మార్కెట్‌కు రైతులు తీసుకొచ్చిన పట్టుగూళ్లు
మదనపల్లె: పట్టణంలోని పట్టు గూళ్ల మార్కెట్‌లో శనివారం రైతులు తీసుకువచ్చిన గూళ్లకు రికార్డు ధర లభించింది. సుమారు 18 మంది రైతులు 924.74 కిలోల బైవోల్టిన్ రకం పట్టు గూళ్లను తీసుకువచ్చారు. వీటికి మార్కెట్ అధికారులు నిర్వహించిన బహిరంగ వేలంలో కిలో గూళ్లు రూ.670–752 వరకు పలికాయి. ప్రస్తుతం విపరీతమైన చలి, మంచు అధికంగా ఉండడంతో మల్బరీ ఆకు కోతకు రాకపోవడం, పురుగులు ఆకును తినకపోవడం, సున్నపుకట్టు వ్యాధితో దిగుబడి భారీగా పడిపోయింది.
చదవండి: కరోనాతో భార్య మృతి, మనస్తాపంతో భర్త ఆత్మహత్య!
అందుకే డిసెంబర్–ఫిబ్రవరి మాసాలను అన్‌సీజన్‌గా పరిగణిస్తారు. చలి, వర్షాలతో దిగుబడులు పూర్తిగా తగ్గిపోతాయి. శుక్రవారం మార్కెట్‌కు ఒకే రైతు కేవలం 36.50 కిలోల గూళ్లు తీసుకువచ్చారు. సంక్రాంతి వరకు దిగుబడులు తక్కువగానే వస్తాయని అధికారులు తెలిపారు. మదనపల్లె గూళ్ల మార్కెట్‌కు జూన్ నుంచి నవంబర్ వరకు సీజన్ కాగా, అత్యధికంగా 6 టన్నుల వరకు గూళ్లు వచ్చిన సందర్భాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment