
గత కొన్ని రోజులకు ముందు టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కేజీ రూ. 100 కంటే ఎక్కువ వద్ద లభిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం టమాటాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) 2023 ఆగస్టు 20 నుండి కిలో రూ. 40 రిటైల్ ధరకు టమోటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది.
ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరలకే ప్రజలకు టమాటాలు అందించిన సందర్భాలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆగస్ట్ 15న ప్రభుత్వం టమాటా ధరలను రూ.50కి తగ్గించింది, తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తూ ప్రకటించింది.
ఇదీ చదవండి: ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే?
ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏకంగా 15 లక్షల కేజీల టమాటాలు విక్రయించినట్లు తెలుస్తోంది. విక్రయాలు ఢిల్లీలో మాత్రమే కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వారణాసి, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా జరిగినట్లు సమాచారం. కేవలం గత 15 రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా 560 టన్నుల టమోటాలను విక్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment