
ముంబై: రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో బక్రీద్ సందర్భంగా 1న బ్యాంకులు పనిచేయవు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 15న సెలవు. ఇక రక్షా బంధన్ కారణంగా ఆగస్ట్ 3న అహ్మదాబాద్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో తదితర పట్టణాలలో బ్యాంకులు పనిచేయవు.
భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పాట్నా తదితర ప్రాంతాలలో కృష్ణాష్టమి నేపథ్యంలో 11న బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది. మరికొన్ని నగరాలలో 12న జన్మాష్టమి సెలవు ఇచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్ట్ 22న వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక బ్యాంకింగ్ మార్గదర్శకాల ప్రకారం నెలలో ప్రతీ రెండు, నాలుగు శనివారాలలో బ్యాంకులు పనిచేయని సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment