tomato price
-
చిగురిస్తున్న ‘టమాటా’ ఆశలు
పలమనేరు: ధరలుంటే సరుకుండదు... సరుకుంటే ధరలుండవు... ఇదీ కొన్నేళ్లుగా చిత్తూరు జిల్లా, పలమనేరు ప్రాంతంలో టమాటా రైతుల దుస్థితి. ఈనెల మొదటివారంలో 14కిలోల బాక్స్ ధర రూ.200 నుంచి రూ.250 దాకా ఉండగా, గడచిన రెండ్రోజుల నుంచి ఆ ధర క్రమేపీ పెరుగుతూ వచ్చింది. మంగళవారం నాటికి బాక్స్ ధర రూ. 500కు చేరింది. ప్రస్తుతం బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు టమాటా కొనుగోలు నిమిత్తం పలమనేరు మార్కెట్‌కు వస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు కోత కోస్తున్న స్థానిక టమాటా తగ్గుతోంది. ఇప్పటికే కోతలు ముగిసిన తోటలు వడిగిపోతున్నాయి. ప్రస్తుతం కోతదశలో ఉన్న తోటలకు గిరాకీ తగిలే అవకాశాలున్నట్టు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.బయటి రాష్ట్రాల్లో తగ్గిన పంట బయటి రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్రల్లో టమాట పంట తగ్గింది. కర్ణాటకలో వైరస్ కారణంగా పంట దిగుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో డిమాండ్ పెరగడంతో పలమనేరు టమాటాధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఇతర రాష్ట్రాల్లో సరుకు లేనందున ఈ రెండు వారాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. -
కొండెక్కిన టమోటా ధరలు: కేజీ ఎంతంటే?
దేశంలో టమోటా ధరలు భారీగా పెరిగాయి. తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మొదలైన దక్షిణాది రాష్ట్రాల్లో కేజీ టమోటా రూ. 90 నుంచి రూ. 100 మధ్య ఉన్నాయి. ముంబైలో ఈ ధరలు రూ. 80 నుంచి రూ. 100 మధ్య ఉన్నట్లు తెలుస్తోంది.2024 ఏప్రిల్‌లో వైజాగ్, విజయవాడ రాష్ట్రాల్లోని హోల్‌సేల్ మార్కెట్లో 15 కేజీల టమోటాల ధర రూ. 150 నుంచి రూ. 200 మధ్య ఉండేది. అయితే ఇప్పుడు ఈ ధరలు అమాంతం పెరిగాయి. దీంతో 15 కేజీల టమోటాలు ధర రూ. 1100 నుంచి రూ. 1200లకు చేసింది. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లో కూడా కేజీ టమోటా ధర రూ. 75 నుంచి రూ. 80 వరకు ఉన్నట్లు తెలుస్తోంది.వర్షాకాలంలో కూరగాయల ధరలు సాధారణంగా పెరుగుతాయి. వర్షం వల్ల పంట ఏపుగా పెరిగినప్పటికీ.. దిగుబడి మాత్రం చాలా తగ్గుతుంది. దీంతో ధరలు అమాంతం పెరుగుతాయి. ఈ ఏడాది ఓ వైపు వర్షాలు, మరోవైపు భారీ ఎండలు కారణంగా నిత్యావసరాల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.ఆలస్యమైన రుతుపవనాలు కూడా టమోటా తోటలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సాధారణంగా జూన్ - జులై నెలల్లో టమాటో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. కానీ సరైన సమయంలో వర్షాలు కురవకపోవడం.. రుతుపవనాల ఆలస్యం కారణంగా టమోటా సాగును చాలామంది రైతులు వాయిదా వేశారు. టమోటా ధరలు మాత్రమే కాకుండా బంగాళదుంపలు, ఉల్లి వంటి ఇతర కూరగాయల ధరలు పెరిగాయి. -
నెలరోజుల్లో అనూహ్యంగా పెరిగిన కూరగాయల ధరలు
-
‘ప్రియ’మైన టమాటో
పార్వతీపురం: టమాటో ధరపైపెకి ఎగబాకుతోంది. ప్రస్తుతం కిలో టమాటో హోల్‌సేల్‌గా రూ.80కు లభిస్తుండగా, రిటైల్‌గా రూ.100కు విక్రయిస్తున్నారు. పల్లెల్లో రూ.110నుంచి రూ.120 వరకూ వర్తకులు అమ్ముతున్నారు. కొద్ది రోజుల నుంచి టమాటో ధర కిలో రూ.40లోపు ఉండగా ఒక్కసారిగా పెరిగింది. దీంతో సాధారణ కుటుంబాలు ప్రస్తుతం టమాటోను కొనలేని పరిస్థితి కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ధర మరింత పెరిగే ఆస్కారముందని వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి తీవ్రత దృష్ట్యా పంట దిగుబడులు తీవ్రంగా తగ్గిపోవడంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి కాకపోవడంవల్ల ధరలు పెరుగుతున్నాయని వర్తకులు చెబుతున్నారు. -
టమోట @ రూ.80
నూజివీడు: పచ్చిమిర్చి కిలో ధర సెంచరీకి చేరి కొనుగోలుదారులకు ఘాటుచూపిస్తుండగా, నేడు టమోట వంతు వచ్చింది. వేసవి కారణంగా టమోట సాగు విస్తీర్ణం బాగా తగ్గిపోవడంతో టమోట ధర ౖపైపెకి ఎగబాకుతోంది. రైతుబజారులోనే కిలో రూ.65కు చేరడంతో ప్రజలు కొనాల్సిన చోట పావుకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో టమోట ధర రూ.80 పలుకుతోంది. గ్రామాల్లో రూ.80 నుంచి రూ.90 విక్రయిస్తున్నారు. దీంతో పెట్టుబడి ఎక్కువ అవడం, ప్రజల కొనుగోలు తగ్గిపోవడంతో రైతుబజారులో ని దుకాణదారులు కూడా సగానికి సగం అమ్మకాలను తగ్గించేశారు. వేసవికి ముందు సాగుచేసిన పంటకాలం పూర్తికావడంతో స్థానికంగా టమోటకు తీవ్ర కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రాంతం నుంచి వస్తున్న టమోటను హోల్‌సేల్ వ్యాపారుల వద్ద నుంచి కొనుగోలు చేసి అమ్మాల్సి వస్తుండటంతో టమోట ధర బాగా పెరిగింది. టమోట ధర మామూలుగా ఉన్నప్పుడు నూజివీడు రైతుబజారులో రోజుకు రెండు టన్నుల వరకు అమ్ముడుపోయేవి. ధర పెరగడంతో కేవలం టన్ను కూడా అమ్ముడుకావడం లేదని దుకాణదారులు చెబుతున్నారు. -
టమాటా ధరలు తగ్గింపుపై కేంద్ర కీలక ప్రకటన! మరింత..
గత కొన్ని రోజులకు ముందు టమాట ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. క్రమంగా ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ కేజీ రూ. 100 కంటే ఎక్కువ వద్ద లభిస్తున్నాయి. ఈ సమయంలో కేంద్రం టమాటాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NAFED) 2023 ఆగస్టు 20 నుండి కిలో రూ. 40 రిటైల్ ధరకు టమోటాలు విక్రయించనున్నట్లు తెలుస్తోంది. ధరల పెరుగుదల సమయంలో కూడా కేంద్రం తక్కువ ధరలకే ప్రజలకు టమాటాలు అందించిన సందర్భాలు గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి. ఆగస్ట్ 15న ప్రభుత్వం టమాటా ధరలను రూ.50కి తగ్గించింది, తాజాగా ఈ ధరలను మరింత తగ్గిస్తూ ప్రకటించింది. ఇదీ చదవండి: ఈ కారు కేవలం 10 మందికి మాత్రమే.. ఎందుకింత స్పెషల్ అంటే? ఇప్పటి వరకు కూడా కేంద్రం ఏకంగా 15 లక్షల కేజీల టమాటాలు విక్రయించినట్లు తెలుస్తోంది. విక్రయాలు ఢిల్లీలో మాత్రమే కాకుండా రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, వారణాసి, బీహార్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ మొదలైన రాష్ట్రాల్లో కూడా జరిగినట్లు సమాచారం. కేవలం గత 15 రోజుల్లో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఏకంగా 560 టన్నుల టమోటాలను విక్రయించింది. -
..దేనిగురించయినా మాట్లాడండి సార్! టమాటాలు తప్ప!!
..దేనిగురించయినా మాట్లాడండి సార్! టమాటాలు తప్ప!! -
గుడ్‌న్యూస్: దిగొస్తున్న టమాట ధరలు.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: దేశ వాప్తంగా టమాటా ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఎక్కడ విన్నా టమోట పేరే వినపడుతోంది. ఎక్కడ చూసినా టమాటా చర్చలే. గతంలో ఎన్నడూ లేనంతగా కేజీ టమాటా ధర రూ. 200కి చేరి సామాన్యుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. ధరలు పెరిగిపోవడంతో టమాట దొంగతనాలు, పంటకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే పరిస్థితి తలెత్తింది. అయితే ఈ పంట వేసిన రైతులు కొందరు లక్షాధికారి కాగా, మరికొందరు కోటీశ్వరులు కూడా అయ్యారు. అయితే దాదాపు రెండు నెలలుగా కొండెక్కి కూర్చున్న టమాటా ధరలు నెమ్మదిగా దిగివస్తున్నాయి. మార్కెట్లోకి టమాటా దిగుబడి పెరగడంతో రెండు రోజులుగా తగ్గుముఖం పట్టాయి. సోమవారం వరకు రూ.4,300 పలికిన 23 కేజీల బాక్సు ధర ప్రస్తుతం రూ. 2,300కి తగ్గింది. నాణ్యతను బట్టి బాక్సు ధర రూ.1500 నుంచి రూ.2,300 వరకు పలుకుతున్నది. రైతు బజార్లలో కిలో టమాటా రూ. 60-100 మధ్య పలుకుతోంది. బయట మార్కెట్లో మాత్రం రూ. 100-140 మధ్య ఉంది. పది రోజుల క్రితం హైదరాబాద్ హోల్‌సేల్ మార్కెట్‌కు 850 క్వింటాళ్ల టమాటా రాగా సోమవారం ఏకంగా 2,450 క్వింటాళ్ల టమాటా వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలతోపాటు కర్ణాటక నుంచి కూడా హైదరాబాద్‌కు టమాటాలు వస్తున్నాయి. దీనికితోడు రంగారెడ్డి, చేవెళ్ల, నవాబ్‌పేట, మెదక్, వికారాబాద్ జిల్లాల నుంచి కూడా మార్కెట్‌కు టమాటాలు పోతెత్తడంతో ధర తగ్గుముఖం పట్టింది. ఈ నెలాఖరుకు కిలో టమాటా రూ. 50కి తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. టమాటాలపై నిఘా కోసం పొలంలో సీసీ కెమెరా ఔరంగాబాద్: మహారాష్ట్రలో ఓ రైతు ఏకంగా తన టమాట పొలంలో సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఔరంగాబాద్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాపూర్ బంజర్‌కు చెందిన రైతు శరద్ రాటేకు ఐదెకరాల సాగుభూమి ఉంది. ఒకటిన్నర ఎకరాల్లో టమాటా సాగు చేశారు. ఆ పంటను కాపాడుకోవడానికి పొలంలో డిజిటల్ నిఘాను ఏర్పాటు చేశారు. దానిని ఫోన్‌కు అనుసంధానించి ఫోన్లో ఎక్కడైనా విజువల్స్‌ని తనిఖీ చేస్తున్నారు. ఇటీవల టమాటా తోటపై దొంగలు దాడి చేసి 20 నుంచి 25 కిలోల టమాటాలు ఎత్తుకుపోవడంతో తాను ఈ చర్యలు తీసుకున్నానన్నారు. ఈ రోజు అత్యంత డిమాండ్ ఉన్న కూరగాయ అయిన టమాటాలను కోల్పోవడం తాను భరించలేనని చెప్పారు. 22–25 కిలోల టమాటా ఇప్పుడు రూ.3 వేలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. కెమెరా సౌరశక్తితో నడుస్తుందని, దాని విద్యుత్ సరఫరా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతు తెలిపారు. -
ఏపీలో టమోటాను కేజీ రూ.50కే అందిస్తోన్న వైఎస్ జగన్ ప్రభుత్వం
-
వామ్మో!.. కోడికూరను మించిపోయిన టమాటా ధరలు..
కూరగాయల ధరలు కుతకుతమంటున్నాయి. టమాటా, పచ్చిమిర్చి, వంకాయ, ఉల్లితోపాటు మిగతా కూరగాయల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట దెబ్బతినడంతో.. దూరప్రాంతాల నుంచి రవాణా సౌకర్యానికి అంతరాయమేర్పడి దిగుమతి తగ్గింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు, వరదలు ఉండగా సరుకులు రావడం లేదంటూ వ్యాపారులు చెబుతున్నారు. ఉన్న సరుకును బ్లాక్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఏ కూరగాయ కొనాలన్నా సామాన్యుడికి అందుబాటులో ఉండడం లేదు. రూ.500తో మార్కెట్‌కు కెళ్తే వారానికి సరిపడా రావడం లేదు. దిగిరాని ధరలు వంటకాల్లో టమాటాకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ఏ వంట చేయాలన్నా టమాటా తప్పనిసరి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న వీటి ధరల పెరుగుదల సామాన్య మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. టమాటా ధరలు తగ్గేదేలే అంటూ రోజు రోజుకు పెరిగిపోతూ వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. మొన్నటి వరకు 100 నుంచి 150 వరకు ఉన్న టమాటా ధర ఇప్పుడు ఏకంగా డబుల్ సెంచరీ దాటేసింది. చదవండి: హైదరాబాద్‌లో పార్కింగ్ పరేషాన్! కేటీఆర్‌కు ట్వీట్.. ఇలా చేస్తే బెటర్! టమాటా @200 కిలో టమాటా రూ.100 ఉండగానే జనాలు కొనేందుకు తంటాలు పడగా.. ఏకంగా రూ.200కు చేరగా ఇక కొనలేమంటూ వాపోతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో కేజీ టమాటా రూ.200పైనే పలుకుతోంది. ధరలు ఆకాశాన్ని తాకుతుంటడంతో సామాన్యులు టమాటా వాడకాన్ని తగ్గించారు. అంతేగాక రానున్న రోజుల్లో మరింత పెరిగినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు. టమాటా కంటే చికెన్ బెటర్ టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి వంటి కూరగాయలు, నిత్యావసర ధరలు పెరుగుతుంటే.. కోడి మాంసం ధరలు మాత్రం నేలచూపులు చూస్తున్నాయి. కొన్నిచోట్ల టమాట కంటే చికెన్ ధరలు తక్కువగా ఉన్నాయి. చాలా చోట్ల కేజీ చికెన్ ధర రూ.200(స్కిన్). రూ. 220(స్కిన్ లెస్)గా ఉంది.. రూ. 200 పెట్టి టమాటాలు కొనే బదులు చికెన్ కొనడమే బెటర్ అని చాలా మంది అంటున్నారు. నిత్యావసరాల ధరలకూ రెక్కలు.. రాష్ట్రంలో ఇటీవల వారంపాటు కురిసిన ఎడతెరిపి లేని భారీ వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. రావాణా వ్యవస్థ కుదేలైంది. దీంతో ధరలు మరింత పెరిగాయి. కూరగాయల ధరలతోపాటు నిత్యావసరాల ధరలకూ రెక్కలొచ్చాయి. రెక్కడితేగాని డొక్కాడని కూలీలు పొద్దంతా పని చేసి వచ్చిన కూలి డబ్బులతో కుటుంబాన్ని పోషించుకోలేని దుస్థితి ఏర్పడింది. పైగా వర్షాల కారణంగా వారంరోజులుగా పనులు లేక ఇళ్లకే పరిమితమైన వీరి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. చదవండి: ఆరో ఉగ్రవాది దొరికాడు! జవహర్‌నగర్‌లో ఎస్కేప్.. రాజేంద్రనగర్‌లో అరెస్టు! -
టమాటా సాగుతో కోటీశ్వరులు.. 45 రోజుల్లో రూ. 3 కోట్ల ఆదాయం
గతంలో ఎన్నడూ లేనంతగా టమాటా ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. గత నెల రోజులుగా కొండెక్కి కూర్చున్న టమాటాధరలు.. ఎంతకీ దిగిరావడం లేదు. పోనూ పోనూ ఇంకా ప్రియంగా మారుతూ.. సామాన్యుడికి భారంగా మారింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.200 చేరి కొత్త రికార్డులు సృష్టిస్తుంది. అయితే పెరిగిన టమాటా ధరలతో వినియోగదారులు బెంబేలెత్తిపోతుంటే.. వీటిని పండించిన రైతుల ఇంట మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కనివినీ ఎరగని రీతిలో కొంతమంది రైతులు ధనవంతులు అవుతున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ రైతు కుటుంబం టమాటా పంటతో జాక్‌పాట్ కొట్టింది. 22 ఎకరాల్లో టమాటాసాగు చేసి.. 45 రోజుల్లో ఏకంగా మూడుకోట్లు సంపాదించారు. భూదేవిని నమ్ముకున్న రైతులు ఏ రోజుకైనా రాజులవుతారని నిరూపించారు రైతులు చంద్రమౌళి, మురళి. చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమందకు చెందిన రైతు కుటుంబంలోని అన్నదమ్ములు చంద్రమౌళి, అతని తమ్ముడు మురళి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. స్వగ్రామమైన కరకమంద సమీపంలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపు వారి పల్లెలో 10 ఎకరాల పొలంలో 23 సంవత్సరాలుగా టమాటను సాగు చేస్తున్నారు. చదవండి: టమాటా లారీ బోల్తా..! క్షణాల్లోనే ఊడ్చుకెళ్లారు..!! 22 ఎకరాల్లో టమాటా సాగు తన వంగడాలు, మార్కెట్ స్థితిగతుల గురించి బాగా అవగాహన పెంచుకున్న చంద్రమౌళి.. ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తూ ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి ప్రారంభమయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఈ సంవత్సరం అరుదైన సాహు రకానికి చెందిన టమాటా మొక్కలను 22 ఎకరాలలో సాగు చేశారు. త్వరగా దిగుబడి పొందడానికి మల్చింగ్, మైక్రో ఇరిగేషన్ పద్ధతుల వంటి అధునాతన పద్ధతులను అనుసారించాడు. దాదాపుగా 70 లక్షల వరకు పంటపై ఖర్చు చేయగా.. జూన్ చివరి వారంలో దిగుబడి ప్రారంభమైంది. రూ. 4 కోట్ల ఆదాయం.. ఖర్చులు పోనూ! ఈ పంటను తమ ప్రాంతానికి దగ్గరల్లో ఉన్న కర్ణాటక రాష్ట్రం కోలార్ మార్కెట్లో విక్రయించారు. అక్కడ 15 కేజీల బాక్స్ ధర వెయ్యి రూపాయల నుంచి 1500 మధ్య పలికింది. గత 45 రోజుల్లో సుమారుగా 40 వేల పెట్టెలు విక్రయించాడు. తనకొచ్చిన లాభంపై రైతు చంద్రమౌళి సంతోషం వ్యక్తం చేశాడు. తన అనుభవాన్ని పంచుకుంటూ..ఇప్పటి వరకు పండించిన పంట ద్వారా రూ. 4 కోట్ల ఆదాయం వచ్చిందన్నాడు. మొత్తంగా 22 ఎకరాల్లో పంట కోసం అన్నీ ఖర్చులు కలిపి కోటి రూపాయలు పెట్టుబడి పెట్టగా... రూ. 3 కోట్ల లాభం వచ్చిందని తెలిపారు. రికార్డు స్థాయిలో ధరలు మరోవైపు భారత్‌లోనే అతిపెద్ద టమటా మార్కెట్లలో ఒకటిగా ఉన్న మదనపల్లెలో టమాట ధర విపరీతంగా పెరుగుతోంది. మొదటి గ్రేడ్ టమోటా కిలో ధర శుక్రవారం రూ. 200 రూపాయలు పలికింది. రెండు వారాల క్రితం కిలో టమాటారూ.120 ఉండగా.. 25 కిలోల డబ్బాను రూ.3 వేలకు విక్రయించారు. అయితే ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో టమాటకు డిమాండ్ పెరగడంతో కిలో ధర రూ.200కి చేరింది. ఆగస్టు నెలాఖరు వరకు టమాటా ధరలు పెరుగుతాయని అధికారులు తెలిపారు. చదవండి: సముద్రంలో పడవ బోల్తా.. రుషికొండ బీచ్‌లో తప్పిన ప్రమాదం -
గుడ్ న్యూస్.. ఆన్లైన్లో రూ. 70కే కేజీ టమాటలు!
గత కొన్ని రోజులుగా టమాట ధరలకు రెక్కలొచ్చి సామాన్య ప్రజలకు అందనంత స్థాయికి ఎదిగిపోయాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కేజీ ధర రూ. 200 దాటింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్సిసిఎఫ్ టమోటాలను కిలో రూ.70కి అందజేస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, ఓఎన్డీసీ (ONDC) కొనుగోలుదారులకు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించకుండా ఆన్లైన్లో రూ. 70కి అందిస్తోంది. దీనికోసం పేటీఎం యాప్ ద్వారా కస్టమర్ ఆర్డర్ చేయవచ్చని, ఒక కస్టమర్ కేవలం 2 కేజీల టమాటలను మాత్రమే ఆర్డర్ చేసుకోవచ్చని మేనేజింగ్ డైరెక్టర్ టి కోశి తెలిపారు. ఈ సదుపాయం ప్రస్తుతం ఢిల్లీ ప్రజలకు మాత్రమే అందుబాటులో ఉంది. పెరుగుతున్న ధరల నుంచి ఉపశమనం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గత వారంలో టమాటాలను సబ్సిడీపై విక్రయించాలని నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NCCF) అండ్ నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED)లను ఆదేశించింది. (ఇదీ చదవండి: ఐఐటీ నుంచి సాఫ్ట్వేర్.. లక్షల ఉద్యోగం వదిలి కమెడియన్‌గా.. ఎంత సంపాదిస్తున్నాడంటే?) కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మొదట్లో కేజీ టమాటలను రూ.90కి విక్రయించారు. ఆ తరువాత జులై 16 నుంచి కేజీ రూ.80కి, జూలై 20 నుంచి కిలో రూ.70కి తగ్గించారు. మొత్తం మీద అధిక ధరల నుంచి ప్రజలను కొంత వరకు విముక్తి కలిగించడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. -
‘అయితే టమాటాలు తినడం మానేయండి’
లక్నో: టమాట ధరల సంక్షోభం దేశం మొత్తం కొనసాగుతోంది. ఎంత రేటు అయినా కొనుక్కునే పరిస్థితి నడుస్తోంది. టమాటల చోరీలంటూ మునుపెన్నడూ లేని ‘చిల్లర’ కథలు చూస్తున్నాం కూడా. ఈ తరుణంలో సోషల్ మీడియాలో మీమ్స్, చర్చలు కొనసాగుతుండగా.. ధరల నియంత్రణకు ప్రభుత్వాల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే.. ధరలు పెరిగాయని బాధపడడం ఎందుకని.. సింపుల్‌గా తినడం మానేయాలంటున్నారు ఓ మహిళా మంత్రిగారు. ఉత్తర ప్రదేశ్ మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ మంత్రి ప్రతిభా శుక్లా pratibha shukla ఈ సలహా ఇచ్చారు. టమాటల ధరలు పెరిగాయని మొత్తుకోవడం ఎందుకు అవి తినడం మానేయొచ్చు కదా అని సలహా ఇచ్చారామె. అయితే తన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతాయని ఊహించారో ఏమో.. వెంటనే సవరించుకుని మరో ప్రకటన ఇచ్చారు. టమాటల రేటు ఎక్కువని ఫీలవ్వడం దేనికి?.. ఇంటి వద్ద పెంచుకునే సరిపోతుంది కదా. యూపీలో అలాంటి ప్రయత్నాలు ప్రభుత్వ సహకారంతో జరుగుతోంది కదా. అసలు టమాటలు తినడం మానేస్తే.. రేట్లు వాటంతట అవే దిగి వస్తాయి కదా. అసలు టమాటలకు బదులు నిమ్మకాయ తింటే పోలా.. దేశంలో ఎవరూ టమాటలు తినకపోతే.. ధరలు ఎందుకు దిగి రావు?.. అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు శుక్లా. ఇదీ చదవండి: ఇదెందయ్యా ఇది.. డ్రైవింగ్‌లో అడ్రస్ మర్చిపోయాడు -
Tomato Prices: టమాట కేజీ రూ. 300?
నెలన్నర గ్యాప్‌లో టమాటా ధర 300 శాతానికి పైగా పెరిగాయి. కొన్నిచోట్ల సెంచరీకి పైనే.. మరికొన్ని చోట్ల డబుల్ సెంచరీ చేరువకి.. కొన్ని చోట్ల 220 దాకా కూడా పలుకుతోంది. ఈ తరుణంలో టమాట కేజీ 300 రూపాయలకు చేరుతుందనే అంచనా.. సామాన్యుడి గుండెను గుబేలుమనిపిస్తోంది. లోకల్‌సర్కిల్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ఆసక్తికర విషయాలు.. 🍅 దాదాపు 68 శాతం కుటుంబాలు తమ వంటకంలో టమాట వినియోగాన్ని తగ్గించాయి. మరో 14 శాతం మంది టమాట వినియోగించడాన్ని పూర్తిగా మానేశారు. 🍅 రానున్న వారాల్లో కిలో రూ.300కు చేరుకోవచ్చు. చాలా చోట్ల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అందుకు కారణం. అదే సమయంలో టమాట సంక్షోభాన్ని క్యాష్ చేసుకునేందుకు రేట్లు ఇంకా పెంచే అవకాశాలూ లేకపోలేదు. 🍅 గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్లలోనే కాకుండా హోల్‌సేల్ మార్కెట్లలో కూడా టమాటా ధరలు నగరాల్లో భారీగా పెరుగుదలను నమోదు చేశాయి. ఢిల్లీలో జూన్ 24న కిలో రూ.20 నుండి 30 ఉండగా, ఆ తర్వాత రూ.180కి , ఇప్పుడు నాణ్యమైన టమాటా ధర రూ.220కి చేరుకుంది. 🍅 జూన్‌లో కేజీ రూ.40గా ఉంటే.. జులై మొదటి వారానికి సగటున కేజీ రూ. 100కి చేరింది. భారీ వర్షాలతో సరఫరాకి అంతరాయం.. టమాట పెంపకంలో జాప్యం వల్ల నాణ్యమైన టమాట రూ.200గా పలుకుతోంది. 🍅 వందలో 87 మంది.. కేజీకి రూ. 100కిపైనే ఖర్చు చేస్తున్నారు. 13 శాతం మాత్రమే 100 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెడుతున్నారట. బహుశా అవి గ్రామీణ ప్రాంతాలు.. టమాట సమృద్దిగా పండించే ప్రాంతాల్లో కావొచ్చు. 🍅 10, 972 మందిలో 41 శాతం మంది.. 100-150 రూ. మధ్య చెల్లిస్తున్నారట. 27 శాతం 150-200 రూ. కేజీ చెల్లిస్తున్నారట. 14 శాతం 200-250 రూ. మధ్య, ఐదు శాతం 250రూ. దాకా చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 🍅 11,550 మందిలో 68 శాతం టమాట వాడకం తగ్గించినట్లు చెబుతున్నారు. 14 శాతం ఏకంగా టమాట వాడకమే మానేశారట. 🍅 మొత్తంగా లోకల్‌సర్కిల్స్ సర్వేలో.. దేశవ్యాప్తంగా 342 జిల్లాలకు చెందిన పాతిక వేల మంది దాకా స్పందించారు. ఇందులో 65% పురుషులు, మిగతా శాతం మహిళలు. 🍅 లోకల్ సర్కిల్స్ అనేది ఓ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్. చిరు వ్యాపారాలు నడిపించుకునేవాళ్లను సైతం ఇందులో చేర్చుకుని ప్రభుత్వ విధానాలు, వాటి వల్ల వాళ్లు ఎదుర్కొనే పరిస్థితులపై అభిప్రాయ సేకరణ చేపడతారు. ఇందులో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారు. -
పుట్టినరోజున ప్రత్యేక కానుక.. షాక్ అయిన యువతి
ముంబై: పుట్టినరోజు అంటే సంబరం. అందులోనూ జన్మదిన వేడుకలో అందుకునే చిన్న చిన్న కానుకలు అంటే అపురూపంగా చూసుకుని మురిసిపోతారు. అలాంటిది ఒక మహిళ అనూహ్యంగా టమాటాలను గిఫ్ట్‌గా అందుకుని ఆశ్చర్యంలో మునిగింది. మహారాష్ట్రలోని థానే పట్టణంలో ఈ కొత్తరకం బహుమతి ఘటన జరిగింది. సంబంధిత వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. థానె జిల్లాలోని కళ్యాణ్ ప్రాంతంలోని కొచాడీలో ఉండే సోనల్ బోర్సే పుట్టినరోజు వేడుక ఆదివారం జరిగింది. ఆ ప్రాంతంలో కేజీ టమాటా ఏకంగా రూ.140 ధర పలుకుతోంది. అదే రోజు ఆమె నాలుగు కేజీలకుపైగా టమాటాలు ఉన్న బుట్టలను బహుమతిగా అందుకున్నారు. ఈసారి అకాల వర్షాలు, బిపర్జోయ్ తుపాను మిగిల్చిన విషాదం కారణంగా పంట నాశనమై దిగుబడి భారీగా తగ్గిపోయి టమాటా ధర రిటైల్ మార్కెట్లో చుక్కలనంటుతోంది. కొద్దిరోజులు గడిస్తే కొత్త పంట వచ్చి ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్ వర్గాలు భరోసా ఇస్తున్నాయి. -
మండుతున్న ధరలు.. 2 వేల కిలోల టమాటా లోడుతో పరారీ
సాక్షి, బెంగళూరు: టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ.. బెంగళూరులో టమాటాలతో ఉన్న బొలెరో వ్యాన్‌తో దుండగులు పరారయ్యారు. చిత్రదుర్గకు చెందిన రైతులు బొలెరో వాహనంలో టమాటా లోడుతో బెంగళూరు ఆర్‌ఎంసీకి వచ్చారు. మార్కెట్ యార్డులో వాహనాన్ని నిలిపి టీ తాగడానికి వెళ్లారు. ఇదే అదనుగా ముగ్గురు వ్యక్తులు ఆ వ్యాన్‌ను స్టార్ట్ చేశారు. అడ్డగించగా రైతులే తమ వాహనాన్ని ఢీకొట్టారంటూ బుకాయించారు. దెబ్బతిన్న తమ వాహనం చూపిస్తామంటూ రైతులను కూడా బొలెరోలోకి ఎక్కించుకున్నారు. కొంతదూరం వెళ్లాక రైతులను బయటకు తోసేసి వాహనంతో పరారయ్యారు. బాధితుల ఫిర్యా దు మే రకు ఆర్ఎంసీ యార్డ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బొలెరో వాహనంలో 250కి పైగా ట్రేల్లో టమాటాలున్నాయి. కిలో టమాటా ధర కనీసం రూ.100 లెక్కన 2 టన్నుల టమాటా విలువ రూ.2 లక్షలుంటుంది. 300 మంది శరణార్థులు సముద్రంలో గల్లంతు దాకర్: ఆఫ్రికా దేశమైన సెనెగల్ నుంచి దాదాపు 300 మంది శరణార్థులతో స్పెయిన్‌కు బయలుదేరిన మూడు పడవలు అట్లాంటిక్ సముద్రంలో గల్లంతయ్యాయి. స్పెయిన్‌కు చెందిన వాకింగ్ బోర్డర్స్ అనే స్వచ్ఛంద సంస్థ సోమవారం ఈ విషయం వెల్లడించింది. రెండు పడవలు జూన్ 23న సెంట్రల్ సెనెగల్‌లోని కోస్తా తీర ప్రాంత నగరం ఎం»ౌర్ నుంచి బయలుదేరింది. వీటిలో 100 మంది ఉన్నారు. 200 మందితో రెండో పడవ జూన్ 27న కంటైటైన్ పట్టణం నుంచి బయలుదేరింది. తర్వాత మూడు పడవల నుంచి హఠాత్తుగా సంకేతాలు నిలిచిపోయాయి. అవి సముద్రంలో గల్లంతైనట్లు గుర్తించారు. స్పెయిన్ అధికారులు విమానాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. -
డబుల్ సెంచరీ కొట్టిన టమాట.. కిలో ఏకంగా రూ. 250.. ఎక్కడంటే
ఎన్నడూ లేనంతగా కూరగాయల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఏదీ కొందామన్న అగ్గిలాగ మండుతున్నాయి. ప్రధానంగా టమాటా ధర దడపుట్టిస్తోంది. సాధారణంగా రూ. 20, 30 కిలో ఉండే టమాట ఇప్పుడు సామన్యుడికి అందని ద్రాక్షగా మారింది. దేశ వ్యాప్తంగా ఇప్పటికే సెంచరీ దాటి టామాట మరింత పరుగులు పెడుతోంది. మరి కొన్ని చోట్ల ఏకంగా డబుల్ సెంచరీ కొట్టేసింది. పెరిగిన ధరలతో ప్రజలు లబోదిబోమంటుంటో.. పలు చోట్ల ప్రభుత్వాలే సబ్సిడీ రేట్లలో టమాటాలను సరఫరా చేస్తున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో టమాట ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఉత్తరఖాండ్ రాష్ట్రం గంగోత్రి ధామ్‌లో కిలో టమాట రూ. 250 పలుకుతోంది. ఉత్తరకాశీ జిల్లాలో కిలో రూ. 180 నుండి 200 వరకు ఉంది. యమునోత్రిలో కిలో టమాట రూ. 200 నుంచి 250 వరకు చేరింది. ఈ ప్రాంతంలో ఒక్కసారిగా టమాటా రేట్లు పెరిగిపోయాయని.. కూరగాయల విక్రయదారుడు తెలిపారు. ఇటీవల తీవ్రల ఎండలు, అకాల వర్షాల కారణంగా ఉత్పత్తి తగ్గడంతో ధరలు పెరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. చదవండి: కొండెక్కిన ధరలు.. తోట నుంచి రూ. 2.5 లక్షల టమాట చోరీ అదే విధంగా కోల్కతాలోరూ.152, ఢిల్లీలో రూ.120, బెంగుళూరులో రూ. 120గా ఉంది. చెన్నైలో రూ.100 నుంచి 130 పలుకుతుండటంతో స్థానిక రేషన్ షాపుల ద్వారా టమాట రూ. 60కే కిలో చొప్పున అందిస్తున్నారు. ఇక అత్యల్పంగా రాజస్థాన్‌లోని చురులో రూ.31గా ఉన్నది. ఇతర కూరగాయలు కూడా ధరల విషయంలో తామేమీ తీసిపోలేదని అల్లం, వంకాయటమాటాతో పోటీపడుతున్నాయి. కూరగాయల ఉత్పత్తిదారుల కమిటీ ప్రకారం కిలో అల్లం ధరం రూ.250 దాటగా, వంకాయ రూ.100 చేరింది. ఇతర కూరగాయల ధరలు కూడా గత పది రోజుల్లో 20 నుంచి 60 శాతం మధ్య పెరిగాయని అధికారులు తెలిపారు. దీంతో కూరగాయలు కొనలేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
తగ్గని టమాట ధర@ రూ. 60
సాక్షి, చైన్నె: బయట మార్కెట్లో టమాట ధర అమాంతంగా పెరుగుతోంది. దీంతో చౌక దుకాణాల ద్వారా టమాట విక్రయాలకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సోమవారం సహకార మంత్రి పెరియకరుప్పన్ నేతృత్వంంలో జరిగే సమావేశంలో నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రంలో వారం రోజులుగా టమాట ధరలు పెరుగుతూ వచ్చాయి. ప్రభుత్వ జోక్యం, ప్రభుత్వ ఉద్యాన వనాల పరిధిలోని తోట, పచ్చదనం దుకాణాలలో టమాట విక్రయాలు జరగడంతో బయట మార్కెట్లో రెండు రోజులపాటు ధర కాస్త దిగి వచ్చినట్టు కనిపించింది. అయితే, మళ్లీ ధరకు రెక్కలు వచ్చాయి. ఆదివారం కిలో టమాట బయటి మార్కెట్లో రూ.120 నుంచి రూ.130 వరకు పలికింది. అయితే, తోట పచ్చదనం దుకాణాలలో మాత్రం రూ. 60కు విక్రయించడం విశేషం. ఈ ధర కట్టడి చేయలేని పరిస్థితి ఉండడంతో ప్రభుత్వ నేతృత్వంలో రాష్ట్రంలో ఉన్న 35 వేల చౌక దుకాణాల ద్వారా టమాట విక్రయాలపై సహకార శాఖ దృష్టి పెట్టింది. సోమవారం అధికారులతో అత్యవసర సమావేశానికి మంత్రి పెరియకరుప్పన్ నిర్ణయించారు. సమావేశానంతరం చౌకదుకాణాల్లో టమాట విక్రయాల ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. -
అయ్యో.. ఆకాశానంటుతున్న టమాటా ధర!
అయ్యో.. ఆకాశానంటుతున్న టమాటా ధర! -
సబ్సిడీపై టమాటా
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న టమాటా ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. పలుచోట్ల టమాటా రేట్లు చుక్కలను తాకుతుండటంతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్ శాఖను రంగంలోకి దించింది. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ.50కే అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టింది. వైఎస్సార్, కర్నూలు జిల్లాలలో బుధవారం శ్రీకారం చుట్టగా.. మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిత్యం 50–60 టన్నుల టమాటాలు సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. మరోవైపు టమాటాతో పోటీపడుతూ ఆకాశానికి ఎగబాకుతున్న పచ్చి మిర్చిని కూడా సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం యాప్‌లో పర్యవేక్షణ.. పలుచోట్ల విస్తారంగా కురుస్తున్న వర్షాలు టమాటా ధరలను హడలెత్తిస్తున్నాయి. వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతినడంతో టమాటా ధర చుక్కలనంటుతోంది. నిన్న మొన్నటి వరకు కిలో రూ.20–30కు మించి పలకని టమాటా ధరలు ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి. పలు రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటగా మన రాష్ట్రంలోని బహిరంగ మార్కెట్లలో ప్రస్తుతం కిలో రూ.65 నుంచి 90 మధ్య పలుకుతోంది. పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వినియోగదారులపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో రంగంలోకి దిగిన వ్యవసాయ శాఖమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్ శాఖ కమిషనర్ రాహుల్ పాండే, రైతుబజార్ల సీఈవో నందకిషోర్‌తో పాటు జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష జరిపారు. సీఎం యాప్ ద్వారా ధరల హెచ్చుతగ్గులను సమీక్షిస్తూ కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. టమాటాతో పాటు పచ్చి మిర్చి ధరలు కూడా వంద దాటడంతో వాటిని కూడా సబ్సిడీపై అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. టమాటా ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో అత్యధికంగా విశాఖలో కిలో రూ.90 ఉండగా మిగిలిన జిల్లాల్లో రూ.50–85 మధ్య ధరలున్నట్లు గుర్తించడంతో రైతుబజార్ల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. నాలుగేళ్లుగా టమాటా ధరలు పెరిగిన పలు సందర్భాల్లోనూ రాష్ట్రప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై వినియోగదారులకు అందిస్తోంది. ధరల పెరుగుదల ఎక్కువగా ఉన్న నగరాలు, పట్టణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అదేవిధంగా పచ్చి మిర్చి కూడా పలు జిల్లాల్లో రూ.వంద దాటినట్టు గుర్తించారు. దీంతో మంత్రి ఆదేశాలతో పచ్చి మిర్చిని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సబ్సిడీపై రైతుబజార్లలో అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో సేకరణ ధరలు ఎగబాకడంతో టమాటా రైతన్నలకు మంచి రేటు లభిస్తోంది. రాష్ట్రంలోని మదనపల్లి, పలమనేరు, పత్తికొండ, పుంగనూరు, కలికిరి మార్కెట్లకు వస్తున్న టమాటాను పొరుగు రాష్ట్రాల వ్యాపారులు ఎగరేసుకుపోతున్నారు. బుధవారం మదనపల్లి, పలమనేరు మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ అధికారులు రైతుల నుంచి కిలో రూ.70 చొప్పున 10 టన్నుల టమాటాలు సేకరించారు. నేటి నుంచి మిగిలిన మార్కెట్లలోనూ సేకరించనున్నారు. రోజుకు కనీసం 50–60 టన్నులు తక్కువ కాకుండా సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో రైతుబజార్ల ద్వారా కిలో రూ.50 చొప్పున టమాటా విక్రయాలకు బుధవారం శ్రీకారం చుట్టగా.. విశాఖ సహా మిగిలిన జిల్లాలకు గురువారం నుంచి విస్తరించాలని నిర్ణయించారు. అదుపులోకి వచ్చే దాకా సబ్సిడీపై విక్రయాలు ఏపీ మినహా మిగిలిన రాష్ట్రాల్లో కిలో రూ.100 దాటింది. ప్రధాన మార్కెట్లలో రైతుల నుంచి సేకరించి సబ్సిడీపై వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టాం. ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు దీన్ని కొనసాగిస్తాం. – నందకిషోర్, సీఈవో, ఏపీ రైతుబజార్లు ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఏర్పాటు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీ టమాటా అమ్మకాలకు శ్రీకారం చుడుతున్నాం. మిగిలిన చోట్ల రైతు బజార్లలో కూడా కౌంటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. – రాహుల్ పాండే, కమిషనర్, మార్కెటింగ్ శాఖ టమాటా, పచ్చిమిర్చి కూడా.. మార్కెట్లో టమాటా, మిర్చి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం. ధరల నియంత్రణపై స్పెషల్ సీఎస్‌తోపాటు, మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతు బజార్ల సీఈవోతో సమీక్షించాం. గురువారం నుంచి రాష్ట్రంలో ప్రధాన రైతు బజార్లలో టమాటా కిలో రూ.50కే సబ్సిడీపై అందించనున్నాం. అదేవిధంగా మిర్చిని కూడా సబ్సిడీపై అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
Tomato price: టమాటో ధర దిగొచ్చేది అప్పుడేనంట!
ఢిల్లీ: సామాన్యుడితో ‘వామ్మో’ అనిపిస్తున్న టమాటో ధర.. ప్రస్తుతం దేశంలోని చాలా చోట్ల సెంచరీ దాటేసింది. కేజీకి మినిమమ్ రూ. 50 నుంచి మొదలై.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా రూ.120 నుంచి రూ.160 కేజీకి అమ్ముడు పోతూ బెంబేలెత్తిస్తోంది. పోను పోను రేటు పెరుగుతోందే తప్ప.. తగ్గడం లేదు. దీంతో ఈ పరిస్థితి సాధారణం ఎప్పుడవుతుందనే సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మరో పది, పదిహేను రోజుల తర్వాత ధరలు సాధారణ స్థితికి చేరుకోవచ్చని కేంద్రం అంచనా వేస్తోంది. టమాటో ధరలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ మీడియాతో స్పందించారు. ‘‘ప్రజలకు చెబుతోంది ఒక్కటే.. పది, పదిహేను రోజుల్లో ధరలు సాధారణ స్థితికి చేరుకుంటాయి. టమాటో తాజా లోడ్లు ఇతర ప్రాంతాలకు చేరుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ సమయం రెండు వారాలకు మించి ఉండదు. కాబట్టి, పదిహేను రోజుల తర్వాత.. పరిస్థితి మామూలుగా ఉంటుంది. ధరలు కచ్చితంగా దిగొస్తాయని అంటున్నారాయన. ప్రతీ ఏడాది ఈ సమయానికి టమాటో ధరల్లో పెరుగుదల సాధారణంగా ఉండేదేనని.. కానీ, ఈసారి పరిస్థితి ఘోరంగా ఉండడమే అడ్డగోలు ధరలకు కారణమని చెబుతున్నారాయన. ప్రతికూల వాతావరణం, సరఫరాపై పరిమితుల వల్లే ఈసారి ఇలాంటి పరిస్థితి నెలకొందని చెప్పారాయన. కొన్ని రాష్ట్రాల్లో వర్షాల వల్ల పంట దెబ్బ తిందని.. తెగులు సమస్యతో పాటు మరికొన్ని చోట్ల టమాటో లోడ్లు గమ్యస్థానాలకు చేరుకోలేదని చెబుతున్నారాయన. టమాటో విషయంలోనే కాదు.. చాలా వరకు కూరగాయల విషయంలో ఇదే జరుగుతోందని చెప్తున్నారాయన. ఈ తరుణంలో.. ధరల నియంత్రణకు సరైన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచిస్తున్నారాయన. ఇదీ చదవండి: మార్కెట్లో ఏది ముట్టుకున్నా.. మంటే! -
దూసుకెళ్లిన టమాట.. ఓ రేంజ్లో పెరుగుతున్న ధరలు
40 రూపాయలకు మూడు కేజీలు, నాణ్యమైన టమాటా.. అని వారం కిందటి వరకు ఆటోలు, బండ్లలో వ్యాపారులు మైక్ పెట్టి అమ్మేవారు. సాయంత్రానికి అమ్ముడుపోని సరుకును చెత్తదిబ్బలో పడేసి వెళ్లేవారు. కానీ ఇప్పుడు టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. బజారులో చిల్లర ధర రూ. 60ని తాకుతోంది. ఇక కోలారు మార్కెట్లో రైతులు కష్టానికి ప్రతిఫలం దక్కుతోందని ఆనందం వ్యక్తంచేశారు. కర్ణాటక: టమాటా రాజధానిగా ప్రఖ్యాతి గాంచిన కోలారు జిల్లాలో రెడ్ యాపిల్‌గా పిలువబడే టమాట ధరలు గగనానికి చేరుకున్నాయి. ధరల పెరుగుదలతో ఆ రైతుల్లో ఆనందం వెల్లివిరిస్తే, కొనుగోలుదారులు బిక్కమొహం వేస్తున్నారు. కోలారు ఏపీఎంసీ మార్కెట్ యార్డులో శనివారం రోజున 15 కిలోల బాక్సు ధర రూ. 1,100 కి చేరుకుంది. ఈ రేంజిలో ధరల పెరుగుదలతో టమాట రైతుల ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయింది. 15 కేజీల బాక్సు ధర ఇలా మార్కెట్లో నాటురకం టమాట ధర 15 కిలోల బాక్సు నాణ్యతను బట్టి 400 రూపాయల నుంచి 800 మధ్య విక్రయం కాగా, ఫారం టమాట ధరలు కిలో 1,100 రూపాయలకు వరకు అమ్ముడయ్యాయి. చిల్లరగా టమాట ధర కేజీ రూ. 60 నుంచి 80 కి పుంజుకోవడంతో వినియోగదారులు అమ్మో అంటున్నారు. శనివారం కోలారు ఏపీఎంసీ మార్కెట్ నుంచి 40 లోడ్ల టమాట లోడ్లు వివిధ రాష్ట్రాలకు సరఫరా అయింది. రాష్ట్రంలోకి 2 లారీ లోడ్లు, తమిళనాడుకు 8 లోడ్లు, బిహార్‌కు 1 లోడ్, మహారాష్ట్రకు 2 లోడ్లు, రాజస్థాన్‌కు 2 లోడ్లు, ఉత్తరప్రదేశ్‌కు 4 లోడ్లు, గుజరాత్‌కు 7 లోడ్లు, కేరళకు 2 లోడ్లు, ఒడిశాకు 5 లోడ్లు, జార్ఖండ్‌కు 1 లోడ్, పశ్చిమ బెంగాల్‌కు 3 లోడ్ల సరుకు వెళ్లింది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు దేశంలోని ప్రతి మార్కెట్‌కు ఇక్కడి నుంచే టమోటా సరఫరా అవుతోంది. ఇవేనా కారణాలు? మార్కెట్‌కు వస్తున్న టమాట దిగుబడి తగ్గడం, వానలు, తెగుళ్ల కారణంగా పలుచోట్ల టమాట తోటలను రైతులు నాశనం చేయడం, బక్రీద్ సందర్భంగా బంగ్లా అంతర్జాతీయ సరిహద్దుల్లో రెండు రోజుల పాటు బంద్ అయ్యే కారణం వల్ల ఒక్కసారిగా టమోటా ధరలు భగ్గుమన్నాయి. ఈ పంటకు జిల్లా ప్రసిద్ధి కోలారు జిల్లాలో మట్టి, వాతావరణం టమాట పంట పండించడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ఇతర ప్రాంతాలలో టమాటాను సీజన్లోనే పండిస్తే కోలారు జిల్లాలో ఏడాది పొడవునా పండిస్తారు. కన్నడనాట సుమారు 50 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతోంటే, కోలారు జిల్లాలో 12,750 హెక్టార్లలో పండిస్తున్నారు. రాష్ట్రంలో ఏటా 12.50 లక్షల టన్నులు, ఒక్క కోలారులో 5 లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. చాలా సంతోషంగా ఉంది కోలారు ఏపీఎంసీ మార్కెట్‌కు 93 బాక్సుల టమాట తెచ్చాను, 15 కిలోల బాక్సు రూ. వెయ్యికి విక్రయించాను. నాణ్యత బాగుంటే ధర మరింతగా ఉంటుంది. సోమవారం మరో 200 బాక్సులు మార్కెట్‌కు తెస్తాను. ఈ ఏడాదిలో ఇలాంటి ధరలు రావడం సంతోషాన్నిస్తోంది. – మహేంద్ర, రైతు -
టమాటా రైతుకు బాసట
సాక్షి, అమరావతి: ధర లేని ప్రతిసారి టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తోంది. నాణ్యమైన టమాటాలనే కాదు, కాస్త వినియోగానికి పనికొచ్చేలా ఉన్న టమాటాలను మార్కెట్లో జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసి వారికి బాసటగా నిలుస్తోంది. ఇప్పటికే కర్నూలు, అన్నమయ్య జిల్లాల్లోని పలు మార్కెట్ యార్డుల నుంచి 220 క్వింటాళ్ల టమాటాలను కొనుగోలు చేసి రైతుబజార్ల ద్వారా వినియోగదారులకు విక్రయించింది. ఇదే రీతిలో మిగిలిన మార్కెట్ యార్డుల్లో కూడా ఎక్కడైనా ధర రావడం లేదు, కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటూ ఆర్బీకేకు సమాచారం ఇస్తే చాలు యుద్ధప్రాతిపదికన కొనుగోలు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో తెగుళ్ళు సోకి టమాటా పంట చాలా చోట్ల దెబ్బ తిన్నది. తమిళనాడు, తెలంగాణ, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వర్షాలు పడుతుండటంతో ఎగుమతులకు ప్రతిబంధకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ధరలను నిలకడగా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వినియోగదారులపై భారం పడకుండా.. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్ యార్డు పరిధిలో రైతుల నుంచి 150 క్వింటాళ్లు, అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మార్కెట్ యార్డు పరిధిలోని రైతుల నుంచి 70 క్వింటాళ్లు టమోటాలు నాణ్యతను బట్టి కిలో రూ.5 నుంచి రూ.12 చొప్పున మార్కెట్‌శాఖ ద్వారా కొనుగోలు చేసింది. వీటిని స్థానిక రైతుబజార్లలో విక్రయిస్తోంది. టమాటా సాగు ఎక్కువగా ఉండే అన్నమయ్య, శ్రీసత్యసాయి, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోని ప్రధాన టమాటా యార్డుల పరిధిలో రేటు దక్కని రైతుల నుంచి టమాటా కొనుగోలుకు ఏర్పాట్లు చేసింది. వర్షాలు, తెగుళ్ల వల్ల దెబ్బతిన్న టమాటా రైతులను ఆదుకుంటూ వినియోగదారులపై భారం పడకుండా సరసమైన ధరలకే రైతు బజారుల ద్వారా విక్రయిస్తోంది. ప్రభుత్వ జోక్యంతో పెరిగిన ధర.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మార్కెట్లో జోక్యం చేసుకుంటూ వ్యాపారులతో కలిసి పోటీపడి ధర పెంచేలా మార్కెటింగ్ శాఖ కృషి చేస్తోంది. ఫలితంగా ఏపీలో ఏ ఒక్క మార్కెట్ యార్డులోనూ టమాటా కిలో రూ.5కు తక్కువగా పలకడం లేదు. నాణ్యతను బట్టి ఫస్ట్ క్వాలిటీ రకం గరిష్టంగా రూ.9 నుంచి రూ.13, కనిష్టంగా రూ.5 నుంచి 10 వరకు పలుకుతోంది. ఇక మధ్యస్థంగా ఉండే టమాటాలకు రూ.7 నుంచి రూ.11 వరకు ధర పలుకుతోంది. ప్రభుత్వం ఆదుకుంటోంది నేను 3 ఎకరాల్లో టమాటా సాగు చేస్తున్నాను. 20 రోజుల నుంచి మార్కెట్లో రేటు తగ్గిపోయింది. ప్రభుత్వం జోక్యం చేసుకుని మార్కెటింగ్ శాఖ ద్వారా టమాటాలను కొనుగోలు చేస్తోంది. కిలో రూ.5 నుంచి రూ.10 వరకు పెట్టి కొనుగోలు చేస్తోంది. ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. – బద్దునాయక్, గుండుతాండ, కర్నూలు జిల్లా రైతులు ఆందోళన చెందవద్దు టమాటా రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. వినియోగానికి పనికి వచ్చే టమాటాలను కొనుగోలు చేస్తాం. క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం. మార్కెట్లో వ్యాపారాలు కొనుగోలు చేయకపోతే సమాచారమివ్వండి. పొలం వద్ద గ్రేడింగ్ చేసి తీసుకొస్తే మంచి ధర లభించేలా కృషి చేస్తాం. నాణ్యతను బట్టి రాష్ట్రంలో ఎక్కడా కిలో రూ.5 కు తక్కువగా కొనుగోలు చేసే పరిస్థితి లేదు. – ముల్లంగి నందకిషోర్, సీఈవో, రైతు బజార్స్ -
ఒక్కసారిగా టమాట ధరలు పైపైకి
సాక్షి, కడప: ఖరీఫ్‌లో సాగు చేసిన టమాట పంట ప్రస్తుతం చివరి దశకు చేరడంతో దిగుబడులు తగ్గాయి. దీంతోపాటు మార్కెట్‌కు సరుకు తక్కువగా వస్తుండటంతో ధర కొంచెం కొంచెం ఎగబాకుతోంది. ఆగస్టు 1న రైతు బజారులో కిలో కిలో రూ.11 ఉండేది. అది కాస్త కాస్తా పెరుగుతూ ప్రస్తుతం కిలో రూ. 28 పలుకుతోంది. బయటి మార్కెట్లో 30కి పైగా ఉంది. జిల్లాలో 470 ఎకరాల్లో.. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 470 ఎకరాల్లో టమాట సాగు చేశారు. మైలవరం, కలసపాడు, ఎర్రగుంట్ల, ఖాజీపేట, సింహాద్రిపురం, వీఎన్‌పల్లె, లింగాల, తొండూరు, సికేదిన్నె, పెండ్లిమర్రి, చక్రాయపేట మండలాల పరిధిలో ఎక్కువగా వేశారు. ఈ పంట ఈ నెల చివరి కంటే ముందే ముగియనుంది. దీంతో ఒక్కసారిగా టమాట ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. జూలైలో 20 నుంచి 25 తేదీల్లో కిలో 10 రూపాయలకే దొరికిన టమాట.. ప్రస్తుతం కిలో రూ.28 నుంచి రూ.32 దాకా ఉంది. రానురాను ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని రైతు బజార్‌లోని కూరగాయల షాపుల నిర్వాహకులు తెలిపారు. చదవండి: (స్థపతి వడయార్‌కు స్వర్ణ కంకణం బహూకరించిన సీఎం జగన్) -
మంట.. మంట.. ధరల మంట.. రూ.100 కొడితేనే టమాటా.. మరి బీరకాయ?
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ఎండలు ఎలా మండుతున్నాయో అదే మాదిరి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ప్రధానంగా టమాటతో పాటు ఇతర కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో వాటికి డిమాండ్ అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా సరఫరా లేకపోవడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు కొనుగోలు చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. గత 20 రోజుల క్రితం ప్రస్తుతం వాటి ధరలు చూస్తే అమాంతంగా పెరిగిపోవడం గమనార్హం. ప్రధానంగా టమాట 20 రోజుల క్రితం కిలో రూ. 20–30 వరకు విక్రయించగా, ప్రస్తుతం రూ. 100కు చేరుకుంది. జిల్లాలో టమాట, ఇతర కూరగాయల విస్తీర్ణం తగ్గడంతో హైదరాబాద్, కర్నూల్, మదనపల్లె తదితర ప్రాంతాలపై ఆధారపడాల్సి వస్తుంది. అక్కడి నుంచి మహబూబ్‌నగర్‌కు రావాలంటే రవాణా వ్యయం సైతం అధికంగా అవుతుంది. మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పూర్తి స్థాయిలో తగ్గకపోవడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. దిగుబడి తగ్గడం, ఇంధనం, రవాణా వ్యయం కారణంగా ధరలు పెంచాల్సి వస్తుందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. జిల్లాలో పంటలు చేతికి వచ్చేదాకా తగ్గే అవకాశం లేదని వారు అభిప్రాయ పడుతున్నారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధర పెరుగుతుంటే ఎలా జీవనం సాగించాలని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిదీ రెట్టింపే వంటకు కావాల్సిన ప్రతి వస్తువు ధర రెట్టింపు అయింది. నిత్యావసర సరుకులు ఒకదానికి ఒకటి పోటీ పడుతున్నట్లు ఉంది. కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో నెల రోజులకు అయ్యే వంటింటి ఖర్చు ప్రస్తుతం పది రోజులకు కూడా సరిపోవడం లేదు. ఆర్థిక భారం మోయాల్సిన దుస్థితి నెలకొంది. – జయమ్మ, గృహిణి, మహబూబ్‌నగర్ -
తగ్గేదేలే అంటున్న టమాటా ధరలు
సాక్షి, మదనపల్లె : టమాట క్రయ, విక్రయాలకు దేశంలోనే అతి పెద్దదైన మదనపల్లె టమాట మార్కెట్లో ధరలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. వారం రోజులుగా ధరలను గమనిస్తే మే 7న మొదటి రకం టమాట ధరలు కిలో రూ.24–44, 8న రూ.27–50, 9, 10న రూ.30–52, 11, 12న రూ.35–56 మధ్య ధరలు పలికితే 13వ తేదీన రూ.39–60కు చేరుకున్నాయి. శుక్రవారం మదనపల్లె మార్కెట్‌కు వివిధ ప్రాంతాల నుంచి రైతులు 198 మెట్రిక్ టన్నులు తీసుకువచ్చారు. బహిరంగ మార్కెట్లో నాణ్యతను బట్టి రూ.50–80 వరకు విక్రయిస్తున్నారు. దీంతో సాధారణ, మధ్యతరగతి ప్రజలు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నారు. మే నెలలో వివాహాది శుభకార్యాలు అధికంగా ఉండటం.. వాతావరణంలో అనూహ్యంగా చోటుచేసుకుంటున్న మార్పులు, పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఒక్కసారిగా డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం మదనపల్లె నుంచి తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఒరిస్సా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతులు జరుగుతున్నాయి. బయటి మార్కెట్లలో స్థానికంగా సరుకు రాకపోవడం, డిమాండ్ అధికంగా ఉండటంతో ఇక్కడి వ్యాపారులు అధిక ధరలకు కొనుగోలు చేసి అక్కడికి తరలిస్తున్నారు. మే చివరి వరకు అధిక ధరలే పలుకుతాయని వ్యాపారులు చెపుతున్నారు. మార్కెట్లో టమాటకు లభిస్తున్న ధరలపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చదవండి: (Darbarevu Land: కీలక సమస్యకు ఏపీ కేబినెట్ పరిష్కారం.. రెండు, మూడు రోజుల్లో జీవో) -
హమ్మయ్య ఈ రోజు పర్వాలేదు అనుకునేలోపే.. అయ్యో మళ్లీ
హమ్మయ్య ఈ రోజు పర్వాలేదు కాస్త రేటు వచ్చింది.. అయ్యో మళ్లీ ధర పడిపోయిందే.. ఇంకాస్త పుంజుకుంటుందేమో చూద్దాం.. అబ్బా ఈసారి మరీ తగ్గిపోయిందే.. ఇలా ఉంది టమాట రైతుల దుస్థితి. మార్కెట్లో టమాట ధరలు నిలకడగా లేకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. నిత్యం పడిలేస్తున్న రేట్లతో పెట్టుబడి సైతం గిట్టుబాటు కాక అన్నదాతలు కొట్టుమిట్టాడుతున్నారు. ఆరుగాలం కష్టించి సాగు చేసిన పంటను నష్టాలకు అమ్ముకోలేక దిగాలుపడుతున్నారు. మధ్యలో దళారులు, వ్యాపారులు మాత్రం ఇదే అవకాశంగా అందినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షి, పలమనేరు: టమాట సాగుకు పలమనేరు హార్టికల్చర్ డివిజన్ పెట్టింది పేరు. ఈ ప్రాంతంలోని రైతులు అధికశాతం టమాట సాగుపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో టమాట ధరలు నిత్యం పడిలేస్తుండటంతో అన్నదాతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పొరుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు కొనుగోలు చేసేందుకు రావడంలేదు. ఫలితంగా ధరలు తగ్గుముఖం పట్టాయని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. మే నాటికి తమిళనాడులో సీజన్ ముగుస్తుంది కాబట్టి అక్కడి వ్యాపారులు రావచ్చని, అప్పుడే ధరలు పెరిగే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మార్కెట్లకు భారీగా సరుకు జిల్లాలో పండిన టమాటతోపాటు కర్ణాటక, అనంతపురం నుంచి లోకల్ సరుకు ఎక్కువగా వస్తోంది. ఈ క్రమంలో మదనపల్లె, పలమనేరు, పుంగనూరు తదితర మార్కెట్లకు రోజుకు 200 లారీలకు పైగా టమాట చేరుతోంది. సరుకు ఎక్కువకావడంతో ధర తగ్గిపోతోంది. ఈ సీజన్లో పొరుగు జిల్లాలతోపాటు తెలంగాణ, తమిళనాడు నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చేవారు. ఆయా ప్రాంతాల్లోనే ప్రస్తుతం టమాట సాగు పెరగడంతో వారు ఇటువైపు కన్నెత్తి చూడడంలేదు. ఎకరాకు రూ.1.20లక్షల ఖర్చు పలమనేరు డివిజన్లో టమాట సీజన్ ఏప్రిల్ నుంచి జూలై దాకా ఉంటుంది. దున్నకం, మొక్కల కొనుగోలుకు రూ.8 వేలవుతుంది. టమాట కట్టెలకు రూ.24వేలు, ఎరువులకు రూ.27వేలు, క్రిమి సంహారక మందులకు రూ.10వేలు, కూలీలకు రూ.15వేలతో కలిసి ఎకరా సాగుకు మొత్తం రూ.84వేలు ఖర్చవుతుంది. ఇక కాయల కోత కూలి, మార్కెట్ రవాణా తదితరాలకు మరో రూ.36వేలతో కలుపుకుంటే మొత్తం ఖర్చు రూ.1.20 లక్షలకు చేరుతోంది. సాగు పెరిగింది పొరుగు రాష్ట్రాల్లో టమాట సాగు పెరిగింది. వాతావరణం అనుకూలించడంతో ఈ సీజన్లో ఇక్కడ కూడా టమాట దిగుబడి బాగా వచ్చింది. ప్రస్తుతం పంటకు డిమాండ్ పడిపోయింది. బయటి వ్యాపారులు రాకపోవడంతో నష్టపోవాల్సి వస్తోంది. – రవీంద్రరెడ్డి, రైతు, పలమనేరు బయటి వ్యాపారులు వస్తేనే.. మార్కెట్లకు నాణ్యమైన సరుకు వస్తోంది. అయితే బయటి రాష్ట్రాలనుంచి వ్యాపారులు రావడం లేదు. దీంతో మన సరుకు మన అవసరాలకు పోగా మిగులుతోంది. దీంతో ధరలు తగ్గిపోయాయి. తమిళనాడులో సీజన్ ముగిస్తే ఇక్కడ రేటు పెరిగే అవకాశముంది. – టీఎస్ బుజ్జి, మండీ నిర్వాహకుడు, పలమనేరు -
టమాటా.. ఊరట! ఈ రోజు ధర ఎంతంటే..
సీతమ్మధార (విశాఖ ఉత్తర): గత కొద్ది రోజులుగా రైతుబజారుల్లో టమాటా ఠారెత్తించింది. వినియోగదారులకు చుక్కలు చూపించిన టమాటా శనివారం దిగొచ్చింది. నెల రోజుల నుంచి రూ.72 పలికిన ధర శనివారం రూ.38కి లభ్యమైంది. దీంతో వినియోగదారులు అధిక సంఖ్యలో వచ్చి కోనుగోలు చేశారు. బీరకాయలు కిలో రూ.48 ఉండగా, రూ.44కు తగ్గింది. బంగాళా దుంపలు కిలో రూ.21 ఉండగా రూ.19కి దిగి వచ్చింది. క్యాబేజి మీద రెండు రూపాయలు తగ్గింది. ధరలు తగ్గడంతో శనివారం ఎక్కువ మంది వినియోగదారులు వచ్చారని రైతు బజార్ ఎస్టేట్ అధికారి వరహాలు తెలిపారు. చదవండి: Visakhapatnam: పాడి గేదె పంచాయితీ.. ప్రాణం తీసిన క్షణికావేశం! -
నిన్నా మొన్నటి దాకా కిలో వంద.. టమాట ధర తగ్గుముఖం..
సాక్షి, హైదరాబాద్: నిన్నా మొన్నటి దాకా కిలోకు దాదాపు వంద రూపాయలు పలికిన టమాట ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఆదివారం బోయిన్పల్లి మార్కెట్లో రూ. 25 నుంచి రూ.28 వరకు పలకడమే ఇందుకు నిదర్శనం. దీంతో రిటైల్ మార్కెట్లో ధరల తగ్గుదల నమోదైంది. టమాటా ధరలు భారీగా తగ్గడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హోల్‌సేల్ మార్కెట్లో రూ.30 –40 వరకు.. రిటైల్‌గా మాత్రం రూ.50– 60 పలుకుతోంది. అలాగే ఈ వారం టమాటా దిగుమతులు పెరగనుండటం గమనార్హం. ఆదివారం నగరంలోని వివిధ మార్కెట్లకు సుమారు 400 టన్నుల టమాటా దిగుమతి అయినట్లు మార్కెటింగ్ అధికారులు చెప్పారు. ఇదే మోతాదులో నిత్యం ఇలాగే దిగుమతి అయితే ధరలు మరింత తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా. వచ్చే ఆదివారం వరకు కేజీ టమాటా రూ.20కి చేరుతుందని వ్యాపారులు అంటున్నారు. చదవండి: రోగికి ఊపిరి పోస్తుండగా... ఆగిన డాక్టర్ గుండె -
హైదరాబాద్‌లో కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం
సాక్షి, హైదరాబాద్: టమాట ధర రోజురోజుకు పెరిగిపోతోంది. పేద, మధ్యతరగతి వర్గాలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. కిలో టమాటా ధర మార్కెట్లలో రూ.130కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎర్రగడ్డ ప్రధాన రహదారిలో ఓ వ్యాపారి ఆటోలో టమాటలు నింపుకొని వచ్చి కిలో రూ.50 కే విక్రయించాడు. దీంతో జనం ఇలా ఎగబడ్డారు. – సాక్షి, స్టాఫ్ ఫోటోగ్రాఫర్ మరోవైపు టమాట ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఇదిలా ఉండగా అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. చదవండి: ఏకే రావు ఉదంతంలో అనేక అనుమానాలు.. ఆత్మ‘హత్యా’? దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. -
టమాటా మోత..మరో రెండు నెలలు!
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్‌లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. దీంతో, నవంబర్ 25 నాటికి 142% మేర ధరలు పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ల నుంచి టమాటా పంట చేతికందే వచ్చే జనవరి వరకు ధరల్లో ఇదే తీరు కొనసాగుతోందని క్రిసిల్ అంచనా వేస్తోంది. కొత్తగా పంట వస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని చెబుతోంది. అయితే, టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10–15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది. అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో తక్కువ వర్షపాతంతో ఆగస్ట్‌లో సాగు ఆలస్యమైంది. దీంతో, పంట ఆలస్యం కావడంవల్ల ధరలు 65% పెరిగాయని తెలిపింది. -
సామాన్యులకు షాక్.. మరింత పెరగనున్న టమాటా ధరలు
వంటగదిలోకి వెళ్లకమునుపే కూరగాయల ధరలు మంట పుట్టిస్తున్నాయి. టమాటా ధరలు అమాంతం పెరగడంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు కూరగాయలు కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, టమాటా ధరలు ఇంకా రెండు నెలల పాటు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ ఒక నివేదికలో తెలిపింది. వర్షాలు, దిగుమతి తగ్గడంతో టమాట ధరలకు రెక్కలు వచ్చాయి అని వివరించింది. టమాటా పండించే ప్రధాన ప్రాంతాలలో ఒకటైన కర్ణాటకలో పరిస్థితి చాలా "భయంకరంగా" ఉంది. ఆ రాష్ట్రం కూరగాయలను మహారాష్ట్ర నాసిక్ నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్-డిసెంబర్ కాలంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో టమాటా పంట చేతికి వస్తుంది. ఇప్పుడు సరిగ్గా సమయంలో అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. నవంబర్ 25 నాటికి ధరలు 145 శాతం పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో టమాటా పంట జనవరి వరకు మార్కెట్లకు చేరుకుంటుంది. అప్పటి వరకు టమోటా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు క్రిసిల్ రీసెర్చ్ పేర్కొంది. ప్రస్తుతం టమాటా ధర హైదరాబాద్‌లో రూ.100కు చెరకుంది. ఇంకా మరో రెండు నెలల పాటు ధర 30 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉల్లిపాయ ధర కూడా మహారాష్ట్రలో కురిసిన అకాల వర్షాల కారణంగా 65 శాతం పెరగడానికి దారి తీసినట్లు నివేదిక తెలిపింది. అయితే, ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. (చదవండి: ‘టమాటా కొనాలంటే.. పాన్ కార్డు కావాలి’) -
‘టమాటా కొనాలంటే.. పాన్ కార్డు కావాలి’
ధరల మోతతో కూరగాయాల మార్కెట్‌కు వెళ్లేందుకు సామాన్యులు జంకుతున్నారు. ముఖ్యంగా టమాటా ధర చుక్కలను తాకడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. భారీ వర్షాలతో భారీగా పెరిగిన టమాటా ధరలను దించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. మరోవైపు టమాటా ధరల పెరుగుదలపై #tomatopricehike హ్యాష్‌టాగ్‌తో సోషల్ మీడియాలో సెటైర్లు, జోకులు పేలుతున్నాయి. సరదా ఫొటోలు, మీమ్స్, వీడియోలను నెటిజనులు ట్విటర్లో షేర్ చేస్తున్నారు. ‘మీరు మార్కెట్ నుంచి టమాటా కొనుగోలు చేసిన ప్రతిసారీ ప్రభుత్వం పాన్ కార్డును అడుగుతుంది. కూరగాయల వ్యాపారులు సైతం పాన్‌కార్డు జిరాక్స్ కాపీని అడుగుతున్నారు’ అంటూ ఈ నెటిజన్ సైటర్ వదిలారు. (చదవండి: హైదరాబాద్‌లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’) జనం తమను టమాటాలతో కొడతారన్న భయంతోనే పాలకులు వాటి ధరను భారీగా పెంచేశారని మరొకరు హాస్యమాడారు. ఇప్పుడు ఖరీదైన ఉంగరం ఇదే అంటూ టమాటాతో ఉన్న ఉంగరం ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు టమాటా ఇప్పుడు కొత్త మాణిక్యం (న్యూ రూబీ) అంటూ వెరైటీ నిర్వచనాలు ఇస్తున్నారు. టమాటా ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలతో పోటీ పడుతున్నాయని పేర్కొంటూ ఉసేన్ బోల్ట్ పరుగు పందెం ఫొటోను షేర్ చేశారు. ఈ నాయకులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో.. కాస్త కనిపెట్టండి అంటూ పాత ట్వీట్‌ను వెలికితీశారు మరో నెటిజన్. టమాటా ధరలు ఎంత పెరిగినా ఫర్వాలేదు. ఇలా చేయండి అంటూ కొత్త టెక్నిక్ కనిపెట్టారు. అదేంటో మీరూ చూడండి.. Tomato price hike ?, No problem, Here is the solution 👇🤣🤣🤣#tomatopricehike pic.twitter.com/DqsKgeDuCA — S℘ıɖɛყ🕸 (@Spidey_e) November 25, 2021 -
హైదరాబాద్‌లో నో‘టమాటా’ రావట్లే.. అంత వద్దు ‘అర కిలో చాలు’
సాక్షి, సిటీబ్యూరో: ఇటీవల కురిసిన వర్షాలు టమాటా రైతులకు తీరని నష్టాలు మిగిల్చాయి. సాధారణంగా ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా.. ఆరేడు క్వింటాళ్లకు మించకపోవంతో రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఆశించిన స్థాయిలో దిగుబడి లేకపోవడం, వినియోగదారుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో నగరంలోని బహిరంగ మార్కెట్లో ట‘మోత’ మోగుతోంది. ప్రస్తుతం సైజు, కలర్‌ను బట్టి కేజీ ధర రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతోంది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. (చదవండి: Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?) రైతుకు నష్టం.. కొనుగోలు కష్టం.. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 14,173.05 ఎకరాల్లో కూరగాయల సాగవుతోంది. ఇందులో 5,827.03 ఎకరాల్లో టమాటా వేశారు. ఇటీవల ఏకధాటి వర్షాలతో పంట చేలోనే కుళ్లిపోయింది. టమాటా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోయే ప్రమాదం ఉండటంతో వచ్చిన పంటను వచ్చినట్లే మార్కెట్‌కు సరఫరా చేస్తుంటారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో ప్రస్తుతం ఆశించిన మేర దిగుబడి రావడం లేదు. అవసరం కొండంత.. దిగుబడి గోరంత.. ► గ్రేటర్లో రోజుకు సగటున 350 నుంచి 380 టన్నుల టమాటా అవసరమవుతున్నట్లు మార్కెటింగ్ శాఖ అంచనా వేసింది. ప్రస్తుతం రంగారెడ్డి సహా ఇతర శివారు జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచి ఆధించిన స్థాయిలో దిగుమతి కావడం లేదు. నగరంలోని బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, మాదన్నపేట, ఎర్రగడ్డ, ఎల్బీనగర్ మార్కెట్లకు రోజుకు సగటున 150 నుంచి 180 టన్నులకు మించి రాకపోవడమే ధరల పెరుగుదలకు కారణమని మార్కెటింగ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ► కేవలం టమాటా మాత్రమే కాదు బీర, కాకర, బెండ, మిర్చి, దోస, సోర వంటి కూరకాయలు, పాలకూర, తోటకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర్ వంటి ఆకుకూరల దిగుబడి కూడా భారీగా పడిపోయింది. ఫలితంగా ఆయా కూరల ధరలు కూడా భారీగా పెరిగాయి. నవంబర్ మొదటివారంలో కేజీ కాయకూరల ధరలు సగటున రూ.20 నుంచి రూ.30 ఉండగా.. ప్రస్తుతం రూ.60పైగా ఉంది. ఆకుకూరలు రూ.10కి నాలుగు నుంచి అయిదు కట్టలు ఇస్తే.. ప్రస్తుతం అంతే మొత్తానికి రూ.20కిపైగా చెల్లించాల్సి వస్తోంది. (చదవండి: తెలుగు గాయని హరిణి తండ్రిది హత్యే) అర కేజీతో సరిపెట్టుకుంటున్నాం.. మార్కెట్లో టమాటా ధరలు మండిపోతున్నాయి. సాధారణ రోజుల్లో కేజీ రూ.10 నుంచి రూ.20కే వచ్చేది. ప్రస్తుతం రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. ఈ ధరను పెట్టి కొనడం కష్టం. తాత్కాలికంగా వినియోగాన్ని తగ్గించాం. గతంలో వారానికి రెండు కేజీలు కొంటే..ప్రస్తుతం అరకేజీతో సరిపెట్టుకుంటున్నాం. – చౌహాన్ లక్ష్మి, బడంగ్పేట్ పంట చేతికొచ్చే దశలోనే.. నేను రెండెకరాల్లో టమాటా సాగు చేశా. ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుందని భావించాను. తీరా కాయ కోతకొచ్చే దశలో భారీ వర్షాలు కురిశాయి. ఫలితంగా చెట్టుకున్న కాయలు నేలకు ఆనుకుని ఉండటంతో వాటికి మచ్చలు ఏర్పడ్డాయి. బూజు పట్టి పాడైపోయాయి. చేను మొత్తం వెతికి ఏరినా ఒక డబ్బా నిండటం లేదు. తెంపిన కాయకు కూడా మచ్చలు ఉండటంతో వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. – యాట అంజయ్య, జాపాల గ్రామం -
టమాటా ధర.. మళ్లీ కొండెక్కింది.. కిలో ఎంతంటే!
సాక్షి, హైదరాబాద్: టమాటా ధర మోతెక్కుతోంది. కొందరు దుకాణాదారులు కిలో రూ.60కిపైగా అమ్ముతుండగా, ఇంకొందరు రూ.50కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలో రూ.45 చొప్పున అమ్ముతున్నారు. కాలనీల్లోని చిల్లర వ్యాపారుల సంగతి చెప్పనవసరమే లేదు. ధరల పెరుగుదలకు ప్రధానం ఇటీవల కురుస్తున్న వర్షాలే కారణమని తెలుస్తోంది. పంట నష్టంతో దిగుబడులు తగ్గడంతో హైదరాబాద్ నగరానికి ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకల నుంచి దిగుమతి అవుతున్నాయి. ధరలు పెరిగేందుకు ఇదే ప్రధాన కారణమని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. నగరానికి అవసరమైన 60 శాతం బయట నుంచే వస్తుండగా.. మిగతా 40 శాతమే మన రాష్ట్రంలో లభ్యమవుతోంది. వర్షాలు పడడంతో అమాంతం 15 శాతానికి సరఫరా పడిపోయింది. దీంతో 85 శాతం వరకు ఇతర రాష్ట్రాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి తలెత్తిందని వ్యాపారులు అంటున్నారు. బీన్స్, బీరకాయ, బెండ ధరలు కూడా పెరిగాయి. (చదవండి: భయం తగ్గింది.. మాస్కులేసుకోవడం మానేశారు) -
టమాటా ధర పైపైకి.. కిలో రూ.42
మదనపల్లె (చిత్తూరు): టమాటా ధరలు రోజురోజుకీ పుంజుకుంటున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం కిలో రూ.42 వరకు పలికింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి దెబ్బతినడం, అందుబాటులో ఉన్న టమాటా నాణ్యత లేకపోవడం తదితర కారణాలతో మార్కెట్‌కు ఆశించిన మేర సరుకు రావడం లేదు. మదనపల్లె మార్కెట్‌కు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలతో పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయల్పాడు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల నుంచి రైతులు బుధవారం మార్కెట్‌కు 189 మెట్రిక్‌టన్నుల టమాటాను తీసుకొచ్చారు. ఈ వారంలో సోమవారం మొదటి రకం కిలో టమాటా ధర రూ.38, మంగళవారం రూ.36 పలికితే బుధవారం రూ.42కు చేరుకోవడం విశేషం. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
కిలో @ రూ.20
సాక్షి సిటీబ్యూరో: టమాటో ధరలు భారీగా తగ్గాయి. గత నాలుగైదు రోజుల క్రితం వరకు కిలో రూ.60 వరకు ధర పలకగా..ఇప్పుడు రూ.20కి ధర పడిపోయింది. కూరగాయల్లో అత్యధికంగా వినియోగంలో ఉండే టమాటో ధరలు పెరగడంతో నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే నగర శివారు జిల్లాల నుంచి మార్కెట్‌కు టమాటో దిగుమతులు భారీగా పెరగడంతో ధరలు తగ్గాయని వ్యాపారులుచెబుతున్నారు. వేసవి కాలంలో అంతగాటమాటో ధరలు పెరగకపోయినా వేసవిఅనంతరం ధరలు అమాంతంగా పెరిగాయి. దీనికి కారణం శివారు జిల్లాల నుంచి దిగుబడులు లేకపోవడం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులతో ధరలు పెరిగినట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. శివారు జిల్లాల నుంచి పెరిగిన దిగుమతులు ప్రతి ఏటా ఫిబ్రవరి నుంచి జూలై వరకు స్థానికంగా టమాటో సాగు అంతగా ఉండదు. ఎందుకంటే వేసవి కాలంలో శివారు జిల్లాలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా టమాటో దిగుబడి ఉండదు. దీంతో నగర అవసరాలు తీర్చడానికి హోల్‌సేల్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో నగర మార్కెట్లో ధరలు పెరుగుతాయి. ఈ ఏడాది మార్చి నెల నుంచి లాక్డౌన్ ప్రారంభకావడంతో హోటళ్లు, ఫంక్షన్స్‌తో పాటు ఇతర శుభకార్యాలకు బ్రేక్ పడింది. దీంతో టమాటో వినియోగం అంతగా లేదు. జూలై చివరి వారంలో మాత్రం టమాటో ధరలు రూ.60 వరకు పెరిగాయి. తిరిగి స్థానిక పంట రావడంతో ఇప్పుడు ధరలు తగ్గుముఖం పట్టాయి. కాగా ప్రతి ఇంట్లో ఇతర కూరగాయలు ఉన్నా లేకున్నా టమాటో మాత్రం ఉండాల్సిందే. ఇటు వెజ్ నుంచి అటు నాన్ వెజ్ వరకు ప్రతి కూరలో దాదాపు టమాటోను వినియోగిస్తారు. గ్రేటర్ జనాభాకు రోజుకు 3 వేల టన్నుల కూరగాయలు అవసరమని మార్కెటింగ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. అయితే 3 వేల టన్నుల్లో ఇతర కూరగాయలకంటే టమాటోనే ఎక్కువ అవసరం. అందుకే టమాటో ధరల్ని మార్కెట్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వచ్చే మార్చి వరకు బేఫికర్ వేసవి ప్రారంభంతో స్థానికంగా కూరగాయల సాగు తగ్గుతుంది. దీంతో శివారు జిల్లాల నుంచి కూరగాయల దిగుమతులు తగ్గుతాయి. ఆగస్టు నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు స్థానికంగా టమాటో సాగు ఎక్కువగానే ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉండడంతో వచ్చే వేసవి ప్రారంభం వరకు అన్ని రకాల కూరగాయలు, ప్రత్యేకంగా టమాటో «ఎక్కువగా దిగుమతులు ఉంటాయి. ధరలు కూడా అంతగా పెరగవు. -
తెలంగాణలో టమాట ధర పైపైకి
సాక్షి, సిటీబ్యూరో : టమాటా.. ఈ మాట వింటేనే ఎంత మాట అనేంతగా ఆశ్చర్యపడాల్సివస్తోంది. ప్రస్తుతం దీని ధర బెంబేలెత్తిస్తోంది. మొన్నటి దాకా సామాన్యులకు అందుబాటు ధరల్లో లభ్యమైన టమాటా రిటైల్ మార్కెట్లో కిలో రూ.60 పలుకుతోంది. లాక్డౌన్, వేసవిలో ధరలు నిలకడగానే ఉన్నా.. వారం పదిరోజులుగా తన ప్రతాపం చూపిస్తోంది. అప్పుడు కిలో రూ.20 నుంచి రూ.30 పలికింది. ప్రస్తుతం మూడింతలు పెరిగింది. హోల్‌సేల్ మార్కెట్లో కిలో టమాటా రూ.40 పలుకుతోంది. కానీ రిటైల్ మార్కెట్లోనే హాట్‌హాట్‌గా మారింది. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే సంకేతాలు వెలువడుతున్నాయి. కాగా.. గత ఏడాది ఇదే సమయంలో కిలో టమాటా రూ.30 పలకడం గమనార్హం. ఎందుకిలా? గ్రేటర్ ప్రజల టమాటా అవసరాలు ఎక్కువ శాతం శివారు ప్రాంతాల నుంచి వచ్చే దిగుమతులే తీరుస్తాయి. రెండు వారాలుగా నగర మార్కెట్లకు ఆశించిన స్థాయిలో రావడంలేదు. అంతేకాకుండా శివారు ప్రాంతాల్లో పంట ఇంకా చేతికి రాలేదు. ఉన్న కొద్దిపాటి టమాటాను గ్రేటర్ మార్కెట్‌కు తరలిస్తున్నారు. దీంతో దీని ధరలు విపరితంగా పెరిగాయి. నెల రోజుల్లో టమాటా పంట చేతికి వస్తే ఎక్కువ మోతాదులో దిగుమతులు ఉంటాయని, దీంతో ధరలు తగ్గుతాయని మార్కెట్ వర్గాల అంచనా వేస్తున్నాయి. మరోవైపు మళ్లీ లాక్డౌన్ చేస్తారనే సంకేతాల నేపథ్యంలో వినియోగదారులు టమాటాను భారీ స్థాయిలో కొనుగోలు చేయడంతో కూడా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతోనూ ధరలపై ప్రభావం చూపుతోందని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు.. శివారు ప్రాంతాల నుంచి టమాటా దిగుమతులు తగ్గడంతో హోల్‌సేల్ వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువస్తున్నారు. కర్ణాటక, ఏపీ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి నగర హోల్‌సెల్ మార్కెట్లకు దిగుమతి చేసుకుంటున్నారు. దీంతో రవాణా చార్జీలు, ఏజెంట్ల కమీషన్‌తో పాటు ఇక్కడి మార్కెట్లో హోల్‌సేల్ వ్యాపారులు వాటా.. ఇవన్నీ కలుపుకొని టమాటా ధరలు పెరుగుతున్నాయి. కాగా.. మార్కెట్ కమీషన్ ఏజెంట్లు ఇతర ప్రాంతాల నుంచి టమాటా తెప్పించి ఎక్కువ లాభాల కోసం ధరలు విపరీతంగా పెంచి అమ్ముతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మార్కెట్ అధికారులు ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదు. మూడ్రోజులు గుడిమల్కాపూర్ మార్కెట్ బంద్ గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ఈ నెల 2 నుంచి 4వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వెంటక్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల మార్కెట్లో ఓ వ్యక్తి కరోనా వ్యాధి బారిన పడ్డారని, దీంతో హమాలీలు, వ్యాపారులు మార్కెట్‌ను బంద్ చేయాలని కోరారు. కమిటీ సభ్యులు బుధవారం సమావేశమయ్యారు. గురు, శుక్ర, శనివారాల్లో మార్కెట్‌ను బంద్ చేయాలని తీర్మానించారు. ఈ మూడ్రోజుల్లో మార్కెట్లో శానిటైజేషన్ చేయాలని నిర్ణయించారు. -
టమాటా ధర పైపైకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధర పైకి ఎగబాకుతోంది. ఇప్పుడే కొత్త సాగు మొదలవ్వడం, పొరుగు రాష్ట్రాల నుంచి డిమాండ్‌కు తగినట్లు సరఫరా లేకపోవడంతో ధర పెరిగిపోతోంది. వారం క్రితం వరకు కిలో టమాటా ధర రూ.30 వరకు ఉండగా, అది ప్రస్తుతం రూ.50కి చేరింది. కొత్త పంట చేతికి రావడానికి మరో రెండు నెలలు పడుతుందని అప్పటివరకు ధర పెంపు తప్పదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మెదక్, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో మాత్రమే టమాటా సాగవుతోంది. ఈ జిల్లాల నుంచి హైదరాబాద్ మార్కెట్లకు రోజుకు 600–800 క్వింటాళ్ల మేర టమాటా వస్తుంది. అయితే ఒక్క హైదరాబాద్ దినసరి టమాటా వినియోగం సగటున 5వేల క్వింటాళ్ల నుంచి 6వేల క్వింటాళ్లు ఉంటుంది. దీంతో డిమాండ్‌ను తీర్చేందుకు స్థానిక వ్యాపారులు ఎక్కువగా ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మంగళూర్‌లపై ఆధారపడి అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటారు. లాక్డౌన్ విధించిన అనంతరం హోటళ్లు, హాస్టళ్లు, రెస్టారెంట్లు మూసివేయడంతో టమాటాకు గిరాకీ తగ్గి ధరలూ తగ్గాయి. లాక్డౌన్ రోజుల్లో కిలో ధర కేవలం రూ.5–10 ఉండగా, లాక్డౌన్ ఎత్తివేత తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తోంది. వారం కిందటి వరకు కిలో ధర రూ.30 పలుకగా, అది ఇప్పుడు రూ.50కి చేరింది. లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో ఫిబ్రవరి, మార్చి నెలలో వేసిన పంటకు డిమాండ్ లేక ధర పూర్తిగా పడిపోయింది. దీంతో ఏప్రిల్, మే నెలలో మన రాష్ట్రంతో పాటు, చిత్తూరు జిల్లాలోనూ పంట సాగు పూర్తిగా తగ్గింది. వేసిన కాస్త పంట ఎక్కడికక్కడ స్థానిక అవసరాలకే సరిపోతుండటంతో అక్కడి నుంచి సరఫరా పడిపోయింది. సరఫరా తగ్గడానికి తోడు ప్రస్తుతం మదనపల్లి మార్కెట్లోనే కిలో టమాటా ధర రూ.30–35 మధ్య ఉంది. ఆ ధరలకు కొనుగోలు చేసి, ఇక్కడ విక్రయించే సరికి ఆ ధర రూ.40–42 మధ్య ఉంటోంది. శనివారం రైతుబజార్లలోనూ కిలో టమాటా రూ.40 వరకు విక్రయించగా, బహిరంగ మార్కెట్లలో రూ.50 వరకు పలికింది. -
ఉల్లి బాటలో టమాట..
న్యూఢిల్లీ : ఉల్లి ధరలు కంటతడి పెట్టిస్తుంటే తాజాగా టమాట కూడా మోతెక్కిస్తోంది. కర్ణాటక సహా టమాట దిగుబడులు అధికంగా ఉండే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా బుధవారం దేశ రాజధానిలో కిలో టమాట రూ 80కి ఎగబాకింది. సరఫరాలు తగ్గడంతో గత ఐదు రోజులుగా టమాట ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. రిటైల్ వర్తకులు టమాటాను రూ 60 నుంచి రూ 80 మధ్య విక్రయిస్తుండగా, మదర్‌డైరీ సఫల్ అవుట్లెట్లలో కిలో రూ 58కి విక్రయిస్తున్నారు. అక్టోబర్ 1న రూ 45 పలికిన కిలో టమాట బుధవారం సగటు రిటైల్ ధర రూ 54కు పెరిగిందని అధికారులు తెలిపారు. వరదలు, భారీ వర్షాలతో పంట దెబ్బతినడం, సరఫరా అవాంతరాలతో టమాట ధరలు మండుతున్నాయని ఆజాద్‌పూర్ మండిలో హోల్‌సేల్ ట్రేడర్ చెప్పుకొచ్చారు. ఇతర మెట్రో నగరాలు కోల్‌కతాలో కిలో టమాట రూ 60 కాగా, ముంబైలో రూ 54, చెన్నైలో రూ 40 వరకూ పలుకుతోంది. -
పడిపోయిన టమాట ధర!
టమాట ధర వింటే రైతు నోటమాట రావట్లేదు. నిన్న మొన్నటి వరకు ఆశలు రేకెత్తించిన ధర.. ఇప్పుడు అమాంతం పడిపోవడంతో రూ.లక్షలు ఖర్చు చేసి పంటలు సాగుచేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రస్తుతం మార్కెట్లో 30 కిలోల బాక్స్ ధర రూ.80 లోపే పలకడంతో.. పెట్టుబడి కాదు గదా రవాణా చార్జీలు దక్కే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. అధికారులు మార్కెటింగ్ సౌకర్యం కల్పించకపోవడం వల్లే తమకీ పరిస్థితి తలెత్తిందంటున్నారు. సాక్షి, అనంతపురం : వేరుశనగ సాగు చేయడం.. దిగుబడి రాక అప్పులపాలు కావడం అనంత రైతులకు నిత్యకృత్యం. కానీ ఇప్పుడిప్పుడే రైతుల ఆలోచనల్లో మార్పు వస్తోంది. ఈ క్రమంలో ఉద్యాన పంటల సాగుపై దృష్టి సారించారు. ఉన్నకొద్దిపాటి నీటి వనరులతోనే టామాట సాగుచేస్తున్నారు. అయితే పంట చేలో ఉన్నప్పుడు ఆశలు రేకెత్తిస్తున్న ధరలు...మార్కెట్‌కు తీసుకువెళ్లే సరికి అమాంతం పడిపోతున్నాయి. రవాణా చార్జీలు కూడా దక్కని పరిస్థితుల్లో రైతులు నిండా మునిగిపోతున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 7,500 హెక్టార్లలో టామాటసాగులో ఉంది. విత్తనం కోనుగోలు , సేద్యం ఖర్చు, మందులు, కూలీలన్నీ కలుపుకుంటే ఎకరాకు సుమారుగా రూ.40 వేల వరకు పెట్టుబడి అవుతోందని రైతులు చెబుతున్నారు. తొలుత ఆశలు రేకెత్తించిన ధర నెలన్నర క్రితం వరకూ కిలో టామాట సుమారు రూ.40 నుంచి దాకా పలికింది. ఇందులో నాసిరకమే ఎక్కువగా ఉండేది. నల్లమచ్చలు, గోళీల కన్నా కాస్త పెద్దసైజు టమాటలను కిలో రూ.30 నుంచి రూ.40లకు కొనాల్సి వచ్చింది. నెల రోజుల నుంచి జిల్లాలో దిగుబడి అధికంగా వస్తోంది. ఈ క్రమంలో 20 రోజుల క్రితం 30 కిలోల బాక్సు ధర రూ. 250 నుంచి రూ.300 వరకు పలికింది. ఇప్పుడూ పరిస్థితి లేకుండా పోయింది. వారం, పది రోజులుగా ధర పూర్తిగా పతనమైపోతోంది. ప్రస్తుతం రవాణా, కూలీ ఖర్చులు రావడం లేదని రైతులు చెబుతున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించినా.. జిల్లా రైతులు టమాట పంటను మదనపల్లి, పలమనేరు, హైదరాబాదు, రాజమండ్రి, నంద్యాల, ప్యాపిలి, బెంగళూరు, బళ్లారి, హోస్పేట్, బాగేపల్లి, చిక్‌బళ్ళాపూర్ తదితర ప్రాంతాల మార్కెట్లకు తరలిస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు తదితర ప్రాంతాల రైతులు జిల్లాలోని స్ధానిక మార్కెట్లతో పాటు తమకు సమీపంలో ఉన్న అనుకులమైన మార్కెట్లకు పంటను పంపుతున్నారు. ప్రస్తుతం ఆయా మార్కెట్లలో 30 కిలోల బాక్సు సగటున రూ. 80లోపే పలుకుతోంది. ఈ విషయం తెలుసుకున్న రాయదుర్గం, కళ్యాణదుర్గం, గుంతకల్లు, గుత్తి ప్రాంతాల రైతులు పంటను కర్ణాటకకు తరలిస్తున్నారు. అక్కడ పెద్దసైజులో ఉన్న టమాటా 15 కిలోల బాక్సు రూ. 35 నుంచి రూ. 40 వరకు పలుకుతోందంటున్నారు. పొలాల్లోనే విడిచిపెట్టిన రైతులు ధర అమాతం పడిపోవడంతో చాలామంది రైతులు పంట కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఆశకొద్దీ కొంతమంది మండీలకు తరలిస్తున్నా...వారికి రవాణా, కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదు. మార్కెట్లో కమీషన్లు, మారుబేరం దెబ్బకు రైతులు అల్లాడిపోతున్నారు. కష్టపడి సాగుచేసిన పంటను మరీ దారుణమన రేటుకు అడుగుతుండటంతో కొందరు రైతులు వ్యాపారులకు ఇవ్వడం ఇష్టలేక రోడ్డుపై పడేసి వెళ్లిపోతున్నారు. రైతును ఆదుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ, జిల్లా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదు. పెట్టుబడులు రాలేదు నేను రూ.లక్ష ఖర్చు చేసి మూడు ఎకరాల్లో టమాట సాగు చేశాను. పంట చేతికి వచ్చే సరికి ధర భారీగా పడిపోయి పెట్టుబడి కూడా దక్కడం లేదు. – కృష్ణారెడ్డి, ఉద్దేహాళ్ గిట్టుబాటు ధర కల్పిస్తాం టమాట రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. రైతుల నుంచి మండీ నిర్వహకులు ఎక్కువ కమీషన్ వసూలు చేస్తే చర్యలు తప్పవు. త్వరలోనే రైతులు, వ్యాపారులు, మండీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేస్తాం. – గుణభూషణ్‌రెడ్డి ఆర్డీఓ, సత్యనారాయణమూర్తి మార్కెంటింగ్ శాఖ ఏడీ -
ట‘మోత’ కేజీ రూ. 80
న్యూఢిల్లీ : కూరగాయల ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఎండకాలంలో ఠారెత్తించిన కూరగాయల ధరలు.. వర్షకాలం ప్రారంభమైన తగ్గడం లేదు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో టమాటా ధరలు సాధరణం కంటే మూడింతలు పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు టమాటా కొనాలంటే భయపడిపోతున్నారు. వారం క్రితం కిలో 20 నుంచి 30 రూపాయలు పలికింది. అయితే ఉన్నట్టుండి టమాటా ధర 60 నుంచి 80 రూపాయలకు చేరింది. ఈ ధర రూ. 100కు చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పహర్‌గంజ్ మండి వ్యాపారులు తెలిపారు. అలాగే బెండకాయ, ఉల్లిపాయ, కొత్తిమీర ధరలు కూడా పెరుగుతూనే ఉన్నాయని అన్నారు. భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. వర్షకాలం తరువాతే కూరగాయల ధరలు తగ్గే అవకాశం ఉన్నట్టు వారు అంచనా వేస్తున్నారు. -
ఠారెత్తిస్తున్న టమాటా
సాక్షి, సిటీబ్యూరో: ట‘మోత’ మోగుతోంది. రెండు వారాల క్రితం కిలో రూ.15 పలికిన టమాటా... ప్రస్తుతం రూ.40కి చేరింది. ఇదే వరుసలో మిగతా కూరగాయల ధరలు సైతం భారీగా ఉన్నాయి. ఎండలు మండిపోతుండడం, నీటి కొరతతో ఉత్పత్తి పడిపోవడంతో నగరానికి దిగుమతులు తగ్గాయి. గుడిమల్కాపూర్, ఎల్బీనగర్, బోయిన్పల్లి, మోండా తదితర ప్రధాన మార్కెట్లతో పాటు రైతుబజార్లకు కూరగాయల సరఫరా తగ్గింది. వేసవి దృష్ట్యా నగర సమీప జిల్లా్లల్లో నీటి కొరతతో పంట దిగుబడి పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈసారి దిగుమతులు బాగా తగ్గాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ఇష్టానుసారంగా టమాటా ధరలు పెంచేశారు. దుకాణాదారులు కిలో రూ.30 నుంచి రూ.40కి విక్రయిస్తున్నారు. రైతుబజార్లలోనూ కిలో రూ.38 చొప్పున అమ్ముతున్నారు. ఇక కాలనీల్లోని చిరు వ్యాపారుల సంగతి చెప్పనక్కర్లేదు. హైబ్రిడ్ టమాటా కిలో రూ.45–48, దేశీ టమాటా రూ.35–40 చొప్పున విక్రయిస్తున్నారు. మార్చి చివరి వారంలో కిలో రూ.10–15, ఏప్రిల్ తొలి వారంలో రూ.15–18 మధ్య ఉన్న ధరలు ఒక్కసారిగా ఇంత మొత్తంలో పెరగడంతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 50–60 లారీలే... నగరానికి ప్రధానంగా మెదక్, నిజామాబాద్, కరీంనగర్, సిద్దిపేటతో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచే అధికంగా కూరగాయలు దిగుమతి అవుతాయి. ఈ జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్నాటక, మహారాష్ట్ర నుంచి వచ్చే టమాటా, క్యాప్సికం, ఆలు, పచ్చి మిర్చి, బీర్నీస్ తదితర ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఆయా ప్రాంతాల్లోనూ ఉత్పత్తి తగ్గిపోయిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. రెండు వారాల క్రితం నగరానికి 100–150 లారీల టమాటా దిగుమతి అయితే... ప్రస్తుతం 50–60 లారీలే వస్తోందని తెలిపారు. ఇక బీర్నీస్, గోకరకాయ, పచ్చిమిర్చి, వంకాయ, క్యారెట్, చిక్కుడు తదితర కూరగాయల ధరలు కూడా రెట్టింపయ్యాయి. జూన్ వరకు పరిస్థితి ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరికొన్ని రోజులైతే కూరగాయలకు పక్క రాష్ట్రాలపైనే ఆధారపడాల్సి వస్తుందని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కూరగాయల ధరలు ఇలా.. (కిలోకు రూ.ల్లో) -
టమోటా ధరకు రెక్కలు: కిలో రూ.80
పటాన్చెరు టౌన్ (హైదరాబాద్) : ఇప్పటికే మిర్చి ధరతో అల్లాడిపోతున్న వినియోగదారులకు ఇప్పుడు టమోటా తన దెబ్బ రుచి చూపిస్తోంది. టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్ధితుల కారణంగా రబీలో సాగు చేసిన టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో బహిరంగ మార్కెట్లో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. 25 కేజీలు ఉన్న ఒక బాక్స్ ధర రూ.1200కు చిరువ్యాపారులు కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమోటా కిలో రూ. 80 పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.50 వరకు ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి వినియెగదారులు ఆందోళన చెందుతున్నారు. -
ఠారెత్తిస్తోన్న టమోటా !
♦ వర్షాలతో దెబ్బతిన్న పంటలు ♦ టమోటా కేజీ రూ.30లకు ఎగబాకిన వైనం ♦ ధరాభారంతో వినియోగదారుల విలవిల సాక్షి, హైదరాబాద్: నగర మార్కెట్లో టమోటా ధర ఠారెత్తిస్తోంది. నిన్న మొన్నటివరకు కేజీ రూ.11-15ల మధ్యలో లభించిన టమోటా ఇప్పుడు ఏకంగా రూ.30లకు ఎగబాకింది. మంగళవారం రైతుబజార్లో కేజీ రూ.11లకు లభించిన టమోటా బుధవారం నాడు రూ.23లకు చేరడం టమోటా కొరతకు అద్దం పడుతోంది. ఇదే సరుకు రిటైల్ మార్కెట్లో కేజీ రూ.28-30ల ప్రకారం వసూలు చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడంతో నగరానికి టమోటా సరఫరా గణనీయంగా తగ్గిపోయింది. కూరల్లో ప్రధాన ముడిసరుకైన టమోటా ధర పెరగడంతో మిగతా కూరగాయల ధరలు కూడా అదే బాటపట్టాయి. మంగళవారం రైతుబజార్లో కేజీ రూ.17 ఉన్న బెండ ప్రస్తుతం రూ.23, అలాగే రూ.19 ఉన్న దొండ రూ.23కి పెరిగాయి. ఒక్క దొండ, బెండలే కాదు... అన్ని కూరగాయల్లో రూ.2-12 వరకు ధరల పెరుగుదల కన్పిస్తోంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో ఏ రకం కూరగాయను కొందామన్నా కేజీ రూ.20-40 ధర పలుకుతుండటంతో సామాన్యుడి గుండె గుభేల్ మంటోంది. ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాల వల్ల నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని పంటలు దెబ్బతిన్నాయి. ప్రత్యేకించి టమోటా పూర్తిగా దెబ్బతినడంతో రైతులు పంటను చేలల్లోనే వదిలేశారు. ఫలితంగా నగరానికి సరఫరా నిలిచిపోయి కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య తీవ్రమైన అంతరం ఏర్పడి ఆ ప్రభావం ధరలపై పడింది. ప్రస్తుతం మదనపల్లి నుంచి దిగుమతయ్యే టమోటా పైనే నగరం ఆధారపడాల్సి వస్తోంది. వర్షాల కారణంగా ఏపీ నుంచి వచ్చే దిగుమతులు కూడా సగానికి సగం పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచి వచ్చే కూరగాయల దిగుబడి కూడా అంతంత మాత్రంగానే ఉంది. దీంతో అసమతౌల్యం ఏర్పడి ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయంటున్నారు. మార్కెటింగ్ శాఖ మౌనం అకాల వర్షాలు పడినప్పుడు మార్కెటింగ్ శాఖ ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఎక్కడాలేని విధంగా మనకు రైతుబజార్ వ్యవస్థ, ఇతర విభాగాలున్నప్పటికీ అధికారుల నిర్లిప్తత, నిర్లక్ష్యం కారణంగా ‘చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందం’ అవుతోంది. సామాన్య మధ్యతరగతి ప్రజానీకానికి ఈ శాఖ ఏమాత్రం సాంత్వన చేకూర్చలేక పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు కూరగాయల ఉత్పత్తి అధికంగా ఉండే ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన మార్కెటింగ్ శాఖ అది తమ పనికాదన్నట్లు వ్యవహరిస్తోంది. మరో వారం రోజుల్లో లోకల్ టమోటా దిగుబడినిచ్చే అవకాశం ఉందని, అప్పుడు ధరలు వాటంతటవే దిగివస్తాయని అధికారులు వ్యాఖ్యానించడం విశేషం. -
ఉత్తరాది రాష్ట్రాలకు మదనపల్లె టమాటా
* మదనపల్లె మార్కెట్లో పుంజుకున్న ధరలు * రైతుల్లో ఆనందం * రోజుకు 50 నుంచి 60 లోడ్ల ఎగుమతి మదనపల్లె: మదనపల్లె మార్కెట్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు టమాటా ఎగుమతి పెరిగింది. గతంలో ఎన్నడూలేని విధంగా రోజుకు 50 నుంచి 60 లోడుల(300 టన్నులు) వరకు ఎగుమతి అవుతున్నాయి. దీంతో రెండు నెలల నుంచి మంచి ధరల్లేక దిగాలుపడ్డ రైతులకు కాస్త గిట్టుబాటు ధర లభిస్తోంది. నెల రోజుల క్రితం మొదటి రకం టమాటా పది కేజీల బుట్ట రూ. 60 దాటలేదు. అదే శుక్రవారం ఒక్కసారిగా రెట్టింపై రూ. 150 ధర పలికింది. ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, జమ్మూకశ్మీర్, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో టమాటా దిగుబడి బాగా తగ్గడంతో మదనపల్లె మార్కెట్లో టమాటాకు డివూండ్ పెరిగింది. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌కు చుట్టు పక్కల పల్లెలు, అనంతపురం జిల్లా కదిరి, ముదిగుబ్బ నుంచి, వైఎస్ఆర్ జిల్లా రాయచోటి నుంచే కాకుండా కర్ణాటకలోని చింతామణి, చీలగట్టు, శ్రీనివాసపూర్, రాయల్పాడు నుంచి సరుకు వస్తోంది. ఉత్తరాదికి ఎగుమతి అవుతుండడంతో ఐదు రోజులుగా ధరలు బాగా పుంజుకున్నాయి. డిసెంబర్ 29న 10 కేజీల బుట్ట ధర మొదటి రకం రూ. 100, రెండో రకం రూ. 70, మూడో రకం రూ. 48 పలికింది. 30న మొదటి రకం రూ. 120, రెండోరకం రూ. 85, మూడో రకం రూ. 60; 31న మొద టి రకం రూ. 130, రెండో రకం రూ. 75, మూడో రకం రూ. 55; జనవరి మొదటి రోజు మొదటి రకం రూ. 140, రెండో రకం రూ. 100, మూడోరకం రూ. 70, 2న మొదటి రకం రూ. 150, రెండో రకం రూ. 100, మూడో రకం రూ. 70 చొప్పున పలికింది. ధరలు పుంజుకుంటుండడంపై రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
తగ్గుతున్న టమాట ధర
వారంలో కిలో రూ.12 తగ్గిన వైనం తగ్గిన ఎగుమతి.. పెరిగిన దిగుబడి మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్లో ధర రోజురోజుకూ తగ్గుతోంది. గత నెల కిలో రూ.50 పైన పలికిన టమాటాలు ప్రస్తుతం రూ.20 పలుకుతున్నాయి. గత వారం కిలో రూ.32 పలికిన టమాట ఆదివారం రూ.20కి పడిపోయింది. కాయల ఎగుమతి 50 శాతం వరకూ తగ్గడం, దిగుబడి 70 శాతం పెరగడమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. గడిచిన వారం రోజుల్లో ధరలను పరిశీలిస్తే 18న 10 కేజీల బుట్ట ధర మొదటి రకం రూ.320, రెండో రకం రూ.250, మూడో రకం రూ.180 పలికాయి. 19న మొదటి రకం రూ.300, రెండో రకం రూ.245, మూడో రకం రూ.170, 20న రూ.285, రూ.220, రూ.180, 21న రూ.300, రూ.245, రూ.190, 22, 23 తేదీలలో రూ.285, రూ.220, రూ.160 పలికాయి. ఆదివారం మొదటి రకం రూ.205, రెండో రకం రూ.150, మూడో రకం రూ.100 పలికాయి. 18న మార్కెట్‌కు 285 టన్నుల కాయలు రాగా ఆదివారం 363 టన్నుల కాయలు వచ్చాయి. ప్రస్తుతం మదనపల్లె మార్కెట్ నుంచి విజయవాడ, కాకినాడ, రాజమండ్రి, నెల్లూరు, హైదరాబాద్, తమిళనాడు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కుంభకోణం, పాండిచ్చేరి ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నాయి. అన్ని చోట్ల పంట దిగుబడి ఉండడంతో వారం రోజులుగా ఎగుమతులు తగ్గాయి. పైగా అనంతపురం, కదిరి, పెద్దమండ్యం, గుంతకల్లు, లక్ష్మీపురం, రాయల్పాడు, శ్రీనివాసపురం, బి.కొత్తకోట, ముదిగుబ్బ, మడకసిర, పులివెందుల, కడప తదితర ప్రాంతాల నుంచి మార్కెట్‌కు అధిక మొత్తంలో టమాటాలు వస్తున్నాయి. ఈ కారణంగా ధర పతనమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు. -
ఇది చాలా రేటు గురూ..!
సాక్షి, న్యూఢిల్లీ: నిన్నామొన్నటిదాకా ఉల్లిపాయల ధరలు ఆకాశాన్నంటగా ఇప్పుడు ఆ స్థానంలోకి టమాటా వచ్చింది. టోకు మార్కెట్లలోనే కిలో టమాటోల ధర రూ.40 పలుకుతోంది. ఇక చిల్లర వ్యాపారులు కిలో రూ. 50 లేదా రూ. 60కి విక్రయిస్తున్నారు. తొలకరి ప్రారంభమైనా తగురీతిలో వర్షాలు కురవకపోవడమే ఇందుకు కారణమని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాజధా ని నగరానికి సిమ్లా, బెంగళూర్. మహారాష్ట్రల నుంచి టమాటాలు వస్తున్నాయని టోకు వ్యాపారులు తెలిపారు. కర్ణాటక, మహారాష్ట్రల్లోనే టమాటాలు కిలో రూ. 30 పలుకుతున్నాయని, అందువల్ల ఇక్కడికి వచ్చే సరికి వాటి ధర మరింత పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు. వానలు పడనందువల్ల టమాటాల దిగుబడి తగ్గిందని, ఒకవేళ ఇప్పుడు ఒక్కసారిగా వానలు పడినా పండిన టమాటాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తక్కువగా ఉండడం వల్ల మార్కెట్‌కు టమాటాల తగ్గుముఖం పట్టిందని వారు చెప్పారు. ప్రతి సంవత్సరం ఈ సమయంలో టమాటా ధర పెరగడం సహజమేనని వారు అంటున్నారు. జూలై నెల ఆరంభంలో కిలో టమాటోల ధర టోకు మార్కెట్లో రూ.10-15, చిల్లర మార్కెట్లో రూ. 20-30 ఉంది. పది రోజుల్లో టమాటాల ధర రెట్టింపయ్యింది. అప్పట్లో ఢిల్లీకి పొరుగున ఉన్న హర్యానా, పంజాబ్‌ల నుంచి టమాటాలు నగరానికి రావడంతో వాటి ధర తక్కువగా ఉందని కూరగాయల వ్యాపారులు అంటున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి టమాటాల రాక వారం కిందట ఆగిపోయిందని, దూరప్రాంతాల నుంచి నగరానికి వస్తున్నందువల్ల రవాణా చార్జీల భారం కూడా వీటి ధరను పెంచిం దని వారంటున్నారు. టమాటాలు మాత్రమే కాకుండా పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి కూరగాయల రాక కూడా ఆగిపోయింద ని, అందువల్ల మున్ముందు టమాటాలతోపాటు ఇతర కూరగాయల ధరలు మరింత పెరగవచ్చని హెచ్చరిస్తున్నారు. -
దరలు కుతకుత!
అనంతపురం రాజు రోడ్డుకు చెందిన రాములమ్మ ఇంటికి బంధువులు రావడంతో బిర్యానీ చేయడానికి సోనామసూరి బియ్యం కోసం మార్కెట్‌కు వెళ్లింది. కిలో బియ్యం (పాతవి) రూ.50 అని వ్యాపారి చెప్పడంతో కంగుతినింది. మొన్నటి వరకు రూ.40 ఉండేవి కదా అని అడిగితే.. ‘ఔనమ్మా అది మొన్నటి మాట. ఇప్పుడు ధర పెరిగింద’ని చెప్పడంతో ఇంటికి తిరుగుముఖం పట్టింది. దారి మధ్యలో మరో అంగడికి వెళ్లి కిలో కందిపప్పు ఎంతని అడగ్గా.. రూ.80 అని చెప్పడంతో ఆమె కళ్లు తేలేసింది. సాక్షి, అనంతపురం : పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజల నడ్డివిరిచేలా ఎప్పటికప్పుడు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. రెండు పూటలా పప్పు చారుతో భోజనం చేసే పరిస్థితులు లేకుండా పోతున్నాయని పేదలు వాపోతున్నారు. మొన్నటి వరకు సన్నరకం బియ్యం (బీపీటీ) ధర కొద్దిగా తగ్గినట్లు కనిపించినా మళ్లీ రెక్కలొచ్చాయి. మూడు నెలల క్రితం వరకు క్వింటాల్ రూ.4 వేలు ఉండగా... ప్రస్తుతం రూ.5 వేలకు చేరాయి. పప్పుల విషయానికొస్తే ఆరు మాసాల క్రితం కిలో రూ.50 నుంచి రూ.60 వరకు ఉన్న పెసర, ఉద్దులు, కందిపప్పు ధరలు ప్రస్తుతం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు చేరాయి. సాధారణంగా పెసర, కందిపప్పులను వారంలో కనీసం నాలుగురోజులైనా వినియోగిస్తుంటారు. పెరిగిన ధరలతో రెండు రోజులు కూడా వినియోగించే పరిస్థితి లేకుండా పోయింది. చట్నీలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. మసాల వంటలతో పాటు ముఖ్యంగా చట్నీలకు ఉపయోగించే కొబ్బరి ధర కూడా అమాంతం పెరిగిపోయింది. తె గుళ్ల దెబ్బకు తమిళనాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో కొబ్బరి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం మార్కెట్లో కిలో కొబ్బరి రూ.120 పలుకుతోంది. రానున్న రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలదీ అదే రూటు కూరగాయలు కొనుగోలు చేయాలంటేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రూ.100 తీసుకుని మార్కెట్‌కు వెళ్తే చిన్నపాటి సంచి నిండా కూడా రావడం లేదు. మొన్నటి వరకు కిలో రూ.10 పలికిన టమాట ప్రస్తుతం రూ.24కు ఎగబాకింది. బెండకాయ మినహా ఏ కూరగాయను ముట్టుకున్నా కిలో రూ.30 పైమాటే. కందగడ్డ కిలో రూ.70, కాలీఫ్లవర్ ఒకటి రూ.15 -20, మునక్కాయలు (నాలుగు) రూ.20 పలుకుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో వర్షాభావం కారణంగా కూరగాయల సాగు తగ్గిపోవడంతో కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆ రాష్ట్రాల్లో కూడా దిగుబడి పెద్దగా లేకపోవడంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉల్లిగడ్డలు మాత్రం రూ.20 పలుకుతుండడంతో జనం కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. -
టమాటా రైతు డీలా
భారీగా తగ్గిపోయిన ధర.. ఖర్చులు సైతం రావడం లేదంటున్న రైతు అచ్యుతాపురం,న్యూస్‌లైన్: టమాటా ధర విపరీతంగా తగ్గిపోవడంతో రైతులు డీలాపడ్డారు. రైతు బజారులో కొనుగోలుదారులు లేకపోవడంతో శుక్రవారం కిలో టమాటా మూడు రూపాయలకే అమ్ముకోవలసివచ్చిం ది. అయితే బయట మార్కెట్లో కిలో రూ.10 పలికిం ది. ఇక్కడి మార్కెట్‌కి గతంలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలనుంచి హోల్‌సేల్ వ్యాపారులు వచ్చేవారు. ఇక్కడ బసచేయడానకి వసతులు లేకపోవడం, రవా ణా చార్జీలు పెరగడంతో వారు ఇప్పుడు రావడం లేదు. దీంతో రైతులు తమ పంటను పూర్ణామార్కెట్ దళారులకు మాత్రమే అమ్ముకోవలసిన దుస్థితి ఏర్పడింది. పూర్ణామార్కెట్ వర్తకులంతా సిండికేట్‌గా ఏర్పడి మా ర్కెట్కి వచ్చిన సరుకును బట్టి రేటు తగ్గిస్తున్నారు. ఆరు గంటలకే మార్కెట్‌కు సరుకు చేరినప్పటికీ 9 గం టల వరకూ కొనుగోలుచేయడంలేదు. రైతులు పాతిక కిలోల గంప ధర రెండు వందలు చె బితే వర్తకులు రూ. 60కి అడుగుతున్నారు.సరుకు అమ్మకం కాకపోతే పూర్తిగానష్టపోతామన్న భయంతో అందినకాడికి అమ్ముకుంటున్నారు. మేలుజాతి విత్తనాలు, దుక్కులు, క్రిమిసంహారక మందులు, తోటలో పంటను ఏరడానికి కూలీ ఖర్చు ఇవన్నీ భారీగా పెరుగుతున్నా మార్కెట్లో పంటకు గిట్టుబాటు ధర రావడం లేదని రైతులు వాపోతున్నారు. అచ్యుతాపురంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి బసచేయడానికి సౌకర్యం ఏర్పాటు చేస్తే వర్తకుల మధ్య పోటీ ఏర్పడి తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని రైతులు ఆశిస్తున్నారు. ఎందుకు వేశామా అన్నట్లుంది... పంట ఎందుకేశామా అనిపిస్తోంది. టమాటా అమ్మితే ఊరులోనుంచి రైతుబజారుకి దారిఖర్చులు రావడంలేదు. ఏమి తిని బతకాలి. అమ్ముడవకుంటే బయట పారబోయాలి. మార్కెట్లో ఎంత ధర ఉంటుందో చెప్పలేకపోతున్నాం. వ్యాపారులంతా సిండికేటైపోతున్నారు. మార్కెట్లో సరుకును చూసుకొని రేటు నిర్ణయిస్తున్నారు. రైతు పండిస్తేదళారులు బాగుపడుతున్నారు. - ధర్మిరెడ్డి అప్పలనాయుడు -
కుప్పకూలిన టమోటా ధర
=రైతుకు దక్కేది కిలోకు మూడు రూపాయలే =ఎకరాకు రూ.20 వేల వరకు పెట్టుబడి =కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన నూజివీడు, న్యూస్‌లైన్ : నెలరోజుల క్రితం వరకు కిలో రూ.30 వరకు పలికిన టమోటా ధర ఒక్కసారిగా కుప్పకూలడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు కిలోకు మూడు రూపాయలు కూడా దక్కడం లేదని, దీనివల్ల కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు బాగా ఉంటాయని అప్పులు చేసి మరీ సాగుచేస్తే దిగుబడి వచ్చే సమయానికి దారుణంగా పతనమవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పులు ఎలా తీరుతాయో అర్థం కాక ఆందోళన చెందుతున్నారు. నూజివీడు ప్రాంతంలో సిద్ధార్థనగర్, నర్సపేట, లైన్‌తండా, వెంకటాయపాలెం, హనుమంతులగూడెం, బత్తులవారిగూడెం, సుంకొల్లు, జంగంగూడెం, దేవరగుంట తదితర గ్రామాల్లో దాదాపు 500 ఎకరాల్లో టమోటా సాగు చేశారు. రోజుకు దాదాపు 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఈ పరిస్థితుల్లో టమాటాకు ఈ ప్రాంతంలో మార్కెటింగ్ సౌకర్యం లేకపోవడంతో రైతులు రైతుబజారులోని వ్యాపారులకు వేసినన్ని వేసి, మిగిలినవి కమీషన్ వ్యాపారులకు అయినకాడికి తెగనమ్ముకుంటున్నారు. మరికొంత ధర ఉంటే గుడివాడ మార్కెట్‌కు తీసుకెళ్లి విక్రయించి వస్తారు. ప్రస్తుతం ధర పడిపోవడంతో అక్కడి వరకు ఉపయోగం ఉండే అవకాశం లేక కమీషన్ వ్యాపారులకే విక్రయిస్తున్నారు. పంట సాగుచేసినందుకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి అయిన నేపథ్యంలో ధర దిగజారడంతో పెట్టుబడులు కూడా రావని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం టమోటాకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే లాభసాటిగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నారు. -
టమా‘ఠా’
రాష్ట్ర రాజధాని నగరంలో టమాటా ధర చతికిల బడింది. వారం రోజుల క్రితం వరకు రూ.40 పలికిన ధర ఉన్నట్టుండి కిలో రూ.ఏడు, పదికి పడిపోంది. ఉత్పత్తి గణనీయంగా పెరగడంతోనే ధర తగ్గించాల్సి వచ్చిందని వర్తకులు పేర్కొంటున్నారు. మార్కెట్లో వినియోగం కంటే సరఫరా అధికంగా ఉందని చెబుతున్నారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కొన్ని నెలలుగా కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతూ వస్తున్నాయి. ఉల్లి కన్నీళ్లు పెట్టిస్తే, టమాటా ప్రియంగా మారింది. దీంతో ఏకంగా కూరగాయల విక్రయాన్ని స్వయంగా ప్రభుత్వమే చేపట్టింది. తోట పచ్చదనం దుకాణాల్ని ఏర్పాటు చేసి కూరగాయల్ని నగరవాసులకు అందించడం ప్రారంభించింది. బయటి మార్కెట్లలో పోల్చితే ఈ దుకాణాల్లో 25 నుంచి 40 శాతం వరకు ధరలు తక్కువే. దీంతో ఈ దుకాణాలు ప్రజాదరణ పొందాయి. ఇంటి వద్దకే కూరగాయలు తీసుకెళ్లి విక్రయించే పథకం కసరత్తుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో వారం రోజులుగా కూరగాయల ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. కిలో రూ.100 వరకు పలికిన ఉల్లి ప్రస్తుతం పేదోడు కొనేట్టుగా రూ. 20 -25కు చేరింది. ఉల్లి ధర తగ్గిందో లేదో ప్రస్తుతం టమాటా ధర చతికిలబడింది. గత వారం వరకు రూ. 50. నుంచి రూ.70 పలికిన టమాటా ప్రస్తుతం రూ. 10 నుంచి 12 వరకు పడిపోయింది. ఇక రెండో రకం టమాటా రూ.7 నుంచి రూ.10 వరకు పలుకుతోంది. రాష్ట్రంలో అన్ని మార్కెట్లలోను ఇదేరకంగా ధర పలుకుతోంది. కొన్ని గ్రామీణ మార్కెట్లలో అయితే, రూ.5, రూ.7కు లభిస్తుండటం విశేషం. పెరిగిన ఉత్పత్తి: రాష్ట్రంలో ఈ ఏడాది టమాటా ఉత్పత్తి పెరిగినట్టు టోకు వర్తకులు పేర్కొంటున్నారు. ఉత్పత్తి పెరగడం, ధర తగ్గడం అన్నదాతను, టోకు వర్తకుల్ని కలవరంలో పడేస్తున్నాయి. ఇది వరకు చెన్నై కోయంబేడు మార్కెట్‌కు రోజుకు 40 టన్నుల టమాటా వచ్చేది. ప్రస్తుతం 60 నుంచి 70 టన్నుల మేరకు టమాట వస్తోంది. దక్షిణాది జిల్లాల్లో ఈ ఏడాది ఉత్పత్తి గణనీయంగా పెరగడంతోనే కోయంబేడుకు అత్యధిక శాతం టమాటా వస్తున్నట్టుగా వర్తకుడు సౌందరరాజన్ పేర్కొన్నారు. దిండుగల్, ఉడుమలై పేట, ఒట్టన్ చత్రంలలో మరీ ఎక్కువగా ఉత్పత్తి ఉందని, ధర మరింత తగ్గే అవకాశం ఉందన్నారు. -
మండుతున్న ‘కూరగాయా’లు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. రాకెట్ వేగంతో పెరిగిన కూరల ధరలు ప్రజలకు గుండె దడ తెప్పిస్తున్నాయి. రాజధాని నగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు చుక్కలనంటుతున్నాయి. సరిగ్గా వారం రోజుల కిందట హైదరాబాద్ మార్కెట్లో కిలో రూ.23 ఉన్న టమాటా శుక్రవారం నాటికి రూ.50కి ఎగబాకింది. నెల రోజుల క్రితం కిలో రూ.20 ఉన్న కిలో గోరుచిక్కుడు ఇప్పుడు రూ.60కి చేరింది. మొన్నటి వరకూ రూ.3 ఉన్న ములక్కాడ నేడు రూ. 12కి పెరిగింది. కిలో రూ. 40 లేనిదే హైదరాబాద్ మార్కెట్లలో ఏ కూరగాయలూ దొరకడంలేదు. కిలో దొండ ధర అనూహ్యంగా రూ. 55కి పెరిగింది. చాలా కాలనీల్లో దుకాణాలవారు దొండ, బీన్స్ కిలో రూ.60కి కూడా అమ్ముతున్నారు. రైతు బజార్లలో కూడా బీన్స్ కిలో రూ.50కి విక్రయిస్తున్నారు. నెల రోజుల కిందటితో పోల్చితే వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరల ధరలు రెట్టింపయ్యాయి. నెల కిందట తోటకూర పెద్ద కట్ట రూ.5కు ఇచ్చేవారు. ఇప్పుడు అదే కట్ట రూ.12 నుంచి 15కు పెంచేశారు. వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరల తోటలు దెబ్బతిన్నాయని, సరఫరా తగ్గిపోయి ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. వర్షాల వల్ల కూరగాయలు, ఆకుకూరల తోటలు కొంతమేరకు దెబ్బతిన్న విషయం వాస్తవమైనా.. దీని వల్లే ధరలు పెరిగాయనే వాదనలో వాస్తవం లేదు. ధరల పెరుగుదలకు వర్షాలే కారణమైతే కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వచ్చే బీన్స్, క్యారట్, క్యాప్సికం ధరలు ఎందుకు పెరిగినట్లు? బీన్స్, క్యాప్సికం కిలో రూ. 60, క్యారట్ కిలో రూ.50 పలుకుతున్నాయి. దీన్నిబట్టి మధ్య దళారులు, వ్యాపారులు వర్షాలను సాకుగా చూపి ఇష్టారాజ్యంగా ధరలు పెంచేశారని స్పష్టమవుతోంది. సామాన్యుల బాధలు పట్టని ప్రభుత్వం గతంలో కూరగాయల ధరలు పెరిగిన సమయాల్లో ప్రభుత్వం కలుగజేసుకుని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి కొంతవరకూ సరసమైన ధరలకు కూరగాయలు విక్రయించేది. ధరల నియంత్రణకు రూ.500 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన నీటిమూటలా మారింది. ‘గతంలో రూ.200 తీసుకెళితే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు రూ.500 తీసుకెళ్లినా సంచి నిండా రావడం లేదు. కూరగాయలు కొనాలంటే చికెన్ కొన్నట్లుంది. కిలో రూ.60 రూపాయలు పెట్టి బీన్స్, గోరుచిక్కుడు, దొండ ఏమి తింటాం. అందుకే వీటిని కొనడమే మానేశాం. గతంలో వారానికి రెండు కిలోల టమాటాలు కొనే మేం ఇప్పుడు కిలోతోనే సరిపెట్టుకుంటున్నాం..’ అని హైదరాబాద్‌లోని ఆదర్శనగర్‌కు చెందిన ఇందుమతి అనే గృహిణి ఆవేదన వ్యక్తం చేశారు. ‘గతంలో కిలో చొప్పున కూరగాయలు తీసుకునే వాళ్లం. ఇప్పుడు అన్నీ అరకిలో చొప్పునే తీసుకుని సరిపెట్టుకుంటున్నాం. నేడు కూరగాయలు కొనడమంటే కందిపప్పు, మినప్పప్పు కొన్నట్లుంది..’ రాజధాని నగరంలోని శాంతినగర్‌కు చెందిన ప్రయివేటు బ్యాంకు ఉద్యోగిని నాగమణి అన్నారు. బోర్డులకే పరిమితమైన రైతు బజారు ధరలు కొద్దిగానైనా తక్కువ ధరతో లభిస్తాయని కూరగాయల కోసం రైతు బజారుకు వెళ్లిన వారికి నిరాశ తప్పడంలేదు. అక్కడ బోర్డులపై రాసిన ధరలకూ అమ్ముతున్న ధరలకూ పొంతనేలేదు. బోర్డుపై రాసిన ధరల కంటే కిలో రూ. 10 నుంచి 16 రూపాయలు అధిక ధరకు రైతు బజారులోని వ్యాపారులు కూరగాయలు విక్రయిస్తున్నారు. బోర్డులో కిలో బీన్స్ ధర రూ.32 ఉండగా వ్యాపారులు రూ.50కి తక్కువ అమ్మడం లేదు. క్యారట్ ధర రూ.22 కాగా వ్యాపారులు రూ.40కి విక్రయించారు. క్యాబేజి ధర రూ.12 కాగా వ్యాపారులు మాత్రం రూ.30కి అమ్ముతున్నారు. బోర్డులోని ధర ప్రకారం ఎందుకు అమ్మరని ఎవరైనా ప్రశ్నిస్తే ‘మేం అమ్మేది ఇంతే నచ్చితే కొనండి.. లేదంటే వెళ్లండి’ అని వ్యాపారులు అంటుండడంతో ప్రజలకు దిక్కు తోచడం లేదు. ఫిర్యాదు చేసినా ఏమీ చేయలేని పరిస్థితిలో రైతు బజారు అధికారులు ఉన్నారు. కిలో కూరగాయలు.. అర కిలో చికెన్! అసలే చలికాలం.. ఆపై కార్తీకమాసం.. చికెన్ ధరలు తగ్గాయి.. స్కిన్లెస్ చికెన్ కిలో రూ.90కే లభిస్తోంది. ప్రస్తుత కూరగాయల ధరలను పరిశీలిస్తే కిలో కూరగాయలు కొని వండుకుని తినడం కన్నా.. ఇద్దరు, ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబం హాయిగా అర్ధకిలో చికెన్ తెచ్చుకుని మసాలా దట్టించి లాగిస్తే బాగుండనే భావన వ్యక్తమవుతోంది. -
ట‘మోత’..
= కేజీ రూ. 50-55 ఉల్లిబాటలోనే =ఇతర కూరగాయలు = వర్షాలతో దెబ్బతిన్న పంటలు =దిగుమతి తగ్గి ధరలపై ప్రభావం = విలవిల్లాడుతున్న వినియోగదారులు సాక్షి, సిటీబ్యూరో: అసలే ఉల్లి ధర కళ్లు బైర్లుకమ్మిస్తోంటే.. తామేమీ తక్కువ కాదంటూ ఇతర రకాల కూరగాయలూ చుక్కలు చూపిస్తున్నాయి. వర్షాలతో పంట దెబ్బతిని నగరానికి దిగుమతులు తగ్గిపోయాయి. ఆ ప్రభావం కూరగాయల ధరలపై పడింది. ప్రత్యేకించి టమోట ధర ఠారెత్తిస్తోంది. రిటైల్ మార్కెట్లో కేజీ రూ.50-55 వసూలు చేస్తున్నారు. ఇప్పుడు రిటైల్ మార్కెట్లో ఏ రకం కొందామన్నా కేజీ రూ.35-60 ధర పలుకుతున్నాయి. వర్షాలకు ముందు ఇవి కేజీ రూ.30కే లభించాయి. మదనపల్లి నుంచి దిగుమతి పడిపోవడంతో టమోట మార్కెట్‌పై ప్రభావం పడింది. అలాగే వర్షాల కారణంగా రాయలసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చే దిగుమతులూ పూర్తిగా పడిపోయాయి. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల నుంచీ దిగుబడి అంతంతగానే ఉంది. దీంతో అసమతౌల్యం ఏర్పడి కూరగాయల ధరలు ఆకాశం వైపు చూస్తున్నాయి. సగానికి పడిపోయిన సరఫరా నగరంలో రోజూవారీ 1.25 లక్షల క్వింటాళ్ల కూరగాయలు అవసరం. ఇప్పుడు సరఫరా అవుతున్న కూరగాయలు ఇందులో సగమే. గుడిమల్కాపూర్, బోయిన్పల్లి, మీరాలంమండి, మాదన్నపేట, ఎల్బీనగర్‌లలోని హోల్‌సేల్ మార్కెట్లకు రోజూ 25 వేల క్వింటాళ్లలోపే కూరగాయలు వస్తున్నాయి. 9 రైతుబజార్లకు 1000 క్వింటాళ్లు, మిగతా ప్రైవేటు మార్కెట్లు, మాల్స్‌కు 20 వేల క్వింటాళ్లు.. మొత్తం 46 వేల క్వింటాళ్ల కూరగాయలు మాత్రమే సరఫరా అవుతున్నాయి. ఈ లెక్కన 54 వేల క్వింటాళ్ల కొరత ఏర్పడుతోంది. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచేశారు. ఇక, కేజీ ఉల్లి ప్రస్తుతం కేజీ రూ.60-65కి ఎగబాకింది. ఒక్కోరోజు టోకు మార్కెట్లో ధర తగ్గినా... రిటైల్ వ్యాపారులు అధిక ధరలనే వసూలు చేస్తున్నారు. నగరంలో రోజుకు 1200 టన్నుల ఉల్లి అవసరం ఉండగా అందులో సగమే దిగుమతవుతోంది. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్ శాఖలో స్పందన కరువైంది. -
కొండెక్కిన ఉల్లి
=ప్రైవేటు మార్కెట్లో రూ.60 =రైతుబజార్లలో రూ.40 =పడిపోయిన అమ్మకాలు =టమోటా ధర పైపైకి విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : ఉల్లి ధరలు కొండెక్కి దిగనంటున్నాయి. మార్కెట్లో మంచి రకం ఉల్లి కనుమరుగైంది. అధిక రేటుతో కొనుగోలు చేసిన నాసిరకం ఉల్లి ఘాటు లేకుండా చప్పగా ఉంటోందని ప్రజలు చెబుతున్నారు. సరకు బాగుండకపోయినా సన్న బియ్యం ధరలతో పోటీ పడి ఉల్లిపాయల రేట్లు పెరగటంతో జనం వాటి వాడకాన్ని తగ్గించేశారు. దాంతో ఉల్లి అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దాదాపు నాలుగో వంతు అమ్మకాలు మాత్రమే జరుగుతున్నాయి. ఢిల్లీలో కిలో ఉల్లి ధర దాదాపు వంద రూపాయలు పలుకుతుండగా, విజయవాడ మార్కెట్లో మంచి రకం ఉల్లి రూ.60, నాసిరకం రూ.45కి విక్రయిస్తున్నారు. రైతు బజార్లలో మాత్రం నాసిరకం కిలో రూ.32, ఓ మోస్తరు రకం రూ.40కి విక్రయిస్తున్నారు. గత సంవత్సరం రూ.12 నుంచి రూ.15 వరకు విక్రయాలు జరిగిన ఉల్లి ఈ ఏడాది రూ.25 నుంచి రూ.30తో ప్రారంభమై బహిరంగ మార్కెట్లో రూ.60కి పెరిగి దిగనంటోంది. ఈ నేపథ్యంలో గత రెండు మాసాల నుంచి విజయవాడ మార్కెట్లోకి నాసిరకం సరకే వస్తోందని హోల్‌సేల్ వ్యాపారులు చెపుతున్నారు. మంచి రకం రాకపోవటం, ధరలు పెరగటంతో జిల్లా వ్యాప్తంగా అమ్మకాలు పడిపోయాయని చెపుతున్నారు. భారీగా తగ్గిన దిగుమతులు... రెండు మాసాల క్రితం వరకు విజయవాడ మార్కెట్‌కు ప్రతిరోజు అహ్మద్‌నగర్, నాసిక్, సోలాపూర్, కర్నూలు నుంచి ఉల్లిపాయలు దిగుమతి అయ్యేవి. గతంలో రోజుకు వంద లారీల సరుకు ఇక్కడకు దిగుమతయ్యేది. ప్రస్తుతం రోజుకు 25 లారీల సరకు మాత్రమే దిగుమతి అవుతోంది. ఒక్కో లారీకి 10 నుంచి 15 టన్నులు వస్తుంది. ఈ లెక్కన వంద లారీలకు 1500 టన్నుల ఉల్లి ప్రతిరోజు హోల్‌సేలర్స్ దిగుమతి చేసుకునేవారు. ప్రస్తుతం 25 లారీలలో 375 టన్నుల సరకు మాత్రమే వస్తోంది. అహ్మద్‌నగర్‌లో ఉల్లి ఉత్పత్తిలో ఆలస్యం అవటంతో మంచి రకం రావటం లేదని చెపుతున్నారు. ఇతర రాష్ట్రాలలో వరదలు, వర్షాలు ఉత్పత్తుల పడిపోవటానికి కారణమని పేర్కొంటున్నారు. మరో నెలరోజుల వరకు ఇదేపరిస్థితి ఉంటుందని హోల్‌సేల్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. టమోటా ధరలు పైపైకి ... లోకల్ మార్కెట్లో ఉత్పత్తులు తగ్గటంలో టమోటా ధరలు పైపైకి వెడుతున్నాయి. ప్రస్తుతం టమోటా ధర రైతు బజార్లలో కిలో రూ.34 ఉండ గా, ప్రైవేటు మార్కెట్లలో ఈ నెల మొదటి వారంలో కిలో రూ.15 ఉండగా, ఆ తరువాత నుంచి పెరుగుతూ వచ్చింది. విజయవాడ పరిసర ప్రాంతాలకు మదనపల్లినుంచి టమోటా వస్తోంది. అక్కడ నుంచి సరకు చెన్నైకి అధిక రే టుకు ఎగుమతి చేస్తున్నారు. దాంతో మనకు సరకు రావటంలేదని వ్యాపారులు చెపుతున్నారు. లోకల్‌గా దిగుమతులు డిసెంబర్ వరకు వచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో టమోటా ధర కూడా కిలో రూ.50 లేదా రూ.60కి చేరవచ్చని భావిస్తున్నారు.