Tomato Price Reaches Rs 42 Per Kg In Madanapalle Market - Sakshi
Sakshi News home page

టమాటా ధర పైపైకి.. కిలో రూ.42

Published Thu, Oct 7 2021 8:52 AM | Last Updated on Thu, Oct 7 2021 12:43 PM

Tomato Price Rs 42 In Madanapalle Market - Sakshi

మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన టమాటా  

మదనపల్లె (చిత్తూరు): టమాటా ధరలు రోజురోజుకీ పుంజుకుంటున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్‌లో బుధవారం కిలో రూ.42 వరకు పలికింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి దెబ్బతినడం, అందుబాటులో ఉన్న టమాటా నాణ్యత లేకపోవడం తదితర కారణాలతో మార్కెట్‌కు ఆశించిన మేర సరుకు రావడం లేదు.

మదనపల్లె మార్కెట్‌కు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలతో పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయల్పాడు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల నుంచి రైతులు బుధవారం మార్కెట్‌కు 189 మెట్రిక్‌టన్నుల టమాటాను తీసుకొచ్చారు. ఈ వారంలో సోమవారం మొదటి రకం కిలో టమాటా ధర రూ.38, మంగళవారం రూ.36 పలికితే బుధవారం రూ.42కు చేరుకోవడం విశేషం.
చదవండి:
Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement