ఆగస్టు నెలలో బ్యాంకులు పనిచేయని రోజులివే.. | Bank Holidays In August 2024 Branches To Shut For 13 Days | Sakshi
Sakshi News home page

ఆగస్టు నెలలో బ్యాంకులు పనిచేయని రోజులివే..

Published Sat, Jul 27 2024 9:30 PM | Last Updated on Sat, Jul 27 2024 9:30 PM

Bank Holidays In August 2024 Branches To Shut For 13 Days

జూలై నెల ముగింపునకు వచ్చేసింది. త్వరలో ఆగస్టు నెలలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ క్రమంలో మన రోజువారీ జీవితంలో భాగమైన బ్యాంకులు రానున్న నెలలో ఎన్ని రోజులు పనిచేస్తాయి.. ఏయే రోజుల్లో సెలవులు ఉంటాయన్నది ఈ కథనంలో తెలుసుకుందాం..

జాతీయ, ప్రాంతీయ సెలవుల కారణంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు 13 రోజుల పాటు మూతపడనున్నాయి.  ఈ సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జారీ చేస్తుంది. పండుగలు, ప్రాంతీయ వేడుకలు, సాధారణ వారాంతపు సెలవుల ఆధారంగా ఆర్బీఐ ఈ సెలవులను నిర్ణయిస్తుంది. ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో పరిశీలించి అందుకు అనుగుణంగా మీ బ్యాంకు పనులకు ప్రణాళిక వేసుకోండి.

ఆగస్టు నెలలో బ్యాంక్ సెలవులు ఇవే..
» ఆగస్టు 3 (శనివారం)- కేర్ పూజ- అగర్తలలో సెలవు.
» ఆగస్టు 4 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్ట్ 8 (గురువారం)-టెండాంగ్ లో రమ్ ఫాత్- సిక్కింలో సెలవు.
» ఆగస్టు 10 (రెండో శనివారం)- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్టు 11 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్టు 13 (మంగళవారం)-దేశభక్తుల దినోత్సవం- మణిపూర్‌లో సెలవు.
» ఆగస్టు 15 (గురువారం) - స్వాతంత్య్ర దినోత్సవం- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్టు 18 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్టు 19- (సోమవారం)- రక్షా బంధన్/జులానా పూర్ణిమ/బీర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య బహదూర్ పుట్టినరోజు- గుజరాత్‌, త్రిపుర, ఒరిస్సా, » ఉత్తరాఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌లో సెలవు
» ఆగస్టు 20- (మంగళవారం)- శ్రీ నారాయణ గురు జయంతి -కేరళలో సెలవు
» ఆగస్టు 24 (నాలుగో శని ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్టు 25 (ఆదివారం)- దేశవ్యాప్తంగా సెలవు.
» ఆగస్టు 26- (సోమవారం)- కృష్ణ జన్మాష్టమి- కొన్ని రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా సెలవు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement