Madanapalle market
-
భారీగా పతనమైన టమాటా రేటు
సాక్షి, అన్నమయ్య: కొండెక్కి రేట్లతో సామాన్యుడ్ని నెలలపాటు ముప్పుతిప్పలు పెట్టిన టమాటా ధర.. అమాంతం పడిపోయింది. ఒకానొక టైంలో కేజీ 300 దాకా చేరుకుని చుక్కలు చూపించింది. అయితే ఊహించినట్లుగా.. ధరలు పడిపోతూ వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఒక్కసారిగా ధరలు నేలకు పడిపోయాయి. నిత్యావసర సరకుల్లో ఒకటైన టమాటా ధరలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కిలో టమాటా ధర రూ. 50 లోపుకి చేరుకుంది. చాలా చోట్ల కేజీకి రూ. 15, రూ. 20 ఇలా దొరుకుతోంది కూడా. హైదరాబాద్‌లోనూ కేజీ రూ. 20 దాకా పలుకుతోంది. అయితే.. టమాట మార్కెట్ యార్డ్ మదనపల్లెలో(అన్నమయ్య జిల్లా ఏపీ) కేజీ టమాట రూ.9కి పలుకుతోంది. గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆవేదన చెందుతున్నారు. సరఫరాలో అంతరాయం కలగడం, టమాటాను ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం ఏర్పడటంతో ఆ మధ్య అన్ని ప్రధాన నగరాల్లో టమాటాలు సెంచరీని దాటేసిన సంగతి తెలిసిందే. -
మదనపల్లి మార్కెట్ యార్డులో కిలో టమాటా రూ.196
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్ చరిత్రలో పాత రికార్డులన్నింటినీ బద్దలు కడుతూ.. తాజాగా టమాటా కిలో రూ.196 ధర పలికింది. టమాటా ధర మరింత పెరుగుతూ రికార్డుల మోత మోగిస్తోంది. మార్కెట్లో ఇప్పటికే ఆకాశాన్ని అంటిన టమాటా ధర.. తాజాగా శనివారం మరింత పెరిగింది. మొదటి రకం టమాటాకు ఈ రేటు పలకగా.. నాణ్యత కాస్త తక్కువగా ఉన్న టమాటాలకు కిలో రూ.140 పలికింది. మార్కెట్‌కు తక్కువ మొత్తంలో సరుకు రావడంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. దేశం మొత్తం మీద ప్రస్తుతం టమాటా మదనపల్లె, పలమనేరు, పుంగనూరు, గుర్రంకొండ, అంగళ్లు, ములకలచెరువు.. కర్ణాటకలోని కోలారు, వడ్డిపల్లె మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. దేశవ్యాప్తంగా టమాటాకు ఉన్నటువంటి డిమాండ్ దృష్ట్యా ఢిల్లీ, పశ్చిమబెంగాల్, చత్తీస్గడ్, మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు ఈ ప్రాంతాల్లో మకాం వేసి అధిక ధరలకు టమాటాను కొనుగోలు చేస్తున్నారు. వచ్చిన సరుకు వచ్చినట్లే అధిక ధరలకు అమ్ముడవుతుండటంతో తీసుకొచ్చిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: బాబు అండ్ బ్యాచ్ ఓవరాక్షన్.. నిర్మల సీతారామన్ చెప్పింది విన్నారా? రాష్ట్ర ప్రభుత్వం మార్కెటింగ్‌శాఖ ఆధ్వర్యంలో మదనపల్లె మార్కెట్లో రైతుల నుంచి సగటున కిలో రూ.104 చొప్పున టమాటా కొనుగోలు చేసి రైతు బజార్లలో సబ్సిడీ ధరలకు కిలో రూ.50 చొప్పున విక్రయిస్తోంది. ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు మరో నెలవరకు ఇలాగే కొనసాగుతాయని, అప్పటికి మదనపల్లె మార్కెట్లో సీజన్ పూర్తయితే అనంతపురం, డోన్, గుత్తి మార్కెట్లలో సరుకు లభ్యత వస్తుందన్నారు. -
మార్కెట్‌కు 1,656 టన్నుల టమాట రాక
మదనపల్లె: మదనపల్లె టమాట మార్కెట్‌కు రైతులు రికార్డుస్థాయిలో టమాటను తీసుకువస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు సీజన్లో అత్యధికంగా బుధవారం 1,656 మెట్రిక్‌టన్నుల టమాటను తీసుకువచ్చారు. జూన్ 1న మార్కెట్‌కు 342 మెట్రిక్‌టన్నుల టమాట వస్తే కేవలం 28రోజుల వ్యవధిలో ఐదురెట్లు రెట్టింపు సంఖ్యలో దిగుబడులు రావడం విశేషం. గత రెండేళ్లలో టమాట ధరలు ఆశించిన స్థాయిలో లేకపోవడం, దిగుబడులు అధికంగా వచ్చినా సరుకుకు డిమాండ్ లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట పెట్టుబడులు, నారు ధరలు విపరీతంగా పెరిగిపోవడం, కూలీల సమస్య అధికంగా ఉండటంతో ఈ సీజన్‌కు రైతులు పంటసాగుకు వెనుకంజ వేశారు. అయితే ఊహించనిరీతిలో మార్చి, ఏప్రిల్‌లో టమాటకు అధిక ధరలు పలకడంతో గంపెడాశతో అప్పులు చేసి సాగుకు పూనుకున్నారు. వాతావరణం అనుకూలించడం, కొత్త వంగడాలతో అధిక దిగుబడులు రావడంతో ఒక్కసారిగా మార్కెట్‌కు టమాటలు పోటెత్తాయి. మదనపల్లె మార్కెట్ నుంచి టమాట ఎగుమతులు జరిగే మహరాష్ట్ర, కేరళ, తమిళనాడు, కర్నాటకలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా టమాట సాగుచేయడంతో బయటి వ్యాపారులు ఎవరూ రాలేదు. దీంతో ధరలు నెలరోజులతో పోలిస్తే కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ ప్రస్తుతానికి లభిస్తున్న ధరలు రైతులకు ఆశాజనకంగానే ఉన్నాయి. మదనపల్లె మార్కెట్‌కు అనంతపురం, శ్రీసత్యసాయిజిల్లా, అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం, కర్నాటక శ్రీనివాసపురం, చింతామణి, వడ్డిపల్లె, కోలారు తదితర ప్రాంతాల నుంచి రైతులు టమాటను తీసుకువస్తున్నారు. ఇక్కడి నుంచి తెలంగాణ, పాండిచ్చేరి, మహరాష్ట్ర బీజాపూర్, మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాలకు, విశాఖపట్నం, కాకినాడ నగరాలకు టమాట ఎగుమతులు జరుగుతున్నాయి. బుధవారం మదనపల్లె మార్కెట్లో మొదటిరకం టమాట కిలో రూ.12–16, రెండోరకం టమాట కిలో రూ.7–11.60 మధ్య ధరలు నమోదయ్యాయి. దిగుబడులకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ తట్టి శారదమ్మ, కార్యదర్శి అభిలాష్ తెలిపారు. -
రికార్డు స్థాయిలో పట్టుగూళ్ల ధర
మదనపల్లె: పట్టణంలోని పట్టు గూళ్ల మార్కెట్లో శనివారం రైతులు తీసుకువచ్చిన గూళ్లకు రికార్డు ధర లభించింది. సుమారు 18 మంది రైతులు 924.74 కిలోల బైవోల్టిన్ రకం పట్టు గూళ్లను తీసుకువచ్చారు. వీటికి మార్కెట్ అధికారులు నిర్వహించిన బహిరంగ వేలంలో కిలో గూళ్లు రూ.670–752 వరకు పలికాయి. ప్రస్తుతం విపరీతమైన చలి, మంచు అధికంగా ఉండడంతో మల్బరీ ఆకు కోతకు రాకపోవడం, పురుగులు ఆకును తినకపోవడం, సున్నపుకట్టు వ్యాధితో దిగుబడి భారీగా పడిపోయింది. చదవండి: కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య! అందుకే డిసెంబర్–ఫిబ్రవరి మాసాలను అన్‌సీజన్‌గా పరిగణిస్తారు. చలి, వర్షాలతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. శుక్రవారం మార్కెట్‌కు ఒకే రైతు కేవలం 36.50 కిలోల గూళ్లు తీసుకువచ్చారు. సంక్రాంతి వరకు దిగుబడులు తక్కువగానే వస్తాయని అధికారులు తెలిపారు. మదనపల్లె గూళ్ల మార్కెట్‌కు జూన్ నుంచి నవంబర్ వరకు సీజన్ కాగా, అత్యధికంగా 6 టన్నుల వరకు గూళ్లు వచ్చిన సందర్భాలున్నాయి. -
Tomato Price: సెంచరీ కొట్టిన టమాటా
మదనపల్లె (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాటా ధర కిలో రూ.100 పలికింది. గడచిన ఐదేళ్లలో ఇంత అత్యధిక ధర నమోదవడం ఇదే తొలిసారి. వాతావరణంలో ఒక్కసారిగా చోటుచేసుకున్న మార్పులు, వరుసగా కురుస్తున్న వర్షాలతో టమాటా దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. అంతో ఇంతో వస్తున్న పంట వర్షం కారణంగా నాణ్యత లేకపోవడం, డ్యామేజీ అధికంగా వస్తుండటంతో మార్కెట్లో టమాటాకు డిమాండ్ ఏర్పడింది. దీనికితోడు బయట రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో అక్కడ స్థానికంగా లభ్యమయ్యే పంటకు నష్టం వాటిల్లింది. దీంతో వ్యాపారులు 365 రోజులు టమాటా దొరికే మదనపల్లె మార్కెట్‌పై దృష్టి కేంద్రీకరించారు. ప్రస్తుతం ఇక్కడి మార్కెట్లో అన్‌సీజన్ కావడం, దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోవడం, డిమాండ్ ఎక్కువ ఉండటంతో రికార్డు స్థాయి ధర పలికింది. 2016 నవంబర్‌లో మొదటి రకం అత్యధికంగా కిలో రూ.98 పలికింది. తర్వాత కిలో రూ.100 మంగళవారం నమోదైంది. -
టమాటా ధర పైపైకి.. కిలో రూ.42
మదనపల్లె (చిత్తూరు): టమాటా ధరలు రోజురోజుకీ పుంజుకుంటున్నాయి. మదనపల్లె టమాటా మార్కెట్లో బుధవారం కిలో రూ.42 వరకు పలికింది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు దిగుబడి దెబ్బతినడం, అందుబాటులో ఉన్న టమాటా నాణ్యత లేకపోవడం తదితర కారణాలతో మార్కెట్‌కు ఆశించిన మేర సరుకు రావడం లేదు. మదనపల్లె మార్కెట్‌కు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలతో పాటుగా కర్ణాటక సరిహద్దు ప్రాంతాలైన రాయల్పాడు, శ్రీనివాసపురం తదితర ప్రాంతాల నుంచి రైతులు బుధవారం మార్కెట్‌కు 189 మెట్రిక్‌టన్నుల టమాటాను తీసుకొచ్చారు. ఈ వారంలో సోమవారం మొదటి రకం కిలో టమాటా ధర రూ.38, మంగళవారం రూ.36 పలికితే బుధవారం రూ.42కు చేరుకోవడం విశేషం. చదవండి: Chittoor: అధికారి ఒకరే.. పోస్టులు ఐదు -
తగ్గుతున్న టమాటా ధరలు
మదనపల్లె: టమాటా మార్కెట్లో ధరలు రోజురోజుకీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆదివారం ధరలు మరింత తగ్గాయి. చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్లో గతనెల 20, 21, 22 తేదీల్లో కిలో టమాటా మొదటిరకం రూ.24, రెండోరకం రూ.17 వరకు పలికాయి. ఈ మార్కెట్లో ఆదివారం కిలో మొదటిరకం రూ.16, రెండోరకం రూ.11.80 పలికాయి. పదిరోజుల కిందటి ధరలతో పోలిస్తే కిలో ధర రూ.8 నుంచి రూ.6 వరకు తగ్గింది. వాతావరణంలో మార్పులు, ఇటీవల కురుస్తున్న వర్షాలతో స్థానికంగా దిగుబడులు తగ్గడం, కాయ నాణ్యత లోపించడం, ఎగుమతులకు కావాల్సిన సరుకు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. బయటిప్రాంతాల వ్యాపారులు సరుకు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు రావడం లేదు. దీనికితోడు అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం, రాయదుర్గం, కర్నూలు జిల్లాలోని పత్తికొండ, ఆదోని, కడప జిల్లాలోని మైదుకూరు తదితర ప్రాంతాల్లో టమాటా సీజన్ ప్రారంభమైంది. ఆరంభంలో కాయలు నాణ్యతగా వస్తుండటం, అధిక దిగుబడులు వస్తుండటంతో వ్యాపారులు అక్కడి సరుకు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. మదనపల్లె మార్కెట్ నుంచి తమిళనాడుకు టమాటా లోడ్ కావడం లేదు. ఆయా ప్రాంతాల్లో స్థానికంగా పంట వస్తుండటంతో అక్కడి వ్యాపారులు ఇక్కడకు రాకపోవడం ధరలు తగ్గేందుకు కారణమైంది. రానున్న రోజుల్లో టమాటా ధరలు ఇంకా తగ్గే అవకాశముందని మార్కెట్ కమిటీ అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్‌లు రెండూ టమాటా రైతును నిలువునా ముంచాయి. జిల్లాలోని పడమటి నియోజకవర్గాల్లో సీజన్ ప్రారంభ సమయంలో కోవిడ్ విస్తృతి అధికంగా ఉండటం, లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలవుతుండటంతో గడిచిన రెండు సీజన్లు టమాటా రైతును నిరాశకు గురిచేశాయి. ఆశించిన స్థాయిలో ధర లేకపోవడంతో పెట్టుబడి డబ్బు కూడా రాక టమాటా రైతు నిలువునా మునిగిపోయాడు. -
టమాటా @ రూ.50
మదనపల్లె (చిత్తూరు జిల్లా): మదనపల్లె హోల్‌సేల్ మార్కెట్లో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వారం క్రితం వరకు గ్రేడ్–1 టమాటా కిలో అత్యధికంగా రూ.20 ధర పలకగా.. ఇప్పుడు అమాంతం రూ.50కి పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటం.. కాయల్లో నాణ్యత తగ్గిపోవడం.. డిమాండ్‌కు తగిన స్థాయిలో సరుకు అందుబాటులో లేకపోవడంతో ధరలు పెరిగాయి. మదనపల్లె మార్కెట్లో ధరలిలా.. ► మదనపల్లె టమాటా హోల్‌సేల్ మార్కెట్లో సోమవారం గ్రేడ్–1 టమాటాను నాణ్యతను బట్టి రైతు నుంచి కిలో రూ.32 నుంచి రూ.50 వరకు వ్యాపారులు కొనుగోలు చేశారు. ► గ్రేడ్–2 రకం నాణ్యతను బట్టి కిలో రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముడుపోయింది. ► ఆగస్టు ప్రారంభంలో గ్రేడ్–1 రకం రూ.19 నుంచి రూ.32, గ్రేడ్–2 రకం రూ.10 నుంచి రూ.19.60 మధ్య పలికింది. ► ఈ నెల 18 వరకు ఇవే ధరలు కొనసాగగా.. మరుసటి రోజు నుంచి అనూహ్యంగా పెరుగుతూ వచ్చాయి. తగ్గిన దిగుబడి ► తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా టమాటా పంట బాగా దెబ్బతింది. కొద్దోగొప్ప వస్తున్న పంట నాణ్యత ఆశించిన స్థాయిలో ఉండటం లేదు. ► కాయపై మచ్చలు, పగుళ్లు రావడం, పంటను పురుగులు ఆశించడం, కాయలు కోసేందుకు వీలు లేకుండా పొలాల్లో నీళ్లు నిలిచిపోవడం, ఎక్కువ తేమకు చెట్టుకు తెగుళ్లు రావడంతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోయాయి. ► దీనికితోడు వరదల కారణంగా రవాణా ఖర్చులు పెరిగిపోయాయి. భారీ వర్షాల కారణంగా మహారాష్ట్ర, తెలంగాణ, ఒడిశాలో టమాటా పంట దెబ్బతింది. ► దాంతో ఆయా రాష్ట్రాల వ్యాపారులు టమాటా కొనుగోలు కోసం మదనపల్లె మార్కెట్‌కు వస్తున్నారు. నాణ్యమైన సరుకు లభిస్తుండటంతో ధర ఎంతైనా వెచ్చించేందుకు వ్యాపారులు వెనుకాడటం లేదు. ► మదనపల్లె మార్కెట్లో సాహో రకానికి చెందిన పంట అధికంగా వస్తుండటం, రంగు, రుచి, నాణ్యత బాగా ఉండటంతో మంచి ధర పలుకుతోంది. -
జాక్‌పాట్ దగా..!
పండ్లు, కూరగాయల రైతులకు మార్కెట్లో రుసుం రద్దుచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 4న ఉత్తర్వులు జారీచేశారు. మార్కెట్ యార్డులు, చెక్‌పోస్టుల్లో కమీషన్ ఏజెంట్ల వ్యవస్థను రద్దుచేశారు. ఇందుకు సంబంధించి జీఓ ఎంఎస్ నంబర్ 58ను తీసుకువచ్చారు. మదనపల్లె మార్కెట్లో ఏమాత్రం మార్పు రాలేదు. సీఎం ఆదేశాలు బేఖాతర్ చేస్తూ ఇష్టారాజ్యంగా కమీషన్ల వసూళ్లకు పాల్పడుతూ జాక్‌పాట్ విధానాన్ని కొనసాగిస్తున్నారు. సాక్షి, మదనపల్లె టౌన్ : అన్నదాతకు ఆసరాగా నిలవాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు దళారులకే అండగా నిలుస్తున్నారు. దీంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. దళారీలతో అధికారుల కుమ్మక్కై ఈ–వేలానికి మంగళం పలికి జాక్‌పాట్ విధానాన్నే నేటికీ కొనసాగిస్తున్నారు. దీంతో రోజుకు రైతులు లక్షల్లో నష్టపోతుండగా ప్రభుత్వ ఆదాయానికి వేలల్లో గండిపడుతోంది. రాష్ట్రంలోనే అతి పెద్ద మార్కెట్‌గా పేరుపొందిన మదనపల్లె టమాట మార్కెట్ యార్డుకు సరాసరిన 400 టన్నుల టమాటాలు వస్తున్నాయి. ప్రస్తుతం పది కిలోల టమాటాలు రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతున్నాయి. ఇలా రోజుకు 4 లక్షల కిలోల టమాటాలు మార్కెట్‌కు వస్తున్నాయి. వాటికి ప్రస్తుత ధరతో పోల్చుకుంటే రూ.1.52 కోట్ల వ్యాపారం జరుగుతోంది. ఈ వ్యాపారంలో జాక్‌పాట్, కమీషన్ విధానంతో సుమారు రైతులకు దాదాపు రూ.7.23 లక్షల మేర నష్టం కలుగుతోంది. ఈ లెక్కన మార్కెట్ అధికారులు నెలవారీ చూపించే వ్యాపార లావాదేవీల్లో నామమాత్రపు వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు నివేదికలు చూపుతున్నారనే సమాచారం ఉంది. మార్కెట్లో దాదాపు 100కు పైగా మండీల యజమానులు ఉన్నారు. ఒక కమీషన్ మండీ ఏజెంట్ నెలకు రూ.50 లక్షల వ్యాపారం నిర్వహిస్తే రూ.10 లక్షలు మాత్రమే చేస్తున్నట్లు అధికారులకు నివేదికలు పంపుతున్నారు. మార్కెట్ యార్డుకు సెస్, వ్యాపార కమీషన్ల ద్వారా సంవత్సరానికి రూ.1.90 కోట్లు వరకు ఆదాయం చేకూరుతోంది. మార్కెట్ యార్డులో రైతులకు, వ్యాపారికి నేరుగా ఎటువంటి సంబంధాలు ఉండవు. రైతు తీసుకొచ్చిన సరుకు కమీషన్ ఏజెంట్ ద్వారా విక్రయాలు జరుగుతాయి. కమీషన్ ఏజెంట్లు వ్యాపారుల మధ్య ముందుగానే వ్యాపారలావాదేవీల ఒప్పందాలు కుదుర్చుకుంటారు. రైతు, వ్యాపారికి కమీషన్ ఏజెంటే మధ్యవర్తిగా వ్యవహరించి టమాటాలను జాక్‌పాట్, కమీషన్ పద్ధతిలో బహిరంగ వేలం నిర్వహిస్తాడు. వ్యాపారి నుంచి నగదును తీసుకుని తన కమీషన్ మినహా మిగిలిన మొత్తాన్ని రైతుకు అందజేస్తాడు. సీఎం ఉత్తర్వులు బేఖాతర్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత వారం రైతులు పండించే పంటలకు కమీషన్ రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నిబంధనలను ఇక్కడి అధికారులు మాత్రం ఖాతరు చేయడంలేదు. వ్యాపారులు, మండీల నిర్వాహకులతో కుమ్మక్కై యథేచ్ఛగా రైతుల శ్రమను దోపిడీ చేస్తున్నారు. మోసం జరుగుతోంది ఇలా.. రైతులు తీసుకువచ్చిన టమాటాలను తనకు ఇష్టమొచ్చిన కమీషన్ మండీల్లో విక్రయించేందుకు సంబంధిత కమీషన్ ఏజెంట్‌తో వ్యాపారి ముందుగానే ఒప్పందం కుదర్చుకుంటారు. ఉదాహరణకు మండీకి ఓ రైతు 50 క్రేట్లు టమాటాలు తీసుకెళ్తే కమీషన్ ఏజెంటు 10 క్రేట్లకు ఒక క్రేట్ (35 కేజీలు) జాక్‌పాట్ కింద తీసుకుంటాడు. క్రేట్‌కు లెక్కప్రకారం 30 కేజీలు భర్తీ చేయాల్సివుండగా అదనంగా ఐదు కిలోలు మండీ వ్యాపారులు తీసుకుంటున్నారు. 50 క్రేట్లకు గాను ఐదు క్రేట్లు జాక్‌పాట్ కింద ఉచితంగా తీసుకుంటాడు. వంద క్రేట్లకు పది క్రేట్లు బలవంతంగా రైతుల నుంచి కమీషన్ మండీల నిర్వాహకులు తీసుకుంటారు. వీటిని వాస్తవిక లెక్కల్లో చూపరు. ఈ కాయలు అమ్మగా వచ్చిన మొత్తాన్ని వ్యాపారి, అధికారులతోపాటు మండీల నిర్వాహకులు పంచుకుంటారు. తరుగు పేరుతో మెలిక ఒక క్రేట్ టమాటాలను రూ.500 వేలం పాటలో పాడితే రైతుకు డబ్బులు ఇచ్చే బిల్లులో తరుగు పేరుతో మెలిక పెట్టి రూ.10 నుంచి 20 తగ్గించి రూ.480 మాత్రమే అందజేస్తున్నారు. బిల్లు ఇచ్చే సమయంలో ప్రభుత్వం నాలుగు శాతం కమీషన్ తీసుకోవాలని నిబంధనలు ఉన్నా ఏజెంట్లు దీన్ని 10 నుంచి 30 శాతానికి పైగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అలా వసూలు అయిన దాంట్లో మండీ ఓనర్‌కు క్రేట్ల బాడుగ పేరుతో రూ.5 నుంచి 10 రూపాయలు, దింపే కూలీలకు లెస్ పేరుతో మరో రూ.5, నూటికి రూ.10 కమీషన్, వ్యాపారికి రిటర్న్ కమీషన్ తీసేస్తున్నారని రైతులు చెబుతున్నారు. ఇలా చివరగా 100కి రూ.10 కమీషన్ పట్టుకుంటూ డబ్బులు ఇచ్చే సమయంలో కాయలు నాణ్యత లేవనో, తరుగు ఉందనో ధరల్లో కోత విధిస్తున్నారు. ఈ నింబ«ంధనలన్నీ పట్టించుకోకుండా అధికారులు గాలికి వదిలివేయడంతో కమీషన్ మండీల నిర్వాహకులకు, వ్యాపారులకు వరంగా మారింది. అంతా చట్టవిరుద్ధం మదనపల్లె టమాటా మార్కెట్లో ఈ–వేలం పద్ధతిలో టమాటాలను రైతుల నుంచి మండీల నిర్వాహకులు, వ్యాపారులు మార్కెట్ అధికారులు కలసి ముందుగానే రైతులతో సమావేశమై ఆన్లైన్ విధానంతో ధరలు నిర్ణయిస్తారు. నాణ్యతను బట్టి ధరలు పలుకుతాయి. ఇలా చేయడం వల్ల రైతులు ఎక్కువ శాతం కమీషన్ నష్టపోకుండా ఉంటారు. జాక్‌పాట్ లేకుంటే రైతులకు మంచి లాభాలు ఉంటాయి. నష్టాలు ఉండవు. అయితే ఇక్కడంతా చట్టవిరుద్ధం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రైతులు మార్కెట్లోని మండీలకు తీసుకువచ్చిన టమాటాలను ఈనాం పద్ధతిలో వేలం వేస్తున్నామని మార్కెట్ అధికారులు రికార్డుల్లో నమోదుచేస్తూ బహిరంగ వేలం ద్వారా క్రయ, విక్రయాలు నిర్వహిస్తూ రైతులను బహిరంగంగానే మోసం చేస్తున్నారు. మార్కెట్ అధికారులే దగ్గరుండి మరీ రైతులను ఏమార్చి నష్టపరస్తున్నారు. రైతులతో సమావేశం ఏర్పాటు చేస్తా పదిహేను రోజులు గడువిచ్చాం.. ట్రేడర్ లైసెన్సులు పొందాలి. నోటీసులు ఇచ్చి రద్దుపరచినట్లు తెలియజేశాం. కమీషన్ తీసుకోకూడదని చెప్పాం. అన్ని మార్కెట్లలో వ్యాపారులు మాట్లాడుకుంటున్నారు. మార్కెట్ యార్డులో జాట్‌పాట్ పద్ధతి లేకుండా చేస్తా. ఇందుకోసం త్వరలో టమాటా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తాం. రైతులకు న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటాం. అధిక కమీషన్ వసూలుచేసే వారిపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులకు నివేధిస్తాం. – జగదీష్, మార్కెట్ ఇన్చార్జి సెక్రటరీ, మదనపల్లె -
జపాన్‌తోనైనా అభివృద్ధి మొదలయ్యేనా?
పర్యటనతోనే సరిపెట్టిన జైకా బృందం రెండుసార్లు మార్కెట్లో పర్యటించిన ప్రతినిధులు ఆగస్టు వచ్చినా నిధులు మాత్రం రాలేదు మదనపల్లె: అగ్రగామిగా ఉన్న జపాన్ దేశం చూపు మదనపల్లె మార్కెట్ వైపు పడింది. అయితే నిధుల ఊసే లేకపోవడం గమనార్హం. రాష్ట్రంలోనే టమాటా క్రయవిక్రయాలలో అతిపెద్దదిగా గుర్తింపు పొందిన మదనపల్లె టమాటా మార్కెట్ అభివృద్ధికి జపాన్ ప్రభుత్వం తొలిఅడుగులు వేసే దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జనవరి 19, మార్చి 5వ తేదీలలో విడివిడిగా ఆ దేశ ప్రతినిధులు మదనపల్లెకు వచ్చి మార్కెట్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపారు. ప్రపంచంలోని దేశాల్లో చైనా తరువాత, ఎక్కువగా టమాటా పండించే దేశంగా గుర్తింపు పొందిన మనదేశంలో 68 శాతం దిగుబడి సాధిస్తున్న రాష్ట్రంలోని మదనపల్లె ప్రాంతంపై జపాన్ దేశం కన్నుపడడం గమనార్హం. ఇక్కడి టమాటా సాగు, క్రయ, విక్రయాలపై పరిశోధన చేసేందుకు ఆ దేశం తరఫున బెంగళూరులోని జైకా( జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ ఏజెన్సీ) ప్రతినిధులు బృందం జరిపిన పర్యటనలో వారు పూర్తి సంతృప్తి పొందారు. జైకా ప్రతినిధులు ప్రకాష్, ప్రకాష్ పి.దేశాయ్ తొలిగా జనవరి 19వ తేదీన రాగా, రెండోసారి మార్చి 5వ తేదీన యోకియో ఐకెడ, యోషికో హోండాలు మార్కెట్ యార్డులోని వివిధ అంశాలను పరిశీలించారు. తొలుత మార్కెట్లో టమాటాలను విక్రయానికి తెచ్చిన రైతులతో ముఖాముఖి నిర్వహించారు. టమాటా దిగుబడి, రాబడి గురించి వాకబు చేశారు. రైతులు చెప్పిన అనేక అంశాలకు సంతృప్తిని వ్యక్తం చేసిన ప్రతినిధులు నివేదికలలో రైతుల అభిప్రాయాలకే పెద్దపీట వేస్తామని హామీలు ఇచ్చారు. అయితే ఆగస్టు వచ్చినా నిధులు రాకపోవడంతో మార్కెట్ అభివృద్ధిపై సందేహం కలుగుతోంది.