట్రానిక్ గూడ్స్, ఆయిల్ సీడ్స్, జీడిపప్పు, తివాచీ, ఇంజనీరింగ్, ఫార్మా, సముద్ర ఉత్పత్తులుసహా మొత్తం 30 కీలక రంగాల్లో 15 సానుకూల వృద్ధి రేటును నమోదు చేసుకున్నాయి. ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లో...కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకూ ఐదు నెలల్లో ఎగుమతులు 11.9 శాతం క్షీణించి 172.95 బిలియన్ డాలర్లుగా నమోదుకాగా, దిగుమతుల విలువ 12 శాతం క్షీణించి 271.83 బిలియన్ డాలర్లుగా ఉంది. వెరసి వాణిజ్యలోటు 98.88 బిలియన్ డాలర్లు. పసిడి దిగుమతులు: పసిడి దిగుమతులు ఆగస్టులో 38.75% పెరిగి 4.93 బిలియన్ డాలర్లుగా నమోదవగా, ఆగస్టు–ఏప్రిల్ మధ్య 10.48% పెరుగుదలతో 18.13 బిలియన్ డాలర్లుగా పసిడి దిగుమతుల విలువ ఉంది. రష్యా నుంచి దిగుమతులు రెట్టింపు రష్యా నుంచి భారత్ దిగుమతులు ఏప్రిల్-ఆగస్టు మధ్య రెట్టింపయ్యాయి. క్రూడ్ ఆయిల్, ఎరువుల దిగుమతులు పెరగడం దీనికి ప్రధాన కారణమని వాణిజ్య మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2022 ఏప్రిల్–ఆగస్టు మధ్య రష్యా నుంచి దిగుమతుల విలువ 13.77 బిలియన్ డాలర్లుకాగా, తాజా సమీక్షా కాలంలో ఈ విలువ 25.69 బిలియన్ డాలర్లకు ఎగసింది. చైనా, అమెరికాల తర్వాత రష్యా చమురు కొనుగోలులో భారత్‌ది మూడవ స్థానం. ఇక చైనా నుంచి దిగుమతులు ఈ ఐదు నెలల కాలంలో 43.96 బిలియన్ డాలర్ల నుంచి 42 బిలియన్ డాలర్లకు తగ్గాయి. -
ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా ఈ ఏడాది ఆగస్ట్‌లో 1.24 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. 2022 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 22.81 శాతం అధికమని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. 63.3 శాతం వాటాతో ఇండిగో విమానాల్లో 78.67 లక్షల మంది రాకపోకలు సాగించారు. టాటా గ్రూప్‌లో భాగమైన ఎయిర్ ఇండియా 9.8 శాతం వాటాతో 12.12 లక్షలు, ఏఐఎక్స్ కనెక్ట్ 7.1 శాతం వాటాతో 9.78 లక్షల మంది ప్రయాణించారు. టాటా సన్స్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంయుక్త భాగస్వామ్య కంపెనీ అయిన విస్తారా 9.8 శాతం వాటాతో 12.17 లక్షల మందికి సేవలు అందించింది. -
భారీగా పెరిగిన వంట నూనెల దిగుమతులు
న్యూఢిల్లీ: వెజిటబుల్ నూనెల దిగుమతులు (వంట నూనెలు, వంటకు వినియోగించనివి) ఆగస్ట్ నెలలో భారీగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చి చూసినప్పుడు 33 శాతం పెరిగి 18.66 లక్షల టన్నులుగా నమోదయ్యాయి. సుంకాలు తగ్గడం, డిమాండ్ పుంజుకోవడం దిగుమతులు గణనీయంగా పెరగడానికి దారితీసినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ (ఎస్ఈఏ) తెలిపింది. 2022 ఆగస్ట్ నెలలో వెజిటబుల్ నూనెల దిగుమతులు 14 లక్షల టన్నులుగా ఉన్నాయి. (ఎస్బీఐ మాజీ చైర్మన్ రజనీష్ సంపాదన ఎంతో తెలిస్తే!) 2022-23 మొదటి పది నెలల్లో (నూనెల సీజన్ నవంబర్-అక్టోబర్) నూనెల దిగుమతులు 24 శాతం పెరిగి 141.21 లక్షల టన్నులుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 113.76 లక్షల టన్నులుగా ఉండడం గమనార్హం. ఆగస్ట్ నెలలో దిగుమతులను పరిశీలిస్తే.. 18.52 లక్షల టన్నులు వంట నూనెలు కాగా, నాన్ ఎడిబుల్ నూనెలు 14,008 టన్నులుగా ఉన్నాయి. పామాయిల్ దిగుమతులు 11.28 లక్షల టన్నులు ఉండడం గమనించొచ్చు. ‘‘మొదటి పది నెలల్లో 141 లక్షల టన్నుల దిగుమతులను పరిశీలిస్తే.. అక్టోబర్‌తో ముగిసే నూనెల సంవత్సరంలో మొత్తం దిగుమతులు 160–165 లక్షల టన్నులకు చేరినా ఆశ్చర్యం అక్కర్లేదు’’అని ఎస్ఈఏ పేర్కొంది.దేశీయంగా నూనెల లభ్యత తగినంత ఉందని, అయినప్పటికీ ధరలు గణనీయంగా తగ్గడంతో డిమాండ్ బాగా పెరిగినట్టు ఎస్ఈఏ తెలిపింది. 2016-17 నూనెల సంవత్సరంలో భారత్ అత్యధికంగా 151 లక్షల టన్నుల వెజిటబుల్ నూనెలను దిగుమతి చేసుకుంది. -
ఉద్యోగ నియామకాలు డౌన్
ముంబై: కార్యాలయ ఉద్యోగ నియామకాలు ఆగస్ట్ నెలలో క్షీణత చూశాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 6 శాతం తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా ఐటీ, బీమా, ఆటోమొబైల్, హెల్త్‌కేర్, బీపీవో రంగాల్లో నియామకాల పరంగా అప్రమత్త ధోరణి కనిపించింది. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2,566 ఉద్యోగాలకు సంబంధించి పోస్టింగ్‌లు పడ్డాయి. క్రితం ఏడాది ఇదే నెలలో ఇవి 2,828గా ఉన్నట్టు నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నివేదిక వెల్లడించింది. నౌకరీ సంస్థ తన పోర్టల్‌పై జాబ్ పోస్టింగ్‌లు, ఉద్యోగ అన్వేషణల డేటా ఆధారంగా ప్రతి నెలా నివేదిక విడుదల చేస్తుంటుంది. ఇక ఈ ఏడాది జూలై నెలలో పోస్టింగ్‌లు 2,573తో పోలిస్తే కనుక ఆగస్ట్‌లో నియామకాలు 4 శాతం పెరిగాయి. ఆయిల్ అండ్ గ్యాస్, హాస్పిటాలిటీ, ఫార్మా రంగాల్లో నియామకాల పట్ల ఆశావహ ధోరణి కనిపించింది. ‘‘ఐటీలోనూ సానుకూల సంకేతలు కనిపించాయి. గడిచిన కొన్ని నెలలుగా ఐటీలో నియామకాలు తగ్గగా, సీక్వెన్షియల్‌గా (జూలైతో పోలిస్తే) ఐటీలో నియామకాలు పెరిగాయి. కార్యాలయ ఉద్యోగాల మార్కెట్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడుతున్నదానికి ఇది ఆరోగ్యకర సంకేతం’’అని నౌకరీ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ వెల్లడించారు. ఐటీలో 33 శాతం డౌన్ ఐటీ రంగంలో నియామకాలు క్రితం ఏడాది ఆగస్ట్‌తో పోలి్చనప్పుడు, ఈ ఏడాది అదే నెలలో 33 శాతం తక్కువగా నమోదయ్యాయి. బీమా రంగంలో 19 శాతం, ఆటోమొబైల్ రంగంలో 14 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 12 శాతం, బీపీవో రంగంలో 10 శాతం చొప్పున నియామకాలు తగ్గాయి. ఆయిల్ అండ్ గ్యాస్ రంగంలో నియామకాల పరంగా 17 శాతం వృద్ధి నమోదైంది. అహ్మదాబాద్, ముంబై, చెన్నై, హైదరాబాద్‌లో ఆయిల్ అండ్ గ్యాస్ రంగ నియామకాలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి. 16 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన నిపుణులకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఆతిథ్య రంగం (హాస్పిటాలిటీ)లోనూ నియామకాలు బలంగా నమోదయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలి్చనప్పుడు 14 శాతం వృద్ధి కనిపించింది. ఆర్అండ్డీపై దృష్టి పెరగడంతో ఫార్మా రంగంలో 12 శాతం అధికంగా నియామకాలు జరిగాయి. అహ్మదాబాద్, చెన్నైలో ఎక్కువగా ఫార్మా అవకాశాలు లభించాయి. ఏఐ ఉద్యోగాల్లోనూ 8 శాతం వృద్ధి కనిపించింది. మెషిన్ లెరి్నంగ్, ఏఐ సైంటిస్ట్, డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్‌ల ఉద్యోగ నియామకాలు కూడా పెరిగాయి. -
పుంజుకున్న ‘తయారీ’
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం కార్యకలాపాలు ఆగస్టులో ఊపందుకున్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూలైలో 57.7 వద్ద ఉంటే, ఆగస్టులో 58.6కు ఎగసింది. దాదాపు మూడు సంవత్సరాల్లో ఎన్నడూ లేని స్థాయిలో కొత్త ఆర్డర్లు, ఉత్పత్తి త్వరితగతిన పెరగడం దీనికి కారణమని శుక్రవారం విడుదలైన సర్వే పేర్కొంది. కాగా, సూచీ 50పైన ఉంటే దానిని వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. ఆ దిగువకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన తయారీ రంగం వరుసగా 26 నెలల నుంచి వృద్ధి బాటన కొనసాగుతోంది. కొత్త ఆర్డర్లు తయారీ రంగానికి ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు ఎస్అండ్పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజెన్స్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తిలో తయారీ రంగం వాటా దాదాపు 70 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్యానల్లోని దాదాపు 400 తయారీ రంగ సంస్థల పర్చేజింగ్ మేనేజర్స్‌కు పంపిన ప్రశ్నలు, అందిన సమాధానాల ప్రాతిపదికన సూచీ కదలికలు ఉంటాయి. 2005 మార్చిలో ఈ గణాంకాల సేకరణ ప్రారంభమైంది. -
ఆగస్ట్‌లో ఆల్‌టైమ్ ‘రయ్’!
న్యూఢిల్లీ: దేశీయ ప్యాసింజర్ వాహన అమ్మకాలు ఆగస్టులో ఆల్‌టైం గరిష్టానికి చేరుకున్నాయి. ఎస్యూవీ(స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్)లకు డిమాండ్ కొనసాగడం, పండుగ సీజన్ మొదలవడంతో గిరాకీ పుంజుకుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మారుతీ సుజుకీ రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. మొత్తం 1,89,082 వాహనాలు విక్రయించింది. గతేడాది ఇదే నెల అమ్మకాలు 1,65,173 యూనిట్లతో పోలిస్తే 14% అధికం. హ్యుందాయ్, ఎంఅండ్ఎం, టయోటా కిర్లోస్కర్ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని సాధించాయి. టాటా మోటార్స్, హోండా కార్స్ విక్రయాల్లో స్వల్ప క్షీణత నమోదైంది. ద్విచక్ర వాహన విభాగంలో బజాజ్ ఆటో విక్రయాలు 15% తగ్గాయి. హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అమ్మకాలు వరుసగా 6%, 4% పెరిగాయి. వాణిజ్య వాహనాలు, ట్రాకర్ల అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. -
మళ్లీ పుంజుకోనున్న రుతుపవనాలు
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలోని పలు ప్రాంతాల్లో జూన్, జూలై నెలల్లో వర్షాలు కురిశాయి. జూలైలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఆగస్టులో రుతుపవనాలు ముఖం చాటేశాయి. అయితే, అతిత్వరలో రుతుపవనాలు మళ్లీ పుంజుకొనే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) గురువారం వెల్లడించింది. మధ్య, దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. 91 నుంచి 109 శాతం వర్షపాతం నమోదవుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒకవేళ సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురిసినా.. జూన్–సెప్టెంబర్ సీజన్లో సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లేనని తెలిపారు. -
డీల్స్ @ రూ. 60,000 కోట్లు!
ముంబై: ఓ వైపు దేశీ స్టాక్ మార్కెట్లు ఈ నెల(ఆగస్ట్)లో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటికీ మరోపక్క లిస్టెడ్ కార్పొరేట్ ప్రపంచంలో భారీస్థాయి విక్రయ లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. గత ఐదు నెలల తదుపరి ఆగస్ట్‌లో మార్కెట్లు కొంతమేర వెనకడుగు వేయగా.. షేర్ల అమ్మకపు డీల్స్ కొత్త రికార్డ్‌కు తెరతీశాయి. ఒక పరిశీలన ప్రకారం ఈ నెలలో 29 వరకూ మొత్తం రూ. 60,000 కోట్లమేర భారీ బ్లాక్‌డీల్స్ జరిగాయి. క్యాలెండర్ ఏడాదిలోని ఏ నెలలోనైనా విలువరీత్యా ఇవి అత్యధికంకాగా.. రెండు భారీ డీల్స్ ఇందుకు దోహదపడ్డాయి. సాఫ్ట్వేర్ సేవల దేశీ కంపెనీ కోఫోర్జ్(గతంలో ఎన్ఐఐటీ టెక్నాలజీస్)లో రూ. 7,684 కోట్ల విలువైన ఈక్విటీని పీఈ దిగ్గజం బేరింగ్ అనుబంధ కంపెనీ హల్ట్ విక్రయించింది. ఇదేవిధంగా ప్రయివేట్ రంగ విద్యుత్ కంపెనీ అదానీ పవర్లో ప్రమోటర్ గ్రూప్ రూ. 7,412 కోట్ల విలువైన షేర్లను యూఎస్ దిగ్గజం జీక్యూజీ పార్ట్నర్స్కు విక్రయించింది. ఈ బాటలో ఇండిగో బ్రాండు విమానయాన సేవల కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్‌లో సహవ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్ కుటుంబం 3 శాతం వాటాను రూ. 2,802 కోట్లకు విక్రయించింది. దేశీ డిజిటల్ పేమెంట్స్ కంపెనీ పేటీఎమ్‌లో చైనా దిగ్గజం అలీబాబా గ్రూప్ కంపెనీ యాంట్‌ఫిన్ రూ. 2,037 కోట్ల విలువైన వాటాను అమ్మివేయగా.. ఆన్లైన్ ఫుడ్ సర్వింగ్ ప్లాట్‌ఫామ్ జొమాటోలో పీఈ దిగ్గజం టైగర్ గ్లోబల్ 1.44 శాతం వాటాను రూ. 1,124 కోట్లకు విక్రయించింది. మార్కెట్ల వెనకడుగు.. ఈ ఏడాది జూలై 20న దేశీ స్టాక్ మార్కెట్ల ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ సరికొత్త గరిష్టం 67,500 పాయింట్లను అధిగమించింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ సైతం దాదాపు 20,000 పాయింట్ల స్థాయికి చేరింది. ఈ రికార్డ్ స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ నిజానికి ఆగస్ట్‌లో 3 శాతం వెనకడుగు వేశాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 65,100, నిఫ్టీ 19,350 వద్ద కదులుతున్నాయి. అయితే దేశీయంగా అదనపు లిక్విడిటీ, మిడ్, స్మాల్‌క్యాప్స్‌నకు విస్తరించిన యాక్టివిటీ, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు వంటి అంశాలు.. ఈ నెలలో భారీ స్థాయి లావాదేవీలకు కారణమవుతున్నట్లు కార్పొరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు దేశ ఆర్థిక వ్యవస్థపై మధ్య, దీర్ఘకాలిక వృద్ధి అంచనాలు, స్టాక్ మార్కెట్ భవిష్యత్‌పై పెరుగుతున్న ఇన్వెస్టర్ల విశ్వాసం జత కలుస్తున్నట్లు తెలియజేశాయి. ఇతర స్టాక్స్‌లోనే.. ప్రధానంగా ఇండెక్సేతర కంపెనీలలోనే ఇటీవల వాటాల విక్రయాలలో భారీ లావాదేవీలు నమోదైనట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో మొత్తం మార్కెట్లో జరుగుతున్న అంశాలను సెన్సెక్స్ లేదా నిఫ్టీ ప్రతిఫలించకపోవచ్చని తెలియజేశాయి. మ్యూచువల్ ఫండ్స్(ఎంఎఫ్‌లు), విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు), పీఈ సంస్థలు తదితర దీర్ఘకాలిక ఇన్వెస్టర్లు స్వల్పకాలిక అంశాలను పరిగణనలోకి తీసుకోవని వివరించాయి. ఈ నెలలో మార్కెట్లు రికార్డ్ గరిష్టాల నుంచి కొంతమేర క్షీణించినప్పటికీ.. మిడ్, స్మాల్ క్యాప్స్ చరిత్రాత్మక గరిష్టాలకు చేరడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాయి. కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకూ ఎన్ఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్స్ 23% జంప్‌చేయగా.. నిఫ్టీ దాదాపు 7% ఎగసింది. ఇక జూన్‌లోనూ మొత్తం రూ. 50,000 కోట్ల విలువైన భారీ బ్లాక్‌డీల్స్ నమోదుకావడం మార్కెట్ల లోతుకు నిదర్శనమని నిపుణులు విశ్లేíÙంచారు. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఆగస్టు జీతంతోనే!
Infosys 80% average variable payout: దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో సగటున 80శాతం వేరియబుల్ పేను విడుదల చేయనుంది ఆగస్టు జీతంతో కలిపి ఈ వేరియబుల్పేను అందించనుంది. ఈ మేరకు కంపెనీ హెచ్ టీం ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారాన్ని అందిచింది. 2024 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 'మంచి పనితీరు' నేపథ్యంలో తన ఉద్యోగులు సగటున 80శాతం వేరియబుల్ వేతనం లభించనుంది. తాము క్యూ1లో మంచి పనితీరును కనబర్చామనీ, భవిష్యత్ విస్తరణకు బలమైన పునాదిని ఏర్పాటు చేసామని ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. అయితే ఉద్యోగుల పనితీరు త్రైమాసికంలో సహకారం ఆధారంగా ఈ పే ఉంటుందని పేర్కొంది. అలాగే పెరఫామెన్స్ బోనస్ నిర్ణారణ నిమిత్తం తమ బడ్జెట్ సంబంధిత DUలకు, యూనిట్ డెలివరీ మేనేజర్లకు అందించినట్టు వెల్లడించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ సగటు వేరియబుల్ పే 60 శాతంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరానికి (YoY) 11 శాతం పెరిగి రూ. 5,945 కోట్లకు చేరుకుంది. డాలర్ ఆదాయం 4,617 మిలియన్ డాలర్లు వచ్చింది. త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 20.8 శాతంగా ఉంది, క్రితం సంవత్సరం త్రైమాసికంలో 20 శాతం కంటే 80 బేసిస్ పాయింట్లు పెరిగాయి, అయితే మార్చి త్రైమాసికంలో 21 శాతం నుండి 20 బేసిస్ పాయింట్లు QoQ తగ్గింది. అంతేకాకుండా, పెద్ద డీల్ విజయాలు 2.3 బిలియన్ల డాలర్లకు పరిమితం. అలాగే అంతకుముందు అంచనా 4-7 శాతంతో పోలిస్తే. రెవెన్యూ గైడెన్స్ 1-3.5 శాతానికి తగ్గించింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద పూల సంబరం!
కొలంబియాలో జరుగుతున్న పూలసంబరాల ఫొటోలు ఇవి. ప్రపంచంలోనే అతిపెద్ద పూలసంబరాలు ఇవి. కొలంబియాలోని మెడలీన్ నగరంలో 1958 నుంచి ఏటా ఆగస్టులో ఈ వేడుకలను నిర్వహిస్తూ వస్తున్నారు. అంతకుముందు ఈ వేడుకలను మే నెలలో నిర్వహించేవారు. కొలంబియాలో బానిసత్వం రద్దయిన సందర్భానికి ప్రతీకగా పూలసంబరాలను ‘ఫెరియా డి లాస్ ఫ్లోరెస్’ పేరుతో నిర్వహించడం ప్రారంభించారు. బానిసత్వం ఉన్నకాలంలో ఎత్తయిన ప్రదేశాలకు బానిసలు తమ వీపులపై మనుషులను మోసుకుపోయేవారు. పూల వేడుకల్లో మనుషులకు బదులుగా పూలబుట్టలను వీపులపై మోస్తూ ఊరేగింపు జరపడం ఆనవాయితీగా మారింది. ఈ సంబరాల్లో భాగంగా పాతకాలం కార్లను, బైకులను పూలతో అలంకరించి మెడలీన్ వీథుల్లో 11 కిలోమీటర్లు ఊరేగింపు సాగించారు. ఈసారి జరిగిన పూలసంబరాల్లో పూల ప్రదర్శనలు, భారీ పూల అలంకరణలతో మెడలీన్ నగరం పూలవనాన్ని తలపించింది. ఈ వేడుకల్లో భాగంగా అందాల పోటీలు, పుష్పాలంకరణ పోటీలు, సంగీత, నృత్య ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి.. దేశ విదేశాల నుంచి దాదాపు పాతికలక్షల మంది పర్యాటకులు ఈ పూలప్రదర్శనను తిలకించారు. (చదవండి: వాట్ యాన్ ఐడియా!..ఏకంగా అంబులెన్స్‌నే ఇల్లుగా..!) -
టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత..
గత కొన్ని రోజులకు ముందు టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కేజీ రూ. 100 కంటే ఎక్కువ వద్ద లభిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం టమాటాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) 2023 ఆగస్టు 20 నుండి కిలో రూ. 40 రిటైల్ ధరకు టమోటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరలకే ప్రజలకు టమాటాలు అందించిన సందర్భాలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆగస్ట్ 15న ప్రభుత్వం టమాటా ధరలను రూ.50కి తగ్గించింది, తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తూ ప్రకటించింది. ఇదీ చదవండి: ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే? ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏకంగా 15 లక్షల కేజీల టమాటాలు విక్రయించినట్లు తెలుస్తోంది. విక్రయాలు ఢిల్లీలో మాత్రమే కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వారణాసి, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా జరిగినట్లు సమాచారం. కేవలం గత 15 రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా 560 టన్నుల టమోటాలను విక్రయించింది. -
ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు వేళాయె...
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) రెండో సీజన్ సమరానికి నేడు తెరలేవనుంది. మొత్తం ఆరు ఫ్రాంచైజీ జట్లు కోస్టల్ రైడర్స్, బెజవాడ టైగర్స్, రాయలసీమ కింగ్స్, గోదావరి టైటాన్స్, వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ మెరుపులతో టి20లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాయి. డిఫెండింగ్ చాంపియన్ కోస్టల్ రైడర్స్, రన్నరప్ బెజవాడ టైగర్స్ల మధ్య బుధవారం జరిగే పోరుతో రెండో సీజన్ మొదలవుతుంది. ప్రతి రోజు రెండేసి మ్యాచ్‌లు జరుగుతాయి. ఈ నెల 27న టైటిల్ పోరు నిర్వహిస్తారు. పోటీలన్నీ విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలోనే జరుగుతాయి. తొలి సీజన్లో ఆఖరి మెట్టుపై తడబడి టైటిల్ కోల్పోయిన బెజవాడ టైగర్స్ ఈ సారి టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. హిట్టర్ రికీ భుయ్పై గంపెడాశలు పెట్టుకున్న ఈ ఫ్రాంచైజీ రూ.8.10 లక్షలతో అతన్ని రిటెయిన్ చేసుకుంది. ఏపీఎల్‌లో ఇదే అత్యధిక మొత్తం కాగా, ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో నిరూపించుకున్న ఆంధ్ర క్రికెటర్లు హనుమ విహారి, కోన శ్రీకర్ భరత్‌లు కూడా ఈ లీగ్‌లో ఆడుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. విహారి రాయలసీమ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రూ. 6.60 లక్షలతో కింగ్స్ అతన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టులో అతనిదే అత్యధిక పారితోషికం. భారత టెస్టు జట్టు వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున స్టార్‌గా బరిలో ఉన్నాడు. అతన్ని రూ. 6 లక్షలకు లయన్స్ కొనుగోలు చేసింది. వీళ్లతో పాటు ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అకాడమీలలో రాణించిన కుర్రాళ్లు ఈ లీగ్‌తో ఏసీఏ సెలక్టర్ల కంట పడాలని ఆశిస్తున్నారు. ‘మన ఆంధ్ర–మన ఏపీఎల్’ అనే నినాదంతో పూర్తిగా స్థానిక కుర్రాళ్లకే అవకాశమిచ్చిన ఈ లీగ్‌ను చూసే ప్రేక్షకులకు కూడా నిర్వాహకులు బంపరాఫర్ ప్రకటించారు. ఏపీఎల్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా తిలకించేందుకు వచ్చే ప్రేక్షకులకు లక్కీ డ్రాను ఏర్పాటు చేశారు. విజేతగా నిలిచిన క్రికెట్ అభిమానులకు ఈ స్టేడియంలో భారత్, ఆ్రస్టేలియాల మధ్య నవంబర్ 23న జరిగే టి20 మ్యాచ్ టికెట్లను ఉచితంగా బహుకరించనున్నారు. -
ఆగస్టు నెలలో పుట్టారా? అయితే ఫోన్ ఫ్రీ!
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మొబైల్ రిటైల్ చెయిన్ సంస్థ టచ్ మొబైల్స్ ‘ఫ్రీ ఫోన్’ ఆఫర్ ప్రకటించింది. 1947 ఆగస్టు నెలలో జన్మించిన వారికి మొబైల్ ఉచితంగా ఇస్తుంది. ఇండిపెండెన్స్ డే రోజున టచ్ స్టోర్‌ను సందర్శించి తమ ఆధార్ కార్డులోని పుట్టిన తేదీని చూపించి ఎలాంటి చార్జీలు లేకుండా ఫ్రీగా మొబైల్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ ఆగస్టు 15 ఒక్క రోజుకే పరిమితం. అలాగే బ్రాండెడ్ ఫోన్లపై 50%, యాక్ససరీస్‌లపై 77% వరకు తగ్గింపు అందిస్తుంది. ఒప్పో అన్ని మోడళ్లపై 15% వరకు క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ప్రారంభ ధర రూ.6,999తో 32 అంగుళాల ఎల్ఈడీ టీవీని అందిస్తుంది. హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రిడిట్ కార్డులపై 10% తక్షణ క్యాష్ బ్యాక్ పొందవచ్చు. సున్నా వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో అధునాతన మోడల్స్ పొందే అవకాశం ఉంది. -
సోలార్ రేడియేషన్ ఎఫెక్ట్.. పెరిగిన ఎండలు
సాక్షి, అమరావతి: సోలార్ రేడియేషన్ (అల్ట్రా వయొలెట్ కిరణాలు) ఎక్కువగా ఉండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో మార్పుల వల్ల ఈ పరిస్థితి నెలకొందని నిపుణులు చెబుతున్నారు. సూర్య కిరణాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉండటం వల్ల చిన్న పిల్లలు, విటమిన్ లోపం ఉన్న వ్యక్తులు అసౌకర్యానికి గురవుతారు. సాధారణంగా ఇలాంటి వాతావరణం వేసవిలోనే ఉంటుంది. వర్షాకాలం కావడం వల్ల ఆగస్టులో ఇలాంటి వాతావరణం దాదాపు ఉండదు. కానీ.. ఈ ఏడాది ఆగస్టులో వర్షాలు లేకపోవడంతో యూవీ కిరణాల ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. సాధారణంగా ఈ సమయంలో మేఘాలు ఏర్పడి సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అందుకే నేరుగా ఎండ భూమిపై పడే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎండ తీవ్రత కూడా ఆ సమయాల్లో తక్కువగా ఉండటానికి కారణం అదే. ప్రస్తుతం అందుకు విరుద్ధంగా వాతావరణంలో మార్పుల కారణంగా మేఘాలు తక్కువగా ఏర్పడటంతో సూర్య కిరణాలు నేరుగా భూమిపై ప్రసరిస్తున్నాయి. దీంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. 32 నుంచి 36 డిగ్రీల మధ్య నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఇప్పుడు 40 డిగ్రీల వరకు ఉంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 42 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల వరకు పెరిగాయి. దీంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. సాధారణ వాతావరణం కంటే భిన్నంగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్టేట్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ సొసైటీ హెచ్చరించింది. 18 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఈ పరిస్థితి మరికొద్ది రోజులే ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. 18వ తేదీ నుంచి కోస్తాంధ్ర అంతటా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు. రాయలసీమలోనూ అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. -
పంద్రాగస్టు వేడుకకి వెళ్లమంటే.. ప్రాణం తీసుకున్నాడు
ఆదిలాబాద్: పాఠశాలకు వెళ్లకుండా ఇంటికి ఎందుకు వచ్చావని తండ్రి మందలించడంతో కుమారుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీంపూర్ మండలంలోని రాజుల్కోరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సిడాం అనురాగ్(13) అందర్‌బంద్ గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 4న ఉపాధ్యాయులకు తెలియకుండా ఇంటికి వెళ్లాడు. తిరిగి పాఠశాలకు వెళ్లాలని తండ్రి సీతారాం చెప్పినా వెళ్లలేదు. పంద్రాగస్టు వేడుకలు ఉన్నందున వెళ్లాలని శనివారం మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన అనురాగ్ ఇంటి వద్ద పురుగుల మందు తాగి కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై లాల్‌సింగ్‌నాయక్ మృతదేహన్ని పరిశీలించారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులు అప్పగించారు. గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఐటీడీఏ ఏపీవో భాస్కర్, ఏటీడీవో నిహారిక రాజుల్కోరిలో కుటుంబసభ్యులను పరామర్శించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని హెచ్ఎం రాజశేఖర్‌ను ఆదేశించారు. -
స్వాతంత్య్ర వేడుకలపై ఉగ్రకన్ను.. హై అలర్ట్..
ఢిల్లీ: స్వాతంత్య్ర వేడుకల్లో ఉగ్రదాడులు జరగనున్నాయనే సమాచారం అందడంతో ఢిల్లీలో భద్రతా దళాలు అలర్ట్ అయ్యాయి. రైల్వే స్టేషన్లు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులే లక్ష్యంగా దాడి చేయనున్నారని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. లష్కరే-ఈ-తోయిబా(ఎల్ఈటీ), జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులే ఈ దాడులకు ప్లాన్ వేశారని ఇంటెలిజెన్స్ బృందాలు తెలిపాయి. దేశ రాజధానితో పాటు ప్రధాన నగరాల్లో దాడులకు పాల్పడే సూచనలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. దేశంలో భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని ప్రణాళికలు వేసినట్లు తెలుస్తోంది. దీంతో భద్రతా బలగాలు సెక్యూరిటీని కట్టుదిట్టం చేశాయి. గత ఫిబ్రవరిలోనే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరగనున్నాయని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం వచ్చింది. ఢిల్లీలో ప్రధాన ప్రదేశాల్లో, రద్దీగా ఉండే స్థలాల్లో దాడులు చేపట్టాలని ఎల్ఈటీ తన సభ్యులకు సమాచారం పంపించినట్లు ఇంటెలిజెన్స్‌కు తెలిసింది. నేషనల్ ఇన్వెష్టిగేటివ్ ఏజెన్సీ (ఎన్ఐఏ) ప్రధానం కేంద్రంపై దాడి చేసి భద్రతా వైఫల్యాన్ని సృష్టించాలని కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిసింది. భారత్‌లో ప్రధాన నగరాల్లో దాడులు జరపాలని 2023 మేలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో జైషే-ఈ-మహ్మద్‌కు చెందిన ఓ వీడియో విడుదలైంది. పాక్ ఆధారిత ఉగ్రవాదులు, గ్లోబల్ జిహాదీలు స్వాతంత్య్ర వేడుకలే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. భద్రత కట్టుదిట్టం.. ఉగ్రదాడుల సమాచారంతో స్వాతంత్య్ర వేడుకలకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. పెట్రోలింగ్ వ్యవస్థలను పెంచారు. ఢిల్లీలో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. వేడుకల్లో భద్రత కోసం దాదాపు 10,000 పోలీసులను మోహరించారు. 1000 ఫేస్ రికగ్నీషన్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో యాంటీ డ్రోన్ సిస్టమ్, సర్వెలెన్స్‌ను పెంచారు. కాగా.. ఆగష్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసం ఇస్తారు. ఇదీ చదవండి: సీమా హైదర్ తిరంగ జెండా ఎత్తితే అట్లుంటది..! జేజేలు కొడుతూ.. దృశ్యాలు వైరల్.. -
హ్యాపీ ఇండిపెండెన్స్ డే 2023: భారత తొలి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల చిత్రాలు
-
ఆగస్టు 14.. చాలామందికి జ్వరం?.. మీరూ ఆ జాబితాలో ఉన్నారా?.. పిచ్చెక్కిస్తున్న మీమ్స్!
సాధారణంగా ఉద్యోగులు లాంగ్ వీకెండ్ కోసం ఎదురు చూస్తుంటారు. ఇటువంటి అవకాశం దొరికితే అలా బయట తిరిగిరావాలని చాలామంది తపన పడుతుంటారు. ఆగస్టు 15 ఈసారి మంగళవారం నాడువచ్చింది.(ఆరోజు ప్రభుత్వ అధికారిక సెలవుదినం). దానికి ముందురోజు అంటే సోమవారం(ఆగస్టు 14). దేశంలోని చాలామంది ఉద్యోగులకు ఆరోజు జ్వరం(సెలవు కోసం) వస్తుందట. లేదా తమ ఇంటిలో పెళ్లిళ్లు, గృహప్రవేశాలు లేదా శుభకార్యాలు ఉన్నాయంటూ సెలవు కోరుతున్నారు. When your sick leave for Monday is actually approved 🤭 #LongWeekend | #Fan pic.twitter.com/79Jw2yx0CD — Yash Raj Films (@yrf) August 11, 2023 సోమవారం ఒక్కరోజు గనుక సెలవు లభిస్తే, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం వరుసగా 4 రోజులు సెలవులు వస్తాయి. దీంతో లాంగ్ వీకెండ్ లభిస్తుంది. ఈ సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని చాలామంది భావిస్తున్నారు. ఈ విషయమై సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వాటిలో జనం సెలవు కోసం ఎటువంటి కారణాలు చెబుతున్నారో తెలియజేస్తున్నారు. అవి ఎంతో ఫన్నీగా ఉంటూ అందరినీ కడుపుబ్బా నవ్విస్తున్నాయి. ఇది కూడా చదవండి: ర్యాపిడో డ్రైవర్ రాయల్ ఎన్‌ఫీల్డ్‌పై రావడమేంటి?.. బుక్ చేసిన టెకీకి వింత అనుభవం! Leaving office on #Friday knowing it’s a long weekend 🚀 pic.twitter.com/OWD8Rn9pfH — Hemaang (@JrSehgal) August 11, 2023 People returning to offices on 16th August after the long weekend: pic.twitter.com/WaQDHXCcjf — Kanika Choudhary (@DalRotiForLife) August 9, 2023 Every employee planning for 14 August sick leave 🤣🤣🤣🤣🤣🤣 pic.twitter.com/kkiLRG56US — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) August 11, 2023 Managers permit sick leave on 14 August...😁😁😀😀 pic.twitter.com/uz3XOc3Jn7 — Gramin Banker 🏦 (@bankarBabu) August 5, 2023 *me applying 14 august sick leave* manager: pic.twitter.com/6DxW7sntpp — oh well (@highondhaniya) August 8, 2023 -
ఐకూ నుంచి జెడ్7 ప్రో 5జీ, కమింగ్ సూన్
న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐకూ కొత్తగా జెడ్7 ప్రో 5జీ ఫోన్‌ను ఆగస్టు 31న ఆవిష్కరించనుంది. ఈ-కామర్స్ పోర్టల్ అమెజాన్‌లో ఇది అందుబాటులో ఉంటుందని సంస్థ తెలిపింది. మీడియాటెక్ డైమెన్సిటీ 7200 మొబైల్ ప్లాట్‌ఫాం, 3డీ కర్వ్డ్ సూపర్ విజన్ అమోలెడ్ డిస్ప్లే, 64 ఎంపీ కెమెరా తదితర ఫీచర్లు ఇందులో ఉన్నట్లు వివరించింది. 8జీబీ ర్యామ్ 128జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వెర్షన్లలో లభ్యం. ఫీచర్లు 6.78-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్ప్లే 4nm MediaTek డైమెన్సిటీ 7200 SoC 64 మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా 2 మెగాపిక్సెల్ సెకండరీ షూటర్‌తో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 4,600mAh బ్యాటరీ 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇది కూడా చదవండి: గుడ్ఇయర్ భాగస్వామ్యంతో అష్యూరెన్స్ బ్యాటరీలు న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ గుడ్ఇయర్ టైర్ అండ్ రబ్బర్ కంపెనీ నుంచి తీసుకున్న అధికారిక లైసెన్సు కింద అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ కొత్త ఫిల్టర్లు, బ్యాటరీల శ్రేణిని ఆవిష్కరించింది. వీటిని భారత్‌లోనే తయారు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. దేశీయంగానే కాకుండా దక్షిణాసియా, ఆగ్నేయాసియా, ఆ్రస్టేలియా న్యూజిలాండ్ మార్కెట్లలో విక్రయించనున్నట్లు వివరించింది. ఆగస్టు ఆఖరు నాటికి ఈ బ్యాటరీలు, ఫిల్టర్లు మార్కెట్లోకి రాగలవని అష్యూరెన్స్ ఇంటర్నేషనల్ పేర్కొంది. -
బంగారం,వెండి ధరలు: ఎలా ఉన్నాయంటే..!
దేశంలో బంగారం ధరలు స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల కాస్త పుంజుకున్న ధరలు సోమవారం మాత్రం అక్కడక్కడే కదలాడుతున్నాయి. గతం వారం పది గ్రాములకు రూ. 60 వేలకు పైన ఉన్న పసిడి ఒక దశలో 60వేల దిగువకు వచ్చింది. ప్రస్తుతం మద్దతు స్థాయిల వద్ద కొనసాగుతోంది. గత వారం బాగా పెరిగిన వెండి ధర ప్రస్తుతం హైదరాబాద్‌లో 80 వేల దిగుకు చేరింది. హైదరాబాద్‌లో స్వల్పంగా ఎగిసిన 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.55,150 ఉండగా 24 క్యారెట్ల పసిడి రూ.60,160 పలుకుతోంది. మరోవైపు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ఇక వెండి రూ. 200 తగ్గి 78,300 గా ఉంది. దాదాపు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.60,310 పలుకుతోంది. ఢిల్లీలో కిలో వెండి 75,100గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల కోసం ఇక్కడ క్లిక్ చేయండి! ఎంసీఎక్స్‌లో పతనం మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో (ఆగస్ట్ 7, 2023 సోమవారం)బంగారం , వెండి ధరలు రెండూ పతనాన్ని నమోదు చేశాయి. అక్టోబరు 5, 2023న మెచ్యూర్ అయ్యే గోల్డ్ ఫ్యూచర్స్, రూ. 91 లేదా 0.15 శాతం స్వల్ప తగ్గుదలని నమోదు చేసిన తర్వాత, 10 గ్రాములకు రూ.59,436గా ఉంది. క్రితం ముగింపు రూ.59,527గా నమోదైంది. అదేవిధంగా, సెప్టెంబరు 5, 2023న వెండి ఫ్యూచర్లు రూ. 300 లేదా 0.41 శాతం క్షీణతను చవిచూశాయి. మునుపటి ముగింపుతో పోలిస్తే MCXలో కిలో రూ. 72,178 వద్ద రిటైల్ అవుతున్నాయి. ఎక్సైజ్ సుంకం, మేకింగ్ ఛార్జీలు, పన్నుల వంటి నిర్దిష్ట పారామితుల ఆధారంగా వివిధ ప్రాంతాల్లో బంగారం ధర మారుతూ ఉంటుందనేది గమనించాలి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధర అమెరికాలో జాబ్ గ్రోత్మందగింపు నేపథ్యంలో సోమవారం బంగారం ధరలు మూడు వారాల కనిష్టానికి పడిపోయాయి. ఉద్యోగ వృద్ధి డాలర్, బాండ్ ఈల్డ్స్ ఫలితాలు పసిడి గరిష్ట స్థాయినుంచి దిగజారాయి.. తాజా నివేదిక ప్రకారం, స్పాట్ గోల్డ్ 0325 ఔన్స్‌కు 1,940.99 డాలర్ల వద్ద స్థిరంగా ఉంది. స్పాట్ వెండి ఔన్స్‌కు 0.3శాతం తగ్గి 23.54 డాలర్ల వద్ద , ప్లాటినం 0.4శవాతం లాభంతో 926.05డాలర్లు వద్ద, పల్లాడియం 0.5శాతం లాభపడి 1,263.26డాలర్లకి చేరుకుంది. -
కారు కొనాలనుకుంటున్నారా? మారుతి కార్లపై భారీ డిస్కౌంట్
ఆటో దిగ్గజం మారుతి సుజుకి పలు మోడళ్ల కార్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆగస్ట్ నెలకు సంబంధించి కార్ల కొనుగోలుదారులకు అదిరిపోయే ఆఫర్ అందిస్తోంది. దాదాపు రూ. 57 వేల తగ్గింపు దాకా అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ తదితరాలు ఉన్నాయి. ఆగస్టు 31 వరకు ఈ డిస్కౌంట్ ధరలు అందుబాటులో ఉంటాయి మారుతి సుజుకి పై రూ. 57 వేల దాకా డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. వేరియంట్ల ఆధారంగా కస్టమర్లు ఈ తగ్గింపును పొందవచ్చు. ఆల్టో కే10పై రూ. 57 వేల దాకా తగ్గింపు పొందవచ్చు. (తండ్రికే షాకిస్తున్న ఇషా: మురిసిపోతున్న అంబానీ) మారుతీ సుజుకి ఎస్ ప్రెస్సో 56,000 వరకు తగ్గింపు. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పెట్రోల్, CNG-ఆధారిత మారుతి సుజుకి S ప్రెస్సో అన్ని వేరియంట్లు రూ. 56,000 వరకు మొత్తం తగ్గింపును పొందవచ్చు. అలాగే ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కూడిన వేరియంట్లు రూ. 32,000 వరకు తగ్గింపు పొందవచ్చు. (స్పెషల్ ఎట్రాక్షన్‌గా నీతా అంబానీ: చెప్పుల ధర రూ.7 లక్షలు) మారుతీ సుజుకీ ఇగ్నిస్, బాలెనో, డిజైర్, వ్యాగన్ ఆర్ మోడల్స్‌పై క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. వేరియంట్లు, డీలర్షిప్ ఏజెన్సీల ఆధారంగా ఈ తగ్గింపు అందుబాటులో ఉంటుంది. కాగా మారుతి సుజుకి ఈ ఏడాది క్యూ1లో మెరుగైన ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్తోముగిసిన త్రైమాసికంలో గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 145శాతం పుంజుకుని రూ. 2,485 కోట్ల నికర లాభాలను సాధించింది. అలాగే 45 లక్షల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్ సెల్లింగ్ కారుగా నిలిచిన సంగతి తెలిసిందే. -
తక్కువ ధరలో బెస్ట్ మొబైల్ కావాలా? ఎంచుకో ఓ మంచి ఆప్షన్..
Best Mobile Phones Under 15,000: భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త ఉత్పత్తుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో స్మార్ట్ఫోన్లు ఎక్కువగా ఉన్నాయి. చాలా బ్రాండ్స్ ఖరీదైనవి కాగా.. మరికొన్ని బడ్జెట్ ధరలోనే లభిస్తాయి. ఆగష్టు నెలలో రూ. 15,000 కంటే తక్కువ ధర కొనుగోలుచేయదగిన టాప్ 5జీ మొబైల్స్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. రెడ్మీ 12 5జీ (Redmi 12 5G).. ఆధునిక మార్కెట్లో రెడ్మీ మొబైల్స్‌కి డిమాండ్ భారీగా ఉంది. దీనికి కారణం తక్కువ ధర వద్ద వినియోగదారునికి కావలసిన ఫీచర్స్ లభించడమే. మన జాబితాలో బడ్జెట్ ధరలో లభించే స్మార్ట్ఫోన్లలో రెడ్మీ 12 5జీ ఒకటి. దీని ధర రూ. 10,999 మాత్రమే. ఇది స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్ కలిగి మంచి కెమెరా సెటప్ కూడా పొందుతుంది. శాంసంగ్ గెలాక్సీ ఎమ్14 5జీ (Samsung Galaxy M14 5G).. శాంసంగ్ కంపెనీకి చెందిన 'గెలాక్సీ ఎమ్14 5జీ' రూ. 15,000 కంటే తక్కువ ధర వద్ద లభించే బెస్ట్ మోడల్. రోజు వారీ వినియోగానికి మాత్రమే కాకుండా గేమింగ్ వంటి వాటికి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది. పనితీరు పరంగా ఉత్తమంగా ఉండే ఈ మొబైల్ 93Hz డిస్ప్లే పొందుతుంది. మంచి డిజైన్, అద్భుతమైన బ్యాటరీ పర్ఫామెన్స్ కలిగి వినియోగదారులకు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇదీ చదవండి: ధనవంతుడవ్వాలనే తపన సరిపోదు.. ఈ టిప్స్ తప్పనిసరి! రియల్మీ నర్జో ఎన్53 5జీ (Realme Narzo N53).. చూడటానికి ఐఫోన్ మాదిరిగా కనిపించడమే కాకుండా వినియోగదారులను ఒక్క చూపుతోనే ఆకట్టుకునే ఈ 'రియల్మీ నర్జో ఎన్53 5జీ' మన జాబితాలో చెప్పుకోదగ్గ స్మార్ట్‌ఫోన్. ఇది ప్రత్యేకంగా గేమింగ్ ఫోన్ కానప్పటికీ.. గేమ్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఫింగర్‌ప్రింట్ రెసిస్టెంట్ బ్యాక్ ప్యానెల్ కలిగి అద్భుతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇదీ చదవండి: ఎక్స్ బాయ్ ఫ్రెండ్‌పై జొమాటో ద్వారా రివేంజ్! యువతి చేసిన పనికి.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G).. మన జాబితాలో తక్కువ ధరలో లభించే మరో మొబైల్.. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ. ఇది ఆకర్షణీయమైన డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్ కలిగి, మంచి బ్యాటరీ కెపాసిటీ కలిగి ఉంటుంది.అంతే కాకుండా ఇందులో 50 మెగా పిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా ఉంటుంది. -
కొద్దిసేపటిలో హైదరాబాద్‌లో ఖగోళ అద్భుతం.. అస్సలు మిస్సవకండి!
భూమి.. సూర్యుని చుట్టూ తిరుగుతూ, దాని చుట్టు అది తిరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఈ నేపధ్యంలో కొన్ని విచిత్రమైన ఖగోళ సంఘటనలు కూడా చోటుచేసుకుంటాయి. కొన్నిసార్లు గ్రహణం సంభవిస్తుంది. ఇంకొన్నిసార్లు ఇతర ఖగోళ సంఘటనలు భూమి నుండి కనిపిస్తాయి. ఇప్పుడు భారతదేశం మరో సంఘటనకు సాక్షిగా నిలవబోతోంది. ఇది ఎంతో ఆశ్చర్యాన్ని గొలపనుంది. ఈ రోజు భారతదేశంలో షాడో డే ఆవిర్భవించనుంది. అంటే దీని అర్థం గురువారం(ఆగస్టు 3) భారతీయులు తమ నీడను తాము కాసేపు చూసుకోలేరు. ఇలా నీడ పడని కాలం ఎంతసేపు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దీనితో పాటు ఇది ఏ కారణం చేత జరుగుతుందో తెలుసుకుందాం. జీరో షాడో డే అంటే ఏమిటి? జీరో షాడో డే నాడు కొద్ది సమయం పాటు మన నీడ మనకు కనిపించదు. జీరో షాడో డే నాడు ఒక నిర్దిష్ట సమయంలో సూర్యుడు మన తలపైకి వచ్చే సమయంలో మన నీడ ఏర్పడదు. ఈ పరిస్థితినే జీరో షాడో అంటారు. ఇది ఆగస్ట్ 3, 2023న 12.23కి భారతదేశంలో సంభవించనుంది. దీని ప్రభావం హైదరాబాద్ సమీపంలో అధికంగా ఉంటుందని, ఇందుకోసం హైదరాబాద్‌లో కూడా ప్రత్యేక సన్నాహాలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు తెలియజేశారు. దీని వెనుక సైన్స్ ఇదే.. ఖగోళంలో సంభవించే ఈ దృగ్విషయం సంవత్సరానికి రెండుసార్లు జరుగుతుంది. భూమి తన అక్షంలో కొద్దిగా వంగి ఉంటుంది. ఈ వంపుతో భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఈ వంపు కారణంగా సూర్యకిరణాల కోణం ఏడాది పొడవునా మారుతూ ఉంటుంది. ఫలితంగా నీడ పొడవు, దిశ కూడా మారుతూ ఉంటుంది. దీనితో పాటు ఈ కోణం కారణంగా సూర్యుని వంపు కూడా మారుతూ ఉంటుంది. ఫలితంగా సూర్యుడు సరిగ్గా తలపైకి వచ్చినప్పుడు మన నీడ కనిపించదు. అయితే ఇది అక్షాంశంపై ఆధారపడి ఉంటుంది. దీని ప్రకారం దేశంలోని హైదరాబాద్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో జీరో షాడో డే ప్రభావం ఉంటుంది హైదరాబాద్ అక్షాంశం 17.3850°N. గురువారం మధ్యాహ్నం 12.23 సమయంలో సూర్యుడి కోణం నిటారుగా ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌లో కొంత సమయం పాటు నీడ కనిపించదు. ఇది కూడా చదవండి: మరో ‘సీమా- సచిన్’.. ఫ్రీ ఫైర్ గేమ్‌తో పరిచయం ఏర్పడి.. -
ముక్కోణపు ప్రేమకథ
అభినవ్ మదిశెట్టి, స్నేహా సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దిల్ సే’. మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ నెల 4న రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు పి. కౌశిక్ రెడ్డి, నిర్మాత బెక్కం వేణుగోపాల్ అతిథులుగా హాజరయ్యారు.‘‘ముక్కోణపు ప్రేమకథా చిత్రమిది’’అని మంకల్ వీరేంద్ర, రవికుమార్ సబ్బాని అన్నారు. -
కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలో లాంచ్ అయ్యే మొబైల్స్ చూసారా!
Upcoming Smartphones: దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులు విడుదలవుతూనే ఉన్నాయి. ఇప్పటికే మనం ఆగష్టు నెలలో విడుదలకానున్న కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు వచ్చే నెలలో విడుదలకు సిద్దమవుతున్న స్మార్ట్‌ఫోన్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. షావోమి మిక్స్ ఫోల్డ్ 3 (Xiaomi Mix Fold 3) ఇండియన్ మార్కెట్లో ఇప్పటికే మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్న షావోమి త్వరలో మిక్స్ ఫోల్డ్ 3 మొబైల్ లాంచ్ చేయనుంది. ఇది చైనా మార్కెట్లో అడుగుపెట్టనున్నట్లు సమాచారం, భారతదేశంలో తరువాత కాలంలో విడుదలయ్యే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నాము. ఈ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జాజ్ ఫోల్డ్ 5కి ప్రత్యర్థిగా ఉండనుంది. వివో వీ29 సిరీస్ (Vivo V29 Series) వివో కంపెనీకి చెందిన వీ29 సిరీస్ గ్లోబల్ మార్కెట్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో వీ29 అండ్ వీ29 ప్రో ఉండనున్నాయి. ఇది కూడా చైనా మార్కెట్లో విడుదలైన తరువాత భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. రియల్మీ జీటీ 5 (Realme GT 5) 2023 ఆగష్టు నెలలో రియల్మీ తన జీటీ 5 స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్ ఉంటుంది, అదే సమయంలో 144 Hz ఓఎల్ఈడీ డిస్ప్లే పొందుతుంది. అద్భుతమైన కెమెరా సెటప్ తప్పకుండా కొనుగోలుదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది. ఇదీ చదవండి: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వజ్రం ఈయన సొంతం - వెహికల్స్ ఫ్యూయెల్కే వందల కోట్లు.. ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో (Infinix GT 10 Pro) ఇన్ఫినిక్స్ తన జీటీ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఆగష్టు 03న ఆవిష్కరించడానికి సన్నద్ధమవుతోంది. ఈ మొబైల్ ఫోన్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్సెట్ ఉంటుందని తెలుస్తోంది. ధరలు & ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్న దుబాయ్ షేక్ కారు.. వీడియో వైరల్ రెడ్మీ 12 5జీ (Redmi 12 5G) రెడ్మీ కంపెనీ ఆగష్టు 01న మరో కొత్త 5జీ మొబైల్ లాంచ్ చేయడానికి సిద్ధమైంది. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్లో గట్టిపోటీనిచ్చే విధంగా కంపెనీ దీనిని రూపొందించింది. ఇందులో స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, 90Hz FHD+ డిస్ప్లేతో 5000 mAh బ్యాటరీ ఉంటాయి. -
రేపటి నుంచే గురుకుల పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షలకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఆగస్టు ఒకటో తేదీ నుంచి 23వ తేదీ వరకు వరుసగా ఈ పరీక్షలు జరుగుతాయి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చొప్పున రోజుకు మూడు సెషన్లలో నిర్వహిస్తారు. తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6.55లక్షల మంది హాజరుకానున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో 104 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆఫ్‌లైన్‌లో నిర్వహించాలని అనుకున్నా... వాస్తవానికి ఈ పరీక్షలన్నీ ఓఎంఆర్ ఆధారితంగా ఆఫ్‌లైన్ పద్ధతిలో నిర్వహించాలని బోర్డు మొదట్లో నిర్ణయించింది. టీఎస్పీఎస్సీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం, తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ పరీక్షలకే మొగ్గు చూపింది. లక్షల్లో అభ్యర్థులు ఉండడంతో ఆన్లైన్ పరీక్షల నిర్వహణ కత్తిమీద సామే అయినా, వ్యూహాత్మక ప్రణాళికతో వేగంగా పరీక్షల నిర్వహణ షెడ్యూల్ ఖరారు చేసినట్టు అధికారులు చెబుతున్నారు. సెంటర్ల మార్పు అసాధ్యం హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థుల్లో కొందరు పరీక్ష కేంద్రాల చిరునామా చూసి గురుకుల బోర్డుకు ఫిర్యాదు చేస్తున్నారు. సుదూర కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలు ఖరారు చేయడం, ఒక్కో పరీక్షను ఒక్కోచోట రాయాల్సి రావడం సరికాదంటూ అధికారులు, హెల్ప్‌లైన్ కేంద్రాలకు ఫోన్లు, ఈ–మెయిల్ ద్వారా వినతులు సమరి్పస్తున్నారు. అయితే పరీక్ష కేంద్రాల మార్పు అసాధ్యమని గురుకుల బోర్డు స్పష్టం చేసింది. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగానే సెంటర్లు ఖరారు చేశామని, పరీక్ష కేంద్రాల లభ్యతకు అనుగుణంగా ఎంపిక చేయడంతో కొందరికి మొదటి ఆప్షన్లో ఉన్న కేంద్రం కేటాయించగా, మరికొందరికి ఎనిమిదవ ఆప్షన్లో కేంద్రం అలాట్ అయ్యిందని, ఇదంతా కంప్యూటర్ ఆధారితంగా జరిగినట్టు గురుకుల బోర్డు కన్వీనర్ మల్లయ్యబట్టు ‘సాక్షి’కి వివరించారు. ఆయా జిల్లాల్లో ఇలా రాష్ట్రంలో అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 32 పరీక్ష కేంద్రాలున్నాయి. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 16 కేంద్రాలు, కరీంనగర్ జిల్లాలో 10 కేంద్రాలో, హైదరాబాద్ జిల్లాలో 5 కేంద్రాలున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో కేవలం ఒకేఒక కేంద్రం ఉంది. ఆ పరీక్ష కేంద్రంలో ఒక సెషన్లో కేవలం 90 మంది అభ్యర్థులు మాత్రమే పరీక్ష రాసే అవకాశముంది. అయితే ఆ జిల్లా నుంచి దాదాపు 6వేల మంది దరఖాస్తు చేసుకోగా, సగం మందికి వారు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా సమీపంలో ఉన్న జిల్లాల్లో పరీక్ష కేంద్రాలు కేటాయించారు. నిజామాబాద్ జిల్లాలో కేవలం రెండు పరీక్ష కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒక సెషన్లో కేవలం 300 మంది చొప్పున 600 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యే వీలు ఉంది. ఆ జిల్లా నుంచి దాదాపు 10వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు కేంద్రాల్లో సర్దుబాటు చేస్తూ మిగిలిన అభ్యర్థులకు వారు ఇచ్చిన ఆప్షన్లకు అనుగుణంగా సమీప జిల్లాల్లో సెంటర్లు కేటాయించారు. నల్లగొండ జిల్లాకు రెండు కేంద్రాలు, సూర్యాపేట జిల్లాలో 5 కేంద్రాలు ఏర్పాటు చేయగా, ఈ రెండు జిల్లాల నుంచి దాదాపు 15వేల మంది దరఖాస్తు చేశారు. కంప్యూటర్ల లభ్యత ప్రకారం సెంటర్లు కేటాయిస్తూ, మిగతా అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో కేటాయింపులు జరిపారు. ఆ మూడు రోజులు వేరే సెంటర్లో.. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఖమ్మంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల నీట మునిగింది. అయితే ఈ కాలేజీని పరీక్ష కేంద్రంగా గుర్తించి ఏర్పాట్లు చేశారు. కానీ కాలేజీ మెజారిటీ ప్రాంతం నీట మునగడంతో వచ్చే 1, 3, 4వ తేదీల్లో ఈ కేంద్రంలో పరీక్షలు రాయాల్సిన అభ్యర్థులకు నిర్దేశించిన తేదీల్లో ప్రత్యామ్నాయంగా సమీపంలోని ఇతర కేంద్రాల్లో సర్దుబాటు చేశారు. ఈమేరకు అభ్యర్థులకు కొత్తగా హాల్‌టికెట్లు జారీ చేశారు. వాటిని గురుకుల బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. 5వ తేదీ నుంచి ఆ కేంద్రంలో మిగతా పరీక్షలు యథావిధిగా జరుగుతాయంటున్నారు. -
‘ఇండియా’ కూటమి భేటీ వాయిదా?
న్యూఢిల్లీ: ముంబైలో ఆగస్ట్‌లో జరగాల్సిన ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల భేటీ సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. కూటమిలోని కొందరు నేతలు ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉన్నామంటున్నందున ఆగస్ట్ 25, 26వ తేదీల్లో సమావేశం జరక్కపోవచ్చని విశ్వసనీయ వర్గాలంటున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో అధికార బీజేపీని ఢీకొట్టే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీల నేతల మొదటి రెండు సమావేశాలు పట్నా, బెంగళూరుల్లో జరిగిన విషయం తెలిసిందే. -
శ్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథగా ‘రుద్రంకోట’
సీనియర్ నటి జయలలిత సమర్పించి, ఓ కీలక పాత్ర చేసిన చిత్రం ‘రుద్రంకోట’. రాము కోన దర్శకత్వంలో అనిల్ ఆర్కా కండవల్లి నిర్మించిన ఈ చిత్రంలో అనిల్ ఆర్కా, విభీష, రియా హీరో హీరోయిన్లు. ఈ చిత్రం ఆగస్ట్‌లో స్క్రీన్ మాక్స్ సంస్థ ద్వారా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో, నిర్మాత అనిల్ ఆర్క కండవల్లి మాట్లాడుతూ.. ‘శ్మశాన వాటికలో పెరిగిన ఓ యువకుడి ప్రేమకథా చిత్రమిది. భద్రాచలం దగ్గర రుద్రంకోట అనే ఊరి నేపథ్యంలో కథ నడుస్తుంది. ఇప్పటి వరకు ఎవరూ చూపించని అంశాలను మా చిత్రంలో చూపిస్తున్నాం. ఇందులో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలుంటాయి. సీనియర్ నటి జయలలిత గారు సమర్పకులుగా వ్యవహరిస్తూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి గారు మా చిత్రానికి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ ప్రముఖులు యుబైఏ సర్టిఫికెట్ తో పాటు సినిమా బావుందంటూ ప్రశంసించారు. మా సినిమా నచ్చడంతో స్క్రీన్ మాక్స్ వారు గ్రాండ్ గా విడుదల చేయడానికి ముందుకొచ్చారు. ఆగస్ట్ లో సినిమాను విడుదల చేయనున్నాం’అన్నారు. -
ఆగస్టు నెలలో 14 రోజులు బ్యాంకుల మూత! సెలవుల జాబితా ఇదిగో..
వచ్చే ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు 14 రోజులు మూత పడనున్నాయి. ఆర్బీఐ సెలవుల క్యాలెండర్ ప్రకారం ఆగస్టు నెలలో దేశవ్యాప్తంగా పండుగలు, పర్వదినాలు, వివిధ రాష్ట్రాల్లో ప్రత్యేక దినోత్సవాలతోపాటు రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలను కలుపుకొంటే 14 రోజులు సెలవులు ఉన్నాయి. ఆగస్టు నెలలో వివిధ బ్యాంకు పనులకు ప్రణాళిక వేసుకున్న ఖాతాదారులు సెలవుల జాబితాకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరముంది. బ్యాంకులు మూసేసినా ఇంటెర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు నిరంతరం అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే ప్రత్యేకించి బ్యాంకు బ్రాంచిలలోనే పూర్తి చేసుకోవాల్సిన కొన్ని పనులకు అవాంతరాలు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రూ.2000 నోట్ల మార్పిడి, డిపాజిట్‌కు గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. కాబట్టి డిపాజిట్‌దారులు గమనించాల్సిన అవసరం ఉంది. సెలవుల జాబితా ఇదే.. ఆగస్టు 6- ఆదివారం ఆగస్టు 8- టెండాంగ్ లో రమ్ ఫాట్ ( సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో సెలవు) ఆగస్టు 12- రెండో శనివారం ఆగస్టు 13- ఆదివారం ఆగస్టు 15- స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 16- పార్సీ నూతన సంవత్సరం (ముంబై, నాగ్‌పూర్, బేలాపూర్‌లలో సెలవు) ఆగస్టు 18- శ్రీమంత శంకర్‌దేవ్ తిథి ( అస్సాం గౌహతిలో సెలవు) ఆగస్టు 20- ఆదివారం ఆగస్టు 26– నాలుగో శనివారం ఆగస్టు 27- ఆదివారం ఆగస్టు 28 - మొదటి ఓనం (కొచ్చి, తిరువనంతపురంలో సెలవు) ఆగస్టు 29 - తిరుఓణం (కొచ్చి, తిరువనంతపురంలో హాలిడే) ఆగస్టు 30- రక్షా బంధన్ ఆగస్ట్ 31- రక్షా బంధన్/శ్రీ నారాయణ గురు జయంతి/పాంగ్-లాబ్సోల్ (డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, కాన్పూర్, కొచ్చి, లక్నో, తిరువనంతపురంలలో సెలవు) -
పెరగనున్న పాల ధరలు.. ఆగష్టు 01 నుంచే..
టమాట ధరల పెరుగుదల మిగతా నిత్యావసరాల ధరల మీద ప్రభావం చూపుతోంది. కర్ణాటకలో పాల ధరలు కూడా 2023 ఆగష్టు 01 నుంచి పెరగనున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కెఎమ్ఎఫ్) బృందం & ముఖ్యమంత్రి సిద్దరామయ్య మధ్య జరిగిన సమావేశం తరువాత ప్రముఖ పాల బ్రాండ్ నందిని (Nandini) ధరలు లీటరుకు రూ. 3 పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న కారణంగా పాల ధరలను పెంచాల్సి వచ్చినట్లు కెఎమ్ఎఫ్ ప్రతినిధి తెలిపారు. కెఎమ్ఎఫ్ చైర్మన్ భీమా నాయక్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ప్రభుత్వానికి చేసిన అభ్యర్థనను ఆమోదించింది. కావున కొత్త ధరలు ఆగష్టు 01 నుండి అమలులోకి రానున్నాయి. ధరల పెరుగుదల కేవలం పాలకు మాత్రమే వర్తిస్తుందని.. పెరుగు, ఇతర పాల పదార్థాలు వర్తించే అవకాశం లేదని తెలిపారు. (ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 సన్‌రూఫ్ ఫీచర్ కార్లు - వివరాలు) ప్రస్తుతం మార్కెట్లో నందిని టోన్డ్ మిల్క్ ధర రూ. 39 ఉండగా.. ఆగష్టు 01 నుంచి ఇది రూ. 42కి చేరుతుంది. పాల పొడి ధరలు కూడా పెంచాలన్న బృందం విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించినట్లు సమాచారం. ధరల పెరుగుదల వల్ల పాడి పరిశ్రమ కూడా అదనపు ఆదాయాన్ని పొందుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇది ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది తెలియాల్సి ఉంది. కర్ణాటక ప్రభుత్వం నియంత్రణలో నడిచే నందిని ఇప్పుడు పాల ధరను పెంచనుండడంతో మిగతా ప్రైవేట్ డెయిరీలు కూడా ఇదే బాట పట్టే అవకాశం కనిపిస్తోంది. నందిని రూ.3 పెంచితే ప్రైవేట్ కంపెనీలు కనీసం రూ.5 వరకు పెంచే అవకాశం ఉందని అక్కడి వర్గాలు తెలిపాయి. -
ముగిసిన ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల కౌన్సెలింగ్ శనివారం ముగిసిందని ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కె.సంధ్యారాణి తెలిపారు. మొత్తం 1,086 మందికి గాను 904 మంది విద్యార్థులు మొదటి విడతలో ప్రవేశాలు పొందారని పేర్కొన్నారు. మిగిలిన 182 సీట్లు రెండవ విడతలో పూర్తి చేయనున్నట్లు చెప్పారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈ నెల 24, 25వ తేదీల్లో ఇడుపులపాయలోని ఆర్కే వ్యాలీ క్యాంపస్‌లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ జరుగుతుందని తెలిపారు. ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ఆగస్ట్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. -
తిరుమల: రెండు నెలలకు 24న ప్రత్యేక దర్శన టికెట్ల కోటా విడుదల
తిరుమల: తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ఆగస్టు, సెప్టెంబర్ నెలల కోటాను ఈ నెల 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదనపు కోటా కింద నాలుగు వేల టికెట్లను విడుదల చేస్తుంది. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించి రోజుకు 15,000 టికెట్లు చొప్పున విడుదల చేయనుంది. కాగా, ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అక్టోబర్ నెలకు సంబంధించిన వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్ల కోటాను కూడా విడుదల చేస్తుంది. భక్తులు టీటీడీ వెబ్సైట్లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది. 26న తిరుమలలో పల్లవోత్సవం.. మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని టీటీడీ ఈ నెల 26న పల్లవోత్సవం నిర్వహించనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం(శనివారం) తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో భక్తులు క్యూలైన్ వెలుపల వేచి ఉన్నారు. ఈ క్రమంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇదే సమయంలో శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. ఇది కూడా చదవండి: ‘ఆగస్టులో మెగా డీఎస్సీ హర్షణీయం’ -
మిల్కీ బ్యూటీ... నువ్వే నా స్వీటీ
‘అచ్చ తెలుగు పచ్చి మిర్చి మగాడు వీడే.. బొంబాటు ఘాటు హాటు హాటుగున్నాడే.. కల్లోకి వచ్చేసి కన్నెగుండెల్లో సూది గుచ్చి పిల్లా నీ ముచ్చటేంది అన్నాడే...’ అంటూ రొమాంటిక్ మోడ్‌లోకి వెళ్లిపోయారు హీరోయిన్ తమన్నా. చిరంజీవి టైటిల్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటించగా, ఆయన చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘మిల్కీ బ్యూటీ.. నువ్వే నా స్వీటీ..’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటను విజయ్ ప్రకాష్, సంజన కల్మంజేతో కలసి ఈ చిత్ర సంగీతదర్శకుడు మహతి స్వర సాగర్ ఆలపించారు. -
ఆగస్టులో పేకమేడలు
వినోద్ కిషన్, అనూష క్రిష్ణ జంటగా నీలగిరి మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘పేకమేడలు’. క్రేజీ యాంట్స్పై రాకేష్ వర్రే నిర్మించిన ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఒక యూనిక్ స్టోరీలైన్‌తో పూర్తిస్థాయి ఎంటర్టైనర్గా రూపొందిన చిత్రం ‘పేకమేడలు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వరుణ్ బోర, ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్: కేతన్ కుమార్, లైన్ ప్రోడ్యూసర్: అనూష బోర, కెమెరా: హరిచరణ్ .కె, సంగీతం: స్మరణ్. -
ఆగస్టు ఫస్ట్.. తొమ్మిది మందికీ బర్త్‌డే ఫెస్ట్
ఎవరైనా ఇద్దరికి ఒకేరోజున బర్త్‌డే వస్తే.. భలే కదా అనిపిస్తుంది. అదే ముగ్గురు, నలుగురి పుట్టినరోజు ఒకే రోజున ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఒకే కుటుంబంలో అందరి బర్త్‌డే ఒకే రోజున అయితే.. అదీ ఒకరిద్దరు కాదు ఏకంగా తొమ్మిది మంది పుట్టినది ఒకే తేదీన అయితే.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం అవుతుంది. మరి అలాంటి ఓ ‘రికార్డు’ ఫ్యామిలీ గురించి తెలుసా? పుట్టినరోజు పెళ్లి చేసుకుని.. పాకిస్తాన్‌లోని లర్కానా ప్రాంతానికి చెందిన మంగి అమీర్ అలీ, ఆయన భార్య ఖుదీజా.. ఇద్దరి పుట్టిన రోజు ఆగస్టు ఒకటో తేదీనే. దీంతో వారు 1991లో ఆగస్టు ఒకటో తేదీనే పెళ్లి చేసుకున్నారు. సరిగ్గా ఏడాదికి ఆగస్టు ఒకటినే వారికి పాప పుట్టింది. తమ పుట్టినరోజునే పాప పుట్టడంపై అమీర్, ఖుదీజా ఆశ్చర్యపోయినా.. సంబురంగా ఆమెకు సింధు అని పేరుపెట్టుకున్నారు. కొన్నేళ్లకు సాసూ, సప్నా అనే కవల అమ్మాయిలు.. తర్వాత విడివిడిగా అమీర్, అంబర్ అనే ఇద్దరు అబ్బాయిలు.. ఆ తర్వాత అమర్, అహ్మర్ అనే కవల అబ్బాయిలు పుట్టారు. వీరంతా పుట్టినది ఆగస్టు ఒకటో తేదీనే కావడం విశేషం. అంతేకాదు.. ఏదో సిజేరియన్ ఆపరేషన్లతో ఇలా ఒకేరోజు పుట్టారనడానికీ లేదు. అంతా సహజ ప్రసవాలేనట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఈ కుటుంబం సర్టిఫికెట్లు, ప్రభుత్వ రికార్డులు అన్నీ పరిశీలించేసి.. వీరిని గిన్నిస్‌బుక్ లోకి ఎక్కించేశారు. ‘‘ఇలా ఒకే తేదీన అందరూ జన్మించడం మాకు భగవంతుడు ఇచ్చిన బహుమతి. ఏటా అందరం కలసి ఒకే కేక్ కట్ చేస్తాం. ఒకరికొకరు అందరం శుభాకాంక్షలు చెప్పుకొంటాం..’’ అని అమీర్ పేర్కొన్నాడు. ఇంతకుముందు అమెరికాలో.. ఒకే కుటుంబానికి చెందిన ఎక్కువ మంది బర్త్‌డే ఒకే రోజు ఉన్న రికార్డు ఇంతకుముందు అమెరికాకు చెందిన కమ్మిన్స్ కుటుంబం పేరిట నమోదైఉంది. 1952–66 మధ్య అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు కలిపి ఐదుగురు ఫిబ్రవరి 20వ తేదీనే పుట్టారు. ఇప్పటివరకు కూడా అదే రికార్డుగా నిలవగా.. అమీర్ అలీ కుటుంబం దాన్ని బద్దలు కొట్టింది. రెండు కవల జంటల రికార్డు కూడా.. అమీర్ కుటుంబంలో సాసూ–సప్నా కవలలు, అమర్–అహ్మర్ కవలలు అంతా ఒకే తేదీన జన్మిం చారు. ఇలా ఒకే తల్లికి ఒకే తేదీన రెండు సార్లు కవలలు పుట్టడం కూడా విశేషమే. ఇంతకుముందు ప్రపంచవ్యాప్తంగా నాలుగు సార్లు మాత్రమే ఇలాంటి జననాలు నమోదవడం గమనార్హం. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
మెగా ఫ్యాన్స్‌కు ఉగాది సర్ప్రైజ్.. భోళాశంకర్ రిలీజ్ అప్పుడే!
Bhola Shankar Movie Release Date: వాల్తేరు వీరయ్య సూపర్ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. మెహర్ రమేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తమిళ హిట్ మూవీ వేదాళంకి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తోంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఉగాది పర్వదినం సందర్భంగా మెగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. భోళాశంకర్ మూవీని ఆగస్టు 11, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ట్వీట్ చేశారు. తెలుగు నూతన ఏడాది సందర్భంగా మెగా అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. This Telugu NEW YEAR Begins in Advance with a MEGA upDATE 😎 Mega🌟@KChiruTweets #BholaaShankar 🔱 Releasing WorldWide In Theatres on AUG 11th 2023 ❤️🔥#HappyUgadi @MeherRamesh @AnilSunkara1 @tamannaahspeaks @KeerthyOfficial @iamSushanth @AKentsOfficial @adityamusic pic.twitter.com/ksqeqldaiA — AK Entertainments (@AKentsOfficial) March 21, 2023 -
‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ కోసం రజనీకాంత్ సినిమా వాయిదా?
వెండితెరపై ‘జైలర్’ రాక ఏప్రిల్ నుంచి ఆగస్టుకు మారిందా? అంటే అవునంటోంది కోలీవుడ్. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘జైలర్’. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోందనే వార్తలు వచ్చాయి. తాజాగా ఆగస్టులో రిలీజ్ చేయాలని భావిస్తున్నారని సమాచారం. మణిరత్నం దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2’ (ఏప్రిల్ 28 విడుదల) బాక్సాఫీస్ వసూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేలా ‘జైలర్’ టీమ్ స్నేహపూర్వకంగా ఏప్రిల్ రిలీజ్‌ను వాయిదా వేసుకుందని కోలీవుడ్ టాక్. అయితే ఈ విషయంపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది. -
ఆగస్ట్‌లో విమాన ప్రయాణికుల్లో వృద్ధి
న్యూఢిల్లీ: దేశీ విమాన ప్రయాణికుల రద్దీ ఆగస్ట్‌లో 5 శాతం పెరిగింది. 1.02 కోట్ల మంది విమాన సేవలను వినియోగించుకున్నట్టు రేటింగ్ ఏజెన్సీ ఇక్రా తెలిపింది. ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ రంగంపై ఒక నివేదికను గురువారం విడుదల చేసింది. జూలై నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 97 లక్షలతో పోలిస్తే 5 శాతం పెరిగినట్టు పేర్కొంది. ఇక 2021 ఆగస్ట్ నెల గణాంకాలతో పోల్చి చూస్తే 52 శాతం పెరిగినట్టు తెలిపింది. ఇక కరోనా ముందు సంవత్సరం 2019 ఆగస్ట్ నెల గణాంకాల కంటే 14 శాతం తక్కువే ఉన్నట్టు వివరించింది. విమాన సర్వీసులు పూర్తి సాధారణ స్థాయికి చేరుకోవడంతోపాటు, కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిపోయినందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రద్దీ వేగంగా పుంజుకోవచ్చని ఇక్రా అంచనా వేసింది. భారత ఎయిర్‌లైన్స్ సంస్థలకు సంబంధించి విదేశీ ప్రయాణికుల సంఖ్య ఆగస్ట్‌లో 19.8 లక్షలుగా ఉందని, కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది 32 శాతం అధికమని తెలిపింది. 2022 మొదటి ఐదు నెలల్లో దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య 5.24 కోట్లుగా ఉంటుందని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 131 శాతం అధికమని ఇక్రా పేర్కొంది. విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) ధరలు పెరిగిపోవడంతో ఎయిర్‌లైన్స్ ఆదాయం రికవరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిదానంగా ఉంటుందని అంచనా వేసింది. దీనికితోడు పరిశ్రమపై ద్రవ్యోల్బణ ప్రభావం సైతం ఉంటుందని పేర్కొంది. -
రత్నాలు, ఆభరణాల ఎగుమతుల్లో 6.7 శాతం వృద్ధి!
ముంబై: భారత్ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఆగస్టులో 2021 ఇదే నెలతో పోల్చి 6.7శాతం పెరిగాయి. విలువలో రూ.26,419 కోట్లుగా (3,316 మిలియన్ డాలర్లు) నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. ఆగస్టులో ఒక్క కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులు 0.84 శాతం తగ్గి రూ.14,956 (1,880 మిలియన్ డాలర్లు) కోట్లకు చేరాయి. ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య మాత్రం స్వల్పంగా 1.59 శాతం వృద్ధి నమోదయ్యింది. విలువలో ఇది రూ.78,697 కోట్లు (10,081 మిలియన్ డాలర్లు). చైనాలో కరోనా ప్రతికూల పరిస్థితులు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులు గడచిన రెండు నెలలుగా కట్ అండ్ పాలిష్డ్ డైమండ్స్ (సీపీడీ) ఎగుమతులపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. -
ఆగస్టులో ఎగుమతులు.. ‘ప్లస్సే’
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు ఆగస్టులో వృద్ధినే నమోదుచేసినట్లు వాణిజ్యమంత్రిత్వశాఖ బుధవారం వెలువరించిన సవరిత గణాంకాలు స్పష్టం చేశాయి. సమీక్షా నెల ఎగుమతుల్లో 1.62 శాతం వృద్ధి నమోదయిందని, విలువలో ఇది 33.92 డాలర్లని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇదిలాఉండగా, నెలవారీగా తొలి లెక్కలు క్షీణతలో ఉండడం, అటు తర్వాత అవి వృద్ధిబాటలోకి రావడం ఇది వరుసగా రెండవనెల. జూలైలో తొలి గణాంకాలు క్షీణత (–0.76) నుంచి 2 శాతం వృద్ధికి మారాయి. ఆగస్టు విషయంలో తొలి గణాంకాల క్షీణ అంచనా మైనస్ 1.15 శాతం. -
టోకు ద్రవ్యోల్బణం తగ్గినా, ‘తీవ్రమే’
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టులో 12.41 శాతంగా (2021 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. గడచిన 11 నెలలుగా ఇంత తక్కువ స్థాయి టోకు ధరల రేటు నమోదు ఇదే తొలిసారి. గడచిన మూడు నెలలుగా టోకు ధరల స్పీడ్ తగ్గుతూ వస్తోంది. అయితే ఈ సూచీ రెండంకెలపైనే కొనసాగడం ఇది వరుసగా 17వ నెల. దీనితోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు వరకూ వరుసగా ఎనిమిది నెలల నుంచి కేంద్రం నిర్ధేశిస్తున్న 6 శాతం ఎగువన కొనసాగుతోంది. ఆయా అంశాలు సామాన్యునిపై ధరల భారాన్ని మోపుతున్నాయి. గణాంకాల్లో కొన్ని కీలక విభాగాలను పరిశీలిస్తే.. ♦ ఫుడ్ ఆర్టికల్స్ ద్రవ్యోల్బణం 12.37 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 10.77 శాతమే. తృణధాన్యాలు (1.77శాతం), గోధుమలు (17.35 శాతం) పండ్లు (31.75 శాతం), కూరగాయల (22.92 శాతం) ధరలు పెరుగుదల బాటన ఉన్నాయి. ♦ టమాటా విషయంలో ధర 43.56 శాతం ఎగసింది. ♦ ఇంధనం, విద్యుత్ బాస్కెట్లో ద్రవ్యోల్బణం 33.67 శాతంగా ఉంది. అయితే జూలైలో ఈ స్పీడ్ 43.75 శాతం. ♦ తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 7.51% ఉంది. ♦ ఆయిల్‌సీడ్స్ విషయంలో రేటు 13.48% తగ్గింది. -
జోరుగా పరుగెడుతున్న వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా అన్ని రకాల వాహనాల రిటైల్ అమ్మకాలు ఆగస్ట్‌లో 15,21,490 యూనిట్లు నమోదైంది. 2021 ఆగస్ట్‌తో పోలిస్తే ఇది 8.31 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్ఏడీఏ) తెలిపింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 6.51 శాతం వృద్ధితో 2,74,448 యూనిట్లకు చేరుకుంది. ద్విచక్ర వాహనాలు 8.52 శాతం దూసుకెళ్లి 10,74,266 యూనిట్లు, త్రిచక్ర వాహనాలు 83.14 శాతం ఎగసి 56,313 యూనిట్లు, వాణిజ్య వాహనాలు 24.12 శాతం పెరిగి 67,158 యూనిట్లుగా ఉంది. 2019 ఆగస్ట్‌తో పోలిస్తే మొత్తం వాహన విక్రయాలు గత నెలలో 7 శాతం తగ్గాయి. ప్యాసింజర్ వెహికిల్స్ 41 శాతం, వాణిజ్య వాహనాలు 6 శాతం అధికం అయ్యాయి. ద్విచక్ర వాహనాలు 16 శాతం, త్రిచక్ర వాహనాలు 1 శాతం, ట్రాక్టర్స్ అమ్మకాలు 7 శాతం తక్కువగా నమోదయ్యాయి. ఇప్పటికీ టూ వీలర్ దూరమే.. : ధరలు పెరిగిన కారణంగా ప్రారంభ స్థాయి కస్టమర్లకు ఇప్పటికీ టూ వీలర్ దూరమేనని ఫెడరేషన్ ప్రెసిడెంట్ మనీష్ రాజ్ సింఘానియా వెల్లడించారు. ‘అస్థిర రుతుపవనాల కారణంగా పంట దిగుబడి తక్కువగా ఉంది. వరదల వంటి పరిస్థితి కొనుగోళ్ల నుంచి వినియోగదారులను పరిమితం చేసింది. ఇక ప్యాసింజర్ వెహికిల్స్‌లో ఎంట్రీ లెవెల్ మినహా ఇతర విభాగాలన్నీ బలమైన పనితీరు కనబరిచాయి. కొన్ని నెలలుగా ఫీచర్లతో కూడిన మోడల్స్ రాక ఇందుకు కారణం. సెమికండక్టర్ల లభ్యత క్రమంగా మెరుగవుతోంది. వాహనాల లభ్యత పెరిగింది. అయితే అధిక ఫీచర్లు కలిగిన మోడళ్లకు ఎక్కువ డిమాండ్ ఉండడంతో వేచి ఉండే కాలం పెరిగింది. ఈ దశాబ్దంలో అత్యధికంగా ఈ పండుగల సీజన్లో ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాలు ఉంటాయి. ధరలు స్థిరంగా ఉండి, ఆరోగ్యపరంగా ముప్పు లేకపోతే ద్విచక్ర వాహనాల జోరు ఉంటుంది’ అని అన్నారు. -
ఆగస్టు 31ని పండగలా జరుపుకుంటున్న తాలిబన్లు... అంబరాన్నంటిన సంబరాలు
కాబూల్: తాలిబన్లు అఫ్గనిస్తాన్ తమ నియంత్రణలోకి తెచ్చుకుని కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తాలబన్లు తమ ఇష్టా రాజ్యంగా రకరకాల నిబంధనలు, ఆదేశాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ వచ్చింది. ఇప్పుడు తాజగా తాలిబన్లు ఆగస్టు 31 బాణా సంచా కాలుస్తు పెద్దగా సంబరాలు చేసుకుంటున్నారు. వాస్తవానికి ఆగస్టు 31 అనేది యూఎస్ నేతృత్వంలోని దళాలను ఉపసంహరించుకున రోజు. ఈ సందర్భంగా తాలిబన్లు తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. యూఎస్ బలగాలు అఫ్గనిస్తాన్ పై గత 20 ఏళ్లుగా దారుణమైన యుద్ధం సాగించింది. దీంతో అఫ్గాన్ నిరంతరం యుద్ధం భయంతో మునిగిపోయింది. అంతేకాదు ఈ యుద్ధంలో వేలాది మంది అఫ్గాన్ వాసులు చనిపోవడం, లక్షలాది మంది గాయాలపాలవ్వడం వంటి విధ్వంసాన్ని చవిచూసింది అఫ్గాన్. ఈ విధ్యంసకర దాడికి ముగింపు పలకి ఆగస్టు 31న యూఎస్ తన బలగాలను అప్గనిస్తాన్ నుంచి వెనుక్కు రప్పించింది. అందువల్ల తాలిబన్లు ఈ రోజును స్వాతంత్య్ర దినోత్సవంగా పేర్కొంటూ ఘనంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నట్లు తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా తెలిపారు. ఈ వార్షికోత్సవంను తాము వివిధ రంగుల బానసంచా కాల్పులతోనూ, వైమానిక కాల్పులతో అట్టహాసంగా జరుపుకుంటామని చెప్పారు. అంతేకాదు తాలిబన్లు అఫ్గనిస్తాన్‌లో అధికారంలోకి వచ్చిన రోజైన ఆగస్టు 15 జాతీయ సెలవుదినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. (చదవండి: అఫ్గాన్ పైలెట్లకు శిక్షణ ఇస్తున్న యూఎస్...ఐ డోంట్ కేర్ అంటున్న రష్యా) -
దేశంలో తగ్గిన పెట్రోల్, డీజిల్ డిమాండ్
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో నెలవారీగా మందగమన ధోరణి కనబడుతోంది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం, ఆగస్టు (జూలైతో పోల్చితే) మొదటి 15 రోజుల కాలంలో డీజిల్ డిమాండ్ తగ్గింది. పెట్రోల్ డిమాండ్ దాదాపు అక్కడక్కడే ఉంది. జూన్‌తో పోల్చితే జూలైలో అటు పెట్రోల్ ఇటు డీజిల్ డిమాండ్ రెండూ తగ్గిన సంగతి తెలిసిందే. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల వినియోగం భారీగా తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రుతుపవనాల ప్రారంభకాలం, ఎడతెరిపిలేని వర్షాలు, వరదల ఎఫెక్ట్ దీనికి కారణమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కాలంలో రవాణా, ట్రావెల్ రంగాలు సహజంగా నెమ్మదిస్తాయి. తీవ్ర వర్షాలు వ్యవసాయ రంగం కార్యకలాపాలకు సైతం అడ్డంకిగా నిలుస్తుంది. ఇందుకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► జూలై 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ డీజిల్ డిమాండ్ 3.17 మిలియన్ టన్నులు. అయితే ఆగస్టు ఇదే కాలంలో డిమాండ్ 11.2 శాతం పడిపోయి 2.82 మిలియన్ టన్నులుగా నమోదయ్యింది. ► ఇక జూలై మొదటి 15 రోజుల్లో పెట్రోల్ అమ్మకాలు 1.28 మిలియన్ టన్నులు. ఆగస్టు ఇదే రోజుల్లో ఈ పరిమాణం దాదాపు అక్కడక్కడే 1.29 మిలియన్ టన్నులుగా ఉంది. ► జూన్‌తో పోల్చితే జూలై నెలలో డీజిల్ వినియోగం 13.1 శాతం తగ్గి 6.44 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో డీజిల్ విక్రయాలు 7.39 మిలియన్ టన్నులు. ఇక పెట్రోల్ వినియోగం జూలైలో 5 శాతం తగ్గి 2.66 మిలియన్ టన్నులుగా ఉంది. జూన్‌లో పెట్రోల్ వినియోగం 2.8 మిలియన్ టన్నులు. ► వార్షికంగా చూస్తే పెట్రోల్, డీజిల్ డిమాండ్‌లో గణనీయమైన వృద్ధిరేటు నమోదవుతోంది. -
మిషన్ ఎలక్ట్రిక్ 2022: మెగా ఈవెంట్లో ఓలా ఏం చేయబోతోంది?
సాక్షి, ముంబై: ఓలా ఎలక్ట్రిక్ ఏడాది కూడా సంచలనానికి తెరతీయనుందా? ఆగస్టు 15న మిషన్ ఎలక్ట్రిక్ 2022 పేరుతో తన ఉత్పత్తులను పరిచయం చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా ప్రచారాన్ని హోరెత్తించిన నేపథ్యంలో ఓలా కొత్త ఎలక్ట్రిక్ కారు, ఎలక్ట్రిక్ స్కూటర్ , ఈవీ బ్యాటరీని లాంచ్ చేయనుందనే అంచనాలు ఊపందుకున్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది. ఓలాకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తన తొలి ఎలక్ట్రిక్ కారును ఆగస్టు 15, 2022న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేయనుంది. ఈ మేరకు ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ తన వీల్స్ ఆఫ్ ద రెవల్యూషన్ అంటూ సోషల్ మీడియా హ్యాండిల్లో ఎలక్ట్రిక్ కారు చిన్న వీడియోను షేర్ చేశారు. ఎలక్ట్రిక్ కారును ప్రకటిస్తూ అగర్వాల్ ట్విటర్లో ఒక వీడియోను పంచుకున్నారు. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్. 15 ఆగస్ట్ 2గంటలకు కలుద్దాం" అంటూ ట్వీట్ చేశారు. భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరో రెండు కొత్త ఉత్పత్తులను కూడా పరిచయం చేయనుంది. ఫ్లాగ్షిప్ S1 ప్రోతో పోలిస్తే మరింత సరసమైన ధరలో ఎలక్ట్రిక్ స్కూటర్ కావచ్చని భావిస్తున్నారు.గత ఏడాది ఇదే రోజున ఓలా తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. S1, S1 ప్రో వేరియంట్లను పరిచయం చేసింది. అయితే ప్రస్తుతం S1 అమ్మకాలను నిలిపివేసి , S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మాత్రమే విక్రయిస్తున్న సంగతి గమనార్హం Wheels of the revolution! pic.twitter.com/8zQV3ezj6o — Bhavish Aggarwal (@bhash) August 13, 2022 -
నందమూరి ఫ్యామిలీకి కలిసిరాని ఆగస్టు, విషాదాలన్నీ ఈ నెలలోనే..
దివంగత నటుడు, మాజీ సీఎం ఎన్టీఆర్ చిన్న కూతురు(నాలుగో కుమార్తె) కంఠమనేని ఉమామహేశ్వరి(57) మృతితో నందమూరి ఇంట విషాదం నెలకొంంది. సోమవారం(ఆగస్ట్ 1న) ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి విధితమే. దీంతో ఆమెను కడసారి చూసేందుకు నందమూరి హీరోలు, బంధువులు జుబ్లీహిల్స్‌లోని ఆమె ఇంటికి వస్తున్నారు. రేపు మహా ప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నందమూరి కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. చదవండి: అప్పుడే ఓటీటీకి ‘థ్యాంక్యూ’?, స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే! గత కొంతకాలంగా నందమూరి ఇంట వరుస విషాదాలు చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. 2019 హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం ఇప్పుడు తాజాగా ఉమామహేశ్వరి బలవన్మరానినకి పాల్పడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ ఆగష్టు నెల నందమూరి ఇంటికి కలిసి రావడం లేదని, విషాదలన్ని ఈ నెలలో చోటుచేసుకుంటున్నాయంటూ చర్చించుకుంటున్నారు. కాగా హరికృష్ణ ఓ పెళ్లికి వెళుతూ నెల్లూరు సమీపంలో ఆగష్టు 29, 2019లో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారు. చదవండి: ‘కార్తీకేయ 2’ ప్రమోషన్స్‌కి అనుపమ డుమ్మా.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్! ఇప్పుడు ఆగష్టు నెలలోనే ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అంతేకాదు రాజకీయ పరంగానే ఎన్టీఆర్‌కు ఈ ఆగస్ట్ నెల కలిసిరాలేదంటున్నారు. రాజకీయ పరంగా నాదేండ్ల భాస్కర్ మోసం, ఆయన అల్లుడు నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు ఈ ఆగస్ట్ నెలలో చోటుచేసుకోవడం గమనార్హం. అయితే 2014 డిసెంబర్ 6న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకి రామ్ రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇలా వరుస విషాదాలు నందమూరి ఇంట చోటుచేసుకోవడంతో అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
ఆగస్ట్‌లో విడుదలయ్యే అదిరిపోయే స్మార్ట్ఫోన్లు ఇవే!
ఫెస్టివల్ సీజన్లో స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. పండుగ సీజన్ ప్రారంభం కావడంతో దేశీయంగా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు ఫోన్లను విడుదల చేస్తుంటాయి. అయితే ఎప్పటిలాగే ఆగస్ట్ నెలలో కొత్త స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో విడుదల కానున్నాయి. అవేంటో ఇప్పుడే చూసేద్దాం వన్ ప్లస్ 10టీ స్నాప్ డ్రాగన్ 8ప్లస్ జనరేషన్ 1 చిప్సెట్తో ఫ్లాగ్ షిప్ ఫోన్‌ను విడుదల అవ్వనుంది. ఆగస్ట్ 3న కొనుగోలు దారులకు పరిచయం కానుంది. మరో ఫ్లాగ్ షిప్ ఫోన్ ఐక్యూ9టీ సైతం ఆగస్ట్ 2న విడుదల కానుండగా..ఆ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8ప్లస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. రియల్ మీ జీటీ నియో 3టీ స్నాప్‌డ్రాగన్ 870 చిప్సెట్తో ఆగస్ట్ 15 తరువాత విడుదల కానుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 సైతం ఆగస్ట్ 4న విడుదల కానుండగా.. ఈ ఫోన్ శాంసంగ్ విడుదల చేసే లేటెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ ఇదేనని తెలుస్తోంది. మరో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ 12లైట్ ఇదే నెలలో విడుదల కానుంది. 200ఎంపీ ప్రైమరీ కెమెరా మోటరోలా ఎడ్జ్ ఎక్స్ 30 ప్రో ఆగస్ట్ 15 తర్వాత విడుదల కానుంది. పోకో ఎం5 బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఆగస్ట్ 15తర్వాత విడుదల కానుంది. వివో వీ25ఫోన్ సైతం ఇదే నెలలో విడుదల కానుంది. -
ఆగస్టులో పుట్టినరోజు జరుపుకుంటున్న సెలబ్రిటీలు వీరే!
సినిమా వస్తోందంటే చాలు సగటు సినీప్రేక్షకుడు పండగ చేసుకుంటాడు.. అందులోనూ అభిమాన హీరో మూవీ అంటే రిలీజ్ డేట్ ప్రకటించిన నాటి నుంచే వేయికళ్లతో ఎదురుచూస్తాడు. తీరా సినిమా రిలీజయ్యాక పాలాభిషేకాలు, నోట్లదండలు, కొబ్బరికాయ కొట్టడాలు.. ఇలా ఊరువాడా దద్దరిల్లేలా వేడుక చేస్తారు. ఇక హీరో బర్త్‌డే అంటే ఏ రేంజ్లో ఉంటుందో చెప్పక్కర్లేదు. అన్నదానాలు, నిత్యావసరాల పంపిణీ, రక్తదానం.. ఇలా ఓ వైపు మంచిపనులు చేస్తూనే మరోవైపు కేక్‌కటింగ్‌లు, ర్యాలీలు, హీరో ఫొటోలున్న డ్రెస్సులు, సోషల్ మీడియాలో పోస్టులు.. అబ్బో.. ఇలా చాలానే ఉంటాయి. మరి ఈ ఆగస్టులో ఏయే సెలబ్రిటీలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో తెలియాలంటే కింద లిస్టు చదివేయండి.. ఆగస్టు 1 తాప్సీ హీరో హరీష్ ఆగస్టు 2 దేవిశ్రీప్రసాద్ నిర్మాత రాఘవేంద్రరావు సోదరుడు కృష్ణమోహన్‌రావు జయంతి బళ్లారి రాఘవ జయంతి ఆగస్టు 3 షామిలీ వాణిశ్రీ ఆగస్టు 4 అర్బాజ్ ఖాన్ మాళవిక మోహనన్ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు ఆగస్టు 5 విజయ చక్రపాణి జయంతి జెనీలియా డిసౌజా కాజోల్ దేవ్‌గణ్ అనన్య నాగళ్ల ఆగస్టు 6 ధన్య బాలకృష్ణ ఆగస్టు 7 సచిన్ జోషి కాలభైరవ ఆగస్టు 8 ఫహద్ ఫాజిల్ ఆగస్టు 9 మహేశ్‌బాబు హన్సిక ఆగస్టు 12 సాయేషా సైగల్ ఆగస్టు 13 అతిలోక సుందరి శ్రీదేవి జయంతి ఆగస్టు 15 శ్రీహరి జయంతి అర్జున్ సుహాసిని మణిరత్నం ఆగస్టు 16 మనీషా కొయిరాల ఆగస్టు 17 నిధి అగర్వాల్ డైరెక్టర్ శంకర్ ఆగస్టు 21 రాధికా శరత్ కుమార్ భూమిక ఆగస్టు 22 చిరంజీవి ఆగస్టు 25 విజయకాంత్ ఆగస్టు 28 సుమన్ ఆగస్టు 29 నాగార్జున విశాల్ ఆగస్టు 31 మహేశ్‌బాబు తనయుడు గౌతమ్ కృష్ణ -
ఆగస్ట్ ఒకటి నుంచి మారనున్న కొత్త రూల్స్..! ఇవే..!
ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చిదంటే చాలు సామాన్యుడి జీవితంపై ప్రభావం చూపేలా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటాయి. దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. ఆగస్ట్ 1 నుంచి మారబోయే అంశాలేంటో తెలుసుకుందాం. బ్యాంక్ ఆఫ్ బరోడా : ఆగస్ట్ 1నుంచి ఆర్బీఐ సూచనల మేరకు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ చెక్కుల కోసం 'పాజిటివ్ పే సిస్టమ్'ని అమలు చేస్తుంది. తద్వారా చెక్కు ఇచ్చి డబ్బులు తీసుకున్న ఖాతాదారుడి వివరాలు, సంబంధిత వ్యక్తికి చెక్కు ఇచ్చిన సంస్థ లేదంటే వ్యక్తుల వివరాల్ని ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ కేవైసీ : రైతుల సౌలభ్యం కోసం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పీఎంకేఎస్‌ఎన్‌వై) కోసం ఈ-కేవైసీ గడువు మే 31 నుండి జూలై 31 వరకు పొడిగించింది. రేపటి నుండి కేవైసీ అప్డేట్ చేసుకునే సౌకర్యం లేదు. పీఎంఎఫ్‌బీవై రిజిస్ట్రేషన్: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (పీఎంఎఫ్‌బీవై)కి సంబంధించిన రిజిస్ట్రేషన్లు జులై 31తో ముగుస్తాయి. రిజిస్ట్రేషన్లను కోల్పోయిన వారు ఈ స్కీంలో లబ్ధి పొందలేరు. కాగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫ్లైన్లోనైనా చేసుకోనే సదుపాయం కేంద్రం కల్పించింది. ఎల్పీజీ గ్యాస్ రేట్లు: ప్రతి నెల మొదటి తేదీన, లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) ధరలు సవరించబడతాయి. ఏప్రిల్ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గగా, డొమెస్టిక్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఐటీఆర్ రిటర్న్ ఫైలింగ్: 2021-22 ఆర్థిక సంవత్సరం, 2022-23 విద్యా సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను సమర్పించడానికి జూలై 31 చివరి తేదీ. గడువు తేదీని ప్రభుత్వం పొడిగిస్తే తప్ప, ఐటీఆర్‌లను ఆలస్యంగా దాఖలు చేసినందుకు ఆగస్టు 1 నుంచి జరిమానా, ఆలస్య రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. -
ఆ మూడు రోజులు మద్యం బంద్: ఎందుకు? ఎక్కడ?
పనాజీ: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గోవా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు నెలలో మూడు రోజుల పాటు మద్యం అమ్మకాలపై నిషేధం విధించింది. ఆగస్టులో గోవా పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 9, 10, 12 తేదీలను డ్రై డేలుగా పాటిస్తామని ఆర్థిక కార్యదర్శి ప్రణబ్ భట్ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. గోవాలోని 186 పంచాయతీ సంస్థలకు ఆగస్టు 10న ఎన్నికలు జరగనున్నాయి. 12వ తేదీన లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9,10,12 తేదీల్లో 'డ్రై డే' అమల్లోకి వస్తుందని సర్కార్ ప్రకటించింది. ఆగస్టు 9,10, 12 తేదీల్లో మద్యం అమ్మకాలను నిలిపి వేయాలని మద్యం దుకాణదారులకు ఆదేశించారు. లైసెన్సు పొందిన బార్ అండ్ రెస్టారెంట్లలో కూడా మద్యం అమ్మకాలు నిషేధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం ఆహారాన్ని అందించడానికి మాత్రమే ఆయా దుకాణాలను తెరవాలని చెప్పింది. ఈ విషయాన్ని తెలిపేలా ఒక బోర్డును కూడా ప్రదర్శించాలని నోటిఫికేషన్ పేర్కొంది. చదవండి : ట్విటర్ డీల్ వివాదం: మస్క్ మరో కీలక నిర్ణయం విలీనమా.. నో వే! కావాలంటే వారు వెళ్లిపోవచ్చు! -
ట్విన్ టవర్ల కూల్చివేతకు రంగం సిద్ధం: భారీ తరలింపులు, హై టెన్షన్!
న్యూఢిల్లీ:నోయిడా వివాదాస్పద, అక్రమ జంట టవర్ల కూల్చివేతకు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 21 న నోయిడాలోని సెక్టార్ 93Aలో సూపర్‌టెక్ జంట టవర్లు అపెక్స్ (32 ఫోర్లు), సెయానే (31 ఫోర్ల)కూల్చివేతకు రంగం సిద్దమైంది. టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలతో దాదాపు 100 మీటర్ల ఎత్తైన ఈ టవర్లను ఎడిఫైస్ ఇంజినీరింగ్ ఆధ్వర్యంలో నేలమట్టం చేయనున్నారు. ఎంపిక చేసిన నిపుణుల సమక్షంలో ఆగస్ట్ 2 నుండి ఆగస్టు 20 వరకు ఈ జంట టవర్లను పేలుడు పదార్థాలతో నింపుతారు. అనంతరం ఆగస్టు 21 మధ్యాహ్నం 2.30 గంటలకు క్షణాల్లో వీటిని పూర్తిగా కూల్చివేయ నున్నారు. నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు జరిగాయని గత ఆగస్టులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అనంతరం ఈ పరిణామం జరగనుంది. అలాగే సుప్రీం ఆదేశాల మేరకు గృహాలను కొనుగోలు చేసి మోసపోయిన వారికి సంబంధిత నగదును వెనక్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ఫ్లాట్లలో నివసిస్తున్న వారిని తరలించేందుకు అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. నోయిడాలో సూపర్‌టెక్ అక్రమ జంట టవర్లలో 1,396 ఫ్లాట్లలో నివసిస్తున్న దాదాపు 5 వేలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. దీంతో చుట్టుపక్కల నివసిస్తున్నవారిలో ఆందోళన నెలకొంది. అంతకుముంద జూలై 27నాటి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, పోలీస్ ఆర్డబ్ల్యుఎలతో నోయిడా అథారిటీ, పోలీసులు, ఇతర అధికారుల సమావేశంలో తరలింపు ప్రణాళిక, భద్రతా వివరాలను చర్చించారు. ఈ మేరకు ఆగస్టు 14న కూల్చివేతకు సంబంధించిన పూర్తిస్థాయి డ్రెస్ రిహార్సల్ నిర్వహించనున్నట్లు నోయిడా అధికారులు తెలిపారు. ఈ ప్రాంగణంలో రెడ్ జోన్‌గా ప్రకటించారు. అంతేకాదు నో-ఫ్లై జోన్‌గా ప్రకటించాలని కేంద్రం అనుమతి కోరనున్నారు. నోయిడా-గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు నిలిపి వేస్తామన్నారు. దశలవారీగా ఎక్స్‌ప్లోజివ్స్ ద్వారా వీటిని కూల్చివేయనున్నారు. ఈ పేలుడుకు మూడు గంటల ముందు, రెండు గంటల తర్వాత ఐదు గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని నోయిడా అథారిటీ సీనియర్ అధికారి తెలిపారు. దీంతో ట్విన్ టవర్లకు ఆనుకుని ఉన్న ఎమరాల్డ్ కోర్ట్ ఏటీఎస్ విలేజ్ సొసైటీ నివాసితులపై కూడా ఈ కూల్చివేత తీవ్ర ప్రభావాన్ని చూపనుంది. -
PMGKY: బాధ్యతగా ఆహార భద్రత
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎన్టీఆర్ జిల్లాలో నిరుపేదలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (పీఎంజీకేవై) కింద ఆగస్టు ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) 3,06,878 మంది కార్డు దారులకు రేషన్ దుకాణాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు బియ్యాన్ని అందించనున్నారు. ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేషన్ షాపులలో ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. కార్డులోని ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున నాన్ సార్టెక్స్ బియ్యం ఇస్తారు. ఎన్ఎఫ్ఎస్ఏ లబి్ధదారులకు వలంటీర్ల ద్వారా పంపిణీకి సంబంధించిన కూపన్లు రెండు రోజుల ముందే వారి ఇంటి వద్దనే అందజేసే విధంగా ఏర్పాటు చేశారు. కూపన్లు తీసుకొన్న లబి్ధదారులు వారు కూపన్లలో చూపిన దుకాణానికి వెళ్లి ఉచిత బియ్యం తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. యథావిధిగా రాష్ట్రం బియ్యం.. ప్రతి నెలా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా పంపిణీ చేస్తున్న సార్టెక్స్ బియ్యాన్ని యథావిధిగా ఉమ్మడి జిల్లాలోని కార్డుదారులకు 710 ఎండీయూ వాహనాల ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ పంపిణీ ఆగస్టు 1వ తేదీ నుంచి ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాగనుంది. కార్డుదారుని ఇంటి వద్దకే వెళ్లి ఈ బియ్యాన్ని పంపిణీ చేయనున్నారు. గ్యాస్ సిలెండర్ల విక్రయాలకు.. ఎన్టీఆర్ జిల్లాలో రేషన్ షాపుల్లో 5కేజీల గ్యాస్ సిలెండర్లను అందుబాటులోకి ఉంచే దిశగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జాయింట్ కల్టెకర్ నుపూర్ అజయ్ కుమార్ గ్యాస్ కంపెనీలు, రేషన్‌షాపు డీలర్లతో సమావేశం ఏర్పాటు చేసి అవగాహన కలి్పంచారు. ఈ మేరకు వారితో ఎంఓయూ చేసుకున్నారు. ఒక్కో రేషన్ షాపులో 20 సిలెండర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటారు. 5 కేజీల గ్యాస్ సిలెండర్ రిజి్రస్టేషన్ చార్జీ రూ. 1,803గా నిర్ణయించారు. ఇందులో రూ.640విలువైన గ్యాస్ ఉంటుంది. గ్యాస్ అయి పోయిన వెంటనే, రేషన్‌షాపు వద్దకు వెళ్లి ఖాళీ సిలెండర్, ఇచ్చి నిండు సిలెండర్ తీసుకోవచ్చు. బియ్యం పంపిణీకి ఏర్పాట్లు.. జిల్లాలో జాతీయ ఆహార భద్రతా చట్టం కింద గుర్తించిన కార్డులకు, ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నాం. రేషన్ షాపుల ద్వారా ఈ బియ్యాన్ని పంపిణీ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతినెలా చేస్తున్న బియ్యం పంపిణీ యథావిధిగా కొనసాగుతుంది. కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటికే వెళ్లి అందిస్తాం. త్వరలో రేషన్ షాపుల్లో 5కేజీల సిలెండర్లు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకొంటున్నాం. – శ్రీవాస్ నుపూర్, జేసీ, ఎన్టీఆర్ జిల్లా -
2022 ఆల్టో: ఎక్సైటింగ్ సర్ప్రైజ్ అంటున్న మారుతి
సాక్షి, ముంబై: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకి ఇండియా 'గెట్ రెడీ ఫర్ ఏ ఎక్సైటింగ్ సర్ప్రైజ్' అంటూ కస్టమర్లను ఊరిస్తోంది. ఆగస్ట్ 18 నుండి 22, 2022 వరకు క్యాలెండర్‌ను బ్లాక్ చేసుకోమంటూ శుక్రవారం సోషల్ మీడియాద్వారా కోరింది. దీంతో మారుతి థర్డ్ జనరేషన్ కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కారు కొత్త 2022 ఆల్టోను ఆవిష్కరించే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తాయి. ఇండియలో అత్యంత ప్రజాదరణ పొందిన కారుగా ఖ్యాతి దక్కించుకున్న ఆల్టోను కొత్త డిజైన్, అప్డేటెడ్ ఫీచర్లతో సరికొత్తగా లాంచ్ చేయనుంది. కొత్త తరం ఆల్టోకి సంబంధించిన కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీ కొత్త ఆల్టో కోసం తుది లాంచ్ తేదీని నిర్ధారించలేదని అధికారికంగా ప్రకటించకపోయినా,ఆగస్ట్ 18 -22 మధ్య లాంచ్ అవుతుందని ఖచ్చితంగా తెలుస్తోంది. కొత్త తరం ఆల్టో కి సంబంధించిన కొన్ని ఫోటోలు అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తున్న కొత్త 998cసీసీ ఆల్టో K10 ఇంజన్ అమర్చిందట. ఇది 66 bhp శక్తిని, 89Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే 2022 ఆల్టో యొక్క ప్రారంభ ధర రూ. 3.5 లక్షల (ఎక్స్-షోరూమ్) గా ఉంటుందని అంచనా ఇక మార్కెట్లో పోటీ విషయానికి వస్తే. రెనాల్ట్ క్విడ్, టాటా టియాగో , డాట్సన్ రెడి-గో వంటి వాటికి గట్టిపోటీ ఇస్తుందని అంచనా. ఇది కూడా చదవండి : మహీంద్రాకు ఏమైంది? రెండోసారి ఆ కార్ల రీకాల్ ఐఫోన్ 11, ఐఫోన్ 12పై భారీ తగ్గింపు -
జియోకు కొత్తగా 6.49 లక్షల మంది కస్టమర్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం సంస్థ రిలయన్స్ జియో ఆగస్ట్ నెలలో కొత్తగా 6.49 లక్షల మంది వైర్లెస్ వినియోగదార్లను సొంతం చేసుకుంది. సంస్థ మొత్తం కస్టమర్ల సంఖ్య 44.38 కోట్లకు చేరుకుంది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) గణాంకాల ప్రకారం.. భారతి ఎయిర్టెల్ 1.38 లక్షల మంది వినియోగదార్లను దక్కించుకుంది. దీంతో మొత్తం కస్టమర్ల సంఖ్య 35.41 కోట్లుగా ఉంది. వొడాఫోన్ ఐడియా 8.33 లక్షల మందిని చేజార్చుకుంది. మొత్తం వినియోగదార్ల సంఖ్య 27.1 కోట్లకు వచ్చి చేరింది. -
Dgca :67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టి వచ్చారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆగస్ట్‌లో దేశవ్యాప్తంగా 67 లక్షల మంది వివిధ నగరాలను విమానాల్లో చుట్టివచ్చారు. జూలైతో పోలిస్తే ఈ సంఖ్య 33.8 శాతం అధికం. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ప్రకారం.. ఏప్రిల్‌లో 57.25 లక్షలు, మే నెలలో 21.15, జూన్‌లో 31.13, జూలైలో 50 లక్షల మంది ప్రయాణం చేశారు. గణాంకాలనుబట్టి మే నెలలో కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. గత నెలలో ఇండిగో 38.16 లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించి 57 శాతం వాటాను దక్కించుకుంది. స్పైస్‌జెట్ 5.84 లక్షల మంది ప్రయాణికులతో 8.7 శాతం వాటా పొందింది. ఎయిర్ ఇండియా 8.86 లక్షలు, గో ఫస్ట్ 4.58, విస్తారా 5.58, ఎయిర్ ఏషియా 3.49 లక్షల మంది రాకపోకలు సాగించారు. ఆరు ప్రధాన విమానయాన సంస్థల ఆక్యుపెన్సీ రేట్ 60.3–79.6 శాతం మధ్య నమోదైంది. స్పైస్‌జెట్ అత్యధికంగా 79.6 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. చదవండి: భయపెట్టే బోయింగ్‌కి మళ్లీ అనుమతులు! ప్రజలేమంటున్నారు? -
ఆగస్ట్‌లో డీల్స్ జూమ్
ముంబై: గత నెల(ఆగస్ట్)లో దేశీ కార్పొరేట్ ప్రపంచంలో డీల్స్ భారీగా ఎగశాయి. మొత్తం 219 డీల్స్ జరిగాయి. 2005 తదుపరి ఇవి అత్యధికంకాగా.. 2020 ఆగస్ట్‌తో పోల్చినా రెట్టింపయ్యాయి. వీటి విలువ 8.4 బిలియన్ డాలర్లు. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్ థార్న్టన్ అందించిన వివరాలివి. అయితే ఈ(2021) జులైతో పోలిస్తే లావాదేవీలు పరిమాణంలో 21 శాతం ఎగసినప్పటికీ విలువలో 36 శాతం క్షీణించాయి. ఇందుకు విలీనాలు, కొనుగోళ్ల(ఎంఅండ్ఏ) విభాగంలో యాక్టివిటీ ఆరు రెట్లు పడిపోవడం కారణమైంది. ఆగస్ట్‌లో ప్రధానంగా ప్రయివేట్ ఈక్విటీ, వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ ద్వారానే అత్యధిక డీల్స్ నమోదయ్యాయి. 182 లావాదేవీల ద్వారా 7.6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేశాయి. దేశీ కంపెనీలు, యూనికార్న్(స్టార్టప్‌లు) ఇందుకు వేదికయ్యాయి. లాభదాయక అవకాశాలు, ఆర్థిక రికవరీపై విశ్వాసం, పరిశ్రమల స్థాపనలో నైపుణ్యం వంటి అంశాలు ప్రభావం చూపాయి. యూనికార్న్‌ల స్పీడ్ పారిశ్రామిక పురోగతి, బలపడుతున్న డిమాండ్, ఆర్థిక రికవరీ నేపథ్యంలో ఇకపై సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశమున్నట్లు గ్రాంట్ థార్న్టన్ నిపుణులు శాంతి విజేత పేర్కొన్నారు. వ్యాక్సినేషన్లు, విధానాల మద్దతు, ప్రపంచ దేశాల పురోభివృద్ధి ఇందుకు మద్దతుగా నిలవనున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎంఅండ్ఏ విభాగంలో 86.7 కోట్ల డాలర్ల విలువైన 37 డీల్స్ జరిగాయి. 2020 ఆగస్ట్‌లో 90.8 కోట్ల డాలర్ల విలువైన 30 లావాదేవీలు నమోదయ్యాయి. టెక్, ఎడ్యుకేషన్, ఫార్మా, ఎనర్జీ రంగాలలో అధిక డీల్స్ జరిగాయి. గత నెలలో ఏడు స్టార్టప్‌లో యూనికార్న్ హోదాను అందుకున్నాయి. బిలియన్ డాలర్ల విలువను సాధించిన స్టార్టప్‌లను యూనికార్న్‌లుగా వ్యవహరించే సంగతి తెలిసిందే. దేశీ స్టార్టప్ వ్యవస్థ 115 డీల్స్ ద్వారా 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకట్టుకుంది. -
దిగివచ్చిన ఆహార ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం స్పీడ్ ఆగస్టులో మరింత తగ్గింది. 5.3 శాతంగా నమోదయ్యింది. అంటే 2020 ఇదే నెలతో పోలి్చతే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 5.3 శాతం పెరిగిందన్నమాట. 2020 ఆగస్టులో రిటైల్ ద్రవ్యోల్బణం 6.69 శాతం ఉంటే, 2021 జూలైలో 5.59 శాతంగా ఉంది. సంబంధిత రెండు నెలలతో పోల్చితే ధరల స్పీడ్ తాజా సమీక్షా నెల 2021 ఆగస్టులో కొంత తగ్గిందన్నమాట. ఆహార ఉత్పత్తుల ధరలు కొంత తగ్గడం దీనికి ప్రధాన కారణమని సోమవారం వెలువడిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) లెక్కలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. కీలక విభాగాలు ఇలా ► ఆహార బాస్కెట్ ద్రవ్యోల్బణం 2021 ఆగస్టులో 3.11 శాతంగా ఉంది. ఇది జూలైలో 3.96 శాతం. ► కూరగాయల ధరలు 11.7 శాతం తగ్గాయి. ► పప్పు దినుసులు సంబంధిత ఉత్పత్తుల ధరలు 1.42 శాతం దిగివచ్చాయి. ► అయితే ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ విషయంలో ధరలు ఏకంగా 33 శాతం ఎగశాయి. ► ఇంధనం, విద్యుత్ విషయంలో ద్రవ్యోల్బణం 13 శాతంగా ఉంది. ► సేవల ద్రవ్యోల్బణం 6.4 శాతం. 2–6 శ్రేణి లక్ష్యం... బ్యాంకులకు తానిచ్చే రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వసూలు చేసే వడ్డీరేటు– రెపో నిర్ణయానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. 2 నుంచి 6 శాతం మధ్య ఈ రేటు ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. 2020 హైబేస్ నేపథ్యంలో 2021 ఏప్రిల్‌లో 4.29 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం నమోదయినప్పటికీ సరఫరాల సమస్య తీవ్రత నేపథ్యంలో మే, జూన్ నెలల్లో వరుసగా 6.3 శాతం, 6.26 శాతాలకు పెరిగింది. జూలైలో కొంత తగ్గి 5.59 శాతంగా ఉంది. 2021–22లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.7 శాతం ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. సగటున రెండవ త్రైమాసికంలో 5.9 శాతం, మూడవ త్రైమాసికంలో 5.3 శాతం, నాల్గవ త్రైమాసికంలో 5.8 శాతం రిటైల్ ద్రవ్యోల్బణం నమోదవుతుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది. 2022–23లో ద్రవ్యోల్బణం 5.1 శాతం ఉంటుందని ఆర్బీఐ ప్రస్తుతం భావిస్తోంది. 2020 మార్చి తర్వాత 115 బేసిస్ పాయింట్ల రెపో రేటును తగ్గించిన గవర్నర్ నేతృత్వంలోని ఆర్బీఐ పాలసీ సమీక్షా కమిటీ, గడచిన ఏడు ద్వైమాసిక సమీక్షా సమావేశాల నుంచి రెపో రేటును యథాతథంగా 4 శాతంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడి జరుగుతుందన్న అంచనాలు, వృద్ధికి ఊపును అందించాల్సిన ఆవశ్యకత నేపథ్యంలో సరళతర రేట్ల విధానానికే కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేస్తోంది. -
ఈక్విటీ ఫండ్స్‌లోకి రూ.8,666 కోట్లు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ పథకాలు ఆగస్ట్ నెలలో నికరంగా రూ.8,666 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాయి. నూతన ఫండ్ పథకాల ఆవిష్కరణ (ఎన్‌ఎఫ్‌వోలు), సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) ద్వారా ఇన్వెస్టర్ల నుంచి స్థిరమైన పెట్టుబడులు రావడం ఇందుకు దోహదం చేశాయి. ఇలా ఈక్విటీ పథకాల్లోకి సానుకూల పెట్టుబడులు ప్రవేశించడం వరుసగా ఆరో నెలలోనూ నమోదైంది. అన్ని మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు (అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు/ఏఎంసీలు) నిర్వహణలోని ఆస్తుల విలువ (ఏయూఎం) ఆగస్ట్ చివరికి రూ.36.6 లక్షల కోట్లకు చేరుకుంది. ఇది జూలై ఆఖరుకు రూ.35.32 లక్షల కోట్లుగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేషన్ (యాంఫి) ఆగస్ట్ నెలకు సంబంధించి గణాంకాలను విడుదల చేసింది. ఈ ఏడాది జూలైలో రూ.22,583 కోట్లు, జూన్‌లో రూ.5,988 కోట్లు, మేలో రూ.10,083 కోట్లు, ఏప్రిల్‌లో రూ.3,437 కోట్లు, మార్చిలో రూ.9,115 కోట్ల చొప్పున పెట్టుబడులు ఈక్విటీ పథకాల్లోకి రావడం గమనార్హం. 2020 జూలై– 2021 ఫిబ్రవరి మధ్య ఎనిమిది నెలల పాటు ఈక్విటీ పథకాల నుంచి నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లాయి. నూతన మైలురాయి.. ‘‘ఓపెన్ ఎండెడ్ పథకాల్లోని సానుకూల పెట్టుబడుల రాకకుతోడు.. ఈక్విటీ మార్కెట్లు గరిష్ట స్థాయిలకు చేరుకోవడం మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమ నిర్వహణలోని నికర ఏయూఎం రూ.36 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించేందుకు తోడ్పడ్డాయి’’ అని యాంఫి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎన్ఎస్ వెంకటేశ్ తెలిపారు. సిప్ ఖాతాలు పెరగడం అన్నది ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో సంపద సృష్టికి మ్యూచువల్ ఫండ్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందన్నారు. ఆగస్ట్‌లో ఈక్విటీ ఎన్‌ఎఫ్‌వోలలో ఇన్వెస్టర్లు రూ.6,863 కోట్ల మేర పెట్టుబడులు పెట్టినట్టు మైవెల్త్‌గ్రోత్ సహ వ్యవస్థాపకుడు హర్షద్ చేతన్‌వాలా పేర్కొన్నారు. విభాగాల వారీగా... ► ఫ్లెక్సీక్యాప్ విభాగం అత్యధికంగా రూ.4,741 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ► ఫోకస్డ్ ఫండ్స్ విభాగంలోకి రూ.3,073 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ► మల్టీక్యాప్, లార్జ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఫండ్స్, ఈఎల్ఎస్ఎస్ పథకాల నుంచి ఆగస్ట్‌లో నికరంగా పెట్టుబడులు బయటకు వెళ్లిపోవడం గమనార్హం. ముఖ్యంగా స్మాల్‌క్యాప్ పథకాల నుంచి ఆగస్ట్‌లో ఇన్వెస్టర్లు రూ.163 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► హైబ్రిడ్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్టర్లు రూ.18,706 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ► సిప్ ఖాతాలు జూలై ఆఖరుకు 4.17 కోట్లుగా ఉంటే, ఆగస్ట్ చివరికి 4.32 కోట్లకు పెరిగాయి. ► నెలవారీ సిప్ పెట్టుబడులు రూ.9,923 కోట్లుగా ఉన్నాయి. జూలైలో ఈ మొత్తం రూ.9,609 కోట్లుగా ఉంది. ► గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా రూ.24 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. జూలైలో మాత్రం ఈ విభాగం నుంచి ఇన్వెస్టర్లు రూ.61 కోట్లను వెనక్కి తీసుకున్నారు. ► ఆగస్ట్‌లో డెట్ పథకాల్లోకి నికర పెట్టుబడులు రూ.1,074 కోట్లుగానే ఉన్నాయి. జూలైలో వచి్చన రూ.73,964 కోట్లతో పోలిస్తే డెట్‌లోకి పెట్టుబడులు గణనీయంగా తగ్గినట్టు తెలుస్తోంది. ► డెట్‌లో ఫ్లోటర్ ఫండ్స్‌లోకి రూ.9,991 కోట్లు, కార్పొరేట్ బాండ్ ఫండ్స్‌లోకి రూ.3,065 కోట్ల చొప్పున వచ్చాయి. ► లిక్విడ్ ఫండ్స్ నుంచి నికరంగా రూ.11,808 కోట్లను ఉపసంహరించుకున్నారు. ► ఆగస్ట్‌లో ఫండ్స్ పరిశ్రమలోకి (అన్ని విభాగాలూ) నికరంగా రూ.32,976 కోట్లు వచ్చాయి. -
ఆగస్టులో సేవల రంగం సూపర్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం ఆగస్టులో దూసుకుపోయింది. ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ క్షీణత నుంచి భారీ వృద్ధిలోకి జంప్ చేసింది. జూలైలో 45.4 క్షీణతలో ఉన్న రంగం, ఆగస్టులో 18 నెలల గరిష్ట స్థాయి 56.7కు ఎగసింది. సూచీ 50 లోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణిస్తారు. సమీక్షా నెల్లో బిజినెస్ ఆర్డర్లు గణనీయంగా పెరిగినట్లు ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. సెకండ్‌వేవ్ నేపథ్యంలో విధించిన ఆంక్షలను సడలించడం, పలు సంస్థల పునఃప్రారంభం, కొత్త ఆర్డర్లు, వినియోగం భారీగా పెరగడం వంటి పలు అంశాలు ఆగస్టు సేవల రంగంపై ప్రభావం చూపాయి. కరోనా సెకండ్‌వేవ్ నేపథ్యంలో గడచిన నాలుగు నెలలుగా సేవల ఇండెక్స్ 50లోపు క్షీణతలోనే కొనసాగుతోంది. సేవలు–తయారీ ఇండెక్స్ కూడా దూకుడే... సేవలు, తయారీ ఇండెక్స్ కలిసిన కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా 49.2 క్షీణత (జూలై) నుంచి ఆగస్టులో 55.4 వృద్ధిలోకి మారింది. మూడు నెలలుగా ఈ విభాగం క్షీణతలోనే కొనసాగింది. ఒక్క తయారీ రంగం చూస్తే, తయారీ రంగం ఆగస్టులో వృద్ధి బాటలోనే ఉన్నప్పటికీ, జూలైకన్నా నెమ్మదించింది. ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 52.3 వద్ద ఉంది. జూలైలో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. భారత్ ఎకానమీలో సేవల రంగం వాటా దాదాపు 60 శాతంకాగా, పారిశ్రామిక రంగం వాటా 15 శాతం. పారిశ్రామిక రంగంలో తయారీ రంగం వెయిటేజ్ దాదాపు 70 శాతం. చదవండి: -
ఆగస్టులో ఐపీవో స్పీడ్ డౌన్
న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దూకుడు చూపుతూ వచ్చిన ప్రైమరీ మార్కెట్ గత నెలలో కొంతమేర మందగించింది. అయితే ఇదే సమయంలో సెకండరీ మార్కెట్లు రేసు గుర్రాల్లా దౌడు తీశాయి. ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం ద్వారా రికార్డులు నెలకొల్పాయి. ఒక్క ఆగస్ట్ నెలలోనే 9 శాతం పురోగమించాయి. సెన్సెక్స్ 57,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. ఈ జోష్‌తో 10 కంపెనీలు విజయవంతంగా పబ్లిక్ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. తద్వారా స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్‌లో సగం కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. వివరాలు ఎలా ఉన్నాయంటే.. స్పందన సైతం గత కేలండర్ ఏడాది(2020)లో అటు ఇన్వెస్టర్ల స్పందనలోనూ.. ఇటు లిస్టింగ్ లాభాల్లోనూ జోరు చూపిన ఐపీవోలు ఈ ఏడాది(2021)లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)ను పరిగణిస్తే ఏప్రిల్ నుంచి 20 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టాయి. రూ. 45,000 కోట్లను సమీకరించాయి. వీటిలో ఆగస్ట్‌లోనే 10 కంపెనీలు ఐపీవోలు పూర్తి చేసుకున్నాయి. అయితే గత నెలకల్లా ఐపీవోల స్పీడ్‌కు బ్రేక్ పడింది. ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి తగ్గింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే సగం కంపెనీలు నీరసంగా లిస్టయ్యాయి. ఇందుకు వెల్లువెత్తుతున్న ఇష్యూలు, నాణ్యమైన ఆఫర్లు కరవుకావడం వంటి అంశాలు కారణమైనట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ తెలియజేశారు. దీనికితోడు మిడ్, స్మాల్ క్యాప్స్‌లో భారీ ఒడిదొడుకులు నమోదుకావడం ప్రభావం చూపినట్లు విశ్లేషించారు. ఆగస్ట్‌లో మిడ్ క్యాప్ 3.3 శాతం పుంజుకోగా.. స్మాల్ క్యాప్ 0.5 శాతమే బలపడింది. జాబితా ఇదీ ఆగస్ట్‌లో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్, రోలెక్స్ రింగ్స్, ఎగ్జారో టైల్స్, విండ్లాస్ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్, కార్‌ట్రేడ్ టెక్, నువోకో విస్టాస్ కార్పొరేషన్, కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా ఐపీవోలను పూర్తి చేసుకుని లిస్టింగ్ సాధించాయి. వీటిలో ఐదు కంపెనీలే ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్ 37 శాతం, రోలెక్స్ రింగ్స్ 30 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ను సాధించాయి. ఈ బాటలో ఎగ్జారో టైల్స్ 10 శాతం, గ్లెన్‌మార్క్ లైఫ్ 4 శాతం లాభాలతో మాత్రమే లిస్టయ్యాయి. ఇక తొలి రోజు క్రిస్నా 4% బలపడింది. నష్టాలతో.. ఇష్యూ ధరతో పోలిస్తే విండ్లాస్ బయోటెక్ 11 శాతం నష్టంతో లిస్టయ్యింది. ఇక కార్‌ట్రేడ్ టెక్ 8 శాతం, నువోకో విస్టాస్ 7 శాతం డిస్కౌంట్‌తో నమోదయ్యాయి. కెమ్‌ప్లాస్ట్ సన్మార్, ఆప్టస్ వేల్యూ ట్రేడింగ్ రోజున 1 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి. కాగా.. గత నెలలో వచ్చిన అన్ని ఐపీవోలు సక్సెస్ అయినప్పటికీ దేవయాని, రోలెక్స్ రింగ్స్‌కు మాత్రమే భారీ స్పందన లభించడం గమనార్హం! ఐపీవోకు ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ న్యూఢిల్లీ: క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటిర్ల సంస్థ ఈఎస్డీఎస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పబ్లిక్ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 1,300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు వీలుగా ఈ నెలలోనే క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. 2005లో ప్రారంభమైన కంపెనీ క్లౌడ్ సర్వీసులు, డేటా సెంటర్లతోపాటు.. ప్రొడక్ట్ ఆర్అండ్డీ తదితర సేవలు అందిస్తోంది. కస్టమర్లలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, టాటా క్యాపిటల్, డీసీబీ బ్యాంక్, ముత్తూట్ గ్రూప్, యూనియన్ బ్యాంక్ తదితరాలున్నాయి. ఐపీవోకు తొందర లేదు:ఫోన్‌పే న్యూఢిల్లీ: ఐపీవోకు వెళ్లేందుకు తొందర లేదని ఫోన్‌పే సీఈవో సమీర్ నిగమ్ స్పష్టం చేశారు. కంపెనీకి అర్ధవంతం, కారణం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తామని అన్నారు. ‘కంపెనీ అయిదేళ్ల క్రితం ప్రారంభమైంది. 30 కోట్ల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. ఆర్థిక సేవల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాం. మ్యూచువల్ ఫండ్స్, బీమా విభాగాల్లో గణనీయమైన పెరుగుదలను ఫోన్‌పే నమోదు చేసింది. త్వరలో బీటూబీ అకౌంట్ అగ్రిగేటర్సహా ఇతర సేవల్లోకి అడుగు పెడుతున్నాం. పోటీ కంపెనీ ఐపీవోకు వెళితే నేను లెక్క చేయను’ అని తెలిపారు. రూ.7.47 లక్షల కోట్ల విలువైన 394.13 కోట్ల లావాదేవీ లను జూన్ క్వార్టర్లో ఫోన్‌పే నమోదు చేసింది. -
ఆగస్టులో 16 లక్షల మంది ఉపాధి గల్లంతు
సాక్షి, న్యూఢిల్లీ: ఆగస్టులో దేశవ్యాప్తంగా 15 లక్షల మంది ఉపాధి కోల్పోయారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఆగస్టులో నిరుద్యోగిత రేటు 8.32 శాతంగా ఉందని వివరించింది. గ్రామీణ నిరుద్యోగిత రేటు 7.64 శాతం ఉండగా, పట్టణ నిరుద్యోగిత రేటు 9.78 శాతం ఉంది. జులైలో ఉపాధి పొందిన వారి సంఖ్య 399.38 మిలియన్లు ఉండగా.. ఆగస్టు నాటికి 397.78 మిలియన్లకు తగ్గింది. అంటే 16 లక్షల మంది ఉపాధి కోల్పోయారు. అత్యధికంగా హరియాణాలో 35.7 శాతం నిరుద్యోగిత రేటు నమోదైంది. తరువాత స్థానాల్లో వరుసగా రాజస్థాన్ (26.7 శాతం), జార్ఖండ్ (16 శాతం), త్రిపుర (15.6 శాతం), బిహార్ (13.6 శాతం) నిలిచాయి. -
కోలుకుంటున్న ఎకానమి.. లక్ష కోట్లు దాటిన జీఎస్టీ
కరోనా సంక్షోభం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోంది. మెరుగవుతున్న జీఎస్టీ వసూళ్లే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వరుసగా రెండో నెల కూడా దేశీయంగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లను దాటాయి. ఆగస్టు వసూళ్లు 1.12 లక్షల కోట్లు ఆగస్టు నెలకు సంబంధించి 1.12 లక్షల కోట్లు జీఎస్టీగా వసూలైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటిచింది. గతేడాదితో పోల్చితే 30 శాతం అధికంగా జీఎస్టీ వచ్చినట్టు తెలిపింది. ఆగస్ట్‌కి సంబంధించిన జీఎస్టీలో సెంట్రల్ జీఎస్టీ రూ. 20,522 కోట్లు, స్టేట్ జీఎస్టీ రూ. 26,605 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ. 56,247 కోట్లు ఉన్నట్టు కేంద్రం తెలిపింది. వీటితో పాటు రూ.8,646 కోట్లు సెస్సుగా వసులైంది. వరుసగా రెండో నెల కరోనా సెకండ్ వేవ్ తర్వాత క్రమంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. ఆగస్టులో రూ. 1.12 కోట్ల జీఎస్టీ రాగా అంతకు ముందు జులైలో రూ. 1.16 లక్షల కోట్లు వచ్చింది. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత 2020 అక్టోబరు తొలిసారిగా జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్లు దాటాయి. ఆ తర్వాత 2021 మే వరకు ప్రతీ నెల లక్ష కోట్లకు పైగానే వస్తు సేవల పన్నుల మొత్తం దాటింది. సెకండ వేవ్ ఎఫెక్ట్‌తో 2021 జూన్‌లో మాత్రం జీఎస్టీ లక్షకు దిగువన రూ 92.84 వేల కోట్లకు పరిమితమైంది. చదవండి: GST On Papad: అప్పడాలపై జీఎస్టీ !.. ట్విట్టర్లో రచ్చ రచ్చ -
బ్యాంకింగ్ రుణ వృద్ధి 6.55 శాతం
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ఆగస్టు 13వ తేదీతో ముగిసిన పక్షం రోజులకు 6.55 శాతంగా నమోదయ్యింది. డిపాజిట్ల విషయంలో ఈ వృద్ధి 10.58 శాతంగా ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు ఈ విషయాన్ని తెలిపాయి. వివరాలు చూస్తే... 2020 ఆగస్టు 14 నాటికి రుణ మంజూరు పరిమాణం రూ.102.19 లక్షల కోట్లు. 2021 ఆగస్టు 13 నాటికి ఈ విలువ రూ.108.89 లక్షల కోట్లకు చేరింది. అంటే రుణ వృద్ధి 6.55 శాతమన్నమాట. చదవండి : రూపాయి.. అధరహో ►ఇక డిపాజిట్ల విలువ ఇదే కాలంలో రూ.140.80 లక్షల కోట్ల నుంచి రూ.155.70 లక్షల కోట్లకు చేరింది. ► 2021 జూలై 30వ తేదీ నాటికి అందిన షెడ్యూల్డ్ బ్యాంకుల స్టేట్మెంట్ల ఆధారంగా ఈ గణాంకాలు వెలువడ్డాయి. ►సమీక్షా పక్షానికి ముందు ముగిసిన పక్షం రోజుల్లో (2021 జూలై 30) రుణ వృద్ధి రేటు 6.11 శాతంకాగా, డిపాజిట్ల వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంది. ►2020–21 ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి 5.56 శాతంగా ఉంటే, డిపాజిట్ల వృద్ధి రేటు 11.4 శాతంగా నమోదయ్యింది. ఇటీవల ప్రభుత్వ రంగ బ్యాంకర్లతో సమావేశమైన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అనంతరం మాట్లాడుతూ, రుణాలకు డిమాండ్‌లేదని ఇప్పుడే ప్రకటించడం తొందరపాటు చర్య అవుతుందని పేర్కొన్నారు. రుణ వృద్ధికి బ్యాంకింగ్ అక్టోబర్ నుంచీ జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కూడా ఆమె వెల్లడించారు. మహమ్మారి కరోనా ప్రారంభం నుంచీ ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కొనడానికి కేంద్రం పలు ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటిస్తోందని,ఈ ఉద్దీపన ప్యాకేజీలు సత్ఫలితాలు ఇవ్వడంలో రుణ వృద్ధి కూడా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. అక్టోబర్ నుంచీ రుణ వృద్ధికి బ్యాంకులు జిల్లాల వారీగా ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు కూడా వెల్లడించారు. రుణ వృద్ధికి ఊపునందించడానికి 2019లో సైతం బ్యాంకులు 400 జిల్లాల్లో రుణ మేళాలను నిర్వహించిన సంగతి తెలిసిందే. -
ఆగస్టు 14.. విభజన గాయాల సంస్మరణ దినం
న్యూఢిల్లీ: ఇకపై ప్రతిఏటా ఆగస్టు 14వ తేదీని విభజన గాయాల సంస్మరణ దినంగా పాటించనున్నట్లు ప్రధాని∙మోదీ శనివారం ప్రకటించారు. దేశ విభజన గాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. ఆ సమయంలో ప్రజలు ఎన్నో కష్టనష్టాలు అనుభవించారని, ఎన్నెన్నో త్యాగాలు చేశారని, వాటిని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినం జరుపుకుందామని పిలుపునిచ్చారు. దేశ విభజన సృష్టించిన మతిలేని ద్వేషం, హింస కారణంగా లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక విభజనలు తొలగిపోవాలని, సామరస్యం పెంపొందాలని, ఏకత్వం అనే స్ఫూర్తి బలోపేతం కావాలని, మానవ సాధికారత పరిఢవిల్లాలని ఆకాంక్షించారు. ఈ ఆశయాలను విభజన అకృత్యాల సంస్మరణ దినం మనకు గుర్తు చేస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ నుంచి ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఆగస్టు 14ను విభజన గాయాల సంస్మరణ దినంగా గుర్తిస్తూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రధానమంత్రి నిర్ణయాన్ని హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. దేశ విభజన గాయాన్ని, సన్నిహితులను కోల్పోయామని వారి ఆవేదనను మాటల్లో వర్ణించలేమని అన్నారు. దేశ విభజన సమయంలో ఎందరో భరతమాత బిడ్డలు తమ జీవితాలను త్యాగం చేశారని కేంద్ర హోంశాఖ శ్లాఘించింది. బ్రిటీష్ వలస పాలకుల దుర్నీతి కారణంగా 1947లో భారతదేశం రెండుగా విడిపోయిన సంగతి తెలిసిందే. భారత్ రెండు ముక్కలై పాకిస్తాన్ అనే కొత్త దేశం ఏర్పడింది. ఆగస్టు 14న పాకిస్తాన్‌కు స్వాతంత్య్రం రాగా, భారత్ ఆగస్టు 15న వలస పాలకుల చెర నుంచి విముక్తి పొందింది. భారతదేశ విభజన మానవ చరిత్రలోనే అతిపెద్ద వలసలకు బీజం చేసింది. ఈ విభజన వల్ల 2 కోట్ల మంది ప్రభావితమైనట్లు అంచనా. -
కళ్లు చెదిరే ఆఫర్, ఈ బైక్ కొంటే రూ.1లక్ష వరకు..!
బైక్ లవర్స్‌కు యమహా ఇండియా మోటార్ కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది.ఇండిపెండెన్స్ డే సందర్భంగా పలు వాహనాలపై గిఫ్ట్ ఓచర్లు, రూ.1లక్ష విలువైన బంపర్ ఫ్రైజ్లను అందిస్తున్నట్లు యమహా ప్రకటించింది. కరోనా కారణంగా చతికిల పడ్డ ఆటోమోబైల్ సంస్థలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. కష్టమర్లు లేక ఇబ్బందులు పడ్డ పలు ఆటో మొబైల్ సంస్థలు ఆఫర్లు ప్రకటించి సేల్స్‌ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో యమహా ఫాసినో 125 ఎఫ్ఐ హైబ్రిడ్, యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ ను ఆగస్ట్ 31లోగా కొనుగోలు చేస్తే రూ.2,999 గిఫ్ట్ ఓచర్స్, రూ.20వేల వరకు అడిషనల్ బెన్ ఫిట్స్ పొందవచ్చని యమహా ఇండియా మోటార్ ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఒక్క తమిళనాడు మినహాయించి మిగిలిన రాష్ట్రాల్లో యమహా రేజడ్ఆర్ 125 ఎఫ్ఐ, యమహా రేజడ్ఆర్ స్ట్రీట్ ర్యాలీ 125 ఎఫ్ఐ, నాన్ ఐబ్రిడ్ వెహికల్ యమహా ఫాసినో 125 ఎఫ్ఐ వెహికల్స్ కొనుగోలు చేసిన వాహనదారులకు రూ.3,876 ఇన్స్యూరెన్స్ బెన్ ఫిట్స్, రూ.999కే లో డౌన్ పేమెంట్స్ తో బైక్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు రూ. 2,999 విలువైన గిఫ్ట్‌ను అందిస్తుంది. తమిళనాడులో యమహా బైక్ కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా రూ.30వేల విలువైన గిఫ్ట్ తో పాటు బంపర్ ఆఫర్ కింద రూ.1లక్ష రూపాయల్ని సొంతం చేసుకోవడమే కాదు..అడిషనల్ బెన్ ఫిట్స్ కింద రూ.20 వేలు దక్కించుకోవచ్చు. ఇక మిగిలిన అన్నీ మోడల్స్ పై రూ. 2,999 విలువైన బహుమతులు, రూ.20వేల అడిషనల్ బెన్ ఫిట్స్‌ను పొందవచ్చు. చదవండి: ఆ..!ఇలా అయితే కార్ల ధరల్ని ఇంకా పెంచాల్సి వస్తుంది -
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త. ఉజ్వల 2.0 పథకం కింద లబ్దిదారులకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్లో పీఎంయూవై పథకం కింద మరో కోటి గ్యాస్ కనెక్షన్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. తొలి విడతలో ఎల్పీజీ కనెక్షన్లు పొందలేక పోయిన పేద కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లను అందించాలని నిర్ణయించింది. PM Narendra Modi launches Pradhan Mantri Ujjwala Yojana 2.0, hands over LPG connections to several women beneficiaries, at Mahoba via video conferencing. pic.twitter.com/DoPfy2RA1b — ANI UP (@ANINewsUP) August 10, 2021 ఇందులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబా జిల్లాలో జరిగిన కార్యక్రమాన్ని ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఉజ్వల 2.0లో యూనియన్ పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యాలు పాల్గొన్నారు. ఈ పథకంలో భాగంగా ఉజ్వల 2.0 కింద ఉచిత ఎల్పీజీ కనెక్షన్‌తో పాటు లబ్ధిదారులకు మొదటి రీఫిల్, హాట్ప్లేట్ అందించనున్నట్లు కేంద్రం తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉజ్వల స్కీమ్‌లో రిజిస్ట్రేషన్ కోసం కనీస ప్రతాలు అవసరమే కానీ ఉజ్వల 2.0లో వలసదారులు రేషన్‌కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు లేకుండానే గ్యాస్ కనెక్షన్లు అందించనుంది. కాగా ఉజ్వల 1.0 కార్యక్రమాన్ని మే1, 2016న ప్రధాని మోదీ ఉత్తర్ ప్రదేశ్ బల్లియా నుంచి ప్రారంభించారు. తొలివిడుతలో 80లక్షల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను అందించిన విషయం తెలిసిందే. -
ఓలా ఎలక్ట్రిక్ బైక్.. లాంఛ్ డేట్ ఇదే!
దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న కీలక ఆప్డేట్ వచ్చేసింది. ప్రీ బుకింగ్స్‌లోనే ప్రపంచ రికార్డు సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీ ఎప్పుడో తెలిసిపోయింది. ఓలా స్కూటర్ లాంఛింగ్ డేట్‌ని ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్ ప్రకటించారు. స్వాతంత్ర దినోత్సవ కానుకగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని ఆగస్ట్ 15న విడుదల చేయబోతున్నట్టు ఓలా స్కూటర్ సీఈవో భవీశ్ అగర్వాల్ ప్రకటించారు. "మా స్కూటర్ని రిజర్వ్ చేసుకున్నవాళ్లందరికీ థ్యాంక్స్ ! ఆగస్టు 15వ తేదిన స్కూటర్ని లాంచ్ చేయబోతున్నాం. స్కూటర్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు, విశేషాలను తెలియజేస్తాం" అంటూ భవీశ్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌కి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ట్వీట్ ద్వారా తెలియజేస్తూ వస్తున్నారు భవీశ్ అగర్వాల్. ఇప్పటికే ఒలా స్కూటర్ పది రంగుల్లో ఉంటుందని ప్రకటించగా గరిష్ట వేగం వందకు పైగా ఉంటుందంటూ హింట్ ఇచ్చారు.. అదే ఒరవడిలో తాజాగా లాంఛింగ్ డేట్‌ను ప్రకటించారు. ఓలా స్కూటర్‌కి సంబంధించి ఒక్కో లీక్ బయటకు వస్తోన్నా.. కీలకమైన ధర విషయంలో ఇప్పటీకీ గోప్యత పాటిస్తున్నారు ఆ కంపెనీ సీఈవో భవీశ్ అగర్వాల్. ఓలా స్కూటర్ ధర ఎంతనే ఆసక్తి అందరిలో నెలకొంది. పెట్రోలు రేట్లు భగ్గుమంటుండంతో వాహనదారులు రెగ్యులర్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ బైక్‌ల వైపు మళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. ప్రభుత్వం సైతం ఈవీ వెహికల్స్‌కి భారీగా ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఆటోమొబైల్ సంస్థలు ఎలక్ట్రిక్ బైక్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇప్పటికే పలు ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లో సందడి చేస్తుండగా.. ఆ జోరును మరింత పెంచేందుకు ఓలా భారీ ఎత్తున ఎలక్ట్రిక్ బైక్ లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Thanks to all who have reserved our scooter! Planning a launch event for the Ola Scooter on 15th August. Will share full specs and details on product and availability dates. Looking forward to it! 😀 — Bhavish Aggarwal (@bhash) August 3, 2021 -
ఇది తెలుసా? పబ్లిక్ హాలిడే అయినా జీతం పడుతుంది
ఒకటో తారీఖున ఆదివారామో, సెలవు రోజో వస్తే వేతన జీవులకు గండమే. సెలవు కావడంతో బ్యాంకులు జీతాలు జమ చేయవు. మరుసటి రోజు వరకు ఎదురు చూడాల్సిందే. అయితే ఇకపై ఈ ఇక్కట్లకు చెల్లు చీటి రాసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సండేలతో పాటు ఇతర పబ్లిక్ హాలిడేస్‌లో కూడా బల్క్ పేమెంట్ చేసేందుకు, ఖాతాదారులు చేసే కీలక చెల్లింపులు స్వీకరించేందుకు బ్యాంకులకు అనుమతి ఇచ్చింది. ఎన్ఏసీహెచ్చ్ నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌజ్ (NACH) పథకాన్ని ఆగస్టు 1 నుంచి అమల్లోకి తెచ్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం ఇకపై ఆదివారాలు, అధికారిక సెలవు రోజుల్లో కూడా శాలరీస్, డివిడెండ్లు, పెన్షన్లు తదితర చెల్లింపులు జరుగుతాయి. చెల్లింపులకు ఓకే వేతనాలు, పెన్షన్ల చెల్లింపులతో పాటు కరెంటు, గ్యాస్, టెలిఫోన్, వాటర్ బిల్లులు, ఈఎంఐ, ప్రీమియం వంటి చెల్లింపులను బ్యాంకులు తీసుకుంటాయి. వినియోగదారులకు మరింత మెరుగైన సౌకర్యవంతమైన సేవలు అందించే ప్రక్రియలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్న మరికొన్ని మార్పులు - భారత తపాల శాఖ ఆధీనంలోని పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ఇప్పటి వరకు ఉచితంగా అందించిన డోర్ స్టెప్ సర్వీసెస్‌ని నిలిపేసింది. ఇకపై ఇంటి వద్దకు వచ్చి పోస్టల్ బ్యాంక్ సర్వీసెస్ అందిస్తే రూ. 20 ప్లస్ జీఎస్టీని వసూలు చేయనుంది. - పరిమితి మించిన తర్వాత ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఇప్పటి వరకు రూ. 15 సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తుండగా ఇప్పుడా మొత్తాన్ని రూ. 17కి పెంచారు. -
వచ్చేస్తున్నాయ్! ఆగస్టులో రయ్‌రయ్‌మంటూ...
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశమంతా ఆగస్టులో ఆజాదీ కా అమృత్ వేడుకలకు ముస్తాబవుతోంది. మరోవైపు ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఓలా స్కూటర్ కూడా ఇదే నెలలో డెలివరీకి రెడీ అవుతోంది. ఓలాతో పాటు ఈ నెలలో రిలీజ్ కాబోతున్న ముఖ్యమైన వెహికల్స్ గురించి క్లుప్తంగా ఓలా పెరిగిన పెట్రోలు ధరలతో జనమంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు చూస్తున్నారు. దీంతో లక్ష ప్రీ బుకింగ్స్ సాధించి ఓలా రికార్డు సృష్టించింది. పది రంగుల్లో వంద కిలోమీటర్ల గరిష్ట వేగంతో ఈ స్కూటర్ రాబోతుందని అంచనా. ఇంకా తేది ఖరారు కానప్పటికీ ఆగస్టులోనే ఓలా స్కూటర్ రోడ్లపై పరుగులు పెడుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 సక్సెస్ ఫుల్ మోడల్ క్లాసిక్ 350కి మరిన్ని హంగులు జోడించి న్యూజెనరేషన్ మోడల్ని ఆగస్టులో మార్కెట్లోకి తెస్తోంది రాయల్ ఎన్ఫీల్డ్ తెస్తోంది. న్యూ ఇంజన్, ఫ్రేమ, టెక్నాలజీ, అధునాత ఫీచర్లను రాయల్‌ఎన్‌ఫీల్డ్ జోడించింది. ఇప్పటి వరకు ఉపయోగించిన ఇంజన్ స్థానంలో మెటియోర్ 350లో వాడే ఇంజన్‌ను ఆర్ఈ తెచ్చింది. సీటు, లైటు, హ్యాండిల్ బార్, పెయింట్ స్కీం, డిస్క్ బ్రేకుల్లో మార్పులు చేసింది. బీఎండబ్ల్యూ సీ 400 జీటీ బీఎండబ్ల్యూ మోటారడ్ నుంచి సరికొత్త సీ 400 జీటీ మ్యాక్సీ స్కూటర్ని మార్కెట్లో ప్రవేశపెట్టబోతుంది. ఈ ప్రీమియం మోడల్ స్కూటర్ ధర రూ. 5 లక్షల దగ్గర ఉండవచ్చని అంచనా. సింపుల్‌వన్ ఎమర్జింగ్ మార్కెట్‌గా భావిస్తోన్న ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్లో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది సింపుల్ వన్ స్కూటర్. ఆగస్టు 15న ఈ స్కూటర్ ఇండియా మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఐక్యూబ్, అథర్‌లకు పోటీగా ఇది మార్కెట్లోకి వస్తోంది. హోండా హర్నెట్ 2.0 బేస్డ్ ఏడీవీ ఈ నెలలో హార్నెట్ 2.0 ఏడీవీ మోడల్ రిలీజ్ చేసేందుకు హోండా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. హోండాకి చెందిన రెడ్ వింగ్ లైన్ డీలర్షిప్ ద్వారా ఇవి మార్కెట్లోకి రాబోతున్నాయి. ఈ బైకు ధర రూ.1.20 నుంచి 1.50ల మధ్య ఉండవచ్చు. -
ఆగస్టు 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ ఇవే!
మీరు ఎక్కువగా బ్యాంకు సంబంధిత లావాదేవీలు చేస్తుంటారా? అయితే, మీకు ఒక ముఖ్య గమనిక. ఆగస్టు 1 నుంచి బ్యాంకుకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల వల్ల సామాన్యుల మీద ఎక్కవగా భారం పడనుంది. ఏటీఎం లావాదేవీలు, ఎల్పీజీ ధరలు, వేతనాలు, పెన్షన్లు ఇలా చాలా అంశాలకు సంబంధించి కొత్త మార్పులు ఆగస్టు 1 నుంచి చోటు చేసుకొనున్నాయి. సాధారణంగా ప్రతీ నెల ప్రారంభంలో కొత్త నిబందనలు అమల్లోకి వస్తుంటాయి. మరి ఆగస్టు 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఏంటీ? అవి మిమ్మల్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నయో? తెలుసుకోండి. వేతనం, ఈఎమ్ఐ చెల్లింపులు: నేషనల్ ఆటోమేటెడ్ క్లియరింగ్ హౌస్(ఎన్ఏసీహెచ్) నిబంధనలలో ఆర్బీఐ మార్పు చేయడం వల్ల సెలవు రోజుల్లో కూడా విద్యుత్, గ్యాస్, టెలిఫోన్, నీరు, జీతం, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ సంబంధిత లావాదేవీలు సెలవు రోజుల్లో కూడా జరగనున్నాయి. ఈ కొత్త మార్పులు ఆగస్టు 1, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రియల్ టైమ్ గ్రాస్ సెటిల్ మెంట్(ఆర్ టీజిఎస్), ఎన్ఏసిహెచ్ సేవలు 24ఎక్స్7 అందుబాటులో ఉంటాయని ఆర్బీఐ పేర్కొంది. ఎన్ఏసీహెచ్ అనేది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్ పీసీఐ) చేత నిర్వహించబడుతుంది. ఎటిఎమ్ క్యాష్ విత్ డ్రా: జూన్ నెలలో ఆర్బీఐ తీసుకొచ్చిన మరో ఆర్డర్ ప్రకారం, ఆగస్టు 1 నుంచి ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్స్(ఏటీఎం) చార్జీలు పెరగనున్నాయి. ఏటీఎం కేంద్రాల నిర్వహణ భారంగా మారిందన్న బ్యాంక్ ఆందోళన నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ఇంటర్ చేంజ్ ఫీజ్ ను ₹2 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. తాజాగా వచ్చే ఆగస్టు 1 నుంచి ఏటీఎం కేంద్రాల్లోనూ ఒక్కో ఆర్ధిక లావాదేవీపై ఇంటర్ ఛేంజ్ ఫీజు రూ.15 నుంచి రూ.17కు, ఆర్ధికేతర లావాదేవీలపై రూ.5 నుంచి రూ.6కు పెరగనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన డెబిట్ కార్డులు 90 కోట్ల వరకు వాడుకలో ఉన్నాయి. ఐపీపీబీ డోర్ స్టెప్ సేవలు ఖరీదు: ఇప్పటి వరకు ఉచితంగా అందిస్తున్న ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ సేవలకు ఇక నుంచి ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలను, సేవింగ్స్ అకౌంట్ల వడ్డీ రేట్లను ఐపీపీబీ సవరించింది. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఛార్జీలు 01 ఆగస్టు 2021 నుంచి వర్తిస్తాయి. ప్రస్తుతం, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సంబంధించి ఎలాంటి ఛార్జీలు లేవు. ఇక ఆగస్టు 1, 2021 నుంచి ప్రతి కస్టమర్ ఐపీపీబీ డోర్ స్టెప్ అభ్యర్థనకు బ్యాంకింగ్ ఛార్జీల కింద రూ.20 + జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకే కస్టమర్ ఎక్కువ సార్లు అభ్యర్థనలు చేయడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఐసీఐసీఐ బ్యాంక్ సర్వీస్ ఛార్జీలు: భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ తన దేశీయ పొదుపు ఖాతాదారులకు నగదు లావాదేవీలు, ఎటిఎం ఇంటర్ చేంజ్, చెక్ బుక్ ఛార్జీల సవరించిన్నట్లు తెలిపింది. ఈ మార్పులు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్ సైట్ తెలిపింది. అన్ని నగదు లావాదేవీలపై ఛార్జీల సవరణ వర్తిస్తుంది.ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలలో నెలకు మొత్తం 4 ఉచిత నగదు లావాదేవీలను అనుమతించింది. ఆ తర్వాత లావాదేవీలకు ఛార్జీలు వర్తిస్తాయి.ప్రతి ఆర్థిక లావాదేవీకి బ్యాంకు ₹20, ఆర్థికేతర లావాదేవీకి ₹8.50 వసూలు చేస్తుంది. ఆగస్టు 1 నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారుల హోమ్ బ్రాంచీలో నగదు లావాదేవీ పరిమితి నెలకు రూ.1 లక్ష వరకు ఉచితం. లక్షకు పైగా జరిపే ప్రతి లావాదేవిపై ₹1,000కు ₹5 చెల్లించాలి. కనీస రుసుము ₹150గా ఉంది. ఎల్పీజీ ధరలు: ఎల్పీజీ ధరలను గ్యాస్ ఏజెన్సీలు ప్రతి నెల ఒకటో తేదీన సవరిస్తాయి. జూలై నెల 1 తేదీన ఎల్పీజీ ధరలను రూ. 26 పెంచాయి. మరి ఈ నెల పెరగనున్నాయా? తగ్గనున్నాయా? అనేది ఆగస్టు 1 తేదీన తెలవనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ): 15సీఏ, 15సీబీ ఫామ్స్ ఎలక్ట్రానిక్ ఫైలింగ్ విషయంలో పలు సడలింపులు ఇచ్చింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్. గతంలో జూలై 15 వరకు ఉన్న చివరి తేదీని ఆగస్ట్ 15కి పొడిగించింది. -
Micromax in 2b: అదిరిపోయే ఫీచర్లు... అతి తక్కువ ధరలో..
దేశీ బ్రాండ్‌గా ఒకప్పుడు ఇండియా మార్కెట్లో హవా చెలాయించిన మైక్రోమ్యాక్స్ మళ్లీ పట్టు కోసం ప్రయత్నిస్తోంది. తనదైన శైలిలో అతి తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్లతో మార్కెట్లోకి కొత్త ఫోన్ తెస్తోంది. హ్యాంగ్ ఫ్రీ గతేడాది మైక్రోమాక్స్ ఐఎన్ 1బీ మోడల్ని మార్కెట్లోకి మైక్రోమ్యాక్స్ విడుదల చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మైక్రోమ్యాక్స్ ఐన్ 2బీని రిలీజ్ చేస్తోంది. ఐఎన్ 2బీ ఫోన్ పెర్ఫామెన్స్ స్మూత్‌గా ఉంటుందని, హ్యంగ్ ఫ్రీ ఫోన్ అంటూ మైక్రోమ్యాక్స్ క్లయిమ్ చేసుకుంటోంది. ఈ మొబైల్లో యూనిసాక్ టీఎ610 చిప్సెట్ని మైక్రోమ్యాక్స్ ఉపయోగిస్తోంది. ధర ఆడ్రాంయిడ్ 11 వెర్షన్‌పై ఐన్ 2బీ మోడల్ ఫోన్ పని చేస్తుంది. ఈ మొబైల్‌ను 4 జీబీ, 6 జీబీ ర్యామ్‌లు 64 జీబీ స్టోరేజీ వేరియంట్లుగా అందుబాటులోకి రాబోతున్నాయి. ఇందులో 4 జీబీ వేరియంట్ మొబైల్ ధర రూ. 7,000లు ఉండగా 6 జీబీ ర్యామ్ మొబైల్ ధర రూ. 8,999లుగా ఉంది. ఆగస్టు 4న ఫ్లిప్‌కార్ట్ వేదికగా 2బీ మొబైల్ లాంచ్ చేయనుంది మైక్రోమ్యాక్స్. బిగ్ బ్యాటరీ మైక్రోమ్యాక్స్ 2బీలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అమర్చారు. దీంతో 15 గంటల పాటు వీడియో స్ట్రీమింగ్, 20 గంటల బ్రౌజింగ్ టైమ్‌ని అందిస్తోంది మైక్రోమ్యాక్స్. అంతేకాదు ఈ సెగ్మెంట్లో ఫాస్టెస్ట్ ఫింగర్ ప్రింట్స్కానర్ ఈ మొబైల్లో పొందు పరిచారు. బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్లలో ఈ మొబైల్ మార్కెట్లోకి రాబోతుంది. ఇందులో 5 మెగా పిక్సెల్ ఫ్రంట్‌కెమెరా, వెనుక వైపు 13 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. 6.5 అంగులాల వాటర్ డ్రాప్ నాచ్ హెడ్డీ డిస్ప్లేని అమర్చింది. -
అలర్ట్: ఆగస్ట్ నెలలో ఎన్నిరోజులు బ్యాంక్ సెలవులో తెలుసా?
నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే, బ్యాంకు క్లోజింగ్ హాలీడే' పేరుతో ఆర్బీఐ మన దేశంలో బ్యాంకు సెలవులను మూడు విభాగాలుగా విభజిస్తుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. ఆగస్ట్ నెలలో పండగలు, ఆదివారాలు, శనివారాల్ని ఆర్బీఐ హాలిడేస్‌ను ప్రకటించింది. అయితే ఈ హాలిడేస్ ఒక్కో రాష్ట్రాన్ని బట్టి, ఆ రాష్ట్రానికి సంబంధించిన పండగల్ని బట్టి మారిపోతుంటాయి. ఆగస్ట్,1 - ఆదివారం ఆగస్ట్, 8 - ఆదివారం ఆగస్ట్,13- దేశభక్తుల దినోత్సవం (ఇంపాల్) ఆగస్ట్,14- రెండో శనివారం ఆగస్ట్,15- ఆదివారం ఇండిపెండెన్స డే ఆగస్ట్,16- పార్సి కొత్త సంవత్సరం (ముంబై, నాగపూర్, బెలాపూర్) ఆగస్ట్,19- మొహరం ఆగస్ట్,20- ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ) ఆగస్ట్,21- తిరుఓనం (కొచ్చి, కేరళ) ఆగస్ట్,22- రక్షాబంధన్ ఆగస్ట్,23- శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ) ఆగస్ట్,20- ఓనమ్ (బెంగళూరు, చెన్నై, కొచ్చి, కేరళ) ఆగస్ట్,21- తిరుఓనం (కొచ్చి, కేరళ) ఆగస్ట్,22- రక్షాబంధన్ ఆగస్ట్,23- శ్రీ నారాయణ గురు జయంతి (కొచ్చి, కేరళ) ఇలా ఆగష్టు నెలలో పదిహేను రోజులు బ్యాకులకు సెలవులు ఉన్నాయి. ఆగస్ట్,28 - నాలుగో శనివారం ఆగస్ట్, 30- జన్మాస్టమి ఆగస్ట్, 31 - శ్రీకృష్టాస్టమి (హైదరాబాద్) -
ఆగస్టులోనే థర్డ్ వేవ్.. ఈ నాలుగు అంశాలు కీలకం: ఐసీఎంఆర్
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మూడోదశ ప్రభావంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమియాలజీ మరియు అంటువ్యాధుల విభాగాధిపతి డాక్టర్ సమిరన్ పాండా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు చివరిలో కోవిడ్-19 థర్డ్ స్టేజ్ దేశాన్ని తాకేఅవకాశం ఉందని తెలిపారు.అయితే సెకండ్ వేవ్ అంత తీవ్రంగా మూడో దశ ఉండకపోవచ్చని వ్యాఖ్యానించారు. సూపర్ స్ప్రెడర్ సంఘటనలను నివారించడం, ఇతర జాగ్రత్త చర్యలతో దీని ఉధృతి ముడిపడి ఉందని తెలిపారు. దీంతో పాటు మరికొన్ని విషయాలను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మూడవ వేవ్ రానుంది, కానీ కేసుల ఉధృతి మాత్రం రెండో వేవ్ కంటే తక్కువగానే ఉంటుందని డాక్టర్ పాండా ఎన్డీటీవీ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ సందర్భంగా నాలుగు ముఖ్యమైన విషయాలను ఆయన ప్రస్తావించారు. మొదటి, రెండో దశలో రక్షించిన రోగనిరోధక శక్తి క్షీణిస్తే అది థర్డ్ వేవ్ విస్తరణకు దారి తీస్తుందన్నారు. ప్రస్తుతం ప్రజల్లో ఉన్న రోగనిరోధక శక్తిని కూడా దాటేసే పుట్టుకొచ్చే కొత్త వేరియంట్ కూడా దీనికి కారణం కావచ్చు. అలాగే కొత్త వేరియంట్‌ను రోగనిరోధక శక్తి నిరోధించినా, వేగంగా విస్తరించే లక్షణంతో లాంటి రెండు కారణాలు థర్డ్‌వేవ్‌కు కారణంగావచ్చు అని పాండా తెలిపారు. ఇక నాలుగవ కారణంగా కరోనా మార్గదర్శకాలను, ఆంక్షలను ముందస్తుగా రాష్ట్రాలు ఎత్తివేస్తే, అది మళ్లీ కేసుల పెరుగుదలకు దారితీస్తుందని డాక్టర్ పాండా చెప్పారు. డెల్టా, డెల్టా ప్లస్ రెండూ ఇప్పటికే దేశాన్ని తాకాయి కనుక డెల్టా వేరియంట్ వలన ముప్పు ఉండకవపోచ్చని అభిప్రాయపడ్డారు. కాగా థర్డ్‌వేవ్ అనివార్యమని ఇప్పటికే దేశంలోని అగ్రశ్రేణి వైద్యులు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పేర్కొంది. అలాగే డెల్టా వేరియంట్ విస్తరణ ద్వారా కోవిడ్ -19 మూడో దశ "ప్రారంభ దశలో" ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ హెచ్చరించారు. సుమారు 111 కి పైగా దేశాలలో దీన్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. మరోవైపు కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. -
ఆగస్టు మాసాంతంలో మూడో వేవ్!: ఐసీఎంఆర్
కరోనా థర్డ్ వేవ్ ఆగస్టు నెలాఖరులో విరుచుకుపడే అవకాశం ఉందని, రెండో వేవ్ తరహాలో ఈసారి తీవ్రత అంతగా ఉండబోదని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్)కు చెందిన ఎపిడెమియాలజీ, ఇన్ఫెక్షన్ వ్యాధుల విభాగం అధినేత డాక్టర్ సమీరన్ పాండా చెప్పారు. వైరస్ వ్యాప్తికి దారితీసే సామూహిక కార్యక్రమాలను నియంత్రించాలని సూచించారు. భారత్‌లో కరోనా థర్డ్ వేవ్ తథ్యమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. కఠినమైన నియంత్రణ చర్యలతో థర్డ్ వేవ్ తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని ఐఎంఏ సూచించింది. కరోనా హెచ్చరికలను ప్రజలు ఖాతరు చేయడం లేదని, వాతావరణ సూచనల తరహాలో తేలిగ్గా తీసుకుంటున్నారని కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టింది. -
నిన్న వడ్డీ రేట్ల కోత.. రేపు సర్వీస్ ఛార్జీల పెంపు..
న్యూఢిల్లీ: సామాన్యులు పొదుపు చేసి దాచుకునే సొమ్ముపై ఇప్పటికే వడ్డీ కోత పెట్టిన తపాలా శాఖ తాజాగా మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. డోర్‌స్టెప్ అందించే బ్యాంకింగ్ సేవలకు సర్వీస్ ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించింది. వడ్డీ తగ్గింపు దేశంలో మారుమూల పల్లెలకు కూడా విస్తరించిన ఇండియన్ పోస్టల్ శాఖ చాలా ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలు అందిస్తోంది. దీంతో లక్షల మంది ప్రజలు ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్లు తీసుకున్నారు. కోట్లాది రూపాయలను పొదుపుగా దాచుకున్నారు. ప్రారంభంలో బ్యాంకు వడ్డీ కంటే ఎక్కువ రాబడిని పోస్టాఫీసులు అందించాయి. అయితే రాను రాను వడ్డీని తగ్గిస్తూ పోయాయి. జులై 1 నుంచి లక్ష లోపు పొదుపు మొత్తాలకు చెల్లించే వడ్డీని సాలుకు 2.75 నుంచి 2.50 శాతానికి తగ్గించింది. జులై 1 నుంచి ఈ తగ్గింపును అమల్లోకి తెచ్చింది. వడ్డీ తగ్గింపుతో ఖాతాదారులు ఉసూరుమంటున్నారు. ఇది చాలదన్నట్టు సర్వీస్ ఛార్జీలను తెరపైకి తెచ్చింది. ‘డోర్‌స్టెప్’కు సర్వీస్ ఛార్జీ పోస్టల్ సేవలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఇంత కాలం ఉచితంగా ఇంటి వద్దకే వచ్చి బ్యాంకు సేవలు అందించే సదుపాయం పోస్టల్ శాఖ కల్పించింది. తాజాగా ఉచిత సర్వీసుకు గుడ్‌బై చెప్పాలని నిర్ణయం తీసుకుంది. డోర్ స్టెప్ సేవలకు సర్వీస్ ఛార్జీలను వసూలు చేస్తామని ప్రకటించింది. ప్రతీ ఒక్క సేవకు రూ. 20 వంతున సర్వీస్ ఛార్జీగా వసూలు చేస్తామని చెప్పింది. ఆగష్టు 1 నుంచి ఈ నిర్ణయం అందుబాటులోకి రానుంది. -
ఆగస్టు కల్లా మాది కరోనా ఫ్రీ దేశం
లండన్: గత సంవత్సర కాలంగా కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అల్లాడిస్తోంది. ఇటీవలే కొన్ని దేశాలు ఈ వైరస్ బారినుంచి మెల్లగా కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ఆగస్టు నాటికి బ్రిటన్ లో కరోనా వైరస్ అంతమైపోతుందని ఆ దేశ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా రిటైరవుతున్న క్లైవ్ డిక్స్ చెప్పారు. ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా తెలిపారు.2022 తొలి మాసాల్లో వ్యాక్సిన్ బూస్టర్ ప్రోగ్రాంను బ్రిటన్ ప్రభుత్వం చేపట్టబోతోంది. కరోనాను ఎదుర్కోవడంలో అందరి శరీరాల్లో యాంటీబాడీలు ఒకేలా పని చేయవు, కనుక అటువంటి వారి కోసం బూస్టర్ షాట్ ను అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది. అలాగే జూలై చివరిలోగా బ్రిటన్ ప్రజలకు కనీసం ఒక్క డోసు వ్యాక్సినేషన్‌ను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు ఇప్పటి వరకు బ్రిటన్‌లో 5 కోట్ల పైగా టీకాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే సగం మంది వయోజనులకు మొదటి డోసు ఇచ్చిన రెండవ దేశంగా బ్రిటన్ రికార్డు సృష్టించింది. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉన్నందున 40 ఏళ్లలోపు వారికి ఆక్స్ఫర్డ్ / ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్‌ను అందించనున్నట్లు బ్రిటిష్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఫైజర్, మోడెర్నా తయారు చేసిన వ్యాక్సిన్ల వైపు అధికారులు మొగ్గు చూపుతున్నారు. డిసెంబర్లో టాస్క్‌ఫోర్స్‌కు తాత్కాలిక నాయకుడిగా నియమితులైన డిక్స్ గత వారం తన పదవి నుంచి వైదొలిగారు. ( చదవండి: Handling Covid Situation: ఓకే.. నాట్ ఓకే..! ) -
ఆగస్ట్‌లో బ్యాంకులకు పలు సెలవులు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో బక్రీద్ సందర్భంగా 1న బ్యాంకులు పనిచేయవు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 15న సెలవు. ఇక రక్షా బంధన్ కారణంగా ఆగస్ట్ 3న అహ్మదాబాద్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో తదితర పట్టణాలలో బ్యాంకులు పనిచేయవు. భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పాట్నా తదితర ప్రాంతాలలో కృష్ణాష్టమి నేపథ్యంలో 11న బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరికొన్ని నగరాలలో 12న జన్మాష్టమి సెలవు ఇచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 22న వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక బ్యాంకింగ్ మార్గదర్శకాల ప్రకారం నెలలో ప్రతీ రెండు, నాలుగు శనివారాలలో బ్యాంకులు పనిచేయని సంగతి తెలిసిందే. -
షెడ్యూల్ ఖరారు చేసేందుకు...
న్యూఢిల్లీ: ఐపీఎల్ 13వ సీజన్‌కు తుది మెరుగులు ఇచ్చేందుకు లీగ్ పాలక మండలి వచ్చేనెల ఆగస్టు 2న సమావేశం కానుంది. కరోనా విలయంతో ఎక్కువగా ఇంటిపట్టునే ఉంటున్న భారత ప్రేక్షకులు మెరుపుల లీగ్ కోసం ఎన్నడూ లేనంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యూఏఈలో జరుగనున్న ఈ టోర్నీ మొదలైతే టీవీలకే అతుక్కుపోవడం ఖాయం. ఇదివరకే సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు ఈవెంట్ నిర్వహిస్తామని లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మంగళవారం కూడా ఆయనే పాలక మండలి సమావేశంపై మీడియాకు తెలిపారు. 2న జరిగే మీటింగ్‌లో లీగ్‌పై తుదిరూపు ఖరారవుతుందని, ఎనిమిది ఫ్రాంచైజీలకు పూర్తి స్పష్టత వస్తుందని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
ఆగస్టులో అల్లకల్లోలమే!
తొలి కేసు నమోదైన మార్చి 2 నుంచి తీసుకుంటే రాష్ట్రంలో తర్వాతి నాలుగు నెలల్లో... అంటే జూన్ చివరికి 16,339 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కానీ జూలైలో 23 రోజుల్లోనే ఏకంగా 34 వేల పైచిలుకు కొత్త కేసులు వచ్చాయి. దీన్నిబట్టి వైరస్ వ్యాప్తి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వైరస్ ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. దాంతో సామాజిక వ్యాప్తి జరిగిందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. రాబోయే నాలుగైదు వారాలు అత్యంత సంక్లిష్టమైనవిగా పేర్కొంది. మొత్తానికి ఆగస్టులో పరిస్థితులు ఎటు దారితీస్తాయోననే ఆందోళన నెలకొంది. సాక్షి, హైదరాబాద్ : మార్చి 2వ తేదీన రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది... ఇప్పుడు ఆ సంఖ్య 50 వేలు దాటింది. ఐదు నెలలు నిండకుండానే కేసుల సంఖ్య ఈ స్థాయికి చేరింది. మార్చి నెలాఖరుకు కేసుల సంఖ్య 77 కాగా, ఏప్రిల్ చివరినాటికి 1,038కి చేరుకుంది. ఆ తర్వాత మే నెలాఖరుకు 2,698కు కేసుల సంఖ్య పెరిగింది. ఇక జూన్ నెలాఖరుకు కేసుల సంఖ్య ఏకంగా 16,339కు చేరు కుంది. ప్రస్తుత జూలై నెలలో 23 రోజుల్లోనే (గురు వారం నాటికి) ఏకంగా 50,826 కేసులు నమోదయ్యాయి. కేవలం 23 రోజుల్లోనే 34 వేల కేసులు రావడం గమనార్హం. అలాగే మరణాలు కూడా ముమ్మరమయ్యాయి. మార్చిలో ఒకటి కాగా, ఏప్రిల్ చివరి నాటికి 28, మే చివరి నాటికి 80, జూన్ నెలాఖరుకు 260, ఈ నెల 23వ తేదీ వరకు 447కు మరణాల సంఖ్య చేరుకుంది. మరోవైపు వైరస్ హైదరాబాద్ మహానగరం నుంచి జిల్లాలకు కూడా వేగంగా విస్తరించింది. అందుకే ఈ వైరస్ సామాజిక వ్యాప్తి అయినట్లు ప్రకటించారు. ఇది మున్ముందు ఎంతటి విపత్తుకు దారితీస్తుందో అంతుచిక్కడంలేదు. అందుకే వచ్చే నాలుగైదు వారాలు అత్యంత సంక్లిష్టమైన రోజులని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెచ్చరించింది. (కరోనా కట్టడిపై చర్యలు తీసుకోవాలి ) ఆగస్టులో ఏం జరుగబోతుంది? ఆగస్టు రావడానికి ఇంకా వారం రోజులుంది. ఈ వారం వ్యాప్తి రోజుల్లో ఎన్ని కేసులు నమోదవుతాయో చెప్పే పరిస్థితి లేదు. ఆ తర్వాత మొదలయ్యే ఆగస్టు నెలలో ఎన్ని కేసులు వస్తాయో ఊహించే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే జూన్ నెలాఖరు నాటికి 16,339 కేసులు మాత్రమే ఉంటే, జులైలో కేవలం 23 రోజుల్లోనే 34 వేల పైచిలుకు కేసులు నమోదయ్యాయి. అంటే దాదాపు మూడు వారాల్లోనే మూడు రెట్లకు మించి కేసులు నమోదయ్యాయి. ఈ నెల చివరకు అంచనా వేసుకుంటే దాదాపు నాలుగు రెట్లు కేసులు పెరిగే అవకాశముందంటున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆగస్టులో అల్లకల్లోలమే ఉంటుందన్న ఆందోళన వైద్య ఆరోగ్యశాఖ వర్గాల్లో నెలకొంది. పైగా ప్రస్తుతం వర్షాకాల సీజన్ నడుస్తోంది. దీంతో జలుబు, దగ్గు, జ్వరాలు పట్టిపీడిస్తాయి. ఫలితంగా వైరస్ మితిమీరిన వేగంతో దూసుకెళ్లే ప్రమాద ఘంటికలు ఉన్నాయంటున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మెడికల్ జర్నల్ లాన్సెట్ కూడా కరోనా రెండో దశ (సెకండ్ వేవ్) ఆగస్టులో ప్రారంభమై, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు తీవ్రంగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు దానికి ముకుతాడు వేయకపోతే అది మరింత విషాదాన్ని మిగుల్చుతుందని హెచ్చరించింది. పైగా మున్ముందు చలికాలం కూడా తోడయ్యే పరిస్థితి ఉండటంతో వైరస్ వ్యాప్తికి పట్టపగ్గాలుండవు. అందువల్ల వైరస్ రెండో దశలోకి వెళ్లడానికి ముందే ముకుతాడు వేయాలి. లేకుంటే రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నది నిపుణుల అంచనా. జ్వరం రాగానే తక్షణ చికిత్స... వైరస్ హైదరాబాద్ మహానగరం నుంచి జిల్లాలకు, ఇప్పుడు గ్రామాలకు విస్తరిస్తోంది. ఎక్కడ ఎలా కరోనా వస్తుందో అంతుచిక్కడం లేదు. ఆగస్టు కల్లోలానికి ముకుతాడు ఎలా వేయాలన్న దానిపై కొన్నిరోజులుగా వైద్య ఆరోగ్యశాఖ ముమ్మరమైన కసరత్తు చేసింది. ఇప్పటివరకు కరోనా నిర్దారణ పరీక్షలు చేయడం, పాజిటివ్ వచ్చిన వారిని ఇళ్లల్లోనో లేదా సీరియస్‌గా ఉంటే ఆసుపత్రుల్లోనో చేర్చి చికిత్స చేస్తున్నారు. అలాగే పరీక్షలు, చికిత్స వంటివన్నీ హెదరాబాద్ కేంద్రంగా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు సాగాలని నిర్ణయించింది. వాస్తవంగా ఇప్పుడు నమోదవుతున్న కేసులన్నీ జ్వరం, జలుబు, ఇతరత్రా లక్షణాలతో ప్రారంభమై ఒక్కసారిగా సీరియస్‌గా మారిపోతున్నాయి. వైరస్ నిర్దారణ పరీక్ష చేసి ఫలితం వచ్చేలోగా పరిస్థితి చేయిదాటిపోతోంది. కొందరు సాధారణ జ్వరం అనుకొని డోలో వంటి మాత్రలు వేసుకుంటున్నారు. తగ్గకపోయేసరికి నిర్దారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఆలస్యం జరిగేసరికి రోగికి వైరస్ ఇన్ఫెక్షన్గా మారి ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. అలాంటి కేసులు ఆసుపత్రుల వరకు వచ్చి, వెంటిలేటర్‌పైకి వెళ్లే పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి వస్తే ఏమేరకు కాపాడగలమన్నది ప్రశ్న. అలాంటి వాటిల్లోనే మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అందుకే ప్రభుత్వం సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఎవరికి జ్వరం వచ్చినా కరోనా నిర్దారణ పరీక్షకంటే ముందే వారిని ఇంటింటికి వెళ్లి గుర్తించాలి. లేదా బాధితుడు తక్షణం సమీప డాక్టర్‌ను సంప్రదించేలా ప్రణాళిక రచించారు. జ్వరం వచ్చిందంటే చాలు నిర్దారణ పరీక్ష కంటే ముందే కరోనాకు ఇప్పుడిస్తున్న చికిత్సను తక్షణమే ప్రారంభిస్తారు. ఇన్ఫెక్షన్ రాకుండా యాంటిబయోటిక్స్, జ్వరం, దగ్గు, జలుబు తగ్గేందుకు, రోగనిరోధక శక్తి పెరిగేందుకు ఇస్తున్న కిట్లను అందజేసి చికిత్సను ప్రారంభిస్తారు. ఆ సమయంలోనే కరోనా నిర్దారణ పరీక్ష చేస్తారు. ఇలా తక్షణం చికిత్స చేయడం ద్వారా కరోనాతో ఇన్ఫెక్షన్ రాకుండా రోగిని కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుందని వైద్య వర్గాలు తెలిపాయి. దాంతోపాటు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, డయాగ్నస్టిక్ సెంటర్లలో విరివిగా యాంటిజెన్ టెస్ట్‌లు చేస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) స్థాయి నుంచీ నిర్దారణ పరీక్ష, చికిత్సలు అందించే ఏర్పాట్లు చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కరోనా పరీక్షలు, చికిత్సలు జిల్లా, మండల స్థాయి వరకు ఇలా వికేంద్రీకరణ అవుతాయి. ఈ వ్యూహంతో కరోనాను కట్టడి చేయాలని సర్కారు నిర్ణయించింది. ఆ మేరకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని నిర్ణయించింది. జ్వరం వచ్చిన వ్యక్తి ఇన్ఫెక్షన్కు గురై వెంటిలేటర్ మీదకు రాకుండా చేయడమే ఇప్పుడున్న ప్రధాన కర్తవ్యమని వైద్య వర్గాలు చెబుతున్నాయి. కరోనా వేగానికి మించి ఇంకో నాలుగైదు అడుగులు ముందుంటేనే దాని ధాటిని ఎదుర్కోనగలమని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. వైరస్ వ్యాప్తికాక ముందే గుర్తించి మరణాల సంఖ్యను తగ్గించడమే ప్రధానమని అంటున్నారు. -
వారంపైగా ఎంసెట్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రవేశ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహించేలా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆన్లైన్ పరీక్షల నిర్వహణ సంస్థ అయిన టీసీఎస్ స్లాట్స్ (ఖాళీ తేదీలు) సెప్టెంబర్ నెలలో లేనందున, ఆగస్టులోనే సెట్స్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. ఈనెలలోనే ఈసెట్, ఎంసెట్ సహా అన్ని సెట్స్‌ను నిర్వహించాల్సి ఉన్నా కోర్టు కేసు కారణంగా ప్రభుత్వం వాయిదా వేసింది. అయితే అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెట్స్ నిర్వహించి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 15 నుంచి వీటిని నిర్వహించేలా షెడ్యూలు ఖరారుపై కసరత్తు ప్రారంభించింది. దీనిపై శనివారం అడ్వొకేట్ జనరల్‌తోనూ చర్చించి హైకోర్టుకు తెలియజేయాలని నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామ్‌చంద్రన్‌తో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి తదితరులు శుక్రవారం సమావేశమై సెట్స్ నిర్వహణపై చర్చించారు. ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ముందుకు సాగాలని సమావేశంలో నిర్ణయించారు. కోర్టు ఆమోదం లభించగానే షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. వారంపైగా ఎంసెట్ పరీక్షలు కరోనా నేపథ్యంలో సెట్స్ నిర్వహణలో భౌతిక దూరం పాటించేలా మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యా మండలి నిర్ణయించింది. ఇందుకోసం ఒక్కో సెషన్లో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్యను 15–16 వేలకు తగ్గించనున్నట్లు తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. సాధారణంగా ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ పరీక్షలను వారంపైగా నిర్వహించాల్సి ఉంది. 70 వేల మందికిపైగా హాజరయ్యే అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడు సెషన్లలో నిర్వహించనుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒక్కో సెషన్‌కు విద్యార్థుల సంఖ్యను తగ్గించి ఇంజనీరింగ్ ఎంసెట్‌ను ఐదు రోజుల్లో 8 నుంచి 9 సెషన్లలో, అగ్రికల్చర్ ఎంసెట్‌ను మూడ్రోజుల్లో నాలుగైదు సెషన్లలో నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. అలాగే 55,012 దరఖాస్తులు వచ్చిన ఐసెట్ మూడు లేదా నాలుగు సెషన్లలో, 43,356 దరఖాస్తులు వచ్చిన ఎడ్‌సెట్‌ను మూడు సెషన్లలో, 27,978 దరఖాస్తులు వచ్చిన ఈసెట్‌ను రెండు సెషన్లలో, 21,704 దరఖాస్తులు వచ్చిన పీజీఈసెట్‌ను వీలైతే ఒకే సెషన్లో, 28,805 దరఖాస్తులు వచ్చిన లాసెట్‌ను రెండు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో ఫైనల్ సెమిస్టర్ ఫైనల్ సెమిస్టర్ విద్యార్థుల పరీక్షలను ఆగస్టు మూడో వారంలో లేదా సెప్టెంబర్‌లో నిర్వహించాలని ఉన్నత విద్యా శాఖ భావిస్తోంది. దీనికి సంబంధించిన కేసు కూడా కోర్టులో ఉండటంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఏఐసీటీఈ మార్గదర్శకాలను కోర్టుకు వివరించి పరీక్షల నిర్వహణ అనుమతి పొందాలని భావిస్తోంది. ఆ తరువాత పరీక్షల నిర్వహణకు యూనివర్సిటీలు షెడ్యూలు జారీ చేసేలా కసరత్తు చేస్తోంది. -
కెంటకీతో సెరెనా ఆట షురూ
లెక్సింగ్టన్: అమెరికా స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ కెంటకీ ఓపెన్‌తో పునరాగమనం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఆగస్టు 10 నుంచి జరుగనున్న ఈ టోర్నీలో 23 గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల (సింగిల్స్) విజేత సెరెనాతో పాటు 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ కూడా పాల్గొననున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. -
సీపీఎల్‌కు ఓకే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అతి త్వరలోనే క్రికెట్ అభిమానులకు ధనాధన్ క్రికెట్ వినోదం లభించనుంది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోగా... ఈనెల 8న ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభమైంది. తాజాగా టి20 ఫార్మాట్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు కూడా లైన్ క్లియర్ అయ్యింది. ప్రేక్షకులు లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించుకోవచ్చని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం నిర్వాహకులకు అనుమతి ఇచ్చింది. దాంతో సీపీఎల్ ఏడో సీజన్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని రెండు వేదికల్లో ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా జరగనుంది. మొత్తం ఆరు జట్లు (బార్బడోస్ ట్రైడెంట్స్, గయానా అమెజాన్ వారియర్స్, జమైకా తలవాస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా జూక్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) ఈ లీగ్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌తో కలుపుకొని మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. సీపీఎల్ నిర్వాహకులకు, ట్రినిడాడ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది టోర్నీకి బయలుదేరేముందు 14 రోజులు... ట్రినిడాడ్‌లో అడుగుపెట్టాక 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ట్రినిడాడ్ చేరుకున్న వెంటనే అందరికీ కోవిడ్–19 పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత 7 రోజులకు, 14 రోజులకు మళ్లీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు జట్లూ ట్రినిడాడ్లోనే ఒకే హోటల్లో బస చేస్తాయి. టోర్నీకి ముందుగానీ, టోర్నీ మధ్యలోగానీ ఎవరికైనా కోవిడ్–19 పాజిటివ్ వస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలోనే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ దేశ సరిహద్దులను మూసివేసింది. సీపీఎల్ కారణంగా బయటి వారిని తొలిసారి దేశంలోకి అనుమతి ఇవ్వనుంది. ట్రినిడాడ్‌లో ఇప్పటివరకు కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. జూలై 9 వరకు ట్రినిడాడ్‌లో కేవలం 133 కోవిడ్–19 పాజిటివ్ కేసులు రాగా, ఎనిమిది మంది మాత్రమే మృతి చెందారు. -
ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!
న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) భావిస్తోంది. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్, పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీతో(ఎన్ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్ ఉన్నాయి. ఈ మేరకు ఎంపిక చేసిన వైద్య సంస్థలు, హాస్పిటళ్లకు తాజాగా లేఖ రాసింది. జూలై 7వ తేదీలోగా ఎన్రోల్మెంట్ పూర్తి చేయాలని కోరింది. భారత్‌లో దేశీయంగానే తయారు చేస్తున్న తొలి వ్యాక్సిన్ ఇదేనని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ ఈ లేఖలో పేర్కొన్నారు. ఆ సమయానికి సాధ్యమా?: భారత్‌లో కోవాక్సిన్ మానవ ప్రయోగాలు ఇంకా మొదలుకాలేదు. దీంతో ఆగస్టు 15లోగా టీకా రావటం దాదాపు అసాధ్యమన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఏ టీకా తయారీ అయినా మూడు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకోవాలి. ఒక్కో దశకు ఏడు నెలల వరకు సమయం పట్టొచ్చు. భారత్ బయోటెక్‌కు కోవాక్సిన్ విషయంలో తొలి రెండు దశలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనుమతులు లభించాయి. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇవి త్వరగా ముగిసినా మూడో దశ ట్రయల్స్ పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తయ్యాక సమాచారాన్ని ఫైలింగ్ చేసి... వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొంది, మందు భారీగా ఉత్పత్తి చేయటానికి మరికొంత సమయం పడుతుందన్నది విశ్లేషకుల మాట. అన్నీ సవ్యంగా... వేగంగా జరిగితే నవంబర్– డిసెంబర్ నాటికి కోవాక్సిన్ అందుబాటులోకి రావచ్చన్నది ఆశావహుల మాట. (రికార్డు స్థాయిలో రికవరీ) -
ఆగస్టు 12న వైఎస్సార్ చేయూత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికలకు ముందు మహిళా సాధికారతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మరో కీలక హామీ అమలుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు వయసు ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో రూ.75 వేలు ఆర్థిక సహాయం చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా 24 లక్షల నుంచి 25 లక్షల మంది పేద మహిళలు లబ్ధి పొందుతారు. నాలుగేళ్లలో ఈ పథకం అమలుకు రూ.18 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఆగస్టు 12న ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ వివరాలను సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) విలేకరుల సమావేశంలో వివరించారు. ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాల కోసం.. ► రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన భవిష్యత్ తరాల కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలు చేయనుంది. ప్రస్తుతం గర్భిణులు, చిన్నారులకు ఇస్తున్న పౌష్టికాహారం కంటే మరింత శక్తివంతమైన పౌష్టికాహారం అందిస్తుంది. ► గిరిజన ప్రాంతం(ఏజెన్సీ)లో 77 మండలాల్లో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, మిగిలిన చోట్ల(మైదాన ప్రాంతం) వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు కానుంది. ఈ పథకం అమలుకు ఈ ఏడాది రూ.1,863.11 కోట్లు ఖర్చు చేయనుంది. ► గర్భిణులు, చిన్నారులకు పౌష్టికాహారం కోసం 2018–19లో రూ.762 కోట్లను మాత్రమే ఖర్చు చేయగా, 2019–20లో ప్రస్తుత ప్రభుత్వం రూ.1,076 కోట్లను ఖర్చు చేసింది. చిరు వ్యాపారులకు ‘జగనన్న తోడు’ ► చిరు వ్యాపారులు, తోపుడు బండ్లపై వ్యాపారం చేసుకునే వారు, నెత్తిమీద బుట్ట పెట్టుకుని సరుకులు అమ్ముకుని జీవించే వాళ్లు.. కొండపల్లి, ఏటికొప్పొక కొయ్య బొమ్మలు, మచిలీప్నటం, శ్రీకాళహస్తి కలంకారి వంటి సంప్రదాయ హస్తకళలపై ఆధారపడి జీవనం సాగించేవాళ్లకు ‘జగనన్న తోడు’ పథకం ద్వారా సున్నా వడ్డీకి ఒక్కొక్కరికి రూ.పది వేల చొప్పున బ్యాంకుల నుంచి రుణం ఇప్పించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ► ఈ పథకాన్ని అక్టోబర్‌లో ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా దాదాపు తొమ్మిది లక్షల మందికిపైగా లబ్ధిపొందుతారని అంచనా. ఏడాదికి దాదాపు రూ.56 కోట్ల మేర వడ్డీని ప్రభుత్వం భరించనుంది. ఇక తల్లుల ఖాతాల్లో ఫీజు రీయింబర్స్మెంట్ ► ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి టీడీపీ సర్కార్ 2018–19 విద్యా సంవత్సరంలో బకాయిపడ్డ రూ.1,291 కోట్లను ప్రస్తుత ప్రభుత్వం ఇటీవల చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.3,780 కోట్లు విడుదల చేసింది. ► ఇకపై ఏడాదికి నాలుగు విడతలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను ‘జగనన్న విద్యా దీవెన’ పథకం కింద నేరుగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఒక్కో త్రైమాసికం పూర్తికాగానే ఆ మేరకు డబ్బు తల్లుల ఖాతాల్లో జమ చేస్తుంది. ► కాలేజీల్లో వసతులు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందుతున్న చదువులపై తల్లిదండ్రుల సమీక్ష, పరిశీలనకు ఈ విధానం ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా.. ► హైకోర్టు ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని ఇళ్ల పట్టాల పంపిణీకి జారీ చేసిన జీవోలో మార్పులు చేర్పులు చేయడానికి మంత్రివర్గం అంగీకరించింది. ► సర్కార్ ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుని.. 5 ఏళ్ల పాటు నివాసం ఉన్న తర్వాతనే అమ్ముకునే వెసులుబాటును కల్పించింది. గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రానికి గ్రీన్ సిగ్నల్ ► విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం గ్రామంలో గ్రేహౌండ్స్ శిక్షణా స్థలం కోసం 385 ఎకరాలను కేటాయించింది. ఈ ప్రభుత్వ భూమిని కొందరు సాగు చేసుకుంటున్నారు. వారికి రూ.10.88 కోట్లను పరిహారంగా అందించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. బిల్డ్ ఏపీలో భాగంగా 11 స్థలాల అమ్మకానికి ఓకే ► బిల్డ్ ఏపీలో భాగంగా గుర్తించిన 16 స్థలాల్లో 11 స్థలాలæ (విశాఖపట్నంలో 7, గుంటూరులో 4) అమ్మకానికి మంత్రివర్గం అంగీకారం తెలిపింది. గుంటూరులో ఒక చోట, విశాఖలో మూడు ప్రాంతాల్లో గుర్తించిన స్థలాలను కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్బీసీసీ ద్వారా అభివృద్ధి చేసి, ఆ తర్వాత ఈ స్థలాలను ఈ–వేలం ద్వారా విక్రయించాలని నిర్ణయం. ► గుంటూరులో ఒక ప్రాంతంలో స్థలాన్ని అభివృద్ధి చేయడాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేసింది. కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ► విజయనగరం జిల్లా కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం. జేఎన్టీయూ–కాకినాడ నేతృత్వంలో నాలుగో కాలేజీగా ఏర్పాటు చేయాలని నిర్ణయం. ► ఇందులో 50 శాతం సీట్లను ఎస్టీ విద్యార్థులకు, మిగిలిన సీట్లను ఇతర వర్గాలకు కేటాయిస్తారు. ఈ కాలేజీ ఏర్పాటుకు రూ.153.85 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. రామాయపట్నం పోర్టు డీపీఆర్‌కు ఆమోదం.. ► రామాయపట్నం పోర్టు నిర్మాణానికి రైట్స్ సంస్థ ఇచ్చిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)కు ఆమోదం. పేజ్–1 కింద 36 నెలల్లో రూ.3,736 కోట్ల వ్యయంతో పోర్టు నిర్మాణానికి ప్రణాళిక. పోర్టు నిర్మాణ పనులకు అవసరమైన 802 ఎకరాల సేకరణకు రూ.200 కోట్లను విడుదల చేయడానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గండికోట, వెలిగొండ నిర్వాసితులకు పునరావాసం ► గండికోట జలాశయంలో గరిష్ట స్థాయిలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేయడానికి వీలుగా ఏడు ముంపు గ్రామాల్లోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి రూ.522.85 కోట్ల మంజూరుకు కేబినెట్ ఆమోదం. ► వెలిగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కోసం రూ.1,301.56 కోట్లు, తీగలేరు, ఈస్ట్రన్ మెయిన్ కెనాల్ భూసేకరణకు రూ.110 కోట్లు మొత్తం రూ.1,411.56 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్. పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం ► రాష్ట్రంలో సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, జీఎస్టీ వంటి పన్ను ఎగవేతలపై ఉక్కుపాదం మోపేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ► ఆర్థిక శాఖ పరిధిలో ఈ విభాగం పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు 55 పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమల సన్నిధి గొల్లలకు వారసత్వపు హక్కు ► తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో తిరుమల వేంకటేశ్వరుని ఆలయం తలుపులు తీసే సంప్రదాయాన్ని అనాదిగా సన్నిధి గొల్లలు కొనసాగిస్తున్నారు. ఈ దృష్ట్యా వారి కుటుంబీకు లకు వారసత్వంగా వస్తున్న హక్కులను పరిరక్షించేందుకు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు కేబినెట్ ఆమోదం. ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు ఓకే ► కర్నూలు జిల్లా పిన్నాపురంలో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మెగా ప్రాజెక్టులో భాగంగా 550 మెగావాట్ల విండ్ పవర్, 1,200 మెగావాట్ల హైడ్రో, 1,000 మెగావాట్ల సోలార్ పవర్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ ప్రాజెక్టుకు గోరకల్లు రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని నాన్ కన్జమ్టివ్ పద్ధతిలో కేటాయించింది. ► ఎన్నికలకు ముందు అంటే.. ఫిబ్రవరి, 2019లో గత ప్రభుత్వం హడావుడిగా ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. అప్పటి ప్రభుత్వం ఎకరా రూ.2.5 లక్షల చొప్పున 4,700 ఎకరాల భూమిని గ్రీన్కో సంస్థకు కేటాయించింది. ఇప్పుడు అదే సంస్థకు.. అదే ప్రాజెక్టుకు ఎకరాకు రెట్టింపు ధర.. అంటే రూ.5 లక్షల చొప్పున భూమిని ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించింది. ► ప్రతి మెగావాట్‌కు ప్రతి ఏటా గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ చార్జ్ కింద రూ.లక్ష చెల్లింపునకు, 25 ఏళ్ల తర్వాత రూ.2 లక్షల చెల్లింపునకు ఆ సంస్థ అంగీకరించింది. దీని వల్ల ఏడాదికి రూ.32 కోట్ల అదనపు ఆదాయం సర్కార్‌కు వస్తుంది. ఈ ప్రాజెక్టు వందేళ్లు పని చేస్తుంది. అంటే.. సర్కార్‌కు అదనంగా రూ.4 వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుంది. భోగాపురం ఎయిర్‌పోర్టు భూముల్లో సర్కార్ అధీనంలోకి 500 ఎకరాలు ► భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గత సర్కార్ జీఎమ్మార్‌కు 2,700 ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు 2,200 ఎకరాల స్థలంలోనే విమానాశ్రయ నిర్మాణానికి ఆ సంస్థ అంగీకరించింది. తాజా ఒప్పందం కారణంగా ప్రభుత్వానికి 500 ఎకరాలు మిగిలింది. ► ప్రస్తుతం అక్కడ ఎకరా రూ.3 కోట్ల ధర పలుకుతోంది. అంటే.. ప్రభుత్వానికి రూ.1,500 కోట్ల ఆదాయం వచ్చింది. ► ప్రభుత్వంలో అవినీతి లేకపోతే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందో ఇంటిగ్రేటెడ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్టులే ఉదాహరణగా నిలిచాయని మంత్రివర్గ సమావేశంలో సీఎం వైఎస్ జగన్, పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు. మరిన్ని నిర్ణయాలు ఇలా.. ► ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ సొసైటీ కింద తెలుగు, సంస్కృత అకాడమీ సొసైటీ ఏర్పాటుకు ఆమోదం. తిరుపతిలో ఏర్పాటుకు సూత్రప్రాయంగా నిర్ణయం. ► గుంటూరు, శ్రీకాకుళం, మచిలీపట్నం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో 282 టీచింగ్, నాన్‌టీచింగ్ పోస్టుల నియామకానికి గ్రీన్ సిగ్నల్. ► ఏలూరు, ఒంగోలు, తిరుపతిలోని నర్సింగ్ కాలేజీల్లో 144 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అంగీకారం. ప్రజారోగ్య రంగంలో సదుపాయాలను మెరుగు పరచడంపై దృష్టి సారింపు. ► ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ మానిటరింగ్ కమిషన్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి ఆమోదముద్ర. ఏపీ అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్లో 55 పోస్టుల భర్తీకి ఆమోదం. 9 గంటల ఉచిత విద్యుత్‌కు దన్నుగా.. ► రైతులకు పగటి పూటే తొమ్మిది గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేయడం కోసం 10 వేల మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ► పోలవరం జల విద్యుదుత్పత్తి కేంద్రం రివర్స్ టెండరింగ్‌లో రూ.405 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యేలా బిడ్ దాఖలు చేసిన మేఘా సంస్థకు ఈ కాంట్రాక్టు అప్పగించేందుకు హైకోర్టు ముందు జాయింట్ మెమొరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్ ఫైల్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
చైనాలో ఆగస్టులోనే కరోనా విజృంభణ!
వాషింగ్టన్: ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో సంచలన విషయం బయటపడింది. చైనాలో ఉద్భవించిన దీని గురించి గతేడాది డిసెంబర్లోనే ప్రపంచానికి తెలిసినప్పటికీ, అంతను మునుపే ఆ దేశంలో వైరస్ విజృంభణ మొదలైందని ఓ అధ్యయనం స్పష్టం చేసింది. సాటిలైట్ నుంచి తీసిన ఫొటోల ద్వారా గతేడాది ఆగస్టు నుంచే కరోనా ఉనికి ప్రారంభమైందని తెలిపింది. కిక్కిరిసిన ఆసుపత్రులు- పార్కింగ్, అక్కడి జనాభా సెర్చ్ ఇంజిన్‌లో వెతికిన పదాల ఆధారంగా ప్రఖ్యాత హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఈ విషయాన్ని వెల్లడించింది. (ఏమి ఆట: కరోనా కాలంలో బొమ్మలాట!) 2019లో సాటిలైట్ ఫొటోల ఆధారంగా వూహాన్లో ఆసుపత్రుల దగ్గర జనాల రద్దీ అధికంగా కనిపించిందని, అనూహ్య రీతిలో పార్కింగ్ స్థలం కూడా నిండిపోయిందని తెలిపింది. పైగా అదే సమయంలో ఎక్కువ మంది జనాలు కరోనా ముఖ్య లక్షణమైన దగ్గుతో పాటు విరేచనాలు వంటి పదాలను గూర్చి సెర్చింజన్లో వెతికారని పేర్కొంది. ఇంతకు మునుపు సీజన్ల కన్నా భిన్నంగా ఆగస్టులో ఈ పదాల గురించి వెతికిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. దీంతో అప్పటి నుంచే వైరస్ వ్యాప్తి ప్రారంభమైందని అభిప్రాయపడింది. హువాన్ మార్కెట్లో కరోనాను గుర్తించే సమయానికి ముందే అది ఉనికిలో ఉందన్న వాదనకు మా ఆధారాలు మద్దతిస్తున్నాయంది. కాగా చైనాలో సోమవారం వరకు 83,040 కేసులు నమోదవగా 78,341 మంది కోలుకున్నారు (చైనాను మించిన మహారాష్ట్ర) -
ఆగస్టులో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య టి20 సిరీస్
భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఆగస్టు చివరి వారంలో సఫారీ గడ్డపై మూడు టి20ల సిరీస్ జరిగే అవకాశం ఉంది. ఇది ముందే అనుకున్న షెడ్యూలు కానప్పటికీ దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్, సీఎస్ఏ డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ ప్రత్యేకంగా అభ్యర్థించారు. అయితే కోవిడ్ మహమ్మారి పరిస్థితులపైనే ఇప్పుడీ సిరీస్ ఆధారపడింది. పరిస్థితి అదుపులో ఉంటే, ప్రభుత్వాల నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే ఈ పొట్టి మ్యాచ్‌ల సిరీస్ నిర్వహించాలని ఇరు దేశాల క్రికెట్ బోర్డులు భావిస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో ఈ సిరీస్ విషయమైన జరిగిన చర్చలు ఫలప్రదంగా సాగాయని ఫాల్ అన్నారు. బీసీసీఐ ఒప్పందం ప్రకారం టోర్నీ జరిగేందుకు సహకరిస్తుందని చెప్పారు. ఈ ద్వైపాక్షిక సిరీస్ తమకు కీలకమన్నారు. ప్రేక్షకులు లేకుండా గేట్లు మూసేసి నిర్వహించాలని ఆదేశించినా అందుకు సిద్ధమేనని ఆయన పేర్కొన్నారు. భారత ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే సిరీస్ జరుగుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ‘ముందుగా మేం ఆటగాళ్లకు గ్రీన్జోన్లో శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాల్సివుంటుంది. ఆ తర్వాత అనుకూల పరిస్థితులు ఏర్పడితే దక్షిణాఫ్రికాలో ఆడతాం’ అని చెప్పారు. ఈ సీజన్ ఐపీఎల్ ఎలాగైన నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐ కూడా ఈ సిరీస్ జరగాలనే కోరుకుంటుంది. తద్వారా ఐపీఎల్‌కు దక్షిణాఫ్రికా నుంచి సహకారం పొందాలని ఆశిస్తోంది. -
ఆగస్టు 23న జేఈఈ–అడ్వాన్స్డ్ పరీక్ష
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) అడ్వాన్స్డ్ పరీక్షను ఆగస్టు 23వ తేదీన నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. మే 17న జరగాల్సిన ఈ పరీక్ష లాక్డౌన్ వల్ల వాయిదా పడింది. జేఈఈ–మెయిన్స్ పరీక్షలను జూలై 18 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాక 10–15 రోజుల్లో ఫలితాలను వెల్లడించనున్నారు. టాప్ మార్కులు సాధించిన 2.5 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ రాసేందుకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత కల్పించనున్నారు. ఆ దరఖాస్తులకు నాలుగైదు రోజుల సమయం ఇస్తారు. ఆగస్టు 23న పరీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఆ తరువాత జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారంతో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనుంది. సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంజనీరింగ్ తరగతులను ప్రారంభించేలా ఇటీవల ఏఐసీటీఈ అకడమిక్ షెడ్యూల్ ప్రకటించింది. ‘పీఎం రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్’లో సవరణలు దేశంలో పరిశోధనలను మరింతగా ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి రీసెర్చ్ ఫెలోషిప్ స్కీమ్‌లో పలు సవరణలు చేసినట్లు రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ వెల్లడించారు. ఈ ఫెలోషిప్ పొందడానికి అవసరమైన నిర్దేశిత గేట్ స్కోర్ తగ్గించినట్లు పేర్కొన్నారు. దీన్ని 750 నుంచి 650కి తగ్గినట్లు స్పష్టం చేశారు. అలాగే లేటరల్ ఎంట్రీ అనే వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పీఎంఆర్ఎఫ్ అనుమతి పొందిన విద్యాసంస్థల్లో పీహెచ్డీ చేస్తున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ కోసం లేటరల్ ఎంట్రీ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. -
దారుణంగా పడిపోయిన ఉద్యోగాల కల్పన
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికమందగమనం, వినియోగదారుల డిమాండ్ పడిపోతున్న నేపథ్యంలో మరో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. జూలై మాసంతో పోలిస్తే, ఆగస్టుమాసంలో ఉద్యోగాల కల్పన దారుణంగా పడిపోయింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) పేరోల్ డేటా ప్రకారం ఆగస్టులో సుమారు 13 లక్షల ఉద్యోగ అవకాశాలు మాత్రం రాగా, అంతకుముందు నెలలో (జూలై) ఈ సంఖ్య 14.49 లక్షలు. 2018-19లో ఇఎస్ఐసితో కొత్త చందాదారుల స్థూల నమోదు 1.49 కోట్లు అని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ (ఎన్ఎస్ఓ) ఒక నివేదికలో తెలిపింది. 2017 సెప్టెంబర్ నుండి 2019 ఆగస్టు వరకు సుమారు 2.97 కోట్ల మంది కొత్త చందాదారులు ఈ పథకంలో చేరినట్లు కూడా నివేదిక వివరించింది. ఇఎస్ఐసీ, రిటైర్మెంట్ ఫండ్ బాడీ ఈపీఎఫ్‌వో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ నిర్వహించే వివిధ సామాజిక భద్రతా పథకాల్లో చేరిన కొత్త చందాదారుల పేరోల్ డేటా ఆధారంగా ఎన్ఎస్ఓ నివేదికను రూపొందిస్తుంది. సెప్టెంబర్ 2018 నుండి ప్రారంభమయ్యే కాలాన్ని కవర్ చేస్తూ ఏప్రిల్ 2018 నుండి ఈ మూడు సంస్థల పేరోల్ డేటా లేదా కొత్త చందాదారుల డేటాను విడుదల ఎన్ఎస్ఓ చేస్తోంది. దీని ప్రకారం సెప్టెంబర్ 2017 నుండి మార్చి 2018 వరకు ఇఎస్ఐసీ లో కొత్త నమోదులు 83.35 లక్షలుగా ఉందని నివేదిక చూపించింది. ఈ ఏడాది జూలైలో 11.71 లక్షలతో పోలిస్తే ఆగస్టులో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఇపిఎఫ్ఓ) తో 10.86 లక్షల కొత్త ఉద్యోగాలు మాత్రమే నమోదయ్యాయి. 2018-19లో నికర ప్రాతిపదికన 61.12 లక్షల మంది కొత్త చందాదారులు ఇపిఎఫ్ఓ నిర్వహిస్తున్న సామాజిక భద్రతా పథకాలలో చేరారు. అదేవిధంగా, నికర కొత్త నమోదులు (సెప్టెంబర్ 2017 - మార్చి 2018 వరకు) 15.52 లక్షలు. కాగా సెప్టెంబర్ 2017 - 2019 ఆగస్టులో ఇపీఎఫ్ పథకంలో చేరిన కొత్త చందాదారులు సుమారు 2.75 కోట్ల మంది. చందాదారుల సంఖ్య వివిధ వనరుల నుండి వచ్చినందున, ఈ అంచనాలు సంకలితం కాదని ఎన్ఎస్ఓ నివేదిక పేర్కొంది. -
టీడీపీ నేతల గుండెల్లో ‘ఆగస్టు’ గండం
సాక్షి, అమరావతి: ఆగస్టు ఈ పేరు చెబితేనే తెలుగుదేశం నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో ఆగస్ట్ నెల పేరు చెప్తే.. తెలుగుదేశం పార్టీ నాయకులు బేజారు. తెలుగుదేశం పార్టీలో సంభవించిన కీలక పరిణామాలకు ఆగస్టు నెలకు ఉన్న సంబంధమే ఈ భయానికి కారణం. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారం కోల్పోయిన తరువాత వరుసగా పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలు టీడీపీలో మరో ఆగస్టు సంక్షోభం తప్పదనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దెబ్బకు దారుణమైన ఓటమిని టీడీపీ చవి చూసింది. తెలుగుదేశంలోనే ఉంటే భవిష్యత్ ఉండదని తెలిసి ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులైన సుజన చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు టీడీపీకి బీజేపీలో చేశారు. ఏకంగా టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేశారు. తరువాత అన్నం సతీష్ ప్రభాకర్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీజేపీ తీర్దం పుచ్చుకున్నారు. అనంతరం మరికొందరు ముఖ్యమైన టీడీపీ నేతలు బీజేపీలో చేరారు. మరోవైపు త్వరలోనే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కీలక నేతలు కూడా టీడీపీ నుంచి తమ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. ఈ ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌లో కీలక పరిణాలు చోటు చేసుకుంటాయని కమలం పార్టీ నేతలు చెబుతున్న మాటలు ఎటుదారితీస్తాయో అని టీడీపీ ఆందోళనగా ఉంది. రాజ్యసభలో టీడీపీ పక్షాన్ని వీలినం చేసిట్లు ఏపీలో కూడ టీడీపీ శాసన సభ పక్షాన్ని బీజేపీలో వీలీనం చేసే దిశగా కూడా కొంత మంది టీడీపీ ప్రజా ప్రతినిధులు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.. దీనికి తోడు ఆగస్టు 11 తరువాత రాష్ర్టంలో కీలక పరిణామాలు తప్పవని బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలు టీడీపీని కుదిపేస్తున్నాయి. -
చరిత్ర అద్దంలో మన తె(వె)లుగు ‘కొండ’
‘మనం మనస్ఫూర్తిగా కోరుకున్న స్వరాజ్యం అనే ఒకే ఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం చేరుకోగానే ఈ స్వాతంత్య్రయోధులలో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్ అవినీతికి ఆలవాలమైపోతున్నది... పైసా ఆదాయం లేనివారు ఇప్పుడు మహారాజులలాగా పెద్దపెద్ద కార్లలో తిరుగుతున్నారు.....’ 1947 డిసెంబర్లో, ప్రపంచ చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చెప్పే స్వేచ్ఛా భారతి ఆవిర్భావం తరువాత మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యథాభరిత వాక్యాలివి. గాంధీజీకి ఇలాంటి లేఖ ఒకటి అందిందని ‘మార్చ్’ అనే పత్రిక పెద్ద పెద్ద అక్షరాలతో వార్తా కథనం కూడా ప్రచురించింది. ఆ వార్తకు శీర్షిక ‘కాంగ్రెస్ వర్స్ దేన్ ది బ్రిటిష్’. కాంగ్రెస్ పతానావస్థ గురించి అలా లేఖ రాసిన వారు కొండా వెంకటప్పయ్యపంతులు. వెంకటప్పయ్య అంటే హిందూ మహాసభ సభ్యుడేమీ కాదు. కమ్యూనిస్టు కూడా కాదు. గాంధీ మార్గాన్ని తుచ తప్పకుండా అనుసరించినవారు. ఉత్తర భారతంలో బాబూ రాజేంద్రప్రసాద్ వలె, దక్షిణాదిన రాజాజీ వలె, తెలుగు ప్రాంతాల నుంచి గాంధీజీకి విశ్వాసపాత్రులుగా ఖ్యాతి గాంచినవారు వెంకటప్పయ్య. భారత జాతీయ కాంగ్రెస్‌తో సుదీర్ఘ అనుబంధం కలిగినవారు చరిత్రలో చాలా తక్కువగా కనిపిస్తారు. దేశం కోసం ఆ సంస్థ జరిపిన పోరాటాన్ని, చివరికి స్వతంత్ర భారతాన్ని చూసిన అతి తక్కువ మందిలో కొండా వెంకటప్పయ్య ఒకరు (స్వీయ చరిత్రలో ఆయన, దానికి ముందుమాట రాసిన ప్రఖ్యాత కవి కాటూరి వేంకటేశ్వరరావు ‘కొండ వేంకటప్పయ్య పంతులు’ అనే రాయడం గమనార్హం). కాటూరి వారు ఆ ముందుమాటలో ‘గాంధీజీ పిలుపు పంతులుగారి గోపికా హృదయమునకు వేణునాదమైనది’ అని కవితాత్మకంగా చెప్పినప్పటికీ, భారత జాతీయ కాంగ్రెస్ (దీనిని కొండా స్వీయ చరిత్రలో ‘భారత దేశీయ మహాసభ– పేజీ 89– అని పేర్కొనడం విశేషం) మూడో సమావేశం మొదలు, 1947 వరకు ఆ సంస్థ ప్రస్థానానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచినవారాయన. కానీ భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలోనే కాదు, దక్షిణ భారత చరిత్రలో కూడా కొండా పేరు చాలా కొంచమే. జాతీయ కాంగ్రెస్‌తో, ఆంధ్రమహాసభతో ఆయన ఆరు దశాబ్దాల పాటు కలసి నడిచారు. అయినా చరిత్రలో ‘కొండ’ స్థానం కొంచెమే. ఇందుకు కారణం, కాటూరి వారు తన ముందుమాటలో పేర్కొన్నట్టు, ‘భోగరాజువారి ప్రజ్ఞాప్రకర్షగాని, టంగుటూరివారి సాహసరసికతగాని, కాశీనాథుని వారి వితరణవీరము గాని కొండా వారికి లేవు. అట్లయ్యు, వీటన్నిటినీ మించిన సత్యతత్పరత, ఆస్తికత్వము, వినయము, నిరంతర సేవాసక్తి, ఆత్మ వితరణము– ఇవి దేశభక్తుని సమానులలో ఉత్తమ శ్లోకుని చేసినవి.’ ఇదొక నిందాస్తుతి. చాలా అరుదుగా ‘దేశభక్త’ అన్న బిరుదు ఆయనకే దక్కింది. కొండా వెంకటప్పయ్య (ఫిబ్రవరి 22, 1866–ఆగస్టు 15, 1949) పాత గుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. ప్రాథమిక విద్య గుంటూరులోనే జరిగింది. తరువాత బీఏ, బీఎల్ మద్రాసులో చేశారు. ఈ చదువుకు కొంచెం ముందు వెంకటప్పయ్య రాజమహేంద్రవరంలో కొద్దకాలం ఉన్నారు. అప్పుడే కందుకూరి వీరేశలింగంగారి ప్రభావంలో పడ్డారు. ఆ రోజులలో విధవా పునర్వివాహాల కోసం ఆ అభాగినులను రహస్యంగా కల్యాణవేదికల వద్దకు తీసుకురావడం ఎంత క్లిష్టంగా ఉండేదో వెంకటప్పయ్య వర్ణించారు. వీరేశలింగం ఉద్యమాన్ని ఆయన హృదయ పూర్వకంగా స్వాగతించారు. వెంకటప్పయ్యగారు శ్రోత్రియ కుటుంబంలో పుట్టారు. కానీ ఆయన భిన్నంగా ఆలోచించడానికి వెనుకాడేవారు కాదు. ఆ రోజుల్లో అమెరికా నుంచి ఒక మిషనరీ వైద్యురాలు గుంటూరు వచ్చారు. ఆమె ఎంతో నిబద్ధతతో వైద్యం చేస్తూనే, క్రైస్తవమత వ్యాప్తికీ కృషి చేసేవారు. ఒకరాత్రి వెంకటప్పయ్య స్నేహితునికి ప్రాణం మీదకు వచ్చింది. అతని తల్లిదండ్రులు ఈయనను బతిమాలి డాక్టరమ్మ వద్దకు పంపారు. వెంకటప్పయ్య సంగతి చెప్పగానే వచ్చి రోగిని చూశారామె. ఆ రోజుల్లోనే సూదిమందు కూడా ఇచ్చారు. తరువాత రోగి కోలుకోవడానికి రోజూ ఎవరో ఒకరు వచ్చి, తన సలహాను అర్థం చేసుకుని ఆ మేరకు మోతాదులు ఇవ్వగల వారు కావాలని ఆమె ఆదేశించారు. ఆ బాధ్యత కూడా వెంకటప్పయ్య గారి మీదే పడింది. రోజూ ఉదయం లేదా సాయంత్రం వెళ్లి మందు తెచ్చేవారు. అదే సమయంలో ఆ డాక్టర్ నివాసంలో బాలబాలికలు క్రైస్తవ ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. ఎందుకో మరి, తాను కూడా అలా ప్రార్థనలు చేయాలని, అందుకు క్రైస్తవం స్వీకరించాలని కూడా ఆ వయసులో వెంకటప్పయ్య అనుకున్నారట. కానీ విరమించుకున్నారు. ఇది కూడా స్వీయచరిత్రలోనే ఉంది. మద్రాసు కైస్తవ కళాశాలలో బీఏ ‘జూనియర్’ చదువుతూ ఉండగానే, అంటే 1887లో భారత జాతీయ కాంగ్రెస్ మూడో మహాసభలు ఆ నగరంలో జరిగాయి. ఆ సభల విశేషాలను చక్కగా నమోదు చేశారు వెంకటప్పయ్య. సభాధ్యక్షుడు డబ్ల్యూసీ బెనర్జీ కంచుకంఠంతో కార్యకలాపాలను నిర్వహించిన తీరు, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మహదేవ గోవింద రనడే వంటి పెద్దల సందేశాలు, మదన్ మోహన్ మాలవీయ, బిపిన్‌చంద్ర పాల్ వంటి యువనేతల ఆకర్షణీయమైన ఉపన్యాసాలు అన్నీ వివరించారాయన. అప్పుడే తాను జాతీయ కాంగ్రెస్ పట్ల అభిమానం ఏర్పరుచుకున్నట్టు వెంకటప్పయ్య స్పష్టంగానే రాశారు. వెంకటప్పయ్య సేవలు బహుముఖీనమైనవి. ఆనాడు కోర్టు మచిలీపట్నంలో ఉండేది. అందుకే న్యాయశాస్త్రం చదివిన తరువాత మచిలీపట్నంలో చాలాకాలం ఉన్నారు. అప్పుడే దాసు నారాయణరావుతో కలసి ‘కృష్ణాపత్రిక’ను (1902) స్థాపించారు. ఆ పత్రిక తెలుగు ప్రాంత రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాలను సుసంపన్నం చేసిందంటే అది అక్షర సత్యమే అవుతుంది. కృష్ణా మండలం నుంచి గుంటూరు జిల్లాను వేరు చేసిన తరువాత ఆ జిల్లాకు వేరే న్యాయస్థానం రావడంతో, వెంకటప్పయ్య స్వస్థలం వచ్చేశారు. అప్పుడే ‘కృష్ణాపత్రిక’ను ముట్నూరు కృష్ణారావుకు అప్పగించారు. బెంగాల్ విభజన వ్యతిరేకోద్యమం ఇటు భారతీయులను ఎంతగా కదిలించిందో, అటు పాలకులను కూడా తీవ్రంగానే భయపెట్టింది. అందుకే అలాంటి ధోరణులకు మళ్లీ పాల్పడలేదు. ‘ఒక్క భాష, ఒక్క సంస్కృతి గల జనులు ఏకముగా ఒక రాష్ట్రములో ఒక్క పరిపాలనలో ఉండడమే ధర్మం. అలాంటి ఐక్యత జాతి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేస్తుంది’ అని వైస్రాయ్ లార్డ్ హార్డింజ్ (1910–1916) పదవిలోకి వచ్చిన కొత్తలోనే ఒక ప్రకటన చేశారు. అప్పటికే మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ఆధిపత్యంతో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాల గురించి ‘ది హిందూ’ వంటి పత్రికలు చైతన్యవంతమైన వ్యాసాలు ప్రచురించాయి. అనేక తెలుగు సంఘాలు గళం ఎత్తాయి. 1913లో ఆంధ్ర రాష్ట్ర సాధనకు ఆంధ్ర మహాసభ ఆవిర్భవించింది. 1913లో తొలి సభ బాపట్లలో జరిగింది. బీఎన్ శర్మ అధ్యక్షులు. ఆంధ్రుల ఆకాంక్ష గురించి దేశమంతా తిరిగి ప్రచారం చేయడానికి ఏర్పాటు చేసిన సంఘంలో వెంకటప్పయ్య ప్రధాన పాత్ర వహించారు. నాటి రాజకీయ సంస్థలు ఎంత నిర్మాణాత్మకంగా ఆలోచించాయో తలచుకుంటే గుండె ఉప్పొంగుతుంది. స్వీయ చరిత్ర (పే 180)లో వెంకటప్పయ్య పొందుపరిచిన అంశమిదిః 1918లో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఏర్పడినప్పుడు తొలి కార్యదర్శిగా వెంకటప్పయ్య ఎన్నికయ్యారు. ఒకసారి గుంటూరు జిల్లా కాంగ్రెస్ సభలు వెంకటప్పయ్య అధ్వర్యంలో నరసరావుపేటలో జరిగాయి. పేదలకు ఉచిత విద్యను అందించడంతో పాటు, మధ్యాహ్న భోజన వసతి కల్పించడానికి అవసరమైన నిధులు ప్రభుత్వం మంజూరు చేయాలని ఆయన ఆ సభ ద్వారానే ప్రభుత్వాన్ని కోరారు. వెంకటప్పయ్య మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. కానీ సహాయ నిరాకరణ ఉద్యమానికి గాంధీజీ పిలుపునిచ్చిన సందర్భంలో రాజీనామా చేశారు. తరువాత అఖిల భారత కాంగ్రెస్ సభ్యుడు కూడా అయ్యారు. 1921లో అఖిల భారత కాంగ్రెస్ ప్రత్యేక సభలు బెజవాడలో జరిగాయి. వీటిని నిర్వహించడమే కాదు, వేలాది రూపాయలు వసూలు చేసి తిలక్ స్వరాజ్య నిధికి విరాళం కూడా ఇచ్చారాయన. తరువాత పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నందుకు కారాగారానికి వెళ్లారు. అదే ఆయన అనుభవించిన తొలి కారాగారవాసం. చరిత్రాత్మక కాకినాడ కాంగ్రెస్ సమావేశాలను బులుసు సాంబమూర్తితో కలసి అమోఘంగా నిర్వహించిన ఘనత కూడా ఆయనదే. 1927లో జరిగిన సైమన్ గోబ్యాక్ ఆందోళనలో, 1930 నాటి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు, 1942లో క్విట్ ఇండియా ఉద్యమంతో నడిచినందుకు కూడా ఆయన జైలు శిక్ష అనుభవించారు. 1937లో శాసనసభలకు జరిగిన కీలక ఎన్నికలలో వెంకటప్పయ్య మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళ, కన్నడ, కేరళ ప్రాంతాలను, తెలుగు ప్రాంతాన్ని భాష ప్రాతిపదికగా విభజించాలని సభలో ఆయన ప్రవేశపెట్టిన తీర్మానం ఏకగ్రీవంగా గెలిచింది. ఆంధ్రోద్యమం, గాంధీ ఉద్యమం, ఖద్దరు ఉద్యమం, హరిజన దేవాలయ ప్రవేశం వంటి అన్ని ఉద్యమాలు గాంధీ మార్గదర్శకత్వంలోకి వెళ్లాయి. వీటన్నింటినీ వెంకటప్పయ్య చిత్తశుద్ధితో నిర్వర్తించారు. గాంధీజీ అంటే ఆయనకు అపారమైన అభిమానం. ‘కొండ అద్దమందు కొంచమై ఉండదా’ అని ప్రశ్నించాడు శతకకారుడు. చరిత్ర అనే అద్దంలో ఈ ‘కొండ’ కొంచెమయ్యే ఉంది. కానీ ఆ కొండ విశ్వరూపాన్ని దర్శించే అవకాశం చరిత్రకారులు మనకు ఇంకా ఇవ్వలేదనే అనాలి. భారత దేశానికి స్వాతంత్య్రం రావడం వెంకటప్పయ్య కళ్లారా చూశారు. ఆయన వ్యక్తిగత జీవితం ఏమాత్రం ఆనందదాయకం కాదు. ‘ఏ వ్యక్తి జీవితం పూర్తిగా ఆనందంతోను ఉండదు. అలా అని పూర్తిగా విషాదంతోనే సాగదు’ అంటూనే స్వీయ చరిత్ర ఆరంభమవుతుంది. తన కళ్లెదుటే తన కుమారులు ఇద్దరు కన్నుమూశారు. తన ఆస్తిలో కొంత అమ్మేసి ఉన్నవ దంపతులు స్థాపించిన బాలికల విద్యాసదనానికి ఇచ్చారు. తన శిష్యుడు స్వామి సీతారాం కావూరులో స్థాపించన వినయాశ్రమానికి భారీగా విరాళం ఇచ్చారు. ఇలాంటి దానాలు ఇంకా ఎన్నో చేశారు. కానీ తామందరినీ దేశ స్వాతంత్య్రం కోసం ఐక్యం చేసిన మహా సంస్థ లక్ష్యసిద్ధి జరిగిన కొన్ని నెలల్లోనే చెదలు పట్టిపోవడం కూడా ఆయన చూడవలసి వచ్చింది. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వచ్చింది. గాంధీ హత్య తరువాత సంవత్సరానికి అంటే 1949లో దేశమంతా ఆగస్టు పదిహేను వేడుకలలో మునిగి ఉండగా, అదే రోజు వెంకటప్పయ్య ప్రాణం అనంత స్వేచ్ఛావాయువులలో కలసిపోయింది. -డా. గోపరాజు నారాయణరావు -
దిగివచ్చిన టోకు ధరల ద్రవ్యోల్బణం
సాక్షి, న్యూఢిల్లీ: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఆగస్టు మాసంలో కొద్దిగా శాంతించింది. టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) జూలైలో ఇది 5.09 శాతంతో పోలిస్తే ఆగస్టు నెలలో 4.53 శాతానికి తగ్గింది. జూలై నాటి నాలుగేళ్ల గరిష్టంనుంచి నాలుగు నెలల కనిష్టానికి చేరింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో 3.24శాతంగా ఉంది. శుక్రవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఆగస్టు 2018 నాటికి ఆహార ద్రవ్యోల్బణం 4.04 శాతంగా నమోదైంది. ప్రాథమిక వస్తువుల ద్రవ్యోల్బణం గత నెలలో 1.73 శాతం నుంచి ఆగస్టు మాసంలో 0.1 శాతానికి తగ్గింది. ఇంధన, విద్యుత్ రంగాల ద్రవ్యోల్బణం ఆగస్టులో 17.73శాతంగా నమోదైంది. 64 శాతం మెజారిటీ వాటా ఉండే ఆహార పదార్థాలు, పొగాకు, కెమికల్స్, ఔషధ ఉత్పత్తులు, టోకు ధరల సూచీ 0.3 శాతంగా నమోదైందని గణాంకాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కూరగాయల ధరలు క్షీణించడంతో ద్రవ్యోల్బణం దిగి వచ్చిందిని తెలిపింది. కాగా గత ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణ రేటు 1.18 శాతంగా నమోదు కాగా ఈ ఏడాది ఇదే కాలంలో ఈ ద్రవ్యోల్బణం రేటు 3.18 శాతంగా ఉంది. -
ఆగస్టులోనూ తక్కువ వర్షపాతమే
న్యూఢిల్లీ: ఈ సీజన్లో దేశవ్యాప్తంగా పరస్పర విరుద్ధ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. భారీ వర్షాలు, వరదలతో కేరళకు తీవ్రనష్టం వాటిల్లగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మరికొన్ని రాష్ట్రాల్లో అతిగా వర్షాలు కురిశాయని పేర్కొంది. అదే సమయంలో తూర్పు, ఈశాన్య రాష్ట్రాల్లో వరుసగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వివరించారు. సాధారణ వర్షపాతం 261.3 మిల్లీమీటర్లు కాగా ఆగస్టులో 241.4 మిమీ మాత్రమే నమోదైందన్నారు. అయితే, దేశ వ్యాప్తంగా చూస్తే వర్షాలు మంచిగానే కురిశాయని తెలిపారు. సాధారణంగా సెప్టెంబర్ 15 తర్వాత రుతు పవనాల నిష్క్రమణ రాజస్తాన్ నుంచి మొదలవుతుంది. దీని ఫలితంగా వానలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. -
రెడ్మి నోట్ 5కి పోటీ : రియల్‌మి 2 త్వరలో
సాక్షి, న్యూఢిల్లీ: షావోమి స్మార్ట్‌ఫోన్ రెడ్ మి నోట్ 5కి షాకిచ్చేలా ఒప్పో రియల్ మి 2 మరికొద్ది రోజుల్లో భారత మార్కెట్లోకి రాబోతోంది. మాతృ సంస్థ దాని చీలిక తరువాత, రియల్ మీ రెండవ స్మార్ట్ ఫోన్నులాంచ్ చేయబోతోంది. తొలి మొబైల్గా రియల్ మి 1 డివైస్ భారీ విక్రయాలనున మోదు చేయగా దీనికి సక్సెసర్‌గా రియల్ మి2ను వచ్చేవారం విడుదల చేయనుంది. ఆగస్టు 28న జరగనున్న ఈ కార్యక్రమానికి కంపెనీ ఇప్పటికే ఆహ్వానాలు పంపింది. డ్యుయల్ రియర్ కెమెరాలు, నోచ్ డిస్ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేషియల్ అన్‌లాక్ ప్రధాన ఫీచర్లుగా రియల్ మి 2ను తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇక దీని ఫీచర్లపై అంచనాలు ఇలా వున్నాయి. 6.23 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే 19:9 యాస్పెక్ట్ రేషియో మీడియా టెక్ హీలియో పీ60 1080 x 2280 పిక్సెల్స్ రిజల్యూషన్ 16+2ఎంపీ బ్యాక్ కెమెరా సెటప్ 4230ఎంఎహెచ్ బ్యాటరీ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రూ.10వేల లోపే నిర్ణయించవచ్చని అంచనా. -
ఫ్లాష్ సేల్కు వస్తున్న జియోఫోన్ 2
సాక్షి, ముంబై: జియోఫోన్ హైఎండ్ మోడల్ జియోఫోన్ 2 కోసం ఎదురు చూస్తున్నఅభిమానులకు గుడ్‌న్యూస్. రేపటి నుంచే ఈ డివైజ్ బుకింగ్‌కు అందుబాటులోకి వస్తుంది. ఎల్లుండి అంటే ఆగస్టు 16న ఈ ఫోన్‌ను ఆన్లైన్లో కొనుగోలు చేసుకోవచ్చు. ఆగస్టు 16న మధ్యాహ్నం 12 గంటలకు జియో.కామ్‌లో ఈ ఫీచర్ ఫోన్ ఫ్లాష్ సేల్‌ను నిర్వహించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఏడాది జూలైలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ జియో ఫోన్ 2ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆగస్టు 15 నుంచి మై జియో యాప్, జియో.కామ్ ద్వారా ఈ ఫోన్‌ను బుకింగ్‌కు అందుబాటులో ఉంచనున్నట్టు పేర్కొన్నారు. జియో ఫోన్2 ధరను రూ .2999గా రిలయన్స్ నిర్ణయించింది. యూ ట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ లాంటి ప్రముఖ నెట్వర్కింగ్ సైట్లకు కూడా అనుమతి ఉంది. దీంతోపాటు దేశంలో జియో జిగాఫైబర్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను కూడా రేపే ప్రారంభం కానుంది. జియోఫోన్ 2 స్పెసిఫికేషన్లు 2.4 అంగుళాల డిస్ ప్లే 240 X 320 పిక్సల్స్ రిసల్యూషన్ 4 జీబీ, 512ఎంబీ స్టోరేజ్ 128జీబీవరకు విస్తరించుకునే అవకాశం 2ఎంపీ రియర్ కెమెరా 0.3 ఎంపీ సెల్పీ కెమెరా 2000 ఎంఏహెచ్ బ్యాటరీ కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక సమావేశంలో ముకేష్ అంబానీ గత ఏడాది చివరినాటికి 124 మిలియన్ల నుంచి 210 మిలియన్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఫిక్స్డ్ లైన్ బ్రాండ్ బాండ్ సర్వీసులు జియోగిగా ఫైబర్‌ను కూడా ప్రకటించారు. -
రైతుకు ధీమా..
సాక్షి, వరంగల్ రూరల్ : రైతుతోపాటు రైతు కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతుకు బీమా పథకంను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు బీమా పథకం ఈనెల 14 అర్ధరాత్రి నుంచి అమలులోకి రానుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం పొందిన 6,29,110 రైతుల్లో 4,49,752 మందిని బీమా పథకానికి అర్హులుగా గుర్తించారు. రైతు బంధు సాయం పొందిన రైతుల్లో 1,79,358 మంది రైతుల నుంచి వివరాలు సేకరించి వారి నుంచి ఈ అర్హులను గుర్తించారు. జిల్లా వ్యవసాయ శాఖ వారి వివరాలను ఎల్ఐసీకి అందజేసింది. బీమా బాండ్లను ఈ నెల 6వ తేదీ నుంచి రైతులకు అందజేస్తున్నారు. నేటి నుంచి బీమా పథకం అమల్లోకి రానున్న సందర్భంగా రైతు మరణించినప్పుడు క్లెయిమ్ గురించి చేపట్టాల్సిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసింది. 1.79 లక్షల మంది అనర్హులు రైతు బీమా పథకానికి 18 నుంచి 59 సంవత్సరాల వయస్సువారు అర్హులని నిబంధన విధించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6,29,110 మంది రైతులు పట్టాలు పొందారు. వయస్సు నిబంధనతో 1,79,358 మందిని వ్యవసాయ అధికారులు అనర్హులుగా తేల్చారు. పథకం అమలు ఇలా.. రైతు బీమా బాండ్ పొందిన రైతు ఏ కారణం చేత మృతిచెందినా సంబంధిత పంచాయతీ నుంచి మరణ ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. పంచాయతీ కార్యదర్శులు రైతు మరణించిన 48 గంటల్లోపు మరణ ధ్రువీకరణ జారీ చేయాలి. రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంకు ఖాతా జిరాక్స్ ప్రతులను మరణ ధ్రువీకరణ పత్రం, క్లెయిమ్ సర్టిఫికెట్‌పై మండల వ్యవసాయధికారి సంతకం చేసి ముద్ర వేయాలి. ఈ పత్రాలన్నింటిని రైతుబంధు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఉండే నోడల్ అధికారి ఈ వివరాలన్నింటిని పరిశీలించి ఎన్ఐసీకి పంపిస్తారు. ఎన్ఐసీ ఆ వివరాలను బీమా కంపెనీకి టెక్టŠస్ ఫైల్ రూపంలో పంపిస్తుంది. క్లెయిమ్‌కు సంబంధించిన వివరాలన్ని అందగానే నామినీ బ్యాంక్ ఖాతాలో రూ.5 లక్షలు జమ చేస్తారు. ఈ బీమా క్లెయిమ్ మొత్తం ఆన్లైన్ ద్వారానే జరుగుతుంది.ఈ ప్రక్రియను పర్యవేక్షించించేందుకు ప్రతి అధికారికి మండల, డివిజన్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో డాష్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ప్రతి దరఖాస్తు స్టేటస్ విషయంలో ఎప్పటికప్పుడు ఎస్ఎంఎస్ మెసేజ్‌లు అందిస్తారు. ఇప్పటికే అన్ని అంశాలపై ఏఓ, ఏఈఓలకు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ, బ్యాంకు అధికారులకు ఆదేశాలు రైతులు మరణించిన 48 గంటల్లోగా మరణ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా రైతు బీమా పథకం కోసం జన్‌ధన్ ఖాతాను ఇచ్చినట్లయితే ఆ ఖాతాను సేవింగ్స్ ఖాతాలోకి మార్చాలని బ్యాంకు అధికారులను వ్యవసాయ అధికారులు కోరాలని సూచించారు. వ్యవసాయ అధికారులను వారి వారి సెల్‌ఫోన్ నంబర్లను సంబంధిత గ్రామాల్లో నోటీస్ బోర్డులపై రాసి రైతులకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి వ్యవసాయ అధికారి తన పరిధిలో నమోదైన రైతుల వివరాలను, వారి ఎల్ఐసీ బాండ్ల నంబర్లను విధిగా ఉంచుకోవాలి. ప్రతి రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆ రోజు వచ్చిన క్లెయిమ్‌లు, సెటిల్మెంట్లను నోడల్ అధికారి ఎల్ఐసీకి పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
కాదేదీ ప్రచారానికి అనర్హం!
శ్రీకాకుళం న్యూకాలనీ : శ్రీకాకుళంలో జరగనున్న స్వాతంత్య్ర వేడుకలను కూడా అధికార పార్టీ నా యకులు తెలివిగా తమ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. జిల్లా కేంద్రంలో మం త్రుల కనుసన్నల్లోనే అధికారులు పనిచేస్తుండడం అందుకు ఉదాహరణ. పంద్రాగస్ట్ వేడుకల్లో చం ద్రబాబు సర్కారు ప్రభుత్వ సంక్షేమ పథకాల తీ రును వివరిస్తు పార్టీ సభను తలపిస్తూ బెలూ న్లను, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తుండటం ఇందుకు మరో నిదర్శనంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం అభివృద్ధి చెందుతోందని ఇక్కడ పంద్రాగస్ట్ వేడుకలు ఏర్పాటుచేశామని, అందుకు సీఎం అంగీకరించారని మంత్రి అచ్చెన్నాయుడు చెబుతున్నా వాస్తవ పరిస్థితి చూస్తే మాత్రం అం దుకు భిన్నంగా తయారైంది. అభివృద్ధి పేరిట పేద, బడుగు, చిరువ్యాపారుల కుటుంబాలను రోడ్డున పడేసిన సర్కారు.. తాజాగా తమ పథకా లను ప్రదర్శించి ప్రజలకు ఆకర్షితులను చేసేం దు కు ఈ వేడుకలను ఉపయోగించుకోవడంపై ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు భగ్గుమంటున్నా యి. ‘వాడవాడలా చంద్రన్న బాట’ పేరిట ఏర్పాటుచేసిన బెలూన్ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అది చూసిన జనాలు విస్తుపోతున్నారు. వాటిని తక్షణమే తొలగించాలని పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. సీఎం రాకతో నగరంలో పోలీసుల ఆంక్షలు సైతం అదే రీతిలో పెచ్చుమీరుతున్నాయి. వేడుకలకు సమీపంలో ఉ న్న శాంతినగర్‌కాలనీ, నెహ్రూనగర్కాలనీ, ఆర్కే నగర్‌కాలనీ వాసులు.. పోలీసు ఆంక్షలతో కనీసం పాలప్యాకెట్లకు కూడా నోచుకోవడం లేదని, తమ పిల్లలను స్కూళ్లకు తీసుకెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేడుకల కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు, కానిస్టేబుళ్లు, ఎన్సీసీ క్యాడెట్స్, స్కౌట్స్, గైడ్స్, విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. వర్షాలతో వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. వసతులు, భోజనాలు పూర్తిస్థాయిలో లేక అల్లాడిపోతున్నారు. అధికారులు ఏసీ గదుల్లో బాగానే ఉంటున్నా.. ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, విద్యార్థులు ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్నారు. అన్నీ తొలగింపులే.. ఆగస్టు 15 సందర్భంగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దాలన్న ఆకాంక్షతో రోజువారి చిరువ్యాపాలతో తోపుడు బళ్లు, బడ్డీలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఇప్పటికే వారం రోజులుగా పాలకొండ రోడ్, ఆర్ట్స్ కళాశాల రోడ్, రెవెన్యూ గెస్ట్ హౌస్ రోడ్, డై అండ్ నైట్ నాలుగువైపుల గల మార్గాల్లో ఉన్న అనాథలను, చిరు వ్యాపారులను వెళ్లగొట్టారు. ఇప్పటికే సుమారుగా 400 కుటుంబాలు సీఎం పర్యటన పుణ్యమా అని రోడ్డున పడ్డాయి. తాజాగా సోమవారం రాత్రి మరింత హంగామా సృష్టించారు. కాంప్లెక్స్ నుంచి బలగ వైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిరువ్యాపారులపై ఉక్కుపాదం మోపారు. బడ్డీలను, తోపుడు బళ్లను క్రెయిన్ల సాయంతో తొలగిస్తున్నారు. దీంతో మరో 60 కుటుంబాలు జీవాన ఆధారం కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. సంక్షేమ పథకాల బెలూన్లలో ఎయిర్‌గ్యాస్‌తో నింపుతున్న సిబ్బంది -
వేడుక.. వేదిక.. సూచిక
శ్రీకాకుళం సిటీ : శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్న పంద్రాగస్టు వేడుకలకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు వాన పడుతున్నా, అధికారులు మాత్రం తమ పనుల్లో తలమునకలై కనిపిస్తున్నారు. వేడుకల సందర్భంగా పట్టణంలో క్రమబద్ధీకరిస్తున్న ట్రాఫిక్‌కు ప్రజలు సహకరించాలని ఎస్పీ సీఎం త్రివిక్రమవర్మ కోరారు. ఆదివారం సాయంత్రం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో ట్రాఫిక్ మార్పులు, పంద్రాగస్టు వేడుకల్లో పార్కింగ్, ముఖ్యమంత్రి పర్యటన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ముఖ్యమంత్రి పర్యటన ఇలా... ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి 80 అడుగుల రోడ్డు మీదుగా అరసవల్లి రోడ్డు, పొట్టి శ్రీరాములు జంక్షన్, కళింగపట్నం రోడ్, ఏడు రోడ్ల కూడలి, పాలకొండ రోడ్, డేఅండ్ నైట్ జంక్షన్, అంబేడ్కర్ జంక్షన్ మీదుగా ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి సిల్వర్ జూబ్లీ ఆడిటోరియం మీదుగా ముఖ్యమంత్రి వేదిక మీదకు వెళ్తారని తెలిపారు. మీడియాకు నేరుగా ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచే అనుమతి ఉంటుందన్నారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ నుంచి ఎవ్వరికీ అనుమతి లేదన్నారు. పంద్రాగస్టు వేడుకల అనంతరం నిర్దేశించిన బస్సులో వేదిక ప్రాంగణం నుంచి ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్‌కు ముఖ్యమంత్రి చేరుకుని తిరుగుపయనమవుతారన్నారు. 13వ తేదీ నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు పట్టణంలోకి భారీ వాహనాలు, అనుమతి లేని వాహనాలు, పట్టణ పరిధిలో లేని ఆటోలను అనుమతించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఏ–1 కేటగిరీ వాహనాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల రోడ్డుకు ఎదురుగా బిషప్ హౌస్ వద్ద ఉంచేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పబ్లిక్ పార్కింగ్‌కు గాను హడ్కో కాలనీ లైబ్రరీ గ్రౌండ్, హడ్కో కాలనీ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో వాహనాలను నిలుపుకోవచ్చు. ఏ–2, ఏ–3, బి–1, బి–2 కేటగిరీలైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు/వివిధ శాఖల అధిపతులు/ అధికారులకు రిమ్స్ కాలేజీ, సెం ట్రల్ డ్రగ్ స్టోరు ముందు, నర్సింగ్ హాస్టల్ పక్కన పార్కింగ్‌ను కేటాయించారు. ఆర్టీసీ డిపో–1లో పారెడీ స్కూల్ బస్సులు/ ద్విచక్ర, త్రిచక్రవాహనాలను నిలుపుకునేందుకు గాను పార్కింగ్ కేటాయించారు. కోడి రామ్మూర్తి స్టేడియంలో ద్విచక్ర, త్రిచక్ర, నాలుగుచక్రాలు, ఏపీఎస్పీ వాహనాలు నిలుపేందుకు పార్కింగ్‌ను కేటాయించారు. వేడుకలను వీక్షించే వారికి రూట్ ఇలా... గార, శ్రీకూర్మం, అరసవల్లి, మహాలక్ష్మినగర్ కాల నీ, మండల వీధి, న్యూకాలనీ, చౌక్‌బజార్ పరిసర ప్రాంతాల ప్రజలు అరసవల్లి మిల్లు జంక్షన్, ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా సూర్యమహల్, జీటీరోడ్, ఎస్బీఐ జంక్షన్ నుంచి కుడివైపు తిరిగి చౌకబజార్ మీదుగా రైతుబజార్‌కు లేదా సూర్యమహల్, రామలక్ష్మణ జంక్షన్ మీదుగా రైతుబజార్‌కు చేరుకుని ఏఎస్ఎన్ కాలనీ మీదుగా సురక్ష ఆస్పత్రి గుండా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీకి చేరుకోవచ్చని తెలిపారు. గుజరాతీపేట, పీఎన్‌కాలనీ వైపు నుంచి వచ్చే వీక్షకుల వాహనాలను కొత్త బ్రిడ్జి రోడ్డు గుండా వచ్చి సిందూర ఆస్పత్రి పక్క నుంచి కోడి రామ్మూర్తి స్టేడియం వద్ద వారి వాహనాలను నిలుపుదల చేసుకొని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానానికి చేరుకోవాలన్నారు. అలాగే ఆమదాలవలస, బలగ వైపు నుంచి వచ్చే వారు రిమ్స్ ఆస్పత్రి మీదుగా హడ్కోకాలనీ లైబ్రరీ వద్ద లేదా హడ్కోకాలనీ మున్సిపల్ హై స్కూల్ మైదానం వద్ద వాహనాలను నిలుపుదల చేసుకుని ప్రభుత్వ డిగ్రీ మైదానానికి చేరుకోవాలన్నారు. నగరంలో వివిధ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, అరసవల్లి మిల్లు జంక్షన్, ప్రభుత్వ మహిళా కళాశాల మీదుగా, సూర్యమహల్ జం క్షన్, జీటీ రోడ్ మీదుగా ఎస్బీఐ వద్దకు చేరుకొని చౌకబజార్ మీదుగా, రౌతుబజార్ జంక్షన్, ఏఎస్ఎన్ కాలనీ, సురక్ష ఆస్పత్రి మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలన్నారు. గుజరాతీపేట, హయాతినగరం, ఫాజుల్‌బాగ్‌పేట, పీఎన్‌కాలనీ వైపు వాహనదారులు కిమ్స్ ఆస్పత్రి జంక్షన్ నుంచి డేఅండ్ నైట్ జంక్షన్‌కు చేరుకోవచ్చు. నరసన్నపేట, కోటబొమ్మాళి, టెక్కలి వైపు నుంచి శ్రీకాకుళం పట్టణంలోకి రాబోయే వాహనదారులు పెద్దపాడు రోడ్డు, కొత్తరోడ్ జంక్షన్ మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవాలి. ఆమదాలవలస, పాలకొండ, కొత్తూరు వైపు నుంచి కొత్తరోడ్డు మీదుగా శ్రీకాకుళం పట్టణంలోనికి యథావిధిగా ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవచ్చును. ఏడు వేల మందికి పైగా.. పంద్రాగస్టు వేడుకల నేపథ్యంలో వేదిక వద్దకు సుమారు 5 వేల మంది విద్యార్థులు, 2 వేల మంది పబ్లిక్ హాజరుకానున్నట్లు ఎస్పీ తెలిపారు. వేడుకలకు హాజరయ్యే ప్రజలంతా ఈనెల 15వ తేదీన ఉదయం 8 గంటలలోపే రావాలని ఎస్పీ సూచించారు. ముందుగా ఎస్పీ రూట్ మ్యాప్‌ను మీడియాకు వివరించారు. ఆయనతో పాటు ట్రాఫిక్ డీఎస్పీ సీహెచ్ పెంటారావు ఉన్నారు. 800 మందికి పైగా బందోబస్తు.. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా (విశాఖపట్నం)అడిషనల్ ఎస్పీ, 18 మంది డీఎస్పీలు, 30 మంది సీఐలు, 80 మంది ఎస్ఐలతో పాటు సుమారు 800 మంది వరకు నగరంలో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వివరించారు. -
పంద్రాగస్టుకు మెట్రో డౌటే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ సిటీజనులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎల్బీనగర్–అమీర్‌పేట్ రూట్లో మెట్రో రైళ్ల రాకపోకలు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న ప్రకారం పంద్రాగస్టు(ఆగస్టు 15)రోజున ఈ మార్గంలో మెట్రో రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయనుకున్నప్పటికీ... రైల్వే మంత్రిత్వశాఖ నుంచి రావాల్సిన కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ వారి భద్రతా ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో జాప్యమవుతోంది. దీంతో మరికొన్ని రోజులు నిరీక్షించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పటికే ఈ మార్గంలో మెట్రో రైళ్లకు స్పీడ్, లోడ్, సేఫ్టీ, ట్రాక్షన్, సిగ్నలింగ్, టెలీకమ్యూనికేషన్ తదితర అంశాల్లో మొత్తంగా 18 రకాల ప్రయోగ పరీక్షలను దశలవారీగా నిర్వహిస్తున్నారు. ఈ నెలాఖరుకు భద్రతా ధ్రువీకరణ పత్రం అందుతుందని మెట్రో వర్గాలు ఆశాభావం వ్యక్తంచేస్తున్నాయి. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ ధ్రువీకరణ అందిన తర్వాతే మెట్రో రైళ్ల వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో మెట్రో పట్టాలెక్కిన పక్షంలో నిత్యం సుమారు 2 లక్షలమంది ఎల్బీనగర్–మియాపూర్ (29 కి.మీ)మార్గంలో రాకపోకలు సాగించే అవకాశాలున్నాయి. ఇప్పటికే నాగోల్–అమీర్‌పేట్–మియాపూర్(30 కి.మీ)మార్గంలో మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా..వీటిల్లో నిత్యం 75 వేల మంది ప్రయాణిస్తున్న విషయం విదితమే. ఈ ఏడాది నవంబరు నెల ప్రారంభంలో అమీర్‌పేట్–హైటెక్ సిటీ రూట్లో మెట్రో రైళ్లు పరుగులు తీస్తాయని హెచ్ఎంఆర్ అధికారులు చెబుతున్నారు. లాస్ట్‌మైల్ కనెక్టివిటీకీ ఏర్పాట్లు.. మెట్రో స్టేషన్లలో దిగిన ప్రయాణికులు తిరిగి తమ గమ్యస్థానాలకుచేరుకునేందుకు వీలుగా పలు మెట్రో స్టేషన్లలో ఎలక్ట్రిక్ కార్లు, బైక్‌లు, అత్యాధునిక సైకిళ్లు, పెట్రోలు ఇంధనంగా నడిచే బైక్‌లను అద్దెకు ఇచ్చే ఏర్పాట్లు చేశారు. వీటికి ప్రయాణికుల ఆదరణ క్రమంగా పెరుగుతోందని..మొబైల్యాప్ ద్వారా వీటిని అద్దెకు తీసుకోవడంతోపాటు చెల్లింపులను సైతం ఆన్లైన్లో చేసే అవకాశం ఉండడంతో ప్రయాణికులు వీటిని అద్దెకు తీసుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. దశలవారీగా నగరంలోని మూడు మెట్రోకారిడార్లు...ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఫలక్‌నుమా, నాగోల్–రాయదుర్గం మార్గాల్లోని 64 మెట్రో స్టేషన్లలో అద్దె వాహనాల సదుపాయం కల్పిస్తామని..అవకాశం ఉన్నచోట ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయం కల్పిస్తామని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. మెట్రో మార్గా ప్రారంభోత్సవాలు ఇలా.. ఎల్బీనగర్–అమీర్‌పేట్: ఆగస్టు చివరి వారం– 2018 అమీర్‌పేట్–హైటెక్‌సిటీ: నవంబరు– 2018 మెట్రో రెండోదశ మార్గాలివే... మెట్రోరెండోదశ ప్రాజెక్టు సర్వత్రా చర్చనీయాంశమైన నేపథ్యంలో రెండోదశ ప్రాజెక్టుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్టు నివేదికను సిద్ధంచేసే బాధ్యతలను ప్రభుత్వం ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ అధికారులకు అప్పగించింది. ప్రస్తుతానికి డీఎంఆర్సీ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వాని కి సమర్పించినట్లు మెట్రో అధికారులు తెలిపారు. పాతనగరానికి మెట్రో జటిలం.... ఎంజీబీఎస్–ఫలక్‌నుమా(5.5 కి.మీ) మార్గంలో మెట్రో ప్రాజెక్టుకు బాలారిష్టాలు ఎదురుకానున్నా యి. ఈ మార్గంలో సుమారు వెయ్యి ఆస్తుల సేకరణ, బాధితులకు రూ.కోట్లలో పరిహారం చెల్లింపు అంశం జఠిలంగా మారనుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పరిహారం చెల్లింపునకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంది. కానీ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా భారీ మొత్తంలో పరిహారం చెల్లింపులు ప్రభుత్వం ఎలా జరుపుతుందన్న అంశంపై పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నిర్మాణ సంస్థసైతం ఇదే అం శంపై మల్లగుల్లాలు పడుతుండడం గమనార్హం. -
మహీంద్రా ధరల పెంపు!
న్యూఢిల్లీ: పెరిగిన ముడివస్తువుల ధరల భారాన్ని వినియోగదారులకు బదిలీచేసే యోచనలో ఉన్నట్లు యుటిలిటీ వాహన దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా వెల్లడించింది. పలు ప్యాసింజర్ వాహనాల ధరలను రూ.30,000 వరకూ (2 శాతం) పెంచే అవకాశం ఉందని ఎం అండ్ ఎం ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ రాజన్ వధెరా అన్నారు. పెరిగిన ధరలు ఆగస్టు నుంచి అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు. టాటా మోటార్స్ సైతం ఆగస్టు నుంచి 2.2 శాతం మేర ధరలు పెరిగేందుకు అవకాశం ఉందని వెల్లడించిన విషయం తెలిసిందే. -
గజ్వేల్‌కు హరితహారం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణకు హరితహారం’లో భాగంగా ఆగస్టు 1న గజ్వేల్ పట్టణంలో లక్షా నూట పదహారు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. వీటికి అదనంగా అదేరోజు అటవీ భూముల్లో మరో 20 వేల మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, విద్యార్థులు, మహిళలు, యువకులు, వ్యాపారులు, సాధారణ ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకకాలంలో లక్షా నూట పదహారు మొక్కలు నాటాలని చెప్పారు. అన్ని రకాల రోడ్ల వెంట, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థల ఆవరణలో, గుడి, మసీదు, చర్చి లాంటి ప్రార్థనా మందిరాల్లో, ప్రతీ ఇంట్లో మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. హరితహారం విజయవంతం కావడానికి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గజ్వేల్‌లో చేపట్టనున్న కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. మంత్రులు జోగు రామన్న, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, పీసీసీఎఫ్ పి.కె.ఝా, ఏపీసీసీఎఫ్ డోబ్రియాల్, సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్, మున్సిపల్ చైర్మన్ భాస్కర్, గజ్వేల్ పట్టణాభివృద్ధి సంస్థ(గడా) ప్రత్యేక అధికారి హన్మంతరావు, కార్పొరేషన్ల చైర్మన్లు ఎలక్షన్‌రెడ్డి, భూపతిరెడ్డి, భూమారెడ్డి, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ ఇందులో పాల్గొన్నారు. ‘‘గజ్వేల్‌లో ఒకేరోజు లక్షా నూట పదహారు మొక్కలను నాటాలి. ఇంట్లో ఎందరు సభ్యులుంటే అంతమంది తలా ఒక మొక్క చొప్పున నాటాలి. ఇండ్లలో నాటడానికి కావాల్సిన మొక్కలను ఒకరోజు ముందే ఆ ఇంటికి చేర్చాలి. ప్రజలకు ఇచ్చే చెట్లలో కచ్చితంగా పండ్ల చెట్లు, పూల చెట్లు ఉండాలి. ఆగస్టు 1వ తేదీన అనుకున్న సమయానికి గజ్వేల్‌లోని అన్ని మసీదుల్లో ఒకేసారి సైరన్ మోగాలి. సైరన్ మోగిన వెంటనే ముఖ్యమంత్రితో సహా, అంతా ఒకేసారి ఎక్కడికక్కడ మొక్కలు నాటాలి. మైకులు, గోడపై రాతలు, హోర్డింగులతో ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన పోటీలు నిర్వహించాలి. నాటిన మొక్కలను బతికించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి. రోడ్లపై పెట్టే మొక్కలకు ట్రీ గార్డులు పెట్టాలి. పట్టణంలో తుమ్మ, జిల్లేడులాంటి పిచ్చిమొక్కలను తీసేసి, మంచి మొక్కలను మాత్రమే పెంచాలి. మొక్కలు పెంచడంలో బాగా శ్రద్ధ చూపిన వారికి అవార్డులు అందించాలి’’అని సీఎం చెప్పారు. 25 శాతం పండ్ల మొక్కలు వచ్చే ఏడాది నుంచి ఏడాదికి వంద కోట్ల చొప్పున మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. ‘‘పోరాడి సాధించుకున్న తెలంగాణను అన్నివిధాలా అభివృద్ధి చేసుకుంటున్నాం. ఆదాయాభివృద్ధిలో దేశంలో నంబర్ వన్‌గా ఉన్నాం. కాళేశ్వరం సహా నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తవుతున్నాయి. 2019 జూన్ నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. చెరువులన్నింటినీ కాల్వల ద్వారా నింపుతాం. రూ.1.25 లక్షల కోట్ల పంటలు పండుతున్నాయి. వ్యవసాయం బాగుపడుతుంది. రెసిడెన్షియల్ స్కూళ్ల ద్వారా పిల్లలకు మంచి విద్య అందుతోంది. రాష్ట్రం అన్నివిధాలా బాగుపడుతు న్నది. ఇంత చేసినా జీవించగలిగే పరిస్థితులు లేకుంటే దండుగ. మనిషి జీవించ గలిగే పరిస్థితి కావాలి. భగవంతుడో, ప్రకృతో మనకు కావాల్సినవన్నీ సమకూర్చింది. మనమే వాటిని చేజేతులా నాశనం చేసుకున్నాం. నాశనమైన వాటిని పునరుద్ధరించుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. మనిషి, చెట్టు నిష్పత్తిలో మన దేశం చాలా వెనుకబడి ఉంది. కెనడాలో ప్రతీ మనిషికి సగటున 8,953 చెట్లు, రష్యాలో 4,465, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లుంటే, భారతదేశంలో ఒక్కో మనిషికి 28 చెట్లు మాత్రమే ఉన్నాయి. ఇది వాతావరణ సమతుల్యం దెబ్బతినడానికి, ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమవుతోంది. అందుకే మనం తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహిస్తున్నాం. అధికార యంత్రాంగమంతా పచ్చదనం పెంచాలనే తపనతో పనిచేయాలి. ప్రతీ గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ నర్సరీల్లో ఇతర మొక్కలతోపాటు కనీసం 25 శాతం పండ్ల మొక్కలను సిద్ధం చేయాలి. చెట్ల పండ్లు దొరికితే కోతులు జనావాసాలపై పడే పరిస్థితి ఉండదు. గజ్వేల్ నియోజకవర్గంలోని కోమటిబండ వద్ద అడవి పునరుద్ధరణలో భాగంగా నాటిన మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’అని ముఖ్యమంత్రి వివరించారు. -
అమెరికాలో పంద్రాగస్టు వేడుకలకు కమల్
తమిళసినిమా: పంద్రాగస్ట్ వేడుక దగ్గర పడుతోంది. ఎందరో పోరాటయోధుల త్యాగఫలం స్వాతంత్ర దినోత్సవం. ఆగస్ట్ 15న యావత్ భారతదేశంలో అశోక చక్రాన్ని ఇముడ్చుకున్న మువ్వన్నెల పతాకం రెపరెపలాడే తరుణం దగ్గరపడింది. ఈ వేడుకలు భారతదేశంలోనే కాకుండా అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో కూ డా జరగుతుంటాయి. వేడుకల్లో వివిధ దేశాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు పాల్గొం టుంటారు. ఈ ఏడాది అమెరికాలోని న్యూ యార్క్‌లో జరగనున్న వేడుకల్లో విశ్వనటుడు, మక్కళ్ నీది మయ్యం పార్టీ అధినేత కమలహాసన్, ఆయన కూతరు శ్రుతీ హాసన్ పాల్గొననున్నారన్నది తాజా సమాచారం. ప్రస్తుతం కమల్‌హాసన్ బిగ్‌బాస్ రియాలిటీ గేమ్ షోలో పాల్గొంటున్నారు. మక్కళ్ నీ ది మయ్యం పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. నటి శ్రుతి హాసన్ చిన్న గ్యాప్ తరువాత హిందీ చిత్ర షూటింగ్లో పాల్గొంటున్నారు. -
అందుకే వాళ్లను నగరం నుంచి బహిష్కరించాం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, శాంతికి విఘాతం కలగవద్దనే కత్తి మహేశ్, స్వామి పరిపూర్ణానందలను ఆరు నెలల పాటు నగరం నుంచి బహిష్కరించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. ఆదివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్.నరసింహన్‌ను కలిసి, ప్రస్తుత రాజకీయ, పాలనాపరమైన అంశాలపై ఆయన చర్చించారు. రైతులకు రూ.5లక్షల జీవిత బీమా సదుపాయం కల్పించేందుకు ఆగస్టు 15న ప్రారంభించనున్న రైతు బీమా పథకం ఉద్దేశాలు, వివరాలను గవర్నర్‌కు సీఎం తెలియజేశారు. వర్షాల రాకతో ఎగువ ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వరద ప్రవాహం ప్రారంభమైందని సీఎం హర్షం వ్యక్తం చేశారు. వచ్చే సెప్టెంబర్ నుంచి సాగునీటి ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తామన్నారు. శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనికి వ్యతిరేకంగా శ్రీ పీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద ఆందోళనకు దిగడం ద్వారా నగరంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వివాదంలో కొన్ని వార్తా చానల్స్ వ్యవహరించిన తీరు పట్ల కూడా సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వామి పరిపూర్ణానందకు నగర బహిష్కరణ విధించడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ రాష్ట్ర నేతలు కొన్ని రోజుల కింద గవర్నర్‌ను కలిసిన నేపథ్యంలో సీఎం గవర్నర్‌కు వివరణ ఇచ్చారు. -
విజయన్‌కు కోపం..
సాక్షి, తిరువనంతపురం : ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ జాతీయ జెండాను ఎగురవేసినందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు పాఠశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. గత ఆగస్టులో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కేరళకు వచ్చిన మోహన్ భగవత్ కర్ణాకెయమెన్ అనే ప్రభుత్వ పాఠశాలలో జాతీయ జెండాను ఎగురవేశారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన విజయన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్(డీపీఐ) అధికారులకు ఆదేశాలు పంపించారు. ఆ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ఈవెంట్ మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో పరిశీలించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్న పాఠశాలలు కచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన మార్గ దర్శకాలకనుగుణంగానే పనిచేయాల్సి ఉంటుందని, అంతేకాకుండా ఆగస్టు 15 వేడుకల్లో రాజకీయ నాయకులకు భాగస్వామ్యం కల్పించవద్దని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ కూడా స్కూల్ అధికారులుగానీ, లేదంటే ప్రజాప్రతినిధులు మాత్రమే జెండాను ఎగురవేయాల్సి ఉంటుందని తెలిపారు. -
ఆగస్టు 15లోగా లక్షా ఉద్యోగాలు భర్తీ
-
ఆందోళనకరంగా టోకు ధరల సూచి
సాక్షి, ముంబై: ఆగస్ట్ నెల ద్రవ్యోల్బణం మరోసారి ఆందోళనకరస్థాయిలో రికార్డయింది. గురువారం వెల్లడైన గణాంకాలు ప్రకారం ఆగస్టు నెల టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ)3. 24 శాతం నమోదైంది. జూలైతో పోల్చితే భారీగా పెరిగి 3.24 శాతానికి పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం, ఇంధన ఉత్పత్తుల ధరలు పెరగడంతో నాలుగు నెలల గరిష్టాన్ని తాకింది. ఆహార ద్రవ్యోల్బణం 5.75గా నమోదైంది. మరోవైపు టోకుధరల సూచి (డబ్ల్యుపీఐ) గణాంకాలు, చమురు ద్రవ్యోల్బణం.. ఆహార ద్రవ్యోల్బణం గణాంకాలు నిరుత్సాహకరంగా వెలువడటంతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఆరంభంలో లాభాలతో జోష్‌గా ఉన్న మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ముఖ్యంగా బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ తదితర ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 32,218 దగ్గర ఉండగా.. నిఫ్టీ 3పాయింట్ల నష్టంతో 10076 వద్ద కొనసాగుతున్నాయి. ట్రేడవుతోంది. -
ఆగస్టులో ఆశాజనకంగా వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జూన్, జూలైలో దారుణంగా దెబ్బతీసిన వర్షాలు ఆగస్టులో మాత్రం ఆశాజనకంగా కురిశాయి. అయితే అప్పటికే ప్రధాన పంట వేరుశనగ, ప్రత్తి, ఆముదం, కంది లాంటి పంటలు వేసుకునేందుకు పుణ్యకాలం ముగిసిపోవడంతో ఖరీఫ్ నిరాశాజనకంగా సాగుతోంది. జూన్‌లో 63.9 మి.మీ గానూ 59.2 మి.మీ, జూలైలో మరీ దారుణంగా 67.4 మి.మీ గానూ 31 మి.మీ వర్షం కురిసింది. దీంతో ఈ సారి కరువు ఛాయలు ముందుగానే ఆవరించడంతో జిల్లా అంతటా ఆందోళన నెలకొంది. ఆగస్టు 5 నుంచి వాతావరణం మారిపోవడం, తేలికపాటి నుంచి చెప్పుకోదగ్గ వర్షాలు కురవడం ప్రారంభమయ్యాయి. నెల ముగిసేనాటికి 88.7 మి.మీ గానూ 9 శాతం ఎక్కువగా 96.8 మి.మీ వర్షం కురిసింది. అందులోనూ గత 15 రోజుల్లోనే 80 మి.మీ వర్షపాతం నమోదు కావడం విశేషం. అంతవరకు 32 శాతం లోటు వర్షపాతం కొనసాగుతుండగా ప్రస్తుతం 15 శాతానికి చేరుకుంది. ఆగస్టులో తాడిపత్రి, ఉరవకొండ, బొమ్మనహాల్, డి.హిరేహాల్, వజ్రకరూరు, విడపనకల్, గుంతకల్లు, పెద్దవడుగూరు, యాడికి, శింగనమల, పామిడి, గార్లదిన్నె, కూడేరు, బెళుగుప్ప, కనేకల్లు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం, నల్లచెరువు, కంబదూరు, తలుపుల, పుట్లూరు, సోమందేపల్లి, పరిగి తదితర మండలాల్లో 100 నుంచి 150 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఇక చెన్నేకొత్తపల్లి, అనంతపురం, కనగానపల్లి, ఆత్మకూరు, రాయదుర్గం, బత్తలపల్లి, గోరంట్ల, కొత్తచెరువు మండలాల్లో తక్కువగా వర్షాలు పడ్డాయి. మిగతా మండలాల్లో 60 నుంచి 100 మి.మీలోపు వర్షపాతం నమోదైంది. ప్రస్తుతానికి వేసిన పంటలు పచ్చదనం సంతరించుకున్నా దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక ఇటీవల కురిసిన వర్షాలకు అంతోఇంతో ప్రత్యామ్నాయ పంటలు సాగులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల అంటే సెప్టెంబర్‌లో సాధారణ వర్షపాతం 118 మి.మీ నమోదు కావాల్సి ఉంది. -
జుకర్‌బర్గ్ దంపతుల ఆసక్తికరమైన పోస్ట్
ఫేస్బుక్ సహ-వ్యవస్థాపకుడు , బిలియనీర్ మార్క్ జుకర్ బర్గ్ తన రెండవ బిడ్డ ఆగమనాన్ని సంతోషంగా షేర్ చేశారు. ఫేస్బుక్ పోస్ట్ ద్వారా జకర్ బర్గ్ ప్రిస్కిల్లా దంపతులు తమ రెండవ కుమార్తె ఆగస్టుకు ప్రపంచానికి స్వాగతం పలికారు. 2015లో మొదటి బిడ్డ మాక్సిమా పుట్టినపుడు కూడా ఇలాగే ఆహ్వానించిన దంపతులు ఈసారి ఒక ఆసక్తికరమైన లేఖను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రియమైన ఆగస్ట్ ప్రపంచానికి స్వాగతం! భవిష్యత్తులో నువ్వు ఏమి కానున్నావోనని ఆతృతగా, సంతోషంగా ఎదురు చూస్తున్నామంటూ లేఖ మొదలు పెట్టారు. నీ సోదరి జన్మించినప్పుడు, మేం ఆశించిన ప్రపంచం గురించి ఒక లేఖ రాశాం.. కానీ ఇపుడు మీరు మంచి విద్య, తక్కువ వ్యాధులు, బలమైన సమాజాలు, మరియు సమానత్వం ఉన్న ప్రపంచంలో పెరగబోతున్నారన్నారు. బాల్యం జీవితంలో ఒక్కసారే వస్తుంది కనుక భవిష్యత్తు గురించి బెంగలేకుండా హాయిగా జీవించమని దీవించారు. అందుకే పెరగడం గురించి కాకుండా, బాల్యం గురించి మాట్లాడాలనుకుంటున్నాము. ప్రపంచం చాలా ప్రమాదకరమైన స్థలంగా ఉంది. అందుకే బయటికి వచ్చి హాయిగా ఆడుకోవాలి..దానికి సమయం కేటాయించడం చాలా ముఖ్యం. వేగంగా అభివృద్ధి చెందుతున్న సైన్స్ అండ్ టెక్నాలజీలో యుగంలో అన్ని పురోగమనాలతో మీ తరం మాకంటే మెరుగైన జీవితాన్ని గడపాలని కోరుకున్నారు. ఇది జరిగేలా చేసే బాధ్యత తమపై ఉందని ఈ జంట తమ లేఖ లో పేర్కొంది. నీ భవిష్యత్తుకోసం.. నీ తరానికి సంబంధించిన బాలలకోసం శక్తిమేరకు తాము చేయాల్సినంత చేస్తామంటూ లేఖలో పాపకు హామీ ఇచ్చారు. చాలా మంది తల్లిదండ్రుల్లాగే, తాము కూడా బుజ్జి పాపాయి అయిన నువ్వు హాయిగా ప్రశాంతంగా బొజ్జోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా మాక్స్ పుట్టిన దగ్గరినుంచి, పాపతో తాను గడిపిన విలువైన సమయం, ఆమె ఎదుగుదల, ఫస్ట్ స్విమ్ లాంటి ఫోటోలను తరచూ సోషల్ మీడియాలో పోస్ట్‌లతో సందడి చేసిన సంగతి తెలిసిందే. బహుశా ఈ సారి ఇదే ధోరణిని కొనసాగించనున్నట్టే కనిపిస్తోంది. -
19న ఉరవకొండకు దగ్గుపాటి పురందేశ్వరి రాక
అనంతపురంసెంట్రల్: నియోజకవర్గ విస్తారక్ యోజన కార్యక్రమంలో భాగంగా ఈనెల 19న ఉరవకొండలో బూత్ కమిటీ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు బీజేపీ జిల్లాఅధ్యక్షుడు అంకాల్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆపార్టీ కార్యాయలంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి జాతీయ మహిళా మోర్చా ఇన్చార్జ్, మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురందేశ్వరి హాజరవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో పెన్నానది నిర్మించిన చాగళ్లు, పెండేకల్లు ప్రాజెక్టులకు నీటి కేటాయింపుల్లో పాలకులు వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అన్ని ప్రాంతాలను సమానదృష్టి చూడాలన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, బీజేపీ నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మనకూ ఓ సంతాప దినం కావాలి!
న్యూఢిల్లీ: పాకిస్తాన్ దేశస్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆగస్టు 14వ తేదీన జరుపుకుంటే భారత్ ఆగస్టు 15వ తేదీన జరుపుకుంటున్న విషయం తెల్సిందే. మన పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం స్వతంత్య్ర దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్ ఆగస్టు 15వ తేదీని జాతీయ సంతాప దినంగా జరుపుకుంటోంది. ఆగస్టు 15వ తేదీన ఆ దేశ ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, దేశ తొలి అధ్యక్షుడైన షేక్ ముజిబూర్ రహమాన్, ఆయన కుటుంబ సభ్యులను బంగ్లా సైనికాధికారుల బృందం దారుణంగా చంపివేయడమే కారణం. దేశ స్వాతంత్య్రం ఖరారైన 1947, ఆగస్టు నెలలో భారత్, పాక్ ప్రాంతాల మధ్య మతకల్లోలాలు, ఘర్షణలు చెలరేగి ఇరువైపుల దాదాపు పది లక్షల మంది మరణించారు. ఈ సంఖ్య ఇరువై లక్షల వరకు ఉంటుందని చరిత్రకారులు చెబుతున్నారు. దేశ విభజన సందర్భంగా దాదాపు1.20 కోటి మంది సరిహద్దులు దాటి భారత్ నుంచి పాక్‌కు, పాక్ నుంచి భారత్‌కు వెళ్లారు. అప్పుడు మనతో కలిసి ఉన్న బంగ్లాదేశ్ ప్రాంతంలో కూడా అల్లర్లలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. స్వాతంత్య్రం సిద్ధించిన సందర్భం కనుక దాని వెనకనున్న చీకటి కోణాన్ని మరచి పోవడమే మంచిదనుకొని భారత నాయకులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. దేశ విభజన అల్లర్లను మరచి పోయారు. జాతిపిత మహాత్మా గాంధీ మాత్రం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం తనకు ఇష్టం లేదన్నారు. దాదాపు పది లక్షల మంది ప్రాణాలు పోయిన నేపథ్యాన్ని మరిచిపోయి ఎలా ఆనందంగా ఉండగలమని అన్నారు. 1947, జూలై 20వ తేదీన జరిగిన ఓ ప్రార్థనా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘నేను ఆగస్టు 15వ తేదీన ఆనందంగా ఉండలేను. ఇది చెప్పకుండా మిమ్మల్ని మోసం చేయలేం’ అని అన్నారు. ఆగస్టు 15వ తేదీన ఉపవాసం దినంగా పాటించాలని అదే ఏడాది ఆగస్టు 8వ తేదీన జరిగే ఓ ప్రార్థనా సమావేశంలో గాంధీజీ సూచించారు. ఆనంద దినాలతోపాటు చీకటి రాత్రులను కూడా మరచిపోకూడదని, అందుకని దేశ విభజన సందర్భంగా మరణించిన వారి కోసం ఒక రోజును జాతీయ సంతాప దినంగా పాటించడం మంచిదని చరిత్రకారులు ఎప్పుడో చెబుతున్నారు. జర్మనీ, జపాన్ లాంటి దేశాలు ఇలాంటి జాతీయ సంతాప దినాలను పాటిస్తున్నాయి. ఆగస్టు 15వ తేదీన జాతీయ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపుకుంటుందన్న, దేశ విభజన మ్యాప్ ఖరారైన ఆగస్టు 17వ తేదీని జాతీయ సంతాప దినంగా పాటించాలని చరిత్రకారులు సూచిస్తున్నారు. సిరిల్ ర్యాడిక్లిఫ్ ఈ మ్యాప్‌ను రూపొందించారు. ఈ విషాధంలో పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు కూడా భాగం ఉన్నందున ఆ దేశాలు కూడా జాతీయ సంతాప దినాన్ని పాటించడం మంచిదంటున్నారు. -
‘ఆగస్టు’ యాజమాన్యంతో అధిక దిగుబడి
- కూరగాయల తోటల్లో సస్యరక్షణ చర్యలు తప్పనిసరి - కళ్యాణదుర్గం కేవీకే కోఆర్డినేటర్ జాన్‌సుధీర్ అనంతపురం అగ్రికల్చర్: ఆగస్టు యాజమాన్యంతో కూరగాయల పంటలకు ఆశించిన చీడపీడలు, తెగుళ్లు నివారించుకోవచ్చని కళ్యాణదుర్గం కృషి విజ్ఙాన కేంద్రం (కేవీకే) కోఆర్డినేటర్ డాక్టర్ ఎం.జాన్‌సుధీర్, ఉద్యాన శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. సరైన సస్యరక్షణ చర్యలు చేపడితే అధిక దిగుబడి సాధించొచ్చని అన్నారు. కూరగాయల పంటల్లో సస్యరక్షణ చర్యలు, ఆగస్టు యాజమాన్యం, తెగుళ్ల నివారణ తదితర విషయాలను వారు తెలియజేశారు. కాయతొలుచు పురుగు నివారణ ఇలా.. + వంగ, బెండలో మొవ్వ, కాయతొలుచు పురుగు నివారణకు తలవాల్చిన కొమ్మలు తుంచేసి, పుచ్చుపట్టిన కాయలు ఏరి నాశనం చేయాలి. తర్వాత 3 మి.లీ రైనాక్సిఫైర్ లేదా స్పైనోసాడ్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. + టమాటలో ఆకుమాడు తెగులు (అర్లీబ్లైట్స్) ఆశిస్తే ఆకులు, కాండం, కాయల మీద గోధుమ రంగుతో కూడిన మచ్చలు ఏర్పడి క్రమేణా మాడి ఎండిపోతాయి. తేమ ఉన్నప్పుడు, చల్లని వాతావరణం తెగులు రావడానికి అనుకూలం. నివారణకు 3 గ్రాములు కాప్టాన్ లేదా మాంకోజెబ్ లేలా 2 గ్రాములు క్లోరోథలోనిల్ లేదా 1 మి.లీ ప్రొపికొనజోల్ లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో మూడు లేదా నాలుగు సార్లు పిచికారీ చేసుకోవాలి. టమాటలో పచ్చదోమ ఆశిస్తే ఆకుల అడుగు భాగం నుంచి రసంపీల్చడం ద్వారా ఆకు చివర్లు పసుపు పచ్చగా మారి క్రమేణా ఆకు అంతా ఎర్రబడి ముడుచుకునిపోతాయి. నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా మిథైట్ డెమటాన్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. + మిరప నారు నాటేందుకు అనువైన సమయం : ఆరు వారాల వయస్సున్న నారును ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. హైబ్రిడ్ రకాలైతే పాదుకు ఒక మొక్క, సూటి రకాలైతే పాదుకు రెండు మొక్కలు పెట్టుకోవాలి. నారుమడిలో అలాగే ఎదపెట్టిన పొలాల్లో నారుకుళ్లు తెగులు నివారణకు 3 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి కలిపి భూమి బాగా తడిచేలా పిచికారీ చేయాలి. కొయనోఫారా ఎండుతెగులు నివారణకు 30 గ్రాములు కాపర్ ఆక్సీక్లోరైడ్ + 1 గ్రాము స్ట్రెప్లోసైక్లిన్ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. + ఉల్లి సాగు చేసే రైతులు పొలాన్ని నాలుగైదు సార్లు దుక్కి చేసుకోవాలి. 30 సెంటీమీటర్ల ఎడంలో బోదెలు చేసుకొని రెండు వైపులా నాటుకోవచ్చు. 1 శాతం బోర్డోమిశ్రమంలో ముంచి నారును నాటడం వల్ల నారుకుళ్లు తెగులును నివారించుకోవచ్చు. సాధ్యమైనంత మేర ఆగస్టు 15వ తేదీలోపు నాటుకోవడం ఉత్తమం. తామర పురుగుల నివారణకు 2 మి.లీ డైమిథోయేట్ లేదా 2 మి.లీ ఫిప్రొనిల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. -
అసుస్ స్మార్ట్‌ఫోన్స్: విత్ డబుల్ సెల్ఫీ కెమెరా
స్మార్ట్‌ఫోన్ మేకర్ అసుస్ రెండు స్మార్ట్‌ఫోన్ లను త్వరలో వినియోగదారులకు అందుబాటులోకి తేనుంది. జెన్‌ఫోన్ 4 సెల్ఫీ, జెన్‌ఫోన్ 4 సెల్పీ ప్రొ పేరుతో రెండు సెల్ఫీ మోడల్స్‌ను ఈ నెల 17న విడుదల చేయనుంది. అదీ రెండు సెల్పీ కెమెరాలతో ఈ స్మార్ట్ఫోన్లను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. సెల్పీ వెర్షన్లో 20,8 మెగాపిక్సెల్ కెమెరాలతో, సెల్ఫీ ప్రో వెర్షన్లో 24ఎంపీ, 5 ఎంపీ సెల్పీ కెమెరాలు విత్ ఫ్లాష్ తో రూపొందించడం ప్రధాన ఆకర్షణకానుంది. ఇంకా డ్యుయల్ సిమ్ స్లాట్‌తో పాటు ఒక స్పెషల్ మైక్రో ఎస్డీ స్లాట్ ఉండనున్నాయి. ఇక ధరల విషయానికి వస్తే జెన్ ఫోన్ 4 సెల్ఫీ ధర సుమారుగా రూ.22,500లుగాను, హై ఎండ్ మోడల్ జెన్ ఫోన్ 4 సెల్పీ ప్రొ సుమారు రూ. 30,000 గాను ఉంటుందని అంచనా. జెన్‌ఫోన్ 4 సెల్పీ ప్రొ ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నూగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 16 ఎంపీ బ్యాక్ కెమెరా 24 మెగాపిక్సెల్ +5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా 4జీ వీవోఎల్టీఈ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దాదాపు ఇవే ఫీచర్లను జెన్ ఫోన్ 4 సెల్పీలో కూడా పొందుపరచింది. -
కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తికి మళ్లీ అవమానం జరిగింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న జెండా వందనం చేసే మంత్రుల జాబితాను సర్కార్ మంగళవారం విడుదల చేసింది. అయితే కేఈ కృష్ణమూర్తికి జెండా వందనం చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. అన్ని జిల్లాల్లోనూ ఇన్ఛార్జ్ మంత్రులే జెండా ఎగురవేస్తారంటూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో కేఈ సొంత జిల్లా కర్నూలులో కాల్వ శ్రీనివాసులు జెండా వందనం చేయనున్నారు. ఇప్పటికే కేఈకి అన్ని అధికారాల్లోనూ చంద్రబాబు కోత పెట్టిన విషయం తెలిసిందే. కాగా జెండా ఎగురవేసే అవకాశాన్ని కేఈ కృష్ణమూర్తికి ఇవ్వకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎంకు ఇచ్చే గౌరవం ఇదేనా అని కేఈ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏపీ కేబినెట్ ఏర్పాటు అయినప్పటి నుంచి ఆయనకు అవమానాలు ఎదురు అవుతూనే ఉన్నాయి. కాగా ఇటీవల జరిగిన జిల్లాల ఇన్చార్జి మంత్రుల నియామకంలో కేఈకి చోటు దక్కలేదు. ఏ జిల్లాకూ ఇన్చార్జి మంత్రిగా ఆయనను నియమించలేదు. కేబినెట్లో అందరికంటే సీనియర్ అయినా కేఈ కృష్ణమూర్తిని చంద్రబాబు పక్కనపెట్టడం గమనార్హం. -
‘సంకల్ప్ పర్వం’గా ఆగస్టు 15
న్యూఢిల్లీ: దేశప్రజలు స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15న ‘సంకల్ప్ పర్వం’ జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. సమాజంలోని రుగ్మతల నిర్మూలనకు కృషి చేస్తామని పౌరులు ఆరోజున సంకల్పించుకోవాలని సూచించింది. 70వ స్వాతంత్య్ర దినోత్సవమైన ఈ నెల 15న ‘సంకల్ప్ పర్వం’ నిర్వహించుకోవాలని సిబ్బంది శిక్షణ శాఖ తన తాజా ఉత్తర్వులో పేర్కొంది. ‘2022నాటికి క్విట్ఇండియా ఉద్యమం 75ఏళ్లు పూర్తిచేసుకుంటుంది. పౌరులంతా సమష్టిగా సమస్యలపై పోరాడి కొత్త భారతావనిని ఆవిష్కరిస్తే మన స్వాతంత్య్రయోధులు గర్విస్తారు’ అని పేర్కొంది. -
ఆలిండియా బ్యాంకర్ల సమ్మె సైరన్
చెన్నై: బ్యాంకు సంఘాలు మరోసారి సమ్మెకు దిగనున్నారు. బ్యాంకింగ్ రంగం, ఇతర అంశాలపై ఇటీవలి సంస్కరణలను నిరసిస్తూ ఆగస్టు 22 న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి. ముఖ్యంగా ప్రయివేటైజేషన్, ప్రభుత్వ రంగబ్యాంకుల విలీనం తదితర చర్యలకు వ్యతిరేకంగా బ్యాంకు యూనియన్లు సమ్మె సైరన్ మోగించాయి. ఈనెల 22వ తేదీన ఆలిండియా బ్యాంకర్ల సమ్మె తలపెట్టినట్లు ద యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బీయు), ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్లు ప్రకటించాయి. ఆగస్టు 22 న మొత్తం బ్యాంకింగ్ రంగంపై సమ్మె జరుగుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐబీఇఎ) ప్రధాన కార్యదర్శి సీహెచ్ వెంకటాచలం తెలిపారు చెప్పారు. వేతనాలు పెంపుతోపాటు బ్యాంకింగ్ రంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్‌తో ఈ సమ్మెకు దిగనున్నామని చెప్పారు. దీనిపై రెండు రోజుల క్రితమే నోటీసులు అందజేశా మన్నారు. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యుఎఫ్‌బీయు ఈ సమ్మెలో పాల్గొంటోందని అలాగే వేతనం సమీక్షలాంటి , ఇతర సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌ను కూడాకోరినట్టు వెంకటాచలం తెలిపారు. -
ఆగస్టులో సెలవులే సెలవులు..
హైదరాబాద్ : ఆగస్టు నెలలో ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు వరుస సెలవులు రానున్నాయి. ఆగస్టు 12న రెండో శనివారం, 13 ఆదివారం, 14 కృష్ణాష్టమి, 15న స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వరుసగా నాలుగు రోజులు పని చేయవు. అయితే ఆగస్టు 14న కృష్ణాష్టమికి బ్యాంకులకు సెలవు లేదు. అదే విధంగా ఆగస్టు 25న వినాయకచవితి, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా మూడురోజులు పనిచేయవు. శ్రావణమాసం శుభ కార్యాలకు తోడు వరుస సెలవులు తోడవ్వడంతో బస్సులు, రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే సందడిలో సడేమియాలా ప్రయివేట్ ట్రావెల్స్ అమాంతం టికెట్ ధరలు పెంచేశాయి. -
నిషే«ధం ఉన్నా నిర్భయంగావేట
కొవ్వూరు రూరల్: నిబందనలు ఉన్నా అమలు చేసేవారే ఉండరు. ఒకవేళ నిబందనలు ప్రదర్శించినా బయపడేవారు ఉండరు. ముఖ్యంగా జూన్ నుంచి ఆగష్టు నెలాఖరు వరకూ గోదావరి నదిలో గుడ్డు దశ నుంచి మత్స్య సంపద పెరుగుతుంది. ఈ సమయంలో నదిలో చేపలవేటను కూడా అధికారులు నిషేదిస్తుంటారు. అయితే అదే సమయంలో గోదావరిలో చేరే కొత్త నీటితో రొయ్య, చేపపిల్లలు విరివిగా దొరుకుతుంటాయి. దీనినే అక్రమార్కులు తమ వ్యాపారానికి మరల్చుకుంటున్నారు. ఆయా సమయంలో వేటపై నిషేదం ఉన్నా అది అమలు కావడం లేదు. కొవ్వూరు మండలం మద్దూరులంకలో బ్యారేజ్ వద్ద రొయ్య సీడ్‌ను పట్టుకుని అమ్ముకునే వ్యాపారం జొరుగా సాగుతుంది. అదే విదంగా గోదావరి పరివాహకప్రాంతంలో రొయ్య పిల్లలు చేప పిల్లలను పట్టి ఎండబెట్టి కోళ్ల మేతకు అమ్ముకుంటున్నారు. పిల్ల దశలో గోదావరిలో మత్స్య సంపదను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన జాలర్లు వలల ద్వారా పట్టుకుంటే నదిలో అవి పెరగవని, తమ జీవనాధారం పోతుందంటూ రెండు నెలల క్రితం తాళ్లపూడి మండలంలోని జాలర్లు వేటను అడ్డుకున్నారు. ఈ విదంగా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. అయితే ఇంత జరుగుతున్నా అడ్డుకోవాల్సిన మత్స్యశాఖ అధికారులు మాత్రం పట్టనట్టే ఉంటారు. తూతూ మంత్రంగా సీడ్ పట్టే ప్రాంతంలో నిబందనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటారు. ఇప్పటికైనా గోదావరిలో అక్రమ వేటను నిరోదించి మత్స్యసంపదను కాపాడాలని కోరుతున్నారు. -
6న ఓపెన్ డిగ్రీ అర్హత పరీక్ష
అనంతపురం ఎడ్యుకేషన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఈనెల 6న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు అనంతపురం ప్రాంతీయ సమన్వయ కేంద్ర కోఆర్డినేటర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేకపోయినా 18 ఏళ్లు నిండిన వారు అర్హులన్నారు. ఇప్పటికే అర్హత పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆర్ట్స్ కళాశాలలోని కేంద్రం నుంచి హాల్ టికెట్లు పొందాలన్నారు. -
ఉద్యానతోటల్లో ‘ఆగస్టు’ యాజమాన్యం
అనంతపురం అగ్రికల్చర్: ద్రాక్ష, దానిమ్మ, మామిడి తోటల్లో ఆగస్టు నెలలో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ టెక్నికల్ అధికారి, ఏపీఎంఐపీ ఏపీడీ జి.చంద్రశేఖర్ తెలిపారు. + ద్రాక్ష తోటల్లో కత్తిరింపులు పూర్తయ్యాక 40 నుంచి 65 రోజులైన తర్వాత నీళ్లు ఎక్కువగా ఇవ్వకూడదు. ఎకరాకు 5,500 లీటర్లు నీరు మాత్రమే పెట్టాలి. ఎక్కువగా నీళ్లు పెడితే పూమొగ్గ ఏర్పడే అవకాశం తగ్గిపోతుంది. అలాగే నీళ్లు తక్కువైనా కూడా కష్టమే. సరైన మోతాదుల్లో నీళ్లు పెడితే పంట బాగొస్తుంది. ఈ దశలో నత్రజని ఎరువులు కూడా ఎక్కువగా వేయకూడదు. నత్రజని వేస్తే పుల్ల ఎక్కువగా సాగి పూత తగ్గిపోతుంది. హార్మోన్ల వాడకం విషయానికి వస్తే కత్తిరింపులైన 40వ రోజు 1 గ్రాము 6–బీఏ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 45వ రోజు 5 గ్రాములు యురాసిల్ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి. 55వ రోజు 1 మి.లీ లెహోసీన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. 65వ రోజు 3 గ్రాములు యురాసిల్ 100 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. 70వ రోజు 2 గ్రాములు యురాసిల్ 100 లీటర్ల నీటికి పిచికారి చేయాలి. 80 నుంచి 90వ రోజు మధ్య 0.5 మి.లీ లెహోసీన్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. ద్రాక్షలో బూజుతెగులు, తామర పురుగులు (త్రిప్స్) నివారణకు 1.5 గ్రాములు నీటిలో కరిగే గంధకం లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. + దానిమ్మలో కాయ ఎదుగుదల దశలో ఉన్న తోటల్లో బ్యాక్టీరియా మచ్చతెగులు సోకే అవకాశం ఉన్నందున 0.5 శాతం మైలుతుత్తం (బోర్డో మిశ్రమం) పిచికారి చేయాలి. రోగం సోకిన కాయలు, కొమ్మలు ఏరివేసి నాశనం చేయాలి. పండుఈగ ఆశిస్తే కాయలపై సూది లాంటి రంధ్రాలు ఏర్పడి కాయ కుళ్లిపోతుంది. నివారణకు 1.5 మి.లీ లాంబ్డాసైలోత్రీన్ ఒక లీటర్ నీటికి కలిపి సాయంత్రం వేళల్లో పిచికారి చేయాలి. కత్తిరింపులు చేసిన తోటల్లో వెంటనే 1 శాతం బోర్డోమిశ్రమం పిచికారి చేయాలి. నేలపైన బ్లీచింగ్ పౌడర్ + బట్టీ సున్నం చల్లుకోవాలి. + పంటకోతలు పూర్తయిన తర్వాత మామిడితోటల్లో ఎండుకొమ్మలు, తొడిమలు, అడ్డదిడ్డమైన కొమ్మలు, గత పంట అవశేషాలు పూర్తిగా కత్తిరించాలి. గాలి, వెలుతురు, సూర్యరశ్మి బాగా ప్రసరించేలా చెట్టు కత్తిరింపులు జాగ్రత్తగా చేయాలి. కత్తిరింపులు తర్వాత 3 గ్రాములు బ్లైటాక్స్ + 2.5 మి.లీ క్లోరోఫైరిపాస్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేయాలి. కొత్త చిగుర్లు వచ్చిన వెంటనే 3 గ్రాములు సూక్ష్మధాతులోప మిశ్రమం + 1 మి.లీ నువాన్ + 1 గ్రాము బావిస్టన్ లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. -
వీఐపీ-2 రిలీజ్ డేట్ కన్ఫాం.. కానీ..
చెన్నై: ఎంతో కాలంగాఎదురు చూస్తున్న వీఐపీ-2 చిత్రం విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న ఈ మూవీ విడుదలను హీరో ధనుష్ ధృవీకరించారు. సౌందర్యరజనీకాంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లను పలకరించనుంది. మూవీ విడుదలపై అంచనాలు వద్దంటూ ఇటీవల వేడుకున్న ధనుష్ ఈ విషయాన్ని మంగళవారం ట్విట్టర్లో ధృవీకరించారు. అయితే తమిళ వెర్షన్ రిలీజ్‌పై ట్వీట్ ద్వారా కబురు అందించిన ధనుష్ తెలుగు, హిందీ భాషల్లో కూడా ఆగస్టు 11న విడుదల కానుందా లేదా అనే దానిపైమాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ధనుష్ కథానాయకుడిగా 2014నాటి తమిళ బ్లాక్ బస్టర్ "వేల ఇల్ల పత్తతారి’’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన చిత్రం వీఐపీ-2. వీఐపీ మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్రానికినిర్మాత కలైపులి ఎస్.థాను, ధనుష్ వండర్‌బార్ ఫిలింస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మించగా, అమలాపాల్ కథానాయకిగా నటించింది. మరోముఖ్య పాత్రలో బాలీవుడ్ భామ కాజోల్, సముతిరాకణి, వివేఖ్ నటించారు. సాన్ రోల్డన్ సంగీతాన్ని అందించారు. అటు ధనుష్ వరుస విజయాలు, ఇటు కాజోల్ రెండు దశాబ్దాల దర్వాత మళ్లీ ఈ చిత్రంలో నటించడంతో ఈ వీఐపి -2 చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. #vip2 release date #raghuvarancoming https://t.co/gFGKxSDR36 — Dhanush (@dhanushkraja) August 1, 2017 -
ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు
జేఎన్టీయూ: జేఎన్టీయూ అనంతపురంలోని పాలకభవనంలో బీటెక్ (బ్లెకింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్వీడన్), జేఎన్టీయూఏ సంయుక్తంగా అందిస్తున్న బీటెక్ కోర్సుల్లో ఆగస్టు 5న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ విజయ్‌కుమార్ తెలిపారు. బీటెక్ సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచుల్లో చేరడానికి ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ఫీజు తదితర పూర్తి వివరాలకు www.jntua.ac.inలో తెలుసుకోవచ్చన్నారు. -
ఖగోళ అద్భుతం..99ఏళ్ల తరువాత
న్యూఢిల్లీ: ఆగస్టు21న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. అమెరికాఖండంలోని 14 రాష్ట్రాల్లో ఏర్పడనుందని నాసా ప్రకటించింది. 2017 ఆగస్టు 21 న సంభవించే ఇది చాలా అరుదైన గ్రహణమనీ, ఖగోళ అద్భుతం మని నాసా అభివర్ణించింది. మనిషి జీవితంలో ఒకసారి మాత్రమే లభించే అవకాశమని, 99 సంవత్సరాలలో ఇది మొదటిదని పేర్కొంది. సంపూర్ణ సూర్యగ్రహణం సమయంలో, సూర్యుడు, భూమికి మధ్యనుంచి చంద్రుడు దాటుడూ ఒకవైపు సూర్యుడు మొత్తం కప్పి వేయడంతో ఆకాశంలో సూర్యుడు కనిపించడని పేర్కొంది. దాదాపు గంటన్నర పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఖగోళ ఈవెంట్‌ను దాదాపు 300 మిలియన్ల కన్నా ఎక్కువ మంది వీక్షించనున్నారని నాసా అంచనా వేసింది. అలాగే ఈ గ్రహణాన్ని వీక్షించాలనుకునేవారు సరైన భద్రా ప్రమాణాలను పాటించాలని నాసా సిఫారసు చేసింది. ముఖ్యంగా ఎక్లిప్ గ్లాసెస్ లేదా హ్యాండ్ హెల్డ్ సోలార్ వ్యూయర్ లాంటి ప్రత్యేక ప్రయోజన సౌర ఫిల్టర్లను మాత్రమే వాడాలని సూచించింది. మరోవైపు ఈ గ్రహణం కారణంగా ఆగస్టు 21వ తేదీన అమెరికా అంతటా మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మాయం కానున్నాడు. గ్రేట్ అమెరికన్ సోలార్ ఎక్లిప్స్ అని పిలిచే ఈ గ్రహణం పోర్ట్లాండ్ నుంచి ఓరెగాన్ మీదుగా, దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ సూర్యుడు మాయమయ్యి చీకటి ఆవరిస్తుంది. రెండు నిమిషాల కొన్నిసెకన్లపాటు ఆకాశంలో చుక్కలు కూడా కనిపిస్తాయట. కాగా 99 సంవత్సరాల క్రితం, 1918, జూన్ 8వ తేదీన వాషింగ్టన్ నుంచి ఫ్లోరిడా వరకు సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించింది.